భారత్‌ ప్రగతి అద్భుతం | Australian PM Anthony Albanese hails India economic growth | Sakshi
Sakshi News home page

భారత్‌ ప్రగతి అద్భుతం

May 29 2026 3:16 AM | Updated on May 29 2026 3:16 AM

Australian PM Anthony Albanese hails India economic growth

ప్రధాని మోదీ రాకకోసం ఎదురు చూస్తున్నా

ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌ వెల్లడి 

కాన్‌బెర్రా: భారత్‌ సాధిస్తున్న ఆర్థిక ప్రగతి ఇండో–పసిఫిక్‌ ప్రాంతానికి అద్భుతమైన అవకాశమని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ ఆల్బనీస్‌ పేర్కొన్నారు.  భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరోసారి ఆతిథ్యం ఇచ్చేందుకు తాను ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. కాన్‌బెర్రాలోని పార్లమెంట్‌లో గురువారం ఆయన ప్రసంగించారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్, త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు ఎదగనుందన్నారు.

 2022లో కుదిరిన ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందంతో రెండు దేశాల వాణి జ్య సంబంధాలు గణనీయంగా పెరిగా యన్నారు. 1991లో పర్యాటకుడిగా భారత్‌ వెళ్లిన తాను, ప్రధానిగా రెండు పర్యాయాలు భారత్‌ సందర్శించినట్లు చెప్పారు. భారత్‌ను దగ్గర్నుంచి పరిశీలించాలనుకునే వారిక బస్సు, రైలు ప్రయాణం ఉత్తమమని సలహాఇచ్చారు. ‘అదొక అద్భుతమైన అనుభవం. ప్రజల ఆప్యాయత చూసేందుకు చక్కని అవకాశం’అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ చివరిసారిగా 2023లో ఆస్ట్రేలియాలో పర్యటించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement