పచ్చమూకల పైశాచికత్వంపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం | Ys Jagan Serious On Mannava Village Sarpanch Nagamalleswara Rao Incident | Sakshi
Sakshi News home page

పచ్చమూకల పైశాచికత్వంపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

Jul 4 2025 6:59 PM | Updated on Jul 4 2025 7:13 PM

Ys Jagan Serious On Mannava Village Sarpanch Nagamalleswara Rao Incident

సాక్షి,గుంటూరు: కూటమి ప్రభుత్వంలో కొనసాగుతున్న దారుణాలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మన్నవ గ్రామ దళిత సర్పంచి నాగమల్లేశ్వర్రావును టీడీపీ నేతలు పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం చేశారు. ఆ ఘటనపై వైఎస్‌ జగన్‌ శుక్రవారం (జులై 4) ఎక్స్‌ వేదికగా స్పందించారు.

‘రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా క్షీణించింది. రెడ్‌బుక్, పొలిటికల్‌ గవర్నన్స్‌లతో ఆంధ్రప్రదేశ్ రక్త‌మోడుతోంది. వైఎస్సార్‌సీపీకి  చెందిన నాయకులు, కార్యకర్తలపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు, అరెస్టులు, అదీ వీలుకాకపోతే, తనవాళ్లని ప్రోత్సహించి మరీ దాడులు చేయిస్తున్నారు.

గుంటూరు జిల్లా మన్నవ గ్రామ దళిత సర్పంచి నాగమల్లేశ్వర్రావును పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వైరల్‌ అయిన వీడియో రాష్ట్రంలో మాఫియా, దుర్మార్గపు పాలనను తెలియజేస్తోంది. నాగమల్లేశ్వర్రావు కుటుంబం మొదటినుంచి వైఎస్సార్‌సీపీలో ఉండడం,  ప్రజల్లో వారికి మంచి గుర్తింపు ఉండడం టీడీపీ వారికి కంటగింపుగా మారింది. పలుమార్లు బెదిరించినా, భయపెట్టినా వెనకడుగు వేయకపోవడంతో, రాజకీయంగా అక్కడ, ఆ ప్రాంతంలో వైఎస్సార్‌సీపీ   ప్రాబల్యాన్ని తట్టుకోలేక స్థానిక ఎమ్మెల్యే తన కార్యకర్తలను పురిగొల్పి ఈ దాడులు చేయించారు. ఆ వీడియోలు చూస్తే, జరిగిన దాడి ఎంత అన్యాయమో, ఎంత హేయమో కనిపిస్తుంది.  

చంద్రబాబు స్వయంగా ప్రోత్సహిస్తూ, తన వాళ్లతో చేయిస్తున్న ఈ దారుణాలతో, వరుసగా జరుగుతున్న ఘటనల నేపథ్యంలో, రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణలేని పరిస్థితులు నెలకొన్నాయి. మాఫియా తరహాలో రాష్ట్రాన్ని నడుపుతున్న చంద్రబాబుకు అసలు పదవిలో ఉండే అర్హత ఉందా? రాజకీయ నాయకులకు, పౌరులకు రక్షణ లేని ఈ రాష్ట్రంలో, రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తూ, లా అండ్‌ ఆర్డర్‌ కాపాడలేని ప‌రిస్థితుల్లో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదని ప్రశ్నిస్తున్నాను’ అని పేర్కొన్నారు. 

 విషమంగా నాగమల్లేశ్వర్రావు ఆరోగ్యం
కూటమి ప్రభుత్వంలో దారుణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అందుకు గుంటూరు జిల్లా మన్నవ గ్రామంలో జరిగిన ఘటన  ఉదాహరణగా నిలుస్తోంది. మన్నవ గ్రామంలో టీడీపీ అడ్డు అదుపూ లేకుండా పోతున్న ఆగడాల్ని ఆ ఊరి సర్పంచి నాగమల్లేశ్వర్రావు ప్రశ్నించారు. జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేయడంతో పాటు ప్రజల పక్షాన నిలిచి వారి ఆగడాల్ని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో నాగమల్లేశ్వర్రావును టీడీపీ నేతలు కొట్టి చంపే ప్రయత్నం చేశారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలో వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం, సర్పంచి నాగమల్లేశ్వర్రావు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement