న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 20వ తేదీన 26వ విడత పీఎం–కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లీ జిల్లా తారకేశ్వర్‌లో పర్యటన సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న 9.44 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.18,880 కోట్లను జమ చేయనున్నారు. పీఎం–కిసాన్ ద్వారా పశ్చిమబెంగాల్‌లోని 45.35 లక్షల మంది రైతులు రూ.907 కోట్ల మేర అందుకోనున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు.
2019లో ఈ పథకం మొదలు కాగా ఇప్పటివరకు మొత్తం రూ.4.46 లక్షల కోట్లను రైతులకు సాగు సాయంగా విడుదల చేసినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. పశ్చిమబెంగాల్‌లో పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ఫసల్ బీయో యోజన (పీఎంఎఫ్‌బీవై)ని, రాష్ట్రంలో పునర్‌వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని కూడా ప్రారంభిస్తారని మంత్రి వివరించారు.


