నేషనల్‌ ఎక్స్‌పో వస్త్ర ప్రదర్శనకు విశేష స్పందన | - | Sakshi
Sakshi News home page

నేషనల్‌ ఎక్స్‌పో వస్త్ర ప్రదర్శనకు విశేష స్పందన

Jul 25 2026 12:29 AM | Updated on Jul 25 2026 12:29 AM

డాబాగార్డెన్స్‌: గ్రీన్‌పార్క్‌ హోటల్‌లో నిర్వహిస్తున్న నేషనల్‌ ఎక్స్‌పో వస్త్ర ప్రదర్శనకు విశేష స్పందన లభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆషాఢం, శ్రావణ మాసాలను దృష్టిలో ఉంచుకుని మహిళల అభిరుచికి అనుగుణంగా పైఠాణీ సిల్క్‌, బెంగళూరు సిల్క్‌, కాశీదా సిల్క్‌, చందేరి, మహేశ్వరి సిల్క్‌, హ్యాండ్‌పెయింట్‌, బలుచారి, జమ్‌దానీ, తంగైల్‌, ఢాకా మస్లిన్‌, లినెన్‌, కంథా వర్క్‌, కంజీవరం, బంధనీ, కచ్‌ ఎంబ్రాయిడరీ, పటోలా, భాగల్‌పూర్‌ సిల్క్‌ చీరలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే దుప్పట్లు, సల్వార్‌ మెటీరియల్స్‌ కూడా విక్రయానికి ఉంచినట్లు పేర్కొన్నారు. 50 శాతం వరకు తగ్గింపు ధరలకు విక్రయిస్తున్నామని,ఈ ప్రదర్శన ఈ నెల 28 వరకు ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement