అమెరికాను బెంబేలెత్తిస్తున్న డెవిన్
డెవిన్ మంచు తుపాను ధాటికి అమెరికాలో గగనతల ప్రయాణాలపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఇయర్ ఎండ్ సెలవులు.. కొత్త సంవత్సర వేడుకల నేపథ్యాలతో ప్రయాణాలకు సిద్ధపడినవాళ్లకు అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లు షాకిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే ఏకంగా 1,800 విమానాలు రద్దు చేశాయి. వేల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్అవేర్ గణాంకాల ప్రకారం.. వివిధ ఎయిర్‌లైన్స్‌లకు చెందిన 1,802 విమానాలను శుక్రవారం రద్దు చేశారు. మరో 22,349 విమానాలు ఆలస్యంగా నడిచాయి. జాన్ ఎఫ్ కెనడీ, లాగార్డియా, డెట్రాయిట్ మెటరోపాలిటిన్ లాంటి ప్రధాన విమానాశ్రయాల్లో వేలమంది ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రతికూల వాతావరణ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పటికే ఎయిర్‌లైన్స్ కంపెనీలు ప్రయాణికులకు క్షమాపణలు చెప్పాయి. మరో రెండ్రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని తెలుస్తోంది. డెవిన్ తీవ్ర మంచు తుపాను(తుపానుకు పెట్టిన పేరు) గ్రేట్ లేక్స్, మిడ్ అట్లాంటిక్, నార్త్ ఈస్ట్ ప్రాంతాలను ప్రభావితం చేసింది. సుమారు 4-8 ఇంచుల మేర మంచు కురిసింది. నేషనల్ వెదర్ సర్వీసెస్ హెచ్చరికల నేపథ్యంలో.. న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. పలు రాష్ట్రాల్లో.. అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లాలని ప్రజలకు సూచిస్తున్నారు. వింటర్ స్ట్రోమ్ డెవిన్.. ఈ క్రిస్మస్, న్యూఇయర్ సీజన్‌కు లక్షల మందిపై ప్రభావం చూపెడుతోంది. స్వస్థలాలకు చేరుకోలేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేల సంఖ్యలో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇటు రోడ్లపై ట్రాఫిక్ నెమ్మదించింది. కొన్ని ప్రాంతాల్లో వరదలు సంభవించినట్లు తెలుస్తోంది. మంచు కరిగి ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ అవుతున్నాయి. అయితే స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం నుంచి మంచు కురిసే తీవ్రత తగ్గొచ్చని.. ఆ తర్వాత క్రమక్రమంగా పరిస్థితులు మెరుగుపడొచ్చని నేషనల్ వెదర్ సర్వీసెస్ అంటోంది.
మహారాష్ట్రలో పొలిటికల్ ట్విస్ట్..
ముంబై: మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికల(బీఎంసీ) వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నాయకుడు శరద్ పవార్, అజిత్ పవార్ మధ్య ఎన్నికల చర్చలు విఫలమైనట్టు సమాచారం. పుణే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీపై వీరి మధ్య జరిగినట్టు తెలిసింది. దీంతో, మహారాష్ట్ర రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.వివరాల మేరకు.. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ అంశంపై సీట్ల పంపకాలపై శుక్రవారం పూణేలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శరద్ పవార్ వర్గానికి కేవలం 35 స్థానాలను మాత్రమే ఇస్తానని, అది కూడా గడియారం గుర్తుపై పోటీ చేయాలని అడిగారు. అయితే, ఈ ప్రతిపాదనను శరద్ పవార్ తిరస్కరించి చర్యలు ఫలించలేదు. చర్చల అనంతరం శరద్ పవార్ ముభావంగా అక్కడి నుంచి వెనుదిరిగినట్టు తెలిసింది. అజిత్‌తో చర్చలు విఫలమైన తర్వాత శరద్ పవార్.. సీట్ల పంపకాలపై చర్చల కోసం మహా వికాస్ అఘాడి (ఎంవీఎ) వద్దకు తిరిగి వెళ్లారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఆ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే శివసేన, కాంగ్రెస్‌తో ముమ్మర చర్చలు జరిపినట్టు సమాచారం. పూణేలోని ఒక హోటల్లో జరిగిన ఎంవీఏ సమావేశంలో శరద్ పవార్ ఎన్సీపీ వర్గం నుండి బాపుసాహెబ్ పఠారే, అంకుష్ కాకడే.. కాంగ్రెస్ నుండి అరవింద్ షిండే, రమేష్ బాగ్వే.. అలాగే, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన వసంత్ మోరే చర్చల్లో పాల్గొన్నారు. మహాయుతి దూకుడు..మరోవైపు.. బీఎంసీ (BMC) పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార ‘మహాయుతి’ కూటమి వ్యూహాలకు పదును పెట్టింది. సీట్ల పంపకాలపై గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ బీజేపీ, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మధ్య ఒప్పందం ఖరారైంది. మహాయుతి వర్గాల ప్రకారం మొత్తం 227 సీట్లలో బీజేపీ 140 స్థానాల్లో పోటీ చేయనుంది. శివసేన (షిండే వర్గం) 87 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టనుంది. ఇప్పటికే 210 సీట్లపై స్పష్టత రాగా, మిగిలిన స్థానాలపై తుది చర్చలు జరుగుతున్నాయి. అసంతృప్తి వార్తల నేపథ్యంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కలుగజేసుకుని కూటమి ధర్మాన్ని పాటించాలని, మిత్రపక్షంపై విమర్శలు చేయవద్దని బీజేపీ నేతలకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇక, బీఎంసీ ఎన్నికలకు జనవరి 15, 2026న పోలింగ్ జరగనుంది.
పాక్ గుండెల్లో ‘సిందూర్ 2.0’ గుబులు
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు చావుదెబ్బ తగిలింది. పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ దాడి చేయడంతో పెద్ద సంఖ్యలో ముష్కరులు హతమయ్యారు. ఉగ్రవాద స్థావరాలు, శిక్షణా కేంద్రాలు నేలమట్టమయ్యాయి. పాక్ వైమానిక కేంద్రాలు, యుద్ధ విమానాలు సైతం ధ్వంసమయ్యాయి. ఆపరేషన్ సిందూర్‌తో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదని సాక్షాత్తూ పాకిస్తాన్ సైన్యమే చెబుతోంది. భారత సైన్యం సత్తా ఏమిటో పొరుగు దేశానికి తెలిసొచి్చంది. దాంతో ముందు జాగ్రత్త చర్యగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) సరిహద్దు అయిన నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. కీలక ప్రాంతాల్లో కౌంటర్–డ్రోన్ వ్యవస్థలను మోహరించింది. మరో కవ్వింపు చర్యలకు పాల్పడితే సిందూర్ మళ్లీ ప్రారంభమవుతుందని భారత ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది. అందుకే ఆపరేషన్ సిందూర్ 2.0 భయం పాకిస్తాన్‌ను వెంటాడుతోంది. భారత సైన్యం దాడులకు దిగితే తిప్పికొట్టడానికి పీఓకేలోని మూడు సెక్టార్లలో కౌంటర్–అన్మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్(సీ–యూఏఎస్)ను పాక్ సిద్ధం చేసినట్లు భారత నిఘా వర్గాలు తాజాగా గుర్తించాయి. రావల్కోట్, కోట్లీ, భింబర్ సెక్టార్లలో వీటిని నెలకొల్పినట్లు పేర్కొన్నాయి. ఎల్ఓసీ వద్ద 30కిపైగా యాంటీ–డ్రోన్ యూనిట్లను అందుబాటులోకి తీసుకొచి్చనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గగనతల నిఘా వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు ఎల్రక్టానిక్ యుద్ధ సామర్థ్యాలు పెంచుకోవడం పాక్ వ్యూహంగా కనిపిస్తోంది.శత్రు డ్రోన్లపై నజర్ భారత్‌లోని పూంచ్ సెక్టార్‌కు ఎదురుగా ఉన్న రావల్కోట్లో యాంటీ–డ్రోన్ల వ్యవస్థలను రెండో ఆజాద్ కశ్మీర్ బ్రిగేడ్ నిర్వహిస్తోంది. రాజౌరీ, నౌషెరా, సుందర్బనీ సెక్టార్లకు ఎదురుగా ఉండే కోట్లీలో వీటి నిర్వహణ బాధ్యతను మూడో ఆజాద్ కశ్మీరీ బ్రిగేడ్‌కు, భింబర్‌లో నిర్వహణను ఏడో ఆజాద్ కశ్మీరీ బ్రిగేడ్‌కు అప్పగించినట్లు తెలిసింది. ఎల్ఓసీ వెంట ఎల్రక్టానిక్, కైనటిక్ కౌంటర్–యూఏఎస్‌లను పాక్ రంగంలోకి దించినట్లు సమాచారం. ఇందులో కీలకమైన స్పైడర్ వ్యవస్థ కూడా ఉంది. ఇది పది కిలోమీటర్ల దూరంలోని శత్రు డ్రోన్లను కూడా సరిగ్గా గుర్తించగలదు. అంతేకాకుండా పాక్ అమ్ముల పొదిలో సఫ్రా యాంటీ–యూఏవీ జామింగ్ గన్ కూడా ఉంది. దీనిని మనుషులు ఆపరేట్ చేస్తుంటారు. 1.5 కిలోమీటర్ల దూరంలోని డ్రోన్లను కూలి్చవేయొచ్చు. తక్కువ ఎత్తులో ఎగిరే శత్రు డ్రోన్లను కూల్చడానికి సంప్రదాయ గగనతల రక్షణ ఆయుధాలను కూడా పాక్ ఉపయోగిస్తోంది. జీడీఎఫ్ 35 ఎంఎం ట్విన్ బ్యారెల్ యాంటీ– ఎయిర్‌క్రాఫ్ట్ గన్స్, అజ్నా ఎంకే–2, ఎంకే–3 మ్యాన్–పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు పాక్ వద్ద ఉన్నాయి. తక్కువ ఎత్తులో తక్కువ వేగంతో దూసుకొచ్చే డ్రోన్లను వీటితో కూల్చవచ్చు.తుర్కియే, చైనాలతో పాక్ చర్చలు ఇటీవలి కాలంలో పశ్చిమ సరిహద్దుల్లో భారత సైన్యం కదలికలు ముమ్మరమయ్యాయి. సైన్యం, నావికాదళం, వైమానిక దళం తరచుగా విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. గగనతల రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు పాక్ సరిహద్దుల్లో అధునాతన డ్రోన్లను మోహరిస్తున్నారు. ఈ పరిణామాలతో పాక్ అప్రమత్తమైనట్లు భారత నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు నూతన డ్రోన్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కోసం తుర్కియే, చైనాలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కౌంటర్–డ్రోన్ సామర్థ్యాల విషయంలో పాక్ సైన్యం చాలా బలహీనంగా ఉంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఈ విషయం నిరూపితమైంది. అందుకే డ్రోన్లతో జరిగే దాడిని తట్టుకోవడంపై పాక్ ప్రధానంగా దృష్టి పెట్టినట్లు భారత నిఘా వర్గాలు కనిపెట్టాయి.
ప్రాంతీయ భాషలే ప్లస్
రోజువారీ ఉద్యోగ విధుల్లో భాగంగా కస్టమర్లతో మాట్లాడాల్సిన ఫ్రంట్‌లైన్ ఉద్యోగులను తీసుకునేందుకు అంకుర సంస్థలు కొత్త పంథాను ఎంచుకుంటున్నాయి. ప్రాథమికంగా దరఖాస్తులను మదింపు చేయడంలాంటి పనుల కోసం ప్రాంతీయ భాషల్లోని కృత్రిమ మేధ (ఏఐ) సాధనాలను విస్తృతంగా ఉపయోగించుకుంటున్నాయి. ఈ టూల్స్ వినియోగంతో నియామకాలకు పట్టే సమయం దాదాపు 40% వరకు ఆదా అవుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. షెఫ్‌లు, స్టోర్ ఆపరేటర్లలాంటి ఉద్యోగాలకు చాలా మంది దరఖాస్తుదారులు, ఇంగ్లిష్ కన్నా, ప్రాంతీయ భాషల్లోనే మాట్లాడటమే సౌకర్యవంతంగా భావిస్తున్నారనే విషయం గ్రహించిన క్లౌడ్ కిచెన్ ఆపరేటరు క్యూర్‌ఫుడ్స్ ఈ ఏడాది నుంచి నియామకాల ప్రక్రియ కోసం నేటివ్ ల్యాంగ్వేజ్ ఏఐ సాధనాలను ఉపయోగించడం ప్రారంభించింది. ప్రస్తుతం తొలి దశ స్క్రీనింగ్‌ను ఆటోమేటెడ్ వాయిస్బాట్స్తో నిర్వహిస్తోంది. దీని వల్ల రిక్రూట్మెంట్ విభాగం సిబ్బందిపై ఒత్తిడి, అలాగే నియామకాలకు పట్టే సమయం తగ్గుతోందని కంపెనీ పేర్కొంది. తెలుగు, తమిళం, హిందీ తదితర ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యమిచ్చే, ద్వితీయ..తృతీయ శ్రేణి పట్టణాల్లో నివసించే ప్రతిభావంతులైన దరఖాస్తుదార్లనూ పరిగణనలోకి తీసుకునేందుకు వీలవుతోందని తెలిపింది. వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు తోడ్పడుతోందని పేర్కొంది. వాహన్ ఏఐ తదితర థర్డ్ పార్టీ ప్లాట్‌ఫాంలు కొన్ని ఈ–కామర్స్, టెక్ స్టార్టప్‌లలో సిబ్బంది సంఖ్య 70 శాతం పైగా పెరిగే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. చాలా అంకుర సంస్థలు తమ మానవ వనరుల విభాగంలో సిబ్బందిని పెంచుకోవాల్సిన అవసరం లేకుండా, ప్రాంతీయ భాషల్లో హైరింగ్ సొల్యూషన్స్ అందించే థర్డ్ పార్టీ ప్లాట్‌ఫాంల సర్వీసులను వినియోగించుకుంటున్నాయి. దీంతో వాహన్ ఏఐ, బోల్నా ఏఐ, సంవాదిని లాంటి కంపెనీల సేవలకు డిమాండ్ పెరుగుతోంది.స్టార్టప్‌లు చిన్న పట్టణాల్లోని ప్రతిభావంతులను కూడా తీసుకునేందుకు ఈ తరహా హైరింగ్ విధానం ఉపయోగపడుతోందని ఇన్‌స్టాహైర్ వర్గాలు వివరించాయి. దేశీయంగా ఏఐ ప్రొఫెషనల్స్ 23.5 లక్షల మంది పైగా ఉన్నప్పటికీ వివిధ కార్యకలాపాల నిర్వహణకు తగినంత మంది దొరకడం లేదు. డిమాండ్, సరఫరాకి మధ్య 51% పైగా వ్యత్యాసం ఉంటోంది. దీనితో ఎక్కువగా సంక్లిష్టత ఉండని, పెద్ద స్థాయిలో నిర్వహించాల్సిన ప్రాథమిక స్క్రీనింగ్, రొటీన్‌గా వచ్చే ప్రశ్నలకు సమాధానాలివ్వడం, ఇంటర్వ్యూలను ఫిక్స్ చేయడంలాంటి పనుల కోసం అంకురాలు ఏఐ టూల్స్‌ని ఎంచుకుంటున్నాయి. ప్రాంతీయ భాషల్లోని వాయిస్ బాట్స్ ఏకకాలంలో పెద్ద సంఖ్యలో కాల్స్‌ని హ్యాండిల్ చేయగలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్నాలాంటి జాబ్స్ మార్కెట్‌ప్లేస్ అంకుర సంస్థ అంతర్గతంగా రూపొందించిన ఏఐ కాలింగ్ ఏజెంటును వినియోగిస్తోంది. తొలి దశ స్క్రీనింగ్‌కి దీన్ని ఉపయోగిస్తోంది. రిక్రూటర్లు నిర్దిష్టంగా ప్రశ్నలను తయారు చేసి సిస్టమ్‌లో ఫీడ్ చేస్తారు. ఆ తర్వాత సదరు సిస్టమే, దరఖాస్తుదార్లకు కాల్ చేసి, వారి సమాధానాలను విశ్లేíÙంచుకుని, షార్ట్‌లిస్ట్ చేస్తుంది. దీని వల్ల మాన్యువల్‌గా స్క్రీనింగ్‌కి పట్టే సమయం సగానికి పైగా తగ్గింది. ఈ టూల్‌ని అప్నా తమ క్లయింట్ కంపెనీలకూ ఆఫర్ చేస్తోంది. మెరుగ్గా అంచనా వేసేందుకు వీలు .. అలాగే దేశవ్యాప్తంగా చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) రుణ సేవలందించే ఫ్లెక్సిలోన్స్ కూడా ఇదే తరహాలో నియామకాలకు ఏఐ టూల్స్‌ని ఉపయోగిస్తోంది. దీనితో ఫ్రంట్‌లైన్ సిబ్బంది నియామకాల ప్రక్రియకు పట్టే సమయం 30–40 శాతం మేర తగ్గిందని కంపెనీ వివరించింది. అభ్యర్ధులు తమకు సౌకర్యవంతంగా ఉండే భాషలో మాట్లాడటం వల్ల వారి సామర్థ్యాలను మరింత మెరుగ్గా అంచనా వేసేందుకు వీలవుతోందని తెలిపింది. ఇలాంటి సిస్టమ్స్ ఇచ్చే విశ్లేషణల వల్ల పక్షపాత ధోరణి తగ్గి, అభ్యర్ధుల షార్ట్‌లిస్టింగ్ ప్రక్రియ వేగవంతమవుతుందని ఫ్లెక్సిలోన్స్ వివరించింది. ముఖ్యంగా రాతపరమైన ఇంగ్లిష్ నైపుణ్యాల కన్నా స్థానిక భాషల్లో మాట్లాడే నైపుణ్యాలు ఎక్కువగా అవసరమయ్యే సేల్స్, కలెక్షన్ మొదలైన ఉద్యోగాలకు ఇది ఎంతో ఉపయోగకరమని పేర్కొంది. సాక్షి, బిజినెస్‌డెస్క్
'దండోరా'కు నష్టం.. వేడుకున్న శివాజీ
పైకప్పు లేక.. 10 నిమిషాలు ఉండలేక..
మహారాష్ట్రలో పొలిటికల్ ట్విస్ట్..
భర్త సంసారానికి పనికిరాడని.. నవ వధువు
అమెరికాను బెంబేలెత్తిస్తున్న డెవిన్
విడాకుల రూమర్స్.. సతీమణితో వేదికపై రానున్న విజయ్!
అవినీతి కేసులో మలేసియా మాజీ ప్రధానికి 15 ఏళ్ల జైలు
వార్తల వెం‘బడి’!
ఏఐ పొట్ట కొట్టింది.. డిజైనర్ దారి తప్పాడు
నేడు సీడబ్ల్యూసీ సమావేశం
రూ.10 నోట్లకు గుడ్‌బై..!
'అందరికీ ఇదే నా విజ్ఞప్తి'.. అనసూయ ఆసక్తికర ట్వీట్
‘మా అబ్బాయి మీ దేశానికి భారమా?’.. న్యూజిలాండ్‌లో భారతీయ కుటుంబం ఆవేదన!
వెండి ఇప్పుడే ఇంతుంటే.. అప్పటికల్లా అంతే!
స్విమ్ సూట్లో అనసూయ వీడియో.. శివాజీపై కోపమా?
ప్రపంచకప్ జట్టులో జైస్వాల్, రుతురాజ్‌కు చోటు!
టీమిండియా కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా!
రేషన్ బియ్యం.. ‘ఉచితం’ వెనుక దాగి ఉన్న నిజం
ఈ రాశి వారికి యత్నకార్యసిద్ధి.. స్థిరాస్తి వృద్ధి
సిఐడి - బాబుకేసుల మూత విభాగం
వేళాకోళంగా ఉందా? వీళ్ల పేర్లు ‘రెడ్‌బుక్’లో రాయండి!!
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్ ఎవరంటే?
‘శంబాల’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
డబ్బు సంపాదన ధ్యేయంగా.. రోజుకు 14 గంటలు పని!
బంగారమా.. ఈరోజైనా కొనగలమా?
మీకు ఎన్ని డాలర్లు ఇస్తే దిగిపోతారో కనుక్కోమంటున్నార్సార్!
నాకేమో రాజకీయ కాలుష్యంతో అలర్జీ సార్!
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. పనుల్లో విజయం
సిగ్గు లేని దేశం...
బంగారం, వెండిలా.. దూసుకెళ్తున్న మరో మెటల్ రేటు!
'దండోరా'కు నష్టం.. వేడుకున్న శివాజీ
పైకప్పు లేక.. 10 నిమిషాలు ఉండలేక..
మహారాష్ట్రలో పొలిటికల్ ట్విస్ట్..
భర్త సంసారానికి పనికిరాడని.. నవ వధువు
అమెరికాను బెంబేలెత్తిస్తున్న డెవిన్
విడాకుల రూమర్స్.. సతీమణితో వేదికపై రానున్న విజయ్!
అవినీతి కేసులో మలేసియా మాజీ ప్రధానికి 15 ఏళ్ల జైలు
వార్తల వెం‘బడి’!
ఏఐ పొట్ట కొట్టింది.. డిజైనర్ దారి తప్పాడు
నేడు సీడబ్ల్యూసీ సమావేశం
రూ.10 నోట్లకు గుడ్‌బై..!
'అందరికీ ఇదే నా విజ్ఞప్తి'.. అనసూయ ఆసక్తికర ట్వీట్
‘మా అబ్బాయి మీ దేశానికి భారమా?’.. న్యూజిలాండ్‌లో భారతీయ కుటుంబం ఆవేదన!
వెండి ఇప్పుడే ఇంతుంటే.. అప్పటికల్లా అంతే!
స్విమ్ సూట్లో అనసూయ వీడియో.. శివాజీపై కోపమా?
ప్రపంచకప్ జట్టులో జైస్వాల్, రుతురాజ్‌కు చోటు!
టీమిండియా కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా!
రేషన్ బియ్యం.. ‘ఉచితం’ వెనుక దాగి ఉన్న నిజం
ఈ రాశి వారికి యత్నకార్యసిద్ధి.. స్థిరాస్తి వృద్ధి
సిఐడి - బాబుకేసుల మూత విభాగం
వేళాకోళంగా ఉందా? వీళ్ల పేర్లు ‘రెడ్‌బుక్’లో రాయండి!!
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్ ఎవరంటే?
‘శంబాల’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
డబ్బు సంపాదన ధ్యేయంగా.. రోజుకు 14 గంటలు పని!
బంగారమా.. ఈరోజైనా కొనగలమా?
మీకు ఎన్ని డాలర్లు ఇస్తే దిగిపోతారో కనుక్కోమంటున్నార్సార్!
నాకేమో రాజకీయ కాలుష్యంతో అలర్జీ సార్!
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. పనుల్లో విజయం
సిగ్గు లేని దేశం...
బంగారం, వెండిలా.. దూసుకెళ్తున్న మరో మెటల్ రేటు!
ఫొటోలు
'ఛాంపియన్' మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
మేడారం వనదేవతల దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
కాజల్ అగర్వాల్ డిసెంబరు జ్ఞాపకాలు (ఫొటోలు)
TTD: అదే నిర్లక్ష్యం.. భక్తుల భద్రత గాలికి.. (ఫొటోలు)
ఈవినింగ్ చిల్ అయిపోతున్న సుప్రీత (ఫొటోలు)
బిగ్‌బాస్ శివజ్యోతి మరోసారి బేబీ షవర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
క్రిస్మస్ వేడుకల్లో సినీ సెలబ్రిటీలు (ఫోటోలు)
ఈ ఏడాది మధుర జ్ఞాపకాలను షేర్ చేసిన సమంత.. (ఫోటోలు)
‘శంబాల’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
టీటీడీ ఘోర వైఫల్యం.. భక్తుల ఆగ్రహం (ఫొటోలు)
సినిమా
మరో అమ్మాయితో నా భర్త డేటింగ్.. వదిలిపెట్టను : స్టార్ హీరో భార్య
బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో గోవిందా, ఆయన భార్య సునీత ఆహుజా విడాకులు తీసుకోబోతున్నారనే వార్త గత కొంతకాలంగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం వీరిద్దరు సపరేట్గా ఉంటున్నారు. కానీ అధికారికంగా విడాకులు అయితే తీసుకోలేదు. కోర్టు ద్వారా గోవిందాకు నోటీసులు అందించారని..త్వరలోనే విడాకులు తీసుకునే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా భర్త గోవిందాపై సునీత(Sunita Ahuja) సంచలన ఆరోపణలు చేసింది. తన భర్తకు మరొక అమ్మాయితో వివాహేతర సంబంధం ఉందని.. డబ్బుల కోసమే ఆమె ఆయనకు దగ్గరైందని ఆరోపించారు.తాజాగా ఆమె ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకుల రూమర్స్‌పై స్పందించారు. ‘మేమిద్దరం సపరేట్గా ఉంటున్న విషయం నిజమే. గోవిందా(Govinda) మరోక అమ్మాయితో డేటింగ్లో ఉన్నాడు. ఆ అమ్మాయి అతన్ని ప్రేమించడం లేదు.. డబ్బుల కోసమై దగ్గరైంది. ఆమె హీరోయిన్ అయితే కాదు. హీరోయిన్లు ఇతరుల కాపురాల్లో చిచ్చు పెట్టేంత చెడ్డవాళ్లు కాదు’ అని సునీత చెప్పుకొచ్చారు. ఇంకా మాట్లాడుతూ..గోవింద జీవితంలో ముగ్గురే మహిళలు కీలకంగా ఉండాలని కోరుకున్నాం. ఆమె తల్లి, భార్య, కూతురు.. ఈ ముగ్గురు మహిళలే ఆయన జీవితంలో ఉండాలకున్నాం. కానీ నాలుగో మహిళ రావడం జీర్ణించుకోలేకపోయామని సునీత ఎమోషనల్ అయ్యారు. ఇప్పటికైనా గోవింద తన చుట్టు ఉన్న చెంచాలను వదిలేసి.. వర్క్‌పై ఫోకస్ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. కాగా.. సునీతా అహుజా, గోవిందల పెళ్లి 1987లో జరిగింది వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకు పేరు యశ్, కూతురు పేరు టీనా. గత ఏడాదిగా వీరిద్దరు వేరు వేరుగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. విడాకుల రూమర్స్ వినిపిస్తున్నా.సునిత మాత్రం గోవిందా ఎప్పటికీ తనవాడే అని.. వదిలేసే ప్రసక్తే లేదన్నారు.
ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి క్రిస్మస్ కలిసి రావడంతో అందరికీ సెలవులు వచ్చాయి. దీంతో చాలామంది ఇళ్లలోనే ఉన్నారు. వాళ్లకోసమా అన్నట్లు థియేటర్లలో చాలా సినిమాలు రిలీజయ్యాయి కానీ వాటిలో 'శంబాల' మాత్రమే బాగుందనే టాక్ తెచ్చుకుంది. మరోవైపు ఓటీటీల్లోనూ బోలెడన్ని మూవీస్ స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి.గురు, శుక్రవారాల్లో కలిపి 22 వరకు సినిమాలు, వెబ్ సిరీస్‌లు పలు ఓటీటీల్లోకి వచ్చాయి. వీటిలో ఆంధ్ర కింగ్ తాలూకా, రివాల్వర్ రీటా, బాహుబలి ద ఎపిక్, అష్టదిగ్బంధనం, ఏక్ దివానే కీ దివానియత్, వ్రిట్టా మూవీస్ ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 కూడా అందుబాటులోకి వచ్చింది. మొత్తం లిస్టు ఇదిగోనెట్ఫ్లిక్స్స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 - తెలుగు డబ్బింగ్ సిరీస్బాహుబలి ద ఎపిక్ - తెలుగు సినిమారివాల్వర్ రీటా - తెలుగు డబ్బింగ్ మూవీఆంధ్ర కింగ్ తాలూకా - తెలుగు సినిమాఉళ్లోరుక్కు - మలయాళ మూవీసింగిల్ సాల్మా - హిందీ సినిమాక్యాష్ హీరో సీజన్ 1 - తెలుగు డబ్బింగ్ సిరీస్అమెజాన్ ప్రైమ్అష్టదిగ్బంధనం - తెలుగు మూవీలవ్ యూ ముద్దు - కన్నడ సినిమాఐ యామ్ స్టిల్ హియర్ - బ్రెజిలియన్ మూవీడోగులు - టర్కిష్ సినిమామనుషన్గడ - తమిళ మూవీవాట్ వుయ్ వాంటెడ్ టూబీ - స్పానిష్ సినిమాహాట్స్టార్గ్రాండ్ కేమన్ - ఇంగ్లీష్ సిరీస్హియర్ నౌ - హిందీ డబ్బింగ్ మూవీఒక్లామా సిటీ బాంబింగ్ - ఇంగ్లీష్ సిరీస్శ్రీ స్వప్న కుమార్ - బెంగాలీ మూవీజీ5ఏక్ దివానే కీ దివానియత్ - హిందీ సినిమారోంకిణి భవన్ - బెంగాలీ సిరీస్వ్రిట్టా - తెలుగు డబ్బింగ్ సినిమాక్రిస్మస్ అన్ టోల్డ్ స్టోరీస్ - హిందీ డాక్యుమెంటరీమనోరమఅపూర్వ పుత్రన్మర్ - మలయాళ మూవీ
శ్రీలీల గ్లామర్ టచ్.. కాజల్ కిస్సీ ఫేస్
గ్లామరస్ టచ్ ఇచ్చేస్తున్న శ్రీలీలముద్దు ఇచ్చేలా ఫేస్ పెట్టిన కాజల్క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో కీర్తి సురేశ్మత్తెక్కేలా చూస్తూ నేహాశెట్టి పోజులువైట్ డ్రస్‌లో అందాల బొమ్మలా రెజీనాషూటింగ్ జ్ఞాపకాలతో అనన్య పాండే View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Surbhi Puranik (@surofficial) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Navya & Divya Niranjan (@styledbynavyadivya) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday)
కెమికల్ వాటర్‌లో పడ్డా.. అప్పటినుంచే..: కమెడియన్
కమెడియన్‌గా, విలన్‌గా వెండితెరపై రాణిస్తున్నాడు తమిళ నటుడు మొట్ట రాజేంద్రన్. ఈయన మొదట్లో స్టంట్‌మెన్‌గా పనిచేశాడు. నాన్ కడవులే సినిమాకుగానూ రాష్ట్రస్థాయిలో అవార్డులు గెల్చుకున్నాడు. అయితే మొదట్లో రాజేంద్రన్ పలువురు నటుల స్థానంలో యాక్షన్ సీన్లు (స్టంట్ డబుల్) చేసేవాడు. ఇప్పుడు మాత్రం నటుడిగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సత్తా చాటుతున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.15 అడుగుల ఎత్తులో నుంఒక మలయాళ సినిమా షూటింగ్లో 15 అడుగుల ఎత్తులో నుంచి కింద నీళ్లలో పడాల్సి ఉంటుంది. నేను ఆలోచించకుండా దూకేశాను. తీరా ఆ ఊరివాళ్లు చూసి.. ఇదంతా ఫ్యాక్టరీల నుంచి వచ్చే కెమికల్ వాటర్.. ఈ నీళ్లలో ఎందుకు దూకారు? అన్నారు. అలా అప్పుడే జుట్టురాలడం మొదలైంది. కొంతకాలానికే మొత్తం గుండు అయిపోయింది. కనుబొమ్మలు కూడా పోయాయి. మొదట్లో కొంత బాధపడ్డాను.అదే ప్లస్ అయిందిఅప్పటినుంచే విలన్‌గా కాకుండా కామెడీ రోల్స్ వచ్చాయి. విగ్ కూడా పెట్టుకోకుండా అలాగే ఉండమంటున్నారు. ఏదైతే మైనస్ అనుకున్నానో అదే నాకు ప్లస్ అయిపోయింది. తెలుగు ప్రేక్షకులు నన్ను థియేటర్లలో చూసి విజిల్స్ వేస్తుంటే ఒక్కోసారి ఆనందంతో కన్నీళ్లు వస్తాయి అన్నాడు. రాజేంద్రన్ తెలుగులో చలో, ఎఫ్ 3, వాల్తేర్ వీరయ్య, సర్, విమానం, దే కాల్ హిమ్ ఓజీ, త్రిబాణధారి బార్బరిక్, త్రిముఖ వంటి పలు చిత్రాల్లో నటించాడు.
క్రీడలు
రేణుక నిప్పులు షఫాలీ మెరుపులు
121/6... 128/9... 112/7... ఇప్పటివరకు జరిగిన మూడు టి20ల్లోనూ శ్రీలంక మహిళల జట్టు స్కోర్లివి... భారత బౌలింగ్ ప్రతాపానికి మచ్చుతునకలు. ప్రతీ మ్యాచ్‌లోనూ మనమ్మాయిలు ప్రత్యర్థి బ్యాటర్లను కట్టిపడేస్తున్నారు. దీంతో 20 ఓవర్ల కోటా పూర్తి చేసినా... ఆలౌట్ కాకపోయినా కూడా కనీసం 130 పరుగులైనా చేయకుండా శ్రీలంకనుతమ బౌలింగ్ బంధనాలతో కట్టడి చేస్తున్నారు. దీంతో హర్మన్‌ప్రీత్ బృందం రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్‌ను 3–0తో వశం చేసుకుంది. తిరువనంతపురం: భారత్, శ్రీలంకల మధ్య ఈ వేదికపై ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కానీ ఇక్కడ ఆడిన తొలి (మూడో టి20) మ్యాచ్‌తోనే భారత మహిళల జట్టు ఐదు టి20ల సిరీస్‌ను 3–0తో కైవసం చేసుకుంది. భారత పేసర్ రేణుక సింగ్ (4/21), సీనియర్ స్పిన్నర్ దీప్తి శర్మ (3/18) కోలుకోలేని దెబ్బతీయడంతో... మొదట శ్రీలంక మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 112 పరుగులే చేసింది. ఆతిథ్య బౌలింగ్ ధాటికి సింహళ బ్యాటర్లలో ఏ ఒక్కరు కనీసం 30 పరుగులైనా చేయలేకపోయారు. ఇమిషా దులానీ (32 బంతుల్లో 27; 4 ఫోర్లు) టాప్‌స్కోరర్! అనంతరం సులువైన లక్ష్యాన్ని హర్మన్‌ప్రీత్ సేన 13.2 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ షఫాలీ వర్మ (42 బంతుల్లో 79 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో గెలిపించింది. ఆమె దూకుడు వల్లే ఇంకా 6.4 ఓవర్లకు ముందే భారత్ లక్ష్యాన్ని చేరుకుంది. ఇదే వేదికపై రేపు నాలుగో టి20 మ్యాచ్ జరుగుతుంది. షఫాలీ మళ్లీ ధనాధన్ ‘షో’ తొలుత లంక ఇన్నింగ్స్ రేణుక, దీప్తి చావుదెబ్బ తీశారు. దీంతో 45/4 స్కోరు వద్దే ప్రధాన బ్యాటింగ్ బలగాన్ని కోల్పోయింది. హాసిని (25), మిడిలార్డర్లో కవిషా దిల్హరి (20), కౌషిని (19) చేసిన పరుగులతో కష్టంగా జట్టు స్కోరు వంద దాటింది. తర్వాత గత మ్యాచ్‌ల కంటే తక్కువైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత జట్టులో షఫాలీ వర్మ మళ్లీ ధనాధన్ షో రెచ్చిపోయింది. చూడచక్కని బౌండరీలు, భారీ సిక్సర్లతో లంక బౌలర్లపై విరుచుకుపడింది. 24 బంతుల్లోనే ఫిఫ్టీని పూర్తి చేసుకుంది. దీంతో స్మృతి మంధాన (1), జెమీమా (9)లు సింగిల్ డిజిట్లకు అవుటైనా... రవ్వంత ప్రభావం లేకుండానే లక్ష్యంవైపు భారత్ నడించింది. హర్మన్‌ప్రీత్ (21 నాటౌట్; 2 ఫోర్లు), షఫాలీ అబేధ్యమైన మూడో వికెట్‌కు 48 పరుగులు జోడించి మ్యాచ్‌ను ముగించారు. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: హాసిని (సి) దీప్తి శర్మ (బి) రేణుక 25; చమరి (సి) హర్మన్‌ప్రీత్ (బి) దీప్తిశర్మ 3; హర్షిత (సి అండ్ బి) రేణుక 2; ఇమిషా దులానీ (సి) జెమీమా (బి) రేణుక 27; నీలాక్షిక (ఎల్బీడబ్ల్యూ) (బి) రేణుక 4; కవీషా (సి) అమన్‌జోత్ (బి) దీప్తిశర్మ 20; కౌషని (నాటౌట్) 19; శేషని (బి) దీప్తిశర్మ 5; మాల్కి మదర (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 112. వికెట్ల పతనం: 1–25, 2–31, 3–32, 4–45, 5–85, 6–90, 7–98. బౌలింగ్: రేణుక 4–1–21–4, క్రాంతి 4–0–22–0, దీప్తిశర్మ 4–0– 18–3, వైష్ణవి 3–0–14–0, అమన్‌జోత్ 4–0– 23–0, శ్రీచరణి 1–0–11–0. భారత ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (నాటౌట్) 79; స్మృతి (ఎల్బీడబ్ల్యూ) (బి) కవిషా 1; జెమీమా (బి) కవిషా 9; హర్మన్‌ప్రీత్ (నాటౌట్) 21; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (13.2 ఓవర్లలో 2 వికెట్లకు) 115. వికెట్ల పతనం: 1–27, 2–67. బౌలింగ్: శేహాని 2.2–0–28–0, మాల్కి మదర 2–0–11–0, నిమష మీపగె 2–0–29–0, కవిషా దిల్హరి 3–0–18–2, ఇనోక 4–0–28–0.151 అంతర్జాతీయ మహిళల టి20ల్లో దీప్తి శర్మ తీసిన వికెట్లు. ఈ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా మేగన్ షుట్ (ఆస్ట్రేలియా) పేరిట ఉన్న రికార్డును దీప్తి సమం చేసింది.
షెఫాలీ మెరుపులు.. మూడో టీ20లో భారత్ ఘన విజయం
తిరువనంతపురం వేదికగా శ్రీలంక మహిళలతో జరిగిన మూడో టీ20లో 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఉమెన్ ఇన్ బ్లూ.. మరో రెండు మ్యాచ్‌ల మిగులూండగానే 3-0 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. 113 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 13.2 ఓవర్లలో చేధించింది.లక్ష్య చేధనలో ఓపెనర్ షెఫాలీ వర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 40 బంతుల్లో 11 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 79 పరుగులు చేసి ఆజేయంగా నిలిచింది. ఆమెతో పాటు హర్మన్ ప్రీత్ కౌర్(21) రాణించింది. అయితే స్టార్ ప్లేయర్లు స్మృతి మంధాన(1), రోడ్రిగ్స్(9) మాత్రం విఫలమయ్యారు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 112 పరుగులకే పరిమితమైంది. భారత పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ నాలుగు వికెట్లు పడగొట్టి లంక టాపార్డర్‌ను దెబ్బతీయగా.. దీప్తీ శర్మ మూడు వికెట్లతో సత్తాచాటింది. శ్రీలంక బ్యాటర్లలో ఇమేషా దులాని 27 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కవిషా దిల్హారి(20), హాసిని పెరీరా(25) ఫర్వాలేదన్పించారు. ఇక నాలుగో టీ20 ఇదే వేదికగా డిసెంబర్ 28న జరగనుంది.చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో టీమిండియా స్టార్, ఢిల్లీ బాయ్ విరాట్ కోహ్లి అదరగొడుతున్నాడు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ దేశవాళీ వన్డే టోర్నీలో ఆడుతున్న కోహ్లి.. అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతున్నాడు. తొలి మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌పై విధ్వంసకర సెంచరీతో చెలరేగిన కోహ్లి.. ఇప్పుడు రెండో మ్యాచ్‌లో గుజరాత్‌పై మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. 61 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 77 పరుగులు చేశాడు.ఈ క్రమంలో కింగ్ కోహ్లి ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. లిస్ట్-ఎ క్రికెట్లో అత్యధిక యావరేజ్ కలిగిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్లో కోహ్లి ఇప్పటివరకు 57.87 సగటుతో 16,207 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ వరల్డ్ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం మైఖేల్ బెవాన్ పేరిట ఉండేది. బెవాన్ తన లిస్ట్-ఎ కెరీర్లో 57.86 సగటుతో 15,103 పరుగులు చేశాడు. తాజా హాఫ్ సెంచరీ బెవాన్ ఆల్‌టైమ్ రికార్డును కింగ్ బ్రేక్ చేశాడు.లిస్ట్ ఎ క్రికెట్లో అత్యధిక సగటు సాధించిన బ్యాటర్లు వీరే1. విరాట్ కోహ్లి (భారత్): 57.87- 16,207 పరుగులు2. మైఖేల్ బెవాన్ (ఆస్ట్రేలియా): 57.86- 15,103 పరుగులు3. సామ్ హైన్ (ఇంగ్లండ్): 57.76- 3004 పరుగులు4. ఛతేశ్వర్ పుజారా (భారత్): 57.01-5759 పరుగులు5. రుతురాజ్ గైక్వాడ్ (భారత్): 56.68- 4648 పరుగులుఇక మ్యాచ్ విషయానికి వస్తే.. గుజరాత్‌పై 7 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కోహ్లితో పాటు కెప్టెన్ రిషబ్ పంత్(70) హాఫ్ సెంచరీతో మెరిశాడు. గుజరాత్ బౌలర్లలో విశాల్ జైశ్వాల్ 4 వికెట్లు పడగొట్టగా..రవి బిష్ణోయ్ రెండు వికెట్లు సాధించాడు. అనంతరం 255 పరుగుల లక్ష్య చేధనలో గుజరాత్ 47.4 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటైంది. గుజరాత్ బ్యాటర్లలో ఆర్య దేశాయ్(57) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సౌరవ్ చౌహన్(49), ఉర్విల్ పటేల్(31) ఫర్వాలేదన్పించారు. ఢిల్లీ బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ మూడు, ఇషాంత్ శర్మ, అర్పిత్ రాణా తలా రెండు వికెట్లు సాధించాడు. హాఫ్ సెంచరీతో సత్తాచాటిన విరాట్ కోహ్లికి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.
IND vs SL: 4 వికెట్లతో చెలరేగిన రేణుకా.. భారత్ టార్గెట్ ఎంతంటే?
తిరువనంతపురం వేదికగా శ్రీలంక మహిళలతో జరుగుతున్న మూడో టీ20లోనూ భారత బౌలర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 112 పరుగులకే పరిమితమైంది. ఇండియన్ పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ నాలుగు వికెట్లు పడగొట్టి లంక టాపార్డర్‌ను దెబ్బకొట్టింది.ఆమెతో పాటు స్పిన్నర్ దీప్తీ శర్మ కూడా మూడు వికెట్లు పడగొట్టి పర్యాటక జట్టును నామమాత్రపు స్కోర్‌కే పరిమితం చేసింది. అయితే మిగితా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికి వికెట్ మాత్రం సాధించలేకపోయారు. శ్రీలంక బ్యాటర్లలో ఇమేషా దులాని 27 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కవిషా దిల్హారి(20), హాసిని పెరీరా(25) ఫర్వాలేదన్పించారు.కెప్టెన్ ఆతపట్టు కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచింది. అయితే భారత బ్యాటర్లు ఉన్న జోరు ముందు ఈ స్పల్ప లక్ష్యాన్ని లంక బౌలర్లు ఎలా కాపాడుకుంటారో చూడాలి. ఇప్పటికే తొలి రెండు టీ20ల్లో విజయం సాధించిన భారత్.. మూడో మ్యాచ్‌లో కూడా ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్ మరో రెండు టీ20ల మిగిలూండగానే 3-0 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంటుంది.తుది జట్లు..శ్రీలంక: చమరి అతపత్తు(కెప్టెన్), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, నిమేషా మదుషాని, కవిషా దిల్హరి, నీలక్షికా సిల్వా, ఇమేషా దులాని, కౌషని నుత్యంగన(వికెట్ కీపర్), మల్షా షెహాని, ఇనోకా రణవీర, మల్కీ మదరభారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్, శ్రీ చరణి
న్యూస్ పాడ్‌కాస్ట్
ఏపీ రాజధానిలో అన్నదాత గుండె ఆగింది... ప్రభుత్వం ఒత్తిడి వల్ల గుండెపోటుతో కుప్పకూలిన రైతు దొండపాటి రామారావు
ఆంధ్రప్రదేశ్ గ్రామాలకు గ్రహణం. కేంద్ర నిధులపై బాబు సర్కారు ఆంక్షలు
ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ యూరియా కష్టాలు... చంద్రబాబు సర్కారు అలసత్వంతో రబీలోనూ రైతన్నకు తప్పని తిప్పలు
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుపై కేసుల కథ కంచికి... ‘స్కిల్’ కుంభకోణం కేసు మూసివేతకు కూటమి సర్కార్ పన్నాగం
రెవెన్యూ ఫిర్యాదులపై ఏమాత్రం స్పందించని చంద్రబాబు సర్కారు. కబ్జాలు, సరిహద్దు సమస్యలు, అక్రమాలతో లక్షలాది మంది సతమతం
పేదల బియ్యం సంచుల్లో పందికొక్కులు 'రేషన్ స్మగ్లర్లు'
రోడ్డెక్కితే బాదుడే... ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన వేల కోట్ల రూపాయల భారం
‘ఇంక్విలాబ్ మంచ్’ నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యతో బంగ్లాదేశ్‌లో విధ్వంసం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని మేం రాగానే పూర్తి చేస్తాం... తేల్చిచెప్పిన వైఎస్ జగన్మోహన్రెడ్డి... మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల పత్రాలు గవర్నర్‌కు అందజేత
ఆంధ్రప్రదేశ్‌లో కోటి సంతకాల సమరం... కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ మహా ఉద్యమం.. నేడు గవర్నర్‌కు కోటి సంతకాల ప్రతులు అందజేయనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి
బిజినెస్
సుందర్ పిచాయ్ కంటే పదిరెట్లు ఎక్కువ సంపద!.. ఎవరీమె?
గ్లోబల్ టెక్ రంగంలో అత్యంత ధనవంతులైన భారతీయ సంతతికి చెందినవారు ఎవరనే ప్రశ్నకు.. చాలామంది సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ పేర్లు చెబుతారు. అయితే హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం.. అత్యంత ధనవంతులైన భారతీయ ప్రొఫెషనల్ మేనేజర్ ఆర్టిస్టా నెట్వర్క్స్ సీఈఓ & చైర్పర్సన్ జయశ్రీ ఉల్లాల్ అని తెలిసింది.హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం.. భారతీయ ప్రొఫెషనల్ మేనేజర్లలో అగ్రస్థానంలో నిలిచిన జయశ్రీ ఉల్లాల్ నికర విలువ రూ.50,170 కోట్లు. కాగా.. సత్య నాదెళ్ల రూ. 9,770 కోట్ల నికర విలువతో రెండవ స్థానంలో, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ రూ. 5,810 కోట్లతో ఏడో స్థానంలో ఉన్నారు. ఆ తరువాత పాలో ఆల్టో నెట్వర్క్స్ సీఈఓ నికేష్ అరోరా, పెప్సికో మాజీ చీఫ్ ఇంద్రా నూయి, అడోబ్ శాంతను నారాయణ్, బెర్క్‌షైర్ హాత్వే అజిత్ జైన్ వంటి వారు ఉన్నారు.2008 నుంచి ఆ కంపెనీకి నాయకత్వంజయశ్రీ ఉల్లాల్ అమెరికాకు చెందిన కంప్యూటర్ నెట్వర్కింగ్ కంపెనీ అరిస్టా నెట్వర్క్స్ ప్రెసిడెంట్ & సీఈఓ. ఈమె క్లౌడ్ అండ్ డేటా సెంటర్ టెక్నాలజీలో కీలక పాత్ర పోషించారు. 2008 నుంచి ఆ కంపెనీకి నాయకత్వం వహిస్తూ.. ముందుకు సాగుతున్నారు.అరిస్టా నెట్వర్క్స్ విలువ గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతూనే ఉంది. 2024లోనే ఈ సంస్థ దాదాపు 7 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది అంతకు ముందు సంవత్సరం కంటే దాదాపు 20 శాతం ఎక్కువ అని ఫోర్బ్స్ తెలిపింది. అరిస్టా స్టాక్‌లో ఉల్లాల్ దాదాపు 3 శాతం వాటాను కలిగి ఉన్నారు, ఇది ఆమె వ్యక్తిగత సంపదలో అతిపెద్ద భాగం అనే చెప్పాలి.1961లో జననం1961 మార్చి 27న లండన్‌లో భారతీయ సంతతికి చెందిన హిందూ కుటుంబంలో జన్మించిన ఈమె.. ప్రస్తుతం శాన్ఫ్రాన్సిస్కోలో ఉంటున్నారు. కానీ చిన్నప్పుడు న్యూఢిల్లీలో పెరిగి అక్కడే జీసస్ అండ్ మేరీ కాన్వెంట్లో తన స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేశారు. ఆ తరువాత చదువంతా అమెరికాలోనే సాగింది. అక్కడ ఆమె శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి.. ఆ తరువాత శాంటా క్లారా విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు.చదువు పూర్తయిన తరువాత.. ఉల్లాల్ సెమీకండక్టర్ విభాగంలో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఫెయిర్‌చైల్డ్ సెమీకండక్టర్, అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్‌లో పనిచేశారు. అక్కడ ఐబీఎం, హిటాచీ వంటి కంపెనీల కోసం హై-స్పీడ్ మెమరీ చిప్‌లను రూపొందించారు. 1980ల చివరలో.. 1990ల ప్రారంభంలో, ఆమె నెట్‌వర్కింగ్‌లోకి అడుగుపెట్టి, ఉంగర్మాన్-బాస్‌లో.. ఆ తరువాత క్రెసెండో కమ్యూనికేషన్స్‌లో చేరారు. క్రెసెండోలో చేరిన ప్రారంభ రోజుల్లో ఈమె ఈథర్నెట్ స్విచింగ్ టెక్నాలజీలపై పనిచేశారు.సిస్కోలో ఉల్లాల్1993లో సిస్కో సిస్టమ్స్ క్రెసెండో కమ్యూనికేషన్స్‌ను కొనుగోలు చేసినప్పుడు జయశ్రీ ఉల్లాల్ కెరీర్లో పెద్ద మలుపు తిరిగింది. ఆ కొనుగోలు ఉల్లాల్‌ను సిస్కోలోకి తీసుకువచ్చింది. ఇక్కడే 15 సంవత్సరాల కంటే ఎక్కువ పనిచేశారు. కాలక్రమేణా.. ఆమె సిస్కో డేటా సెంటర్‌కు సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎదిగారు.2008లో అరిస్టా నెట్వర్క్స్ వ్యవస్థాపకులు ఆండీ బెచ్టోల్షీమ్ & డేవిడ్ చెరిటన్ ఆమెకు కంపెనీ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించారు. ఆమె నాయకత్వంలో, అరిస్టా సిలికాన్ వ్యాలీ యొక్క అత్యంత విజయవంతమైన నెట్వర్కింగ్ సంస్థలలో ఒకటిగా మారింది. 2014లో, ఆమె కంపెనీని న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో పబ్లిక్ లిస్టింగ్‌కు తీసుకెళ్లింది. దీంతో ఫోర్బ్స్ ఆమెను నెట్వర్కింగ్ పరిశ్రమలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా పేర్కొంది. ఆమె బారన్ ప్రపంచంలోని ఉత్తమ సీఈఓల జాబితాలో.. ఫార్చ్యూన్ టాప్ గ్లోబల్ బిజినెస్ లీడర్స్ జాబితాలో కూడా చోటు సంపాదించింది.
అర్ధరాత్రితో మారిపోయే ఆధార్ రూల్స్..
దేశంలో ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైన డాక్యుమెంటో అందరికీ తెలిసిందే. రోజువారీ ఆర్థిక కార్య కలాపాల దగ్గర నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాల వరకు అన్నింటికీ ఇదే ‘ఆధారం’. ఇంత కీలకమైన ఆధార్‌కు సంబంధించిన పలు ముఖ్యమైన నిబంధనల్లో మార్పులు చేస్తోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ). డిసెంబర్ 31 అర్ధరాత్రి తర్వాత అంటే కొత్త ఏడాది 2026లో నూతన నిబంధనలు అమలు కాబోతున్నాయి.ఆధార్ కార్డు కొత్త డిజైన్ప్రస్తుతం పెరిగిన డిజిటల్ మోసాలు, డేటా దుర్వినియోగం సంఘటనలను దృష్టిలో ఉంచుకుని యూఐడీఏఐ ఇప్పటికే 2025 డిసెంబర్ 1 నుంచే ఆధార్ కొత్త డిజైన్‌ను ప్రకటించింది. ఈ కొత్త కార్డులో మీ ఫోటో, సురక్షిత క్యూర్ కోడ్ మాత్రమే ఉంటుంది. మీ పేరు, ఆధార్ నంబర్ ఉండవు. మొత్తం కార్డుల డిజైన్‌ను 2026 జూన్ 14 లోపు అప్డేట్ చేయనుంది యూఐడీఏఐ.ఫోటోకాపీల వాడకంపై ఆంక్షలుకొత్త యూఐడీఏఐ నిబంధనల ప్రకారం.. గుర్తింపు కోసం ఇక ఆధార్ కార్డు భౌతిక కాపీలను (జిరాక్స్) ఇవ్వాల్సిన పని లేదు. గుర్తింపు ధ్రువీకరణ కోసం క్యూఆర్ కోడ్ స్కానింగ్, ఆఫ్‌లైన్ ఆధార్ ఎక్స్ఎంఎల్, మాస్క్డ్ ఆధార్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. డిజిటల్ ధ్రువీకరణను ప్రాథమిక ఎంపికగా చేస్తున్నారు. ఫేస్ అథెంటికేషన్‌ను చట్టపరమైన గుర్తింపుగా చేయనున్నారు.ఆధార్-పాన్ లింక్ గడువుఆధార్-పాన్ లింక్ చేయడానికి 2025 డిసెంబర్ 31 చివరి తేదీ. ఈ తేదీ నాటికి పాన్ ను ఆధార్ తో లింక్ చేయకపోతే, అది 2026 జనవరి 1 నుండి ఇనాక్టివ్‌గా మారుతుంది. దీంతో ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు, రిఫండ్, ఇతర ఆర్థిక లావాదేవీలు కష్టమవుతాయి.10 ఏళ్లు దాటిన ఆధార్ కార్డుల అప్డేట్ తప్పనిసరిమీడియా నివేదికల ప్రకారం.. 10 ఏళ్లు దాటిన ఆధార్ కార్డులు అంటే పదేళ్ల క్రితం ఆధార్ తీసుకుని వాటిని ఇప్పటివరకూ ఎలాంటి అప్డేట్ చేయించకపోతే ఇప్పుడు చేయించడం తప్పనిసరి. పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి సమాచారాన్ని అప్ డేట్ చేయడం వల్ల మీ ఆధార్ యాక్టివ్ గా ఉండటమే కాకుండా ధ్రువీకరణ సమయంలో ఎటువంటి ఇబ్బందులూ ఉండవు.
2026 కవాసకి వెర్సిస్ 650 లాంచ్: ధర ఎంతంటే?
కవాసకి ఇండియా ఇటీవలే 2026 వెర్షన్ నింజా 650ను లాంచ్ చేసింది. ఇప్పుడు బ్రాండ్ తన 'వెర్సిస్ 650' అప్డేటెడ్ వెర్షన్‌ను మార్కెట్లో రూ. 8.63 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు ప్రవేశపెట్టింది. ధర మునుపటి మోడల్ కంటే రూ. 15,000 ఎక్కువ.కంపెనీ లాంచ్ చేసిన.. లేటెస్ట్ వెర్సిస్ 650 బైక్ కాస్మొటిక్ అప్డేట్స్ పొందినప్పటికీ.. ఎటువంటి యాంత్రిక మార్పులు పొందలేదు. కాబట్టి అదే 649 సిసి లిక్విడ్-కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజన్ 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 67 హెచ్‌పి పవర్.. 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 61 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ గేర్‌బాక్స్ కలిగి, ఉత్తమ పనితీరును అందిస్తుంది.కవాసకి వెర్సిస్ 650 కొత్త పెయింట్ స్కీమ్‌ను పొందుతుంది. ఇది మెటాలిక్ స్పార్క్ బ్లాక్‌తో కూడిన మెటాలిక్ గ్రాఫైట్ గ్రే, డార్క్ షేడ్. ఈ వెర్షన్ ప్రస్తుతం 2025 వెర్షన్‌తో పాటు అమ్మకానికి ఉంది. ఈ లేటెస్ట్ బైక్.. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో 4.3 అంగుళాల TFT కలర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతుంది. కవాసకి ట్రాక్షన్ కంట్రోల్, ఎకనామిక్ రైడింగ్ ఇండికేటర్, ఫోర్ వే అడ్జస్టబుల్ విండ్‌స్క్రీన్, ఏబీఎస్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.
వెండి ఇంకా కొనచ్చా.. ఇప్పటికే లేటైందా?
వెండి ధర ఆకాశమే హద్దుగా పెరిగిపోతోంది. రోజుకో సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. ఈ క్రమంలో రజతం రేటు భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందని, లేదు సర్దుబాటు ఉంటుందని ఇలా.. మార్కెట్ విశ్లేషకులు తలో అంచనా చెబుతున్నారు. ఇక బంగారం, వెండి మాత్రమే అసలైన ఆస్తులని వాదించే ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి వెండి ధర గురించి సోషల్ మీడియాలో రోజుకో పోస్ట్ చేస్తున్నారు.వెండి ఔన్సుకు 70 డాలర్లను దాటిపోయిన నేపథ్యంలో ఈ వైట్ మెటల్‌పై ఇంకా పెట్టుబడులు పెట్టొచ్చా.. ఇప్పటికే ఆలస్యమైందా? అన్న సందేహానికి రాబర్ట్ కియోసాకి ( Robert Kiyosaki) సమాధానమిస్తూ తాజాగా ట్వీట్ చేశారు. ఇప్పుడున్న వెండి ధరే ఆల్‌టైమ్ హై అని అనుకుంటే పొరపడినట్టేనని రాసుకొచ్చారు. ఇప్పుడిది ప్రారంభమేనని, అసలు ర్యాలీ ముందుందని పేర్కొన్నారు.వెండి ధర 2026లో అనూహ్యంగా 200 డాలర్లను (ఔన్స్‌కు) దాటిపోతుందని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. ఇది అతి శయోక్తి కాదని, సాధ్యకావడానికి చాలా కారణాలే ఉన్నాయని స్పష్టం చేశారు. కావాలంటే యూట్యూబ్ మొత్తం వెతికి సాధ్యసాధ్యాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవచ్చన్నారు.ఒక్క డాలరు కన్నా తక్కువున్నప్పుడే..1965లో వెండి ధర ఔన్సుకు ఒక డాలర్ కంటే తక్కువున్నప్పటి నుంచే తాను వెండి కొనడం ప్రారంభించానన్న రాబర్ట్ కియోసాకి.. ఇప్పుడు 70 డాలర్లు దాటిపోయినా సిల్వర్ కొనుగోలును ఆపనన్నారు. ధనవంతులు కావడానికి ఉత్తమ మార్గం ఎవరికి వారు సొంతంగా పరిశీలించుకోవడమేనన్నారు.‘చిన్నగా ప్రారంభించండి.... సంపద ఇక మీ బుర్రలో.. మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ క్రమంలో పొరపాట్లు చేసినప్పటికీ, ఊరికే మాటలు చెప్పేవారి కంటే మీరు ధనవంతులు అవుతారు ’ అంటూ తనను అనుసరించేవారికి హితవు పలికారు సిల్వర్ మ్యాస్ట్రో..Silver is over $70 USD an ounce.Q: IS IT TOO LATE TO BUY SILVER?A: It depends.If you think silver is at an all time high then you’re too late.I believe silver is just getting started and I believe $70- $200 silver could be an outside reality in 2026.There are many…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 25, 2025
ఫ్యామిలీ
'భారత్ చాలా నేర్పించింది'..! ఓ విదేశీ తల్లి భావోద్వేగ పోస్ట్
చాలామంది విదేశీయలు మన మాతృగడ్డపై మమకారం పెంచుకుని ఇక్కడే శాశ్వత నివాసం ఏర్పరుచుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ సంస్కృతి, ఆచార వ్యవహారాలకు ఫిదా అంటూ ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకుంటున్నారు. పైగా వాళ్ల సతంతి కూడా ఇక్కడ పెరిగితేనే మంచిదని భావిస్తుండటం విశేషం. ఆ కోవలోకి తాజాగా మరో రష్యన్ తల్లి వచ్చి చేరింది. ఆ పిల్లల తల్లి పోస్ట్‌లో పేర్కొన్న విషయాలు వింటుంటే మన గడ్డపై మమకారం, ప్రేమ రెట్టింపు అవవ్వడమే కాదు భారతీయులుగా గర్వం ఉప్పొంగుతుంది కూడా. మరి ఇంతకీ ఆమె ఆ పోస్ట్‌లో ఏం చెప్పుకొచ్చిందంటే..బెంగళూరులో నివశిస్తున్న ఈ రష్యన్ మహిళ తాను తన భర్త భారతదేశాన్ని కేవలం పర్యాటక ప్రదేశంగా కాకుండా శాశ్వత నివాసంగా ఎందుకు మార్చుకున్నామో వెల్లడించింది పోస్ట్‌లో. ఈ గడ్డపై ఉంటేనే తన పిల్లలు మంచిగా పెరుగుతారని, ఇది పిల్లల పెంపకానికి అత్యంత అనుకూలమైన వాతావరణమని, విశాల దృక్పథంతో వ్యవహరించడం అలవడుతుందని అటోంది. ఈ భారతదేశం తమ కుటుంబానికి ఎన్నో నేర్పించిందంటూ ఇలా వివరించింది. వేగాన్ని తగ్గించడం దగ్గర నుంచి తొందరపడకుండా ఉండటం, మాటకు స్పదించడం, శ్రద్ధగా వినడం వంటివి తమ కుటుంబం నేర్చుకుందని తెలిపింది. అలాగే తాము ఇక్కడ భారతీయులను తాము ఎంతగానో ప్రేమిస్తున్నామని, వారి కపటం లేని మనసు, దయ, ప్రతిఫలాప్రేక్ష లేని హెల్పింగ్ నేచర్ మమ్మల్ని ఎంతగానో కట్టిపడేశాయని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా పొరుగువారితో సత్సంబంధాలు చాలా బాగుంటాయని, ఇక్కడ చిరునవ్వే అందరి కామన్‌భాష అని అంటోంది. అందువల్లే తన పిల్లలను ఇక్కడే పెంచాలని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యానంటోంది ఈ తల్లి. ఈ బహుళ సంస్కృతి, బహుభాషా వాతావరణంలో ఎన్నో నేర్చుకోగలరు, ముఖ్యంగా గౌరవించడం, చిన్న చిన్న వాటికి ప్రశంసించడం వంటివి నేర్చుకుంటారని చెబుతోంది. ఈ వెచ్చని వాతావరణం ఎంజాయ్ చేయడం ఓ థ్రిల్, అలాగే ఏడాది పొడవునా కాలానుగుణ తాజా పండ్లను ఆస్వాదించడంలో ఓ మజా ఉందంటోంది. అందువల్లే తాము భారతదేశాన్ని తమ నివాస స్థలంగా మార్చుకున్నామంటూ పోస్ట్‌ని ముగించింది. అయితే నెటిజన్లు స్పందిస్తూ..మా భారత్‌కి స్వాగతం, మా మృతృభూమి చాలా అందమైనది, ఎవరినైనా తనలో ఇట్టే కలిపేసుకుంటుంది అని ఆమెకు సాదారంగా ఆహ్వానం పలుకుతూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Lifestyle (@yana.in.india) (చదవండి: సంపాదన కంటే అదే అత్యంత ముఖ్యం! వైరల్‌గా ఎన్ఆర్ఐ పోస్ట్)
సంపాదన కంటే అదే అత్యంత ముఖ్యం ! వైరల్‌గా ఎన్ఆర్ఐ పోస్ట్
సంపాదన కంటే ప్రశాంతమైన జీవితం మంచిది అనే సూక్తులు వినడానికే బాగుంటాయి. నిజజీవితంలో కాస్త కష్టమే అంత ఈజీ కూడా కాదు. పోనీ అలాంటి సాహసం చేస్తే..సమాజంలో, బంధువుల్లో మన స్థాయి తక్కువుగా ఉంటే మనం తట్టుకున్నా.. మన కుటుంబసభ్యలు అందుకు సిద్ధంగా ఉంటారా అంటే సమాధానం దొరకడం చాలా కష్టం. కానీ నార్వేలో నివశిస్తున్న భారత యువకుడు అదే మంచిదంటూ తాను అనుభవ పూర్వకంగా తెలుసుకున్నా అంటూ పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవ్వడమే కాదు..అందర్నీ విపరీతంగా ఆకర్షించింది.అందులోనూ ఈ ఉరుకుల, పరుగుల జీవితంతో విసిగివేశారిన వారికి ఈ పోస్ట్ ఓ మంచి ఎనర్జిటిక్‌గా కనిపించింది. పైగా ఆయన ఏం చెబుతున్నాడో అంటూ ఆ వీడియోని అంతా ఆస్తక్తిగా చూసేశారు కూడా. ఇంతకీ ఈ నార్వే యుకుడు ఆ ఇన్స్టాగ్రామ్ వీడియో పోస్ట్‌లో ఏం చెప్పాడంటే..తన పేరు సచిన్ అని తాను నార్వేలో నివశిస్తున్నట్లు పేర్కొన్నాడు. తాను దాదాపు 35 దేశాలకు పైగా పర్యటించాక ఓ విషయాన్ని గ్రహించానానని అంటూ చెప్పుకుంటూ రావడం వీడియోలో చూడొచ్చు. జీవితానికి ఎల్లప్పుడూ డబ్బు అవసరం లేదని, జీవించడానికి కేవలం సమయమే కావలని అన్నాడు. ఇక్కడ నార్వేలో ఉద్యోగం మనిషి విలువను ప్రతిబింబించదని, కేవలం వాళ్లు మనుషులుగా చూడటం అత్యంత ప్రశంసించదగ్గ విషయమని అన్నాడు. అక్కడ జీతం, హోదా, జెండర్, ఎక్కడ నుంచి వచ్చారు వంటి వాటికి పెద్దగా విలువ ఇవ్వరని అన్నాడు. అక్కడ కుటుంబం, ఆరోగ్యం, అభిరుచులు, పర్యటనలు, మానసిక ప్రశాంతత తదితరాలే ముఖ్యమనే విషయం ఇక్కడకు వచ్చాక తప్పక గుర్తిస్తారని అన్నాడు. కేవలం జీవన నాణ్యత, భద్రత, శాంతి అనేవి ఎంత ముఖ్యమో కచ్చితంగా తెలుస్తుందంటున్నాడు. అలాగని నార్వే ఏదో గొప్పదని చెప్పుకురావడం తన ఉద్దేశ్యం మాత్రం కాదని, కేవలం నిజంగా మనం కోసం మనం జీవించే జీవితాన్ని ఎంచుకోవడానికి మించిన ప్రశాంతత మరొకటి ఉండదని తెలియజేసేందకేనని పోస్ట్‌లో పేర్కొన్నాడు. అంతేగాదు నార్వేలో పని అనేది జీవితంలో ఒక భాగమేనని, అక్కడ ప్రజలు కుటుంబం, పర్యటనలు, అభిరుచులపై పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తారని చెప్పాడు. అంతేగాదు ఇక్కడ ప్రజలు మనుగడ కోసం జీవించరని, పూర్తి స్థాయిలో జీవితాన్ని ఆస్వాదిస్తారని ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు సచిన్. అయితే నెటిజన్లు ఈ పోస్ట్‌ని చూసి బ్రదర్ మీరు చాలా అదృష్టవంతులు అని కొందరు, అలాంటి మంచి భారతీయ కమ్యూనిటీ ఉంటే కచ్చితంగా మేము అక్కడకి వచ్చేస్తాం అంటూ కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Sachin | Life in Norway 🇳🇴 | Ship to Shore 🚢 (@sachinoffshore) (చదవండి: IAS Officer Anu Garg: ఎవరీ అను గర్గ్..? అత్యున్నత పదవిని చేపట్టిన తొలి మహిళగా..)
ఎవరీ అను గార్గ్..? అత్యున్నత పదవిని చేపట్టిన తొలి మహిళగా..
