దేశంలో తొలి గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ ప్రారంభం! | PM Modi Launches Indias First Greenfield Refinery Petrochemical Hub In Rajasthan | Sakshi
Sakshi News home page

దేశంలో తొలి గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ ప్రారంభం!

Jul 4 2026 2:43 PM | Updated on Jul 4 2026 3:14 PM

PM Modi Launches Indias First Greenfield Refinery Petrochemical Hub In Rajasthan

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్‌లోని.. బలోత్రా జిల్లాలోని పచ్‌పద్ర ప్రాంతంలో దేశంలోని తొలి గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ-పెట్రోకెమికల్ సముదాయాన్ని ప్రారంభించారు. ఇది దేశ ఇంధన, పెట్రోకెమికల్ రంగంలో కొత్త అధ్యాయంగా నిలిచింది. ఈ సముదాయం భారతదేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడంతో పాటు దేశీయ పారిశ్రామికాభివృద్ధికి కీలకంగా మారనుంది.

ఈ రిఫైనరీని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL), రాజస్థాన్ ప్రభుత్వం సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను రూ. 79,450 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడితో ఏర్పాటు చేశారు. దీని సామర్థ్యం సంవత్సరానికి 9 మిలియన్ మెట్రిక్ టన్నులు. అదనంగా ఏడాదికి 2.4 మిలియన్ మెట్రిక్ టన్నుల పెట్రోకెమికల్ ఉత్పత్తులను తయారు చేసే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది.

ఈ ప్రాజెక్టు ద్వారా భారతదేశం దిగుమతులపై ఆధారపడే అవసరం తగ్గి, దేశీయంగా పెట్రోకెమికల్ ఉత్పత్తుల తయారీ పెరుగుతుంది. దీనివల్ల దేశ ఇంధన భద్రత మరింత బలోపేతం అవుతుంది. అంతే కాకుండా.. ఈ రిఫైనరీ ఆధారంగా ఇక్కడ పెట్రోకెమికల్, ప్లాస్టిక్ పార్క్ అభివృద్ధి చెందనుంది. దీనివల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలు ఏర్పడి స్థానిక ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి. ఈ ప్రాజెక్టు వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. దీంతో రాజస్థాన్ రాష్ట్రం ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందనుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement