14న మాక్రాన్‌తో ప్రధాని మోదీ భేటీ | PM Narendra Modi to visit France and Slovakia tour | Sakshi
Sakshi News home page

14న మాక్రాన్‌తో ప్రధాని మోదీ భేటీ

Jun 12 2026 5:13 AM | Updated on Jun 12 2026 6:22 AM

PM Narendra Modi to visit France and Slovakia tour

న్యూఢిల్లీ: శనివారం నుంచి ప్రధాని మోదీ ఫ్రాన్స్, స్లొవేకియాల్లో వారం రోజులపాటు పర్యటించనున్నారు. పారిస్‌లో జరిగే జీ–7 శిఖరాగ్రంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మాక్రాన్‌తో విస్తృత చర్చలు జరపునున్నారు. నీస్‌ నగరంలో 14న మేక్రాన్‌తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 

ఫ్రాన్స్‌ కంపెనీలతో మల్టీ రోల్‌ ఫైటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రాజెక్టుపై ఒప్పందం కుదిరే అవకాశముంది. అదేవిధంగా, ఫ్రెంచి కంపెనీలు భారత్‌లో అణు విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుపై అవగాహన కుదుర్చుకునే వీలుందని సమాచారం. ఫ్రాన్స్‌తో కనీసం 12 ఒప్పందాలు కుదిరేందుకు ఛాన్సుందని చెబుతున్నారు. అనంతరం ప్రధాని జీ 7 దేశాల నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. శిఖరాగ్రానికి హాజరయ్యే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తోనూ ప్రధాని భేటీ అవుతారని భావిస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు షెడ్యూల్‌ ఖరారు కాలేదు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement