తీవ్ర మనోవేదనలో ఉండగా మోదీ ఫోన్‌ చేశారు.. మాజీ సీఎం | shivraj singh chauhan book pm modi experiences | Sakshi
Sakshi News home page

తీవ్ర మనోవేదనలో ఉండగా మోదీ ఫోన్‌ చేశారు.. మాజీ సీఎం

May 28 2026 12:18 AM | Updated on May 28 2026 12:29 AM

shivraj singh chauhan book pm modi experiences

ఢిల్లీ: తాను మానసికంగా తీవ్ర ఆందోళనలో ఉన్న సమయంలో ‍ ప్రధాని మోదీ తనకు ఫోన్‌ చేశారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆయన రాసిన "అప్నాపన్" 'మై ఎక్స్‌పీరియన్సెస్ విత్ నరేంద్ర మోదీ' అనే  పుస్తకాన్ని మాజీ ప్రధానమంత్రి హెచ్‌డి దేవెగౌడ, మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు.

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తన 35 ఏళ్ల అనుభవంపై ఒక పుస్తకం రాశారు. అందులో ప్రధానితో ఆయనుకున్న అనుభవాల్ని పంచుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసినప్పటికీ, అందులో శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు లేదన్నారు. ఆ సమయంలో తన రాజకీయ ప్రస్థానం అప్పటికే ముగిసిపోయిందన్నట్లుగా ప్రచారం చేశారని ప్రతిపక్షాలు  "మేము వెళ్ళిపోతే, మిమ్మల్ని చాలా మిస్ అవుతాము" అనే వాక్యాన్ని ప్రతిపక్షాలు ప్రచారం చేయడం ప్రారంభించాయన్నారు.

ఆసమయంలో ప్రధాని మోదీ తనకు ఫోన్ చేశారని " నేను ముఖ్యమంత్రితో కాదు, నా శివరాజ్‌తో మాట్లాడుతున్నాను. "మీరెందుకు ఇంతగా ఆందోళన చెందుతున్నారు? కొన్ని రోజులు ఏకాంతంలోకి వెళ్ళండి, మీ అంతరాత్మను పరిశీలించుకోండి, మరియు మీ మనస్సును ప్రశాంతం చేసుకోండి." అని తనకు సూచన ఇచ్చినట్లు తెలిపారు. ఆసమయంలో మోదీ ఒక నాయకుడిగానే కాకుండా  అన్నలా మాట్లాడారని పుస్తకంలో రాశారు. శివరాజ్ మనోస్థైర్యం దెబ్బతింటే, అది లక్షలాది మంది కార్మికులపై ప్రభావం చూపుతుందని ఆయన సూచించారన్నారు.

ఆ తర్వాత ఉత్తరాఖండ్‌కు వెళ్లి అక్కడ ఆయన గంగా నదీ తీరంలో ధ్యానం చేశానని  తిరిగి వచ్చిన తర్వాత, పూర్తి ఉత్సాహంతో ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. పుస్తకం ప్రకారం, ఆయన 13-14 రోజుల్లో 165కు పైగా ర్యాలీలు నిర్వహించానని పుస్తకంలో రాసుకొచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement