breaking news
Narendra Modi
-
పండుగల వేళ ‘షుగర్’ షాక్.. కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్
న్యూఢిల్లీ: పండుగల సీజన్ మొదలు కాకముందే దేశంలో చక్కెర ధరలు పెరుగుతుండటంపై రాజకీయ దుమారం రేగుతోంది. పెరుగుతున్న ధరలు, తక్కువగా ఉన్న చక్కెర నిల్వలు, ఇథనాల్ ఉత్పత్తి విధానాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించింది. అదే సమయంలో దేశంలో చక్కెర కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.చక్కెర నిల్వలు తగ్గడం, ధరలు పెరగడం, ఇథనాల్ ఉత్పత్తికి చెరకు మళ్లించడం వంటి అంశాలను కాంగ్రెస్ ప్రస్తావించింది. కేంద్రం చెబుతున్న ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు ప్రస్తుత పరిస్థితులు విరుద్ధంగా ఉన్నాయని ప్రశ్నించింది. ముఖ్యంగా పండుగల సీజన్‌కు ముందు ధరలు పెరగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రతిపక్షం నిలదీసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ.. పండుగల సీజన్ ప్రారంభానికి ముందే చక్కెర ధరలు పెరగడం, దేశంలో చక్కెర నిల్వలు తగ్గిపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వ విధానాల చేదు.. చక్కెర తీపిలోకి కూడా చేరింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఇథనాల్ ఉత్పత్తి కోసం చెరకును మళ్లించడం వల్ల చక్కెర ఉత్పత్తి, నిల్వలు ప్రభావితమయ్యాయా? దేశంలో చక్కెర నిల్వలు తొమ్మిదేళ్ల కనిష్ఠానికి చేరాయా? ధరలు పెరుగుతున్న వేళ చక్కెరను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ఖర్గే కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇదేనా ఆత్మనిర్భర్ భారత్? అంటూ కేంద్ర విధానాలపై విమర్శలు గుప్పించారు.ఇది కూడా చదవండి: రేవంత్ ఒక్కడే కాదు.. కేంద్రం ‘నో’ చెప్పిన సీఎంలు వీరే!అయితే ఖర్గే ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. చక్కెర ధరల పెరుగుదలకు ఇథనాల్ ఉత్పత్తి కారణం కాదని స్పష్టం చేసింది. 2022-23లో ఇథనాల్‌కు మళ్లించిన చక్కెర వాటా సుమారు 12 శాతం ఉండగా.. 2025-26లో అది దాదాపు 9 శాతానికి తగ్గిందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ధరల పెరుగుదలకు తక్కువ దేశీయ ఉత్పత్తి, వాతావరణ ప్రభావం, పండుగల డిమాండ్, ఊహాజనిత ట్రేడింగ్, నిల్వ దాచడం వంటి కారణాలు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది.ధరలను అదుపులోకి తీసుకురావడానికి కేంద్రం అక్టోబర్ 31 వరకు 10 లక్షల టన్నుల ముడి చక్కెరను డ్యూటీ లేకుండా దిగుమతి చేసుకునేందుకు అనుమతించింది. అలాగే హోర్డింగ్‌ను అరికట్టేందుకు స్టాక్ పరిమితులను కూడా కఠినతరం చేసింది. మొత్తానికి పండుగల వేళ చక్కెర ధరలు పెరగడం, దేశీయ నిల్వలు, ఇథనాల్ ఉత్పత్తి, దిగుమతులు.. ఈ నాలుగు అంశాలు ఇప్పుడు కేంద్రం, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి కారణమయ్యాయి. పండుగల సీజన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో చక్కెర ధరలు ఎలా ఉంటాయన్నదే వినియోగదారుల్లో ఆసక్తిని రేపుతోంది. -
సంస్కరణలే ప్రభుత్వ లక్ష్యం
న్యూఢిల్లీ: అన్ని రంగాల్లోనూ సంస్కరణలు చేపట్టడం తన ప్రభుత్వ లక్ష్యమని, వృద్ధి వేగాన్ని నిలకడగా కొనసాగించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలో ఎకనామిక్స్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరమ్ సదస్సులో ఆయన ప్రసంగించారు. దేశంలో రాజకీయ స్థిరత్వం, ప్రభుత్వ విధానాల్లో కొనసాగింపు ఉన్నాయని చెప్పారు. ప్రపంచం భారత్‌ను ఒక ఆశాకిరణంగా చూస్తోందని పేర్కొన్నారు. వనరులను ఆయుధాలుగా మారుస్తుండటంతో వృద్ధికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అనేక ఆందోళనలు ఉన్నప్పటికీ, భారత్ మాత్రం వృద్ధికి సంబంధించి ఒక ఆశాకిరణంగా కనిపిస్తోందని స్పష్టంచేశారు. సంస్కరణల విషయంలో ఎన్డీయే ప్రభుత్వానికి ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్ ఉందన్నారు. తమ ప్రభుత్వం అధిక ఉత్పత్తికి ప్రోత్సాహకాలతో తగిన గుర్తింపునిస్తోందని వివరించారు. ప్రజలను కొరతలో ఉంచి, కనీస అవసరాల కోసం కూడా ప్రభుత్వం ముందు వేడుకునేలా చేయడం గత ప్రభుత్వాల విధానమని నరేంద్ర మోదీ ఆరోపించారు. గత ప్రభుత్వాల లైసెన్స్ రాజ్ విధానం నిరుద్యోగ భారాన్ని పెంచేదిగా ఉండేదని గుర్తుచేశారు. కానీ తన ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక విధానంతో కొత్త అవకాశాలను సృష్టిస్తోందని వెల్లడించారు. తాము కేవలం నిబంధనలను మాత్రమే మార్చడం లేదని, నిబంధనలకు సంబంధించిన మొత్తం విధానాన్నే మారుస్తున్నామని వివరించారు. -
అంతరిక్ష స్టార్టప్‌లకు అండదండలు
న్యూఢిల్లీ: స్పేస్ స్టార్టప్‌లకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఆయా స్టార్టప్‌లను నిర్వహించే యువ పారిశ్రామికవేత్తలను మరింత ప్రోత్సహిస్తామని ప్రకటించారు. వ్యవసాయం, పశుసంపద, పాడి, పర్యావ రణం, ప్రజల దైనందిన జీవితాలను ప్రభా వితం చేసే రంగాల్లో అంతరిక్ష సాంకేతికతను ఎలా ఉపయోగించాలన్న దానిపై అన్వేషణ సాగించాలని వారిని కోరారు. 20 స్పేస్ స్టార్టప్‌ల వ్యవస్థాపకులు, సీఈఓలతో ప్రధాని మోదీ శుక్రవారం సమావేశమ య్యారు. అంతరిక్ష స్టార్టప్‌ల వంటి నూతన, సవాలుతో కూడిన రంగంలోకి ప్రవేశించి, రిస్కులు తీసుకుని, ప్రభుత్వ సంస్కరణల ప్రక్రియను విశ్వసించి, ప్రయత్నాలను నిలకడగా కొనసాగిస్తున్నందుకు వారిని ప్రశంసించారు. ఈ రంగంలో విజయాలు సాధించడానికి అన్ని విధాలుగా మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. అలాగే, అంతరిక్ష సాంకేతికతల వినియోగాన్ని విస్తరించేందుకు అంతరిక్ష రంగ సంస్థలు, ఇతర రంగాల్లోని సంస్థల మధ్య మరింత సహకారం ఉండాలని అభిప్రా యపడ్డారు. అంతరిక్ష రంగంలో ప్రపంచానికి ఒక బలమైన, వినూత్నమైన, వాణిజ్యపరంగా ఆచరణీయమైన నమూనాను భారత్ అందించగలదని మోదీ స్పష్టంచేశారు. అంతరిక్షం నుంచి వచ్చే శిథిలాలపై పరిశో« దిస్తున్న కంపెనీలు తమ సాంకేతికతలను విస్తరించడానికి పర్యావరణ సంస్థలతో కలిసి పనిచేయవచ్చని ప్రధానమంత్రి సూచించారు. వ్యవసాయ రంగంతో కలిసి పని చేస్తున్న స్పేస్ టెక్నాలజీ కంపెనీలు వ్యవ సాయ విశ్వవిద్యాలయాలు, విభాగాలతో సమన్వయం చేసుకోవచ్చని అన్నారు. తద్వారా రైతులు మరింత సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి , వారి ఉత్పత్తిని గరిష్ఠ స్థాయికి పెంచుకోవడానికి వీలవుతుందని వెల్లడించారు. స్టార్టప్‌లు తమ కార్యకలాపాలపై అర్థవంతమైన ప్రజెంటేషన్లు ఇచ్చాయని, అలాగే ప్రభుత్వం చేపట్టిన అంతరిక్ష రంగ సంస్కరణలను, ఆ రంగం వృద్ధికి కల్పించిన అవకాశాలను అవి ప్రశంసించాయని ప్రధానమంత్రి పేర్కొ న్నారు. యువ పారిశ్రామికవేత్తల కృషి వల్ల అంతరిక్ష రంగంలో భారత్ ఎన్నో ఘనతలు సాధించిందని హర్షం వ్యక్తంచేశారు. -
సోషల్ మీడియాలో మోదీ హవా.. కేంద్ర మంత్రులకు ర్యాంకింగ్స్
-
దీర్ఘకాలిక దృక్పథంతో ఆలోచించాలి
న్యూఢిల్లీ: విధాన రూపకల్పనలో నూతన అంశాలను జోడించడానికి ప్రభుత్వ శాఖలు, విశ్వవిద్యాలయాలు, యువత మధ్య మరింత సమన్వయం ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యదర్శులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కృత్రిమ మేధ(ఏఐ)ను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని చెప్పారు. అదే సమయంలో మానవ మేధస్సు, విచక్షణను విస్మరించకూడదని అన్నారు. దేశ భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాలనే దానిపై దీర్ఘకాలిక దృక్పథంతో ఆలోచించాలని కార్యదర్శులను కోరారు. డేటాను జాతీయ సంపదగా అభివర్ణించారు. వివిధ ప్రయోజనాల కోసం డేటాను సేకరించి, నిర్వహించే విధానాలలో తేడాలు ఉన్నాయని తెలిపారు. అలాగే, డేటా మధ్య మరింత అనుసంధానతను, దాని సమర్థవంతమైన వినియోగాన్ని సాధ్యం చేసే పరిష్కారాలను కనుగొనాలని సూచించారు. విడివిడిగా పనిచేయడం అనేది కేవలం సంస్థాగత సమస్య మాత్రమే కాదని, అది ఒక ఆలోచనా విధాన సమస్య అని అన్నారు. అధికారులు ఐకమత్య స్ఫూర్తితో పనిచేయాలని ప్రధాని స్పష్టం చేశారు. జట్టు స్ఫూర్తిని పెంపొందించుకోవడం వెనుక ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేయాల్సిన, ప్రపంచ స్థాయిలో దానిని మరింత పోటీతత్వంతో కూడినదిగా తీర్చిదిద్దాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. -
సోషల్ మీడియాలో మంత్రుల పనితీరు ఎంత?
సాక్షి, న్యూఢిల్లీ: సభలు, దంచికొట్టే ప్రసంగాల కాలం నుంచి రాజకీయాలు, రాజకీయ చర్చలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికలపైకి మారుతున్నాయి. యువతతో పార్టీ, ప్రభుత్వ సంబంధాలను బలోపేతం చేసుకోవాలంటే సోషల్ మీడియానే అత్యంత ప్రధానమని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా వేదికల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రధాని సహా కేంద్ర మంత్రులందరూ ఫేస్బుక్ , ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ‘ఎక్స్’అనే 4 ప్రధాన వేదికల ద్వారా ప్రజలతో మమేకం కావాలని, ఎల్లప్పుడూ అప్డేట్స్ ఇస్తూ సోషల్‌మీడియాలో క్రియాశీలకంగా ఉండాలని స్పష్టం చేశారు. ఇప్పటివరకు సోషల్ మీడియా మాధ్యమాల్లో కేంద్ర మంత్రుల పనితీరు, క్రియాశీలత ఎలా ఉందనే దానిపై ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ఒక అధ్యయనం చేయించింది. నివేదికను సిద్ధం చేసింది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధాని మోదీ ఈ నివేదికలను సీల్డ్ కవర్లలో మంత్రులకు వ్యక్తిగతంగా అందజేశారు. సమగ్ర విశ్లేషణతో తుది నివేదిక.. ఈ రిపోర్టులో మే 1 నుంచి ఆగస్టు 15 వరకు మంత్రులు సోషల్ మీడియాలోని నాలుగు వేదికలపై చూపిన క్రియాశీలతను సమగ్రంగా విశ్లేషించారు. మంత్రులు పెట్టిన పోస్టులు, వివిధ అంశాలపై వారి వైఖరి, కామెంట్లు, స్పందనలను ఇందులో లెక్కగట్టారు. తోటి మంత్రులతో పోలిస్తే, అలాగే ప్రతిపక్ష నేతలతో పోలిస్తే సదరు మంత్రి ఏ స్థాయిలో యాక్టివ్‌గా ఉన్నారు? అనే దానికి సంబంధించిన నిష్పాక్షికమైన, పోల్చదగిన నివేదికను ప్రధానమంత్రి కార్యాలయం రూపొందించినట్లు సమాచారం. ఆధునిక ప్రచార సాధనాలపై ప్రధాని దిశానిర్దేశం.. ఈ రిపోర్టును మంత్రులంతా తీవ్రంగా, బాధ్యతగా తీసుకోవాలని ప్రధాని మోదీ సూచించినట్లు తెలిసింది. ఆధునిక సమాచార వ్యవస్థలైన ఈ సోషల్ మీడియా వేదికలు ఎంతటి కీలక పాత్ర పోషిస్తున్నాయో మంత్రులకు ప్రధాని మరోసారి సుదీర్ఘంగా వివరించారు. ఈ డిజిటల్ వేదికలను సమర్థవంతంగా వాడుకోవాలన్నారు. సోషల్ మీడియా ప్రచారంతోపాటు, యాక్టివ్‌గా ఉండటంలోనూ ప్రధాని మోదీ స్వయంగా ఆదర్శంగా నిలిచారు. పీఎంఓ రూపొందించిన ఈ ‘పర్ఫార్మెన్స్ రిపోర్ట్’ర్యాంకింగ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అందరికంటే ముందు వరుసలో నిలిచి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారని తెలిసింది. -
చైనాతో సంబంధాలు మెరుగయ్యేనా?
వచ్చే నెల సెప్టెంబర్‌లో భారత్‌లో జరుగనున్న బ్రిక్స్ దేశాధినేతల సమావేశానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరవుతాడా అని విశ్లేషకులు ఆసక్తితో ఎదురు చూస్తు న్నారు. భారత్–చైనా దేశాధినేతల భేటీ నేపథ్యంలో రెండు దేశాల సంబంధాలకు దిశానిర్దేశం జరుగుతుందని జియో పొలిటికల్ సర్కిల్స్‌లో ఆశాభావం వ్యక్తమవుతోంది. భారత్–చైనా సంబంధాలలో స్థిరత్వం ఆసియా ఖండానికే కాకుండా ప్రపంచ శాంతికి కూడా కీలకం. 2020 గల్వాన్ ఘర్షణ నేపథ్యంలో సుమారు నాలుగు సంవ త్సరాలు సంబంధాలలో స్తబ్ధత చోటు చేసుకున్నది. 2024లో రష్యాలో కజాన్‌లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో మోదీ–జిన్‌పింగ్ సమావేశం, సరిహద్దు గస్తీ ఒప్పందం ఇరుదేశాల సంబంధాలలో ఘర్షణను కొంతవరకు తగ్గించాయి. కానీ మొత్తంగా సంబంధాలు సాధారణ స్థితికి చేరటానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి. 1962 యుద్ధం తరువాత 1988లో రాజీవ్ గాంధీ బీజింగ్ పర్యటనతో మళ్లీ రెండు దేశాల సంబంధాలు గాడిన పడ్డాయి. 44 సంవత్సరాల తరువాత 2006లో నాథూ లా కనుమ మళ్లీ తెరుచు కున్నది. కానీ ఇరుదేశాల మధ్య పీటముడిలా ఉన్న సరిహద్దు సమస్యకు పరిష్కారం సమీప భవిష్యత్తులో లేనట్లే లెక్క.అయినా... వాణిజ్యం పెరిగింది!సరిహద్దు సమస్య సంక్లిష్టత నేపథ్యంలో ఇరు దేశాలు వాస్తవిక దృష్టితో గత రెండు దశాబ్దాలుగా వ్యాపార–వాణిజ్య సంబంధాలపై దృష్టి పెట్టాయి. 2000 సంవత్సరంలో 3 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యం, 2025కల్లా 128 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. గత 25 సంవత్సరాలలో సరిహద్దుల మీద ఎన్ని ఘర్షణలు చోటు చేసుకున్నా అవి ఇరు దేశాల వాణిజ్యానికి నష్టం కలిగించలేదు. కానీ జూన్ 2020 గల్వాన్ దుస్సాహసం రెండు దేశాల మధ్య అగాథాన్ని సృష్టించింది. 2024 నుండి మరమ్మత్తు చర్యలు చేపట్టినప్పటికీ, అవి ఢిల్లీ–బీజింగ్ మధ్య విశ్వసనీయతలో లోటును పూరించలేక పోయాయి. గత రెండున్నర దశాబ్దాలుగా చైనాతో భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. ఒకవైపు వ్యాపార వాణిజ్య సంబంధాలను పటిష్టం చేసుకుంటూనే, మరొకవైపు సరిహద్దులలో మన సైనిక శక్తిని మెరుగుపరచుకోవటానికి ప్రయత్నిస్తున్నాం. అంతర్జాతీయ యవనికపై పర్యావరణం, వాతావరణంలో మార్పులు, శక్తి, అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యల విషయంలో చైనాతో చేతులు కలిపాము. ఇరుదేశాల మధ్య వాణిజ్యం విçస్తృతంగా వృద్ధి చెంది నప్పటికీ వాణిజ్య లోటు పెద్ద సమస్యగా మారింది. 2020లో 44 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు 2026కల్లా 112 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. చైనా దిగుమతులపై మన ఆర్థిక వ్యవస్థ విపరీతంగా ఆధారపడతున్నది. ఈ రకమైన వాణిజ్య సంబంధాలు దీర్ఘకాలంలో మనకు నష్టం కలిగించటం ఖాయం.చైనా గ్రే జోన్ యుద్ధతంత్రం1962 తర్వాత భారత్‌పై చైనా మళ్లీ యుద్ధం చేసే పరిస్థితి, ప్రమాదం లేకపోయినప్పటికీ... సరిహద్దు సమస్య శాశ్వత పరిష్కా రానికి మనస్ఫూర్తిగా, మిత్రత్వ ధోరణితో చైనా ముందుకు రావటం లేదు. పైపెచ్చు వరుసగా సరిహద్దులలో కవ్వింపు ధోరణిని అమలు పరుస్తున్నది. వ్యూహాత్మకంగా ‘గ్రే జోన్ ’ యుద్ధతంత్రాన్ని అమలు పరుస్తున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఒకవైపు సరిహద్దులలో భారత్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ... మరొకవైపు పరోక్షంగా భారత్ అభివృద్ధిని అడ్డుకొని బలహీనపరచే కుతంత్రాన్ని చైనా అమలుపరుస్తున్నది. దీనితో ఆర్థిక, సామాజిక అభివృద్ధికి వెచ్చించాల్సిన కీలక నిధులను భారత ప్రభుత్వంచే సైనిక వ్యయంవైపు మళ్లింప చేయటంతో చైనా కృత కృత్యురాలయింది. సరిహద్దులను ఒకవైపు అస్థిరం చేస్తూనే మరొక వైపు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, శ్రీలంక, మాల్దీవు లతో జతకట్టి ఇండియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఈశాన్య భారతంలో ఉగ్రవాద ముఠాలకు వత్తాసు పలుకుతూ దేశాన్ని అస్థిరం చేయటానికి ప్రయత్నిస్తున్నది. వాణిజ్యంలో కూడా కీలకమైన వస్తువులను, ఉత్పత్తులను భారత్‌కు ఎగుమతి చేయకుండా ఆంక్షలు విధిస్తున్నది. మనకు అత్యంత అవసరమైన టన్నెల్ బోరింగ్ యంత్రాలు, సీఎన్ సీ లేథ్ యంత్రాలు, యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రేడియంట్లు, క్రిటికల్ మినరల్స్ మనకు అందకుండా వ్యూహాత్మ కంగా వ్యవహరిస్తున్నది. సామాజిక మాధ్యమాలలో భారత్‌కు వ్యతి రేకంగా పెద్ద ఉద్యమాన్నే నడుపుతున్నది.భారత్ ఏం చేయ్యాలి?గత రెండు దశాబ్దాలలో భారత్ ఎడల చైనా ప్రవర్తన, దృక్పథంలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. 2000 సంవత్సరం వరకు భారత్‌ను చైనా ఒక సహ ప్రత్యర్థిగా చూసింది. 2025కల్లా అంతర్జాతీయంగా చైనా ఆర్థిక శక్తిగానే కాకుండా టెక్నాలజీ పవర్ హౌస్‌గా ఏర్పడింది. సహజంగానే భారత్ ఎడల ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్నది. అమెరికా బలహీనపడటం చైనాకు కలిసి వచ్చింది. భారత్–చైనా సంబంధాలలో యూఎస్ఏ, పాకిస్తాన్ పాత్రను మనం కాదనలేము. ఇటీవల బీజింగ్ పర్యటన సందర్భంగా ట్రంప్ యూఎస్ఏ, చైనాలను జీ2గా అభివర్ణించాడు. అంటే యూఎస్ఏ, చైనాలే అగ్రరాజ్యాలని ప్రకటించాడు. అయితే, చైనాను ప్రాంతీయంగా బలహీన పరచటానికి అమెరికా భారత్‌ను సమర్థిస్తుందనీ, అమెరికాను ఎదుర్కోవటానికి చైనా భారత్‌తో చేతులు కలుపుతుందనీ మరొక వాదన. చైనాతో సంబంధాల విషయంలో భారత్ ఈ వాదనల ఆధారంగా సిద్ధాంత రూపకల్పన చేయటం అవివేకం. చైనాతో సంబంధాల విధాన రూపకల్పన అమెరికన్ సిద్ధాంతాల ఆధారంగా కాకుండా మన దేశ శక్తి, సామర్థ్యాలు, స్థిరత్వం, అభివృద్ధి అవసరాల ఆధారంగానే జరగాలి.భారత్‌కు కొన్ని ముఖ్యమైన అంశాల్లో స్పష్టత అవసరం. మన లక్ష్యం ప్రాంతీయ హోదానా? సరిహద్దు సమస్య పరిష్కారమా? సరి హద్దులలో ప్రశాంతతనా? అంతర్జాతీయంగా చైనాను బలహీనపర చటమా? ఏ అంశాల విషయంలో భారత్ రాజీపడదనే విషయంలో చైనాకు భారత్ స్పష్టతనివ్వాలి. కవ్వింపు చర్యలు, పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక భూభాగాల నుండి భారత్‌ను అస్థిరపరచే కుట్రల విషయంలో భారత్ రాజీ పడదు. ద్వైపాక్షిక సంబంధాలలో భారత్‌ను సమవుజ్జీగా పరిగణించాలి. అయితే, చైనా ధోరణి ఎప్పటికైనా మన బలంపైనే ఆధారపడి ఉంటుంది. బలమైన భారత్ మాత్రమే చైనాకు సరైన సమాధానం. ముఖ్యంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థ చైనాకు కంటగింపుగా ఉన్నది. ఈ విషయంలో భారత్ అప్రమత్తంగా ఉండాలి. చైనా పెట్టు బడులకు మళ్లీ పచ్చజెండా ఊపాలంటే వాణిజ్య లోటును పరిగణన లోనికి తీసుకోవాల్సిందే. భారత జెనరిక్ ఔషధాలు, ఐటీ సేవలను ఎగుమతి చేయటానికి చైనాపై ఒత్తిడి తేవాలి. 21వ శతాబ్దం చైనా శతాబ్దం కాకూడదు, అది ఆసియా శతాబ్దమవ్వాలి!గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
వన్ డే.. వన్ వర్సిటీ!
న్యూఢిల్లీ: దేశంలో పరీక్ష పత్రాల లీకేజీలు, పరీక్షల్లో అవకతవకలే ప్రధానాంశాలుగా విద్యార్థి, యువత కొనసాగిస్తున్న వరుస ఆందోళనల నేపథ్యంలో మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జన్ జెడ్‌కు చేరువయ్యే ప్రయత్నాలను ప్రారంభించింది. ఇందుకోసం ‘వన్ డే, వన్ యూనివర్సిటీ’ కార్యక్రమాన్ని తలపెట్టింది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రులు ప్రతి రోజూ ఒక యూనివర్సిటీకి వెళ్లి, అక్కడి యువతతో ముఖాముఖి చర్చలు జరుపుతారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకోవడంతోపాటు వారిని అర్థం చేసుకునేందుకు ప్రయతి్నస్తారు. విద్యార్థులు, యువత కోసం ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను వారికి వివరిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి సంబంధించి వర్సిటీలతోపాటు, మంత్రుల పర్యటనల సమన్వయ బాధ్యతలను ప్రభుత్వం విద్యా మంత్రి ప్రల్హాద్ జోషి, యువజన వ్యవహారాల మంత్రి మన్సుఖ్ మాండవీయలకు అప్పగించింది. ‘వన్ డే, వన్ యూనివర్సిటీ’ కార్యక్రమంపై బుధవారం ప్రధాని మోదీ సారథ్యంలో జరిగిన కేబినెట్ భేటీలోనూ చర్చించారు. దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వర్సిటీలతోపాటు డీమ్డ్ వర్సిటీలు కలిపి 1,300 వరకు ఉన్నట్లు అంచనా. -
భారత్ ఎన్నికలపై ట్రంప్ ఫోకస్..! అమెరికాలో కొత్త రూల్స్ కు పిలుపు
-
మోదీ కోసం పోలీస్ ఉద్యోగానికి రాజీనామా..2029 వరకు చెప్పులు వేసుకోనని శపథం!
గాంధీనగర్: ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) విధానాలకు మద్దతుగా గుజరాత్లో ఓ పోలీసు ఉద్యోగి తన పదవికి రాజీనామా చేశారు. తూర్పు కచ్‌లోని అడేసార్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రామ్‌గర్ మోహన్‌గర్ గోసాయ్ తన ఉద్యోగానికి రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చాంశనీయంగా మారింది. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు, పరిణామాల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాలను తిప్పికొట్టడానికి, ప్రధాని మోదీ దేశంలోని యువత కోసం చేపడుతున్న విధానాలకు మద్దతుగా నిలవడమే తన నైతిక బాధ్యతగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను కూడా విడుదల చేశారు. ఆ వీడియోలో ఈ ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి నేను ఎంతో కష్టపడ్డాను. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం ఒక ప్రభుత్వ ఉద్యోగిగా కాకుండా.. నేరుగా రంగంలోకి దిగి మోదీ ప్రభుత్వానికి, ఆర్ఎస్ఎస్కు అండగా నిలవాలని నిర్ణయించుకున్నాను. ఎలాంటి లాభాపేక్ష లేకుండా దేశ సేవకు అంకితమైన ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో ఇకపై పూర్తిగా భాగస్వామి అవుతాను’ అని వెల్లడించారు. అంతేకాకుండా, 2029లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి బీజేపీ గెలిచి, ప్రధాని నరేంద్ర మోదీ తిరిగి అధికారంలోకి వచ్చే వరకు తాను ఎలాంటి చెప్పులు ధరించనని శపథం చేయడం గమనార్హం. કચ્છમાં પોલીસ કોન્સ્ટેબલનું રાજીનામું!આડેસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રામગર ગુસાઈએ 2019થી પોલીસ સેવામાં રહ્યા બાદ રાજીનામું આપ્યું. RSSમાં સેવા આપવા માટે નોકરી છોડ્યાનો દાવો.રામગર ગુસાઈનું નિવેદન: “2029માં મોદી સરકાર અને સંઘ સરકાર નહીં બને ત્યાં સુધી પગમાં પગરખાં… pic.twitter.com/kIrk6Kezgq— Benefit News 24 (@BenefitNews24) August 15, 2026 -
మోదీగారూ.. చూడండి ఏం జరిగిందో!
న్యూఢిల్లీ: యూజీసీ-నెట్లో ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నపత్రాల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. వాటిని రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వైఫల్యాల భారాన్ని విద్యార్థులపై మోపుతున్నారని ఆరోపించారు. ‘‘మీ ఎన్టీఏ ఏం చేసిందో చూడండి’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు.‘‘ఏళ్ల తరబడి చదివిన వేలాది మంది అభ్యర్థులు మళ్లీ పరీక్ష రాయాల్సిన పరిస్థితి వచ్చింది. దరఖాస్తులు, ఫీజులు, దూర ప్రాంతాలకు ప్రయాణాలు.. అన్నీ మరోసారి చేయాల్సి వస్తోంది. తప్పు చేసింది ఎన్టీఏ.. కానీ శిక్ష అనుభవించేది మాత్రం విద్యార్థులు’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. జూన్ 22 నుంచి 30 వరకు జరిగిన యూజీసీ-నెట్ పరీక్షలను దాదాపు రెండు నెలల తర్వాత రద్దు చేయడంపై ఆయన ప్రశ్నించారు. పరీక్షలకు ముందే ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయా? అనే అసలు ప్రశ్నకు NTA సమాధానం చెప్పడం లేదని ఆరోపించారు.Modi ji, look at what your NTA has just done.UGC-NET exams for Sociology, English and Commerce were held between 22 and 30 June. Nearly two months later, NTA has cancelled all three because it set faulty papers and repeated old questions.Thousands of candidates who prepared… https://t.co/TUMhhMhjvL— Rahul Gandhi (@RahulGandhi) August 17, 2026‘విద్యా వ్యవస్థ కాదు.. వసూళ్ల యంత్రం’దేశంలోని ప్రస్తుత విద్యా వ్యవస్థపై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది ఇక విద్యా వ్యవస్థ కాదు.. ఒక ఎక్స్ట్రాక్షన్ మెషీన్‌గా మారింది. ఇది విద్యార్థుల డబ్బు, సమయం, మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసాన్ని తీసుకుంటోంది. కానీ తిరిగి ఉద్యోగం కూడా ఇవ్వడం లేదు’’ అని విమర్శించారు. పేపర్ లీక్ వ్యవహారాలపై బాధ్యత వహించాల్సిందేనని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కేవలం తొలి అడుగు మాత్రమేనని.. NTA నాయకత్వంపైనా చర్యలు తీసుకోవాలని కోరారు.సెప్టెంబర్‌లో రీటెస్ట్NTA ప్రకారం.. ఇంగ్లిష్, కామర్స్ అభ్యర్థులకు సెప్టెంబర్ 9న, సోషియాలజీ పరీక్షకు సెప్టెంబర్ 10న రీటెస్ట్ నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు అదనపు ఫీజు వసూలు చేయబోమని స్పష్టం చేసింది. మిగిలిన 84 సబ్జెక్టుల ఫలితాలు షెడ్యూల్ ప్రకారమే విడుదల చేస్తామని తెలిపింది. నీట్ పేపర్ లీక్ వివాదం తర్వాత ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న NTAపై తాజాగా యూజీసీ-నెట్ రీటెస్ట్ నిర్ణయం మరింత ఒత్తిడి పెంచింది. -
దిమాగీ నక్సల్సైపై పొలిటికల్ దుమారం
-
ఎగ్జామ్ స్కాంలపై మోదీ సర్కార్‌కు బాబా రామ్‌దేవ్ హెచ్చరిక
హరిద్వార్: భారతీయ జనతాపార్టీకి వీర విధేయుడుగా భావించే యోగా గురు బాబా రామ్‌దేవ్ తాజా వ్యాఖ్యలు నెట్టింట సంచలనంగా మారాయి. విద్యా, నియామక పరీక్షల అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనలకు రామ్‌దేవ్ మద్దతుగా నిలవడమేకాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం విశేషం. కేంద్రం త్వరగా ఈ 'ఘప్లా' ( స్కాంలను)ను సరిదిద్దకపోతే, ఈ ఆందోళన మరింత తీవ్రరూపం దాల్చవచ్చని, ప్రభుత్వం ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని హితవుపలికారు. లేకపోతే తాను కూడా నిరసన చేపట్టాల్సి రావచ్చని వ్యాఖ్యానించారు.80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హరిద్వార్‌లోని పతంజలి యోగపీఠ్ వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి కీలక హెచ్చరికలు చేశారు. పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయులు, నీరు, విద్యుత్ వంటి ప్రాథమిక సౌకర్యాల కొరతపై విద్యార్థులు నిరసన గురించి ప్రస్తావించారు. ప్రభుత్వ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియపై అవినీతి, ధనబలం ప్రభావం చూపుతున్నాయని కూడా ఆ సందర్భంగా ఆయన ఆరోపించారు.దేశంలో అంతటా గందరగోళం నెలకొని ఉంది. తమ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరని పిల్లలు ఫిర్యాదు చేస్తున్నారు. విద్యుత్, నీరు, మరుగుదొడ్లు వంటి ప్రాథమిక సౌకర్యాలు కొరవడ్డాయి. కొన్నిచోట్ల మోసాలు విచ్చలవిడిగా జరుగుతుండగా, మరికొన్నిచోట్ల ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ ఇంటర్వ్యూలలో అవినీతి 99 శాతం వరకు ఉంది. కుల, మత ప్రాతిపదికన ఎంపికలు జరుగుతున్నాయి. ఇది రాజ్యాంగ విరుద్ధం, అత్యంత అభ్యంతరకరమైనదని రామ్‌దేవ్ మండిపడ్డారు.వారికి సిగ్గుండాలిభారత పౌరులమని చెప్పుకుంటూనే, రాజకీయ కారణాలతో లేదా కులం పేరుతో ఒకరిపై ఒకరు ద్వేషం, కక్ష పెంచుకునే వారిని ఖండిస్తున్నా అన్నారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, దళితులు, ఆదివాసీలు, అటవీ ప్రాంత వాసులు, అలాగే హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు... ఇలా ఒకరి రక్తం కోసం మరొకరు తహతహలాడుతున్నట్లుగా, పరస్పర శత్రుభావంతో నిలబడటం ఎంత దారుణంమని ఆవేదన వ్యక్తంచేశారు.ఒకవైపు 'సత్యమేవ జయతే', 'యతో ధర్మస్తాతో జయః' అని బోధిస్తూనే, మరోవైపు కోటి రూపాయల లంచం తీసుకున్న తర్వాతే నియామకాలు జరుగుతుండటంపై ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. అందరూ నిరసనలు ప్రారంభిస్తే దేశం ఎలా నడుస్తుంది? అందుకే, ఇకనైనా పద్ధతులను మార్చుకోండి; లేకపోతే, ఆందోళన మరింత తీవ్రమవుతుందని మోదీ సర్కార్‌ను హెచ్చరించారు.అలాగే నిరసనలు హింసాత్మకంగా కాకుండా, రాజ్యాంగ పరిధిలోనే ఉండాలని చెబుతూ, హింసకు, అరాచకానికి దూరంగా ఉండాలని జెన్ జెడ్ నిరసనకారులను రామ్‌దేవ్ కోరారు. స్కాములు జరుగుతున్నాయనేది కాదనలేని సత్యమన్నారు. భారతీయుల మధ్య పెరుగుతున్న శత్రుత్వాన్ని కూడా రామ్‌దేవ్ ఖండించారు. వివిధ కులాలు, వర్గాలకు చెందిన ప్రజలు ఒకరికొకరు వ్యతిరేకంగా నిలబడటం ప్రారంభించారని ఆయన అన్నారు. యువత తమ హక్కుల కోసం పోరాడేటప్పుడు చట్టాన్ని, రాజ్యాంగాన్ని అనుసరించాలని, హింసను విడనాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా 2011లో ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో తాను చేసిన అవినీతి వ్యతిరేక నిరసనను ఆ యోగా గురువు ప్రస్తావించారు. ఇదీ చదవండి: 24 గంటల్లో 1.6 లక్షల ఫాలోవర్స్ : సీజేపీ తరహాలో డీజేపీ సంచలనం -
24 గంటల్లో 1.6 లక్షల ఫాలోవర్స్ : సీజేపీ తరహాలో డీజేపీ సంచలనం
దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ ప్రభంజనం కొనసాగుతుండగానే ‘దిమాగీ నక్సల్ జనతా పార్టీ ’ అనే పేరుతో కొత్త సోషల్ మీడియా అకౌంట్లు సంచలనంగా మారాయి. రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఒక్క రోజులోనే 1.6 లక్షలకు పైగా ఫాలోవర్లను సంపాదించుకుంది. ఈ అకౌంట్‌కు 62 పోస్ట్‌లను పోస్ట్ చేయగా, సుమారు 35 మందిని ఫాలో అవుతోంది. దీంతో సీజేపీ తరహాలోనే దిమాగీ నక్సల్ పార్టీ కూడా ఇప్పుడో ఉద్యమంగా మారుతుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరికల నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ తరహాలోనే ఇప్పుడు దిమాగీ నక్సల్ పార్టీ, దిమాగీ నక్సల్స్ జనతా పార్టీ వెలుగులోకి రావడం విశేషం. మావోయిస్టులపై ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో సాధించిన విజయాలు ,నీడలా పొంచి ఉన్న ప్రమాదాల గురించి ప్రస్తావిస్తూ, దేశానికి సమస్యగా మారిన నక్సల్స్ ను ఏరిపారేశామని, ఇపుడిక దిమాగీ నక్సల్స్‌ను పని పడతామని తన ప్రసంగంలో మోదీ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం పెల్లుబుకింది.🇮🇳 DIMAAGI NAXAL JANTA PARTY — DJP 🇮🇳🚨🚨 01. NATION RE-BUILDING • ECONOMIC CONSTRUCTION🏗️ BUILD THE NATION. REBUILD THE ECONOMY.🇮🇳 $10 TRILLION ECONOMY BY 2035📈 Required nominal growth: ~10.5% CAGR⚙️ ECONOMIC RECONSTRUCTION🏭 Manufacturing: ~17% → 25% of GDP📈… pic.twitter.com/36APNRh3ua— Dimaagi Naxal Janta Party 🧠 (@DJPforINDIA) August 16, 2026 అయితే, ఈ దిమాగీ నక్సల్ జనతా పార్టీ ఖాతాను ఖచ్చితంగా ఎవరు నిర్వహిస్తున్నారనే దాని గురించి ఎలాంటి సమాచారం వెలుగులోకి రాలేదు. మరోవైపు "తెలివిగా ఉండండి.. మూర్ఖంగా ఉండకండి. ప్రశ్నలు అడగండి.. బానిసలా ఉండకండి" అంటూ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ఒక పోస్ట్‌ను 'దిమాగీ నక్సల్ జనతా పార్టీ' ఖాతా రీట్వీట్ చేసింది. ఇది ఇలా ఉండగా ప్రధానమంత్రి వ్యాఖ్యలపై రాజకీయ వివాదం చెలరేగగా, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పీ చిదంబరం, "నేను 'దిమాగీ నక్సల్' అయినందుకు గర్వపడుతున్నాను" అని స్పందించడం ఈ వివాదానికి మరింత అగ్గి రాజేసింది.కిరణ్ రిజుజు వివరణఈ వివాదం నేపథ్యంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రధానమంత్రి ప్రకటనపై స్పష్టతనిచ్చారు. "ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకులను నేరుగా 'మైండ్-మేడ్ నక్సల్స్' అని పిలవలేదని, మావోయిస్టులకు మద్దతు ఇచ్చేవారు, భారత రాజ్యాంగాన్ని అగౌరవపరిచేవారు, వేర్పాటువాదులకు మద్దతిచ్చేవారు లేదా ఈశాన్య భారతదేశాన్ని మిగిలిన భారతదేశం నుండి వేరుచేసే 'చికెన్ నెక్' ప్రాంతం దిగ్బంధనానికి మద్దతు ఇచ్చేవారిని ఉద్దేశించి ఈ పదాన్ని ఉపయోగించాదని పేర్కొన్నారు. కాగా దేశ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నిరుద్యోగ యువతను ఉద్దేశించి చేసిన బొద్దింకల వ్యాఖ్యలకు నిరసనగా పుట్టకొచ్చిందే కాక్రోచ్ జనతా పార్టీ. దీనికి సోషల్ మీడియాలో జెన్‌జీ నుంచి భారీ ఆదరణ లభించింది. అంతేకాదు నీట్ లీక్, విద్యార్థుల ఆత్మహత్యలకు నైతికబాధ్యత వహిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన ఉద్యమం, కేంద్రమంత్రి రాజీనామా దాకా కొనసాగిన సంగతి తెలిసిందే. -
నేడు బీజేపీ కొత్త టీమ్ ప్రకటన.. జాతీయ కార్యవర్గంపై ఉత్కంఠ
సాక్షి, ఢిల్లీ: బీజేపీలో కొత్త జాతీయ కార్యవర్గం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. నేడు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కొత్త టీమ్‌ను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. జాతీయ పదాధికారులతో పాటు కీలకమైన పార్టీ కమిటీలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. కొత్త కార్యవర్గంలో యువత, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు పలువురు కేంద్ర మంత్రులకు కూడా చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వచ్చే లోక్‌సభ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ అధిష్టానం కొత్త టీమ్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.అదే సమయంలో పార్లమెంటరీ బోర్డు, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, మార్గదర్శక మండలి వంటి కీలక సంస్థల్లో కూడా మార్పులు, కొత్త నియామకాలు జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, గుజరాత్, మణిపూర్, హిమాచల్‌ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఆయా రాష్ట్రాల రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని కొత్త జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాంతీయ సమీకరణాలు, సామాజిక వర్గాల ప్రాతినిధ్యం, యువతకు అవకాశం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కొత్త టీమ్‌కు తుది రూపు ఇచ్చినట్లు సమాచారం.నెల రోజులుగా కసరత్తు..జాతీయ కార్యవర్గం ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, పార్టీ సంస్థాగత వ్యవహారాల కీలక నేత బీఎల్ సంతోష్ నెల రోజుల క్రితమే కసరత్తు ప్రారంభించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, బీజేపీ కార్యక్రమాలు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం నేపథ్యంలో కొత్త కార్యవర్గం ప్రకటన కొంత ఆలస్యమైనట్లు తెలుస్తోంది.కేంద్ర కేబినెట్లో మార్పులు?బీజేపీ జాతీయ కార్యవర్గం ప్రకటన తర్వాత కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన కూడా జరిగే అవకాశం ఉందనే చర్చ ఢిల్లీ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. కొత్త పార్టీ టీమ్, కేంద్ర కేబినెట్లో మార్పులు.. రాబోయే ఎన్నికల వ్యూహంలో భాగంగానే ఉండవచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే కొత్త కార్యవర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుంది? కీలక పదవుల్లో ఎలాంటి మార్పులు ఉంటాయి? కేంద్ర మంత్రుల్లో ఎవరికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారు? అన్నదానిపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
దిమాగీ నక్సల్స్ పై పొలిటికల్ దుమారం
-
నా మిత్రులకు ఆహారం తినిపించా
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఎర్రకోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు బయలుదేరే ముందు, దినచర్యలో భాగంగా ఆవులు, నెమళ్లకు మేత తినిపించిన వీడియోను ఆదివారం సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘ఉదయాన్నే నా మిత్రులకు మేత వేయడం నా దినచర్యలో ఒక భాగం. నిన్న ఉదయాన్నే నేను బయటకు వెళ్తున్నానని నా మిత్రులు గ్రహించినట్లున్నాయి. అందుకే ముందుగానే నా వద్దకు వచ్చాయి. ఎప్పటిలాగే ఇది చాలా ప్రత్యేకమైనది’ అని ఇన్‌స్టా గ్రామ్‌లో పేర్కొన్నారు. ఎర్రకోట వేడుకల కోసం సంప్రదాయ దుస్తులు ధరించి, లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ఏడో నంబర్ నివాసంలో ఆవులకు గడ్డి, నెమళ్లకు ధాన్యపు గింజలు అందిస్తూ అందులో ప్రధాని కనిపించారు. ఆ తర్వాత ఆయన ఎర్రకోటకు చేరుకున్నారు. -
‘దిమాగీ’పై దుమారం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మావోయిస్టు తీవ్రవాదం అంతమైనప్పటికీ దిమాగీ నక్సల్స్(మేధో నక్సలైట్లు) మాత్రం సమాజానికి ముప్పుగా మారారని, వారిని గుర్తించి, ఏకాకులని చేయాలని, పూర్తిగా పక్కనపెట్టాలని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు ఇచ్చిన పిలుపు పట్ల అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మోదీ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ సహా ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. అసమ్మతిని అణచివేయడానికే విపక్షాలపై దిమాగీ నక్సలైట్ అంటూ ముద్ర వేస్తున్నారని ఆరోపించారు. మోదీ వ్యాఖ్యలను అధికార బీజేపీ నాయకులు సమర్థించారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుల గురించి కాకుండా.. కేవలం మావోయిస్టులకు, వేర్పాటువాదులకు మద్దతునిస్తూ భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించే వ్యక్తుల గురించి మాత్రమే ప్రధానమంత్రి మాట్లాడారని స్పష్టంచేశారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష నేతలను దిమాగీ నక్సల్స్ అనలేదు. 1.మావోయిస్టులకు మద్దతు ఇస్తూ భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించేవారు. 2.వేర్పాటువాదులతో అండగా నిలుస్తూ ఆరి్టకల్ 370కి మద్దతిచ్చే వారు. 4.భారతదేశం నుంచి ఈశాన్య ప్రాంతాన్ని వేరు చేయడానికి కోడి మెడ(చికెన్ నెక్)ను కత్తిరించాలని కుట్రలు సాగించేవారు మాత్రమే దిమాగీ నక్సల్స్’’ అని కిరణ్ రిజిజు తేల్చిచెప్పారు. 3 వస్తుంది, 4 కాదు: పవన్ ఖేరా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ పవన్ ఖేరా ‘ఎక్స్’లో వ్యంగ్యంగా స్పందించారు. ‘‘సోదరా కిరణ్ రిజిజు.. ముందు మీ లెక్కింపును సరిచేసుకోండి. అప్పుడు మేము సమాధానం ఇస్తాము. 1, 2 తర్వాత 3 వస్తుంది, 4 కాదు’’ అని పోస్టుచేశారు. పవన్ ఖేరా ట్వీట్‌పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నేత జైరామ్ రమేశ్ ప్రతిస్పందించారు. ‘‘సమస్త రాజకీయ శాస్త్రపు అద్భుతం’’ అని పేర్కొన్నారు. ‘‘నేను దిమాగీ నక్సలైట్ అయినందుకు గర్విస్తున్నాను’’ అంటూ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం సైతం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. చిదంబరంపై బీజేపీ నేతల ఆగ్రహం పి.చిదంబరం పోస్టుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బి.ఎల్.సంతోష్ విమర్శలు గుప్పించారు. ‘‘ఇందులో ఆశ్చర్యం లేదు. యూపీఏ ప్రభుత్వ హయాంలో చిదంబరం కాషాయ ఉగ్రవాదానికి ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెంట్‌గా పనిచేశారు’’ అని పోస్టుచేశారు. చిదంబరం తీరుపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఆగ్రహం వ్యక్తంచేశారు. అణ్వాయుధాల అవసరంపై దేశంలోనూ, పార్లమెంట్‌లోనూ పూర్తి స్థాయి, సరైన చర్చ జరిగేంత వరకు వాటిని సమకూర్చుకోవడాన్ని, భారత సాయుధ దళాలలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ చిదంబరం మాట్లాడినట్లుగా ఉన్న ఒక పాత వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘నేటి ప్రపంచ పరిస్థితులను గమనిస్తే సోనియా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పారీ్టకి చెందిన చిదంబరం చేసిన ఈ వ్యాఖ్య దిమాగీ నక్సల్ వ్యాఖ్య అవునా కాదా.. మీరే చెప్పండి?’’ అని దూబే పేర్కొన్నారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర సైతం చిదంబరంపై తీరుపై మండిపడ్డారు. ఆయన దిమాగీ నక్సల్ అనే బిరుదు తగిలించుకోవడం ఆలస్యమైనా, అది మంచి పరిణామమేనని అన్నారు. ‘‘చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు, యూపీఏ ప్రభుత్వ హయాంలో నక్సలిజం ఎందుకు బలపడిందో ఇప్పుడు అర్థమైంది. 2004–2014 మధ్య నక్సలిజంపై పోరాడుతూ దాదాపు 2,000 మంది పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు ఎందుకు ప్రాణాలు కోల్పోయారో ఇప్పుడు మాకు తెలిసింది. యూపీఏ ప్రభుత్వ పాలనలో నక్సల్స్ దాడుల వల్ల 5,000 మందికి పైగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. చిదంబరం హోం మంత్రిగా ఉన్నప్పుడు పోలీసు ఆయుధాగారాల నుంచి నక్సలైట్లు ఆయుధాలు దోచుకుపోవడానికి అనుమతించారు’’ అని తేల్చిచెప్పారు. ప్రధాని మోదీ చెప్పిన ‘దిమాగీ నక్సల్స్’ అంటే ఢిల్లీ, ముంబై, పట్నా, కోల్‌కతాల్లోని ఏసీ గదుల్లో కూర్చుని మావోయిస్టు భావజాలాన్ని పోషించే వ్యక్తులని అర్థమని బీజేపీ సీనియర్ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ‘‘వారు (నక్సలైట్లు) ఉద్యమానికి నిధులు, మద్దతు సమకూర్చుకోవడానికి తమ నెట్‌వర్క్‌లను ఉపయోగించుకుంటారు. మావోయిస్టుల దురాగతాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నప్పుడు, దిమాగీ నక్సల్స్ వారిని సమర్థిస్తూ ఆంగ్ల వార్తాపత్రికలలో వ్యాసాలు రాస్తారు’’ అని ఆరోపించారు. -
ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి పొన్నం లేఖ
హైదరాబాద్: 2027 జనాభా లెక్కల్లో ఓబీసీలకు ప్రత్యేక కేటగిరీ ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాశారు పొన్నం. ‘ ఓబీసీ, ఎస్‌ఈబీసీల సమగ్ర కులగణకు ప్రత్యేక విధానం రూపొందించాలి. ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీలకు ప్రశ్నావళిలో ప్రత్యేక కేటగిరి చేర్చాలి. ప్రతి కులం, సముదాయానికి డిజిటల్ కోడ్లు కేటాయించాలి. కులగణనలో బీసీల సమాచారాన్ని సేకరించాలి. బీసీల లెక్కలు తేలితేనే సామాజిక న్యాయం జరుగుతుంది. SECC-2011లో ఎదురైన కులపేర్ల సమస్యలు 2027 జనాభా లెక్కల్లో పునరావృతం కాకూడదు. రాష్ట్రాల వారీగా మాస్టర్ కుల డైరెక్టరీ.. ప్రతి కులం, సముదాయానికి డిజిటల్ కోడ్లు ఇవ్వాలి. స్థానిక, వివాదాస్పద కులపేర్ల నమోదుకు ప్రత్యేక ధృవీకరణ విధానం ఉండాలి. వ్యక్తి స్వయంగా ప్రకటించిన కులం, అధికారిక వర్గీకరణ రెండింటినీ డేటాలో భద్రపరచాలి. తెలంగాణ SEEPC సర్వే అనుభవాలను 2027 జనాభా లెక్కల రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోవాలి’ అని లేఖలో పేర్కొన్నారు. -
"భూమి, ఆకాశం, పాతాళం" ఆపరేషన్ సిందూర్‌పై అజిత్ దోవల్
ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ ఈ పేరు చెబితే చాలు ప్రతి భారతీయుడు హృదయం గర్వంతో ఉప్పొంగిపోతుంది. దాయాది పాకిస్థాన్ దేశానికి చెందిన ముష్కరులను వారి సొంత దేశంలోకే చొరబడి తుదముట్టించారు. భారత్ జోలికోస్తే ఎక్కడున్నా వదిలేది లేదంటూ ప్రపంచానికి భారత్ హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా దీనిపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆసక్తికర విషయాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు.ఈ ఘటనపై మాట్లాడుతూ..“ ఈ దాడి జరిగిన తర్వాత విమానాశ్రయంలోనే ప్రధాని మోదీతో మాకు సమావేశం జరిగింది. మొదట, ఆయన వాస్తవాలన్నీ తెలుసుకోవాలనుకున్నారు. ఆ తర్వాత నన్ను అడిగిన మొదటి ప్రశ్న, ‘ఇది ఎవరు చేశారు?’ "మేము వారిని వెంబడిస్తాము. వారు భూమిపై ఉన్నా, ఆకాశంలో ఉన్నా, పాతాళంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే... మేము వారిని క్షమించము," అని మోదీ తనతో ఆగ్రహంగా అన్నట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా గూడఛార సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు. వారు అద్భుతంగా పనిచేశారు. తక్కువ సమయంలోనే మనం నిందితులను గుర్తించి, కచ్చితత్వంతో చర్యలు తీసుకోగలిగామన్నారు. భారతదేశం చూపే ఉదారత లేదా సహనాన్ని ఎవరూ బలహీనతగా భావించకూడదని ప్రపంచానికి స్పష్టమైన సందేశం ఇచ్చామని తెలిపారు. పహల్గామ్ దాడికి కారణమైన శత్రువుల ఉగ్రవాద శిబిరాలను ముఖ్యంగా ధ్వంసం చేయడమే ఈ ఆపరేషన్ యొక్క ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పరిణామాలతో సంబంధం లేకుండా భారతదేశం ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొనగలదని, శత్రువులపై తీవ్రంగా ఎదురుదాడి చేయగలదని ఆయన స్పష్టం చేశారు.2025 ఏప్రిల్ 22న జరిగిన ఘోరమైన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా 2025 మే 7న 'ఆపరేషన్ సింధూర్' ప్రారంభమైంది. పాకిస్తాన్ డ్రోన్ దాడులను తిప్పికొడుతూ, పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులు చేసి కీలక నేతలను అంతమెుందించింది. -
సప్తధారతో వికసిత భారతం... పన్నెండేళ్లలో అపూర్వ ప్రగతి... స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
-
అణచి వేయడానికే ‘దిమాగీ’ మాట
న్యూఢిల్లీ: దేశంలో దిమాగీ నక్సలైట్లు అశాంతి, అరాచకాలకు సృష్టించడానికి కుట్రలు సాగిస్తున్నారంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. అసమ్మతిని అణచివేయడానికే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డాయి. నక్సలిజాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తున్నప్పటికీ, మావోయిస్టుల విషయంలో మోదీ ప్రభుత్వం చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ ఆరోపించారు. దిమాగీ నక్సలైట్లుఅంటూ ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకునే ప్రయత్నమేనని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నవారిని దేశద్రోహులుగా ముద్ర వేయడం, పాకిస్తాన్‌కు వెళ్లాలని అనడం ప్రభుత్వ పెద్దలకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. అరెస్టయిన మావోయిస్టుల పట్ల మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఉగ్రవాద చర్యలను తలపిస్తోందని ఆరోపించారు. కొందరిపై చట్టపరమైన విచారణ జరపకుండా, కస్టడీలోనే కాల్చి చంపారని ఆగ్రహం వ్యక్తంచేశారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున కూడా మోదీ అసమ్మతివాదులను టార్గెట్ చేశారని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఆక్షేపించరు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కళంకం వేయడానికి దిమాగీ నక్సల్స్ అనే పదాన్ని వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారో మర్చిపోయి, అసమ్మతివాదులను లక్ష్యంగా చేసుకోవడానికి సమయం, అవకాశం వెతుక్కుంటున్నారని రాజా తప్పుపట్టారు. ఇది కేవలం భిన్నాభిప్రాయాలను అణచివేయడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని భయపెట్టడానికి చేసే ప్రయత్నం మాత్రమేనని తేల్చిచెప్పారు. విద్య, ఉపాధికి సంబంధించి విద్యార్థులు, యువత లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించాలని ప్రధాన మోదీకి డి.రాజా సూచించారు. రాజకీయ శాస్త్రంలో మోదీ ‘ఎంఏ’ ‘‘స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ తన ప్రత్యర్థులను దిమాగీ నక్సల్స్ అని పిలుస్తూ చౌకబారు విమర్శలు చేయడం సిగ్గుచేటు. విమర్శకులను లక్ష్యంగా చేసుకోవడానికి స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఉపయోగించుకోవడం సరైంది కాదు. మోదీ ఇకనైనా అహంకారం వదిలించుకోవాలి’’ అని తృణమూల్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ సాకేత్ గోఖలే ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘‘ప్రధానమంత్రి మొదట తన ప్రత్యర్థులను అర్బన్ నక్సల్స్ అని విమర్శించారు. ఇప్పుడు వారిని దిమాగీ నక్సల్స్ అని పిలుస్తున్నారు. ఇది మోదీ నిస్సహాయతకు స్పష్టమైన సంకేతం. ఇతరులపై నిందలు వేయడంతో మోదీ ఆరితేరిపోయారు. మొత్తం రాజకీయ శాస్త్రంలోనే ఆయన మాస్టర్ అబ్యూజర్(ఎంఏ). కాబట్టి ప్రధానమంత్రికి ఎంఏ డిగ్రీ ఉండటంలో ఆశ్చర్యం లేదు’’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ‘ఎక్స్’లో తేల్చిచెప్పారు. -
యువతకు ఉచితంగా ఆన్లైన్ కోచింగ్
న్యూఢిల్లీ: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ఉచిత ఆన్లైన్ కోచింగ్ కార్యక్రమాన్ని ప్రకటించారు. అలాగే కోటి మంది యువతకు కృత్రిమ మేధ(ఏఐ) శిక్షణ ఇస్తామని వెల్లడించారు. ఆయన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మాట్లాడుతూ.. కోచింగ్ తరగతులు పేద, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నాయని చెప్పారు. అందుకే వివిధ పరీక్షలకు ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ అందించబోతున్నట్లు తెలిపారు. పిల్లలను కోచింగ్ క్లాసులకు పంపించడం తల్లిదండ్రులకు నేడు ఒక ప్రతిష్టగా మారిపోయిందని గుర్తుచేశారు. కోచింగ్‌పై వెచ్చించే వేల కోట్ల రూపాయలను ఉచిత ఆన్లైన్ శిక్షణతో ఆదా చేసుకోవచ్చని, పిల్లలకు దగ్గరగా ఉంటూ వారిని జాగ్రత్తగా చూసుకోవచ్చని అన్నారు. మనకు డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు ఉన్నాయని, అద్భుతమైన ప్రతిభ, చక్కటి ఉపాధ్యాయులు ఉన్నారని ప్రధానమంత్రి చెప్పారు. ఈ వనరులన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా యువతకు ఉచిత కోచింగ్ అందించేందుకు పూర్తిస్థాయి నెట్‌వర్క్‌ను నిర్మించబోతున్నామని స్పష్టంచేశారు. -
‘ఉర్దూమే తిరంగా పెహనాహై’
న్యూఢిల్లీ: స్వాతంత్య్రోత్సవాల్లో ప్రధాని నరేంద్రమోదీ కోటు జేబులోని ఒక వస్త్ర విశేషం శనివారం సామాజిక మాధ్యమంలో పెద్ద దుమారమే రేపింది. మూడు రంగులున్న ఈ పాకెట్ స్క్వెర్‌పై కాంగ్రెస్ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. జాతీయ జెండా రంగుల్లోనే ఉన్నప్పటికీ వాటి క్రమం తిరగేసి ఉండటం విమర్శలకు కారణమైంది. ఆ పాకెట్ స్క్వెర్ భారత జాతీయ జెండాలా లేదని, ఐర్లాండ్ పతాకంలా ఉందని కాంగ్రెస్ నేతలు కొందరు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తే... ఆ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ‘‘లగ్తా హై సాహిబ్ నే ఉర్దూ మే తిరంగా పెహనా హై. యా ఫిర్ భారత్ కి జగా ఐర్లాండ్‌గా ఇండిపెండెన్స్ డే మనా రహా హై’’(బహుశా ప్రధాని త్రివర్ణ పతాకాన్ని ఉర్దూలో ధరించినట్లు ఉన్నారు. లేదంటే ఐర్లాండ్ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకుంటున్నారేమో) అని ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. ఉర్దూ భాషను కుడి నుంచి ఎడమకు రాస్తారన్న విషయం తెలిసిందే. పవన్ ఖేరా వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేథ్ సమర్థించడమే కాకుండా... ఆ పాకెట్ స్క్వెర్లోని రంగులు కాషాయం, తెలుపు, పచ్చలుగా కాకుండా తిరగేసి ఉన్నాయని ఎత్తి చూపారు. ‘‘ఇది ఏ శైలి త్రివర్ణ పతాకం. తిరగేసి ఉంది. భారతదేశానిది కాకుండా ఐర్లాండ్దిలా ఉంది’’అని ఆమె ఎక్స్ పోస్టులో తెలిపారు. ఈ వ్యవహారం మొత్తం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. కొందరు కాంగ్రెస్‌ను విమర్శిస్తే మరికొందరు మోదీ జాతీయ పతాకాన్ని వేసుకుని తిరగడం లేదని అశోక చక్రం లేని విషయాన్ని ఎత్తి చూపారు. మరికొందరు జాతీయ జెండాకు సంబంధించిన నిబంధనలు పాటించి ఉండాల్సిందని సలహా ఇచ్చారు. ఇంకొందరైతే త్రివర్ణం ధరించడం వెనుక ఉద్దేశాన్ని చూడాలని దీన్ని కూడా రాజకీయం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. -
సప్తధారతో వికసిత భారతం
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సిద్ధికి వందేళ్లు నిండేనాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలందరికీ పిలుపునిచ్చారు. పన్నెండేళ్లలో సాధించిన పురోగతిని వివరిస్తూనే.. 2047 నాటికి వికసిత భారతాన్ని ఆవిష్కరించేందుకు ఒక్కొక్కరూ కంకణం కట్టుకుని తమవంతు తోడ్పాటు, కృషి చేయాలని ఆయన ఎర్రకోట వేదికగా శనివారం జరిగిన 80వ స్వాతంత్య్రోత్సవ వేడుకల్లో కోరారు. ఏడు రకాల శక్తులు కలిస్తే (సప్త ధార) ఇది అసాధ్యం కానేకాదని భరోసానిచ్చిన మోదీ.. లక్ష్యసాధనకు సాధించాల్సిన ప్రగతిపై కూడా నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించారు. దేశీ కంపెనీల్లో కనీసం యాభై ఫార్చ్యూన్ 500 జాబితాలో చోటు సంపాదించుకోవాలని, అంతర్జాతీయంగా టాప్ 5 బ్యాంకుల్లో ఒకటైనా భారత్‌ది అయి ఉండాలని స్పష్టం చేశారు. ప్రపంచ భవిష్యత్తును శాసించనున్న కృత్రిమ మేధ రంగంలో అగ్రస్థానంలో నిలిచే లక్ష్యంతో వచ్చే ఏడాది కోటి మంది యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తామని ప్రకటించారు. శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు విభేదాలు మరచి రాజకీయ పార్టీలన్నీ ముందుకు రావాలని కోరారు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో యువత నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు. దేశంలో సాయుధ నక్సలిజం లేకుండా పోయినా ‘దిమాగీ నక్సల్స్’ఇంకా ఉన్నారని హెచ్చరించారు. దేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు రాజధాని ఢిల్లీలో ఘనంగా మొదలయ్యాయి. శనివారం ఉదయం 6.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మాగాం«దీకి నివాళులు అర్పించి ఎర్రకోటకు చేరుకున్నారు. రక్షణశాఖ కార్యదర్శి, గార్డ్ ఆఫ్ హానర్ కమాండర్ సుమారు 7.15 గంటల ప్రాంతంలో ప్రధానిని ఆహ్వానించారు. ఆ తరువాత ప్రధాని గార్డ్ ఆఫ్ హానర్‌ను అందుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వందేమాతర గీతం 150వ వార్షికోత్సవాన్ని చిరస్మరణీయం చేస్తూ ఆర్మీబ్యాండ్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మొదటిసారి దీన్ని ఆలపించడం, ఆ తరువాత 21 తుపాకులతో ‘రాష్ట్రీయ సెల్యూట్’, జాతీయ గీతాలాపన జరిగాయి. ఇదే సమయంలో భారతీయ వాయుసేనకు చెందిన రెండు ఎంఐ–17 హెలికాప్టర్లు వేదికపై పుష్ఫవర్షం కురిపించాయి. ఒక హెలికాప్టర్ జాతీయ పతాకాన్ని, మరోటి ‘వందే మాతరం’అని రాసి ఉన్న జెండాను మోసుకెళుతూ కనిపించాయి. అనంతరం 7.40 గంటలకు ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం భారతీయులు అందరి లక్ష్యం కావాలని నిర్దేశించిన ప్రధాని మోదీ ఎర్రకోటపై తొలిసారి వందేమాతరం పాడటంపై సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో ప్రకృతి వైపరీత్యాల బారిన పడి ఇబ్బందులు పడుతున్న వారికి దేశం దన్నుగా ఉంటుందని భరోసానిచ్చిన ప్రధాని గత పన్నెండేళ్లలో వివిధ రంగాల్లో సాధించిన పురోగతిని సోదాహరణంగా వివరించారు. అనంతరం వికసిత భారత లక్ష్యాన్ని అందుకునేందుకు సాయం చేయగల సప్తధార శక్తులను ప్రకటించారు. అంతేకాకుండా దేశం అనుకున్నది అనుకున్నట్టుగా సాధించేందుకు వేయాల్సిన ముందడుగులను వివరించారు. యువత ఉన్నత శిఖరాలను అందుకునేందుకు దేశం అండగా ఉంటుందని చెప్పిన ప్రధాని మత్తుమందుల మహమ్మారిని పారదోలే లక్ష్యంతో వలంటీర్లు, ఎన్జీవోలు, సామాజిక, సాంస్కృతిక సంస్థలు, ఆధ్యాతి్మక నాయకులతో కలిసి వంద వారాల ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించారు. పురోగతి బాటలో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో గత పన్నెండేళ్లలో దేశం సాధించిన పురోగతిని ఇలా వివరించారు... → రక్షణ రంగ ఉత్పత్తులు దాదాపు నాలుగు రెట్లు పెరిగాయి. → ఖాదీ, గ్రామీణ పరిశ్రమల్లో పురోగతి ఐదు రెట్లు → ఎల్రక్టానిక్స్ ఉత్పత్తుల తయారీలో పెరుగుదల ఏడు రెట్లు. → ఆధునిక రైల్వే కోచ్‌ల ఉత్పత్తి 21 రెట్లు పెరిగింది. → మొబైల్ ఫోన్ల తయారీలో పెరుగుదల 33 రెట్లు ఎక్కువైంది. → ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువైంది. → పేటెంట్లు కూడా 4 రెట్లు ఎక్కువయ్యాయి. → డిజిటల్ లావాదేవీలు దాదాపు 100 రెట్లు పెరిగాయి. → నల్లాల ద్వారా తాగునీటి కనెక్షన్లు గతం కంటే 15 రెట్లు వేగంగా అందిస్తున్నాం. → గ్యాస్ కనెక్షన్లు అందించే వేగం కూడా ఆరు రెట్లు ఎక్కువైంది. → స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణం నాలుగు రెట్లు వేగంగా జరుగుతోంది. → పీఎం ఆవాస్ యోజన కింద పేదల కోసం ఇళ్ల నిర్మాణ వేగం మూడు రెట్లు పుంజుకుంది. → పేదరికం నుంచి బయటపడ్డ వారి సంఖ్య 25 కోట్లు. → ‘‘ఫ్రాజైల్ ఫైవ్’’నుంచి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుదల → దేశం మొత్తమ్మీద 2.5 లక్షలకు పైగా స్టార్టప్‌లు → 650 కొత్త యూనివర్సిటీల స్థాపనలక్ష్య నిర్దేశం 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు భారతీయ సంస్థలు, బ్రాండ్లు పలు లక్ష్యాలను సాధించాలి. ఫార్చ్యూన్ 500లో 50 భారతీయ కంపెనీలు ఉండాలి. బ్యాంకులు, ఫార్మా, లాఫర్మ్లు, రేటింగ్ ఏజెన్సీలు, ఐటీ, కన్సల్టింగ్, అకౌంటింగ్ సంస్థలు కూడా ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరాలి. భారతీయ బ్రాండ్లు విశ్వాసానికి ప్రతీకలుగా మారాలి. దేశాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థలన్నీ కలిసికట్టుగా పని చేయాలి. భారతీయ ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ కంపెనీలు కొత్త ఉపాధి అవకాశాలకు దారులు తెరుస్తోంది. 2036 ఒలింపిక్స్, 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు దేశం సిద్ధం. ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఆత్మనిర్భర్ భారత్ దిశగా సెమీకండక్టర్లు, క్రిటికల్ మినరల్స్, శక్తి భద్రతపై దృష్టి సారించాలి మూడు సెమీకండక్టర్ ప్లాంట్లలో ఉత్పత్తి మొదలైంది. వచ్చే ఏడు, ఎనిమిదేళ్లలో మరో ఎనిమిది ప్లాంట్ల స్థాపన. 2047 నాటికి వంద గిగావాట్ల అణు శక్తి లక్ష్యం. ఈ దశాబ్దంలో ఐదు కొత్త అణు రియాక్టర్లు ప్రారంభం. సౌర శక్తి సామర్థ్యం రెండు గిగావాట్ల నుంచి 160 గిగావాట్లకు వృద్ధి. పీఎం సూర్య ఘర్ పథకం కింద 50 లక్షలకు పైగా రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్లు. యువత, క్రీడలు, మహిళా సాధికారత దేశంలో 2.5 లక్షలకు పైగా స్టార్టప్‌లు ఉన్నాయి. రూ.లక్ష కోట్లతో ఇన్నోవేషన్ ఫండ్. డ్రగ్–ఫ్రీ ఇండియా జాతీయ మిషన్‌గా మారాలి.సప్తధార: ఏడు శక్తి ప్రవాహాలు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి ‘‘సప్తధార’’అనే ఏడు శక్తి ప్రవాహాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. రానున్న ఐదు, ఏడేళ్లు చాలా కీలకమని, ప్రజలు పని సంస్కృతి తోపాటు మైండ్‌సెట్‌నూ మార్చుకుని దశాబ్దాలుగా అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలిని అన్నారు. ప్రధాని వివరించిన సప్తధారల వివరాలు... → తయారీ శక్తి: డిజైన్ నుంచి తయారీ వరకు మొత్తం అన్ని దశలూ భారత్‌లోనే పూర్తవ్వాలి. నాణ్యమైన ఉత్పత్తుల తయారీకి కేంద్రంగా మారాలి. ఖర్చు, నాణ్యతల పరంగా భారతీయ పరిశ్రమలు ప్రపంచ దేశాలతో పోటీపడాలి. నమ్మదగ్గ, యూజర్ ఫ్రెండ్లీ, ఆకర్శణీయమైన ఉత్పత్తుల తయారీ లక్ష్యంగా పనిచేయాలి. → వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్: చిరుధాన్యాలు, మసాలా దినుసులు, పండ్లు, పూలు, సంప్రదాయ ఆహారాలను ప్రపంచ బ్రాండ్లుగా మార్చాలి. రసాయన–రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ల కారణంగా అందుబాటులోకి వచ్చిన ప్రపంచ మార్కెట్లను రైతులు సది్వనియోగం చేసుకోవాలి. పొలాల నుంచి నేరుగా ఎగుమతులు జరగాలి → టెక్నాలజీ, ఇన్నొవేషన్: ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, అంతరిక్ష ప్రయోగాలు, రోబోటిక్స్, డేటా సెంటర్లలో కొత్త కొత్త ఆవిష్కరణలు చేసేలా ఎదగాలి యూపీఐ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ప్రపంచానికి మార్గదర్శకం కావాలి. 6జీ సాంకేతికతను దేశీయంగా అభివృద్ధి చేయాలి. → గతి శక్తి: హై–స్పీడ్ రైలు, ఆధునిక హైవేలు, అంతర్గత జలమార్గాలు, ప్రపంచ స్థాయి విమానాశ్రయాలు, మల్టీమోడల్ లాజిస్టిక్స్ వ్యవస్థల ద్వారా నగరాలను అనుసంధానించాలి. పోర్టులను పోర్ట్–ఆధారిత అభివృద్ధి కేంద్రాలుగా మార్చాలి. → రక్షణ శక్తి: రక్షణ రంగంలో దేశం స్వావలంబన సాధించడంతోపాటు ప్రపంచదేశాలకు రక్షణ ఉత్పత్తులను సరఫరా చేసేదిగా ఎదగాలి. డ్రోన్లు, కౌంటర్ డ్రోన్లతోపాటు హైపర్ సోనిక్ టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలి. సైబర్ సెక్యూరిటీ రంగంలో భారత యువత కీలక పాత్ర పోషించాలి. → గ్రీన్, బ్లూ ఎకానమీ: గ్రీన్ హైడ్రోజన్, సంప్రదాయేతర ఇంధన వనరులు, ఇంధన నిల్వ, పర్యావరణ హితమైన రవాణా, తయారీల కోసం కృషి జరగాలి. మత్స్య, తీరప్రాంత పర్యాటకం, ఓషన్ టెక్నాలజీల సాయంతో దేశం బ్లూ ఎకానమీలోనూ అగ్రస్థానానికి చేరవచ్చు. దేశ సంపదైన సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉపాధి, ఆర్థిక వృద్ధికి అవకాశాలు సృష్టికి అనుకూలం. → సాఫ్ట్ పవర్: భారతదేశ సాఫ్ట్ పవర్‌కు యోగా, ఆయుర్వేదం, ఆధ్యాతి్మకత, ఆరోగ్య సంరక్షణ, హస్తకళలు, సంస్కృతి, సినిమా, వీఎఫ్ఎక్స్, యానిమేషన్, గేమింగ్, డిజిటల్ కంటెంట్లు నిదర్శనాలు. యువతకు అపార అవకాశాలు కల్పించగల సత్తా వీటికి ఉంది. హెల్త్ టూరిజమ్ ప్రోత్సాహానికి ‘హీల్ ఇన్ ఇండియా’ఉపయోగపడుతుంది. వేవ్స్ సమ్మిట్ దేశ సృజనాత్మక, వినోద పరిశ్రమల సత్తాను చాటింది. వందకు పైగా ఉన్న జాతీయ పార్కులతోపాటు వన్యప్రాణి సంపద పర్యాటక రంగాన్ని ఆకర్శించేందుకు సాయపడుతుంది. అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలు, కచేరీలు, యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించగలవు. -
అభివృద్ధి చెందిన భారత్ కోసం.. 'సప్తధార' సూత్రం!