ఇప్పటివరకు పరిపాలనా విభాగానికి సంబంధించిన అత్యతున్నత బ్యూరోక్రాటిక్ పదవులను పురుషులు మాత్రమే చేపట్టారు. అలాంటి పదవులు మహిళల వరకు చేరువ్వడం లేదా ఆ స్థాయికి చేరుకునేలా ప్రతిభా చాటిన మహిళలు చాలా అరుదు. అలాంటి మూసధోరణిని బద్దలు కొట్టి సరికొత్త ప్రభంజనం సృష్టించారు ఐఏఎస్ అధికారిణి అనుగార్గ్. ఎవరీమె? ఈ అరుదైన ఘనతను ఎలా సాధించారామె..?56 ఏళ్ల అనుగార్గ్ ఒడిశాలో అదనపు ప్రధాన కార్యదర్శి హోదాతో అభివృద్ధి కమిషనర్‌గా పనిచేస్తూ.. జల వనరుల విభాగం కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1991 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిణి అయిన అనుగార్గ్ బుధవారమే ఒడిశా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇలా రాష్ట్రంలో అత్యున్నత బ్యూరోక్రాటిక్ పదవిని చేపట్టిన తొలి మహిళగా ఘనత సృష్టించారు. ప్రస్తుతం ఈ పదవిలో కొనసాగుతున్న ప్రధాన కార్యదర్శి మనోజ్ అహుజా డిసెంబర్ 31 పదవీవిరమణ చేయనున్న నేపథ్యంలో ఒడిశా సాధారణ పరిపాలన, ప్రజా ఫిర్యాదుల విభాగం అను గర్గ్‌కి నియామక ఉత్తర్వులను జారీ చేయడం విశేషం. ఇన్నాళ్లు అనుగర్గ్ డెవలప్మెంట్ కమ్ అదనపు ప్రధాన కార్యదర్శిగా ప్లానింగ్ అండ్ కన్వర్జెన్సీ విభాగంలో పనిచేస్తూ..జనవనరుల విభాగానికి అదనపు భాధ్యతలను కూడా నిర్వహించారామె. ఇప్పటి వరకు పురుషులకే పరిమితమైన అత్యున్నత బ్యూరోక్రాటిక్ పదవిని అనుగర్గ్ చేపట్టి ఒడిశా పరిపాలన చరిత్రలో ఒక సరొకొత్త మైలు రాయిని సృష్టించారు. అయితే ఒడిశాలో గతంలో ఇలాంటి అత్యుతన్న పరిపాలనాధికారంలో 1972లో నందిని సత్పతి మహిళా సీఎంగా ఉన్నారన్నది గమనార్హం.మరో విశేషం ఏంటంటే అనుగార్గ్ ఒడిశా రాష్ట్రంలో డెవలప్మెంట్ కమిషనర్‌గా నియమితులైన తొలి మహిళా ఐఏఎస్ అధికారిణి కూడా ఆమెనే. దీన్ని అను ప్రస్తుతం చేపట్టనున్న అత్యున్న పదవి తర్వాత రెండో అత్యున్నతి పదవిగా పేర్కొనవచ్చు. ఇక ఈ అత్యున్న బ్యూరోక్రాటిక్ పదవిని అలంకరించనున్న అనుగర్గ్ మార్చ్2029లో పదవీవిరమణ చేయనున్నారు. నిజానికి కొత్తేడాది నేపథ్యంలో కీలక అభివృద్ధి కార్యక్రమాలు, బడ్జెట్ ప్రతిపాదనలు అమలకు సిద్ధమవుతన్న తరుణంలో అనుగార్గ్ ఈ ఉన్నతి పదవిని చేపట్టడం హర్షించదగ్గ విషయం. కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన అనుగార్గ్ సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. అలాగే మూడు దశాబ్దాలకు పైగా సివిల్ సర్వీస్‌లో పనిచేసి మహిళా అధికారిణి కూడా.(చదవండి: ప్రపంచం మొత్తం 6జీ అంటుంటే..అక్కడ మాత్రం కీప్యాడ్ ఫోనులే! ఎందుకో తెలుసా?)
ప్రపంచంలోనే అతిపెద్ద ఆపిల్-ఇసుక శాంతాక్లాజ్ శిల్పం..!
ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ప్రతి పండుగ, ప్రత్యేక రోజుల సమయంలో ఆయా ఇతి వృత్తంతో కూడిన సైకత శిల్పంతో మన ముందుకు వస్తుంటారు. ఈసారి అచ్చం అలానే అత్యంత ఆకర్షణీయమైన సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఈ డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ పురస్కరించుకుని అతి పెద్ద శాంతాక్లాజ్‌ని రూపొందించారు. అయితే దేనితో తెలిస్తే షాకవ్వడం ఖాయం. మరి ఆ విశేషాలేంటో సవివరంగా చూద్దామా..!.పూరీకి చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకునే క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని పూరీలోని నీలాద్రి బీచ్‌లో 1.5 టన్నుల ఆపిల్ పండ్లు, ఇసుకతో అతిపెద్ద శాంతాక్లాజ్ సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఇది ఏకంగా 60 అడుగుల పొడవు, 22 అడుగుల ఎత్తు. దీన్ని సుమారు 30 మంది విద్యార్థుల సాయంతో తీర్చిదిద్దారు. క్రిస్మస్ శుభాకాంక్షల తోపాటు ప్రపంచ శాంతి, ఐక్యత సందేశాన్ని ఇస్తూ ఈ భారీ సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. అంతేగాదు యాపిల్స్‌తో రూపొందించిన అతిపెద్ద శాంతాక్లాజ్ సైకత శిల్పంతో ప్రపంచ రికార్డు సృష్టించనుంది కూడా. దీన్ని పట్నాయక్ 22వ పూరీ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్లో భాగంగా, క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో రూపొందించారు. తన సాండ్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్కు చెందిన 30 మంది విద్యార్థుల సహాయంతో ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు.Puri-based sand artist Sudarshan Patnaik attempts world record with biggest Santa Claus sculpture created with apples. pic.twitter.com/Qsb1Ez7aHY— News Arena India (@NewsArenaIndia) December 24, 2025 (చదవండి: ఆ దేశాలు డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకోవు..!ఎందుకో తెలుసా?)
అంతర్జాతీయం
ఆపరేషన్ సిందూర్ 2.0.. వణికిపోతున్న పాక్!
ఆపరేషన్ సిందూర్ ఈ పేరు వింటే చాలు పాకిస్థాన్‌కు చెమటలు పడతాయి. పహల్గామ్ లోయ విహారయాత్రకు వెళ్లిన భారతీయులను అన్యాయంగా పొట్టన బెట్టుకున్న ఉగ్రమూకలను వారి దేశంలోనే భారత్ తుదముట్టించింది. అంతే కాకుండా ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని దాయాది దేశాన్ని హెచ్చరించింది. అయితే ఆపరేషన్ సిందూర్ భయం పాక్‌ను ఇప్పటికీ వీడనట్లే కనిపిస్తుంది. అందుకే తాజాగా ఎల్ఓసీ సరిహద్దు ప్రాంతాలలో డ్రోన్లలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది.ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి యావద్దేశాన్ని వేదనకు గురి చేసింది. విహారయాత్రకు వెళ్లిన పౌరులపై పాక్ లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన ఉగ్రమూకలు విచక్షణ రహితంగా కాల్పులు జరిపాయి. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు వదిలారు. అంతేకాకుండా మరణించిన వారిలో అప్పుడే పెళ్లయిన నవ దంపతుల జంట ఉండడం, వారిని హేళన చేస్తూ ఉగ్రవాదులు మాట్లాడడం చూసి కోట్లాది హృదయాలు ఆవేదనతో రగిలిపోయాయి.దీనికి ప్రతికారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై త్రివిధ దళాల సమన్వయంతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విరుచుకుపడింది. లష్కరేతోయిబాతో పాటు జైషేమహమ్మద్ ఉగ్రస్థావరాలపై దాడులు జరిపింది. ఇందులో దాదాపు 100 మంది ఉగ్రవాదులు మరణించినట్లు పలు నివేదికలు తెలిపాయి. అయితే పాకిస్థాన్‌ను ఆపరేషన్ సిందూర్ భయం (Operation Sindoor) ఇంకా వదలట్లేదు. తాజాగా భారత్‌తో సరిహద్దు ప్రాంతాలలో ఆధునాతన డ్రోన్ టెక్నాలజీ వ్యవస్థను మెహరించినట్లు సమాచారం.సరిహద్దులో ప్రత్యేక నిఘాభారత్, పాకిస్థాన్ సరిహద్దులో నియంత్రణ రేఖ వెంబడి దాదాపు 30కి పైగా యాంటీ డ్రోన్ యూనిట్స్‌ని 12వ పదాదిదళ విభాగం ఏర్పాటు చేసింది. వీటితో సరిహద్దు రేఖ వెంబడి అకస్మాత్తుగా వచ్చే యుద్ధవిమానాలు, డ్రోన్లపై ప్రత్యేక నిఘా ఉంచనుంది. అంతేకాకుండా రాజస్థాన్ పుంచ్ సెక్టార్‌కు రావల్కోట్ల ఈ డోన్ వ్యవస్థలను మోహరించింది. ఇవి సరిహద్దు రేఖకు 10 కిలోమీటర్ల వెలుపల ఎగిరే అతి చిన్న వస్తువును సైతం గుర్తిస్తాయి. ఈ సిస్టమ్‌లో 1.5 కిలోమీటర్ల పరిధిలోని వస్తువులను గాలిలోనే ధ్వంసం చేసేలా ప్రత్యేక వ్యవస్థ కలిగిన గన్ సిస్టమ్ ఉంటుంది.చదవండి: పాక్ పన్నాగాల్ని ముందే పసిగట్టిన పుతిన్!దీనితో పాటు డ్రోన్ సాంకేతికత మరింతగా పెంచుకునేందుకు టర్నీ, చైనా దేశాలతో పాకిస్థాన్ (Pakistan) చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల ఆ దేశ నాయకులు సైతం తరచుగా భారత్‌తో యుద్ధానికి సిద్ధం అంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. నేపథ్యంలో ఆపరేషన్ 2.0 అవసరముందని ఇటీవల విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ వ్యాఖ్యానించారు.
పాక్ పన్నాగాల్ని ముందే పసిగట్టిన పుతిన్!
అమెరికాను సైతం తాకేలా క్షిపణులను ఆసియా దేశం పాకిస్థాన్ రహస్యంగా తయారు చేస్తోందని ఆ మధ్య అతి ప్రచారం నడిచింది. అలాగే.. పాక్ అణ్వాయుధాలపై భారత్ కొన్నేళ్లుగా ఆందోళనలు వ్యక్తంచేస్తోంది. అయితే.. పాక్ పన్నాగాల్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ముందే పసిగట్టారా?.. ఈ విషయంలో ఆయన అగ్రరాజ్యం అమెరికాను ముందే అప్రమత్తం చేశారా?.. రెండు దశాబ్దాల కింద.. 2001లో స్లోవేనియాలో జరిగిన ఓ సమావేశానికి పుతిన్, నాటి అమెరికా అధ్యక్షుడు బుష్ హాజరయ్యారు. ఆనాడు వాళ్ల మధ్య జరిగిన సంభాషణను అమెరికాకు చెందిన నేషనల్ సెక్యూరిటీ ఆర్కైవ్స్ (2001-2008) బయటపెట్టింది. తమ మధ్య మాటల్లో.. నాటి పర్వేజ్ ముషారఫ్ నేతృత్వంలోని పాక్ అణు కార్యక్రమాన్ని నాడు వారిద్దరు తీవ్ర సమస్యగా పరిగణించినట్లు ఆ పత్రాలను బట్టి స్పష్టమవుతోంది.‘‘అది అణ్వాయుధాలు కలిగిన సైనిక కూటమి. అక్కడ ప్రజాస్వామ్యం లేదు. మిలిటరీ పాలనలో ఉంది. కానీ పాశ్చాత్య దేశాలు(వెస్ట్రన్ కంట్రీస్) దానిపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం లేదు. దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది’’ అని రష్యా అధ్యక్షుడు బుష్ వద్ద ఆక్షేపించారు. పాక్ పట్ల ఉదాసీనంగా వ్యవహరించడంపై పలు అనుమానాలు లేవనెత్తారు. అయితే.. ఈ వ్యాఖ్యలతో బుష్ విభేదించలేదని తెలుస్తోంది. కానీ, పాక్ అక్రమ అణు వ్యాపారంపై అమెరికా అధ్యక్షుడు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ఉల్లంఘన కలవరపెట్టేదే’’ అని పుతిన్ మాటలను బుష్ అంగీకరించారు.ఇలా.. పాక్ అణ్వాయుధాల అంశంపై వీరు సమగ్రంగా చర్చించారు. అంతేకాదు అణు కార్యక్రమాల నిబంధనలను ఉల్లంఘించిట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దేశాల విషయంలో వ్యవహరించినట్లుగా.. పాకిస్థాన్‌పై ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని నాడు పుతిన్ (Putin) పశ్నించినట్లు ఆ పత్రాల ద్వారా బయటకు వచ్చింది. అయితే.. పాక్ అణుపితామహుడు అబ్దుల్ ఖాదిర్ ఖాన్ కార్యకలాపాలు బయటపడిన తర్వాత ఆ దేశంపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చామని నాడు బుష్ వెల్లడించారు. అలాగే ఖాన్‌తో పాటు అతడి అనుచరులను నిర్బంధించేలా చేశామన్నారు. కానీ.. ఈ అణు పదార్థాలు పాక్ (Pakistan) నుంచి ఎవరికి చేరాయనే దానిపై మాత్రం స్పష్టత లేదని ఆ సందర్భంలో బుష్ తెలిపారు. ప్రజాస్వామ్య జవాబుదారీతనం లేని ప్రభుత్వాల చేతుల్లో అణ్వాయుధాలు అధికంగా ఉన్నాయని పుతిన్ పదేపదే లేవనెత్తగా.. ఆ సున్నితమైన పరిజ్ఞానం మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించాల్సిన అవసరం ఉందని బుష్ సమర్థించినట్లు వెల్లడైంది. అలాగే.. ఇరాన్ అణు కార్యక్రమంలో పాక్ యురేనియాన్ని గుర్తించామని 2005లో జరిగిన మరో భేటీలో బుష్ వద్ద పుతిన్ ప్రస్తావించినట్లు ఇవే పత్రాలు బయటపెట్టాయి.అయితే.. పాక్ అణ్వాయుధాలతో ప్రధానంగా భారత్‌కే ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. అసలు ఆ అణ్వాయుధాలను భారత్‌ను ఎదుర్కోవడానికే పాక్ అభివృద్ధి చేసిందని(ఇంకా చేస్తోందనే) అని కూడా అంటున్నారు. భారత్ అణ్వాయుధాల విషయంలో “No First Use” (మొదట ప్రయోగించొద్దు) అనే స్పష్టమైన అణు విధానం పాటిస్తోంది. కానీ పాక్ వద్ద అలాంటి పద్ధతులేం లేవు. పైగా భారత్ సాంప్రదాయ సైనిక శక్తిని సమతుల్యం చేసుకోవడానికే పాక్ చాలా కాలంగా పాకులాడుతూ వస్తోంది.2025 నాటికి పాకిస్తాన్ వద్ద సుమారు 170 అణ్వాయుధాలు ఉన్నాయని ఒక అంచనా. రానున్న ఐదేళ్లలో ఆ సంఖ్య 200కి చేరుకునే అవకాశం లేకపోలేదు. అయితే.. పాక్ అణ్వాయుధాలనేవి యావత్ ప్రపంచానికి ఒక ఆందోళనకర అంశమే. ఎందుకంటే.. పాక్‌లో కొనసాగే రాజకీయ అస్థిరత.. సైనికాధిపత్యం, ఉగ్రవాద సంస్థలు వాటిని చేజిక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉండడం, వీటికి తోడు గతంలో అణు సాంకేతికత లీక్ కావడం లాంటివి విశ్లేషకులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.
ఇది భారత్‌తో విభేదాలు సృష్టించే ప్రయత్నమే..!
అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ రిలీజ్ చేసిన తాజా నివేదికపై చైనా తీవ్రంగా స్పందించింది. భారత్‌తో సరిహద్దు ఉద్రిక్తతలు శాంతియుతంగానే ఉన్నాయని.. అయితే పాత పరిస్థితులను ప్రస్తావిస్తూ భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలకు అమెరికా ప్రయత్నిస్తోందని మండిపడింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియన్ మాట్లాడుతూ.. ఈ నివేదిక చైనా రక్షణ విధానాన్ని వక్రీకరిస్తోంది. భారత్ సహా పొరుగు దేశాల మధ్య విభేదాలు సృష్టిస్తోంది. తన సైనిక ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నమే ఇది అని అన్నారు. భారత్ సంబంధాలను చైనా వ్యూహాత్మక స్థాయిలో, దీర్ఘకాల దృష్టితో చూస్తోంది. పరస్పర విశ్వాసం పెంపు, సహకారం, విభేదాల పరిష్కారం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను స్థిరంగా ఉంచాలని కోరుకుంటోంది అని అన్నారు. అయితే.. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC) పై US నివేదికలో చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. ప్రస్తుతం సరిహద్దు పరిస్థితి స్థిరంగా ఉందని, కమ్యూనికేషన్ చానెల్స్ సజావుగా పనిచేస్తున్నాయని తెలిపారు. మరోవైపు.. చైనా రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఈ నివేదికను ఖండిస్తూ.. ఇది తప్పుడు కథనాలు, పక్షపాతాలతో కూడిందని, చైనా మిలిటరీ ముప్పు అనే అతిశయోక్తితో నిండిపోయి ఉందని విమర్శించింది. మొత్తంగా చైనా అగ్రరాజ్య నివేదికను అసంబద్ధమైనదని.. బాధ్యతారహితమైనదని పేర్కొంది.భారత అమెరికా సంబంధాలను నీరుగార్చేందుకు చైనా కృషి చేస్తోందని.. సరిహద్దు ఉద్రిక్తతలు సడలింపును ఎరగా వేసి భారత్‌తో సత్సంబంధాలను పునరుద్ధరించకోజూస్తున్న డ్రాగన్ కంట్రీ అదే సమయంలో పాకిస్థాన్‌తోనూ మైత్రిని నెరపుతోందని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ నివేదిక వెలువరించింది. దీంతో చైనా పైవిధంగా స్పందించింది.
మెరీ క్రిస్మస్.. నైజీరియాలో ఐసిస్ తాట తీశాం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెరైటీగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. నైజీరియాపై అగ్రరాజ్య సైన్యం దాడులు జరిపిందని.. చచ్చిన ఉగ్రవాదులతో పాటు ప్రజలందరికీ మెరీ క్రిస్మస్ అంటూ ఓ ప్రకటన చేశారు. ఆ దేశ వాయవ్య ప్రాంతంలో ఐసిస్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైన్యం తీవ్ర దాడులు జరిపిందని.. అనుకున్న లక్ష్యాన్ని సాధించిందని ఆ ప్రకటనలో ఆయన తెలియజేశారు. ట్రంప్ తన సోషల్ ట్రూత్‌లో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి..‘‘అమెరికా సైన్యం నైజీరియాలోని వాయువ్య ప్రాంతంలో ఐసిస్(ISIS) ఉగ్రవాదులపై వైమానిక దాడులు జరిపింది. క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని ఆ ఉగ్రసంస్థ గత కొంతకాలంగా హత్యలు చేస్తోంది. ముందే హెచ్చరించినా కూడా ఆ ఊచకోత ఆగలేదు. అందుకే ఈ దాడులు జరిపాం’’ అని అన్నారాయన. అమెరికా మాత్రమే చేయగలిగే పరిపూర్ణ దాడులు జరిగాయని.. తన నాయకత్వంలో తీవ్రవాదాన్ని అణచివేస్తామని.. ఈ సందర్భంగా అమెరికా సైన్యానికి కృతజ్ఞతలంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారాయన. అయితే దాడుల తదనంతర పరిణామాలపై మాత్రం ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు.నైజీరియా జనాభాలో ఉత్తర భాగంలో మస్లింలు, దక్షిణ భాగంలో క్రిస్టియన్లు ఎక్కువ సంఖ్యలో స్థిరపడిపోవడంతో.. మతాల మధ్య తరచూ ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గత కొన్నేళ్లుగా ఐసిస్ సంస్థ.. అనుబంధ గుంపులు, అలాగే బోకో హరామ్ వంటి తీవ్రవాద సంస్థలు హింస కొనసాగిస్తున్నాయి. అదే సమయంలో.. రైతులు గొర్రెల కాపరులు మధ్య ఘర్షణలు, మతపరమైన, జాతిపరమైన రూపం సంతరించుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తరం, ఈశాన్య ప్రాంతాల్లో ఈ ఘర్షణలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యాలతో.. అమెరికా ఇటీవల నైజీరియాను ఆందోళన దేశాల జాబితాలో(country of particular concern) చేర్చింది. సీపీసీ అంటే.. కంట్రీస్ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్(CPC) జాబితాలో మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్న దేశాలు ఉంటాయి. మతపరమైన హింస, వివక్ష, బలవంతపు మత మార్పిడిలు, మతపరమైన హక్కుల హననంలాంటి అంశాల ఆధారంగా ఈ లిస్ట్ రూపొందిస్తారు. ప్రస్తుతం.. నైజీరియాతో పాటు చైనా, మయన్మార్, ఉత్తర కొరియా, రష్యా, పాకిస్తాన్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి.గత కొన్నేళ్లుగా క్రైస్తవులపై నిషేధిత సంస్థల హింస తీవ్రతరం అయ్యిందని ట్రంప్ ఆ మధ్య ఆందోళన వ్యక్తం చేశారు కూడా. అంతేకాదు.. క్రైస్తవులపై జరుగుతున్న హింస కారణంగా నైజీరియా పౌరులపై వీసా పరిమితులు కూడా విధించారు.. నైజీరియాలో క్రైస్తవులను రికార్డు స్థాయిలో హత్య చేస్తున్నారు. చాలా పెద్ద సంఖ్యలోనే చంపుతున్నారు. నైజీరియాలో క్రైస్తవులు తీవ్ర ముప్పులో ఉన్నారు. ఇక మీదట అలా జరగనివ్వబోను. అవసరమైతే అమెరికా బలగాలను మోహరిస్తాం. వైమానిక దాడులు జరుపుతాం. ఇప్పటికే యుద్ధ విభాగానికి(Department of War) ఆదేశాలు కూడా జారీ చేశాను అని తెలిపారు. చెప్పినట్లే ఇప్పుడు వైమానిక దాడులు జరిపించారు..@POTUS “Tonight, at my direction as Commander in Chief, the United States launched a powerful and deadly strike against ISIS Terrorist Scum in Northwest Nigeria, who have been targeting and viciously killing, primarily, innocent Christians, at levels not seen for many years, and… pic.twitter.com/ct7rUW128t— Department of War 🇺🇸 (@DeptofWar) December 26, 2025మరోవైపు.. అమెరికా చర్యలను నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబు పరోక్షంగా ఖండించారు. క్రైస్తవులపై వ్యవస్థీకృత హింస జరుగుతోందనే ఆరోపణలను తిరస్కరించింది. ఉగ్రవాదులు ముస్లింలను కూడా లక్ష్యంగా చేసుకుంటారని, సమస్య క్లిష్టమైందని పేర్కొంది. దేశంలో మత స్వేచ్ఛను కాపాడతానని.. అన్ని మతాల ప్రజలను రక్షించేందుకు కట్టుబడి ఉన్నానని బోలా తన క్రిస్మస్ సందేశంలో పేర్కొన్నారు. మొత్తం మీద అమెరికా-నైజీరియా మధ్య ఉగ్రవాదంపై చర్యలు, మత స్వేచ్ఛ రక్షణపై ప్రకటనలు హాట్ టాపిక్‌గా మారాయి.
జాతీయం
వీరు దేశానికి గర్వకారణం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు స్వీకరించిన చిన్నారులు వారి కుటుంబాలకు, మొత్తం దేశానికి గర్వకారణంగా నిలిచారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రశంసించారు. విజేతలకు అభినందనలు తెలియజేశారు. ఈ పురస్కారాలు దేశవ్యాప్తంగా బాలబాలికలందరికీ స్ఫూర్తినిస్తాయని చెప్పారు. రాష్ట్రపతి శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ‘వీర్ బాల్ దివస్’కార్యక్రమంలో పాల్గొన్నారు. సాహస బాలలతోపాటు సామాజిక, సేవ, పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, కళలు, సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీలో అసమాన ఘనతలు సాధించిన 20 మంది చిన్నారులకు ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వీర్ బాల్ దివస్ ప్రాముఖ్యతను వివరించారు. 320 ఏళ్ల క్రితం గురు గోవింద్ సింగ్ నలుగురు కుమారులు సత్యం, న్యాయం కోసం పోరాడుతూ ప్రాణత్యాగాలు చేశారని చెప్పారు. చిన్న కుమారులైన బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్‌లు ప్రదర్శించిన ధైర్యసాహసాలు దేశ విదేశాల్లో గౌరవాన్ని అందుకుంటున్నాయని తెలిపారు. చిన్నారుల్లోని దేశ భక్తి, ఉన్నత విలువలను బట్టి ఒక దేశం గొప్పతనాన్ని గుర్తించవచ్చని పేర్కొన్నారు. ఇద్దరు తెలుగు బాలలకు పురస్కారాలు ఈ ఏడాది ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను 18 మంది పిల్లలకు, మరణానంతరం మరో ఇద్దరి తరఫున వారి తల్లిదండ్రులకు రాష్ట్రపతి ముర్ము అందజేశారు. పురస్కారాల గ్రహీతల్లో ఇద్దరు తెలుగు బాలలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు చెందిన 16 ఏళ్ల పడకంటి విశ్వనాథ్ కార్తికేయ క్రీడా విభాగంలో పురస్కారం అందుకున్నారు. కార్తికేయ పర్వతారోహకుడు. 2025లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి సెవెన్ సమ్మిట్ చాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన అతిపిన్న వయసు్కడిగా ఘనత సాధించాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాకు చెందిన 17 ఏళ్ల పారా అథ్లెట్ శివానీ హోసూరు ఉప్పర సైతం క్రీడా విభాగంలో పురస్కారం అందుకున్నారు. ఈమె షాట్‌పుట్, జావలిన్ థ్రోలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఎన్నో అవార్డులు సాధించారు. పురస్కార గ్రహీతలకు మెడల్, సరి్టఫికెట్‌తోపాటు రూ.లక్ష నగదు ప్రోత్పాహకాన్ని రాష్ట్రపతి అందజేశారు. పురస్కార గ్రహీతలతో ప్రధాని మోదీ భేటీ బాల పురస్కారాలు అందుకున్న చిన్నారులతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. భారత్ మండపంలో నిర్వహించిన వీర్ బాల్ దివస్ కార్యక్రమంలో భాగంగా వారితో ముచ్చటించారు. చిన్న వయసులోనే ఇతరులకు స్ఫూర్తినిచ్చే విజయాలు సాధించారని ప్రశంసించారు. ఈ విజయాలు ఆరంభం మాత్రమేనని, ఇంకా సుదూర ప్రయాణం చేయాల్సి ఉందని చెప్పారు. ఈ తరంలో జని్మంచడం ఈ చిన్నారుల అదృష్టమని, వారి ప్రతిభకు దేశమంతా మద్దతుగా నిలుస్తోందని తెలిపారు. ప్రతిభావంతులైన బాలలను మరింత ముందుకు నడిపించేందుకు ఎన్నో వేదికలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, తాత్కాలిక ప్రజాదరణ, గ్లామర్‌కు ఆకర్షితులు కాకుండా లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించాలని చిన్నారులకు ప్రధాని మోదీ సూచించారు.
పాక్ గుండెల్లో ‘సిందూర్ 2.0’ గుబులు
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు చావుదెబ్బ తగిలింది. పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ దాడి చేయడంతో పెద్ద సంఖ్యలో ముష్కరులు హతమయ్యారు. ఉగ్రవాద స్థావరాలు, శిక్షణా కేంద్రాలు నేలమట్టమయ్యాయి. పాక్ వైమానిక కేంద్రాలు, యుద్ధ విమానాలు సైతం ధ్వంసమయ్యాయి. ఆపరేషన్ సిందూర్‌తో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదని సాక్షాత్తూ పాకిస్తాన్ సైన్యమే చెబుతోంది. భారత సైన్యం సత్తా ఏమిటో పొరుగు దేశానికి తెలిసొచి్చంది. దాంతో ముందు జాగ్రత్త చర్యగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) సరిహద్దు అయిన నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. కీలక ప్రాంతాల్లో కౌంటర్–డ్రోన్ వ్యవస్థలను మోహరించింది. మరో కవ్వింపు చర్యలకు పాల్పడితే సిందూర్ మళ్లీ ప్రారంభమవుతుందని భారత ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది. అందుకే ఆపరేషన్ సిందూర్ 2.0 భయం పాకిస్తాన్‌ను వెంటాడుతోంది. భారత సైన్యం దాడులకు దిగితే తిప్పికొట్టడానికి పీఓకేలోని మూడు సెక్టార్లలో కౌంటర్–అన్మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్(సీ–యూఏఎస్)ను పాక్ సిద్ధం చేసినట్లు భారత నిఘా వర్గాలు తాజాగా గుర్తించాయి. రావల్కోట్, కోట్లీ, భింబర్ సెక్టార్లలో వీటిని నెలకొల్పినట్లు పేర్కొన్నాయి. ఎల్ఓసీ వద్ద 30కిపైగా యాంటీ–డ్రోన్ యూనిట్లను అందుబాటులోకి తీసుకొచి్చనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గగనతల నిఘా వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు ఎల్రక్టానిక్ యుద్ధ సామర్థ్యాలు పెంచుకోవడం పాక్ వ్యూహంగా కనిపిస్తోంది.శత్రు డ్రోన్లపై నజర్ భారత్‌లోని పూంచ్ సెక్టార్‌కు ఎదురుగా ఉన్న రావల్కోట్లో యాంటీ–డ్రోన్ల వ్యవస్థలను రెండో ఆజాద్ కశ్మీర్ బ్రిగేడ్ నిర్వహిస్తోంది. రాజౌరీ, నౌషెరా, సుందర్బనీ సెక్టార్లకు ఎదురుగా ఉండే కోట్లీలో వీటి నిర్వహణ బాధ్యతను మూడో ఆజాద్ కశ్మీరీ బ్రిగేడ్‌కు, భింబర్‌లో నిర్వహణను ఏడో ఆజాద్ కశ్మీరీ బ్రిగేడ్‌కు అప్పగించినట్లు తెలిసింది. ఎల్ఓసీ వెంట ఎల్రక్టానిక్, కైనటిక్ కౌంటర్–యూఏఎస్‌లను పాక్ రంగంలోకి దించినట్లు సమాచారం. ఇందులో కీలకమైన స్పైడర్ వ్యవస్థ కూడా ఉంది. ఇది పది కిలోమీటర్ల దూరంలోని శత్రు డ్రోన్లను కూడా సరిగ్గా గుర్తించగలదు. అంతేకాకుండా పాక్ అమ్ముల పొదిలో సఫ్రా యాంటీ–యూఏవీ జామింగ్ గన్ కూడా ఉంది. దీనిని మనుషులు ఆపరేట్ చేస్తుంటారు. 1.5 కిలోమీటర్ల దూరంలోని డ్రోన్లను కూలి్చవేయొచ్చు. తక్కువ ఎత్తులో ఎగిరే శత్రు డ్రోన్లను కూల్చడానికి సంప్రదాయ గగనతల రక్షణ ఆయుధాలను కూడా పాక్ ఉపయోగిస్తోంది. జీడీఎఫ్ 35 ఎంఎం ట్విన్ బ్యారెల్ యాంటీ– ఎయిర్‌క్రాఫ్ట్ గన్స్, అజ్నా ఎంకే–2, ఎంకే–3 మ్యాన్–పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు పాక్ వద్ద ఉన్నాయి. తక్కువ ఎత్తులో తక్కువ వేగంతో దూసుకొచ్చే డ్రోన్లను వీటితో కూల్చవచ్చు.తుర్కియే, చైనాలతో పాక్ చర్చలు ఇటీవలి కాలంలో పశ్చిమ సరిహద్దుల్లో భారత సైన్యం కదలికలు ముమ్మరమయ్యాయి. సైన్యం, నావికాదళం, వైమానిక దళం తరచుగా విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. గగనతల రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు పాక్ సరిహద్దుల్లో అధునాతన డ్రోన్లను మోహరిస్తున్నారు. ఈ పరిణామాలతో పాక్ అప్రమత్తమైనట్లు భారత నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు నూతన డ్రోన్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కోసం తుర్కియే, చైనాలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కౌంటర్–డ్రోన్ సామర్థ్యాల విషయంలో పాక్ సైన్యం చాలా బలహీనంగా ఉంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఈ విషయం నిరూపితమైంది. అందుకే డ్రోన్లతో జరిగే దాడిని తట్టుకోవడంపై పాక్ ప్రధానంగా దృష్టి పెట్టినట్లు భారత నిఘా వర్గాలు కనిపెట్టాయి.
ఖర్చు తక్కువైతేనే విదేశీ విద్య!
