విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి | Prime Minister expresses grief over the mishap at the Visakhapatnam Steel Plant | Sakshi
Sakshi News home page

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి

Jun 8 2026 8:21 PM | Updated on Jun 8 2026 9:46 PM

Prime Minister expresses grief over the mishap at the Visakhapatnam Steel Plant

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బాధితులకు స్థానిక అధికారులు సాధ్యమైనంత సహాయం అందిస్తున్నారని పేర్కొన్నారు.

మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌) నుంచి 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 రూపాయలు అందజేస్తామని ప్రధానమంత్రి తెలిపారు.

కాగా, ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలు కాలిపోయాయి. బాధితులకు న్యాయం చయాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. చనిపోయిన ఒక్కొక్కరికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని అంటున్నారు. అలాగే, కుటుంబంలో అర్హులైన వారికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు, క్షతగాత్రుల్లో ఆరుగురిని గుర్తించారు. వారి పేర్లు రావూరి మల్లికార్జున రావు, పల్లెల శ్రీనివాసరావు, అప్పారావు, సత్యానంద్ బొల్లా, హరిబాబు, రాజు.

మృతుల వివరాలు

ఉద్యోగులు
గొంతిన భాను కుమార్ (టెక్నీషియన్)
జి.వి. అప్పారావు
ఎం. కృష్ణ నాగు
కె. ప్రభాకర్ (జనరల్ ఫోర్‌మ్యాన్)
గోల్డ్ కుమార్ (మేనేజర్, మెకానిక్-2 ఇన్‌చార్జ్)

కాంట్రాక్ట్ కార్మికులు
రమణ
త్రినాథ్
ఎన్. అప్పల రాజు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement