పారిస్: ఫ్రాన్స్‌లోని ఎవియన్‌లో జరుగుతున్న జీ 7 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పరం కరచాలనం చేసుకున్నారు. గత 16 నెలల తర్వాత ఇద్దరూ బహిరంగంగా కలుసుకున్న తొలి సందర్భం ఇదే.
ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఆతిథ్యం ఇచ్చిన ఈ శిఖరాగ్ర సమావేశానికి ప్రపంచ నాయకులు హాజరయ్యారు. కీలక అంతర్జాతీయ అంశాలపై చర్చలు ప్రారంభం కావడానికి ముందు మాక్రోన్ సమావేశ వేదిక వద్ద ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. కాగా, బుధవారం (జూన్ 17)న మోదీ, ట్రంప్ భేటీ కానున్నారు.
జీ7 సదస్సుకు ప్రపంచ దేశాల నాయకులు హాజరయ్యారు. అమెరికా కుదుర్చుకున్న ఇరాన్ ఒప్పందంపై నేతల మధ్య బహిరంగంగా, స్పష్టమైన చర్చలు జరిగినట్లు సోర్సెస్ తెలిపాయి. ట్రంప్, ముగ్గురు అరబ్ దేశాల నాయకులతో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో కూడా సమావేశం కానున్నారు.
ఇరాన్‌తో కుదిరిన ఒప్పందం పూర్తి వివరాలను మరో 2 రోజుల్లో బహిరంగంగా విడుదల చేస్తానని ట్రంప్ తెలిపారు. అవసరమైతే ఆ పత్రాన్ని కెమెరాల ముందే చదివి వినిపిస్తానని కూడా వ్యాఖ్యానించారు. అలాగే ఆ ఒప్పందాన్ని పరిశీలన కోసం అమెరికా కాంగ్రెస్‌కు పంపుతానని చెప్పారు. ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన క్లిష్టమైన అంశాల పరిష్కారానికి జరగనున్న తదుపరి దశ చర్చలు మరింత సులభంగా ఉంటాయని ట్రంప్ గతంలో పేర్కొన్నారు.
#WATCH | Prime Minister Narendra Modi and other G7 world leaders stand together for a group photo at the G7 Summit, in Evian, France.
(Video: DD News) pic.twitter.com/MI5YiAys44
— ANI (@ANI) June 16, 2026


