మోదీ అధ్యక్షతన ఎన్డీఏ నేతల కీలక భేటీ | Key NDA meeting PM Modi 12 year milestone | Sakshi
Sakshi News home page

మోదీ అధ్యక్షతన ఎన్డీఏ నేతల కీలక భేటీ

Jun 10 2026 5:32 PM | Updated on Jun 10 2026 7:59 PM

Key NDA meeting PM Modi 12 year milestone

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన భారత మండపంలో ఎన్డీఏ నేతలు సమావేశమయ్యారు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశం జరుపుతున్నారు. అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన రికార్డును సొంతం చేసుకున్న మోదీని ఎన్డీఏ నేతలు సత్కరించారు. మోదీని అభినందిస్తూ ఎన్డీఏ తీర్మానం చేసింది. ఈ సమావేశంలో పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.

ఎన్‌డీఏలోని కీలక నేతలు భారత్ మండపానికి చేరుకుని సమావేశంలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరయ్యారు.

అలాగే, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, బిహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరి కూడా సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి భవిష్యత్ వ్యూహం, రాజకీయ అజెండాపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది.

కాగా, 2014 మే 26న తొలిసారి పదవీ బాధ్యతలు చేపట్టిన ప్రధాని మోదీ, ఇప్పుడు ప్రభుత్వ అధినేతగా వరుసగా 4,399 రోజులు పూర్తి చేశారు. ఎన్నికైన ప్రభుత్వ అధినేతగా జవహర్‌లాల్ నెహ్రూ పదవీకాలాన్ని అధిగమించారు. అయితే నెహ్రూ 1947 నుంచి 1964లో మరణించే వరకు ప్రధానిగా కొనసాగారు. కానీ ఈ పోలిక ప్రత్యేకంగా తొలి లోక్‌సభ ఎన్నికల తర్వాతి కాలానికి మాత్రమే సంబంధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement