మారిషస్‌ ప్రధానితో భేటీ | PM Narendra Modi meets Mauritius PM Dr Navin Ramgoolam in Victoria | Sakshi
Sakshi News home page

మారిషస్‌ ప్రధానితో భేటీ

Jun 29 2026 1:10 AM | Updated on Jun 29 2026 1:10 AM

PM Narendra Modi meets Mauritius PM Dr Navin Ramgoolam in Victoria

విక్టోరియా: ప్రధాని  మోదీ ఆదివారం మారిషస్‌ ప్రధానమంత్రి నవీన్‌చంద్ర రామ్‌గూలమ్‌తోనూ సమావేశమయ్యారు. భారత్, మారిషస్‌ ద్వైపాక్షిక సంబంధాలపై వారిద్దరూ చర్చించుకున్నారు. పరస్పర సహకారం, సముద్ర భద్రత, వాణిజ్యం సహా పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. ఇరువురు నేతలు భారత్‌– మారిషస్‌ వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతిని సమీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement