సాక్షి, విశాఖపట్నం: వైఎస్సా ర్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ అనుబంధ విభాగాల్లో పలువురికి చోటు కల్పించారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్‌గా కలిదిండి బద్రినాఽథ్ (విశాఖ పశ్చిమ), రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శిగా అనిపాక పెంటారావు (నార్త్)ను నియమించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా మత్స్యకార విభాగం ప్రెసిడెంట్‌గా వాసుపల్లి ధనరాజు (దక్షిణ), జిల్లా గ్రీవెన్స్ సెల్ ప్రధాన కార్యదర్శిగా పండూరి రాజు (గాజువాక), జిల్లా వైఎస్సార్ టీయూసీ ప్రధాన కార్యదర్శిగా గొందేసి అప్పల రెడ్డి(గాజువాక), జిల్లా ఇంటలెక్చువల్ ఫోరం సెక్రెటరీగా పిట్టా మధురెడ్డి (గాజువాక), జిల్లా లీగల్ సెల్ సెక్రెటరీగా వీవీ రవికుమార్ (గాజువాక), జిల్లా ఐటీ వింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా నీలాపు అనిల్‌కుమార్(గాజువాక), జిల్లా లీగల్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అండిబోయిన అరుణ్‌కుమార్ (గాజువాక), జిల్లా పబ్లిసిటీ వింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా చేతల రామ్మోహన్‌రెడ్డి (గాజువాక), జిల్లా ఎస్సీ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా బల్లంకి నాగరాజు (గాజువాక)ను నియమించారు. గాజువాక నియోజకవర్గ గ్రీవెన్స్ సెల్ ప్రెసిడెంట్‌గా మడల నరసింగరావును, గాజువాక నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్‌గా ఈతలపాక మంగరాజు, తూర్పు నియోజకవర్గం నాగవంశీయుల విభాగం ప్రెసిడెంట్‌గా కనకాల గురునాయుడు, దక్షిణ నియోజకవర్గం కాళింగ విభాగం ప్రెసిడెంట్‌గా పట్నాన రమణ, దక్షిణ నియోజకవర్గం నాయీ బ్రాహ్మణ విభాగం ప్రెసిడెంట్‌గా వీరేశ్వరపు త్రీనాఽథరావును నియమించారు.


