పవిత్రమైన అమర్‌నాథ్ యాత్ర 2026 అధికారికంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ యాత్రికులకు ప్రత్యేక లేఖ రాశారు. ఈ యాత్రను గొప్ప అదృష్టంగా అభివర్ణించారు. భక్తి, ఆధ్యాత్మికతతో పాటు సామాజిక బాధ్యతను కూడా పాటించాలని భక్తులకు ఆయన సూచించారు. ఈ మేరకు ఐదు సంకల్పాలను మోదీ సూచించారు.
ప్రధాని మోదీ లేఖలో ప్రధాన సందేశం
యాత్రికులకు రాసిన లేఖలో ప్రధాని మోదీ.. అమర్‌నాథ్ యాత్రను భారతదేశ ఆధ్యాత్మిక సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన యాత్రలలో ఒకటిగా పేర్కొన్నారు. ఆయన ఈ యాత్రను భక్తి, ఏకత్వం మరియు శ్రద్ధకు ప్రతీకగా అభివర్ణించారు. ఈ సమయంలో యాత్రికులు పాటించాల్సిన ముఖ్యమైన అంశాలుగా ఆయన ఐదు సంకల్పాలుగా సూచించారు.
The first batch of Amarnath pilgrims departs from the Baltal base camp for the holy cave shrine.@waseem_andrabi pic.twitter.com/pXIzwgKKmj
— Waseem Andrabi وسیم (@waseem_andrabi) July 3, 2026
ఐదు సంకల్పాలు ఇవే..
యాత్ర మార్గాల్లో పరిశుభ్రతను కాపాడటం
భద్రతా నియమాలు, ట్రాఫిక్ నియమాలను పాటించడం
స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం (“Vocal for Local”)
యాత్ర అనంతరం ఒక మొక్క నాటడం (“Ek Ped Maa Ke Naam”)
దేశాభివృద్ధికి బాధ్యతగా వ్యవహరించడం (“Nation First” భావన)
ఇక, ఈ ఏడాది యాత్ర జూలై 3 నుంచి ఆగస్టు 28 వరకు 57 రోజుల పాటు కొనసాగనుంది. హిమాలయాల్లో 12,000 అడుగుల ఎత్తులో ఉన్న అమర్‌నాథ్ గుహకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొంటారు. యాత్ర ప్రారంభానికి ముందు జమ్మూ నుంచి మొదటి భక్తుల బృందాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి పంపించారు. ఈ సందర్భంగా భక్తులు “హర్ హర్ మహాదేవ్”, “బమ్ బమ్ భోలే” అంటూ భక్తి నినాదాలు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా కేంద్ర బలగాలు, జమ్మూ, కాశ్మీర్ పోలీసులు కలిసి బలమైన మల్టీ-లేయర్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. డ్రోన్లు, సీసీటీవీలు, ఆధునిక మానిటరింగ్ వ్యవస్థలు ఉపయోగించి యాత్ర మార్గాన్ని పర్యవేక్షిస్తున్నారు.


