breaking news
Petro Chemical Complex
-
పెట్రో కెమికల్ కారిడార్‌తో 50 లక్షల మందికి ఉపాధి అవకాశాలు..
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా ఉందని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. 25వేల కోట్ల రూపాయలతో పెట్రో కెమికల్ కారిడార్ రూపొందించనున్నట్లు వెల్లడించారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్‌తో సుమారు 50 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు తెలిపారు.రానున్న 2, 3 ఏళ్లల్లో పెట్రో కెమికల్ రంగంలోకి భారీగా పెట్టుబడులు రాబోతున్నట్లు వెల్లడించారు. ఈస్ట్‌కోస్ట్ కారిడార్‌లో రూ.30వేల కోట్ల వరకు పెట్టుబడులు రానున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ఇథనాల్ రంగంలోకి మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే అనుబంధ పరిశ్రమలు కలుపుకొని మరో 2 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశం ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పెట్రో కెమికల్ ప్రాజెక్టు పూర్తికి కేంద్రం నుంచి పూర్తి సహకారానికి అంగీకారం తెలిపేలా చేస్తామన్నారు. ఇటీవల పెట్రోల్‌లో ఇథనాల్ వినియోగం 10 శాతం నుంచి 20 శాతానికి కేంద్ర ప్రభుత్వం పెంచిందన్నారు. తద్వారా రాబోయే రోజుల్లో ఇథనాల్ రంగంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంటున్నారు. రాష్ట్రంలో చక్కెర మిల్లుల నుంచి విడుదలయ్యే మొలాసిస్ నుంచి ఇథనాల్ తయారుచేయవచ్చని, చక్కెర మిల్లులు ప్రత్యేకంగా ఈ ప్లాంట్లను నెలకొల్పడానికి పెట్టుబడులు కావాలన్నారు. దేశవ్యాప్తంగా ఇథనాల్ ఉత్పత్తి పెంచే చర్యల్లో భాగంగా రూ. 1,000 కోట్లు కేంద్రం ఇవ్వనుందని తెలిపారు. ‘పెట్రో కెమికల్ కాంప్లెక్స్ గురించి ప్రాజెక్టు రిపోర్ట్ ప్రజంటేషన్ ఇవ్వడం జరిగింది. వయోబిలిటీ గ్యాప్ ఫండింగ్ పైనా కేంద్ర, రాష్ట్ర కార్యదర్శులు ప్రణాళిక సిద్ధం చేయడానికి దిశానిర్దేశం. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో చర్యలు. ఆ తర్వాత కేంద్రం ఆమోదంతో ప్రాజెక్టు పనులు మొదలు. అదే జరిగితే ప్రైవేటు పెట్టుబడులు కూడా అనేకం వస్తాయి. అభివృద్ధి, పెట్టుబడులకు సంబంధించి ఎంవోయూల గురించి చెప్పలేదు. కేవలం గ్రౌండ్ అయినవి మాత్రమే ఓపెన్‌గా ప్రకటించాం. రాష్ట్రంలో రూ. 30 వేల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అవడమే కాకుండా, మరో రూ.16వేల కోట్లు ఎస్ఐపీసీలో క్లియర్ అయ్యాయి. ఎస్ఐపీబీ అనంతరం వీటిపై కూడా పూర్తి క్లారిటీ. కోవిడ్ విపత్తులోనూ 45,000 ఉపాధి అవకాశాలు సృష్టించడం చిన్న విషయం కాదు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రౌండ్ అయిన ప్రాజెక్టుల గురించి అది కూడా 2019 నుంచి గ్రౌండ్ అయినవే చెప్పాం’. అని తెలిపారు. చదవండి: సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన లేళ్ల అప్పిరెడ్డి ఏపీ: గ్రూప్-1 ఇంటర్వ్యూలపై హైకోర్టు స్టే -
1.22 లక్షల కోట్ల ‘పెట్రో’ పెట్టుబడులు
-
1.22 లక్షల కోట్ల ‘పెట్రో’ పెట్టుబడులు
►రూ.60 వేల కోట్లతో పెట్రోకెమికల్ కాంప్లెక్స్, హెచ్‌పీసీఎల్ విస్తరణ ► మరో రూ.62 వేల కోట్లతో కేజీ బేసిన్లో క్రూడాయిల్ వెలికితీత ► పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ► విశాఖలో పెట్రో యూనివర్సిటీకి శంకుస్థాపన ► ప్రత్యేక ప్యాకేజీతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం: సీఎం సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రో రంగానికి రూ.లక్షా 22 వేల కోట్లు వెచ్చించనున్నట్టు కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ సహాయమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. వీటిలో రూ.62 వేల కోట్లతో పెట్రోకెమికల్ కాంప్లెక్స్, హెచ్‌పీసీఎల్ విస్తరణ, మరో రూ.60 వేల కోట్లతో కేజీ బేసిన్లో క్రూడాయిల్ వెలికితీతకు ఖర్చు చేయనున్నామని వెల్లడించారు. విశాఖ జిల్లా సబ్బవరం మండలం వంగలిలో రూ.600 కోట్లతో నిర్మించనున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (పెట్రో యూనివర్సిటీ)కి గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిలతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ... ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న మేరకు పెట్రో యూనివర్సిటీని విశాఖలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌కు, డిసెంబర్లో హెచ్‌పీసీఎల్ విస్తరణకు శంకుస్థాపన చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకులు విదేశాల్లో పెట్రో రంగంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌లో పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా పనులు వేగవంతం చేస్తామని చెప్పారు. వచ్చే జూన్ 2వ తేదీ నాటికల్లా రాష్ట్రంలో ప్రధాని ఉజ్వల్ యోజన కింద అందరికీ గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తామని మంత్రి వెల్లడించారు. అంతకుముందు నేషనల్ స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్‌ను మంత్రి ధర్మేంద్ర జాతికి అంకితం చేశారు. రాష్ట్రంలో తొలిసారిగా ప్రధాని ఉజ్వల్ యోజన పథకాన్ని ఇక్కడినుంచే ప్రారంభించారు. ప్యాకేజీని సమర్థిస్తున్నా: చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీని సమర్థించడమే కాదు, అందుకు కారకుడైన వెంకయ్యనాయుడిని అభినందిస్తున్నానని చంద్రబాబు చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీతో రాష్ట్రంలో అభివృద్ధికి శ్రీకారం చుడతామన్నారు. విశాఖ నుంచి రాజమహేంద్రవరం వరకు పెట్రో హబ్‌గా తయారవుతుందని చెప్పారు. ఏపీలో రెండేళ్లలోనే జాతీయ విద్యా సంస్థల ఏర్పాటు ప్రధాని మోదీ ఘనతేనని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కొనియాడారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. కేంద్రం రాష్ట్రానికిచ్చే సొమ్ము పాచిపోదని, చట్టవిరుద్ధంగా దాచుకున్న సొమ్మే పాచిపోతుందని వ్యాఖ్యానించారు. వైఎస్ హయాంలోనే స్థల పరిశీలన పెట్రోవర్సిటీకి విశాఖలో శంకుస్థాపన చేసిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడులు వర్సిటీని తీసుకురావడం తమ ప్రభుత్వాల ఘనతగా చెప్పుకున్నారు. కానీ వాస్తవాలు చూస్తే.. దివంగత వైఎస్ఆర్ హయాంలోనే విశాఖలో ఐఐఎం, రాజమండ్రిలో పెట్రో వర్సిటీ ఏర్పాటుచేయాలని యూపీఏ ప్రభుత్వాన్ని కోరగా సుముఖత వ్యక్తంచేసింది. 2013లోనే కేంద్ర ఉన్నతాధికారుల బృందం స్థల పరిశీలన చేసింది. తాత్కాలిక తరగతుల నిర్వహణ కోసం భవన సముదాయాలను పరిశీలించారు. ఆ తర్వాత వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం కూడా రాజమండ్రిలోనే పెట్రోవర్సిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొంది. తొలి బడ్జెట్లో ఇందుకు తూర్పు గోదావరి జిల్లా పేరే ప్రతిపాదించారు. ఆ తర్వాత స్థలాలు అందుబాటులో లేవంటూ విశాఖకు ప్రతిపాదించారు.