రివర్స్ డ్రామా.. వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌పై కూటమి ప్రభుత్వం మరో కుట్రకు తెర తీసింది. మాచవరం పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదు చేయించింది.సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు అయ్యింది. 2024 జులైలో వంశీ, ఆయన అనుచరులు తనపై దాడికి పాల్పడ్డాడని తాజాగా ఆ వ్యక్తి మాచవరం పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో.. వంశీ సహా మరో 20 మందిపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. ఇక్కడ జరిగింది వేరు!. 2024 జూలై 7న విజయవాడలోని వంశీ ఇంటిపై టీడీపీ గూండాలు కత్తులు, కర్రలు, రాడ్లు, రాళ్లతో రెచ్చిపోయారు. అయితే వంశీ ఇంటిపై జరిగిన దాడిని.. తమ పైన దాడిగా రివర్స్‌లో ఫిర్యాదు చేయడం గమనార్హం. పైగా ఫిర్యాదులో తమను ఉద్ధేశపూర్వకంగా రెచ్చగొట్టి.. దూషించి దాడి చేశారంటూ సునీల్ పేర్కొనడం గమనార్హం. ఇంతకు ముందు.. వల్లభనేని వంశీని అక్రమ కేసుల్లో కూటమి ప్రభుత్వం జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో నకిలీ ఇళ్ల పట్టాల కేసుతో వంశీని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయించింది. ఈ కేసులో విజయవాడ జైల్లో ఉన్న ఆయన.. నూజివీడు కోర్టు బెయిల్ ఇవ్వడంతో 137 రోజుల తర్వాత బయటకు వచ్చారు.
చైనా-పాకిస్థాన్‌కు మధ్య చెడింది ఇక్కడే..!
‘దోస్త్ మేరా దోస్త్.. నువ్వే నా ప్రాణం’.. అంటూ ఏక కంఠంతో చెప్పిన చైనా-పాకిస్థాన్ మధ్య దోస్తీ ఇప్పుడు చెడిందా..! పాకిస్థాన్ ఆవిర్భావం నుంచి డ్రాగన్‌తో కలిసే ఉన్నా.. ఇంత సడెన్‌గా ఎందుకు చైనా దూరమవుతోంది..? షోలే సినిమాలో ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ మాదిరిగా కలిసి ఉండే చైనా-పాకిస్థాన్‌లు ఇప్పుడు విడిపోవడానికి కారణాలేమిటి..? ఇంతకాలం చైనా నుంచి ఇతోధికంగా సాయం పొందిన పాకిస్థాన్.. ఉన్నఫళంగా ఎందుకు రూట్ మార్చింది..? భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత జియోపాలిటిక్స్ ఇంత వేగంగా మారిపోవడానికి దోహదపడిన అంశాలేమిటి..? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే.. ఈ కథనం చదవాల్సిందే..సిల్క్ రోడ్ మాదిరి చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్‌ను నిర్మించింది. దీని కోసం చైనా ఎన్నో బిలియన్ల డాలర్లు ఖర్చు చేసింది. బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ అనే షీ జిన్‌పింగ్ కలను సాకారం చేసే దిశలో పాకిస్థాన్ సీపీఈసీకి సహకరించింది. అంతేకాదు.. పాకిస్థాన్‌లోని గ్వాదర్ పోర్టును చైనా అభివృద్ధి చేసి, తనకు అనుకూలంగా మలచుకోవాలనుకుంది. భారత్‌కు ధీటుగా పాకిస్థాన్‌ను ప్రపంచం ముందు నిలబెట్టే ప్రయత్నం చేసింది. అంతెందుకు.. మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్య రాజ్య సమితిలో భారత్ చేసిన ప్రతిపాదనను చైనా అడ్డుకుంది.పాక్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యలపై గళమెత్తిన ప్రతీసారి.. చైనా రొటీన్‌గా ఆధారాలేవి? అంటూ ప్రశ్నించేది. అలా పాలు-నీళ్లలా చైనా-పాకిస్థాన్ బంధం కొనసాగింది. భారత్‌కు చెక్ పెట్టేలా ఎప్పటికప్పుడు పాకిస్థాన్‌కు అధునాతన యుద్ధ విమానాలు, రక్షణ పరికరాలను సరఫరా చేయడంలో చైనా ముందంజలో ఉండేది. అంతెందుకు.. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదులు వాడే తూటలాలు.. ముఖ్యంగా స్టీల్ బుల్లెట్లు కూడా చైనా సరఫరా కావడం గమనార్హం..! సంక్షోభ సమయాల్లోనూ పాక్‌కు చైనా వెన్నంటే ఉంది.చైనా-పాకిస్థాన్‌ల చైనా బంధం దశాబ్దాలుగా కొనసాగింది. పాకిస్థాన్‌లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. పాలకులు మాత్రం చైనాకు అనుకూలంగా ఉండడం రివాజుగా మారింది. చివరకు సైనిక పాలన కొనసాగినా.. సైన్యాధికారులు చైనాకు తొత్తులగానే పనిచేసేవారు. నిజానికి చైనా మతరహిత సమాజాన్ని కోరుకుంటే.. పాకిస్థాన్ మాత్రం ఫక్తుగా ఇస్లామిక్ దేశం. ఇంకా చెప్పాలంటే.. చైనాలో మైనారిటీలుగా ఉన్న ముస్లింలపై మారణకాండ కొనసాగినా.. పాకిస్థాన్ మాత్రం చైనాకు వంతపాడేది.అంటే.. సిద్ధాంతపరంగా వేర్వేరు భావజాలాలున్నా.. ‘అవసరం’ అనే ఒకే ఒక్క పదం ఈ రెండు దేశాలను ఫ్రెండ్స్‌గా మార్చేశాయి. జియోపాలిటిక్స్ అనే రాజనీతితో ఇరుదేశాలు సఖ్యతను ప్రదర్శించాయి. బలూచిస్థాన్‌లో వ్యతిరేకత పెరిగినా.. పాకిస్థాన్ మాత్రం చైనా కోసం అణచివేత ధోరణిని కొనసాగిస్తోంది. ఇంకా చెప్పాలంటే.. బలూచిస్థాన్‌లో ఉన్న అపారమైన ఖనిజ సంపదను చైనాకు కట్టబెట్టేందుకు పాకిస్థాన్ ఇప్పుడు బలూచీలపై కత్తిదూస్తోంది. వారి ఆగ్రహ జ్వాలలకు సొంత సైన్యం, పోలీసులు బలవుతున్నా.. మొండిధోరణితో ముందుకు సాగింది.పాలు-నీళ్లుగా స్నేహ బంధంలో మునిగితేలిన చైనా-పాకిస్థాన్ ఇప్పుడు ఉప్పు-నిప్పులా మారిపోతున్నాయి. అందుకు అనేక కారణాలున్నాయని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రారంభించిన ‘ఆపరేషన్ సిందూర్’తో భారత రక్షణశాఖ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. భారత డిఫెన్స్‌తోపాటు.. అఫెన్స్ కెపాసిటీకి అగ్రదేశాలు సైతం అద్దిరిపోయాయి..! అందుక్కారణం.. ఈ రెండు అంశాల్లో భారతే టాప్ అన్నట్లుగా గణాంకాలు స్పష్టం చేశాయి. డిఫెన్స్‌లో తోపులమనుకునే ఇజ్రాయెల్, రష్యా, అమెరికా కంటే.. ఎంతో ముందంజలో ఉన్నట్లు ‘ఆపరేషన్ సిందూర్’ నిరూపించింది.అమెరికా తయారీ ఎఫ్-16, చైనా తయారీ జే-10సీ వంటి అధునాతన యుద్ధ విమానాలున్నా.. పాకిస్థాన్ చతికిలపడిపోయింది. అదే సమయంలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. దాంతో.. భారత్‌కు చెక్ పెట్టాలని అమెరికా నిర్ణయించింది. ఓవైపు సుంకాల భారం మోపుతూనే.. మరోవైపు పాకిస్థాన్‌ను పావులా వాడుకోవాలని వ్యూహాలు రచించింది. అదే సమయంలో చైనాకు పోటీగా పాకిస్థాన్‌లోని ఓ పోర్టును అభివృద్ధి చేసి, బలూచిస్థాన్‌లోని అపారమైన ఖనిజ సంపదను దోచుకోవాలని ప్లాన్ చేసింది. దాన్ని అర్థం చేసుకోకుండా.. తమకు పెద్దన్న పెద్దపీట వేస్తున్నాడనే ఉద్దేశంతో పాకిస్థాన్ ట్రంప్‌ను గుడ్డిగా నమ్మేసింది..!అమెరికాను బద్ధ శత్రువుగా భావించే చైనా.. ఇప్పుడు పాకిస్థాన్ నిర్ణయంతో షాక్ అయ్యింది. దాంతో.. పాకిస్థాన్‌ను పూర్తిగా పక్కన పెట్టేసింది. 2013 నుంచి వ్యూహాత్మకంగా గ్వాదర్ పోర్టును అభివృద్ధి చేసినా.. ఇప్పుడు పాక్‌కు దూరంగా ఉంటోంది. అయితే.. హోర్మూజ్ జలసంధి నుంచి గ్వాదర్ పోర్టు 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. చైనాకు సరఫరా అయ్యే చమురు ఈ పోర్టు మీదుగానే వస్తుంది. అక్కడి నుంచి సీపీఈసీ ద్వారా గిల్గిట్-బాల్టిస్థాన్‌కు.. అక్కడి నుంచి జిన్జియాంగ్కు చమురు చేరుకుంటుంది. వ్యూహాత్మకంగా శత్రుదేశాల యుద్ధ నౌకలను అడ్డుకునేందుకు గ్వాదర్ పోర్టును అడ్డాగా మార్చుకోవాలని చైనా భావించింది.ముఖ్యంగా అమెరికా యుద్ధ నౌకలు ఈ మార్గం మీదుగానే దక్షిణాసియాకు రావాల్సి ఉంటుంది. అయితే.. పాకిస్థాన్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి బిలియన్ల డాలర్లు ఖర్చు చేసిన చైనా.. ఇప్పుడు వాటిని అప్పుగా చూపించి, వసూలు చేసుకుంటుందా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. పైగా.. బలూచిస్థాన్, ఖైబర్ పంఖ్తుంఖ్వాల్లో రోడ్లను చైనా అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో లభించే అరుదైన ఖనిజ సంపదను అమెరికాకు ఎగుమతి చేసే దిశలో పాకిస్థాన్ అడుగులు వేస్తోంది. దీన్ని చైనా సహిస్తుందా??గ్వాదర్ పోర్టు నుంచి జిన్జియాంగ్ వరకు సీపీఈసీ, రైల్వేలు, విమానాశ్రయాలను అభివృద్ధి చేసిన చైనా.. వాటిని ఊరికే వదిలిపెడుతుందా??? ఇవన్నీ సమాధానాల్లేని ప్రశ్నలే..! గ్వాదర్‌కు సమాంతరంగా పజ్నీ నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు అమెరికా సిద్ధమైంది. ఈ పరిణామాలకు చైనా ఎలా రియాక్ట్ అవుతుంది? అనేది తెలియాలంటే.. ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే..!-హెచ్.కమలాపతిరావు
గండిపేటలోకి గలీజు!
మొయినాబాద్: హైదరాబాద్ మహానగర ప్రజలకు మంచినీరు అందిస్తున్న గండిపేట జలాశయం గలీజవుతోంది. సెప్టిక్ ట్యాంకులోని మల, మూత్ర విసర్జన వ్యర్థాలను జలాశయంలో వదులుతున్నారు. ఈ తతంగం ఏన్నాళ్ల నుంచి జరుగుతుందోగాని.. బుధవారం స్థానికులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని జలమండలి అధికారులకు అప్పగించారు. అదే సమయంలో.. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్‌నగర్ పక్కనే గండిపేట జలాశయం ఉంది. బుధవారం ఇక్కడ ఉన్న కట్టపై ఎఫ్టీఎల్ 428వ పాయింట్ వద్ద ఓ సెప్టిక్ ట్యాంక్ వాహనం నుంచి మల, మూత్ర విసర్జన వ్యర్థాలను జలాశయంలోకి వదులుతున్నారు. దుర్వాసన రావడంతో గమనించిన స్థానికులు సెప్టిక్ ట్యాంక్ డ్రైవర్‌ను నిలదీశారు. స్థానికులు జలమండలి అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాటర్ వర్క్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ నరహరి అక్కడికి చేరుకుని డ్రైవర్‌ను ప్రశ్నించారు. అది శివనాయక్‌కు సంబంధించిన వాహనమని.. హిమాయత్‌నగర్ గ్రామంలో నుంచి వ్యర్థాలను తీసుకొచ్చి వదులుతున్నట్లు డ్రైవర్ చెప్పాడు. దీంతో డీజీఎం నరహరి మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు. తాగే నీళ్లలో మనుషుల వ్యర్థాలు అన్లోడ్ వ్యవహారంపై హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీని స్థానికులు తిట్టిపోస్తున్నారు. ఉస్మాన్‌సాగర్‌లో అధికారులే దగ్గరుండి పారబోయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు అధికారి నరహరిపైనా ఫిర్యాదు చేస్తున్నట్లు తెలుస్తోంది.
నిధి అగర్వాల్‌పై చేతులు.. వీళ్లు మగాళ్లు కాదంటూ చిన్మయి ఫైర్
ప్రభాస్- మారుతిల సినిమా ది రాజా సాబ్ నుంచి తాజాగా రెండో సాంగ్‌ను విడుదల చేశారు. ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని లులూ మాల్‌కు హీరోయిన్ నిధి అగర్వాల్ రావడంతో భారీగా అభిమానులు చేరుకున్నారు. అయితే, ఆమె తిరిగి వెళ్తున్న సమయంలో తన కారు వద్దకు అభిమానులు చొచ్చుకు వచ్చారు. ఆమెతో సెల్ఫీల తీసుకునేందకు ఎగబడ్డారు. ఈ క్రమంలో మరికొందరు ఆమెను తాకేందుకు ప్రయత్నించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.నిధి అగర్వాల్ కనీసం తన కారు వద్దకు కూడా చేరుకోవడం కష్టమైంది. అయితే, అక్కడ ఉన్న బౌన్సర్లు అక్కడున్నవారిని వెనక్కి నెట్టి చివరకు నిధి అగర్వాల్‌ను కారు ఎక్కించారు. దీంతో నిధి ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియోను షేర్ చేస్తే.. సింగర్ చిన్మయి ఘాటుగానే స్పందిచారు. నిధి అగర్వాల్‌కు ఎదురైన సంఘటన చాలా దారుణంగా ఉందని ఆమె పేర్కొన్నారు. వీళ్లు మగాళ్లు కాదు, జంతువులంటూ సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. జంతువుల కంటే హీనంగా ఉన్నారంటూ చిన్మయి భగ్గుమంది. ఇలాంటి మానవ మృగాలను భూమిపై ఉంచకుండా మరో గ్రహానికి పంపించాలని కోరింది. Pack of men behaving worse than hyenas.Actually why insult hyenas. Put ‘likeminded’ men together in a mob, they will harass a woman like this. Why doesnt some God take them all away and put them in a different planet? https://t.co/VatadcI7oQ— Chinmayi Sripaada (@Chinmayi) December 17, 2025Vultures Disguised As Fans; Prabhas Starrer "The Raja Saab" Actress Nidhhi Agerwal, was literally gets Mobbed and Crushed by Fans at a Song Launch event in Hyderabad on Wednesday.#NidhhiAgerwal #Prabhas #Hyderabad #TheRajaSaab #SahanaSahana pic.twitter.com/omOzynRQcj— Surya Reddy (@jsuryareddy) December 17, 2025
సొంతూరిలో చంద్రబాబుకి షాక్!
గోల్డెన్ లెహంగాలో 24 క్యారెట్ల బంగారంలా మెరిసిన శోభితా ధూళిపాళ..!
‘పోయేకాలం వచ్చింది’.. కడియం శ్రీహరిపై రాజయ్య ఫైర్
శ్రీలీల చేతులు జోడించింది గీతాంజలి లాంటి వారి కోసమే...
డిఫరెంట్‌గా డకాయిట్ టీజర్
భార్య కోసం.. కన్నవారిని రంపంతో నరికి..
ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం
ఆ ‘పదం’ అంటే నాకు చాలా ఇష్టం: ట్రంప్
గ్రహాంతర వాసులున్నారా?
నాటు కోళ్లకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలట!
కొత్త కారు కొన్న టాలీవుడ్ బుల్లితెర నటి
ఈ రాశి వారికి చేపట్టిన కార్యక్రమాలలో విజయం
ఒక్కరోజే ఊరట.. మారిపోయిన బంగారం, వెండి రేట్లు
'ధురంధర్' సినిమా రివ్యూ
తుపాను బీభత్సం : కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
ఓటీటీలో 'రష్మిక' హిట్ సినిమా.. ఉచితంగానే స్ట్రీమింగ్
జనవరి నుంచి పెరగనున్న టీవీ ధరలు
రాబోయే మద్యం ఆదాయం తాకట్టు పెట్టి అప్పులు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
తండ్రి నుంచి తాతగా ప్రమోషన్? నాగార్జున ఆన్సరిదే!
విమానం రద్దు.. ప్రేమకు ఆకాశమే హద్దు..!
ఓటీటీలోకి ఐశ్వర్య రాజేశ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా
ఈ రాశి వారికి అదనపు ఆదాయం సమకూరుతుంది
ఒకప్పుడు రూ.8 కోట్లు.. ఇప్పుడు ధర తెలిస్తే షాక్!
మొన్న చిరంజీవి.. నేడు బాలయ్య.. అక్కడ అట్టర్ ఫ్లాప్!
బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ నొక్కడంతో..
దంచికొట్టిన వైభవ్ సూర్యవంశీ.. కానీ..
సుప్రీంకోర్టులో రఘురామ కృష్ణరాజుకు భారీ షాక్
నీలిరంగు చీరలో శ్రీదేవి.. నివేదా ఇంత గ్లామరా?
IND vs SA: టాస్ పడలేదు.. మ్యాచ్ రద్దు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది
సొంతూరిలో చంద్రబాబుకి షాక్!
గోల్డెన్ లెహంగాలో 24 క్యారెట్ల బంగారంలా మెరిసిన శోభితా ధూళిపాళ..!
‘పోయేకాలం వచ్చింది’.. కడియం శ్రీహరిపై రాజయ్య ఫైర్
శ్రీలీల చేతులు జోడించింది గీతాంజలి లాంటి వారి కోసమే...
డిఫరెంట్‌గా డకాయిట్ టీజర్
భార్య కోసం.. కన్నవారిని రంపంతో నరికి..
ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం
ఆ ‘పదం’ అంటే నాకు చాలా ఇష్టం: ట్రంప్
గ్రహాంతర వాసులున్నారా?
నాటు కోళ్లకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలట!
కొత్త కారు కొన్న టాలీవుడ్ బుల్లితెర నటి
ఈ రాశి వారికి చేపట్టిన కార్యక్రమాలలో విజయం
ఒక్కరోజే ఊరట.. మారిపోయిన బంగారం, వెండి రేట్లు
'ధురంధర్' సినిమా రివ్యూ
తుపాను బీభత్సం : కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
ఓటీటీలో 'రష్మిక' హిట్ సినిమా.. ఉచితంగానే స్ట్రీమింగ్
జనవరి నుంచి పెరగనున్న టీవీ ధరలు
రాబోయే మద్యం ఆదాయం తాకట్టు పెట్టి అప్పులు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
తండ్రి నుంచి తాతగా ప్రమోషన్? నాగార్జున ఆన్సరిదే!
విమానం రద్దు.. ప్రేమకు ఆకాశమే హద్దు..!
ఓటీటీలోకి ఐశ్వర్య రాజేశ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా
ఈ రాశి వారికి అదనపు ఆదాయం సమకూరుతుంది
ఒకప్పుడు రూ.8 కోట్లు.. ఇప్పుడు ధర తెలిస్తే షాక్!
మొన్న చిరంజీవి.. నేడు బాలయ్య.. అక్కడ అట్టర్ ఫ్లాప్!
బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ నొక్కడంతో..
దంచికొట్టిన వైభవ్ సూర్యవంశీ.. కానీ..
సుప్రీంకోర్టులో రఘురామ కృష్ణరాజుకు భారీ షాక్
నీలిరంగు చీరలో శ్రీదేవి.. నివేదా ఇంత గ్లామరా?
IND vs SA: టాస్ పడలేదు.. మ్యాచ్ రద్దు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది
ఫొటోలు
ఏఎన్నార్ కాలేజీకి నాగార్జున రూ.2 కోట్లు.. ఈవెంట్ ఫోటోలు
ఫ్యామిలీతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దిల్ రాజు (ఫోటోలు)
'డేవిడ్ రెడ్డి'గా మంచు మనోజ్.. గ్లింప్స్ వేడుకలో యూనిట్ ( ఫోటోలు)
హీరోయిన్ రష్మిక.. గర్ల్స్ గ్యాంగ్‌తో శ్రీలంక ట్రిప్ (ఫొటోలు)
హ్యాపీ బర్త్ డే మై హార్ట్‌బీట్.. భర్తకు జెనీలియా విషెస్ (ఫొటోలు)
వంతారలో మెస్సీ.. వన్య ప్రాణులతో సందడి (ఫోటోలు)
హైదరాబాద్‌లో ఆలిండియా పోలీస్ బ్యాండ్ పోటీలు (చిత్రాలు)
తిరుమలలో నటి స్వాతి దీక్షిత్ (ఫోటోలు)
భార్యతో కలిసి నిర్మాత దిల్ రాజు ప్రత్యేక పూజలు (ఫొటోలు)
శ్రీవారిలో సేవలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ దంపతులు (ఫొటోలు)
సినిమా
జైలర్ 2లో ఐటం సాంగ్!
సినిమాలో ఎంత పెద్ద హీరోలు ఉన్నా ఐటమ్ సాంగ్స్ తప్పనిసరిగా మారుతోంది. కథ, కథనాలు ఎంత బాగున్నా, ఆ చిత్రాలకు ఎక్కువ మైలేజ్ ఇస్తున్నవి ఐటమ్ సాంగ్స్‌నే అంటున్నారు సీనీ పండితులు. అలా ఐటమ్ సాంగ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారిన అతి కొద్దిమంది స్టార్ హీరోయిన్లలో తమన్నా పేరు ముందు ఉంటుంది. రజనీ నటించిన జైలర్ మూవీలో తమన్నా అందాలు ఆరబోసిన నువ్వు కావాలయ్యా పాట ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. జైలర్ 2లో ఐటం సాంగ్అదేవిధంగా కూలీ చిత్రంలో పూజాహెగ్డే స్టెప్పేసిన మోనికా సాంగ్ కూడా ఈచిత్రానికి కొంత మైలేజ్‌ను తీసుకొచ్చింది. తాజాగా రజనీ నటిస్తున్న జైలర్–2 చిత్రంలోనూ ఐటమ్‌సాంగ్ ఉంటుందని సమాచారం. కాకపోతే ఈ సారి మిల్కీ బ్యూటీ తమన్నాకు బదులుగా బాలీవుడ్ బ్యూటీని ఎంపిక చేసే ప్లాన్‌లో ఉన్నారట! ఆమె ఎవరో కాదు నోరా ఫతేహి.స్టెప్పేయనున్న నోరా ఫతేహి?మోడలింగ్ రంగంలో రాణించిన ఈ క్రేజీ భామ హిందీ బిగ్‌బాస్ రియాలిటి గేమ్షోలోనూ పాల్గొంది. అనంతరం పలు హిందీ చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ బాహుబలి వంటి కొన్ని చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌లో నటించి గుర్తింపు పొందింది. ఇప్పుడు జైలర్–2 మూవీలో ఐటమ్ సాంగ్ చేయనుందని తెలుస్తోంది. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే!
సినిమా వైఫల్యంతో నటన మానేయాలనుకున్నా: నవదీప్
టాలీవుడ్ నటుడు నవదీప్ కథానాయకుడిగా భారీ అంచనాలతో నటించిన చిత్రం లవ్ మౌళి.. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్గ నిలిచింది. అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ఫంకూరీ గిద్వానీ హీరోయిన్గా నటించింది. సుమారు ఏడాది తర్వాత ఈ మూవీ ఫలితం గురించి నవదీప్ రియాక్ట్ అయ్యారు. ఈ చిత్రం రిజల్ట్ తనను భావోద్వేగ స్థాయిలో తీవ్రంగా ప్రభావితం చేసిందని ఆయన అన్నారు.లవ్ మౌళి సినిమా వైఫల్యాన్ని గుర్తుచేసుకుంటూ.. నవదీప్ ఇలా అన్నారు. 'ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పేలవమైన ప్రదర్శన ఇవ్వడంతో నన్ను బాగా కుంగతీసింది. చాలా కష్టపడి ఈ చిత్రాన్ని నిర్మించాం. నాపై ఈ మూవీ ఫలితం తీవ్రంగా ప్రభావితం చేసింది. చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది కూడా.. విడుదల తర్వాత వచ్చిన టాక్‌తో నిరాశ చెందాను. దానిని తట్టుకోవడం చాలా కష్టమనిపించింది. నా జీవితంలో చాలా బాధాకరమైన అనుభవంగా అది మిగిలిపోతుంది. ఈ సినిమా విడుదల తర్వాత కొంతకాలం పరిశ్రమకు దూరంగా ఉన్నాను. పెర్త్‌లోని నా సోదరి ఇంట్లో దాదాపు మూడు నెలలు ఉన్నాను. ఇక నటనను పూర్తిగా మానేయాలని కూడా భావించాను. అయితే, సమయం అన్నీ మార్చేస్తుంది. కొంత కాలం తర్వాత తిరిగి ప్రయత్నాం చేయాలనిపించింది. అలా ధండోరా మూవీతో ప్రేక్షకుల వద్దకు మళ్లీ వస్తున్నాను.' అని నవదీప్ గుర్తుచేసుకున్నారు.
ఆస్కార్ అవార్డ్స్.. 50ఏళ్ల బంధానికి బ్రేక్ వేసిన యూట్యూబ్
ప్రపంచవ్యాప్తంగా సినీ పరిశ్రమ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుకను చూడాలని కోట్ల మంది ప్రేక్షకులు ఎదురుచూస్తారు. 1976 నుండి ఆస్కార్ అవార్డుల ప్రసార హక్కులు అమెరికాకు చెందిన ABC నెట్వర్క్ వద్ద ఉన్నాయి. సుమారు 50 ఏళ్లుగా ఇదే ఛానల్లో ఆస్కార్‌కు సంబంధించిన వీడియోలు ప్రసారం అవుతున్నాయి. అయితే, ఇప్పుడు వారి బంధానికి యూట్యూబ్ బ్రేక్ వేసింది.ఆస్కార్ అవార్డుల వేడుకును ప్రపంచవ్యాప్తంగా లైవ్‌లో చూసే ఛాన్స్‌ను యూట్యూబ్ కల్పిస్తుంది. 2029 నుండి 2033 వరకు ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి సంబంధించిన గ్లోబల్ స్ట్రీమింగ్ హక్కులను యూట్యూబ్‌కి మంజూరు చేస్తూ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ABCతో ఉన్న సుదీర్ఘ అనుబంధం ముగిసింది. అయితే, 2028లో 100వ ఆస్కార్ అవార్డులు జరగనున్నాయి. ఈ ఈవెంట్ వరకు ABC ప్రసారం చేస్తుంది. ఈ పెను మార్పు చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారింది. ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా చూడొచ్చు అనే ప్రకటన రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో రెడ్ కార్పెట్ కవరేజ్ మరియు తెరవెనుక కంటెంట్ కూడా ఉంటుంది.
8 ఏళ్ల తర్వాత 'పార్టీ' ఇవ్వనున్న రెజీనా, రమ్యకృష్ణ
తమిళసినిమా: ఒక్కోసారి అనుకున్నది అనుకున్నట్లు జరగదు. అందుకు పలు కారణాలు ఉంటాయి. ఇది చిత్రాలకు అతీతం కాదు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్నా, కొన్ని చిత్రాల విడుదలకు ఏళ్ల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. ఉదాహరణకు మదగజరాజానే తీసుకుంటే నిర్మాణం పూర్తి చేసుకుని పలు అవరోధాలను ఎదురొడ్డి 12 ఏళ్ల తరువాత తెరపైకి వచ్చింది. విశాల్ హీరోగా నటించిన ఈ చిత్రానికి సుందర్.సీ దర్శకుడు అయినప్పుటికీ ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అలాంటి మ్యాజిక్ పార్టీ చిత్రానికి వర్కౌట్ అవుతుందా? అన్నదే ఇప్పుడు జరుగుతున్న చర్చ. వెంకట్‌ప్రభు దర్శకత్వం వహించిన చిత్రం పార్టీ.. మిర్చి శివ, జయ్, రెజీనా, రమ్యకృష్ణ, నివేదాపేతురాజ్, జయరామ్, సత్యరాజ్ వంటి ప్రముఖ నటీనటులు నటించిన ఈ చిత్రానికి ప్రేమ్‌జీ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం 8 ఏళ్ల క్రితం నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. అయితే ఆర్థిక సమస్యల కారణంగా ఇప్పటికీ తెరపైకి రాలేదు. మధ్యలో చిత్ర వర్గాలు చాలా ప్రయత్నాలు చేశారు. తాజాగా పార్టీ చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ప్రథమార్థంలో పార్టీ తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. వెంకట్‌ప్రభు చిత్రాలకు కాలంతో పనిఉండదు. ఎంటర్టెయిన్మెంట్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి పార్టీ చిత్రం కూడా సక్సెస్ అవుతుందని భావిద్దాం.
క్రీడలు
క్రికెట్ వర్సెస్ కాలుష్యం.. నిజంగా ఇది సిగ్గు చేటు!
లక్నోలోని ఏకనా స్టేడియం వేదికగా బుధవారం భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన నాలుగో టీ20 ప్రతికూల వాతావరణం కారణంగా రద్దయ్యింది. పొగమంచు కమ్మేయడంతో కనీసం టాస్ పడకుండానే మ్యాచ్‌ను ముగించాల్సి వచ్చింది. లక్నోలో గాలి నాణ్యత సూచీ (AQI) 400 దాటి 'హానికర' స్థాయికి చేరుకుంది.దీంతో మొత్తంగా ఆరు సార్లు మైదానంలోకి వచ్చి పరిస్థితిని సమీక్షించిన అంపైర్లు.. చివరిసారిగా రాత్రి 9.25 సమయంలో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో బీసీసీఐ షెడ్యూల్ తీవ్రస్ధాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి.ప్రణాళిక లోపం..!వాతావరణంపై పూర్తి నియంత్రణ ఎవరి చేతిలోనూ ఉండదు. కానీ ఉత్తర భారతదేశంలో నవంబర్, డిసెంబర్ నెలల్లో కాలుష్యం, పొగమంచు తీవ్రత ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇది కొత్త విషయం ఏమీ కాదు. గతంలో దీపావళి తర్వాత ఢిల్లీలో జరగాల్సిన టెస్ట్ మ్యాచ్‌ను కాలుష్యంగా కారణంగా బీసీసీఐ కోల్‌కతాకు మార్చింది. అంటే బోర్డుకు అక్కడి పరిస్థితులపై స్పష్టమైన అవగాహన ఉంది. కానీ ఈసారి మాత్రం ముందస్తు జాగ్రత్త తీసుకోవడంలో బీసీసీఐ విఫలమైంది. దేశవ్యాప్తంగా ఇంకా ఎన్నో వేదికలు ఉన్నప్పటికి లక్నోలోనే షెడ్యూల్ చేయాల్సిన అవసరం ఏముందని బీసీసీఐపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇంతటి కాలుష్యంలో ఆడటం ఆటగాళ్లకు ప్రేక్షకులకు, అధికారులకు ప్రాణసంకటమే. ఈ మైదానంలో హార్డిక్ పాండ్యా వంటి ఆటగాళ్లు మాస్కులు ధరించి తిరగాల్సి వచ్చింది. ఈ సిరీస్‌లో ధర్మశాల వేదికగా జరిగిన మూడో టీ20లోనూ భారత ఆటగాళ్లు చాలా ఇబ్బంది పడ్డారు. ఇంతటి చలిలో ఆడడం ఇదే తొలిసారి అని స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చెప్పుకొచ్చాడు.ఇప్పటికైనా మారాల్సిందే..భారత్‌లో క్రికెట్ కేవలం ఒక క్రీడ మాత్రమే కాదు.. కోట్లాది మంది భావోద్వేగం. తమ ఆరాధ్య క్రికెటర్లను చూసేందుకు టిక్కెట్లు తీసుకుని మరి మైదానంకు వచ్చిన అభిమానులకు నిరాశ ఎదురవ్వడం చాలా బాధాకారం. ఇకనైనా బీసీసీఐ షెడ్యూలింగ్ చేసేటప్పుడు.. వాతావరణ పరిస్థితులు, కాలుష్య స్థాయిలను పరిగణనలోకి తీసుకుని వేదికలను ఎంపిక చేయాలని క్రీడా విశ్లేషకులు సూచిస్తున్నారు.అయితే వచ్చే ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగే వైట్‌బాల్ సిరీస్‌లకు దక్షిణ, పశ్చిమ భారత నగరాలు వేదికలగా ఉన్నాయి. ఒక్క మూడో టీ20 నార్త్ ఈస్ట్(అస్సాం)లో జరగనుంది. ఈ మ్యాచ్ వేదికను బీసీసీఐ మార్చే అవకాశముంది. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది. ఐదో టీ20 శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.ఇది రెండోసారి..అంతర్జాతీయ క్రికెట్లో పొగమంచు కారణంగా మ్యాచ్ రద్దు కావడం ఇది రెండోసారి. 1998లో ఫైసలాబాద్‌లో పాకిస్తాన్, జింబాబ్వే మధ్య జరగాల్సిన టెస్ట్ మ్యాచ్ పొగమంచు కారణంగా రద్దు అయింది. ఆశ్చర్యకరంగా ఐదు రోజులూ ఆట సాధ్యం కాలేదు.చదవండి: అంధుల మహిళల క్రికెట్ జట్టుకు సచిన్ అభినందన
భారత ఫుట్‌బాల్‌కు ఉజ్వల భవిత: మెస్సీ
న్యూఢిల్లీ: భారత్‌లో ఫుట్‌బాల్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లయోనల్ మెస్సీ అన్నాడు. ‘మీ ఆదరణ, మీరు పంచిన ప్రేమాభిమానాలను నాతోపాటు తీసుకెళ్తున్నా. మ్యాచ్ ఆడేందుకైనా... మరో కార్యక్రమానికైనా ఇంకోసారి భారత్‌కు రావాలని గట్టిగా కోరుకుంటున్నాను. కచ్చితంగా తిరిగి వచ్చే ఆలోచనైతే నాకుంది’ అని మెస్సీ అన్నాడు. తను సందర్శించిన ప్రాంతాల్ని, కలుసుకున్న భారత దిగ్గజాలతో ఉన్న ఒక నిమిషం నిడివిగల వీడియోను మెస్సీ తన సోషల్ మీడియా అకౌంట్లో పంచుకున్నాడు. ఈ వీడియోలో భారత ప్రముఖ క్రీడాకారులు, సినీ స్టార్లు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులెందరో ఉన్నారు. కానీ... హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీలతో ఉన్న ఫుటేజీ మాత్రం క్షణమైనా కనిపించలేదు. భారత్‌లో తన ఐదు రోజుల పర్యటన అద్భుతంగా సాగిందన్నాడు. బుధవారం ముంబై నుంచే మయామికి బయలుదేరాడు. 38 ఏళ్ల అర్జెంటీనా స్ట్రయికర్ తన మయామి క్లబ్ జట్టు సహచరులు స్వారెజ్, రోడ్రిగో డి పాల్‌లతో కలిసి 13, 14, 15 తేదీల్లో మూడు రోజుల పర్యటన నిమిత్తం వచ్చాడు. అయితే మరో రెండు రోజులు పొడిగించాడు. భారత్‌లోని వివిధ రంగాల ప్రముఖులను, క్రికెట్, ఫుట్‌బాల్, సినీ స్టార్లను కలుసుకున్నాడు. ముంబైలో సచిన్, మెస్సీల భేటీ వాంఖెడే మైదానానికే వన్నె తెచ్చింది. బాలీవుడ్ స్టార్లు షారుక్ ఖాన్, కరీనా కపూర్, భారత ఫుట్‌బాల్ మాజీ కెపె్టన్ సునీల్ ఛెత్రి తదితరులు మెస్సీని కలిసిన వారిలో ఉన్నారు. మంగళవారం దేశీ కార్పోరేట్ సంస్థ రిలయన్స్ యాజమాన్యం వంతారాలో అచ్చెరువొందే సదుపాయాలతో ఏర్పాటు చేసిన వన్యప్రాణుల సంరక్షిత ప్రాంతాన్ని సందర్శించాడు. ఈ సందర్భంగా పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ... మెస్సీకి ఆత్మీయ స్వాగతం పలికి ఆతిథ్యమిచ్చాడు. ప్రముఖ క్రీడా ఉపకరణాల సంస్థ అడిడాస్ నిర్వహించిన ఫొటో షూట్లోనూ పాల్గొన్నాడు. ఈ ఫొటో షూట్లో మెస్సీతోపాటు తెలంగాణ స్టార్ బాక్సర్, ప్రపంచ మాజీ చాంపియన్ నిఖత్ జరీన్, క్రికెటర్లు కుల్దీప్ యాదవ్, రేణుక సింగ్, పారాథ్లెట్స్ నిశాద్ కుమార్, సుమింత్ అంటిల్ పాల్గొన్నారు.
అంధుల మహిళల క్రికెట్ జట్టుకు సచిన్ అభినందన
ముంబై: అంధుల మహిళల టి20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టును క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభినందించాడు. తొలిసారి నిర్వహించిన ఈ మెగాటోర్నీలో భారత జట్టు అజేయంగా ట్రోఫీ చేజిక్కించుకుంది. తాజాగా వరల్డ్‌కప్ నెగ్గిన భారత జట్టు... మంగళవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సచిన్‌ను కలిసింది. ఈ సందర్భంగా ప్రపంచకప్‌లో మన అమ్మాయిలు చూపిన ప్రతిభాపాటవాలను మాస్టర్ బ్లాస్టర్ కొనియాడాడని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ‘కఠోర శ్రమ, అకుంఠిత దీక్షతోనే మన జట్టు ప్రపంచకప్ గెలిచింది. ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు కూడా ఇదే నిలకడ కొనసాగిస్తూ... మరిన్ని విజయాలు సాధించాలి. ఈ విజయం అందరి బాధ్యతను మరింత పెంచింది. ప్రపంచ కప్ ట్రోఫీ ఎంతో మందిలో స్ఫూర్తి నింపింది’ అని సచిన్ పేర్కొన్నాడని నిర్వాహకులు తెలిపారు.వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టు కెపె్టన్ దీపిక మాట్లాడుతూ... ‘సచిన్ మాటలు మాకు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. మేము మైదానంలోకి దిగిన ప్రతిసారీ ఎంతో అంకితభావం, ఆత్మవిశ్వాసంతో ఆడాం. దానికి తగ్గ ప్రతిఫలం వరల్డ్ కప్ రూపంలో దక్కింది. సచిన్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వినడంతో మా మనసు ఉప్పొంగుతోంది’ అని దీపిక పేర్కొంది.
కేరీ సూపర్ సెంచరీ
అడిలైడ్: వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (143 బంతుల్లో 106; 8 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక ‘యాషెస్ సిరీస్’ మూడో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే తొలి రెండు టెస్టులు గెలిచి 2–0తో ఆధిక్యంలో ఉన్న ఆ్రస్టేలియా... సిరీస్ చేజిక్కించుకునే దిశగా కీలక పోరులోనూ మంచి ప్రదర్శన చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా... బుధవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. అలెక్స్ కేరీ ‘శత’క్కొట్టగా... ఉస్మాన్ ఖ్వాజా (126 బంతుల్లో 82; 10 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గాయం కారణంగా గత రెండు టెస్టులకు దూరమైన ఆ్రస్టేలియా రెగ్యులర్ కెపె్టన్ ప్యాట్ కమిన్స్ ఈ మ్యాచ్ బరిలోకి దిగగా... టాస్ వేయడానికి 45 నిమిషాల ముందు స్టీవ్ స్మిత్ అనూహ్యంగా జట్టు నుంచి తప్పుకున్నాడు. అనారోగ్యం కారణంగా అతడు ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడని క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) వెల్లడించింది. ఐపీఎల్–2026 మినీ వేలంలో రికార్డు ధర దక్కించుకున్న పేస్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టగా... కార్స్, జాక్స్ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. కేరీ కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై భారీ జన సందోహం మధ్య తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో జేక్ వెదరాల్డ్ (18)ను ఆర్చర్ అవుట్ చేయగా... మరుసటి ఓవర్లో ట్రావిస్ హెడ్ (10) కూడా వెనుదిరిగాడు. తన శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడిన హెడ్‌ను కార్స్ బుట్టలో వేసుకున్నాడు. ఈ దశలో లబుషేన్ (19)తో కలిసి ఉస్మాన్ ఖ్వాజా కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. స్మిత్ గైర్హాజరీతో చివరి నిమిషంలో జట్టులో చోటు దక్కించుకున్న ఖ్వాజా చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. అయితే లంచ్ అనంతరం ఆర్చర్ మూడు బంతుల వ్యవధిలో రెండు వికెట్లు పడగొట్టి మరోసారి ఆసీస్‌ను కష్టాల్లోకి నెట్టాడు. అతడి ధాటికి లబుషేన్, హెడ్ పెవిలియన్ బాటపట్టారు. దీంతో ఆసీస్ 94/4తో నిలిచింది. ఈ దశలో అడిలైడ్ ‘లోకల్ బాయ్’ కేరీ గొప్ప సంయమనం కనబర్చాడు. మరో ఎండ్‌లో ఖ్వాజా కూడా పట్టువదలకుండా ప్రయతి్నంచాడు. ఈ జంట ఐదో వికెట్‌కు 91 పరుగులు జత చేసింది. తొలి రోజు ఆటకు రికార్డు స్థాయిలో 56,298 మంది అభిమానులు హాజరయ్యారు. అడిలైడ్ మైదానంలో ఇదే అత్యధికం. ‘ఈ రోజుల్లో ఇంత పెద్ద సంఖ్యలో అభిమానులు టెస్టు మ్యాచ్ చూసేందుకు తరలి రావడం అద్భుతంగా ఉంది. సొంత మైదానంలో 56 వేల పైచిలుకు జనం ముందు సెంచరీ చేయడం ఎంతో ప్రత్యేకం’ అని కేరీ అన్నాడు. జోష్ ఇన్గ్లిస్తో ఆరో వికెట్‌కు 59 పరుగులు జోడించిన కేరీ... ఎనిమిదో వికెట్‌కు మిచెల్ స్టార్క్ (63 బంతుల్లో 33 బ్యాటింగ్; 4 ఫోర్లు)తో కలిసి 50 పరుగులు జోడించాడు. 135 బంతుల్లో ‘యాషెస్ సిరీస్’ల్లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్న కేరీ... కాసేపటికే పెవిలియన్ చేరాడు. స్టార్క్‌తో పాటు లయన్ (18 బంతుల్లో 0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. తొలి రోజు అడిలైడ్‌లో 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా... నేడు మరింత ఎండ తీవ్రత ఉండనుంది. సిడ్నీ బాండీ బీచ్‌లో జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి సంతాపంగా ఇరు జట్ల ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో చేతికి నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగారు.
న్యూస్ పాడ్‌కాస్ట్
ఆంధ్రప్రదేశ్‌లో కోటి సంతకాల సమరం... కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ మహా ఉద్యమం.. నేడు గవర్నర్‌కు కోటి సంతకాల ప్రతులు అందజేయనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఫేక్ సొసైటీతో భూములు కబ్జా చేయడానికి కుట్ర... విజయవాడలో 42 మంది పేదల ఇళ్ల కూల్చివేత బాబు సర్కారు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్‌లో పోటెత్తిన కోటి సంతకాల ర్యాలీ. కోటి మంది చేసిన సంతకాల ప్రతులతో జిల్లా కేంద్రాలలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీలు
ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టే్ట్ రివర్స్... భారీగా క్షీణించిన స్థిరాస్తుల క్రయవిక్రయాలు, అవసరానికి అమ్ముకోలేక ప్రజల అవస్థలు
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ ఉక్కు పరిశ్రమకు ఉరి!. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు శరవేగంగా అడుగులు
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ ఉక్కు పరిశ్రమకు ఉరి!. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు శరవేగంగా అడుగులు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు... కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర మంత్రివర్గం
విద్యార్థులకు నాసిరకం స్కూల్ బ్యాగులు, బూట్లు... ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో తీవ్ర ఇక్కట్లు
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ కక్షపూరిత విధానాలకు వ్యతిరేకంగా ‘కోటి’ గళాల గర్జన...
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడానికే అంకెల గారడీ. చంద్రబాబు జీఎస్డీపీ ముందస్తు అంచనాలపై వైఎస్ జగన్ ధ్వజం
బిజినెస్
డ్రైవర్ల పంట పండించే ‘భారత్ ట్యాక్సీ’
దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 1, 2026 నుంచి రవాణా విభాగంలో ఒక కొత్త విప్లవం రాబోతోంది. ఇప్పటివరకు ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ దిగ్గజాల ఆధిపత్యంలో ఉన్న ఆన్లైన్ ట్యాక్సీ మార్కెట్లోకి ప్రభుత్వ మద్దతుతో ‘భారత్ ట్యాక్సీ’(Bharat Taxi) సర్వీసులు అందుబాటులోకి రాబోతున్నాయి. అధిక ఛార్జీలు, క్యాన్సిలేషన్ సమస్యలతో విసిగిపోయిన ప్రయాణికులకు, తక్కువ కమిషన్లతో సతమతమవుతున్న డ్రైవర్లకు ఇది ప్రత్యామ్నాయంగా నిలవనుంది.భారత్ ట్యాక్సీప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ యాప్ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) తరహాలో పనిచేసే అవకాశం ఉంది. ఇది ఒక ప్రైవేట్ లాభాపేక్ష కలిగిన సంస్థలా కాకుండా డ్రైవర్లను, ప్రయాణికులను నేరుగా అనుసంధానించే వేదికగా పనిచేస్తుంది. ఇందులో కేవలం కార్లు మాత్రమే కాకుండా ఆటోలు, బైక్ టాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇది ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నడుస్తుంది కాబట్టి భద్రత, పారదర్శకత ఎక్కువగా ఉంటాయి.డ్రైవర్లకు చేకూరే ప్రయోజనాలుప్రస్తుతం ఓలా, ఉబర్ వంటి సంస్థలు డ్రైవర్ల సంపాదనలో 25% నుంచి 30% వరకు కమిషన్ రూపంలో తీసుకుంటున్నాయి. దీనివల్ల డ్రైవర్లకు గిట్టుబాటు కావడం లేదని అభిప్రాయాలున్నాయి. భారత్ ట్యాక్సీ ఈ విధానాన్ని పూర్తిగా మార్చేయనుంది. ప్రతి రైడ్ ద్వారా వచ్చే ఆదాయంలో 80% నేరుగా డ్రైవర్‌కే చెందుతుంది. మిగిలిన 20% నిర్వహణ ఖర్చులు, ఇతర పన్నులకు పోతుంది. తక్కువ కమిషన్ భారం వల్ల డ్రైవర్ల రోజువారీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ప్రభుత్వ అనుసంధానంతో ఉండటం వల్ల పేమెంట్స్ విషయంలో జాప్యం తగ్గుతుంది.ప్రయాణికులకు కలిగే లాభాలుప్రయాణికులు తరచుగా ఎదుర్కొనే సర్జ్ ప్రైసింగ్ (రద్దీ సమయంలో ఎక్కువ ధరలు), డ్రైవర్ల రైడ్ క్యాన్సిలేషన్లకు భారత్ ట్యాక్సీ చెక్ పెట్టనుంది. కంపెనీ తీసుకునే కమిషన్ తగ్గడం వల్ల సహజంగానే ప్రయాణికులపై పడే భారం తగ్గుతుంది. సాధారణ సమయాల్లోనూ, రద్దీ సమయాల్లోనూ స్థిరమైన ధరలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన డ్రైవర్లు ఉండటం వల్ల ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించవచ్చు.భారత్ ట్యాక్సీ రాకతో రవాణా రంగంలో గుత్తాధిపత్యానికి తెరపడనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డ్రైవర్ల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కడం, ప్రయాణికులకు తక్కువ ధరలో సురక్షితమైన ప్రయాణం లభించడమే ఈ యాప్ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు. జనవరి 1 నుంచి ఢిల్లీలో ప్రారంభం కానున్న ఈ ప్రయోగం విజయవంతమైతే త్వరలోనే దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలకు విస్తరించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: టెలికాం కంపెనీల మరో ‘ధరల’ బాదుడు
టెలికాం కంపెనీల మరో ‘ధరల’ బాదుడు
భారతీయ టెలికాం వినియోగదారులకు మోర్గాన్ స్టాన్లీ నివేదిక షాకిచ్చే వార్తను అందించింది. దేశంలోని ప్రముఖ ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లయిన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా తమ టారిఫ్ ధరలను 2026లో మరోసారి పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు ఈ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ అంచనా వేసింది.ఎంత పెరగవచ్చు?మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీలు సగటున 20 శాతం వరకు టారిఫ్ ధరలను పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే జులై 2024లో ఈ మూడు కంపెనీలు తమ ప్లాన్ ధరలను 11 నుంచి 25 శాతం వరకు పెంచిన సంగతి తెలిసిందే. 2026 నాటి పెంపుతో ఒక వినియోగదారుని నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) గణనీయంగా పెరగాలని కంపెనీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.టారిఫ్‌లు పెంచడానికి కారణాలుదేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి కంపెనీలు వేల కోట్ల రూపాయలను వెచ్చించాయి. ఈ పెట్టుబడులపై రాబడిని (ROI) రాబట్టడం ఇప్పుడు అనివార్యంగా మారింది. టెలికాం రంగం లాభదాయకంగా ఉండాలంటే ‘ఒక్కో వినియోగదారుని నుంచి వచ్చే సగటు ఆదాయం’(ARPU) కనీసం రూ.300 దాటాలని సంస్థలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఇది రూ.200 - రూ.210 స్థాయిలో ఉంది. ప్రభుత్వానికి టెలికాం కంపెనీలు చెల్లించాల్సిన స్పెక్ట్రమ్ ఫీజులు, ఇతర రుణాలను తీర్చుకోవడానికి కంపెనీలకు అదనపు నగదు ప్రవాహం అవసరం.సామాన్యులపై ప్రభావంనిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి ఈ టారిఫ్ పెంపు భారంగా మారనుంది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో కనీసం 3 నుంచి 4 మొబైల్ కనెక్షన్లు ఉంటాయి. 20% పెంపు అంటే వారి నెలవారీ డిజిటల్ ఖర్చు భారీగా పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ధరలకు ఇంటర్నెట్ వాడుతున్న వారిపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. డేటా ఖరీదైనదిగా మారితే డిజిటల్ అక్షరాస్యత మందగించే ప్రమాదం ఉంది. గత జులైలో జరిగిన ధరల పెంపు వల్ల చాలా మంది తమ సెకండరీ సిమ్ కార్డులను రీఛార్జ్ చేయడం మానేశారు. 2026లో కూడా ఇదే ధోరణి కొనసాగవచ్చు.ఇదీ చదవండి: రైల్వే వాలెట్ నుంచి నగదు విత్‌డ్రా కుదరదు
