
ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా తమ 5జీ సర్వీసులను మరో 23 నగరాలకు విస్తరించింది. వీటిలో వైజాగ్‌తో పాటు జైపూర్, కోల్‌కతా, లక్నో తదితర సిటీలు ఉన్నట్లు సంస్థ తెలిపింది. ప్రారంభ ఆఫర్ కింద రూ.299 నుంచి డేటా ప్లాన్లను అందిస్తున్నట్లు వివరించింది.
కంపెనీ ఇప్పటికే ముంబై, ఢిల్లీ–ఎన్‌సీఆర్, బెంగళూరు, చండీగఢ్, పట్నాలాంటి అయిదు నగరాల్లో 5జీ సేవలు అందిస్తోంది. 22 టెలికం సర్కిళ్లకు గాను 17 సర్కిళ్లలో 5జీ స్పెక్ట్రమ్‌ను వొడా–ఐడియా కొనుగోలు చేసింది.
4జీ సేవలకు సంబంధించి సుమారు 65,000 సైట్లలో నెట్‌వర్క్‌ను పటిష్టం చేసుకున్నామని, కవరేజీని మెరుగుపర్చామని కంపెనీ పేర్కొంది. వచ్చే ఆరు నెలల్లో కొత్తగా 1 లక్ష టవర్లను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలిపింది.