Sports
-
మరోసారి తండ్రైన టీమిండియా క్రికెటర్
టీమిండియా క్రికెటర్ జయదేవ్ ఉనద్కత్ మరోసారి తండ్రి అయ్యాడు. అతని భార్య రిన్నీ కంతారియా ఈ నెల 18న మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఉనద్కత్ ఇవాళ (మే 28) సాయంత్రం సోషల్‌మీడియా వేదికగా వెల్లడించాడు. ఉనద్కత్, రిన్నీ 2021లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2023 డిసెంబర్లో జేడన్ (మగబిడ్డ) జన్మించాడు.👼🏻❤️ pic.twitter.com/Maoc5AbA3h— Jaydev Unadkat (@JUnadkat) May 28, 202533 ఏళ్ల ఉనద్కత్ ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడాడు. ఈ సీజన్లో అతను 7 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీశాడు. ఈ సీజన్లో సన్‌రైజర్స్ లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఉనద్కత్ రంజీల్లో సౌరాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తాడు. ఆ జట్టుకు అతను కెప్టెన్‌గానూ వ్యవహరిస్తున్నాడు. అతని సారథ్యంలో సౌరాష్ట్ర 2020లో రంజీ ట్రోఫీ గెలిచింది. ఇది ఆ జట్టుకు తొలి టైటిల్. 2010లో టీమిండియా అరంగేట్రం చేసిన ఉనద్కత్.. మధ్యలో చాలాకాలం జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. 15 ఏళ్లలో అతను టీమిండియా తరఫున 4 టెస్ట్‌లు, 8 వన్డేలు, 10 టీ20లు మాత్రమే ఆడాడు. ఇందులో 26 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో ఉనద్కత్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. క్యాష్ రిచ్ లీగ్‌లోనూ 2010లోనే కెరీర్ ప్రారంభించిన ఉనద్కత్.. ఇప్పటివరకు వివిధ ఫ్రాంచైజీల తరఫున 112 మ్యాచ్‌లు ఆడి 110 వికెట్లు తీశాడు. -
విండీస్‌తో తొలి వన్డే.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఐపీఎల్ స్టార్లకు చోటు
భారతకాలమానం ప్రకారం రేపు (మే 29) సాయంత్రం 5:30 గంటలకు వెస్టిండీస్‌తో జరుగబోయే తొలి వన్డే కోసం ఇంగ్లండ్ తుది జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టులో ఐపీఎల్-2025 స్టార్ త్రయం జోస్ బట్లర్ (గుజరాత్ టైటాన్స్), విల్ జాక్స్ (ముంబై ఇండియన్స్), జేకబ్ బేతెల్‌కు (ఆర్సీబీ) చోటు దక్కింది. వీరితో పాటు సీఎస్కే బౌలర్ జేమీ ఓవర్టన్ కూడా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌లో ఇంగ్లిష్ జట్టుకు హ్యారీ బ్రూక్ నాయకత్వం వహిస్తున్నాడు. బట్లర్, బేతెల్, జాక్స్ ఐపీఎల్లో తమ జట్లు ప్లే ఆఫ్స్ ఆడాల్సి ఉన్నా లీగ్ మ్యాచ్‌లు పూర్తి కాగానే జాతీయ విధులకు హాజరయ్యారు. ఈ ముగ్గురు లీగ్ దశలో తమతమ జట్ల తరఫున అత్యుత్తమ ప్రదర్శనలు చేశారు.రేపు విండీస్‌తో జరుగబోయే మ్యాచ్‌లో జేమీ స్మిత్, బెన్ డకెట్ ఓపెనింగ్ చేస్తారు. వెటరన్ ఆటగాడు మూడో స్థానంలో, కెప్టెన్ బ్రూక్ నాలుగో స్థానంలో, బట్లర్, బేతెల్, జాక్స్, ఓవర్టన్ వరుసగా ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో బరిలోకి దిగుతారు. గాయం కారణంగా ఐపీఎల్ ప్రారంభానికి ముందే వైదొలిగిన బ్రైడన్ కార్స్ కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు.ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన జోఫ్రా ఆర్చర్ కూడా తొలుత ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆర్చర్ ఐపీఎల్ సందర్భంగా గాయపడటంతో అతని స్థానంలో సాకిబ్ మహమూద్‌ను ఎంపిక చేసుకుంది ఇంగ్లిష్ మేనేజ్మెంట్. రేపటి మ్యాచ్‌కు అతను కూడా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. మొత్తంగా చూస్తే, రేపు విండీస్‌తో తలపడబోయే ఇంగ్లిష్ జట్టు ఐపీఎల్ డూప్ జట్టుగా కనిపిస్తుంది.విండీస్‌తో తొలి వన్డే కోసం ఇంగ్లండ్ తుది జట్టు..బెన్ డకెట్, జేమీ స్మిత్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), జేకబ్ బేతెల్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, బ్రైడాన్ కార్స్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్.ఇదిలా ఉంటే, రేపటి మ్యాచ్ కోసం విండీస్ తుది జట్టును ప్రకటించాల్సి ఉంది. మూడు వన్డేలు, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం విండీస్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత వన్డే సిరీస్, ఆతర్వాత టీ20 సిరీస్ జరుగుతాయి. మే 29, జూన్ 3 తేదీల్లో వన్డేలు.. 6, 8, 10 తేదీల్లో టీ20లు జరుగనున్నాయి.పూర్తి జట్లు..వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, కీసీ కార్టీ, షాయ్ హోప్(w/c), అమీర్ జాంగూ, జస్టిన్ గ్రీవ్స్, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, అల్జారి జోసెఫ్, గుడకేష్ మోటీ, షమర్ జోసెఫ్, జెడియా బ్లేడ్స్, జ్యువెల్ ఆండ్రూ, జేడెన్ సీల్స్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, షిమ్రాన్ హెట్మైర్ఇంగ్లండ్: బెన్ డకెట్, జేమీ స్మిత్, జో రూట్, హ్యారీ బ్రూక్(c), జోస్ బట్లర్(wk), జాకబ్ బెథెల్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, బ్రైడాన్ కార్స్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ల్యూక్ వుడ్, టామ్ బాంటన్, మాథ్యూ పాట్స్, టామ్ హార్ట్లీ -
IPL 2025: రేటు తక్కువ.. ప్రభావం చాలా ఎక్కువ.. ఆ హీరోలు వీరే..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో కొందరు క్రికెటర్లు అంచనాలకు మించి రాణించారు. వీరిలో కొందరు ఏమాత్రం అంచనాలు లేకుండానే అదరగొట్టారు. ఇలాంటి వారిపై ఫ్రాంచైజీలు చాలా తక్కువ పెట్టుబడి పెట్టి పైసా వసూల్ ప్రదర్శనలు చేయించుకున్నారు. ఇలా రేటు తక్కువ.. ప్రభావం చాలా ఎక్కువ చూపిన ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.ఈ జాబితాలో ముందొచ్చే పేరు వైభవ్ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ ఈ 14 ఏళ్ల కుర్ర చిచ్చరపిడుగును కేవలం రూ. 1.1 కోట్లకు సొంతం చేసుకుంది. తీసుకున్న డబ్బుకు వైభవ్ తొలి మ్యాచ్ నుంచే న్యాయం చేస్తూ వచ్చాడు. ఓ విధ్వంసకర సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 206.56 స్ట్రయిక్‌రేట్‌తో 252 పరుగులు చేశాడు.పైసా వసూల్ ప్రదర్శన చేసిన మరో చిచ్చరపిడుగు ప్రియాంశ్ ఆర్య. ఇతగాడిని పంజాబ్ వేలంలో రూ. 3.8 కోట్లకు సొంతం చేసుకుంది. తొలుత ప్రియాంశ్‌పై పంజాబ్ చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టిందని అంతా అనుకున్నారు. అయితే అతను ఫ్రాంచైజీ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, దాదాపు ప్రతి మ్యాచ్‌లో ఇరగదీశాడు. పంజాబ్ ఈ సీజన్లో టేబుల్ టాపర్‌గా నిలవడంలో ప్రియాంశ్ పాత్ర చాలా కీలకం. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో అతను 183.55 స్ట్రయిక్‌రేట్‌తో సెంచరీ, 2 అర్ద సెంచరీల సాయంతో 424 పరుగులు చేశాడు. రేటు తక్కువ, ప్రభావం ఎక్కువ చూపిన మరో ఆటగాడు ర్యాన్ రికెల్టన్. ముంబై ఇండియన్స్ ఇతన్ని కేవలం కోటి రూపాయలకే సొంతం చేసుకుంది. ఇతను దాదాపు ప్రతి మ్యాచ్‌లో ముంబైకు అద్భుతమైన ఆరంభాలు అందించాడు. ఈ సీజన్లో ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరడంలో రికెల్టన్ కీలకపాత్ర పోషించాడు. ఇతను 14 మ్యాచ్‌ల్లో 150.97 స్ట్రయిక్‌రేట్‌తో 388 పరుగులు చేశాడు.ఈ సీజన్లో తక్కువ ధరకే అబ్బురపడే ప్రదర్శనలు చేసిన మరో ఆటగాడు అనికేత్ వర్మ. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇతన్ని కేవలం 30 లక్షలకే సొంతం చేసుకుంది. ఇతను ఈ సీజన్లో ఆడిన 12 మ్యాచ్‌ల్లో 166.20 స్ట్రయిక్‌రేట్‌తో 236 పరుగులు చేశాడు. లోయల్ మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు దిగే అనికేత్ అంచనాలకు మించి భారీ హిట్టింగ్ చేసి తన జట్టుకు ఎంతో ఉపయోగపడ్డాడు. హెడ్, అభిషేక్, ఇషాన్ కిషన్, క్లాసెన్ లాంటి విధ్వంసకర వీరులు ఉన్న జట్టులో అనికేత్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.పైన పేర్కొన్న నలుగురే కాకుండా ఈ సీజన్లో రేటు తక్కువ, ప్రభావం చాలా ఎక్కువ చూపిన మరికొందరు ఆటగాళ్లు ఉన్నారు. సీఎస్కే తరఫున ఆయుశ్ మాత్రే (30 లక్షలు), డెవాల్డ్ బ్రెవిస్ (2.2 కోట్లు).. ఆర్సీబీ తరఫున కొద్ది మ్యాచ్‌లే ఆడిన దేవ్‌దత్ పడిక్కల్ (2 కోట్లు), ఢిల్లీ ఆల్‌రౌండర్ విప్రాజ్ నిగమ్ (50 లక్షలు), బౌలర్లలో ఎల్ఎస్జీకి చెందిన దిగ్వేశ్ రాఠీ (30 లక్షలు), ముంబై బౌలర్లు అశ్వనీ కుమార్ (30 లక్షలు), కర్ణ్ శర్మ (50 లక్షలు) అంచనాలకు మించి రాణించి ఈ సీజన్లో మంచి పేరు తెచ్చుకున్నారు. -
LSG VS RCB: రిషబ్ పంత్‌పై మండిపడ్డ అశ్విన్.. సొంత బౌలర్‌నే ఫూల్ చేశాడు..!
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 27) జరిగిన లక్నో-ఆర్సీబీ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ కీలక దశలో సాగుతుండగా లక్నో స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ మన్కడింగ్‌కు (నాన్ స్ట్రయికర్ ఎండ్‌లోని బ్యాటర్ బంతి వేయకముందే క్రీజ్‌ను దాటిన సమయంలో బౌలర్ వికెట్లను గిరాటు వేయడం) పాల్పడ్డాడు. ఈ విషయమై రాఠీ అప్పీల్ చేసినప్పటికీ.. లక్నో కెప్టెన్ పంత్ దాన్ని విత్‌డ్రా చేసుకున్నాడు. రీప్లే పరిశీలించిన అనంతరం థర్డ్ అంపైర్ దీన్ని నాటౌట్‌గా ప్రకటించాడు.టెక్నికల్‌గా (రాఠీ ఫ్రంట్ ఫుట్ ల్యాండ్ అయ్యే సమయానికి నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న జితేశ్ శర్మ క్రీజ్‌లోనే ఉన్నాడు) ఇది నాటౌటే అయినప్పటికీ.. రూల్స్‌కు విరుద్దం అయితే కాదు. గతంలో చాలా సందర్భాల్లో బౌలర్లు మన్కడింగ్ చేసి బ్యాటర్లను ఔట్ చేశారు. తాజాగా అదే ప్రయత్నం జరిగింది. అయితే ఇక్కడ కెప్టెన్ బౌలర్‌ను సమర్థించకపోవడం చర్చనీయాంశంగా మారింది.అ విషయమై క్రికెట్ సర్కిల్స్లోభిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు రాఠీ చర్యను సమర్దిస్తుంటే.. మరికొందరు పంత్ అప్పీల్‌ను వెనక్కు తీసుకోవడాన్ని తప్పుబడుతున్నారు.రాఠీ చర్యను సమర్దించిన వారిలో సీఎస్కే వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఉన్నాడు. యాష్ ఓ పక్క రాఠీ చర్యను సమర్దిస్తూనే, అప్పీల్‌ను విత్‌డ్రా చేసుకున్న పంత్‌ను తప్పుబట్టాడు. పంత్ అప్పీల్‌ను విత్‌డ్రా చేసుకోవడం వల్ల రాఠీ కోట్లాది మంది అభిమానుల ముందు ఫూల్ అయ్యాడని అభిప్రాయపడ్డాడు. పంత్ రాఠీని జీవితంలో ఇంకోసారి మన్కడింగ్‌కు పాల్పడకుండా చేశాడని మండిపడ్డాడు.మన్కడింగ్ విషయంలో బౌలర్లంటే ఎందుకు అంత చిన్న చూపని ప్రశ్నించాడు. ఓ రకంగా బౌలర్‌కు ఇది అవమానమని అన్నాడు. పంత్ తీసుకున్న నిర్ణయం వల్ల రాఠీ భయపడి ఉంటాడని తెలిపాడు. బౌలర్ చర్యను వెనకేసుకురావడం కెప్టెన్ బాధ్యత అని గుర్తు చేశాడు. ఔటైనా, నాటౌటైనా మన్నడింగ్ అనేది ఆటలో భాగమని అన్నాడు. మ్యాచ్ కీలక దశలో సాగుతుండగా బౌలర్ ఇలాంటి ప్రయత్నం చేయడం తప్పేది కాదని అభిప్రాయపడ్డాడు.కాగా, ఆర్సీబీ 228 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తుండగా ఇన్నింగ్స్ 17వ ఓవర్లో (ఆఖరి బంతికి) ఇది జరిగింది. రాఠీ మన్కడింగ్‌కు పాల్పడే సమయానికి ఆర్సీబీ 19 బంతుల్లో 29 పరుగులు చేయాలి. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. అప్పటకే జితేశ్ శర్మ జోరు మీదున్నాడు. ఒకవేళ జితేశ్ మన్కడింగ్ ద్వారా ఔటయ్యుంటే ఆర్సీబీ కష్టాల్లో పడేది. మ్యాచ్‌ను కూడా కోల్పోవాల్సి వచ్చేది. ఇలాంటి సందర్భంలో పంత్ బౌలర్ అప్పీల్‌ను ఉపసంహరించుకుని ఆర్సీబీకి ఫేవర్ చేశాడు. క్రీడా స్పూర్తి అని పెద్దపెద్ద మాటలు అనుకోవచ్చు కానీ, మ్యాచ్‌ను కాపాడుకునే ప్రయత్నంలో బౌలర్ చేసింది కరెక్టే అని చెప్పాలి. రాఠీ అప్పీల్‌ను పంత్ చిన్నచూపు చూసి తన వ్యక్తిగత ఇమేజ్ను పెంచుకున్నాడు. అంతటితో ఆగకుండా అప్పీల్ విత్‌డ్రా చేసుకున్న తర్వాత జితేశ్‌ను కౌగించుకుని సొంత బౌలర్‌ను అవమానించాడు. మన్కడింగ్ తర్వాత మరింత రెచ్చిపోయిన జితేశ్ కొద్ది బంతుల్లోనే మ్యాచ్‌ను లక్నో చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు. -
IPL 2025: ప్లే ఆఫ్స్‌లో ఆర్సీబీ చరిత్ర ఇదీ..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలవడం ద్వారా క్వాలిఫయర్-1లో పోటీ పడే అవకాశాన్ని (ఇక్కడ గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుతుంది) కూడా దక్కించుకుంది. క్యాష్ రిచ్ లీగ్‌లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరడం ఇది పదోసారి. ఇన్ని ప్రయత్నాల్లో ఆ జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. మూడు సందర్భాల్లో (2009, 2011, 2016) ఫైనల్ వరకు చేరినా రిక్తహస్తాలతో వెనుదిరిగింది.ఐపీఎల్ చరిత్రలో 15 ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ.. ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి, పదింట ఓడింది. ప్లే ఆఫ్స్‌లో ఆర్సీబీని అత్యంత దురదృష్టమైన జట్టు అని అంటారు. లీగ్ దశలో చెలరేగి ఆడే ఈ జట్టు నాకౌట్ మ్యాచ్‌లు వచ్చే సరికి ఢీలా పడిపోతుంది. గతమంతా ఇలాగే సాగింది. కానీ ఈ సారి పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తుంది.ఆర్సీబీ ఈ సీజన్లో చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. ఇందుకు నిన్న (మే 27) లక్నోతో జరిగిన మ్యాచే నిదర్శనం. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 228 పరుగుల భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లి వికెట్ సహా నాలుగు వికెట్లు కోల్పోయినా ఏ మాత్రం ఒత్తిడికి లోనుకాకుండా అబ్బురపడే విజయం సాధించింది. జితేశ్ శర్మ (33 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీని గెలిపించాడు.ఈ గెలుపుతో ఆర్సీబీ క్వాలిఫయర్-1లో పోటీపడే అవకాశాన్ని దక్కించుకుంది. మే 29న జరిగే ఈ పోటీలో ఆర్సీబీ టేబుల్ టాపర్ పంజాబ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఓడినా ఆర్సీబీకి మరో అవకాశం ఉంటుంది. జూన్ 1న జరిగే క్వాలిఫయర్-2లో పోటీ పడే ఛాన్స్ ఉంటుంది. గుజరాత్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజేతతో ఆర్సీబీ క్వాలిఫయర్-2లో తలపడుతుంది.ప్లే ఆఫ్స్‌లో ఆర్సీబీ ప్రస్తానం..2009- ఫైనల్లో డెక్కన్ ఛార్జర్స్ చేతిలో 6 పరుగుల తేడాతో ఓటమి2010- సెమీఫైనల్లో ముంబై ఇండియన్స్ చేతిలో 35 పరుగుల తేడాతో ఓటమి2011- ఫైనల్లో సీఎస్కే చేతిలో 58 పరుగుల తేడాతో ఓటమి2015- క్వాలిఫయర్-2లో సీఎస్కే చేతిలో 3 వికెట్ల తేడాతో ఓటమి2016- ఫైనల్లో సన్‌రైజర్స్ చేతిలో 8 పరుగుల తేడాతో ఓటమి2020- ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి2021- ఎలిమినేటర్‌లో కేకేఆర్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమి2022- క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి2024- ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమి2025- క్వాలిఫయర్-1లో పంజాబ్ ప్రత్యర్థి -
RCB VS PBKS Qualifier-1: అలా జరిగితే గెలవకపోయినా పంజాబ్ ఫైనల్‌కు చేరుతుంది..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో లీగ్ దశ మ్యాచ్‌లన్నీ ముగిశాయి. పంజాబ్, ఆర్సీబీ, గుజరాత్, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. మే 29న జరిగే క్వాలిఫయర్-1లో ఆర్సీబీ, పంజాబ్ తలపడతాయి. మే 30న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకుంటాయి. లీగ్ దశలో సాధించిన విజయాలు, నెట్ రన్‌రేట్ ఆధారంగా ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారయ్యాయి. పంజాబ్, ఆర్సీబీ తలో 14 మ్యాచ్‌ల్లో చెరో 9 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. పాయింట్లు సమంగా (19) ఉన్నా, ఆర్సీబీతో పోలిస్తే నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉండటంతో పంజాబ్‌కు తొలి ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కింది.గుజరాత్ 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, ముంబై ఇండియన్స్ 14 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. గుజరాత్ కూడా పంజాబ్, ఆర్సీబీ మాదిరి 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు సాధించినా.. పంజాబ్, ఆర్సీబీ ఆడాల్సిన ఓ మ్యాచ్ (వేర్వేరుగా) రద్దైంది. దీంతో పంజాబ్, ఆర్సీబీలకు అదనంగా తలో పాయింట్ లభించింది.ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు ఎలా..?పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు (పంజాబ్, ఆర్సీబీ) మొదటి క్వాలిఫయర్‌లో తలపడతాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టుకు మరో ఛాన్స్ ఉంటుంది. క్వాలిఫయర్-2లో (జూన్ 1) పోటీ పడే అవకాశం దక్కుతుంది. క్వాలిఫయర్-2లో ఇంకో బెర్త్ ఎలిమినేటర్ మ్యాచ్ ద్వారా తెలుస్తుంది. పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడతాయి. గెలిచిన జట్టు క్వాలిఫయర్-2లో పోటీ పడాల్సి ఉంటుంది. ఎలిమినేటర్‌లో ఓడిన జట్టు ఇంటి ముఖం పడుతుంది. క్వాలిఫయర్-2లో గెలిచే జట్టు.. క్వాలిఫయర్-1లో గెలిచే జట్టుతో ఫైనల్లో (జూన్ 3) తలపడుతుంది.ఆర్సీబీ, పంజాబ్ క్వాలిఫయర్ మ్యాచ్ రద్దైతే..?పంజాబ్, ఆర్సీబీ మధ్య మే 29న జరగాల్సిన క్వాలిఫయర్-1 మ్యాచ్ ఏ కారణంగా అయినా రద్దైతే పంజాబ్ ఫైనల్‌కు చేరుతుంది. పాయింట్ల పట్టికలో పంజాబ్ అగ్రస్థానంలో ఉంది కాబట్టి, ఆ జట్టుకు ఈ అవకాశం దక్కుతుంది. షెడ్యూల్ ప్రకారం క్వాలిఫయర్-1కు రిజర్వ్ డే లేదు. కాబట్టి తప్పనిసరిగా మ్యాచ్ జరిగి గెలిస్తేనే ఆర్సీబీ ఫైనల్‌కు చేరుతుంది. పంజాబ్‌కు అలా కాదు. ఏ కారణంగా అయినా మ్యాచ్ రద్దైనా ఆ జట్టు ఫైనల్‌కు చేరుతుంది. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఏ కారణంగా కూడా పంజాబ్, ఆర్సీబీ క్వాలిఫయర్-1 మ్యాచ్ రద్దయ్యే అవకాశం లేదు. -
LSG VS RCB: అబ్బురపరిచే ఇన్నింగ్స్.. ధోని రికార్డు బద్దలు కొట్టిన జితేశ్
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 27) జరిగిన ఉత్కంఠ సమరంలో లక్నో సూపర్ జెయింట్స్‌పై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీని తాత్కాలిక కెప్టెన్ జితేశ్ శర్మ ఒంటిచేత్తో గెలిపించాడు. 227 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో జితేశ్ హీరోయిక్ ఇన్నింగ్స్ ఆడాడు. 33 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 85 పరుగులు చేసి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు.ఈ ఇన్నింగ్స్‌తో జితేశ్ ధోని పేరిట ఏడేళ్లు కొనసాగిన ఓ రికార్డును బద్దలు కొట్టాడు. విజయవంతమైన ఛేదనల్లో 6 అంతకంటే కింది స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 2018 సీజన్లో ధోని ఆర్సీబీపై 34 బంతుల్లో అజేయమైన 70 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో సీఎస్కే ఆర్సీబీపై విజయం సాధించింది.విజయవంతమైన ఛేదనల్లో 6 అంతకంటే కింది స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్కోర్ చేసిన ఆటగాళ్లు..85*(33) - జితేష్ శర్మ (RCB) vs LSG, లక్నో, 2025 70* (34) - MS ధోని (CSK) vs RCB, బెంగళూరు, 2018 70*(31) - ఆండ్రీ రస్సెల్ (KKR) vs PBKS, ముంబై WS, 2022 70(47) - కీరన్ పొలార్డ్ (MI) vs RCB, బెంగళూరు, 2017 68(30) - డ్వేన్ బ్రావో (CSK) vs MI, ముంబై WS, 2018లక్నో, ఆర్సీబీ మ్యాచ్ పూర్తి వివరాలు..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. రిషబ్ పంత్ (61 బంతుల్లో 118 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో, మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోర్ చేసింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే (4 వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేరింది. జితేశ్ శర్మ (33 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీని ఒంటిచేత్తో గెలిపించాడు. అతనికి మయాంక్ అగర్వాల్ (23 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు) సహకరించాడు.అంతకుముందు విరాట్ కోహ్లి (30 బంతుల్లో 54; 10 ఫోర్లు), ఫిల్ సాల్ట్ (19 బంతుల్లో 30; 6 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి ఆర్సీబీ గెలుపుకు పునాది వేశారు.ఈ గెలుపుతో ఆర్సీబీ టేబుల్ సెకెండ్ టాపర్‌గా నిలిచి క్వాలిఫయర్-1 బెర్త్ ఖరారు చేసుకుంది. మే 29న జరిగే క్వాలిఫయర్-1లో ఆర్సీబీ.. పంజాబ్‌తో తలపడనుంది. మే 30న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకుంటాయి. -
టీమిండియాతో టెస్టు సిరీస్.. ఇంగ్లండ్‌కు ఊహించని షాక్
టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ గస్ అట్కిన్సన్ గాయం బారిన పడ్డాడు. జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో అట్కిన్సన్ తొడ కండరాలు పట్టేశాయి. అతడు గాయం నుంచి కోలుకోవడానికి రెండు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. అతడు ప్రస్తుతం ఇంగ్లండ్ క్రికెట్ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు.ఈ క్రమంలో వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు అట్కిన్సన్ దూరమయ్యాడు. అతడు విండీస్‌తో టీ20లలో కూడా ఆడేది అనుమానమే. కాగా జూన్ 20న ప్రారంభమయ్యే భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ సమయానికైనా 27 ఏళ్ల గస్ అట్కిన్సన్ ఫిట్నెస్ సాధిస్తాడో లేదో వేచి చూడాలి.కాగా విండీస్‌తో వన్డేలకు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఇప్పటికే స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ సేవలను కోల్పోయింది. గాయం కారణంగా ఆర్చర్ విండీస్ టూర్‌కు దూరమయ్యాడు. అతడి స్ధానాన్ని లూక్ వుడ్‌తో ఇంగ్లండ్ సెలక్టర్లు భర్తీ చేశారు. ఇక ఇంగ్లండ్-విండీస్ మధ్య మూడు వన్డేల సిరీస్ గురువారం నుంచి ప్రారంభం కానుంది.ఇంగ్లండ్ వన్డే జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్, విల్ జాక్స్, జో రూట్, బెన్ డకెట్, జోఫ్రా ఆర్చర్, గుస్ అట్కిన్సన్, టామ్ బాంటన్, జేకబ్ బెథెల్, బ్రైడన్ కార్స్, టామ్ హార్ట్లే, సాకిబ్ మహమూద్, మాథ్యూ పాట్స్, జేమీ ఒవర్టన్, ఆదిల్ రషీద్, జేమీ స్మిత్. ఇంగ్లండ్ టీ20 జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జేకబ్ బెథెల్, టామ్ బాంటన్, జోస్ బట్లర్, బ్రైడన్ కార్స్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, సాకిబ్ మహమూద్, మాథ్యూ పాట్స్, జేమీ ఒవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, ల్యూక్ వుడ్. -
భారత-ఎ జట్టు నుంచి తప్పుకున్న శుబ్‌మన్ గిల్..!
ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సమయం అసన్నమవుతోంది. జూన్ 20 నుంచి ఈ హైవోల్టేజ్ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ప్రధాన సిరీస్‌కు ముందు భారత-ఎ జట్టు ఇంగ్లండ్ లయన్స్‌తో రెండు అనాధికారిక టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.తొలి టెస్టు మే 30 నుంచి జూన్ 2 వరకు కాంటర్బరీ వేదికగా, రెండో టెస్టు నార్తాంప్టన్‌లో జూన్ 6 నుంచి 9 వరకు జరగనున్నాయి. అయితే ఈ అనాధికారిక టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇండియా- ఎ జట్టు నుంచి తప్పుకోవాలని గిల్ నిర్ణయించుకున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ సిరీస్‌కు ఎంపిక చేసిన భారత-ఎ జట్టులో గిల్ సభ్యునిగా ఉన్నాడు. ఇంగ్లండ్ కండీషన్స్‌కు అలవాటు పడేందుకు గిల్‌కు ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఉపయోగపడతాయని సెలక్టర్లు భావించారు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కారణంగా తొలి వార్మాప్ మ్యాచ్‌కు గిల్ దూరంగా ఉంటాడని, రెండవ ప్రాక్టీస్ మ్యాచ్ కోసం ఇండియా-ఎ జట్టులో చేరతారని భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలిపాడు. కానీ ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్న గిల్‌కు విశ్రాంతి ఇవ్వాలని సెలక్టర్లు కూడా యోచిస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే భారత-ఎ జట్టు ఇంగ్లండ్‌కు పయనమైంది. ఈ జట్టు కెప్టెన్‌గా దేశవాళీ దిగ్గజం అభిమాన్యు ఈశ్వరన్ వ్యవహరించనున్నాడు. జూన్ 13 నుంచి బెకెన్హామ్ వేదికగా మూడు రోజుల పాటు జరిగే ఇంట్రా స్వ్కాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో గిల్ పాల్గోనే అవకాశముంది.ఇంగ్లండ్ పర్యటనకు భారత- ఎ జట్టు:అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, ధృవ్ జురెల్ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మానవ్ సుతార్, తనుష్ కోటియన్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే, హర్ష్ దూబేచదవండి: ఏయ్ నీవు ఏమి చేస్తున్నావు.. కోపంతో ఊగిపోయిన కోహ్లి! వీడియో వైరల్ -
ఏయ్ నీవు ఏమి చేస్తున్నావు.. కోపంతో ఊగిపోయిన కోహ్లి! వీడియో వైరల్
ఐపీఎల్-2025లో సోమవారం ఎకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. తాత్కాలిక కెప్టెన్ జితేష్ శర్మ తుపాన్ ఇన్నింగ్స్‌తో ఆర్సీబీ టాప్-2 ప్లేస్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఇన్నింగ్స్ 17వ ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది. లక్నో యువ స్పిన్నర్ దిగ్వేష్ సింగ్ రాఠి మరోసారి తన చర్యతో వార్తల్లోకెక్కాడు.అసలేమి జరిగిందంటే?228 పరుగుల భారీ లక్ష్య చేధనలో విరాట్ కోహ్లి(54) ఔటయ్యాక స్టాండ్ ఇన్ కెప్టెన్ జితేష్ శర్మ క్రీజులోకి వచ్చాడు. జితేష్ తన ఎదుర్కొన్న తొలి బంతి నుంచే బౌండరీలు బదడం మొదలుపెట్టాడు. జితేష్ క్రీజులోకి వచ్చినప్పటికే ఆర్సీబీ కావల్సిన రన్ రేట్ ఓవర్‌కు 13పైగా ఉంది. దీంతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. బౌలర్లను ఎంతమంది మార్చిన అతడిని ఆపడం ఎవరి తరం కాలేదు.ఈ క్రమంలో అతడి దూకుడును అడ్డుకట్ట వేసేందుకు స్పిన్నర్ దిగ్వేష్‌ను తిరిగి పంత్ ఎటాక్‌లోకి తెచ్చాడు. దీంతో 17 ఓవర్ వేసిన దిగ్వేష్ ఓవరాక్షన్ చేశాడు. జితేష్‌ను తన బౌలింగ్‌తో ఆపలేకపోయిన దిగ్వేష్.. అతడిని మన్కడింగ్ చేసి పెవిలియన్‌కు పంపాలని ప్రయత్నించాడు. ఆ ఓవర్ ఆఖరి బంతిని వేసే క్రమంలో నాన్ స్ట్రైక్‌లో ఉన్న జితేష్ క్రీజు దాటడం గమనించిన దిగ్వేష్ బంతిని డెలివరీ చేయకుండా స్టంప్స్‌ను పడగొట్టాడు. వెంటనే రనౌట్‌కు అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. పలు మార్లు రిప్లేలు పరిశీలించిన థర్డ్ అంపైర్.. అప్పటికే దిగ్వేశ్ బౌలింగ్ యాక్షన్ పూర్తి చేయడంతో నిబంధనల ప్రకారం నాటౌట్‌గా ప్రకటించాడు.పంత్ క్రీడా స్పూర్తి.. అయితే ఇదే సమయంలో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ క్రీడా స్పూర్తిని ప్రదర్శించాడు. థర్డ్ అంపైర్ తన నిర్ణయం ప్రకటించికముందే పంత్ తమ అప్పీల్‌ను వెనక్కి తీసుకున్నాడు. దీంతో జితేత్.. పంత్‌కు వద్దకు వెళ్లి అలిగంనం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కోహ్లి ఫైర్..కాగా దిగ్వేష్ మన్కడింగ్‌కు ప్రయత్నించడంతో డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్ప విరాట్ కోహ్లి ఊగిపోయాడు. తన చేతిలో ఉన్న బాటిల్‌ను కిందకు విసిరి కొట్టాడు. అస్సలు నీవు ఏమి చేస్తున్నావు అన్నట్లు కోహ్లి సీరియస్ రియాక్షన్ ఇచ్చాడు. కాగా దిగ్వేష్ ఇప్పటికే తన మితిమీరిన ప్రవర్తనతో ఓ మ్యాచ్ నిషేదాన్ని కూడా ఎదుర్కొన్నాడు.థర్డ్ అంపైర్ ఎందుకు నాటౌట్ ఇచ్చాడంటే?మెరిల్‌బోన్ క్రికెట్ నిబంధనల ప్రకారం.. బౌలర్ నాన్ స్ట్రైకర్ బ్యాటర్ ను రనౌట్ చేయాలనుకుంటే యాక్షన్‌ను పూర్తి చేయకముందే ఔట్ చేయాలి. అంటే చేతిని పూర్తిగా తిప్పకముందే వికెట్లను గిరాటు వేయాలి. కానీ దిగ్వేష్ మాత్రం తన బౌలింగ్ యాక్షన్‌ను పూర్తి చేసి స్టంప్స్‌ను పడగొట్టాడు. దీంతో థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. Watch out for Virat’s reaction after Digvesh attempted mankid on Jitesh Sharma. #IPL2025 #IPL #JiteshSharma pic.twitter.com/sAKf6Ck7TV— Akhilesh Dhar (@akhileshdhar1) May 27, 2025 -
కోహ్లి సరికొత్త చరిత్ర.. ప్రపంచ క్రికెట్లో ఒకే ఒక్కడు
ఐపీఎల్-2025లో టీమిండియా స్టార్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లెజెండ్ విరాట్ కోహ్లి పరుగులు వరద పారిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో కోహ్లి అద్బుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు.228 పరుగుల భారీ లక్ష్య చేధనలో ప్రత్యర్ధి బౌలర్లను కోహ్లి ఉతికారేశాడు. కేవలం 30 బంతులు మాత్రమే ఎదుర్కొన్న కోహ్లి 10 ఫోర్ల సాయంతో 54 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన కింగ్ కోహ్లి పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.కోహ్లి సాధించిన రికార్డులు ఇవే..👉ఐపీఎల్లో అత్యధిక ఆర్ధ సెంచరీలు సాధించిన ప్లేయర్‌గా కోహ్లి రికార్డులెక్కాడు. కోహ్లి ఇప్పటివరకు 63 హాఫ్ సెంచరీలు ఐపీఎల్లో సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పేరిట ఉండేది. వార్నర్ ఐపీఎల్లో 62 ఆర్ధ శతకాలు నమోదు చేశాడు. తాజా హాఫ్ సెంచరీతో వార్నర్‌ను కోహ్లి అధిగమించాడు. ఈ ఫీట్‌ను కోహ్లి 257వ ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో అందుకోగా.. వార్నర్ కేవలం 184 ఇన్నింగ్స్‌లలోనే సాధించాడు.👉అదేవిధంగా టీ20 క్రికెట్లో ఓ జట్టు తరుపున 9వేల పరుగుల మైలురాయిని చేరుకున్న ఏకైక ఆటగాడిగా కోహ్లి చరిత్ర సృష్టించాడు. లక్నో మ్యాచ్‌లో 24 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లి ఈ ఫీట్ నమోదు చేశాడు. ఐపీఎల్‌తో పాటు ఛాంపియన్స్ లీగ్టీ20తో కలిపి కోహ్లి ఆర్సీబీ తరుపున 9వేల పరుగులు సాధించాడు. ఈ జాబితాలో రెండో స్దానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ ముంబై ఇండియన్స్ తరుపన 6060 పరుగులు చేశాడు.టీ20 క్రికెట్లో ఓ జట్టు తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..విరాట్ కోహ్లి (ఆర్సీబీ) – 9030 పరుగులురోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్) – 6060 పరుగులుజేమ్స్ విన్స్ (హాంప్‌షైర్) – 5934 పరుగులుసురేశ్ రైనా (సీఎస్కే) – 5529 పరుగులుఎంఎస్ ధోని (సీఎస్కే) – 5314 పరుగులు👉ఐపీఎల్ సీజన్లలో అత్యధిక సార్లు 600 పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి రికార్డు సృష్టించాడు. కోహ్లి ఇప్పటివరకు ఐదు సీజన్లలో 600కు పైగా పరుగులు చేశాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడి 602 పరుగులు చేశాడు.చదవండి: IPL 2025: రిషబ్ పంత్‌కు భారీ షాకిచ్చిన బీసీసీఐ -
రిషబ్ పంత్‌కు భారీ షాకిచ్చిన బీసీసీఐ
ఐపీఎల్-2025 సీజన్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఓటమితో ముగించింది. సోమవారం ఏకానా స్టేడియం వేదికగా రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ పరాజయం పాలైంది. అయితే ఓటమి బాధలో ఉన్న లక్నో కెప్టెన్ రిషబ్ పంత్‌కు మరో బిగ్ షాక్ తగిలింది.ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు మెయింటిన్ చేసినందుకుగానూ పంత్‌కు రూ. 30 లక్షల భారీ జరిమానా ఐపీఎల్ ఎడ్వైజరీ కమిటీ విధించింది. అలాగే జట్టులో ఇంపాక్ట్ ప్లేయర్ సహా అందరూ రూ. 12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 50శాతం జరిమానాగా చెల్లించాలని సదరు కమిటీ ఆదేశించింది.ఈ ఏడాది సీజన్లో లక్నో జట్టు స్లో ఓవర్ రేట్‌ను నమోదు చేయడం ఇది మూడో సారి. అందుకే అంత భారీ మొత్తంలో జరిమానా విధించారు. "లక్నో సూపర్ జెయింట్స్ సారథి రిషబ్ పంత్‌కు జరిమానా విధించాం. ఏకానా స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇది మూడో సారి అయినందున ఆర్టికల్ 2.22 ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం పంత్ కు రూ. 30 లక్షలు ఫైన్ వేశాము ’ అని ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. సీజన్ ఆరంభం నుంచి విఫలమైన పంత్.. తమ ఆఖరి మ్యాచ్‌లో మాత్రం విధ్వంసం సృష్టించాడు. రిషబ్ 61 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 118 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67, 4 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో మెరిశాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 228 పరుగుల భారీ లక్ష్యాన్ని బెంగళూరు కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో చేధించింది.చదవండి: IND Vs ENG: బీసీసీఐ కీలక నిర్ణయం.. దిలీప్‌కు మళ్లీ పిలుపు -
IPL 2025: ఐపీఎల్ ప్లే ఆఫ్స్.. ఎవరితో ఎవరు ఆడతారంటే?