‘విదేశాల్లోని పేరొందిన యూనివర్సిటీల్లో చదువుకోవాలి. కోర్సు పూర్తి కాగానే మంచి జీతంతో ఉద్యోగం సంపాదించాలి’అన్నది భారతీయ విద్యార్థుల కల. కానీ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిణామాలు, వీసా విధానాలు ఎప్పటికప్పుడు మారుతున్న నేపథ్యంలో యూనివర్సిటీల ర్యాంకుల బదులుగా తక్కువగా ఉండే విదేశీ చదువు ఖర్చులు, ఉద్యోగ అవకాశాలు, చేసిన ఖర్చుకు వచ్చే రాబడి వంటి అంశాలు విద్యార్థుల ‘విదేశీ విద్య’నిర్ణయాలను అత్యంత ప్రభావితం చేస్తున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్మార్కెట్ విలువ ఆధారంగా లెక్కలు.. మంచి జరుగుతుందని వేచి చూసే ధోరణి గతం. ఈ విధానం నుంచి విద్యార్థులు బయటకు వచ్చారు. చేయబోయే కోర్సు లేదా డిగ్రీ ఉత్తమమైనదా కాదా అని బేరీజు వేసుకొనే రోజులు వచ్చాయి. ప్రపంచ పోటీ నేపథ్యంలో ప్రతి డిగ్రీకి మార్కెట్ విలువ ఉందా అని లెక్కలు వేసుకుంటున్నారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే అభ్యర్థులకు సహాయం, సమాచారం అందిస్తున్న లీప్ స్కాలర్ అనే కంపెనీ 2020–2025 మధ్య 30 లక్షల మందికిపైగా భారతీయ విద్యార్థులు, వృత్తి నిపుణుల దరఖాస్తులు, పరస్పర సంప్రదింపుల ఆధారంగా రూపొందించిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. తక్కువ వ్యయంతో.. ‘విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లగలనా’అనే సందేహం స్థానంలో ‘ఈ డిగ్రీ నాకు నిజంగా ఏమి ఇస్తుంది’అని విద్యార్థులు ప్రస్తుతం ప్రశ్నించుకుంటున్నారు. యూఏఈలో చదువుకోవడానికి పెరిగిన 55 రెట్ల ఆసక్తి మొదలు.. ట్యూషన్ ఫీజురహిత జర్మనీలో అడుగుపెట్టాలన్న కుతూహలం వరకు.. భారతీయ విద్యార్థులు తక్కువ వ్యయంతో అధిక నైపుణ్యాన్ని అందించే దేశాల కోసం ప్రపంచ పటాన్ని పరిశీలిస్తున్నారు. మరోవైపు వృత్తి నిపుణులు నైపుణ్యాన్ని పెంచుకోవాలన్న డిమాండ్ కారణంగా ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్‌లో (ఏఐ) మాస్టర్స్ చేయాలనుకుంటున్న వారి సంఖ్య ఏకంగా 186% పెరిగింది.తిరిగి ఏం లభిస్తుంది? చదువుకు నిధులు సమకూర్చుకోవడం నుంచి కెరీర్‌కు ఆర్థిక సాయం చేసుకోవడం వైపు విద్యార్థుల ఆలోచనలు మళ్లుతున్నాయి. స్పష్టమైన కెరీర్ మార్గాలు, ప్రపంచంలో ఎక్కడైనా బతకగలిగేలా ఉపాధి, దీర్ఘకాలిక నివాస స్థిరత్వానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. పెరుగుతున్న ప్రపంచ ద్రవ్యోల్బణం నేపథ్యంలో 2025–26లో ఆశావహులు విద్యను వ్యూహాత్మక పెట్టుబడిగా పరిగణిస్తున్నారు. ఒక నిర్దిష్ట డిగ్రీ వారి దీర్ఘకాలిక ఆదాయ సామర్థ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో లెక్కించడానికి అభ్యాసంపై రాబడిని (రిటర్న్ ఆన్ లెర్నింగ్) కొలుస్తున్నారు. రాబోయే రోజుల్లో కాలేజీల్లో ప్రవేశాలు కేవలం డిగ్రీ గురించి కాదు.. ప్రపంచ జాబ్ మార్కెట్లో స్థానం సంపాదించడం కోసం అని స్పష్టం అవుతోంది. రూట్ మారింది.. సంప్రదాయ కేంద్రాలకు అతీతంగా విద్యార్థులు ఎంచుకుంటున్న దేశాలు మారుతున్నాయి. సంప్రదాయ కేంద్రాలైన యూఎస్, యూకే, కెనడా, ఆ్రస్టేలియాలో అధిక ఖర్చులు, మారుతున్న వీసా నిబంధనలు విద్యార్థుల ప్రాథమ్యాలను మార్చాయి. వారసత్వ ప్రతిష్ట కంటే దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. 2025–26 విద్యా సంవత్సరానికిగాను యూఏఈకి 5,400%, న్యూజిలాండ్ 2,900%, జర్మనీకి 377% దరఖాస్తులు పెరగడం ఇందుకు నిదర్శనం. కెరీర్ పురోగతికే పట్టం.. ⇒ 85% మంది అభ్యర్థులు విద్యార్హతల కంటే చదువు తర్వాత కెరీర్ పురోగతికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ⇒ 68% మంది విద్యార్థులు ‘అందుబాటులో వ్యయాలు’అత్యంత ప్రాధాన్యంగా పేర్కొంటున్నారు. ⇒ విదేశాల్లో విద్యనభ్యసించాలనుకున్న అభ్యర్థుల్లో 65.5% మంది 18–25 ఏళ్ల వయస్కులు. ⇒ 26 ఏళ్లకుపైగా ఉన్నవారి వాటా 34.5%. కెరీర్ పురోగతికై ప్రత్యేక డిగ్రీలను వృత్తి నిపుణులు కోరుకుంటున్నారు. ⇒ విద్యార్థుల్లో పురుషులు 58%, మహిళలు 42% ఉన్నారు. ⇒ అభ్యర్థుల్లో మాస్టర్స్ ప్రోగ్రామ్స్ 54.7%, అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు కోరుకునేవారు 23.7% ఉన్నారు. ⇒ దరఖాస్తుల్లో 6.3% పీహెచ్డీ కోసం అభ్యరి్థంచినవే. వీటి సంఖ్య ఏడాదిలో 60% పెరిగింది.ఏఐపై పట్టు సాధించేందుకు.. ⇒ ఏఐ కోర్సుల్లో ప్రత్యేక మాస్టర్స్ ప్రవేశాలు 2023తో పోలిస్తే 2024లో దాదాపు 3 రెట్లు పెరిగాయి. ⇒ ఈ విద్యార్థులలో 49.9% మంది పూర్తిగా రంగాలను మార్చడం కంటే మార్కెటింగ్ అనలిటిక్స్, ఫైనాన్స్ వంటి వారి ప్రస్తుత రంగాల్లో నైపుణ్యాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ⇒ ఏఐ కోర్సులు చేద్దామనుకుంటున్న ఆశావహుల్లో దాదాపు 36% మంది ఇప్పటికే వృత్తి నిపుణులు. సాంకేతిక నైపుణ్యం పెంచుకోవడం వృత్తిపరంగా అవసరమని వారు రుజువు చేస్తున్నారు.
16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్?
సోషల్ మీడియా ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ దీనిలో మునిగిపోతున్నారు. పిల్లల్లో అయితే సామాజిక మాధ్యమాల ఎఫెక్ట్ మరింత అధికంగా ఉంటుంది. అయితే మద్రాస్ హైకోర్టు పిల్లల్లో సోషల్ మీడియా వాడకంపై కీలక సూచన చేసింది. 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు వాటిని వాడకుండా నియంత్రించాలని సూచించింది. పిల్లల్లో ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. మానసికంగా, శారీరకంగా ఎదగాల్సిన వయస్సులో గంటల గంటలు ఫోన్లకు అతుక్కపోయి వాటిలోనే గడపడంతో ఆందోళన, డిఫ్రెషన్, ఒత్తిడి తదితర సమస్యలు చిన్న వయసులోనే వెలుగు చూస్తున్నాయి. వారి తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు ఫోన్లకు దూరం చేద్దామని ప్రయత్నించినా ఫలితం ఉండట్లేదు. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు తెలిపింది.16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా ఖాతాలకు అనుమతించకుండా చట్టం రూపొందించాలని కోర్టు పేర్కొంది. ఆస్ట్రేలియాలో ఈ మధ్య ఇటువంటి చట్టం రూపొందించారని భారత్‌లో సైతం ఈ విషయం ఆలోచించాలని తెలిపింది. తద్వారా హానికరమైన, అసభ్యకరమైన కంటెంట్‌ను పిల్లలు చూడకుండా నియంత్రిచవచ్చని పేర్కొంది. అదేవిధంగా అటువంటి కఠిన చట్టాలు రూపొందించే వరకూ పిల్లలు ఇంటర్నెట్ను సురక్షితంగా వాడేలా రాష్ట్ర ప్రభుత్వం, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సంయుక్తంగా ఓ కార్యాచరణ సిద్ధం చేయాలని మద్రాస్ హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.
ఎన్ఆర్ఐ
మరోసారి అందరి మనసులు దోచేసిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, యుఏఈ ఉప ప్రధాని మరియు రక్షణ మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఓ రెస్టారెంట్లో అందరి బిల్లులు చెల్లించి దాతృత్వాన్ని చాటుకున్న ఆయన.. తాజాగా తన సింప్లిసిటీతో మరోసారి అందరి మనసులు దోచేశారు.సామాజిక సంబంధాలను బలపరిచేందుకు దుబాయ్ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన ‘దుబాయ్ లంచ్’ ప్రాజెక్ట్‌లో భాగంగా షేక్ హమ్దాన్ బిన్, దెయ్రా ప్రాంతంలోని 200 కుటుంబాలను కలిశారు. అల్ ఖవానీజ్ మజ్లిస్ వద్ద జరిగిన సమావేశంలో వారితో చాలాసేపు గడిపారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ అయినా ఏమాత్రం ఆడంబరాలకు పోకుండా సాధారణ వ్యక్తిలా ప్రజలతో మమేకమైపోయారు. లంచ్ చేస్తూ వారిలో ఒకరయ్యారు. అందరిని పలకరిస్తూ విశేషాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన ఓ చిన్నారిని కౌగిలించుకున్న హృద్యమైన దృశ్యం సోషల్ మీడియాలో వైరలవుతుంది. షేక్ హమ్దాన్ సింప్లిసిటీకి నెటిజన్లు ముగ్దులవుతున్నారు. షేక్ హమ్దాన్ను అతని తండ్రి, దుబాయ్ రాజు షేక్ మహమ్మద్‌తో పోలుస్తున్నారు. రాజకుటుంబం మంచితనాన్ని, సింప్లిసిటీని కొనియాడుతున్నారు. షేక్ హమ్దాన్ తండ్రి షేక్ మహమ్మద్ కూడా దుబాయ్ వాసులందరితో సాధారణ వ్యక్తిలా కలిపోతారు. తాను రాజునన్న అహంకారాన్ని ఎక్కడా ప్రదర్శించరు.దుబాయ్ లంచ్ కార్యక్రమ లక్ష్యం ఏంటంటే..?దుబాయ్ లంచ్ కార్యక్రమ లక్ష్యం స్థానిక కమ్యూనిటీ మజ్లిస్ల ద్వారా సామాజిక ఐక్యతను పెంపొందించడం. పరస్పర సహకారం, స్నేహాన్ని బలపరచడం. మజ్లిస్ల పూర్వపు సంప్రదాయ ప్రాధాన్యాన్ని తిరిగి తీసుకురావడం. ప్రజలతో నేరుగా సంభాషణకు వేదిక కల్పించడం.దుబాయ్ లంచ్ సందర్భంగా షేక్ హమ్దాన్ వ్యాఖ్యలు..దుబాయ్ లంచ్ కార్యక్రమ సందర్భంగా షేక్ హమ్దాన్ ఇలా అన్నారు. దుబాయ్ శక్తిని భవనాలతో కాదు, ప్రజల మధ్య ఐక్యతతో కొలవాలి. దుబాయ్ చరిత్రను కారుణ్యం, అతిథి సత్కారం, బాధ్యతా భావం నిర్మించాయి. ఈ విలువలను భవిష్యత్ తరాలకు అందించడానికి ఇలాంటి సమావేశాలు అవసరం.2026.. కుటుంబ సంవత్సరంకమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్ జనరల్ హెస్సా బింత్ ఈసా బుహుమైద్ తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ 2026ను కుటుంబ సంవత్సరంగా జరుపుకోడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రాబోయే రోజుల్లో దుబాయ్‌లోని వివిధ ప్రాంతాల్లో ‘దుబాయ్ లంచ్’ కార్యక్రమాలు జరుగుతాయి.
ప్రవాస భారతీయులకు ప్రాణ గండం.. అసలేం జరుగుతోంది?
విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల భద్రత ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. సిడ్నీ నుండి టొరంటో వరకు.. అక్కడి ప్రవాస భారతీయులు భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు. విదేశాలకు వెళ్లడమంటే ప్రాణాలను పణంగా పెట్టడమేనా? అనే విధంగా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా సిడ్నీలోని బోండి బీచ్‌లో భారతీయ విద్యార్థులపై జరిగిన దాడి అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, మరికొందరు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఇటువంటి ఘటనల నేపధ్యంలో విదేశాల్లో ఉంటున్న తమవారు ఎలా ఉన్నారోనని భారతదేశంలోని వారి కుటుంబ సభ్యులు అనునిత్యం ఆవేదన అనుభవిస్తున్నారు.జాత్యహంకార కోరలుకొన్ని పాశ్చాత్య దేశాల్లో జాత్యహంకారం అధికంగా కనిపిస్తుంది. ఈ జాబితాలోని దేశాలలో అమెరికా, కెనడా పేర్లు ముందుగా వినిపిస్తాయి. ఈ దేశాల్లో ఇటీవలి కాలంలో భారతీయులపై ద్వేషపూరిత నేరాలు (Hate Crimes) మునుపెన్నడూ లేనంతగా పెరిగాయి. కెనడాలో భారతీయుల పట్ల విద్వేషం మరింతగా పెరగడం వెనుక సోషల్ మీడియాలో జరుగుతున్న విష ప్రచారం ప్రధాన పాత్ర పోషిస్తోంది. అమెరికాలో 2024 నుంచి ఇప్పటివరకు 11 మందికి పైగా భారతీయ విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఇది స్థానిక భద్రతా వైఫల్యాలను ఎత్తిచూపుతోంది. డబ్లిన్‌లో ఒక భారత సంతతి వ్యక్తిపై జరిగిన పాశవిక దాడి, సభ్య సమాజం తలదించుకునేలా చేసింది.అభద్రతా భావంవిద్యా కేంద్రాల్లో అభద్రతా భావం మరింతగా పెరిగిపోయింది. భారతీయ విద్యార్థులు ఎక్కువగా వెళ్లే ఆస్ట్రేలియా, ఐరోపా దేశాల్లో ఇది ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఆయా దేశాల్లో భారతీయ విద్యార్థులకు క్యాంపస్ భద్రత అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల టెహ్రాన్‌లోని భారతీయ వైద్య విద్యార్థులు తమపై దాడులు జరుగుతున్నాయని మొరపెట్టుకున్నా, స్థానిక అధికార యంత్రాంగం స్పందించలేదనే వార్తలు వచ్చాయి. ఈ ఘటన దౌత్యపరమైన వైఫల్యంగా కనిపిస్తోంది. విద్యాభ్యాసం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసి, వెళ్తున్న విద్యార్థులు, అక్కడ కనీస రక్షణ లేక జాత్యహంకార దాడులకు బలవుతుండటం గమనార్హం.సైద్ధాంతిక విద్వేషంవిదేశాల్లో భారతీయులపై దాడులకు జాత్యహంకారం ఒక్కటే కాదు.. రాజకీయం, మతం లేదా సామాజిక పరమైన అసహనం కూడా కారణంగా నిలుస్తోంది. ఈ తరహా దాడులు కేవలం దొంగతనాలు లేదా స్థానిక గొడవలకు మాత్రమే పరిమితం కావడం లేదు. ఆన్లైన్ వేదికలపై భారతీయులకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాలు పలుచోట్ల హింసకు దారితీస్తున్నాయి. దీనికి తోడు నేరస్తులకు సరిహద్దులు దాటి ఉన్న సంబంధాలు దర్యాప్తు సంస్థలకు పెద్ద సవాలుగా మారాయి. సిడ్నీ ఘటనలో హైదరాబాద్ లింకులు బయటపడటం దీనికి ఉదాహరణగా నిలిచింది. విదేశాంగ శాఖ అప్రమత్తం విదేశాలలో పెరుగుతున్న ఈ హింసాత్మక ధోరణిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) తీవ్రంగా పరిగణిస్తోంది. గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే భారతీయులపై దాడులు క్రమంగా పెరుగుతున్నాయనే విషయాన్ని ప్రభుత్వం అంగీకరించింది. ఇటువంటి సందర్భాల్లో విదేశీ ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మార్పు అనుకున్నంతగా కనిపించడం లేదు. భారతీయ రాయబార కార్యాలయాలు విద్యార్థులకు, వలసదారులకు రక్షణ కల్పించడంలో మరింత చురుకైన పాత్ర పోషించాలని పలువురు అంటున్నారు.భద్రతా సంక్షోభం?ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఆయా దేశాలు తక్షణ చర్యలు తీసుకోకుంటే ఇవి పునరావృతం అవుతాయని పలువురు అంటున్నారు. ప్రవాస భారతీయులు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు వెన్నెముకగా నిలుస్తున్నారనడంలో సందేహం లేదు. దీనిని గుర్తించి అయినా అక్కడి ప్రభుత్వాలు వారికి రక్షణ కల్పించాలనే వాదన వినిపిస్తుంటుంది. ప్రవాస మేధావులు, విద్యార్థులపై దాడులు కొనసాగితే, అది ప్రపంచ భద్రతా సంక్షోభానికి దారితీస్తుందనేవారూ ఉన్నారు. ఇటువంటి సందర్భాల్లో కేవలం నిరసనలు తెలపడమే కాకుండా, అంతర్జాతీయ చట్టాలను బలోపేతం చేయడం ద్వారా ఇటువంటి ఘటనలను నివారించవచ్చని పలువురు సూచిస్తున్నారు. లేనిపక్షంలో విదేశీ కలలు కనే వేలాది మంది భారతీయుల భవిష్యత్తు అంధకారంలో పడిపోయే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చదవండి: బోండి బీచ్ ఘటన: వృద్ధ దంపతుల త్యాగం.. వీడియో వైరల్
గేదెల దాముకు సేవారత్న అవార్డు
అమెరికాలో నివసిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రవాసాంధ్ర వాసి, మన అమెరికా తెలుగు అసోసియేషన్- మాట కో కన్వీనర్ దాము గేదెలను సేవారత్న అవార్డుతో సత్కరించారు. విజయనగరం జిల్లాలోని రాజాంకు చెందిన పోలిపల్లి పైడితల్లి కళాకారుల సంక్షేమ సేవా సంఘం నెలవారీ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు పద్మశ్రీ యడ్ల గోపాలరావు... శ్రీకాకుళం జిల్లా కత్తులకవిటికి చెందిన ఎన్నారై, సామాజిక సేవా కార్యకర్త గేదెల దాము దంపతులను సేవారత్న అవార్డుతో సత్కరించారు.అవార్డు అందుకున్న దాము మాట్లాడుతూ… తనకు చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాలు అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. కుటుంబీకులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ ఉత్సాహం రెట్టింపు అయ్యిందని, సేవా కార్యక్రమాలు బాధ్యతను, సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెట్టాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దామును పలువురు కళాకారులు సత్కరించారు.అంతకు ముందు జగన్మోహిని పద్య నాటక ప్రదర్శన, కేవీ పద్మావతి శిష్య బృందంతో భరత నాట్య నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. స్థానిక జీఎంఆర్ వరలక్ష్మీ కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలిపల్లి పైడితల్లి కళాకారుల సంక్షేమ సేవా సంఘం కమిటీ సభ్యులు, రాజాంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.(చదవండి: ఘనంగా శంకర నేత్రాలయా ఫండ్‌రైజింగ్ సంగీత విభావరి)
అంతర్జాతీయ వేదికపై డా. తెన్నేటి సుధాదేవికి ఘన నివాళి
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వంశీ ఇంటర్నేషనల్ & శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, అంతర్జాలంలో శనివారం సాయంత్రం, ప్రఖ్యాత కథా నవలా రచయిత్రి, తెలుగు అకాడమీ పూర్వ ఉపసంచాలకులు, వంశీ అధ్యక్షురాలు డా. తెన్నేటి సుధాదేవి సంస్మరణ సభ నిర్వహించారునవంబర్ 23వ తేదీ హైదరాబాదులో స్వర్గస్తులైన, డా. తెన్నేటి సుధాదేవి (Dr.Tenneti Sudha Rani), వంశీ సంస్థల వ్యవస్థాపకులైన డా. వంశీ రామరాజు ధర్మపత్ని. "సుధాదేవి స్మరణలో, వివిధ దేశాల తెలుగు ప్రవాస సంస్థల ప్రతినిధులు, భారతదేశంలో చెన్నై ముంబై విశాఖపట్నం మొదలైన ప్రాంతాలలో ఉండే ప్రముఖులు ఆప్తులు కలిసి ఆమెకి నివాళులు అర్పించే విధంగా ఈ అంతర్జాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని నిర్వహకులు వంగూరి ఫౌండేషన్ అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు, శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్, కార్యక్రమ సమన్వయకర్త రాధిక మంగిపూడి తెలియ జేశారు.సుమారు నాలుగు గంటల పాటు కొనసాగిన ఈ కార్యక్రమంలో శిరోమణి డా వంశీ రామరాజు అంతర్జాల వేదిక మాధ్యమంగా అన్ని దేశాలనుండి తమ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్ నుండి మాత్రమే కాక సుమారు పది దేశాల నుండి 50 మంది వరకు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.భారతదేశం నుండి వంశీ సంస్థలతో అవినాభావ సంబంధం ఉన్న పద్మభూషణ్ డా.యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్, డా. మేడసాని మోహన్, సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, సినీ రచయిత భువనచంద్ర, సంగీత విద్వాంసులు గరికపాటి ప్రభాకర్, గాయకులు గజల్ శ్రీనివాస్, గాయని సురేఖ మూర్తి, హాస్యబ్రహ్మ శంకరనారాయణ, సినీ నటులు సుబ్బరాయశర్మ, సాహితీవేత్త ఓలేటి పార్వతీశం, రచయిత్రి జలంధర చంద్రమోహన్, రాజకీయవేత్త వామరాజు సత్యమూర్తి, అవధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, జుర్రు చెన్నయ్య, పొత్తూరి సుబ్బారావు తదితర వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో అమెరికా, సింగపూర్, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా, ఉగాండా, మలేషియా, హాంకాంగ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల నుండి కృష్ణవేణి శ్రీ పేరి, సుచిత్ర, బూరుగుపల్లి వ్యాసకృష్ణ, సత్య మల్లుల, పద్మ మల్లెల, జయ పీసపాటి, స్వాతి జంగా, విక్రమ్ సుఖవాసి, వెంకప్ప భాగవతుల, సీతాపతి అరికరేవుల , తాతాజీ & పద్మజ ఉసిరికల, శ్రీసుధ, మాధవీలలిత, సాహిత్య జ్యోత్స్న, కోనేరు ఉమామహేశ్వర రావు, శారదా పూర్ణ శొంఠి, శారద ఆకునూరి, రాధిక నోరిరాధ కాసినాథుని, కె ధర్మారావు గుణ కొమ్మారెడ్డి, డా. సత్యమూర్తి , డా. సుజాత కోటంరాజు, డా. బి కె మోహన్ పాల్గొని వంశీ సంస్థలతో సుధ గారితో తమకున్న అనుబంధాన్ని గురించి నెమరు వేసుకుంటూ ఆమెను స్మరించు కున్నారు. కల్చరల్ టీవీ వారు సాంకేతిక సహకారం అందించగా ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేశారు.
క్రైమ్
భార్య గొంతు కోసిన భర్త
ఆత్మకూరు: భార్యపై అనుమానం పెంచుకు న్న ఓ భర్త ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన హనుమ కొండ జిల్లా ఆత్మకూ రు మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రా నికి చెందిన అనూష, మంద రవి 2014లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమా ర్తెలు. పెళ్లైన నాలుగేళ్లనుంచి రవి తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. అనూష ఓ గురుకుల పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తుండగా రవి మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తనపై శారీరక, మానసిక వేధింపులు ఎక్కువ కావడంతో రెండు నెలల క్రితం అనూ ష మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్ చేసి పంపించారు. అయినా రవి ప్రవర్తనలో మార్పు రాలే దు. గురువారం రాత్రి రవి భార్యతో మరోసారి గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ఆమెను పిడిగుద్దులు గుద్దుతూ ఇంట్లోని కత్తి తీసుకుని గొంతు, మెడ, పొట్ట, కుడిచేతిపై ఇష్టానుసారంగా పొడిచాడు. అనూష కేకలు వేయడంతో పక్కగదిలో ఉన్న అత్త, కూతుళ్లు వచ్చి అడ్డుకున్నారు. చుట్టుపక్కలవారి సమాచారంతో 108 సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని ఆమెను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆత్మకూరు సీఐ సంతోష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.
మృత్యు ‘వే’గం.. రక్తమోడిన రహదారులు
రహదారులు శుక్రవారం తెల్లవారుజామున రక్తమోడాయి. అతివేగం, నిద్రమత్తు ఎనిమిది మంది ప్రాణాలను బలిగొన్నాయి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అదుపుతప్పిన కారు.. ప్రైవేటు బస్సును ఢీకొనడంతో ఐదుగురు మరణించారు. గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెంలో వెనుక నుంచి వస్తున్న ప్రైవేటు బస్సు రోడ్డు పక్కగా ఆగుతున్న కారును బలంగా ఢీకొనడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ రెండు ఘటనలు బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. నిద్రమత్తే యమపాశమై.. దొర్నిపాడు: నంద్యాల జిల్లా ఎన్‌హెచ్–40పై ఆళ్లగడ్డ సమీపంలో డ్రైవర్ నిద్రమత్తు వల్ల కారు అదుపు తప్పి డివైడర్‌ను క్రాస్ చేసి మరో రూట్లో వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతులంతా క్యాటరింగ్ పనులు చేసుకుని జీవించేవారు. హైదరాబాద్ బాచుపల్లికి చెందిన గుండేరావు(46), శ్రావణ్(21), సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన నరసింహులు(30), కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన సిద్ధయ్య(50)తోపాటు గుండేరావు కుమారులు సిద్ధార్థ కులకరి్ణ(19), శివసాయి కులకర్ణి ఈనెల 11న అయ్యప్ప భక్తులకు వంట చేసేందుకు శబరిమలైకి కారులో వెళ్లారు. అక్కడ కార్యక్రమం ముగించుకొని తిరుగు ప్రయాణంలో తిరుమలకు వెళ్లారు. స్వామి దర్శనం చేసుకొని గురువారం సాయంత్రం కారులో తిరుపతి నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు. శుక్రవారం తెల్లవారుజామున 2.30గంటల ప్రాంతంలో నల్లగట్ల వద్ద డ్రైవింగ్ చేస్తున్న శివసాయి కులకర్ణి నిద్రమత్తులో కునుకు తీయడంతో వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటుకుని మరో రూట్లో హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి వెళ్తున్న సీజీఆర్ ట్రావెల్స్ బస్సును బలంగా ఢీకొంది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనలో గుండేరావు, శ్రావణ్, నరసింహులు, సిద్ధయ్య అక్కడికక్కడే మరణించారు. సిద్ధార్థ కులకర్ణి, శివసాయి కులకర్ణి తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాలను కారు నుంచి బయటకు తీశారు. క్షతగాత్రులిద్దరిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అక్కడ పరిస్థితి విషమించి సిద్ధార్థ కులకర్ణి మృతి చెందాడు. ఘటనాస్థలంలో చనిపోయిన నలుగురిని ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించి అక్కడే పోస్టుమార్టం పూర్తి చేశారు. విషయం తెలుసుకున్న మృతుల బంధువులు ఆళ్లగడ్డ ప్రభుత్వాస్పత్రికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు.ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో 40 మంది ప్రయాణికులు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి వెళుతున్న సీజీఆర్ ట్రావెల్స్ బస్సులో 40మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ప్రమాదంలో వీరెవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు బస్సును పోలీసు స్టేషన్‌కు తరలించి ప్రయాణికులను ఇతర వాహనాల్లో వారి గమ్యస్థానాలకు చేర్చారు.ప్రైవేటు బస్సే మృత్యుశకటమైగుంటూరు రూరల్: వెనుక నుంచి వచ్చిన ప్రైవేటు బస్సు కారును బలంగా ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం, మామిళ్ళమడవ గ్రామానికి చెందిన కంచనపల్లి మధు స్థానికంగా వంటమేస్త్రీ. ఆయనకు భార్య మనీష, పిల్లలు జ్ఞానేశ్వర్, వర్షిత్ ఉన్నారు. పిల్లలిద్దరికీ పుట్టు వెంట్రుకలు తీయించేందుకు తిరుమల వెళ్లాలని కారు మాట్లాడుకున్నారు. కారులో మధు భార్యాబిడ్డలతోపాటు తల్లిదండ్రులు కంచనపల్లి సుశీల(64) వెంకటయ్య(70) మనీష తండ్రి మన్సూర్, కారు డ్రైవర్ సైదులు(28) మంగళవారం సాయంత్రం ఇంటివద్దనుంచి తిరుమల వెళ్లారు. తిరుపతిలో పిల్లల కార్యక్రమాలు పూర్తి చేసుకుని గురువారం సాయంత్రం విజయవాడకు కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు బయలుదేరారు. శుక్రవారం తెల్లవారుజామున గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెం సమీపంలోకి చేరింది. ఆ సమయంలో డ్రైవర్ సైదులు నిద్ర వస్తుందని కారును పక్కకు తీసి ముఖం కడుక్కుని వెళ్దామని చెప్పాడు. కారును రోడ్డుపక్కన ఆపేందుకు స్లో చేస్తుండగా వెనుకనుంచి అతి వేగంగా వస్తున్న వీఆర్‌సీఆర్ సంస్థకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కారును బలంగా ఢీకొంది. ప్రమాదంలో సుశీల, వెంకటయ్య, డ్రైవర్ సైదులు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలినవారికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి కారు డోర్లను రాడ్లతో వంచి క్షతగాత్రులను, మృతదేహాలను బయటకు తీశారు. క్షతగాత్రులను జీజీహెచ్‌కు తరలించారు. ఎస్పీ వకుల్ జిందాల్, సౌత్‌జోన్ డీఎస్పీ భానోదయ, నల్లపాడు సీఐ వంశీధర్ ఘటన స్థలికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు.
కదులుతున్న కారులో గ్యాంగ్‌రేప్: డ్యాష్ క్యామ్‌తో సీఈవో గుట్టు రట్టు
రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఉదయపూర్ సామూహిక అత్యాచార ఉదంతం కలకలం రేపింది. ఈ దురాగతానికి సంబంధించి అత్యంత దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కంపెనీ సీఈవో పుట్టినరోజు, లేట్-నైట్ పార్టీలో మహిళా ఉద్యోగిపై లైంగిక దాడి చేశారు. బాధితురాలిని ఇంట్లో దింపుతామని నమ్మించి, మార్గమధ్యలో మత్తు పదార్థం ఇచ్చి అపస్మారక స్థితిలోకి తీసుకెళ్లి ఘాతుకానికి పాల్పడ్డారు. డాష్‌క్యామ్ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. పుట్టిన రోజు పార్టీ తర్వాత ఇంటి దగ్గర దింపుతామని చెప్పి కంపెనీ సీఈవో మరో ఇద్దరితో కలిసి కదులుతున్న కారులో మహిళా ఉద్యోగినిపై సామూహిక అత్యాచారం చేశాడు. ఈ కేసులో కంపెనీ సీఈవో జయేష్, మరో ఎగ్జిక్యూటివ్ గౌరవ్, అతని భార్య శిల్ప సహా ముగ్గురిని ఉదయ్ పూర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను గురువారం తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకుని, తరువాత స్థానిక కోర్టు రిమాండ్‌కు తరలించారు.పోలీసుల ప్రకారం.. సీఈవో పుట్టిన రోజు సందర్భంగా శోభాగ్పురాలోని ఒక హోటల్లో రాత్రి 9 గంటల ప్రాంతంలో పార్టీ ప్రారంభమై దాదాపు తెల్లవారుజామున 1.30 గంటల వరకు కొనసాగింది. బాగా లేట్ అయింది కాబట్టి కారులో ఇంట్లో దింపుతామని ఆఫర్ చేశారు. దారి మధ్యలో సిగరెట్‌ను పోలిన మత్తు పదార్థాన్ని ఇచ్చారని బాధితురాలు ఆరోపించింది. అది తిన్న తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాననీ, అనంతరం తనపై కారులోనే అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది. మెలకువ వచ్చిన తరువాత చెవిపోగులు, ముఖ్యంగా లోదుస్తులు మాయం కావడం ప్రైవేట్ పార్ట్స్‌పై గాయాలు ఆమెలో భయాన్ని రేపాయి. దీంతో కారు డాష్‌క్యామ్ ఫుటేజీలో పరిశీలించాక జరిగిన దారుణమంతా రికార్డ్ అయిందని గుర్తించింది. డిసెంబర్ 23న పోలీసులకు ఫిర్యాదు చేసింది. డిసెంబర్ 21 తెల్లవారుజామున ఈ సంఘటన జరిగిందని పోలీసు సూపరింటెండెంట్ ఆఫ్ యోగేష్ గోయల్ తెలిపారు. బాధితురాలు లైంగిక వేధింపులకు గురయినట్టు వైద్య పరీక్షల ద్వారా నిర్ధారించినట్టు తెలిపారు. ఈ కేసు దర్యాప్తును అదనపు పోలీసు సూపరింటెండెంట్ మాధురి వర్మకు అప్పగించారు. దర్యాప్తును మరింతగా కొనసాగించడానికి పోలీసులు కారులో ఏర్పాటు చేసిన డాష్‌క్యామ్ నుండి ఆడియో, వీడియో రికార్డింగ్‌లను కూడా పరిశీలిస్తున్నారు.
ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటే..
ఇచ్చాపురం రూరల్: పెళ్లి పేరిట అమాయకులను మోసం చేస్తున్న ఓ యువతి వ్యవహారం బయటప డింది. ఇప్పటికే రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకు న్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ఈ నిజాలను దాచి మరోసారి వివాహం చేసుకుని వరుడి కుటుంబాన్ని బురిడీ కొట్టించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం భవానీపురంలో నివాసం ఉంటున్న యువతి వాణిని వివాహం చేసుకోవడానికి కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లాకు చెందిన నాగిరెడ్డి సురేష్‌రెడ్డి మధ్యవర్తుల ద్వారా లక్ష రూపాయల ఎదురు కట్నం ఇచ్చాడు.ఈనెల 17న సోంపేట కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఇరు కుటుంబాల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. 19వ తేదీన తన స్వగ్రామం కోలార్ వెళ్లేందుకు సురేష్‌రెడ్డి భార్య వాణితో కలిసి పలాసలో ట్రైన్ ఎక్కారు. విజయనగరం రైల్వేస్టేషన్‌కు వచ్చే సరికి భర్త కళ్లు గప్పి ఆమె నేరుగా ఇచ్చాపురంలోని తన ఇంటికి చేరుకుంది. భార్య కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన భర్త సురేష్ రెడ్డి అంతటా వెతికి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తిరిగి ఇచ్చాపురం (Ichchapuram) వచ్చి చూడగా వాణి ఇంట్లోనే ఉంది. ఎందుకిలా చేశావంటూ ప్రశ్నించగా తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. దీంతో మోసపోయినట్లు గ్రహించిన సురేష్‌రెడ్డి తన వారితో కలిసి గురువారం రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు.ఎదురు కట్నం ఇచ్చినా.. ఇంతకు ముందే ఆమెకు పలువురితో వివాహాలు జరిగినట్లు ఫొటోలు తమకు కనిపించాయని, ఎదురు కట్నంతో పాటు వెండి పట్టీలు, మెట్టెలు, బట్టలు ఇచ్చామంటూ వరుడు సురేష్‌రెడ్డి, వారి బంధువులు విలేకరుల ఎదుట వాపోయారు. అయితే పెళ్లి కుమార్తెకు తాము ఇచ్చిన కట్నం, వెండి వస్తువులు తిరిగి ఇచ్చేస్తే కేసు పెట్టమని వారు డిమాండ్ చేశారు. ఆమెకు ఇప్పటికే ఇద్దరితో నిశ్చితార్థం జరిగిందని, ఇప్పుడు తమ అబ్బాయితో పెళ్లి జరిగిందని తెలిపారు. అయితే వరుడు ఇచ్చిన వస్తువులు ఇచ్చేందుకు యువతి తరఫు వారు సమ్మతించడంతో కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.చదవండి: పెప్పర్ స్ప్రే కొట్టి భర్తపై భార్య దాడి
వీడియోలు
కారులో నుండి రాకెట్ షాట్స్.. అప్పుడే న్యూయర్ రచ్చ షురూ జేసిండ్రు
పిల్లలను వెంటాడి చంపేస్తా..! తిరుమలలో సైకో హల్ చల్..
మాచర్లలో చీలిన టీడీపీ
అన్నంత పని చేసిన కిమ్.. షాక్ లో ప్రపంచ దేశాలు
అనంతలో గన్ కల్చర్
శ్రీశైలంలో ఘోరం.. 200 కేజీల మాంసం.. లిక్కర్ స్వాధీనం.. కార్లు సీజ్
ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. క్రేజీ అప్డేట్!
నన్ను లక్షకు అమ్మేశాడు.. కాపాడండి సార్
మద్యం మత్తులో వీరంగం సృష్టించిన ఏఎస్సై
భార్యపై అనుమానంతో నిప్పు పెట్టిన భర్త