రైల్వే వాలెట్ నుంచి నగదు విత్‌డ్రా కుదరదు
భారతీయ రైల్వే ప్రయాణికులకు అత్యంత వేగంగా టికెట్ బుకింగ్ సేవలను అందించేందుకు ప్రవేశపెట్టిన ‘ఐఆర్సీటీసీ (IRCTC) ఈ-వాలెట్’ అంశంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో వివరణ ఇచ్చారు. వాలెట్లో డిపాజిట్ చేసిన సొమ్మును తిరిగి వెనక్కి తీసుకోవడం (Withdrawal) సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ విధానం వెనుక ఉన్న కారణాలు, దీనివల్ల రైల్వేకు చేకూరే ప్రయోజనాలను చూద్దాం.లోక్‌సభలో మంత్రి వివరణలోక్సభలో ఒక సభ్యుడు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ కింది అంశాలను వెల్లడించారు.ఐఆర్సీటీసీ వాలెట్లో ఉన్న డబ్బును కేవలం రైలు టికెట్ల బుకింగ్‌కు మాత్రమే ఉపయోగించుకోవాలి.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేసిన ‘ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్’ నిబంధనల ప్రకారం.. ఈ తరహా క్లోజ్డ్ వాలెట్ల నుంచి నగదును విత్‌డ్రా చేయడానికి వీల్లేదు.ఒకవేళ వినియోగదారుడు తన ఐఆర్సీటీసీ వాలెట్ ఖాతాను పూర్తిగా మూసివేయాలని నిర్ణయించుకుంటే మాత్రమే అందులోని నగదును వారి సోర్స్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తారు.విత్‌డ్రాకు అనుమతించకపోవడానికి కారణాలుఐఆర్సీటీసీ వాలెట్ అనేది ఒక క్లోజ్డ్ లూప్ సిస్టమ్. అంటే ఏ సంస్థ అయితే వాలెట్ సేవలను అందిస్తుందో ఆ సంస్థ సర్వీసులను మాత్రమే ఆ నగదును వాడాలి. దీన్ని నగదుగా మారిస్తే అది బ్యాంకింగ్ కార్యకలాపాల కిందకు వస్తుంది. దానికి వేరే రకమైన నిబంధనలు ఉంటాయి.నగదు విత్‌డ్రా సౌకర్యం ఉంటే దీన్ని కొందరు నగదు బదిలీకి లేదా ఇతర మనీ లాండరింగ్ అవసరాలకు వాడే అవకాశం ఉంటుంది. కేవలం ప్రయాణికుల అవసరాల కోసమే పరిమితం చేశారు.నిత్యం వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగే ఐఆర్సీటీసీలో ప్రతి చిన్న మొత్తాన్ని వెనక్కి పంపడం వల్ల అకౌంటింగ్ ప్రక్రియ సంక్లిష్టంగా మారుతుంది.రైల్వేకు కలిగే ప్రయోజనాలులక్షలాది మంది ప్రయాణికులు వాలెట్లో ఉంచే సొమ్ము రైల్వే వద్ద ముందే జమ అవుతుంది. ఈ ‘ఫ్లోట్ మనీ’ ద్వారా రైల్వేకు వడ్డీ రూపంలో లేదా వర్కింగ్ క్యాపిటల్ రూపంలో అదనపు ప్రయోజనం కలుగుతుంది.ప్రయాణికులు బ్యాంక్ కార్డులు లేదా యూపీఐ వాడితే రైల్వే కొంత సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. వాలెట్ వాడకం వల్ల ఈ లావాదేవీ ఖర్చులు తగ్గుతాయి.తత్కాల్ సమయాల్లో పేమెంట్ గేట్వేలు విఫలమయ్యే అవకాశం ఉంటుంది. కానీ వాలెట్ లావాదేవీలు అంతర్గతంగా జరుగుతాయి కాబట్టి, సర్వర్‌పై భారం తగ్గి బుకింగ్ వేగం పెరుగుతుంది.ప్రయాణికులకు కలిగే ప్రయోజనాలుఐఆర్సీటీసీ వాలెట్ వాడటం వల్ల ప్రయాణికులకు ప్రధానంగా సమయం ఆదా అవుతుంది. సాధారణంగా బ్యాంక్ అకౌంట్ లేదా కార్డుల ద్వారా చెల్లింపులు చేసేటప్పుడు పేమెంట్ గేట్‌వే రిడైరెక్షన్ కోసం వేచి చూడాల్సి ఉంటుంది. కానీ వాలెట్ ద్వారా కేవలం సెకన్లలోనే టికెట్ బుకింగ్ పూర్తవుతుంది. ఇది ముఖ్యంగా తత్కాల్ టికెట్లు బుక్ చేసే సమయంలో ఎంతో కీలకం. పేమెంట్ ఫెయిల్యూర్స్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉండటంతో తత్కాల్ టికెట్లు దొరికే అవకాశం పెరుగుతుంది. వీటన్నింటికీ మించి ఒకవేళ టికెట్ క్యాన్సిల్ చేసినా లేదా వెయిటింగ్ లిస్ట్ కారణంగా బుకింగ్ కాకపోయినా దానికి సంబంధించిన రీఫండ్ సొమ్ము వెంటనే వాలెట్‌కు చేరుతుంది. సాధారణ బ్యాంక్ ట్రాన్సాక్షన్లలా దీని కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదు.ప్రతికూలతలుమరోవైపు ఈ వాలెట్ విధానంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. వాలెట్లో డిపాజిట్ చేసిన సొమ్మును తిరిగి బ్యాంక్ ఖాతాకు విత్‌డ్రా చేసుకునే వీలు లేకపోవడంతో ప్రయాణ ప్రణాళికలు లేనప్పుడు ఆ డబ్బు వ్యాలెట్‌లోనే నిలిచిపోతుంది. దీనివల్ల అవసరానికి ఆ నగదును వాడుకోలేరు. అలాగే ఈ డబ్బు వినియోగానికి పరిమితులు ఉంటాయి. దీన్ని కేవలం ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్‌లో టికెట్లు కొనడానికి తప్ప ఇతర వ్యక్తిగత అవసరాలకు లేదా ఇతర వెబ్సైట్లలో వాడలేం. ఒకవేళ వాలెట్లోని డబ్బును తిరిగి పొందాలంటే వినియోగదారుడు తన ఐఆర్సీటీసీ వాలెట్ ఖాతాను శాశ్వతంగా మూసివేయాల్సి ఉంటుంది. నగదు కోసం ఖాతాను రద్దు చేసుకోవాల్సి రావడం ప్రయాణికులకు కొంత అసౌకర్యంగా మారుతుంది.ఇదీ చదవండి: వ్యాపార సామ్రాజ్యంలో రారాజు ఎవరంటే..
వ్యాపార సామ్రాజ్యంలో రారాజు ఎవరంటే..
భారత కార్పొరేట్ రంగంలో 2000 సంవత్సరం తర్వాత స్వయంకృషితో ఎదిగిన పారిశ్రామికవేత్తల జాబితా విడుదలైంది. ఇందులో సంప్రదాయ వ్యాపార దిగ్గజాలను వెనక్కి నెట్టి టెక్ ఆధారిత స్టార్టప్‌లు దూసుకుపోతున్నాయి. ఐడీఎఫ్సీ ఫస్ట్ ప్రైవేట్, హురున్ ఇండియా సంయుక్తంగా విడుదల చేసిన ‘టాప్-200 వ్యాపారవేత్తల జాబితా 2025’లో జొమాటో మాతృసంస్థ ఎటర్నెల్ సీఈఓ దీపిందర్ గోయల్ అగ్రస్థానంలో నిలిచారు.ఇప్పటివరకు రిటైల్ రంగంలో తిరుగులేని శక్తిగా ఉన్న డీమార్ట్ (అవెన్యూ సూపర్‌మార్ట్స్) అధినేత రాధాకృష్ణ దమానీని దీపిందర్ గోయల్ వెనక్కి నెట్టి రెండో స్థానానికి పరిమితం చేశారు. గడిచిన ఏడాది కాలంలో ఎటర్నెల్ మార్కెట్ విలువ 27 శాతం వృద్ధి చెంది రూ. 3.2 లక్షల కోట్లకు చేరింది. ఇదే సమయంలో అవెన్యూ సూపర్‌మార్ట్స్ విలువ 13 శాతం క్షీణించి రూ.3 లక్షల కోట్లకు పడిపోయింది. దేశవ్యాప్తంగా 800 నగరాల్లో సేవలందిస్తున్న జొమాటో నెట్వర్క్ దీపిందర్‌ను ఈసారి జాబితాలో మొదటిసారి నిలపడమే కాకుండా నేరుగా అగ్రస్థానంలో కూర్చోబెట్టింది.తొలి ప్రయత్నంలోనే మూడో స్థానంప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో వ్యవస్థాపకులు రాహుల్ భాటియా, రాకేశ్ గంగ్వాల్ ఈ జాబితాలో తొలిసారి చోటు సంపాదించి ఏకంగా మూడో స్థానంలో నిలవడం విశేషం. వీరి సంస్థ ‘ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్’ మార్కెట్ విలువను రూ.2.2 లక్షల కోట్లుగా హురున్ లెక్కగట్టింది. విమానయాన రంగంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ 65 శాతం మార్కెట్ వాటాతో ఇండిగో అగ్రగామిగా దూసుకుపోతోందని ఈ నివేదిక ప్రశంసించింది.టాప్-10 సెల్ఫ్‌మేడ్ ఆంత్రప్రెన్యూర్స్ 2025ర్యాంక్వ్యాపారవేత్తలుకంపెనీ పేరు1దీపిందర్ గోయల్ఎటర్నెల్ (జొమాటో)2రాధాకృష్ణ దమానీడీమార్ట్3రాహుల్ భాటియా, రాకేశ్ గంగ్వాల్ఇండిగో4అభయ్ సోయిమ్యాక్స్ హెల్త్ కేర్5శ్రీహర్ష మాజేటి, నందన్ రెడ్డిస్విగ్గీ6దీప్ కర్లా, రాజేశ్ మాగౌమేక్ మై ట్రిప్7యాశిష్ దహియా, అలోక్ బన్సల్పాలసీ బజార్8విజయ్ శేఖర్ శర్మపేటీఎం9ఫల్గుణి నాయర్, అద్వైత్ నాయర్నైకా10పీయూష్ బన్సల్ & టీమ్లెన్స్‌కార్ట్
ఫ్యామిలీ
గుర్రపుడెక్కతో కళాకృతులు..!
గుర్రపుడెక్క (వాటర్ హైసింత్)... నదీ ప్రవాహాలు, చెరువులు, కుంటల్లో సహజంగా పెరిగే కలుపు మొక్క. నీటి ప్రవాహానికి ఆటంకం కలిగించడం, నీటి కాలుష్యానికి కారకమవుతుండడంతో వీటి పెరుగుదలను నివారించేందుకు స్థానిక సంస్థలు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇదే సమస్య గోదావరి జిల్లాలు, ముఖ్యంగా నది పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. కానీ అస్సాం సరికొత్త ఆలోచనతో చూపిన పరిష్కార మార్గం అన్ని రాష్ట్రాలకు ఉపయోగపడటమే గాక నదులు, చురువులు పరిశుభ్రంగా ఉంటాయి కూడా. మరి అస్సాం ఎలా ఈ గుర్రపుడెక్క సమస్యకు అర్థవంతంగా పరిష్కారం మార్గం చూపిందో తెలుసుకుందామా..!ఎన్నో అనర్థాలకు దారితీసే ఈ కలుపు మొక్కను అర్థవంతంగా మార్చి మహిళలకు పని కల్పిస్తూ దాని ద్వారా వారి ఆర్థిక చేయూతకు బాటలు వేసింది అస్సాం స్టేట్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ (ఏఎస్‌ఆర్‌ఎల్‌ఎం). ఈ గుర్రపు డెక్కను పెకిలించి వాటిని ప్రాసెస్ చేస్తూ ఎన్నో కళాకృతులను తయారు చేసేందుకు పెద్ద కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అస్సాం రాష్ట్రం మాజూలీ ద్వీపంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఏఎస్‌ఆర్‌ఎల్‌ఎం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తూ వారికి కళా ఉత్పత్తుల తయారీలో మెరికలుగా తీర్చిదిద్దుతోంది. ఈ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో వ్యాపారాన్ని విస్తృతం చేసేందుకు వ్యూహాత్మక కార్యాచరణకు సిద్ధమవుతోంది.బ్రహ్మపుత్రలో విరివిగా...ప్రపంచంలోని ఐదు అతిపెద్ద నదుల్లో బ్రహ్మపుత్ర ఒకటి. ఊహకందని వేగం, ప్రవాహం దాని సొంతం. దాదాపు ఏడాది పొడవునా ఈ నది ప్రవహిస్తూనే ఉంటుంది. అస్సాం రాష్ట్రంలోని మెజార్టీ ప్రాంతంలో ఈ నది ప్రవహిస్తుండగా... మాజూలీ ద్వీపం చుట్టూ విస్తరించి ఉండడం... నీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడంతో వాటర్ హైసింత్ కూడా ఇక్కడ దట్టంగా అల్లుకుని ఉంటుంది. ఈ పరిస్థితే ఇక్కడి మహిళా సంఘాలకు ఒక అవకాశంగా పరిణమించింది. అస్సాం గ్రామీణాభివృద్ధి శాఖ రూపొందించిన ప్రత్యేక వ్యూహంతో కళా ఉత్పత్తుల తయారీకి కీలక మలుపుగా మారింది.మూడు దశల్లో ప్రక్రియ...వాటర్ హైసింత్ నుంచి కళా ఉత్పత్తుల తయారీ నాలుగు దశల్లో ఉంటుంది. ముందుగా నది నుంచి వాటర్ హైసింత్ సేకరణ మొదటి దశలో చేపడుతుండగా... రెండోదశలో వాటి ఆకులను కత్తిరించి ఆరబెట్టడం... పొడిగా మారిన తర్వాత అల్లికకు అనువుగా మార్చేలా ప్రాసెస్ చేయడం... ఆ తర్వాత వాటిని మహిళలకు అందించే కళాత్మక పనులను కొనసాగించడం... తయారైన వస్తువులను మార్కెటింగ్ చేయడం లాంటి ప్రక్రియను మహిళా సంఘాల ద్వారా నిర్వహిస్తారు. అల్లికల ద్వారా పర్సులు, బుట్టలు, టేబుల్ మాట్స్, హ్యాండ్ బ్యాగులు, ల్యాప్‌టాప్ బ్యాగులు, బాటిల్ కేరియర్లు, హోమ్ డెకర్ ఐటమ్స్‌ను తయారు చేస్తున్నారు. తయారైన తర్వాత వాటికి పాలిషింగ్ చేయడంతో ఎంతో ఇంపుగా కనిపిస్తాయి. ఇవి పూర్తిగా పర్యావరణ హితమైనవి కావడంతో మార్కెట్లో వీటికి క్రేజ్ ఉంది. అయితే ఈ తయారీ ప్రక్రియంతా ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల పర్యవేక్షణలోనే జరుగుతుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ ప్రారంభ దశలో ఉన్నప్పటికీ... ఉత్పత్తి సామర్థ్యం పెరిగిన తర్వాత ఇతర ప్రాంతాలకు సైతం ఎగుమతి చేసేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అస్సాంలోని మాజూలీ నుంచి – చిలుకూరి అయ్యప్ప, సాక్షి (చదవండి: ఆ కారు కొన్నప్పుడు బాధపడ్డా..కానీ అదే నా బిడ్డ ఆరోగ్యానికి శ్రీరామరక్ష..!)
మనసు దోచే వరమాల..! పూలతో చేసింది కాదు..
ఈ వెడ్డింగ్ సీజన్ ట్రెండ్... ‘క్రోచెట్ వరమాల’. కాస్త వెనక్కి వెళితే... వివాహం చేసుకోబోయే ఒక జంట నుంచి ఒక మహిళకు ‘వరమాల’ తయారుచేయాల్సిందిగా ఆర్డర్ వచ్చింది.‘ఎప్పుడూ పూలతోనే చేస్తే ఏం వెరైటీ ఉంటుంది. కొత్తగా చేయాలి’ అని ఆలోచించింది. ఆమె ఆలోచనలో నుంచి వచ్చిందే... క్రోచెట్ వరమాల. మృదువైన రంగుల ఉన్ని దారాలను ఉపయోగించి ఆమె తయారుచేసిన ‘వరమాల’ ఆహా అనిపించింది. వరమాల మేకింగ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తరువాత ఈ వరమాలకు ‘క్రోచెట్ వరమాల’గా పేరు వచ్చింది. ఆ తరువాత ట్రెండ్‌గా మారింది. ఇలాంటి అందాల వరమాలను మీరు కూడా తయారుచేయాలనుకుంటున్నారా? ‘క్రోచెట్’ హ్యాండిల్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోను చూసి నేర్చుకోండి. వధూవరులకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వండి!. View this post on Instagram A post shared by Hot_Knot (@hot_knot_by_sumee) (చదవండి: నెలగంట కట్టడం అంటే..? అది పండుగ రాకకు సంకేతమా..?)
పిల్లల్ని కలిసే హక్కు తండ్రిగా నాకు లేదా?
నాకు ఇద్దరు కూతుళ్ళు. వయసు 8ఏళ్ళు, 6 ఏళ్ళు. మేము విడిపోయి 2 సంవత్సరాలవుతోంది. పిల్లలు నా భార్య వద్దనే ఉన్నారు. వాళ్లని చూడాలని ఉంది కానీ ఆమె నాకు చూపించకపోగా నామీద క్రిమినల్ కేసు, మెయింటెనెన్స్ కేసు వేసింది. పిల్లల్ని చూడాలంటే వారికి నానుంచి హాని ఉంది అని చెప్తుంది. పిల్లల్ని ఒకసారి కోర్టుకు తెస్తే, జడ్జిగారికి పిల్లల చేత ‘మా నాన్న మంచివాడు కాదు’ అని చెప్పించారు. నిజానికి పిల్లలు నాతో చాలా బాగా ఉండేవారు. తండ్రిగా పిల్లల్ని కలిసే హక్కు నాకు లేదా? నాతో ఎంతోబాగుండే పిల్లలు ఇలా అయ్యారు అంటే, తనే నేర్పించింది అని అనిపిస్తుంది. ఏం చేయాలో చెప్పగలరు.– సంపత్, విశాఖపట్నంఇది మీ ఒక్కరి సమస్య మాత్రమే కాదు. చాలా కేసులలో ఇలాంటి ధోరణి చూస్తుంటాము. అనేక కారణాలు ఉంటాయి. ‘‘తండ్రిగా పిల్లల్ని కలిసే హక్కు నాకు లేదా?’’ అని అడిగారు. తల్లిదండ్రులకి పిల్లలపై హక్కు మాత్రమే కాదు బాధ్యత ఉంటుంది. తల్లితండ్రుల ప్రేమ, ఆదరణ సమానంగా పొందే హక్కు పిల్లలకు ఉంటుంది. అంటే ప్రథమంగా అది పిల్లల హక్కు. మీ హక్కు కాదు. చట్టాలు చిన్నపిల్లల శ్రేయస్సు కోసమే ఉన్నాయి. వారి శ్రేయస్సు ముందు ఎవరి హక్కు అయినా చిన్నదే! భార్యాభర్తలు విడిపెయిన సందర్భాలలో పిల్లలను ఆయుధంగా వాడుకోవాలి అనుకోవడం దాదాపుగా అన్ని కేసులలో చూస్తుంటాము. అది తప్పు. భార్యాభర్తలు ఒకరికొకరు మంచివారు కాక΄ోయి ఉండొచ్చు. అంతమాత్రాన మంచి తల్లిదండ్రులు కాదని చెప్పలేము. విడి΄ోయిన తర్వాత పిల్లలు ఎవరి దగ్గర అయితే ఉంటారో వారు సాధారణంగానే అవతల వారిపై వ్యతిరేక భావనను పిల్లలలో పెంచుతుంటారు. విజ్ఞత కోల్పోతుంటారు. చిన్నారుల పసి హృదయాలపై వారు ఎంత ప్రభావం చూపిస్తున్నారో అర్థం చేసుకోలేనంత స్థాయిలో ప్రవర్తన మారి΄ోతూ ఉంటుంది. మీ విషయానికి వస్తే, రెండు సంవత్సరాల నుంచి దూరంగా ఉంటున్న మీరు పిల్లలు కావాలి అని కేసు ఎందుకు వేయలేదు? పిల్లల శ్రేయస్సు కోసం మీరు ఏం చేశారు? మీ బాధ్యతలను మీరు నిర్వర్తిస్తున్నారా? ఇలాంటివి కోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది. కేసులో లబ్ధి కోసం ఉన్నట్లుండి పిల్లలపై ప్రేమ ఉన్నట్టు చూపించుకోవాలి అనుకుంటే కోర్టులు నమ్మవు! ఇప్పటికైనా పిల్లలపై బాధ్యతను నెరవేరుస్తూ, వారికి కస్టడీ మీకు కూడా కావాలి అని గార్డియన్స్ అండ్ వర్డ్స్ చట్టం కింద కేసు వేయవచ్చు. పిల్లల అభిప్రాయాలను బలవంతంగా మార్చారు అని మీరు ఖచ్చితంగా అనుకుంటే, మీ ఇద్దరు పిల్లలను సైకాలజిస్ట్ వద్దకు పంపాలి అని మధ్యంతర దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అందుకు తగిన కారణాలను చూపాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు ఎవరైనా పిల్లల మానసిక స్థితిని దృష్టిలో పెట్టుకొని వారితో మాట్లాడాలి. తల్లిపైన లేదా తండ్రిపైన విష ప్రచారం చేయకూడదు. అలా చేస్తున్నవారికి నా విన్నపం ఏంటంటే: మీరు కేసులు గెలవచ్చు కానీ మున్ముందు పిల్లల భవిష్యత్తును కోల్పోతారు. జాగ్రత్త వహించాలి. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు.) (చదవండి: అలాంటి శోకం ఎవ్వరికి వద్దని..30 ఏళ్లుగా ట్రాఫిక్ పోలీసుగా సేవ!)
గాన మాధుర్యంతో దూసుకుపోతున్న అమిత
విశాఖపట్నం: పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టుగా, చిన్న వయసులోనే తన పాటలతో ఎందరో అభిమానులను సంపాదించుకుంది పీఎం పాలేనికి చెందిన చింతకాయల అమిత. ప్రస్తుతం బీటెక్ చదువుతున్న ఈ యువ గాయని తన మధురమైన గాత్రంతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది. ఐదో తరగతి చదువుతున్నప్పుడే పలు టీవీ షోలలో పాల్గొని తన గాత్ర మాధుర్యాన్ని పరిచయం చేసింది. ఏ పాటనైనా అవలీలగా ఆలపిస్తూ, అంచెలంచెలుగా తన ప్రస్థానాన్ని ముందుకు సాగిస్తోంది. తాత నుంచి వారసత్వంగా సంగీతం అమిత తాతయ్య..పూర్ణ చంద్ర రావు ప్రముఖ సంగీత విద్వాంసులు, హార్మోనీ ప్లేయర్‌గా మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి. ఆయన స్ఫూర్తితోనే అమిత శ్రీకాకుళంలో గురువు దుర్గా ప్రసాద్ వద్ద సంగీతాన్ని నేర్చుకుని తన కళకు మెరుగులు దిద్దుకుంది. సంగీతం నేర్చుకుంటున్న సమయంలో ఐదో తరగతి చదువుతుండగా ఒక చానల్లో నిర్వహించిన ‘అమూల్ బోల్ బేబీ బోల్’ కార్యక్రమంలో పాల్గొని మొదటిసారిగా తన ప్రతిభను చాటుకుంది. ఆరో తరగతి చదువుతున్నప్పుడు మరో టీవీ చానల్లో నిర్వహించిన ‘సరిగమప లిటిల్ చాంప్స్’ లో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది. 2023లో ప్రసారమైన ‘సూపర్ సింగర్’ టీవీ షోలో ఫైనలిస్ట్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ‘ఖడ్గం’ సినిమాలోని ‘అహ అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయే’ పాటకు స్టేజీపై పాడుతూ మంచి గుర్తింపు పొందింది. మిలియన్ వ్యూస్‌తో దూకుడు అమిత తాను పాడిన పాటలతో ఎందరినో ఆకట్టుకోవడమే కాకుండా, ప్రైవేట్ ఆల్బమ్స్‌తోనూ తన ప్రతిభను మరింత చాటుకుంది. ‘విడలేని ప్రేమని’, ‘రాయే రాయే పిల్లా’, ‘ముద్దుముద్దు గుంటడే నా బావగాడు’ వంటి పాటలతో సోషల్ మీడియాలో సైతం తన అభిమానులను పెంచుకుంది. ఈ పాటలు ప్రతిదీ మిలియన్ వ్యూస్‌తో దూసుకుని పోతున్నాయి. ఇటీవల విడుదలైన ‘ఉతుకు పిండు ఆరేయ్’ చిత్రంలో పాటతో మరోసారి తన గాత్ర ప్రత్యేకతను చాటుకుంది.సినిమాల్లో అవకాశం ప్రస్తుతం రెండు తెలుగు సినిమాల్లో పాటలు పాడే అవకాశం లభించినట్లు అమిత తెలిపింది. తన తండ్రి అంబేడ్కర్, విజయనగరం సర్కిల్ ఇన్స్పెక్టర్, తల్లి గౌరి తనకు అన్ని విధాలా సహకారం అందిస్తున్నారని పేర్కొంది. ఒకవైపు బీటెక్ చదువుతూనే, మరోవైపు పాటలు పాడుతూ, గ్రూప్స్‌లో ఉత్తీర్ణత సాధించడం తన లక్ష్యమని చెప్పింది. సినిమాల్లో అవకాశాలు లభించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అమిత పేర్కొంది.
అంతర్జాతీయం
చైనా-పాకిస్థాన్‌కు మధ్య చెడింది ఇక్కడే..!
‘దోస్త్ మేరా దోస్త్.. నువ్వే నా ప్రాణం’.. అంటూ ఏక కంఠంతో చెప్పిన చైనా-పాకిస్థాన్ మధ్య దోస్తీ ఇప్పుడు చెడిందా..! పాకిస్థాన్ ఆవిర్భావం నుంచి డ్రాగన్‌తో కలిసే ఉన్నా.. ఇంత సడెన్‌గా ఎందుకు చైనా దూరమవుతోంది..? షోలే సినిమాలో ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ మాదిరిగా కలిసి ఉండే చైనా-పాకిస్థాన్‌లు ఇప్పుడు విడిపోవడానికి కారణాలేమిటి..? ఇంతకాలం చైనా నుంచి ఇతోధికంగా సాయం పొందిన పాకిస్థాన్.. ఉన్నఫళంగా ఎందుకు రూట్ మార్చింది..? భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత జియోపాలిటిక్స్ ఇంత వేగంగా మారిపోవడానికి దోహదపడిన అంశాలేమిటి..? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే.. ఈ కథనం చదవాల్సిందే..సిల్క్ రోడ్ మాదిరి చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్‌ను నిర్మించింది. దీని కోసం చైనా ఎన్నో బిలియన్ల డాలర్లు ఖర్చు చేసింది. బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ అనే షీ జిన్‌పింగ్ కలను సాకారం చేసే దిశలో పాకిస్థాన్ సీపీఈసీకి సహకరించింది. అంతేకాదు.. పాకిస్థాన్‌లోని గ్వాదర్ పోర్టును చైనా అభివృద్ధి చేసి, తనకు అనుకూలంగా మలచుకోవాలనుకుంది. భారత్‌కు ధీటుగా పాకిస్థాన్‌ను ప్రపంచం ముందు నిలబెట్టే ప్రయత్నం చేసింది. అంతెందుకు.. మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్య రాజ్య సమితిలో భారత్ చేసిన ప్రతిపాదనను చైనా అడ్డుకుంది.పాక్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యలపై గళమెత్తిన ప్రతీసారి.. చైనా రొటీన్‌గా ఆధారాలేవి? అంటూ ప్రశ్నించేది. అలా పాలు-నీళ్లలా చైనా-పాకిస్థాన్ బంధం కొనసాగింది. భారత్‌కు చెక్ పెట్టేలా ఎప్పటికప్పుడు పాకిస్థాన్‌కు అధునాతన యుద్ధ విమానాలు, రక్షణ పరికరాలను సరఫరా చేయడంలో చైనా ముందంజలో ఉండేది. అంతెందుకు.. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదులు వాడే తూటలాలు.. ముఖ్యంగా స్టీల్ బుల్లెట్లు కూడా చైనా సరఫరా కావడం గమనార్హం..! సంక్షోభ సమయాల్లోనూ పాక్‌కు చైనా వెన్నంటే ఉంది.చైనా-పాకిస్థాన్‌ల చైనా బంధం దశాబ్దాలుగా కొనసాగింది. పాకిస్థాన్‌లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. పాలకులు మాత్రం చైనాకు అనుకూలంగా ఉండడం రివాజుగా మారింది. చివరకు సైనిక పాలన కొనసాగినా.. సైన్యాధికారులు చైనాకు తొత్తులగానే పనిచేసేవారు. నిజానికి చైనా మతరహిత సమాజాన్ని కోరుకుంటే.. పాకిస్థాన్ మాత్రం ఫక్తుగా ఇస్లామిక్ దేశం. ఇంకా చెప్పాలంటే.. చైనాలో మైనారిటీలుగా ఉన్న ముస్లింలపై మారణకాండ కొనసాగినా.. పాకిస్థాన్ మాత్రం చైనాకు వంతపాడేది.అంటే.. సిద్ధాంతపరంగా వేర్వేరు భావజాలాలున్నా.. ‘అవసరం’ అనే ఒకే ఒక్క పదం ఈ రెండు దేశాలను ఫ్రెండ్స్‌గా మార్చేశాయి. జియోపాలిటిక్స్ అనే రాజనీతితో ఇరుదేశాలు సఖ్యతను ప్రదర్శించాయి. బలూచిస్థాన్‌లో వ్యతిరేకత పెరిగినా.. పాకిస్థాన్ మాత్రం చైనా కోసం అణచివేత ధోరణిని కొనసాగిస్తోంది. ఇంకా చెప్పాలంటే.. బలూచిస్థాన్‌లో ఉన్న అపారమైన ఖనిజ సంపదను చైనాకు కట్టబెట్టేందుకు పాకిస్థాన్ ఇప్పుడు బలూచీలపై కత్తిదూస్తోంది. వారి ఆగ్రహ జ్వాలలకు సొంత సైన్యం, పోలీసులు బలవుతున్నా.. మొండిధోరణితో ముందుకు సాగింది.పాలు-నీళ్లుగా స్నేహ బంధంలో మునిగితేలిన చైనా-పాకిస్థాన్ ఇప్పుడు ఉప్పు-నిప్పులా మారిపోతున్నాయి. అందుకు అనేక కారణాలున్నాయని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రారంభించిన ‘ఆపరేషన్ సిందూర్’తో భారత రక్షణశాఖ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. భారత డిఫెన్స్‌తోపాటు.. అఫెన్స్ కెపాసిటీకి అగ్రదేశాలు సైతం అద్దిరిపోయాయి..! అందుక్కారణం.. ఈ రెండు అంశాల్లో భారతే టాప్ అన్నట్లుగా గణాంకాలు స్పష్టం చేశాయి. డిఫెన్స్‌లో తోపులమనుకునే ఇజ్రాయెల్, రష్యా, అమెరికా కంటే.. ఎంతో ముందంజలో ఉన్నట్లు ‘ఆపరేషన్ సిందూర్’ నిరూపించింది.అమెరికా తయారీ ఎఫ్-16, చైనా తయారీ జే-10సీ వంటి అధునాతన యుద్ధ విమానాలున్నా.. పాకిస్థాన్ చతికిలపడిపోయింది. అదే సమయంలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. దాంతో.. భారత్‌కు చెక్ పెట్టాలని అమెరికా నిర్ణయించింది. ఓవైపు సుంకాల భారం మోపుతూనే.. మరోవైపు పాకిస్థాన్‌ను పావులా వాడుకోవాలని వ్యూహాలు రచించింది. అదే సమయంలో చైనాకు పోటీగా పాకిస్థాన్‌లోని ఓ పోర్టును అభివృద్ధి చేసి, బలూచిస్థాన్‌లోని అపారమైన ఖనిజ సంపదను దోచుకోవాలని ప్లాన్ చేసింది. దాన్ని అర్థం చేసుకోకుండా.. తమకు పెద్దన్న పెద్దపీట వేస్తున్నాడనే ఉద్దేశంతో పాకిస్థాన్ ట్రంప్‌ను గుడ్డిగా నమ్మేసింది..!అమెరికాను బద్ధ శత్రువుగా భావించే చైనా.. ఇప్పుడు పాకిస్థాన్ నిర్ణయంతో షాక్ అయ్యింది. దాంతో.. పాకిస్థాన్‌ను పూర్తిగా పక్కన పెట్టేసింది. 2013 నుంచి వ్యూహాత్మకంగా గ్వాదర్ పోర్టును అభివృద్ధి చేసినా.. ఇప్పుడు పాక్‌కు దూరంగా ఉంటోంది. అయితే.. హోర్మూజ్ జలసంధి నుంచి గ్వాదర్ పోర్టు 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. చైనాకు సరఫరా అయ్యే చమురు ఈ పోర్టు మీదుగానే వస్తుంది. అక్కడి నుంచి సీపీఈసీ ద్వారా గిల్గిట్-బాల్టిస్థాన్‌కు.. అక్కడి నుంచి జిన్జియాంగ్కు చమురు చేరుకుంటుంది. వ్యూహాత్మకంగా శత్రుదేశాల యుద్ధ నౌకలను అడ్డుకునేందుకు గ్వాదర్ పోర్టును అడ్డాగా మార్చుకోవాలని చైనా భావించింది.ముఖ్యంగా అమెరికా యుద్ధ నౌకలు ఈ మార్గం మీదుగానే దక్షిణాసియాకు రావాల్సి ఉంటుంది. అయితే.. పాకిస్థాన్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి బిలియన్ల డాలర్లు ఖర్చు చేసిన చైనా.. ఇప్పుడు వాటిని అప్పుగా చూపించి, వసూలు చేసుకుంటుందా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. పైగా.. బలూచిస్థాన్, ఖైబర్ పంఖ్తుంఖ్వాల్లో రోడ్లను చైనా అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో లభించే అరుదైన ఖనిజ సంపదను అమెరికాకు ఎగుమతి చేసే దిశలో పాకిస్థాన్ అడుగులు వేస్తోంది. దీన్ని చైనా సహిస్తుందా??గ్వాదర్ పోర్టు నుంచి జిన్జియాంగ్ వరకు సీపీఈసీ, రైల్వేలు, విమానాశ్రయాలను అభివృద్ధి చేసిన చైనా.. వాటిని ఊరికే వదిలిపెడుతుందా??? ఇవన్నీ సమాధానాల్లేని ప్రశ్నలే..! గ్వాదర్‌కు సమాంతరంగా పజ్నీ నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు అమెరికా సిద్ధమైంది. ఈ పరిణామాలకు చైనా ఎలా రియాక్ట్ అవుతుంది? అనేది తెలియాలంటే.. ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే..!-హెచ్.కమలాపతిరావు
బంగ్లాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
బంగ్లాదేశ్ నేతల విద్వేశపూరిత ప్రసంగాల నేపథ్యంలో ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఢాకాలోని ఇండియా వీసా కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేసేస్తున్నట్లు ప్రకటించింది. తీవ్రవాదుల నుంచి ముంపు పొంచిఉన్న నేపథ్యంలో దేశ భద్రతకై ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఇండియన్ వీసా సెంటర్ తన కార్యకలాపాలను తాత్కాలికంగా మూసివేసింది. ఇటీవల బంగ్లాదేశ్‌కి చెందిన నేత భారత్‌ను విచ్ఛిన్నం చేసే వారికి తమ దేశంలో ఆశ్రయం కల్పిస్తామని తద్వారా సెవెన్ సిస్టర్స్ ప్రాంతం చీలిపోయే అవకాశం ఉందని విద్వేశపూరిత వ్యాఖ్యలు చేశారు. ఈనేపథ్యంలో భారత విదేశాంగ శాఖ ఆదేశ రాయభారి రియాజ్ హమీదుల్లాకి సమన్లు జారీ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ నుంచి శాంతి భద్రతల సమస్య పొంచిఉన్న నేపథ్యంలో ఆ బంగ్లాదేశీయులకు భారత వీసా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.అసలేం జరిగింది.బంగ్లాదేశ్‌లో అల్లర్ల నేపథ్యంలో ఆదేశ మాజీ ప్రధాని షేక్ హాసీనా ప్రస్తుతం భారత్‌లో తలదాచుకుంటున్నారు. అయితే ఆమెకు వివిధ కేసుల్లో మరణశిక్షతో పాటు 21 సంవత్సరాల జైలుశిక్ష పడింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ షేక్ హసీనాను ఆదేశానికి అప్పగించాలని భారత్‌ను కోరింది. ఈవిషయంపై ఇండియా ఇంకా స్పందించలేదు. ఇంతలోనే బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ లీడర్ హసంత్ అబ్దుల్లా భారత్‌పై విద్వేశపూరిత వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తులకు, ఉగ్రవాద సంస్థలకు బంగ్లాదేశ్‌లో ఆశ్రయం కల్పిస్తామని దాని వల్ల భారత్‌నుంచి ఈశాన్య ప్రాంతం సెవెన్సిస్టర్స్ వేరయ్యే అవకాశం ఉందన హెచ్చరించారు. దీనిపై సీరియస్ అయిన భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ హైకమిషనర్‌ని వివరణ కోరింది. తాజాగా బంగ్లాదేశీయులకు భారత వీసాను నిలిపివేసింది.
ట్రంప్‌తో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ భేటీ?
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయ్యే అవకాశం ఉంది. గాజాలో శాంతిస్థాపనకు ముస్లిం దేశాలు అక్కడ సైనిక దళాలలను ఏర్పాటు చేయాలని ట్రంప్ ఇటీవల ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో ఆసిమ్ మునీర్ ఆవిషయమై యుఎస్ అధ్యక్షుడితో చర్చించనున్నట్లు సమాచారం.ప్రస్తుతం పాకిస్థాన్-అమెరికా మధ్య సంబంధాలు బలీయంగా ఉన్నాయి. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్, పాక్ ప్రధాని షెహబాజ్, ఆర్మీచీఫ్ ఆసిమ్ మునీర్‌లతో ఇటీవల తరచుగా భేటీలు జరుపుతున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా ట్రంప్ ఎఫ్-16 యుద్ధవిమానాల అప్‌గ్రేడ్ కోసం పాకిస్థాన్‌కు ప్రత్యేక ప్యాకేజ్ మంజూరు చేశారు. ఈ చర్య భారత్‌ను కలవరపాటుకు గురిచేసింది. అనంతరం కూడా భారత్‌పై పలు రకాల ఆంక్షలు విధించి అదే సమయంలో పాకిస్థాన్‌కు దగ్గరయ్యే యత్నం ట్రంప్ చేశారు.కాగా ఇటీవల గాజాలో శాంతిస్థాపన కోసం ట్రంప్ 20 పాయింట్ల ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగా గాజాలో శాంతిని నెలకొల్పేందుకు ముస్లిం దేశాలైన పాకిస్థాన్, టర్కీ, ఈజిప్ట్ తదితర దేశాలు తమ దేశ సైనిక దళాలను గాజాలో మెుహరించాలని ట్రంప్ ప్రతిపాదించారు. ఈ విషయమై పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ట్రంప్‌తో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై పాకిస్థాన్‌లో వ్యతిరేకత ఎదురవుతుంది. అక్కడి ప్రజలు ఆదేశ సైనికులను గాజా పంపించడాన్ని వ్యతిరేకిస్తున్నారు.ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి. ఒకవేళ ఈ డీల్‌కు అంగీకరిస్తే సొంత దేశంలో వ్యతిరేకత, అంగీకరించకుంటే అమెరికా అధ్యక్షుడి ఆగ్రహాం మెుత్తానికి ఆసిమ్ మునీర్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందాన ఉంది. ఈ డీల్‌కు టర్కీ, ఈజిప్టు, జోర్దాన్ దేశాలు మద్దుతిస్తున్నాయి. ఇరాన్ మాత్రం వ్యతిరేకంగా ఉంది. ఆ విషయమై గత నెలలో పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి స్పందించారు. గాజాలో సైనిక దళాల మెుహరింపు విషయం ఆలోచిస్తామన్నారు. అయితే హామాస్ని నిరాయుధీకరించడం తమ పని కాదన్నారు.
తండ్రిని హత్య చేసిన ఎన్ఆర్ఐ, ట్విస్ట్ ఏంటంటే..!
ఇల్లినాయిస్లోని షామ్‌బర్గ్‌లో భారత సంతతికి చెందిన 28 ఏళ్ల వ్యక్తి, 67 ఏళ్ల వృద్ధ తండ్రిని సుత్తితో మోది దారుణంగా హత్య చేశాడు. థాంక్స్ గివింగ్ వారాంతంలో తండ్రిని చంపినట్లు ఆరోపణలపై అభిజిత్ పటేల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఫస్ట్-డిగ్రీ హత్య కేసు నమోదు చేశారు. కుక్ కౌంటీ ప్రాసిక్యూటర్ల ప్రకారం బాధితుడు అనుపమ్ పటేల్ డయాబెటిస్తో బాధపడుతున్నకారణంగా ఇంట్లోనే ఉంటున్నాడు. నవంబర్ 29న కుమారుడు చేతిలో హత్యకు గురయ్యాడు.కేసు ఏంటీ అంటేఅనుపమ్ పటేల్ భార్య ఉదయం డ్యూటీకి వెళ్లిపోయింది. తండ్రీ కొడుకులిద్దరు ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. ప్రతీరోజు ఉదయం 8 గంటల తన బ్లడ్ షుగర్ లెవల్స్ గురించి భార్యకు ఫోన్ చేయడం అలవాటు. పైగా అతని గ్లూకోజ్ మానిటర్ భార్య ఫోన్‌కు కనెక్ట్ అయ్యి ఉంది. హత్య జరిగిన రోజు భర్త నుంచి ఫోన్ రాకపోవడం, అతని గ్లూకోజ్ స్థాయిలు పడిపోవడం గమనించింది. ఫోన్లో వారితో సంప్రదించాలని ప్రయత్నించినా సమాధానం లేకపోవడంతో ఆందోళన ఇంటికి పరుగు తీసింది. ఎదురుగా కనిపించిన కొడుకు నాన్న బాగానే ఉన్నాడులే అని చెప్పాడు. ఏదో అనుమానం వచ్చి తల్లి చెక్ చేయగా, మంచం మీద రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను చూసి హతాశురాలైంది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. వారి సాయంతో భర్తను ఆసుపత్రికి తరలించింది. కానీ అప్పటికే ప్రాణం పోయిందని వైద్యులు ప్రకటించారు. సంఘటనా స్థలంలో ఒక పెద్ద సుత్తిని గుర్తించారు పోలీసులు. అనుపమ్ పటేల్ తలకు తీవ్ర గాయాలు, పుర్రె, ముక్కు ఎముక విరిగినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో తేలింది. మరోవైపు నిందితుడు అభిజిత్ పటేల్ పోలీసులకు లొంగిపోయాడు. విచారణ సమయంలో, చిన్నతనంలో తండ్రి తనను లైంగికంగా వేధించాడని, అందుకే చంపేశానని, ఇది తన డ్యూటీని అని చెప్పుకొచ్చాడు. అయితే స్కిజోఫ్రీనియా బాధితుడైన అభిజిత్, గతంలో చికిత్స కోసం గతంలో ఆసుపత్రిలో చేరినట్లు రికార్డుల ద్వారా తెలుస్తోంది. దీంతో అభిజిత్ ఆరోపణలన్నీ భ్రమలు కావచ్చని పోలీసుల అంచనా. దీనికి తోడు గతంలో చాలా సార్లు తండ్రిని చంపేస్తానని బెదరించేవాడట. దీంతో అభిజిత్ తండ్రిని సంప్రదించకుండా చట్టబద్ధంగా నిషేధం 2027 జనవరి వరకు అమల్లో ఉంది. అయితే అతని తల్లిదండ్రులు ఇంట్లో నివసించడానికి అనుమతించారు. కానీ ఇంతలోనే ఘోరం జరిగింది. ఈ నేపథ్యంలో అభిజిత్ పటేల్ నాన్ బెయిలబుల్ కేసులు నమోదైనాయి. అంతేకాదు తల్లిని సంప్రదించకుండా ఉండేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. తదుపరి విచారణ డిసెంబర్ 19న జరగనుంది.చదవండి: భార్య, ఇద్దరు బిడ్డల్ని చంపి ఇంట్లోనే..వాళ్లు బతికిపోయారురణరంగంగా సెంట్రల్ జైలు : సూపరింటెండెంట్ పరిస్థితి విషమం
జాతీయం
సీఐ గారు మీరంటే నాకు మోజు..!
కర్ణాటక: ఇక్కడ అంతా రివర్స్ అయ్యింది. ఓ పురుష సీఐని మహిళ ప్రేమపేరుతో వేధిస్తోందని తెలిసింది. బెంగళూరులోని రామమూర్తినగర ఠాణా సీఐ సతీష్ కి ఇది పెద్ద తలనొప్పిగా మారింది. తాను అధికార కాంగ్రెస్ పార్టీ నాయకురాలినని, ప్రేమించకపోతే ఇబ్బంది పడతావని కూడా బెదిరిస్తూ ప్రముఖులతో తీసుకున్న ఫోటోలను వాట్సాప్‌లో పంపి సతాయిస్తోంది. ఎలా మొదలైంది.. సదరు మహిళ పని మీద ఒకటి రెండుసార్లు ఠాణాకు వచ్చి సీఐతో మాట్లాడింది, అంతే అప్పటి నుంచి ఆయనంటే మోజు పడింది. ప్రేమగా కజ్జికాయల డబ్బా, పూల బొకే తీసుకుని సీఐ కోసం వస్తుంది. మొదట్లో మామూలే కదా అనుకున్న సీఐకి తరువాత సీరియస్ అని అర్థమైంది. సుమారు 11 నంబర్ల నుంచి ఫోన్ చేసి, ప్రేమించాలని డిమాండ్ చేస్తోందని ఠాణా సిబ్బంది చెబుతున్నారు. నన్ను ప్రేమించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని, మీరే కారణమని డెత్‌నోట్ రాస్తాను అని బెదిరిస్తూ రక్తంతో మరో లేఖను రాసింది. మహిళపై కేసు ఈ చర్యలతో విసుగెత్తి ఇన్స్పెక్టర్ సతీశ్.. తన విధులకు అడ్డుపడుతున్న, ఆత్మహత్య బెదిరింపులకు పాల్పడుతున్న సెక్షన్ల కింద ఆమె మీద కేసు నమోదు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నారు.
6,117 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 6,117 రైల్వే స్టేషన్లలో ఉచితంగా వైఫై సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు రైల్వే శాఖ బుధవారం వెల్లడించింది. వ్యక్తిగత గోప్యానికి ఏవిధమైన ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు. వైఫైను అందించేందుకు ఆయా ప్రయాణికుల మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని మాత్రమే యాక్సెస్ చేస్తున్నామని, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం 1,731 స్టేషన్లలో సీసీటీవీ నిఘా వ్యవస్థను ఏర్పాటుచేశామని తెలిపారు. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, పాదచారుల వంతెనలు, వేచి ఉండే హాళ్లు, టికెట్ కేంద్రాల వద్ద సీసీటీవీలను ఏర్పాటుచేశారు. రైళ్లలో దొంగతనాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు బోగీల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 11,953 బోగీల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చినట్లు తెలిపారు. దీని ద్వారా ఎప్పటికప్పుడు బోగీల్లో జరిగే కదలికలను తెలుసుకుని, ప్రయాణికుల భద్రతను కాపాడుతున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.
రాష్ట్రపతిగా వాజ్ పేయి!
న్యూఢిల్లీ: అటల్ బిహారీ వాజ్ పేయి హయాంలో ఏపీజే అబ్దుల్ కలాం అనూహ్య రీతిలో రాష్ట్రపతిగా ఎన్నికవడం తెలిసిందే. కానీ అసలు వాజ్ పేయినే రాష్ట్రపతిగా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన అప్పట్లో బీజేపీ నాయకత్వానికి వచ్చిందట! అంతేగాక వాజ్ పేయి స్థానంలో నాటి పార్టీ అగ్ర నేత ఎల్ కే అడ్వాణీని ప్రధానిగా చేయాలన్న ప్రతిపాదన కూడా జోరుగా సాగిందట. కానీ రాష్ట్రపతి అయ్యేందుకు స్వయానా వాజ్ పేయే తిరస్కరించడంతో ఆ ప్రయత్నాలకు అక్కడితోనే తెర పడిందట! నాడు ఆయన మీడియా సలహాదారుగా ఉన్న అశోక్ టాండన్ తన తాజా పుస్తకం ’అటల్ సంస్మరణ్’ లో ఈ ఆసక్తికర అంశాన్ని పేర్కొన్నారు. పాలక ఎన్డీఏతో పాటు విపక్షాల మద్దతుతో కలాం 2022లో దేశ 11వ రాష్ట్రపతిగా ఎన్నికవడం తెలిసిందే.కలాం ఎంపిక వెనక...ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా కలాం ఎంపిక వెనక ఏం జరిగిందీ, ఈ విషయంలో కలిసి వచ్చేలా కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్షాలను వాజ్ పేయి ఎలా ఒప్పించిందీ పుస్తకంలో టాండన్ వివరించారు. ‘తాను రాష్ట్రపతి కావాలన్న ప్రతిపాదనను వాజ్ పేయి తీవ్రంగా వ్యతిరేకించారు. జనాదరణ ఉన్న ఒక ప్రధాని ఇలా మెజారిటీ ఆధారంగా రాష్ట్రపతి కావడం భారత పార్లమెంటరీ ప్రజా స్వామ్యానికి మంచిది కాదని ఆయన భావించారు. అదో తప్పుడు సంప్రదాయానికి నాంది పలుకుతుందన్నారు. అంతేగాక కలాం అభ్యర్థి త్వానికి అన్ని పార్టీ మద్దతు కూడగట్టేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. ఈ విషయమై ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నేతలను చర్చలకు ఆహ్వానించారు. సోనియాగాంధీ, ప్రణబ్ ముఖర్జీ, మన్మోహన్ సింగ్ వంటి అగ్ర నేతలు వచ్చి వాజ్ పేయితో చర్చించారు. రాష్ట్రపతిగా కలాంను నామినేట్ చేయాలని ఎన్డీఏ నిర్ణయించినట్టు వాజ్ పేయి తొలిసారిగా ఆ భేటీలోనే ప్రకటించారు. దాంతో కాసేపు అంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు. ముందుగా సోనియానే తేరుకున్నారు. ఈ ఎంపికతో ఆశ్చర్యపోయినట్టు చెప్పారు. అయితే కలాంకు మద్దతివ్వడం తప్ప తమకు మరో మార్గం కూడా లేదని ఆమె అన్నారు‘ అని ఆయన రాసుకొచ్చారు. 2001 డిసెంబర్ 13న పార్లమెంటుపై ఉగ్ర దాడి సందర్భంగా సోనియా, వాజ్ పేయి ఫోన్ సంభాషణ గురించి టాండన్ ప్రస్తావించారు. ‘నాడు విపక్ష నేతగా ఉన్న సోనియా వెంటనే వాజ్ పేయికి కాల్ చేశారు. ’మీరు క్షేమమేనా? నాకు ఆందోళనగా ఉంది’ అంటూ ఆరా తీశారు. ’నేను క్షేమం. మీరు పార్లమెంటు హాల్లో ఉన్నారేమోనని నేను ఆందోళన పడ్డా’ అంటూ వాజ్ పేయి బదులిచ్చారు‘ అని పేర్కొన్నారు.
ఆ టోల్‌ప్లాజాలను మూసేయండి
న్యూఢిల్లీ: టోల్‌ఫీజు కట్టేందుకు తరచూ కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిల్చిపోతుండటం, వందల వాహనాల నుంచి ఒకేచోట వెలువడుతున్న పొగ, కాలుష్యం కారణంగా ఢిల్లీ–నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్) పరిధిలో కాలుష్యఛాంబర్లుగా తయారైన 9 టోల్‌ప్లాజాలను తక్షణం తాత్కాలికంగానైనా మూసేయాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. లేదంటే కనీసం ఢిల్లీ–ఎన్సీఆర్ నుంచి సుదూరాలకు తరలించాలని జాతీయరహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ), మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ(ఎంసీడీ)లకు సుప్రీంకోర్టు బుధవారం సూచించింది. వారంలోపు మీ నిర్ణయం తెలపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం పాంఛోలీల ధర్మాసనం ఆదేశించింది. టోల్‌ప్లాజాల తాత్కాలిక మూసివేత లేదా వేరే చోట ఏర్పాటు ద్వారా హస్తిన సరిహద్దుల్లో తీవ్ర వాయుకాలుష్యానికి కళ్లెం వేయొ చ్చని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘చలికాలంలో వాయు కాలుష్యం విపరీతంగా పెరగడం అనేది ఒక వార్షిక తంతుగా తయారైంది. వాయుకాలుష్యానికి ఇకనైనా చెక్‌పెట్టేలే చర్యలు తీసుకోండి. భారత్ స్టేజ్–4 స్థాయిలో తక్కువ ఉద్గారాలను వెదజల్లని వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ ఆగ స్ట్ 12న మేం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరిస్తాం. ఇక నర్సరీ నుంచి ఐదో తరగతి చిన్నారులు నేరుగా పాఠశాలకు రావొద్దంటూ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలన్న అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోబోం. ఎందుకంటే త్వరలోనే చిన్నారులకు శీతాకాల సెలవు రాబోతున్నాయి. అప్పుడెలాగు పిల్లలు పాఠశాలకు రారు. ఆమాత్రందానికి మేం జోక్యం చేసుకోవడం అనవసరం’’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎంసీడీకి పరిహారం ఇవ్వండి ‘‘ఢిల్లీలోకి ఎంట్రీ పాయింట్లుగా మారిన ఈ 9 టోల్‌బూత్‌లు ప్రస్తుతం ఎంసీడీ నిర్వహిస్తోంది. వీటిని తాత్కాలికంగా మూసేయండి. మూసివేత కారణంగా ఎంసీడీ చవిచూసే నష్టాలను ఎన్హెచ్ఏఐ భర్తీచేయొచ్చేమో యోచించండి. తాత్కాలికంగా ఆదాయం కోల్పోయేందుకు ఎంసీడీ సిద్ధపడాలి. ఆ మేరకు తోడ్పాటునందించేలా ఎంసీడీ ముందుకురావాలి. ఈ విషయంలో ఎంసీడీ తన నిర్ణయాన్ని వారంలోపు తెలుపుతూ నివేదికను మా ముందు ఉంచండి’’అని ఎంసీడీని ధర్మాసనం ఆదేశించింది. కన్నాట్ ప్లేస్‌లోనూ పెట్టేస్తారా? కేసు విచారణ సందర్భంగా సీజేఐ ఒకింత అసహనంవ్యక్తంచేశారు. ‘‘గురుగ్రామ్ సరిహద్దులోని ఒక టోల్‌ప్లాజా వద్ద గంటల తరబడివాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో వందల వాహనాల నుంచి దట్టమైన పొగ ఒకేచోట పరుచుకుంటోంది. జనవరిదాకా టోల్‌ప్లాజాను తీసేస్తామని అధికారులు ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు?. మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే ఢిల్లీ నడిబొడ్డున ఉన్న కన్నాట్ ప్లేస్ ప్రాంతంలోనూ టోల్‌ప్లాజా కట్టేస్తారు. ఎందుకంటే మీకు టోల్‌ప్లాజా నగదు వసూళ్లు మాత్రమే ముఖ్యంకదా? టోల్గేట్లు ఆదాయాన్ని కళ్లజూపిస్తాయేమో అంతకంటే ఎక్కువగా కాలుష్యాన్నీ తీసుకొస్తున్నాయి. ఈ విషయంలో మీరు నిర్మాణాత్మకమైన ప్రణాళికతో రండి. జనవరి 31వ తేదీదాకా టోల్‌ప్లాజా ఉండబోదని ధీమాగా చెప్పగలిగేలా ఒక ప్లాన్‌తో రండి’’అని మున్సిపల్ కార్పొరేషన్‌కు సీజేఐ సూచించారు.
ఎన్ఆర్ఐ
ఎప్పటికీ భారతీయుడిగానే ఉంటా : ఎన్ఆర్ఐ పోస్ట్ వైరల్
జర్మనీలో నివసిస్తున్న ఒక భారతీయ వ్యవస్థాపకుడు ,పరిశోధకుడు, మయూఖ్ పంజా దాదాపు దశాబ్ద కాలంగా విదేశాల్లో ఇక్కడి పౌరసత్వాన్ని తీసుకునేందుకు నిరాకరించాడు. తన భారతీయ పాస్‌పోర్ట్‌ను వదులుకోవడానికి సిద్ధంగా లేనని ప్రకటించాడు. తాను ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో కూడా వివరించాడు. దీంతో ఇది నెట్టింట సందడిగా మారింది.మయూఖ్ సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం తొమ్మిది సంవత్సరాలకు పైగా జర్మనీలో నివసిస్తున్న అతనికి గత ఏడాది పౌరసత్వానికి అర్హత సాధించాడు. కానీ దరఖాస్తు చేయ కూడదని నిర్ణయించుకున్నాడు.తాను జర్మన్ పౌరుడిగా గాకుండా, ఎప్పటికీ భారతీయుడి గానే ఉంటాని ఆయన వివరించాడు. మయూఖ్ పంజా తొమ్మిదేళ్ల క్రితం జర్మనీ వెళ్లాడు.. డాక్టోరల్ రీసెర్చ్ కోసం వెళ్లిన మయూఖ్ అక్కడే పాపులేషన్స్ అనే ఏఐ సంస్థను స్థాపించాడు. గతేడాదే జర్మన్ పౌరసత్వం పొందేందుకు అర్హుత సాధించాడు. అయినా సిటిజన్ షిప్ కోసం దరఖాస్తు చేయలేదట. పాస్ పోర్ట్ అంటే తన దృష్టిలో కేవలం అదొక డాక్యుమెంట్ కాదని, అది వ్యక్తిత్వ గుర్తింపని చెప్పుకొచ్చాడు. భారతీయతను వదులుకోలేక పోతున్నానని వెల్లడించారు.జర్మనీ కథలు, చరిత్ర, భాష,సంస్కృతిని అర్థం చేసుకున్నాడు. వాటితో తాను మమేకం కాలేక పోతున్నానని, బెర్లిన్ వాతావరణం, సాంకేతిక శాస్త్రీయ పరిస్థితులలో తాను సుఖంగా ఉన్నప్పటికీ, అది తన సొంతఇంట్లో ఉన్నట్లు భావించడం లేదని ఆయన అన్నారు. ఫుట్‌బాల్ మ్యాచ్‌లో జర్మనీ గెలుపు లేదా ఓటమి తనకు పెద్దగా తేడాను కలిగించదని, భారతదేశం ప్రపంచ కప్ గెలిచినప్పుడు తన ఆనందమే వేరు అంటూ ఒక ఉదాహరణగా చెప్పుకొచ్చాడు. తాను జర్మనీ స్నేహితుడినే తప్ప ఆ దేశంలో భాగమని భావించే వ్యక్తిని కాదన్నాడుపంజా ప్రకారం, జర్మన్ పౌరుడిగా మారడం అంటే జర్మన్ విలువలు మరియు ఆదర్శాలతో తనను తాను సమలేఖనం చేసుకోవడం. కానీ కొత్త పౌరుడిగా, శతాబ్దాల నాటి సంస్కృతి తన ఇష్టానికి అనుగుణంగా ఉంటుందని ఆయన భావించడలేదు. పైగా భారత పౌరసత్వాన్ని కాపాడుకోవడం అనేది ఏదైనా చట్టపరమైన ప్రయోజనానికి సంబంధించిందికాదు,కానీ తన నిజమైన గుర్తింపుతో కనెక్ట్ అవ్వడానికి ఒక మార్గం అని మయూఖ్ పంజా తెలిపారు. I have been here 9 + years and I became eligible for the German passport a year back. I could have applied for citizenship a year ago, but I did not. I have thought about this a lot and I am increasingly coming to the conclusion that I can’t do this. Because I don’t feel German.… https://t.co/amUbrxgObK— Mayukh (@mayukh_panja) December 5, 2025 సోషల్ మీడియా మయూఖ్ నిర్ణయానికి సానుకూలంగా స్పందించింది. ఆయన నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.
ఓవర్సీస్ మొబిలిటీ బిల్లులో ప్రవాసీల హక్కులు కాపాడాలి
భారతదేశం నుంచి విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లే లక్షలాది మంది వలస కార్మికుల జీవితాలను ప్రభావితం చేసే ఓవర్సీస్ మొబిలిటీ (విదేశీ వలస) బిల్లు–2025 లో ప్రవాసీల హక్కులు రక్షించబడేలా చూడాలని, తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, సభ్యులు చెన్నమనేని శ్రీనివాస రావులతో కూడిన ప్రతినిధి బృందం తమ నాలుగు రోజుల ఢిల్లీ పర్యటనలో తెలంగాణకు చెందిన ఏడుగురు పార్లమెంటు సభ్యులను కలిసి వినతిపత్రాలను సమర్పించారు. భారతీయ వలస కార్మికులు విదేశాల్లో గౌరవంగా, భద్రతతో నివసించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.42 ఏళ్లుగా అమలులో ఉన్న ఎమిగ్రేషన్ యాక్ట్–1983 స్థానంలో భారత ప్రభుత్వం కొత్త చట్టం చేయనున్న నేపథ్యంలో... విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్థాండింగ్ కమిటీ సభ్యులు, బీజేపీ ఎంపీ డీకే అరుణ (మహబూబ్ నగర్), బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కెఆర్ సురేష్ రెడ్డి, కాంగ్రేస్ ఎంపీలు మల్లు రవి (నాగర్ కర్నూల్), సురేష్ షెట్కార్ (జహీరాబాద్), డా. కడియం కావ్య (వరంగల్), గడ్డం వంశీక్రిష్ణ (పెద్దపల్లి), చామల కిరణ్ కుమార్ రెడ్డి (భువనగిరి), మాజీ ఎంపీ మధు యాష్కీలతో వారు చర్చించారు. 2021 ముసాయిదాలో ప్రవాసీ కార్మికులకు ప్రతిపాదించిన అనేక రక్షణలు కొత్త బిల్లులో లేవు. అధికారాలు కేంద్రీకృతమవడం ద్వారా దోపిడీ ప్రమాదం పెరుగుతుందని భీంరెడ్డి, శ్రీనివాస రావులు ఎంపీలకు వివరించారు.ప్రవాసుల హక్కులు బలహీనం కావద్దుబాధిత ప్రవాసీ కార్మికులు నేరుగా కోర్టులను ఆశ్రయించే హక్కు తొలగింపు.. మహిళలు, పిల్లల రక్షణలను ‘సున్నిత వర్గాలు’ అనే అస్పష్ట వర్గంలో విలీనం. రిక్రూట్మెంట్ ఏజెన్సీలు వసూలు చేసే ఫీజుల వివరాల వెల్లడి నిబంధన రద్దు వలన రుణ బానిసత్వానికి దారి తీస్తుంది. విదేశాలకు పంపిన అనంతరం కార్మికులపై ఏజెన్సీల బాధ్యత లేకపోవడం, విదేశాల నుంచి తిరిగివచ్చిన వారికి పునరేకీకరణ నిబంధనలు బలహీనపడ్డాయి. 182 రోజుల (ఆరు నెలల) లోపు విదేశాల నుండి వాపస్ పంపబడ్డ (డిపోర్ట్) అయిన వారిని ‘రిటర్నీలు’గా పరిగణించకపోవడం లాంటి విషయాలను భారత ప్రభుత్వ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసికెళ్లాలని వారు కోరారు.‘ఎమిగ్రంట్’, ‘ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్’, ‘లేబర్’ వంటి పదాల నిర్వచనాల్లో విద్యార్థులు, ఆధారితులు, డిజిటల్ కార్మికులు వంటి వర్గాల వెలివేత. ‘మానవ అక్రమ రవాణా’ (హ్యూమన్ ట్రాఫికింగ్) కు స్పష్టమైన నిర్వచనం లేకపోవడం. కేంద్రీకృత పాలన – రాష్ట్రాలకు, కార్మిక సంఘాలకు చోటు లేదు. ప్రతిపాదిత 'ఓవర్సీస్ మొబిలిటీ & వెల్ఫేర్ కౌన్సిల్' లో వలస కార్మికులను విదేశాలకు పంపే రాష్ట్రాలు, కార్మిక సంఘాలు, హక్కుల సంస్థలకు ప్రాతినిధ్యం లేదు. రాష్ట్ర స్థాయి నోడల్ కమిటీలు తొలగించబడటం వల్ల స్థానిక సమస్యల పరిష్కారానికి ఆటంకం ఏర్పడుతుందని మంద భీంరెడ్డి, చెన్నమనేని శ్రీనివాస రావులు ఆందోళన వ్యక్తం చేశారు.డిమాండ్లుబిల్లుపై లోతుగా అధ్యయనం చేయాలిఎమిగ్రేషన్ చెక్ పోస్టులు రద్దు అయినప్పటికీ ప్రత్యామ్నాయ నియంత్రణ వ్యవస్థ లేదు.ప్రయాణానికి ముందు శిక్షణ, విదేశాల్లో సహాయక సేవల ప్రమాణాలు స్పష్టంగా లేవు.ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ — హక్కుల కంటే పర్యవేక్షణపైనే దృష్టి.24/7 హెల్ప్లైన్లు, విమానాశ్రయ–ఎంబసీ సహాయం తప్పనిసరి కాదని ముసాయిదా చెబుతోంది.శిక్షలు కేవలం రిక్రూట్మెంట్ ఏజెంట్లపైనే; విదేశీ యాజమాన్యాలపై చర్యలు లేవు.ట్రాఫికింగ్, చట్ట విరుద్ధ ఆన్లైన్ రిక్రూట్మెంట్పై ప్రత్యేక నిబంధనలు లేకపోవడం.విధించే జరిమానాల్లో బాధితులకు పరిహారం కేటాయింపు లేదు.
'నైటా' కొత్త అధ్యక్షుడిగా రవీందర్ కోడెల
ప్రపంచ వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లో నివసిస్తున్న తెలుగువారు ఏర్పాటు చేసుకున్న సంస్థ న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా). రానున్న ఏడాది (2026) కోసం కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నైటా కొత్త అధ్యక్షుడుగా ప్రముఖ ఫార్మసిస్ట్ రవీందర్ కోడెల ఎంపికయ్యారు. ఏడాది పాటు ఆయన న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ కు నాయకత్వం వహించనున్నారు.అమెరికా ప్రధాన నగరమైన న్యూయార్క్ లో వేల సంఖ్యలో తెలుగు, తెలంగాణ ఎన్నారైలు కుటుంబాలతో సహా స్థిరపడ్డారు. వీరందరూ వివిధ వృత్తుల్లో పనిచేస్తూ ఒక సామాజిక సమూహంగా కలిసి ఉండేందుకు నైటాను ఆరేళ్లకిందట ఏర్పాటుచేసుకున్నారు. ఇప్పటివరకూ ఆరు సార్లు ఏర్పాటైన కార్యవర్గాలు తమ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను పాటించటంతో పాటు, అమెరికాలోనే పుట్టిపెరిగిన తమ పిల్లలకు తెలుగు, తెలంగాణ పండగల ప్రాధాన్యత తెలిసేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలాగే అమెరికా సమాజంలో భాగమై వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. సంప్రదాయాన్ని కొనసాగిస్తూ రానున్న ఏడాదిలో కొత్త కార్యవర్గం సహకారంతో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామని నూతన అధ్యక్షుడు రవీందర్ కోడెల (Ravinder Kodela) వెల్లడించారు. ఇటీవల మరణించిన ప్రజాకవి అందెశ్రీకి నైటా సభ్యులు సంతాపం ప్రకటించారు. వాణి అనుగు నేతృత్వంలోని తాజా మాజీ కార్యవర్గానికి వీడ్కోలు విందును ఏర్పాటుచేశారు.కార్యక్రమంలో న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్ కుమార్, ప్రముఖ ఎన్నారై పైళ్ల మల్లారెడ్డి, ఇతర కార్యవర్గ సభ్యులు, నైటా (NYTTA) సభ్యులు కుటుంబాలతో సహా పాల్గొన్నారు.రవీందర్ కోడెల ప్రస్థానంఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చిట్యాల మండలం వాస్తవ్యులు. బాల్యం నుంచి పదవ తరగతిదాకా అక్కడే గడిచింది. ఆతర్వాత హన్మకొండలో ఇంటర్, డిగ్రీ, కాకతీయ యూనివర్సిటీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో మాస్టర్స్ చదివారు. ఆ తర్వాత ఫెలోషిప్ (CSIR)తో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో పీహెచ్డీ చేశారు. చదవండి: ఎన్ని కష్టాలున్నా ఇల్లు ఇల్లే.. వచ్చేస్తున్నా!తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలోనూ వివిధ వేదికల ద్వారా తన వంతు పాత్ర పోషించారు. ఆ తర్వాత డాక్టర్ రెడ్డీస్ తో పాటు పలు ప్రముఖ సంస్థల్లో పనిచేస్తూ అమెరికా వెళ్లి అక్కడే న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. సిటీ కాలేజీ ఆఫ్ న్యూయార్క్ (మెడికల్ స్కూల్)తో పాటు సౌత్ వెస్ట్రర్న్ మెడికల్ సెంటర్లలో ప్రముఖ ఫార్మాసిస్టుగా క్యాన్సర్ నివారణ ఔషధాల తయారీలో గుర్తింపు పొందారు.
అమెరికాలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
అమెరికా బర్మింగ్‌హామ్‌లో విషాదం చోటు చేసుకుంది. తెలుగు విద్యార్థులు నివసిస్తున్న ఓ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు తెలుగు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరణించిన వారిలో మేడ్చల్ జిల్లా పోచారానికి చెందిన ఉడుముల సహజ రెడ్డి, కూకట్‌పల్లికి చెందిన మరొక విద్యార్థి ఉన్నారు. మృతులిద్దరూ హైదరాబాద్ వాసులు. కాగా అగ్నిప్రమాదం జరిగిన అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో పదిమంది తెలుగు విద్యార్థులు నివసిస్తున్నారు. హఠాత్తుగా చెలరేగిన మంటలకు అందులో చిక్కుకున్న విద్యార్థులు ఉక్కిరి బిక్కిరయ్యారు. విద్యార్థులు శ్వాస తీసుకోలేక పెద్దగా కేకలు పెట్టారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వారిని రక్షించారు. తీవ్ర గాయాలైన విద్యార్థులను ఆసుపత్రికి తీసుకెళ్లాగా అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వీరంతా అక్కడి అలబామా యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్నారు.
క్రైమ్
సీఐ గారు మీరంటే నాకు మోజు..!
కర్ణాటక: ఇక్కడ అంతా రివర్స్ అయ్యింది. ఓ పురుష సీఐని మహిళ ప్రేమపేరుతో వేధిస్తోందని తెలిసింది. బెంగళూరులోని రామమూర్తినగర ఠాణా సీఐ సతీష్ కి ఇది పెద్ద తలనొప్పిగా మారింది. తాను అధికార కాంగ్రెస్ పార్టీ నాయకురాలినని, ప్రేమించకపోతే ఇబ్బంది పడతావని కూడా బెదిరిస్తూ ప్రముఖులతో తీసుకున్న ఫోటోలను వాట్సాప్‌లో పంపి సతాయిస్తోంది. ఎలా మొదలైంది.. సదరు మహిళ పని మీద ఒకటి రెండుసార్లు ఠాణాకు వచ్చి సీఐతో మాట్లాడింది, అంతే అప్పటి నుంచి ఆయనంటే మోజు పడింది. ప్రేమగా కజ్జికాయల డబ్బా, పూల బొకే తీసుకుని సీఐ కోసం వస్తుంది. మొదట్లో మామూలే కదా అనుకున్న సీఐకి తరువాత సీరియస్ అని అర్థమైంది. సుమారు 11 నంబర్ల నుంచి ఫోన్ చేసి, ప్రేమించాలని డిమాండ్ చేస్తోందని ఠాణా సిబ్బంది చెబుతున్నారు. నన్ను ప్రేమించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని, మీరే కారణమని డెత్‌నోట్ రాస్తాను అని బెదిరిస్తూ రక్తంతో మరో లేఖను రాసింది. మహిళపై కేసు ఈ చర్యలతో విసుగెత్తి ఇన్స్పెక్టర్ సతీశ్.. తన విధులకు అడ్డుపడుతున్న, ఆత్మహత్య బెదిరింపులకు పాల్పడుతున్న సెక్షన్ల కింద ఆమె మీద కేసు నమోదు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నారు.
ఇంట్లోకి చొరబడి మహిళపై హత్యాయత్నం
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): బెజవాడలో గంజాయి బ్యాచ్ మరోసారి రెచ్చిపోయింది. మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే రాళ్లు, క్రికెట్ బ్యాట్లు, కారం చేత పట్టుకొని ఏకంగా ఇళ్లల్లోకి చొరబడి ఓ మహిళను హతమార్చేందుకు యత్నించారు. గంజాయి మత్తులో వీరు చేసిన వీరంగంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ లూనాసెంటర్లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. గుమ్మళ్ల కుసుమ అనే మహిళ సింగ్‌నగర్‌లోని నార్త్‌జోన్ తహసీల్దార్, మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయం సమీపంలో 20 ఏళ్లుగా ఉంటోంది. బుధవారం సాయంత్రం ఆమె ఇంట్లో టీవీ చూస్తుండగా గంజాయి మత్తులో ఉన్న ఓ యువకుడు లోనికి ప్రవేశించాడు. చీరను లాగి ఆమెపై హత్యాయత్నానికి యత్నించాడు. దీంతో ఆమె అతడిని బయటకు తోసేసి తలుపులు వేసింది. విషయాన్ని సమీపంలో ఉన్న తన అన్నయ్య శేఖర్‌కు ఫోను చేసి చెప్పింది. ఇంతలో ఆ వ్యక్తితోపాటు మరో ఇద్దరు గంజాయి బ్యాచ్ సభ్యులు, ఓ మహిళ కూడా వారితోపాటు వచ్చి రాళ్లు, బ్యాట్, కారంతో వీరంగం సృష్టించారు. మహిళను, ఆమె కుమారుడిని చంపేస్తామంటూ ఇంటిపైకి రాళ్లు రువ్వారు. అద్దాలు, తలుపులు, కిటికీలు పగలగొట్టి బీభత్సం సృష్టించారు. వీరి చేష్టలకు భయపడి స్థానికులు ఇళ్లల్లోకి పరుగులు తీశారు. బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులపైనా రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్ పోలీసులపైనా గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. తమకు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా అండదండలు ఉన్నాయని హూంకరించింది. వారు చెప్పినట్లుగానే స్థానిక టీడీపీ నాయకులు కొందరు గొడవ జరిగిన కాసేపటికే అక్కడకు చేరుకొని నిందితులను రక్షించేందుకు యత్నించారు. వారిపై కేసులు పెట్టవద్దంటూ పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. వీడియోల రూపంలో సాక్ష్యాధారాలు ఉన్నా కేసులు కట్టేందుకు పోలీసులు వెనుకాడుతున్నారు. రాజీ పడాల్సిందిగా బాధితులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం. విషయం మీడియాకు, పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో హత్యాయత్నం కాకుండా చిన్న చిన్న సెక్షన్ల కింద కేసులు కట్టి చేతులు దులుపుకునేందుకు యత్నిస్తున్నట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులను వివరణ కోరగా బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని తెలిపారు.
చంద్రకళ మనసుల్లో నిలిచిపోతుంది
‘‘చాంపియన్’ కథ విన్నప్పుడు ఎమోషనల్‌గా అనిపించింది. సినిమాలో నేను చేసిన చంద్రకళ పాత్ర చాలా బాగుంటుంది. డైరెక్టర్ ప్రదీప్‌గారి సపోర్ట్‌తో నా క్యారెక్టర్‌కి ఏం కావాలో అన్నీ పర్ఫెక్ట్గా చేశాను. నా పాత్ర ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుంది’’ అని మలయాళ భామ అనస్వరా రాజన్ చెప్పారు. రోషన్, అనస్వరా రాజన్ జోడీగా నటించిన చిత్రం ‘చాంపియన్’. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌పై రూపొందిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా అనస్వరా రాజన్ మాట్లాడుతూ – ‘‘వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్లాంటి సంస్థలు నిర్మించిన సినిమాతో తెలుగులో పరిచయం కావడం నా అదృష్టం. తెలుగు ప్రేక్షకులు నేను వేరే భాషలో చేసిన సినిమాలు చూసి, ఎన్నో అద్భుతమైన మెసేజ్‌లు పంపారు. తెలుగులో నా తొలి సినిమాని కూడా అంతే గొప్పగా ఆదరిస్తారని నమ్ముతున్నాను. తెలుగు సినిమా చాలా గ్రాండ్‌గా ఉంటుంది. ఇక్కడ ఫిల్మ్ మేకర్స్,ప్రొడ్యూసర్స్ సపోర్టివ్‌గా ఉంటారు. ఒక్కసారి ఇక్కడ పని చేస్తే మళ్లీ మళ్లీ తెలుగు సినిమాలు చేయాలనిపిస్తుంది. ప్రస్తుతం తెలుగులో ‘ఇట్లు మీ అర్జున’ సినిమా చేస్తున్నాను. ‘చాంపియన్’ మూవీ కంటే ముందే నేను ఒప్పుకున్న సినిమా ఇది’’ అని పేర్కొన్నారు.
తండ్రిని హత్య చేసిన ఎన్ఆర్ఐ, ట్విస్ట్ ఏంటంటే..!
ఇల్లినాయిస్లోని షామ్‌బర్గ్‌లో భారత సంతతికి చెందిన 28 ఏళ్ల వ్యక్తి, 67 ఏళ్ల వృద్ధ తండ్రిని సుత్తితో మోది దారుణంగా హత్య చేశాడు. థాంక్స్ గివింగ్ వారాంతంలో తండ్రిని చంపినట్లు ఆరోపణలపై అభిజిత్ పటేల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఫస్ట్-డిగ్రీ హత్య కేసు నమోదు చేశారు. కుక్ కౌంటీ ప్రాసిక్యూటర్ల ప్రకారం బాధితుడు అనుపమ్ పటేల్ డయాబెటిస్తో బాధపడుతున్నకారణంగా ఇంట్లోనే ఉంటున్నాడు. నవంబర్ 29న కుమారుడు చేతిలో హత్యకు గురయ్యాడు.కేసు ఏంటీ అంటేఅనుపమ్ పటేల్ భార్య ఉదయం డ్యూటీకి వెళ్లిపోయింది. తండ్రీ కొడుకులిద్దరు ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. ప్రతీరోజు ఉదయం 8 గంటల తన బ్లడ్ షుగర్ లెవల్స్ గురించి భార్యకు ఫోన్ చేయడం అలవాటు. పైగా అతని గ్లూకోజ్ మానిటర్ భార్య ఫోన్‌కు కనెక్ట్ అయ్యి ఉంది. హత్య జరిగిన రోజు భర్త నుంచి ఫోన్ రాకపోవడం, అతని గ్లూకోజ్ స్థాయిలు పడిపోవడం గమనించింది. ఫోన్లో వారితో సంప్రదించాలని ప్రయత్నించినా సమాధానం లేకపోవడంతో ఆందోళన ఇంటికి పరుగు తీసింది. ఎదురుగా కనిపించిన కొడుకు నాన్న బాగానే ఉన్నాడులే అని చెప్పాడు. ఏదో అనుమానం వచ్చి తల్లి చెక్ చేయగా, మంచం మీద రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను చూసి హతాశురాలైంది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. వారి సాయంతో భర్తను ఆసుపత్రికి తరలించింది. కానీ అప్పటికే ప్రాణం పోయిందని వైద్యులు ప్రకటించారు. సంఘటనా స్థలంలో ఒక పెద్ద సుత్తిని గుర్తించారు పోలీసులు. అనుపమ్ పటేల్ తలకు తీవ్ర గాయాలు, పుర్రె, ముక్కు ఎముక విరిగినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో తేలింది. మరోవైపు నిందితుడు అభిజిత్ పటేల్ పోలీసులకు లొంగిపోయాడు. విచారణ సమయంలో, చిన్నతనంలో తండ్రి తనను లైంగికంగా వేధించాడని, అందుకే చంపేశానని, ఇది తన డ్యూటీని అని చెప్పుకొచ్చాడు. అయితే స్కిజోఫ్రీనియా బాధితుడైన అభిజిత్, గతంలో చికిత్స కోసం గతంలో ఆసుపత్రిలో చేరినట్లు రికార్డుల ద్వారా తెలుస్తోంది. దీంతో అభిజిత్ ఆరోపణలన్నీ భ్రమలు కావచ్చని పోలీసుల అంచనా. దీనికి తోడు గతంలో చాలా సార్లు తండ్రిని చంపేస్తానని బెదరించేవాడట. దీంతో అభిజిత్ తండ్రిని సంప్రదించకుండా చట్టబద్ధంగా నిషేధం 2027 జనవరి వరకు అమల్లో ఉంది. అయితే అతని తల్లిదండ్రులు ఇంట్లో నివసించడానికి అనుమతించారు. కానీ ఇంతలోనే ఘోరం జరిగింది. ఈ నేపథ్యంలో అభిజిత్ పటేల్ నాన్ బెయిలబుల్ కేసులు నమోదైనాయి. అంతేకాదు తల్లిని సంప్రదించకుండా ఉండేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. తదుపరి విచారణ డిసెంబర్ 19న జరగనుంది.చదవండి: భార్య, ఇద్దరు బిడ్డల్ని చంపి ఇంట్లోనే..వాళ్లు బతికిపోయారురణరంగంగా సెంట్రల్ జైలు : సూపరింటెండెంట్ పరిస్థితి విషమం
వీడియోలు
జగన్ హయాంలోనే సంపద సృష్టి.. నిజం ఒప్పుకున్న బాబు
ఎంత పనైంది..? అవతార్ 3కి బిగ్ షాక్..
తిరుమలలో రాజకీయ పోస్టర్ కలకలం
Watch Live: కోటి సంతకాల పత్రాలతో ర్యాలీగా బయల్దేరిన వాహనాలు
బోండా ఉమా అండతో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్
వారిద్దరిది లవ్ కాదు
చైనా-పాక్ కటిఫ్..! కారణాలు తెలిస్తే షాకవుతారు..!!
ఎలుక కోసం కార్ బంపర్ ని పీకేసింది.. కట్ చేస్తే.. కారు కంపెనీపై..!
తిరుమలలో మాంసం, మద్యం కలకలం.. BR నాయుడుని ఏకిపారేసిన భక్తులు
ప్రజా ఉద్యమంతో తగ్గిన చంద్రబాబు.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై సంచలన నిర్ణయం..

