పారిస్ : ఫ్రాన్స్‌లో జరిగిన 52వ జీ7 శిఖరాగ్ర సమావేశంలో బుధవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశానికి ఆలస్యంగా హాజరయ్యారు. ఆయన ప్రవేశిస్తుండగా సభికులు లేచి నిలబడి చప్పట్లతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. దీంతో నేనే ఇక్కడ బాస్ అంటూ ఆయన సరదాగా మాట్లాడారు.
అనంతరం ఆయన జీ7 ప్రత్యేక సమావేశంలో ప్రసంగించారు."మనం నిజంగా అంతర్జాతీయ ఐక్యతను బలోపేతం చేయాలనుకుంటే, ఈ సంక్షోభాల భారాన్ని అత్యంత బలహీన దేశాలు ఒంటరిగా మోయకూడదు. నేడు అనేక సమాజాలు వృద్ధాప్యం వైపు పయనిస్తుండగా, భారతదేశం మరియు గ్లోబల్ సౌత్‌లోని ఇతర దేశాలు యువ ప్రతిభ, నైపుణ్యాలతో ఉప్పొంగుతున్నాయి.అని భారత్‌ను ప్రశంసిస్తూ మాట్లాడారు.
అంతకుముందు సమావేశంలో మాట్లాడిన భారత ప్రధాని 'పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా ఇంధనం, ఎరువులు, ఆహార సరఫరా గొలుసులలో ఏర్పడిన అంతరాయాలు గ్లోబల్ సౌత్‌పై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయని మోదీ అన్నారు. కాగా జీ 7 దేశాలలో భారత్ సభ్య దేశంగా లేదు. అయినప్పటికీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రత్యేక ఆహ్వానం మేరకు సదస్సులో పాల్గొనడానికి మోదీ ఫ్రాన్స్ వెళ్లారు.
కాగా ఈ రోజు సాయంత్రం ట్రంప్‌తో, మోదీ భేటి జరగనుంది. వాణిజ్య ఒప్పందంతో సహా పలు అంశాలపై ఈ ఇద్దరు నాయకులు చర్చించే అవకాశం ఉంది. వీరు చివరిసారిగా 16 నెలల క్రితం, 2025 ఫిబ్రవరిలో వాషింగ్టన్‌లో సమావేశమయ్యారు.


