పాకిస్తాన్‌ లాహోర్‌లో పేలుళ్లు.. పరుగు తీసిన ప్రజలు | Pakistan Lahore Airport Strikes A Day After India Operation Sindoor, Watch Video Inside | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ లాహోర్‌లో పేలుళ్లు.. పరుగు తీసిన ప్రజలు

May 8 2025 9:36 AM | Updated on May 8 2025 11:23 AM

Pakistan Lahore Airport Strikes Video Viral

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లోని లాహోర్‌లో పేలుడు ఘటన చోటుచేసుకుంది. లాహోర్‌లోని వాల్టన్ విమానాశ్రయం సమీపంలోని లాహోర్‌లోని గోపాల్ నగర్, నసీరాబాద్ ప్రాంతాలలో వరుసగా బాంబు పేలుడు ఘటన సంభవించింది. ఎయిర్‌పోర్టు వద్ద గురువారం ఉదయం ఒక్కసారిగా సైరన్లు మోగడంతో ఇళ్ల నుంచి పాక్‌ ప్రజలు బయటకు పరుగులు తీశారు.

అయితే, డ్రోన్‌ కారణంగానే పేలుడు సంభవించినట్లు పాక్‌ పోలీసులు చెబుతున్నారు. 5-6 అడుగుల పొడవున్న డ్రోన్ పేలుడు సంభవించి ఉండవచ్చని పోలీసు వర్గాలు తెలిపాయి. డ్రోన్ వ్యవస్థను జామ్ చేయడం ద్వారా కూల్చివేసినట్లు చెప్పుకొచ్చారు. వరుస బాంబు పేలుడు ఘటనలతో పాకిస్తాన్‌లోని కరాచీ, ఇస్లామాబాద్‌ సహా పలు విమనాశ్రయాలను అధికారులు మూసివేశారు. ఇక, భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టిన మరుసటి రోజే పేలుళ్లు సంభవించడం గమనార్హం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ బాంబు పేలుడుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement