రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో ఏపీకి ఉజ్వల భవిత

APK has great potential in defense products - Sakshi

 హైదరాబాద్‌లో యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ రీఫ్‌మన్‌

సాక్షి, హైదరాబాద్‌ : రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో ఏపీకి మంచి భవిష్యత్తు ఉం దని హైదరాబాద్‌లో అమెరికా కాన్సుల్‌ జనరల్‌ జోయ ల్‌ రీఫ్‌మన్‌ అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న అమెరికా భారత్‌ రక్షణ సంబంధాల అంతర్జాతీయ సదస్సులో భాగంగా ఢిల్లీ రాయబార కార్యాలయ అధికారి కెప్టెన్‌ డేనియల్‌ ఇ ఫిలియన్, ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డితో కలిసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల విశాఖలో అమెరికా, భారత్‌ త్రివిధ సైనిక దళాలు ప్రదర్శించిన సైనిక విన్యాసాలు రక్షణ రంగంలో ఏపీ సామర్థ్యానికి అద్దం పట్టాయన్నారు.

ఏపీ, తెలంగాణతో అత్యున్నత రక్షణ సాంకేతిక సహకార బంధం ఏర్పర్చుకునేందుకు అమెరికన్‌ కంపెనీలు ఆసక్తితో ఉన్నాయన్నారు.డిఫెన్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగంలో రెండు  రాష్ట్రాలకు అనేక అనుకూలతలున్నాయని తెలిపారు. అమెరికా విద్యాసంస్థల్లో చదివే భారతీయ విద్యార్థులను ప్రోత్సహించేందుకు వీసాల జారీని కొనసాగించడంతో పాటు, భవిష్యత్తులో పెంచుతామని చెప్పా రు. తాజాగా అమెరికా భారత్‌ నడుమ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఒప్పందానికి  తుది రూపునిచ్చినట్టు తెలిపారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top