2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ కీలక దిశానిర్దేశం చేశారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. ఎర్రకోట నుంచి జాతి ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. దేశ ప్రగతికి ఏడు ప్రధాన శక్తులు అవసరమని పేర్కొన్నారు. వీటినే 'సప్తధార'గా అభివర్ణించారు.ఉత్పాదక శక్తి (Manufacturing power)మోదీ 'సప్తధార'లో మొదటి స్థానాన్ని తయారీ రంగానికి ఇచ్చారు. చిన్న వస్తువుల నుంచి భారీ పరిశ్రమల వరకు సాధ్యమైనంత ఎక్కువగా భారత్‌లోనే తయారు చేయాలి అనేది ప్రధాని ఆలోచన. కేవలం ఉత్పత్తి చేయడం మాత్రమే కాకుండా.. డిజైన్, తయారీ, నాణ్యత, సరఫరా వంటి మొత్తం విలువ గొలుసును దేశంలోనే అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. ప్రపంచ దేశాలకు భారత్ ఒక నమ్మకమైన సప్లై చైన్ భాగస్వామిగా ఎదగాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు, పారిశ్రామికవేత్తలు ధరతో పాటు నాణ్యత, ఉత్పత్తి సామర్థ్యంపై కూడా దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.వ్యవసాయం, ఆహార ఉత్పత్తి (Agriculture and food production)రెండో శక్తిగా వ్యవసాయం, ఆహార ఉత్పత్తి, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలను ప్రధాని ప్రస్తావించారు. మన రైతులు కేవలం దేశీయ మార్కెట్‌పైనే ఆధారపడకుండా.. ప్రపంచ మార్కెట్‌ను కూడా లక్ష్యంగా చేసుకోవాలని ఆయన అన్నారు. చిరుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, పండ్లు, పూలు, సంప్రదాయ ఆహార పదార్థాలు, రసాయన రహిత వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అంటే.. పొలంలో పంట పండించడం దగ్గరే ప్రక్రియ ఆగిపోకూడదు. ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, బ్రాండింగ్, ఎగుమతుల వరకు పూర్తి వ్యవస్థను అభివృద్ధి చేయాలి చెప్పారు.టెక్నాలజీ, ఆవిష్కరణ (Technology and innovation)మూడో శక్తిగా టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ను ప్రధాని ప్రస్తావించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్వాంటం టెక్నాలజీ, అంతరిక్ష రంగం, రోబోటిక్స్, డేటా సెంటర్లు వంటి భవిష్యత్ రంగాల్లో భారత్ మరింత ముందుకు వెళ్లాలని అన్నారు. యూపీఐ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారత్ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ.. తదుపరి తరం కమ్యూనికేషన్ టెక్నాలజీలో కూడా దేశం నాయకత్వం వహించాలని చెప్పారు. ముఖ్యంగా మేడ్ ఇన్ ఇండియా 6జీను ప్రపంచానికి అందించే స్థాయికి భారత్ ఎదగడమే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు.గతి శక్తి (Gati Shakti)నాలుగో శక్తిగా గతిశక్తిని ప్రధాని పేర్కొన్నారు. దేశంలో రవాణా, కనెక్టివిటీ మరింత వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. హైస్పీడ్ రైళ్లు, కొత్త పోర్టులు, విమానాశ్రయాలు, హైవేలు వంటి మౌలిక వసతులను విస్తరించడంతో పాటు.. దేశంలోని నగరాలు, పరిశ్రమలు, పోర్టులు పరస్పరం మెరుగ్గా అనుసంధానమయ్యేలా చూడాలని సూచించారు. పోర్టులను కేవలం సరుకులు ఎగుమతి, దిగుమతి చేసే ప్రాంతాలుగా కాకుండా.. ఆర్థిక అభివృద్ధికి కేంద్రాలుగా మార్చాలని ఆయన అభిప్రాయపడ్డారు.రక్షణ శక్తి (Raksha Shakti)ఐదో శక్తిగా రక్షణ రంగం గురించి పేర్కొన్నారు. రక్షణ ఉత్పత్తుల కోసం ఇతర దేశాలపై ఆధారపడకుండా.. భారత్ మరింత ఆత్మనిర్భర్‌గా మారాలని ప్రధాని చెప్పారు. డ్రోన్లు, కౌంటర్ డ్రోన్ వ్యవస్థలు, హైపర్సోనిక్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక రంగాల్లో భారత్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని అన్నారు. భారత్ కేవలం ప్రపంచ దేశాలకు మార్కెట్‌గా ఉండకుండా.. అత్యాధునిక రక్షణ సాంకేతికతను తయారు చేసి ఇతర దేశాలకు అందించే స్థాయికి ఎదగాలన్నది లక్ష్యం.గ్రీన్, బ్లూ ఎకానమీ (Green economy and blue economy)ఆరవ శక్తిగా గ్రీన్, బ్లూ ఎకానమీలను ప్రధాని ప్రస్తావించారు. గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధనం, ఎనర్జీ స్టోరేజ్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, పర్యావరణహిత తయారీ వంటి రంగాల్లో భారత్ భారీ అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు.అదే సమయంలో.. దేశానికి ఉన్న విస్తారమైన సముద్ర తీరాన్ని కూడా ఆర్థిక అభివృద్ధికి ఉపయోగించుకోవాలని సూచించారు. మత్స్య పరిశ్రమ, సముద్ర సాంకేతికత, తీర ప్రాంత పర్యాటకం వంటి రంగాలను అభివృద్ధి చేయడం ద్వారా బ్లూ ఎకానమీకి మరింత ఊతమివ్వాలని అన్నారు.యువశక్తి, సాఫ్ట్ పవర్ (India’s soft power)'సప్తధార'లో చివరి శక్తిగా యువశక్తి, భారత సాఫ్ట్ పవర్‌ను ప్రధాని వివరించారు. యోగా, ఆయుర్వేదం, ఆధ్యాత్మికత, ఆరోగ్యం, హస్తకళలు వంటి సంప్రదాయ రంగాలతో పాటు సినిమాలు, యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గేమింగ్, డిజిటల్ కంటెంట్ వంటి ఆధునిక సృజనాత్మక రంగాల్లో కూడా భారత్ ప్రపంచవ్యాప్తంగా తన ప్రభావాన్ని పెంచుకోవాలని అన్నారు.అంతే కాకుండా.. వైద్య పర్యాటకాన్ని ప్రోత్సహించడం, భారతదేశంలోని ప్రకృతి అందాలు, జాతీయ పార్కులు, పర్యాటక ప్రాంతాలను ప్రపంచానికి మరింతగా పరిచయం చేయడం ద్వారా దేశ సాఫ్ట్ పవర్‌ను పెంచుకోవాలని సూచించారు.'సప్తధార'లో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ ఏడు రంగాలను వేర్వేరుగా చూడకూడదని ప్రధాని స్పష్టం చేయడం. ఉదాహరణకు తయారీ రంగానికి టెక్నాలజీ అవసరం. వ్యవసాయానికి ఫుడ్ ప్రాసెసింగ్ అవసరం. ఎగుమతులకు మెరుగైన లాజిస్టిక్స్ అవసరం. రక్షణ రంగానికి ఆవిష్కరణలు అవసరం. గ్రీన్ ఎకానమీకి యువత, టెక్నాలజీ అవసరం. అంటే.. ఒక రంగం అభివృద్ధి చెందితే దాని ప్రభావం మరో రంగంపైనా పడుతుంది. ఈ రంగాలన్నింటినీ కలిపి ముందుకు తీసుకెళ్లడమే 'సప్తధార' ఆలోచనలోని అసలు ఉద్దేశం.వికసిత్ భారత్ లక్ష్యానికి.. సప్తధార!మన దేశం స్వాతంత్య్రం సాధించి 100 సంవత్సరాలు పూర్తిచేసుకునే 2047 నాటికి వికసిత్ భారత్‌గా మారాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే కేవలం ఒకటి రెండు రంగాలు అభివృద్ధి చెందితే సరిపోదు. తయారీ నుంచి వ్యవసాయం వరకు, టెక్నాలజీ నుంచి రక్షణ వరకు, గ్రీన్ ఎకానమీ నుంచి యువశక్తి వరకు అన్ని రంగాలు కలిసి ముందుకు సాగాలి.ఇదీ చదవండి: 80 ఏళ్లలో 1711 రెట్లు పెరిగిన బంగారం! -
దేశంలో ‘‘స్వచ్ఛంద సేవకుల దళం’’ ఏర్పాటు? అంటే ఏంటి?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద ప్రసంగిస్తూ.. ‘‘వైబ్రంట్ సివిల్ డిఫెన్స్ నెట్వర్క్’’తో పాటు ‘‘భారీ, ఆధునిక పౌర రక్షణ స్వచ్ఛంద సేవకుల దళాన్ని’’ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆధునిక భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు పౌరులు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. 2025 మేలో ఆపరేషన్ సిందూర్ తరువాత పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో సివిల్ డిఫెన్స్ స్వచ్ఛంద సేవకులను రంగంలోకి దింపి దేశవ్యాప్తంగా కృత్రిమ విన్యాసాలు నిర్వహించారు. అసలు ఈ దళం అంటే ఏమిటి? జాతీయ భద్రత కోసం పౌర స్వచ్ఛంద సేవకుల దళాన్ని భారత్ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారా?ఈ ప్రతిపాదిత దళం భారత్‌లో తొలి పౌర స్వచ్ఛంద సంస్థ కాదు. వాస్తవానికి 1968 సివిల్ డిఫెన్స్ చట్టం కింద భారత్‌లో ఇప్పటికే చట్టబద్ధమైన సివిల్ డిఫెన్స్ దళం ఉంది. సివిల్ డిఫెన్స్ దళాల ఏర్పాటు, శిక్షణ లేదా సివిల్ డిఫెన్స్ విధులకు పిలిచే పౌర స్వచ్ఛంద సేవకుల నియామకానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. 1968 సివిల్ డిఫెన్స్ నిబంధనల్లో ప్రజలను తరలించడం, కీలక మౌలిక వసతులకు రక్షణ కల్పించడం, అగ్నిప్రమాదాల నివారణ, ప్రజలకు అవగాహన కల్పించడం, శత్రు దాడుల నుంచి రక్షణకు ముందస్తు జాగ్రత్తలు వంటి చర్యలు ఉన్నాయి. అందువల్ల సివిల్ డిఫెన్స్ అంటే యుద్ధ సమయంలో పోరాటానికి మాత్రమే పరిమితం కాదు. అత్యవసర పరిస్థితుల్లో పౌరులు, కీలక సేవలను రక్షించడం దీని ప్రధాన ఉద్దేశం.స్వచ్ఛంద సేవకులు ఏం చేయవచ్చు?సాంప్రదాయ సివిల్ డిఫెన్స్ విధుల్లో అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో సహాయపడటం, కీలక సేవలకు రక్షణ కల్పించడం, అగ్నిప్రమాదాలను ఎదుర్కోవడం, అత్యవసర సూచనలను ప్రజలకు చేరవేయడం ఉన్నాయి. ఆధునికీకరించిన వ్యవస్థలో ప్రథమ చికిత్స, గాలింపు, రక్షణ చర్యలు, అత్యవసర సమాచార వ్యవస్థలు, ప్రజల తరలింపు నిర్వహణ, ఆశ్రయ కేంద్రాల నిర్వహణ, విపత్తుల సమయంలో సహాయక చర్యలు వంటి రంగాలకు ఈ బాధ్యతలు విస్తరించే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం మరిన్ని వివరాలు వెల్లడించే వరకు ఇవి మోదీ ప్రతిపాదించిన దళంలో ఖరారైన విధులుగా కాకుండా సాధ్యమైన విధులుగా మాత్రమే చూడాలి.ఆపరేషన్ సిందూర్ సమయంలో ఏం జరిగింది?పాకిస్థాన్‌తో ఘర్షణల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో సివిల్ డిఫెన్స్ స్వచ్ఛంద సేవకులను రంగంలోకి దించారు. ఆరోగ్యం, అగ్నిమాపక, అత్యవసర సేవలు, పశుసంపద నిర్వహణ, నిత్యావసర వస్తువుల సరఫరాలో 2,818 మంది స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2025 మే 7న 244 జిల్లాల్లో సివిల్ డిఫెన్స్ కృత్రిమ విన్యాసాలు నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది. వైమానిక దాడుల హెచ్చరిక సైరన్లు, విద్యుత్ దీపాల ఆర్పివేత, ప్రజల తరలింపు, అగ్నిమాపక చర్యలు, గాలింపు, రక్షణ చర్యలు, క్షతగాత్రుల తరలింపు, అత్యవసర వైద్య ఏర్పాట్లను ఈ విన్యాసాల్లో పరీక్షించారు.ఇది ఎన్సీసీకి ఎలా భిన్నం?జాతీయ సేవలో పౌరులు లేదా స్వచ్ఛంద సేవకులను భాగస్వాములను చేసే సంస్థలు భారత్‌లో ఇప్పటికే ఉన్నాయి. అయితే వాటి ఉద్దేశాలు వేర్వేరుగా ఉంటాయి. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) ప్రధానంగా యువతకు సంబంధించిన సంస్థ. 1948 ఎన్సీసీ చట్టం కింద ఏర్పాటైన ఈ సంస్థ విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సేవా భావాన్ని పెంపొందించే శిక్షణ అందిస్తుంది.ఎన్సీసీ క్యాడెట్లు సామాజిక సేవ, విపత్తు సహాయక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. అయితే ఎన్సీసీ అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే దళం కాదు. యువత అభివృద్ధి, శిక్షణ, వ్యక్తిత్వ వికాసంపై ఇది ప్రధానంగా దృష్టి పెడుతుంది. మరోవైపు సివిల్ డిఫెన్స్ ను ప్రత్యేకంగా పౌరుల రక్షణ, అత్యవసర పరిస్థితుల్లో సన్నద్ధత కోసం రూపొందించారు.హోమ్ గార్డులు, టెరిటోరియల్ ఆర్మీ సంగతేంటి?పోలీసులకు సహాయం చేసేందుకు హోమ్ గార్డులను 1946లో తొలిసారిగా స్వచ్ఛంద సంస్థగా ఏర్పాటు చేశారు. 1962 భారత్-చైనా యుద్ధం తరువాత మరింత ఏకరీతి హోమ్ గార్డుల వ్యవస్థను అభివృద్ధి చేయాలని కేంద్రం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ప్రోత్సహించింది. వరదలు, అగ్నిప్రమాదాలు, భూకంపాలు, తుపాన్లు వంటి అత్యవసర పరిస్థితుల్లో హోమ్ గార్డులు పోలీసులకు సహాయం చేయడంతో పాటు అధికారులకు తోడ్పడవచ్చు. వారు సివిల్ డిఫెన్స్ విధులను కూడా నిర్వహించవచ్చు.హోమ్ గార్డులు ప్రధానంగా పోలీసులకు సహాయక దళంగా పనిచేస్తారు. సివిల్ డిఫెన్స్ మాత్రం పౌరుల రక్షణ, అత్యవసర పరిస్థితుల్లో సన్నద్ధతపై దృష్టి పెడుతుంది. అలాగే హోమ్ గార్డులు వేతనం పొందే స్వచ్ఛంద సేవకుల దళం. అయితే విధులకు పిలిచిన రోజులకు మాత్రమే గౌరవ వేతనం లేదా కూలీ అందుతుంది.టెరిటోరియల్ ఆర్మీ కూడా పౌరులు స్వచ్ఛందంగా జాతీయ భద్రతా బాధ్యతలు చేపట్టే మరో ఉదాహరణ. అయితే ఇది సివిల్ డిఫెన్స్‌కు పూర్తిగా భిన్నమైనది. టెరిటోరియల్ ఆర్మీ సిబ్బంది సాధారణంగా తమ తమ వృత్తుల్లో పౌరులుగా ఉంటారు. అయితే వారు సైనిక శిక్షణ పొందుతారు. సైనిక సేవకు పిలిచినప్పుడు విధులు నిర్వర్తించవచ్చు. వారు సైనిక రిజర్వ్ వ్యవస్థలో భాగంగా ఉంటారు. అవసరమైనప్పుడు సాధారణ సైన్యానికి సహాయం చేయవచ్చు. టెరిటోరియల్ ఆర్మీ సిబ్బందికి నెలవారీ స్థిర వేతనం ఉండదు. అయితే శిక్షణ సమయంలో, విధుల్లో ఉన్నప్పుడు అదే హోదాలోని సైనిక అధికారికి లభించే వేతనం, భత్యాల స్థాయిలో చెల్లింపులు అందుతాయి. దీనికి భిన్నంగా సివిల్ డిఫెన్స్ స్వచ్ఛంద సేవకులు సైనికులు కాదు. అలాగే వారు హోమ్ గార్డులకు పూర్తిగా సమానమైన వారు కూడా కాదు.కొత్త స్వచ్ఛంద సేవకులకు ఆయుధాలు ఇస్తారా?ప్రతిపాదిత సివిల్ డిఫెన్స్ స్వచ్ఛంద సేవకులకు ఆయుధాలు ఇస్తారని మోదీ ప్రకటనలో ఎలాంటి సూచన లేదు. సివిల్ డిఫెన్స్ ఉద్దేశం పౌరులను రక్షించడం, అత్యవసర సేవలకు సహాయం చేయడం, సంక్షోభ సమయంలో కీలక సేవలను కొనసాగించడం. ఇది మరో సాయుధ దళం కాదు. అమెరికా దీనికి ఉదాహరణ. అమెరికా రాజ్యాంగంలోని రెండో సవరణ ఆయుధాలను కలిగి ఉండే, ధరించే హక్కును రక్షిస్తూ “క్రమబద్ధమైన మిలీషియా” గురించి ప్రస్తావిస్తుంది. ఆ మిలీషియా ప్రస్తావన తొలినాటి అమెరికాలోని పౌర సైనిక దళాల వ్యవస్థను ప్రతిబింబించింది. తరువాత వ్యక్తిగతంగా తుపాకులు కలిగి ఉండే హక్కుపై అమెరికాలో జరుగుతున్న రాజ్యాంగపరమైన చర్చలో ఈ నిబంధన కీలకంగా మారింది.మొత్తానికి సివిల్ డిఫెన్స్ అంటే యుద్ధం లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో పౌరులను రక్షించడం, అత్యవసర సేవలకు సహాయం చేయడం, ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు ముందస్తు సన్నద్ధత కల్పించే వ్యవస్థ. -
ఎవరీ కెప్టెన్ సోనియా సింగ్ చౌహాన్? స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీకి..
భారతదేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎర్రకోట వద్ద జరిగే వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వం వహించారు. ఈ ఏడాది ‘వందే మాతరం’ 150 సంవత్సరాల చరిత్రను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తొలిసారిగా జాతీయ గేయం ‘వందే మాతరం’ను పూర్తిస్థాయిలో ఆలపించారు. ఈ కార్యక్రమంలో జెండా ఎగురవేసే సమయంలో ప్రధాని మోదీకి సమీపంలో నిలబడిన ఒక మహిళా సైనికాధికారి ప్రజల దృష్టిని అమితంగా ఆకర్షించింది. ఇంతకీ ఎవరామె అంటే..ఆ ఆధికారిణి కెప్టెన్ సోనియా సింగ్ చౌహాన్. ఆమె భారత సైన్యంలో ఒక కమిషన్డ్ అధికారిణి. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో, ఎర్రకోట ప్రాకారాలపై ప్రధాన మంత్రి జాతీయ జెండాను ఎగురవేస్తున్నప్పుడు ఆయనకు సహాయపడే ఒక నిర్దిష్ట లాంఛనప్రాయ బాధ్యతను ఆమెకు అప్పగించారు.ఎర్రకోటలో ఆమె పాత్ర ఏంటంటే..ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సైనిక నియమావళి ప్రకారం జరుగుతాయి. ఇందులో గౌరవ వందనంగా(గార్డ్ ఆఫ్ ఆనర్) నుంచి జాతీయ పతాక వందనం (నేషనల్ ఫ్లాగ్ గార్డ్) వరకు ప్రతిదానికీ కేటాయించిన అధికారులు బాధ్యత వహిస్తారు. అధికారిక షెడ్యూల్ ప్రకారం, జెండాను ఎగురవేసే క్షణంలో నేరుగా సహాయం చేయడమే కెప్టెన్ చౌహాన్ పని. ఈ కార్యక్రమం, స్వదేశీ 105mm లైట్ ఫీల్డ్ గన్లను ఉపయోగించి 1721 ఫీల్డ్ బ్యాటరీ కాల్చిన 21-గన్ సెల్యూట్‌తో నిర్వహిస్తారు.అందరి దృష్టిని ఆకర్షించడానికీ రీజన్..జెండా ఎగురవేసే సమయంలో ప్రధాని మోదీ పక్కనే కనిపించడంతో అందరి దృష్టిని ఆమె అమితంగా ఆకర్షించింది. పైగా ఈ దృశ్యం నారీ శక్తి లేదా మహిళా సాధికారతపై భారతదేశం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనంగా నిలిచింది. అలాగే ఇటీవల సంవత్సరాలలో భారత సాయుధ దళాలలో, పోరాట విధుల నుంచి భారతదేశపు అత్యంత ఎత్తైన పర్వత సరిహద్దులలోని పోస్టింగ్‌ల వరకు మహిళా అధికారుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న ధోరణికి అనుగుణంగా ఉంది. View this post on Instagram A post shared by ᴅᴇꜰᴇɴᴄᴇ ʟᴏᴠᴇʀꜱ (@defence_lovers121) (చదవండి: Independence Day 2026: ఎర్రకోటపై మోదీ ‘బంధనీ’ సఫా.. చుక్కల వెనుక వేల ఏళ్ల భారతీయ చరిత్ర!) -
మోదీ ప్రసంగం.. దద్దరిల్లిన ఎర్రకోట
-
ఎర్రకోటపై మోదీ ‘బంధనీ’ సఫా.. చుక్కల వెనుక వేల ఏళ్ల భారతీయ చరిత్ర!
ప్రధాని నరేంద్ర మోదీ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన వేళ.. ఆయన ధరించిన మరూన్ రంగు బంధనీ సఫా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పసుపు, తెలుపు రంగుల చిన్నచిన్న చుక్కలతో కనిపించిన ఆ సఫా కేవలం అలంకరణ కాదు.. శతాబ్దాల నాటి భారతీయ వస్త్ర సంప్రదాయానికి ప్రతీక.బంధనీ లేదా బంధేజ్ అనేది వస్త్రాన్ని కట్టి, రంగు అద్దే ప్రత్యేకమైన టై-డై కళ. ఇందులో కనిపించే చిన్నచిన్న చుక్కలు వస్త్రంపై ముద్రించేవి కావు. కళాకారులు వస్త్రంలోని అతి చిన్న భాగాలను చేతితో తీసుకుని, దారంతో గట్టిగా కట్టి, ఆ తర్వాత రంగులో ముంచుతారు. కట్టిన భాగాలకు రంగు అంటకపోవడంతో ఆ ప్రాంతాల్లో తెల్లటి లేదా ఇతర రంగుల చుక్కలు, ఆకృతులు ఏర్పడతాయి. ‘బంధనీ’ అనే పేరు సంస్కృతంలోని ‘బంధ్’ అంటే కట్టడం అనే పదం నుంచి వచ్చిందని చెబుతారు. గుజరాత్లో దీనిని బంధేజ్గా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో బంధనీ లేదా బంధ్నీగా పిలుస్తారు.చుక్కల వెనుక శతాబ్దాల చరిత్రభారతదేశంలో టై-డై వస్త్ర సంప్రదాయాలకు ఎంతో పురాతన చరిత్ర ఉంది. అజంతా చిత్రాల్లో కనిపించే చుక్కలతో కూడిన వస్త్రాలను ఈ సంప్రదాయానికి సంబంధించిన ఆధారాలుగా కొందరు పరిశోధకులు పేర్కొంటారు. అయితే నేటి బంధనీ కళను నేరుగా వేల సంవత్సరాల క్రితం నాటి సంప్రదాయంతో అనుసంధానించడం మాత్రం అంత సులభం కాదు. తరువాతి కాలంలో గుజరాత్, రాజస్థాన్ బంధనీ కళకు ప్రధాన కేంద్రాలుగా ఎదిగాయి. ముఖ్యంగా గుజరాత్‌లోని ఖత్రి కళాకారులు ఈ కళను అభివృద్ధి చేసి తరతరాలకు అందించారు. జామ్‌నగర్, కచ్ ప్రాంతాలు నేటికీ బంధనీకి ప్రసిద్ధి చెందాయి. చిన్న చుక్కల నుంచి పూలు, రేఖాగణిత ఆకృతులు, సంక్లిష్టమైన డిజైన్ల వరకు బంధనీలో ఎన్నో రకాల నమూనాలు కనిపిస్తాయి. చీరలకే పరిమితం కాకుండా ఓఢ్నీలు, ఘాగ్రాలు, తలపాగాలు, సఫాలు వంటి వాటిలోనూ ఈ వస్త్రాన్ని ఉపయోగించారు.రాజవంశాల నుంచి ఎర్రకోట వరకు..బంధనీ వస్త్రానికి రాజకుటుంబాల వస్త్రధారణలోనూ ప్రత్యేక స్థానం ఉంది. రాజస్థాన్ రాజకుటుంబాలకు చెందిన మహిళలు, పురుషుల సంప్రదాయ వస్త్రాల్లోనూ ఇది కనిపించేది. అందుకే ఎర్రకోటపై మోదీ ధరించిన బంధనీ సఫా కేవలం రంగురంగుల తలపాగా కాదు. భారతీయ చేనేత, ప్రాంతీయ సంస్కృతి, కళాకారుల నైపుణ్యం, సంప్రదాయ వస్త్ర వైభవాన్ని జాతీయ వేదికపై ప్రదర్శించిన ఒక ప్రతీకగా నిలిచింది. చిన్నచిన్న చుక్కలతో కనిపించే ఆ సఫా వెనుక.. భారతీయ వస్త్రకళకు చెందిన పెద్ద చరిత్ర దాగి ఉంది.(చదవండి: తొలి స్వాతంత్ర్య దినోత్సవం రోజున వందేమాతరం ఆలపించింది ఎవరో తెలుసా..!) -
ఎర్రకోటపై మువ్వన్నెల జెండా.. 13వ సారి జెండా ఎగరేసిన మోదీ
-
నక్సలిజంపై మోదీ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ: దేశంలో కొత్త తరహా శత్రువుగా ‘మానసిక నక్సల్స్’ ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం ఢిల్లీలోని ఎర్రకోట పై నుంచి 80వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేసిన ఆయన.. అధికార వ్యవస్థలోని కీలక ప్రాంతాల్లో ఇలాంటి భావజాలం ఉన్న వారు పాతుకుపోయారని తెలిపారు. వారిని గుర్తించి, ఒంటరి చేయాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పారు.ఎర్రకోట వేదికగా నరేంద్రమోదీ మాట్లాడుతూ ‘‘ఎన్నో ఏళ్లుగా మావోయిస్టు భావజాలం ఉన్న కొందరు దేశంలోని అధికార వ్యవస్థలోని కీలక ప్రాంతాల్లో పాతుకుపోయారు. ప్రభుత్వ కమిటీల్లో సలహాదారులుగా వ్యవహరిస్తూ విధానాలపై ఆ భావజాల ప్రభావాన్ని చూపిస్తున్నారు. అయితే సాయుధ నక్సల్స్ అంతరించినప్పటికీ.. ‘మానసిక నక్సల్స్’ మాత్రం ఇంకా ఉన్నారు ఈ భావజాలాన్ని కలిగి ఉన్నవారు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. హింస, సామాజిక విభేదాలకు మార్గం సుగమం చేస్తున్నారు. సమాజాన్ని తప్పుడు మార్గంలోకి తీసుకెళ్లేందుకు వారు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తున్నారు" అని మోదీ అన్నారు.అయితే అడవుల్లో ఉన్న సాయుధ నక్సల్స్‌ను నిర్మూలించడంలో దేశం విజయం సాధించిందని, తద్వారా ఆ సంక్షోభం నుంచి దేశాన్ని విముక్తి చేశామని చెప్పారు. ఇప్పుడు మనం ఈ మానసిక నక్సల్స్‌ను గుర్తించాలి, వారిని ఒంటరి చేయాలి. దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యంతో యువతను ప్రధాన స్రవంతి కృషితో అనుసంధానం చేయాలని మోదీ పిలుపునిచ్చారు. దేశ యువతను సరైన దిశలో నడిపిస్తూ, అభివృద్ధి లక్ష్యాల వైపు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రధాని స్పష్టం చేశారు.ఎర్ర ఉగ్రవాదం తుపాకీ తూటాలతో దేశంలోని పలు ప్రాంతాలను సంవత్సరాల తరబడి బందీలుగా ఉంచిందని ప్రధాని మోదీ అన్నారు. ప్రజలను రక్షించేందుకు చేపట్టిన వివిధ ఆపరేషన్లలో 3,500 మందికి పైగా భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. యుద్ధాల్లో మరణించే వారి సంఖ్య కంటే ఇది ఎక్కువని ఆయన పేర్కొన్నారు. 80 ఏళ్ల క్రితం భారత్ స్వాతంత్ర్యం సాధించగా, ఇప్పుడు నక్సలిజం పట్టు నుంచి దేశం మరోసారి విముక్తి పొందుతోందని అన్నారు. -
స్వాతంత్ర్య దినోత్సవం వేళ రూబియో కీలక సందేశం
వాషింగ్టన్: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో.. భారత ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారత్-అమెరికా సంబంధాలు ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహపూర్వక సంబంధం ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేస్తోందని రూబియో అన్నారు.అమెరికా తరఫున భారత ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు రూబియో తన ప్రకటనలో పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న స్నేహం, కుటుంబ సంబంధాలే భారత్-అమెరికా భాగస్వామ్యానికి బలమైన పునాది అని ఆయన వివరించారు. రక్షణ, ఇంధన భద్రత, కీలక ఖనిజాలు, కృత్రిమ మేధస్సు (AI), అంతరిక్ష రంగం, వాణిజ్యం తదితర కీలక రంగాల్లో ఇరు దేశాల సహకారం కొనసాగుతోందని తెలిపారు. ఈ సహకారం భారత్, అమెరికాతో పాటు మొత్తం హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని మరింత సురక్షితంగా, బలంగా, సుసంపన్నంగా మార్చేందుకు దోహదపడుతోందని అన్నారు. భవిష్యత్తులో ఇరు దేశాలు కలిసి నిర్మించబోయే భాగస్వామ్యంపై అమెరికా ఆశాభావంతో ఉందని పేర్కొన్నారు.అమెరికాలోనూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికాలోని పలు రాష్ట్రాలు ప్రత్యేక ప్రకటనలు జారీ చేశాయి. ఆగస్టు 15, 2026ను ‘ఇండియా డే’గా గుర్తిస్తూ భారతీయులకు శుభాకాంక్షలు తెలిపాయి. అమెరికాలోని భారతీయ ప్రవాసుల సేవలు, ఆ దేశ అభివృద్ధికి వారు అందిస్తున్న సహకారాన్ని పలువురు అమెరికన్ సెనేటర్లు, కాంగ్రెస్ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు కొనియాడారు. భారత్-అమెరికా మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యంతో పాటు ఇరు దేశాల ప్రజల మధ్య బలపడుతున్న సంబంధాలు కూడా ఈ సందర్భంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
సమయం.. అవసరం.. సంకల్పం మనది: ఎర్రకోటపై ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: మన దేశం కొత్త సంకల్పంతో ముందుకు వెళ్తోందని.. ఆ అభివృద్ధిని ఆపడం ఎవరి వల్ల కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చారిత్రక ఎర్రకోట పై జాతీయ పతాకాన్ని ఎగరేసిన అనంతరం.. ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఏడాది వేడుకల్లో ‘వందేమాతరం’ 150 ఏళ్ల వారసత్వం, ‘యువశక్తి–వికసిత్ భారత్ 2047’ అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న ప్రధాని.. వారి కలలు, ఆశయాల స్ఫూర్తితో భారత్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని అన్నారు. ఇవాళ ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురుతోందని.. ప్రతీ భారతీయుడి గుండెలో వందేమాతరం ప్రతిధ్వనిస్తోందని పేర్కొన్నారు. దేశం కొత్త సంకల్పంతో ముందుకు వెళ్తోందని, పెద్ద కలలు కనాలని, వాటిని సాకారం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ‘‘సమయం.. అవసరం.. సంకల్పం మనది. సామర్థ్యం పెంచుకుని విజయం సాధిద్దాం’’ అని ప్రధాని పేర్కొన్నారు.వికసిత్ భారత్ కోసం సప్తధార ప్రణాళికతయారీ శక్తిఫుడ్ ప్రొడక్షన్టెక్నాలజీగతిశక్తిరక్షణ రంగంగ్రీన్ ఎకానమీ.. బ్లూ ఎకానమీయువశక్తి25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారుతమ హయాంలో దేశ వికాసం కోసం కృషి చేశామని.. వివిధ రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందినట్లు గణాంకాలే చెబుతున్నాయని అన్నారు. గత కొన్నేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడి తమ జీవితాలను మెరుగుపర్చుకున్నారని ప్రధాని తెలిపారు. రక్షణ ఉత్పత్తులు పెరిగాయని, అనేక రంగాల్లో భారత్ తన సామర్థ్యాన్ని నిరూపించుకుందని అన్నారు. దేశ ప్రయోజనాలను కాపాడుకోవడంతో పాటు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.కరోనా నుంచి యుద్ధాల వరకు సవాళ్లు ఎదుర్కొన్నాంగత 12 ఏళ్లలో భారత్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని ప్రధాని గుర్తుచేశారు. కరోనా మహమ్మారి, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల మధ్య కూడా దేశం అభివృద్ధి బాటలో ముందుకు సాగిందన్నారు. యూపీఏ హయాంలో ప్రజలు భయాందోళనతో గడిపారని.. ఆ తర్వాత కూడా ప్రజల్ని భయపెట్టడమే పనిగా కొందరు పెట్టుకున్నారని అన్నారు. యుద్ధాలతో పెట్రోల్, డీజిల్, ఫర్టిలైజర్లు దొరకవని జనాలకు భయపెట్టారని.. కానీ, అడ్డంకులు అధిగమించామని ప్రధాని అన్నారు. దేశ ప్రగతిని ఆపడం ఎవరి తరం కాదని చెప్పారు.సంస్కరణలు మరింత వేగంగా..ఇక ఆగేదే లేదని.. తగ్గేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. దేశాభివృద్ధికి ఆర్థిక సంస్కరణలను మరింత వేగవంతం చేస్తామని ప్రధాని తెలిపారు. తయారీ రంగాన్ని బలోపేతం చేయడం, మౌలిక వసతుల అభివృద్ధి, సాంకేతిక రంగంలో ముందంజ వేయడమే లక్ష్యమన్నారు. రైల్వే విద్యుద్దీకరణ, మెట్రో విస్తరణ, హైడ్రోజన్ రైలు, సెమీకండక్టర్ రంగం వంటి అంశాలను ప్రస్తావించారు. ఇంధన భద్రతను అత్యవసర అంశంగా పరిగణించి.. దాని కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం ఇతర దేశాలపై ఆధారపడడం తగ్గించాలని అభిప్రాయపడ్డారు.ఆత్మనిర్భర్ భారత్.. మేడిన్ ఇండియానే లక్ష్యంభారత్ స్వయం సమృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోందని ప్రధాని తెలిపారు. డిజిటల్ టెక్నాలజీ, సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, తయారీ రంగాల్లో భారత్ ప్రపంచానికి కీలక భాగస్వామిగా ఎదగాలని ఆకాంక్షించారు. ‘‘మన ఉత్పత్తుల ఆధారంగానే ప్రపంచంలో మనకు గుర్తింపు రావాలి. ప్రతి మార్కెట్‌కు భారత ఉత్పత్తులు చేరాలి’’ అని అన్నారు. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో భారత కంపెనీల సంఖ్య పెరగాలని, ప్రపంచ స్థాయి ఫార్మా సంస్థలు భారత్ నుంచి రావాలని లక్ష్యాలను వివరించారు.ఉగ్రవాదం, నక్సలిజంపై పోరాటం కొనసాగుతుందిదేశ భద్రతపై మాట్లాడుతూ.. సరిహద్దుల అవతల, ఇవతల భారత్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని ప్రధాని అన్నారు. ఉగ్రవాదం అనేక కుటుంబాలను నాశనం చేసిందని, నక్సలిజం వల్ల కూడా ఎంతో నష్టం జరిగిందని పేర్కొన్నారు. దేశాన్ని మావోయిజం నుంచి విముక్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.యువత తోడుంటేనే..దేశం ముందున్న అతిపెద్ద లక్ష్యం వికసిత్ భారత్ అని ప్రధాని స్పష్టం చేశారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను నిలబెట్టాలంటే యువత కీలక పాత్ర పోషించాలని అన్నారు. యువతే దేశానికి వెన్నెముక అని పేర్కొన్న ప్రధాని.. ఏఐ, సాంకేతికత, క్రీడలు, ఆవిష్కరణల రంగాల్లో యువత సామర్థ్యాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. యువశక్తితోనే వికసిత్ భారత్ కల సాకారం అవుతుందని చెప్పారు. అందుకోసం యువత తనకు మద్దతు నిలవాలని పిలుపు ఇచ్చారు. ఇప్పుడు గ్లోబలైజేషన్ అనే మాటే వినిపించడం లేదని.. ప్రతీ దేశం దాని సంక్షోభాల మీదే దృష్టిసారిస్తున్నాయని అన్నారు. ఇలాంటి తరుణంలో భారత్ గ్లోబల్ లీడర్షిప్, సప్లై చైన్‌గా మారే అవకాశాలు ఉన్నాయని అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యం సాధిస్తే ప్రపంచం మనవైపు చూస్తుందని అన్నారాయన. మహిళా బిల్లుకు ముందుకు రండిమహిళా సాధికారతపై ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ వారి హక్కు అని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. రాజకీయాలను పక్కన పెట్టి మహిళల అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అవసరమైతే క్రెడిట్ వారే తీసుకోవాలంటూ విపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశంలో 3 కోట్ల మంది మహిళలను ‘లక్పతి దీదీ’లుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు.తొలిసారి ఎర్రకోటపై వందేమాతరంఈసారి స్వాతంత్య్ర వేడుకల్లో వందేమాతరం ప్రత్యేకంగా నిలిచింది. వందేమాతరం 150 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ తొలిసారి ఎర్రకోట అధికారిక కార్యక్రమంలో ఆలపించారు. ప్రతి భారతీయుడి హృదయం వందేమాతరం నినాదంతో మారుమోగుతోందని ప్రధాని అన్నారు. వేడుకలు ఇలా.. స్వాతంత్య్ర వేడుకలకు ముందు ప్రధాని మోదీ రాజ్‌ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అనంతరం ఎర్రకోటకు చేరుకుని త్రివిధ దళాలు, ఢిల్లీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం 21 గన్ సెల్యూట్, సైనిక గౌరవ కార్యక్రమాలు జరిగాయి. ఎర్రకోట ప్రాంగణంలో పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు యువత, మహిళలు, స్వయం సమృద్ధి, ఆవిష్కరణలే కీలకమని ప్రధాని మోదీ ఎర్రకోట వేదికగా దేశానికి సందేశం ఇచ్చారు. -
అప్పట్లో మోదీ ఉండి ఉంటేనా...!!!
లక్నో: భారతదేశ విభజనకు బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని, అప్పట్లో దేశ ప్రధానిగా నరేంద్రమోదీ ఉండి ఉంటే దేశానికి ఎలాంటి నష్టమూ జరిగేది కాదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్‌పటేల్ లాంటి వ్యక్తి దేశ ప్రధానిగా ఉన్నా దేశం ముక్కలయ్యేది కాదని స్పష్టం చేశారు. 1948 నాటి దేశ విభజనపై శుక్రవారం లక్నోలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ విభజనతోపాటు తదనంతరం చెలరేగిన హింసకూ అసలు బాధ్యత కాంగ్రెస్‌దేనని పునరుద్ఘాటించారు. ‘‘స్వాతంత్య్రం వచ్చినప్పుడు నరేంద్ర మోదీ దేశ ప్రధాని అయిఉంటే భారత్‌కు ఎవరూ ఇసుమంత నష్టమూ చేయగలిగి ఉండేవారు కాదు’’అని చెప్పారు. కాంగ్రెస్ సభ్యుల పిరికితనానికి దేశం భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని అన్నారు. సీఏఏ నిరసన ప్రదర్శనల సందర్భంగానూ కాంగ్రెస్ అలాంటి వ్యక్తిత్వాన్నే చూపిందని వ్యాఖ్యానించారు. విభజన, ఇతర చారిత్రక తప్పులకు భారతదేశం ఉగ్రవాదం, నక్సలిజం, మావోయిజం, ఇతర అతివాద రూపాల రూపంలో ఇప్పటికీ మూల్యం చెల్లిస్తోందని ఆదిత్యనాథ్ అన్నారు. విభజనను ‘‘మానవాళి చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయం’’గా ఆయన అభివరి్ణంచారు. -
ఇతరులను గౌరవించడం నేర్చుకోవాలి
న్యూఢిల్లీ: ఇటలీతో భారత్‌కు బలమైన సంబంధాలు ఉన్నాయని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీర్ జైస్వాల్ శుక్రవారం స్పష్టంచేశారు. ఎవరైనా సరే బహిరంగ కార్యక్రమాల్లో మాట్లాడేటప్పుడు గౌరవంగా వ్యవహరించాలని సూచించారు. ఇతరులను గౌరవించడం నేర్చుకోవాలని చెప్పారు. గౌరవం అనేది పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలని అన్నారు. విదేశీ నేతలను ఆలింగనం చేసుకోవడమే ప్రధాని నరేంద్ర మోదీ విదేశాంగ విధానంగా మారిందంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై రణ«దీర్ జైస్వాల్ పరోక్షంగా స్పందించారు. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీని ప్రధాని మోదీ ఆలింగనం చేసుకోవడం పెద్ద తప్పు అన్నట్టుగా రాహుల్ ఎద్దేవా చేయడాన్ని ఖండించారు. ఇటీవలి కాలంలో భారత్, ఇటలీ మధ్య సంబంధాలు మరింత విస్తరించాయని చెప్పారు. పరస్పర గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇతర దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం దౌత్యపరమైన విధానంలో కీలకమైన అంశమని తెలిపారు. -
రాహుల్ వ్యాఖ్యలపై రాజ్‌నాథ్ సింగ్ ధ్వజం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో పాటు భారత విదేశాంగ విధానంపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు చాలా చిల్లర వ్యాఖ్యలంటూ మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడి నుండి అటువంటి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని రాజ్‌నాథ్ సింగ్ ధ్వజమెత్తారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడి పదవి గౌరవాన్ని రాహుల్ దెబ్బతీస్తున్నారని, ఈ వ్యాఖ్యలు ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య చర్యకు ముప్పు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘నిన్న ప్రధాని నరేంద్ర మోదీపై, భారత విదేశాంగ విధానంపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు నీచమైనవి, ఖండించదగినవి. ఇది వ్యక్తిగతంగా నాకు కూడా బాధ కలిగిస్తోంది. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏ ప్రతిపక్ష నాయకుడి నుండీ ఇంతటి అసభ్యకరమైన, ఊహించలేని ప్రవర్తనను నేను ఎన్నడూ చూడలేదు. ఇటువంటి ప్రవర్తన ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లడానికి తీవ్రమైన సంకేతం’ అని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.కాగా, ప్రధాని మోదీ విదేశాంగ విధానం అంతా విదేశీ నాయకులను కౌగిలించుకోవడమేనని రాహుల్ గాంధీ ఎగతాళి చేసిన సంగతి తెలిసిందే. గురువారం ఢిల్లీలో జరిగిన రచనాత్మక కాంగ్రెస్ జాతీయ సదస్సులో రాహుల్ ప్రసంగిస్తూ.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) తన అసలైన స్వభావాన్ని ఎప్పుడో కోల్పోయిందని, ప్రస్తుతం అది అంబానీ, అదానీ వంటి బడా పెట్టుబడిదారుల చేతిలో ఒక సాధనంగా మారిందని ఆరోపించారు. -
మానవ చరిత్రలో కన్నీటి అధ్యాయం.. మోదీ
సాక్షి, ఢిల్లీ: దేశ చరిత్రలో అత్యంత బాధాకరమైన అధ్యాయాలలో దేశ విభజన ఒకటని ప్రధాని మోదీ అన్నారు. ఈ రోజు ఆగస్టు 14 "విభజన భయానక స్మృతి దినం" సందర్భంగా ఎక్స్ ఖాతాలో విభజన దినోత్సవ విషాద స్మృతులను ఆయన పంచుకున్నారు. దేశ విభజన అంతులేని జీవితాలను ఛిన్నాభిన్నం చేసిందని, కుటుంబాలను నిర్వాసితులను చేసిందని అపారమైన మానవ వేదనకు కారణమైందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.ప్రధాని ఎక్స్ ఖాతాలో "ఈరోజు మనం విభజన విషాధ స్మృతి దినాన్ని పాటిస్తున్నాము. విభజన కారణంగా ప్రభావితమైన ప్రతి ఒక్కరి ధైర్యాన్ని మనం గుర్తుచేసుకుంటున్నాము. ఇది అనేక జీవితాలను ఛిన్నభిన్నం చేసిన చారిత్రక క్షణం... కుటుంబాలు నిర్వాసితులయ్యాయి, ప్రియమైన వారిని కోల్పోయారు అపారమైన బాధను అనుభవించారు. " అని ప్రధాని మోదీ రాసుకొచ్చారు. ఈ విషాదాన్ని తట్టుకుని నిలబడిన వారి పట్టుదలను ఆ సందర్భంగా ఆయన కొనియాడారు.ఊహించని కష్టాలు ఎదురైనప్పటికీ, చాలా మంది తమ జీవితాలను మళ్లీ నిర్మించుకుని దేశ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు. "వారి జీవిత ప్రయాణాలు మానవ ఆత్మ యొక్క బలాన్ని మనకు గుర్తుచేస్తాయి. మన దేశంలో ఐక్యతను, సౌభాత్రాన్ని కాపాడుకోవాలనే మన సంకల్పాన్ని ఈ రోజు మరింతగా బలోపేతం చేయాలి. ఒక వికసిత్ భారత్‌ను నిర్మించడానికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం" అని ఆయన జోడించారు.కాగా విభజన బాధితులకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సైతం నివాళులర్పించారు. భారతదేశ విభజన వల్ల జరిగిన అపారమైన మానవ వేదనను ఆయన గుర్తుచేసుకున్నారు. ఎంతటి కష్టాలు ఎదురైనా తమ జీవితాలను తిరిగి నిర్మించుకున్న ప్రజల ధైర్యాన్ని మరియు పట్టుదలను ఆయన ప్రశంసించారు.లక్షలో సంఖ్యలో మరణాలు1947లో జరిగిన దేశ విభజన మానవ చరిత్రలోనే అత్యంత పెద్ద విషాదకరమైన వలసలలో ఒకటి. బ్రిటిష్ పాలన ముగిసిన తర్వాత భారతదేశం, పాకిస్తాన్ దేశాలుగా విడిపోయింది. ఆ సమయంలో దాదాపు 1 కోటి 50 లక్షల మంది ప్రజలు సరిహద్దులు దాటారు. విభజన రేఖల వల్ల రెండు వైపులా తీవ్రమైన మతకల్లోలాలు జరిగాయి. ప్రజలు తమ ఇళ్లు, భూములు, వ్యాపారాలను ఉన్నపళంగా వదిలి శరణార్థులుగా మారారు. రవాణాపై దాడులు శరణార్థులతో వెళ్తున్న రైళ్లు, బస్సులు నడిచి వెళ్తున్న కాన్వాయ్‌లపై దాడులు జరిగాయి. సుమారు 2 లక్షల నుండి 20 లక్షల మంది వరకు చనిపోయారని అంచనా. లక్షలాది మంది ప్రజలు తమ సర్వస్వాన్ని కోల్పోయి, ఏళ్ల తరబడి శరణార్థుల శిబిరాల్లో మగ్గిపోయారు. ఆ రోజు ప్రాణాలు కోల్పోయిన, నిరాశ్రయులైన ప్రజల త్యాగాల జ్ఞాపకార్థం 2021 నుండి ఏటా ఈ రోజును "విభజన భయానక స్మృతి దినం" గా జరుపుకుంటున్నారు. -
‘హగ్’ కామెంట్ రచ్చ.. షీలా వీడియోతో బీజేపీ కౌంటర్
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఓ సరదా వ్యాఖ్య ఇప్పుడు రాజకీయ వివాదానికి దారితీసింది. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ నేతలతో కొనసాగించే సాన్నిహిత్యంపై విమర్శలు చేస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య కొత్త మాటల యుద్ధానికి తెరలేపాయి. మరీ ముఖ్యంగా షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్‌పై బీజేపీ, మోదీ అభిమానులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. గురువారంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. సాయంత్రం కాంగ్రెస్ నిర్వహించిన జాతీయ సదస్సులో పాల్గొన్న రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీ విదేశాంగ విధానంపై విమర్శలు చేశారు. ‘‘మోదీకి ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. వింత ఆలోచనలు వస్తుంటాయి. ఇదే విదేశాంగ విధానం అనుకుంటున్నారు’’ అంటూ వేదికపైనే కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్‌ను ఆలింగనం చేసుకున్నారు.RaGa is in full roast mode.🤣🔥Rahul Gandhi just gave the most savage demonstration of “hug diplomacy”.*Runs and hugs Sandeep Dikshit*The hall couldn’t stop laughing. This one will travel. pic.twitter.com/XodlA8MvS8— Rajat Jain (@RajatJain) August 13, 2026ఈ సమయంలో సందీప్ దీక్షిత్ స్పందిస్తూ.. ‘‘నన్ను మెలోనీ అనుకుని కౌగిలించుకున్నారా?’’ అని ప్రశ్నించారు. దీంతో అక్కడున్న వాళ్లంతా ఘోల్లున నవ్వారు. దీనికి రాహుల్ గాంధీ.. ‘‘ఆ స్థాయికి ఇంకా చేరుకోలేదు’’ అంటూ బదులివ్వడంతో సభలో నవ్వులు వెల్లువెత్తాయి. అయితే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రాజకీయ దుమారం మొదలైంది.మోదీ ‘హగ్ డిప్లమసీ’పై రాహుల్ సెటైర్పలువురు ప్రపంచ నేతలతో ప్రధాని మోదీ కౌగిలించుకున్న సందర్భాలను ఉద్దేశించే రాహుల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది. విదేశాంగ విధానంలో దౌత్య సంబంధాల కంటే వ్యక్తిగత ఇమేజ్, ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారంటూ కాంగ్రెస్ గతంలోనూ మోదీపై విమర్శలు చేసింది. అయితే బీజేపీ మాత్రం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ప్రధాని స్థాయిని, అంతర్జాతీయ సంబంధాలను ఎగతాళి చేసేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించింది. ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడింది.బీజేపీ–ఆర్ఎస్ఎస్పై రాహుల్ విమర్శలుఇదే కార్యక్రమంలో రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్ఎస్ఎస్పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్కు దేశ చరిత్ర, సంస్కృతి, ప్రస్తుత పరిస్థితులపై సరైన అవగాహన లేదని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ తన అసలు స్వరూపాన్ని కోల్పోయిందని, పెద్ద పారిశ్రామిక వర్గాల ప్రభావంలోకి వెళ్లిందని రాహుల్ వ్యాఖ్యానించారు. అదానీ, అంబానీల పేర్లను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.‘‘మోదీ, అమిత్ షాకు నిద్ర లేకుండా చేస్తాం’’కేంద్ర ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేసే వరకు ఒత్తిడి కొనసాగిస్తామని అన్నారు. అయితే తమ పోరాటం ద్వేషం, హింసకు వ్యతిరేకంగా ఉంటుందని చెప్పారు.సందీప్ దీక్షిత్ నేపథ్యంసందీప్ దీక్షిత్ కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు. 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఈస్ట్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. రాజకీయాల్లోకి రాకముందు సామాజిక అభివృద్ధి రంగంలో పనిచేసిన ఆయన.. ‘సంకేత్’ అనే సంస్థను నడిపించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో కీలక నేతగా కొనసాగుతూ ఢిల్లీ రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. షీలా దీక్షిత్ ప్రస్తావనతో బీజేపీ కౌంటర్ఈ వివాదంలో బీజేపీ నేతలు మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పేరును తెరపైకి తెచ్చారు. 2024లో ప్రధాని మోదీ.. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ షీలా దీక్షిత్‌ను గౌరవిస్తూ, ఆమెపై వచ్చిన ఆరోపణల తీరుపై బాధపడ్డానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ ఇప్పుడు అదే మోదీపై వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని బీజేపీ విమర్శిస్తోంది. మెలోనీ పేరును ప్రస్తావిస్తూ ఓ మహిళా దేశాధినేతను రాజకీయ వ్యంగ్యంలోకి లాగడం సరికాదని ఆరోపిస్తోంది. మరోవైపు.. పలువురు సీనియర్ జర్నలిస్టులు సైతం ఈ తరహా రాజకీయం సరికాదంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. In 2024, PM Modi publicly said he was PAINED by the way Sheila Dikshit was "INSULTED" with baseless Corruption allegations.Today her own son, Sandeep Dikshit, stands on stage with Rahul & mocks the same Prime Minister 💔> He reduces a diplomatic gesture to a cheap joke by… pic.twitter.com/tALdiFnJhd— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) August 13, 2026‘‘మెలోనీ పేరు ప్రస్తావించలేదు’’రాహుల్ వ్యాఖ్యలను కాంగ్రెస్ సమర్థించింది. ఆయన ఎక్కడా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ పేరును ప్రస్తావించలేదని, కేవలం ప్రధాని మోదీ విదేశాంగ శైలిపై రాజకీయ విమర్శ మాత్రమే చేశారని స్పష్టం చేసింది. కాంగ్రెస్ నేతలు.. అంతర్జాతీయ దౌత్యంలో వ్యక్తిగత హావభావాలను ఎలా చూపిస్తున్నారనే అంశంపైనే రాహుల్ వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ప్రధాని మోదీ విదేశీ నేతలతో చేసే కౌగిలింతలను కాంగ్రెస్ గతంలోనూ విమర్శించిన విషయాన్ని గుర్తు చేశారు.అయితే బీజేపీ మాత్రం ఈ విషయాన్ని అంత తేలికగా వదిలేలా కనిపించడం లేదు.ట్రెండింగ్‌లో మెలోనీప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య స్నేహపూర్వక సంబంధాలపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తుంది. ఆ ట్రెండ్‌ను పసిగట్టిన ఇద్దరూ.. అందుకు తగ్గట్లే మెలోడీ పేరుతో సరదా పోస్టులు చేస్తుంటారు. ఈ క్రమంలో యూరప్ పర్యటనకు వెళ్లిన మోదీ.. ఆమెకు మెలోడీ చాక్లెట్లు బహుకరించడం గమనార్హం. అంతెందుకు కొందరు ఆకతాయిలు ఏఐ వీడియోలతోనూ ఈ మధ్య నెట్టింట హల్ చల్ చేస్తున్నారు. అయితే.. తాజా రాహుల్ గాంధీ హగ్ పాలిటిక్స్.. బీజేపీ అభ్యంతరాల నేపథ్యంతో నెట్టింట మెలోనీ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చేశారు. -
జెన్జీలూ.. పార్లమెంట్‌కు రండి..!
