మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిసింది. సెన్సెక్స్ 325.78 పాయింట్లు లేదా 0.42 శాతం నష్టంతో 76,909.68 వద్ద.. నిఫ్టీ 76.60 పాయింట్లు లేదా 0.32 శాతం నష్టంతో 24,078.30 వద్ద నిలిచింది.
ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్, కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్, సైయంట్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. నెట్‌వెబ్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్, సిఇఎస్‌సి లిమిటెడ్, అక్యూటాస్ కెమికల్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