బాలీవుడ్ నటుడు, ఎంపీ రవికిషన్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా మారారు. ఆయన చెప్పిన మాటలు, డ్యాన్స్ స్టెప్పులు యువతకు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా జెన్జీలు ఆయన వీడియోలను వైరల్ చేస్తున్నారు.తాజాగా రవికిషన్ యువతపై ప్రశంసలు కురిపించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘జనరేషన్ జెడ్ సృజనాత్మకతకు సెల్యూట్ చేస్తున్నాను. మీరు చేస్తున్న సృజనాత్మక పనులు అద్భుతంగా ఉన్నాయి. నా మాటలు, నా పేరును మీ శైలిలో మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఒకప్పుడు గుర్తింపు లేకుండా ఉన్న నన్ను మళ్లీ ప్రజల్లోకి తీసుకొచ్చింది మీరే. జెన్‌జీలకు నా నమస్కారాలు’’ అంటూ యువతకు కృతజ్ఞతలు తెలిపారు.అంతేకాకుండా యువతను పార్లమెంట్‌కు ఆహ్వానించారు. ‘దేశంలోనే అతిపెద్దది పంచాయతీ పార్లమెంట్. ఇక్కడికి మీ అందరికీ స్వాగతం. భారత భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. దేశ జనాభాలో 65 శాతం మంది యువతే ఉన్నారు’ అని పేర్కొన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా యువత అభిప్రాయాలను తెలుసుకుంటున్నారని రవికిషన్ చెప్పారు. దేశ అత్యున్నత వేదికలో యువత మాటలకు ప్రాధాన్యం పెరుగుతోందని వివరించారు. సినిమాల విషయానికి వస్తే.. రవికిషన్ ప్రస్తుతం ‘మిర్జాపూర్: ది మూవీ’, ‘ఖోస్లా కా ఘోస్లా 2’, ‘నాగ్జిల్లా’ చిత్రాల్లో నటిస్తున్నారు. -
రీల్స్ యుగంలో షార్ట్కట్లు వద్దు!
న్యూఢిల్లీ: యువత తాము ఆదర్శంగా తీసుకునే వ్యక్తుల ఆత్మకథలు చదవాలని, తద్వారా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల ప్రభావంతో పక్కదారి పట్టకుండా ఉండవచ్చునని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం పరోక్షంగా వ్యాఖ్యానించారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ‘‘ట్రైంఫ్ ఆఫ్ ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్, మై స్ట్రగుల్స్’’పేరుతో రాసిన ఆత్మకథను ప్రధాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ‘‘ఈ రీల్స్ యుగం’లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మిమ్మల్ని కొన్ని దారుల్లోకి మళ్లించవచ్చు. ఓడించవచ్చు. షార్ట్కట్ల కాలంలో రైల్వేస్టేషన్లలో ప్రదర్శించే ఓ సందేశాన్ని గుర్తు చేసుకుందాం. ‘ఏ షార్ట్‌కట్ విల్ కట్ యూ షార్ట్’(దగ్గరి దారిలో వెళ్లాలనుకుంటే మీరు ఖతమైపోతారన్న అర్థం) అని ఎందుకు రాస్తారంటే కొంతమందికి రైల్వే బ్రిడ్జీలు ఎక్కి అవతలకు వెళ్లడం కాకుండా.. పట్టాలపై దూకి వెళ్లే అలవాటు ఉంటుంది. అయితే జీవితంలో ముందుకెళ్లేందుకు ఒక షార్ట్‌కట్ ఉందంటే అది మీరు ఆదర్శంగా తీసుకునే వ్యక్తుల ఆత్మకథలు చదవడం’’అని వ్యాఖ్యానించారు. ఆత్మకథలు ఆయా కాలాల పరిస్థితులను వారి జీవితానుభవాల దృష్టిలోంచి ఆవిష్కరిస్తాయి కాబట్టి యువత తాము ఆదర్శంగా భావించే నేతలు, వ్యక్తుల ఆత్మకథలు చదవడం అలవాటు చేసుకోవాలని కోరారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ కృత నిశ్చయంతో ఒక వ్యక్తి ఎలా అత్యున్నత రాజ్యాంగ పదవి పొందవచ్చు తెలుసుకునేందుకు రామ్‌నాథ్ కోవింద్ ప్రత్యక్ష ఉదాహరణ అని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. పదవీ విరమణ తరువాత కూడా కోవింద్ ‘‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’’విషయంపై పనిచేస్తూ తన ప్రజా జీవితాన్ని కొనసాగిస్తూండటాన్ని ప్రధాని కొనియాడారు. ఈ జమిలీ ఎన్నికలు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టే అవకాశముందన్నారు. కోవింద్ ఆత్మకథ నుంచి నవతరం నేర్చుకోవాల్సింది చాలా ఉందని ప్రధాని ప్రశంసించారు. భవిష్యత్తులో మరింత మంది యువకులు కోవింద్లా ఎదగాలని ఆకాంక్షించారు. పల్లెటూరి వాడిని: కోవింద్ ఆత్మకథ ఆవిష్కరణ సందర్భంగా రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడుతూ ‘‘కాన్పూర్ సమీపంలోని గ్రామీణ ప్రాంతపు పల్లెటూరి వాడిని నేను. గ్రామస్తుల నుంచే సహానుభూతి, ప్రేమలను నేర్చుకున్నా’’అని తెలిపారు. చిన్నప్పుడు వర్షాలొస్తే ఇల్లు మొత్తం కారిపోయేదని, వర్షం ఎప్పుడు ఆగుతుందా అని ఎదురు చూసే వారమని తన కష్టాలను గుర్తు చేసుకున్నారు. -
మోదీని ఆటపట్టించిన ఖర్గే.. సరదా సన్నివేశం
ఢిల్లీ: ఎంపీ సుప్రియా సూలే కుమార్తె వివాహానికి ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతల మధ్య ఒక సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధాని మోదీ వేదిక వద్దకు రాగానే అక్కడ రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తదితరులు నిలబడి ఉన్నారు. ప్రధాని మోదీ మొదట రాహుల్ గాంధీకి కరచాలనం చేశారు.ఆ తర్వాత ప్రధాని మోదీ నమస్కరిస్తూ ప్రియాంకా గాంధీ వైపు దృష్టి సారించారు. ప్రియాంకా జీ ఎలా ఉన్నారంటూ ప్రధాని పలకరించారు. ‘‘నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు?" అంటూ ప్రియాంక బదులిచ్చారు. ‘‘నేను అలాగే ఉన్నాను’’ అని ప్రధాని నవ్వుతూ ముందుకు నడిచారు. ఈ సంభాషణను గమనిస్తున్న మల్లికార్జున ఖర్గే వెంటనే జోక్యం చేసుకున్నారు. ‘‘అలా ఏమీ లేరు.. కాస్త మారారు’’ అని ఖర్గే చమత్కరించారు. ‘‘అవునా’’ అంటూ నవ్వుతూ ప్రధాని మోదీ.. ఖర్గే చేతిపై తట్టారు. చిరునవ్వుల మధ్య ఇద్దరు నేతలు ఒకరికొకరు హై-ఫైవ్ ఇచ్చుకున్నారు.ఢిల్లీలో సుప్రియా సూలే కుమార్తె రేవతి సూలే, నాగ్‌పూర్‌కు చెందిన పారిశ్రామికవేత్త సారంఘ్ లఖానీల వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ జంట జూన్‌లో ముంబైలో వివాహం చేసుకోగా.. ఢిల్లీలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, ఎస్ జైశంకర్, హర్దీప్ సింగ్ పూరి, గజేంద్ర సింగ్ షెకావత్, రాందాస్ అథవాలే, చిరాగ్ పాశ్వాన్ తదితరులు హాజరయ్యారు.मौका और दस्तूर यही होता है सुप्रिया सुले की बेटी के विवाह समारोह कार्यक्रम में कांग्रेस के वरिष्ठ नेता मल्लिकार्जुन खड़गे जी ने मोदी जी के मजे ले लिए।खड़गे जी - भाई साहब थोड़ा सा बदल गए हैं।नरेंद्र मोदी जी - अच्छाखड़गे जी ने अपने दिल की बात कह दी जो सदन में कहते नहीं बनता था। pic.twitter.com/dDgzLbWO3V— Krishnadev Yadav (@krishna_news) August 12, 2026 -
మళ్లీ పాత నోట్ల రద్దు? పాత, కొత్త నోట్ల మధ్య తేడా ఇదే
-
జెన్‌జీపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
సోషల్ మీడియా, రీల్స్ యుగంలో పెరుగుతున్న యువతకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశారు. జీవితంలో విజయాన్ని సాధించేందుకు షార్ట్‌కట్స్ వెతకవద్దని.. అది ఎంతో ప్రమాదమని.. కష్టపడి సాధించిన అనుభవాల నుంచి నేర్చుకోవాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు.బుధవారం ఉదయం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కాలం సోషల్ మీడియా, రీల్స్ యుగంగా మారిందని ప్రధాని అన్నారు. యువతపై సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉందని పేర్కొంటూ.. తక్షణ ఫలితాల కోసం ప్రయత్నించడం సరైన మార్గం కాదని చెప్పారు.“ఇది రీల్స్ కాలం. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మిమ్మల్ని ఆకర్షిస్తుంటారు. కానీ ఈ షార్ట్‌కట్ యుగంలో ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి.. రైల్వే స్టేషన్లలో రాసి ఉంటుంది.. ‘షార్ట్‌కట్స్ విల్ కట్ యూ షార్ట్’” అంటూ మోదీ వ్యాఖ్యానించారు. జీవితంలో ముందుకు వెళ్లాలనుకునే యువత తమకు నచ్చిన గొప్ప వ్యక్తుల ఆత్మకథలను చదవాలని సూచించారు. వారి ప్రయాణం, కష్టాలు, విజయాల నుంచి స్ఫూర్తి పొందాలని చెప్పారు.ప్రధాని మోదీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి సారించింది తెలిసిందే. జంతర్ మంతర్ నీట్ నిరసనల తర్వాత.. తొలిసారి సెల్ఫీ వీడియో సందేశం ఇచ్చారు ఆయన. ఆ తర్వాతి నుంచి క్రమం తప్పకుండా వివిధ అంశాలపై వీడియోలు రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అలాగే.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ యువతను ఆకట్టుకోవాలని మంత్రులకు, ఎంపీలకు సైతం ఆయన సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే జెన్జీపైనా వివిధ కార్యక్రమాల్లో వరుసగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కోవింద్ జీవితం యువతకు స్ఫూర్తిఇవాళ్టి కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథ కేవలం వ్యక్తిగత విజయాల కథ కాదని.. అది భారత ప్రజాస్వామ్యం, సమాజం అందించిన అవకాశాలకు ప్రతిబింబమని ప్రధాని అన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన కోవింద్ దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిని అలంకరించారని గుర్తు చేశారు. ఆయన జీవితంలోని పోరాటాలు యువతకు ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు.పదవి నుంచి దిగినా దేశ సేవ కొనసాగింపురాష్ట్రపతి పదవి ముగిసిన తర్వాత కూడా కోవింద్ విశ్రాంతి తీసుకోకుండా కీలక అంశాలపై పనిచేస్తున్నారని మోదీ ప్రశంసించారు. ముఖ్యంగా ‘ఒక దేశం.. ఒకే ఎన్నిక’(వన్‌నేషన్.. వన్ ఎలక్షన్) అంశంపై ఆయన చేస్తున్న కృషిని ప్రస్తావించారు. ఈ అంశానికి పరిష్కారం లభిస్తే భారత ప్రజాస్వామ్యంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని మోదీ అన్నారు.కోవింద్ వినయం.. భారత విలువలకు ప్రతీకమాజీ రాష్ట్రపతి వినయం, భారతీయ సంస్కృతి పట్ల గౌరవాన్ని కూడా ప్రధాని గుర్తు చేశారు. రాష్ట్రపతి భవన్లో ఉన్న సమయంలోనూ ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి తనను కారు వరకు వచ్చి సాగనంపేవారని చెప్పారు. అలాగే తన గ్రామం పర్యటనలో కోవింద్ తన గురువుల పాదాలకు నమస్కరించిన ఘటనను ప్రస్తావిస్తూ.. అది భారతీయ సంస్కృతి విలువలను ప్రపంచానికి చాటిందని అన్నారు.“విజయాలు వ్యక్తిగతం కాదు.. సమాజం భాగస్వామ్యం”ఒక వ్యక్తి విజయాలను తన సొంత ఘనతగా భావించడం సాధారణమని.. కానీ సమాజం అందించిన సహకారాన్ని గుర్తించే వ్యక్తులే గొప్పవారని మోదీ అన్నారు. కోవింద్ ఆత్మకథలో ఇదే భావన కనిపిస్తుందని పేర్కొన్నారు. ఆయన పోరాటాలు వ్యక్తిగతమైనప్పటికీ.. వాటి నుంచి వచ్చిన విజయాలు భారత ప్రజాస్వామ్య విజయాలని అభివర్ణించారు.రీల్స్ వేగంలో జీవిత ప్రయాణాన్ని చిన్నదారిలో ముగించాలని చూస్తున్న యువతకు, మరీ ముఖ్యంగా జెన్‌జీకి.. అనుభవాల నుంచి నేర్చుకోవాలనే ప్రధాని మోదీ సందేశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
బీజేపీకి బిగ్ షాక్.. ‘ఎయిర్‌పోర్టుకు పడవలు వస్తాయా?’
నోయిడా: ఆకాశంలో ఎగరాల్సిన విమానాశ్రయం.. వర్షం పడితే నీట మునిగింది. ప్రారంభించి ఐదు నెలలు కూడా పూర్తికాకముందే రూ.11,200 కోట్లతో నిర్మించిన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారీ వర్షానికి టెర్మినల్-పార్కింగ్ మార్గంలో నీరు నిలిచిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. దీంతో ‘అభివృద్ధి మోడల్’గా ప్రచారం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ఇది ఊహించని ఎదురుదెబ్బగా మారింది.మంగళవారం గ్రేటర్ నోయిడాలో భారీ వర్షం కురిసింది. వర్షం దెబ్బకు జేవర్‌లోని నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో టెర్మినల్ నుంచి పార్కింగ్ ప్రాంతానికి వెళ్లే మార్గం నీటితో నిండిపోయింది. ప్రయాణికులు, వాహనాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నీటిని తొలగించేందుకు ఎయిర్‌పోర్టు సిబ్బంది రంగంలోకి దిగిన దృశ్యాలు వీడియోల్లో కనిపించాయి. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ కావడంతో రాజకీయ దుమారం మొదలైంది. భారీ పెట్టుబడులు, ఆధునిక సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన విమానాశ్రయంగా ప్రచారం పొందిన ప్రాజెక్టులో.. ఒక్క భారీ వర్షం పడితే నీరు నిలిచిపోవడమేంటి? అంటూ నెటిజన్లు ప్రశ్నలు సంధించారు.Heavy rainfall today caused severe waterlogging at Noida International Airport in Uttar Pradesh, India. The airport was inaugurated by Prime Minister Narendra Modi on March 28, 2026. pic.twitter.com/mVu12u7B7Z— Weather Monitor (@WeatherMonitors) August 11, 2026విమర్శలకు తోడు రాజకీయ కౌంటర్లు కూడా మొదలయ్యాయి. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ నేరుగా బీజేపీపై సెటైర్ వేశారు. “ఇక విమానాశ్రయంలో పడవలు నడుస్తాయా?” అంటూ ఎక్స్‌లో ప్రశ్నించారు. బీజేపీ పాలనలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. అయితే ఎయిర్‌పోర్టు యాజమాన్యం మాత్రం ఈ ఘటనపై వివరణ ఇచ్చింది. తక్కువ వ్యవధిలో అత్యంత భారీ వర్షపాతం నమోదవడంతో టెర్మినల్, పార్కింగ్ ప్రాంతాన్ని కలిపే మార్గంలోకి వర్షపు నీరు వచ్చిందని తెలిపింది. తమ సిబ్బంది వెంటనే స్పందించి 30 నిమిషాల్లోపే నీటిని తొలగించారని వెల్లడించింది.నీరు నిలిచిన సమయంలో ప్రయాణికులు, వాహనాల రాకపోకలను ప్రత్యామ్నాయ మార్గంలోకి మళ్లించారు. ప్రయాణికులను నేరుగా కర్బ్ వద్ద పికప్, డ్రాప్ చేసుకునే అవకాశం కల్పించారు. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. విమానాలు ఆగిపోయాయా లేదా అన్నది ఒక విషయం.. నీరు ఎందుకు నిలిచింది అన్నది మరో విషయం. అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయంలో వర్షపు నీటి నిర్వహణ వ్యవస్థ ఎంత సమర్థంగా ఉంది? భవిష్యత్తులో ఇంతకంటే భారీ వర్షం కురిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి.మరోవైపు సోషల్ మీడియాలో కొందరు ఈ ఘటనను వ్యంగ్యంగా తీసుకున్నారు. “ఇది ఎయిర్‌పోర్టా.. స్విమ్మింగ్ పూలా?” అంటూ కామెంట్లు చేశారు. మరికొందరు మాత్రం ఒక్క ఘటన ఆధారంగా మొత్తం ప్రాజెక్టును తప్పుబట్టడం సరికాదని అంటున్నారు. వాస్తవానికి ఎయిర్‌పోర్టు సిబ్బంది స్పందించి తక్కువ సమయంలోనే నీటిని తొలగించడంతో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది. ఇదిలా ఉండగా.. ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 28, 2026న విమానాశ్రయాన్ని ప్రారంభించారు. తొలి దశ నిర్మాణానికి సుమారు రూ.11,200 కోట్లు ఖర్చయ్యాయి. అయితే రెగ్యులర్ కమర్షియల్ విమాన కార్యకలాపాలు జూన్ 15 నుంచి ప్రారంభమయ్యాయి.Noida International Airport amidst Heavy rains today🚨 #DelhiRains pic.twitter.com/rp0Ur3jaed— Mumbai Nowcast (@s_r_khandelwal) August 11, 2026 -
‘ప్రశ్నించండి’ అంటున్న మోదీ.. ఏపీలో ప్రశ్నిస్తే కేసులా?
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక ఉపన్యాసం చేస్తూ ప్రతి అంశంపైన ప్రశ్నించాలని యువతకు పిలుపు ఇచ్చారు. ఇది నిజంగా ఆహ్వానించదగ్గ విషయం. కొద్దికాలం క్రితం ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నీట్ పరీక్ష పత్రాల లీక్‌కు సంబంధించి యువత పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన నేపథ్యంలో జరిగిన పరిణామాలకు, ఆ తర్వాత మోదీలో వచ్చిన మార్పునకు ఇది దర్పణం పడుతుంది. ప్రధాని వ్యూహాత్మకంగా తన వైఖరి మార్చుకున్నారా? లేక దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రశ్నించేతత్వాన్ని బలపరచడానికి చేశారా? అన్నదానిపై ఎవరి అభిప్రాయం వారికి ఉండవచ్చు. కాని మోదీ ప్రసంగాలలో ఇది కీలకమైన మార్పుగా చెప్పవచ్చు.కానీ, దీనికి ఆయన కట్టుబడి ఉండడమే కాదు. తన మిత్రపక్షాలు ప్రభుత్వం నడుపుతున్న రాష్ట్రాలలో కూడా అలాగే వాతావరణం ఏర్పడేలా ఆయన చర్య తీసుకుంటేనే యువతలో విశ్వాసం ఏర్పడుతుంది. ఏపీలో ప్రశ్నించే యువతను టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ పెద్దలు గంజాయి బ్యాచ్ అని, బ్లేడ్ బాచ్ అంటూ అవమానించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రత్యర్ది పార్టీని గొడ్డలి పార్టీ అంటూ అనుచిత భాష వాడుతున్నారు. దేశంలో ఇలాంటి పెడ పోకడలను నియంత్రించాల్సిన అవసరాన్ని ప్రధాని గుర్తించాలి. అయితే కాక్రోచ్ ఆందోళన తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్‌కు బీజేపీ ఎంపీలు పార్లమెంటులో పూలదండలతో స్వాగతం చెప్పిన తీరు కూడా అంత శోభ నివ్వదు. దీనిని మోదీ ఎందుకు అనుమతించారో తెలియదు.మరోవైపు ఏపీలో డీఎస్సీ అక్రమాలపై విపక్ష వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు సాగుతున్నాయి. ఈ అక్రమాల వల్ల నష్టపోయిన యువత బహిరంగంగా అవి ఎలా సాగాయో వెల్లడిస్తున్నారు. దీనిపై సీఐఐ దర్యాప్తును, మంత్రి లోకేష్ రాజీనామాను వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. నిజంగా ఇందులో ఏ అవకతవక జరగకపోతే నీట్ పరీక్షల గొడవపై సీబీఐ దర్యాప్తు వేసినట్లు ఏపీలో కూడా చేసి ఉండవచ్చు. అలా చేయకపోగా ప్రశ్నించేవారి గొంతు నులమడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. తప్పుడు కేసులు పెట్టడం, వైఎస్సార్సీపీ దీక్ష శిబిరాలపై టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు దాడులు చేయడం వంటివి చేస్తున్నారంటే ఏపీలో ప్రజాస్వామ్యం ఏ స్థాయికి దిగజారిందో అర్దం చేసుకోవచ్చు. ఇంత చేస్తున్నా ఆందోళనలు ఆగడం లేదన్న అసహనంతో పోటీ ర్యాలీలు చేయించడం ఆరంభించారు.ఢిల్లీలో యువత ఆందోళన చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి వ్యూహాలను కొన్నిటిని అమలు చేయకపోలేదు. పోలీసులు పెల్లెట్ గన్లను ప్రయోగించడం, లాఠీలను ఝళిపించడం వంటివి చేశారు. దీనివల్ల బీజేపీకి బాగా నష్టం జరిగింది. ఆ డ్యామేజీని గుర్తించిన ప్రధాని ఆందోళనకారులను ఫ్రెండ్స్ అంటూ అడ్రస్ చేశారు. కానీ ఏపీలో మాత్రం గంజాయి బ్యాచ్ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శిస్తూ, ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారు. పైగా ప్రభుత్వం తలచుకుంటే రెండు నిమిషాలలో అణచివేస్తుందని కూడా బెదిరిస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సంబంధించి వచ్చిన ఆరోపణల మీద ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆందోళనకారులతో చర్చలకు సిద్దపడింది. ఏపీలో మాత్రం అలా చేయడం లేదు.ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అరాచకాలను ప్రభుత్వం సాగిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. పంజాబ్‌లో ఇలాంటి ఆరోపణలు వస్తే అక్కడ బీజేపీకి చెందినవారు కూడా ఆందోళనలు చేస్తున్నారు. జార్ఖండ్‌లో ఉద్యమానికి అక్కడ అధికారంలో ఉన్న భాగస్వామి అయిన కాంగ్రెస్ కూడా మద్దతు ఇస్తోంది. స్వయంగా రాహుల్ గాంధీ ఈ మేరకు ప్రకటన చేశారు. కానీ ఏపీలో విచిత్రంగా కాంగ్రెస్, బీజేపీలు నోరు విప్పడం లేదు. జనసేన ఎటూ 15 ఏళ్ల పాటు చంద్రబాబుకు మద్దతు ఇస్తామని ఓపెన్ గానే చెబుతోంది. అంటే అంతకాలం చంద్రబాబు సర్కార్ ఏం చేసినా నోరు విప్పదనుకోవాలి. ఆ రకంగా ఈ పార్టీలన్నిటిని చంద్రబాబు తన కంట్రోల్లో పెట్టుకున్నారన్న భావన ఉంది. అయితే, ప్రధాని మోదీ తన ప్రసంగంలో యువత ప్రశ్నించడాన్ని స్వాగతిస్తున్నామని అంటున్నారు. ప్రతి అంశంపైనా ప్రశ్నించాలని, అందరూ ఆమోదించారని అక్కడితో ఆగిపోవద్దు అని ఆయన చెబుతున్నారు. ఇందులో ఎంత చిత్తశుద్ది ఉందన్నది భవిష్యత్ పరిణామాలను బట్టి ఆధారపడి ఉంటుంది.ఇదే సందర్భంలో అమెరికాలో ప్రజాస్వామ్యం బలోపేతం అయిన తీరుపై ప్రముఖ చరిత్రకారుడు మైకేల్ బిష్లోన్ చేసిన ఒక ప్రసంగం ప్రపంచ వ్యాప్తంగా ఆకర్షించింది. సాక్షి దినపత్రిక ఈ వ్యాసంలోని ముఖ్యాంశాలను ప్రచురించింది. ఆ ఉపన్యాసంలో ఆయా పూర్వ అధ్యక్షులు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి చేసిన కృషిని, వారి ఉత్తేజపూరిత వ్యాఖ్యలను కూడా ఆయన ఉదహరించారు. ఇది భారత ప్రజాస్వామ్యం బలపడటానికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. అమెరికాలో గొప్ప నాయకుడిగా గుర్తింపు పొందిన బెంజిమిన్ ఫ్రాంక్లిన్ ప్రతి పౌరుడి తొలి బాధ్యత అధికారాన్ని ప్రశ్నించడమే అని వ్యాఖ్యానించారు. మాజీ అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ చెప్పిన మాట ఏమిటంటే, అమెరికాలో గొప్పహోదా మిస్టర్ ప్రెసిడెంట్ కాదు.. మిస్టర్ సిటిజన్.. అమెరికా రాజ్యాంగం ప్రకారం ప్రజలు అధ్యక్షుడి కోసం పనిచేయరు. అధ్యక్షుడే ప్రజల కోసం పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.దేశాన్ని పొగిడేవారికే కాదు.. దేశంలోని లోపాలను నిర్మాణాత్మకంగా సమర్ధించేవారికి సమాన గౌరవం ఉండాలని కూడా అమెరికా గొప్ప నేతలు నమ్మారని మైఖేల్ వివరించారు. ఇంకో ప్రముఖుడు ధామస్ జపర్సన్ మరో మాట చెప్పారు. మిత వ్యయంతో, సమర్ధవంతంగా పనిచేసే రాజకీయ వ్యవస్థ ఏర్పడితే ఆ ప్రజాస్వామ్య స్పూర్తి ప్రపంచమంతా వ్యాపిస్తుందని అన్నారు. ఇదే వ్యాసంలో మైఖేల్ ఒక విషయం చెప్పారు. చరిత్రకారులు తమకు అనుకూలంగానే మాట్లాడాలని 2026లో వాషింగ్టన్ డీసీలోని కొందరు రాజకీయ నేతలు ఆశిస్తున్నారని, సర్కస్ లోని విదూషకుల మాదిరి ప్రవర్తించాలని కోరుకుంటున్నారని, అమెరికా వ్యవస్థాపకులు ఇలాంటి ఆలోచనను చూసి బాధపడేవారిని ఆయన వ్యాఖ్యానించారు. అంటే అమెరికాలో కూడా గత విలువలు కొరవడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారన్న మాట.మైఖేల్ చెప్పిన మాటలు వింటుంటే ఏమనిపిస్తుంది? అమెరికా కన్నా పెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారత్ లో ఈ మధ్య కాలంలో జరుగుతున్న విపరిణామాలు, ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణులు పెరుగుతున్నాయనే అనిపిస్తుంది కదా! దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రత్యేకించి ఏపీ వంటి రాష్ట్రాలలో రెడ్ బుక్ అంటూ అరాచకపు వ్యవస్థను సృష్టించడం ప్రజలను కలవరపరుస్తుంది. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ వంటి రాజ్యాంగ రూపకర్తలు, దేశ నిర్మాతలు భారత్ లో ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఊహించి ఉండరు. ప్రజాస్వామ్యంతో నిమిత్తం లేకుండా నియంతృత్వంగా అల్ప బుద్దితో వ్యవహరిస్తున్న నేతల తీరును గమనిస్తే వారి ఆత్మలు క్షోభిస్తాయి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
సగర్వంగా, వైభవోపేతంగా స్వాతంత్య్ర దినోత్సవం
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవాన్ని సగర్వంగా, వైభవోపేతంగా నిర్వహించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ‘అభివృద్ధి చెందిన భారత్’కోసం ప్రతిజ్ఞ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అధికార ఎన్డీయే కూటమి మంగళవారం నిర్వహించిన ‘మంగళ్ మిలన్’కు మోదీ హాజరయ్యారు. సమావేశ ప్రాంగణానికి మోదీ చేరుకున్నప్పుడు ఎన్డీయే ఎంపీలు, కేంద్ర మంత్రులు త్రివర్ణ పతాకాలు చేతబూని వందేమాతరం, భారత్ మాతా కీ జై అని నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. ఈ దృశ్యాలతో కూడిన వీడియోను మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుచేశారు. మన స్వాతంత్య్ర సమరయోధులకు ఘనంగా నివాళులు అర్పిద్దామని, అభివృద్ధి చెందిన భారతదేశం కోసం ప్రతిజ్ఞ చేద్దామని సూచించారు.‘‘హర్ ఘర్ తిరంగా, ఘర్ ఘర్ తిరంగా, హర్ మన్ తిరంగా (ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకం, ప్రతి హృదయంలో త్రివర్ణ పతాకం). అందరూ కలిసి రండి. ప్రతి ఇంట్లోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేద్దాం. భారత్ మాతా కీ జై, వందేమాతరం, వందేమాతరం, వందేమాతరం’’అని మోదీ ఈ వీడియోలో పిలుపునిచ్చారు. అంతకుముందు పార్లమెంట్ భవన సముదాయంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో మంగళ్ మిలన్ నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి స్వయంగా జాతీయ జెండాను చేతబూనారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, శివరాజ్‌సింగ్ చౌహాన్, ఎస్.జైశంకర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. జల్‌శక్తి మంత్రిత్వ శాఖకు సంబంధించిన వివిధ అంశాలపై కేంద్ర మంత్రి సి.ఆర్.పాటిల్ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రతి మంగళవారం ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహిస్తున్నారు. -
కొత్త కరెన్సీ వచ్చేస్తోంది.. 100 కోట్ల ప్లాస్టిక్ నోట్లతో కేంద్రం ట్రయల్
-
మరో వీడియో పోస్ట్ చేసిన మోదీ.. దేశ ప్రజలకు కీలక పిలుపు
న్యూఢిల్లీ: దేశ ప్రజలు ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారంలో భాగస్వాములు కావాలని, స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ప్రతి ఇంట్లో దాన్ని ఒక వేడుకగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం పిలుపునిచ్చారు. ఈ ప్రచారానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ పోస్ట్ చేశారు. “రండి, #హర్‌ఘర్‌తిరంగా ప్రతి ఇంటి వేడుకగా మార్చుకుందాం” అని పోస్టు చేశారు. ఈ ప్రకటన ఆగస్టు 15న జరిగే 80వ స్వాతంత్య్ర వేడుక సందర్భంగా చేశారు.“రండి, ఆగస్టు 15ను గర్వంతో, గౌరవంతో జరుపుకుందాం. స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులు అర్పిద్దాం. అభివృద్ధి చెందిన భారత్ (వికసిత్ భారత్) నిర్మాణానికి ప్రతిజ్ఞ చేద్దాం. ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకం, ప్రతి గృహంలో త్రివర్ణ పతాకం, ప్రతి హృదయంలో త్రివర్ణ పతాకం ఉండాలి. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేద్దాం” అని ప్రధాని అన్నారు. 2026 హర్ ఘర్ తిరంగా ప్రచారం ఆగస్టులో నిర్వహిస్తున్నారు. దేశ ప్రజలు తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశవ్యాప్త వేడుకల్లో పాల్గొనాలని ప్రోత్సహిస్తున్నారు. ఈ ప్రచారం ద్వారా ప్రజలు త్రివర్ణ పతాకాన్ని తమ ఇళ్లకు తీసుకువచ్చి స్వాతంత్య్ర స్ఫూర్తిని జరుపుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఎర్రకోట వద్ద ‘వందే మాతరం’ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ గీతానికి ముందు ఎర్రకోట ప్రాకారాలపై నుంచి ‘వందే మాతరం’ను సామూహికంగా ఆలపించనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మంగళవారం తెలిపారు. ఎక్స్‌లో చేసిన గుప్తా స్పందిస్తూ దీనిని “గౌరవప్రదమైన, చారిత్రాత్మక ఘట్టం”గా అభివర్ణించారు. జాతీయ గీతానికి ముందు ఎర్రకోట వద్ద సామూహికంగా ‘వందే మాతరం’ ఆలపించడం ఇదే తొలిసారి అని చెప్పారు.భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ‘వందే మాతరం’ ఒక “అమర జాతీయ మంత్రం”గా నిలిచిందని, అది విప్లవకారులకు స్ఫూర్తినిచ్చిందని, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలకు స్వరంగా మారిందని గుప్తా పేర్కొన్నారు. ‘వందే మాతరం’ 150వ వార్షికోత్సవం, పార్లమెంట్లో ఆమోదించిన తీర్మానం, ప్రధాని మోదీ నాయకత్వాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. ఇవన్నీ కలిసి భారత జాతీయ స్మృతి, సాంస్కృతిక గౌరవం, దేశభక్తికి గొప్ప ప్రకటనగా నిలుస్తాయని చెప్పారు. “వందే మాతరం. జై హింద్, భారత మాతాకీ జై!” అని గుప్తా తన పోస్టులో పేర్కొన్నారు.గోవాలో తిరంగా ర్యాలీహర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా గోవా రాజధాని పనాజీలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. మిరామార్ సర్కిల్ నుంచి కాలా అకాడమీ మీదుగా ఆజాద్ మైదాన్ వరకు నిర్వహించిన ప్రదర్శనలో పాల్గొన్నారు. కాలా అకాడమీలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్.. పాల్గొన్న వారిని ఉద్దేశించి ప్రసంగించారు. View this post on Instagram A post shared by Narendra Modi (@narendramodi) -
ఒకే ఫ్రేమ్‌లో మోదీ–పవార్–షా..
ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ఫొటో ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. సుప్రియా సూలే కుమార్తె రేవతి సూలే వివాహ రిసెప్షన్ సందర్భంగా చోటుచేసుకున్న ఈ పరిణామం.. సాధారణ కుటుంబ వేడుకే అయినప్పటికీ, ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.सुप्रिया सुळे यांची मुलगी रेवती सुळे आणि सारंग लखानी यांचा दिल्लीत रिसेप्शन सोहळा. यावेळी अमित शाह यांनी उपस्थित राहीले. रेवती आणि सारंग यांना आशिर्वाद दिले. #sharadpawar #amitshah pic.twitter.com/pSE3rg9UQL— Ramraje Shinde (@ramraje_shinde) August 10, 2026Prime Minister Modi ji attended the wedding reception of Sharad Pawar's granddaughter today. He blessed the newlyweds during the event. pic.twitter.com/0BVKo5YXZT— Avinash K S🇮🇳 (@AvinashKS14) August 10, 2026ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలో కొనసాగుతున్న శరద్ పవార్ పార్టీ.. ఇటీవల కేంద్ర ప్రభుత్వంతో పలు అంశాలపై చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో మోదీ, పవార్, షా కలిసి కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది. ఈ వివాహ వేడుకకు కొందరు కాంగ్రెస్ పెద్దలు, ఎన్సీపీ-ఎస్పీ మిత్రపక్షాల నేతలు కొందరు దూరంగా ఉండడమూ ఇందుకు మరో ప్రధాన కారణమైంది. అయితే ఇది కేవలం కుటుంబ కార్యక్రమంలో భాగమైన మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని ఎన్సీపీ (ఎస్పీ) వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు మహారాష్ట్ర రాజకీయాల్లో మాత్రం.. ఈ కలయికపై ఊహాగానాలు మొదలయ్యాయి.కొసమెరుపు: మోదీ విధానాలపై తరచూ విమర్శలు చేసే రోహిత్ పవార్.. అదే వేదికపై ప్రధాని మోదీతో కలిసి ఫొటోకు పోజివ్వడం కూడా చర్చకు దారితీసింది.If Sharad Pawar’s faction ever boards the NDA ship, Rohit Pawar will probably be the first passenger with his bags packed. 😂On social media, Rohit Pawar keeps claiming that he will never bow before the BJP. When it came to Delhi, he was among the first to meet PM Modi along…— Saffron Monk (@mangeshspa) August 11, 2026ఇక ఈ వివాహ వేడుకకు బీజేపీ అగ్రనేతలు హాజరు కావడం కంటే కొన్ని గంటల ముందే.. ఎన్సీపీ (ఎస్పీ)కి చెందిన లోక్‌సభ ఎంపీల బృందం ప్రధాని మోదీని కలిసింది. సుప్రియా సూలే నేతృత్వంలోని ఎనిమిది మంది ఎంపీలు మహారాష్ట్రకు సంబంధించిన పలు సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. కరువు పరిస్థితులు, సాగునీరు, నదుల అనుసంధానం, రైల్వే ప్రాజెక్టులు, రైతు రుణమాఫీ వంటి అంశాలపై వినతిపత్రం అందించారు. పుణె–నాశిక్ సెమీ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు, ఉల్లి ధరలు, చంద్రభాగా నది కాలుష్యం వంటి సమస్యలను కూడా ప్రస్తావించినట్లు సమాచారం.రాజకీయ మార్పులపై ఊహాగానాలుమోదీతో పవార్ వర్గం వరుస భేటీలు, కేంద్రం ప్రతిపాదిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై పార్టీ వైఖరి వంటి పరిణామాలు కొత్త చర్చలకు కారణమయ్యాయి. డీలిమిటేషన్ విషయంలో తమ నిర్ణయం తుది బిల్లు వచ్చిన తర్వాతే తీసుకుంటామని సుప్రియా సూలే ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే కొన్ని షరతులతో ఈ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది.ఇండియా కూటమిలో ఉంటూనే.. ఎన్సీపీ (ఎస్పీ) మాత్రం తమ రాజకీయ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చెబుతోంది. మహారాష్ట్ర సమస్యలు, ప్రజా ప్రయోజన అంశాలపైనే కేంద్రంతో చర్చలు జరుపుతున్నామని స్పష్టం చేస్తోంది. గతంలోనూ శరద్ పవార్, సుప్రియా సూలేలు ప్రధాని మోదీని కలిసి విద్యార్థుల సమస్యలు, నీటి నిర్వహణ, రైతుల అంశాలపై చర్చించారు.ఒక ఫొటో.. ఎన్నో ప్రశ్నలు!ప్రస్తుతం రేవతి సూలే వివాహ రిసెప్షన్లో తీసిన ఈ చిత్రం కేవలం ఓ కుటుంబ వేడుక జ్ఞాపకమే అయినప్పటికీ.. దాని వెనుక ఉన్న రాజకీయ నేపథ్యం కారణంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మోదీతో పవార్ సాన్నిహిత్యం పెరుగుతోందా? లేదంటే ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాత్రమే ఈ భేటీలా? మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ ఫొటో ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. -
ఆ పేరంటే ద్వేషం: బాక్సర్ మాటలకు మోదీ రియాక్షన్ వైరల్
కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత బాక్సర్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఈ మెగా ఈవెంట్లో భారత్ గెలిచిన 39 పతకాల్లో పది బాక్సింగ్‌లో వచ్చినవే. అంకుశ్ పంఘాల్, సచిన్ సివాచ్, జాస్మిన్ లంబోరియా, ప్రీతి పవార్, సాక్షి చౌదరి, అరుంధతి చౌదరి, ప్రియా ఘంఘాస్ స్వర్ణాలతో సత్తా చాటారు.మరోవైపు.. నరేందర్ బెర్వాల్, లవ్లీనా బొర్గొహెన్, జాదుమణి సింగ్ రజత పతకాలు కైవసం చేసుకున్నారు. కాగా కామన్వెల్త్ గేమ్స్ పతక విజేతలతో ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో ఆదివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బాక్సర్ నరేందర్ బెర్వాల్.. పాకిస్తాన్ బాక్సర్తో తనకు జరిగిన సంభాషణ గురించి ప్రధానితో పంచుకున్నాడు.ఆరోజు నేనే గెలిచాను‘‘పాకిస్తాన్ ప్రస్తావన వచ్చింది కాబట్టి.. నాకొక విషయం గుర్తుకువచ్చింది సర్. 2015 వరల్డ్ మిలిటరీ గేమ్స్.. నా తొలి రౌండ్ మ్యాచ్ పాకిస్తాన్‌తోనే. అప్పుడు మన మిలిటరీ నుంచి నాకు ఫోన్ వచ్చింది. పాకిస్తాన్ ప్రత్యర్థిపై అస్సలు ఓడిపోవద్దని చెప్పారు. ఆరోజు నేనే గెలిచాను. అయితే, నేను, నా ప్రత్యర్థి ఇద్దరం గాయాలపాలై ఆస్పత్రికి చేరుకున్నాం. ఇద్దరికీ కుట్లు పడ్డాయి. అప్పుడు ఆర్మీ కోచ్‌గా నరేందర్ రాణా ఉన్నారు. మీరు కూడా అప్పుడే తొలిసారి ప్రధాని అయ్యారు.ఈ పేరును ద్వేషించడం మొదలుపెట్టానుఆ సమయంలో ఆ పాక్ బాక్సర్ నాతో.. ‘సోదరా నీకో మాట చెప్పనా?’ అన్నాడు. సరే ఏమిటో చెప్పమన్నాను. అప్పుడు అతడు.. ‘నీ పేరు నరేందర్. మీ కోచ్ పేరు నరేందర్. మీ ప్రధాన మంత్రి పేరు నరేంద్ర. ఇప్పటి నుంచి ఈ పేరును నేను ద్వేషించడం మొదలుపెట్టాను’ అని అన్నాడు’’ అని నరేందర్ బెర్వాల్ ప్రధాని మోదీకి తెలిపాడు.మోదీ రియాక్షన్ వైరల్దీంతో ప్రధాని మోదీ నవ్వులు చిందించారు. బెర్వాల్‌తో పాటు అక్కడున్న అథ్లెట్లంతా కూడా నవ్వుకున్నారు. కాగా నరేందర్ బెర్వాల్ భారత సైన్యంలో జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్. ఆసియా చాంపియన్‌షిప్స్‌లో పతకాలు సాధించిన అతడు.. ఆసియా క్రీడలు-2023లో కాంస్యం గెలిచాడు. తాజాగా కామన్వెల్త్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్ అందుకున్నాడు.ఇదిలా ఉంటే.. పతక విజేతలతో ముచ్చటించిన ప్రధాని మోదీ.. వారందరినీ అభినందించారు. భారత క్రీడా ప్రతిష్టను ఉన్నత శిఖరాలకు చేర్చారని.. క్రీడల పట్ల వారికున్న అంకిత భావాన్ని కొనియాడారు. కాగా గ్లాస్గోలో జరిగిన తాజా కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ మొత్తంగా 39 పతకాలు గెలిచింది. ఇందులో పదమూడు స్వర్ణాలు, పదిహేడు రజతాలు, తొమ్మిది కాంస్య పతకాలు ఉన్నాయి. ఇక 2030లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుండగా.. అహ్మదాబాద్ ఇందుకు వేదిక. చదవండి: స్పిన్నర్లతో తలనొప్పి.. కుల్దీప్ యాదవ్‌కు నో ఛాన్స్?!#WATCH | "Pakistani boxer said to me 'Aapka naam Narender hai, aapke coach ka naam Narender hai, aapke Pradhan Mantri ka naam Narendra hai. Mujhe Narendra naam se nafrat ho gayi hai'..." says Heavyweight boxer and silver medallist Narender Berwal narrating his conversation with a… pic.twitter.com/qvmwO5D2sz— ANI (@ANI) August 10, 2026 -
రెబల్స్‌లో రెబల్స్.. బీజేపీతో బంధంపై చీలిక!
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఎంపీలు నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా అనే అనామక పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వాళ్లు ఎన్డీయే కూటమికి బయటి నుంచి మద్దతు ప్రకటించడం.. తాజాగా జరిగిన ఎన్డీయే ఎంపీల మీటింగ్‌లో ప్రధాని మోదీతో వాళ్లు భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే.. బీజేపీతో సాన్నిహిత్యంపై ఆ వర్గంలోనూ కొందరు అసంతృప్తితో తిరుగుబాటు బాట పట్టినట్లు తెలుస్తోంది. తమ వర్గం ఓట్ల నేపథ్యం కారణంగా.. బీజేపీతో కొనసాగడం ఏమాత్రం మంచిది కాదని వాళ్లు భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఎంపీలు అబూ తాహెర్ ఖాన్, ఖలీలుర్ రెహ్మాన్, యూసుఫ్ పఠాన్(మాజీ క్రికెటర్)లు.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో సన్నిహిత సంబంధాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ఈ ముగ్గురు ఇటీవల ఎన్డీఏ ఎంపీల సమావేశానికి దూరంగా ఉండడం బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.‘బీజేపీతో వెళ్లం’.. ఎంపీల స్పష్టీకరణబీజేపీతో పొత్తు తమ రాజకీయ భవిష్యత్‌కు నష్టం కలిగిస్తుందని ఈ ఎంపీలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న ముర్షిదాబాద్ వంటి ప్రాంతాల్లో తమ సంప్రదాయ ఓటర్లకు దూరమవుతామనే భయం వారిలో ఉన్నట్లు సమాచారం. ‘‘మేము బీజేపీతో కలిసి వెళ్లబోమని ఇప్పటికే స్పష్టం చేశాం. ఎన్డీయేలో భాగస్వాములం కాబోం’’ అని ఎంపీ అబూ తాహెర్ ఖాన్ ప్రకటించారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రజా ప్రయోజనాల కోసం సహకరిస్తామని మాత్రం ఆయన తెలిపారు.అదంతా డ్రామా?: మమత వర్గం ఫైర్ఎన్సీపీఐలో కొనసాగుతున్న ఈ పరిణామాలపై మమతా బెనర్జీ వర్గం తీవ్రంగా స్పందించింది. తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ తిరుగుబాటు ఎంపీలపై విమర్శలు గుప్పించారు. ‘‘వారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎన్సీపీఐ అనేది ఎన్డీయేకు మిత్రపక్షమని ఆ పార్టీ నేతలే ప్రకటించారు. ఇప్పుడు తమ నియోజకవర్గాల్లో ఎదురవుతున్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని ఆరోపించారు.మరో తృణమూల్ నేత కునాల్ ఘోష్ కూడా విమర్శలు చేశారు. ‘‘బీజేపీకి బీ టీమ్‌గా మారిన వారు ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు గెలిచింది మమతా బెనర్జీ పేరుతో, వ్యతిరేక ఓట్లతో’’ అని వ్యాఖ్యానించారు.ఢిల్లీలో మోదీ, షాతో భేటీలు.. మరోవైపు దూరంఆశ్చర్యకరంగా, బీజేపీతో దూరంగా ఉంటామని చెబుతున్న ఈ ముగ్గురు ఎంపీలు ఇటీవల ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రధాని నివాసంలో జరిగిన అల్పాహార భేటీకి కూడా హాజరయ్యారు. అయితే ఎన్డీఏ ఎంపీల ‘మంగళ్ మిలన్’ సమావేశానికి మాత్రం గైర్హాజరయ్యారు. తిరిగి సొంత గూటికే?తిరుగుబాటు ఎంపీల్లో కొందరు తిరిగి మమతా బెనర్జీ వర్గంతో సంప్రదింపులు జరుపుతున్నారని తృణమూల్ నేతలు చెబుతున్నారు. మరోవైపు ఎన్సీపీఐ నేతలు మాత్రం పార్టీలో ఎలాంటి చీలిక లేదని, అభివృద్ధి అంశాలపై మాత్రమే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెబుతున్నారు.మొత్తానికి.. తృణమూల్ నుంచి వలసలతో బలపడిన ఎన్సీపీఐలోనే ఇప్పుడు అసంతృప్తి స్వరాలు వినిపించడం బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. బీజేపీతో సంబంధాలే ఈ సంక్షోభానికి కారణమా? లేదంటే ఎంపీల రాజకీయ పునరాలోచనా? అన్నది ఆసక్తికరంగా మారింది. -
‘విరాళాల గోల్మాల్’ : ప్రధాని నివాసానికి సాధువుల భారీ మార్చ్!
న్యూఢిల్లీ: అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగంపై నిష్పక్షపాత విచారణ కోరుతూ దాదాపు 500 మంది సాధువులు, మతాచార్యులు సోమవారం ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసానికి శాంతియుతంగా మార్చ్ నిర్వహిస్తున్నారు. ప్రకాశానంద గిరి మహారాజ్ నేతృత్వంలో ఈ నిరసన ప్రదర్శన జరుగుతోంది. మండి హౌస్ సమీపంలోని నేపాల్ రాయబార కార్యాలయం వద్ద ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. విరాళాల కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ ప్రధానికి సాధువులు వినతిపత్రం సమర్పించనున్నారు.శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో పెద్దఎత్తున ఆర్థిక మోసాలు, నిధుల స్వాహా జరిగిందని నిర్వాహకులు ఆరోపించారు. సాధారణ సిబ్బందిని మాత్రమే లక్ష్యంగా చేసుకుని కొనసాగిస్తున్న సిట్ విచారణ కేవలం కంటితుడుపు చర్యగా ఉందని, ఇందులో కీలక వ్యక్తులను రక్షించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. మరోవైపు ఈరోజు రామమందిర విరాళాల గోల్‌మాల్‌పై సీబీఐ దర్యాప్తు కోరిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించనుంది. అలాగే లోక్‌సభలో ఈ అంశంపై చర్చ జరపాలని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ వాయిదా తీర్మాన నోటీసు ఇచ్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో అత్యున్నత స్థాయి స్వతంత్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. -
‘జో ఖేలేగా... వో ఖిలేగా’
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తం 39 పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. కాగా అథ్లెట్లతో భేటీ అయిన వీడియోను ప్రధాని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. ‘జో ఖేలేగా... వో ఖిలేగా’ (ఆటలు ఆడేవాళ్లు వికసిస్తారు) అంటూ అథ్లెట్లను అభినందించిన ప్రధానమంత్రి... దేశం కోసం ఇలాంటి మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కామన్వెల్త్ క్రీడల మహిళల 51 కేజీల బాక్సింగ్ విభాగంలో పసిడి నెగ్గిన సాక్షి మాట్లాడుతూ... ‘పతకాలు సాధించిన ప్లేయర్లను ప్రధాని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆ అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ భేటీని మేమంతా ఎంతో ఆస్వాదించాం’ అని పేర్కొంది. 2030లో జరగనున్న కామన్వెల్త్ క్రీడలకు అహ్మదాబాద్ ఆతిథ్యమివ్వనుంది. -
ప్రధాని మోదీకి జేడీ వాన్స్ ఫోన్.. కారణం ఇదే!
ఢిల్లీ: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ శనివారం రాత్రి ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. కీలకమైన రంగాల్లో భారత్–అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు గల అవకాశాలపై ఇద్దరు నేతలు చర్చించారు. అదేవిధంగా, వాన్స్, ఉష దంపతులకు ఇటీవల కుమారుడు పుట్టిన సందర్భంగా మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ఎక్స్‌లో వెల్లడించారు.తుర్కియే, పాకిస్తాన్, సౌదీ అరేబియాలు కీలకమైన రక్షణ ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో వాన్స్ మోదీతో మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది. పరస్పర రక్షణ ఒప్పందంపై తుర్కియే, సౌదీ అరేబియా, పాకిస్తాన్‌లు సంతకాలు చేసిన కొద్ది రోజులకే ప్రధాని మోదీకి వాన్స్ ఫోన్ చేయడం గమనార్హం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో వర్తకం, రక్షణ, ఇంధన భద్రత రంగాలలో భారత్-అమెరికాల సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక సంబంధాలను విస్తరించడంపై కూడా చర్చించారు."అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కీలక రంగాల్లో భారత్-యుఎస్ సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై మేము చర్చించాం" అని ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. భారత అధికారిక ప్రకటన ప్రకారం.. భారత్-అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్య పురోగతిని ప్రధాని మోదీ, వాన్స్ సమీక్షించారు.ఉన్నత స్థాయి చర్చల్లో కొనసాగుతున్న పురోగతిని వారు ప్రస్తావించారు. వర్తకం, రక్షణ, సంక్లిష్ట, వర్ధమాన సాంకేతికతలు, ఇంధన భద్రత, కీలక ఖనిజాల రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతంపై చర్చించారు. పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా వారు అభిప్రాయాలను పంచుకున్నారని ప్రకటన తెలిపింది. అయితే, ఈ సంభాషణకు సంబంధించి అమెరికా అధికారిక వర్గాల నుంచి ఇంకా ఎలాంటి వివరాలు వెలువడలేదు. భారత్, అమెరికాల మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం గురించి ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చిందో లేదో స్పష్టత రాలేదు. ‘మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ పేరుతో పాకిస్థాన్, సౌదీ అరేబియా, తుర్కియే కీలక రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్న ఆ దేశాలు.. ఏ దేశంపై దాడి జరిగినా మూడింటిపై జరిగిన దాడిగానే పరిగణించనున్నాయి. ఈ కీలక రక్షణ ఒప్పందంపై ఆ దేశాలు సంతకాలు చేశాయి.పెరుగుతున్న భద్రతా ఆందోళనల వేళ ఈ ఒప్పందం మూడు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం.. మూడు దేశాలలో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా.. అది మిగతా అన్ని దేశాలపై జరిగిన దాడిగానే పరిగణనలోకి తీసుకోనున్నాయి. మూడు దేశాలలో ఏ ఒక్క దానిపై సాయుధ దాడి జరిగినా.. అది మూడింటిపై జరిగిన దాడిగానే భావిస్తారు. అలాగే మూడు దేశాల మధ్య రక్షణ సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను మరింత పెంపొందించడానికి ఇది తోడ్పడుతుందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన సంగతి తెలిసిందే. -
ప్రతి అంశంపైనా ప్రశ్నించాలి
న్యూఢిల్లీ: ఎలాంటి ఆలోచన లేకుండా అందరూ ఆమోదించే అంశాన్నయినా సరే మీరు ప్రశ్నించి తీరాలని ప్రధాని మోదీ విద్యార్థులకు సూచించారు. ఐఐటీ ఢిల్లీ 57వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ అక్కడి వందలాది మంది విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ఆ ధైర్యం ఉండాల్సిందే... ‘‘ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ప్రశ్నించడంతోనే ఆగిపోవద్దు. అందుకు పరిష్కారాలు వెతికే శక్తిసామర్థ్యాలు, ధైర్యాన్ని పెంపొందించుకోండి. మీరు కొత్త విషయాలు తెల్సుకోవాలన్న జిజ్ఞాస ఎప్పుడూ ఉండాలి. ఆ ఉత్సుకతను మీలో శాశ్వతంగా సజీవంగా ఉంచుకోండి. అది మీరు ఎల్లప్పుడూ నేర్చుకోవాలనే ఆశను సదా రేకెత్తిస్తుంది. దేశంలో యువత ఎంతగా సాధికారత సాధిస్తే దేశం అంతగా సాధికారతను సంతరించుకుంటుంది. దేశం ఇప్పుడు ప్రతిరంగంలో స్వావలంభనను సాధించేందుకు వడివడిగా అడుగులేస్తోంది. ఆర్థికరంగంలో స్వయంసమృద్ధి, సాంకేతికపరంగా స్వావలంభన, పారిశ్రామికంగానూ అదే పంథా. ఇది వికసిత్ భారత్‌కు పటిష్టమైన పునాదిగా మారుతుంది. ఈ స్నాతకోత్సవంలో ఎంతో లోతైన భావోద్వేగం నిండి ఉంది. విద్యార్థుల కలలు,ఆశయాలతో ఈ కళాశాల ప్రాంగణం నిండిపోయింది. మీకందరికీ శుభాకాంక్షలు కోర్సులను విజయవంతంగా పూర్తిచేసి డిగ్రీ పట్టాలు అందుకుంటున్న విద్యార్థులందరికీ, వాళ్ల కుటుంబసభ్యులకు సైతం నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ డిగ్రీ పట్టాలు చదువులను మాత్రమే ప్రతిబింబించవు. బాధ్యతాయుతంగా మీరు దేశానికి చేయబోయే సేవలను గుర్తుచేస్తాయి. మెడళ్లు సాధించిన విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు. ఐఐటీ ఢిల్లీలో కొత్తగా కృత్రిమ మేధ(ఏఐ) సంబంధింత కోర్సులు అందుబాటులోకి రావడం శుభపరిణామం. ఇక్కడ అందుకున్న డిగ్రీ పట్టాలతో దేశసేవ చేయాలన్న మీ కలను నిజం చేసుకోబోతున్నారు. కొత్తగా మీరు ఈ క్యాంపస్‌లోకి అడుగుపెట్టినప్పుడు ఓరియంటేషన్ పూర్తిచేసుకుని ఉంటారు. తర్వాత ఇప్పుడు స్నాతకోత్సవానికి చేరుకున్నారు. ఈ ఆశయాలకు పునాదులు వేసుకుంటూ కొందరు ఉద్యోగంలో చేరి తొలి వేతనం అందుకోబోతున్నారు. మరికొందరు కాబోయే పారిశ్రామికవేత్తలుగా అంకుర సంస్థలను ప్రారంభించబోతున్నారు. మరికొందరు ఉన్నత చదువులు, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఈ మొత్తం విద్యాయాత్రలో మీరెన్నో మధురానుభూతులను చవిచూసి ఉంటారు. కొత్త జీవితం ఆరంభించబోతున్నామనే ఉత్సాహం మీలో కని్పస్తోంది. అన్నీ మారుతున్నాయి.. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, భౌగోళిక అంశాలతోపాటు సాంకేతికత వేగంగా మారుతోంది. సాంకేతికతలో వస్తున్న పెనుమార్పులు ప్రపంచ పరిణామాలకు కారణభూతమవుతున్నాయి. పెనుమార్పుల యుగంలో అనూహ్య సవాళ్లతోపాటు ఎన్నో అవకాశాలు అందివస్తున్నాయి. ఈ మార్పుల శకంలో నా మాట ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నిరంతరం నేర్చుకు నే వ్యక్తే విజేతగా నిలుస్తాడు. ఐఐటీ డిగ్రీ అనేది కేవలం అన్ని సబ్జెక్టుల్లో అత్యధిక గ్రేడ్ తెచ్చుకుని చక్కటి వేతనంతో ఉపాధి సాధించే అవకాశంగా కంటే వాస్తవిక ప్రపంచంలో సవాళ్లను వేగంగా పరిష్కరించే సత్తాను సంతరించుకోవడమే. అత్యంత క్లిష్టమైన సమస్యలను సైతం మీరు సాధించగలరు అని ఈ డిగ్రీ ప్రపంచానికి చాటిచెబుతుంది’’ అని మోదీ అన్నారు.గత తరం అలా.. మీరు ఇలా.. ‘‘భారత్‌లో గత తరం మొత్తం దేశ స్వాతంత్య్రసాధన అనే ఏకైక లక్ష్యం కోసం ఎన్నో త్యాగాలు చేసింది. ఎన్నో బాధలు, అవమానాలను భరించారు. లక్ష్యసాధన కోసం ఆ తరం చూపిన తెగువ, అకుంఠిత దీక్షను మీరూ వారసత్వంగా అందిపుచ్చుకోండి. వచ్చే మూడు దశాబ్దాల్లో భారత్ సాధించాల్సిన అభివృద్ధిలో భాగస్వాములుకండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం భారతదేశ పురోగతికి ఏ విధంగా సానుకూలమో ఆలోచించి ముందడుగువేయండి. యువతరం సాధికారత అనేది అభివృద్ధిచెందిన భారత్‌కు బలమైన పునాది అవుతుంది. ఇప్పుడు ఏఐ, డేటా సెంటర్లు, భూ అయస్కాంతాలు, సముద్ర గర్భ శోధన, క్వాంటం కంప్యూటింగ్, ఇంధన భద్రత రంగాలదే హవా. ఈ రంగాలు మీ పదునైన ఐడియాల కోసం వేచిచూస్తున్నాయి. సత్తా చాటి నాయకత్వాన్ని కైవసం చేసుకోండి’’ అని మోదీ హితవు పలికారు.సవాళ్లను ముక్కలుగా చేయండి ‘‘జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఒక్క ఉదుటుగా పరిష్కరించాలనే విధానాన్ని కాస్తంత మార్చుకోండి. సమస్యలను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి ఒక్కోటి పరిష్కరించుకుంటూ వెళ్లండి. ల్యా»ొరేటరీలో ప్రయోగం మొత్తాన్నీ ఒకేసారి చేయనట్లుగా మీ సమస్యల్ని సైతం దశలవారీగా పరిష్కరించి విజయం సాధించండి. సమస్యల్ని సమస్యల్లాగా చూడక ండి. వాటిలోని అవకాశాలను ఒడిసిపట్టండి. సమస్యల్ని పరిష్కరించినప్పుడు అందులో ఒక సువర్ణావకాశం దాగి ఉన్న విషయం బోధపడుతుంది. అందుకే ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి. వర్సిటీలో సిలబస్ ప్రకారం చదువుతాం. అందులోంచే ప్రశ్నలొస్తాయి. జీవితం అ లా కాదు. సిలబస్‌లో లేని కఠిన సమస్యలే ఎక్కువశాతం ఎదురవుతాయి. ముందే కూర్చి న ప్రశ్నలకు సమాధానం చెప్పగలగడంకంటే సమాజం విసిరిన సవాళ్లను ఎదుర్కోవడంలో నే అసలైన విజయం దాగి ఉంది. చిక్కు ప్రశ్నలుగా ఎప్పట్నుంచో అందరూ వదిలేసిన వాటి ని పరిష్కరించిన వాళ్లే నేడు విజేతలుగా కీర్తిపొందుతున్నారు’’అని మోదీ వివరించారు. విద్యలో అమ్మాయిల భాగస్వామ్యం పెరగాలి‘‘ఈ స్నాతకోత్సవంలో అవార్డ్లు, మెడళ్లు తీసుకునే వాళ్లలో అమ్మాయిలు ఒకరిద్దరయినా ఉంటే బాగుణ్ణు అని అనుకుంటున్నారా? అది తప్పు. చాలా ఎక్కువ మంది ఆడబిడ్డలు ఈ జాబితాలో ఉండాల్సిందే. ఉన్నత విద్యలో మెరుగైన ప్రతిభ కనబర్చిన విద్యార్థుల్లో అమ్మాయిల భాగస్వామ్యం ఇంకా పెరగాలి’’అని మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు. -
నరేంద్ర మోదీ (ప్రధాని) రాయని డైరీ
సమస్య అనుకుంటే ప్రతిదీ సమస్యే. జెన్–జీ సమస్యే. పునర్విభజన బిల్లు సమస్యే. రామ మందిరంలో విరాళాల చోరీ సమస్యే. క్యాబినెట్ మార్పులూ సమస్యే. నిజంగా సమస్యలైనవి కొన్ని ఉంటాయి... అవసలు సమస్యలే కాదని ఎంత అనుకున్నా సమస్యలు కాకుండా పోనివి! ఆరెసెస్ను సంతోషంగా ఉంచటం నిరంతర సమస్య. ఒక్క ఏడాదైనా, ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు లేకుండా ఉండక పోవటం నిరవధిక సమస్య. ఆగస్టు 13తో వర్షాకాల సమావేశాలు ముగుస్తున్నాయి. సభ లోపల సమస్యలతో సమస్య లేదు. ఆ సంగతి స్పీకర్ ఓం బిర్లా చూసుకుంటారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు చూసుకుంటారు. స్పోక్స్ పర్సన్ సంవిత్ పాత్రా చూసుకుంటారు. మాటకు మాట చెప్పవలసి వస్తే ఎంపీ దినేష్ శర్మ చూసుకుంటారు. వీళ్ల కాక, చూసీ చూడనట్లు చూసుకునే ‘ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్’ రాజ్‌నాథ్ సింగ్, ‘నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్’ అమిత్ షా ఎటూ ఉంటారు. టీమ్ అంతా కలిసి సమస్యలు కానివాటిని, సమస్యలు కానివాటితో డీల్ చేస్తుంది. చివరికి వచ్చేసరికి ఏదీ సమస్య కాకుండా పోతుంది. ఏదీ సమస్య కానప్పుడు, పడుకున్న 8 సెకన్ల లోపే గాఢ నిద్ర పట్టేస్తుంది. ఒక దేశ ప్రధానికి పడుకున్న ఎనిమిది సెకన్లకే గాఢ నిద్ర పట్టేయటం దేశ సౌభాగ్యానికి సంకేతం. దేశ ఆర్థికాభివృద్ధికి సూచిక. ‘‘మా త్రివిధ దళాలు కళ్లు తెరిచే ఉన్నాయి’’ అని శత్రు దేశాలకు హెచ్చరిక. ‘‘దేశంలో శాంతి భద్రతలు లేవు’’ అని ఆరోపిస్తున్న ప్రతి పక్షాల నోటికి ఆనకట్ట. సభలో ఈ చివరి మూడు రోజులను కూడా మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సాగనిచ్చేలా లేరు. వాళ్ల ఆందోళన, నిరసన, డిమాండ్ ఒక్కటే... కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు ఎందుకు రావటం లేదో చెప్పాలని! తరగతి గదిలో అల్లరి చేస్తున్న పిల్లల మధ్యలోంచి ఒక మంచి విద్యార్థి లేచివెళ్లి, తరగతి బయట కాస్త దూరంగా చెట్టుకింద కూర్చుని తన క్లాస్ వర్క్ కంప్లీట్ చేసుకుంటూ ఉండటంలో జాతికి హితం కానిది ఏముంటుంది? వీళ్లు శీతాకాల సమావేశాలనైనా సజావుగా నడవనిస్తారా?! అప్పటికి ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’పై రిపోర్ట్ కూడా సిద్ధమై పార్లమెంటుకు వచ్చేస్తుంది. అదొస్తే, అందులోని ఏదో ఒక పాయింట్‌ను సపోర్ట్‌గా తీసుకుని పునర్విభజన బిల్లును మళ్లీ సభలో ప్రవేశపెట్టటానికి ఉంటుంది. వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాల ఎన్నికలున్నాయి. ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లలో ఇప్పుడున్నది బీజేపీ కనుక అక్కడ మళ్లీ బీజేపీనే వస్తుంది. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి కనుక అక్కడ ఈసారి బీజేపీ వస్తుంది. ఎన్నికలు సమస్య కాదు. సభలో బిల్లులు సమస్య కాదు. ఖర్గే, రాహుల్ సమస్య కాదు. ఆరెసెస్ను సంతృప్తి పరచటం ఒక్కటే సమస్య ఇప్పుడు! ‘‘జెన్–జీ ఆందోళనలో న్యాయం ఉంది’’ అని అంటున్నారు ఆరెసెస్ చీఫ్ మోహన్ భాగవత్! ‘‘విద్యార్థులపై పోలీసు చర్య వెనుక అసలేం జరిగిందో నాకు తెలుసుకోవాలని ఉంది’’ అంటున్నారు! ‘‘జెన్–జీని నేను గుడ్డిగా నమ్ముతాను’’ అంటున్నారు! జెన్–జీ వాదనను ఓపికతో వినాలని, వాళ్ల డిమాండ్లను ప్రేమతో అర్థం చేసుకోవాలని అంటున్నారు!అంటే, చెట్టుకింద కూర్చుని క్లాస్ వర్క్ చేస్తున్న మంచి స్టూడెంట్‌ని మంత్రి వర్గం నుంచి డిబార్ చెయ్యాలని చెబుతున్నారా? జెన్–జీని ఇక్కడ ఎవరు మాత్రం గుడ్డిగా నమ్మటం లేదు?! జెన్–జీ వాదనను ఇక్కడ ఎవరు మాత్రం ఓపికతో వినటం లేదు?! అర్థం చేసుకోని వారికంటే కొన్నిసార్లు బాగా అర్థం చేసుకునేవారే సమస్యగా మారతారు. నిద్ర కూడా పట్టకుండా చేస్తారు. -
డీలిమిటేషన్ బిల్లుపై శిరోమణి అకాలీ దళ్ కీలక నిర్ణయం
చంఢీగఢ్: శిరోమణి అకాలీ దళ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కేంద్రం తీసుకవచ్చిన డీలిమిటేషన్ , మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు తమ పార్టీ మద్దతు ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో, శిరోమణి అకాలీ దళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ భేటీ అయిన ఒక రోజు అనంతరమే ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ మద్దతుతో రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి–బీజేపీ కూటమి మళ్లీ ఏర్పడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయిసుఖ్బీర్ సింగ్ బాదల్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. "దేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని అకాలీ దళ్ డిమాండ్ చేస్తోంది. అలాగే అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను ఏకరీతిగా 50 శాతం పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు SAD మద్దతు ఇస్తుంది. ఈ మేరకు శిరోమణి అకాలీ దళ్.. చండీగఢ్‌లో జరిగిన పార్టీ సీనియర్ నాయకుల సమావేశంలో నిర్ణయం తీసుకుంది” అని బాదల్ ‘ఎక్స్’లో తెలిపారు.పార్లమెంట్ ముందున్న కీలక అంశాలపై సవివరంగా చర్చించిన అనంతరం.. అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించే విధంగా న్యాయమైన, సమతుల్య డీలిమిటేషన్ జరగాలని శిరోమణి అకాలీ దళ్ డిమాండ్ చేసిందని ఆయన పేర్కొన్నారు.గతంలో డీలీమిటేషన్‌కు వ్యతిరేకంగాఅయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కేంద్ర ప్రభుత్వం తొలిసారి ఏప్రిల్‌లో డీలిమిటేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు అకాలీ దళ్ దానిని వ్యతిరేకించింది. ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఆ పార్టీ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసింది. ఆసమయంలో పంజాబ్‌కు ఈ బిల్లు వివక్ష చూపుతోందని అకాలీ దళ్ ఆరోపించింది. పంజాబ్‌కు సీట్ల సంఖ్యలో స్వల్ప పెరుగుదల మాత్రమే లభిస్తుండగా, పొరుగు రాష్ట్రాలు మరింత ఎక్కువ సీట్లు పొందే అవకాశం ఉందని పార్టీ పేర్కొంది.ఈ నేపథ్యంలో ఇటీవల మోదీతో భేటీ అయిన అనంతరం ఆ నిర్ణయాన్ని మార్చుకుంటూ డీలిమిటేషన్ బిల్లులకు మద్దతు తెలపడం విశేషం.2020లో తెగిపోయిన దాదాపు రెండున్నర దశాబ్దాల బంధంబీజేపీ–శిరోమణి అకాలీ దళ్ మధ్య దాదాపు రెండున్నర దశాబ్దాలుగా కొనసాగిన పొత్తు 2020లో తెగిపోయింది. అప్పట్లో వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాల నేపథ్యంలో అకాలీ దళ్.. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) నుంచి వైదొలగాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మరోసారి ఈ రెండు పార్టీలు కలిసే పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
మోదీతో తొలి భేటీ.. రాఘవ్ చద్దా ఎమోషనల్
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా ఆసక్తికర పోస్ట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో తొలిసారి భేటీ అయిన ఆయన.. ఆ భేటీ సారాంశాన్ని సోషల్ మీడియాలో భావోద్వేగంగా ప్రదర్శించారు. ఈ సమావేశం తనకు ఎంతో విలువైన అనుభూతిని ఇచ్చిందని.. ఈ ఉదయాన్ని తన జీవితంలో ఎప్పటికీ గుర్తుంచుకుంటానని వ్యాఖ్యానించారు."ఎప్పటికీ గుర్తుండిపోయే ఉదయం ఇది. ప్రధాని నరేంద్ర మోదీ జీని కలిసే అవకాశం లభించింది. సుదీర్ఘమైన, ఎంతో ఉపయోగకరమైన చర్చ జరిగింది. ఆయన విలువైన సమయం కేటాయించినందుకు, ఆయన ఆలోచనలు, మార్గదర్శకత్వం పొందే అవకాశం కలిగినందుకు కృతజ్ఞతలు" అంటూ రాఘవ్ చద్దా సోషల్ మీడియా వేదికగా స్పందించారు.A morning I will cherish.Had the privilege of meeting Hon’ble Prime Minister Shri @narendramodi Ji. A detailed and enriching interaction. Deeply grateful for his generous time and for the opportunity to benefit from his insights and guidance. 🇮🇳 pic.twitter.com/4A5cEwVCNg— Raghav Chadha (@raghav_chadha) August 8, 2026ఆప్ నుంచి బీజేపీలో చేరిన రాఘవ్ చద్దా.. మోదీని కలిసిన ఈ ఉదయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటానని పేర్కొనడం గమనార్హం. ప్రధానితో జరిగిన ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వక భేటీనా? లేదంటే రాఘవ్ చద్దాకు పార్టీలో మరింత కీలక బాధ్యతలు దక్కే సంకేతమా? అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో మొదలైంది.రాఘవ్ చద్దా.. ఒకప్పుడు ఆప్‌లో ఉన్నప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్లతో నెటిజన్ల దృష్టిని.. మరీ ముఖ్యంగా జెన్‌జీ దృష్టిని ఆకర్షించారు. అయితే బీజేపీలో చేరిన తర్వాత రాఘవ్ చద్దా కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పలు అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీక్‌ల అంశంపై ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలకు ఆయన మద్దతుగా మాట్లాడారు.నీట్ నిరసనలపై ఎందుకు మౌనంగా ఉన్నాడో అనేదానిపైనా ఆయన పార్లమెంట్లో వివరణ ఇచ్చుకున్నారు. తన రోల్ మారిందని.. ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితిలో తాను లేనని చెప్పుకొచ్చారు. అయితే విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే పేపర్ లీక్ వ్యవస్థపై కఠిన చర్యలు అవసరమని, ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పరీక్షల పారదర్శకత కోసం కఠిన చట్టాలు, వ్యవస్థలో సంస్కరణలు అవసరమన్న ప్రభుత్వ వైఖరికి ఆయన మద్దతు తెలిపారు.బీజేపీలో చద్దా పాత్రపై ఆసక్తిరాఘవ్ చద్దా–మోదీ భేటీ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. బీజేపీలో చేరిన తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాల్లో మరింత చురుకుగా పాల్గొంటున్నారు. కీలక విధాన అంశాలపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఏదేమైనా.. ఒకప్పుడు భిన్న రాజకీయ వేదికపై ఉన్న రాఘవ్ చద్దా ఇప్పుడు బీజేపీ నేతగా ప్రధాని మోదీని కలవడం ఆయన రాజకీయ ప్రయాణంలో మరో కీలక మలుపుగా కనిపిస్తోంది.యువతకు మోదీ భరోసామరోవైపు, ఇవాళ ఢిల్లీలోని ఐఐటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ దేశ యువతపై విశ్వాసం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన భారత్ (వికసిత్ భారత్) లక్ష్యాన్ని సాధించడంలో యువత శక్తి, ప్రతిభ కీలకమని అన్నారు. యువతలో ఉన్న ఆలోచనలు, సాంకేతిక నైపుణ్యాలు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని ప్రధాని పేర్కొన్నారు. -
ట్రెండింగ్‌లో వారణాసి.. మోదీ కంచుకోటలో ఇదేం సీన్?
వారణాసి: ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నగరం భారీ వర్షాలకు అతలాకుతలమైంది. రోడ్లు చెరువులను తలపించేలా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా రోడ్డు మధ్యలో వరద నీటిలో ఓ ఆటో బోల్తా పడటం, ఆ వెంటనే ఓ బైకర్ కూడా అదుపుతప్పి నీటిలో పడిపోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో, అధికారులపై నెటిజన్లు మండిపడుతున్నారు.ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు దాదాపు 22 ప్రాంతాల్లో నీటిముంపు ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రధాన రహదారులపై పెద్దఎత్తున నీరు నిలిచిపోయింది. నీటిమట్టం పెరగడంతో రోడ్డు ఎక్కడుందో, గుంతలు ఎక్కడున్నాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది. వర్షం తగ్గిన తర్వాత కూడా పలు ప్రాంతాల్లో నీరు బయటకు వెళ్లకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో నీటితో నిండిన రోడ్డుపై ఓ ఆటో ముందుకు వెళ్తుండగా ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఆటో ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే మరో బైకర్ కూడా బ్యాలెన్స్ కోల్పోయి నీటిలో పడిపోయాడు. ఈ ఘటనల్లో డ్రైవర్, ప్రయాణికులకు గాయలైనట్టు తెలుస్తోంది.అయితే, వరద నీటిలో వాహనాలు బోల్తా పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసలు చర్చ మరో అంశంపై మొదలైంది. ‘స్మార్ట్ సిటీ’గా అభివృద్ధి చేస్తున్న వారణాసిలో ప్రతిసారీ వర్షానికి రోడ్లు ఎందుకు జలమయం అవుతున్నాయని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రధాని మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో వారణాసిలో మౌలిక వసతుల అభివృద్ధిపై దేశవ్యాప్తంగా ప్రత్యేక దృష్టి ఉంటుంది. అలాంటి నగరంలో భారీ వర్షం పడిన ప్రతిసారీ రోడ్లపై నీరు నిలిచిపోవడం, వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్న దృశ్యాలు ఇప్పుడు రాజకీయంగానూ, ప్రజా చర్చగానూ మారుతున్నాయి.Varanasi pic.twitter.com/4x2V5VrnW2— Piyush Rai (@Benarasiyaa) August 6, 2026భారీ వర్షాలు పడటం సహజమే అయినప్పటికీ.. వర్షం తగ్గిన తర్వాత కూడా నీరు గంటల తరబడి రోడ్లపై నిలిచిపోతే మాత్రం డ్రైనేజీ, పట్టణ ప్రణాళికపై ప్రశ్నలు తలెత్తాయి. తాజాగా వైరల్ అయిన ఆటో బోల్తా, బైకర్ ప్రమాద దృశ్యాలు వారణాసిలోని నీటిముంపు సమస్య తీవ్రతను మరోసారి బయటపెట్టాయి.Modi promised, he will make Varanasi like Kyoto of JapanBut even after he being the MP of it for 12 years, this is the condition of it 👇👀 pic.twitter.com/qMAUgixOAA— Veena Jain (@Vtxt21) August 7, 2026Agra, Uttar Pradesh Modi ji built roads with Space Technology Now those roads opening portal to the New Universe Modi hai toh mumkin hai ✊ pic.twitter.com/qxPXkkgykg— Veena Jain (@Vtxt21) August 7, 2026 -
మీకు అండగా నేనుంటా..
న్యూఢిల్లీ: పార్లమెంట్ కార్యకలాపాలకు పదేపదే అంతరాయం కలుగుతుండడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. సభలో నెలకొన్న గందరగోళం కారణంగా, ఇటీవల ఎన్నికైన ప్రతిభావంతులైన ఎంపీల మాటలను వినే అవకాశం దేశానికి దక్కలేదని పేర్కొన్నారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎన్సీపీఐ), శివసేన, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(అథవాలే), రాష్ట్రీయ లోక్ మోర్చా, ఏఐఏడీఎంకే, యూపీపీఎల్ పార్టీలకు చెందిన 40 మందికి పైగా ఎంపీలతో శుక్రవారం జరిగిన అల్పాహార విందు సమావేశంలో మోదీ మాట్లాడారు. మంగళవారం జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశమైన గైర్హాజరైన ముగ్గురు తృణమూల్ కాంగ్రెస్ రెబెల్ ఎంపీలు ఖలీలుర్ రెహ్మాన్, యూసుఫ్ పఠాన్, అబూ తాహెర్ ఖాన్ ఈ విందు సమావేశంలో పాల్గొనడం విశేషం. కేంద్ర మంత్రి జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. గత 20 ఏళ్లుగా లేదా కనీసం ఏడాది కాలంగా ఎన్డీయేతో కలిసి ఉన్నవారందరూ తన కుటుంబ సభ్యులేనని అన్నారు. దేశ అభివృద్ధి కోసం మనమంతా కలిసికట్టుగా పని చేయాలని చెప్పారు. అందరూ పార్లమెంట్ సమావేశాల్లో చురుగ్గా పాల్గొనాలని, ప్రజా సమస్యలపై చర్చించాలని కోరారు. ఎన్డీయే ఎంపీలందరికీ తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి క్రమం తప్పకుండా యోగా చేయాలని సూచించారు. ప్రతి వారం ఆరోగ్య పరీక్ష చేయించుకోవాలని తెలిపారు. ఎన్డీయే అంటే ఒక కుటుంబం తూర్పు, ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి గురించి ప్రధానమంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. అలాగే దేశ నిర్మాణంలో ఎంపీలు ఏ విధంగా సమర్థవంతంగా కృషి చేయవచ్చనే అంశంపై చర్చించారు. నియోజకవర్గాల అభివృద్ధికి అవసరమైన అంశాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎంపీలకు తాను వెన్నుదన్నుగా నిలుస్తానని పేర్కొన్నారు. ఎన్డీయే అంటే ఒక కుటుంబమని పునరుద్ఘాటించారు. తమ భాగస్వామ్య పక్షాలకు అన్నివిధాలుగా అండగా నిలుస్తామని వివరించారు. కేవలం ఎన్డీయే సభ్యులకే కాకుండా ప్రతి ఎంపీకీ మద్దుతుగా నిలిచానని గుర్తుచేశారు. అల్పాహార విందుకు హాజరైనప్పటికీ తాను తాము ఎన్డీయేలో భాగస్వాములం కాదని నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా నేత అబూ తాహెర్ వెల్లడించారు. -
మై హూ నా.. కొత్త మిత్రులకు మోదీ అభయం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రతిష్టంభనతో కొనసాగుతున్న వేళ.. ఎన్డీయేలో కొత్తగా చేరిన ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఈ ఉదయం కొత్త మిత్రులతో ప్రత్యేక అల్పాహార సమావేశం నిర్వహించిన ప్రధాని.. వారిలో నెలకొన్న సందేహాలు, ఆందోళనలకు తెరదించే ప్రయత్నం చేశారు. “ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ఎన్డీయే ఒక కుటుంబం.. మీకు మేమంతా అండగా ఉంటాం” అంటూ భరోసా ఇచ్చారు.ఇటీవల ప్రతిపక్ష పార్టీల నుంచి విడిపోయి ఎన్డీయేలో చేరిన 26 మంది ఎంపీలకు పార్లమెంటరీ వ్యవహారాలు, సభా చర్చల్లో చురుగ్గా పాల్గొనే విధానం, తమ నియోజకవర్గాల అభివృద్ధిపై ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు. వీరిలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నుంచి షిండే వర్గంలో చేరిన ఆరుగురు ఎంపీలు, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నుంచి బయటకు వచ్చి ఎన్డీయేలో చేరిన 20 మంది ఎంపీలు ఉన్నారు.ముఖ్యంగా ఉద్ధవ్ శివసేన నుంచి షిండే శివసేనలోకి వచ్చిన ఎంపీలకు ప్రధాని ప్రత్యేక భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. వాళ్లతో మరాఠీలో పలకరించిన ఆయన.. కొత్తగా కూటమిలోకి వచ్చిన వారంతా ఎన్డీయేలో సమాన భాగస్వాములేనని, వారికి పూర్తి గౌరవం, అవకాశాలు ఉంటాయని స్పష్టం చేసినట్లు సమాచారం.పార్లమెంట్ చరిత్రపై అవగాహన పెంచుకోండికొత్తగా ఎన్డీయేలోకి వచ్చిన ఎంపీలను ఉద్దేశించి ప్రధాని.. సభా చర్చల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. పార్లమెంట్ చరిత్ర, సంప్రదాయాలు, విధివిధానాలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. “పార్లమెంట్ చరిత్రకు సంబంధించిన అపారమైన సమాచారం అందుబాటులో ఉంది. దానిని చదివి చర్చలకు సిద్ధం కావాలి” అని ఎంపీలకు సూచించారు.టీఎంసీ నుంచి వచ్చిన ఎంపీలకు కూడా.. టీఎంసీ నుంచి విడిపోయి ఎన్డీఏలో చేరిన 20 మంది ఎన్సీపీ(ఐ) ఎంపీలతో కూడా ప్రధాని మాట్లాడారు. కొత్తగా వచ్చిన సభ్యులు కూటమిలో భాగమని, వారికి తగిన గౌరవం, అవకాశాలు ఉంటాయని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాలు, నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని మోదీ సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వ వనరులను వినియోగించుకోవాలని చెప్పారు.ఎన్డీయే బలం పెంచుకునే వ్యూహంకీలక రాజ్యాంగ సవరణ బిల్లులకు రెండు సభల్లో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం ఉండటంతో బీజేపీ ఎన్డీయే విస్తరణపై దృష్టి పెట్టింది. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల తొలగింపు నిబంధనలు, నియోజకవర్గాల పునర్విభజన వంటి ప్రతిపాదిత బిల్లులకు మద్దతు కూడగట్టేందుకు కొత్త మిత్రుల చేరిక కీలకంగా మారింది. ఇటీవల ప్రతిపక్ష పార్టీల నుంచి 26 మంది ఎంపీలు ఎన్డీయేలో చేరడంతో లోక్‌సభలో ఎన్డీఏ బలం 293 నుంచి 319కి పెరిగింది. అయినప్పటికీ ప్రత్యేక మెజారిటీకి ఇంకా 41 స్థానాల కొరత ఉంది.‘కొత్తవారూ మా కుటుంబ సభ్యులే’కొత్తగా చేరిన ఎంపీలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని చూపించేందుకు ఎన్డీఏ ప్రయత్నిస్తోంది. ఎన్డీయే పార్లమెంటరీ సమావేశంలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి సన్నిహితురాలిగా ఉన్న కాకోలి ఘోష్ దస్తిదార్కు ప్రధాని మోదీ.. అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలతో పాటు ముందు వరుసలో స్థానం కల్పించడం కూడా ఈ వ్యూహంలో భాగంగా భావిస్తున్నారు. -
దెబ్బ మీద దెబ్బ.. పుండు మీద కారం.. జుకర్‌బర్గ్ ఉక్కిరిబిక్కిరి
ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా సామ్రాజ్యం అది. ప్రపంచాన్ని కలిపిన వేదికగా ఎదిగిన ఆ సంస్థ.. అదే సమయంలో టెక్ రంగంలోనే అత్యంత వివాదాస్పద కంపెనీగా నిలిచింది. పేరు మార్చుకుని ఫేస్బుక్ నుంచి మెటాగా మారినా.. ఫేట్ మాత్రం మారడం లేదు. విమర్శలు, కోర్టు కేసులు, బిలియన్ల డాలర్ల జరిమానాలు, చివరకు క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితులు.. ఆ ప్రయాణంలో భాగంగా కొనసాగుతూనే ఉన్నాయి.తాజాగా పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించిందనే ఆరోపణలతో అమెరికాలోని న్యూ మెక్సికో కోర్టు మెటాపై భారీ జరిమానా విధించింది. మైనర్ల భద్రత విషయంలో సంస్థ విఫలమైందని, వినియోగదారులను ఎక్కువ సమయం ప్లాట్‌ఫామ్‌లలోనే గడిపేలా చేసే ఫీచర్లను రూపొందించిందని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో మెటాకు మొత్తం 567 మిలియన్ డాలర్ల (సుమారు రూ.4,700 కోట్లకు పైగా) జరిమానా విధించింది. ఇదే కాదు..ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ సెల్ఫీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన ఘటన కూడా మెటాకు ఇబ్బందులు తెచ్చింది. సాంకేతిక లోపం కారణంగానే వీడియో తొలగించామని వివరణ ఇచ్చిన సంస్థ.. అనంతరం భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పింది. అయితే ఇవి మెటాకు ఎదురైన తొలి వివాదాలు కావు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌ల చుట్టూ గతంలోనూ డేటా లీకులు, ప్రైవసీ ఉల్లంఘనలు, ఫేక్ న్యూస్, పిల్లల భద్రత వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చలు జరిగాయి. ఒకప్పుడు ప్రపంచాన్ని కలిపిన వేదికగా పేరు తెచ్చుకున్న మెటా.. ఇప్పుడు బాధ్యత, భద్రత, పారదర్శకత వంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది.కేంబ్రిడ్జ్ అనలిటికా షాక్ఫేస్బుక్(మెటా) చరిత్రలో అత్యంత పెద్ద కుదుపు తెచ్చిన ఘటనల్లో ఇది ఒకటి. కోట్లాది మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారం వారి అనుమతి లేకుండా సేకరించి రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించారనే ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ వ్యవహారంలో మార్క్ జుకర్‌బర్గ్ అమెరికా కాంగ్రెస్ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అప్పట్లో ఫేస్బుక్ డేటా భద్రతపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది.పిల్లల భద్రతపై ప్రశ్నలుఇన్స్టాగ్రామ్ యువత మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోందనే ఆరోపణలు కొన్నేళ్లుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అందం, ఫాలోవర్లు, లైక్‌ల సంస్కృతి యువతలో ఒత్తిడిని పెంచుతోందని విమర్శలు వచ్చాయి. అంతర్గత పరిశోధనల్లో కొన్ని సమస్యలు బయటపడినా సంస్థ తగిన చర్యలు తీసుకోలేదనే ఆరోపణలతో మెటా ఇప్పుడు కోర్టు కేసులను ఎదుర్కొంటోంది.జుకర్‌బర్గ్ క్షమాపణలు.. సెనేట్‌లో భావోద్వేగ క్షణాలుపిల్లల ఆన్లైన్ భద్రతపై అమెరికా సెనేట్ విచారణ సందర్భంగా మార్క్ జుకర్‌బర్గ్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు. బాధిత కుటుంబాలను ఉద్దేశించి ఆయన క్షమాపణలు చెప్పారు. అయితే ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారనే ప్రచారం జరిగినప్పటికీ, అధికారిక రికార్డుల్లో ఆయన ఏడ్చినట్లు స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ పిల్లల భద్రత అంశంపై ఆయన భావోద్వేగానికి గురైన విషయం మాత్రం చర్చనీయాంశమైంది.ఫేక్ న్యూస్ తుఫాను.. ఎన్నికలపై సోషల్ మీడియా ప్రభావంఫేస్బుక్, వాట్సాప్‌లలో తప్పుడు సమాచారం వేగంగా వ్యాపించడం అనేక దేశాల్లో ఆందోళన కలిగించింది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఓటర్ల అభిప్రాయాలను ప్రభావితం చేసేలా తప్పుడు ప్రచారం జరుగుతోందనే ఆరోపణలు రావడంతో మెటా కంటెంట్ నియంత్రణ విధానాలపై ప్రశ్నలు తలెత్తాయి.వాట్సాప్ పాలసీ వివాదం.. యూజర్లలో పెరిగిన అనుమానాలు2021లో వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ ప్రకటించడంతో పెద్ద వివాదం మొదలైంది. యూజర్ల డేటా ఫేస్‌బుక్‌తో పంచుకుంటారనే భయంతో చాలామంది ప్రత్యామ్నాయ మెసేజింగ్ యాప్స్ వైపు వెళ్లారు. ఆ తర్వాత మెటా వివరణలు ఇచ్చినా.. ప్రైవసీపై ప్రజల్లో ఉన్న అనుమానాలు పూర్తిగా తొలగిపోలేదు.మయన్మార్ ఘటనలు.. ద్వేష ప్రచారంపై ఫేస్బుక్ విమర్శలుమయన్మార్లో రోహింగ్యాలపై జరిగిన హింస సమయంలో ద్వేష ప్రచారం వ్యాప్తికి ఫేస్బుక్ వేదికగా మారిందనే విమర్శలు వచ్చాయి. కంటెంట్ పర్యవేక్షణలో తమ వైఫల్యాలు ఉన్నాయని ఫేస్బుక్ కూడా అంగీకరించాల్సి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా బాధ్యతపై కొత్త చర్చకు ఇది కారణమైంది.లైక్‌ల మాయాజాలం.. ఇన్స్టాగ్రామ్ అల్గారిథమ్‌పై ఆరోపణలుయువత ఎక్కువ సమయం యాప్‌లో గడిపేలా ఇన్స్టాగ్రామ్ డిజైన్ చేశారనే విమర్శలు వచ్చాయి. లైక్‌లు, కామెంట్లు, ఫాలోవర్ల కోసం పరుగులు పెట్టేలా చేసే అల్గారిథమ్ యువతలో ఆందోళన, అసంతృప్తిని పెంచుతోందని నిపుణులు హెచ్చరించారు.మెటావర్స్ కల.. భారీ పెట్టుబడులు, భారీ నష్టాలుఫేస్బుక్ పేరును మెటాగా మార్చిన జుకర్‌బర్గ్.. వర్చువల్ ప్రపంచమైన మెటావర్స్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ అనుకున్న స్థాయిలో ఆదరణ పొందలేదు. భారీ ఖర్చులు, షేర్ విలువ పతనం, ఉద్యోగుల తొలగింపులతో మెటాకు కఠిన పరిస్థితులు ఎదురయ్యాయి.డేటా గోప్యతపై యూరప్ కఠిన చర్యలుయూరోపియన్ యూనియన్ డేటా రక్షణ నిబంధనలు ఉల్లంఘించిందంటూ మెటాపై పలు సందర్భాల్లో భారీ జరిమానాలు విధించాయి. యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని ఎలా నిర్వహించాలన్న విషయంలో టెక్ కంపెనీలకు యూరప్ గట్టి హెచ్చరికలు ఇచ్చింది.ఏఐ యుగం.. డీప్‌ఫేక్‌లతో కొత్త తలనొప్పులుకృత్రిమ మేధస్సు పెరుగుతున్న కొద్దీ మెటాకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. డీప్‌ఫేక్ వీడియోలు, నకిలీ కంటెంట్, పిల్లలకు సంబంధించిన ప్రమాదకరమైన కంటెంట్ విషయంలో సంస్థపై ఒత్తిడి పెరిగింది. భవిష్యత్తులో సోషల్ మీడియా కంపెనీలకు కేవలం టెక్నాలజీ సరిపోదని.. బాధ్యత కూడా అవసరమని ఈ వివాదాలు గుర్తుచేస్తున్నాయి.జరిమానాల చరిత్ర కూడా మెటాకు ఓ పెద్ద మచ్చగానే మిగిలింది. ఫేస్బుక్ పేరుతో ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు డేటా ప్రైవసీ, యూజర్ల సమాచారం దుర్వినియోగం, పిల్లల భద్రత వంటి అంశాల్లో మెటాపై బిలియన్ల డాలర్ల జరిమానాలు పడ్డాయి. ఇందులో అత్యంత భారీ దెబ్బ 2019లో కేంబ్రిడ్జ్ అనలిటికా డేటా వివాదం కేసులో అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC) విధించిన 5 బిలియన్ డాలర్ల జరిమానా. ఆ తర్వాత యూరప్‌లో యూజర్ల డేటా రక్షణ నిబంధనలు ఉల్లంఘించిందంటూ 2023లో ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ 1.2 బిలియన్ యూరోల జరిమానా విధించింది. ఫేస్ రికగ్నిషన్ డేటా సేకరణ వ్యవహారంలో అమెరికాలోని టెక్సాస్‌తో 1.4 బిలియన్ డాలర్ల సెటిల్మెంట్, వాట్సాప్ ప్రైవసీ నిబంధనల ఉల్లంఘనపై 225 మిలియన్ యూరోలు, ఇన్‌స్టాగ్రామ్‌లో పిల్లల డేటా రక్షణ లోపాలపై 405 మిలియన్ యూరోలు వంటి భారీ జరిమానాలు ఎదురయ్యాయి. తాజాగా పిల్లల మానసిక ఆరోగ్యం, మైనర్ల భద్రత విషయంలో అమెరికా న్యూ మెక్సికో కోర్టు విధించిన భారీ ఆర్థిక శిక్ష కూడా మెటా సంక్షోభాల జాబితాలో చేరింది. మొత్తంగా చూస్తే.. మెటా చెల్లించిన, చెల్లించాల్సి వచ్చిన జరిమానాల విలువ బిలియన్ల డాలర్లలోనే ఉంది.ఒకప్పుడు ప్రపంచాన్ని కలిపే వేదికగా మొదలైన ఫేస్బుక్ ప్రయాణం.. ఇప్పుడు యూజర్ భద్రత, గోప్యత, బాధ్యత అనే మూడు కీలక ప్రశ్నల మధ్య సాగుతోంది. ప్రతి వివాదం మార్క్ జుకర్‌బర్గ్‌కు మరో పరీక్షగా మారుతోంది. -
మరో వీడియా రిలీజ్ చేసిన ప్రధాని
సాక్షి, ఢిల్లీ: ఈ రోజు శుక్రవారం (ఆగస్టు 7) జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. చేనేత హ్యాండ్లూమ్ ఉత్పత్తులను కొనుగోలు చేసి, ఆ వీడియోలను చేనేత కార్మికులకు మద్దతుగా సోషల్ మీడియాలో వీడియోల రూపంలో పంచుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. స్నేహితుల దినోత్సవంఎంత ఉత్సాహంగా జరుపుకుంటామో, అదే ఉత్సాహంతో జాతీయ చేనేత దినోత్సవాన్ని కూడా జరుపుకోవాలని కోరారు.ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన వీడియోలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. "1905 ఆగస్టు 7న స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారత స్వాతంత్ర్య పోరాటంలో ఈ ఉద్యమం కీలక పాత్ర పోషించిందని, దేశ ప్రజలను ఏకం చేయడంతో పాటు స్వావలంబనకు ప్రతీకగా నిలిచింది" అని పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం కూడా అదే స్పూర్తిని గుర్తు చేసే సందర్భంగా భావించాలని ప్రధాని అన్నారు.దేశవ్యాప్తంగా అనేక మంది నేత కార్మికులు చిన్న చిన్న ఇళ్లలోనే పనిచేస్తూ, విభిన్న రకాల చేనేత వస్త్రాలను అద్భుతమైన నైపుణ్యంతో తయారు చేస్తున్నారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక హ్యాండ్లూమ్ ఉత్పత్తిని కొనుగోలు చేయాలని, దానిని చూపిస్తూ ఒక చిన్న వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పంచుకోవాలని ప్రధాని మోదీ సూచించారు.ఇలా చేయడం ద్వారా మరింత మంది చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ప్రేరణ పొందుతారని, నేత కార్మికులకు విస్తృత మద్దతు లభిస్తుందని ఆయన చెప్పారు. "ఆత్మనిర్భర్ భారత్ నిర్మించడమే మన లక్ష్యమని. అందుకోసం సమాజంలోని అత్యంత చిన్న, పేద కుటుంబాలు కూడా ఆర్థికంగా బలోపేతం కావాలి. ప్రజల మద్దతు పెరిగితే భారతీయ నేత కార్మికుల ప్రతిభ, వారి అద్భుతమైన కళాత్మక నైపుణ్యం ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు పొందుతుంది” అని ప్రధాని మోదీ ఇన్‌స్టా వేదికగా పేర్కొన్నారు. -
ఇరాన్ యుద్ధం.. ట్రంప్ బిగ్ సిగ్నల్
పశ్చిమాసియాను కుదిపేస్తున్న యుద్ధ మేఘాలు క్రమంగా తొలగిపోతున్నాయా? నెలల తరబడి కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ ఘర్షణకు తెరపడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఓ వైపు ఆయుధ నిల్వలు, యుద్ధ సామర్థ్యంపై చర్చలు సాగుతుండగా.. మరోవైపు కీలక దేశాల మధ్య దౌత్య ప్రయత్నాలు వేగం పుంజుకోవడం ఆసక్తిని రేపుతోంది. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం “చాలా త్వరలోనే ముగుస్తుందని భావిస్తున్నా” అని ఓవల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. ఇరాన్ ఈ యుద్ధాన్ని ఎక్కువ కాలం కొనసాగించే పరిస్థితిలో లేదని ఆయన పేర్కొన్నారు.క్షిపణుల నిల్వలపై వస్తున్న ప్రశ్నలపైనా ట్రంప్ స్పందించారు. కొన్ని అత్యంత శక్తివంతమైన ఆయుధాలు తమ వద్ద భారీగా ఉన్నాయని, మరికొన్ని ఆయుధాల నిల్వలు పరిమితంగా ఉన్నాయని అంగీకరించారు. అయితే అమెరికా సైన్యం మాత్రం “చాలా మంచి స్థితిలోనే ఉందని” స్పష్టం చేశారు.ఇటీవల ఇరాన్‌తో నెలల తరబడి సాగిన యుద్ధంలో అమెరికా సైన్యం అత్యంత ఖచ్చితమైన దీర్ఘశ్రేణి క్షిపణుల నిల్వలను భారీగా వినియోగించిందని వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఆయుధాల లభ్యతపై చర్చ మొదలైంది. అయితే ఆయుధాల కొరతను అధిగమించేందుకు అమెరికా రక్షణ సంస్థలు కొత్త తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయని ట్రంప్ తెలిపారు. ముఖ్యంగా పేట్రియాట్, టామాహాక్ క్షిపణుల ఉత్పత్తిని పెంచుతున్నట్లు వెల్లడించారు.హర్ముజ్ జలసంధిపై కీలక నిర్ణయం?మరోవైపు ఇరాన్, అమెరికా, ఒమన్ మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి తాత్కాలిక ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నట్లు సమాచారం. ఈ మార్గంలో ఆంక్షలు, భద్రతా సమస్యలు ప్రపంచ చమురు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి.మోదీ–నెతన్యాహు ఫోన్కాల్పశ్చిమాసియాలో తాజా పరిణామాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్లో చర్చించారు. భారత్–ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై కూడా ఇరువురు నేతలు సమీక్షించినట్లు మోదీ తెలిపారు.Received a phone call from Prime Minister Benjamin Netanyahu. We reviewed progress on various aspects of the India-Israel Special Strategic Partnership which continues to grow from strength-to-strength.We also exchanged views on the current situation in West Asia.@netanyahu— Narendra Modi (@narendramodi) August 6, 2026ప్రాంతీయ భద్రతపై సౌదీ–ఫ్రాన్స్ చర్చలుతాజా పరిస్థితులు, ఎర్ర సముద్రంలో నౌకా రవాణా స్వేచ్ఛపై సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ చర్చించారు. హౌతీ దాడుల నేపథ్యంలో ప్రాంతీయ భద్రతపై ఇరువురు నేతలు దృష్టి సారించారు.చమురు ధరలు మళ్లీ పైకిపశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయ చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 82 డాలర్లకు పైగా చేరింది. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ధర కూడా 77 డాలర్లకు ఎగబాకింది. హర్ముజ్ జలసంధిలో అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన నౌకలపై ఆంక్షలు విధించేలా ఇరాన్ పార్లమెంట్లో ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. నిబంధనలు ఉల్లంఘించే నౌకలకు భారీ జరిమానాలు విధించే ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోంది.ఇరాన్ తీవ్ర ఆరోపణలు.. గ్యాస్ నష్టంపై వ్యాఖ్యలుఅమెరికా గరిష్ఠ ఆర్థిక ఒత్తిడి విధానాన్ని కొనసాగిస్తోందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఆరోపించారు. అమెరికా–ఇజ్రాయెల్ దాడుల కారణంగా రోజుకు దాదాపు 230 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ నష్టపోతున్నామని పేర్కొన్నారు.కొనసాగుతున్న ఉద్రిక్తతలుఇరాన్–అమెరికా యుద్ధ వాతావరణం కొనసాగుతుండగా, ప్రాంతంలోని ఇతర దేశాల్లోనూ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. యెమెన్‌లో హౌతీ దాడుల్లో కనీసం 18 మంది సైనికులు మరణించినట్లు సమాచారం. డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో దాడులు జరిగినట్లు హౌతీ వర్గాలు ప్రకటించాయి. లెబనాన్–ఇజ్రాయెల్ మధ్య రోమ్‌లో జరిగిన చర్చలు ముగిశాయి. చర్చలు ఫలప్రదంగా సాగాయని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ మరోసారి వైమానిక దాడులు నిర్వహించింది. కాల్పుల విరమణ చర్చలు పక్కకు జరిగిన సమయంలో ఈ దాడులు జరగడం గమనార్హం.గాజాలో పిల్లల మరణాలపై యూనిసెఫ్ ఆందోళనగాజాలో పరిస్థితిపై యూనిసెఫ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 2025 అక్టోబర్ కాల్పుల విరమణ తర్వాతి 300 రోజుల్లో కనీసం 300 మంది పిల్లలు మరణించినట్లు తెలిపింది. రోజుకు సగటున ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది.ఇరాన్‌పై యుద్ధం ముగింపుకు చేరుకుంటోందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, హర్ముజ్ ఒప్పంద ప్రయత్నాలు, చమురు ధరల పెరుగుదల.. పశ్చిమాసియా సంక్షోభం కీలక మలుపులోకి ప్రవేశించిన సంకేతాలుగా కనిపిస్తున్నాయి. -
రాహుల్ గాంధీ వ్యాఖ్యలను భవిష్యత్తు తరాలు క్షమించవు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని సమర్థించడం దురదృష్టకరమని, బాధ్యత గల నాయకులు యువతకు ఆదర్శంగా నిలవాలని, కానీ రాహుల్ గాంధీ ఆ దిశగా వ్యవహరించడం లేదని అన్నారు.పిల్లలు తప్పు చేసినప్పుడు వారిని సరైన మార్గంలో నడిపించడం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం బాధ్యత అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అలాంటి సందర్భాల్లో అసభ్యకరంగా మాట్లాడిన వారిని వెనుకేసుకురావడం సరికాదని, రాహుల్ గాంధీ కుటుంబ సభ్యులను ఎవరైనా ఇదే విధంగా దూషిస్తే ఆయన అదే విధంగా స్పందిస్తారా అని ప్రశ్నించారు.అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనపై, తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు వచ్చినప్పటికీ ఆయన హుందాగా స్పందించారని, చిన్నారులు తప్పులు చేయడం సహజమని, వారిని సరైన దారిలో నడిపించాల్సిన బాధ్యత పెద్దలదేనని మోదీ సూచించారు. ఆయన స్పందనలో క్షమాగుణం, బాధ్యత మాత్రమే కనిపించగా, విద్యార్థిని స్వచ్ఛందంగా క్షమాపణ చెప్పడం భారతీయ సంస్కృతి, విలువలకు నిదర్శనమని మంత్రి అన్నారు.అలాగే, భారతీయ సంప్రదాయాలు పెద్దలను గౌరవించడం, తప్పు చేసిన వారిని క్షమించి సరైన మార్గంలో నడిపించడం వంటి విలువలను బోధిస్తాయని వారు గుర్తుచేశారు. ప్రతిపక్ష నాయకుడిగా యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా వ్యవహరించాల్సిన సమయంలో రాహుల్ గాంధీ బాధ్యతాయుత రాజకీయాలను విస్మరించారు. అయితే, తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం అవమానకరమైన భాషను ప్రోత్సహించే నాయకులను భవిష్యత్తు తరాలు తిరస్కరిస్తాయని, దేశ ప్రజల ఆకాంక్షలకు గౌరవం ఇచ్చే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి యువత మద్దతు ఎప్పటికీ ఉంటుందని మంత్రి కిషన్‌రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
మోదీ, అమిత్‌షా క్షమాపణలు చెప్పాలి.. బీవీ రాఘవులు
సాక్షి, హైదరాబాద్: సీజేపీ, ఇతర యువజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన చలో పార్లమెంట్ సందర్భంగా జెన్‌జీపై లాఠీలు ఝులిపించడం, పిల్లెట్లను ప్రయోగించడం దారుణమనీ సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ. రాఘవులు అన్నారు.ఈ విషయంలో యువతకు, దేశ ప్రజలకు ప్రధాన మంత్రి మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.బుధవారం హైదరాబాద్‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యల మీద చర్చించేందుకు కాకుండా ప్రతిపక్ష పార్టీల ఎంపీలను చీల్చి గత సమావేశాల్లో వీగిపోయిన బిల్లులను ఆమోదించుకోవడానికి పార్లమెంట్ సమావేశాలు పెట్టినట్టు ఉందని విమర్శించారు. చలో పార్లమెంట్ సందర్భంగా జరిగిన ఘటనలపైనా, విద్యార్థులపై జరిగిన దాడులపైనా కనీసం చర్చించేందుకు అధికార ఎన్డీఏ కూటమి ముందుకు రాకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులపై దాడులకు పాల్పడింది ఎవరు? పెల్లెట్లు ప్రయోగించాల్సిన అవసరమేమి వచ్చింది? ఆ ఘటనకు ఆదేశాలు జారీ చేసిందెవరు? అనే దానిపై చర్చే లేదన్నారు. పార్లమెంట్ సమావేశాలకు రాకుండా అమిత్‌షా మొహం చాటేయడాన్ని తప్పుబట్టారు.జెన్‌జీ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులను క్షమిస్తున్నామని ప్రధాని మోదీ ప్రకటన చేయడం అంటే విద్యార్థుల పోరాటాన్ని అవమానించడమేనని స్పష్టం చేశారు. డీలిమిటేషన్ మహిళా బిల్లును కలిపి పెట్టినందుకే ప్రతిపక్షాలు వ్యతిరేకించాయన్నారు. కేవలం మహిళా బిల్లునే విడిగా ప్రవేశపెట్టేందుకు ముందుకు వస్తే అన్ని పక్షాలు మద్దతు తెలుపుతాయని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు పదో తేదీన తలపెట్టిన జైల్‌భరోకు మద్దతిస్తున్నామనీ, ఆ నిరసనల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.బిహార్ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ గెలుపు బీజేపీకి చెంపపెట్టు అన్నారు. దేశంలోని యువతరం బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్నదనీ, మతం, రాముని పేరుతో రాజకీయాలు ఎల్లకాలం సాగవని తెలిపారు. జెన్‌జీ పోరాటం రాజకీయంగా వినూత్న మార్పునకు సంకేతమనీ, ఇది లౌకిక శక్తులకు పెద్ద ఊరట అని కొనియాడారు. ప్రధాని మోదీ మెప్పు కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విలపించినట్టు ఉందని విమర్శించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వల్ల 20 మంది విద్యార్థులు చనిపోయినప్పుడు, లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు బాధపడ్డప్పుడు ఎందుకు ఏడుపు రాలేదని ప్రశ్నించారు. ఇండ్ల స్థలాల కోసం పోరాటాలు : జాన్వెస్లీప్రజలకు విద్యావైద్యాన్ని ఉచితంగా అందించేలా పాలకులపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు పోరాటాలు చేస్తున్నామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ తెలిపారు. విద్యావైద్య రంగాలను పరిరక్షించడంలో భాగంగా వాటిని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో 85 శాతం మంది పిల్లలను తల్లిదండ్రులు ప్రయివేటు స్కూళ్లలో చదివిస్తున్నారనీ, కొత్త ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేయకపోవడమే కారణమని తెలిపారు. తక్కువలో తక్కువగా ఏటా ఒక్కో విద్యార్థిపై తల్లిదండ్రులు రూ.50 వేల వరకు ఖర్చుపెట్టాల్సి రావడం భారంగా మారిందని చెప్పారురాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా, టీచర్లను నియమించకుండా నియోజకవర్గానికి ఒకటో, రెండో స్కూళ్లను పెడతామని చెప్పడమంటే ప్రభుత్వ విద్యావ్యవస్థను నీరుగార్చడమేనని విమర్శించారు. తక్షణమే రాష్ట్రంలో ఖాళీగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగ యువత చేస్తున్న పోరాటాలకు తమ పార్టీ అండగా ఉంటుందని హామీనిచ్చారు. 20 వేల కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.గుడిసెలు వేసుకున్న పేదలకు ఇండ్ల స్థలాలిచ్చి ఇందిరమ్మ ఇండ్లు కట్టిచ్చేదాకా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలనీ, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికే నష్టమని హెచ్చరించారు. పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారుల దాడులను, వేధింపులను ఆపాలని డిమాండ్ చేశారు. ఎనిమిది లక్షల ఎకరాలకు పోడు హక్కు పత్రాలివ్వాలని కోరారు. -
భారత్‌పై వ్యాఖ్యలు.. చివరకు క్షమాపణ చెప్పిన Mark Zuckerberg
-
ప్రధాని మోదీకి మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు
సాక్షి,న్యూఢిల్లీ: తమ ప్లాట్‌ఫామ్‌లలోని ప్రధాని మోదీ వీడియో తొలగింపు, బాలల లైంగిక వేధింపులు, డీప్‌ఫేక్ కంటెంట్‌పై మెటా అధిపతి మార్క్ జుకర్‌బర్గ్ బుధవారం క్షమాపణలు చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. జులై 23న నీట్‌పేపర్ లీకేజీ ఆందోళనలపై విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆ వీడియోలను మెటా నేతృత్వంలోని అన్నీ ఫ్లాట్‌ఫారమ్ మెటా,ఇన్‌స్టాగ్రామ్‌ల నుంచి తొలగించింది. కొద్ది సేపటికే ఆ వీడియోలను పునరుద్ధరించింది.అయితే, ప్రధాని వీడియో తొలగింపుపై క్షమాపణలు చెప్పాలంటూ పార్లమెంటరీ ప్యానెల్ జుకర్ బర్గ్‌ను కోరింది. అందుకు మెటా స్పందించింది. పొరపాటున కంటెంట్‌ను తొలగించి, ప్లాట్ఫామ్లో పునరుద్ధరించినట్లు కంపెనీ తెలిపింది. మెటా వివరణపై ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ వివరణ సరిపోదని అభిప్రాయపడింది. ఈ క్రమంలో నిషికాంత్ దూబే నేతృత్వంలోని పార్లమెంటరీ ఐటీ కమిటీ కూడా మూడు రోజుల అల్టిమేటం జారీ చేసింది. ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే ఐటీ చట్టం సెక్షన్ 79 కింద మెటాకు ఉన్న ‘సేఫ్ హార్బర్’ చట్టపరమైన రక్షణను రద్దు చేస్తామని హెచ్చరించింది. ప్రభుత్వం, పార్లమెంటరీ ప్యానెల్ నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో మెటా గ్లోబల్ ఉన్నతాధికారులు ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ క్రమంలో ప్లాట్‌ఫామ్ నిర్వహణలో జరిగిన లోపాలను అంగీకరిస్తూ మార్క్ జుకర్‌బర్గ్ విచారం వ్యక్తం చేసినట్లు, ప్రధాని మోదీతో పాటు భారత ప్రభుత్వానికి బేషరతుగా క్షమాపణలు తెలిపినట్లు తాజా జాతీయ మీడియా కథనాలు స్పష్టం చేశాయి. -
ఆర్టికల్ 370 రద్దుకు ఏడేళ్లు.. ప్రధాని మోదీ భావోద్వేగ సందేశం
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్, లడఖ్‌ల ప్రయాణంలో ఆర్టికల్ 370 రద్దు ఒక ‘నిర్ణాయక నూతన అధ్యాయం’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఆర్టికల్ 370 రద్దుకు ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం ఆయన ఈ చారిత్రక నిర్ణయాన్ని గుర్తు చేసుకున్నారు. 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి, జమ్ము కశ్మీర్‌ను జాతీయ ప్రధాన స్రవంతిలో పూర్తిగా విలీనం చేసింది. ఈ ప్రత్యేక హోదా రద్దు ద్వారా దశాబ్దాలుగా ప్రాథమిక రాజ్యాంగ హక్కులకు దూరంగా ఉన్న మహిళలు, అట్టడుగు వర్గాలకు సాధికారత లభించిందని ప్రధాని పేర్కొన్నారు. Seven years ago, on this day, Articles 370 and 35(A) became history, marking a decisive new chapter in the journey of Jammu and Kashmir as well as Ladakh.Since then, the lives of the people of J&K and Ladakh have witnessed wide-ranging transformation. Infrastructure has…— Narendra Modi (@narendramodi) August 5, 2026‘ఎక్స్’ వేదికగా స్పందించిన ప్రధాని మోదీ, ఏడేళ్ల కిందట ఇదే రోజున ఆర్టికల్ 370, 35(ఏ) చరిత్రలో కలిసిపోయాయని, నాటి నుంచి జమ్ము కశ్మీర్, లడఖ్ ప్రజల జీవితాల్లో సమూల మార్పులు వచ్చాయని అన్నారు. మౌలిక వసతులు విస్తరించడంతోపాటు విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో, క్రీడల్లో నూతన అవకాశాలు మెరుగయ్యాయని చెప్పారు. నేడు దేశం డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని జరుపుకుంటున్న సందర్భంలో ఈ ఆగస్టు 5వ తేదీకి మరింత ప్రాముఖ్యత సంతరించుకుందని అన్నారు. దేశ సమైక్యత కోసం ఆయన చేసిన త్యాగం తరతరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. జమ్ము కశ్మీర్, లడఖ్ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని పునరుద్ఘాటించారు.ఇది కూడా చదవండి: ఎంబీబీఎస్ గైనకాలజీ పేపర్ లీక్? -
మోదీ వీడియో.. క్షమాపణలు చెప్పినా వదిలేది లేదు!
సోషల్ మీడియా దిగ్గజం మెటా చుట్టూ వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఓ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన ఘటనపై ఇప్పటికే వివరణ ఇచ్చిన మెటా.. దీనిని “టెక్నికల్ ఎర్రర్”గా పేర్కొంటూ క్షమాపణలు చెప్పింది. అనంతరం వీడియోను పునరుద్ధరించింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టకుండా.. మెటా పనితీరు, అల్గారిథంల నిర్ణయాలపై మరిన్ని వివరాలు కోరుతోంది.ఈ క్రమంలో మెటా గ్లోబల్ పబ్లిక్ పాలసీ హెడ్ జోయెల్ కప్లాన్‌ను కేంద్రం మరోసారి వివరణ కోసం పిలిచినట్లు సమాచారం. వారం రోజుల్లోనే ఇది రెండోసారి కావడం గమనార్హం. బుధవారం జరిగే సమావేశానికి ఇన్స్టాగ్రామ్ టెక్నికల్ టీమ్ ప్రతినిధులు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మెటా అల్గారిథంలు ఎలా పనిచేస్తున్నాయి? ఏ కంటెంట్‌ను తొలగించాలనే నిర్ణయం ఎలా తీసుకుంటున్నారు? ప్రముఖ వ్యక్తుల ఖాతాలకు ఎలాంటి రక్షణ వ్యవస్థలు ఉన్నాయి? అనే అంశాలపై కేంద్రం వివరణ కోరే అవకాశం ఉంది. అలాగే ప్రధాని వీడియో తొలగింపునకు కారణమైన “టెక్నికల్ గ్లిచ్”పై మెటా నుంచి లిఖితపూర్వక వివరణ, క్షమాపణ కోరనున్నట్లు సమాచారం.అసలు వివాదం ఏంటి?జూలై 23న ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక ఖాతాలో ఓ వీడియోను పోస్టు చేశారు. జెన్-జెడ్ యువతను ఉద్దేశించి మాట్లాడిన ఈ వీడియోలో పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విద్యార్థుల నిరసనల సమయంలో పోస్టు చేసిన ఈ వీడియోను కొంతకాలం తర్వాత ఫేస్బుక్ నుంచి తొలగించారు.దీనిపై స్పందించిన మెటా.. ఇది ఉద్దేశపూర్వక చర్య కాదని, ఆటోమేటెడ్ వ్యవస్థలో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగానే వీడియో తొలగించబడిందని వివరణ ఇచ్చింది. అనంతరం వీడియోను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే దేశ ప్రధాని స్థాయి వ్యక్తికి సంబంధించిన కంటెంట్ కూడా అల్గారిథంల నిర్ణయాల్లో చిక్కుకోవడం టెక్ సంస్థల జవాబుదారీతనంపై కొత్త చర్చకు దారితీసింది.‘టెక్నికల్ ఎర్రర్’తో సరిపెట్టుకోవద్దుసోషల్ మీడియా సంస్థలు కోట్లాది పోస్టులను పరిశీలించేందుకు ఆటోమేటెడ్ అల్గారిథంలను ఉపయోగిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధమైన కంటెంట్‌ను గుర్తించి తొలగించడం వీటి ప్రధాన ఉద్దేశం. అయితే కొన్నిసార్లు సరైన కంటెంట్ కూడా పొరపాటున తొలగించబడుతోందనే విమర్శలు ఉన్నాయి. 2016లో వియత్నాం యుద్ధానికి సంబంధించిన పులిట్జర్ అవార్డు పొందిన ప్రసిద్ధ ఫొటోను ఫేస్బుక్ తొలగించింది. నగ్నత్వ నిబంధనల ఉల్లంఘనగా అల్గారిథం గుర్తించడంతో ఈ చర్య తీసుకుంది. తీవ్ర విమర్శల తర్వాత ఫేస్బుక్ తన నిర్ణయం తప్పని అంగీకరించింది. తాజాగా మోదీ వీడియో ఘటనలోనూ మళ్లీ “టెక్నికల్ సమస్య”నే కారణంగా చెప్పడం.. అల్గారిథంల పారదర్శకతపై ప్రశ్నలు పెంచుతోంది.పార్లమెంట్ కమిటీ కూడా ప్రశ్నలుమరోవైపు ఈ వ్యవహారంపై పార్లమెంట్ సమాచార సాంకేతిక వ్యవహారాల కమిటీ కూడా మెటా ప్రతినిధులను ప్రశ్నించింది. సోమవారం జరిగిన సమావేశంలో మెటా అధికారులు వీడియో తొలగింపుపై క్షమాపణలు తెలిపారు. అయితే కేవలం క్షమాపణలు చెప్పడం సరిపోదని, ఇలాంటి నిర్ణయాలకు ఎవరు బాధ్యత వహిస్తారనే అంశంపై స్పష్టత అవసరమని కమిటీ సభ్యులు ప్రశ్నించినట్లు సమాచారం.ఐటీ కమిటీ ఛైర్మన్, బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఈ ఘటనపై స్పందిస్తూ.. మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ స్వయంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి. 140 కోట్ల మంది భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాని వీడియోను తొలగించడం తీవ్రమైన అంశం. అవసరమైతే మెటాకు లభిస్తున్న “సేఫ్ హార్బర్” రక్షణపై కూడా పునరాలోచించాల్సి ఉంటుంది. మూడు రోజుల్లో జుకర్‌బర్గ్ క్షమాపణలు చెప్పాలి. బాధ్యులైన వాళ్లందరిపైనా చర్యలు తీసుకోవాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.మెటా కొత్త భద్రతా చర్యలుఈ వివాదం నేపథ్యంలో ప్రముఖ ఖాతాల విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకుంటామని మెటా కేంద్రానికి హామీ ఇచ్చినట్లు సమాచారం. ప్రధాని వంటి హైప్రొఫైల్ ఖాతాలకు సంబంధించిన పోస్టులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి పోస్టులపై చర్య తీసుకునే ముందు సీనియర్ అధికారులు సమీక్షించే విధానాన్ని అమలు చేయనున్నట్లు మెటా వెల్లడించింది. కనీసం ఇద్దరు సీనియర్ అధికారుల పరిశీలన తర్వాతే తుది నిర్ణయం తీసుకునేలా వ్యవస్థను బలోపేతం చేయనున్నట్లు తెలిపింది.అల్గారిథంల వెనుక దాక్కోవద్దుటెక్ సంస్థలు తమ అల్గారిథంలను ఒక “బ్లాక్ బాక్స్”లా ఉంచుతున్నాయనే విమర్శలు చాలాకాలంగా ఉన్నాయి. ఏ పోస్టు ఎందుకు తొలగించబడుతుంది? ఏ కంటెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు? అనే విషయాల్లో పారదర్శకత తక్కువగా ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి. ప్రధాని వీడియో తొలగింపు ఘటనను కేవలం సాంకేతిక లోపంగా కాకుండా.. డిజిటల్ వేదికలపై జవాబుదారీతనం పెంచేందుకు వచ్చిన అవకాశంగా భారత్ చూస్తోంది. క్షమాపణలతో సమస్య ముగియదని.. అల్గారిథంల నిర్ణయాలకు టెక్ సంస్థలు బాధ్యత వహించాల్సిందేననే డిమాండ్ బలపడుతోంది. -
చంద్రబాబు, పవన్, లోకేష్.. మరీ ఇంతలా?
ఏమైంది.. అలనాటి తెలుగు ఆత్మగౌరవం.. ఏమైంది.. తెలుగు పౌరుషం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కీలక మంత్రి లోకేష్ లు వీటిని పక్కనబెట్టరా అన్న సందేహం ప్రజలలో ఎందుకు వస్తోంది?ఒకప్పుడు మోడీ దేశానికే పనికిరారని తీవ్రంగా పరుష వ్యాఖ్యలు చేశారే.. పర్వతం ఎవరికి తలవంచదన్నారే.. మేం భయపడతామా అని హూంకరించారే.. మరి ఇప్పుడు ఏమైంది. మరీ ఇంతగా లొంగిపోయినట్లు వీరు మాట్లాడడం ద్వారా తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారన్న విమర్శను ఎందుకు ఎదుర్కోవలసి వస్తోంది?మోడీ కన్నా తానే సీనియర్ని అని, ఆయనకన్నా టీడీపీ కార్యకర్త కూడా బెటరే అని అప్పట్లో ఘాటుగా మాట్లాడిన చంద్రబాబే ఇప్పుడు మోడీకి తాను జై కొట్టడమే కాకుండా, సభికులతో కూడా జేజేలు కొట్టించడమేమిటి అని అంతా విస్తుపోతున్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో ఇలాంటి సన్నివేశాలు రాష్ట్ర ప్రజలందరికి కనిపించాయి. మోడీని ప్రశంసించడం తప్పుకాదు. కాని మరీ అతిగా భజన చేసిన తీరులో మోడీని ఈ ముగ్గురు నేతలు తమను తాము తగ్గించుకోవడమే కాకుండా తెలుగువారి ప్రతిష్టను కూడా తగ్గించారే అన్నదే చర్చగా ఉంది. దీనికి తోడు మా జీసీఎం జగన్ పై అసత్యాలు యధాప్రకారం వీరు సాగించారు. కొబ్బరికాయ మేమే కొట్టాం, గుమ్మడి కాయ మేమే కొట్టాం అని చంద్రబాబు అంటుంటే..అవును.. అది నిజమే.. మధ్యలో పనులన్నీ జగన్ నేతృత్వంలోనే జరిగాయని వైఎస్సార్సీపీ నేతలు బదులు చెబుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొక్కుబడిగా శంకుస్థాపన చేసి వదలివేస్తే, జగన్ ప్రభుత్వం కదా మొత్తం అనుమతులు తెచ్చి,భూ సేకరణ పూర్తి చేసి, శంకుస్థాపన చేసి దానిని ముందుకు తీసుకువెళ్లింది! ఈ విషయాన్ని ఎయిర్ పోర్టు నిర్మాణం చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంధి మల్లిఖార్జున రావు 2023లో జరిగిన సభలో బహిరంగంగానే చెప్పారు కదా! అందువల్లే ఈ ప్రారంభోత్సవ సభలో జీఎంఆర్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చేశారా అని మాజీ మంత్రి అమరనాధ్ ప్రశ్నించారు. అది ఉత్తరాంధ్రకు అవమానం కాదా అని అంటున్నారు. జగన్ హయాంలో 80 శాతం నిర్మాణం జరిగిన భోగాపురం ఎయిర్ పోర్టు తన ఘనత అని చెప్పుకుంటున్న చంద్రబాబు, కుప్పం లో విమానాశ్రయం కట్టి అంతర్జాతీయ నగరాలకు అనుసంధానం చేస్తానన్నారుగా..అది ఎక్కడదాకా వచ్చిందని పలువురు వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు.ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. భోగాపురం ఎయిర్ పోర్టుతోనే ఉత్తరాంధ్ర పరిస్తితి మారిపోతుందని చెప్పడం అతిశయోక్తి అవుతుంది. ప్రస్తుతం నగరంలో ఉన్న ఎయిర్ పోర్టు బదులు కొత్తది నిర్మించారు.అంతవరకు ఓకె. కాని దానితోనే అంతా అయిపోతుందా?ప్రస్తుతం విశాఖ నగరం నుంచి సాగుతున్న విమానయానం ఇకపై భోగాపురం నుంచి జరుగుతుంది. ట్రాఫిక్ పెరిగితే మరికొన్ని విమానాలు రావచ్చు. కాని ఇప్పటికిప్పుడు హైదరాబాద్ తదితర పెద్ద నగరాలతో పోల్చుకునే పరిస్థితి ఉండకపోవచ్చు.ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగిపోవడమే కాదు..రివర్స్ వలసలు జరుగుతాయని చంద్రబాబు వంటి సీనియర్ నేత చెబుతుంటే వినేవారి చెవిలో పూలు పెడుతున్నారన్న భావన కలగదా?అదే నిజమైతే ఆయనే కదా సుదీర్ఘకాలం ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నది. మరి ఇంతకాలం వలసలు జరుగుతున్నా ఆయన పట్టించుకోలేకపోయారా అని ఎవరైనా అడిగితే జవాబు దొరకదు.ప్రధాని మోడీని ప్రశంసించడాన్ని ఎవరూ ఆక్షేపించరు.కాని అది మరీ అతిగా ఉందని టీడీపీ మద్దతుదారులే వ్యాఖ్యానిస్తున్నారు. ఒకప్పుడు మోడీని తీవ్రంగా విమర్శించిన చంద్రబాబు ఎందుకు ఇంతలా మారిపోయారు?మోడీకంటే తానే సీనియర్ ని అని ఒకప్పుడు చంద్రబాబు ధైర్యంగా చెప్పుకున్నారు.అంతేకాదు..మోడీ పాలన ఘోరంగా సాగుతోందని అంటూ ఏడేళ్ల క్రితం చీల్చి చెండాడినట్లు ప్రసంగాలు చేసేవారు.అప్పుడేమో ఏపీకి ఏమీ చేయడం లేదన్నారు. అసలు దేశానికే నష్టం జరుగుతోంందని ..ఇంకా చాలాచాలా ఆరోపించారు. అదే చంద్రబాబు ప్రస్తుతం మోడీని అధ్బుతం, అమోఘం, అన్న చందంగా స్పీచ్ ఇవ్వడం విన్నవారంతా మరీ అతిగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా మాట్లాడడంలో ఆయన ఆంతర్యం ఏమిటి? గత అనుభవాల రీత్యా తన విధేయతను కనబరుచుకోవడానికి మాట్లాడారా? లేక ఇంకేదైనా ఇబ్బంది ఉందా అన్నది తెలియదు. ఇక పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకేసి మోడీని ఎవరో దూషించారట. దానికి ఆయన గుండె కదలిపోయిందట.కన్నీళ్లు వచ్చాయట. ఇదంతా సినిమాటిక్ అనిపించడం లేదూ!మోడీపై అంత ప్రేమ ,విశ్వాసం ఉంటే 2019 ఎన్నికల సమయంలో ఎందుకు మోడీని వదలి కమ్యూనిస్టులతో కలిసి ప్రయాణం చేశారు. మోడీ కన్నా బిఎస్పి అధినేత్రి మాయావతి గొప్పవారన్నట్లుగా వ్యవహరించారే! అవన్ని ఎందుకు చంద్రబాబు అప్పట్లో మోడీని అనరాని మాటలు అంటున్నప్పుడు ఒక్కసారైనా అది తప్పు అని చెప్పలేదే!కొందరు మరో సంగతిని ప్రస్తావిస్తున్నారు. తన తల్లిని దూషించారు అంటూ ఎవరిపై పవన్ ఆరోపించారో, క్షమించబోనని హెచ్చరించారో, వారితోనే చెట్టపట్టాలు వేసుకు తిరుగుతున్నారే అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకే ..మోడీకి మద్దతు ఇవ్వవచ్చు.కాని కన్నీళ్లు పెట్టుకున్నానంతగా చెబితే వినే జనానికి ఎబ్బెట్టు అనిపించింది. ఇక లోకేష్ ఒక వ్యాఖ్య చేశారు. గుజరాత్ లో బిజెపినే గత పాతికేళ్లుగా అధికారంలో ఉంది కనుక అభివృద్ది జరుగుతోందట. అందువల్ల ఏపీలో కూడా ఎన్డీఏనే గెలిపించాలని ఆయన అంటున్నారు.ఇదే సూత్రం ఏ పార్టీకైనా వర్తిస్తుంది కదా!గత టరమ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ మళ్లీ అదికారంలోకి వచ్చి ఉంటే జగన్ ప్రారంభించిన ఓడరేవుల నిర్మాణం పూర్తి అయ్యేది కదా! పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వరంగంలోనే ఉండేవి కదా!పరిశ్రమల పేరుతో రూపాయికే ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు ,తమ అనుంగులకు టీడీపీ పెద్దలు ఇచ్చే పరిస్థితి ఉండేదికాదు కదా!అన్నిటికి మించి రెడ్ బుక్ పేరుతో అరాచాకాలకు అవకాశం ఉండేది కాదు కదా! మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు జరిగేవి కాదు కదా!మహిళను వివస్త్రను చేసిన ఘటనకు అవకాశం ఉండేది కాదు కదా!ఇలా అనుకోవచ్చు కదా అని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.ఇది ప్రజాస్వామ్యం అన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఒకప్పుడు గుజరాత్ కు అన్నీ తీసుకువెళతారా అని ప్రశ్నించారు .ఆంధ్ర అభివృద్ది చెందుంటే మోడీ అసూయ పడుతున్నారని ధ్వజమెత్తేవారు. ఇప్పుడేమో మోడీనే ఏపీకి అంతా చేస్తున్నారని అంటున్నారు.దేనిని నమ్మాలి. ఏది ఏమైనా అతి సర్వత్రా వర్జయేత్ అని అంటారు. ఈ నేపధ్యంలోనే సిబిఐ మాజీ డైరెక్టర్ ఎమ్. నాగేశ్వరరావు ఒక వ్యాఖ్య చేస్తూ చంద్రబాబు తన స్థాయిని తగ్గించుకుని మోడీని పొగుడుతున్నారని,ఈ రకంగా పతనం మంచిది కాదని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దిగజార్చుతారా అని కామెంట్ చేశారు.సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ సూటిగానే చంద్రబాబు ప్రభృతులు మోడీని పొగిడిన తీరు తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్లు ఉందని విమర్శించారు. భోగాపురం ఎయిర్ పోర్టు మంచిదే.ఎయిర్ బస్సు బాగానే ఉంటుంది.కాని ఎర్రబస్సు ఎక్కేవారు కూడా ఎయిర్ బస్ ఎక్కేలా చేయగలిగితే అభివృద్ది అవుతుంది తప్ప,కేవలం బడాబాబుల కోసమే ఎయిర్ పోర్టు కాకూడదన్నది నిష్టుర సత్యం. -
మోదీ ముందు యాక్టింగ్ అదుర్స్ కానీ.. జనాలు పిచ్చోళ్ళు కాదు బ్రో
-
మోదీని దూషించి.. మూడు సార్లు మకాం మార్చిన బాలిక!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని దూషించిన కేసులో నోయిడాకు చెందిన 15 ఏళ్ల బాలిక రుచికా సింగ్ ఎదుర్కొంటున్న కష్టాలు ఇంకా తొలగలేదు. బహిరంగంగా క్షమాపణ కోరినప్పటికీ, సోషల్ మీడియా వేదికగా ఆమెకు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. ఎఫ్ఐఆర్ ద్వారా చిరునామా లీక్ కావడంతో ఆమె తల్లితో పాటు మూడు సార్లు ఇల్లు మార్చాల్సిన దుస్థితి ఏర్పడింది.ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో జరిగిన విద్యార్థి ఆందోళన సందర్భంగా ప్రధాని మోదీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో రుచికా సింగ్ వివాదంలో చిక్కుకున్నారు. ప్రధాని మోదీ ఆమెను క్షమిస్తూ సందేశం ఇవ్వడంతో ఢిల్లీ పోలీసులు ఆమెపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేశారు. ఈ క్రమంలోనే రుచికా కూడా తన తప్పును మన్నించాలని దేశ ప్రజలను కోరుతూ, ఒక వీడియో విడుదల చేశారు. అయినప్పటికీ ఆమెకు కష్టాలు తప్పలేదు.రుచికా సింగ్ తరఫు న్యాయవాది అనిల్ కుమార్ మాట్లాడుతూ, ఎఫ్ఐఆర్ నమోదు సమయంలో ఆమె వయసు కేవలం 14 ఏళ్లని, ఆగస్టు 1 నాటికి ఆమెకు 15 ఏళ్లు నిండాయని తెలిపారు. ఈ ఎఫ్ఐఆర్లో చిరునామా లీక్ కావడంతో కొందరు ఆమె ఇంటికి వెళ్లి అత్యాచార హెచ్చరికలు, ప్రాణహాని బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. దీంతో ప్రాణభయంతో వారు ఫరీదాబాద్‌లోని బంధువుల ఇంట ఆశ్రయం పొంది, ఆ తర్వాత మరో అజ్ఞాత ప్రదేశానికి వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు.ఈ ఘటనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని న్యాయవాది ఖండించారు. రుచికా సెలూన్ వర్కర్ కాదని, ఢిల్లీ పాఠశాలలో ఓపెన్ స్కూలింగ్ విధానంలో పదవ తరగతి చదువుతున్న మైనర్ విద్యార్థి అని తెలిపారు. ఆమె తల్లి సింగిల్ పేరెంట్ అని, ప్రైవేట్ ట్యూషన్లు చెబుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారన్నారు. ఈ వేధింపులు ఆ తల్లీకూతుళ్ల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఇది కూడా చదవండి: అభిజీత్ దీప్కే అరెస్ట్‌కు రంగం సిద్ధం? -
ఆప్ E20 మార్చ్ అడ్డగింత.. ఉద్రిక్తత
సాక్షి, ఢిల్లీ: ఈ20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా ఆప్ నేతలు చేపట్టిన ఛలో ప్రధాని నివాస్ ర్యాలీని ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపైనే భైటాయించిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్‌లు.. ఇథనాల్ ఇంధనానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా ఆప్ రెండు లక్షలకు పైగా సంతకాల సేకరణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి ర్యాలీగా వెళ్లి.. ఆయనకు ఆ ప్రతిని అప్పగించాలని కేజ్రీవాల్ భావించారు. అయితే.. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే భైఠాయించి నిరసన తెలుపుతున్నారు.ఈ సందర్భంగా మాజీ సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘‘ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి లోనుకావద్దు. అమెరికా నుంచి ఎథనాల్ కొనుగోళ్లను నిలిపివేయాలి. దేశంలో E20 పెట్రోల్ విధానాన్ని బలవంతంగా అమలు చేయొద్దు. ఈ అంశంపై ప్రధానిని కలిసే విషయమై లేఖలు పంపాం. సమస్య పరిష్కారం అయ్యే వరకు మా పోరాటం కొనసాగుతుంది’’ అని స్పష్టం చేశారు.#WATCH | Delhi: AAP National Convenor Arvind Kejriwal says, "I want to say that PM Modi should not come under pressure from US President Trump. He should stop buying ethanol from the USA and stop imposing E20 on our country. I hope that the Prime Minister will call us. We have… https://t.co/HCiUUO0dW0 pic.twitter.com/xCNkecugvT— ANI (@ANI) August 4, 2026ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకం వల్ల వాహనాల ఇంజిన్ సామర్థ్యం పాడవుతుందని వాదిస్తున్న కేజ్రీవాల్.. ప్రజలకు ఇంధనం వేసుకునే సమయంలో ప్యూర్ పెట్రోల్, ఇథనాల్ పెట్రోల్ అనే రెండు ఆప్షన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలోనే.. ఈ అంశంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని అంటున్నారాయన. "కొన్ని రోజుల క్రితం ప్రధానికి ఉద్దేశించి ఆన్లైన్ వినతిపత్రం ప్రారంభించాం. చాలా తక్కువ సమయంలోనే సుమారు 2,33,238 మంది దానిపై సంతకం చేశారు. నా కార్యాలయం నుంచి అరెస్టులంటే భయపడని 100 మందితో కలిసి ప్రధాని నివాసానికి బయలుదేరుతాను. ఈ వినతిపత్రాన్ని ఆయనకు స్వయంగా అందించి, ఇథనాల్ విధానంలో ఉన్న లోపాల గురించి చర్చించాలని కోరతాం" అని కేజ్రీవాల్ ఇంతకు ముందే ప్రకటించారు. -
‘మోదీనే బెస్ట్’ అంటూ వ్యాఖ్యలు.. సీజేపీ నేత దాస్ ‘పోస్ట్’ కలకలం
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్‌కు సంబంధించిన 2015 నాటి ఓ పాత సోషల్ మీడియా పోస్ట్ మళ్లీ వైరల్‌గా మారింది. అప్పట్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై విమర్శలు చేస్తూ, ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించిన ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి. ప్రస్తుతం సీజేపీ కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తుండటంతో, సౌరవ్ దాస్ గత వ్యాఖ్యలను నెటిజన్లు మళ్లీ ప్రస్తావిస్తున్నారు.2015లో అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఉద్దేశించి సౌరవ్ దాస్ చేసిన పోస్టులో, "ఆప్‌కు ఏమైంది? పూర్తిగా మారిపోయింది. ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. మీరు కూడా కాంగ్రెస్‌లాగే మారిపోయారు. మోదీజీ చాలా మెరుగైన నాయకుడు... ఆయనే బెస్ట్" అని పేర్కొన్నారు. ఆ పోస్టు స్క్రీన్షాట్లు ప్రస్తుతం పలు సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతున్నాయి. ఈ పాత పోస్టును ఆధారంగా చేసుకుని నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు గతంలో మోదీకి మద్దతు తెలిపిన వ్యక్తి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే పార్టీకి అధికార ప్రతినిధిగా ఉండడాన్ని ప్రస్తావిస్తుండగా, మరికొందరు రాజకీయ నాయకుల అభిప్రాయాలు కాలక్రమేణా మారవచ్చని వ్యాఖ్యానిస్తున్నారు.Whats wrong with AAP?completely changed. Double standards. U too are like congress. modiji is far better.. the best one. @ArvindKejriwal— Saurav Das (@SauravDassss) December 19, 2015సౌరవ్ దాస్ ప్రస్తుతం అభిజీత్ దిప్కే స్థాపించిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రధాన అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థుల ఉద్యమాలు, విద్యా సంస్కరణలు తదితర అంశాలపై పార్టీ తరఫున తరచూ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇటీవల సీజేపీ కార్యకలాపాలు, కేంద్ర ప్రభుత్వంపై పార్టీ వైఖరి చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఆయన పాత సోషల్ మీడియా పోస్టులు కూడా మళ్లీ వెలుగులోకి వచ్చాయి. అయితే వైరల్ అవుతున్న ఈ పాత పోస్టుపై సౌరవ్ దాస్ గానీ, సీజేపీ గానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అలాగే, 2015లో చేసిన ఆ వ్యాఖ్యలపై ఆయన ప్రస్తుత వైఖరి ఏమిటన్న విషయంపైనా ఎలాంటి స్పష్టీకరణ వెలువడలేదు. -
ఇక కేసు లేనట్లే!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న మైనర్ బాలికకు ఊరట లభించింది. ఆమెపై ఎలాంటి కేసు నమోదు చేయకూడదని ఢిల్లీ పోలీసులు నిర్ణయించినట్లు సమాచారం. జంతర్ మంతర్‌లో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనల్లో భాగంగా వైరల్ అయిన వీడియోలో బాలిక చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.తొలుత నోయిడా పోలీసులు ఈ ఘటనపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఆ ఫిర్యాదులో ఆమెను 25 ఏళ్ల మహిళగా పేర్కొన్నారు. అనంతరం సోషల్ మీడియాలో విడుదల చేసిన ఓ వీడియోలో తాను కేవలం 15 ఏళ్ల బాలికనని, ఇతరుల ప్రభావంతోనే ఆ వ్యాఖ్యలు చేశానని ఆమె వెల్లడించింది. “నేను చేసినది క్షమించరాని తప్పు. చాలా చెడ్డ మాటలు మాట్లాడాను. ఇది నా మొదటి, చివరి తప్పు. దేశ ప్రజలందరికీ క్షమాపణలు చెబుతున్నాను” అంటూ ఆ బాలిక వీడియోలో పేర్కొంది.మోదీ క్షమాభిక్ష.. మారిన పరిణామాలుఈ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ.. తనను దూషించిన వారిని క్షమిస్తున్నట్లు తెలిపారు. “అలాంటి పిల్లలను కోర్టుల చుట్టూ తిప్పడం, శిక్షించడం వల్ల పరిస్థితులు మారవు. వారిని క్షమించాలని కోరుకుంటున్నాను” అని మోదీ పేర్కొన్నారు. మోదీ వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలోనూ బాలికపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ పలువురు విజ్ఞప్తి చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.కూతురిని క్షమించాలని తల్లి విజ్ఞప్తిబాలిక తల్లి కూడా ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. తన కుమార్తెపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరారు. “మోదీ గారు గొప్ప మనసుతో నా కుమార్తెను క్షమించారు. ఆమెకు కొత్త జీవితం ఇచ్చారు. చేతులు జోడించి ధన్యవాదాలు చెబుతున్నాను” అని ఆమె తెలిపారు. అంతేకాకుండా 18 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై పరిమితులు విధించాలని ప్రధానిని కోరారు. చిన్నారులు సులభంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.CJP నిరసనల నేపథ్యంలో ఘటననీట్ పేపర్ లీక్ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఐదు వారాలకు పైగా నిరసనలు నిర్వహించింది. ఎక్కువగా విద్యార్థులు ఈ ఆందోళనకు మద్దతు ఇచ్చారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించడంతో గత నెలలో ఈ నిరసనలను విరమించారు. అయితే నిరసనల సమయంలోనే నోయిడాకు చెందిన బాలిక.. రెచ్చిపోయి మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో ఓ సుప్రీం కోర్టు లాయర్ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆపై ప్రధాని క్షమాభిక్ష.. పోలీసుల నిర్ణయం.. మైనర్ బాలికకు భారీ ఊరట లభించినట్లయింది. -
డ్రగ్స్‌తో జీవితాలు నాశనం
న్యూఢిల్లీ: మాదక ద్రవ్యాల వినియోగం వల్ల తాత్కాలికంగా ఉత్సాహం కలిగినప్పటికీ అవి వృత్తి, వ్యక్తిగత జీవితాలను పూర్తిగా నాశనం చేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయాలని యువతకు పిలుపునిచ్చారు. ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్’ కార్యక్రమాన్ని ఆయన ఆదివారం ఢిల్లీలో వర్చువల్‌గా ప్రారంభించారు. యువత మానసికంగా, శారీరకంగా దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలని.. ఇందుకోసం అన్ని రకాల మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండటం అవసరమని పేర్కొన్నారు. శత్రు దేశాలు తమ ఉగ్రవాద ప్రణాళికల్లో భాగంగా మాదక ద్రవ్యాల సరఫరాను ఒక ఆయుధంగా వాడుతున్నాయని ఆరోపించారు. డ్రగ్స్ వ్యసనం నుంచి బయటపడేవారు పోరాట యోధులని, సమాజం వారిని గౌరవించాలని సూచించారు. అవగాహన పెంచుకోవాలి..చుట్టూ ఉన్న సమాజం తోడ్పాటు, యోగా, ధ్యానంతో మాదక ద్రవ్యాల వ్యసనం నుంచి సులభంగా బయటపడవచ్చని మన సంస్కృతి బోధిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. ‘నషా ముక్త్ యువ’కార్యక్రమం అనేది వ్యక్తి, కుటుంబం, సమాజం, అన్నింటికంటే ముఖ్యంగా దేశం పట్ల ఒక సంకల్పం అని చెప్పారు. ఈ కార్యక్రమం పేరులోనే దాని ఉద్దేశం ప్రతిబింబిస్తోందని అన్నారు. ‘అభివృద్ధి చెందిన భారతదేశం’మన లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఇలాంటి తరుణంలో శారీరకంగా, మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటూ ఆత్మవిశ్వాసంతో నిండిన యువత మనకు అవసరమని స్పష్టంచేశారు. డ్రగ్స్ వల్ల తలెత్తే దుష్పరిమాణాలపై అవగాహన పెంచుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని కోరారు. డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయాలని చెప్పారు. నేటి నుంచే దేశవ్యాప్తంగా నషా ముక్త్ యువ అభియాన్ ప్రారంభమవుతోందని, ఇది ఒక సామూహిక ఉద్యమంగా మారినప్పుడు, మాదక ద్రవ్యాల నుంచి దేశానికి విముక్తి లభిస్తుందని వివరించారు. ఈరోజు తీసుకున్న సంకల్పం రాబోయే 100 వారాల పాటు ఇదే రీతిలో కొనసాగుతుందని పేర్కొన్నారు. రాబోయే 100 ఆదివారాలు ‘డ్రగ్స్ రహిత భారత్’దిశగా 100 బలమైన అడుగులు పడబోతున్నాయని వెల్లడించారు. ఒక చెడు వ్యసనం కేవలం శరీరాన్నే కాకుండా, తల్లి చిరునవ్వును దూరం చేస్తుందని, తండ్రి కలలను ఛిద్రం చేస్తుందని, సోదరి ఆశలను బలహీనపరుస్తుందని, తమ్ముడి గౌరవాన్ని హరిస్తుందని వ్యాఖ్యానించారు. తమ కళ్ల ముందే తమ పిల్లలు క్రమంగా తమను తాము కోల్పోతుండటం చూస్తూ కుటుంబ సభ్యులు ప్రతిరోజూ వేదనతోనే జీవిస్తుంటారని అన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఈ పోరాటంలో ప్రభుత్వం యువతకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. పిల్లల వ్యసనాలను దాచవద్దు దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు. గతంతో పోలిస్తే అరెస్టుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అన్నారు. రూ.వేల కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వా«దీనం చేసుకున్నట్లు తెలిపారు. మాదక ద్రవ్యాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందన్నారు. సామాజికంగా పరువు ప్రతిష్టలకు భయపడి పిల్లల వ్యసనాలను దాచవద్దని, దానికి బదులుగా వారితో స్వేచ్ఛగా మాట్లాడాలని, వ్యసనం నుంచి బయటపడేందుకు నిపుణుల సహాయం లేదా వైద్య సాయం పొందాలని మోదీ సూచించారు. యువత మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండేలా ప్రోత్సహించడం, వారు సమాజంలో సానుకూల సామాజిక మార్పుకు రాయబారులుగా మారేలా చేసేందుకు ప్రభుత్వం ‘నషా ముక్త్ యువ’ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ప్రతి ఆదివారం పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో క్రీడలు, వాకథాన్‌లు, ధ్యానం, సాంస్కృతిక కార్యక్రమాలు, అవగాహన ప్రచారాలు, వీధి నాటకాలు, చర్చా వేదికలు, కళల పోటీలు, సామాజిక భాగస్వామ్య కార్యక్రమాలు ఉంటాయి. నషా ముక్త్ భారత్(వ్యసన రహిత భారత్)ను నిర్మించాలన్న ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ను ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయా వెల్లడించారు. -
వివేక్, మాధవన్‌పై ప్రముఖ నేత ఆగ్రహం.. సంపాదన కోసమే దేశమా?
ముంబై: నటులు ఆర్ మాధవన్ (మ్యాడీ),వివేక్ ఓబెరాయ్పై మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే విమర్శలు గుప్పించారు. భారత్‌పై అంత ప్రేముంటే విదేశాల్లో ఎందుకు నివసిస్తున్నారంటూ ప్రశ్నించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం భారత్‌లో ప్రతీదీ అద్భుతంగా మార్చిందని భావిస్తే వాళ్లెందుకు విదేశాల్లో ఉంటున్నారని అన్నారు.ముంబైలో ఎంఎన్ఎస్ విద్యార్థి విభాగం ‘మహారాష్ట్ర నవనిర్మాణ విద్యార్థి సేన’ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోని వేలాది మంది పారిశ్రామికవేత్తలు విదేశాలకు వెళ్లిపోయారని అన్నారు. మోదీ బయోపిక్‌లో నటించి, ఆయన పాత్రను పోషించిన వివేక్ ఓబెరాయ్ కూడా ఇప్పుడు దుబాయ్‌లోనే నివసిస్తున్నారు. పీఎం మోదీని ప్రశంసించిన ఆర్ మాధవన్ ఎక్కడ ఉంటున్నారు? ఆయన కూడా దుబాయ్‌లోనే ఉంటున్నారు.మీకు భారత్‌పై అంత ప్రేమ ఉంటే పీఎం మోదీని అంతగా అభిమానిస్తే, దేశాన్ని మోదీ అభివృద్ధి చేస్తున్నారని నమ్మితే.. మరి విదేశాల్లో ఎందుకు ఉంటున్నారు? తమ కుటుంబాలతో కలిసి దుబాయ్‌లో ఎందుకు నివసిస్తున్నారు? అని థాకరే నిలదీశారు.వారు ఇక్కడికి వస్తారు, ప్రభుత్వం స్పాన్సర్ చేసే ‘ధురంధర్’లాంటి సినిమాల్లో నటిస్తారు. ఆ తర్వాత మళ్లీ దుబాయ్‌కి వెళ్లిపోతారు’ అని ఆయన ఆరోపించారు. అయితే, తన కుమారుడి స్విమ్మింగ్ కెరీర్ కోసం కోవిడ్-19 మహమ్మారి సమయంలో తాను దుబాయ్‌కి మారినట్లు ఆర్ మాధవన్ గతంలో పేర్కొనగా, తన వ్యాపారాన్ని ప్రారంభించేందుకు దుబాయ్ వెళ్లినట్లు వివేక్ ఓబెరాయ్ చెప్పారు. -
మోదీ పెద్ద మనసు.. తనను తిట్టిన అమ్మాయికి ‘కొత్త జీవితం’ ఇచ్చిన ప్రధాని!
సాక్షి,ఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలో జరిగిన విద్యార్థి ఆందోళనల్లో పాల్గొన్న ఓ మైనర్ బాలిక, ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై సదరు బాలిక తల్లి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రధాని మోదీ పెద్ద మనసుతో తన కుమార్తెను క్షమించి, ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించారని కొనియాడారు. ఈ సందర్భంగా తన కుమార్తెపై నమోదైన జీరో ఎఫ్ఐఆర్ను పూర్తిగా ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.చేతులు జోడించి ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతున్నాను. నా కుమార్తె చేసిన వ్యాఖ్యల్ని ప్రధాని మోదీ పెద్ద మనసుతో క్షమించారు. ప్రధాని కొత్త జీవితాన్ని ప్రసాదించడంతో ఆమె మళ్లీ జన్మించినట్లైంది’అని అన్నారు.కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలో బాలిక ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గత వారం నోయిడా పోలీసులు ఆమెపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్లో బాలిక పేరు రుచికా సింగ్, వయస్సు 25గా పొందుపరిచారు. అయితే ఆ ఎఫ్ఐఆర్లో తన కుమార్తె వివరాలు తప్పుగా ఉన్నాయని ఆమె తల్లి మోదీకి వివరించారు.మోదీపై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నాం. ఈ సందర్భంగా ప్రధాని మోదీని ఒకటే అభ్యర్థిస్తున్నాను. దయచేసి ఆమెపై తప్పుడు పేరు, వయస్సుతో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను తొలగించండి. అప్పుడు ఆమె ప్రశాంతంగా జీవించగలదు. ఇప్పుడు ఆమె మీ పర్యవేక్షణలో ఉంది. మైనర్ పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు. వారిని ఆసరాగా చేసుకుని లబ్ధి పొందాలనుకునే వారికి సులభ లక్ష్యాలుగా మారతారని పేర్కొంటూ, వారిపై సోషల్ మీడియాను నిషేధించాలని కూడా ఆమె ప్రధానమంత్రిని కోరారు.విద్యార్థుల నిరసనల సందర్భంగా తనపై చేసిన దూషణాత్మక నినాదాల విషయంలో, ప్రధాని మోదీ గత శుక్రవారం సంయమనం పాటించాలని, క్షమించాలని విజ్ఞప్తి చేశారు. ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లో ఆయన దూషణలు ఎప్పటికీ దేనినీ పరిష్కరించవు అని పేర్కొంటూ వారిని శిక్షించడం కాకుండా సమాజం వారికి మార్గనిర్దేశం చేయాలని కోరారు.వారు తప్పుదారి పట్టిన పిల్లలు. వారికి సరైన మార్గాన్ని చూపించడం మన బాధ్యత. వారిని శిక్షించడం, కోర్టుల చుట్టూ తిప్పడం లేదా వేధించడం వల్ల పరిస్థితులేమీ మారవు. నేను వారిని క్షమించాలనుకుంటున్నాను. సమాజం కూడా నా మాటను అంగీకరించాలని కోరుతున్నాను’ అని ఆయన అన్నారు.తనపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంపై బాలిక ప్రధానికి క్షమాపణలు చెప్పారు. నిరసన సమయంలో ఇతరుల ప్రభావంతోనే తాను ప్రధానమంత్రిని ఉద్దేశించి అసభ్య పదజాలం వాడానని ఆమె పేర్కొన్నారు. నా వయసు కేవలం 15 ఏళ్లు మాత్రమే. నేను చేసిన పని క్షమించరానిది. నేను అభ్యంతరకరమైన మాటలు అన్నాను. ఇదే నా మొదటి, చివరి తప్పు. దేశం మొత్తానికి నేను క్షమాపణలు చెబుతున్నాను. నాకు చాలా సిగ్గుగా ఉంది. నా ముఖాన్ని అద్దంలో చూసుకోవడానికి కూడా నాకు ధైర్యం చాలడం లేదు. దయచేసి నన్ను క్షమించండి’ అని ఆమె చెప్పింది. -
భోగాపురం ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ‘రన్‌వే’... ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
-
మోదీజీ.. సారీ!
న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నపత్రాల లీకేజీపై జరిగిన నిరసన ప్రదర్శనల్లో ప్రధాని మోదీని దుర్భాషలాడిన బాలిక ఒకరు క్షమాపణలు చెబుతూ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇతరుల ప్రభావానికి లోనై తాను అలా మాట్లాడానని, పోస్టు చేసింది కూడా తాను కానని, తన వయసు పదిహేనేళ్లు మాత్రమేనని శనివారం విడుదలైన వీడియోలో ఒక బాలిక చెబుతూండటం కనిపించింది. అయితే ఈ వీడియో అసలుదా? కాదా? అన్నది తాము నిర్ధారించలేదని పీటీఐ స్పష్టం చేయడం గమనార్హం. ప్రధాని మోదీ ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లో మాట్లాడుతూ తప్పుదారి పట్టిన పిల్లలు కొందరు తనను దుర్భాషలాడారని, వారిని క్షమించి సరైన మార్గంలో పెట్టాల్సిన అవసరముందని వ్యాఖ్యానించిన కొంత సమయానికే క్షమాపణలు కోరుతున్న బాలిక వీడియో విడుదల కావడం గమనార్హం. బాలిక ఆ వీడియోలో మాట్లాడుతూ... ‘‘జూలైలో ఫ్రెండ్స్‌తో కలిసి కన్నాట్‌ప్లేస్‌కు వెళ్లా. అక్కడ కొంతమంది ప్రధానిని తిడుతూ, అభ్యంతరకరమైన భాష వాడుతూ కనిపించారు. వాళ్లు నన్ను ప్రభావితం చేశారు. తమ మాటలను రిపీట్ చేయాల్సిందిగా ప్రోత్సహించారు. దాంతో నేను కూడా వారిలా మాట్లాడాను’’ అని చెప్పింది. ‘‘నేనిప్పుడు తలెత్తుకోలేకపోతున్నాను. దేశం మొత్తాన్ని, ప్రతి ఒక్కరిని నన్ను క్షమించమని కోరుతున్నా’’ అని కూడా ప్రార్థించినట్లు ఆ వీడియోలో ఉంది. ‘‘ఇదే తన తొలి, చివరి తప్పిదమని, ఇలాంటి పని ఇంకోసారి చేయను’’అని వివరించింది. ప్రధానిని తిడుతూ చేసిన వీడియో ఆధారంగా పోలీసులు ఇప్పటికే ఒక కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. నోయిడాలో ఆ వీడియోపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు కాగా... అది ఆ తరువాత ఢిల్లీకి బదిలీ అయ్యింది. -
ఉత్తరాంధ్ర అభివృద్ధికి ‘రన్‌వే’
సాక్షి ప్రతినిధి, విజయనగరం: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రన్‌వేగా, యువత భవిష్యత్తుకు లాంచ్‌ప్యాడ్‌గా నిలుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు, సెమీకండక్టర్ పరిశ్రమలకు శనివారం ప్రధాని శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర పవిత్ర భూమిలో ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు, శ్రీ వరాహ లక్ష్మీనర్సింహ స్వామి, శ్రీకూర్మనాథ స్వామి, పైడితల్లి అమ్మవారిని స్మరించారు. భోగాపురం వేదిక నుంచి సుమారు రూ.17,900 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేశారు. ఈ రోజు ప్రారంభమైన విమానయానం, రహదారులు, సెమీకండక్టర్లు, స్వచ్ఛ ఇంధనం, పోర్టులు, రైల్వేలు, కనెక్టివిటీ తదితర రంగాలకు సంబంధించిన ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త దిశను చూపుతాయని ప్రధాని పేర్కొన్నారు. సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గిరిజనుల సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేసిన నేలపైనే కొత్త విమానాశ్రయం ఏర్పాటు కావడం గొప్ప విశేషమన్నారు. ఎయిర్‌పోర్టును ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ, గవర్నర్ జస్టిస్ అబ్దుల్‌నజీర్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ దేశంలో పౌర విమానయాన రంగం గత 12 ఏళ్లలో విశేషంగా అభివృద్ధి చెందిందని ప్రధాని వివరించారు. 2014లో దేశంలో 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 166కు పెరిగిందన్నారు. ఉడాన్ పథకంతో సామాన్య ప్రజలు కూడా విమాన ప్రయాణం చేసే అవకాశం కల్పించామని చెప్పారు. ఉడాన్ రెండో దశకు రూ.29 వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. కాశీలో ప్రారంభించిన స్పోక్ ఎయిర్పోర్ట్ మోడల్ ఇప్పుడు అమృత్‌సర్‌కు విస్తరించి, అక్కడి నుంచి 25కుపైగా అంతర్జాతీయ గమ్యస్థానాలకు అనుసంధానం కల్పించిందని తెలిపారు.బ్లూ ఎకానమీకి ప్రోత్సాహం దేశంలో బ్లూ ఎకానమీ బలోపేతానికి కేంద్రం ప్రోత్సాహం అందిస్తుందని చెబుతూ విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం వరకు తీర ప్రాంతాన్ని కోస్టల్ ఎకనామిక్ కారిడార్‌గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. విశాఖపట్నం, కృష్ణపట్నం పోర్టుల ఆధునికీకరణతో పాటు, మూలపేట, రామాయపట్నంలో కొత్త పోర్టులు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. విశాఖపట్నం–రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వే సహా రాష్ట్రంలో పలు జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మాణంలో ఉన్నాయని, రైల్వే రంగంలో సుమారు లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులు అమలవుతున్నాయని చెప్పారు. రైల్వే నెట్వర్క్ పూర్తిగా విద్యుదీకరణ కావడంతో పాటు, 70కుపైగా స్టేషన్లు ఆధునికీకరణ జరుగుతోందని వివరించారు.» పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ద్వారా రైలు, పోర్టులు, విమానాశ్రయాల అనుసంధానంతో సమగ్ర లాజిస్టిక్స్ వ్యవస్థ ఏర్పడుతుందని, దీనివల్ల పరిశ్రమలు, రైతులు, వ్యాపార రంగానికి ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ యువతలో అపారమైన ప్రతిభ ఉందని, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్నారని ప్రధాని కొనియాడారు. ఈ ప్రతిభను దేశ అభివృద్ధికి వినియోగించేందుకు సెమీకండక్టర్ పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. విశాఖపట్నంలో సెమీకండక్టర్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయడం ఈ దిశగా కీలక ముందడుగని చెప్పారు.» సాఫ్ట్వేర్ రంగంతో పాటు తయారీ రంగంలోనూ ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీంతో భవిష్యత్ సాంకేతిక ఉద్యోగాలకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని అన్నారు.» కృత్రిమ మేధ (ఏఐ) డేటా సెంటర్ల రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు విస్తృత అవకాశాలు ఉన్నాయని, గూగుల్ ప్రకటించిన 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి దీనికి నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. రాష్ట్ర యువతకు భారీ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. నక్కపల్లిలో భారీ ఫార్మా పార్క్ ఏర్పాటుకు కేంద్రం పూర్తి మద్దతు అందిస్తోందని, దీనివల్ల దేశంలో ప్రముఖ ఔషధ తయారీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తుందని తెలిపారు. » ఈ సందర్భంగా 13 వేల మందికి పైగా గిరిజన మహిళలు, యువతులు ప్రదర్శించిన థింసా నృత్యం ప్రపంచ రికార్డు సృష్టించడం గర్వకారణమని కొనియాడారు. భారత గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ఇది అద్భుత నిదర్శనమని పేర్కొన్నారు.ఇక ఉత్తరాంధ్ర వైపు వలసలు : చంద్రబాబుఅల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడం, ఉత్తరాంధ్రలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం ద్వారా ఈ ప్రాంతంలో రివర్స్ మైగ్రేషన్‌కు నాంది పలికిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విమానాశ్రయ ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్రను దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ప్రాంతాల్లో ఒకటిగా నిలబెడుతుందని చెప్పారు. గత రెండేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టుల ద్వారా రూ.6.13 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించగలిగామని, వీటి ద్వారా 5.57 లక్షల ఉద్యోగాలు లభించే అవకాశముందని వెల్లడించారు. రూ.2,784 కోట్ల వ్యయంతో ఎనిమిది ప్రాధాన్య సాగునీటి ప్రాజెక్టులను మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నేరడి బ్యారేజ్‌కు అనుమతులు, నిధులు లభించాయని చెప్పారు. ఆగస్టు 14న గోదావరి జలాలు అనకాపల్లికి చేరనున్నాయని, అలాగే వంశధార–గోదావరి నదుల అనుసంధాన ప్రాజెక్టును కూడా చేపడతామని వెల్లడించారు. పర్యాటకం, ఔషధ పరిశ్రమలు, అరుదైన ఖనిజాలు, జాతీయ రహదారులు, ఆధ్యాత్మిక పర్యాటకం వంటి రంగాల అభివృద్ధితో ఉత్తరాంధ్ర దేశంలో ప్రముఖ ఆర్థిక కేంద్రంగా అవతరిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం, విశాఖ రైల్వే జోన్, అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు వంటి కీలక కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారానికి ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో మోదీ వంటి నాయకుడిని చూడలేదని చంద్రబాబు కొనియాడారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని, అలాగే 2028 నాటికి అమరావతి తొలిదశ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని ప్రకటించారు. » విమానాశ్రయ టెర్మినల్‌ను ప్రారంభించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణికుల సౌకర్యాలు, చెక్–ఇన్ హాల్, ఆధునిక సాంకేతిక వ్యవస్థలను పరిశీలించారు. విమానాశ్రయం మాస్టర్ ప్లాన్, భవిష్యత్ ఏవియేషన్ హబ్, ఏరోసిటీ అభివృద్ధి ప్రణాళికలను అధికారులు ప్రధానికి వివరించారు.థింసా నృత్యంతో స్వాగతంఎయిర్పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన ఉత్తరాంధ్ర సాంస్కృతిక వారసత్వం, ప్రముఖ పుణ్యక్షేత్రాలను ప్రతిబింబించే ప్రదర్శనలను ప్రధాని సందర్శించారు. సంప్రదాయ థింసా నృత్యాలను తిలకించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానికి పొందూరు ఖాదీ శాలువాతో సత్కారం చేయగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ కలిసి ఉత్తరాంధ్ర కళా వైభవానికి ప్రతీక అయిన బొబ్బిలి వీణను బహూకరించారు.ప్రధానిని తిడుతుంటే కన్నీళ్లొచ్చాయి.. పవన్ కల్యాణ్‘భారతదేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కొందరు ఇష్టానుసారం తూలనాడుతుంటే గుండె కదిలిపోయింది. కన్నీళ్లు వచ్చాయి. బాధ పడ్డాను. దేశం కోసం నిస్వార్థంగా కష్టపడే వారికి ఇవా బహుమతులు అనిపించింది’అని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. ఏపీలో రూ.17,900 కోట్ల అభివృద్ధి పనులు మోదీ చేతుల మీదుగా ప్రారంభం కావడం గొప్ప విషయంగా పేర్కొన్నారు. పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా భారతదేశాన్ని ముందుకు నడిపిన వ్యక్తి మోదీ. ఆయన వెనుక మనం ఉండాలన్నారు.ఏపీకి గ్రోత్ ఇంజన్ ఉత్తరాంధ్ర : లోకేశ్ కొందరు ఎర్రబస్సు రాదు అన్న చోటకి ఎయిర్ పోర్ట్ వచ్చిందని లోకేశ్ పేర్కొన్నారు. ఈ రోజు కేవలం ఒక ఎయిర్ పోర్ట్ ప్రారంభం మాత్రమే కాదు. మన మోదీ వికసిత్ భారత్, మన సీబీఎన్ విజన్ కలిసిన రోజు. ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారే రోజు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దూసుకెళ్లే రోజు అని అన్నారు.అభివృద్ధికిది సింహద్వారం.. రామ్మోహన్నాయుడు ఒకప్పుడు అవకాశాల కోసం ప్రపంచం వైపు ఉత్తరాంధ్ర చూసేదని.. ఇప్పుడు ప్రపంచం మనవైపు చూసేలా భోగాపురం విమానాశ్రయం చేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి సింహద్వారం భోగాపురం అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు.పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రధాని » ఎయిర్‌పోర్టు ప్రారంభంతో పాటు ప్రధాని మోదీ రాష్ట్రంలోని పలు రోడ్లు, పారిశ్రామిక సంస్థలను రిమోట్‌తో ప్రారంభించారు. » విశాఖపట్నం తర్లువాడలో ఏఎస్ఐపీ టెక్నాలజీస్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్–టెస్టింగ్ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. » కర్నూలులోని విండ్, సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ వ్యవస్థను ప్రారంభించారు. » అనంతపురంలో 2500 మెగావాట్లు, కర్నూలులో 1000 మెగావాట్లు సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ పథకాలు ప్రారంభం» కర్నూలు–ఐవీరెన్యూవబుల్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టు, పెంచలకొన–యరపాడు మధ్యనున్న బ్రిడ్జికి శంకుస్థాపన.» ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ నాలుగు లైన్ల ఎక్స్‌ప్రెస్‌వే, ఖమ్మం–దేవరపల్లి ప్యాకేజీ, తాడిపత్రి నాలుగు లైన్ల బైపాస్ రోడ్లు ప్రారంభించారు. -
E 20పై యుద్ధం.. ప్రధాని నివాసం ముట్టడి..?
-
విద్యార్థులకు కావాల్సింది క్షమాభిక్ష కాదు మోదీజీ: రాహుల్
చెన్నై: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విద్యార్థుల ఆందోళనలను పట్టించుకోవడంలో విఫలమయ్యారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శనివారం ఆరోపించారు. విద్యార్థులకు ఆయన క్షమాభిక్ష కాదు, క్షమాపణ చెప్పాలని అన్నారు."భారత్ విద్యార్థులకు ఆయన క్షమాభిక్ష అవసరం లేదు. వారికి ఆయన క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఉంది" అని రాహుల్ చెప్పారు. విద్యార్థులు తనపై చేసిన వ్యాఖ్యలను "క్షమిస్తున్నాను" అన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ రాహుల్ ఇలా అన్నారు.నీట్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను రాహుల్ కలుసుకుని ఓదార్చారు. ఈ భేటీ చెన్నై సమీపంలోని మహాబలిపురంలో జరిగింది. తమ పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు దుఃఖంలో ఉండటాన్ని చూడటం కంటే బాధాకరమైనది మరొకటి లేదని రాహుల్ అన్నారు. ప్రాణాలు కోల్పోయిన ప్రతి యువకుడు, యువతి వెనుక జీవితాంతం బాధ మోసే కుటుంబం ఉంటుందని చెప్పారు.పలుసార్లు ప్రశ్నపత్రాల లీకులు జరగడం, పరీక్షలు రద్దు కావడం, ఎన్నో సంవత్సరాల సన్నాహాలు ఒక్క రాత్రిలో వృథా కావడం విద్యా వ్యవస్థలోని వైఫల్యాన్ని బయటపెట్టాయని అన్నారు. నిజాయితీగా లేని వ్యవస్థలో విద్యార్థులు నిజాయితీగా శ్రమించాలని అడుగుతున్నారని చెప్పారు.ప్రశ్నపత్రం లీక్ కారణంగా భవిష్యత్తు కోల్పోయిన ఒక్క విద్యార్థినైనా, దుఃఖంలో ఉన్న ఒక్క తల్లిదండ్రినైనా ప్రధాన మంత్రి కలవలేదని ఆయన విమర్శించారు. విద్యార్థులు, వారి కుటుంబాలు అనుభవిస్తున్న వేదనను కేంద్ర ప్రభుత్వం గుర్తించడంలో విఫలమైందని అన్నారు. -
అసెంబ్లీ సాక్షిగా నీ తల్లిని తిడితే.. సీఎంని చేశావ్.. మోదీకి రాచమల్లు సలహా
-
ఈ20కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేయాల్సిందే: కేజ్రీవాల్
ఢిల్లీ: ఈ20 పెట్రోల్ కి వ్యతిరేకంగా ఢిల్లీలో శనివారం ఆమ్ ఆద్మీ పార్టీ సదస్సు నిర్వహించింది. మాజీ సీఎం కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆఫ్‌లైన్, ఆన్లైన్లో కలిసి మొత్తం 6 లక్షల మందికి పైగా హాజరయ్యారు. E20ని వ్యతిరేకిస్తూ ప్రధానికి రాసిన పిటిషన్ పై 2 లక్షల మందికి పైగా సంతకాలు చేశారు. ప్రధానికి మంగళవారం (ఆగస్టు 4) స్వయంగా పిటిషన్ అందజేస్తానని కేజ్రీవాల్ అన్నారు. లాఠీఛార్జీకి భయపడని 100 మందితో కలిసి వెళ్తానని తెలిపారు. ఈ20కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేయాల్సిందేనని తెలిపారు.‘‘ఎవరూ భయపడొద్దు.. ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయాలి. ఇథనాల్ వల్ల వాహనాల మైలేజ్ తగ్గిపోతుంది, పాడవుతున్నాయి. ప్రభుత్వం స్టడీ చేసిన రిపోర్ట్ బయటపెట్టాలి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి, ఆయన కొడుకులకు మేలు చేసేందుకే ఇథనాల్ తీసుకువచ్చారు.అమెరికాతో చేసుకున్న ట్రేడ్ డీల్‌లో భాగంగా దేశంపై ఇథనాల్ ను రుద్దుతున్నారు. మేం చదువుకున్నవాళ్లం.. మీ డిగ్రీ ఎలాగో నకిలీది.. మా డిగ్రీ అసలైంది. ఆర్టీఐ ద్వారా నా డిగ్రీ వివరాలు కూడా తీసుకున్నారు. ప్రశ్నిస్తే FIR లు నమోదు చేస్తున్నారు. E20లో ఏదో గందరగోళం ఉంది. లేదంటే ప్రశ్నిస్తే మాట్లాడాలి కానీ కేసులు పెట్టడం ఏంటి?పెట్రోల్, డీజిల్ వాహనాల కొనుగోలు ఆపేయండి. కొంటే ఎలక్ట్రిక్ వాహనాలను కొనండి. E20 విషయంలో ప్రభుత్వం ముందు మూడు డిమాండ్లు పెడుతున్నాం. 1.ప్రతి పెట్రోల్ బంక్ లో వినియోగదారుడికి ఆప్షన్ ఉండాలి. 2. ప్యూర్ పెట్రోల్ కంటే, E20 పెట్రోల్ ధర తక్కువగా ఉండాలి. 3.పెట్రోల్ ధరను 84 రూపాయలే ఉంచాలి’’ అని అన్నారు.పెట్రోల్ ధర రూ. 125 అయ్యేది!ప్రపంచ ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 135 డాలర్లకు పెరిగినప్పుడు, ఇంధనంలో ఇథనాల్ కలపకపోతే ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు సుమారు రూ.125 అయ్యేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇథనాల్ వల్ల, వినియోగదారులు లీటరుకు రూ. 94.77 మాత్రమే చెల్లించారని తెలిపింది. ఇథనాల్ కలపడం వల్ల వాహనాల మైలేజీ, ఇంజిన్ పై ప్రభావం పడుతుందనే ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ వివరణ ఇచ్చింది. చమురు సంక్షోభాలను ఎదుర్కొనేందుకు ఇథనాల్ వినియోగం ఒక మార్గమని తెలిపింది. -
బీజేపీకి గుడ్‌బై.. మోదీ వీరాభిమాని ఆస్తులెంతో తెలుసా?
షెహజాద్ పూనావాలా.. బీజేపీకి పార్టీకి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. వ్యక్తిగత కారణాలతోనే తాను పార్టీని వీడుతున్నట్లు ఆయన వర్గాలు చెబుతున్నప్పటికీ.. ఆయన నిష్క్రమణ వెనుక మరిన్ని కారణాలున్నాయా? అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా ఇటీవల దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన నిరసనలు, అలాగే పార్టీ వైఖరి నేపథ్యంలోనే ఆయన నిర్ణయం తీసుకున్నారా? అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.షెహజాద్ పూనావాలా రాజీనామా వార్తలకు ముందు ఆయన తన ఎక్స్ (X) ఖాతా బయోలో కీలక మార్పులు చేశారు. తన ప్రొఫైల్ నుంచి బీజేపీ ప్రస్తావనను తొలగించారు. అయితే అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తన అభిమానాన్ని మాత్రం కొనసాగించారు. తన ఎక్స్ బయోలో మోదీకి తాను “లైఫ్ లాంగ్ ఫాలోవర్” అంటూ పేర్కొన్నారు. దీంతో పార్టీకి దూరమైనా.. మోదీ పట్ల తన గౌరవం కొనసాగుతుందనే సంకేతాలు ఇచ్చినట్లయింది.జెన్‌జీ నిరసనల ఎఫెక్ట్‌తోనేనా?షెహజాద్ పూనావాలా నిష్క్రమణపై మరో ఆసక్తికర చర్చ కూడా సాగుతోంది. ఇటీవల నీట్ పేపర్ లీక్, విద్యార్థుల నేతృత్వంలో జరిగిన జెన్‌జీ నిరసనలు, వాటి చుట్టూ ఏర్పడిన రాజకీయ వాతావరణం తర్వాతే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే పూనావాలా రాజీనామాకు జెన్‌జీ నిరసనలే కారణమని ఎక్కడా అధికారికంగా వెల్లడించలేదు. పార్టీ వర్గాలు మాత్రం ఇది వ్యక్తిగత నిర్ణయమని చెబుతున్నాయి. దీంతో అసలు కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.ఎవరీ షెహజాద్ పూనావాలా?1987 అక్టోబర్ 17న మహారాష్ట్రలోని పుణెలో జన్మించిన షెహజాద్ పూనావాలా న్యాయ విద్యను అభ్యసించారు. పుణే విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేసిన ఆయన.. న్యాయవాది, రాజకీయ విశ్లేషకుడు, కాలమిస్టుగా పనిచేశారు. ఆయన కుటుంబ విషయానికి వస్తే.. తండ్రి సర్ఫరాజ్ పూనావాలా, తల్లి యాస్మిన్ పూనావాలా. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, కాంగ్రెస్ అనుకూల వాదిగా పేరున్న తహసీన్ పూనావాలా ఆయన సోదరుడు. విద్యార్థి రాజకీయాలు, పబ్లిక్ డిబేట్లలో చురుగ్గా పాల్గొన్న ఆయన.. తన న్యాయ నేపథ్యంతో వాదనలను బలంగా వినిపించే నేతగా పేరు తెచ్చుకున్నారు.కాంగ్రెస్‌లో పంచాయితీతో.. షెహజాద్ పూనావాలా తొలుత కాంగ్రెస్‌లో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అయితే 2017లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియపై ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు లేవనెత్తిన ఆయన.. ఆ తర్వాత కాంగ్రెస్‌కు దూరమయ్యారు. 2021లో ఆయన బీజేపీలో చేరారు. ఆ తర్వాత పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమితులై.. దేశవ్యాప్తంగా టీవీ డిబేట్లలో బీజేపీ వాణిని బలంగా వినిపించారు.బీజేపీకి బలమైన వాయిస్.. బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న సమయంలో షెహజాద్ పూనావాలా పలు కీలక అంశాలపై పార్టీ తరఫున స్పందించారు. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్లు ఇవ్వడం, రాజకీయ చర్చల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. రాజకీయాలు, పాలన, జాతీయ భద్రత వంటి అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు తరచూ వార్తల్లో నిలిచాయి.ఆస్తులు ఎంత, ఆదాయ వనరులు ఏంటంటే..షెహజాద్ పూనావాలా ఇప్పటివరకు ఎలాంటి లోక్‌సభ లేదంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. దీంతో ఎన్నికల అఫిడవిట్ రూపంలో ఆయన ఆస్తులపై అధికారిక వివరాలు అందుబాటులో లేవు. అయితే కొన్ని మీడియా నివేదికల ప్రకారం ఆయన ఆస్తి విలువ సుమారు 70 లక్షల అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.65 కోట్ల వరకు) ఉండొచ్చని అంచనా. ఆదాయ వనరుల్లో న్యాయవాద వృత్తి, టీవీ చర్చలు, రాజకీయ విశ్లేషణలు, పబ్లిక్ ఈవెంట్లలో ప్రసంగాలు వంటి అంశాలు ఉన్నట్లు సమాచారం.ఎన్నికల బరిలోకి ఎందుకు రాలేదు?రాజకీయాల్లో చురుగ్గా ఉన్నప్పటికీ షెహజాద్ పూనావాలా ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయనకు లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల టికెట్ కూడా లభించలేదు. అయితే దీనిపై ఆయన ఎలాంటి ప్రత్యేక కారణాన్ని బహిరంగంగా వెల్లడించలేదు. బీజేపీలో చేరిన తర్వాత ఆయన ప్రధానంగా పార్టీ అధికార ప్రతినిధి, మీడియా వాయిస్‌గా గుర్తింపు పొందారు. టీవీ డిబేట్లు, రాజకీయ విశ్లేషణలు, పార్టీ విధానాలపై వివరణ ఇవ్వడం వంటి బాధ్యతల్లోనే ఎక్కువగా కనిపించారు.కొన్ని సందర్భాల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల కంటే సంస్థాగత బాధ్యతలకు, మీడియా ప్రతినిధిత్వానికి ప్రాధాన్యం ఉన్న నేతలను ఆ పాత్రల్లోనే కొనసాగిస్తాయి. పూనావాలా విషయంలోనూ అదే జరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.నెక్ట్స్ ఏంటి?బీజేపీకి రాజీనామా చేసిన షెహజాద్ పూనావాలా తదుపరి రాజకీయ ప్రయాణంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. పార్టీ నుంచి బయటకు వచ్చినా.. మోదీపై తన అభిమానాన్ని కొనసాగిస్తున్నట్లు ఆయన సోషల్ మీడియా బయో స్పష్టం చేస్తోంది. అయితే ఆయన నిర్ణయం వెనుక అసలు కారణాలు ఏమిటి? జెన్‌జీ నిరసనల తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల ప్రభావం ఉందా? లేక పూర్తిగా వ్యక్తిగత కారణాలేనా? అన్నదానిపై ఇంకా చర్చ కొనసాగుతోంది. -
పవిత్రమైన ఉత్తరాంధ్రకు రావడం నా అదృష్టం: ప్రధాని మోదీ
సాక్షి, విజయనగరం: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం.. అభివృద్ధికి కొత్త ద్వారమని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని స్పీచ్‌ను ఎంపీ, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు తెలుగులో తర్జుమా చేసి ప్రజలకు వినిపించారు.పవిత్రమైన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని.. ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామి కావడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ‘‘ పైడితల్లి అమ్మవారికి, సింహాచలం అప్పన్నకు నమస్కరిస్తున్నా. స్వర్ణాంధ్ర విజన్‌కు ఇవాళ కీలక రోజు. రూ.18 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను శ్రీకారం చుట్టాం. ఇవాళ రెండు రికార్డులు సృష్టించాం. ఒకటి ఎయిర్పోర్ట్.. రెండోది థింసా నృత్యం. 13 వేల మందికిపైగా గిరిజన పిల్లలు ఉత్సాహం చూస్తే ముచ్చటేసింది. .. ఇది అల్లూరి సీతారామ రాజు నడియాడిన నేల. గిరిజన హక్కుల కోసం ఆయన తన జీవితాన్నిఅంకితం చేశారు. ఇదే భూమిపై ఇవాళ అభివ ల్యాంచ్‌ప్యాడ్ ప్రారంభమైంది. ఎయిర్‌పోర్టుల పేర్లను ఒక కుటుంబానికి పరిమితం చేయలేదు. అయోధ్య ఎయిర్‌పోర్టుకు వాల్మీకి, ఇవాళ అల్లూరి పేరు పెట్టుకున్నాం. 2014 కంటే ముందు దేశంలో 74 ఎయిర్‌పోర్టులు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య 166కి చేరింది. చిన్న పట్టణాలకు నుంచి నగరాలకు ఎయిర్ సేవలు ఉన్నాయి. ఉడాన్ పథకం వల్ల ఎయిర్‌పోర్టుల సంఖ్య మాత్రమే పెరగలేదు.. ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగింది. కాశీలో ప్రారంభమైన స్పోక్ ఎయిర్పోర్ట్ మోడల్ అమృత్సర్ వరకు విస్తరించింది. బ్లూ ఎకానమీని బలోపేతం చేస్తున్నాం. ఈ మొత్తం కోస్టల్ ఏరియాను అభివృద్ధి చేస్తున్నాం. మూలపేట, రామయపట్నం పోర్టులను నిర్మిస్తున్నాం. ఐటీ రంగంలో ప్రపంచానికి ఏపీ యువత తమ ట్యాలెంట్‌ను చూపిస్తున్నారు. ఏపీ యువత దేశానికి కూడా ఉపయోగపడాలి. ఒక్క ఫ్యాక్టరీతో ఏ గ్రోత్‌సెంటర్ నిర్మితం కాదు. ఇక్కడ గూగుల్ కూడా డేటా సెంటర్ నిర్మిస్తోంది. నక్కపల్లిలో ఫార్మ్ పార్క్ రాబోతోంది. విశాఖను ఇండస్ట్రీయల్ హబ్‌గా తీర్చిదిద్దుతాం. భోగాపురం విమానాశ్రయం.. అభివృద్ధికి కొత్త ద్వారం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఇది కీలక మైలురాయిగా నిలుస్తుంది. ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతానికి కొత్త అవకాశాలు వస్తాయి. విమాన రవాణా విస్తరణతో పర్యాటకం, పరిశ్రమలు, వాణిజ్యం వేగంగా అభివృద్ధి చెందుతాయి. యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
పని YSRCP ది.. ప్రచారం చంద్రబాబు ది.. బాబుకు ఇచ్చిపడేసిన వైఎస్ జగన్
-
మోదీజీ క్షమించండి.. ఇదే నా మొదటి, చివరి తప్పు బాలిక వీడియో వైరల్
-
ప్రధాని మోదీ ‘ఫ్రంట్ కెమెరా’పై ప్రముఖ నటుడు ఎగతాళి!
న్యూఢిల్లీ: ప్రముఖ నటుడు, షో హోస్ట్ శేఖర్ సుమన్ తన ‘శేఖర్ టునైట్’ టాక్ షో తాజా ఎపిసోడ్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రంట్ కెమెరా వీడియో, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఢిల్లీ పోలీసుల లాఠీచార్జి, ‘జెన్-జీ’ భాషపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. 63 ఏళ్ల ఈ నటుడు తనదైన శైలిలో రాజకీయ, సామాజిక పరిణామాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.ప్రధాని మోదీ తొలిసారిగా ఫ్రంట్ కెమెరాలో రికార్డ్ చేసిన వీడియోపై స్పందిస్తూ ‘రావాల్సిన 'అచ్ఛే దిన్ వస్తాయో లేదో కానీ, మంచి రీల్స్ మాత్రం వస్తాయి’ అంటూ ఎద్దేవా చేశారు. పేపర్ లీక్ ఉదంతాన్ని ప్రధాని ‘ఘోర పాపం’ అని అభివర్ణించడంపై స్పందిస్తూ, ఆ వేదనను వ్యక్తంచేయడానికి మూడు నెలల సమయం పట్టిందని విమర్శించారు. ప్రభుత్వం, ప్రజల మధ్య సంబంధం జెన్-జీ ట్రెండ్స్‌లోని ‘సిచ్యుయేషన్‌షిప్’ మాదిరిగా మారిందని, ఎన్నికలప్పుడు లవ్ బాంబింగ్ చేసి, ఆ తర్వాత గోస్టింగ్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.ఇక విద్యార్థుల నిరసనలను అణచివేయడానికి ఢిల్లీ పోలీసులు ఎక్స్పైర్ అయిన టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. పోలీసుల నినాదమైన 'శాంతి, సేవ, న్యాయం' అనే మూడింటి ఎక్స్పైరీ తేదీ ఆరోజే ముగిసిందని చురకలంటించారు. సుదీర్ఘ ఆందోళనల తర్వాత కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడాన్ని ప్రస్తావిస్తూ, ఆయనకు విద్యాశాఖతో పాటు రక్షణ శాఖ బాధ్యతలు కూడా అప్పగించాలని వ్యంగ్యంగా పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: ‘నాన్న జ్ఞాపకం’ చోరీ.. తెచ్చిస్తే రూ. 5 లక్షలు, ఉద్యోగం! -
భోగాపురం ఎయిర్ పోర్ట్ టెర్మినల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
-
భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రారంభించిన ప్రధాని మోదీ
సాక్షి, భోగాపురం: ప్రధాని నరేంద్ర మోదీ.. భోగాపురం పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. అంతకుముందు ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ.. ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. మోదీకి ఏపీ గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం స్వాగతం పలికారు. ప్రారంభోత్సవానికి కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. -
మోదీ మంచి మనసు.. రుచికా ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్
ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యల వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జంతర్ మంతర్ నిరసనల్లో చేసిన వ్యాఖ్యలపై విమర్శలు.. కేసు ఎదుర్కొంటున్న రుచికా సింగ్ తాజాగా క్షమాపణలు కోరుతూ ఓ వీడియో విడుదల చేసింది. తాను చేసింది ముమ్మాటికీ తప్పేనని అంటోంది. అదే సమయంలో రుచికా వ్యవహారంపై పరోక్షంగా ప్రధాని మోదీ స్పందించడమూ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ వెంటనే ఈ ఎపిసోడ్లో మరికొన్ని ట్విస్టులు వెలుగు చూశాయి.. ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో నీట్ పేపర్ లీక్ అంశంపై జరిగిన నిరసనల సందర్భంగా నోయిడాకు చెందిన రుచికా సింగ్ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. కొందరు యువకులు వీడియో తీస్తుండగా రెచ్చిపోతూ ఆమె ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర భాష ఉపయోగించింది. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది.ఈ వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న ప్రధానిపై అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. సుప్రీంకోర్టు న్యాయవాది స్మృతి సింగ్ చందేల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జూలై 29న నోయిడాలోని ఎక్స్‌ప్రెస్‌వే పోలీస్ స్టేషన్లో రుచికా సింగ్‌పై జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది.భారతీయ న్యాయ సంహిత (BNS)లోని 352, 353(1), 356(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా అవమానించడం, ప్రజా శాంతికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం, పరువునష్టం వంటి అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. జంతర్ మంతర్ ప్రాంతం ఢిల్లీ పోలీసుల పరిధిలో ఉండటంతో కేసును ఢిల్లీ పోలీసులకు బదిలీ చేశారు.మోదీ ఏమన్నారంటే..ఈ వివాదం మధ్య ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. తనపై, తన దివంగత తల్లిపై చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని చెప్పిన ఆయన.. యువత చేసిన తప్పులకు మార్పు అవకాశం ఇవ్వాలని సూచించారు. “నన్ను దూషించిన వారిని క్షమించాలనుకుంటున్నాను. పిల్లలు తప్పులు చేస్తారు. వారిని శిక్షించడం కంటే సరైన మార్గం చూపించడం సమాజం బాధ్యత” అని మోదీ అన్నారు. అవమానాలు ఏ సమస్యను పరిష్కరించవని, యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యల తర్వాతే రుచికా క్షమాపణ వీడియో బయటకు రావడం ఆసక్తికర పరిణామంగా మారింది.Abuses never solve anything. Let’s guide the misguided. Let’s work together. Let’s work for Bharat. pic.twitter.com/yAePG60KYL— Narendra Modi (@narendramodi) July 31, 2026చేతులు జోడించి రుచికా క్షమాపణలుసోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో రుచికా సింగ్ చేతులు జోడించి దేశ ప్రజలకు క్షమాపణలు కోరింది. “నేను చేసినది తప్పు. దేశం మొత్తానికి క్షమాపణలు చెబుతున్నాను. నాకు చాలా సిగ్గుగా ఉంది. ఇది నా మొదటి, చివరి తప్పు. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయను” అని ఆమె చెప్పింది. తాను అక్కడ ఉన్న కొందరి ప్రభావానికి లోనై ఆ వ్యాఖ్యలు చేశానని పేర్కొంది. అయితే ఈ వీడియో ఎప్పుడు తీశారనేది స్పష్టత రావాల్సి ఉంది.Ruchika Singh, a CJP protester who made abusive remarks against PM Narendra Modi, has issued an apology to the entire country.She claims that other people at the protest influenced and encouraged her to use abusive language. She has promised never to repeat such an act again.… pic.twitter.com/hNQULRZ8r1— Mukesh (@mksh_kgp) July 31, 2026వయసుపై వివాదంఈ వ్యవహారంలో మరో కీలక అంశంగా రుచికా వయసు మారింది. క్షమాపణ వీడియోలో ఆమె తన వయసు 15 ఏళ్లు అని చెప్పింది. అయితే పోలీసుల ఎఫ్ఐఆర్లో ఆమె వయసు 25 ఏళ్లుగా పేర్కొనడం గమనార్హం. దీంతో ఆమె అసలు వయసు ఎంత? అనే ప్రశ్నలు తలెత్తాయి. పోలీసులు ఆమె కుటుంబ వివరాలు, నేపథ్యాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.నేపథ్యంపై సోషల్ మీడియాలో చర్చఇదే సమయంలో రుచికా వ్యక్తిగత నేపథ్యంపై సోషల్ మీడియాలో పలు వాదనలు వైరల్‌గా మారాయి. ఆమె గతంలో ఓ సెలూన్లో నెయిల్ ఆర్ట్ శిక్షణ కోసం వెళ్లేదని, ఆధార్ కార్డు అడిగిన తర్వాత అక్కడికి వెళ్లడం ఆపేసిందని ఆ సెలూన్ యజమాని చెప్పినట్లు కొన్ని పోస్టుల్లో పేర్కొన్నారు. అలాగే ఆమె తన పేరు వేరుగా చెప్పిందని, ఆధార్ వివరాలు ఇవ్వలేదని కూడా కొన్ని వాదనలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ అంశాలను అధికారికంగా ధ్రువీకరించలేదు. వాస్తవాలు పోలీసు దర్యాప్తులోనే తేలాల్సి ఉంది.భావ ప్రకటనా స్వేచ్ఛపై చర్చరుచికాపై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ప్రశ్నించారు. అభ్యంతరకర వ్యాఖ్యలను సమర్థించలేమని చెబుతూనే.. కేవలం వ్యాఖ్యల ఆధారంగా క్రిమినల్ చర్యలు తీసుకోవడం భావ ప్రకటనా స్వేచ్ఛపై ప్రభావం చూపుతుందని అన్నారు. అలాంటి సందర్భాల్లో పరువునష్టం వంటి చట్టపరమైన మార్గాలను అనుసరించవచ్చని సూచించారు. అదే సమయంలో నిరసనకారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే సమయంలో సంయమనం పాటించాలని కూడా కోరారు.రుచికా క్షమాపణలు, మోదీ స్పందన, ఆమె వయసుపై వివాదం, సీజేపీ స్పందన పోలీసుల దర్యాప్తు.. ఈ పరిణామాలతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. యువతకు మార్పు అవకాశం ఇవ్వాలన్న మోదీ సందేశం ఒకవైపు చర్చకు దారితీస్తుండగా.. చట్టపరమైన ప్రక్రియ మరోవైపు కొనసాగుతోంది. -
మణిహారం భోగాపురం
సాక్షి, న్యూఢిల్లీ / సాక్షి, విశాఖపట్నం : ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. శనివారం ఉదయం విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల టెర్మినల్‌ను పరిశీలించిన అనంతరం 11.30 గంటలకు జాతికి అంకితం చేస్తారు. ఉత్తరాంధ్ర ఊహలకు రెక్కలు తొడుగుతూ.. ఈ ప్రాంతానికి మణిహారంగా మారనుంది ఈ విమానాశ్రయం. ప్రారంభోత్సవం అనంతరం అదే వేదిక నుంచి రాష్ట్రంలోని రూ.17,900 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నట్లు ప్రధాని కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, శనివారం ప్రధాని ప్రారంభించనున్న భారీ అవుట్ సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్(ఓశాట్) ఫెసిలిటీ ప్లాంట్ ఏర్పాటుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే అడుగులు పడ్డాయి. మొదటి విడత రూ.542.19 కోట్లు, రెండో విడత రూ.1,845.61 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించారు. స్మార్ట్ వాచ్‌లు, ఐఓటీ పరికరాలకు కావాల్సిన అధునాతన 2.5డీ, త్రీడీ చిప్ ప్యాకేజింగ్, టెస్టింగ్ సేవలను ఇక్కడ అందించనున్నారు. -
పీఎం–కిసాన్.. మరో ఐదేళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రైతన్నలకు ఆర్థిక మద్దతును పొడిగిస్తూ కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. అన్నదాతలకు ప్రతిఏటా మూడు విడతల్లో పెట్టుబడి సాయం అందించే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం–కిసాన్) పథకాన్ని 2026–27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030–31 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించాలని నిర్ణయించింది. రాబోయే ఐదేళ్లలో ఈ పథకం అమలుకు రూ.3.15 లక్షల కోట్లు కేటాయించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ శుక్రవారం సమావేశమైంది. 2026–2031 కాలానికి సంబంధించి వ్యవసాయంతోపాటు పునరుత్పాదక ఇంధనం, చమురు అన్వేషణకు భారీగా నిధులు కేటాయిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. పలు కీలక ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయాల వివరాలు, పథకాల గణాంకాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. పీఎం–కిసాన్తో సత్ఫలితాలు పీఎం–కిసాన్ పథకంలో ఆశించిన ఫలితాలు వస్తున్నట్లు గుర్తించారు. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలోని డెవలప్మెంట్ మానిటరింగ్, ఎవాల్యుయేషన్ ఆఫీస్(డీఎంఈఓ) నివేదిక ప్రకారం.. 92 శాతం మంది లబి్ధదారులు ఈ నగదును నేరుగా వ్యవసాయ పనులకు వినియోగించారు. 85 శాతం రైతులు తమ వ్యవసాయ ఆదాయం పెరిగిందని, ప్రైవేట్ అప్పులపై ఆధారపడటం తగ్గిందని చెప్పారు. పీఎం–కిసాన్ పథకం అమలుతో 2020–21 నుంచి 2025–26 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సాగు విస్తీర్ణం 9.65 శాతం, ఉత్పాదకత 10.53 శాతం మేర పెరిగినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఫలితంగా మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 21.18 శాతం వృద్ధి నమోదైంది. చమురు అన్వేషణకు ‘సముద్ర మంథన్’ దేశీయంగా చమురు, సహజ వాయువుల అన్వేషణ, ఉత్పత్తిని పెంచే ఉద్దేశంతో జాతీయ ఆఫ్‌షోర్ అన్వేషణ పథకం ‘సముద్ర మంథన్’కు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టుకు రూ.84,084 కోట్లు కేటాయించారు. సముద్రగర్భ అన్వేషణల ద్వారా 600 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు నిల్వలను వెలికితీయవచ్చని అంచనా వేస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పన, ఆఫ్‌షోర్ టెక్నాలజీ పెంపు, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దేశీయ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఈ ప్రాజెక్టు ఉపకరిస్తుంది. దీర్ఘకాలిక ఇంధన భద్రత సాధన దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సౌర విద్యుత్‌కు ‘పీఎం సూర్య సరోవర్’ జలాశయాలపై తేలియాడే సౌర విద్యుత్ (ఫ్లోటింగ్ సోలార్ ఫొటోవోల్టాయిక్) ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ‘ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన(పీఎం–ఎస్ఎస్వై)’ను కేంద్రం తీసుకొచ్చింది. ఈ కార్యక్రమానికి రూ.5,070 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద 5,000 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నారు. 2026–27 నుంచి 2030–31 మధ్య ఈ ప్రాజెక్టులను మంజూరు చేస్తారు. 2032–33 వరకు ఆర్థిక సాయం కొనసాగిస్తారు. పూర్తయిన ప్రాజెక్టులకు మెగావాట్‌కు రూ.కోటి చొప్పున కేంద్ర ఆర్థిక సాయం(సీఎఫ్ఏ) కింద అందజేస్తారు. ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాల అధ్యయనానికి గరిష్టంగా రూ.50 లక్షల వరకు అందజేస్తారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ (ఎన్ఐఎస్ఈ) అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా జలాశయాలపై 102.18 గిగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంది. ప్రస్తుతం 700 మెగావాట్ల సామర్థ్యం మాత్రమే అందుబాటులో ఉంది. కొత్త ప్రాజెక్టుల వల్ల భూమి కొరత సమస్యను అధిగమించవచ్చు. ఏటా సుమారు 10 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గడంతోపాటు 16 వేల నుంచి 17 వేల వరకు పూర్తిస్థాయి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా. -
'అలాంటి వారికి మార్గనిర్దేశం చేయాలి': ప్రధాని మోదీ పిలుపు
భారత ప్రధాని నరేంద్ర మోదీ మరో వీడియో రిలీజ్ చేశారు. నీట్ పేపర్ లీక్ అంశంపై మరోసారి మాట్లాడారు. జంతర్‌మంతర్‌లో ఏం జరిగిందో దేశ ప్రజలంతా చూశారని అన్నారు. నిరసనలో కొందరు అసభ్యకరమైన పదాలు వాడారని అన్నారు. తనను అసభ్య పదజాలంతో దూషించారని తెలిపారు. అయినప్పటికీ అందరినీ తాను క్షమించానని ప్రధాని మోదీ వెల్లడించారు. సరికొత్త భారత్ కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. తప్పుదోవ పట్టిన వారికి మార్గనిర్దేశం చేయాలని ప్రధాని సూచించారు. కాగా.. నీట్ పేపర్ లీక్ కావడంతో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన చేపట్టింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగింది. ఈ నిరసనను కొన్ని రాజకీయ పార్టీలు అవకాశంగా మార్చుకున్నాయి. కాంగ్రెస్‌తో పాటు పలు ప్రతిపక్ష నాయకులు ఢిల్లీలో హంగామా చేశారు. చివరికీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రధాని మోదీ విద్యార్థులను ఉద్దేశించి వీడియోలు రిలీజ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఇవాళ మరో వీడియో సందేశమిచ్చారు. Abuses never solve anything. Let’s guide the misguided. Let’s work together. Let’s work for Bharat. pic.twitter.com/yAePG60KYL— Narendra Modi (@narendramodi) July 31, 2026 -
రుచికా సింగ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. క్రిమినల్ కేసుపై CJP సంచలన వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ అంశంపై జరిగిన నిరసనల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో యువతి రుచికా సింగ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ తీవ్రంగా తప్పుబట్టారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలను సమర్థించలేమని స్పష్టం చేసిన ఆయన, అలాంటి సందర్భాల్లో క్రిమినల్ చర్యలకు బదులుగా పరువు నష్టం దావా వంటి చట్టపరమైన మార్గాలను అనుసరించాలని సూచించారు.జూలై 23న జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న రుచికా సింగ్ ప్రధాని గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆమెపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ఈ పరిణామంపై స్పందించిన సౌరవ్ దాస్, భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేసే విధంగా క్రిమినల్ చట్టాలను వినియోగించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు.‘రుచికా సింగ్ చేసిన వ్యాఖ్యలు తప్పు కావచ్చు. అవి చాలామందికి అభ్యంతరకరంగా అనిపించవచ్చు. కానీ కేవలం అలాంటి భాష వాడినందుకు ఒక యువతిపై క్రిమినల్ కేసు నమోదు చేయడం సమంజసం కాదు. అలాంటి సందర్భాల్లో పరువు నష్టం దావా వంటి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. క్రిమినల్ విచారణ భయానక వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇది యువతకు ఆమోదయోగ్యం కాదు’ అని ఆయన అన్నారు.అయితే యువ నిరసనకారులు తమ అసమ్మతిని వ్యక్తం చేసే సమయంలో సంయమనం పాటించాలని, ఉపయోగించే పదాల విషయంలో మరింత బాధ్యతతో వ్యవహరించాలని కూడా దాస్ సూచించారు. ప్రజాప్రతినిధులు లేదా ఇతర వ్యక్తులపై వ్యక్తిగత దూషణలు, అవమానకర వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో పోలీసులు రాజకీయ ప్రయోజనాల కోసం తమ అధికారాలను దుర్వినియోగం చేయరాదని ఆయన హెచ్చరించారు. ‘క్రిమినల్ న్యాయ వ్యవస్థను ఇలాంటి సందర్భాల్లో వినియోగించడం పూర్తిగా ఆమోదయోగ్యం కాదు. పోలీసులు శాంతంగా వ్యవహరించాలి. యువతపై వేధింపులు ఆగాలి’ అని పేర్కొన్నారు.ఇదిలా ఉండగా, ఘజియాబాద్‌కు చెందిన స్మృతి సింగ్ ఫిర్యాదు మేరకు జూలై 29న గౌతమ్ బుద్ధ నగర్‌లోని ఎక్స్‌ప్రెస్‌వే పోలీస్ స్టేషన్లో రుచికా సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆమె వ్యాఖ్యలు ప్రధానమంత్రి రాజ్యాంగ పదవి గౌరవాన్ని దెబ్బతీశాయని, ద్వేషాన్ని రెచ్చగొట్టే ఉద్దేశంతో చేసినవని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత చట్టం కింద కేసు నమోదు చేశారు.జీరో ఎఫ్ఐఆర్ విధానం ప్రకారం, నేరం ఎక్కడ జరిగినా ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఫిర్యాదు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. అనంతరం సంబంధిత అధికార పరిధి ఉన్న పోలీస్ స్టేషన్‌కు కేసును బదిలీ చేస్తారు. నీట్ పేపర్ లీక్, పరీక్షల అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన సీజేపీ ఆందోళన నేపథ్యంలో ఈ వివాదం చోటుచేసుకుంది. 36 రోజుల పాటు కొనసాగిన నిరసనలు కేంద్ర ప్రభుత్వం పార్టీ ప్రధాన డిమాండ్లను అంగీకరించిన అనంతరం జూలై 25న ముగిశాయి. -
ఫేస్బుక్ వివాదం.. కేంద్రం యాక్షన్!
భారత ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఫేస్బుక్ పోస్ట్‌ను కొంతసేపు పరిమితం చేసిన ఘటన తర్వాత.. కేంద్ర ప్రభుత్వం మెటా సంస్థపై మరింత దృష్టి పెట్టింది. ఈ వ్యవహారంపై.. మెటా గ్లోబల్ బృందాన్ని భారత్‌కు పిలిపించి.. సంస్థ విధానాలు, కంటెంట్ నియంత్రణ వ్యవస్థలపై వివరణ కోరాలని నిర్ణయించింది.మెటా ప్రతినిధులను ముఖ్యంగా అల్గారిథమ్‌లు ఎలా పనిచేస్తాయి?, వినియోగదారులకు ఏ కంటెంట్ చూపించాలి?, అనే నిర్ణయాలు ఎలా తీసుకుంటారు, కంటెంట్ మోడరేషన్లో ఏమైనా పక్షపాతం ఉందా?, అనే అంశాలపై ప్రశ్నించనున్నారు. అంతే కాకుండా.. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ప్రజా శాంతి, సమాజంపై చూపించే ప్రభావం గురించి కూడా చర్చ జరగనుంది. దీంతో.. మెటా గ్లోబల్ బృందం వచ్చే వారం మధ్యలో భారత్‌కు వచ్చే అవకాశం ఉందని, అనంతరం పార్లమెంటరీ కమిటీ ముందు కూడా హాజరుకానుందని సమాచారం.సోషల్ మీడియా సంస్థలు భారతదేశంలో పనిచేస్తున్నప్పుడు.. దేశ చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ యువతను ఉద్దేశించి షేర్ చేసిన ఒక ఫేస్బుక్ పోస్టును తాత్కాలికంగా పరిమితం చేసింది. ఈ పోస్టులో పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని పేర్కొన్నారు. ఈ ఘటన సాంకేతిక లోపం వల్ల జరిగిందని మెటా వివరణ ఇచ్చి క్షమాపణలు చెప్పినప్పటికీ, ఈ వివరణపై కేంద్రం సంతృప్తి చెందలేదని సమాచారం.ఈ పరిణామాల తర్వాత ప్రధాని మోదీతో పాటు ఇతర ప్రముఖుల ఖాతాల నుంచి వచ్చే పోస్టులపై మరింత పర్యవేక్షణ ఉంటుందని మెటా తెలిపింది. ముఖ్యమైన ఖాతాల కంటెంట్‌ను సీనియర్ అధికారులు పలు స్థాయిల్లో పరిశీలించే విధంగా అదనపు భద్రతా చర్యలు తీసుకున్నట్లు కంపెనీ కేంద్రానికి వివరించింది.ఇదే సమయంలో.. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని మార్ఫింగ్ చేసిన చిత్రాలు, ఏఐ ద్వారా రూపొందించిన తప్పుడు పోస్టులు ప్రచారం చేశారనే ఆరోపణలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్‌తో పాటు కొన్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై కేసులు నమోదు చేశారు.సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చట్టవిరుద్ధమైన లేదా హానికరమైన కంటెంట్‌ను నియంత్రించడంలో సంస్థలు బాధ్యతగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే.. సోషల్ మీడియా అధిక వినియోగం పిల్లలు, పెద్దల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. -
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
ఢిల్లీ: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా వివిధ పథకాలకు 4,50,988 కోట్ల రూపాయల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన 5070 కోట్లు, ప్రధానమంత్రి కిసాన్ సన్మానిధికి 3,15,614 కోట్లు, ఖేలో ఇండియా పథకం నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ స్కీంకు 36441 కేటాయించింది. సముద్ర మంతన్ పథకానికి 84,084 కోట్ల రూపాయలు, యూని డైరెక్షనల్ ట్విన్ ట్యూబ్ టన్నుల్స్ నిర్మాణానికి 9779 కోట్ల రూపాయల కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. -
భారత్‌కు జిన్‌పింగ్.. గాల్వాన్ ఘర్షణ తర్వాత తొలి పర్యటన!
ఢిల్లీ: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వచ్చే సెప్టెంబర్‌లో భారత్‌లో జరగనున్న బ్రిక్స్ (BRICS) సదస్సుకు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. సెప్టెంబర్ 12–13 తేదీల్లో న్యూఢిల్లీలో నిర్వహించనున్న ఈ సదస్సులో పాల్గొనేందుకు ఆయన భారత్‌కు రావచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ పర్యటనపై భారత్ లేదా చైనా ప్రభుత్వాలు ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.షీ జిన్‌పింగ్ భారత్‌కు వస్తే.. 2020 గాల్వాన్ లోయ ఘర్షణ తర్వాత ఆయన చేసే తొలి భారత పర్యటనగా నిలుస్తుంది. చివరిసారిగా ఆయన 2019 అక్టోబర్‌లో భారత్‌ను సందర్శించారు. ఆ తర్వాత తూర్పు లడఖ్‌లో భారత్–చైనా సరిహద్దు ఉద్రిక్తతలు రెండు దేశాల సంబంధాలను దెబ్బతీశాయి. కాగా, జిన్‌పింగ్ పర్యటనకు ముందు భారత్–చైనా మధ్య దౌత్య చర్చలు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ త్వరలో చైనాలో పర్యటించి ఉన్నత స్థాయి సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.అలాగే, సరిహద్దు వ్యవహారాలపై వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ (WMCC) సమావేశం, అనంతరం ప్రత్యేక ప్రతినిధుల స్థాయి చర్చలు కూడా జరగనున్నట్లు సమాచారం. ప్రత్యేక ప్రతినిధుల సమావేశంలో భారత్–చైనా సరిహద్దు వివాద పరిష్కారానికి సంబంధించిన అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. సరిహద్దు నిర్వహణ, ఉద్రిక్తతల నివారణ, పరస్పర విశ్వాసం పెంపు వంటి అంశాలపై రెండు దేశాలు ముందడుగు వేయాలని ప్రయత్నిస్తున్నాయి.#JUSTIN: Sources: Chinese President Xi Jinping is likely to visit India in September for the BRICS Summit in New Delhi, marking his first trip to India since the COVID-19 pandemic and the Galwan border tensions, sources said. Ahead of the summit, India and China are expected to…— India Today Global (@ITGGlobal) July 31, 2026మోదీ–షీ భేటీపై ఆసక్తిషీ జిన్‌పింగ్ బ్రిక్స్ సదస్సుకు హాజరైతే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశం జరిగే అవకాశముంది. ఈ భేటీలో సరిహద్దు వివాదం, ప్రాంతీయ భద్రత, ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం వంటి కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. అయితే, ప్రస్తుతం జిన్‌పింగ్ భారత్ పర్యటనపై అధికారిక ధృవీకరణ లేదు. ఢిల్లీ లేదా బీజింగ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే ఈ పర్యటన ఖరారైనట్లు భావించాల్సి ఉంటుంది. -
మరోసారి కేంద్ర క్యాబినేట్ భేటీ .. కీలక నిర్ణయాలు?
సాక్షి, ఢిల్లీ: ఈ రోజు (శుక్రవారం) మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ (Union Cabinet) సమావేశం కానుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విపక్షాల ఆందోళనలు, తాజా బిల్లుల వ్యూహాలపై ఈ భేటీలో చర్చించనుంది. కాగా నిన్న రాత్రి ప్రధాని మోదీ అత్యంత కీలకమైన భద్రతపై క్యాబినెట్ కమిటీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఇంతలోనే క్యాబినేట్ మరోసారి సమావేశం కానుంది.ఈ రోజు జరగబోయే భేటీలో ఇటీవల ఆమోదం పొందిన జాతీయ గౌరవ నిరోధక సవరణ బిల్లు-2026, పేపర్ లీకేజీల నిరోధక బిల్లు వంటి కీలక అంశాలపై తదుపరి పార్లమెంటరీ వ్యూహాలను ఖరారు చేయనున్నారు.దానితో పాటు పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వల్ల అంతర్జాతీయంగా ఎరువుల దిగుమతులకు ఆటంకం కలగవచ్చు. దేశంలోని రైతులకు రాబోయే రబీ సీజన్లో ఎరువుల కొరత రాకుండా, ప్రత్యామ్నాయ దేశాల నుంచి స్టాక్‌ను తెప్పించుకునే వ్యూహాత్మక ప్రణాళికను సిద్ధం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.కాగా నిన్న జరిగిన భేటీలో పశ్చిమాసియాలో ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితులు భారత రక్షణ, ఆర్థిక రంగాలపై దాని ప్రభావాన్ని సమీక్షించారు. ఈ సందర్బంగా యుద్ధ ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయ నావికులకు, ప్రవాస భారతీయుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని ఆదేశించారు. వారి కుటుంబాలకు సమాచారం, అత్యవసర సహాయం అందించేందుకు ప్రత్యేక సహాయక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు.అదే విధంగా పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ముడిచమురు, ఎల్పీజీ, ఎల్ఎన్జీ సరఫరాకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ దేశాల నుంచి దిగుమతులను వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కేంద్ర క్యాబినేట్ మరోసారి భేటీ కాబోతుంది.కాగా విపక్షాల ఆందోళన కారణంగా రాజ్యసభ ఆగస్టు 3వరకూ వాయిదా వేసినట్లు స్పీకర్ ప్రకటించారు. -
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. విపక్షాల నినాదాలు
పార్లమెంట్ సమావేశాలు అప్డేట్స్.. రాజ్యసభ వాయిదా.. రాజ్యసభ సోమవారానికి వాయిదా.. రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీల నిరసనలు లోక్‌సభలో విపక్షాల నిరసనలు.. మధ్యాహ్నం 12 గంటల వరకు లోక్‌సభ వాయిదా.. ఎంపీ వినూత్న నిరసనలు..రెండు కుండీలు పెట్టి అందులో డబ్బులు వేసిన ఎంపీలుహుండీ చోరీపై ఎంపీ వినూత్న నిరసనలు.స్వామీజీ గెటప్లోని వచ్చి చందా అడిగిన ఎంపీ పప్పూ యాదవ్.హుండీలో డబ్బులు వేసిన రాహుల్ గాంధీ. #WATCH | Delhi | Monsoon Session of the Parliament | Opposition MPs including Lok Sabha LoP and Congress MP Rahul Gandhi protest over the issue of alleged Ayodhya Ram Mandir donations embezzlement pic.twitter.com/1BXa6UiUuq— ANI (@ANI) July 31, 2026 పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం..పార్లమెంటు మకర ద్వారం వద్ద కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీల ధర్నావిద్యార్థులపై పోలీసులు పెల్లెట్ గన్స్ ఉపయోగించడాన్ని నిరసిస్తూ నినాదాలుకేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించాలని నినాదాలుపార్లమెంటుకు అమిత్ షా రావాలని డిమాండ్అయోధ్య విరాళాల చోరీపై దర్యాప్తు జరపాలని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీల డిమాండ్ -
మోదీపై అభ్యంతకర పోస్టులు.. మెటా హెడ్‌పై కేసు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన నిరసనలలో ప్రధాని మోదీకి అభ్యంకతరంగా పోస్టులు చేశారంటూ మోటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్‌పై కేసు నమోదైంది. ఆయనతో పాటు పలువురి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై ఇద్దరు బీజేపీ కార్యకర్తలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధాని మోదీకి సంబంధించినటువంటి అభ్యంతరకరమైన, తప్పుడు కంటెంట్‌ను తమ ఫ్లాట్పారమ్లపై (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్) ప్రసారం కావడానికి అనుమతించారని,అటువంటి పోస్టులను తొలగించడంలో విఫలమయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇన్స్టాగ్రామ్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు, ప్రధానమంత్రిని అసభ్యకరంగా, అవమానకరంగా మరియు తప్పుదోవ పట్టించే విధంగా చిత్రీకరిస్తూ మార్ఫింగ్ చేయబడిన, డిజిటల్‌గా తారుమారు చేయబడిన అనేక వీడియోలు ,చిత్రాలు అందులో కనిపించాయని తెలిపారు.కాగా నీట్లీకేజ్కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది. దీంతో మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేశారు. మరిన్ని డిమాండ్లను సైతం కేంద్రం ముందుంచింది. -
భారత్‌తో పోలుస్తావా?.. పాక్‌లో కట్టలు తెంచుకున్న ఆగ్రహం
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖానుమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ఆందోళనల విషయంలో భారత ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రస్తావిస్తూ.. ఆ దేశ అధికార వ్యవస్థపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘మోదీ సర్కార్‌ను చూసి నేర్చుకోండి’’ అంటూ పాకిస్థాన్ పాలకులకు హితవు పలికారు. ప్రజల గొంతును అణచివేయడం కాకుండా.. వారి సమస్యలను వినే సంస్కృతి అలవర్చుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పాకిస్థాన్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.పాకిస్థాన్‌లో ఇటీవల విద్యార్థులు, రాజకీయ కార్యకర్తలు చేపట్టిన నిరసనలపై భద్రతా బలగాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయంలో భారత్‌లో విద్యార్థుల నిరసనలకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో సంస్కరణలు, పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు వంటి నిర్ణయాలు తీసుకుందని అలీమా ఖానుమ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆవేదనను వినడం ప్రభుత్వ బాధ్యత అని, ఆ విషయంలో భారత్‌ను చూసి పాకిస్థాన్ ప్రభుత్వం నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు.‘‘భారత్‌లో విద్యార్థులు రోడ్డెక్కితే ప్రభుత్వం స్పందిస్తుంది. కానీ పాకిస్థాన్‌లో ప్రజలు ప్రశ్నిస్తే అరెస్టులు, కేసులు, బెదిరింపులే ఎదురవుతున్నాయి. ప్రజాస్వామ్యం అంటే ప్రజల గొంతును అణచివేయడం కాదు’’ అంటూ ఆమె మండిపడ్డారు. అధికార యంత్రాంగం ప్రజల హక్కులను గౌరవించకుండా వ్యవహరిస్తోందని, ఇది దేశ భవిష్యత్తుకు మంచిది కాదని అలీమా హెచ్చరించారు.అలీమా ఖానుమ్ వ్యాఖ్యలు వెలువడిన వెంటనే పాకిస్థాన్ రాజకీయ వర్గాల్లో తీవ్ర స్పందన వ్యక్తమైంది. అధికార పక్షానికి చెందిన నేతలు ఆమె వ్యాఖ్యలను తప్పుబడగా, పాకిస్థాన్‌ను భారత్‌తో పోల్చడం సరికాదని పేర్కొన్నారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ నేతలు మాత్రం ఆమె వ్యాఖ్యలకు మద్దతు తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటే విమర్శలను అంగీకరించే సంస్కృతి అవసరమని వారు అభిప్రాయపడ్డారు.ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైలులో ఉండగా, ఆయన కుటుంబ సభ్యులు తరచూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. దేశంలో రాజకీయ ప్రత్యర్థులను అణచివేస్తున్నారని, న్యాయవ్యవస్థపై కూడా ఒత్తిళ్లు పెరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అలీమా ఖానుమ్ చేసిన "మోదీ సర్కార్‌ను చూసి నేర్చుకోండి" వ్యాఖ్యలు భారత్-పాకిస్థాన్ పోలికలకే కాకుండా, పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్య పరిస్థితులపై కూడా మరోసారి చర్చను రేకెత్తించాయి.ప్రస్తుతం ఈ అంశం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చనీయాంశమైంది. కొందరు అలీమా ఖానుమ్ వ్యాఖ్యలను సమర్థిస్తుండగా, మరికొందరు భారత్‌ను ఉదాహరణగా చూపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏదేమైనా, ఆమె చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్ రాజకీయాల్లో మరో కొత్త దుమారానికి తెరలేపాయి.నీట్ యూజీ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణలు, గ్రేస్ మార్కుల వివాదంపై విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ సహా పలు ప్రాంతాల్లో నిరసనలు నిర్వహించి.. పరీక్ష రద్దు చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వివాదం తీవ్రం కావడంతో కేంద్రం విచారణలు, సంస్కరణలపై చర్యలు చేపట్టింది. విద్యార్థుల ఆందోళనలు కొనసాగిన నేపథ్యంలో ప్రభుత్వం–నిరసనకారుల మధ్య చర్చలు జరిగాయి. అనంతరం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో విద్యార్థులు తమ నిరసనలను విరమించినట్లు ప్రకటించారు. -
మోదీపై వ్యాఖ్యల వివాదం.. ఎవరీ రుచికా సింగ్?
ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో నీట్ నిరసనల సందర్భంగా రెచ్చిపోయిన యువతికి పెద్ద షాక్ తగిలింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఆమెపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. ‘‘రాజ్యాంగ పదవి గౌరవాన్ని ఆమె వ్యాఖ్యలు దెబ్బతీశాయని.. ప్రజా శాంతికి భంగం కలిగించే ఉద్దేశంతో ఉన్నాయని’’ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.కాక్రోచ్ పార్టీ నిరసనల్లో పాల్గొన్న ఆ యువతి.. జూలై 23-24 తేదీల మధ్య ఈ వీడియో తీసినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో ఆమె ప్రధాని మోదీపై అభ్యంతరకర భాష ఉపయోగించింది. మోదీని గద్దె దిగిపోవాలని.. యువత ఆ పని చేయాలంటూ అసభ్య పదజాలంతో దూషించింది. ఆ సమయంలో కొందరు ఆందోళనకారులు ఆమెను సెల్ఫోన్లతో వీడియోలు తీసిన మరింత రెచ్చిగొట్టినట్లు కనిపించింది. అవి విపరీతంగా వైరల్ కావడంతో పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు స్వచ్చందంగా ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించారు.జీరో ఎఫ్ఐఆర్ నమోదుసుప్రీంకోర్టు న్యాయవాది స్మృతి సింగ్ చందేల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జూలై 29న నోయిడాలోని ఎక్స్‌ప్రెస్‌వే పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 352, 353(1), 356(1) కింద కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగా అవమానించడం ద్వారా ప్రజా శాంతికి భంగం కలిగించడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, పరువునష్టం వంటి అంశాలపై అభియోగాలు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదులో.. సదరు యువతి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ పదవి గౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా, ద్వేషాన్ని వ్యాప్తి చేసి ప్రజా శాంతికి విఘాతం కలిగించే ఉద్దేశంతో ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాదు.. ఆ వీడియోలో ఆమె ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ పేరును కూడా ప్రస్తావించడం గమనార్హం. ఎవరీ అమ్మాయి?.. జంతర్ మంతర్ నిరసనల్లో ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేసిన యువతిని నోయిడాకు చెందిన రుచికా సింగ్‌గా గుర్తించారు. 25 ఏళ్ల రుచిక.. విద్యార్హతలు ఏంటో స్పష్టత లేదు. అయితే ఆమె మోడల్‌గా, ఇన్ఫ్లుయెన్సర్గా రాణిస్తున్నట్లు సమాచారం. విద్యా వ్యవస్థకు సంబంధించిన అంశాలు, విద్యార్థుల సమస్యలపై జరిగిన ఈ నిరసనలో భాగంగా ఆమె.. ఇలా అభ్యంతరక వ్యాఖ్యలతో దేశ ప్రధానిని తిట్టడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.ఢిల్లీ పోలీసులకు బదిలీజంతర్ మంతర్ ప్రాంతం ఢిల్లీ పోలీసుల పరిధిలో ఉండటంతో నోయిడాలో నమోదైన జీరో ఎఫ్ఐఆర్ను ఢిల్లీ పోలీసులకు బదిలీ చేశారు. ఈ కేసును ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం ఐఎఫ్ఎస్ఓ (Intelligence Fusion and Strategic Operations) పరిశీలిస్తోంది. నిరసనకు సంబంధించిన వీడియోలు, సోషల్ మీడియా పోస్టులను పోలీసులు పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆమెను అరెస్ట్ చేశారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.సోషల్ మీడియా ఖాతాలకు నోటీసులుఈ వ్యవహారంలో ఇప్పటికే పలు సోషల్ మీడియా ఖాతాలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అభ్యంతరకరమైన, పరువునష్టం కలిగించే కంటెంట్‌ను షేర్ చేశారన్న ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎక్స్ (X) వేదికకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చి సంబంధిత పోస్టులను తొలగించడం లేదంటే వాటి యాక్సెస్‌ను నిలిపివేయడం, దర్యాప్తు కోసం ఎలక్ట్రానిక్ రికార్డులను భద్రపరచాలని కోరినట్లు సమాచారం. -
అనిశ్చితి వేళ అత్యయిక భేటీ
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో మళ్లీ రోజురోజుకూ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుండటంతో అక్కడి విపరిణామాలు భారత్‌పై ఏమేరకు ప్రభావం చూపుతున్నాయనే విషయమై ప్రధాని మోదీ కీలక సమీక్ష జరిపారు. కీలక శాఖల మంత్రులు, ఉన్నతాధికారులను పలు అంశాలపై ప్రధాని ఆరా తీశారు. తన అధ్యక్షతన గురువారం ఢిల్లీలో జరిగిన భద్రతపై కేబినెట్ కమిటీ(సీసీఎస్) అత్యవసర సమావేశంలో ప్రధాని మోదీ ఇంధన అవసరాల కోసం కొనసాగుతున్న దిగుమతుల తీరుతెన్నులు, అవలంభిస్తున్న అంతర్జాతీయ విధానాలను సమీక్షించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్, హోం మంత్రి అమిత్‌షా, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా, వాణిజ్య మంత్రి పియూశ్ గోయల్, షిప్పింగ్ మంత్రి శర్బానంద సోనోవాల్, పెట్రోలియం మంత్రి హర్దీప్సింగ్ పురితోపాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హార్మూజ్ జలసంధి, నల్ల సముద్ర, ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ మార్గాల ద్వారా పెట్రోలియం, సహజవాయువు, ఎరువుల దిగుమతి తీరుతెన్నులపై కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అంతర్జాతీయంగా నెలకొన్ని అనిశ్చితి, భద్రతపై దాని దుష్ప్రభావాలు, దేశీయంగా ద్రవరూప సహజ వాయువు, ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్, పెట్రో ఉత్పత్తులను అందుబాటులో ఉంచేందుకు భారత్ ఆ మేరకు తీసుకుంటున్న చర్యలను అధికారులు ప్రధానికి విడమర్చి చెప్పారు. ఎల్పీజీని విభిన్న దేశాల నుంచి సమీకరిస్తున్నామని, సరిపడా నిల్వలు దేశంలో ఉన్నాయని సోమనాథన్ వెల్లడించారు. రైతులుకు ఎల్లవేళలా ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆదేశించారు. హార్మూజ్ జలసంధి, సమీప సముద్ర జలాల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించే సరకు రవాణా నౌకల్లోని భారతీయ నావికులు, సిబ్బంది రక్షణపై మోదీ ఆరాతీశారు. భారతీయ సిబ్బంది యోగక్షేమాలను భారత్‌లోని వాళ్ల కుటుంబసభ్యులకు ఎప్పటికప్పుడు తెలియజేసే యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలని మోదీ సూచించారు. -
పదవి వదిలేసి ఇన్ఫ్లుయెన్సర్గా మారండి
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న తరుణంలో విద్యార్థులతో సంప్రదింపుల కోసం ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాను వినియోగించుకోవడంపై కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకొని, దానికి బదులుగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారా లని సూచించారు. నరేంద్ర మోదీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా వ్యవహరించడానికే సరిగ్గా సరిపోతారని ఎద్దేవా చేశారు. ఆయన పదవి నుంచి తప్పుకోవాలని, దేశాన్ని నడిపే బాధ్యతను మరొకరికి అప్పగించాలని అన్నారు. నీట్ పేపర్ లీక్‌పై ఆందోళనను విరమించినప్పటికీ నిరసనకారులపై వేధింపులు ఆగడం లేదని దీప్కే ఆరోపించారు. నిరసనల్లో పాల్గొన్న వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయని విమర్శించారు. కేంద్ర మంత్రి రాజీనామా చేసినంత మాత్రాన నిరసన కారుల ఆగ్రహం చల్లారలేదని తేల్చిచెప్పారు. యువత ఆగ్రహాన్ని బీజేపీ ఎందుకు అర్థం చేసుకో లేకపోతోందని ప్రశ్నించారు. -
లీకేజీ ముఠాలను వదలం: మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సెల్ఫీ వీడియోల పరంపర కొనసాగుతోంది. పార్లమెంట్ ఉభయ సభల్లో ‘ప్రశ్నాపత్రాల లీకేజీల నివారణ బిల్లు’ ఆమోదం పొందిన వేళ ప్రధాని మోదీ గురువారం రాత్రి ఇన్‌స్టా గ్రామ్ ఖాతాలో సెల్ఫీ వీడియో ఒకటి విడుదలచేశారు. ‘‘అత్యంత పటిష్టమైన పరీక్ష విధానాన్ని తీసుకొచ్చేందుకు అనుక్షణం శ్రమిస్తున్నాం. పేపర్ లీకేజీలు కోట్లాది మంది పరీక్షార్థుల భవిష్యత్తుకు ప్రమాదకరంగా పరిణమించాయి. కోట్లాదిమంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న పేపర్ లీకేజీ గ్యాంగ్‌లను, లీకేజీ మాఫియాను వదిలేది లేదు. నేను మాట ఇచ్చినట్లే శక్తివంతమైన పేపర్ల లీకేజీ నివారణ బిల్లును రూపొందించాం. అది ఇప్పుడు పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం పొందడం సంతోషకరం. పేపర్ల లీకేజీలపై మా పోరాటం భవిష్యత్తులోనూ కొనసాగుతుంది’’ అని మోదీ హామీ ఇచ్చారు. -
'పేపర్ లీక్ గ్యాంగ్‌లను వదిలే ప్రసక్తే లేదు'.. పీఎం మోదీ స్ట్రాంగ్ వార్నింగ్
పేపర్ లీక్ గ్యాంగ్‌లను వదిలిపెట్టే ప్రసక్తే లేదనిస ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అందుకే పార్లమెంట్లో యాంటి పేపర్ లీక్ బిల్ పాస్ చేశామని వెల్లడించారు. ఈ మేరకు ప్రధాని మోదీ సోషల్ మీడియాలో మరో వీడియో రిలీజ్ చేశారు. పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు కొనసాగుతాయని నరేంద్ర మోదీ తెలిపారు. విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడేవారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ దిశగా ముందుకు సాగుదామని ఆయన పిలుపునిచ్చారు. కాగా.. ఈ ఏడాది నీట్ పరీక్ష పేపర్ లీకైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షను దేశవ్యాప్తంగా మరోసారి నిర్వహించారు. ఈ పేపర్ లీక్‌పై కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనకు దిగింది, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టారు. సీజేపీ చీఫ్ అభిజీత్ దిప్కే ఆధ్వర్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దీంతో నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం యాంటి పేపర్ లీక్ బిల్‌ను తీసుకొచ్చింది. ఈ బిల్లుకు లోక్ సభ కూడా ఆమోదం తెలిపింది. Parliament passes a Bill that makes our examination system more robust! pic.twitter.com/OEvLKXoUaf— Narendra Modi (@narendramodi) July 30, 2026 -
యువతను ఆకట్టుకునే పనిలో బీజేపీ అగ్రనేతలు!
ఫేస్బుక్, ఎక్స్, వాట్సప్‌లకు ఇక కాలం చెల్లినట్లే! రాజకీయ నేతలు మరీ ముఖ్యంగా బీజేపీ వారు ఇక ఇన్‌స్టా మార్గం పట్టనున్నారు. రీల్స్ రాజకీయమే భేషన్న ప్రధాని మాటలు వారిపై సీరియస్ ప్రభావమే చూపాయి. జెన్–జీ ప్రియ నేస్తం ఇన్‌స్టాగ్రామ్‌పై కేంద్ర మంత్రులు సహా కాషాయ పార్టీ నేతల విన్యాసాలు ఎంతమేరకు రక్తికట్టిస్తాయో చూడాలి మరి! కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పుణ్యమా అని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేతలకు తమ రాజకీయాన్ని పండించుకునేందుకు కొత్త అస్త్రం దొరికింది. నిన్న మొన్నటివరకూ అన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తమ సందేశాన్ని వినిపిస్తూ వచ్చిన కాషాయ పార్టీ నీట్ ప్రశ్న పత్రాల లీకేజీలపై విద్యార్థుల ఆందోళనల తరువాత రూటు మార్చింది. ఇన్‌స్టాగ్రామ్‌పై తన దృష్టిని కేంద్రీకరించింది. ఆందోళనలను విరమింపజేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇన్‌స్టా సందేశం పంపడం, జెన్–జీని ఆకట్టుకోవాలంటే ఇదే మేలి మార్గమని ఆయన స్వయంగా ప్రకటించడం ఆ పార్టీ నేతల్లో జోష్ నింపిందని చెప్పాలి. అందుకేనేమో... ఒక్కరొక్కరుగా కేంద్ర మంత్రులు కూడా రీల్స్ చేయడం మొదలుపెట్టారు.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తరువాత కొత్త విద్యాశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి కొత్తగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఓ నాలుగు పోస్టులు పెట్టారు అందులో. ప్రస్తుతానికి ఆయనకున్న ఫాలోయర్లు కేవలం 23 మంది మాత్రమే. మోదీ సందేశం, తనను విద్యాశాఖ మంత్రిగా నియమించడం, కర్ణాటక సీఎం డి.కె.శివకుమార్‌తో చర్చలు, ప్రశ్న పత్రాల లీకేజీ విషయమై అధికారులతో చర్చలు మాత్రమే ఆయన పోస్టులు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, సీజేపీతో చర్చలు జరిపిన బీజేపీ నేత జేపీ నడ్డా, మాజీ మంత్రి జితేంద్ర సింగ్‌లు గతంలో వారానికి నాలుగైదు పోస్టులు మాత్రమే పెడుతూంటే.. తాజాగా ప్రతిరోజు బోలెడన్ని ఇన్‌స్టా పోస్టులు పెడుతున్నారు. ఇన్‌స్టాను వాడుకోండి అన్న ప్రధాని పిలుపునకు ముందు జేపీ నడ్డా ఇన్‌స్టాపై చివరగా పోస్టు చేసింది జూలై నాలుగున. అంతకు ముందు జూన్ 27న ఒక పోస్టు చేశారు. ఇప్పుడు మాత్రం రోజూ పోస్టులే పోస్టులు! పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా కొన్ని రోజులుగా ఇన్‌స్టా వేదికగా ప్రశ్న పత్రాల లీకేజీని అరికట్టేందుకు ఉద్దేశించిన బిల్లుపై పలు పోస్టులు చేస్తున్నారు. ప్రశ్న పత్రాల లీకేజీ అంశాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగినదిగా వర్ణించిన రిజిజు చర్చకు సహకరించాల్సిందిగా ప్రతిపక్షాలకు చేసిన విజ్ఞప్తులను రీల్స్‌గా పోస్ట్ చేశారు.చదవండి: నీలేకనికి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కూడా ఇన్‌స్టా బాట పట్టారు. ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో బీజేపీ ప్రభుత్వం సత్వర చర్యలకు దిగిందని, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు హామీ ఇచ్చిందని ఆమె ఈ మధ్యే పోస్టు పెట్టారు. ఇక బీజేపీని డిజిటల్ మార్గం పట్టించిన ఐటీ సెల్ అధ్యక్షుడు అమిత్ మలవీయా కూడా జెన్–జీకి దగ్గరైన ఇన్స్టాగ్రామ్పైకి రాక తప్పలేదు. సీజేపీ నిరసనల్లో అసంబద్ధమైన నినాదాలు ఉన్నాయని, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రశ్న పత్రాల లీకేజీలపై వారెవరూ మాట్లాడకపోవడాన్ని ప్రశ్నించారు.టాప్‌లో పీఎం... భారత ప్రధాని నరేంద్ర మోదీ 2014 నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో చురుకుగా ఉన్నారు. పది కోట్ల మందికిపైగా ఫాలోయర్లు ఉండగా... సీజేపీ నిరసనల సందర్భంగా అర్ధ రాత్రి చేసిన సెల్ఫీ వీడియోతో ఫాలోయర్ల సంఖ్య సుమారు పది లక్షల మంది పెరిగారు. మూడు నెలల క్రితం భారతీయ జనతా పార్టీ ఇన్‌స్టాగ్రామ్‌కు 9.5 లక్షల మంది ఫాలోయర్లు ఉండగా సీజేపీ కొన్ని గంటల్లోనే ఈ సంఖ్యను దాటిపోయింది. తరువాత సీజేపీ హ్యాండిల్‌పై నిషేధం వేటు పడటం.. కోర్టు కేసుల తరువాత హ్యాండిల్ మళ్లీ దక్కడం తెలిసిన విషయమే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మోదీ మంచి ఇన్ఫ్లుయెన్సర్.. కంగనా లైట్: అభిజిత్ దీప్కే
ప్రధాని నరేంద్ర మోదీపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ మాంచి ఇన్ఫ్లుయెన్సర్ అంటూ ప్రశంసలు గుప్పించారు. ఇక్కడే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై జరిగిన ఆందోళనలు, కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంతో.. దీప్కే సెటైరిక్ వ్యాఖ్యలే చేశారు.రాజకీయ నేతగా కంటే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా బాగా రాణిస్తున్నారని వ్యాఖ్యానిస్తూ.. ప్రధాని పదవి నుంచి తప్పుకుని ఆ రంగంలో కొనసాగాలంటూ వ్యంగ్యంగా సూచించారు. ఢిల్లీ నిరసనలు, అనారోగ్యం నుంచి కోలుకున్నాక తన స్వస్థలమైన మహారాష్ట్రకు తిరిగి వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడిన దీప్కే.. ప్రధాని మోదీ మంచి ఇన్ఫ్లూయెన్సర్గా పని చేస్తున్నారని, అయితే దేశ పాలన బాధ్యతలను మరొకరికి అప్పగించాలని వ్యాఖ్యానించారు.🚨 BREAKING 🚨Abhijeet Dipke asks PM Modi to resign, & become full-time INFLUENCER 🤯🗣️"He is doing good as an influencer— I think he should STEP DOWN, & someone else should take over governance." pic.twitter.com/o2r8hoG9x0— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) July 29, 2026"మోదీ ఇప్పుడు ఇన్ఫ్లూయెన్సర్గా మారాలి. ఆ పని ఆయన చాలా బాగా చేస్తున్నారు. ప్రధాని పదవి వదిలి ఇంకొక నాయకుడు దేశాన్ని నడిపే అవకాశం ఇవ్వాలి" అని అన్నారు. నీట్ ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమించినప్పటికీ.. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులను వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు గుర్తించి వేధిస్తున్నాయని దీప్కే ఆరోపించారు. విద్యార్థులను ఇబ్బంది పెట్టడం వెంటనే ఆపాలని, లేకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రజలే ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.పేపర్ లీక్ కేసుల కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ ఇటీవల ప్రకటించారని గుర్తుచేసిన దీప్కే.. అయితే మొదటి విచారణకే సీబీఐ న్యాయవాది హాజరు కాకపోవడంతో కేసు వాయిదా పడిందని ఎద్దేవా చేశారు. మాటలకు, చేతలకు పొంతన ఉండాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.అదే నిజమైతే హోం మంత్రి ఫెయిల్ అయినట్లే!పెల్లెట్ గన్స్ వాడడం నా కళ్లారా చూశా. చాలా మంది కళ్లు పోయాయి. బిహార్‌లో ఏకంగా ఏకే47 ఎక్కుపెట్టారు. కసబ్‌లాంటి ఉగ్రవాదులపై ఎక్కుపెట్టాల్సిన ఏకే-47ను విద్యార్థులపై గురి పెట్టారు. బీజేపీలోకి రమ్మని నన్ను బెదిరిస్తున్నారు. అమిత్ షా చెప్పడం వల్లే పెల్లెట్ గన్స్ వాడి ఉండొచ్చు. ఢిల్లీ పోలీసులు అమిత్‌షాకే రిపోర్ట్ చేస్తారు. ఇది అమిత్ షాకు తెలియదంటే హోం మంత్రిగా ఆయన ఫెయిల్ అయినట్లే!. 'ఆగ్రహం ఇంకా చల్లారలేదు'కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినా.. ప్రజల్లో, ముఖ్యంగా యువతలో ఉన్న ఆగ్రహం ఏమాత్రం తగ్గలేదని దీప్కే అన్నారు. ఆగ్రహం వ్యక్తిగతంగా మంత్రి మీద కాదని, ప్రభుత్వ వైఖరిపైనేనని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం యువత మనోభావాలను అర్థం చేసుకోవడంలో విఫలమైందని విమర్శించారు. విద్యార్థులపై వేధింపులు కొనసాగితే ఉద్యమం మరింత పెద్ద ఎత్తున తిరిగి ప్రారంభిస్తామని దీప్కే స్పష్టం చేశారు. "ఈ విద్యార్థులు ఉగ్రవాదులు కాదు. దేశ భవిష్యత్తు. భవిష్యత్తును ఇలా ఇబ్బంది పెడితే.. అవసరమైతే ఈ ప్రభుత్వాన్నే మార్చే స్థాయిలో ఉద్యమం చేస్తాం" అని హెచ్చరించారు.పెల్లెట్ గన్స్.. చర్యలు తీసుకోవాలిజంతర్మంతర్ వద్ద జరిగిన నిరసనల సందర్భంగా విద్యార్థులపై పెల్లెట్ గన్స్ వినియోగించిన ఘటనపై కూడా దీప్కే స్పందించారు. ఆదేశాలు ఇచ్చింది ఎవరైనా సరే.. అది కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయినా, మరెవరైనా అయినా.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రధాన్‌కు సన్మానం చేయడంపై.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం పార్లమెంట్లో ఆయనకు బీజేపీ సభ్యులు సన్మానం చేయడాన్ని కూడా దీప్కే తప్పుబట్టారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితుల్లో రాజీనామా చేసిన మంత్రిని సత్కరించడం సరికాదని వ్యాఖ్యానించారు.కంగనా.. లైట్నీట్ ఉద్యమంపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన దీప్కే.. ఆమెను "పార్ట్‌టైమ్ రాజకీయ నాయకురాలు"గా అభివర్ణించారు. తాను సీరియస్ రాజకీయ నాయకుల వ్యాఖ్యలకే స్పందిస్తానని చెప్పి ఆమె విమర్శలను తేలికగా కొట్టిపారేశారు. -
‘విద్యార్థులకు న్యాయం జరగాలి’
పార్లమెంట్ సమావేశాలు అప్డేట్స్.. రాహుల్‌కు కౌంటర్..నిశికాంత్ దూబే వ్యాఖ్యలుఅమిత్ షాపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను దూబే తీవ్రంగా ఖండించారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎవరికి భయపడరు.కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీనే అమిత్ షాకు భయపడుతున్నారు.దేశాన్ని విభజించాలని కోరుకునే దేశ వ్యతిరేక శక్తులే అమిత్ షాకు భయపడుతున్నాయి.ప్రజలు, ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసంతోనే అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాజ్యసభ నుంచి విపక్షాల వాకౌట్పెల్లెట్ గన్స్‌పై చర్చించాలని పట్టుఅమిత్ షా సభకు రావాలంటూ నినాదాలు.చర్చకు అంగీకరించని ప్రభుత్వంవిద్యార్థులకు న్యాయం చేయాలి: రాహుల్రాహుల్ గాంధీ కామెంట్స్..విద్యార్థులకు న్యాయం జరగాలి.విద్యార్థులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.విద్యార్థులపై దాడులు, కఠిన చర్యలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఓ ఉన్నత స్థాయి స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలి.రాజకీయ జోక్యం లేకుండా నిష్పక్షపాతంగా విచారణ జరగాలి.విద్యార్థుల హక్కులు, భద్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఈ ఘటనలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి.Students deserve justice. An independent SC monitored high powered committee must be constituted to probe brutalities against our students. pic.twitter.com/pZATUeAjwC— Rahul Gandhi (@RahulGandhi) July 30, 2026 కాంగ్రెస్ వాయిదా తీర్మానం..రాజ్యసభలో వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్అయోధ్య రామ మందిరం విరాళాల దుర్వినియోగంపై చర్చించాలని డిమాండ్ పార్లమెంట్ వద్ద ప్రతిపక్ష పార్టీల ధర్నా..కాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంపార్లమెంటు ద్వారం వద్ద ప్రతిపక్ష పార్టీల ధర్నా అయోధ్య విరాళాల చోరీ పైన దర్యాప్తు చేయాలని నినాదాలుఉభయసభల్లో చర్చకు నోటీస్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీఅయోధ్య విరాళాల చోరీపై స్వతంత్ర ఆడిటింగ్ దర్యాప్తు జరగాలని నినాదాలుచందా చోర్.. అధికారం నుంచి గద్దె దిగాలని ప్రతిపక్ష నేతల నినాదాలు#WATCH | Delhi: Congress MPs including Priyanka Gandhi Vadra and others hold a protest at Makar Dwar of the Parliament, against Union Home Minister Amit Shah over 'police action' against CJP protestors on 20th July. pic.twitter.com/zmuqaWOt6n— ANI (@ANI) July 30, 2026 -
దేవుడి విరాళాలే కాపాడలేదు పేపర్ లీక్ ఎలా అరికడతారు..?
-
పేపర్ లీక్ తర్వాత పెట్రోల్ పోరు..కేజ్రీవాల్ సన్నాహాలు
న్యూఢిల్లీ: పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలపడం (E20)పై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ సమన్వయకన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నీట్ పేపర్ లీక్ ఆందోళనలకు మద్దతు తెలిపిన ఆయన, తాజాగా ఈ20 విధానానికి వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2023కి ముందు తయారైన వాహనాల్లో ఈ20 వాడకం సురక్షితమేనా అని తాను 29 ఆటోమొబైల్ కంపెనీలను ప్రశ్నించినట్లు తెలిపారు. అయితే మోదీ ప్రభుత్వంపై భయంతో ఏ కంపెనీ కూడా లిఖితపూర్వకంగా స్పందించలేదని అన్నారు.సాంకేతికంగా ఈ విధానం వల్ల వాహనాలు దెబ్బతింటాయని, మైలేజ్ తగ్గుతుందని కంపెనీల అధికారులు అనధికారికంగా అంగీకరించినట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. ప్లాంట్లు మూసివేయిస్తామని, ఈడీ దాడులు చేయిస్తామని కేంద్రం నుంచి బెదిరింపులు వస్తున్నందునే వారు బయటకు చెప్పలేకపోతున్నారని విమర్శించారు. దేశంలో 2023కి ముందు కొనుగోలు చేసిన దాదాపు 30 కోట్ల వాహనాలను మోదీ ప్రభుత్వం పనికిరాకుండా చేస్తోందని ఆరోపించారు. ఇథనాల్ వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని, పైగా నీటి వనరులు కలుషితమవుతున్నాయని పేర్కొన్నారు.శనివారం తలపెట్టిన టౌన్‌హాల్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు ప్రయత్నిస్తున్నారని, అనుమతుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారని కేజ్రీవాల్ మండిపడ్డారు. పోలీసులు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం ఈ20 విధానాన్ని శాంతియుతంగా వెనక్కి తీసుకోవాలని, లేదంటే ప్రజలే తరగబడతారని ఆయన హెచ్చరించారు. -
‘దిల్ కా యాంగిల్’ మార్చుకోండి
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెన్ జెడ్ తరాన్ని, వారి మనసులను గెలుచుకోవాలనుకుంటే కెమెరా యాంగిల్స్ కాకుండా ‘దిల్ కా యాంగిల్’మార్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా సూచించారు. విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీ విషయంలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యార్థుల వీపులపై పడే ప్రతి లాఠీ దెబ్బ వారి కంటే ఎక్కువగా ప్రభుత్వ ప్రతిష్టకే హాని కలిగిస్తుందని తేల్చి చెప్పారు. మంగళవారం లోక్‌సభలో పేపర్ లీక్ వ్యతిరేక బిల్లుపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. విద్యార్థులపై బాష్పవాయువు ప్రయోగించి, లాఠీలతో విరుచుకుపడాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.యువతుల దుస్తులు చింపేసి అవమానించడం, కనికరం లేకుండా కొట్టించడం ఏమిటని మండిపడ్డారు. దేశ యువతపై పెల్లెట్ గన్లు, ఏకే–47లతో కాల్పులు జరపడం రాక్షసత్వం కాదా? అని నిలదీశారు. ప్రభుత్వం దృష్టిలో విద్యార్థులు ఉగ్రవాదులా? అని ధ్వజమెత్తారు. ఈ రోజు ఈ ప్రశ్నలను కాంగ్రెస్ మాత్రమే కాదు, దేశం మొత్తం అడుగుతోందని అన్నారు. వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.దేశంలోని యువతను ఈ ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని అడిగారు. వారి గొంతుకలను అణచివేసే హక్కు ఎవరు ఇచ్చారు? అంటూ దుయ్యబట్టారు. విద్యార్థులపై పెల్లెట్ గన్లతో దాడి చేయాలని ఎవరు ఆదేశాలు ఇచ్చారో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. దేశమంతా ఇదే ప్రశ్న అడుగుతోందని వెల్లడించారు. మోదీ సత్య మార్గంలో నడవాలి పేపర్ లీకేజీలను అరికట్టడానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనను ప్రియాంకా గాంధీ తోసిపుచ్చారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల పనితీరు ఇప్పటికే చాలా పేలవంగా ఉందని గుర్తుచేశారు. పార్లమెంట్లో ప్రతిపక్షాన్ని నిందించడం, డొల్ల రాజకీయ క్రీడలు ఆడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. నేటి కొత్త తరం ఎంతో అవగాహన కలిగి ఉందని, అబద్ధాలను గుర్తించగల అపారమైన సామర్థ్యాన్ని వారికి ఉందని వెల్లడించారు. యువత హృదయాలను గెలుచుకోవాలంటే ప్రధాని మోదీ సత్య మార్గంలో నడవాలని ప్రియాంకా గాంధీ సూచించారు. మోదీ పాలనలో యువతకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.‘‘నిజాన్ని అంగీకరించండి, బాధ్యత తీసుకోండి, పటిష్టమైన చర్యలు చేపట్టింది. నిపుణులను సంప్రదించండి. లోపాలకు తావులేని నూతన విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయండి. యువతకు ఉద్యోగాలు, ఉపాధి కలి్పంచేందుకు ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలి. దేశంలో విద్య, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను విస్తరించాలి. అప్పుడే పిల్లలు ఉజ్వల భవిష్యత్తును కలలు కనగలరు’’అని స్పష్టంచేశారు. విద్యార్థులను బలవంతంగా వీధుల నుంచి తొలగించవచ్చేమో గానీ వారి ప్రశ్నలను మాత్రం తొలగించలేమని ప్రియాంకా గాంధీ తేల్చి చెప్పారు. -
పేపర్ లీక్ బిల్లు చరిత్రాత్మకం
న్యూఢిల్లీ: పేపర్ లీకేజీలను అరికట్టడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పబ్లిక్ ఎగ్జామినేషన్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026’చరిత్రాత్మకమని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు చట్టాన్ని తీసుకురావాలన్న అసంపూర్ణ కార్యాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2024లో పూర్తి చేసిందని తెలిపారు. 2024 నాటి చట్టాన్ని మరింత కఠినతరం చేసే దిశగా చర్యలు చేపట్టిందని అన్నారు. ఈ బిల్లు విద్యార్థులు, యువత ప్రయోజనాలు కాపాడాలన్న ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. సవరణ బిల్లును సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టగా, మంగళవారం చర్చ ప్రారంభమైంది. మంత్రి జితేంద్ర సింగ్ చర్చకు శ్రీకారం చుట్టారు.ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తుచేశారు. ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడిన వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.50 లక్షల భారీ జరిమానా వంటి కఠినమైన శిక్షలు విధించేలా ‘పబ్లిక్ ఎగ్జామినేషన్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026’ను రూపొందించిన సంగతి తెలిసిందే. బిల్లుపై వివిధ పార్టీల సభ్యులు మాట్లాడారు. మంగళవారం అర్ధరాత్రి వరకు చర్చ కొనసాగింది. నిరసన వ్యక్తంచేసిన విద్యార్థులపై లాఠీచార్జీ చేయడాన్ని విపక్ష సభ్యులు తప్పుపట్టారు.ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యా రంగంలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అధికార పక్ష సభ్యులు బిల్లును సమరి్థంచారు. విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు స్పష్టంచేశారు. పేపర్ లీకేజీలను అరికట్టడానికి పటిష్టమైన చట్టం తీసుకొస్తుండడం కీలక పరిణామం అని వెల్లడించారు. అనంతరం చర్చ బుధవారానికి వాయిదా పడింది. విపక్ష సభ్యులది రాజకీయ ప్రసంగం: రిజిజు ప్రతిపక్షాలు పేపర్ లీక్ నిరోధక బిల్లు గురించి కాకుండా ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. మొత్తం చర్చ బిల్లు యోగ్యతపై కేంద్రీకృతమై ఉండాల్సిందని అన్నారు. ఆయన పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. విపక్ష సభ్యులు బిల్లు గురించి మాట్లాడలేదని, కేవలం రాజకీయాలు చేశారని అన్నారు. అందరూ రాజకీయ ప్రసంగాలు చేశారని ఆక్షేపించారు. సభలో ఇలా చేయడం సరైంది కాదన్నారు. -
ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ
సాక్షి,చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశారు. రాజ్యసభలో జలశక్తి శాఖ సహాయ మంత్రి ఇచ్చిన సమాధానాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన ఈ లేఖలో కోరారు. కావేరీ నదిపై కర్ణాటక ప్రతిపాదించిన మేకేదాటు మురుగునీటి నిల్వ/డ్యామ్ ప్రాజెక్టుకు సంబంధించిన చట్టపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆ సమాధానం ఇచ్చారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.రాజ్యసభలో జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి మాట్లాడుతూ, కావేరీ నదిపై ఏదైనా నిర్మాణాన్ని చేపట్టే ముందు కర్ణాటక రాష్ట్రం ఇతర దిగువ రాష్ట్రాల (తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి) అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సుప్రీంకోర్టు 2018 నాటి తీర్పులో స్పష్టంగా ఎక్కడా పేర్కొనలేదని సమాధానమిచ్చారు.అయితే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ సమాధానం తీవ్ర నిరాశకు గురిచేసిందని సీఎం విజయ్ పేర్కొన్నారు. అంతరాష్ట్ర నీటి వివాదాలలో ఇప్పటికే స్థిరపడిన చట్టాలు మరియు చట్టపరమైన సూత్రాలను పరిశీలించకుండానే కేంద్ర మంత్రి ఈ ప్రకటన చేశారని విజయ్ విమర్శించారు. కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జరిగిన ఆలమట్టి డ్యామ్ వివాదంలో, దిగువన ఉండే రాష్ట్రం యొక్క అనుమతి ఖచ్చితంగా అవసరమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన తీర్పునిచ్చిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.కావేరీ నీటి వివాదాల ట్రిబ్యునల్ అవార్డు, సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా ఉంటే తప్ప, మేకేదాటు డ్యామ్ ప్రాజెక్టుకు ఎటువంటి పరిపాలనాపరమైన లేదా చట్టపరమైన అనుమతులు మంజూరు చేయకుండా చూడాలని సీఎం విజయ్ ప్రధానమంత్రిని కోరారు. అలాగే, 2018లో సుప్రీంకోర్టు ట్రిబ్యునల్ తీర్పును సమర్థించినప్పుడు, రాష్ట్రాలు తమ పరిధిలోని నీటిని ట్రిబ్యునల్ ఆదేశాలకు లోబడి మాత్రమే నియంత్రించుకోవచ్చని స్పష్టం చేసిందని పేర్కొన్నారు.గతంలో కేరళకు చెందిన పాంబార్ హైడ్రో-ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ విషయంలో కూడా దిగువ రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా ఉమ్మడి ఒప్పందాలు అవసరమని ట్రిబ్యునల్ పేర్కొన్న విషయాన్ని విజయ్ గుర్తు చేశారు. కాబట్టి, కేంద్ర ప్రభుత్వం వెంటనే రాజ్యసభలో ఇచ్చిన సమాధానాన్ని ఉపసంహరించుకోవాలని, దిగువ రాష్ట్రాల హక్కులను రక్షించాలని ఈ ప్రాజెక్టుపై సమగ్ర చట్టపరమైన, సాంకేతిక పరిశీలన జరపాలని డిమాండ్ చేశారు. -
మోదీకి మెటా క్షమాపణలు.. మోదీ వీడియో డిలీట్.. అసలు కారణమిదే!
-
నీలేకనికి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి.. ఎందుకంటే!
బెంగళూరు: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకనికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు బీకే హరిప్రసాద్ డిమాండ్ చేశారు. ముఖం లేని సంపన్నుడు (ఫేస్‌లెస్ బిలియనీర్) అంటూ నీలేకనిపై గతంలో మోదీ చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలన్నారు. గతంలో విమర్శలు చేసిన వ్యక్తికి ఇప్పుడు కీలక బాధ్యతలు అప్పజెప్పడం మోదీ రాజకీయ అవకాశవాదానికి నిదర్శనమని దుయ్యబట్టారు. రాజకీయ స్వప్రయోజనాల కోసం మోదీ ఏమైనా చేస్తారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.''నందన్ నీలేకనికి ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలి. మీ రాజకీయాలకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒకరిని 'ముఖం లేని బిలియనీర్' అని ముద్ర వేసి, మీ ప్రభుత్వం విఫలమైనప్పుడు అదే వ్యక్తికి భారతదేశ పరీక్షా విధానాన్ని సంస్కరించే బాధ్యతను అప్పగించలేరు. ఇది నందన్ నీలేకని సామర్థ్యాన్ని ప్రశ్నించడం గురించి కాదు, మేము ఎల్లప్పుడూ ఆయన సామర్థ్యాలను గుర్తించాము. ఇది రాజకీయ కపటత్వం, జవాబుదారీతనం గురించిన విషయం. మన నాయకులు స్థిరంగా ఉండాలి, దేశానికి సేవ చేసే వారిని గౌరవించాల''ని ఎక్స్‌లో హరిప్రసాద్ పేర్కొన్నారు.నీలేకణికి ముఖం వచ్చిందా? "ప్రధానిగారూ... ఇప్పుడు నందన్ నీలేకణికి ముఖం వచ్చిందా? లేక అప్పట్లో చేసిన ఆరోపణలే ఇప్పుడు అర్థరహితమయ్యాయా? ఆ ఆరోపణలు నిజమే అయితే కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తును ఆయన చేతుల్లో ఎలా పెడుతున్నారు? అవి అబద్ధమైతే, బహిరంగ వేదికపై ఒక ప్రతిభావంతుడిని అవమానించినందుకు ఎప్పుడు క్షమాపణ చెబుతారు?" అని హరిప్రసాద్ ప్రశ్నించారు."ఇది నాయకత్వం కాదు. ప్రతిపక్షంతో ఉన్నారని దేశ ప్రతిభను అవమానించడం, తర్వాత తమ ప్రభుత్వ వైఫల్యాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు అదే ప్రతిభను ఆశ్రయించడం రాజకీయ అవకాశవాదానికి నిదర్శనం. నందన్ నీలేకణి సామర్థ్యంపై మాకు ఎలాంటి సందేహం లేదు. ప్రశ్నించాల్సింది ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ నిబద్ధతనే" అని హరిప్రసాద్ విమర్శించారు.నీట్ ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారం రేపిన కలకలం నేపథ్యంలో పరీక్షల్లో సంస్కరణల కోసం హైపవర్డ్ టాస్క్ ఫోర్స్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నందన్ నీలేకని నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో ఈ టాస్క్ ఫోర్స్‌ను నియమించినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. పటిష్ట, పారదర్శక పరీక్ష విధానాన్ని ఏర్పాటు చేసేందుకు సాంకేతికతను గరిష్టంగా వినియోగించుకోవడంపై ఈ టాస్క్‌ఫోర్స్ సూచనలు ఇస్తుందని వెల్లడించారు. టాస్క్ ఫోర్స్ ఇచ్చే నివేదిక ఆధారంగా రాబోయే రోజుల్లో పరీక్షల విశ్వసనీయతను మరింత పెంచేలా చర్యలు చేపడతామన్నారు.చదవండి: ప్రధాని మోదీకి మాజీ ఐఏఎస్ వింత విజ్ఞప్తినందన్ నీలేకణి యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) తొలి ఛైర్మన్‌గా పనిచేసి, ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థ ఆధార్ రూపకల్పన, అమలులో కీలక పాత్ర పోషించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, బీజేపీ నేత హెచ్ఎన్ అనంత్‌కుమార్ చేతిలో ఓడిపోయారు. -
కేసులు ఎత్తివేయకపోతే తీవ్ర పరిణామాలు.. కేంద్రానికి CJP మరో వార్నింగ్
-
మోదీ సెల్ఫీ వీడియో తొలగింపుపై మెటా వివరణ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెల్ఫీ వీడియోలు సోషల్ మీడియాలో ఎంత ప్రభంజనం సృష్టించాయో తెలిసిందే. రికార్డు స్థాయి వ్యూస్, లైక్స్, కామెంట్లు వచ్చాయి వాటికి. అయితే ఫేస్బుక్ నుంచి ఆ వీడియోలు కాసేపు కనిపించకుండా పోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకు తొలగించారంటూ ఫేస్‌బుక్‌పై నెటిజన్లు మండిపడ్డారు. అయితే ఈ ‘తాత్కాలిక’ వ్యవహారంపై మెటా వివరణ ఇచ్చింది. ఆ వీడియోను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెబుతూ.. దాన్ని పునరుద్ధరించామని కూడా వెల్లడించింది.నీట్ వివాదంపై కొనసాగిన విద్యార్థుల ఉద్యమం నేపథ్యంలో ప్రధాని మోదీ జులై 23న ఫేస్బుక్లో ఓ వీడియోను పోస్టు చేశారు. అందులో పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని, పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. జెన్ జీ విద్యార్థులతో మోదీ చేసిన తొలి ప్రత్యక్ష సంభాషణగా ఈ వీడియోకు భారీ స్పందన వచ్చింది.అయితే జులై 28 తెల్లవారుజామున కొంతసేపు ఈ వీడియో భారతీయ వినియోగదారులకు అందుబాటులో లేకుండా పోయింది. వీడియో స్థానంలో ‘‘చట్టపరమైన అభ్యర్థన కారణంగా మీ ప్రాంతంలో ఈ మీడియా అందుబాటులో లేదు’’ అనే సందేశం కనిపించింది. దీంతో రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.మెటా ఏమంది?వీడియో తొలగింపుపై వివరణ ఇచ్చిన మెటా.. ఇది ఉద్దేశపూర్వక చర్య కాదని స్పష్టం చేసింది. పొరపాటున వీడియోను పరిమితం చేశామని, గుర్తించిన వెంటనే దాన్ని పునరుద్ధరించామని తెలిపింది. వీడియోను తొలగించడానికి కారణమైన ప్రక్రియలో తప్పిదం జరిగిందని, వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని మెటా పేర్కొంది.భగ్గుమన్న బీజేపీ, అభిమానులుప్రధాని మోదీ అధికారిక ఖాతాలో ఉన్న వీడియోను ఫేస్బుక్ పరిమితం చేయడంపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. కోట్లాది మంది భారతీయులకు చేరాల్సిన ప్రధానమంత్రి సందేశాన్ని ఒక సోషల్ మీడియా సంస్థ ఎలా అడ్డుకుంటుందని ప్రశ్నించారు. బీజేపీ సోషల్ మీడియా విభాగానికి చెందిన నేతలు మెటాను ట్యాగ్ చేస్తూ పారదర్శకత, జవాబుదారీతనంపై ప్రశ్నలు లేవనెత్తారు. కంటెంట్ నియంత్రణ పేరుతో రాజకీయ పక్షపాతం చూపుతున్నారా? అనే చర్చకు ఈ ఘటన కారణమైంది.జెన్ జీ ఉద్యమం సమయంలో వీడియోనీట్ పరీక్షలో అవకతవకల ఆరోపణలపై దేశవ్యాప్తంగా సాగిన విద్యార్థుల నిరసనల సమయంలో ప్రధాని మోదీ ఈ వీడియో విడుదల చేశారు. పేపర్ లీక్‌లను అరికట్టేందుకు మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని, పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ వీడియోకు భారీగా వ్యూస్ రావడంతో పాటు యువతలో చర్చకు దారితీసింది. ఇలాంటి సమయంలో వీడియో తాత్కాలికంగా కనిపించకుండా పోవడం మరింత ఆసక్తిని రేపింది.వివాదం టు వివరణ వరకుసోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రధాని నరేంద్ర మోదీ.. ఇన్నేళ్లలో పోస్ట్ చేసిన తొలి సెల్ఫీ వీడియో ఇదే కావడం గమనార్హం. అదీ నీట్ నిరసనలతో జెన్ జీ చేసిన ఆందోళనలపై కావడంతో ప్రపంచవ్యాప్తంగా దానిని కోట్ల మంది వీక్షించారు. అయితే ఉన్నట్లుండి ఆ వీడియో ఎందుకు తొలగించబడిందన్న దానిపై స్పష్టత లేకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. చట్టపరమైన అభ్యర్థన కారణమా? అనే ప్రశ్నా తలెత్తింది. అయితే మెటా తాజాగా ఇచ్చిన వివరణతో ఇది సాంకేతిక పొరపాటేనని తేలింది. ప్రస్తుతం ప్రధాని మోదీ వీడియో మళ్లీ ఫేస్బుక్లో అందుబాటులోకి వచ్చింది.మెటాకు కేంద్రం నోటీసులుమెటా క్షమాపణలు చెప్పినప్పటికీ.. కేంద్రం మాత్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఫేస్బుక్ వీడియో తొలగింపు వ్యవహారంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) స్పందించింది. ఈ అంశంపై వివరణ కోరుతూ మెటా గ్లోబల్ హెడ్ ఆఫ్ పబ్లిక్ పాలసీకి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. -
LIVE: మళ్లీ అదే రిపీట్ అవుతుంది..!
-
లోక్‌సభలో పేపర్‌లీకేజీల బిల్లు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక నీట్ వంటి కీలక పోటీపరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలతో ఉద్యమించిన విద్యార్థిలోకాన్ని శాంతింపజేసేందుకు, లీకేజీ నేరగాళ్ల వెన్నులో వణుకుపుట్టేలా అత్యంత కఠిన శిక్షలు, అత్యధిక జరిమానాలతో నూతన చట్టానికి తుదిరూపునిచ్చి సంబంధిత బిల్లును మోదీ సర్కార్ సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ప్రభుత్వ పరీక్షలు(అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లు,2026ను ప్రధానికార్యాలయానికి సహాయ మంత్రి అయిన జితేంద్ర సింగ్ సోమవారం లోక్‌సభలో విపక్షాల నిరసనల మధ్యే ప్రవేశపెట్టారు. బిల్లు ప్రతిపాదించేముందు నిబంధనల ప్రకారం సీనియర్ విపక్ష సభ్యులైన సౌగతా రాయ్(టీఎంసీ), మనీశ్ తివారీ(కాంగ్రెస్), ఎన్కే ప్రేమచంద్రన్(ఆర్ఎస్పీ)లను బిల్లుపై మాట్లాడాల్సిందిగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కోరారు. దానికి వాళ్లు ముందుకురాకపోవడంతో ఇక బిల్లును ప్రవేశపెట్టాలని సహాయమంత్రి జితేంద్రను స్పీకర్ కోరడంతో ఆయన బిల్లును సభముందుకు తెచ్చారు. వెంటనే స్పీకర్ మాట్లాడారు. ‘‘ప్రభుత్వ పరీక్షలను పటిష్టంగా నిర్వహించేందుకు తెస్తున్న బిల్లు ఇది. మీరు నినాదాలు ఆపేసి బిల్లుపై చర్చలో పాల్గొంటే బాగుంటుంది. చర్చ వేళ మీరు ఇచ్చే సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోనుంది’’ అని స్పీకర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం, దాని ఏజెన్సీలు నిర్వహించే పబ్లిక్ ఎగ్జామ్‌లో అవకతవకలకు పాల్పడే వాళ్లను ప్రత్యేక చట్టాల కింద శిక్షించేందుకు మోదీ సర్కార్ 2024లో పబ్లిక్ ఎగ్జామ్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టం తెచ్చింది. యూపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వేస్, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ పరీక్షలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇతర ప్రభుత్వ సంస్థలు చేపట్టే పరీక్షల పేపర్లను లీక్‌చేసే వాళ్లను, ముఠాలను ఈ చట్టనిబంధనల కింద శిక్షిస్తున్నారు. తాజాగా నీట్ లీకేజీ ఉదంతం, విద్యామంత్రిగా ధర్మేంద్ర రాజీనామా డిమాండ్లు, విద్యార్థి నిరసనోద్యమంలో మోదీ సర్కార్ చట్టసవరణ చేస్తూ కొత్త బిల్లును తేవడం తెల్సిందే.బిల్లులో ఏముంది? → అక్రమ పద్దతులను అనుసరిస్తూ పోటీపరీక్షల ప్రశ్నపత్రాలను వ్యక్తిగతంగా లీక్‌చేసిన నేరగాళ్లకు కనిష్టంగా ఐదేళ్లు, గరిష్టగా పదేళ్ల శిక్ష పడేలా బిల్లులో ప్రతిపాదనలు పొందుపరిచారు. ఈ నేరగాళ్లకు రూ.50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. → వ్యక్తిగతంగా కాకుండా ముఠాగా ఏర్పడి వ్యవస్థీకృత నేరం చేసిన వాళ్లకు గరిష్టంగా ఏడేళ్ల జైలుశిక్ష విధించేలా బిల్లులో ప్రతిపాదనలు చేర్చారు. వీళ్లకు గరిష్టంగా రూ.10 కోట్ల జరిమానా విధిస్తారు. → 2024లో అమల్లోకి వచ్చిన పాత చట్టం ప్రకారం పేపర్ లీకేజీ వ్యక్తిగతం నేరగాళ్లకు మూడు నుంచి ఐదేళ్ల జైలుశిక్ష విధించేవారు. వ్యవస్థీకృత నేరగాళ్లకు గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.1 కోటి జరిమానా విధిస్తారు. వీటిని పెంచుతూ సవరణ బిల్లును తెచ్చారు.→ లీకేజీ సంబంధిత కేసుల సత్వర విచారణ కోసం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏదైనా సెషన్స్ కోర్టును ఫాస్ట్‌ట్రాక్ కోర్టుగా ఏర్పాటుచేయాలని కొత్త బిల్లులో ప్రతిపాదించారు.→ కేసును రోజువారీగా కోర్టులో విచారిస్తూ, ఆ కేసులో నేరాభియోగం(చార్జ్‌షీట్) దాఖలైన మూడు నెలల్లోపు కేసు విచారణ ముగించాలని బిల్లులో ప్రతిపాదించారు. కేసు తీవ్రత దృష్టా అవసరమైతే ప్రత్యేక టాస్క్ఫోర్స్నుఏర్పాటుచేయొచ్చు.→ పరీక్షల నిర్వహణ కోసం అవసరమైతే ఇతర విభాగాల సాయం తీసుకోవచ్చు.→ పరీక్ష కేంద్రాలు, పరీక్షార్థుల తనిఖీ, బయోమెట్రిక్ నమోదు, భద్రతా ప్రమాణాలు, సీట్ల కేటాయింపు, ప్రశ్నపత్రాల కూర్పు, పేపర్ల లోడింగ్, ఇని్వజిలేషన్లకు సంబంధించి కొత్త నిబంధనలు,ప్రమాణాల రూపకల్పనకు సంబంధించి బిల్లులో ప్రతిపాదనలుచేశారు→ పేపర్ లీక్ చేయడం, ఓఎంఆర్ షీట్ ట్యాంపరింగ్, నకిలీ వెబ్సైట్ల రూపకల్పన, నకిలీ ఐడీ కార్డులను జారీచేయడం ఇలా 15 అనైతిక చర్యలను నేరాలుగా పేర్కొన్నారు. నేడు చర్చ! వరసబెట్టి వాయిదాలపర్వంతో ముగుస్తున్న లోక్‌సభ సెషన్లో తొలిసారిగా మంగళవారం సుదీర్ఘ చర్చ జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్ట సవరణ బిల్లు–2026 ను మంగళవారం లోక్‌సభో చర్చించనున్నారు. చర్చ కోసం అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను స్పీకర్ బిర్లా ఒప్పించడంతో చర్చ సాధ్యంకానుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సభలో బిల్లుపై ఏడు గంటలపాటు చర్చించే వీలుంది. -
ప్రధాని సభకు జన సమీకరణ బాధ్యత సచివాలయ ఉద్యోగులదే
సాక్షి, అమరావతి: ఆగస్ట్ 1న విజయనగరం జిల్లాలోని భోగాపురం ఎయిర్పోర్ట్ వద్ద జరగనున్న ప్రధాని మోదీ బహిరంగ సభకు ప్రజలను తరలించే బాధ్యతను చంద్రబాబు ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నెత్తిన పెట్టింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈ సభకు మండలాల వారీగా ఎంత మందిని తరలించాలనే విషయంపై అధికారులకు టార్గెట్లు పెట్టారు. దీంతో ఎమ్మెల్యేల టార్గెట్ల మేరకు..సచివాలయ ఉద్యోగులకు ఒక్కొక్కరు ఎంతమందిని సభకు తరలించాలో పేర్కొంటూ ఆయా మండలాల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే తమ పరిధిలోని 4 మండలాలతో పాటు రాజాం అర్బన్ ప్రాంతం నుంచి 1,500 మందిని తరలించాలని హుకుం జారీ చేశారు. ఆయా ఉద్యోగులు 1న ఉదయం 4 గంటలకే ఎంపీడీవో ఆఫీసు కంట్రోల్ రూంలో హాజరై జనాల తరలింపులో పాల్గొనాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. -
నెగ్గాల్సిన ఇతర పరీక్షలు
యాభై రోజులుపైగా ఢిల్లీలో మహోధృతంగాసాగి, దేశం మొత్తాన్ని సుడిగాలిలా చుట్టేసిన జంతర్ మంతర్ ఉద్యమం ఉపశమించిన మర్నాడే ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షల సంస్కరణల కోసం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని ఆధ్వర్యాన ఆరుగురు సభ్యుల టాస్క్‌ఫోర్స్ కమిటీని నియమిస్తున్నట్టు ఆదివారం ప్రకటించారు. అంతేకాదు... పరీక్షల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పబ్లిక్ పరీక్షల (అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లును లోక్‌సభలో సోమవారం ప్రవేశపెట్టారు. కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మొదలెట్టి చకచకా సాగుతున్న ఈ పరిణామాలు... ఆగ్రహంతో రగులుతున్న జెన్ జీ తరాన్ని దగ్గర చేసుకోవటానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాల పర్యవసానమే. నీట్ పేపర్ లీకయిందనీ, మరోసారి ఆ పరీక్ష నిర్వహణ తప్పదనీ తేలిన వెంటనే ఇంతే వేగంగా స్పందించివుంటే బహుశా ఈ స్థాయిలో ఆందోళన జరిగివుండేది కాదేమో! ఆ మాటకొస్తే ఎన్నో యేళ్లుగా ఈ లీకులు వినబడుతూనే ఉన్నాయి. కానీ వ్యవస్థల్లో కదలిక లేదు. 2024 నీట్ ప్రశ్నపత్రం లీక్ తర్వాత మాత్రం ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటైంది. అది ఇచ్చిన నివేదిక అతీగతీ ఏమైందో తెలియదు. ఇంత నిస్తేజంగా ప్రభుత్వాలున్నప్పుడు ఉద్యమాలు వెల్లువెత్తడంలో ఆశ్చర్యం లేదు. మన దేశంలో సమస్యేమంటే కేంద్రం ఒక్కటే కాదు... రాష్ట్ర ప్రభుత్వాలు సైతం లీకుల విషయంలో నిర్లిప్తంగానే ఉంటాయి. జంతర్ మంతర్ ఉద్యమం ఒకపక్క సాగుతుండగానే పంజాబ్‌లో ఫార్మసీ రిక్రూట్మెంట్ పరీక్షల అక్రమాలు బయటపడ్డాయి. ఇక ఎన్డీయే కూటమి ఏలుబడిలోనే సాగుతున్న ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియే పెద్ద కుంభకోణంగా మారింది. నోటిఫికేషన్ విడుదలనాడే స్పోర్ట్స్ కోటా నియామకాలకు అర్హత పరీక్ష అవసరం లేదంటూ రెండు జీవోలు తీసుకురావటం ఆ ప్రభుత్వ బరితెగింపునకు చిహ్నం. అందుకే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ఏపీ విద్యామంత్రి లోకేశ్ రాజీనామా చేయాలన్న డిమాండ్ బలంగా వినిపించింది. నందన్ నిలేకని విద్యాధికుడు. ఐటీ రంగంలో పేరెన్నికగన్నవారు. గతంలో మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం దేశంలో సంక్షేమ పథకాల అమలుకోసమంటూ తీసుకొచ్చిన ఆధార్ కార్డుల రూపకర్త ఆయనే. నిలేకని మాదిరే ఇతర సభ్యులు సైతం వారి వారి రంగాల్లో నిష్ణాతులు. పరీక్షల నిర్వహణకు ఇప్పుడ నుసరిస్తున్న విధానాల్లోని లోటుపాట్లు అధ్యయనం చేసి, ఎలాంటి సంస్కరణలు అవసరమో వీరు సూచిస్తారు. అడుగడుగునా చోటుచేసుకోవటానికి ఆస్కారం ఉన్న అవకతవకలనూ, అనైతిక పద్ధతులనూ నివారించటానికి ఏం చేయాలో చెబుతారు. వీటన్నిటికన్నా ముందు అసలు పరీక్ష నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వంటి జాతీయ సంస్థ అవసరమా అనే సంగతి నిగ్గుదేల్చటం అవసరం. ఒక సంస్థకు దాని సామర్థ్యానికీ, వనరులకూ మించిన బాధ్యతల్ని అప్పగించటం సరైందేనా? ఆలోచించాలి. రెండేళ్లనాటి రాధాకృష్ణన్ కమిటీ నివేదికలోని అంశాలేమిటో, దాని సిఫార్సులపై తీసుకున్న చర్యలేమిటో చెప్పాల్సిన బాధ్యత పాలకులకు లేదా? కాక్రోచ్ ఉద్యమం సాగుతుండగానే 2024 నీట్ లీక్ ప్రధాన నిందితుడిపై వచ్చిన ఆరోపణలు రుజువు కాలేదని సీబీఐ ప్రకటించటం మరో వైచిత్రి. ఇక విద్యార్థులపై అత్యంత ఘోరంగా బలప్రయోగానికి పూనుకున్నవారిపైనా చర్యలుండాలి.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఇకపై అవసరమైన చర్యలు నిరంతరం తీసుకుంటూనే ఉంటుందని ప్రధాని చెప్పటం హర్షించదగ్గది. ఇది కేంద్ర స్థాయిలో మాత్రమే కాదు... రాష్ట్రాల స్థాయిలో కూడా జరగాలి. ఇతర రాష్ట్రాల మాటెలవున్నా తమ ఏలుబడిలోని ప్రభుత్వాలైనా జవాబుదారీతనంతో వ్యవహరించేలా చూడాల్సిన బాధ్యత ఎన్డీయే పెద్దలకుంది. ప్రధాని హామీ కంటితుడుపు చర్య మాత్రమేనని, రాష్ట్రాల్లో కూడా కాక్రోచ్ల స్థాయిలో ఉద్యమిస్తే తప్ప డీఎస్సీ అవకతవకల వంటివి పట్టించుకోబోరన్న సంకేతాలు వెళ్లరాదు. అందుకే దేశంలో యువత మనసు గెలవాలంటే నెగ్గాల్సిన పరీక్షలు చాలానే ఉన్నాయని కేంద్రం గుర్తించాలి. -
ఢిల్లీలో పెల్లెట్ గన్స్ బీహార్ లో AK-47 తో కాల్పులు.. రాహుల్ గాంధీ సూటి ప్రశ్న
-
విద్యార్థులపైకి తూటాలా.. మోదీ క్షమాపణ చెప్పాల్సిందే: రాహుల్
ఢిల్లీ: కేంద్రంలోని మోదీ సర్కార్ విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై పెల్లెట్ గన్స్, బీహార్‌లో నిరసన చేస్తున్న విద్యార్థులపై ఏకే-47 తూటాలు ప్రయోగించారని రాహుల్ మండిపడ్డారు. విద్యార్థుల పట్ల మొత్తం వ్యవస్థ అత్యంత కఠినంగా, అన్యాయంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో కేంద్రంపై నిప్పులు చెరిగారు.విద్యార్థులపై పోలీసుల చర్యలను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా రాహుల్.. ‘బీహార్‌లో నిరసన చేస్తున్న విద్యార్థులపై ఏకే-47 తూటాలు ప్రయోగించారనే వార్తలు వస్తున్నాయి. వందలాది మంది విద్యార్థులను అరెస్టు చేసి వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నట్టు తెలుస్తోంది. విద్యార్థులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయబోమని, వారిని విడుదల చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రధాని నరేంద్ర మోదీని ఆయన ప్రశ్నించారు. విద్యార్థులపై దాడులు, కఠిన చర్యలు కొనసాగుతున్నాయని ఆరోపించారు.छात्रों के ख़िलाफ़ पूरा का पूरा सिस्टम ही जानलेवा है।खबर आ रही है कि बिहार में प्रदर्शन कर रहे छात्रों पर AK-47 से गोलियाँ चलाई गई हैं और सैकड़ों छात्रों को गिरफ़्तार करके उनपर FIR की जा रही है।मोदी जी, कहाँ गया आपका वादा कि छात्रों पर कोई FIR नहीं की जाएगी और उन्हें रिहा कर… https://t.co/c7zdyyeLA0— Rahul Gandhi (@RahulGandhi) July 27, 2026ఢిల్లీలో విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఉపయోగించారని, బీహార్‌లో ఏకే-47లు ప్రయోగించారంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఢిల్లీ.. ఎక్కడ చూసినా ఇదే విధమైన పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరించడం లేదని, సంస్కరణలు చేపట్టే సామర్థ్యం లేదని ఆయన విమర్శించారు. విద్యార్థుల గొంతును అణచివేసేందుకు ప్రభుత్వం అన్ని మార్గాలను ఉపయోగిస్తోందని ఆరోపించారు. దేశంలోని విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి. విద్యార్థులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి కానీ విద్యార్థులపైన కాదు అని డిమాండ్ చేశారు.అయితే, పోలీసుల చర్యలు చట్టపరమైన పరిస్థితుల నేపథ్యంలోనే జరిగాయని, శాంతిభద్రతలను కాపాడేందుకు అధికారులు తమ విధులు నిర్వహిస్తున్నారని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై రాజకీయంగా విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. బీహార్‌లో విద్యార్థుల నిరసనల సందర్భంగా ఓ పోలీసులు అధికారి ఏకే-47 పట్టుకుని నిరసనకారులపైకి ఎక్కుపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో, ప్రభుత్వం దిద్దుబాటు చర్యల్లో భాగంగా సదరు పోలీసు అధికారిని సస్పెండ్ చేసింది. -
‘కాక్రోచ్’ ఉద్యమం కుదిపేసిన రాజకీయాలు.. అమరావతి వరకు సెగ!
రాజకీయాలలో ఎప్పుడూ ఎవరిని తక్కువ అంచనా వేయకూడదన్నది ఒక అభిప్రాయం. అన్నిసార్లు కాకపోయినా, కొన్నిసార్లు బొద్దింకలు కూడా తిరగబడతాయన్న సత్యాన్ని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) పక్షాన యువత రుజువు చేసింది. ఎంత బలాఢ్యుడైనా ఆ తిరుగుబాటుకు తలొగ్గక తప్పదని రుజువైంది. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీక్‌కు సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తుంది. ఈ పర్వం దేశానికే ఒక స్పూర్తిదాయక ఘట్టంగా నిలిచింది. ఇలాంటి లీక్‌లు జరిగినా, లేదా స్కామ్‌ల ఆరోపణలు ఆధారాలతో సహా బయటపడినా సంబందిత బాధ్యులు పదవి నుంచి వైదొలగవలసిన పరిస్థితి ఏర్పడుతుందని ఈ యువత ఆందోళన తేల్చి చెప్పింది.కేంద్రంలోనేనా ఇలా రాజీనామాలు జరగవలసింది? మరి రాష్ట్రాలలో జరిగే లీక్‌లు, ఇతర కుంభకోణాల పరిస్థితి ఏమిటి? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగానే ఏపీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పదవి నుంచి తప్పుకోవాలన్న డిమాండ్ గట్టిగా తెరపైకి వచ్చింది. డీఎస్సీ పరీక్ష ప్రశ్నపత్రాల లీక్ ఆరోపణ, టీచర్ల ఎంపికలో అవకతవకలు, స్పోర్ట్ కోటా టీచర్ల ఎంపికలో అక్రమాలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధారసహింతంగా ఆరోపణలు చేసినా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. బహుశా ఈ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం గురించి స్పందించకుండా జాగ్రత్తపడ్డారు. కాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం ఉద్యమం చేస్తున్న యువతపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారన్న విమర్శకు గురయ్యారు.కాక్రోచ్ ఉద్యమానికి కాంగ్రెస్ తదితర విపక్షాలు రంగంలోకి దిగడంతో తీవ్రరూపం దాల్చింది. ఒకరకంగా రాజకీయ రంగు పులుముకున్నప్పటికీ, విపక్ష నేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేలు ప్రధాని ఇంటిముందు ధర్నాకు దిగడంతో బీజేపీ కంగుతిన్నట్లనిపించింది. సీజేపీతో చర్చలకు సిద్దమని బీజేపీ కూడా చెప్పవలసి వచ్చింది. రాహుల్ గాంధీపై విమర్శలు చేసినా, బీజేపీ కొంత డిఫెన్స్‌లో పడినట్లయింది. కాక్రోచ్ ఉద్యమంతో పాటు, కాంగ్రెస్ ధర్నా ప్రభావం వివిధ రాష్ట్రాలలో కూడా పడింది. కాంగ్రెస్ శ్రేణులు ఎక్కడికక్కడ యాక్టివ్ అయ్యాయి. వారికి పోటీగా బీజేపీ కూడా ఎదురుదాడి చేయడానికి యత్నించింది.ఏపీ, తెలంగాణలలో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఇదో గొడవగా మారింది. తెలంగాణలో రెండు పార్టీలు కర్రలతో ఘర్షణకు దిగాయి. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేటీఆర్ ఆధ్వర్యంలో భారీ ధర్నా జరిగింది. విజయవాడలో కాంగ్రెస్ ఆఫీస్‌పై బీజేపీ దాడికి యత్నించడం ఆశ్చర్యంగానే ఉంది. ఏపీలో ఈ రెండు పార్టీలకు పెద్దగా బలం లేకపోయినా, ఈ అవకాశం ద్వారా తమ ఉనికి కోసం ప్రయత్నించినట్లు అనిపిస్తుంది.23 లక్షల మంది విద్యార్ధులు మెడికల్ కాలేజీలలో సీట్ల నిమిత్తం రాసిన నీట్ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయిన వైనం, ఆ తర్వాత ఆ విషయాలు బయటకు వచ్చి దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. సుప్రింకోర్టు ఛీఫ్ జస్టిస్ చేసిన ఒక అనవసర వ్యాఖ్యతో దేశంలో కొత్తగా పుట్టుకువచ్చిన క్రాకోచ్ జనతాపార్టీ యువతను ఆకర్షించింది. నీట్ ప్రశ్నాపత్రాల లీక్‌కు సంబంధించి కొందరిని ప్రభుత్వం అరెస్టు చేసింది. కాని తొలి నీట్ పరీక్ష రద్దు కావడంతో సుమారు ఇరవైమంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకోవడం అందరిని ఆవేదనకు గురి చేసింది. మళ్లీ నీట్ పరీక్షను నిర్వహించినప్పటికీ, నీట్ ప్రశ్నాపత్రాల లీక్‌కు నైతిక బాధ్యత వహించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌ను కాక్రోచ్ జనతా పార్టీ చేసింది. అలాగే ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని వీరు కోరారు.ఇలా వివిధ డిమాండ్లతో సాగుతున్న వీరి ఉద్యమం ఒక దశలో ముగిసిపోయిందని అనుకున్నారు. కాని వాంగ్ చుక్ అనే ఉద్యమకారుడు నిరాహారదీక్షకు దిగడంతో తిరిగి ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. వేలాదిగా తరలివచ్చిన యువత పార్లమెంటు ముట్టడికి వెళ్లడం, ఆ క్రమంలో పోలీసులు లాఠీచార్జీ చేయడం వంటివి పరిస్థితిని ఉద్రిక్తం చేశాయి. పోలీసులు విచక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్లు పలువురిని లాఠీలతో కొట్టారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. కొంతమంది సంబంధం లేని పిల్లలను కూడా పోలీసులు కొట్టిన తీరు విమర్శలకు గురి అయింది. ఇదంతా కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.ప్రధాని మోదీ తొలిసారిగా నీట్ ప్రశ్నాపత్రాల లీక్‌పై స్పందించి అది మహాపాపమని అభివర్ణించారు. ఈ వ్యవహారంలో గట్టిగా స్పందిస్తున్నామన్న సంకేతం ఇవ్వడానికి యత్నించారు. బీజేపీ, జనసేన వంటి పార్టీలు ఈ ఉద్యమంలో దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయని, ఇతరత్రా ఆరోపణలు చేసినా, ప్రధాని ఆ యువతను స్నేహితులు అని అడ్రస్ చేయడం విశేషం. ఈ కేసులో నిందితులకు సత్వరమే శిక్ష పడడానికి వీలుగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. వాంగ్ చుక్ దీక్ష విరమించినా, ఉద్యమం కొనసాగడం, దేశం అంతటా దీని ప్రభావం పడుతుండడం గమనించి మోదీ స్పందించారు. వెంటనే డామేజ్ కంట్రోల్‌కు చర్యలు చేపట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు ఉద్యమకారుల డిమాండ్లను అంగీకరించినట్లు కేంద్ర మంత్రులు ప్రకటించారు. దాంతో కాక్రోచ్ సంబరాలు అంబరాన్ని అంటాయి.నిజానికి కాక్రోచ్ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వం మొదట తేలికగా తీసుకున్నట్లుగా ఉంది. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న కొన్ని వందలమంది దేశ యువతకు ప్రతినిధులుగా కేంద్రం ఆలోచించలేకపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో పలుచోట్ల ఇంటర్నెట్ బంద్ చేశారంటే, 18 మెట్రో రైల్వేస్టేషన్లను బంద్ చేశారంటేనే ఈ ఉద్యమం ఏ స్థాయిలో జరిగిందో ఊహించుకోవచ్చు. ఇదంతా యువత స్వచ్చందంగా చేసిందే.కొన్నేళ్ల క్రితం ఢిల్లీలో రైతుల ఆందోళన కుదిపేసింది. వారు కోరినట్లు కొన్ని చట్టాలను కేంద్రం ఉపసంహరించుకుంది. అయినా ఆనాడు సమర్థంగా హాండిల్ చేశామన్న భావన కేంద్ర పెద్దలకు ఉండి ఉండవచ్చు. ఆ పరిస్థితి వేరు. ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితి వేరు. ఒక్కసారి యువతలో గూడుకట్టిన అసంతృప్తి ఎగసిపడితే, అది దేశ వ్యాప్తంగా పాకితే ఎంత ప్రమాదమో బీజేపీ పెద్దలకు తెలియనిది కాదు. అందులోనూ పలు ఇతర దేశాలలో యువత ఈ మధ్యకాలంలో ఎంతటి క్రియాశీలకపాత్ర పోషించి ప్రభుత్వాలే మారిపోయేలా చేసిందో ఇటీవలి చరిత్రే.ఈ క్రమంలో పార్లమెంటు సమావేశాలలో సహజంగానే విపక్షం దీనిని ప్రధాన అస్త్రంగా మార్చుకుంది. మంత్రి ప్రధాన్ రాజీనామాకు విపక్షం కూడా పట్టుబట్టింది. ఎప్పుడో కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం సంచలనం అయింది. తర్వాతకాలంలో కొందరు కేంద్ర మంత్రులు వివిధ కారణాలతో రాజీనామాలు చేయకపోలేదు. రైల్వే ప్రమాదాల కారణంగానే నితీష్ కుమార్, మమత బెనర్జీ వంటివారు రాజీనామా చేశారు. విమాన ప్రమాదం జరిగినప్పుడు మాధవరావు సింధియా రాజీనామా చేశారు. ఉగ్రదాడికి బాధ్యత వహిస్తూ శివరాజ్ పాటిల్ పదవి నుంచి తప్పుకున్నారు.అలాగే, ఆయా స్కామ్‌ల ఆరోపణలపై దయానిది మారన్, ఎ.రాజా తదితరులు రాజీనామా చేశారు. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో ప్రశ్నాపత్రాల లీక్‌కు బాధ్యత వహిస్తూ అప్పటి విద్యా మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు రాజీనామా చేశారు. క్యాబినెట్ ఎజెండాను లీక్ చేశారన్న కారణంగా 31 మంది మంత్రుల నుంచి ఎన్టీరామారావు రాజీనామాలు తీసుకున్నారు. చంద్రబాబు టైమ్‌లో వివిధ ఆరోపణలు వచ్చినా ఆయన నైతిక బాధ్యత వహించడానికి సిద్దపడలేదు. గోదావరి పుష్కరాలలో తొక్కిసలాట కారణంగా 29 మంది మరణిస్తే, చంద్రబాబు ఎదురు బుకాయించారు తప్ప బాధ్యత తీసుకోలేదు. పూరి జగన్నాథ రథయాత్రలో జరగలేదా? కుంభమేళాలో జరగలేదా? రోడ్డు ప్రమాదాలలో మరణించడం లేదా అంటూ డబాయించారు. ఆ ఘటనలో ఒక్క కానిస్టేబుల్‌పై కూడ కేసు రాకపోవడం చిత్రంగానే అనిపిస్తుంది.తిరుమలలో 20 మంది తమిళ కూలీలు ఎన్ కౌంటర్‌కు గురి కావడం వివాదాస్పదం అయినా, అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది పడలేదు. అవన్ని ఎందుకు స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టు అయినా, ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద కేసే లేకుండా చేసుకోగలిగారు. ఒకప్పుడు చెన్నారెడ్డి ప్రభుత్వంలో హౌసింగ్ స్కామ్ జరిగితే అప్పటి మంత్రి కోనేరు రంగారావుతో రాజీనామా చేయించారు. తదుపరి ఆ ఆరోపణలు రుజువు కాలేదని తిరిగి మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు డీఎస్సీ అక్రమాలకు వైఎస్సార్సీపీ ఎన్నో ఆధారాలు చూపి సీబీఐ విచారణ కోరుతోంది. వాటికి చంద్రబాబు లేదా లోకేష్ ఎక్కడా నేరుగా జవాబు ఇవ్వలేదు. టీడీపీ ఇతర నేతలతో ఎదురుదాడి చేయించారు.ఈ నేపథ్యంలో డీఎస్సీ అక్రమాలపై ఉద్యమించాలని వైఎస్సార్సీపీ తలపెట్టింది. దీనికి యువత కూడా తోడైతే అది సీరియస్‌గా మారవచ్చు. అయితే వారిని అణచివేయడానికి చంద్రబాబు సర్కార్ ప్రయత్నిస్తుంది. ఇది ఏ రూపు దాల్చుతుందో అప్పుడే చెప్పలేం. కాకపోతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లోకేష్‌పై ఒత్తిడి పెంచుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్యమం చేసిన కాక్రోచ్ యువతపై కక్ష కట్టకుండా ఉండాలని ఆశిద్దాం. ఏది ఏమైనా కాక్రోచ్‌లే కదా అని తేలికగా చూడరాదన్న విషయం అర్థం అవుతోంది కదా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం.. రేపటికి వాయిదా
పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి. లోక్‌సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు వచ్చింది. విపక్షాల నిరసనల మధ్యే ప్రవేశపెట్టింది కేంద్రం. లోక్‌సభ, రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. పరీక్షల లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన నిబంధనలు తీసుకొస్తున్నామని కేంద్రం చెబుతుండగా.. నిరసనల సమయంలో జరిగిన పరిణామాలపై విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తున్నాయి.పార్లమెంట్ సమావేశాలు.. 6వ రోజు అప్డేట్స్రాజ్యసభ రేపటికి వాయిదారాజ్యసభ సమావేశాలు తిరిగి ప్రారంభంసభలో మళ్లీ గంగదగోళంరేపటికి వాయిదా వేసిన డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్లోక్సభ రేపటికి వాయిదాలోక్సభ సమావేశాలు తిరిగి ప్రారంభంసభలో గందరగోళం.. రేపటికి వాయిదాకాంగ్రెస్ సహా విపక్షాల ఆందోళనలతో ముందుకు సాగని సభా కార్యక్రమాలుయాంటీ పేపర్ లీక్ బిల్లుపై జరగని చర్చవాయిదాల పర్వంలోక్సభ సాయంత్రం 5 గంటల వరకు వాయిదా3 గంటల వరకు వాయిదా పడి మళ్లీ ప్రారంభమైన రాజ్యసభఆ తర్వాత కూడా ప్రతిపక్షాల ఆందోళనరాజ్యసభ మళ్లీ సాయంత్రం 5.15 గంటల వరకు వాయిదాఓం బిర్లా కీలక ప్రకటనలోక్సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లువిపక్షాల నిరసనల మధ్యే ప్రవేశపెట్టిన కేంద్రంచర్చ ముందుకు సాగకపోవడంతో వాయిదామధ్యాహ్నం 2గం. తిరిగి ప్రారంభం కానున్న లోక్సభలోక్సభ స్పీకర్ ఓం బిర్లా కీలక ప్రకటనబిల్లుపై ఎంపీల సూచనలు కోరిన స్పీకర్.మధ్యాహ్నం 1 గంట వరకు సవరణలకు అవకాశం.చర్చకు తగిన సమయం ఇస్తామని హామీ.పేపర్ లీక్‌కు భారీ శిక్షలుయాంటీ పేపర్ లీక్ బిల్లులో కీలక ప్రతిపాదనలుపేపర్ లీక్‌లో వ్యక్తులకు 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష ప్రతిపాదన.జరిమానా రూ.50 లక్షల నుంచి రూ.10 కోట్ల వరకు ఉండే అవకాశం.విద్యార్థుల లాఠీఛార్జిపై రగడపోలీసుల చర్యలపై హోం మంత్రి అమిత్ షా సమాధానం ఇవ్వాలని పవన్ ఖేరా డిమాండ్.నిరసనలను అణచివేయడం సరికాదని వ్యాఖ్య.సుప్రీంకోర్టు వ్యాఖ్యలను స్వాగతించిన కాంగ్రెస్.సమగ్ర కథనం: లాఠీచార్జ్ ఎలా చేస్తారు?.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుపేపర్ లీక్ బిల్లుకు కేంద్రం ప్రాధాన్యంలోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లుస్పందించిన పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజుబిల్లు ఆమోదమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటనవిద్యార్థుల భవిష్యత్ రక్షణే ప్రధాన ఉద్దేశమని వెల్లడి.పేపర్ లీక్‌లకు పాల్పడేవారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం.విపక్షాలు ఇతర అంశాలతో దృష్టి మళ్లించొద్దని సూచన.పరీక్షల వ్యవస్థపై నమ్మకం పెంచడమే లక్ష్యమని వ్యాఖ్య.లోక్‌సభ సైతం వాయిదామధ్యాహ్నానికి లోక్‌సభ వాయిదావిపక్షాల నిరసనల నడుమే.. యాంటీ పేపర్ లీక్ బిల్లు పెట్టిన కేంద్రంవిపక్షాల ఆందోళనలతో ముందుకు సాగని చర్చలోక్‌సభ మధ్యాహ్నం 2గం. కు వాయిదారాజ్యసభ మధ్యాహ్నానికి వాయిదావాయిదా తర్వాత కూడా మారని సీన్పెద్దల సభలో విపక్షాల నిరసన గళంప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలంటూ విపక్షాల డిమాండ్మధ్యాహ్నం 2గం. దాకా సభ వాయిదా వేసిన చైర్మన్వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన ఉభయ సభలులోక్సభలో కొనసాగుతున్న విపక్షాల ఆందోళనవిపక్షాల నిరసనల నడుమే లోక్‌సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి జితేంద్ర జింగ్నీట్ నిరసనలు.. కేంద్రంపై పప్పు యాదవ్ ఫైర్ నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన.. ప్రభుత్వ చర్యలు తీవ్రంగా తప్పుబట్టిన స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కు ఉన్న విద్యార్థులను నేరస్తుల్లా చూస్తున్నారా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.“మన పిల్లలు ఉగ్రవాదులా? మన కూతురు నేరస్తురాలా? హక్కుల కోసం గొంతెత్తడం తప్పా?” అని పప్పు యాదవ్ వ్యాఖ్యానించారు.బిహార్‌లో దాదాపు 800 మంది విద్యార్థులను జైలుకు పంపించారని ఆరోపించారు.విద్యార్థుల ఆందోళనలపై ప్రభుత్వ వైఖరితో దేశంలో భయానక వాతావరణం నెలకొన్నదని ఆయన విమర్శించారు.ఖర్గే తీవ్ర వ్యాఖ్యలునీట్ నిరసనల్లో విద్యార్థులపై జరిగిన దాడి ఘటనను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అత్యంత అరుదైన ఘటన (rarest of rare) గా అభివర్ణించారు.ఈ అంశంపై రాజ్యసభలో తక్షణ చర్చకు అనుమతించాలని చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్‌ను ఖర్గే కోరారు.రూల్ 267 కింద చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ నిబంధన ప్రకారం ఆ రోజు జాబితాలో ఉన్న ఇతర కార్యక్రమాలను నిలిపివేసి ప్రత్యేక అంశంపై చర్చ చేపట్టవచ్చు.భారత చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని ఖర్గే పేర్కొంటూ.. ఈ అంశంపై వెంటనే చర్చ అవసరమని అన్నారు.ఖర్గే డిమాండ్‌పై స్పందించిన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్.. రూల్ 267 అమలుకు ఆ అంశం నిజంగా “rarest of rare” స్థాయిలో ఉండాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.నీట్ నిరసనల అంశం మాన్సూన్ సమావేశాల్లో రాజకీయంగా వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.మోదీ సర్కార్‌పై రాహుల్ గాంధీ ఫైర్పార్లమెంట్ ఉభయ సభలు వాయిదాపార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీల నిరసనప్రధాని మోదీపై లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్విద్యార్థుల్ని అణచివేయడంలో మోదీ ప్రభుత్వ తీరు ఎక్కడైనా ఒక్కటేఢిల్లీలో పెల్లెట్లు.. పట్నాలో ఏకే 47 ప్రయోగించారుప్రధాని మోదీ క్షమాపణ చెప్పాల్సిందే स्टूडेंट्स पर लाठीचार्ज और पैलेट गन के इस्तेमाल के विरोध में विपक्ष संसद परिसर में विरोध प्रदर्शन कर रहा है#Parliament pic.twitter.com/ihXExAzby2— Poonam Pandey (@pandeypoonam20) July 27, 2026 बिहार के सीवान में छात्र प्रदर्शन के दौरान AK-47 से फायरिंग करने वाले SIT जवान अभिषेक पटेल को सस्पेंड कर दिया गया है!सिवान में छात्र आंदोलन के दौरान पुलिस अधिकारी अभिषेक पटेल ने छात्रों की दिशा में AK-47 असॉल्ट राइफल से फायरिंग की थी! pic.twitter.com/ZjyQa8fGOK— Sadaf Afreen صدف (@s_afreen7) July 27, 2026జంతర్ మంతర్‌లో లాఠీఛార్జిపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలుఛలో సంసద్ ర్యాలీ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుశాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు: సీజేఐ జస్టిస్ సూర్య కాంత్ ధర్మాసనం.విద్యార్థుల ఆందోళనలను సాకుగా చూపి పోలీసుల మితిమీరిన బలప్రయోగాన్ని సమర్థించుకోలేం ఆందోళనల్లో ఆకతాయిలు ప్రవేశించి పోలీసులపై దాడులు చేయడం తీవ్ర ఆందోళనకరంశాంతియుత నిరసనలు, పోలీసు చర్యల నిర్వహణకు దేశవ్యాప్తంగా ఒకే రకమైన ఏకరూప మార్గదర్శకాలు అవసరం.నిరసనల్లో చొరబడే సామాజిక విద్రోహ శక్తులపై చర్యలకు అధికారులకు పూర్తి అధికారాలు ఉండాలినిరసనల్లో హింసకు తావులేకుండా నిరసనకారులు 'ఆత్మశిక్షణ' పాటించడం అత్యంత కీలకమన్న సుప్రీంకోర్టు.విద్యార్థుల నిరసనలు, పోలీసుల దాష్టీకంపై దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా.ఉభయ సభలు వాయిదా!ఆరో రోజు అదే తీరునీట్పై చర్చకు పట్టుబట్టిన విపక్షాలుప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ఉభయ సభలు మధ్యాహ్నం 12గం. దాకా వాయిదాప్రారంభమైన పార్లమెంట్ ఉభయ సభలులోక్సభలో విపక్ష ఎంపీల ఆందోళనపబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026 నేడే ప్రవేశపెట్టాలని కేంద్రం యోచనలాఠీ ఛార్జిపై చర్చకు పట్టుబడుతున్న విపక్షాలు పార్లమెంట్‌కు ధర్మేంద్ర ప్రధాన్.. పోటాపోటీ నినాదాలుపార్లమెంట్ ఆవరణలో ఎన్డీయే, ఇండియా కూటమి ఎంపీలు పోటాపోటీ నినాదాలుపార్లమెంట్కు వచ్చిన మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ధర్మేంద్ర ప్రధాన్‌కు హీరో వెల్ కమ్ చెప్పిన ఎన్డీయే ఎంపీలుకేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఇండియా కూటమి ఎంపీలునీట్ లీకేజీ వ్యవహారంలో.. యువత నిరసనతో రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ఊహించినట్లే.. కాంగ్రెస్ వాయిదా తీర్మానంపార్లమెంట్ ఉభయ సభల్లో కాంగ్రెస్ వాయిదా తీర్మానంవిద్యార్థులపై లాఠీఛార్జి, పెల్లెట్ గన్స్‌తో దాడిపై చర్చకు నోటీసుజంతర్ మంతర్ ధర్నా సమయంలో విద్యార్థులపై భద్రతా బలగాల బలప్రయోగంచలో సంసద్‌ను అడ్డకునే కమ్రంలో జులై 20న చోటు చేసుకున్న పరిణామాలుతీవ్రంగా ఖండించిన కాంగ్రెస్అమిత్ షాకు లేఖ రాసిన రాహుల్ గాంధీవిద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలంటున్న విపక్ష నేతపరీక్షా బిల్లు.. చర్చలో పాల్గొనేది వీళ్లే!నేడు లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026పై చర్చబిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్ర మంత్రి డా. జితేంద్ర సింగ్బిల్లుపై 8–12 గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగే అవకాశంబీజేపీ తరఫున బన్సూరి స్వరాజ్ చర్చ ప్రారంభంబీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ప్రసంగంటీడీపీ తరఫున లావు శ్రీకృష్ణ దేవరాయలుజేడీయూ నుంచి లల్లన్ సింగ్ సభలో మాట్లాడనున్నారుశివసేన తరఫున డా. శ్రీకాంత్ షిండే ప్రసంగంఅప్నా దల్ (ఎస్) నుంచి అనుప్రియా పటేల్ చర్చలో పాల్గొననున్నారుఎల్జేపీ (రామ్ విలాస్) నుంచి అరుణ్ భారతికి అవకాశంఎన్సీపీ తరఫున సునీల్ తట్కరేతృణమూల్ కాంగ్రెస్ నుంచి సయోని ఘోష్ లేదా మితాలి బాగ్ పాల్గొనే అవకాశంపరీక్షల సంస్కరణలు, పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు బిల్లు ప్రధాన లక్ష్యంబిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించే అవకాశంపై ఆసక్తిసభ.. సజావుగా సాగేనా?సీజేపీ ఆందోళన విరమణతో పార్లమెంట్ సమావేశాలపై అందరి దృష్టిగతవారమంతా విపక్షాల నిరసనలతోనే గడిచిన పార్లమెంట్కేంద్ర మంత్రి రాజీనామా కోరుతూ సభను అడ్డుకున్న విపక్షాలునీట్ లీకేజీపై చర్చ.. ప్రత్యేక చట్టంకు సిద్ధమని ప్రకటించిన కేంద్రంఅయినా వెనక్కి తగ్గని విపక్షాలు, చివరకు..ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో శాంతించిన యువతఆందోళన విరమించిన కాక్రోచ్ జనతా పార్టీనేడు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లుకాసేపట్లో ఖర్గే కార్యాలయంలో విపక్షాల సమావేశంయువతపై జరిగిన దాడుల విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్న విపక్షాలుదాడికి బాధ్యత వహించాలని ఇప్పటికే అమిత్ షాకు లేఖ రాసిన రాహుల్ గాంధీ బిల్లులో కీలక ప్రతిపాదనలుపేపర్ లీక్ కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు విధించేలా నిబంధనలు.లీకేజీలకు పాల్పడిన వ్యక్తులకు గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్ష.నిందితులపై రూ.50 లక్షల వరకు జరిమానా.వ్యవస్థీకృతంగా పేపర్ లీక్‌లకు పాల్పడే ముఠాలకు రూ.10 కోట్ల వరకు జరిమానా.ప్రతి రాష్ట్రంలో ప్రత్యేకంగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు.కేసుల దర్యాప్తును వేగంగా పూర్తి చేసేలా నిబంధనలు.ఎన్డీయే వ్యూహం ఏంటి?పేపర్ లీక్‌లను అరికట్టేందుకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని చాటే ప్రయత్నం.యువ ఎంపీలను రంగంలోకి దించి బిల్లుపై బలమైన వాదనలు వినిపించాలనే వ్యూహం.బీజేపీ నుంచి బన్సూరీ స్వరాజ్, తేజస్వీ సూర్య చర్చకు నాయకత్వం వహించే అవకాశం.టీడీపీ, జేడీయూ, శివసేన, ఎన్సీపీ, ఇతర మిత్రపక్షాల ఎంపీలు కూడా చర్చలో పాల్గొననున్నారు.విపక్షాల వ్యూహం ఏమిటి?బిల్లుకు వ్యతిరేకంగా కాకుండా.. నీట్ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించాలని భావిస్తున్నాయి.పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావాన్ని లేవనెత్తే అవకాశం.జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ మార్చ్ సమయంలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించనున్నారు.ఘటనలపై ప్రధాని క్షమాపణ చెప్పాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసే అవకాశం.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత తొలి పార్లమెంట్ సమరంనీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.ఆయన స్థానంలో ప్రహ్లాద్ జోషి విద్యాశాఖ బాధ్యతలు చేపట్టారు.కొత్త మంత్రి తొలిసారి విద్యాశాఖకు సంబంధించిన ప్రశ్నలను ఎదుర్కోనున్నారు.నీట్ వివాదంపై ప్రభుత్వ వైఖరి ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.10 గంటల పాటు చర్చబిల్లుపై లోక్‌సభలో సుదీర్ఘ చర్చకు అవకాశం.దాదాపు 8 నుంచి 10 గంటల పాటు చర్చ జరగనున్నట్లు సమాచారం.అధికార, విపక్ష సభ్యులు తమ వాదనలు వినిపించనున్నారు.36 రోజుల ఉద్యమం తర్వాత..నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు జరిగాయి.విద్యార్థుల నిరసనలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి.పార్లమెంట్ మార్చ్ సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఉద్యమం ముగిసింది. -
నందన్ నీలేకని ఎవరు?..‘పరీక్షల భద్రత’కు ఎందుకు ఎంపిక చేశారు?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పరీక్షా విధానంలో సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పేపర్ లీక్ ఉదంతాలు, అక్రమాలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, యూఐడీఏఐ (ఆధార్) వ్యవస్థాపక ఛైర్మన్ నందన్ నీలేకని నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఒక హైపవర్డ్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా వివరాలను వెల్లడించారు. HIGH POWERED TASK FORCE on examination reforms under the leadership of Shri Nandan Nilekani constituted.@NandanNilekani pic.twitter.com/mMpmPdIEL5— Narendra Modi (@narendramodi) July 26, 2026పోటీ పరీక్షలను మరింత పారదర్శకంగా, సురక్షితంగా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించేందుకు ఈ కమిటీ పలు సిఫార్సులు చేయనుంది. ప్రశ్నాపత్రాల భద్రతను పటిష్టం చేయడం, అభ్యర్థుల ధృవీకరణ, మూల్యాంకన విధానాలు, పరీక్షల నిర్వహణలో సాంకేతికతను ఏ విధంగా అమలు చేయాలనే అంశాలపై ఈ బృందం అధ్యయనం చేస్తుంది. మాజీ ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్, ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ తపన్ దేకా, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వీ కామకోటి, మాజీ విద్యాశాఖ కార్యదర్శి అనితా కల్వాల్ తదితరులు ఈ టాస్క్ ఫోర్స్‌లో సభ్యులుగా ఉన్నారు.నందన్ నీలేకని ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త, టెక్నాలజీ నిపుణుడు. ప్రభుత్వ విధాన నిపుణుడు. 1981లో ఎన్ఆర్ నారాయణ మూర్తితో కలిసి ఇన్ఫోసిస్ సంస్థను స్థాపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 2002 నుండి 2007 వరకు ఆ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (సీఈఓ) సేవలు అందించారు. ఆ తర్వాత దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రపంచపు అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు ప్రాజెక్ట్ అయిన ‘ఆధార్’ (యూఐడీఏఐ) వ్యవస్థాపక ఛైర్మన్‌గా విశేష సేవలందించి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి విశేష కృషి చేశారు.ఇది కూడా చదవండి: ‘నన్ను అరెస్ట్ చేస్తారా?’.. మమ్దానీపై విరుచుకుపడ్డ నెతన్యాహు -
రక్షణ రంగంలో ఉన్నత శిఖరాలకు భారత్
సాక్షి, న్యూఢిల్లీ: రక్షణ రంగ ఉత్పత్తులు, ఎగుమతులు, మిత్రదేశాలతో రాజకీయ సహకారం వంటి రంగాల్లో భారత్ నిరంతరం ఉన్నత శిఖరాలను అధిరోహిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రక్షణ, అంతరిక్ష రంగాల్లో మనదేశం స్వయం సమృద్ధి సాధిస్తోందని, స్వదేశీ పరిజ్ఞానంతో నూతన రికార్డులు సృష్టిస్తోందని మోదీ హర్షం వ్యక్తంచేశారు. ఆదివారం 136వ ‘మన్ కీ బాత్’లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. దేశ రక్షణ, పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, యువత సాధిస్తున్న విజయాలను ప్రస్తావించారు. ఆయన ఏం చెప్పారంటే.. ‘ స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ ‘విక్రమ్–1’జూలై 18న శ్రీహరికోట నుంచి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లడం చరిత్రాత్మక ఘట్టం. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెరుగుతుండడం సంతోషంగా ఉంది. ‘క్యాచ్ ది రెయిన్’, ‘ఏక్ పేడ్ మా కే నామ్ పే’ కార్యక్రమాలు ఉద్యమంలా కొనసాగుతున్నాయి’’ అని అన్నారు. క్రీడలు, విద్యలో సత్తా చాటుతున్న యువత ‘‘అంతర్జాతీయ క్రీడల్లో మన క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. జపాన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ షట్లర్‌గా పీవీ సింధు చరిత్ర సష్టించింది. లండన్‌లోని చారిత్రక లార్డ్స్ మైదానంలో భారత మహిళల క్రికెట్ జట్టు తొలి టెస్ట్ మ్యాచ్‌లో 270 పరుగుల తేడాతో అపూర్వ విజయం సాధించడం మనందరికీ గర్వకారణం. 1983లో పురుషుల జట్టు ఇక్కడే తొలి ప్రపంచకప్ సాధించగా, ఇప్పుడు మన నారీశక్తి దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచి్చపెట్టింది’’ అని అన్నారు. చేనేత కళాకారులను గౌరవించాలి‘‘అంతర్జాతీయ సైన్స్ ఒలింపియాడ్స్‌లో సత్తా చాటిన భారత విద్యార్థులను నా అభినందలు. కేరళ రాష్ట్రం ఎర్నాకుళం జిల్లాలోని సౌత్ చిట్టూర్కు చెందిన ఉపాధ్యాయుడు అభిలాష్ ఫుట్‌బాల్ పదాలతో సంస్కృతం నేర్పిస్తున్న ‘అక్షర కందుక్’ ప్రాజెక్టు ప్రయోగం ప్రశంసనీయం. జూలై 27న మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్థంతి జరుగనుంది. గురు పూరి్ణమ నిర్వహించుకోబోతున్నాం. రాబోయే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రజలంతా ‘హర్ ఘర్ తిరంగా’కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలి. ఆగస్ట్ 7న ‘నేషనల్ హ్యాండ్లూమ్ డే’జరుగనుంది. చేనేత వ్రస్తాలను ప్రోత్సహించడం ద్వారా చేనేత కళాకారులను గౌరవించాలని ప్రజలను కోరుతున్నా’’ అని అన్నారు. -
మోదీపై అభ్యంతకర పోస్టర్.. నటిపై ఫిర్యాదులు
కోల్‌కతా:ప్రధాని నరేంద్ర మోదీపై 'అసభ్యకరమైన' పోస్టర్‌ను ప్రదర్శించారనే ఆరోపణలతో ప్రముఖ బెంగాలీ నటి శ్రీలేఖ మిత్రపై ఫిర్యాదు నమోదైంది. కోల్‌కతాలో ఇటీవల జరిగిన విద్యార్థి నిరసనలో మోదీ చిత్రపటాన్ని అసభ్యకరరీతిలో ప్రదర్శించారని నటి శ్రీలేఖపై పలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి.నిన్న (ఆదివారం) ఆనంద్‌పూర్ పోలీసు స్టేషన్లో బీజేపీ నాయకురాలు కేయా ఘోష్, నటి శ్రీలేఖ మిత్రపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. కేవలం ఒకే చోట కాకుండా బిధాన్నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌తో సహా పలు జిల్లాల్లోని వివిధ పోలీసు స్టేషన్లలో ఆమెపై ఫిర్యాదులు దాఖలైనట్లు నివేదికలు వెల్లడించాయి.ఈ అంశమై బీజేపీ నేత మాట్లాడుతూ.. "దేశ ప్రధానిని అవమానించేలా ఒక అసభ్యకరమైన పోస్టర్‌ను ప్రదర్శించినందుకు నటి శ్రీలేఖ మిత్రపై ఫిర్యాదు దాఖలైంది, ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. శ్రీలేఖ మిత్రను వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలి" అని పేర్కొన్నారు.నిరసన ప్రదర్శన నేపథ్యంNEET ప్రశ్నాపత్రం లీకేజీకి వ్యతిరేకంగా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కోల్‌కతా రోడ్లపై భారీ నిరసన ప్రదర్శన జరిగింది.ఈ నిరసనలో శ్రీలేఖ మిత్ర కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో ఆమె ప్రధాని మోదీకి సంబంధించిన అభ్యంతరకరమైన/అసభ్యకరమైన చిత్రంతో ఉన్న పోస్టర్‌ను పట్టుకున్నట్లు ఫోటోలు వెలువడ్డాయి.అయితే దీనిపై శ్రీలేఖ మిత్ర తన సోషల్ మీడియా పేజీలో ఒక వీడియో స్టేషను విడుదల చేస్తూ ఘాటుగా స్పందించారు."నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ చేయండి; నన్ను ఉరిశిక్షకు పంపాలనుకుంటే ఉరిశిక్షకు పంపండి. దీనికి వ్యతిరేకంగా కూడా కచ్చితంగా ఒక ఉద్యమం వస్తుందని నేను నమ్ముతున్నాను" అని ఆమె సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. -
హైపవర్డ్ యాక్షన్
దేశంలో తీవ్ర కలకలం రేపిన నీట్ ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారంలో పలు పరిణామాల అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినా.. ఆ వేడి మాత్రం ఇంకా తగ్గలేదు. ఆదివారం కూడా ఇదే అంశం చుట్టూ దేశ రాజకీయాలు పరిభ్రమించాయి. ఢిల్లీలో 37 రోజులపాటు చేసిన యువత ఆందోళనలు ఆగిపోయినప్పటికీ.. పరీక్షల్లో లీకేజీలు, అక్రమాల విషయంలో వారిలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తిని కేంద్రం గుర్తించింది. ఈ అంశంపై ఇప్పటికే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, లీకేజీలకు పాల్పడితే పదేళ్ల జైలుశిక్ష వంటి చర్యలు తీసుకునే దిశగా సాగుతున్న ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో సంస్కరణల కోసం హైపవర్డ్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ‘ఇన్ఫోసిస్’ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో ఈ టాస్క్ ఫోర్స్‌ను నియమించినట్లు చెప్పారు. పటిష్ట, పారదర్శక పరీక్ష విధానాన్ని ఏర్పాటు చేసేందుకు సాంకేతికతను గరిష్టంగా వినియోగించుకోవడంపై ఆ టాస్క్‌ఫోర్స్ సూచనలు ఇస్తుందన్నారు. మరోవైపు పేపర్ లీకేజీలపై ఉక్కుపాదం మోపడానికి, పరీక్షల వ్యవస్థలో పారదర్శకత పెంచడానికి ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026’ను కేంద్రం సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. ఇక ఈ మొత్తం వ్యవహారంలో తాము మరింత విజృంభించాలని విపక్షాలు కూడా భావిస్తున్నాయి. విద్యార్థులపై పాశవికంగా దాడికి దిగడం, వారిపై కేసులు నమోదు చేయడంపై పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీయడానికి సన్నద్ధమవుతున్నాయి. విద్యార్థులపై లాఠీచార్జ్ చేసి బాష్పవాయుగోళాలు ప్రయోగించి, పెల్లెట్ గన్స్ వినియోగించాలంటూ అనుమతిచి్చంది మీరేనా? అంటూ హోంమంత్రి అమిత్ షాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖాస్త్రం సంధించారు. మరోవైపు నీట్ ఆందోళనలను పతాకస్థాయికి తీసుకెళ్లి ధర్మేంద్ర ప్రదాన్ చేత రాజీనామా చేయించడంతో విజయం సాధించిన కాక్రోచ్ జనతా పార్టీ కూడా తమ పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టంచేసింది. పంజాబ్‌లో ఫార్మసీ రిక్రూట్మెంట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై త్వరలో ఉద్యమించబోతున్నట్లు ఆ పార్టీ అధినేత అభిజిత్ దీప్కే సంకేతాలిచ్చారు. ఇలా ఎవరికి వారు తమ హైపవర్డ్ కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు వాడీవేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరీక్షల్లో సంస్కరణలకు టాస్క్‌ఫోర్స్ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పరీక్షల వ్యవస్థలో సంస్కరణలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. పరీక్షల వ్యవస్థలను ఎలా మెరుగుపరచాలన్న అంశాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు ‘ఇన్ఫోసిస్’ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం ఒక వీడియోను ‘ఎక్స్’లో పోస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ నివేదిక ఆధారంగా రాబోయే రోజుల్లో పరీక్షల విశ్వసనీయతను మరింత పెంచేలా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. పటిష్టమైన, పారదర్శకమైన పరీక్షా విధానాన్ని ఏర్పాటు చేసేందుకు సాంకేతికతను గరిష్టంగా వినియోగించుకోవడంపై ఆ టాస్క్ ఫోర్స్ సూచనలు ఇస్తుందని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడిన వారు జైళ్లలో మగ్గుతున్నారని చెప్పారు. పేపర్ లీకేజీలు, పరీక్షల్లో అక్రమాలను అరికట్టడానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసినట్లు ఉద్ఘాటించారు. కఠినమైన నిబంధనలతో కూడిన కొత్త చట్టాన్ని రూపొందించే దిశగా ముందుకు సాగుతున్నామని స్పష్టంచేశారు. ఇందుకు సంబంధించిన బిల్లును సోమవారం పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టబోతున్నట్లు వివరించారు. విశ్వసనీయంగా, పారదర్శకంగా... నీట్ పేపర్ లీకేజీ వివాదంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన మరుసటి రోజే హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుపై ప్రధాని స్వయంగా ప్రకటన చేయడం గమనార్హం. మనం భవిష్యత్తు గురించి ఆలోచించాలని ఆయన చెప్పారు. మన పరీక్షా విధానం విశ్వసనీయంగా, పారదర్శకంగా ఉండాలన్నారు. అలాగే, అందులో సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా వినియోగించుకోవాలని అభిప్రాయపడ్డారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పరీక్షల సంస్కరణలపై దృష్టి సారించేందుకు ప్రఖ్యాత సాంకేతిక నిపుణుడు నీలేకని నేతృత్వంలో ఉన్నతస్థాయి టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టాస్క్‌ఫోర్స్ సభ్యులు నీలేకని నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన హైపవర్డ్ టాస్క్ ఫోర్స్‌లో మొత్తం ఆరుగురు సభ్యులను నియమించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) పరీక్షా విధానాన్ని, ముఖ్యంగా సాంకేతిక కోణంలో వ్యవస్థాగత సంస్కరణల పరంగా పునరుద్ధరించడంలో సహాయపడేందుకు వివిధ రంగాలకు చెందిన నిపుణులకు ఇందులో స్థానం కల్పించింది. → టెక్నాలజీ నిపుణుడు నందన్ నీలేకని → ఇస్రో మాజీ చైర్మన్ ఎస్.సోమనాథ్ → ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ తపన్ డేకా → ఐఐటీ–చెన్నై డైరెక్టర్ వి.కామకోటి → విద్యాశాఖ మాజీ కార్యదర్శి అనితా కార్వాల్ → లాజిస్టిక్స్ నిపుణుడు అమృత్ లాల్ మీనాటెక్నాలజీ దిగ్గజం నీలేకని నందన్ నీలేకని భారతీయులకు సుపరిచితులే. ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్‌కు ఆయన సహ వ్యవస్థాపకుడు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) వ్యవస్థాపక చైర్మన్‌గా సేవలందించారు. ‘ఆధార్’ ప్రాజెక్టు విజయవంతం కావడం వెనుక ఆయనదే కీలకపాత్ర. 2023 జనవరిలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఏర్పాటు చేసిన జీ20 టాస్క్ ఫోర్స్ సహ–అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బెంగళూరులో జన్మించిన నందన్ నీలేకని ఐఐటీ–బాంబే నుండి బ్యాచిలర్ డిగ్రీని పొందారు. పద్మభూషణ్ సహా ఎన్నెన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు, గౌరవాలు అందుకున్నారు.ఫోర్బ్స్ ఆసియా బిజినెస్‌మేన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, బిజినెస్ స్టాండర్డ్ లైఫ్‌టైమ్ అఛీవ్మెంట్ అవార్డు ఆయనను వరించాయి. ఏక్‌స్టెప్ ఫౌండేషన్‌ను నిలేకని స్థాపించారు. ‘టైమ్స్’ పత్రిక విడుదల చేసిన ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో(2006, 2009), ఏఐ రంగంలో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల(2024) జాబితాలో ఆయన చోటు దక్కించుకున్నారు. వ్యాపారం, ఆవిష్కరణలు, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల రంగాల్లో అందించిన సేవలకు గాను నీలేకని అనేక అవార్డులను పొందారు.టాస్క్ ఫోర్స్ బాధ్యతలు → నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన పరీక్షల వ్యవస్థను పునర్వ్యస్థీకరించడం→ పరీక్షల నిర్వహణలో నిర్మాణాత్మక సంస్కరణలను సిఫార్సు చేయడం→ పేపర్ లీకేజీలు, మాల్ ప్రాక్టీస్ వంటి అనైతిక పద్ధతులను అరికట్టడానికి నూతన వ్యవస్థను రూపొందించడం → జాతీయ పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడం. -
మోదీ ఎంచుకున్న టెక్ దిగ్గజం.. ఆధార్ రూపకర్తకు కీలక బాధ్యత!
భారతదేశంలో సమాచార సాంకేతిక (ఐటీ) రంగం ప్రపంచ స్థాయికి ఎదగడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులలో నందన్ నీలేకని ఒకరు. కేవలం ఇన్ఫోసిస్ కో-ఫౌండర్‌గా మాత్రమే కాకుండా.. ఆధార్ (Aadhaar) రూపకల్పనలో చేసిన సేవలకు ఈయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. కాగా.. ఇప్పుడు పరీక్షల సంస్కరణల కోసం నీలేఖని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు పీఎం మోదీ పేర్కొన్నారు.ఎవరీ నందన్ నీలేకనినందన్ నీలేకని 1955 జూన్ 2న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించారు. ఆయన తండ్రి మోహన్ రావు నీలేకని టెక్స్టైల్ పరిశ్రమలో పనిచేసేవారు. చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరిచిన నందన్, ఐఐటీ బాంబేలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అక్కడే ఆయనకు సాంకేతిక రంగంపై మరింత ఆసక్తి పెరిగింది.1981లో ఎన్.ఆర్. నారాయణ మూర్తితో కలిసి మరో ఆరుగురు సహ వ్యవస్థాపకులతో కలిసి ఇన్ఫోసిస్ (Infosys) సంస్థను ప్రారంభించారు. అప్పట్లో చిన్న స్థాయిలో మొదలైన ఈ సంస్థ, నేడు ప్రపంచంలోని ప్రముఖ ఐటీ కంపెనీలలో ఒకటిగా ఎదిగింది. కంపెనీ అభివృద్ధిలో నందన్ నీలేకని కీలక పాత్ర పోషించారు. 2002 నుంచి 2007 వరకు ఇన్ఫోసిస్ సీఈవోగా పనిచేసి సంస్థను అంతర్జాతీయ స్థాయిలో మరింత బలోపేతం చేశారు.ఉడాయ్ చైర్మన్2009లో ఆయన కార్పొరేట్ జీవితానికి కొంత విరామం ఇచ్చి.. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ''యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా'' (UIDAI)కి తొలి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. దేశంలోని ప్రతి పౌరుడికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య అందించే ఆధార్ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేయడంలో ఆయన నాయకత్వం కీలకంగా నిలిచింది.రచయితగా నీలేకనివ్యాపారవేత్తగానే మాత్రమే కాకుండా.. రచయితగా కూడా గుర్తింపు పొందారు. 'ఇమాజినింగ్ ఇండియా' అనే పుస్తకంలో భారతదేశ భవిష్యత్తు, ఆర్థిక వ్యవస్థ, విద్య, సాంకేతికత వంటి అంశాలపై తన ఆలోచనలను వివరించారు. ఆయన రచనలు, ప్రసంగాలు యువతకు స్ఫూర్తినిస్తుంటాయి.రాజకీయాల్లో నీలేకని2014లో రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టి బెంగళూరు దక్షిణ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే.. ఆ ఎన్నికల్లో విజయం సాధించలేదు. అనంతరం తిరిగి ఇన్ఫోసిస్‌లో చేరి సంస్థ అభివృద్ధిలో తన పాత్రను కొనసాగించారు. ప్రస్తుతం ఆయన ఇన్ఫోసిస్‌కు నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సేవలందిస్తున్నారు.నందన్ నీలేకని కేవలం విజయవంతమైన వ్యాపారవేత్త మాత్రమే కాదు. డిజిటల్ ఇండియా, ఫిన్‌టెక్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో కూడా విలువైన సూచనలు చేస్తుంటారు. భారతదేశంలో డిజిటల్ విప్లవానికి మార్గం సుగమం చేసిన ప్రముఖ వ్యక్తుల్లో ఆయన ఒకరుగా గుర్తింపు పొందారు. View this post on Instagram A post shared by Narendra Modi (@narendramodi) -
పరీక్షల సంస్కరణలపై కేంద్రం కీలక నిర్ణయం
ఢిల్లీ: పరీక్షల సంస్కరణలపై కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమాల నివారణే లక్ష్యంగా పలు సంస్కరణలు తీసుకురావడానికి కేంద్రం సన్నద్ధమైంది. పరీక్షల సంస్కరణలపై ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు నరేంద్ర మోదీ. ‘ పరీక్షల సంస్కరణలపై ఉన్నతస్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం. సాంకేతిక నిపుణుడు నందన్ నీలేఖని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం, పరీక్షల విశ్వసనీయతపై ఇచ్చే ఈ నివేదికను అమలు చేస్తాం. లీక్‌లకు పాల్పడిన వారిని జైల్లో పెట్టాం. రేపు పార్లమెంట్లో కఠిన చట్టాలను తీసుకొస్తాం. పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకతతో పాటు అక్రమాల నివారణే లక్ష్యం సంస్కరణలు తీసుకురాబోతున్నాం. విద్యార్థుల భవిష్యత్ కోసం నిరంతరం చర్యలు తీసుకుంటున్నాం. కఠిన నియమాలతో కొత్త చట్టం తీసుకొస్తున్నాం. వీలైనంత ఎక్కువగా టెక్నాలజీని ఉపయోగిస్తాం’ అని తెలిపారు.HIGH POWERED TASK FORCE on examination reforms under the leadership of Shri Nandan Nilekani constituted.@NandanNilekani pic.twitter.com/mMpmPdIEL5— Narendra Modi (@narendramodi) July 26, 2026 -
భారత్ ఇప్పుడు తిరుగులేని శక్తి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 136వ ఎపిసోడ్ ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కార్గిల్ విజయ్ దివస్ ప్రాముఖ్యతను వివరిస్తూ, దేశ సైనికుల అసాధారణ ధైర్యసాహసాలు, త్యాగాలను కొనియాడారు. జూలై 14న ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ నుండి ప్రారంభమైన ‘శౌర్య విజయ్ యాత్ర’ ద్రాస్ లోని కార్గిల్ వార్ మెమోరియల్ వరకు సాగుతుందని తెలిపారు.భారత రక్షణ రంగ తయారీ సామర్థ్యాలకు ప్రతీకగా ఐఎన్ఎస్ మహేంద్రగిరి నౌకను ఇటీవల నావికాదళంలో చేర్చినట్లు ప్రధాని వెల్లడించారు. ఈ ఆధునిక యుద్ధ నౌక పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారని, ఇందులో 75 శాతానికి పైగా స్వదేశీ పరికరాలనే వినియోగించినట్లు చెప్పారు. అలాగే లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్, కుషా క్షిపణి పరీక్షలు విజయవంతం కావడంపై డీఆర్డీఓను ప్రశంసించారు. ఇండోనేషియాతో బ్రహ్మోస్, అస్త్రా క్షిపణుల ఒప్పందం కుదిరిందని, రక్షణ రంగంలో భారత్ విశ్వసనీయ భాగస్వామిగా ఎదుగుతోందని పేర్కొన్నారు.అంతర్జాతీయ వేదికలపై అద్భుత ప్రతిభ కనబరుస్తున్న భారతీయ అథ్లెట్లను ప్రధాని అభినందించారు. జపాన్ ఓపెన్ బాడ్మింటన్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించిన పీవీ సింధును, లండన్ లోని లార్డ్స్ స్టేడియంలో తొలి టెస్ట్ మ్యాచ్ విజయం సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టును ప్రశంసించారు. కేరళలోని ఎర్నాకులం విద్యార్థుల సంస్కృత క్లబ్, ప్రైవేట్ రంగం అభివృద్ధి చేసిన దేశపు తొలి రాకెట్ ‘విక్రమ్-1’ విజయవంతమైన ప్రయోగాన్ని కొనియాడారు. సైన్స్ ఒలింపియాడ్లలో విద్యార్థులు సాధించిన పతకాల గురించి ప్రస్తావించారు. కాశ్మీరీ సాంప్రదాయ చాపల తయారీ కళ ‘వాగు’ పునరుద్ధరణకు గులాబ్ హుస్సేన్, తన్జిలా చేస్తున్న కృషితో పాటు ఉత్తరప్రదేశ్ బిజ్నోర్ జిల్లా మహిళలు తయారు చేస్తున్న ‘విదుర్ ప్రేరణ స్వదేశీ హెర్బల్ టీ’ విశేషాలను ప్రధాని వివరించారు. -
‘సంపూర్ణ క్రాంతి’ సైరన్!
‘‘పదండి ముందుకు, పదండి తోసుకు – ప్రభంజనం వలె హోరెత్తండి’’... శ్రీశ్రీ కవితావేశానికి దృశ్యరూపంలా కనిపించింది ‘కాక్రోచ్’ల కదనోత్సాహం. ఎండుగడ్డి మైదానంలో నిప్పు రవ్వలా నిద్రాణమైన జన చేతనను రగిలించగలిగింది. 1974లో స్వాతంత్య్ర సమరయోధుడు జేపీ నాయకత్వంలో నడిచిన ‘సంపూర్ణ క్రాంతి (టోటల్ రివోల్యూషన్) ఛాయలు ఈ ఉద్య మంలో ప్రస్ఫుటంగా కనిపించాయి. నిరంకుశ పాలన వైపు అడుగులేస్తున్న అధికార కూటమికీ, పక్షవాతం సోకిన ప్రధాన ప్రతిపక్షానికీ కాక్రోచ్ ఉద్యమం గట్టి సవాల్నే విసిరింది. ఉద్యమ స్వభావాన్ని, దాని గమనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక సమయంలోనే గుర్తించగలిగారు. ఫలితంగా శనివారం మధ్యాహ్నం విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని ఆయనే వ్యక్తిగతంగానే తీసుకున్నారని జాతీయ మీడియాకు లీకులందాయి. బహుశా ఆయన ప్రతిష్ఠను నిలబెట్టడం కోసం వీటిని ప్రసారం చేసి ఉండవచ్చు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల విజయాల కీలక పాత్రధారుల్లో ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఒకరు. ఆయన గౌరవాన్ని కాపాడటం పార్టీ బాధ్యత కూడా. సంపూర్ణ క్రాంతి ఉద్యమం మాదిరిగా దేశ వ్యాప్తంగా విస్తరించే లక్షణాలను కాక్రోచ్ ఉద్యమంలో గుర్తించి నందువల్ల దీనికి వెంటనే ఫుల్స్టాప్ పెట్టాలని ప్రధాని భావించి నట్టు సమాచారం.ధరేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌ను తొలి దశలో ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రజా ఉద్యమాలకు తలొగ్గి నిర్ణయాలను మార్చుకునే లక్షణం పన్నేండేళ్ల పాలనా కాలంలో ఎన్డీఏకు ఎప్పుడూ లేదు. వ్యవసాయ చట్టాలకు వ్యతి రేకంగా పంజాబ్ రైతులు చేసిన చరిత్రాత్మక పోరాటంపై స్పందించడానికి మోదీ సర్కార్ సుదీర్ఘ సమయాన్ని తీసు కున్నది. అంతర్జాతీయ క్రీడా యవనికపై దేశ ప్రతిష్ఠను ఇనుమ డింపజేసిన మహిళా మల్లయోధుల ఆక్రందన అరణ్యరోదనగా మారింది తప్ప ఎన్డీఏ సర్కార్ చలించలేదు. పౌరసత్వ చట్టం దగ్గర నుంచి అనేకానేక అంశాల్లో కేంద్రం ప్రజా ఉద్యమాలను పట్టించుకున్న దాఖలాలు లేవు. ‘కాక్రోచ్’ల పార్లమెంట్ ముట్టడి జరిగిన మూడు రోజుల్లోనే ప్రధానమంత్రి రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలను చేపట్టారు.ఈ నెల 23న ఆందోళనపై తొలిసారిగా ఆయన నోరు విప్పారు. పేపర్ లీకేజీ ఘటనల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు లను ఏర్పాటు చేస్తున్నట్టు అర్ధరాత్రి ట్వీట్ చేశారు. విద్యార్థుల సంక్షేమం, వారి భవితవ్యం కంటే ఇంకేదీ ముఖ్యం కాదని కూడా అందులో పేర్కొన్నారు. 24న జరిగిన కేబినెట్ సమావేశంలో ఇటువంటి నేరాలకు సంబంధించి చట్టానికి మరింత పదును పెడుతూ తీర్మానించారు. సీజేపీ ప్రతినిధులు పెట్టిన గడువు లోపల 25 మధ్యాహ్నం మంత్రి రాజీనామా నిర్ణయం వెలువడింది. ఈ మూడు రోజులుగా కేంద్రమంత్రులు సీజేపీ ప్రతి నిధులతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. సీజేపీ పెట్టిన డిమాండ్లలో మంత్రి రాజీనామా ముఖ్యమైనది. ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వడం, ఆందోళనలో పాల్గొన్న వారిపై కేసులు ఎత్తివేయడం మిగిలిన రెండు డిమాండ్లు. వీటిని కూడా కేంద్రం అంగీకరించినట్టు సమాచారం.విద్యార్థులపై జరిగిన పాశవిక లాఠీచార్జికి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని తాజాగా సీజేపీ డిమాండ్ చేసింది. మంత్రి రాజీనామాతో యువజనోద్యమం ముగిసిపోలేదనీ, విద్యావ్యవస్థ ప్రక్షాళన జరిగేవరకూ కొనసాగు తుందనీ కాక్రోచ్ ప్రతినిధులు విజయోత్సవం సందర్భంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న ధర్నా, దీక్షా కార్యక్రమాల విరమణపై నిర్ణయం వెలువడాల్సి ఉన్నది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం కంటే ఎక్కువగా అప్రదిష్ట మూటకట్టుకున్నది గోదీ (పెంపుడు) మీడియా.ఏన్డీఏ కూటమిలో అప్రకటిత భాగస్వాములుగా పెంపుడు మీడియా, యెల్లో మీడియా వగైరాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జూలై 20న జరిగిన కాక్రోచ్ల పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం పెంపుడు మీడియాను దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశం నలుమూలల నుంచి లక్షలాది యువజనం తరలి వస్తారని అది ఊహించలేకపోయింది. పోలీసు దమనకాండకు ఎదురొడ్డి నిలబడతారని కూడా అంచనా వేయలేకపోయింది. ఈ ఉలికి పాటు నుంచి తెప్పరిల్లిన తర్వాత సన్నాయి నొక్కులు ప్రారంభించింది. తరలివచ్చిన ఝంఝూమారుత యువ కెరటాలను ‘నీట్ పరీక్ష’ పరిధిల్లోనే బంధించడానికి తాపత్రయపడింది. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తున్నప్పటికీ ఆందోళన కొనసాగించడంలో అర్థం లేదని ధర్మపన్నాగాలను వల్లె వేసింది. జవాబుదారీతనం ఒక కనీస ప్రజాస్వామిక ధర్మమనే విషయాన్ని విస్మరించి మంత్రి రాజీనామా డిమాండ్‌ను తప్పుపట్టింది. తాడూ బొంగరం లేని పార్టీ పిలుపునిస్తే ఇంత జనసందోహం పోగవడం వెనుకనున్న ‘అదృశ్య శక్తుల’ కోసం ఆరా తీయడం మొదలుపెట్టింది. మీడియా పక్షపాతాన్ని నిలదీసిన యువకులను అరాచక శక్తులుగా చిత్రించారు. నవతరం యువతుల ధైర్యసాహసాలకూ, మొహమాటమెరుగని ముక్కుసూటి తనానికీ వాట్సాప్ యూనివర్సిటీ పెడార్థాలు తీసింది.ఆన్లైన్లో మొదలైన కాక్రోచ్ పార్టీ పిలుపునిస్తే లక్షలాది మంది స్పందించడం పట్ల ప్రభుత్వం, పెంపుడు మీడియాలే కాదు, ప్రతిపక్షం కూడా అవాక్కయింది. పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకోవడానికి సహజంగానే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. అయితే పాలక కూటమి అందుకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడింది. యాభయ్యేళ్ల కింద దేశంలో సంపూర్ణ క్రాంతి ఉద్యమంనాటి పరిస్థితులే నేటి యువజనో ద్యమం పరిస్థితులు కూడా. బంగ్లాదేశ్ విమోచన యుద్ధం తర్వాత ఇందిరాగాంధీ ప్రతిష్ఠ పెరిగింది కానీ దేశ ఆర్థిక పరిస్థితి దిగజారింది. సరకుల ధరలు పెరిగాయి. నిరుద్యోగం ప్రబలింది. రాజకీయ నేతలు, అధికార యంత్రాంగంలో గతంతో పోలిస్తే అవినీతి ప్రబలింది. దీనికి తోడు ఎదురులేదన్న ధీమాతో అధికార పార్టీలో, అధినాయకత్వంలో నియంతృత్వ ధోరణులు ప్రబలాయి. ఈ ధోరణులకు వ్యతిరేకంగా గుజరాత్ విద్యార్థులు ప్రారంభించిన ఆందోళనను బిహార్ అందిపుచ్చుకున్నది.అనంతరం జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో అది సంపూర్ణ క్రాంతి ఉద్యమంగా పరిణామం చెంది ఎమర్జెన్సీ విధింపునకు, తదనంతరం ఇందిరాగాంధీ ఓటమికి దారితీసింది. 1974 నాటి పరిస్థితులు మరింత దారుణంగా ఇప్పుడు పరిణమించాయి. విద్యారంగంలో విచ్చలవిడిగా ప్రైవేటీకరణ ప్రబలింది. ఈ ప్రైవేటీకరణ భూతంలేని ఆ రోజుల్లోనే సంపూర్ణ క్రాంతి డిమాండ్లలో అందరికీ విద్య అందుబాటులో ఉండాలనే అంశం ప్రముఖంగా చోటుచేసుకున్నది. ఇప్పుడు దేశంలో మెజా రిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులో లేని పరి స్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ స్కూళ్లను దిగజార్చుతున్నాయి. 2014 నుంచి నేటివరకు దేశంలోని ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య ఒక కోటి పద్దెనిమిది లక్షలు తగ్గింది. అదే సమయంలో ప్రైవేట్ స్కూళ్లలో 88 లక్షల మంది పెరిగారు. ఇటువంటి పరిస్థితుల్లోనే నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసింది. ఫలితంగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. కొన్ని స్కూళ్లలో నో వేకెన్సీ బోర్డులు పెట్టడం జాతీయ వార్తగా మారింది. వాస్తవాలు ఇలా వుంటే... ఇప్పుడు కొత్తగా లోకేశ్ సారథ్యంలో ప్రభుత్వ స్కూళ్లు నో వేకెన్సీ బోర్డులు పెడుతున్నట్టు రంప చోడవరం సభలో చంద్రబాబు కళ్లార్పకుండా చెప్పేశారు. తల్లికి వందనం ఐడియా కూడా లోకేశ్‌దే నన్నట్టుగా ఆయన మాట్లా డారు. పెద్ద నాయకుడు కాబట్టి సరిపోయింది. ఇంకెవరైనా అలా మాట్లాడితే ‘అతన్నెవరికైనా చూపించండర్రా’ అంటారు. జగన్ మోహన్‌రెడ్డి నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌కు కట్టబెట్టడం కోసం అనుమతులు తీసుకోకుండా 1,800 మెడికల్ సీట్లను ఏపీ విద్యార్థులకు దూరం చేసి వారి కలలను భగ్నం చేశారు. ఇలాంటి పరిస్థితులే కదా కాక్రోచ్ల పుట్టుకకు దారితీసేది!దేశవ్యాప్తంగా ఉన్నత విద్యారంగం పరిస్థితి కూడా నిరాశా జనకంగానే ఉన్నది. యూజీసీ గ్రాంట్లకు భారీగా కత్తెర వేసి విశ్వవిద్యాలయాల నాణ్యతా ప్రమాణాలను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ వర్సిటీలకు అనుమతులు పెరిగాయి. అవి కాసుల కోసం పని చేస్తాయి తప్ప పరిశోధనల కోసం పాకులాడవు కదా! ఉన్నత విద్యారంగంలో కూడా ప్రమాణాలు గణనీయంగా పడిపోతు న్నాయి. లక్షల సంఖ్యలో ఉత్పత్తి అవుతున్న నాణ్యతలేని పట్టభద్రులకు ఉద్యోగాలు దొరకడం లేదు. పట్టభద్రుల నిరు ద్యోగితా శాతం దేశంలో ముప్పయి శాతం దాటింది. నాణ్యమైన విద్యను ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో దూరం చేశారు. ప్రైవేట్ సంస్థల్లో కొనలేని పేద, మధ్యతరగతి విద్యార్థులు నిరుద్యో గులుగా మిగిలిపోతున్నారు. విద్యారంగం పూర్తి సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ సంక్షోభంలో కోట్లాది మంది చిక్కుకొని పోయారు.సంక్షోభానికి మరోకోణం అవినీతి. రాష్ట్రాల వారీగా నిక్షేపంగా జరుగుతున్న మెడికల్ అడ్మిషన్ల విధానాన్ని ఉద్దరిస్తామని చెప్పి కేంద్రీకరించారు. వ్యవస్థాగత బలంలేని టెస్టింగ్ ఏజెన్సీకి ప్రతిష్ఠాత్మక సంస్థల అడ్మిషన్ల బాధ్యతను అప్పగించారు. ప్రైవేట్ సంస్థలకు కీలకమైన పనులను ఔట్ సోర్సింగ్ చేసే పద్ధతి వల్ల అవకతవకలకు రాచబాట ఏర్పడింది. ఫలితంగా లక్షలాది విద్యా ర్థుల కలలు కల్లలవుతున్నాయి. ఈ పూర్వరంగంలో ప్రధాన్ రాజీనామాతోనే ఈ సంక్షోభం తొలగిపోదు. సంపూర్ణ క్షాళన కోసం యువతరం ఉద్యమించడం అనివార్యం. ఇవాళ కాక పోయినా రేపైనా ఈ సంపూర్ణ క్రాంతిరథం కదలక తప్పదు.ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ అవకతవకలపై ప్రతిపక్ష నేత అందజేసిన సాక్ష్యాలను యువతరం అందిపుచ్చుకోవలసి ఉన్నది. మెడికల్ సీట్లను రాష్ట్ర విద్యార్థులకు అందకుండా చేసిన నిర్వాకంపై ఎలు గెత్తవలసి ఉన్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగం తోడుగా ఉన్నంతవరకు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఏ శక్తీ ఏమార్చ లేదని ఈ పరిణామం రుజువు చేసింది. జెన్జీగా పిలుచుకుంటున్న నవతరం మొబైల్ ఫోన్లలో మునిగిపోయి స్తబ్ధుగా మారిపోయిందనే అభిప్రాయం శుద్ధ తప్పని తేలి పోయింది. అవసరం వస్తే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎలాంటి సవాలైనా ఎదుర్కొనేందుకు వారు సిద్ధపడతారని రుజువైంది. కాక్రోచ్ ఆందోళనకు దేశవ్యాప్త గుర్తింపు రావడానికి దోహద పడిన సోనమ్ వాంగ్‌చుక్, ఒక సెటైర్‌ను వైల్డ్ ఫైర్‌గా మార్చగలిగిన అభిజిత్ దీప్కే, 23 రోజుల నిరాహార దీక్ష అనంతరం కూడా సివంగిలా రణగర్జనలు చేసిన నేహా బోరా, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా పోలీస్ వ్యాన్ ఎదురుగా నిలబడి అమరత్వానికి సిద్ధపడిన రియా అహిర్, వాటర్ కెనాన్లను గేలిచేస్తూ వాటికింద డ్యాన్సులు చేసిన బిహారీ విద్యార్థులు, తోడేళ్ల మంద ఎదుట తొడగొట్టినట్టు లాఠీచార్జీలను సవాల్ చేసిన యువతీ యువకులందరూ ఈ ఉద్యమంలో హీరోలే! రాబోయే సంపూర్ణ విప్లవానికి వేగుచుక్కలు వారే!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
వీడియోలు కాదు, యాక్షన్ కావాలి : రాహుల్ గాంధీ విమర్శలు
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ అవకతవకలపై దేశ రాజదాని నగరం న్యూడిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ,విద్యార్థులు ఆందోళన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా విడుదల చేస్తున్న వీడియోలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వీడియోలు కాదు, విద్యార్థులపై కోరుతున్న డిమాండ్లపై చర్యలు కావాలి అంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో దాడికి గురైన విద్యార్థులకు ప్రధాని మోదీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.23 రోజులుగా నిరాహార దీక్ష చేసిన విద్యార్థులతో కలిసి మీడియాతో మాట్లాడిన రాహుల్ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యా వ్యవస్థ అవినీతికి ప్రతీక అని విమర్శించారు. ఆయనను వేరే శాఖకు మార్చడం కాకుండా, ప్రభుత్వం నుంచే పూర్తిగా తొలగించాలని (మంత్రివర్గం నుండి తీసేయాలని) విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారన్నారు.మోదీ రాత్రివేళల్లో చేసే వీడియో సందేశాలను ప్రస్తావిస్తూ విద్యార్థులకు ప్రధాని హామీలు, వీడియోలు వద్దని, తక్షణ చర్యలే కావాలని స్పష్టం చేశారు.मोदी जी, करोड़ों छात्रों का भविष्य बर्बाद करने के बाद अब आधी रात की Reel से उनका वक़्त बर्बाद मत कीजिए।प्रधान बर्ख़ास्त। दोषियों पर कार्रवाई। छात्रों से माफ़ी।इससे कम कुछ भी मंज़ूर नहीं। pic.twitter.com/RWrLLDD0WC— Rahul Gandhi (@RahulGandhi) July 25, 2026 అలాగే ఆందోళన బాట పట్టిన విద్యార్థులపై లాఠీచార్జ్, పెల్లెట్ ప్రయోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గాయపడిన ఒక విద్యార్థిని చూపిస్తూ... విద్యార్థులపై దాడికి బాధ్యులైన వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. విద్యార్థులే ఈ దేశపు భవిష్యత్తు అని మోదీ దేశానికి గతం అని గతం ఎన్నటికీ భవిష్యత్తును ఓడించలేదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా AISA ప్రతినిధి నేహా బోరా మాట్లాడుతూ, రాహుల్ గాంధీతో విద్యా వ్యవస్థపై చర్చలు జరిపినట్లు తెలిపారు. కాగా నీట్ 2026 పేపర్ లీకేజీ అంశంపై విద్యార్థులను ఉద్దేశించి మోదీ గురువారం అర్ధరాత్రి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో మరో సెల్ఫీ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
NTAలో 47 మందిపై క్రిమినల్ చర్యలు... BJP సీరియస్ యాక్షన్
-
నా నిజాయితీని నిరూపించాలా? విమర్శలకు వాంగ్ చుక్ ఘాటు రియాక్షన్
-
నీట్ సెగ.. ధర్మేంద్ర ప్రధాన్‌పై కీలక నిర్ణయం?
నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణల వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతుండగా.. కేంద్రం వరుస చర్యలు చేపట్టింది. ఎన్టీఏలో మార్పులు, ఉన్నతాధికారుల బదిలీలు, కఠిన చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పటికీ.. నిరసనలు మాత్రం తగ్గడం లేదు. కీలకమైన మూడు డిమాండ్లలో.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశమే ప్రధాన చర్చనీయాంశంగా మారింది.నీట్ వ్యవహారంలో నైతిక బాధ్యత వహించాల్సింది విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధానేనని అటు విద్యార్థి సంఘాలు.. నిరసనకారులు, ఇటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆయన రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకుంటేనే తమ పోరాటానికి న్యాయం జరుగుతుందని, అప్పుడే ఆందోళనలు విరమిస్తామని స్పష్టం చేస్తున్నాయి. ఈ తరుణంలో.. ధర్మేంద్ర ప్రధాన్‌ను తప్పించేందుకు కేంద్రం సుముఖంగా కనిపించడం లేదని సమాచారం. ఇదే ప్రధాన ఎజెండాగా నిన్న కేబినెట్ భేటీలోనూ చర్చించినట్లు తెలుస్తోంది. అయితే వివాదం నేపథ్యంలో ఆయన్ని మరో శాఖకు మార్చే అవకాశం ఉందన్న ప్రచారం ఢిల్లీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. రాజకీయ ఒత్తిడిని తగ్గించే ప్రయత్నంలో భాగంగా శాఖ మార్పును పరిశీలిస్తున్నారనే వాదనలు వస్తున్నాయి. అయితే దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ ఈ ఉదయం ప్రెస్మీట్లో ప్రముఖంగా ప్రస్తావించారు. నీట్ వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను అవినీతికి ప్రతీకగా అభివర్ణించిన ఆయన.. మరో శాఖకు మార్చడం పరిష్కారం కాదని అన్నారు. విద్యార్థులు కోరుకుంటున్నట్లు ఆయనను కేబినెట్ నుంచి తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు. పైగా ఈ వ్యవహారంపై తనకు సమాచారం ఉందని పేర్కొన్న ఆయన.. పరీక్షా వ్యవస్థలో చోటుచేసుకున్న పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. అర్ధరాత్రి వీడియోలు చేయడంతో లాభం లేదని.. మంత్రిని తొలగించి విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.#WATCH | LoP, Lok Sabha, Rahul Gandhi says, "...Students have three demands, and these are not negotiable demands... The first demand is that the Education Minister, who is corrupt, incompetent, and misaligned, has to be sacked... There's some talk going on in Mr. Modi's cabinet… pic.twitter.com/hKoXOQ4SSz— ANI (@ANI) July 25, 2026మరోవైపు కేంద్ర ప్రభుత్వం నీట్ వివాదం నేపథ్యంలో పలు చర్యలు చేపట్టింది. పేపర్ లీక్ కేసులను త్వరగా విచారించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. పరీక్షల నిర్వహణలో అక్రమాలను అరికట్టేందుకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అలాగే పరీక్షల నిర్వహణ సంస్థ అయిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఎన్టీఏలోని 47 మంది అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. నీట్ వివాదం వేళ కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిని కూడా బదిలీ చేసింది. ఆయన స్థానంలో కొత్త అధికారిని నియమించింది.అయితే ఈ చర్యలు విద్యార్థుల ఆగ్రహాన్ని చల్లార్చలేకపోయాయి. పరీక్షల నిర్వహణలో జరిగిన తప్పిదాలకు కేవలం అధికారులపై చర్యలు తీసుకోవడం సరిపోదని, రాజకీయ బాధ్యత కూడా ఉండాలని సీజేపీ, ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఇదే సమయంలో విద్యార్థి సంఘాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. మూడో దఫా చర్చలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం ఎలాంటి హామీలు ఇస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. అయితే మంత్రి రాజీనామా డిమాండ్‌పై మాత్రం విద్యార్థులు వెనక్కి తగ్గడం లేదు.ఈ పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ శాఖ మార్పు జరుగుతుందా? లేదంటే ప్రస్తుత పరిస్థితినే కొనసాగిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు విద్యార్థులు రాజీనామా డిమాండ్‌పై పట్టుబడుతుండగా.. మరోవైపు కేంద్రం మాత్రం ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. నీట్ వివాదం రాజకీయంగానూ, పరిపాలనా పరంగానూ మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. -
మెట్రో ఆపగలరు.. పేపర్ లీక్ ఆపలేరు: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ఢిల్లీలో జరుగుతున్న నీట్ అభ్యర్థుల నిరసనలు, పేపర్ లీక్ ఉదంతాలపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మెట్రో స్టేషన్లు, ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా తప్పుపట్టారు. రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులు గత కొన్ని రోజులుగా నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పలు కఠిన ఆంక్షలు విధించడంతో పాటు 18 మెట్రో స్టేషన్లను మూసివేసింది. దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ.. ‘మెట్రో బంద్ చేయండి, ఇంటర్నెట్ బంద్ చేయండి, దుకాణాలు బంద్ చేయండి.. కానీ ప్రధాని మోదీ మాత్రం పేపర్ లీక్ మాత్రం అడ్డుకోలేకపోయారు’ అంటూ ఎద్దేవా చేశారు. मेट्रो बंद करो।रास्ते बंद करो।दुकानें बंद करो।Internet बंद करो।खाना बंद करो।अपना हक़ मांग रहे छात्रों के ख़िलाफ़ सरकार ने ये क्रूर कदम उठाए।बस एक चीज़ बंद नहीं कर पाए, मोदी जी - पेपर लीक।— Rahul Gandhi (@RahulGandhi) July 25, 2026శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ప్రభుత్వం అత్యంత క్రూరంగా వ్యవహరిస్తోందని రాహుల్ ఆరోపించారు. జాతీయ జెండాలు పట్టుకుని నిరసన తెలుపుతున్న యువకులపై పోలీసులు పెల్లెట్ గన్లు ప్రయోగించారని, లాఠీచార్జీ చేశారని మండిపడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ విద్యార్థి కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థ పతనానికి ఆయనే ప్రధాన కారణమని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం, వారిపై అణచివేత చర్యలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.ఇది కూడా చదవండి: యువతకు సమాధానం ఇవ్వాల్సిందే: మోహన్ భగవత్ -
యువతకు ధన్యవాదాలు మోదీ మరో వీడియో వైరల్
-
మోదీ మ్యాజిక్ ఇలాగే ఉంటుంది మరి!
నరేంద్ర మోదీ.. ఈ పేరుకు ఉన్న గ్లోబల్ క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రపంచ దేశాల అధినేతలు సైతం ఆయనతో కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపుతుంటారు. అంతర్జాతీయ వేదికలపై మోదీకి లభించే ఆదరణకు ఇదే నిదర్శం కూడా. అలాంటి వ్యక్తి తొలిసారి జాతిని ఉద్దేశించి.. అదీ నీట్‌లాంటి నిరసనల మీద సెల్ఫీ వీడియో పోస్ట్ చేస్తే స్పందన ఎలా ఉంటుందో ఊహించగలరా?. నీట్-యూజీ పేపర్ లీక్, పరీక్షల వ్యవస్థలో లోపాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారింది. విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షల పారదర్శకతపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ గురువారం రాత్రి మోదీ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. అందులో.. పేపర్ లీక్‌పై ఆందోళనలను అర్థం చేసుకున్నామని, కఠిన చర్యలకు దిగుతున్నామని ప్రకటించారు. ఇకనైనా ఆందోళనలు విరమించాలి అంటూ పరోక్షంగా ఆయన నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు. అయితే.. ఈ వీడియోకు భారీ స్పందన లభించింది. కోట్లాది మంది వీక్షణలు, లక్షల సంఖ్యలో స్పందనలతో ఆ వీడియో వైరల్‌గా మారింది.ప్రధాని మోదీ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఈ సెల్ఫీ వీడియోకు తక్కువ సమయంలోనే పెద్ద ఎత్తున వ్యూస్, లైక్స్, కామెంట్లు వచ్చాయి. సుమారు 25 కోట్ల మందికి పైగా ఈ వీడియోను వీక్షించగా.. 10 లక్షలకు పైగా కామెంట్లు, కోటిన్నరకు పైగా లైక్స్‌తో దూసుకుపోతోంది. అయితే అన్ని ప్లాట్‌ఫారమ్‌లతో కలిపి ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని తెలుస్తోంది. More strict actions against paper leaks to come in tomorrow’s Cabinet! pic.twitter.com/NRysBukk5U— Narendra Modi (@narendramodi) July 23, 2026నీట్ వివాదంపై వీడియో సందేశంలో స్పందించిన ప్రధాని.. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలను సహించేది లేదని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. యువత ఆశలు, భవిష్యత్తుతో ఎలాంటి రాజీ ఉండదని భరోసా ఇచ్చారు.ఈ వీడియోపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు కనిపించాయి. ప్రధాని సందేశాన్ని స్వాగతించిన పలువురు.. ఇది విద్యార్థులకు భరోసా ఇచ్చే ప్రయత్నమని పేర్కొన్నారు. మరోవైపు, ప్రతిపక్షాలు మాత్రం నీట్ వివాదంలో బాధ్యులపై చర్యలు, వ్యవస్థలో సమూల మార్పులపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.శుక్రవారం రాత్రి మరో వీడియోను రిలీజ్ చేశారాయన. ఈసారి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన మోదీ.. “ధన్యవాదాలు మిత్రులారా. నిన్న (గురువారం) రాత్రి మీతో మాట్లాడే అవకాశం లభించింది. నా వీడియోను ఎంతోమంది చూసి, విలువైన సూచనలు అందించారు. మీ ప్రేమ, ఆదరణకు హృదయపూర్వక కృతజ్ఞతలు” అని అన్నారు. యువత నుంచి వచ్చిన సానుకూల స్పందన తనకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Narendra Modi (@narendramodi)ఇక మోదీకి ఉన్న వ్యక్తిగత బ్రాండ్ ఇమేజ్, సోషల్ మీడియా ప్రభావం మరోసారి ఈ వీడియోల ద్వారా చర్చకు వచ్చింది. దేశీయ రాజకీయాలతో పాటు అంతర్జాతీయ వేదికలపై కూడా ప్రత్యేక గుర్తింపు పొందిన మోదీ.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోనూ భారీ స్థాయిలో ప్రజలతో అనుసంధానమవుతున్నారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ యువతకు చేరువ కావాలంటూ మంత్రులకు సైతం నిన్నటి కేబినెట్ భేటీలో మోదీ సూచించడం గమనార్హం. నీట్ వివాదం నేపథ్యంలో వచ్చిన ఈ సెల్ఫీ వీడియో.. కేవలం ఓ రాజకీయ సందేశంగానే కాకుండా, సోషల్ మీడియాలో మోదీకి ఉన్న ప్రజాదరణకు మరో ఉదాహరణగా నిలిచిందని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. -
విద్యార్థులను శత్రువులుగా చూస్తున్న మోదీ ప్రభుత్వం: సోనియా
న్యూఢిల్లీ: విద్యా వ్యవస్థలో సంస్కరణలు, అకౌంటబిలిటీ కోరిన పాపానికి మోదీ ప్రభుత్వం విద్యార్థులపట్ల క్రూరంగా ప్రవర్తిస్తోందని, ఈ దేశ భవిష్యత్తుగా కాకుండా శత్రువులా చూస్తోందని కాంగ్రెస్ పార్లమెంటరీప ఆర్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించార.ఉ. దేశ విద్యా వ్యవస్థను దిగజారుస్తున్న మోడీ ప్రభుత్వ డొల్లతనాన్ని ఈ దేశ విద్యార్థులు బట్టబయలు చేశారని వ్యాఖ్యానించారు. విద్యార్థుల పక్షాన నిలవడం నైతికంగానే కాకుండా రాజకీయ, రాజ్యాంగబద్ధ ధర్మం కూడా అని స్పష్టం చేశారు. నిరాశ నిస్పృహలను కలిగించే విద్యావ్యవస్థ, మోడీ ప్రభుత్వపు అహంకార ధోరణి, బాధ్యతారాహిత్యం వంటి అంశాలన్నీ నిరసనలకు దారితీయడం సహజ పరిణామమేనని సోనియాగాంధీ ‘ద హిందూ’పత్రికలో ‘ఆన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కొలాప్స్, యంగ్ ఇండియాస్ ట్రామా’శీర్షికతో రాసిన కథనంలో పేర్కొన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి ఆధ్వర్యంలో పనిచేసే ఢిల్లీ పోలీసులు ‘ఛలో సంసద్’సందర్భంగా విద్యార్థులపై చూపిన క్రూరత్వం ఈ ప్రభుత్వ హయాంలో కొత్తేమీ కాదని, 2020లో సీఏఏ నిరసన ప్రదర్శనల సందర్బంగానూ పోలీసులు, పారా మిలటరీ బలగాలు దారుణంగా వ్యవహరించాయని, మహిళ రెజ్లర్లపై జరిగిన దమనకాండను కూడా ఈ దేశం మరచిపోలేదని అన్నారు. విద్యార్థులు ధైర్యంగా వేస్తున్న ప్రశ్నలకు ఈ ప్రభుత్వం పిరికితనంతో జవాబు చెబుతోందని, క్రూరంగా అణచివేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ప్రశ్న పత్రాల లీకేజీని అరికట్టడంలో దారుణంగా విఫలమైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేందుకు నిరాకరించడం ప్రజల మనసుల్లో గూడుకట్టుకుపోయిన ఆగ్రహానికి ఆజ్యం పోసిందని అన్నారు. ఎనీ్టయేను శక్తిమంతం చేసేందుకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచి్చన సలహాలను బహిరంగంగానే తిరస్కరించడం ద్వారా ప్రధాన్ ధిక్కారాన్ని ప్రదర్శించడమే కాకుండా బాధ్యతారహితంగా వ్యవహరించారని ఆ కథనంలో ఆరోపించారు. -
యువతకు కృతజ్ఞతలు.. మోదీ మరో వీడియో
సాక్షి, ఢిల్లీ: ప్రధాని మోదీ మరో వీడియో విడుదల చేశారు. నిన్న అర్థరాత్రి (గురువారం) తను పోస్ట్ చేసిన వీడియోపై అభిప్రాయాలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. విలువైన సూచనలు చేసిన యువతకు ప్రత్యేక కృతజ్ఞతలని పేర్కొన్నారు. యువతరం ఇచ్చే విలువైన సలహాలు దేశ భవిష్యత్తుకు మరింతగా సహకరిస్తాయని మోదీ అభిప్రాయపడ్డారు. కేంద్ర కేబినేట్ భేటీ అనంతరం మోదీ ఈ వీడియోని విడుదల చేశారు.మోదీ మాట్లాడుతూ "ధన్యవాదాలు మిత్రులారా. నిన్న రాత్రి ఆలస్యంగా మిమ్మల్ని కలిసే అవకాశం నాకు లభించింది. నా వీడియోకు మీరు స్పందించిన తీరును, మీ సానుకూల సూచనలను నేను అభినందిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు..." అని అన్నారు. కాగా నిన్న (గురువారం) నీట్ లీకేజ్‌పై జరుగుతున్న నిరసనలపై మోదీ కీలక ప్రకటన చేశారు" నీట్ లీకేజ్‌పై కేంద్ర కేబినేట్లో పేపర్‌లీక్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. పేపర్ లీకెజ్‌లపై కఠిన చర్యలు తీసుకునేలా నిర్ణయాలుంటాయని తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ వివరాలను ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. #WATCH | Prime Minister Narendra Modi shared a video on his Instagram handle;, "Thanks to the youngsters who watched my video yesterday and sent insightful suggestions."He says, "Thank you friends. I had the opportunity to meet you late last night. I appreciate the way you… https://t.co/B4hrqwPwic pic.twitter.com/t6hfaVcvET— ANI (@ANI) July 24, 2026 -
కేంద్ర క్యాబినెట్ సమావేశంలో మంత్రులకు మోదీ క్లాస్
ఢిల్లీ :కేంద్ర క్యాబినెట్ సమావేశంలో మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ క్లాస్ పీకారు. సోషల్ మీడియాలో మంత్రులు యాక్టివ్‌గా ఉన్నారా.. లేదా అని నిలదీశారు. ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతమంది యాక్టివ్‌గా ఉన్నారని ఆరా తీశారు. మంత్రులందరూ సోషల్ మీడియాలో కచ్చితంగా యాక్టివ్‌గా ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు అందులో పోస్ట్ చేయడం కాదు.. వాటి గురించి అర్థం అయ్యేలా వీడియోలు పోస్ట్ చేయాలన్నారు. యువత ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని, మంత్రులు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ వారితో సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సిందేనన్నారు మోదీ. -
పేపర్ లీక్ చేస్తే.. 10 ఏళ్లు జైలుకే.. మోదీ కేబినెట్ కఠిన నిర్ణయాలు