ఐపీఎల్-2025లో లీగ్ దశ మ్యాచ్‌లు సోమవారం(మే 27)తో ముగిశాయి. ఈ మెగా టోర్నీ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఆర్సీబీ క్వాలిఫియర్-1కు ఆర్హత సాధించింది. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్‌లో ఏ జట్టు ఎవరితో తలపడుతుందో ఓ లుక్కేద్దాం. ఈ ఏడాది సీజన్ పాయింట్ల పట్టికలో అగ్రస్దానంలో పంజాబ్ కింగ్స్(18) నిలవగా.. ఆర్సీబీ(18) రెండో స్ధానంలో నిలిచింది. పాయింట్ల పరంగా ఇరు జట్లు సమంగా ఉన్నప్పటికి బెంగళూరు కంటే పంజాబ్ రన్‌రేట్ మెరుగ్గా ఉండడంతో టాప్ ప్లేస్‌ను సుస్థిరం చేసుకుంది.క్వాలిఫయర్-1లో పంజాబ్, ఆర్సీబీ ఢీ..టాప్-2లో నిలిచిన పంజాబ్, ఆర్సీబీ మే 29న చంఢీగడ్ వేదికగా క్వాలిఫయర్-1లో తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు ఆర్హత సాధిస్తోంది. అయితే ఇక్కడ ఓడిన జట్టుకు కూడా ఫైనల్ చేరేందుకు మరో ఛాన్స్ ఉంటుంది. ఓటమి చెందిన జట్టు జూన్ 1న క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్ లేదా గుజరాత్ టైటాన్స్ ఆడాల్సి ఉంటుంది. అక్కడ గెలిస్తే ఫైనల్‌కు చేరుకోవచ్చు. ఇక పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్ధానాల్లో నిలిచిన గుజరాత్ టైటాన్స్, మంబై ఇండియన్స్ మే 30న ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఇక్కడ గెలిచిన జట్టు ఫైనల్ బెర్త్ కోసం క్వాలిఫయర్-2లో క్వాలిఫయర్-1లో ఓడిన టీమ్‌తో తలపడాల్సి ఉంటుంది. ఇక చివరగా ఫైనల్ జూన్ 3న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.IPL 2025 ప్లేఆఫ్స్ షెడ్యూల్:క్వాలిఫయర్ 1: పంజాబ్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - మే 29, చండీగఢ్ఎలిమినేటర్: గుజరాత్ టైటాన్స్ vs ముంబై ఇండియన్స్ - మే 30, చండీగఢ్క్వాలిఫయర్ 2: క్వాలిఫయర్ 1లో ఓడిపోయిన జట్టు vs ఎలిమినేటర్ విజేత - జూన్ 1, అహ్మదాబాద్ఫైనల్: క్వాలిఫయర్ 1 విజేత vs క్వాలిఫయర్ 2 విజేత - జూన్ 3, అహ్మదాబాద్ -
చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. ఐపీఎల్ హిస్టరీలోనే
ఐపీఎల్-2025 సీజన్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆసాధరణ ప్రదర్శన కనబరిచింది. సోమవారం ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆర్సీబీ క్వాలిఫయర్-1కు ఆర్హత సాధించింది. లక్నో నిర్ధేశించిన 228 పరుగుల భారీ లక్ష్యాన్ని బెంగళూరు కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఊదిపడేసింది.ఆర్సీబీ బ్యాటర్లలో స్టాండ్ ఇన్ కెప్టెన్ జితేష్ శర్మ(33 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 85 నాటౌట్) విధ్వంసం సృష్టించగా.. విరాట్ కోహ్లి(30 బంతుల్లో 10 ఫోర్లతో 54), మయాంక్ అగర్వాల్(23 బంతుల్లో 41 నాటౌట్), సాల్ట్(30) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. లక్నో బౌలర్లలో విలియం ఓ రూర్క్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఆకాష్, అవేష్ ఖాన్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ రిషభ్ పంత్ (61 బంతుల్లో 118 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్స్‌లు) సీజన్లో తొలి సెంచరీతో చెలరేగగా, మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో మెరిశాడు.ఆర్సీబీ సరికొత్త చరిత్ర..ఇక ఈ మ్యాచ్‌లో అద్బుత విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. ఒక ఐపీఎల్ సీజన్లో ప్రత్యర్ధి జట్లతో వాటి హోం గ్రౌండ్స్‌లో జరిగిన అన్నీ మ్యాచ్‌లలోనూ గెలుపొందిన తొలి టీమ్‌గా ఆర్సీబీ చరిత్ర సృష్టించింది.ఈ ఏడాది సీజన్ తొలి మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్‌ను ఓడించిన ఆర్సీబీ.. ఆ తర్వాత సీఎస్కే, ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్‌ను వారి సొంత మైదానాల్లోనే చిత్తు చేసింది.చదవండి: IND vs ENG: బీసీసీఐ కీలక నిర్ణయం.. దిలీప్‌కు మళ్లీ పిలుపు -
బీసీసీఐ కీలక నిర్ణయం.. దిలీప్‌కు మళ్లీ పిలుపు
భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా హైదరాబాద్‌కు చెందిన టి.దిలీప్ మళ్లీ ఎంపికయ్యాడు. ప్రతిష్టాత్మక ఇంగ్లండ్ పర్యటన కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దిలీప్‌ను మరో సారి ఫీల్డింగ్ కోచ్‌గా నియమించింది. 2021 నుంచి ఈ ఏడాది ఆరంభం వరకు దిలీప్ టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించగా... ఆ్రస్టేలియాలో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భారత జట్టు పేలవ ప్రదర్శనతో సహాయక కోచ్ అభిషేక్ నాయర్‌తో పాటు దిలీప్‌ను తొలగించింది.ఫీల్డింగ్ కోచ్‌గా విదేశీయుడిని నియమించాలని బోర్డు ప్రయత్నించనా... అది వీలు కాకపోవడంతో జట్టు సభ్యులతో మంచి అనుబంధం ఉన్న దిలీప్‌ను తిరిగి ఎంపిక చేసింది. "దిలీప్ చాలా మంచి కోచ్. నాలుగేళ్లుగా భారత జట్టుతో కలిసి పనిచేశాడు. ఆటగాళ్ల బలాబలాలు అతడికి బాగా తెలుసు. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు అతడిని తిరిగి నియమించాం"అని బోర్డు అధికారి వెల్లడించారు. ఇక మరోవైపు భారత టెస్టు కొత్త కెపె్టన్ శుబ్‌మన్ గిల్, సుదర్శన్ జూన్ 6 నుంచి ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగే వార్మప్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: జితేశ్ జితాదియా -
సినెర్ ముందంజ
పారిస్: ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్, సెర్బియన్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో అలవోక విజయాలతో శుభారంభం చేశారు. అయితే మాజీ ప్రపంచ నంబర్‌వన్, 11వ సీడ్ రష్యన్ స్టార్ డానిల్ మెద్వెదెవ్కు తొలి రౌండ్లోనే ఊహించని షాక్ ఎదురైంది. మహిళల సింగిల్స్‌లో అమెరికన్ స్టార్లు కొకొ గాఫ్, మాడిసన్ కీస్ వరుస సెట్లతో ప్రత్యర్థుల్ని చిత్తు చేసి రెండో రౌండ్లోకి ప్రవేశించారు. మిగతా సీడెడ్ క్రీడాకారిణుల్లో జెస్సికా పెగూలా, మిర అండ్రీవా ముందంజ వేశారు. గత ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనలిస్ట్ కొకొ గాఫ్ (అమెరికా) 6–2, 6–2తో గడెక్కి (ఆస్ట్రేలియా)పై గెలుపొందగా... అజరెంకా (బెలారస్) 6–0, 6–0తో విక్మయెర్ (బెల్జియం)పై నెగ్గింది. మూడో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) 6–2, 6–4తో అన్క టొడొని (రొమేనియా)పై, ఆరో సీడ్ మిర అండ్రీవా (రష్యా) 6–4, 6–3తో క్రిస్టీనా బుక్సా (స్పెయిన్)పై విజయం సాధించారు. 12వ సీడ్ రిబాకినా 6–1, 4–6, 6–4తో రియెరా (అర్జెంటీనా)పై గెలుపొందగా, ఏడో సీడ్ కీస్ (అమెరికా) 6–2, 6–1తో సవిల్లే (ఆస్ట్రేలియా)ను ఓడించింది. సోఫియా కెనిన్ (అమెరికా) 6–3, 6–1తో గ్రాచెవా (ఫ్రాన్స్)పై గెలిచింది. జొకో అలవోకగా... మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలిరౌండ్ మ్యాచ్‌లో జొకోవిచ్ 6–3, 6–3, 6–3తో అమెరికన్ ప్లేయర్ మెక్‌డొనాల్డ్‌పై సునాయాస విజయంతో ముందంజ వేశాడు. తాజా ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్, టాప్ సీడ్ ఇటలీ స్టార్ సినెర్ 6–4, 6–3, 7–5తో రిండెర్క్నెచ్ (ఫ్రాన్స్) గెలుపొందాడు. మూడో సెట్లో స్థానిక ప్లేయర్ నుంచి గట్టీపోటీ ఎదురైనప్పటికీ మరో సెట్‌కు అవకాశమివ్వకుండా మూడు సెట్లలోనే ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు ముగించాడు. ఈ సీజన్ మెద్వెదెవ్కు నిరాశనే మిగిలిస్తోంది. ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టిన ఈ 11వ సీడ్ రష్యన్ స్టార్ ఇక్కడ తొలిరౌండ్లోనే 5–7, 3–6, 6–4, 6–1, 5–7తో కామెరూన్ నోరీ (బ్రిటన్) చేతిలో కంగుతిన్నాడు. బల్గేరియాకు చెందిన 16వ సీడ్ దిమిత్రోవ్ 6–2, 6–3 2–6తో అమెరికన్ క్వాలిఫయర్ కిన్‌పై రెండు సెట్లతో ఆధిక్యంలో ఉండగా రిటైర్డ్‌హర్ట్‌గా కోర్టు నుంచి నిష్క్రమించాడు.ఏడో సీడ్ కాస్పెర్ రూడ్ (నార్వే) 6–3, 6–4, 6–2తో రమొస్ వినొలస్ (స్పెయిన్)పై, గత ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్, ఈ సీజన్ ఆ్రస్టేలియన్ ఓపెన్ రన్నరప్ మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–3, 6–3, 6–4తో లర్నెర్ టియెన్ (అమెరికా)పై గెలుపొందారు. -
గుల్వీర్కు గోల్డ్
గుమి (దక్షిణ కొరియా): ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ పసిడి పతకంతో సత్తా చాటాడు. 10,000 మీటర్ల పరుగులో భారత అథ్లెట్ అగ్ర స్థానంలో నిలిచి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. 20 కిలోమీటర్ల రేస్ వాక్‌లో భారత్‌కు చెందిన సెర్విన్ సెబాస్టియన్ కాంస్య పతకంతో మెరిశాడు. దీంతో పోటీల తొలి రోజు భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. ఆసియా క్రీడల్లో కాంస్యం నెగ్గిన 26 ఏళ్ల గుల్వీర్... మంగళవారం 10,000 మీటర్ల రేసును 28 నిమిషాల 38.63 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణం గెలుచుకున్నాడు. గుల్వీర్కు ఇదే తొలి ఆసియా చాంపియన్‌షిప్ స్వర్ణం. మెబుకి సుజుకి (28 నిమిషాల 43.84 సెకన్లు; జపాన్), అల్బర్ట్ రోప్ (28 నిమిషాల 46.82 సెకన్లు; బహ్రెయిన్) వరుసగా రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. భారత్‌కే చెందిన సావన్ బర్వాల్ 28 నిమిషాల 50.53 సెకన్లలో లక్ష్యాన్ని చేరి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. తొలి రోజు పోటీలు ముగిసేసరికి భారత్ ఒక స్వర్ణం, ఒక కాంస్యంతో పతకాల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. 5 స్వర్ణాలు, 2 రజతాలతో చైనా నంబర్‌వన్‌గా ఉండగా... 3 రజతాలు, 2 కాంస్యాలతో జపాన్ మూడో స్థానంలో ఉంది. చివరి 200 మీటర్లలో వేగం పెంచి.. ఉత్తరప్రదేశ్‌లోని నిరుపేద రైతు కుటుంబానికి చెందిన గుల్వీర్ సింగ్ ఇప్పటికే జాతీయ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో అతడు 10,000 మీటర్ల రేసును 27 నిమిషాల 00.22 సెకన్లలో పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. మంగళవారం రేసులో చివరికి వచ్చేసరికి మూడో స్థానంలో కనిపించిన గుల్వీర్... మరో 200 మీటర్లలో రేసు ముగుస్తుందనగా వేగం పెంచాడు. ఒక్కొక్క సహచరుడిని వెనక్కి నెడుతూ చిరుతలా దూసుకొచ్చాడు. ఆఖరి వరకు అదే కొనసాగిస్తూ ఫినిషింగ్ లైన్ దాటాడు. ‘విజేతగా నిలవాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగా. టైమింగ్‌పై కాకుండా అందరికంటే ముందుండాలని అనుకున్నా. స్వర్ణం గెలవడం ఆనందంగా ఉంది. దీంతో నా ర్యాంకింగ్ మరింత మెరుగవనుంది. ఈ ఏడాది సెపె్టంబర్లో టోక్యో వేదికగా జరగనున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌నకు అర్హత సాధించడానికి అది తోడ్పడనుంది’అని గుల్వీర్ పేర్కొన్నాడు. భారత్ నుంచి 1975లో హరిచంద్, 2017 లక్ష్మణన్ పసిడి పతకాలు గెలవగా... ఇప్పుడు గుల్వీర్ ఆ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. 5000 మీటర్ల పరుగులోనూ జాతీయ రికార్డు కలిగిన గుల్వీర్ ఇక్కడ కూడా ఆ విభాగంలో పోటీపడనున్నాడు. 2023 ఆసియా చాంపియన్‌షిప్ 5000 మీటర్ల పరుగులో గుల్వీర్ కాంస్యం నెగ్గగా... ఇప్పుడు పతకం రంగు మార్చాలని కృతనిశ్చయంతో ఉన్నాడు.డెకాథ్లాన్‌లో తేజస్విన్ దూకుడు... భారత స్టార్ అథ్లెట్ తేజస్విన్ శంకర్ డెకథ్లాన్ (100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, షాట్‌పుట్, హై జంప్, 400 మీటర్ల పరుగు, 110 మీటర్ల హర్డిల్స్, డిస్కస్ త్రో, పోల్ వాల్ట్, జావెలిన్ త్రో, 1500 మీటర్ల పరుగు)లో సత్తాచాటుతున్నాడు. పోటీల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన ఐదు ఈవెంట్లలో శంకర్ దుమ్మురేపాడు. దీంతో సగం పోటీలు ముగిసేసరికి తేజస్విన్ అగ్రస్థానంలో ఉన్నాడు. పురుషుల 400 మీటర్ల పరుగులో విశాల్ ఫైనల్‌కు చేరగా... మహిళల 400 మీటర్ల పరుగులో రూపాల్ చౌధరీ, విదయ రామ్రాజ్ తుది రేసుకు అర్హత సాధించారు. పురుషుల హై జంప్‌లో భారత అథ్లెట్ అనిల్ కుషారె 2.10 మీటర్ల ఎత్తు దూకి ఫైనల్‌కు అర్హత సాధించాడు. పురుషుల 1500 మీటర్ల రేసులో యూనుస్ షా ఫైనల్‌కు చేరాడు. మహిళల జావెలిన్ త్రోలో అన్ను రాణి నాలుగో స్థానంలో నిలిచి పతకానికి దూరమైంది. సెబాస్టియన్‌కు కాంస్యం పురుషుల 20 కిలోమీటర్ల రేస్‌వాక్‌లో సెబాస్టియన్ 1 గంట 21 నిమిషాల 13.60 సెకన్లలో లక్ష్యాన్ని చేరి మూడో స్థానంలో నిలిచాడు. ‘పతకం నెగ్గడం సంతోషంగా ఉంది. విజేతల మధ్య పెద్ద అంతరం లేదు. ఆసియా చాంపియన్‌షిప్‌లో ఇదే నా తొలి పతకం’అని సెబాస్టియన్ అన్నాడు. వాంగ్ జవో (1 గంట 20 నిమిషాల 36.90 సెకన్లు; చైనా), కెంటా యొషికవా (1 గంట 20 నిమిషాల 44.90 సెకన్లు; జపాన్) వరుసగా స్వర్ణ, రజతాలు గెలుచుకున్నారు. ఇదే విభాగంలో పోటీపడిన మరో భారత వాకర్ అమిత్ 1 గంట 22 నిమిషాల 14.30 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఐదో స్థానంలో నిలిచాడు. -
వరల్డ్ చాంపియన్‌షిప్ పతకమే లక్ష్యం
న్యూఢిల్లీ: దాదాపు ఏడాది క్రితం... పారిస్ ఒలింపిక్స్... 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్... భారత్‌కు చెందిన 23 ఏళ్ల సిఫ్ట్ కౌర్ సమ్రాపై భారీ అంచనాలు ఉన్నాయి. కచ్చితంగా పతకం సాధించగల షూటర్ల జాబితాలో ఆమె కూడా ఉంది. సంవత్సరం ముందు ఇదే ఈవెంట్లో సిఫ్ట్ ప్రపంచ రికార్డును నమోదు చేయడం కూడా అందుకు ఒక కారణం. అయితే అసలు సమయంలో రైఫిల్ గురి చెదిరింది. సగటు భారత అభిమాని కూడా ఆశ్చర్యపోయే రీతిలో ఒక్కసారిగా పేలవ ప్రదర్శన నమోదైంది.32 మంది పోటీ పడితే సిఫ్ట్ కౌర్ 31వ స్థానంతో ముగించింది! ఈ షాక్‌కు ఒక్కసారిగా సిఫ్ట్ ఆట నుంచి తప్పనిసరిగా విరామం తీసుకోవాల్సి వచ్చింది. ఇకపై భవిష్యత్తు గురించి సందేహించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎట్టకేలకు నాటి పరాభవం నుంచి కోలుకున్న సిఫ్ట్ ఇప్పుడు మళ్లీ చిరునవ్వులు చిందించింది. ఇటీవల జరిగిన వరల్డ్ కప్‌లో ఆమె స్వర్ణంతో మెరిసి ఒలింపిక్ బాధను కాస్త మర్చిపోయేలా చేసుకుంది. నిరాశ నుంచి కోలుకొని... పారిస్‌లో ఘోర ప్రదర్శన తర్వాత సిఫ్ట్ కౌర్ మానసికంగా చాలా కుంగిపోయింది. ఆ ఈవెంట్ ముగిసిన సమయం నుంచి ఆమెను సాధారణ స్థితికి తెచ్చేందుకు తల్లిదండ్రులు, సోదరుడు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. పారిస్ ఒలింపిక్స్ వేదిక నుంచి ఆమెను విహారయాత్ర కోసం వారు మరో నగరానికి తీసుకెళ్లి సరదాగా గడిపి వచ్చారు. స్వదేశానికి తిరిగొచ్చాక తండ్రి మరో రూపంలో ఆమెను బిజీగా ఉంచే ప్రయత్నం చేశారు. మళ్లీ మళ్లీ వైఫల్యం గురించి, స్కోర్ల గురించి ఆలోచించకుండా సరదాగా గన్స్‌తో ఆడుతున్నట్లుగానే ఆడమంటూ రైఫిల్ రేంజ్‌కే తీసుకెళ్లే ఓదార్చే ప్రయత్నం చేశాడు. మన దేశంలో అభిమానులు ఒలింపిక్స్ క్రీడలకు అన్నింటికంటే చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని... అందరి దృష్టీ వాటి ఫలితాలపైనే ఉండటం వల్ల అసలు సమయంలో తాను తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు సిఫ్ట్ చెప్పుకుంది. కోలుకునేందుకు కొంత సమయం పట్టినా... తాను వెనక్కి వెళ్లి ఫలితాన్ని మార్చలేను కాబట్టి ఇక ఆలోచించడం అనవసరం అని ఆమె భావించింది. జాతీయ స్థాయి పోటీలతో... దాదాపు ఆరు నెలల తర్వాత సిఫ్ట్ మళ్లీ షూటింగ్లో పోటీ పడేందుకు సిద్ధమైంది. అందుకు ముందుగా పెద్ద ఆలోచనలు పెట్టుకోకుండా జాతీయ క్రీడల్లో పాల్గొంది. ఆమె స్థాయికి ఈ క్రీడలు చిన్నవే అయినా... ఆరంభానికి ఇదే సరైందని సిఫ్ట్ భావించింది. సహజంగానే స్వర్ణం నెగ్గడంతో కాస్త ఆత్మవిశ్వాసం వచ్చింది. ఆ తర్వాత వరుసగా రెండు సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొని అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ చేసిన 595 పాయింట్ల స్కోరు పారిస్‌లో సాధించి ఉంటే ఆమె ఫైనల్స్‌కు చేరేది! తాజా ప్రదర్శనతో అర్జెంటీనాలో జరిగే వరల్డ్ కప్ షూటింగ్‌కు సిఫ్ట్ ఎంపికైంది. సవాల్‌ను అధిగమించి... బ్యూనస్ఎయిర్స్లో కొత్తగా నిర్మించిన రేంజ్లో వరల్డ్ కప్ స్థాయి పోటీలు జరగడం ఇదే తొలిసారి. వాతావరణం, గాలి దిశ... ఇలా అన్నీ కొత్తగానే ఉండటంతో సిఫ్ట్ కాస్త ఆందోళన చెందింది. 16.1 డిగ్రీల ఉష్ణోగ్రతలో మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు పోటీలు మొదలైనా ఇంకా చలిగానే ఉంది. తమ సన్నాహాలతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నమైన పరిస్థితి. అయితే పట్టుదలగా ఆడి క్వాలిఫికేషన్‌ను ఆమె అధిగమించింది. ఆపై ఫైనల్ పోరులో మళ్లీ తడబాటు. ‘నీలింగ్’ పొజిషన్ ముగిసేసరికి ఆమె చివరి స్థానంలో ఉంది. ‘ప్రొన్’ పొజిషన్ కాస్త మెరుగ్గా ఆడినా ఆ తర్వాతా అదే ఆఖరి స్థానం! ఆ తర్వాత తనకిష్టమైన ‘స్టాండింగ్’ పొజిషన్‌కు ఆమె సిద్ధమైంది. అసాధారణ ప్రదర్శన కనబరిస్తే గానీ ముందుకెళ్లే అవకాశం లేదు. ఇలాంటి సమయంలో సిఫ్ట్ తన ఆటకు పదును పెట్టింది. అద్భుతంగా లక్ష్యంపైకి బుల్లెట్లు సంధిస్తూ దూసుకుపోయింది. తుది ఫలితం చూస్తే 458.6 పాయింట్ల స్కోరుతో సిఫ్ట్‌కు స్వర్ణ పతకం. ‘నీలింగ్’ ముగిసిన తర్వాత సిఫ్ట్కంటే ఏకంగా 7.2 పాయింట్లు ముందంజలో ఉన్న జర్మనీ షూటర్ అనితను వెనక్కి నెట్టిన సిఫ్ట్ అగ్రస్థానం సాధించడం విశేషం. ఇప్పుడు సిఫ్ట్ తర్వాతి లక్ష్యం వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షిప్. నవంబర్‌లో జరిగే ఈ పోటీల్లో చెలరేగి భారత్ తరఫున తొలి స్వర్ణం సాధించిన మహిళగా నిలవాలని సిఫ్ట్ కౌర్ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసమే ఇప్పుడు తీవ్ర సాధనను కొనసాగిస్తోంది. -
సింధు, ప్రణయ్ శుభారంభం
సింగపూర్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేశారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీ మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో పీవీ సింధు 21–14, 21–9 తేడాతో వెన్ యూ జాంగ్ (కెనడా)పై విజయం సాధించింది. 31 నిమిషాల్లో ముగిసిన పోరులో పూర్తి ఆధిపత్యం కనబర్చిన తెలుగమ్మాయి వరస గేమ్‌ల్లో గెలుపొందింది. బుధవారం జరగనున్న ప్రిక్వార్టర్స్‌లో టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, ప్రపంచ ఐదో ర్యాంకర్ చెన్ యూ ఫీ (చైనా)తో సింధు తలపడనుంది. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ 34వ ర్యాంకర్ ప్రణయ్ 19–21, 21–16, 21–14తో రాస్మస్ గెమ్కే (డెన్మార్క్)పై గెలుపొందాడు. 72 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో తొలి గేమ్‌లో ఓడిన అనంతరం తిరిగి పుంజుకున్న ప్రణయ్... ప్రత్యర్థిపై ఆధిపత్యం కనబరుస్తూ మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. తదుపరి రౌండ్లో ఫ్రాన్స్ షట్లర్ క్రిస్టోవ్ పొపోవ్‌తో ప్రణయ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. కాగా ఈ టోర్నీలో మిగిలిన భారత షట్లర్లకు నిరాశ ఎదురైంది. మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్, అన్మోల్ పరాజయం పాలవగా... పురుషుల సింగిల్స్‌లో ప్రియాన్షు రజావత్, కిరణ్ జార్జ్‌కు నిరాశ తప్పలేదు. మాళవిక, ప్రియాన్షు తొలి గేమ్ గెలిచినప్పటికీ అదే జోరు కొనసాగించడంలో విఫలమై పరాజయాల పాలయ్యారు. మాళవిక 21–14, 18–21, 11–21తో ఎనిమిదో సీడ్ సుపనిడా కటెథాంగ్ (థాయ్‌లాండ్) చేతిలో... ప్రియాన్షు 21–14, 10–21, 14–21తో ఏడో సీడ్ నరోకా (జపాన్) చేతిలో ఓడాడు. అన్మోల్ 11–21, 22–24తో చెన్ చేతిలో... కిరణ్ జార్జ్ 19–21, 17–21తో వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా) చేతిలో సంతోష్ రామ్రాజ్ 14–21, 8–21తో కిమ్ గా ఇన్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడారు. మిక్స్డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో, అషిత సూర్య–అమృత ప్రథమేశ్ జోడీలు నిరాశ పరచగా... మహిళల డబుల్స్‌లో కవిప్రియ సెల్వం–సిమ్రన్ సింగ్ తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. -
జితేశ్ జితాదియా
లక్నో: సొంతగడ్డపై విజయగర్వంతో సీజన్‌ను ముగించే భారీ స్కోరునే లక్నో చేసింది... ఛేదనలో సాల్ట్, లివింగ్‌స్టోన్, కోహ్లిలాంటి విలువైన వికెట్లను తీసింది. 52 బంతుల్లో 105 పరుగుల సమీకరణం బెంగళూరుకు క్లిష్టంగా అనిపించింది... అయితే కెప్టెన్ జితేశ్... మయాంక్‌తో కలిసి చేసిన బ్యాటింగ్ మ్యాజిక్ మ్యాచ్‌నే మార్చేసింది. ఇంకో 8 బంతులు మిగిలుండగానే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌పై జయభేరి మోగించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ రిషభ్ పంత్ (61 బంతుల్లో 118 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్స్‌లు) సీజన్లో తొలి సెంచరీతో కదం తొక్కగా, మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. అనంతరం బెంగళూరు 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జితేశ్ శర్మ (33 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు), కోహ్లి (30 బంతుల్లో 54; 10 ఫోర్లు) చెలరేగారు. చితగ్గొట్టిన పంత్ మార్ష్ తో ఇన్నింగ్స్ ఆరంభించిన బ్రిట్జ్కీ (14) మూడో ఓవర్లో నిష్క్రమించాడు. తర్వాత రిషభ్ పంత్ రావడంతో లక్నో ప్రతీ ఓవర్లోనూ పండగ చేసుకుంది. యశ్ దయాళ్ వేసిన నాలుగో ఓవర్లో ఒక సిక్స్, రెండు బౌండరీలు బాదడం ద్వారా పంత్ ప్రతాపం మొదలైంది. పవర్‌ప్లే తర్వాత ఓ వైపు మార్ష్, ఇంకోవైపు రిషభ్ ధనాధన్ షోతో ఓవర్‌కు సగటున పది పరుగుల రన్‌రేట్ నమోదైంది. దీంతో 9.5 ఓవర్లో జెయింట్స్ 100 స్కోరును చేరుకుంది.ముందుగా పంత్ 29 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 14వ ఓవర్లో సిక్సర్‌తో మార్ష్ 31 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. ఆ ఓవర్లో రిషభ్ కూడా ఫోర్, సిక్స్ బాదడంతో 18 పరుగులు వచ్చాయి. 16వ ఓవర్లో వరుసగా 2 సిక్సర్లు కొట్టిన మార్ష్ ను భువనేశ్వర్ అవుట్ చేశాడు. దీంతో రెండో వికెట్‌కు 152 పరుగుల సుదీర్ఘ భాగస్వామ్యానికి తెరపడింది. అతని మరుసటి ఓవర్లో బౌండరీతో పంత్ 54 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకోవడం, జట్టు 200మార్క్ దాటడం జరిగిపోయాయి. మెరుపు భాగస్వామ్యం... సాల్ట్, కోహ్లిలు పెద్ద లక్ష్యాన్ని ఛేదించేందుకు అవసరమైన మెరుపు ఆరంభాన్నిచ్చారు. ఇద్దరు బౌండరీలతో స్కోరుబోర్డును పరుగు పెట్టించారు. 4 ఓవర్లలోనే స్కోరు 50కి చేరింది. కానీ పవర్‌ప్లే ఆఖరి ఓవర్లోనే సాల్ట్ (19 బంతుల్లో 30; 6 ఫోర్లు) వికెట్‌ను కోల్పోయింది. తర్వాత కోహ్లికి జతయిన రజత్ పటిదార్ (14) ఫోర్, సిక్సర్ బాదాడు. కానీ రూర్కే ఒకే ఓవర్లో అతన్ని, లివింగ్‌స్టోన్ (0)ను అవుట్ చేసి బెంగళూరును కష్టాల్లో పడేశాడు. కోహ్లి తన మార్క్ షాట్లతో చెలరేగిపోవడంతో రన్‌రేట్ లక్ష్యాన్ని కరిగించేంత వేగంగా దూసుకెళ్లింది. 9.1 ఓవర్లోనే ఆర్సీబీ స్కోరు వందను దాటేసింది. కోహ్లి 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ధాటిని కొనసాగించే ప్రయత్నంలో కొట్టిన షాట్ మిడాఫ్‌లో బదోని చేతికి చిక్కడంతో కోహ్లి నిరాశగా వెనుదిరిగాడు. అప్పుడు జట్టు స్కోరు 11.2 ఓవర్లలో 123/4. కాగా గెలుపు సమీకరణం 52 బంతుల్లో 105 చాలా కష్టమైంది.మయాంక్, కెప్టెన్ జితేశ్ శర్మల మెరుపులకు తోడు... లక్నో ఆటగాళ్ల చెత్త ఫీల్డింగ్, సులువైన రనౌట్పట్ల రూర్కే అశ్రద్ధ వెరసి... పరుగులు, బౌండరీలు అలవోకగా రావడంతో చూస్తుండగానే లక్ష్యం దిగొచ్చింది. అబేధ్యమైన ఐదో వికెట్‌కు మయాంక్, జితేశ్‌లు కేవలం 44 బంతుల్లోనే 107 పరుగులు జోడించడం విశేషం! స్కోరు వివరాలు లక్నో సూపర్‌జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్ (సి) జితేశ్ (బి) భువనేశ్వర్ 67; బ్రిట్జ్కీ (బి) తుషార 14; పంత్ నాటౌట్ 118; పూరన్ (సి) యశ్ దయాళ్ (బి) షెఫర్డ్ 13; సమద్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 227. వికెట్ల పతనం: 1–25, 2–177, 3–226. బౌలింగ్: తుషార 4–0–26–1, కృనాల్ పాండ్యా 2–0–14–0, యశ్ దయాళ్ 3–0–44–0, భువనేశ్వర్ 4–0–46–1, సుయశ్ 3–0–39–0, షెఫర్డ్ 4–0–51–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) దిగ్వేశ్ (బి) ఆకాశ్ 30; కోహ్లి (సి) బదోని (బి) అవేశ్‌ఖాన్ 54; పటిదార్ (సి) సమద్ (బి) రూర్కే 14; లివింగ్‌స్టోన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రూర్కే 0; మయాంక్ నాటౌట్ 41; జితేశ్ నాటౌట్ 85; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (18.4 ఓవర్లలో 4 వికెట్లకు) 230. వికెట్ల పతనం: 1–61, 2–90, 3–90, 4–123. బౌలింగ్: ఆకాశ్ 4–0–40–1, విల్ రూర్కే 4–0–74–2, దిగ్వేశ్ రాఠి 4–0–36–0, షాబాజ్ 3–0–39–0, అవేశ్‌ఖాన్ 3–0–32–1, బదోని 0.4–0–9–0. ఐపీఎల్ ‘ప్లే ఆఫ్స్’క్వాలిఫయర్–1 (మే 29)పంజాబ్ X బెంగళూరువేదిక: ముల్లాన్‌పూర్ , రాత్రి 7: 30 గంటల నుంచిఎలిమినేటర్ (మే 30)గుజరాత్ X ముంబైవేదిక: ముల్లాన్‌పూర్ , రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
RCB Vs LSG: వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన జితేశ్.. ఉత్కంఠ పోరులో లక్నోపై ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 27) జరిగిన ఉత్కంఠ పోరులో లక్నోపై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో భారీ స్కోర్ (227/3) చేసింది. రిషబ్ పంత్ (61 బంతుల్లో 118 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో అలరించాడు. లక్నో ఇన్నింగ్స్‌లో మాథ్యూ బ్రీట్జ్కీ 14, పూరన్ 13 పరుగులు చేసి ఔటయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో తుషార, భువనేశ్వర్ కుమార్, షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీ విజయవంతమైంది. ఆ జట్టు 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జితేశ్ శర్మ (33 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీని గెలిపించాడు. అతనికి మయాంక్ అగర్వాల్ (23 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు) సహకరించాడు. అంతకుముందు విరాట్ కోహ్లి (30 బంతుల్లో 54; 10 ఫోర్లు), ఫిల్ సాల్ట్ (19 బంతుల్లో 30; 6 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి ఆర్సీబీ గెలుపుకు పునాది వేశారు. లక్నో బౌలర్లలో విలియమ్ ఓరూర్కీ 2, ఆకాశ్ సింగ్, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో ఆర్సీబీ టేబుల్ సెకెండ్ టాపర్‌గా నిలిచి ప్లే ఆఫ్స్‌కు చేరింది.మే 29న జరిగే క్వాలిఫయర్-1లో ఆర్సీబీ.. పంజాబ్‌తో తలపడనుంది. మే 30న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకుంటాయి. -
IPL 2025, LSG VS RCB: విధ్వంసకర శతకం.. పల్టీ కొట్టిన పంత్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పేలవ ప్రదర్శన కారణంగా ముప్పేట దాడిని ఎదుర్కొన్న పంత్ ఎట్టకేలకు తమ చివరి మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చాడు. ఆర్సీబీతో ఇవాళ (మే 27) జరుగుతున్న మ్యాచ్‌లో పంత్ విధ్వంసకర శతకంతో (61 బంతుల్లో 118 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో ఆది నుంచే దూకుడుగా ఆడిన పంత్.. 54 బంతుల్లో సెంచరీని పూర్తి చేశాడు. ఐపీఎల్లో పంత్‌కు ఇది రెండో సెంచరీ. సెంచరీ పూర్తి చేసిన అనంతరం పంత్ ఆనందంతో పల్టీ కొట్టాడు. దీనికి సంబంధించిన క్లిప్పింగ్స్, వీడియోలు సోషల్‌మీడియాలో వైరవలవుతున్నాయి.Coldest IPL hundred celebration 🥶pic.twitter.com/WDHHIvLVv6— CricTracker (@Cricketracker) May 27, 2025ఎట్టకేలకు పంత్ తనపై పెట్టిన పెట్టుబడికి (రూ. 27 కోట్లు) న్యాయం చేశాడని నెటిజన్లు అంటున్నారు. ఈ సీజన్లో పంత్ చాలా దారుణమైన ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందు 12 ఇన్నింగ్స్‌ల్లో కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు. పంత్ పేలవ ప్రదర్శన కారణంగా లక్నో సూపర్ జెయింట్స్ చాలా మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించాక ఎట్టకేలకు తమ చివరి మ్యాచ్‌లో పంత్ సెంచరీతో సత్తా చాటాడు.ఇటీవలికాలంలో పంత్ బ్యాట్ నుంచి జాలువారిన అత్యుత్తమ ఇన్నింగ్స్ ఇది. ఐపీఎల్లో పంత్ చివరిగా 2018 సీజన్లో సెంచరీ చేశాడు. నాడు సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 128 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున నేటికి ఇదే అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్‌గా చలామణి అవుతుంది. తాజా శతకంతో పంత్ తనలో చేవ తగ్గలేదని నిరూపించుకున్నాడు.ఆర్సీబీతో మ్యాచ్‌లో పంత్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో పాటు మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీ సాధించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్నో ఇన్నింగ్స్‌లో మాథ్యూ బ్రీట్జ్కీ 14, పూరన్ 13 పరుగులు చేసి ఔటయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో తుషార, భువనేశ్వర్ కుమార్, షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు.కాగా, ఈ సీజన్లో లక్నో ప్రయాణం ఇదివరకే ముగిసింది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఆ జట్టు రెండు మ్యాచ్‌ల ముందే నిష్క్రమించింది. సీజన్ ఆరంభంలో అద్భుత విజయాలు సాధించిన ఈ జట్టు క్రమంగా నీరసపడిపోయింది. మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నా ఎందుకో విజయాలు సాధించలేకపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న లక్నో ఆర్సీబీతో ఇవాళ జరుగబోయే మ్యాచ్‌లో గెలిస్తే ఆరో స్థానానికి చేరుకుంటుంది.ఆర్సీబీ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో లక్నోపై గెలిస్తే ఆర్సీబీ క్వాలిఫయర్-1 బెర్త్ దక్కించుకుంటుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. పంజాబ్ ఇదివరకే క్వాలిఫయర్ బెర్త్ సాధించగా.. మరో బెర్త్ కోసం గుజరాత్, ఆర్సీబీ పోటీలో ఉన్నాయి. ముంబై తప్పనిసరిగా ఎలిమనేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. -
LSG VS RCB: అరుదైన మైలురాయిని తాకిన మిచెల్ మార్ష్
లక్నో సూపర్ జెయింట్స్ విధ్వంసకర ఆటగాడు మిచెల్ మార్ష్ టీ20ల్లో ఓ అరుదైన మైలురాయిని తాకాడు. పొట్టి ఫార్మాట్లో 5000 పరుగులు పూర్తి చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన 115వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. టీ20 కెరీర్లో 201 మ్యాచ్‌లు ఆడిన మార్ష్ 136 స్ట్రయిక్‌రేట్‌తో 2 సెంచరీలు, 31 అర్ద సెంచరీల సాయంతో 5000 పరుగుల మార్కును దాటాడు.ఐపీఎల్ 2025లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (మే 27) జరుగుతున్న మ్యాచ్‌లో మార్ష్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో మార్ష్ 12 ఓవర్ల అనంతరం 45 పరుగులతో అజేయంగా ఉన్నాడు. సీజన్ ప్రారంభం నుంచి అదిరిపోయే ఫామ్‌లో ఉన్న మార్ష్ లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. 13 మ్యాచ్‌ల్లో సెంచరీ, 5 అర్ద సెంచరీల సాయంతో 607 పరుగులు చేసి పరుగుల వేటను కొనసాగిస్తున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ కష్టాలు కొని తెచ్చుకుంది. లక్నో ఆదిలోనే బ్రీట్జ్కీ (14) వికెట్ కోల్పోయినప్పటికీ.. రిషబ్ పంత్ (59), మిచెల్ మార్ష్ (47) విధ్వంసం సృష్టిస్తున్నారు. 13 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 131/1గా ఉంది.కాగా, ఈ సీజన్లో లక్నో ప్రయాణం ఇదివరకే ముగిసింది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఆ జట్టు రెండు మ్యాచ్‌ల ముందే నిష్క్రమించింది. సీజన్ ఆరంభంలో అద్భుత విజయాలు సాధించిన ఈ జట్టు క్రమంగా నీరసపడిపోయింది. మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నా ఎందుకో ఈ జట్టు విజయాలు సాధించలేకపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న లక్నో ఆర్సీబీతో ఇవాళ జరుగబోయే మ్యాచ్‌లో గెలిస్తే ఆరో స్థానానికి చేరుకుంటుంది.ఆర్సీబీ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో లక్నోపై గెలిస్తే ఆర్సీబీ క్వాలిఫయర్-1 బెర్త్ దక్కించుకుంటుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. పంజాబ్ ఇదివరకే క్వాలిఫయర్ బెర్త్ సాధించగా.. మరో బెర్త్ కోసం పోటీలో గుజరాత్, ఆర్సీబీ ఉన్నాయి. ముంబై తప్పనిసరిగా ఎలిమనేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. -
సెంచరీలు మీద సెంచరీలు చేసినా..
టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు, టైమ్ కూడా కలసిరావాలంటారు పెద్దవాళ్లు. అవును నిజమే.. ఎంత ప్రతిభ ఉన్నా కూడా, లక్ లేకపోతే వెనుబడిపోయే చాన్స్ ఉంది. టాలెంట్‌ను నిరూపించే వేదిక దొరక్కపోతే తెర మరుగు కావడం ఖాయం. అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోతే ఆ బాధ వర్ణణాతీతం. పోటీ ఎక్కువగా ఉండే క్రీడల్లో దేశం తరపున ఆడే అవకాశం దక్కినా బరిలోకి దిగే చాన్స్ రాక చాలా మంది వెలుగులోకి రాలేకపోయారు.క్రికెట్ కెరీర్‌గా ఎంచుకున్న ప్రతి ప్లేయర్ దేశం తరపున ఆడాలని కలలుగంటారు. జాతీయ జట్టులో స్థానమే లక్ష్యంగా కష్టపడుతుంటారు. బ్లూ క్యాప్, జెర్సీతో బరిలోకి దిగాలని వర్ధమాన భారత క్రికెటర్లు అహరహం శ్రమిస్తుంటారు. కానీ జాతీయ జట్టులో ఆడే అరుదైన అవకాశం కొద్ది మందికి మాత్రమే దక్కుతుంది. చాన్స్ దక్కించున్న వారిలో నిలదొక్కునే వారు అతి కొద్ది మంది మాత్రమే. ఇక జట్టులో చోటు దక్కినా మైదానంలో బరిలోకి దిగే అవకాశం రాని దురదృష్టవంతులూ ఉన్నారు. అలాంటి వారిలో ప్రియాంక్ పంచల్ (Priyank Panchal) ఒకరు.విషయం అర్థమైందిదేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించిన ప్రియాంక్ పంచల్ టీమిండియా (Team India) తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. దేశీయ క్రికెట్లో అత్యంత నిలకడగా రాణిస్తున్న బ్యాట్స్‌మెన్‌లో ఒకరైన 35 ఏళ్ల ఈ స్టార్ గుజరాతీ బ్యాటర్.. మూడు ఫార్మాట్లలో ఏ ఒక్కదానిలోనూ భారత జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేయలేకపోయాడు. దీంతో 17 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు తాజాగా వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు సోమవారం ప్రకటించాడు. 'టీమిండియాలో ఎప్పటికీ నాకు చోటు దక్కదనే విషయం అర్థమైంది' అంటూ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు.చాన్స్ రాలేదుడొమెస్టిక్ సూపర్‌స్టార్‌గా పేరొందిన ప్రియాంక్.. 127 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 45.18 సగటు, 23 సెంచరీలతో 8856 పరుగులు సాధించి సత్తా చాటాడు. దేశీయ క్రికెట్లో అత్యంత నిలకడగా రాణించిన బ్యాటర్లలో ఒకరైన ప్రియాంక్ పేరు పలుమార్లు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ముందు వచ్చింది. 2021-22లో దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా తరపున అరంగేట్రం చేయడానికి దగ్గరగా వచ్చాడు కానీ బ్లూ క్యాప్ దక్కించులేకపోయాడు. టెస్ట్ సిరీస్‌కు రోహిత్ శర్మ స్థానంలో రిజర్వ్ ఓపెనర్‌గా ఎంపికయ్యాడు కానీ అతడికి ఆడే అవకాశం రాలేదు. 2022లోనూ శ్రీలంక టూర్‌కు సెలెక్ట్ అయినా అరంగ్రేటం చేసే చాన్స్ రాలేదు.టైమ్ ముఖ్యంతనకు జాతీయ జట్టులో ఆడేందుకు రాసిపెట్టి లేదని భావించిన ప్రియాంక్ ఇప్పటి వరకు దేశీయ క్రికెట్లోనే కొనసాగుతూ తానేంటో నిరూపించుకున్నాడు. సెంచరీలు మీద సెంచరీలు చేసినా, టైమ్ కలిసి రాకపోతే తనలాగే అవుతుందని సరిపెట్టుకున్నాడు. 'క్రికెట్లో నిలకడగా ఆడాలి. ఆటగాడిగా మంచి ప్రదర్శన ఇవ్వాలి. సరైన సమయంలో ప్రదర్శన ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. అంతర్జాతీయ క్రికెట్లో సమయం చాలా విలువైనది. నిలకడగా 100 తర్వాత 100 పరుగులు చేస్తూనే ఉన్నప్పటికీ.. మీ జట్టు గెలవకపోతే, అది సరైన సమయం కాదు. కానీ 30 పరుగులు చేసినప్పటికీ.. జట్టు గెలిస్తే మీ సహకారం చాలా విలువైనది. అంతర్జాతీయ క్రికెట్‌కు అది అవసరం. దాని నుండి నేను చాలా నేర్చుకున్నాన'ని ప్రియాంక్ పేర్కొన్నాడు.బాధగానే ఉంది.. కానీటీమిండియా తరపున ఆడలేకపోవడం బాధగానే ఉందని ప్రియాంక్ చెప్పాడు. అయితే క్రికెట్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్ వంటి దిగ్గజ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూం షేర్ చేసుకునే అవకాశం రావడం మామూలు విషయం కాదన్నాడు. రిటైర్మెంట్ గురించి చాలా రోజులుగా ఆలోచన చేస్తున్నానని, ఇప్పుడే సరైన సమయం అని భావించి నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాడు. చదవండి: ఐపీఎల్ 2025 తర్వాత రిటైర్ కానున్న క్రికెటర్లు వీరేనా?'రిటైర్ అవ్వాలనే ఆలోచన నా మనసులో చాలా కాలంగా ఉంది. ఎందుకంటే, నేను క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పుడు.. టీమిండియాకు ఆడాలన్న ఆకాంక్ష నన్ను నడిపించేంది. క్రమశిక్షణ, అంకిత భావంతో ఆడి జాతీయ జట్టులో చోటు కోసం శాయశక్తులా ప్రయత్నించాను. కానీ అవకాశాలు చేజారాక నేను ఆచరణాత్మకంగా ఆలోచించడం మొదలుపెట్టాను. టీమిండియాలో నాకు ఇక చోటు దక్కదని గ్రహించాను. అందుకే రిటైర్మెంట్ ప్రకటించాన'ని ప్రియాంక్ వివరించాడు. -
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి ఎగబాకిన పాక్ ప్లేయర్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ బౌలర్ సదియా ఇక్బాల్ అగ్రస్థానానికి ఎగబాకింది. సదియా.. ఇంగ్లండ్ బౌలర్ సోఫీ ఎక్లెస్టోన్‌ను కిందకు దించి టాప్ ప్లేస్‌కు చేరుకుంది. గత వారం ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉండిన సదియా ఓ స్థానం మెరుగుపర్చుకుంది.తాజాగా స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో ఎక్లెస్టోన్ పాల్గొనకపోవడంతో సదియా అగ్రపీఠాన్ని దక్కించుకుంది. సదియా ఖాతాలో 746 రేటింగ్ పాయింట్లు ఉండగా.. ఎక్లెస్టోన్ ఖాతాలో 734 పాయింట్లు ఉన్నాయి. ఎక్లెస్టోన్ మూడు స్థానాలు కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోయింది.భారత స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ (737 పాయింట్లు), ఆసీస్ బౌలర్ అన్నాబెల్ సదర్‌ల్యాండ్ తలో స్థానం మెరుగుపర్చుకుని రెండు, మూడు స్థానాలకు ఎగబాకారు. భారత పేసర్ రేణుక సింగ్ ఠాకూర్ ఐదో స్థానాన్ని నిలబెట్టుకుంది.ఇంగ్లండ్ బౌలర్ లారెన్ బెల్ ఏకంగా 13 స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరింది. మరో ఇంగ్లండ్ బౌలర్ చార్లీ డీన్, పాకిస్తాన్ బౌలర్ సష్రా సంధు, ఆస్ట్రేలియా బౌలర్ జార్జియా వేర్హమ్ ఏడు నుంచి తొమ్మిది స్థానాల్లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్ సారా గ్లెన్ నాలుగు స్థానాలు కోల్పోయి పదో స్థానానికి పడిపోయింది. భారత బౌలర్లలో రాధా యాదవ్ 16, శ్రేయాంక పాటిల్ 21, పూజా వస్త్రాకర్ 33 స్థానాల్లో ఉన్నారు.బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. బెత్ మూనీ టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకుంది. విండీస్ స్టార్ బ్యాటర్ హేలీ మాథ్యూస్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని నాలుగు నుండి రెండో స్థానానికి చేరింది. ఆసీస్ బ్యాటర్ తహిళ మెక్‌గ్రాత్, టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన తలో స్థానం కోల్పోయి మూడు, నాలుగు స్థానాలకు పడిపోయారు. ఇంగ్లండ్ బ్యాటర్ నాట్ సీవర్ బ్రంట్ ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని తొమ్మిదో స్థానానికి ఎగబాకింది. ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. హేలీ మాథ్యూస్, అమేలియా కెర్, దీప్తి శర్మ టాప్-3లో కొనసాగుతున్నారు. -
IPL 2025: లక్నోపై ఆర్సీబీ ఘన విజయం
లక్నోపై ఆర్సీబీ ఘన విజయంఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 27) జరిగిన ఉత్కంఠ పోరులో లక్నోపై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. రిషబ్ పంత్ (61 బంతుల్లో 118 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో భారీ స్కోర్ (227/3) చేసింది. అనంతరం ఆర్సీబీ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జితేశ్ శర్మ (33 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీని గెలిపించాడు.14 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 156/4జితేశ్ శర్మ 22, మయాంక్ అగర్వాల్ 32నాలుగో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ11.2వ ఓవర్- 123 పరుగుల వద్ద ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో ఆయుశ్ బదోనికి క్యాచ్ ఇచ్చి విరాట్ కోహ్లి (54) ఔటయ్యాడు. వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన ఆర్సీబీవరుస బంతుల్లో ఆర్సీబీ వికెట్లు వికెట్లు కోల్పోయింది. విలియమ్ ఓరూర్కీ బౌలింగ్‌లో పాటిదార్, లివింగ్‌స్టోన్ వరుసగా ఔటయ్యారు.రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ7.5వ ఓవర్- 90 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. విలియమ్ ఓరూర్కీ బౌలింగ్‌లో అబ్దుల్ సమద్‌కు క్యాచ్ ఇచ్చి రజత్ పాటిదార్ (14) ఔటయ్యాడు. విరాట్‌కు (42) జతగా లివింగ్‌స్టోన్ క్రీజ్‌లోకి వచ్చాడు. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ5.4వ ఓవర్- 61 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. ఆకాశ్ సింగ్ బౌలింగ్‌లో దిగ్వేశ్ రాఠీకి క్యాచ్ ఇచ్చి ఫిల్ సాల్ట్ (30) ఔటయ్యాడు. కోహ్లికి (29) జతగా పాటిదార్ క్రీజ్‌లోకి వచ్చాడు.ఒకే ఓవర్లో 4 ఫోర్లు బాదిన కోహ్లి228 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ కూడా ధాటిగానే ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. విలియమ్ ఓరూర్కీ వేసిన రెండో ఓవర్లో కోహ్లి ఏకంగా నాలుగు ఫోర్లు బాదాడు. ఇదే ఓవర్లో సాల్ట్ కూడా ఓ ఫోర్ కొట్టాడు. 3 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 39/0గా ఉంది. సాల్ట్ 17, కోహ్లి 21 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. శతక్కొటిన పంత్.. లక్నో భారీ స్కోర్‌టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో భారీ స్కోర్ (227/3) చేసింది. రిషబ్ పంత్ (61 బంతుల్లో 118 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో అలరించాడు. లక్నో ఇన్నింగ్స్‌లో మాథ్యూ బ్రీట్జ్కీ 14, పూరన్ 13 పరుగులు చేసి ఔటయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో తుషార, భువనేశ్వర్ కుమార్, షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు.రిషబ్ పంత్ సెంచరీలక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ సెంచరీతో చెలరేగాడు. బెంగళూరుతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 50 బంతుల్లో 100 పరుగులు చేశాడు.రెండో వికెట్ కోల్పోయిన లక్నో15.3వ ఓవర్- 177 పరుగుల వద్ద లక్నో రెండో వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి మిచెల్ మార్ష్ (67) ఔటయ్యాడు. రిషబ్ పంత్ 83 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. 14 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 150/1మిచెల్ మార్ష్ 54, రిషబ్ పంత్ 7012 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 127/1మిచెల్ మార్ష్ 45, రిషబ్ పంత్ 58ధాటిగా ఆడుతున్న పంత్ఈ మ్యాచ్‌లో వన్‌డౌన్‌గా బరిలోకి దిగిన రిషబ్ పంత్ ధాటిగా ఆడుతున్నాడు. 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 36 పరుగులు చేశాడు. మరో ఎండ్‌లో మిచెల్ మార్ష్ ఓ మోస్తరుగా ఆడుతున్నాడు. 19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ సాయంతో 26 పరుగులు చేశాడు. 9 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 84/1గా ఉంది.6 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 55/1మిచెల్ మార్ష్ 15, రిషబ్ పంత్ 20తొలి వికెట్ కోల్పోయిన లక్నో2.4వ ఓవర్- 25 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్ కోల్పోయింది. నువాన్ తుషార బౌలింగ్‌లో మాథ్యూ బ్రీట్జ్కీ (14) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీఐపీఎల్ 2025లో ఇవాళ (మే 27) చివరి లీగ్ మ్యాచ్ జరుగుతుంది. లక్నో వేదికగా ఎల్ఎస్జీ, ఆర్సీబీ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.తుది జట్లు..రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, రజత్ పాటిదార్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(w/c), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, నువాన్ తుషారఇంపాక్ట్ సబ్స్: సుయాష్ శర్మ, రసిఖ్ సలామ్, మనోజ్ భాండాగే, టిమ్ సీఫెర్ట్, స్వప్నిల్ సింగ్.లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, మాథ్యూ బ్రీట్జ్కే, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(w/c), ఆయుష్ బడోని, అబ్దుల్ సమద్, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్, విలియం ఓర్కేఇంపాక్ట్ సబ్స్ - ఆకాష్ మహరాజ్ సింగ్, ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్షిన్ కులకర్ణి, యువరాజ్ చౌదరి -
ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో హెచ్‌సీఏ పాత్ర.. విచారణలో సంచలన విషయాలు
ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) పాత్రపై విజిలెన్స్ విచారణ పూర్తయ్యింది. ప్రాథమిక నివేదికను విజిలెన్స్ ప్రభుత్వానికి పంపింది. విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. టికెట్ల విషయంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు సన్‌రైజర్స్ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి, తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లు నిర్ధారణ అయ్యింది. ఎస్ఆర్హెచ్ యాజమాన్యం పది శాతం టికెట్లు ఉచితంగా ఇస్తున్నా.. మరో పది శాతం టికెట్లు అదనంగా ఇవ్వాలని హెచ్‌సీఏ కార్యదర్శి ఒత్తిడి చేసినట్లు రుజువైంది. విజిలెన్స్ తమ నివేదికలో హెచ్‌సీఏపై చర్యలకు సిఫార్సు చేసింది.కాగా, అదనపు టికెట్ల కోసం హెచ్‌సీఏ ఒత్తిడి తెస్తుందని సన్‌రైజర్స్ యాజమాన్యం బీసీసీఐకి ఫిర్యాదు చేసింది. మరో పది శాతం టికెట్లు అదనంగా ఇచ్చే ప్రసక్తే లేదని సన్‌రైజర్స్ యాజమాన్యం తేల్చి చెప్పింది. ఓపెన్ మార్కెట్లో కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు డిమాండ్ చేశాడు. వ్యక్తిగతంగా తనకు మరో పది శాతం టికెట్లు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చాడు. వ్యక్తిగతంగా టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని సన్‌రైజర్స్ మేనేజ్మెంట్ తేల్చి చెప్పింది. సన్‌రైజర్స్ యాజమాన్యం టికెట్లు ఇవ్వకపోవడంతో మ్యాచ్‌ల సందర్భంగా జగన్మోహన్ రావు ఇబ్బందులకు గురి చేశాడు. లక్నో మ్యాచ్ సందర్భంగా వీఐపీ గ్యాలరీలకు తాళాలు వేయించాడు. -
IPL 2025: రోహిత్ చాలా అనాసక్తిగా ఆడుతున్నాడు.. భారత మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణలు
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపిస్తున్నాడు. ఈ సీజన్లో అతను 13 మ్యాచ్‌ల్లో మూడు హాఫ్ సెంచరీల సాయంతో 329 పరుగులు చేశాడు. హిట్‌మ్యాన్ ఈ సీజన్లో ఓ మోస్తరుగా రాణిస్తున్నా విమర్శకులు అతన్ని టార్గెట్ చేస్తున్నారు.రోహిత్ ప్రదర్శనలు ఈ సీజన్లో ముంబై ఇండియన్స్‌కు పెద్దగా ఉపయోగపడలేదని అంటున్నారు. హిట్‌మ్యాన్ చాలా నిర్లక్ష్యంగా, అనాసక్తిగా ఆడుతూ వికెట్ పారేసుకుంటున్నాడని ఆరోపిస్తున్నారు. తాజాగా హిట్‌మ్యాన్ వ్యతిరేకులతో భారత మాజీ బౌలర్ అతుల్ వాసన్ కూడా గళం కలిపాడు.ఈ సీజన్లో రోహిత్ ప్రదర్శనలపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. క్రీడా జీవితంలో అన్ని సాధించాక రోహిత్ చాలా అనాసక్తిగా కనిపిస్తున్నాడంటూ కామెంట్ చేశాడు. రోహిత్లో ప్రేరణ కొరవడిందని అన్నాడు. ప్రేరణ కోసం అతను లక్ష్యాలను సెట్ చేసుకోవాలని సూచించాడు.వాసన్ వ్యాఖ్యలు ఘాటుగా ఉన్నప్పటికీ అతని అభిప్రాయంతో ఏకీభవించాల్సిందే. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ కోల్పోయినప్పటి నుంచి రోహిత్లో ఏదో తెలినీ తేడా కనిపిస్తుంది. మునుపటిలా అతను జట్టు కోసం ఆడటం లేదు. చాలా నిర్లక్ష్యంగా షాట్లు ఆడుతూ వికెట్ పారేసుకుంటున్నాడు. ఈ సీజన్లోనూ అదే జరిగుతుంది. ఒకటి, రెండు మ్యాచ్‌లు మినహా రోహిత్ శ్రద్దగా ఆడింది లేదు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగుతూ జట్టు జయాపజయాల పట్ల పట్టీపట్టనట్లున్నాడు. టీమ్‌లో అతని ఇన్వాల్మెంట్ ఎక్కడా కనిపించడం లేదు. ఎవరి కోసమో అడుతున్నా అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో అతని బాండింగ్ మొదటి నుంచే మిస్ అయినట్లు కనిపిస్తుంది. రోహిత్ అభిమానులు పైకి ఏమీ చెప్పలేకపోతున్నా అసలు విషయం వారికి బాగా తెలుసు. తమ ఆరాధ్య ఆటగాడు వంద శాతం కమిట్మెంట్తో ఆడటం లేదని లోలోపల వారూ మదనపడుతున్నారు.సూర్యకుమార్ యాదవ్ మెరుపులు, రికెల్టన్ ప్రతిభ, బౌలర్ల కష్టంతో ముంబై ఇండియన్స్ అనూహ్య రీతిలో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించినప్పటికీ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆ జట్టు నెగ్గుకొస్తుందన్న ఆశలు లేవు. అదే రోహిత్ వంద శాతం కమిట్మెంట్తో ఆడితే ఫలితం అనుకూలంగా రావచ్చు. -
ఐపీఎల్ 2025 తర్వాత రిటైర్ కానున్న క్రికెటర్లు వీరే..?
ఐపీఎల్ 2025 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్ బెర్త్‌లు (పంజాబ్, గుజరాత్, ఆర్సీబీ, ముంబై) ఇదివరకే ఖరారయ్యాయి. క్వాలిఫయర్-1 (పంజాబ్), ఎలిమినేటర్ (ముంబై) మ్యాచ్‌ల్లో కూడా ఒక్కో బెర్త్ ఖరారైంది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన జట్లు (సీఎస్కే, రాజస్థాన్, ఎస్ఆర్హెచ్, కేకేఆర్, లక్నో, ఢిల్లీ) తదుపరి సీజన్లో మరింత బలంగా తిరిగి రావాలని ఆశిస్తున్నాయి. కొన్ని జట్లు తదుపరి సీజన్లో ఎవరిని వదిలించుకోవాలో, ఎవరిని అట్టిపెట్టుకోవాలో అన్నదానిపై ఇప్పటికే ఓ అంచనా కలిగి ఉన్నాయి.ఆటగాళ్ల రిటెన్షన్ గురించి మాట్లాడుకుంటే వెటరన్ ఆటగాళ్ల ప్రస్తావన వస్తుంది. కొందరు వెటరన్లు లీగ్ ప్రారంభం నుంచి ఆడుతూ ఇంకా కొనసాగుతున్నారు. వీరిలో కొందరకి ఈ సీజన్ ఆఖరిదయ్యే అవకాశం ఉంది. ఇలాంటి వారిపై ఓ లుక్కేద్దాం.ఈ సీజన్ తర్వాత రిటైరయ్యే ఆటగాళ్ల ప్రస్తావన వస్తే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు ధోని. 44 ఏళ్ల ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి చాలా కాలమైనా ఐపీఎల్లో కొనసాగుతున్నాడు. ధోనికి ఈ సీజన్ ఆఖరిదని చాలామంది అంటున్నారు. ధోని ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వనప్పటికీ.. రిటైర్ కానని కూడా ఖరాఖండిగా చెప్పలేదు. ధోని ఈ సీజన్లో ఆటగాడిగా, కెప్టెన్‌గా దారుణంగా విఫలమయ్యాడు. అతడిపై వయోభారం స్పష్టంగా కనిపిస్తుంది.ఈ ఐపీఎల్ సీజన్ తర్వాత రిటైరయ్యే అవకాశమున్న మరో ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్. 39 ఏళ్ల అశ్విన్‌ను ఈ సీజన్ మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకుంది. అయితే యాష్ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేదు. కుర్ర విధ్వంసకర బ్యాటర్ల ముందు అతని మాయాజాలం పని చేయలేదు. జట్టు నుంచి స్వతహాగా వైదొలగాలని సొంత జట్టు అభిమానులే కోరుకున్నారు. ఈ నేపథ్యంలో అశ్విన్ ఈ సీజన్ తర్వాత ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పడం గ్యారెంటీ అని తెలుస్తుంది.ఈ సీజన్ తర్వాత రిటైరయ్యే అవకాశమున్న మరో స్టార్ క్రికెటర్ ఫాప్ డుప్లెసిస్. ఫాఫ్‌ను ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓ మోస్తరు ధరకే సొంతం చేసుకుంది. వయసు మీద పడటంతో ఫాఫ్ మునుపటిలా వేగంగా ఆడలేకపోతున్నాడు. అందుకే అతన్ని ఆర్సీబీ వదిలించుకుంది. 40 ఏళ్ల ఫాఫ్ కుర్ర బ్యాటర్లతో పోటీపడి గతంలోలా భారీ షాట్లు ఆడలేకపోతున్నాడు. వాస్తవానికి ఆర్సీబీ వదిలించుకున్నప్పుడే అతని పనైపోయిందని అంతా అనుకున్నారు. అయితే ఢిల్లీ ఏదో ప్రణాళికతో అతన్ని దక్కించుకుంది. తీరా అది కూడా ఫ్లాప్ అయ్యింది.ఈ సీజన్ తర్వాత రిటైరయ్యే అవకాశమున్న మరో స్టార్ క్రికెటర్ మొయిన్ అలీ. త్వరలో 38లో అడుగుపెట్టనున్న మొయిన్ ఈ సీజన్ తర్వాత ఐపీఎల్‌కు గుడ్‌బై చెబుతాడని టాక్ నడుస్తుంది. ఈ సీజన్లో మొయిన్‌ను కేకేఆర్ నామమాత్రపు ధరకు సొంతం చేసుకుంది. మొయిన్ ఫ్రాంచైజీ నమ్మకానికి వంద శాతం న్యాయం చేయలేకపోయినా, పర్వాలేదనిపించాడు. మొయిన్ విదేశీ లీగ్‌లపై దృష్టి పెట్టేందుకు తనకు పెద్దగా డిమాండ్ లేని ఐపీఎల్‌ను వదిలేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.పైన పేర్కొన్న ఆటగాళ్లే కాకుండా విజయ్ శంకర్ (సీఎస్కే), మోహిత్ శర్మ (ఢిల్లీ), అజింక్య రహానే (కేకేఆర్) కూడా ఈ సీజన్ తర్వాత ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పవచ్చని టాక్ నడుస్తుంది. -
వెస్టిండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లండ్
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు వెస్టిండీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా నిన్న (మే 26) జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేయగా.. విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 127 పరుగులు మాత్రమే చేయగలిగింది.రాణించిన హీథర్ నైట్‌స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ హీథర్ నైట్ అజేయ అర్ద సెంచరీతో (66) రాణించడంతో ఇంగ్లండ్ ఓ మోస్తరు స్కోర్ చేయగలిగింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో నాట్ సీవర్ బ్రంట్ 37, ఆమీ జోన్స్ 22,అలైస్ క్యాప్సీ 4, సోఫియా డంక్లీ 3, ఎమ్ ఆర్లాట్ 2 (నాటౌట్) పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ 3, జైదా జేమ్స్, క్లాక్స్ట్న్ తలో వికెట్ పడగొట్టారు.హేలీ పోరాటం వృధా145 పరుగుల ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో విండీస్ తడబడింది. ఆ జట్టు కెప్టెన్ హేలీ మాథ్యూస్ (71) ఒంటరిపోరాటం చేసినా గెలవలేకపోయింది. విండీస్ ఇన్నింగ్స్‌లో మాథ్యూస్‌తో పాటు గ్రిమ్మండ్ (15), గజ్నబి (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లు లారెన్ బెల్, ఆర్లాట్, చార్లోట్ డీన్, లిన్సే స్మిత్ తలో రెండు వికెట్లు పడగొట్టి విండీస్‌ను కట్టడి చేశారు.30 నుంచి ప్రారంభంకాగా, మూడు టీ20లు, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం విండీస్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. టీ20 సిరీస్ నిన్నటితో ముగియగా.. మే 30 (డెర్బీ), జూన్ 4 (లీసెస్టర్), 7 తేదీల్లో (టాంటన్) మూడు వన్డేలు జరుగనున్నాయి. -
PKL 2025: యు ముంబా హెడ్ కోచ్‌గా అనిల్
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో యు ముంబా జట్టుకు అనిల్ చప్రానా హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. పీకేఎల్ 11వ సీజన్లో యు ముంబా జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్న గులామ్‌రజా మజందరాని (ఇరాన్) సీజన్ ముగిశాక తన బాధ్యతల నుంచి వైదొలిగాడు.గత సీజన్లో అనిల్ చప్రానా యు ముంబా జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా పని చేశాడు. గులాంరజా తప్పుకున్న తర్వాత 12వ సీజన్ కోసం భారత మాజీ ప్లేయర్ రాకేశ్ కుమార్‌ను యు ముంబా కొత్త హెడ్ కోచ్‌గా నియమించుకుంది. అయితే ఆదివారం అనూహ్య పరిణామంచోటు చేసుకుంది. రాకేశ్‌ను హెడ్ కోచ్ పదవి నుంచి తప్పిస్తున్నామని ముంబా సీఈఓ సుహైల్ చందోక్ తెలిపారు. రాకేశ్‌తో సంప్రదింపులు చేశాకే ఈ నిర్ణయం తీసుకున్నామని చందోక్ వివరించారు. 2022లో యు ముంబా జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్న అనిల్ చప్రానాకు మరోసారి ఆ బాధ్యతలు అప్పగిస్తున్నామని, అసిస్టెంట్ కోచ్‌గా పారి్థబన్ను ఎంపిక చేశామని సోమవారం సదరు ఫ్రాంచైజీ పేర్కొంది. ఈనెల 31న, జూన్ 1న పీకేఎల్ 12వ సీజన్ కోసం ఆటగాళ్ల వేలం కార్యక్రమం జరగనుంది. 2014లో పీకేఎల్ ఆరంభ సీజన్ నుంచి పోటీపడుతున్న యు ముంబా జట్టు రెండుసార్లు రన్నరప్‌గా, ఒకసారి చాంపియన్‌గా (2015) నిలిచింది. గత సీజన్లో యు ముంబా టాప్–6లో నిలిచి ఎలిమినేటర్ మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ చేతిలో ఓడింది. -
సూర్యకుమార్ వరల్డ్ రికార్డు.. సౌతాఫ్రికా కెప్టెన్‌ను దాటేశాడు
ఐపీఎల్-2025లో టీమిండియా టీ20 కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ దుమ్ములేపుతున్నాడు. సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 39 బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్.. 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో సూర్య భాయ్ ఓ వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.టీ20 క్రికెట్లో వరుసగా అత్యధిక సార్లు 25 పరుగులు దాటిన క్రికెటర్‌గా సూర్య చరిత్రపుటలెక్కాడు. ఐపీఎల్-2025 సీజన్లో ఈ ముంబైకర్ వరుసగా 14 సార్లు 25 పైగా పరుగులు చేశాడు. దీంతో ఈ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా పేరిట ఉండేది. బావుమా వరుసగా 13 టీ20 మ్యాచ్‌లలో 25 ప్లస్ పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో ప్రోటీస్ కెప్టెన్‌ను సూర్య అధిగమించాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్ 640 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్దానంలో కొనసాగుతున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబై ఇండియన్స్‌పై 7 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పంజాబ్ టాప్ స్దానాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.సూర్యకుమార్ (39 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. అర్ష్‌దీప్, యాన్సెన్, వైశాక్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం పంజాబ్ కింగ్స్ 18.3 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి 187 పరుగులు చేసి గెలుపొందింది.చదవండి: గిల్‌ను కాదు అతడిని కెప్టెన్‌గా సెలక్ట్ చేయాల్సింది: వీరేంద్ర సెహ్వాగ్ -
గిల్‌ను కాదు అతడిని కెప్టెన్‌గా సెలక్ట్ చేయాల్సింది: వీరేంద్ర సెహ్వాగ్
ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ ఎంపికైన సంగతి తెలిసిందే. అదేవిధంగా గిల్‌కు డిప్యూటీగా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ నియమితుడయ్యాడు. రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో కొత్త కెప్టెన్ ఎంపిక అనివార్యమైంది. పలు మీడియా రిపోర్ట్లు ప్రకారం.. కెప్టెన్సీ రేసులో నుంచి ఫిట్నెస్, వర్క్‌లోడ్ కారణంగా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా తప్పుకోవడంతో గిల్‌కు జట్టు పగ్గాలను సెలక్టర్లు అప్పగించారు. కాగా భారత సెలక్టర్ల ముందు గిల్‌తో పాటు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ అప్షన్స్ కూడా ఉండేవి. కానీ జట్టు దీర్ఘకాలక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని గిల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినట్లు బీసీసీఐ ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్ టీమ్ సెలక్షన్ ప్రెస్మీట్లో తెలిపాడు. అయితే 25 ఏళ్ల గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడంపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్లు మనోజ్ తివారీ,వీరేంద్ర సెహ్వాగ్‌లు తమ మనసులోని మాటను బయటపెట్టారు. ఫిట్నెస్ సమస్యల కారణంగానే బుమ్రా కాదని గిల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించరాని తివారీ అన్నాడు."భారత టెస్టు కెప్టెన్సీకి శుబ్‌మన్ గిల్ సెకెండ్ బెస్ట్ ఆప్షన్. సెలక్టర్లకు తొలి ఎంపికగా బుమ్రా ఉండేవాడు. కానీ ఫిట్నెస్ సమస్యల వల్ల తుదిజట్టులో ఆడలేని వారికి సారథ్య బాధ్యతలు ఎలా అప్పగిస్తారు. అందుకే తమ సెకెండ్ అప్షన్ అయిన గిల్‌కు జట్టు పగ్గాలను కట్టబెట్టారు" అని క్రిక్‌బజ్ లైవ్ షోలో తివారీ పేర్కొన్నాడు. అయితే తివారీ వ్యాఖ్యలతో సెహ్వాగ్ విభేదించాడు. గిల్‌ను కాకుండా పంత్ కెప్టెన్‌గా ఎంపిక చేసి ఉంటే బాగుండేదని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు."కేవలం ఒక్క సిరీస్ కోసం అయితే బుమ్రాను కెప్టెన్‌గా సెలక్ట్ చేయవచ్చు. అందులో ఎటువంటి సమస్య లేదు. కానీ దీర్ఘకాలనికి అయితే ఈ నిర్ణయం సరైంది కాదు. భారత్ ఒక ఏడాది 10 టెస్టులు ఆడితే, ఆ మ్యాచ్‌లన్నీ బుమ్రా ఆడగలడా అని ఆడగాలి? లేదా అతడు ఎన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండగలడు అని ప్రశ్నించాలి. కెప్టెన్‌ను ఎంపిక చేయడంలో అది ఒక ప్రధాన అంశం.కానీ సెలక్టర్లు ఆ ఒత్తిడిని, వర్క్‌లోడ్‌ను బుమ్రాపై పెట్టాలనుకోలేదు. అందుకే అతడిని కెప్టెన్‌గా ఎంపిక చేయలేదు. సెలక్టర్లు తీసుకుంది సరైన నిర్ణయం అని నేను కూడా భావిస్తున్నాను. అయితే కెప్టెన్సీకి గిల్ రెండవ బెస్ట్ ఆప్షన్ అని తివారీ అన్నారు. నా దృష్టిలో టీమిండియాకు సారథిగా రిషభ్ పంత్ సెకండ్ బెస్ట్ ఆప్షన్. టెస్ట్ క్రికెట్‌కు పంత్ చేసినంతగా, ఇతర మరే ఇతర ఆటగాడు చేయలేదు. విరాట్ కోహ్లి తర్వాత టెస్టు క్రికెట్ చూసేలా చేసిన ప్లేయర్ పంత్. కారు ప్రమాదం నుంచి కోలుకుని వచ్చిన తర్వాత పంత్ అంతగా ప్రభావం చూపలేకపోయాడు. దీన్ని నేను కూడా అంగీకరిస్తున్నాను. అతడు తిరిగి తన ఫామ్‌ను అందుకంటే, భవిష్యత్తులో అతన్ని కెప్టెన్‌గా చేసే నిర్ణయాన్ని సెలక్టర్లు తీసుకొవచ్చు.అందుకే వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అయితే భారత టెస్టు సారథిగా చాలా కొద్ది మంది బౌలర్లరే వ్యవహరించారు.నేను క్రికెట్ ఆడిన కాలంలో కేవలం అనిల్‌కుంబ్లేనే ఈ ఫీట్ సాధించాడు. అదేవిధంగా అన్ని మ్యాచ్‌లకు కూడా అతడు అందుబాటులో ఉన్నాడని" సెహ్వాగ్ విశ్లేషించాడు.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. -
సంచలనం.. 2 పరుగులకే టీమ్ ఆలౌట్! అందులో ఓ వైడ్
క్రికెట్ చరిత్రలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ జట్టు కేవలం రెండు పరుగులకు ఆలౌటైంది. ఈ వింత రికార్డుకు ఇంగ్లండ్ మిడిలెసెక్స్ కౌంటీ లీగ్ వేదికైంది. ఈ లీగ్ మూడో టైర్ డివిజన్లో భాగంగా సోమవారం నార్త్ లండన్ సీసీ 3rd XI, రిచ్మండ్ సీసీ 4th XI జట్లు తలపడ్డాయి.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ లండన్ సీసీ నిర్ణీత 45 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 426 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. నార్త్ లండన్ బ్యాటర్ డాన్ సిమ్మన్స్(140) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. అనంతరం 427 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రిచ్మండ్ సీసీకి ఆది నుంచే కష్టాలు ఎదురయ్యాయి. నార్త్ లండన్ సీసీ బౌలర్ల ధాటికి రిచ్మండ్ బ్యాటర్లు వరుస క్రమంలో పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో రిచ్మండ్ 5.4 ఓవర్లలో కేవలం 2 పరుగులకే ఆలౌటైంది. ఈ రెండు పరుగుల స్కోర్‌లో ఓ వైడ్ కూడా ఉండడం గమనార్హం. రిచ్మండ్ ఇన్నింగ్స్ లో ఏకంగా 9 మంది బ్యాటర్లు డకౌట్ అయ్యారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన స్కోర్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.నార్త్ లండన్ బౌలర్లలో మాథ్యూ రాన్సన్ 5 వికెట్లతో ప్రత్యర్ది పతనాన్ని శాసించగా..థామస్ పాటన్ 3 వికెట్లు పడగొట్టారు. లాస్ట్ బ్యాటర్ విక్రమ్ మంగళూరు బ్యాటింగ్ కు రాలేదు. రిచ్మండ్ 2 పరుగులే చేయడంతో నార్త్ లండన్ 424 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్, లిస్ట్-ఎ క్రికెట్ కిందకు రానుందన ఈ చెత్త రికార్డును పరిగణలోకి తీసుకోలేదు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యల్ప స్కోరు సాధించిన రికార్డు ది బిఎస్ జట్టు పేరు మీద ఉంది. 1810లో లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ది బిస్ కేవలం 6 పరుగులకే ఆలౌట్ అయింది. అదేవిధంగా అంతర్జాతీయ క్రికెట్లో ఈ చెత్త రికార్డు న్యూజిలాండ్ జట్టు పేరిట ఉంది. 1955లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కివీస్ జట్టు కేవలం 26 పరుగులకే ఆలౌటైంది. -
భారత సైన్యానికి స్పెషల్ ట్రిబ్యూట్ ఇవ్వనున్న బీసీసీఐ
ఐపీఎల్-2025 సీజన్ తుది అంకానికి చేరుకుంది. మంగళవారం(మే 27)తో లీగ్ స్టేజి మ్యాచ్‌లు ముగియనున్నాయి. మే 29న తొలి క్వాలిఫయర్, మే 30న ఎలిమినేటర్, జూన్ 1న క్వాలిఫయర్-2 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక ఆఖరిగా జూన్ 3న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.ఈ ఫైనల్‌కు మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది సీజన్ ఫైనల్ సందర్బంగా నిర్వహించే ముగింపు వేడుకను భారత సాయుధ దళాలకు అంకితమివ్వాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ధ్రువీకరించారు. ఈ క్లోజింగ్ సెర్మనీ కార్యక్రమానికి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్ స్టాఫ్ చీఫ్‌లను ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు."ఆపరేషన్ సిందూర్‌లో మన సాయుధ దళాలు చూపించిన ధైర్య సహసాలకు బోర్డు సెల్యూట్ చేస్తోంది. ముగింపు వేడుకను మన సైన్యానికి అంకితం చేయాలని మేము నిర్ణయించుకున్నాము" అని సైకియా స్పోర్ట్స్ స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాగా పెహల్గమ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ చేపట్టాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్ధావరాలపై భారత బలగాలు దాడులు చేశాయి. ఆ తర్వాత పాక్-భారత్ మధ్య ఉద్రిక్తలు తలెత్తడంతో ఐపీఎల్‌ను వారం రోజుల పాటు వాయిదా వేశారు. పరిస్థితులు సద్దుమణగడంతో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ తిరిగి ప్రారంభమైంది.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. -
వారిద్దరూ అద్బుతం.. అదే మా కొంపముంచింది: హార్దిక్ పాండ్యా
ఐపీఎల్-2025 పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలవాలని కలలు కన్న ముంబై ఇండియన్స్(MI)కు నిరాశ మిగిల్చింది. సోమవారం జైపూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ముంబై ఓటమి పాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానానికి పరిమితమైన ముంబై జట్టు.. ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. మరోవైపు ఈ విజయంతో పాయింట్ల పట్టికలో పంజాబ్ అగ్రస్ధానానికి దూసుకెళ్లింది. దీంతో క్వాలిఫయర్-1 ఆడేందుకు శ్రేయస్ సేన అర్హత సాధించింది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. బ్యాటింగ్ యూనిట్‌గా మరింత మెరుగ్గా రాణించి ఉండాల్సందని పాండ్యా అభిప్రాయపడ్డాడు."జైపూర్ పిచ్ బ్యాటింగ్‌కు అద్బుతంగా ఉంది. ఈ పిచ్‌ను బట్టి చూస్తే కనీసం 20 పరుగులు తక్కువ చేశామని అన్పించింది. అయితే గత కొన్ని మ్యాచ్‌లుగా మేము మంచి క్రికెట్ ఆడుతున్నాము. ఈ మ్యాచ్‌లో మాత్రం మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాము.ఈ ఓటమి మాకు నష్టం కలిగించింది. ముంబై ఫ్రాంచైజీ ఇప్పటివరకు ఐదు ట్రోఫీలను గెలుచుకుంది. అయినప్పటికి ప్రతీ మ్యాచ్ కూడా సవాలుతో కూడుకున్నది. ఒక్కసారి మన స్పీడ్‌ను తగ్గిస్తే ప్రత్యర్ధి దాన్ని ఉపయోగించుకుని విజయాలు సాధిస్తారు.మా బాయ్స్‌కు నేను చెప్పేది ఒక్కటే. ఈ మ్యాచ్ నుంచి పాఠాలు నేర్చుకుని నాకౌట్ దశ కోసం సిద్ధంగా ఉండాలి. ఏదేమైనప్పటికి బ్యాటింగ్ యూనిట్‌గా మేము కచ్చితంగా 20 పరుగులు వెనకబడ్డాము. తప్పు ఎక్కడ జరిగిందో మా డ్రెస్సింగ్ రూమ్‌లో చర్చించుకుంటాము. మా తర్వాతి మ్యాచ్‌లో ఇటువంటి పొరపాట్లు చేయకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాము. ఈ పిచ్‌పై లెగ్ స్పిన్నర్, పేసర్ కాంబినేషన్ పని చేస్తుందనే భావించాము. అందుకే అదనంగా ఆఫ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ బదులుగా పేసర్ అశ్వినీ కుమార్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకున్నాము. కానీ ఫలితం మేము ఆశించినట్లు రాలేదు. మేము అశ్వినీ కుమార్ సపోర్ట్ చేస్తున్నాము. సీజన్ అంతటా మాది అదే ప్రణాళిక. సెకెండ్ హాఫ్‌లో కూడా పిచ్ ఏ మాత్రం మారలేదు. పంజాబ్ మా కంటే మెరుగ్గా ఆడారు. ముఖ్యంగా ఆ ఇద్దరు(ప్రియాన్ష్ ఆర్య, ఇంగ్లిష్) రెండో వికెట్‌కు అద్బుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. మా బౌలర్లు లైన్ తప్పిన ప్రతీసారి వారిద్దరూ బంతులను స్టాండ్స్‌కు పంపిచారు. బౌలింగ్ యూనిట్‌గా అంత గొప్పగా మేము బౌలింగ్ చేయలేకపోయాము. ఇక ఇప్పుడు ఎలిమినేటర్ లోకి వెళ్తున్నాము.. అక్కడ మంచి బ్యాటింగ్, బౌలింగ్ తో కూడా అద్భుత ప్రదర్శన చేయాల్సిన అవసరముంది అని పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్‌లో హార్దిక్ పేర్కొన్నాడు.కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. అనంతరం 185 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.3 ఓవర్లలోనే చేధించింది. జోష్ ఇంగ్లిష్ (42 బంతుల్లో 73; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), ప్రియాన్ష్ ఆర్య (35 బంతుల్లో 62; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్బుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. -
టీమ్ విక్టరీ సెలబ్రేషన్స్.. ఫ్యాన్స్‌పైకి దూసుకెళ్లిన కారు! వీడియో
లివర్‌పూల్ టీమ్ విక్టరీ పరేడ్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. ప్రీమియర్ లీగ్‌లో 20వ టైటిల్‌ను లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం లివర్‌పూల్‌లో విక్టరీ పరేడ్‌ను నిర్వహించారు. తమ ఆరాధ్య ప్లేయర్లను అభినందించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు ఈ విజయోత్సవ ర్యాలీలో పాల్గోన్నారు.ఈ క్రమంలో విక్టరీ పరేడ్‌లోకి ఓ దుండగుడు కారుతో దూసుకొచ్చాడు. విచక్షణారహితంగా పలువురిని ఢీకొట్టుకుంటూ ముందుకెళ్లాడు. ఈ ప్రమాదంలో 27 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.వాహనదారుడిని అరెస్ట్ చేసినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. అయితే ఇది ఉగ్రవాద చర్య కాదని పోలీసులు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.Car drives into Liverpool fan crowd. pic.twitter.com/Q4422ueYIo— RedandWhite Ireland (@RIreland29776) May 26, 2025చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. -
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్..
ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో అదరగొట్టింది. జైపూర్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం సాధించింది. దీంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానాన్ని కైవసం చేసుకోంది.ఇక ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. సూర్యకుమార్ (39 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. అర్ష్‌దీప్, యాన్సెన్, వైశాక్ తలా 2 వికెట్లు పడగొట్టారు.అనంతరం పంజాబ్ కింగ్స్ 18.3 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి 187 పరుగులు చేసి గెలిచింది. జోష్ ఇన్‌గ్లిస్ (42 బంతుల్లో 73; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), ప్రియాన్ష్ ఆర్య (35 బంతుల్లో 62; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. ముంబై బౌలర్లలో సాంట్నర్ రెండు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా ఒక్క వికెట్ సాధించారు. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.చరిత్ర సృష్టించిన శ్రేయస్..ఐపీఎల్ చరిత్రలో మూడు వెర్వేరు జట్లును క్వాలిఫయర్స్‌కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్‌గా అయ్యర్ రికార్డులకెక్కాడు. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో తన ఐపీఎల్ కెరీర్‌ను ప్రారంభించిన శ్రేయస్.. 2020 సీజన్లో ఢిల్లీ జట్టును కెప్టెన్‌గా రెండవ స్ధానానికి చేర్చాడు.సెకెండ్ క్వాలిఫయర్‌లో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్.. దురుదృష్టవశాత్తూ ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. అనంతరం ఐపీఎల్-2024 పాయింట్ల పట్టికలో శ్రేయస్ సారథ్యంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) అగ్రస్దానంలో నిలిచింది. ఫైనల్లో ఎస్ఆర్హెచ్ను చిత్తు చేసి మూడో ఐపీఎల్ టైటిల్‌ను కేకేఆర్ సొంతం చేసుకుంది. ఇప్పుడు పంజాబ్‌ను క్వాలిఫయర్స్‌కు చేర్చి ఈ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.చదవండి: బెంగళూరుకు ‘ఆఖరి’ చాన్స్ -
‘పోల్’ దాటడమే పరీక్ష!
సాక్షి క్రీడా విభాగం: ఒకవైపు ప్రపంచ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు తీవ్ర ఒత్తిడి మధ్య ప్రయాణానికి సిద్ధమవుతున్న తరుణం... మరోవైపు పోటీలు జరిగే దేశంలో ఉండే పరిస్థితులు, అనుకూలతల గురించి ఆలోచిస్తూ తమ వ్యూహాలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం... సాధారణంగా అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఇలాంటి దశను ఎదుర్కొంటూనే ఉంటారు. టీమ్ గేమ్‌లకు సంబంధించి ఏర్పాట్లను చక్కబెట్టేందుకు ప్రత్యేక బృందాలు అందుబాటులో ఉంటాయి. అదే వ్యక్తిగత క్రీడాంశాల్లో పాల్గొనే ఆటగాళ్లు మాత్రం అన్నీ తామే చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ విషయంలో ఎన్నో ఏర్పాట్లు, మరెన్నో అదనపు జాగ్రత్తలతో వారు పోటీలకు వెళుతుంటారు. కానీ ఇలాంటి ఆటగాళ్లకు విమానాశ్రయంలో ప్రతీసారి నిబంధనల పేరుతో ప్రతిబంధకాలు ఎదురవుతూనే ఉంటాయి. ప్రశాంతంగా, సమస్య లేకుండా ప్రయాణం చేయాల్సిన అథ్లెట్లు సామాన్యుల తరహాలో అనేక తనిఖీలను ఎదుర్కొంటూ అడ్డంకులను అధిగమించాల్సి ఉంటుంది. భారత డెకాథ్లెట్ తేజస్విన్ శంకర్‌కు ప్రతీసారి ఇలాంటి అనుభవమే ఎదురవుతూ ఉంటుంది. 2022 ఆసియా క్రీడల డెకాథ్లాన్ (పది క్రీడాంశాల సమాహారం) ఈవెంట్లో శంకర్ రజత పతకం సాధించాడు. ఈ పోటీల్లో భాగంగా అతను పోల్‌వాల్ట్ ఈవెంట్లో కూడా పాల్గొనాల్సి ఉంటుంది. దాని కోసమే అతను ఎక్కడికైనా తన సొంత ‘పోల్’లను తీసుకెళతాడు. సుమారు 15.7 అడుగుల పొడవు ఉండే ఈ పోల్‌ను ముందుగా విమానాశ్రయం కార్గోలోకి తీసుకెళ్ళడం మొదలు విమానం దిగిన తర్వాత ఆయా ఎయిర్‌పోర్ట్‌నుంచి బయటకు తీసుకు రావడం వరకు పెద్ద ప్రహసనం సాగుతుంది. భారత్‌లో జరిగే ఈవెంట్లలో అయితే అతను తన పోల్‌లను ట్రైన్ల ద్వారా సునాయాసంగా పంపించేస్తాడు. అదే విదేశాలకు వెళ్లేటప్పుడే సమస్య ఎదురవుతుంది. టోర్నీ జరిగే సమయంలో నిర్వాహకులు పోల్‌లను సిద్ధం చేస్తారు కానీ కొత్తవాటిని ఉపయోగించడంలో చాలా సమస్యలు ఉంటాయి. వాటి పొడవు, బరువును బట్టి ప్రాక్టీస్‌లో వాడటం బాగా అలవాటైన పోల్లనే పోటీల్లోనూ వాడితే సౌకర్యంగా ఉంటుంది. అందుకే తేజస్విన్ కూడా ఎక్కడికి వెళ్లినా వాటిని తీసుకెళతాడు. యూరోప్, అమెరికా దేశాల్లో ఇలాంటి సమస్య తక్కువ. అగ్రశ్రేణి అథ్లెట్లంతా ఈ రెండు ఖండాల్లో తమకు అనువైన చోట ఒక్కో సెట్‌ను ఉంచుతారు. వాటిని తరలించడంలో వారికి పెద్దగా ఇబ్బంది ఎదురు కాదు. ఈనెల 27 నుంచి దక్షిణ కొరియాలో జరిగే ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తేజస్విన్ పాల్గొంటున్నాడు. అతని ఈవెంట్ రెండు రోజులపాటు ఉంటుంది. మే 27న తొలి రోజు ఐదు ఈవెంట్స్ (100 మీటర్లు, లాంగ్‌జంప్, షాట్‌పుట్, హైజంప్, 400 మీటర్లు)... రెండో రోజు మే 28న మరో ఐదు ఈవెంట్స్ (110 మీటర్ల హర్డిల్స్, డిస్కస్ త్రో, పోల్‌వాల్ట్, జావెలిన్ త్రో, 1500 మీటర్లు) జరుగుతాయి. అత్యధిక పాయింట్లు సాధించిన టాప్–3 డెకాథ్లెట్లకు వరుసగా స్వర్ణ, రజత, కాంస్యాలు లభిస్తాయి. ఈ నేపథ్యంలో తేజస్విన్ తన గతానుభవాలను వివరించాడు. వివరాలు అతని మాటల్లోనే.... ‘నా ఈవెంట్‌కు సంబంధించిన స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్‌లో జావెలిన్, డిస్కస్, షాట్‌పుట్ సహా అన్నింటిని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాధారణ చెకింగ్ ద్వారానే నేను దాటించ గలుగుతాను. కానీ అసలు సమస్య పోల్‌వాల్ట్ పోటీల్లో వాడే పోల్ గురించే వస్తుంది. దాదాపు 5 మీటర్ల పొడవు ఉండే పోల్‌ను తీసుకెళ్లడం నాకు ఎప్పుడూ సమస్యే. అన్నింటికంటే ముందు ప్రధాన ద్వారం వద్దే సీఐఎస్ఎఫ్ జవాన్లు నన్ను ఆపేస్తారు. నా గురించి మొత్తం చెప్పిన గతంలోనూ ఇలా వెళ్లానని వివరించాల్సి వస్తుంది. మరోవైపు ప్రయాణీకులేమో నేనేదో ఆయుధాలు తీసుకెళుతున్నట్లు చూస్తారు. సాధారణంగా లగేజీకి వాడే రెండు కార్గో లిఫ్ట్‌లలో ఈ పోల్లు పట్టవు. అందుకే మరో లిఫ్ట్‌ను వాడాల్సి ఉంటుంది. మొదటిసారి నేను ఈ పోల్స్ తీసుకొని భారత్‌కు తిరిగొచ్చాక వాటిని ఎలా బయటకు తీసుకురావాలో తెలీక కొందరు అధికారులు వెనక్కి పంపాలని కూడా ఆలోచించారు. చివరకు నాలుగు రోజుల తర్వాత అలాంటి వాటి కోసం స్టీల్ గేట్ ఒకటి ఉంటుందని తెలిసింది. దానిని కేవలం ప్రధానమంత్రి విదేశాలకు వెళ్లేటప్పుడు మాత్రమే వాడతారని వారు చెప్పారు. ఈ గేట్‌ను వాడేందుకు నేను ముందుగా సదరు ఎయిర్‌లైన్స్ అధికారుల లెటర్ తీసుకోవాలి. ఆపై సెక్యూరిటీ హెడ్, కస్టమ్స్ హెడ్‌తో కూడా దానిపై సంతకం చేయించాలి. వేర్వేరు చోట్ల బిజీగా ఉండేవారంతా ఒకే సమయంలో మనకు దొరకరు. చివరకు ఆ స్టీల్ గేట్‌ను తెరుస్తారు. ఈ ప్రక్రియ అంతా దాదాపు ఐదు గంటల పాటు సాగుతుంది! అందుకే నేను ప్రయాణ సమయానికన్నా ఎన్నో గంటల ముందు అక్కడుంటాను. కాస్త ఆలస్యం అయితే వారు నన్ను పట్టించుకోరు. ఎన్నిసార్లు నేను ఇదే చేస్తున్నా ప్రతీసారి మళ్లీ కొత్తగా మొదలు పెట్టాల్సి ఉంటుంది. భారత్ నుంచి వెళ్లిన తర్వాత మనం ఏ దేశంలో అడుగుపెడుతున్నాం అనేదానిపై తర్వాతి అంశాలు ఆధారపడి ఉంటాయి. కొన్ని ఎయిర్‌లైన్స్‌లు బాగా సహకరిస్తే కొన్ని పోల్స్‌ను తీసుకెళ్లమని గట్టిగా చెప్పేస్తాయి. నాకు ఇదంతా చేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. అయితే పతకం గెలిచి వస్తున్నప్పుడు ఎంతో చక్కగా మనకు సహాయం చేస్తారు కూడా. ఇది ఒక అథ్లెట్‌గా నాకు కలిగే ఆనందం’ అని తేజస్విన్ వివరించాడు. -
LSG Vs RCB: బెంగళూరుకు ‘ఆఖరి’ చాన్స్
లక్నో: ఐపీఎల్ లీగ్ దశ ఆఖరి అంకానికి చేరింది. 66 రోజులుగా జరుగుతున్న లీగ్ దశకు నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) ఫలితంతో తెరపడుతుంది. ఈ సీజన్లో ఎప్పుడో నాలుగు జట్లు ‘ప్లే ఆఫ్స్’ చేరాయి. అలాగని ఈ మ్యాచ్ పూర్తిగా నామమాత్రమని కొట్టిపారేయడానికి వీలు లేదు. ఎందుకంటే ‘ప్లే ఆఫ్స్’ చేరిన నాలుగు జట్లలో ఒకటైన ఆర్సీబీ సేఫ్ జోన్ టాప్–2లో నిలిచేందుకు ఇదే ఆఖరి అవకాశం. ఈడెన్ గడ్డపై మార్చి 22న మొదలైన ఐపీఎల్లో కోల్‌కతాపై గెలిచి శుభారంభం చేసిన బెంగళూరు... ఇప్పుడు మరో పరాయిగడ్డ లక్నోలోనూ సూపర్ జెయింట్స్‌పై గెలిచి టాప్–2లో చేరాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు ఈ సీజన్లో ఎలాగూ ముందంజ వేయలేకపోయిన లక్నో... కనీసం సొంత ప్రేక్షకుల మధ్య విజయంతో ముగింపు పలకాలనే పట్టుదలతో ఉంది. మిడిలార్డర్ మెరిపిస్తే... బెంగళూరు జట్టులో ఓపెనర్లు ఫిల్ సాల్ట్, కోహ్లి మంచి ఆరంభాన్నే ఇస్తున్నారు. హైదరాబాద్‌తో జరిగిన తమ చివరి మ్యాచ్‌లో ఓపెనింగ్ వికెట్‌కు 7 ఓవర్లలో 80 పరుగులు జోడించారు. తర్వాత వచ్చిన మిడిలార్డర్ బ్యాటర్లు రజత్ పాటీదార్, జితేశ్ శర్మ, షెఫర్డ్, కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్‌లు తీవ్రంగా నిరుత్సాహపరిచారు. వీళ్లందరూ మూకుమ్మడిగా విఫలమవడం మ్యాచ్ ఫలితాన్నే మార్చింది. లేదంటే 200 పైచిలుకు లక్ష్యాన్ని బెంగళూరు ఛేదించేంది. ఇక బౌలర్లు గత మ్యాచ్‌లో విరివిగా పరుగులు సమర్పించుకున్నారు. యశ్ దయాళ్, ఇన్‌గిడి, షెఫర్డ్, సుయశ్లు తేలిపోవడం ప్రత్యర్థి బ్యాటర్లకు అనుకూలతనిచ్చింది. అయితే టాప్–2లో నిలిపే కీలకమైన పోరులో సమష్టిగా బాధ్యత కనబరిస్తే ఆర్సీబీకి ఢోకా ఉండదు. తడాఖా చూపేనా లక్నో ప్లే ఆఫ్స్‌కు మాత్రమే దూరమైంది. అంతమాత్రాన పోరాటానికి విరామమివ్వలేదు. గత రెండు మ్యాచ్‌ల్ని పరిశీలిస్తే ఈ విషయమే అర్థమవుతుంది. సొంతగడ్డపై లక్నో 205 పరుగులు చేసింది. కానీ సన్‌రైజర్స్ దూకుడుతో ఓడింది. ఇక గుజరాత్ గడ్డ అహ్మదాబాద్‌పై టైటాన్స్‌పై 235 పరుగులు చేసి గెలిచింది. గత రెండు మ్యాచ్‌ల్లోనూ సులువుగా 200 పైచిలుకు పరుగులు చేసిన లక్నో బ్యాటింగ్ దుర్భేధ్యంగా ఉంది. ముఖ్యంగా ఓపెనర్లు మిచెల్ మార్‡్ష, మార్క్రమ్, మిడిలార్డర్లో నికోలస్ పూరన్ ఫామ్‌లో ఉన్నారు. ప్రత్యర్థి బౌలర్లపై చెలరేగుతున్నారు. లక్నో బ్యాటింగ్‌కు అండ, దండా ఈ ముగ్గురే! బౌలింగ్ విభాగానికి వస్తే రూర్కే, అవేశ్ ఖాన్లు నిలకడగా వికెట్లు తీస్తున్నారు. ఒక మ్యాచ్ సస్పెన్షన్‌తో గత మ్యాచ్‌కు దూరమైన స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి రావడం కలిసొచ్చే అంశం. అతని ప్రవర్తన పక్కనబెడితే స్పిన్‌తో బ్యాటర్లను బాగా ఇబ్బంది పెడుతున్నాడు. నేటి మ్యాచ్‌లో వీళ్లందరూ ఆశించిన మేర రాణిస్తే విజయంతో బైబై చెప్పడం ఏమంత కష్టం కానేకాదు. పిచ్, వాతావరణం బ్యాటింగ్‌కు కలిసొచ్చే పిచ్ ఇది. మూడు మ్యాచ్‌ల్లో 200 పైచిలుకు స్కోరు సాధ్యమైంది. ఇందులో ఒకసారైతే 206 లక్ష్యఛేదన సులువైంది. టాస్ నెగ్గిన జట్టు మొదట ఫీల్డింగ్‌కే మొగ్గుచూపుతుంది.. మంగళవారం వర్ష సూచనైతే లేదు. తుది జట్లు (అంచనా) బెంగళూరు: రజత్ పాటీదార్ (కెపె్టన్), సాల్ట్, కోహ్లి, మయాంక్, జితేశ్, రొమారియో షెఫర్డ్, కృనాల్, టిమ్ డేవిడ్, భువనేశ్వర్, యశ్ దయాళ్, ఇన్‌గిడి. లక్నో: రిషభ్ పంత్ (కెపె్టన్), మార్క్రమ్, మిచెల్ మార్‡్ష, పూరన్, ఆయుశ్ బదోని, సమద్, హిమ్మత్ సింగ్, షాబాజ్, అవేశ్‌ఖాన్, ఆకాశ్‌దీప్, విల్ రూర్కే. -
PBKS Vs MI: విధ్వంసం సృష్టించిన ఇంగ్లిస్, ఆర్య.. ముంబైపై పంజాబ్ గ్రాండ్ విక్టరీ
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 26) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది.ఈ గెలుపుతో పంజాబ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకి, టాప్-2లో స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఈ ఓటమితో ముంబై నాలుగో స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.పాయింట్ల పట్టికలో ప్లే ఆఫ్స్‌కు చేరిన జట్లు..పంజాబ్- 19గుజరాత్- 18ఆర్సీబీ- 17 (ఇంకా ఓ మ్యాచ్ ఆడాల్సి ఉంది)ముంబై- 16సత్తా చాటిన సూర్యకుమార్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన సూర్యకుమార్ మెరుపు అర్ద సెంచరీతో (57) సత్తా చాటాడు.ముంబై ఇన్నింగ్స్‌లో రికెల్టన్ 27, రోహిత్ శర్మ 24, తిలక్ వర్మ 1, విల్ జాక్స్ 17, హార్దిక్ పాండ్యా 26, నమన్ ధిర్ 20 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో జన్సెన్, విజయ్‌కుమార్ వైశాఖ్, అర్షదీప్ సింగ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. హర్‌ప్రీత్ బ్రార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.విధ్వంసం సృష్టించిన ఇంగ్లిస్, ప్రియాంశ్అనంతరం 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్.. 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ప్రియాంశ్ ఆర్య 62, జోష్ ఇంగ్లిస్ 73, శ్రేయస్ అయ్యర్ 26 (నాటౌట్), ప్రభ్‌సిమ్రన్ 13, నేహల్ వధేరా 2 (నాటౌట్) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో సాంట్నర్ 2, బుమ్రా ఓ వికెట్ పడగొట్టారు. -
IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్
ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో రెండు సీజన్లలో 600, అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి ముంబై ఇండియన్స్ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 2023 సీజన్లో తొలిసారి 600 ప్లస్ మార్కును (605) తాకిన స్కై.. ప్రస్తుత సీజన్లో కూడా 600 పరుగుల మైలురాయిని దాటాడు. ముంబై ఇండియన్స్ చరిత్రలో (ఐపీఎల్లో) స్కై కాకుండా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మాత్రమే ఓసారి 600 ప్లస్ పరుగులు స్కోర్ చేశాడు. సచిన్ 2010 సీజన్లో 618 పరుగులు సాధించాడు.ఓ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..619* - సూర్యకుమార్ యాదవ్ (2025)618 - సచిన్ టెండూల్కర్ (2010)605 - సూర్యకుమార్ యాదవ్ (2023)553 - సచిన్ టెండూల్కర్ (2011)540 - లెండిల్ సిమన్స్ (2015)538 - రోహిత్ శర్మ (2013)ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో ఇవాళ (మే 26) జరుగుతున్న మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 600 పరుగుల మార్కును దాటాడు. ఈ మ్యాచ్‌లో 44 పరుగుల వద్ద (16 ఓవర్ల తర్వాత) బ్యాటింగ్ చేస్తున్న స్కై.. ఈ సీజన్లో 14వ సారి 25 పరుగుల మార్కును దాటాడు. ఐపీఎల్ చరిత్రలో ఓ బ్యాటర్ ఇన్ని సార్లు (ఒకే సీజన్లో) 25 పరుగుల మార్కును దాటడం ఇదే మొదటిసారి. 2018 సీజన్లో కేన్ విలియమ్సన్, 2023 సీజన్లో శుభ్‌మన్ గిల్ 13 సార్లు ఈ ఘనత సాధించారు.మ్యాచ్ విషయానికొస్తే.. పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ 16.3 ఓవర్ల తర్వాత 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. సూర్యకుమార్ యాదవ్ 44, నమన్ ధిర్ 0 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ముంబై ఇన్నింగ్స్‌లో రికెల్టన్ 27, రోహిత్ శర్మ 24, తిలక్ వర్మ 1, విల్ జాక్స్ 17 పరుగులు చేసి ఔటయ్యారు. పంజాబ్ బౌలర్లలో జన్సెన్, విజయ్‌కుమార్ వైశాఖ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. హర్‌ప్రీత్ బ్రార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
పాకిస్తాన్ సూపర్ లీగ్ విజేత లాహోర్ ఖలందర్స్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 ఎడిషన్ విజేతగా లాహోర్ ఖలందర్స్ అవతరించింది. నిన్న (మే 25) జరిగిన ఫైనల్లో ఆ జట్టు క్వెట్టా గ్లాడియేటర్స్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గత నాలుగు సీజన్లలో ఖలందర్స్‌కు ఇది మూడో టైటిల్ కావడం విశేషం.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గ్లాడియేటర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేయగా.. ఖలందర్స్ మరో బంతి మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. సికందర్ రజా సుడిగాలి ఇన్నింగ్స్ (7 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడి ఖలందర్స్‌ను గెలిపించాడు. 19వ ఓవర్ చివరి రెండు బంతులకు 8 పరుగులు అవసరం కాగా.. రజా వరుసగా సిక్సర్, బౌండరీ కొట్టాడు.అంతకుముందు కుసాల్ పెరీరా మెరుపు ఇన్నింగ్స్ (31 బంతుల్లో 62 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆడి ఖలందర్స్‌ను గెలుపుకు దగ్గర చేశాడు. ఖలందర్స్ ఇన్నింగ్స్‌లో ఫకర్ జమాన్ 11, ముహమ్మద్ నయీమ్ 46, అబ్దుల్లా షఫీక్ 41, భానుక రాజపక్స 14 పరుగులు చేశారు.గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్‌లో హసన్ నవాజ్ (76) మెరుపు అర్ద సెంచరీతో చెలరేగగా.. సౌద్ షకీల్ 4, ఫిన్ అలెన్ 12, రిలీ రొస్సో 22, అవిష్క ఫెర్నాండో 29, దినేశ్ చండీమల్ 22, ఫహీమ్ అష్రాఫ్ 28 పరుగులు చేశారు. ఖలందర్స్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 3, సల్మాన్ మిర్జా, హరీస్ రౌఫ్ తలో 2, సికందర్ రజా, రిషద్ హొసేన్ తలో వికెట్ పడగొట్టారు.ఆఖరి నిమిషంలో బరిలోకి దిగి ఖలందర్స్‌ను గెలిపించిన సికందర్ రజాముందు రోజు ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో జింబాబ్వేకు ప్రాతినిథ్యం వహించిన సికందర్ రజా.. ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి పది నిమిషాల ముందు ఖలందర్స్‌కు అందుబాటులోకి వచ్చాడు. తొలుత బౌలింగ్‌లో ఓ వికెట్ తీసిన రజా.. ఆతర్వాత బ్యాటింగ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి ఖలందర్స్‌కు టైటిల్‌ను అందించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో రజా 24 ఓవర్లు బౌలింగ్ చేసి రెండు ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేశాడు. ఇందులో తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన (7) అతను.. రెండో ఇన్నింగ్స్‌లో అర్ద సెంచరీతో (60) రాణించాడు. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఇన్నింగ్స్ 45 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. -
రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్..
ఇండియా-ఎ జట్టు మాజీ కెప్టెన్, గుజరాత్ స్టార్ బ్యాటర్ ప్రియాంక్ పంచల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని సోమవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు కొనసాగిన తన దేశవాళీ కెరీర్‌కు ముగింపు పలికాడు.ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాను. నాకు ఈ క్షణం చాలా భాగోద్వేగంతో కూడుకున్నది. అంతే గర్వంగా కూడా ఉంది. నాకు మద్దతుగా నిలిచిన గుజరాత్ క్రికెట్ ఆసోషియేషన్‌కు, అభిమానులకు, సహచర ఆటగాళ్లు ధన్యవాదాలు అని తన రిటైర్మెంట్ నోట్లో పంచల్ పేర్కొన్నాడు.ప్రియాంక్‌కు దేశవాళీ క్రికెట్లో అద్బుతమైన రికార్డులు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్, లిస్ట్-ఎ క్రికెట్లో పరుగులు వరద పారించాడు. ప్రియాంక్ తన 17 ఏళ్ల కెరీర్లో127 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి 8856 పరుగులు చేశాడు. ఇందులో 29 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ముఖ్యంగా 2016-17 రంజీ సీజన్లో ఈ గుజరాతీ బ్యాటర్ భీబత్సం సృష్టించాడు. ఆ సీజన్లో ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. ఓవరాల్‌గా ఆ ఎడిషన్‌లో 1310 పరుగులు చేశాడు. అదేవిధంగా97 లిస్ట్ ఏ మ్యాచుల్లో 8 సెంచరీలతో కలిపి 3,672 పరుగులు చేశాడు. 59 టీ20లు ఆడిన ప్రియాంక్ 28.71 సగటుతో 1,522 పరుగులు సాధించాడు.కాగా ప్రియాంక్ 2021లో టీమిండియాకు రిజర్వ్ ఓపెనర్‌గా ఎంపికయ్యాడు. కానీ భారత తరుపన అరంగేట్రం చేసే అవకాశం మాత్రం లభించలేదు. 2022 శ్రీలంక టూర్‌కు కూడా సెలక్ట్ అయ్యాడు. అక్కడ కూడా అతడికి డెబ్యూ చేసే ఛాన్స్ రాలేదు. -
IPL 2025: ముంబైపై పంజాబ్ గెలుపు
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 26) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ గెలుపుతో పంజాబ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకి, టాప్-2లో స్థానాన్ని ఖరారు చేసుకోగా.. ముంబై నాలుగో స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేయగా.. పంజాబ్ 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ప్రియాంశ్ ఆర్య 62, జోష్ ఇంగ్లిస్ 73, శ్రేయస్ అయ్యర్ 26 (నాటౌట్) పరుగులు చేసి పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చారు.రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్14.1వ ఓవర్- 143 పరుగుల వద్ద పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. సాంట్నర్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి ప్రియాంశ్ ఆర్య (62) ఔటయ్యాడు. టార్గెట్ 185.. 13 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 131/1ప్రియాంశ్ ఆర్య 57, జోష్ ఇంగ్లిస్ 54టార్గెట్ 185.. 10 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 89/1ప్రియాంశ్ ఆర్య 37, జోష్ ఇంగ్లిస్ 358 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 75/1ఇంగ్లిస్ 25, ప్రియాంశ్ ఆర్య 34టార్గెట్ 185.. తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్4.2వ ఓవర్- 185 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ 34 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో అశ్వనీ కుమార్‌కు క్యాచ్ ఇచ్చి ప్రభ్‌సిమ్రన్ సింగ్ (13) ఔటయ్యాడు. సత్తా చాటిన సూర్యకుమార్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే..?టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన సూర్యకుమార్ మెరుపు అర్ద సెంచరీతో (57) సత్తా చాటాడు.ముంబై ఇన్నింగ్స్‌లో రికెల్టన్ 27, రోహిత్ శర్మ 24, తిలక్ వర్మ 1, విల్ జాక్స్ 17, హార్దిక్ పాండ్యా 26, నమన్ ధిర్ 20 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో జన్సెన్, విజయ్‌కుమార్ వైశాఖ్, అర్షదీప్ సింగ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. హర్‌ప్రీత్ బ్రార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.ఆఖరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన అర్షదీప్ కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు (నమన్ ధిర్, సూర్యకుమార్ యాదవ్) తీశాడు. 18 ఓవర్ల తర్వాత ముంబై ఇండియన్స్ స్కోర్ 158/5సూర్యకుమార్ యాదవ్ 45, నమన్ ధిర్ 7 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై12.3వ ఓవర్- 106 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. విజయ్ కుమార్ బౌలింగ్‌లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి విల్ జాక్స్ (17) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన ముంబై 10.5వ ఓవర్- 87 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. విజయ్ కుమార్ బౌలింగ్‌లో అర్షదీప్‌కు క్యాచ్ ఇచ్చి తిలక్ వర్మ (1) ఔటయ్యాడు.రెండో వికెట్ కోల్పోయిన ముంబై9.3వ ఓవర్- 81 పరుగుల వద్ద ముంబై రెండో వికెట్ కోల్పోయింది. హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో నేహల్ వధేరాకు క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ (24) ఔటయ్యాడు.9 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 79/19 ఓవర్ల తర్వాత ముంబై ఇండియన్స్ స్కోర్ 79/1గా ఉంది. రోహిత్ శర్మ 23, సూర్యకుమార్ యాదవ్ 26 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన ముంబై5.1వ ఓవర్- 45 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది.జన్సెన్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి రికెల్టన్ (27) ఔటయ్యాడు. 5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 50/0టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ ధాటిగా ఆడుతుంది. 5 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 45/0గా ఉంది. రికెల్టన్ 27, రోహిత్ శర్మ 16 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ఐపీఎల్ 2025లో భాగంగా జైపూర్ వేదికగా ఇవాళ (మే 26) జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్లు..పంజాబ్ కింగ్స్: ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్, శ్రేయాస్ అయ్యర్, నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, కైల్ జేమీసన్, విజయ్‌కుమార్ వైశాక్ఇంపాక్ట్ సబ్స్: ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షేడ్గే, జేవియర్ బార్ట్లెట్, ముషీర్ ఖాన్ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికిల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రాఇంపాక్ట్ సబ్స్: కర్ణ్ శర్మ, కార్బిన్ బాష్, రాజ్ బవా, అశ్వనీ కుమార్, సత్యనారాయణ రాజు -
IPL 2025: పంజాబ్ కింగ్స్‌కు శుభవార్త
ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్‌కు ముందు పంజాబ్ కింగ్స్‌కు శుభవార్త అందింది. చేతి వేలి గాయం కారణంగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌కు దూరంగా ఉన్న స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ప్లే ఆఫ్స్ సమయానికి అందుబాటులోకి రానున్నాడు. ఈ విషయాన్ని పంజాబ్ కింగ్స్ యాజమాన్యం అధికారికంగా ధృవీకరించనప్పటికీ.. ఓ ప్రముఖ వార్తా సంస్థ తమ కథనంలో రాసుకొచ్చింది. చహల్‌ను నేడు ముంబైతో జరుగబోయే మ్యాచ్‌లో బరిలోకి దించకూడదని భావిస్తున్నట్లు తెలుస్తుంది. పంజాబ్ ఇదివరకే ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయిన నేపథ్యంలో చహల్ విషయంలో రిస్క్ తీసుకోకూడదని ఆ జట్టు యాజమాన్యం భావిస్తుంది.కాగా, చహల్ లేని లోటు పంజాబ్‌కు గత మ్యాచ్‌లో (ఢిల్లీతో) బాగా తెలిసొచ్చింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి 206 పరుగుల భారీ స్కోర్ చేసినా పంజాబ్ దాన్ని కాపాడుకోలేకపోయింది. ఆ మ్యాచ్‌లో చహల్ ఆడి ఉంటే పంజాబ్ మరో విజయం నమోదు చేసేది. అలా జరిగి ఉంటే నేటి మ్యాచ్‌తో (ముంబై) సంబంధం లేకుండా ఆ జట్టు టేబుల్ టాపర్‌గా నిలిచేది.పంజాబ్ ఇవాళ (మే 26) జైపూర్ వేదికగా జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే పంజాబ్ టేబుల్ టాపర్‌గా నిలుస్తుంది. ముంబై గెలిచినా అగ్రస్థానానికి చేరుకుంటుంది. లీగ్ దశ మ్యాచ్‌లు పూర్తయ్యే సరికి తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లకు అదనపు ప్రయోజనం (క్వాలిఫయర్-1లో ఓడినా ఫైనల్‌కు చేరేందుకు క్వాలిఫయర్-2లో పోటీ పడే అవకాశం ఉంటుంది) చేకూరుతుందన్న విషయం తెలిసిందే.పాయింట్ల పట్టికలో టాప్-4లో ఉన్న జట్లు (ప్రస్తుతం)..గుజరాత్- 18 (0.254)పంజాబ్- 17 (0.327)ఆర్సీబీ- 17 (0.255)ముంబై- 16 (1.292)నేటి మ్యాచ్‌లో తుది జట్లు (అంచనా)..పంజాబ్: ప్రభ్‌సిమ్రన్ సింగ్ (wk), ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్, శ్రేయాస్ అయ్యర్, నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్/ప్రవీణ్ దూబేముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికిల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా -
#RCB: చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. తొలి ఐపీఎల్ జట్టుగా
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్‌ను సొంతం చేసుకోపోయినప్పటికి.. ఆర్సీబీని అభిమానించే వాళ్లు కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఈ క్రమంలో బెంగళూరు ఓ డిజిటల్ మైలురాయిని అందుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 2 కోట్ల మంది ఫాలోవర్లను దాటిన తొలి ఐపీఎల్ ఫ్రాంచైజీగా బెంగళూరు అవతరించింది.ఈ ఏడాది ఏప్రిల్ ఆరంభంలో ఆర్సీబీ ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య 18 మిలియన్లగా ఉండేది. ఇప్పుడు కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఆ సంఖ్య 20 మిలియన్లకు చేరింది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ (18.6 మిలియన్లు), ముంబై ఇండియన్స్ (18 మిలియన్లు)లను బెంగళూరు ఫ్రాంచైజీ దాటిసేంది.ఇక ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. టాప్-2 స్ధానం కోసం ప్రయత్నిస్తోంది. ఆర్సీబీకి ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. మే 27న ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో బెంగళూరు తలపడనుంది.ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధిస్తే పాయింట్ల పట్టకలో టాప్-2 స్ధానానికి చేరుకుంటుంది. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన రాయల్ ఛాలెంజర్స్.. ఎనిమిదింట విజయాలో పాయింట్ల పట్టికలో మూడో స్ధానంలో కొనసాగుతోంది.ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ఫాలో అవుతున్న ఐపీఎల్ జట్లు ఇవే:రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) - 20 మిలియన్లుచెన్నై సూపర్ కింగ్స్ (CSK)- 18.6 మిలియన్లుముంబై ఇండియన్స్ (MI)- 18 మిలియన్లుకోల్కతా నైట్ రైడర్స్ (KKR)- 7.5 మిలియన్లుసన్రైజర్స్ హైదరాబాద్ (SRH)- 5.4 మిలియన్లు -
IPL 2025: తొలి సీజన్లోనే భారీ రికార్డు సొంతం చేసుకున్న ఆయుశ్ మాత్రే
సీఎస్కే యువ కెరటం ఆయుశ్ మాత్రే ఐపీఎల్ అరంగేట్రం సీజన్లోనే భారీ రికార్డు సొంతం చేసుకున్నాడు. సీఎస్కే తరఫున ఓ సీజన్లో అత్యధిక స్ట్రయిక్‌రేట్‌తో (కనీసం 200 పరుగులు) పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ సీజన్లో 7 మ్యాచ్‌లు ఆడిన మాత్రే 188.97 స్ట్రయిక్‌రేట్‌తో ఓ భారీ అర్ద సెంచరీ సాయంతో (94) 240 పరుగులు చేశాడు.ఇదే సీజన్లో మరో చిచ్చరపిడుగు డెవాల్డ్ బ్రెవిస్ కూడా 180 స్ట్రయిక్‌రేట్‌తో 225 పరుగులు చేశాడు. మాత్రే తర్వాత ఓ సీజన్లో అత్యధిక స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించిన సీఎస్కే ఆటగాడిగా బ్రెవిస్ నిలిచాడు. ఈ రికార్డు విభాగంలో మాత్రే, బ్రెవిస్ తర్వాత అజింక్య రహానే (2023 సీజన్లో 172.48 స్ట్రయిక్‌రేట్‌తో 326 పరుగులు), రవీంద్ర జడేజా (2020 సీజన్లో 1671.85 స్ట్రయిక్‌రేట్‌తో 232 పరుగులు), ఎంఎస్ ధోని (2013 సీజన్లో 162.89 స్ట్రయిక్‌రేట్‌తో 461 పరుగులు) ఉన్నారు. కాగా, గుజరాత్ టైటాన్స్‌తో నిన్న (మే 25) జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 83 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సీజన్‌ను గెలుపుతో ముగించింది. అయినా సీజన్లో ఆఖరి స్థానంతోనే సరిపెట్టుకుంది. నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే భారీ స్కోర్ (230/5) చేసింది. ఆయుశ్ మాత్రే (34), డెవాన్ కాన్వే (52), ఉర్విల్ పటేల్ (37), డెవాల్డ్ బ్రెవిస్ (57) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్.. సీఎస్కే బౌలర్లు చెలరేగడంతో 18.3 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది. గుజరాత్ ఇలా తక్కువ స్కోర్‌కే చేతులెత్తేయడం ఈ సీజన్లో ఇదే మొదటిసారి. అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్ తలో మూడు వికెట్లు తీసి గుజరాత్ పతనాన్ని శాశించారు. రవీంద్ర జడేజా 2, ఖలీల్ అహ్మద్, పతిరణ తలో వికెట్ తీశారు. గుజరాత్ ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్ (41) టాప్ స్కోరర్‌గా నిలువగా.. అర్షద్ ఖాన్ (20), శుభ్‌మన్ గిల్ (13), షారుఖ్ ఖాన్ (19), తెవాటియా (140, రషీద్ ఖాన్ (12) రెండంకెల స్కోర్లు చేశారు. -
టీమిండియా కొత్త కెప్టెన్‌కు గవాస్కర్ వార్నింగ్!?
భారత క్రికెట్ జట్టు టెస్టు కెప్టెన్‌గా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఇటీవలే టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ స్దానాన్ని గిల్ భర్తీ చేయనున్నాడు. వచ్చే నెలలో ఇంగ్లండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్ నుంచి భారత టెస్టు కెప్టెన్‌గా గిల్ ప్రయాణం ప్రారంభం కానుంది.గిల్‌కు తన మొదటి పరీక్షలోనే కఠిన సవాలు ఎదురుకానుంది. ఎందుకంటే వారి సొంతగడ్డపై ఇంగ్లీష్ జట్టును ఓడించడం అంతసులువు కాదు. అంతకుతోడు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లు ఇప్పుడు జట్టులో లేరు. ప్రస్తుతం భారత జట్టులో ముగ్గురు నలుగురికి మినహా ఇంగ్లండ్‌లో ఆడిన అనుభవం పెద్దగా లేదు. గిల్‌కు కూడా ఇంగ్లీష్ కండీషన్స్‌లో ఆడిన అనుభవం లేదు. దీంతో గిల్ కెప్టెన్‌గా తన మొదటి ఎసైన్మెంట్లో ఎలా రాణిస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గిల్‌ను ఉద్దేశించి భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గిల్‌పై ఇప్పుడు అదనపు ఒత్తిడి ఉంటుందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు."భారత కెప్టెన్‌గా ఎంపికైన ఆటగాడిపై ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే జట్టు సభ్యుడిగా ఉండటానికి, కెప్టెన్‌గా వ్యవహరించడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే టీమ్ మెంబర్‌గా ఉన్నప్పుడు సాధారణంగా మీకు క్లోజ్‌గా ఉన్న ఆటగాళ్లతో ఎక్కువగా సంభాషిస్తారు. కానీ కెప్టెన్ అయినప్పుడు, జట్టులోని ఇతర ఆటగాళ్ళు మిమ్మల్ని గౌరవించే విధంగా మీరు ప్రవర్తించాలి. కెప్టెన్ ప్రవర్తన అతని ప్రదర్శన కంటే ముఖ్యమైనది" అంటూ స్పోర్ట్స్ టాక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది.ఇంగ్లండ్‌తో టెస్టులకు భారత జట్టుశుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, సిరాజ్చదవండి: IPL 2025: 'పంత్‌ను చూసి నేర్చుకోండి'.. రహానేపై సెహ్వాగ్ ఫైర్ -
గంగూలీ సోదరుడికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సోదరుడు, క్యాబ్ (బెంగాల్ క్రికెట్ అసోసియేషన్) అధ్యక్షుడు స్నేహశిష్ గంగూలీకి తృటిలో ప్రాణాపాయం తప్పింది. పూరీ బీచ్‌లో (ఒడిశా) అతను ప్రయాణిస్తున్న స్పీడ్ బోట్ బోల్తా పడింది. ప్రమాద సమయంలో స్నేహశిష్తో పాటు అతని భార్య అర్పిత గంగూలీ కూడా ఉన్నారు. స్నేహశిష్ దంపతులు సముద్ర నీటిలో మునిగిపోతుండగా కొందరు లోకల్ బోట్ డ్రైవర్లు, మత్స్యకారులు వారిని రక్షించారు. ప్రాణాపాయం నుండి బయటపడిన స్నేహశిష్ దంపతులు ప్రస్తుతం కోల్‌కతాకు చేరుకున్నారు. మాకిది పునర్జన్మ అని గంగూలీ భార్య అర్పిత అన్నారు. అదో భయానక ఘటన అని అమె గుర్తు చేసుకున్నారు. పూరి జగన్నాథుని కృప వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడ్డామని తెలిపారు. -
MI VS PBKS: రోహిత్ శర్మను ఊరిస్తున్న రెండు భారీ రికార్డులు
ఐపీఎల్ 2025లో భాగంగా జైపూర్ వేదికగా ఇవాళ (మే 26) జరుగనున్న కీలక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచేందుకు ఈ మ్యాచ్ ఫలితం ఇరు జట్లకు చాలా కీలకమవుతుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ గెలిస్తే 19 పాయింట్లతో టాప్ ప్లేస్‌కు చేరుతుంది. ముంబై గెలిచినా (గుజరాత్ కంటే మెరుగైన రన్‌రేట్ ఉండటం చేత) 18 పాయింట్లతో అగ్రస్థానంలో నిలుస్తుంది. లీగ్ దశ మ్యాచ్‌లు పూర్తయ్యే సరికి తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లకు అదనపు ప్రయోజనం (క్వాలిఫయర్-1లో ఓడినా ఫైనల్‌కు చేరేందుకు క్వాలిఫయర్-2లో పోటీ పడే అవకాశం ఉంటుంది) చేకూరుతుందన్న విషయం తెలిసిందే.పాయింట్ల పట్టికలో టాప్-4లో ఉన్న జట్లు (ప్రస్తుతం)..గుజరాత్- 18 (0.254)పంజాబ్- 17 (0.327)ఆర్సీబీ- 17 (0.255)ముంబై- 16 (1.292)మూడు సిక్సర్ల దూరంలో..!ఇదిలా ఉంటే, నేటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ రెండు భారీ రికార్డులపై కన్నేశాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ మూడు సిక్సర్లు బాదితే ఐపీఎల్లో 300 సిక్సర్ల అరుదైన మైలురాయిని తాకుతాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో క్రిస్ గేల్ ఒక్కడే ఇప్పటివరకు 300 సిక్సర్ల మైలురాయిని తాకాడు. రోహిత్ తర్వాత 300 సిక్సర్ల మార్కు తాకేందుకు విరాట్ కోహ్లికి అవకాశముంది. విరాట్ ఐపీఎల్లో ఇప్పటివరకు 291 సిక్సర్లు బాదాడు.మరో 67 పరుగులు చేస్తే..!నేటి మ్యాచ్‌లో రోహిత్ మరో 67 పరుగులు చేస్తే ఐపీఎల్లో అత్యంత అరుదైన 7000 పరుగుల మార్కును తాకుతాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో విరాట్ కోహ్లి మాత్రమే ఈ అరుదైన ఘనత సాధించాడు. విరాట్ ఖాతాలో 8552 పరుగులు ఉండగా.. రోహిత్ ఖాతాలో 6933 పరుగులు ఉన్నాయి. విరాట్, రోహిత్ తర్వాత ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లుగా శిఖర్ ధవన్ (6769), డేవిడ్ వార్నర్ (6565), సురేశ్ రైనా (5528) ఉన్నారు.వార్నర్, విరాట్ తర్వాత..!నేటి మ్యాచ్‌లో రోహిత్ 47 పరుగులు చేస్తే పంజాబ్ కింగ్స్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి చేరతాడు. పంజాబ్‌పై అత్యధిక పరుగులు చేసిన టాప్-2 బ్యాటర్లుగా డేవిడ్ వార్నర్ (1134), విరాట్ కోహ్లి (1104) చలామణి అవుతున్నారు.నేటి మ్యాచ్‌లో తుది జట్లు (అంచనా)..పంజాబ్: ప్రభ్‌సిమ్రన్ సింగ్ (wk), ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్, శ్రేయాస్ అయ్యర్, నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్/ప్రవీణ్ దూబేముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికిల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా -
ఇంగ్లండ్ టూర్.. కామాఖ్య ఆలయంలో గంభీర్ ప్రత్యేక పూజలు! వీడియో
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అస్సాంలోని గౌహతిలో ఉన్న కామాఖ్య ఆలయాన్ని సందర్శించాడు. సోమవారం ఆలయానికి చేరుకున్న గంభీర్‌కు ఆర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.గంభీర్ కొన్ని ప్రత్యేక పూజలు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా కామాఖ్య ఆలయం దేశంలోని అత్యంత ప్రముఖ శక్తి పీఠాలలో ఒకటి. ఈ ఆలయాన్ని ప్రతీ రోజు వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు.గంభీర్ ఇటీవల తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్నాడు. ఇక భారత్- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్‌కు సమయం అసన్నమవుతోంది. జూన్ 20 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సిరీస్‌కు భారత జట్టును బీసీసీ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. అదేవిధంగా సాయిసుదర్శన్, అర్ష్‌దీప్ సింగ్ వంటి యువ ఆటగాళ్లకు తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కింది. అదేవిధంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి సీనియర్లు టెస్టులకు వీడ్కోలు పలకడంతో యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఇంగ్లండ్‌తో తలపడనుంది. కాగా ఈ సిరీస్ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27లో భాగంగా జరగనుంది. ఈ సిరీస్ భారత జట్టుకు చాలా కీలకం.ఇంగ్లండ్‌తో టెస్టులకు భారత జట్టుశుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, సిరాజ్ 📍 Assam — Gautam Gambhir offered prayers at Maa Kamakhya Mandir.Jai Mata Di 🚩 pic.twitter.com/975Wfj67ko— Megh Updates 🚨™ (@MeghUpdates) May 26, 2025 -
గుడ్ న్యూస్.. జియో హాట్‌స్టార్‌లో భారత్-ఇంగ్లండ్ మ్యాచ్‌లు!
భారత క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఈ ఏడాది జూన్‌లో జరగనున్న ఇండియా- ఇంగ్లండ్ టెస్టు సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జియోహాట్‌స్టార్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు ఈ ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను జియోహాట్‌స్టార్ యాప్ అండ్ వెబ్ సైట్లో వీక్షించవచ్చు.కాగా వాస్తవానికి 2031 వరకు ఇంగ్లండ్‌లో జరిగే మ్యాచ్‌లను ప్రసారం చేసే అన్ని హక్కులను సోనీ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ కలిగి ఉంది. అయితే క్రిక్‌బజ్ రిపోర్ట్ ప్రకారం.. ఈ మార్క్యూ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్‌స్టార్‌కు సోనీ సబ్-లైసెన్స్ చేసినట్లు సమాచారం.ఈ ఒప్పందం రెండు కంపెనీల మధ్య దాదాపు నెల రోజుల చర్చల తర్వాత జరిగనట్లు సదరు క్రికెట్ వెబ్సైట్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. కాగా జియోహాట్‌స్టార్ ఇప్పటికే భారత్ హోమ్ సిరీస్‌లు, ఐసీసీ టోర్నమెంట్లు, ఐపీఎల్, ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రసార హక్కులను కలిగి ఉంది. ఇప్పుడు కొత్తగా ఇంగ్లండ్-భారత్ మధ్య టెస్టు సిరీస్ డిజిటల్ హక్కులను కూడా దక్కించుకుంది. ఇక ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27లో ఇదే తొలి సిరీస్. ఇంగ్లండ్ పర్యటన కోసం భారత జట్టు బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది.కొత్త కెప్టెన్ శుబ్‌మన్ గిల్ నేతృత్వంలో టీమిండియా ఇంగ్లండ్‌కు పయనం కానుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి సీనియర్లు టెస్టులకు వీడ్కోలు పలకడంతో యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఇంగ్లండ్‌తో తలపడనుంది.చదవండి: IPL 2025: 'పంత్‌ను చూసి నేర్చుకోండి'.. రహానేపై సెహ్వాగ్ ఫైర్ -
IPL 2025: ‘క్వాలిఫయర్-1, ఫైనల్ ఆడే జట్లు ఇవే!’
ఐపీఎల్-2025 (IPL 2025) ముగింపు దశకు వచ్చేసింది. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించగా.. క్వాలిఫయర్-1 కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. లీగ్ దశ ముగిసే సరికి టాప్-2లో ఉన్న జట్లు ఈ పోరుకు అర్హత సాధిస్తాయన్న విషయం తెలిసిందే.ఆ రెండు మ్యాచ్‌ల ఫలితాలతో..సీజన్లో పద్నాలుగు మ్యాచ్‌లూ పూర్తి చేసుకున్న గుజరాత్.. తొమ్మిది గెలిచి 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. మిగిలిన మూడు జట్లకు లీగ్ దశలో ఒక్కో మ్యాచ్ మిగిలి ఉండగా.. ఓవరాల్‌గా సీజన్లో రెండు మిగిలి ఉన్నాయి. ఇందులో భాగంగా సోమవారం పంజాబ్ కింగ్స్- ముంబై ఇండియన్స్ తలపడనుండగా.. మంగళవారం నాటి పోరులో ఆర్సీబీ లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడుతుంది.ఈ మ్యాచ్ తర్వాత టాప్-2లో నిలిచి క్వాలిఫయర్-1 ఆడే జట్లు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి ఎలిమినేటర్ మ్యాచ్ ఆడే జట్లు ఏవో తేలుతాయి. ఇక క్వాలిఫయర్-1లో ఓడిపోయిన జట్టు.. ఎలిమినేటర్ విజేతతో క్వాలిఫయర్-2లో తలపడుతుందన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు, క్వాలిఫయర్-1 విజేత టైటిల్ పోరుకు అర్హత సాధిస్తాయి.ఫైనల్ ఆడే జట్లు ఇవేఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా క్వాలిఫయర్-1, ఫైనల్లో తలపడే జట్లపై తన అంచనా తెలియజేశాడు. పంజాబ్ కింగ్స్‌పై ముంబై, లక్నోపై ఆర్సీబీ గెలిచి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాలు ఆక్రమిస్తాయని జోస్యం చెప్పాడు.అదే విధంగా.. ఈ రెండు జట్లే ట్రోఫీ కోసం ఫైనల్లో తలపడతాయని అంచనా వేశాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ.. ‘‘ముంబై పంజాబ్‌పై గెలవాలని పట్టుదలగా ఉంది. వాళ్లు గనుక గెలిస్తే టాప్-2లోకి వస్తారు. ఇది జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.ఇక ఆర్సీబీ కూడా అంతే. లక్నోపై ఆ జట్టు గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంది. నా అంచనా ప్రకారం ముంబై- ఆర్సీబీ టాప్-2లో నిలుస్తాయి. అదే విధంగా ఈ రెండు జట్లే ఫైనల్లోనూ తలపడతాయి’’ అని మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.మిగిలిన షెడ్యూల్ ఇలా👉క్వాలిఫయర్-1: మే 29, గురువారం, చండీగఢ్👉ఎలిమినేటర్ మ్యాచ్: మే 30, శుక్రవారం, చండీగఢ్👉క్వాలిఫయర్-2: జూన్ 1, ఆదివారం, అహ్మదాబాద్👉ఫైనల్: జూన్ 3, మంగళవారం, అహ్మదాబాద్.చదవండి: Pat Cummins: ఫైనల్ చేరాల్సిన జట్టు.. మా వాళ్లను చూస్తే నాకే భయమేసింది -
'పంత్‌ను చూసి నేర్చుకోండి'.. రహానేపై సెహ్వాగ్ ఫైర్
ఐపీఎల్-2025 సీజన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ ఘోర ఓటమితో ముగించింది. ఆదివారం ఢిల్లీ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 110 పరుగుల తేడాతో కేకేఆర్ పరాజయం చవిచూసింది. ఈ ఏడాది సీజన్ అసాంతం దారుణ ప్రదర్శన కనబరిచిన డిఫెండింగ్ ఛాంపియన్.. వరుస ఓటములతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది.శ్రేయస్ అయ్యర్ స్ధానంలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన వెటరన్ ఆటగాడు అజింక్య రహానే జట్టును విజయం పథంలో నడిపించడంలో విఫలమయ్యాడు. వ్యక్తిగత ప్రదర్శన పరంగా పర్వాలేదన్పించినప్పటికి, కెప్టెన్‌గా మాత్రం రహానే పూర్తిగా తేలిపోయాడు.ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ ఐదింట మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఏడో స్ధానంలో నిలిచింది. ఈ క్రమంలో కేకేఆర్ మెనెజ్మెంట్పై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. రహానే టాప్-3లో బ్యాటింగ్‌కు రావడాన్ని సెహ్వాగ్ తప్పుబట్టాడు."కెప్టెన్ టాప్ త్రీలోనే బ్యాటింగ్ చేయాలని ఎక్కడా రాసిలేదు. పంత్‌ను చూసి నేర్చుకోండి. అతడు తన ఫామ్‌లో లేని అని తెలిసి మిగితా ఆటగాళ్లను తనకంటే ముందు బ్యాటింగ్‌కు పంపుతున్నాడు. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లు టాపర్డర్‌లో బ్యాటింగ్‌కు రావడంతో లక్నో భారీ స్కోర్ సాధించగలుగుతుంది.కేకేఆర్ అలాగే చేసి ఉంటే బాగుండేది. అది టీమ్ మెనెజ్‌మెంట్, కోచింగ్ స్టాప్ బాధ్యత. నిన్న గుజరాత్‌తో మ్యాచ్‌లో కూడా సీఎస్కే అదే పనిచేసింది. ఫామ్‌లో ఉన్న డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబేలను ముందు బ్యాటింగ్‌కు పంపారు" అని క్రిక్‌బజ్ లైవ్ షో సెహ్వాగ్ పేర్కొన్నాడు.చదవండి: చెప్పింది వినరా?.. సహనం కోల్పోయిన ధోని.. పతిరణ, దూబేపై ఫైర్! -
చెప్పింది వినరా?.. సహనం కోల్పోయిన ధోని.. పతిరణ, దూబేపై ఫైర్!
‘మిస్టర్ కూల్’ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni)కి కోపమొచ్చింది. తన ప్రియ శిష్యుడు మతీశ పతిరణ (Matheesha Pathirana) తీరు ‘తలా’కు విసుగుతెప్పించింది. దీంతో ధోని సీరియస్ లుక్ ఇవ్వగానే.. పతిరణ అలెర్ట్ అయిపోయాడు. కెప్టెన్ వ్యూహానికి అనుగుణంగా వ్యవహరించి.. అనుకున్న ఫలితాన్ని రాబట్టడంలో సఫలమయ్యాడు. తద్వారా ‘తలా’ను ప్రసన్నం చేసుకోగలిగాడు. 230 పరుగులుఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆదివారం తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడేసింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో పోరులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ధోని సేన.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది.ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్‌కు సాయి సుదర్శన్ (28 బంతుల్లో 41) మరోసారి శుభారంభం అందించినా.. మరో ఓపెనర్, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (13) విఫలమయ్యాడు. జోస్ బట్లర్ (5), షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (0) కూడా నిరాశపరిచారు. ఇలాంటి తరుణంలో సాయి సుదర్శన్‌తో కలిసి షారుఖ్ ఖాన్ నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు.గుజరాత్ ఇన్నింగ్స్‌లో శివం దూబే పదో ఓవర్ వేయగా.. తొలి రెండు బంతుల్లో రెండు ఫోర్లు రాబట్టిన సాయి సుదర్శన్.. మూడో బంతికి సింగిల్ తీశాడు. ఇక నాలుగో బంతికి షారుఖ్ సిక్సర్ బాదాడు. ఆ తర్వాత షారుఖ్ సింగిల్ తీయగా.. ఆఖరి బంతికి సుదర్శన్ రెండు పరుగులు తీశాడు. దీంతో దూబే ఓవర్లో మొత్తంగా 18 పరుగులు సమర్పించుకున్నాడు.చెప్పింది వినరా?.. సహనం కోల్పోయిన ధోని.. పతిరణ, దూబేపై ఫైర్!అయితే, ఈ ఓవర్లో ధోని ఫీల్డింగ్ సెట్ చేస్తున్న వేళ పతిరణ కాస్త నిర్లక్ష్యంగా కనిపించాడు. దీంతో తన ఆదేశాలను పట్టించుకోకుండా ఉన్న బౌలర్, ఫీల్డర్‌పై ధోని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా సీరియస్ లుక్ ఇచ్చాడు. ఇక మరుసటి ఓవర్లో రవీంద్ర జడేజా బంతితో రంగంలోకి దిగగా.. తొలి బంతికే షారుఖ్‌ను అవుట్ చేశాడు.ఫుల్ వైట్ అవుట్‌సైడ్ ఆఫ్ దిశగా చేసిన బంతిని షాట్ ఆడేందుకు ప్రయత్నించిన షారుఖ్ ఖాన్ బంతిని గాల్లోకి లేపగా షార్ట్ థర్డ్‌మ్యాన్ దిశగా పయనించింది. ఈ క్రమంలో.. పతిరణ క్యాచ్ అందుకునే క్రమంలో తడబడ్డా.. ఎట్టకేలకు విజయవంతంగా పనిపూర్తి చేశాడు. దీంతో 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షారుఖ్ ఖాన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.ఆ తర్వాత వచ్చిన వాళ్లలో రాహుల్ తెవాటియా 14, అర్షద్ ఖాన్ 20 పరుగులు చేశారు. ఈ క్రమంలో 18.3 ఓవర్లలో 147 పరుగులకే గుజరాత్ ఆలౌట్ అయింది. సీఎస్కే 83 పరుగుల తేడాతో గెలిచి.. సీజన్లో నాలుగో విజయం సాధించి గెలుపుతో ముగించింది. ఈ మ్యాచ్‌లో ధోని సహనం కోల్పోయిన తీరును కామెంటేటర్లు విశ్లేషించిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ షేర్ చేసింది.కాగా ఈ మ్యాచ్‌లో ధోని బ్యాటింగ్‌కు రాలేదు. ఓవరాల్‌గా ఈ సీజన్లో పదమూడు ఇన్నింగ్స్ ఆడిన ధోని 196 పరుగులు చేశాడు. ఇక సీఎస్కే పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ కేవలం నాలుగు మాత్రమే గెలిచింది. మరోవైపు.. గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరిన విషయం తెలిసిందే. చదవండి: Pat Cummins: ఫైనల్ చేరాల్సిన జట్టు.. మా వాళ్లను చూస్తే నాకే భయమేసిందిWhen #CaptainCool lost his cool! 🥵A tactical masterclass & an uncanny #MSDhoni's moment - #CSK's last match this season had it all! 💛Watch the LIVE action ➡ https://t.co/XfCrZHriFf #IPLonJioStar 👉 #SRHvKKR | LIVE NOW on Star Sports Network & JioHotstar! pic.twitter.com/wxPM71McJI— Star Sports (@StarSportsIndia) May 25, 2025 -
ఐర్లాండ్‌ను చిత్తు చేసిన విండీస్.. సిరీస్ సమం
డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో 197 పరుగుల తేడాతో(డక్ వర్త్ లూయిస్ పద్దతి) వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 385 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.విండీస్ ఇన్నింగ్స్‌లో ఫస్ట్ డౌన్ బ్యాటర్ కీస్ కార్టీ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 142 బంతులు ఎదుర్కొన్న కార్టీ.. 15 ఫోర్లు, 8 సిక్స్‌లతో 170 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో కార్టీకి ఇది వరుసగా రెండో సెంచరీ కావడం గమనార్హం. విండీస్ బ్యాటర్లలో కార్టీతో పాటు కెప్టెన్ షాయ్ హోప్(75), జస్టిన్ గ్రీవ్స్(50) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఐరీష్ బౌలర్లలో బారీ మెక్‌కార్తీ మూడు వికెట్లు పడగొట్టగా.. లైమ్ మెక్‌కార్తీ రెండు, మెక్‌బ్రైన్, డకెరల్ తలా వికెట్ సాధించారు.అనంతరం వర్షం కారణంగా 46 ఓవర్లలో ఐర్లాండ్ టార్గెట్‌ను 363గా నిర్ణయించారు. భారీ లక్ష్య చేధనలో ఐర్లాండ్ 29.5 ఓవర్లలో 165 పరుగులకే కుప్పకూలింది. ఐర్లాండ్ బ్యాటర్లలో కేడ్ కార్మైకేల్(48) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.విండీస్ బౌలర్లలో జైడన్ సీల్స్ మూడు వికెట్లు పడగొట్టి ఐర్లాండ్‌ను దెబ్బతీయగా.. జోషఫ్, గ్రీవ్స్, ఛేజ్ తలా వికెట్ సాధించారు. కాగా తొలి వన్డేలో ఐర్లాండ్ విజయం సాధించగా.. రెండో వన్డే వర్షం కారణంగా రద్దు అయింది. ఇప్పుడో మూడో వన్డేలో విండీస్ గెలవడంతో సిరీస్ సమమైంది. ఇక ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: #CSK: 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో తొలిసారి -
#CSK: 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో తొలిసారి
ఐపీఎల్-2025 సీజన్లో ఐదు సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ దారుణ ప్రదర్శన కనబరిచింది. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన సీఎస్కే.. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాలలో విఫలమై అభిమానులను తీవ్ర నిరాశపరిచింది.తమ చెత్త ఆట తీరుతో మిగితా జట్ల కంటే ముందే ప్లే ఆఫ్స్ రేసు నిష్క్రమించింది. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన సీఎస్కే.. కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానానికి పరిమితమైంది.18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో పదివ స్దానంలో నిలవడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు ఏ సీజన్లో కూడా సీఎస్కే ఆఖరి స్దానానికి పరిమితం కాలేదు. ఐదు సార్లు ఛాంపియన్, 9 సార్లు ఫైనల్‌కు చేరిన చెన్నైకు నిజంగా ఇది ఘోర పరాభావమే అని చెప్పాలి. కాగా ఈ ఏడాది సీజన్ తమ ఆఖరి మ్యాచ్‌లో మాత్రం సీఎస్కే అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 83 పరుగుల తేడాతో చెన్నై ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టి గుజరాత్‌కు ఊహించని షాక్ ఇచ్చింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సీఎస్కే బ్యాటర్లలో డెవాల్డ్ బ్రెవిస్(23 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 57), డెవాన్ కాన్వే(35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఆయూష్ మాత్రే(17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34), ఉర్విల్ పటేల్(19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం లక్ష్య చేధనలో గుజరాత్.. 18.3 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది. గుజరాత్ బ్యాటర్లలో ఓపెనర్ సాయిసుదర్శన్(41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. . సీఎస్కే బౌలర్లలో అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్ తలా మూడు వికెట్లు పడగొట్టి గుజరాత్‌ను దెబ్బతీయగా.. రవీంద్ర జడేజా రెండు, పతిరానా, ఖాలీల్ అహ్మద్ చెరో వికెట్ పడగొట్టారు.చదవండి: ఇంకా ఫిట్‌గా ఉన్నాడా?.. అవును.. అయితే, ఎందుకు ఆడట్లేదు? -
ఫిట్‌గా ఉన్నాడా?.. అవును.. అయితే, ఎందుకు తప్పించుకుంటున్నాడు?
మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni).. ఐపీఎల్ ఆరంభ సీజన్ (2008) నుంచి ఆడుతున్న తలా.. ఇప్పటికీ క్యాష్ రిచ్ లీగ్‌లో కొనసాగుతున్నాడు. కెప్టెన్‌గా చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు ఐదుసార్లు టైటిల్ అందించిన ఈ దిగ్గజ సారథి.. 43 ఏళ్ల వయసులో మరోసారి పగ్గాలు చేపట్టాడు. ఇక ఐపీఎల్-2025 (IPL 2025)లో ఐదు మ్యాచ్‌లు ముగిసిన తర్వాత రుతురాజ్ గైక్వాడ్ గాయం వల్ల దూరం కాగా.. తలా మరోసారి సారథ్య బాధ్యతలు స్వీకరించాడు. అయితే, ఈసారి సీఎస్కే చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాయింట్ల పట్టికలో తొలిసారి అట్టడుగున (పద్నాలుగు నాలుగే విజయాలు) పదో స్థానంలో నిలిచింది. అయితే, లీగ్ దశలో ఆఖరిదైన ఆదివారం నాటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై ఘన విజయం సాధించి సీజన్‌ను ముగించడం చెన్నై అభిమానులకు కాస్త ఊరటనిచ్చింది.The 5⃣-time champs sign off from #TATAIPL 2025 with a convincing win 💛#CSK register a HUGE 83-run win over #GT 👏Updates ▶ https://t.co/P6Px72jm7j#GTvCSK | @ChennaiIPL pic.twitter.com/ey9uNT3IqP— IndianPremierLeague (@IPL) May 25, 2025 ఇక ఈ మ్యాచ్ ముందు నుంచే మరోసారి 43 ధోని రిటైర్మెంట్పై చర్చోపర్చలు జరిగాయి. ఇందులో భాగంగా మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, ఆర్పీ సింగ్- ఆకాశ్ చోప్రా, సంజయ్ బంగర్ మధ్య వాడివేడి చర్చ జరిగింది.స్టార్ స్పోర్ట్స్ షోలో భాగంగా ఈ కామెంటేటర్లు ధోని భవితవ్యంపై సంభాషణ సాగించారు. రైనా, ఆర్పీ సింగ్ తలా ఇంకొన్నాళ్లు కొనసాగాలని పేర్కొంటే.. ఆకాశ్ చోప్రా, సంజయ్ బంగర్ మాత్రం ధోని లోయర్ ఆర్డర్లో రావడాన్ని తప్పు బడుతూ ఇక అతడు తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారి చర్చ సాగిందిలా..ఆకాశ్ చోప్రా: ఒకవేళ ఎంఎస్ ధోని ‘అన్క్యాప్డ్’ (ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైన్ అయిన తర్వాత ఇలా ఐపీఎల్లో అందుబాటులో ఉండవచ్చు)ప్లేయర్ కాకపోయి ఉంటే.. ఈసారి కూడా సీఎస్కే జట్టుతో కొనసాగేవాడా?సురేశ్ రైనా: కచ్చితంగా.. పద్దెమినదేళ్లుగా అతడు జట్టుతో ఉన్నాడు. ఇంకా ఫిట్‌గా ఉన్నాడు. ఇప్పటికీ అత్యధిక సిక్సర్ల వీరుల జాబితాలో కొనసాగుతున్నాడు.ఆకాశ్ చోప్రా: మరి అతడు 7, 8, 9 స్థానాల్లో ఎందుకు బ్యాటింగ్‌కు వస్తున్నాడు. బ్యాటింగ్ పరంగా జట్టు చిక్కుల్లో పడిన వేళ.. కష్టాలు చుట్టుముట్టిన సమయంలోనూ టాపార్డర్‌లో ఆడవచ్చు కదా? అంతటి అనుభవం ఉన్న ఆటగాడు ఇలా ఎందుకు చేస్తున్నాడు? అసలు అతడు నిజంగానే ఫిట్‌గా ఉన్నాడా?సురేశ్ రైనా: ఆఖరి నాలుగు ఓవర్లలో ఆడటం ఎంఎస్‌కు సౌకర్యవంతంగా ఉంటుంది. అతడు ఫిట్‌గానే ఉన్నాడు. 44 ఏళ్లకు చేరువైనా.. ఇంకా వికెట్ కీపర్‌గా సేవలు అందిస్తున్నాడు. ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో ఇంటర్వ్యూలో రానున్న టీ20 ప్రపంచకప్ జట్టు గురించి మాట్లాడాడు. శివం దూబే వంటి వాళ్లకు అవకాశాలు ఇచ్చేందుకు తనిలా చేస్తుండవచ్చు కదా!ఆర్పీ సింగ్: మోకాలి సర్జరీ తర్వాత ధోని కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. 20 ఏళ్లుగా కీపింగ్ చేస్తున్నాడు. కచ్చితంగా బ్యాటర్‌గానూ మరోసారి సత్తా చాటగలడు.ఇదిలా ఉంటే.. గుజరాత్ టైటాన్స్‌పై 83 పరుగుల తేడాతో గెలుపొందిన తర్వాత ధోని మాట్లాడుతూ.. తన రిటైర్మెంట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. తన ఆట ముగిసిపోయిందని చెప్పలేనని.. అదే విధంగా ఎప్పుడు తిరిగి వస్తానో తెలియదని పేర్కొన్నాడు. రిటైర్మెంట్ విషయంలో నిర్ణయానికి ఇంకా సమయం ఉందని ధోని తెలిపాడు. కాగా ఈ సీజన్లో ధోని 14 మ్యాచ్‌లలో కలిపి 196 పరుగులు మాత్రమే చేశాడు.చదవండి: Pat Cummins: ఫైనల్ చేరాల్సిన జట్టు.. మా వాళ్లను చూస్తే నాకే భయమేసిందిThings get a little heated in the studio during #TheBigDebate! 🔥What's your take on #CaptainCool's batting position this season? 💬Watch him #OneLastTime 👉 GTvCSK | SUN, 25th MAY, 2:30 PM on Star Sports Network & JioHotstar pic.twitter.com/uUWwUqK69I— Star Sports (@StarSportsIndia) May 25, 2025 -
చరిత్ర సృష్టించిన క్లాసెన్.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా ఇలా..
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klaasen) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. ఆద్యంతం ఆకాశమే హద్దుగా చెలరేగుతూ.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ పొట్టి క్రికెట్లోని అసలైన మజా అందించాడు.కేవలం 37 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న క్లాసెన్.. క్యాష్ రిచ్ లీగ్‌లో వేగవంతమైన శతకం (Fastest Century) బాదిన మూడో క్రికెటర్‌గా యూసఫ్ పఠాన్ రికార్డును సమం చేశాడు. ఇక కేకేఆర్‌తో మ్యాచ్‌లో మొత్తంగా 39 బంతులు ఎదుర్కొన్న ఈ సౌతాఫ్రికా స్టార్ ఏడు ఫోర్లు, తొమ్మిది సిక్సర్ల సాయంతో 105 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా ఇలా..ఈ క్రమంలో క్లాసెన్ సరికొత్త రికార్డు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్ట్రైక్‌రేటు (269.23)తో సెంచరీ బాదిన తొలి విదేశీ క్రికెటర్, ఓవరాల్‌గా రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో యూసఫ్ పఠాన్ అతడి కంటే ముందున్నాడు. ఇలా కేకేఆర్‌తో ఆదివారం నాటి మ్యాచ్ సందర్భంగా క్లాసెన్ రెండు అరుదైన రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా ఓవరాల్‌గా క్లాసెన్‌కు ఐపీఎల్లో ఇది రెండో సెంచరీ.110 పరుగుల తేడాతో జయభేరి అంతేకాదు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గానూ ఈ వికెట్ కీపర్ బ్యాటర్ నిలిచాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే... ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో జరిగిన పోరులో సన్‌రైజర్స్ కేకేఆర్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కమిన్స్ బృందం.. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి 278 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.ఓపెనర్లు అభిషేక్ శర్మ (16 బంతుల్లో 32), ట్రవిస్ హెడ్ (40 బంతుల్లో 76) శుభారంభం అందించగా.. క్లాసెన్ సునామీ ఇన్నింగ్స్‌తో స్కోరు బోర్డును పరుగులు తీయించాడు. మిగతా వాళ్లలో ఇషాన్ కిషన్ 29, అనికేత్ వర్మ 12(నాటౌట్) పరుగులు చేశారు.ఇక లక్ష్య ఛేదనలో కేకేఆర్ 18.4 ఓవర్లలో కేవలం 168 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా సన్‌రైజర్స్ 110 పరుగుల తేడాతో జయభేరి మోగించి.. ఈ సీజన్‌ను విజయంతో ముగించింది. రైజర్స్ బౌలర్లలో జయదేవ్ ఉనాద్కట్ (3/24), ఇషాన్ మలింగ (3/31), హర్ష్ దూబే (3/34) మూడేసి వికెట్లతో అద్భుతంగా రాణించారు.హెన్రిచ్ క్లాసెన్ సాధించిన రికార్డులుఐపీఎల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ వీరుల జాబితాలో చోటు1. క్రిస్ గేల్- 30 బంతుల్లో శతకం2. వైభవ్ సూర్యవంశీ- 35 బంతుల్లో శతకం3. యూసఫ్ పఠాన్- 37 బంతుల్లో శతకం4. హెన్రిచ్ క్లాసెన్- 37 బంతుల్లో శతకం5. డేవిడ్ మిల్లర్- 38 బంతుల్లో శతకంఐపీఎల్లో అత్యధిక స్ట్రైక్‌రేటుతో వందకు పైగా పరుగులు సాధించింది వీరే1. యూసఫ్ పఠాన్- రాజస్తాన్ రాయల్స్ తరఫున 2010లో ముంబై ఇండియన్స్‌పై 270.27 స్ట్రైక్‌రేటుతో 100 రన్స్2. హెన్రిచ్ క్లాసెన్- సన్‌రైజర్స్ తరఫున 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 169.23 స్ట్రైక్‌రేటుతో 105 రన్స్ (నాటౌట్)3. డేవిడ్ మిల్లర్- పంజాబ్ కింగ్స్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్) తరఫున 2013లో ఆర్సీబీపై 265.78 స్ట్రైక్‌రేటుతో 101 రన్స్ (నాటౌట్)4. వైభవ్ సూర్యవంశీ- రాజస్తాన్ రాయల్స్ తరఫున గుజరాత్ టైటాన్స్‌పై 2025లో 265.78 స్ట్రైక్‌రేటుతో 1015. క్రిస్ గేల్- ఆర్సీబీ తరఫున 2013లో పుణె వారియర్స్‌పై 265.14 స్ట్రైక్‌రేటుతో 175 రన్స్ (నాటౌట్).చదవండి: Pat Cummins: ఫైనల్ చేరాల్సిన జట్టు.. మా వాళ్లను చూస్తే నాకే భయమేసిందిSky is not the limit when he's batting! 🫡🎥 Glimpse of the 𝙃𝙚𝙞𝙣𝙧𝙞𝙘𝙝 𝙆𝙡𝙖𝙖𝙨𝙚𝙣 𝙨𝙝𝙤𝙬 en route his mind-blowing 105*(39) 🚀Scorecard ▶ https://t.co/4Veibn1bOs #TATAIPL | #SRHvKKR | @SunRisers pic.twitter.com/WaOSR90wrg— IndianPremierLeague (@IPL) May 25, 2025 -
అందుకే సర్ఫరాజ్‌పై వేటు!.. రీఎంట్రీకి అతడు అర్హుడు: పుజారా
ఐపీఎల్-2025 తర్వాత టీమిండియా ఇంగ్లండ్ పర్యటన (India vs England)తో బిజీకానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2025-27 సీజన్లో భాగంగా ఇరుజట్ల మధ్య తొలి సిరీస్ జరుగునుంది. ఇందుకు సంబంధించి శనివారమే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జట్టును ప్రకటించింది.వారికి గ్రీన్ సిగ్నల్పద్దెనిమిది మంది సభ్యులతో కూడిన బృందానికి యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా నియమించింది. ఇంగ్లండ్‌తో టెస్టులతో సారథిగా అతడి ప్రయాణం మొదలుకానుంది. ఇక ఈ జట్టులో సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్ చోటు దక్కించుకోగా.. అర్ష్‌దీప్ సింగ్ కూడా తొలిసారి టెస్టు టీమ్‌లోకి వచ్చాడు. కరుణ్ రీ ఎంట్రీచాలా ఏళ్ల తర్వాత ‘ట్రిపుల్ సెంచూరియన్’ కరుణ్ నాయర్‌కు కూడా అవకాశం దక్కింది. మరోవైపు.. శార్దూల్ ఠాకూర్ కూడా పునరాగమనం చేశాడు. అయితే, సర్ఫరాజ్ ఖాన్‌కు మాత్రం సెలక్టర్లు ఇంగ్లండ్‌తో టెస్టులు ఆడే జట్టులో చోటివ్వలేదు. ఈ పరిణామాలపై టీమిండియా వెటరన్ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా స్పందించాడు. అందుకే సర్ఫరాజ్‌పై వేటు!‘‘ఆసియా, ఉపఖండ పిచ్‌లపై సర్ఫరాజ్ ఖాన్ విజయవంతమైన ఆటగాడిగా ఉన్నాడు. కానీ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో అతడు రాణించలేడని సెలక్టర్లు భావించి ఉండవచ్చు. అందుకే.. అతడికి ఈ జట్టులో చోటు ఇవ్వలేదనుకుంటా. అంతేకాదు.. అతడికి ఫిట్నెస్ సమస్యలు ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే, ప్రస్తుతం సర్ఫరాజ్ ఫిట్నెస్ గురించి నాకైతే సమాచారం లేదు. ఫిట్‌గా ఉండేందుకు అతడు అన్ని రకాలుగా తీవ్రంగా శ్రమిస్తున్నాడని మాత్రం తెలుసు.రీఎంట్రీకి అతడు అర్హుడుఏదేమైనా దురదృష్టవశాత్తూ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, కరుణ్ నాయర్ ఎంపిక పట్ల సంతోషంగా ఉంది. దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా ఆడుతున్న అతడు జట్టులో చోటుకు అర్హుడు’’ అని పుజారా హిందుస్తాన్ టైమ్స్‌తో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా టీమిండియా చివరగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడింది. ఈ టెస్టు సిరీస్‌కు సర్ఫరాజ్ ఎంపికైనా ఒక్క మ్యాచ్ కూడా అడే అవకాశం రాలేదు.ఇక టీమిండియా- ఇంగ్లండ్ మధ్య జూన్ 20 నుంచి ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. కాగా దేశవాళీ క్రికెట్‌తో పాటు కౌంటీల్లోనూ రాణిస్తున్న పుజారా సైతం టెస్టు జట్టులో పునరాగమనం కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే, అతడి కల ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు.ఇంగ్లండ్‌తో టెస్టులకు భారత జట్టుశుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.చదవండి: కోపంతో ఊగిపోయిన సిరాజ్.. ఇదేంటి మియా?.. అతడి పట్ల ఇలాగేనా ప్రవర్తించేది? -
ఫైనల్ చేరాల్సిన జట్టు.. మా వాళ్లను చూస్తే నాకే భయమేసింది: కమిన్స్
ఐపీఎల్-2025 (IPL 2025) సీజన్‌ను అద్భుత విజయంతో ముగించామని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) హర్షం వ్యక్తం చేశాడు. తమ బ్యాటర్లు విధ్వంసకర ఆటతో విరుచుకుపడుతుంటే తనకు కూడా కాస్త భయం వేసిందంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. తమ జట్టులో అద్బుత ఆటగాళ్లు ఉన్నారని.. ఫైనల్ చేరే సత్తా ఉన్నా ఈసారి ఆ పని చేయలేకపోయామని పేర్కొన్నాడు.రేసు నుంచి నిష్క్రమించిన తర్వాతకాగా గతేడాది రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్.. ఈసారి మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయింది. తొలి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌పై వీరబాదుడు మినహా ఆ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే, ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తర్వాత మాత్రం కమిన్స్ బృందం వింటేజ్ బ్యాటింగ్‌తో రెచ్చిపోయింది.ఆఖరి మ్యాచ్‌లో ఆర్సీబీపై 42 పరుగుల తేడాతో గెలిచిన రైజర్స్.. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. ఢిల్లీ వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో రహానే సేనపై 110 పరుగుల భారీ తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఓపెనర్లలో అభిషేక్ శర్మ (16 బంతుల్లో 32) రాణించగా.. ట్రవిస్ హెడ్ (40 బంతుల్లో 76) ఆకాశమే హద్దుగా చెలరేగాడు.𝙃𝙚𝙖𝙙𝙞𝙣𝙜 towards a 𝙆𝙡𝙖𝙨𝙨𝙮 show 🍿#SRH cruising along at the moment ⛵Updates ▶ https://t.co/4Veibn1bOs #TATAIPL | #SRHvKKR | @SunRisers pic.twitter.com/AMKTayK7PS— IndianPremierLeague (@IPL) May 25, 2025క్లాసెన్‌కు పూనకాలు ఇక హెన్రిచ్ క్లాసెన్ పూనకం వచ్చినట్లుగా బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. 37 బంతుల్లో శతక్కొట్టిన క్లాసెన్.. ఐపీఎల్లో మూడో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. మొత్తంగా 39 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 9 సిక్స్‌ల సాయంతో 105 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది సన్‌రైజర్స్.Sky is not the limit when he's batting! 🫡🎥 Glimpse of the 𝙃𝙚𝙞𝙣𝙧𝙞𝙘𝙝 𝙆𝙡𝙖𝙖𝙨𝙚𝙣 𝙨𝙝𝙤𝙬 en route his mind-blowing 105*(39) 🚀Scorecard ▶ https://t.co/4Veibn1bOs #TATAIPL | #SRHvKKR | @SunRisers pic.twitter.com/WaOSR90wrg— IndianPremierLeague (@IPL) May 25, 2025లక్ష్య ఛేదనలో కేకేఆర్‌ను 18.4 ఓవర్లలోనే ఆలౌట్ చేసింది. సన్‌రైజర్స్ బౌలర్ల విజృంభణతో రహానే సేన 168 పరుగులకే కుప్పకూలింది. ఇలా సమిష్టి ప్రదర్శనతో జట్టు రాణించడం పట్ల రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సంతోషం వ్యక్తం చేశాడు.‘‘అద్భుతమైన ముగింపు. ఈ సీజన్లో గత కొన్ని మ్యాచ్‌లలో మేము సూపర్‌గా ఆడాము. మా వాళ్ల బ్యాటింగ్ భయంకరంగానే ఉందని చెప్పవచ్చు (నవ్వులు). మా ఆటగాళ్ల సమర్థత దృష్ట్యా నిజానికి ఈ సీజన్లో కొన్ని మ్యాచ్‌లు ఇంత చెత్తగా ఆడాల్సింది కాదు.ఫైనల్ చేరాల్సిన జట్టుఫైనల్కు చేర్చగల సత్తా ఉన్న ఆటగాళ్లు మా జట్టులో ఉన్నారు. కానీ ఈసారి మేము ఫైనల్ చేరలేకపోయాం. ఢిల్లీ వికెట్ మీద మా వాళ్లు అదరగొట్టారు. ఈసారి మా జట్టు బాగానే ఉంది. అయితే, కొంత మంది గాయాల వల్ల స్వదేశానికి వెళ్లిపోయారు. జట్టులోని 20 మంది ఆటగాళ్ల సేవలను మేము ఉపయోగించుకున్నాము’’ అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.కాగా ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ పద్నాలుగింట ఆరు గెలిచి.. ఏడు ఓడిపోయింది. ఓ మ్యాచ్ వర్షం వల్ల రద్దైపోయింది. ఈ క్రమంలో 13 పాయింట్లతో ప్రస్తుతం పట్టికలో ఆరోస్థానంలో ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ తమ ఆఖరి మ్యాచ్‌లో గెలిస్తే గనుక ఏడో స్థానానికి పడిపోతుంది.చదవండి: IPL: రిటైర్మెంట్పై ధోని కీలక వ్యాఖ్యలు -
కోపంతో ఊగిపోయిన సిరాజ్.. ఇదేంటి మియా?.. ఇలాగేనా ప్రవర్తించేది?
గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)కు కోపమొచ్చింది. సహచర ఆటగాడిపై మైదానంలోనే అతడు కోపంతో ఊగిపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో ఆదివారం నాటి మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. విషయమేమిటంటే..చేదు అనుభవంఐపీఎల్-2025 (IPL 2025) లీగ్ దశ ఆఖరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. సొంత మైదానం నరేంద్ర మోదీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో శుబ్‌మన్ సేన 83 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. తద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగాలంటే మిగిలిన మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి.అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ ఆది నుంచే గుజరాత్‌కు కలిసిరాలేదు. టాస్ గెలిచిన సీఎస్కే తొలుత బ్యాటింగ్‌కు దిగి.. 230 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు ఆయుశ్ మాత్రే (17 బంతుల్లో 34), డెవాన్ కాన్వే (35 బంతుల్లో 52) శుభారంభం అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ (19 బంతుల్లో 37) దానిని కొనసాగించాడు.The word 'fear' isn't in their dictionary 🔥#CSK's young guns Ayush Mhatre and Urvil Patel added to the Ahmedabad heat with their knocks 👏Updates ▶ https://t.co/P6Px72jm7j#TATAIPL | #GTvCSK | @ChennaiIPL pic.twitter.com/KcM4XW9peg— IndianPremierLeague (@IPL) May 25, 2025 ఇక శివం దూబే (8 బంతుల్లో 17) కాసేపు మెరుపులు మెరిపించగా.. డెవాల్డ్ బ్రెవిస్ (23 బంతుల్లో 57) ధనాధన్ దంచికొట్టాడు. రవీంద్ర జడేజా (18 బంతుల్లో 21 నాటౌట్) కూడా ఈసారి ఫర్వాలేదనిపించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై ఐదు వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది.అదనపు పరుగులుకాగా సీఎస్కే ఇన్నింగ్స్‌లో ఐదో ఓవర్‌ను సిరాజ్ వేశాడు. ఈ క్రమంలో ఐదో బంతిని ఎదుర్కొన్న ఉర్విల్ పటేల్.. మిడాఫ్ దిశగా బాల్‌ను తరలించాడు. కాన్వేతో కలిసి సింగిల్ పూర్తి చేసుకున్నాడు. అయితే, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ డైరెక్ట్ త్రో ద్వారా వికెట్లను గిరాటేయాలని చూడగా.. మిస్ ఫీల్డ్ అయింది. ఓవర్ త్రో కారణంగా చెన్నై మరో పరుగు తీయగలిగింది.ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. గిల్ వేసిన ఓవర్ త్రోను అందుకునేందుకు స్క్వేర్ లెగ్ వద్ద నుంచి పరిగెత్తుకు వచ్చిన ఆర్. సాయి కిషోర్ బంతిని అందుకుని మిడ్ వికెట్ వద్ద కలెక్ట్ చేసుకున్నాడు. అనుకోకుండా బంతి అతడి నుంచి చేజారగా.. ఇంతలో సీఎస్కే బ్యాటర్లు మూడో పరుగు కూడా పూర్తి చేసుకున్నారు.ఇదేంటి మియా? ఇలాగేనా ప్రవర్తించేది?దీంతో కోపోద్రిక్తుడైన సిరాజ్ కిషోర్‌ను ఉద్దేశించి గట్టిగానే తిట్టినట్లు కనిపించింది. అంతేకాదు.. బంతిని కూడా గ్రౌండ్‌కేసి కొడుతూ తన ఆగ్రహం వెళ్లగక్కాడు. ఇంతలో గిల్ వచ్చి సిరాజ్ భుజం తడుతూ నచ్చజెప్పాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఈ నేపథ్యంలో కామెంటేటర్ రవిశాస్త్రి స్పందిస్తూ.. ‘‘ఇదేంటి మియాన్’’ అంటూ ఇలాగేనా ప్రవర్తించేది? అన్నట్లుగా కాస్త అసహనం వ్యక్తం చేశాడు. కాగా లక్ష్య ఛేదనలో ఆది నుంచే తడబడిన గుజరాత్... 18.3 ఓవర్లలో కేవలం 147 పరుగులు చేసి ఆలౌట్ అయింది. చదవండి: చరిత్ర సృష్టించిన సునీల్ నరైన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గాpic.twitter.com/8UKU1ibO6o— The Game Changer (@TheGame_26) May 25, 2025 -
సబలెంకా సులువుగా...
ఎర్రమట్టి కోర్టులపై తన ఆధిపత్యం నిరూపించునే దిశగా బెలారస్ టెన్నిస్ స్టార్ సబలెంకా అడుగు వేసింది. తనకు అంతగా కలిసిరాని ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా శుభారంభం చేసింది. టాప్ సీడ్ హోదాలో బరిలోకి దిగిన ఆమె తొలి మ్యాచ్‌లో దుమ్మురేపింది. రష్యా ప్లేయర్ కమిల్లా రఖిమోవాతో జరిగిన పోరులో సబలెంకా కేవలం ఒక్క గేమ్ మాత్రమే కోల్పోయి విజయాన్ని ఖరారు చేసుకుంది. వరుసగా ఎనిమిదో ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడుతున్న సబలెంకా గత ఏడాది సెమీఫైనల్ చేరుకొని తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ (2 ఆస్ట్రేలియన్ ఓపెన్, 1 యూఎస్ ఓపెన్) సాధించిన సబలెంకా స్థాయికి తగ్గట్టు ఆడితే ఫ్రెంచ్ ఓపెన్‌లో అద్భుతం సృష్టించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పారిస్: టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి రోజు ఎలాంటి సంచలనాలు నమోదు కాలేదు. మహిళల సింగిల్స్‌లో ఫేవరెట్స్‌లో ఒకరైన నంబర్‌వన్ సబలెంకా గెలుపు బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన తొలి రౌండ్లో సబలెంకా 6–1, 6–0తో ప్రపంచ 86వ ర్యాంకర్ కమిల్లా రఖిమోవా (రష్యా)పై అలవోకగా గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. 60 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఐదు ఏస్‌లు సంధించిన సబలెంకా ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా కోల్పోని ఆమె ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. 30 విన్నర్స్ కొట్టిన సబలెంకా 17 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు ఎనిమిదో సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా), 13వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 11వ సీడ్ డయానా ష్నైడర్ (రష్యా) కూడా తొలి రౌండ్లో విజయం సాధించి రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో కిన్వెన్ జెంగ్ 6–4, 6–3తో పావ్లీచెంకోవా (రష్యా)పై, స్వితోలినా 6–1, 6–1తో జెనిప్ సోన్మెజ్ (తుర్కియే)పై, డయానా 7–6 (7/3), 6–2తో క్వాలిఫయర్ సొబోలియెవా (ఉక్రెయిన్)పై గెలిచారు. ముసెట్టి ముందంజ పురుషుల సింగిల్స్ విభాగంలో ఎనిమిదో సీడ్ ముసెట్టి (ఇటలీ), 12వ సీడ్ టామీ పాల్ (అమెరికా), 15వ సీడ్ టియాఫో(అమెరికా) శుభారంభం చేశారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ముసెట్టి 7–5, 6–2, 6–0తో హాన్్ఫమన్ (జర్మనీ)పై, టామీ పాల్ 6–7 (3/7), 6–2, 6–3, 6–1తో ఎల్మెర్ మోలెర్ (డెన్మార్క్)పై, టియాఫో 6–4, 7–5, 6–4తో సఫిలిన్ (రష్యా)పై విజయం సాధించారు. నాదల్కు సన్మానం రికార్డుస్థాయిలో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను 14 సార్లు గెలిచిన స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్కు ఆదివారం నిర్వాహకులు సన్మానించారు. ఈ కార్యక్రమానికి స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్, బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే హాజరై నాదల్‌తో ఫొటోలు దిగారు. గత ఏడాది ఆటకు గుడ్‌బై చెప్పిన నాదల్ తన కెరీర్లో మొత్తం 22 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించాడు. -
Shubman Gill: ‘గొప్ప గౌరవం... పెద్ద బాధ్యత’
ముంబై: భారత టెస్టు క్రికెట్ చరిత్రలో విదేశీ గడ్డపై అప్పుడప్పుడు కొన్ని మెరుపులు మినహా మన జట్టు రికార్డు పేలవంగానే ఉంది. సహజంగానే సిరీస్‌లో ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనలతో పాటు కెప్టెన్సీపై కూడా అందరి దృష్టీ ఉంటుంది. ఇప్పుడు టీమిండియా టెస్టు కెప్టెన్ హోదాలో శుబ్‌మన్ గిల్ ఇంగ్లండ్‌తో సిరీస్‌లో తొలిసారి బరిలోకి దిగబోతున్నాడు. ఈ నేపథ్యంలో సారథిగా తనపై అనవసరపు ఒత్తిడిని పెంచుకోనని గిల్ స్పష్టం చేశాడు. కెపె్టన్‌గా ఎంపికైన తర్వాత అతను బీసీసీఐ మీడియాతో తన స్పందనను పంచుకున్నాడు. బ్యాటర్‌గా కూడా తన బాధ్యత నెరవేర్చడం ముఖ్యమని అతను అన్నాడు. ‘ఒక విషయంలో నేను చాలా స్పష్టంగా ఉండదల్చుకున్నాను. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నేను బ్యాటర్‌గానే ఆలోచిస్తాను. అదే కోణంలో నిర్ణయాలు తీసుకుంటాను తప్ప కెప్టెన్ హోదా గురించి పట్టించుకోను. బ్యాటింగ్ చేస్తూ కూడా ఇతర అంశాలపై దృష్టి పెడితే సహజంగానే ఒత్తిడి పెరుగుతుంది. అది అవసరం లేదు. నేను కెప్టెన్‌ను అనే భావనే రాకుండా నా బ్యాటింగ్‌తో ఏం చేయగలననేది ముఖ్యం’ అని గిల్ వ్యాఖ్యానించాడు. భారత కెప్టెన్‌గా ఎంపిక కావడం పట్ల చాలా సంతోషంగా ఉందన్న గిల్... అదో పెద్ద బాధ్యత అని అభిప్రాయపడ్డాడు. ‘చిన్నప్పుడు క్రికెట్ ఆడటం మొదలు పెట్టినప్పుడు భారత్‌కు ఆడితే చాలనుకుంటాం. ఆ తర్వాత ఎక్కువ కాలం టెస్టులు ఆడితే బాగుంటుందని భావిస్తాం. అలాంటిది ఇప్పుడు కెప్టెన్ కావడం గొప్ప గౌరవం. ఇంత పెద్ద బాధ్యత నాకు దక్కిన గొప్ప అవకాశం. ఇంగ్లండ్‌తో సిరీస్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’ అని గిల్ భావోద్వేగం ప్రదర్శించాడు.ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చి వారి నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టడంతో పాటు ఏ సమయంలో కెప్టెన్ అవసరం జట్టుకు ఉంటుందని గుర్తించడం కూడా కీలకమని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇటీవలే టెస్టుల నుంచి రిటైర్ అయిన కోహ్లి, రోహిత్, అశ్విన్‌ల నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని... విదేశాల్లో ఎలా గెలవాలో వారు చూపించారని కొత్త కెప్టెన్ అన్నాడు. ‘రోహిత్, విరాట్, అశ్విన్ విదేశాల్లో టెస్టులు, సిరీస్‌లు ఎలా గెలవాలనే విషయంలో ఒక ‘బ్రూప్రింట్’ను అందించారు. దీనిని అమలు చేయగలగాలి. విరాట్, రోహిత్‌ల నాయకత్వంలో ఆడటం నా అదృష్టం. బయటకు కనిపించడంలో ఇద్దరి శైలి భిన్నమే అయినా...మైదానంలో అటాకింగ్ చేసే విషయంలో ఇద్దరూ దూకుడుగానే ఉంటారు. ఎప్పటికిప్పుడు మాట్లాడుతూ ఆటగాళ్లనుంచి తనకు ఏం కావాలో స్పష్టంగా చెప్పే రోహిత్ కెప్టెన్సీ పద్ధతిని నేను నేర్చుకున్నాను’ అని గిల్ వివరించాడు. -
MI Vs PBKS: ముంబై X పంజాబ్
జైపూర్: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవడమే లక్ష్యంగా... సోమవారం పంజాబ్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ పోరుకు సిద్ధమైంది. లీగ్ దశలో 13 మ్యాచ్‌లు ఆడిన ముంబై 8 విజయాలు, 5 పరాజయాలతో 16 పాయింట్లు ఖాతాలో వేసుకొని నాలుగో స్థానంలో ఉండగా... పంజాబ్ 13 మ్యాచ్‌ల్లో 17 పాయింట్లతో రెండో ‘ప్లేస్’లో కొనసాగుతోంది. టాప్–2లో నిలిచిన జట్లకు ఫైనల్‌కు చేరేందుకు మరో అదనపు అవకాశం ఉండటంతో... ఇరు జట్లు దానిపైనే దృష్టి సారించాయి. సీజన్ ఆరంభంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ముంబై జట్టు... ఆ తర్వాత వరుస విజయాలతో విజృంభిస్తుంటే... పంజాబ్ కింగ్స్ 11 ఏళ్ల తర్వాత ‘ప్లే ఆఫ్స్’కు అర్హత సాధించింది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై జట్టు స్టార్ ఆటగాళ్లతో నిండి ఉంటే... శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్‌పై ఎక్కువ ఆధారపడుతోంది. చిన్న బౌండరీల మైదానంలో భారీ స్కోర్లు నమోదవడం ఖాయం కాగా... ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్న బుమ్రా ఫామ్‌లో ఉండటంతో ముంబైకి కాస్త మొగ్గు ఉంది. సూర్యకుమార్ యాదవ్ 583 పరుగులతో ఫుల్ ఫామ్‌లో ఉండగా... రోహిత్ శర్మ, రికెల్టన్, విల్ జాక్స్ మంచి టచ్‌లో ఉన్నారు. హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ... ధాటిగా ఆడలేక ఇబ్బంది పడుతుండగా... హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్ భారీ షాట్లతో జట్టుకు ఉపయుక్తకరమైన పరుగులు అందిస్తున్నారు. బౌలింగ్‌లో బుమ్రా, బౌల్ట్, దీపక్ చాహర్, సాంట్నర్ కీలకం కానున్నారు. మరోవైపు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్లో 488 పరుగులు చేయగా... ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (486), ప్రియాన్‡్ష ఆర్య (362) దూకుడు మీదున్నారు. ఈ జంట మెరుగైన ఆరంభాలు అందిస్తుండటంతోనే ఆ జట్టు నిలకడ కొనసాగించగలుగుతోంది. జోష్ ఇన్‌గ్లిస్, నేహల్ వధేరా, శశాంక్ సింగ్, స్టొయినిస్‌తో పంజాబ్ బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. గత మ్యాచ్‌లో టాపార్డర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... చివర్లో స్టొయినిస్ మెరుపులు మెరిపించడంతో పంజాబ్ భారీ స్కోరు చేయగలిగింది. ఇలాగే ప్రతి మ్యాచ్‌లో ఒకరు విఫలమైనా మరొకరు బాధ్యత తీసుకుంటుండటం పంజాబ్ కింగ్స్‌కు కలిసి వస్తోంది. బ్యాటింగ్‌లో ముంబైకి దీటుగా ఉన్న పంజాబ్... బౌలింగ్‌లో మాత్రం కాస్త వెనుకబడ్డట్లు కనిపిస్తోంది. అర్‡్షదీప్ సింగ్, మార్కో యాన్సెన్‌పై అధిక భారం పడుతోంది. మరి కీలక పోరులో ముంబై విజయం సాధించి ముందంజ వేస్తుందా... లేక పంజాబ్ ప్రతాపం కనబరుస్తుందా చూడాలి! -
స్వప్నం సాకారం
మోంటెకార్లో: టెన్నిస్‌లో ‘వింబుల్డన్’... బ్యాడ్మింటన్‌లో ‘ఆల్ ఇంగ్లండ్’... ఫార్ములావన్‌లో ‘మొనాకో’ గ్రాండ్‌ప్రి... ఆయా క్రీడాంశాల్లోని క్రీడాకారులు పై మూడింటిలో గెలిస్తే ఎంతో గొప్పగా, ఎంతో గౌరవంగాభావిస్తారు. బ్రిటన్ రేసింగ్ డ్రైవర్ లాండో నోరిస్ ఆదివారం మొనాకో వీధుల్లో తన చిన్ననాటి కలను నిజం చేసుకున్నాడు. ఎంతో ఘన చరిత్ర కలిగిన మొనాకో గ్రాండ్‌ప్రిలో నోరిస్ విజేతగా అవతరించాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన లాండో నోరిస్ నిర్ణీత 78 ల్యాప్‌లను అందరికంటే వేగంగా, అందరికంటే వేగంగా 1 గంట 40 నిమిషాల 33.843 సెకన్లలో ముగించి టైటిల్ సాధించాడు. ‘ఎంతో గొప్పగా అనిపిస్తోంది. ఏనాటికైనా మొనాకో గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలవాలని చిన్ననాటి నుంచి కలలు కన్నాను. ఇప్పుడు నా స్వప్నం సాకారమైంది’ అని ఈ సీజన్లో రెండో విజయాన్ని అందుకున్న నోరిస్ వ్యాఖ్యానించాడు. మొనాకో గ్రాండ్‌ప్రి మొత్తం వీధుల్లోనే జరుగుతుంది కాబట్టి నిర్వాహకులు ఈ రేసులో ప్రత్యేక నిబంధనను ప్రవేశపెట్టారు. ఈసారి డ్రైవర్లందరూ కచ్చితంగా రెండుసార్లు పిట్ స్టాప్‌లోకి వెళ్లి టైర్లు మార్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ‘పోల్ పొజిషన్’ నుంచి రేసును ఆరంభించిన నోరిస్ 20వ ల్యాప్ వరకు ఆధిక్యంలో ఉన్నాడు. ఆ తర్వాత 20వ ల్యాప్‌లో నోరిస్ పిట్ స్టాప్‌లోకి వెళ్లడంతో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ వెర్స్టాపెన్ ఆధిక్యంలోకి వచ్చాడు. వెర్స్టాపెన్ 29వ ల్యాప్‌లో తొలిసారి పిట్ స్టాప్‌లోకి వెళ్లాడు. ఆ తర్వాత వెర్స్టాపెన్ 77వ ల్యాప్ వరకు ఆధిక్యంలో ఉన్నా రెండోసారి పిట్ స్టాప్‌లోకి వెళ్లలేదు. 77వ ల్యాప్‌లో వెర్స్టాపెన్ పిట్ స్టాప్‌లోకి ప్రవేశించగా... ఇదే అదనుగా నోరిస్ దూసుకుపోయి మళ్లీ ఆధిక్యంలోకి వచ్చి చివరి ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.ఫెరారీ డ్రైవర్ లెక్లెర్క్ రెండో స్థానంలో, ఆస్కార్ పియాస్ట్రి (మెక్లారెన్) మూడో స్థానంలో నిలిచారు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ వెర్స్టాపెన్ నాలుగో స్థానంతోసరిపెట్టుకున్నాడు. మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్‌కు ఐదో స్థానం దక్కింది. ఇద్దరు డ్రైవర్లు ఫెర్నాండో అలోన్సో (ఆస్టన్ మార్టిన్), పియరీ గ్యాస్లీ (అల్పైన్) రేసును పూర్తి చేయలేకపోయారు. ప్రస్తుత సీజన్లో ఎనిమిది రేసులు ముగిశాయి. ఆరింటిలో మెక్లారెన్ డ్రైవర్లు, రెండింటిలో రెడ్‌బుల్ డ్రైవర్లు విజేతలుగా నిలిచారు. డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో 161 పాయింట్లతో ఆస్కార్ పియాస్ట్రి తొలి స్థానంలో, 158 పాయింట్లతో లాండో నోరిస్ రెండో స్థానంలో, 136 పాయింట్లతో వెర్స్టాపెన్ మూడో స్థానంలో ఉన్నారు. సీజన్‌లోని తదుపరి రేసు స్పానిష్ గ్రాండ్‌ప్రి జూన్ 1న జరుగుతుంది. -
రన్నరప్ శ్రీకాంత్
కౌలాలంపూర్: కెరీర్లో మరో అంతర్జాతీయ టైటిల్ సాధించాలని ఆశించిన భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్‌కు నిరాశ ఎదురైంది. మలేసియా ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ శ్రీకాంత్ రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 65వ ర్యాంకర్ శ్రీకాంత్ 11–21, 9–21తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ లీ షి ఫెంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. 36 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ అడపాదడపా మెరిపించినా చివరకు చైనా ప్లేయర్‌దే పైచేయి అయింది. రన్నరప్‌గా నిలిచిన శ్రీకాంత్‌కు 18,050 డాలర్ల (రూ. 15 లక్షల 35 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 7800 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ‘మళ్లీ పోడియంపైకి వచ్చి పతకం అందుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఫైనల్ ఫలితం నిరాశపరిచినా, ఓవరాల్‌గా ఈ టోర్నీలో నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నా’ అని 32 ఏళ్ల శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. 2017లో ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ సాధించిన తర్వాత శ్రీకాంత్ మరో అంతర్జాతీయ టైటిల్ నెగ్గలేకపోయాడు. 2019లో ఇండియా ఓపెన్‌లో, 2021 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరిన శ్రీకాంత్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. -
ఆఖర్లో అదరహో
‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి తప్పుకున్న జట్లు... తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌ల్లో దంచికొట్టాయి. గుజరాత్ టైటాన్స్‌తో పోరులో చెన్నై దుమ్మురేపి 230 పరుగులు చేస్తే... కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 278 పరుగులతో విరుచుకుపడింది. అంచనాల ఒత్తిడి లేకపోవడంతో స్వేచ్ఛగా ఆడిన ఈ రెండు జట్లు విజయాలతో సీజన్‌ను ముగించాయి. గుజరాత్‌తో పోరులో చెన్నై బ్యాటర్లు కాన్వే, బ్రెవిస్ హాఫ్ సెంచరీలతో విజృంభిస్తే... నైట్ రైడర్స్ బౌలర్లను క్లాసెన్, హెడ్ చీల్చి చెండాడారు. సీజన్ ఆరంభ పోరులో రాజస్తాన్ రాయల్స్‌పై 286 పరుగులు చేసి అదరగొట్టిన ఆరెంజ్ ఆర్మీ... తమ ఆఖరి మ్యాచ్‌లో మరోసారి మూడొందలకు చేరువైంది. అభిషేక్ శర్మ, హెడ్ మెరుపులతో భారీ స్కోరుకు పునాది వేస్తే... క్లాసెన్ దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. మధ్యలో నిలకడలేమితో పరాజయాలు మూటగట్టుకున్న ఆరెంజ్ ఆర్మీ... చివరి మూడు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. న్యూఢిల్లీ: విధ్వంసకర ఆటతీరుతో ఐపీఎల్లో భారీ స్కోర్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో సీజన్‌కు వీడ్కోలు పలికింది. ఆదివారం జరిగిన పోరులో సన్‌రైజర్స్ 110 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)పై విజయం సాధించింది. మొదట సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హెన్రిచ్ క్లాసెన్ (39 బంతుల్లో 105 నాటౌట్; 7 ఫోర్లు, 9 సిక్స్‌లు) అజేయ శతకంతో కదంతొక్కగా... ట్రావిస్ హెడ్ (40 బంతుల్లో 76; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) దంచికొట్టాడు. బంతి తన పరిధిలో ఉంటే చాలు దానిపై ఆకలిగొన్న సింహంలా విరుచుకుపడిన క్లాసెన్ 37 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అభిషేక్ శర్మ (16 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), కూడా రాణించాడు. లక్ష్యఛేదనలో కోల్‌కతా నైట్‌రైడర్స్ 18.4 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. దంచుడే... దంచుడు మొదట బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ తొలి ఓవర్లో 2 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాతి నుంచి వెనుదిరిగి చూసుకోని రైజర్స్... ఫోర్లు, సిక్స్‌లతో మైదానాన్ని మోతెక్కించింది. రెండో ఓవర్లో హెడ్ సిక్స్‌తో ఖాతా తెరవగా... అభిషేక్ రెండు ఫోర్లు బాదాడు. మూడో ఓవర్లో 6, 4, 2, 6 బాదిన హెడ్... నాలుగో ఓవర్లో మరో మూడు ఫోర్లు కొట్టాడు. నోర్జే ఓవర్లో అభిషేక్ 2 ఫోర్లతో చెలరేగడంతో పవర్‌ప్లే ముగిసేసరికి రైజర్స్ 79 పరుగులు చేసింది. నరైన్ ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టిన అభిషేక్... మరో షాట్ ఆడే ప్రయత్నంలో ఔట్ కాగా... క్లాసెన్ రాకతో విధ్వంసం మరో స్థాయికి చేరింది. ఒకవైపు హెడ్, మరోవైపు క్లాసెన్ బౌలర్‌తో సంబంధం లేకుండా భారీ షాట్లతో విరుచుకుపడటంతో... 10 ఓవర్లు ముగిసేసరికి ఆరెంజ్ ఆర్మీ 139/1తో నలిచింది. ఈ క్రమంలో హెడ్ 26 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... హర్షిత్ ఓవర్లో 4, 6, ,6తో క్లాసెన్ 17 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ అందుకున్నాడు. హెడ్‌ను ఔట్ చేయడం ద్వారా నరైన్ ఈ జోడీని విడదీయగా ... ఇషాన్ కిషన్ వేగంగా ఆడలేకపోయాడు. నరైన్ ఓవర్లో 2 సిక్స్‌లు కొట్టిన క్లాసెన్... వరుణ్‌కు అదే శిక్ష వేసి సెంచరీకి సమీపించాడు. రసెల్ ఓవర్లో 6, 4 కొట్టిన క్లాసెన్... అరోరా బౌలింగ్‌లో రెండు పరుగులు తీసి 37 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) రింకూ (బి) నరైన్ 32; హెడ్ (సి) రసెల్ (బి) నరైన్ 76; క్లాసెన్ (నాటౌట్) 105; ఇషాన్ కిషన్ (సి) నోర్జే (బి) వైభవ్ 29; అనికేత్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 278. వికెట్ల పతనం: 1–92, 2–175, 3–158. బౌలింగ్: వైభవ్ అరోరా 4–0–39–1; నోర్జే 4–0–60–0; హర్షిత్ రాణా 3–0–40–0; నరైన్ 4–0–42–2; వరుణ్ చక్రవర్తి 3–0–54–0; రసెల్ 2–0–34–0. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) మనోహర్ (బి) మలింగ 9; నరైన్ (బి) ఉనాద్కట్ 31; రహానే (సి) అభిషేక్ (బి) ఉనాద్కట్ 15; రఘువంశీ (సి) నితీశ్ (బి) మలింగ 14; రింకూ (సి) నితీశ్ (బి) హర్ష్ దూబే 9; రసెల్ (ఎల్బీ) (బి) హర్ష్ దూబే 0; మనీశ్ పాండే (సి) మనోహర్ (బి) ఉనాద్కట్ 37; రమణ్‌దీప్ (బి) హర్ష్ దూబే 13; హర్షిత్ (సి అండ్ బి) మలింగ 34; వైభవ్ అరోరా (రనౌట్) 0; నోర్జే (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (18.4 ఓవర్లలో ఆలౌట్) 168. వికెట్ల పతనం: 1–37, 2–55, 3–61, 4–70, 5–70, 6–95, 7–110, 8–162, 9–162, 10–168. బౌలింగ్: కమిన్స్ 2–0–25–0; ఉనాద్కట్ 4–0–24–3; హర్షల్ 2–0–21–0; ఇషాన్ మలింగ 3.4–0– 31–3; హర్ష్ దూబే 4–0–34–3; నితీశ్ రెడ్డి 1–0–6–0; అభిషేక్ 2–0–25–0. 278/3 ఐపీఎల్లో ఇది మూడో అత్యధిక స్కోరు. తొలి రెండు స్థానాల్లోనూ సన్‌రైజర్స్ జట్టే ఉంది. 2024లో బెంగళూరుపై 287/5 స్కోరు చేసిన హైదరాబాద్... ఈ ఏడాది తమ తొలి మ్యాచ్‌లో రాజస్తాన్‌పై 286/5 పరుగులు చేసింది. 37 సెంచరీకి క్లాసెన్ తీసుకున్న బంతులు. ఐపీఎల్లో ఇది మూడో వేగవంతమైన శతకం. క్రిస్ గేల్ (30 బంతుల్లో), వైభవ్ సూర్యవంశీ (35 బంతుల్లో), యూసుఫ్ పఠాన్ (37 బంతుల్లో) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. అహ్మదాబాద్: ఐపీఎల్ 18వ సీజన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయంతో ముగించింది. పాయింట్ల పట్టికలో చివరిదైన పదో స్థానంలో నిలిచిన ధోనీ బృందం... ఆదివారం తమ చివరి లీగ్ మ్యాచ్‌లో 83 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై గెలుపొందింది. మొదట చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డెవాల్డ్ బ్రెవిస్ (23 బంతుల్లో 57; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), కాన్వే (35 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఆయుశ్ మాత్రే (17 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఉర్విల్ పటేల్ (19 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. అర్షద్ ఖాన్ వెసిన రెండో ఓవర్లో ఆయుశ్ చెలరేగి వరుసగా 2, 6, 6, 4, 4, 6తో 28 పరుగులు రాబట్టాడు. క్రీజులో అడుగుపెట్టిన ప్రతీ బ్యాటర్ దంచికొట్టడమే పనిగా పెట్టుకోవడంతో చెన్నై భారీ స్కోరు చేయగలిగింది. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ 18.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న సాయి సుదర్శన్ (28 బంతుల్లో 41; 6 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లు ఆకట్టుకోలేకపోయారు. చెన్నై బౌలర్లలో అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్ చెరో 3 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌తో ధోని ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకుతాడని జోరుగా చర్చ సాగగా... మహీ తనకు అలవాటైన రీతిలో ‘వేచి చూద్దాం’ అని ముక్తాయించాడు. సంక్షిప్త స్కోర్లుచెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: 230/5 (20 ఓవర్లలో) (ఆయుశ్ 34; కాన్వే 52; ఉర్విల్ 37; బ్రెవిస్ 57, ప్రసిధ్ కృష్ణ 2/22) గుజరాత్ టైటాన్స్: 147 ఆలౌట్ (18.3 ఓవర్లలో) (సాయి సుదర్శన్ 41; అర్షద్ ఖాన్ 20, అన్షుల్ కంబోజ్ 3/13, నూర్ అహ్మద్ 3/21, జడేజా 2/17).ఐపీఎల్లో నేడుముంబై X పంజాబ్‌వేదిక: జైపూర్ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో -
SRH Vs KKR: కోల్‌కతాపై సన్‌రైజర్స్ గ్రాండ్ విక్టరీ..
ఐపీఎల్-2025 సీజన్ తమ ఆఖరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 110 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.క్లాసెన్ 39 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 105 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. క్లాసెన్‌తో పాటు ట్రావిస్ హెడ్(40 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 76), అభిషేక్ శర్మ(16 బంతుల్లో 32), ఇషాన్(29) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ రెండు, వైభవ్ ఆరోరా ఓ వికెట్ సాధించారు.అనంతరం లక్ష్య చేధనలో కేకేఆర్ 18.4 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌటైంది. కేకేఆర్ బ్యాటర్లలో మనీశ్ పాండే(37) టాప్ స్కోరర్‌గా నిలవగా.. హర్షిత్ రాణా(34), సునీల్ నరైన్(31) పర్వాలేదన్పించారు. మిగితా కేకేఆర్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో జయ్‌దేవ్ ఉనద్కట్, మలింగ మూడు వికెట్లు పడగొట్టగా.. హర్ష్‌దూబే తలా రెండు వికెట్లు సాధించారు. -
SRH Vs KKR: హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసం.. 37 బంతుల్లో సెంచరీ! వీడియో
ఐపీఎల్-2025లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ అద్బుత సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చిన క్లాసెన్ విధ్వంసం సృష్టించాడు. ఈ దక్షిణాఫ్రికా ఆటగాడు ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించాడు.అతడి బ్యాటింగ్ ధాటికి ఫీల్డర్లు కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే పోషించారు. ఈ క్రమంలో క్లాసెన్ కేవలం 37 బంతుల్లోనే తన రెండో ఐపీఎల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. క్లాసెన్ ఓవరాల్‌గా 39 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 105 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. దీంతో టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగుల భారీ స్కోర్ సాధించింది. క్లాసెన్‌తో పాటు ట్రావిస్ హెడ్(40 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 76), అభిషేక్ శర్మ(16 బంతుల్లో 32), ఇషాన్(29) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ రెండు, వైభవ్ ఆరోరా ఓ వికెట్ సాధించారు. కాగా ఇది ఐపీఎల్లో మూడో అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఐపీఎల్లో అత్యధిక టోటల్ నమోదు చేసిన రికార్డు కూడా ఎస్ఆర్హెచ్ పేరిటే ఉంది. ఐపీఎల్-2024లో బెంగళూరుపై సన్‌రైజర్స్ 3 వికెట్ల నష్టానికి ఏకంగా 287 పరుగులు చేసింది.HEINRICH KLAASEN - Fastest Century by an SRH player 🔥🫡 #SRHvKKR pic.twitter.com/glWohcuB4x— Arun Vijay (@AVinthehousee) May 25, 2025 -
చరిత్ర సృష్టించిన సునీల్ నరైన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్లో ఒకే జట్టు తరపున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నరైన్ చరిత్ర సృష్టించాడు. సునీల్ కేకేఆర్ తరుపన ఇప్పటివరకు ఐపీఎల్లో 191, ఛాంపియన్స్ లీగ్ టీ20 (CLT20)లో 18 వికెట్లు తీశాడు. మొత్తంగా 209 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్-2025లో భాగంగా ఢిల్లీ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో నరైన్ ఈ ఫీట్ సాధించాడు. కాగా సునీల్ నరైన్ ఐపీఎల్ ఆరంభం నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కే ఆడుతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటివరకు ఈ రికార్డు ఇంగ్లండ్ క్రికెట్ క్లబ్ నాటింగ్‌హామ్‌షైర్ బౌలర్ సమిత్ పటేల్ పేరిట ఉండేది. నాటింగ్‌హామ్‌షైర్ తరపున పటేల్ 208 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో సమిత్ వరల్డ్ రికార్డును నరైన్ బ్రేక్ చేశాడు. నరైన్ పటేల్, తర్వాతి స్ధానంలో హాంప్‌షైర్ బౌలర్ క్రిస్ వుడ్ 199 ఉన్నాడు. ముంబై ఇండియన్స్ మాజీ బౌలర్ లసిత్ మలింగ 195 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.పురుషుల టీ20 క్రికెట్లో ఒక జట్టుకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు210* – సునీల్ నరైన్ (కోల్‌కతా నైట్ రైడర్స్)208 – సమిత్ పటేల్ (నాటింగ్‌హామ్‌షైర్)199 – క్రిస్ వుడ్ (హాంప్‌షైర్)195 – లసిత్ మలింగ (ముంబై ఇండియన్స్)193 – డేవిడ్ పేన్ (గ్లౌసెస్టర్షైర్) -
IPL: రిటైర్మెంట్పై ధోని కీలక వ్యాఖ్యలు
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఈ ఏడాది ఐపీఎల్ ఆఖరి సీజన్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తన రిటైర్మెంట్ వార్తలపై ధోని స్పందించాడు. తన నిర్ణయాన్ని వెల్లడించడానికి ఇంకా సమయం ఉందని ధోని చెప్పుకొచ్చాడు.ఐపీఎల్-2025లో ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 83 పరుగుల తేడాతో సీఎస్కే ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం ప్రెజేంటర్ ధోని తన రిటైర్మెంట్ ప్లాన్స్ గురించి ప్రశ్నించాడు."వచ్చే సీజన్ ఆడాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి నాలుగు లేదా ఐదు నెలల సమయం ఉంది. రిటైర్మెంట్ విషయంలో తొందరపడాల్సిన అవసరం లేదు. ఇది ప్రొఫెషనల్ క్రికెట్. ఏ ఆటగాడైనా ఫిట్‌గా ఉండి, ఆడాలనే తపన ఉన్నంత కాలం ఆడొచ్చు. ప్రదర్శన ఆధారంగా రిటైర్ అవ్వాలంటే, ప్రతీ ఆటగాడు 22 ఏళ్లకే వీడ్కోలు పలకాలి. నేను తిరిగి రాంఛీకి వెళ్లి ఫ్యామిలీతో సమయాన్ని గడుపుతాను. ఆ తర్వాత ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను. అయితే వచ్చే సీజన్‌కు తిరిగి వస్తాను అని చెప్పలేను.. అలా అని రానని చెప్పలేను. నాకు ఇంకా చాలా సమయముందని" 43 ఏళ్ల ధోని బదులిచ్చాడు. -
CSK Vs GT: సీఎస్కే ఆల్‌రౌండ్ షో.. కీలక మ్యాచ్‌లో గుజరాత్ చిత్తు
ఐపీఎల్-2025 సీజన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ అద్బుతమైన విజయంతో ముగించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను 83 పరుగుల తేడాతో సీఎస్కే చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సీఎస్కే ఇన్నింగ్స్‌లో డెవాల్డ్ బ్రెవిస్(23 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 57), డెవాన్ కాన్వే(35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) సూపర్ హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. ఆయూష్ మాత్రే(17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34), ఉర్విల్ పటేల్(19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ రెండు వికెట్లు పడగొట్టగా.. సాయికిషోర్, రషీద్ ఖాన్, షారుఖ్ ఖాన్ తలా వికెట్ సాధించారు.సుదర్శన్ ఒక్కడే..అనంతరం లక్ష్య చేధనలో సీఎస్కే బౌలర్లు చెలరేగడంతో గుజరాత్.. 18.3 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది. గుజరాత్ బ్యాటర్లలో ఓపెనర్ సాయిసుదర్శన్(41) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 13 పరుగులు చేయగా.. స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచారు. సీఎస్కే బౌలర్లలో అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్ తలా మూడు వికెట్లు పడగొట్టి గుజరాత్‌ను దెబ్బతీయగా.. రవీంద్ర జడేజా రెండు, పతిరానా, ఖాలీల్ అహ్మద్ చెరో వికెట్ పడగొట్టారు.కాగా ఈ ఓటమితో గుజరాత్ టైటాన్స్ టాప్-2 స్దానం ప్రమాదంలో పడింది. ఆర్సీబీ, పంజాబ్ తమ తదుపరి రెండు మ్యాచ్‌లలో గెలిస్తే గుజరాత్ మూడో స్ధానానికి పడిపోతుంది.చదవండి: IPL 2025: ప్లే ఆఫ్స్‌కు ముందు పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్ -
కేకేఆర్‌ను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్..
IPL 2025 SRH vs KKR Live Updates: కేకేఆర్‌ను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్..ఐపీఎల్-2025లో ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 110 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ ఘన విజయం సాధించింది. 279 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 18.4 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌటైంది. కేకేఆర్ బ్యాటర్లలో మనీశ్ పాండే(37) టాప్ స్కోరర్‌గా నిలవగా.. హర్షిత్ రాణా(34), సునీల్ నరైన్(31) పర్వాలేదన్పించారు. మిగితా కేకేఆర్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో జయ్‌దేవ్ ఉనద్కట్, మలింగ మూడు వికెట్లు పడగొట్టగా.. హర్ష్‌దూబే తలా రెండు వికెట్లు సాధించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.దూకుడుగా ఆడుతున్న హర్షిత్కేకేఆర్ ఎనిమిదో నెంబర్ బ్యాటర్ హర్షిత్ రానా మెరుపులు మెరిపిస్తున్నాడు. 14 బంతుల్లో 3 సిక్సర్లు, 1 ఫోర్‌తో 29 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. 17 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 161/7కేకేఆర్ ఆరో వికెట్ డౌన్95 పరుగుల వద్ద కేకేఆర్ ఆరో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన రఘువంశీ.. మలింగ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ 6 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది.పీకల్లోతు కష్టాల్లో కేకేఆర్..70 పరుగులకే కేకేఆర్ 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 8వ ఓవర్ వేసిన హర్ష్ దూబే బౌలింగ్‌లో రింకూ సింగ్(9), రస్సెల్(0) వరుస బంతుల్లో ఔటయ్యారు.కేకేఆర్ మూడో వికెట్ డౌన్..డికాక్ రూపంలో కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన డికాక్.. ఎషాన్ మలింగ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 7 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 62/3కేకేఆర్ రెండో వికెట్ డౌన్..అజింక్య రహానే రూపంలో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన రహానే.. ఉనద్కట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 59/2కేకేఆర్ తొలి వికెట్ డౌన్..సునీల్ నరైన్ రూపంలో కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన నరైన్.. ఉనద్కట్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 4 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 39/13 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 33/03 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. క్రీజులో సునీల్ నరైన్(27), క్వింటన్ డికాక్(4) ఉన్నారు.ఎస్ఆర్హెచ్ బ్యాటర్ల వీరవిహారం.. ఏకంగా 278 రన్స్అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.క్లాసెన్ 39 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 105 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. క్లాసెన్‌తో పాటు ట్రావిస్ హెడ్(40 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 76), అభిషేక్ శర్మ(16 బంతుల్లో 32), ఇషాన్(29) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ రెండు, వైభవ్ ఆరోరా ఓ వికెట్ సాధించారు.హెన్రిచ్ క్లాసెన్ సెంచరీ..కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ సెంచరీతో మెరిశాడు. కేవలం 37 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను క్లాసెన్ అందుకున్నాడు. 19 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 261/3200 దాటేసిన ఎస్ఆర్హెచ్ఎస్ఆర్హెచ్ స్కోర్ బోర్డు రెండు వందలు దాటేసింది. 17 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ రెండు వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. క్రీజులో క్లాసెన్(87), ఇషాన్ కిషన్(20) పరుగులతో ఉన్నారు.ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ డౌన్ట్రావిస్ హెడ్ రూపంలో ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. 76 పరుగులు చేసిన హెడ్.. సునీల్ నరైన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ రెండు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. క్రీజులో క్లాసెన్(55), ఇషాన్ కిషన్(6) ఉన్నారు.హెన్రిచ్ క్లాసెన్ ఫిప్టీ..హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసం సృష్టిస్తున్నాడు. కేవలం 17 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు ఐదు ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. 13 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్భారీ స్కోర్ దిశగా ఎస్ఆర్హెచ్..అరుణ్ జైట్లీ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టిస్తున్నారు. 10 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టానికి 139 పరుగులు చేసింది. క్రీజులో హెడ్(65), క్లాసెన్(28) ఉన్నారు.ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ డౌన్..అభిషేక్ రూపంలో ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 32 పరుగులు చేసిన అభిషేక్.. సునీల్ నరైన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 79/06 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ నష్టపోకుండా 79 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్(47), అభిషేక్ శర్మ(20) మెరుపులు మెరిపిస్తున్నారు.దూకుడుగా ఆడుతున్న ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు..టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్ దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ వికెట్ నష్టపోకుండా 41 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(9), ట్రావిస్ హెడ్(15) ఉన్నారుఐపీఎల్-2025లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తమ ఆఖరి మ్యాచ్‌లో ఇరు జట్లు కూడా ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. ఈ ఏడాది సీజన్‌ను విజయంతో ముగించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.తుది జట్లుకోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), మనీష్ పాండే, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, అన్రిచ్ నార్ట్జే, వరుణ్ చకరవర్తిసన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ -
ప్లే ఆఫ్స్‌కు ముందు పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్
ఐపీఎల్-2025 సీజన్లో ప్లే ఆఫ్స్‌కు ముందు పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ గాయపడ్డాడు. ఈ విషయాన్ని పంజాబ్ కింగ్స్ అసిస్టెంట్ కోచ్ సునీల్ జోషి ధ్రువీకరించాడు. అయితే చాహల్ ఏ గాయంతో బాధపడుతున్నాడన్న విషయాన్ని జోషి స్పష్టం చేయలేదు.గాయం కారణంగానే శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌కు చాహల్ దూరమయ్యాడు. చాహల్ స్దానంలో ప్రవీణ్ దూబే జట్టులోకి వచ్చాడు. కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టిన దూబే.. భారీగా పరుగులు సమర్పించుకున్నాడు."చాహల్ చిన్న గాయంతో బాధపడుతున్నాడు. అందుకే అతడికి మేము విశ్రాంతి. అతడు మా తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నాము" అని పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో సునీల్ జోషీ పేర్కొన్నాడు.ఒకవేళ చాహల్ గాయం కారణంగా మిగిలిన మ్యాచ్‌లకు దూరమైతే పంజాబ్‌కు అది గట్టి ఎదురు దెబ్బే అని చెప్పాలి. ఎందుకంటే ఈ సీజన్లో చాహల్ పంజాబ్ జట్టుకు ప్రధాన స్పిన్నర్‌గా ఉన్నాడు. ఓ హ్యాటిక్ కూడా అతడి ఖాతాలో ఉంది. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన చాహల్.. 9.56 ఏకానమితో 14 వికెట్లు పడగొట్టాడు.కాగా పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో టాప్-2 స్ధానం కోసం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధించిన పంజాబ్‌కు ఇంకా ఒక లీగ్ మ్యాచ్ మిగిలి ఉంది. మే 26న జైపూర్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో పంజాబ్ తలపడనుంది.చదవండి: IPL 2025: బ్రెవిస్, కాన్వే, మాత్రే మెరుపులు.. సీఎస్కే భారీ స్కోర్ -
బ్రెవిస్, కాన్వే, మాత్రే మెరుపులు.. సీఎస్కే భారీ స్కోర్
ఐపీఎల్-2025లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న తమ ఆఖరి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు జూలు విధిల్చారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఏకంగా 230 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సీఎస్కే ఇన్నింగ్స్‌లో డెవాల్డ్ బ్రెవిస్(23 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 57), డెవాన్ కాన్వే(35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) అద్బుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. ఆయూష్ మాత్రే(17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34), ఉర్విల్ పటేల్(19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ రెండు వికెట్లు పడగొట్టగా.. సాయికిషోర్, రషీద్ ఖాన్, షారుఖ్ ఖాన్ తలా వికెట్ సాధించారు. కాగా ఈ ఏడాది సీజన్లో సీఎస్కేకే ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. అదేవిధంగా ఈ మ్యాచ్‌లో చెన్నై బ్యాటర్లు ఏకంగా 15 సిక్సర్లు బాదారు. అదేవిధంగా గుజరాత్‌ను 121 పరుగులలోపు ఆలౌట్ చేస్తే పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానం నుంచి సీఎస్కే బయటపడుతోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సీఎస్కే పదో స్దానంలో ఉంది. -
ఆయూష్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 28 రన్స్! వీడియో వైరల్
ఐపీఎల్-2025లో చెన్నై సూపర్‌కు కింగ్స్‌కు ఆయుష్ మాత్రే రూపంలో ఒక అణిముత్యం దొరికింది. గాయపడిన రుతురాజ్ గైక్వాడ్ స్దానంలో సీఎస్కే జట్టులోకి వచ్చిన ఆయూష్.. ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ సత్తాచాటాడు. ఈ యువ ఆటగాడు తన విధ్వంసకర బ్యాటింగ్‌తో సీఎస్కేకు అద్బతమైన ఆరంభాలను అందించాడు. తాజాగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న సీఎస్కే ఆఖరి మ్యాచ్‌లోనూ మాత్రే మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆయూష్ కేవలం 17 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34 పరుగులు చేసి ఔటయ్యాడు. చెన్నై ఇన్నింగ్స్ 2 ఓవర్ వేసిన గుజరాత్ పేసర్ ఆర్షద్ ఖాన్‌ను మాత్రే ఊతికారేశాడు.ఓ ఓవర్లో మాత్రం మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లతో ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. తొలి బంతికి రెండు పరుగులు తీసిన మాత్రే.. ఆ తర్వాత రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లు బాదాడు. ఆఖరి బంతిని కూడా స్టాండ్స్‌కు తరలించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.కాగా ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన ఐదో సీఎస్కే బ్యాటర్‌గా మాత్రే నిలిచాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో రవీంద్ర జడేజా అగ్రస్దానంలో ఉన్నాడు. ఐపీఎల్-2021 సీజన్లో జడేజా.. హర్షల్ పటేల్ వేసిన ఓవర్లో ఏకంగా 36 పరుగులు సాధించాడు. ఇక మాత్రే విషయానికి వస్తే.. ఈ ఏడాది సీజన్లో 7 మ్యాచ్‌లు 240 పరుగులు చేశాడు.చదవండి: PBKS VS DC: అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రీతి జింటా#CaptainCool would be proud of that onslaught! 🤩#AyushMhatre smashes 28 runs off the 2nd over of the game. 💪Watch the LIVE action ➡ https://t.co/vroVQLpMts#Race2Top2 👉 #GTvCSK | LIVE NOW on Star Sports Network & JioHotstar! pic.twitter.com/jvoaHXixXD— Star Sports (@StarSportsIndia) May 25, 2025 -
IPL 2025: సీజన్ ఆఖరి మ్యాచ్.. తొలుత బ్యాటింగ్ చేయనున్న సీఎస్కే
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఇవాళ (మే 25) తమ ఆఖరి మ్యాచ్ ఆడుతుంది. అహ్మదాబాద్ వేదికగా టేబుల్ టాపర్స్ గుజరాత్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. గుజరాత్ తరఫున రబాడ స్థానంలో గెరాల్డ్ కొయెట్జీ తుది జట్టులోకి రాగా.. సీఎస్కే తరఫున అశ్విన్ స్థానంలో హుడా తుది జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో సీఎస్కే గెలిచినా, ఓడినా ఒరిగేదేమీ ఉండదు. ఈ సీజన్‌ను ఆ జట్టు ఆఖరి స్థానంతోనే ముగిస్తుంది. గుజరాత్ విషయానికొస్తే.. ఈ జట్టు సీఎస్కేపై గెలిస్తే టేబుల్ టాపర్‌గా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది.జట్ల వివరాలు..చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ఆయుష్ మ్హత్రే, డెవాన్ కాన్వే, ఉర్విల్ పటేల్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, దీపక్ హుడా, MS ధోని(w/c), నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్ఇంపాక్ట్ సబ్స్: మతీష పతిరన, విజయ్ శంకర్, కమలేష్ నాగర్కోటి, రామకృష్ణ ఘోష్, రవిచంద్రన్ అశ్విన్గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్(సి), జోస్ బట్లర్(w), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, గెరాల్డ్ కోయెట్జీ, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, అర్షద్ ఖాన్, ప్రసిద్ కృష్ణఇంపాక్ట్ సబ్స్: సాయి సుదర్శన్, అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, వాషింగ్టన్ సుందర్, ఇషాంత్ శర్మ -
IPL 2025: అత్యుత్తమ బంగ్లాదేశీ బౌలర్‌గా ముస్తాఫిజుర్
ఐపీఎల్లో అత్యుత్తమ బంగ్లాదేశీ బౌలర్‌గా ముస్తాఫిజుర్ రెహ్మాన్ రికార్డు నెలకొల్పాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బంగ్లాదేశీ బౌలర్‌గా అవతరించాడు. ఈ క్రమంలో ఫిజ్.. ఆ దేశ దిగ్గజ ఆటగాడు షకీబ్ అల్ హసన్‌కు అధిగమించాడు. షకీబ్ ఐపీఎల్లో 63 వికెట్లు తీయగా.. ఫిజ్ 65 వికెట్లు (60 మ్యాచ్‌ల్లో) తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ సీజన్లో లేట్‌గా (ఐపీఎల్ పునఃప్రారంభం తర్వాత స్టార్క్‌కు ప్రత్యామ్నాయంగా) ఎంట్రీ ఇచ్చిన ఫిజ్ (ఢిల్లీ క్యాపిటల్స్).. నిన్న (మే 24) పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్లు తీయడంతో షకీబ్ రికార్డును బద్దలు కొట్టాడు.2016 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఫిజ్.. ఆ సీజన్లో సన్‌రైజర్స్ ఛాంపియన్‌గా అవతరించడంలో తనవంతు పాత్ర పోషించాడు. ఆ సీజన్లో ఫిజ్ 16 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీశాడు. సన్‌రైజర్స్ తర్వాత ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లకు ప్రాతినిథ్యం వహించిన ఫిజ్.. ఆయా జట్ల తరఫున అత్యుత్తమ ప్రదర్శనలు చేశాడు.ఈ సీజన్లో ఢిల్లీ తరఫున మూడే మ్యాచ్‌లు ఆడిన ఫిజ్ తనదైన మార్కును చూపించాడు. నిన్న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫిజ్ తొలుత ఓపెనర్ ప్రియాంశ్ ఆర్యను, ఆతర్వాత శశాంక్ సింగ్, మార్కో జన్సెన్ వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన ఫిజ్ కేవలం 33 పరుగులు మాత్రమే ఇచ్చాడు.మ్యాచ్ విషయానికొస్తే.. ఢిల్లీ పంజాబ్‌ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసి సీజన్‌ను గెలుపుతో ముగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేయగా.. ఢిల్లీ 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.పంజాబ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (53) అర్ద సెంచరీతో రాణించగా.. ప్రభసిమ్రన్ (28), జోష్ ఇంగ్లిస్ (32), స్టోయినిస్ (44 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ప్రియాంశ్ ఆర్య (6), నేహల్ వధేరా (16), శశాంక్ సింగ్ (11), అజ్మతుల్లా ఒమర్జాయ్ (1), మార్కో జన్సెన్ (0) నిరాశపరిచారు. ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్ 3, విప్రాజ్, కుల్దీప్ తలో 2, ముకేశ్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు.ఢిల్లీ తరఫున సమీర్ రిజ్వి (58 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడగా.. కరుణ్ నాయర్ (44), కేఎల్ రాహుల్ (35), డుప్లెసిస్ (23), సెదీఖుల్లా అటల్ (22), ట్రిస్టన్ స్టబ్స్ (18 నాటౌట్) కూడా అదే తరహా ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నారు. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ 2, జన్సెన్, ప్రవీణ్ దూబే తలో వికెట్ పడగొట్టారు. -
PBKS VS DC: అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రీతి జింటా
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 24) జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ పంజాబ్‌ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసి సీజన్‌ను గెలుపుతో ముగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేయగా.. ఢిల్లీ 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.పంజాబ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (53) అర్ద సెంచరీతో రాణించగా.. ప్రభసిమ్రన్ (28), జోష్ ఇంగ్లిస్ (32), స్టోయినిస్ (44 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ప్రియాంశ్ ఆర్య (6), నేహల్ వధేరా (16), శశాంక్ సింగ్ (11), అజ్మతుల్లా ఒమర్జాయ్ (1), మార్కో జన్సెన్ (0) నిరాశపరిచారు. ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్ 3, విప్రాజ్, కుల్దీప్ తలో 2, ముకేశ్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు.ఢిల్లీ తరఫున సమీర్ రిజ్వి (58 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడగా.. కరుణ్ నాయర్ (44), కేఎల్ రాహుల్ (35), డుప్లెసిస్ (23), సెదీఖుల్లా అటల్ (22), ట్రిస్టన్ స్టబ్స్ (18 నాటౌట్) కూడా అదే తరహా ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నారు. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ 2, జన్సెన్, ప్రవీణ్ దూబే తలో వికెట్ పడగొట్టారు.In a such a high profile tournament with so much technology at the Third Umpire’s disposal such mistakes are unacceptable & simply shouldn’t happen. I spoke To Karun after the game & he confirmed it was DEFINITELY a 6 ! I rest my case ! #PBKSvsDC #IPL2025 https://t.co/o35yCueuNP— Preity G Zinta (@realpreityzinta) May 24, 2025ప్రీతి జింటా ఆగ్రహం కాగా, ఈ మ్యాచ్‌లో జరిగిన ఓ తప్పిదంపై పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్ ఇన్నింగ్స్ 15వ ఓవర్లో శశాంక్ సింగ్ లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడగా.. బౌండరీ లైన్‌పై కరుణ్ నాయర్ అద్భుతంగా బంతిని అడ్డుకున్నాడు. ఈ క్రమంలో బంతి చేతిలో ఉండగా.. కరుణ్ కాలు బౌండరీ లైన్ టచ్ అయినట్లు స్పష్టంగా కనిపించింది. కరుణ్ కూడా అది సిక్సరే అంటూ సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఫీల్డ్ అంపైర్లు మాత్రం క్లారిటీ లేకపోవడంతో థర్డ్ అంపైర్ సమీక్ష కోరారు. థర్డ్ అంపైర్ క్రిస్ గఫెనే పలు కోణాల్లో రిప్లేలను పరిశీలించి సిక్సర్ కాదని తేల్చాడు. కరుణ్ కాలు బౌండరీ లైన్‌కు తాకినట్లు స్పష్టమైన ఆధారాలు లేవని తెలిపాడు. ఈ ఘటనపై ప్రీతి జింటా ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐపీఎల్ లాంటి హై ప్రొఫైల్ టోర్నమెంట్లో థర్డ్ అంపైర్ వద్ద అత్యుత్తమ టెక్నాలజీ ఉన్నా ఇలాంటి తప్పిదాలు చేయడమేంటని ప్రశ్నించారు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఇలాంటి తప్పిదాలు అస్సలు జరగకూడదని నిరాశ వ్యక్తం చేశారు. ఆట తర్వాత కరుణ్‌తో మాట్లాడానని, అతను కూడా అది ఖచ్చితంగా సిక్సర్ అని ధృవీకరించాడని ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. -
IPL 2025: టాప్-3 జట్లకు షాక్‌లు.. ముంబై ఇండియన్స్‌కు గోల్డెన్ ఛాన్స్
ఐపీఎల్ 2025లో గత మూడు రోజుల్లో సమీకరణలు శరవేగంగా మారిపోయాయి. ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారైనా.. లీగ్ దశ ముగిసే సరికి ఏ జట్లు టాప్-2లో (అదనపు ప్రయోజనం) ఉంటాయో ఇప్పటికీ స్పష్టత రాలేదు. గత మూడు మ్యాచ్‌ల్లో పాయింట్ల పట్టికలో టాప్-3లో ఉన్న జట్లకు (గుజరాత్, పంజాబ్, ఆర్సీబీ) ఆల్రెడీ ఎలిమినేట్ అయిన జట్లు వరుసగా షాకులిచ్చాయి.మే 22న జరిగిన మ్యాచ్‌లో లక్నో గుజరాత్‌కు.. ఆతర్వాతి రోజు జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆర్సీబీకి.. నిన్న (మే 24) జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌కు ఢిల్లీ షాకిచ్చాయి. టాప్-3 జట్లు వరుస మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో నాలుగో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్‌కు ఈ జట్లకు పెద్ద వ్యత్యాసం (పాయింట్ల తేడా) లేకుండా పోయింది.టేబుల్ టాపర్‌గా ఉన్న గుజరాత్ 18, రెండు, మూడు స్థానాల్లో ఉన్న పంజాబ్, ఆర్సీబీ తలో 17 పాయింట్లు, నాలుగో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ 16 పాయింట్లు తమ ఖాతాలో కలిగి ఉన్నాయి. ప్రస్తుతం ప్లే ఆఫ్స్‌కు చేరిన నాలుగు జట్లు తలో మ్యాచ్ మాత్రమే ఆడాల్సి ఉంది. చివరి మ్యాచ్‌లో గెలిచే జట్లు టాప్-2 జట్లుగా ప్లే ఆఫ్స్‌కు చేరతాయి.ముంబై టాప్-2లో ఉండాలంటే..?నాలుగు జట్లతో పోలిస్తే టాప్-2లో ఉండేందుకు ముంబై ఇండియన్స్‌కు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ముంబై తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలిస్తే టాప్-2లో నిలువనుంది. ఆ జట్టు రన్‌రేట్ (1.292) కూడా మిగిలిన జట్లకంటే మెరుగ్గా ఉంది. గుజరాత్ రన్‌రేట్ 0.602గా.. పంజాబ్ రన్‌రేట్ 0.327గా.. ఆర్సీబీ రన్‌రేట్ 0.255గా ఉంది.- పంజాబ్ కింగ్స్‌పై ముంబై విజయం సాధించాలి. అలాగే లక్నో చేతిలో ఆర్సీబీ ఓడిపోవాలి. - సీఎస్కే చేతిలో గుజరాత్ టైటాన్స్, లక్నో చేతిలో ఆర్సీబీ ఓడి.. పంజాబ్‌పై ముంబై విజయం సాధిస్తే ఏకంగా టాప్ ప్లేస్ ఖరారవుతుంది.టాప్-2లో నిలిచేందుకు గుజరాత్ టైటాన్స్‌కు ఉన్న అవకాశాలు..సీఎస్కేతో ఇవాళ (మే 25) జరిగే మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధిస్తే 20 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటుంది. ఓడినా.. మెరుగైన రన్‌రేట్‌తో ఉంటే టాప్-2లో చోటు దక్కుతుంది.గుజరాత్ సీఎస్కే చేతిలో ఓడి.. పంజాబ్, ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఓడిపోయినా గుజరాత్ టాప్-2లో ఉంటుంది. అలా కాకుండా గుజరాత్ సీఎస్కే చేతిలో ఓడి.. ముంబైపై పంజాబ్, లక్నోపై ఆర్సీబీ గెలిస్తే మాత్రం గుజరాత్ ప్లేస్ టాప్-2లో గల్లంతవుతుంది.ఆర్సీబీ టాప్-2లో నిలవాలంటే..లక్నోతో జరిగే తమ ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఆర్సీబీ 19 పాయింట్లతో టాప్-2లో నిలుస్తుంది. ఓడితే మాత్రం టాప్-2 ప్లేస్ గల్లంతవుతుంది.పంజాబ్ కింగ్స్ అవకాశాలు ఇలా..ముంబై ఇండియన్స్‌పై విజయం సాధిస్తే పంజాబ్ కింగ్స్‌కు టాప్-2లో ప్లేస్ ఖరారవుతోంది. అయితే ఆర్సీబీ, గుజరాత్ తమ చివరి మ్యాచ్‌లో ఓడిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆర్సీబీ, గుజరాత్ తమ చివరి మ్యాచ్‌ల్లో గెలిచినా.. ఆర్సీబీ కంటే రన్‌రేట్ మెరుగ్గా ఉంటే టాప్-2 ప్లేస్ దక్కుతుంది. -
IPL 2025: శ్రేయస్ ఖాతాలో చెత్త రికార్డు
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఖాతాలో అనవసర రికార్డు వచ్చి చేరింది. ఐపీఎల్ చరిత్రలో 200 ప్లస్ లక్ష్యాలను డిఫెండ్ చేసుకునే క్రమంలో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న కెప్టెన్‌గా అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు.శ్రేయస్ ఐపీఎల్లో ఇప్పటివరకు నాలుగు 200 ప్లస్ లక్ష్యాలను కాపాడుకోవడంలో విఫలమయ్యాడు. శ్రేయస్ తర్వాత ఈ చెత్త రికార్డును ఎంఎస్ ధోని, ఫాఫ్ డుప్లెసిస్, శుభ్‌మన్ గిల్ సంయుక్తంగా షేర్ చేసుకున్నారు. వీరు ముగ్గురు తలో మూడు సందర్భాల్లో 200 ప్లస్ లక్ష్యాలను కాపాడుకోవడంలో విఫలమయ్యారు.ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 24) ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఎదురైన పరాభవం తర్వాత శ్రేయస్ ఈ చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ సారథ్యం వహించిన పంజాబ్.. 207 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఢిల్లీ మరో 3 బంతులు మిగిలుండగానే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది.శ్రేయస్ సారథ్యంలో 200 ప్లస్ టార్గెట్‌ను నిలువరించుకోలేకపోయిన సందర్భాలు..2024 సీజన్లో రాజస్థాన్ రాయల్స్‌పై 223 పరుగులు (కేకేఆర్ కెప్టెన్‌గా)2024 సీజన్లో పంజాబ్ కింగ్స్‌పై 261 పరుగులు (కేకేఆర్ కెప్టెన్‌గా)2025 సీజన్లో ఎస్ఆర్హెచ్పై 245 పరుగులు (పంజాబ్ కెప్టెన్‌గా)2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 206 పరుగులు (పంజాబ్ కెప్టెన్‌గా)జట్ల విషయానికొస్తే.. 200 ప్లస్ లక్ష్యాలను అత్యధిక సార్లు నిలువరించుకోలేకపోయిన జట్టుగా పంజాబ్ కింగ్స్ అపఖ్యాతిని మూటగట్టుకుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఏడు సందర్భాల్లో 200 ప్లస్ లక్ష్యాలను కాపాడుకోలేకపోయింది. పంజాబ్ తర్వాత ఆర్సీబీ, సీఎస్కే అత్యధిక సార్లు ఈ అపఖ్యాతిని మూటగట్టుకున్నాయి.200 ప్లస్ లక్ష్యాలను అత్యధిక సార్లు కాపాడుకోలేకపోయిన జట్లు..పంజాబ్- 7ఆర్సీబీ- 6సీఎస్కే- 5కేకేఆర్- 4గుజరాత్- 4రాజస్థాన్- 2ఎస్ఆర్హెచ్- 2ఢిల్లీ- 2ఎల్ఎస్జీ- 2నిన్నటి పంజాబ్-ఢిల్లీ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో పంజాబ్ 200 ప్లస్ లక్ష్యాన్ని సెట్ చేసిన కూడా కాపాడుకోలేకపోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (6)ను ముస్తాఫిజుర్ రహ్మాన్ సింగిల్ డిజిట్ స్కోరు వద్ద పెవిలియన్‌కు పంపాడు.అయితే, మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (18 బంతుల్లో 28), జోష్ ఇంగ్లిస్ (12 బంతుల్లో 32) కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఇక శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 34 బంతుల్లో 53 పరుగులు సాధించాడు. కానీ శ్రేయస్ అవుటైన తర్వాత పంజాబ్ ఇన్నింగ్స్ మళ్లీ నెమ్మదిగా సాగింది.నేహాల్ వధేరా (16), శశాంక్ సింగ్ (11) నిరాశపరచగా.. మార్కస్ స్టొయినిస్ మెరుపులతో పంజాబ్ 200 పరుగుల మార్కు దాటింది. స్టొయినిస్ 16 బంతుల్లో 44 పరుగులతో రాణించాడు. ఆఖర్లో హర్‌ప్రీత్ బ్రార్ 2 బంతుల్లో 7 పరుగులతో స్టొయినిస్‌తో కలిసి నాటౌట్‌గా నిలిచాడు.ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్ రహ్మాన్ మూడు వికెట్లు తీయగా.. విప్రాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ముకేశ్ కుమార్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.అనంతరం 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, ఫాఫ్ డుప్లెసిస్ ధాటిగా ఆడటంతో ఐదు ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. అయితే, ఆరో ఓవర్ మూడో బంతికి రాహుల్ (21 బంతుల్లో 35) మార్కో యాన్సెన్ బౌలింగ్‌లో అవుట్ కాగా.. పవర్ ప్లే ముగిసే సరికి ఢిల్లీ వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది.ఆ తర్వాతి ఓవర్లలో డుప్లెసిస్ (15 బంతుల్లో 23) కూడా అవుటయ్యాడు. వన్‌డౌన్ బ్యాటర్ కరుణ్ నాయర్ (27 బంతుల్లో 44) మెరుపులు మెరిపించగా .. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన సెదీకుల్లా అటల్ (22) ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న సమీర్ రిజ్వీ ధనాధన్ దంచికొట్టాడు. 22 బంతుల్లో 50 పరుగులు చేసిన అతడు.. తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.మొత్తంగా 25 బంతుల్లో మూడు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 58 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ 18 పరుగులతో అతడికి తోడుగా నిలిచాడు. ఈ క్రమంలో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ లక్ష్యాన్ని అందుకుంది. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ రెండు, మార్కో యాన్సెన్, ప్రవీణ్ దూబే ఒక్కో వికెట్ తీశారు. కాగా అగ్ర స్థానంపై కన్నేసిన పంజాబ్ ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోనే కొనసాగుతోంది. ప్రస్తుతం 17 పాయింట్లతో ఉన్న పంజాబ్ ఆఖరిదైన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలిస్తేనే టాప్-2లో నిలిచే అవకాశం ఉంటుంది. -
IPL 2025: ఆర్సీబీకి బిగ్ న్యూస్
ఐపీఎల్ 2025లో తమ చివరి లీగ్ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీకి శుభవార్త అందింది. గాయం కారణంగా గత కొద్ది మ్యాచ్‌లకు దూరంగా ఉన్న ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ తిరిగి అందుబాటులోకి వచ్చాడు. హాజిల్‌వుడ్ నిన్న (మే 24) రాత్రి ఆర్సీబీ క్యాంప్‌లో చేరాడు. ఆర్సీబీ మే 27న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు హాజిల్‌వుడ్ అందుబాటులో ఉంటాడు. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ స్థానాన్ని ఖరారు చేయడంలో ఈ మ్యాచ్ అత్యంత కీలకమవుతుంది. లక్నోపై గెలిస్తే ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఏదో ఒక స్థానంలో ముగించవచ్చు.ఐపీఎల్ పాక్షికంగా వాయిదా పడిన తర్వాత హాజిల్‌వుడ్ మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని తొలుత వార్తలు వచ్చాయి. గాయంతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా షెడ్యూలై ఉండటంతో హాజిల్‌వుడ్ అందుబాటులోకి రావడం అసాధ్యమే అని అంతా అనుకున్నారు. He's hereಬಂದ್ಬಿಟ್ಟవచ్చేసాడుவந்துட்டான்वो आगयाവന്നിരിക്കുന്നുWelcome back, Josh Reginald Hazlewood! 🫡❤🔥 pic.twitter.com/pttA5DX3N8— Royal Challengers Bengaluru (@RCBTweets) May 25, 2025అయితే అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ.. హాజిల్‌వుడ్ చివరి లీగ్ మ్యాచ్‌కు (లక్నోతో) ముందే ఆర్సీబీ క్యాంప్‌లో చేరాడు. హాజిల్‌వుడ్ తమ క్యాంప్‌లో చేరిన విషయాన్ని ఆర్సీబీ అధికారికంగా వెల్లడించింది. హాజిల్‌వుడ్ ఈ సీజన్లో 10 మ్యాచ్‌లు ఆడి 18 వికెట్లు తీశాడు. ఈ సీజన్లో ఆర్సీబీ సాధించిన విజయాల్లో అతనిది కీలకపాత్ర. ప్లే ఆఫ్స్‌కు హాజిల్‌వుడ్ అందుబాటులోకి రావడం ఆర్సీబీ శుభపరిమాణం.ఇదిలా ఉంటే, హాజిల్‌వుడ్ లేని లోటు ఆర్సీబీలో కొట్టొచ్చినట్లు కనిపించింది. సన్‌రైజర్స్‌తో తాజాగా (మే 23) జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లు ఏకంగా 231 పరుగులు సమర్పించుకున్నారు. యశ్ దయాల్ 3 ఓవర్లలో 36, భువనేశ్వర్ 4 ఓవర్లలో 43, ఎంగిడి 4 ఓవర్లలో 51, సుయాశ్ శర్మ 3 ఓవర్లలో 45 పరుగులు సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ భారీ లక్ష్య ఛేదనలో తడబడింది. ఫలితంగా 42 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. -
సైనిక వితంతువుల సంక్షేమ నిధికి ప్రీతి జింటా రూ.1.10 కోట్ల విరాళం
జైపూర్: క్రికెట్ జట్టు పంజాబ్ కింగ్స్ సహ యజమాని, సినీ నటి ప్రీతీ జింటా సైనిక వితంతువుల సంక్షేమ నిధి(ఏడబ్ల్యూడబ్ల్యూఏ)కి రూ.1.10 కోట్ల విరాళం ప్రకటించారు. పంజాబ్ కింగ్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్)నిధిలోని జింటా వాటా నుంచి ఈ విరాళాన్ని ఆమె ప్రకటించారు. ఈ మొత్తాన్ని సౌత్ వెస్టర్న్ కమాండ్ ఆర్మీ విభాగంలోని వీర నారీమణుల సాధికారితకు, వారి పిల్లల చదువుల కోసం వెచ్చించనున్నారు. శనివారం జైపూర్‌లో జరిగిన ఏడబ్ల్యూడబ్ల్యూఏ సమావేశంలో ప్రీతీ జింటా ఈ విరాళాన్ని ప్రకటించారు. ‘సాయుధ బలగాల కుటుంబాలకు సాయంగా నిలవడం మన బాధ్యత. మన సైనికులు చేసిన త్యాగాలకు తగు మూల్యం ఎప్పటికీ తిరిగి చెల్లించలేం. కానీ, మనం వారి కుటుంబాలకు అండగా ఉండి ముందుకు సాగడానికి మద్దతునిద్దాం’అని ఆమె పేర్కొన్నారు. -
బ్రాండ్ బాజా విరాట్
పుష్కర కాలం కిందటి మాట. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన చివరి సిరీస్ ఆడుతున్నాడు. ఆ సిరీస్ తొలి టెస్టులో ఒక యువ ఆటగాడు.. ‘ఎంఆర్ఎఫ్’స్టిక్కర్ అంటించి ఉన్న బ్యాట్‌తో తొలిసారి క్రీజ్‌లో వచ్చాడు. అప్పటివరకు భారత అభిమానుల దృష్టిలో ‘ఎంఆర్ఎఫ్’బ్యాట్ అంటే సచిన్‌దే. ఇప్పుడు మరో యువ ప్లేయర్ బ్యాట్‌పై ఫ్యాన్స్ ఆ బ్రాండ్‌ను చూశారు. ఆ కుర్రాడు సచిన్ స్థాయి ఆటను ప్రదర్శించడంలో సఫలమయ్యాడు. అంతే కాదు.. ఆ తరవాత జరిగిన ‘ఎంఆర్ఎఫ్’ఒప్పందం భవిష్యత్తులో వాణిజ్యపరంగా కూడా బ్రాండింగ్ ప్రపంచంలో ఒక సంచలనమైంది. ఆ యువ ఆటగాడే విరాట్ కోహ్లి. నాటితో మొదలుపెట్టి అసంఖ్యాక ఉత్పత్తులకు ప్రచారకర్తగా ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో రెండు ఫార్మాట్లనుంచి తప్పుకున్నా.. బ్రాండింగ్ విలువ ఏమాత్రం తగ్గకపోవడం కోహ్లీ కింగేనని రుజువుచేస్తోంది. స్పోర్ట్స్ వేర్, ఆన్లైన్ షాపింగ్, బ్యాంకింగ్, ఎంటర్టైన్మెంట్, ఎలక్ట్రానిక్స్, సాంప్రదాయ దుస్తులు, ఎడ్యుకేషన్ యాప్, స్నాక్స్, టూరిజం, బెవరేజెస్, న్యూట్రిషన్, ఆటోమొబైల్, భవన నిర్మాణ రంగం... ఇలా విభిన్నమైన రంగాల ఉత్పత్తులకు విరాట్ కోహ్లి ప్రచారం చేస్తూ కనిపిస్తాడు. బ్రాండ్ అంబాసిడర్‌గా ఒప్పందం కుదుర్చుకునే సమయంలో సహజంగానే ఉండే నిబంధనల ప్రకారం ఈ అన్ని ఉత్పత్తులకూ అతను పూర్తి స్థాయిలో ప్రకటనల్లో కనిపించడు. కొన్ని అంతర్జాతీయ బ్రాండ్లకు వాణిజ్య ప్రకటనల్లో నటించడంతో పాటు ఆయా ఉత్పత్తులకు సంబంధించి ప్రచార కార్యక్రమాల్లో సంవత్సరానికి కనీసం 2–3 చోట్ల వ్యక్తిగతంగా పాల్గొనాల్సి ఉంటుంది. మరికొన్నింటిలో సదరు ఉత్పత్తికి సంబంధించి ఒక సంక్షిప్త వ్యాఖ్య మాత్రమే జోడించే స్వల్ప ప్రకటనలో అతను కనిపిస్తాడు. మరికొన్నింటికి సదరు బ్రాండింగ్ మాత్రమే కనిపించే జెర్సీ ధరించి లేదా బ్యాట్ చేతపట్టి ఒక ఫొటో ఇస్తాడు. దాన్నే వారు వాడుకోవాలి. ఇలా స్థాయిని బట్టి కోహ్లి బ్రాండింగ్ రేటు ఉంటుంది. మార్కెట్ అంచనా ప్రకారం అతను ప్రస్తుతం రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. 8 ఏళ్లకు రూ.100 కోట్లు! విరాట్ కోహ్లి కెరీర్లో 2014 నుంచి 2019ని అత్యుత్తమ దశగా చెప్పొచ్చు. వరుస రికార్డుల ప్రదర్శనతో అతని స్థాయి ఎంతో పెరగడంతో పాటు వాణిజ్యపరంగా కూడా అతని విలువ శిఖరాగ్ర స్థాయికి చేరింది. అందుకే మొదటిసారి ఎంఆర్ఎఫ్ చేసుకున్న ఒప్పందంతో పోలిస్తే తర్వాత చాలా పెద్ద మొత్తం ఆఫర్ చేసింది. 2017లో ఎనిమిదేళ్ల కాలానికి రూ.100 కోట్లతో కాంట్రాక్ట్ కుదుర్చుకోవడం అప్పట్లో సంచలనం. మరోవైపు అదే సమయంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ బ్రాండ్ ‘ప్యూమా’తో బ్రాండింగ్ ఒప్పందం అతని కెరీర్లో మరో పెద్ద రికార్డు. ‘ప్యూమా’కూడా ఎనిమిదేళ్లకు రూ.100 కోట్లతో జత కట్టడం విశేషం. ‘ప్యూమా’తో కలిసి భాగస్వామ్యంతో కోహ్లి తన సొంత బ్రాండ్‌ను కూడా సృష్టించుకున్నాడు. తన జెర్సీ నంబర్ 18ని గుర్తుచేసేలా ‘వన్ 8’పేరుతో మార్కెట్లోకి వచ్చిన దుస్తులకు మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం కోహ్లి దాదాపు 30 ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండగా.. మరో 10 రకాల వ్యాపారాల్లో అతని భాగస్వామ్యం లేదా అతని పేరు ఉన్నాయి. స్టార్టప్‌లలో పెట్టుబడులుముఖ్యంగా స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టడంలో కోహ్లీ మొదటి నుంచి ఆసక్తి కనబరిచేవాడు. స్పోర్ట్స్ కాన్వో, డిజిట్ ఇన్సూరెన్స్, రేజ్ కాఫీ, వన్8 వంటి స్పోర్ట్స్, ఫ్యాషన్, ఆహారం, పానీయాల విభాగాల్లో ఎన్నో స్టార్టప్‌లలో విరాట్ పెట్టుబడులు పెట్టాడు. ఐపీఎల్ టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 17 సీజన్లలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. కానీ ఆ టీమ్‌కు ఉండే విలువ మొత్తం ఒక్క కోహ్లి వల్లనే వచ్చిందనడంలో అతిశయోక్తి లేదు. లీగ్ మొదలైన 2008 నుంచి ఇప్పటి వరకు జట్టు మారని ఒకే ఒక్క ఆటగాడిగా నిలిచిన కోహ్లిని చూపిస్తూనే టీమ్ బ్రాండింగ్ సాగుతుంది. ఇందులో తన వ్యక్తిగత ప్రకటనకర్తలను కూడా చేరుస్తూ అతను ఆ టీమ్ వాణిజ్య అంశాలను కూడా శాసిస్తున్నాడు. మరి కోహ్లి విలువ పడిపోతుందా? కోహ్లీ టెస్టులనుంచి రిటైర్ కావడం అతడి బ్రాండ్ మార్కెట్ మీద ఏమాత్రం ప్రభావం చూపదని మార్కెటింగ్ వ్యూహకర్త దినేశ్ అరోరా అంటున్నారు. ‘బ్రాండింగ్ ప్రపంచంలో కోహ్లి ఒక సామ్రాజ్యం నెలకొల్పాడు. అది అంత తొందరగా కనుమరుగు కాదు. దానికి పలు కారణాలున్నాయి. కోహ్లి తన అత్యుత్తమ ఫార్మాట్ అయిన వన్డేల్లో కనిపిస్తాడు. ఐపీఎల్లో ఒప్పందం ప్రకారం ఎలాగూ కనీసం 2027 సీజన్ వరకు అవకాశం ఉంది. పైగా అతను మైదానంలో ఎక్కువగా కనపడకున్నా ఇప్పటికిప్పుడు ఫ్యాన్స్ మరిచిపోయే స్థాయి కాదు అతనిది. సచిన్, ధోని రిటైర్మెంట్ తర్వాత కూడా పలు ప్రకటనల్లో ఇంకా కనిపిస్తున్నారు. వారితో పోలిస్తే కోహ్లి బ్రాండింగ్ విలువ చాలా ఎక్కువ. కార్పొరేట్ సంస్థలు అతనిపై మున్ముందూ నమ్మకాన్ని కొనసాగిస్తాయి’అని ఆయన చెప్పారు.బాలీవుడ్ స్టార్లను దాటి... ప్రఖ్యాత బ్రాండింగ్ వాల్యుయేషన్ సంస్థ ‘క్రోల్’ప్రకారం విరాట్ ప్రస్తుత బ్రాండింగ్ విలువ అక్షరాలా రూ.1900 కోట్లు. 2016 నుంచి 2023 వరకు చూస్తే ఎనిమిదేళ్లలో.. రెండు సార్లు మినహా ప్రతీ ఏటా అతను బ్రాండింగ్ విలువ పరంగా భారత సెలబ్రిటీల్లో అగ్రస్థానంలోనే ఉన్నాడు. గతేడాది కూడా బాలీవుడ్ స్టార్లు షారుఖ్ ఖాన్, రణ్వీర్ సింగ్లకంటే కూడా కోహ్లి విలువే ఎక్కువగా ఉండటం విశేషం. ఇప్పుడు అతను అంతర్జాతీయ క్రికెట్లో టి20లు, టెస్టుల నుంచి తప్పుకొన్నాడు. ఇకపై వన్డేలు మాత్రమే ఆడనున్నాడు. టీవీల్లో అతను కనిపించడం కాస్త తగ్గుతుంది. ఇన్‌స్ట్రగామ్‌లో పోస్టుకు రూ.10 కోట్లు ఇన్‌స్ట్రగామ్‌లో 27 కోట్ల ఫాలోవర్లు ఉన్న కోహ్లి తన ఒక్కో కమర్షియల్ పోస్టుకు దాదాపు రూ.10 కోట్లు తీసుకుంటాడని సమాచారం. అతను ఒక మాట చెబితే చాలు కోట్లాది మందికి చేరుతుంది కాబట్టి ఆ మొత్తం చెల్లించేందుకు ఎవరూ వెనుకాడరు. విరాట్ ప్రచారకర్తగా ఉన్న సంస్థలు ప్యూమా, మింత్రా, హెచ్ఎస్బీసీ, నాయిస్, మొబైల్ ప్రీమియర్ లీగ్, బ్లూ స్టార్, ఆడి ఇండియా, మాన్యవర్, టూత్సి, గ్రేట్ లెరి్నంగ్, లక్సర్, వొలిని, వెల్మాన్, వివో, డ్యూరోఫ్లెక్స్, అమెరికన్ టూరిస్టర్, ఆవాస్ లివింగ్, ఎంఆర్ఎఫ్, ఎసిలార్, లివ్‌స్పేస్, హెర్బలైఫ్, హీరో మోటార్స్ కోహ్లి భాగస్వామిగా ఉన్నవీ.. సొంత కంపెనీలు బ్లూ ట్రైబ్, రేజ్ కాఫీ, వన్8, హైపర్ఐస్, చిసెల్ ఫిట్నెస్, డిజిట్ ఇన్సూరెన్స్, రాంగ్ క్లాతింగ్, గ్యాలక్టస్ ఫన్‌వేర్, ఐఎస్ఎల్ టీమ్ గోవా ఎఫ్‌సీ, నూవా రెస్టారెంట్, స్పోర్ట్స్ కాన్వో, టీమ్ బ్లూ రైసింగ్, వన్8 కమ్యూన్ రెస్టారెంట్స్ చైన్, యూనివర్సల్ స్పోర్ట్స్ బిజినెస్ -
సీకే నాయుడు నుంచి శుబ్‌మన్ గిల్ వరకు...
అంచనాలకు అనుగుణంగానే యువ ఆటగాడు శుబ్‌మన్‌గిల్ భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వచ్చే నెలలో జరగనున్న ఇంగ్లండ్ పర్యటన కోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ శనివారం... గిల్ సారథ్యంలో 18 మందితో కూడిన జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడంతో... భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 25 ఏళ్ల గిల్‌ను ఎంపిక చేసింది. సీకే నాయుడు భారత తొలి టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించగా... ఇప్పుడు గిల్ 37వ కెప్టెన్ కానున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు భారత టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహించిన ప్లేయర్ల జాబితా... -
జొకోవిచ్ 100 నాటౌట్
జెనీవా: టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) వందో సింగిల్స్ టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు. జెనీవా ఓపెన్‌లో చాంపియన్‌గా నిలవడం ద్వారా జొకో ఈ ఘనత సాధించాడు. తద్వారా ఓపెన్ ఎరాలో 100 సింగిల్స్ టైటిల్స్ సాధించిన మూడో ప్లేయర్‌గా జొకోవిచ్ రికార్డుల్లోకి ఎక్కాడు. జిమ్మి కానర్స్ (109; అమెరికా), రోజర్ ఫెదరర్ (103; స్విట్జర్లాండ్) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ జొకోవిచ్ 5–7, 7–6 (7/2), 7–6 (7/2)తో హబర్ట్ హుర్కాజ్ (పోలాండ్)పై విజయం సాధించాడు. తొలి సెట్లో పరాజయం పాలైన జొకో... హోరాహోరీగా సాగిన మిగిలిన రెండు సెట్లను టై బ్రేకర్ ద్వారా గెలుచుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో హుర్కాజ్ 19 ఏస్‌లు సంధించగా... జొకోవిచ్ 6 ఏస్‌లకే పరిమితమైనా కీలక సమయాల్లో పాయింట్లు కొల్లగొట్టాడు. హుర్కాజ్ 112 పాయింట్లు నెగ్గగా... జొకో 121 పాయింట్లు సాధించాడు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో 99వ టైటిల్ ఖాతాలో వేసుకున్న జొకోవిచ్... ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభానికి ముందు ‘సెంచరీ’ పూర్తి చేసుకున్నాడు. పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన అనంతరం జొకో... షాంఘై మాస్టర్స్, మియామి మాస్టర్స్ టోర్నమెంట్ ఫైనల్స్‌కు చేరినా టైటిల్ గెలవలేకపోయాడు. ‘వందో టైటిల్ నెగ్గడం చాలా ఆనందంగా ఉంది. ఈ క్షణం కోసం ఎతో కష్టపడ్డా. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నా. హబర్ట్ సర్వీస్‌ను బ్రేక్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. అయినా ప్రయత్నించి సఫలమయ్యా’ అని జొకో అన్నాడు. 2006లో తొలి టైటిల్ నెగ్గిన జొకోవిచ్... 19 ఏళ్ల కెరీర్లో మూడంకెల సంఖ్యకు చేరుకున్నాడు. ఈ క్రమంలో ఓపెన్ ఎరాలో 20 వేర్వేరు సీజన్లలో టైటిల్స్ నెగ్గిన తొలి ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. ఇప్పటికే 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఖాతాలో వేసుకున్న జొకోవిచ్... నేటి నుంచి ప్రారంభం కానున్న ఫ్రెంచ్ ఓపెన్‌లో మరోసారి విజేతగా నిలిచేందుకు కసరత్తు చేస్తున్నాడు. మట్టి కోర్టులో జరగనున్న ఈ టోర్నీ తొలి రౌండ్లో సోమవారం మెకెంజీ మెక్‌డొనాల్డ్ (అమెరికా)తో జొకోవిచ్ తలపడనున్నాడు. -
మరో టైటిల్ వేటలో... అల్కరాజ్
పారిస్: సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌కు నేడు తెర లేవనుంది. గతేడాది ఒలింపిక్స్‌లో తలపడిన టెన్నిస్ సూపర్ స్టార్లందరూ మళ్లీ పారిస్‌లో పోరాడేందుకు వచ్చేశారు. క్లే కోర్టులో సత్తా చాటేందుకు సై అంటున్నారు. డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్) ట్రోఫీని నిలబెట్టుకునే పనిలో ఉంటే... ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ) టైటిల్ సాధించేందుకు వచ్చాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌తో సత్తా చాటుకున్న సినెర్ డోపింగ్ మరకను దాటేశాడు. ఇప్పుడిక్కడ ప్రెంచ్ ముచ్చట తీర్చుకోవాలని అనుకుంటున్నాడు. వీరిద్దరితో పాటు టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ కూడా 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం కాచుకున్నాడు. దీనికోసం రెండేళ్లుగా పెద్ద పోరాటమే చేస్తున్నాడు. ఈ సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో సెమీస్ చేరిన నొవాక్ రోలండ్ గారోస్‌లో చివరిసారిగా 2023లో టైటిల్ గెలిచాడు. ఆ ఏడాది వింబుల్డన్ (రన్నరప్) తప్ప మూడు టైటిళ్లను కైవసం చేసుకున్న జొకోవిచ్‌కు గత సీజన్ తీవ్ర నిరాశను మిగిల్చింది.ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయాడు. దీంతో ‘గ్రాండ్‌స్లామ్ రజతోత్సవం’ కోసం ఈ ఫ్రెంచ్ ఓపెన్‌లో సెర్బియన్ స్టార్ గంపెడాశలతో బరిలోకి దిగుతున్నాడు. సరిగ్గా తొమ్మిది నెలల క్రితం ఇక్కడే ఒలింపిక్స్‌లో చాంపియన్‌గా నిలిచిన జొకోకు మళ్లీ కాలం కలిసొస్తే ‘గ్రాండ్–25’ సాకారం అవుతుంది. తొలి రౌండ్లలో నిరుటి విజేత అల్కరాజ్... క్వాలిఫయర్ గులియో జెప్పియెరి (ఇటలీ)తో, సినెర్... రిండెర్క్నెచ్ (ఫ్రాన్స్)తో, ఆరో సీడ్ జొకోవిచ్... షెవ్చెంకో (కజకిస్తాన్)తో ఫ్రెంచ్ సమరాన్ని ప్రారంభించనున్నారు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత నాదల్ లేని క్లేకోర్ట్ ఈవెంట్ జరగబోతోంది. 2005 నుంచి 2024 వరకు పోటీపడిన స్పెయిన్ దిగ్గజం 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లలో 14 ఫ్రెంచ్ ఓపెన్లోనే సాధించడం విశేషం. సబలెంక, స్వియాటెక్లే ఫేవరెట్లు మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ అరియాన సబలెంక (బెలారస్), స్వియాటెక్ (పోలండ్)లు టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు. గతేడాది ఆస్ట్రేలియన్, యూఎస్ ఓపెన్లు గెలిచిన సబలెంకకు ఈ ఏడాది ఆరంభ గ్రాండ్‌స్లామ్‌లో టైటిల్ పోరులో చుక్కెదురైంది. ఇప్పుడు టైటిల్ గెలిచేదాకా నిలకడైన ఆటతీరును కనబరచాలనే లక్ష్యంతో ప్రపంచ నంబర్‌వన్ సబలెంక బరిలోకి దిగుతోంది. మరోవైపు ‘క్లేకోర్టు రాణి’గా ఎదిగిన స్వియాటెక్ రోలండ్ గారోస్‌లో ఐదో టైటిల్‌పై కన్నేసింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆమె హ్యాట్రిక్ సహా నాలుగు (2020, 2022, 2023, 2024) ట్రోఫీలు సాధించింది. తొలి రౌండ్ పోటీల్లో రష్యన్ అన్‌సీడెడ్ రకిమొవాతో సబలెంక... రెబెక్కా స్రాంకొవా (స్లొవేకియా)తో స్వియాటెక్ పోటీపడనున్నారు. గత యూఎస్ ఓపెన్ రన్నరప్, మూడో సీడ్ జెస్సికా పెగులా (అమెరికా)... రొమేనియన్ ప్లేయర్ అన్క టొడోనితో, ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్ మాడిసన్ కీస్ (అమెరికా) క్వాలిఫయర్ డెరియా సవిల్లే (ఆస్ట్రేలియా)తో... రెండో సీడ్ కొకొ గాఫ్ (అమెరికా) అన్‌సీడెడ్ ఒలీవియా గడెకి (ఆ్రస్టేలియా)తో తలపడతారు. -
నోరిస్‌కు పోల్ పొజిషన్
మొనాకో: ఫార్ములా వన్ సీజన్ తొమ్మిదో రేసు మొనాకో గ్రాండ్ ప్రిలో మెక్లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ పోల్ పొజిషన్ సాధించాడు. ఈ క్రమంలో నోరిస్ ట్రాక్ రికార్డును తిరగరాశాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ ఈవెంట్లో నోరిస్ 1 నిమిషం 9.954 సెకన్లలో ల్యాప్‌ను పూర్తిచేసి అగ్రస్థానంలో నిలిచాడు. 2019లో లూయిస్ హామిల్టన్ టైమింగ్‌ను తాజాగా నోరిస్ అధిగమించాడు. ఈ సీజన్ ఆరంభ ఆ్రస్టేలియా గ్రాండ్ ప్రి తర్వాత నోరిస్‌కు ఇదే తొలి పోల్ పొజిషన్. ఆదివారం జరగనున్న ప్రధాన రేసును అతడు తొలి స్థానం నుంచి ప్రారంభించనున్నాడు.గతేడాది ఈ రేసులో విజేతగా నిలిచిన స్థానిక డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ (1 నిమిషం 10.063 సెకన్లు; ఫెరారీ) రెండో స్థానం దక్కించుకోగా... మెక్లారెన్ జట్టుకే చెందిన ఆస్కార్ పియాస్ట్రి (1 నిమిషం 10.063 సెకన్లు) మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది అంతగా ఆకట్టుకోలేకపోయిన ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (1 నిమిషం 10.382 సెకన్లు) నాలుగో స్థానంలో నిలవగా... డిఫెండింగ్ చాంపియన్, రెడ్‌బుల్ రేసర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ (1 నిమిషం 10.669 సెకన్లు) ఐదో ప్లేస్ దక్కించుకున్నాడు. ఈ సీజన్లో మెక్లారెన్ డ్రైవర్ల జోరు సాగుతుండగా... ఎనిమిది రేసులు ముగిసేసరికి డ్రైవర్స్ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో పియాస్ట్రి 146 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. లాండోనోరిస్ 133 పాయింట్లతో రెండో ప్లేస్‌లో కొనసాగుతుండగా... నాలుగు సార్లు ప్రపంచ చాంపియన్ వెర్స్టాపెన్ (124 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నాడు. -
ఇంగ్లండ్ ఘన విజయం
నాటింగ్‌హామ్: టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు సొంతగడ్డపై ఇంగ్లండ్ క్రికెట్ జట్టు అదరగొట్టింది. జింబాబ్వేతో 22 ఏళ్ల తర్వాత ఆడిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్, 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు రోజుల్లోనే ముగిసిన ఈ నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో ఇంగ్లండ్ సంపూర్ణ ఆధిపత్యం కనబర్చగా... జింబాబ్వే ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఓవర్‌నైట్ స్కోరు 30/2తో శనివారం మూడో రోజు ఫాలోఆన్‌లో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన జింబాబ్వే చివరకు 59 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌటైంది. సీన్ విలియమ్స్ (82 బంతుల్లో 88; 16 ఫోర్లు), సికందర్ రజా (68 బంతుల్లో 60; 10 ఫోర్లు) అర్ధ శతకాలతో పోరాడారు. ఈ జంట బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మెరుగ్గా కనిపించిన జింబాబ్వే... ఇన్నింగ్స్ పరాజయం తప్పించుకునేలా అనిపించినా... ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఈ ఇద్దరినీ పెవిలియన్‌కు పంపి జింబాబ్వే ఆశలపై నీళ్లు చల్లాడు. ఈ జంట మూడో వికెట్‌కు 122 పరుగులు జోడించింది. బెన్ కరన్ (37), వెస్లీ మధెవెరె (31) ఫర్వాలేదనిపించగా... కెప్టెన్ ఇర్విన్ (2), బెనెట్ (1), తఫద్జా (4), బ్లెస్సింగ్ ముజర్బానీ (4) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బషీర్ 6 వికెట్లతో సత్తా చాటాడు. అంతకు ముందు ఇంగ్లండ్ 565/6 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా... జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 265 పరుగులకే ఆలౌటై ఫాలోఆన్‌లో పడింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు తీసిన బషీర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. -
శ్రీకాంత్ ఎట్టకేలకు ఫైనల్‌కు...
కౌలాలంపూర్: భారత సీనియర్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ నాలుగేళ్ల తర్వాత టైటిల్ పోరుకు అర్హత సంపాదించాడు. మలేసియా మాస్టర్స్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో శ్రీకాంత్ 21–18, 24–22తో ప్రపంచ 23వ ర్యాంకర్ యుషి తనాకా (జపాన్)పై తుదికంటా పోరాడి గెలిచాడు. ప్రతీ గేమ్‌లోనూ జపనీస్ ప్రత్యర్థి నుంచి కఠినమైన సవాళ్లు ఎదురైనా... ఏ దశలోనూ పట్టుసడలించని భారత స్టార్ వరుస గేముల్లోనే మ్యాచ్‌ను ముగించాడు. ‘చాలా అనందంగా ఉంది. గతేడాది ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. ఈ ఫలితం కోసం ఎంతగానో శ్రమించాను’ అని శ్రీకాంత్ అన్నాడు. 32 ఏళ్ల ఈ షట్లర్ చివరిసారిగా 2021లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరి రజతంతో సరిపెట్టుకున్నాడు. అయితే బీడబ్ల్యూఎఫ్ టూర్ టోర్నీల విషయానికొస్తే అతను ఆరేళ్ల తర్వాత టైటిల్ పోరుకు అర్హత సాధించినట్లయింది. 2019లో జరిగిన ఇండియా ఓపెన్‌లో ఆంధ్రప్రదేశ్ వెటరన్ స్టార్ రన్నరప్‌గా నిలిచాడు. నేడు జరిగే ఫైనల్లో ప్రపంచ 65వ ర్యాంకర్ శ్రీకాంత్ చైనాకు చెందిన రెండో సీడ్ లీ షి ఫెంగ్‌తో తలపడతాడు. -
‘శుబ్’ సమయం మొదలు
భారత టెస్టు క్రికెట్‌కు కొత్త నాయకుడు వచ్చాడు...నాలుగున్నరేళ్ల కెరీర్ అనుభవం ఉన్న శుబ్‌మన్ గిల్ టీమిండియా టెస్టు సారథిగా ఎంపికయ్యాడు... 93 ఏళ్ల భారత టెస్టు చరిత్రలో 37వ సారథిగా గిల్ బాధ్యతలు చేపడుతున్నాడు...గత కొంత కాలంగా చర్చ సాగినట్లుగా ఎలాంటి అనూహ్య నిర్ణయాలు లేకుండా సెలక్టర్లు 25 ఏళ్ల గిల్‌కే మద్దతు పలికారు... ఇంగ్లండ్ పర్యటనలో అతను తొలిసారి టెస్టు జట్టును నడిపించనున్నాడు. టెస్టు జట్టులో సాయిసుదర్శన్, అర్ష్ దీప్ లకు తొలి అవకాశం లభించగా...ఎనిమిదేళ్ల తర్వాత కరుణ్ నాయర్ మళ్లీ టీమ్‌లోకి రావడం విశేషం. ముంబై: ఇంగ్లండ్‌తో గడ్డపై జరిగే ఐదు టెస్టుల సిరీస్ కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. 18 మంది సభ్యుల ఈ బృందానికి శుబ్‌మన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు వైస్ కెప్టెన్సీ దక్కింది. ఆసీస్‌తో సిరీస్‌లో బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించినా...అతని ఫిట్నెస్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని కెప్టెన్సీ కోసం బుమ్రా పేరును పరిశీలించలేదు. కోహ్లి, రోహిత్, అశ్విన్‌ల శకం ముగిసిన తర్వాత భవిష్యత్తు కోసం టీమ్‌ను సిద్ధం చేసే కోణంలో జట్టు ఎంపిక జరిగింది. 2025–27 వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్ పాల్గొనే తొలి సిరీస్ ఇదే కానుంది. భారత జట్టు చివరిసారిగా ఆ్రస్టేలియాలో ఆడిన టెస్టు సిరీస్‌తో పోలిస్తే జట్టులో ఐదు మార్పులు జరిగాయి. కోహ్లి, రోహిత్, అశ్విన్ రిటైర్ కాగా...రెండు టెస్టులు ఆడిన పేసర్ హర్షిత్ రాణా, ఒక్క మ్యాచ్ కూడా ఆడని బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ స్థానం కోల్పోయారు. వీరి స్థానాల్లో కరుణ్ నాయర్, సాయిసుదర్శన్, అర్ష్ దీప్ సింగ్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చారు. ఎనిమిదేళ్ల తర్వాత... 33 ఏళ్ల కరుణ్ నాయర్ తన కెరీర్లో 6 టెస్టులు ఆడాడు. తన మూడో టెస్టులో ఇంగ్లండ్‌పై 303 పరుగులు చేసి అజేయంగా నిలిచిన అతను...సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అయితే ఆ తర్వాత మరో 3 టెస్టులు మాత్రమే ఆడి జట్టులో 2017లో జట్టులో స్థానం కోల్పోయాడు. ఈ సీజన్ రంజీ ట్రోఫీలో 9 మ్యాచ్‌లలో 863 పరుగులు సాధించి రేసులోకి వచ్చాడు. కోహ్లి రిటైర్మెంట్తో మిడిలార్డర్లో ఖాళీ ఏర్పడి మరో అవకాశం లభించింది. దేశవాళీ క్రికెట్లో, భారత్ ‘ఎ’ తరఫున టన్నుల కొద్దీ పరుగులు చేసి అభిమన్యు ఈశ్వరన్‌కు మరోసారి పిలుపు లభించింది. ఇక ఇప్పటికీ వన్డేలు, టి20లు ఆడిన పేసర్ అర్ష్ దీప్ సింగ్, సాయి సుదర్శన్‌కు టెస్టుల్లో ఇదే తొలి అవకాశం. షమీ అవుట్... సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీకి ఊహించినట్లుగానే చోటు దక్కలేదు. గాయం నుంచి కోలుకున్న తర్వాత వన్డేలు, టి20లు ఆడినా...టెస్టు మ్యాచ్‌లకు తగిన స్థాయిలో అతని ఫిట్నెస్ లేదని సెలక్టర్లు తేల్చారు. కివీస్‌తో సిరీస్‌లో చివరి రెండు టెస్టుల్లో విఫలమై మళ్లీ మ్యాచ్ అవకాశం దక్కని సర్ఫరాజ్ ఖాన్‌ను కూడా పక్కన పెట్టారు. ఆసీస్ గడ్డపై రెండు టెస్టులు ఆడిన హర్షిత్ రాణాను కూడా ఎంపిక చేయలేదు. ‘కోహ్లి, రోహిత్, అశ్విన్‌లాంటి ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేయడం కష్టం. అయితే కొత్తగా జట్టులోకి వచ్చే వారికి తమ సత్తా చాటేందుకు ఇది మంచి అవకాశం. ఫిట్నెస్ సమస్యల కారణంగా బుమ్రా అన్నీ టెస్టులూ ఆడతాడనే నమ్మకం లేదు. అందుకే కెప్టెన్సీ భారం లేకుండా అతను బౌలర్‌గా మాకు అందుబాటులో ఉంటే చాలు. ఈ విషయాన్ని బుమ్రా కూడా అర్థం చేసుకున్నాడు. గిల్లో మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న విషయాన్ని గమనించాం. చాలా మంది అభిప్రాయాలు కూడా విన్నాం. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొనే కెప్టెన్, జట్టును ఎంపిక చేశాం. ప్రస్తుత స్థితిలో సర్ఫరాజ్‌తో పోలిస్తే అనుభవజ్ఞుడైన కరుణ్ సరైనవాడు అనిపించింది’ అని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వ్యాఖ్యానించారు. భారత జట్టు వివరాలు గిల్ (కెప్టెన్ ), పంత్ (వైస్ కెప్టెన్ ), జైస్వాల్, రాహుల్, జురేల్, జడేజా, కుల్దీప్, బుమ్రా, సిరాజ్, ఆకాశ్‌దీప్, ప్రసిధ్, సుదర్శన్, ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, సుందర్, శార్దుల్, అర్ష్ దీప్ భారత జట్టు విజేతగా నిలిచిన 2020–21 బోర్డర్ గావస్కర్ ట్రోఫీతో శుబ్‌మన్ గిల్ టెస్టుల్లోకి అడుగు పెట్టాడు. 91 పరుగులతో చారిత్రాత్మక గాబా టెస్టు విజయంలో అతను కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత టెస్టు టీమ్‌లో గిల్ రెగ్యులర్ సభ్యుడిగా మారాడు. భారత జట్టు ఆడిన రెండు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్‌లలో గిల్ ఆడాడు. 32 టెస్టుల కెరీర్లో గిల్ 35.05 సగటుతో 1893 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 7 అర్ధ సెంచరీలు ఉన్నాయి.స్వదేశంలో ప్రదర్శనతో పోలిస్తే విదేశీ గడ్డపై అతని రికార్డు పేలవంగా ఉన్నా...మంచి ప్రతిభావంతుడైన బ్యాటర్‌గా మున్ముందు సత్తా చాటగలడని సెలక్టర్లు నమ్ముతున్నారు. భారత అండర్–19 జట్టు తరఫున ఆడినా అతను కెపె్టన్‌గా ఎప్పుడు వ్యవహరించలేదు. రంజీ ట్రోఫీలో కూడా పంజాబ్‌కు ఒకే ఒక మ్యాచ్‌లో సారథ్యం వహించాడు. అయితే భారత్‌కు 5 టి20 మ్యాచ్‌లలో కెప్టెన్ గా పని చేసిన అనుభవం గిల్‌కు ఉంది. రెండు సీజన్లుగా ఐపీఎల్లో గుజరాత్ జట్టును నడిపిస్తున్నాడు. -
విజయంతో ముగించిన ఢిల్లీ
జైపూర్: ఈ ఐపీఎల్లో ప్లేఆఫ్స్ చెరిన జట్లను ఇంటికెళ్లే జట్లు గట్టి దెబ్బే కొడుతున్నాయి. తాజాగా పట్టికలో ‘టాప్’పై గురిపెట్టిన పంజాబ్ కింగ్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్లతో గెలిచి షాకిచ్చింది. తద్వారా ఢిల్లీ ఘన విజయంతో ఈ సీజన్‌ను ముగించింది. తొలుత పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోరు చేసింది. కెపె్టన్ శ్రేయస్ అయ్యర్ (34 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. ఆరంభంలో ఇన్‌గ్లిస్ (12 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆఖర్లో స్టొయినిస్ (16 బంతుల్లో 44 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) దంచేశారు. అనంతరం ఢిల్లీ 19.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 208 పరుగులు చేసి గెలిచింది. కరుణ్ నాయర్ (27 బంతుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), మెరిపిస్తే... సమీర్ రిజ్వీ (25 బంతుల్లో 58 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) గెలిచేదాకా నిలిచాడు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ఆర్య (సి) స్టబ్స్ (బి) ముస్తాఫిజుర్ 6; ప్రభ్‌సిమ్రన్ (బి) విప్రాజ్ 28; ఇన్‌గ్లిస్ (స్టంప్డ్) స్టబ్స్ (బి) విప్రాజ్ 32; శ్రేయస్ (సి) మోహిత్ (బి) కుల్దీప్ 53; నేహల్ (సి) డుప్లెసిస్ (బి) ముకేశ్ 16; శశాంక్ (సి) స్టబ్స్ (బి) ముస్తాఫిజుర్ 11; స్టొయినిస్ నాటౌట్ 44; అజ్మతుల్లా (సి) సమీర్ (బి) కుల్దీప్ 1; యాన్సెన్ (సి) స్టబ్స్ (బి) ముస్తాఫిజుర్ 0; హర్‌ప్రీత్ నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 206. వికెట్ల పతనం: 1–8, 2–55, 3–77, 4–118, 5–144, 6–172, 7–174, 8–197. బౌలింగ్: ముకేశ్ 4–0–49–1, ముస్తాఫిజుర్ 4–0–33–3, మోహిత్ శర్మ 4–0–47–0, విప్రాజ్ నిగమ్ 4–0–38–2, కుల్దీప్ 4–0–39–2. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) శశాంక్ (బి) యాన్సెన్ 35; డుప్లెసిస్ (సి) ప్రియాన్ష్(బి) హర్‌ప్రీత్ 23; కరుణ్ (బి) హర్‌ప్రీత్ 44; సాదికుల్లా (సి) అర్‡్షదీప్ (బి) ప్రవీణ్ 22; రిజ్వీ నాటౌట్ 58; స్టబ్స్ నాటౌట్ 18; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19.3 ఓవర్లలో 4 వికెట్లకు) 208. వికెట్ల పతనం: 1–55, 2–65, 3–93, 4–155. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–35–0, అజ్మతుల్లా 4–0–46–0, హర్‌ప్రీత్ 4–0–41–2, యాన్సెన్ 4–0–41–1, ప్రవీణ్ 2–0–20–1, స్టొయినిస్ 1.3–0–21–0. ఐపీఎల్లో నేడుగుజరాత్ X చెన్నైవేదిక: అహ్మదాబాద్మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి కోల్‌కతా X హైదరాబాద్ వేదిక: ఢిల్లీరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
సమీర్ రిజ్వీ మెరుపులు.. పంజాబ్‌పై ఢిల్లీ ఘన విజయం
ఐపీఎల్-2025 సీజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో ముగించింది. పంజాబ్ కింగ్స్‌తో శనివారం నాటి మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. పంజాబ్ విధించిన 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, ఫాఫ్ డుప్లెసిస్ ధాటిగా ఆడటంతో ఐదు ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. అయితే, ఆరో ఓవర్ మూడో బంతికి రాహుల్ (21 బంతుల్లో 35) మార్కో యాన్సెన్ బౌలింగ్‌లో అవుట్ కాగా.. పవర్ ప్లే ముగిసే సరికి ఢిల్లీ వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది.ఆ తర్వాతి ఓవర్లలో డుప్లెసిస్ (15 బంతుల్లో 23) కూడా అవుటయ్యాడు. వన్‌డౌన్ బ్యాటర్ కరుణ్ నాయర్ (27 బంతుల్లో 44) మెరుపులు మెరిపించగా .. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన సెదీకుల్లా అటల్ (22) ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న సమీర్ రిజ్వీ ధనాధన్ దంచికొట్టాడు. 22 బంతుల్లో 50 పరుగులు చేసిన అతడు.. తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.మొత్తంగా 25 బంతుల్లో మూడు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 58 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ 18 పరుగులతో అతడికి తోడుగా నిలిచాడు. ఈ క్రమంలో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ లక్ష్యాన్ని అందుకుంది. ఇక పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ రెండు, మార్కో యాన్సెన్, ప్రవీణ్ దూబే ఒక్కో వికెట్ తీశారు. కాగా అగ్ర స్థానంపై కన్నేసిన పంజాబ్ ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోనే కొనసాగుతోంది. ప్రస్తుతం 17 పాయింట్లతో ఉన్న పంజాబ్ ఆఖరిదైన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలిస్తేనే టాప్-2లో నిలిచే అవకాశం ఉంటుంది. శ్రేయస్ ఫిఫ్టీ, స్టొయినిస్ మెరుపులుఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. జైపూర్ వేదికగా శనివారం నాటి ఈ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (6)ను ముస్తాఫిజుర్ రహ్మాన్ సింగిల్ డిజిట్ స్కోరు వద్ద పెవిలియన్‌కు పంపాడు.అయితే, మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (18 బంతుల్లో 28), జోష్ ఇంగ్లిస్ (12 బంతుల్లో 32) కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఇక శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 34 బంతుల్లో 53 పరుగులు సాధించాడు. కానీ శ్రేయస్ అవుటైన తర్వాత పంజాబ్ ఇన్నింగ్స్ మళ్లీ నెమ్మదిగా సాగింది.నేహాల్ వధేరా (16), శశాంక్ సింగ్ (11) నిరాశపరచగా.. మార్కస్ స్టొయినిస్ మెరుపులతో పంజాబ్ 200 పరుగుల మార్కు దాటింది. స్టొయినిస్ 16 బంతుల్లో 44 పరుగులతో రాణించాడు. ఆఖర్లో హర్‌ప్రీత్ బ్రార్ 2 బంతుల్లో 7 పరుగులతో స్టొయినిస్‌తో కలిసి నాటౌట్‌గా నిలిచాడు.ఇక ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్ రహ్మాన్ మూడు వికెట్లు తీయగా.. విప్రాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ముకేశ్ కుమార్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. -
IPL 2025: పంజాబ్‌ను ఓడించిన ఢిల్లీ
Punjab Kings vs Delhi Capitals- Jaipur Updates: పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. శ్రేయస్ అయ్యర్ సేనను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (18 బంతుల్లో 28), జోష్ ఇంగ్లిస్ (12 బంతుల్లో 32) ఫర్వాలేదనిపించగా.. శ్రేయస్ అయ్యర్ (34 బంతుల్లో 53 పరుగులు) రాణించాడు. మార్కస్ స్టొయినిస్ ( 16 బంతుల్లో 44 పరుగులు) మెరుపులు మెరిపించాడు. ఇక 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 19.3 ఓవర్లలో పని పూర్తి చేసింది. కేఎల్ రాహుల్ (35), ఫాఫ్ డుప్లెసిస్ (23)లు మెరుగ్గా ఆడగా.. కరుణ్ నాయర్ (27 బంతుల్లో 44) దంచికొట్టాడు. సమీర్ రిజ్వీ మెరుపు అర్ధ శతకం (28 బంతుల్లో 58) సాధించగా.. ట్రిస్టన్ స్టబ్స్ (18) అతడికి సహకారం అందించాడు. ఇద్దరూ కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి ఢిల్లీని విజయతీరాలకు చేర్చారు. సమీర్ రిజ్వీ తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీ18.2: ఐపీఎల్లో తొలి అర్ధ శతకం బాదిన సమీర్ రిజ్వీ . 22 బంతుల్లో యాభై పరుగుల మార్కు అందుకున్నాడు.రిజ్వీ ధనాధన్18 ఓవర్లలో ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. విజయానికి ఇంకో రెండు ఓవర్లలో 22 పరుగులు కావాలి.16 ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 159/4కరుణ్ నాయర్ అవుట్ధనాధన్ ఇన్నింగ్స్‌తో దూకుడు మీదున్న కరుణ్ నాయర్ (27 బంతుల్లో 44)ను హర్‌ప్రీత్ బ్రార్ బౌల్డ్ చేశాడు. ట్రిస్టన్ స్టబ్స్ క్రీజులోకి రాగా.. సమీర్ రిజ్వీ 24 పరుగులతో ఉన్నాడు. ఢిల్లీ స్కోరు: 155/4 (15)14 ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 146/3 యాభై రెండు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కరుణ్ నాయర్, సమీర్ రిజ్వీ. కరుణ్ 38, సమీర్ 22 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఢిల్లీ విజయానికి 36 బంతుల్లో 61 పరుగులు కావాలి.ఫోర్ల వర్షంప్రవీణ్ దూబే బౌలింగ్‌లో కరుణ్ నాయర్ వరుసగా నాలుగు బౌండరీలు బాదాడు. 11 ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 110-3. కరుణ్ 27, సమీర్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. మూడో వికెట్ డౌన్10:1: సెదీకుల్లా (22) రూపంలో ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. ప్రవీణ్ దూబే బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి అతడు అవుటయ్యాడు. సమీర్ రిజ్వీ క్రీజులలోకి రాగా.. కరుణ్ 15 పరుగులతో ఉన్నాడు.పది ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 93/2 (10)సెదీకుల్లా 22, కరుణ్ నాయర్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.డుప్లెసిస్ అవుట్6.4: హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో డుప్లెసిస్ (23)రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. సెదీకుల్లా అటల్ క్రీజులోకి వచ్చాడు. ఏడు ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 66-2. కరుణ్ నాయర్ ఏడు పరుగులతో క్రీజులో ఉన్నాడు.తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ5.3: కేఎల్ రాహుల్ రూపంలో ఢిల్లీ తొలి వికెట్ కోల్పోయింది. మార్కో యాన్సెన్ బౌలింగ్‌లో శశాంక్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్ పెవిలియన్ చేరాడు. కరుణ్ నాయర్ క్రీజులోకి వచ్చాడు.5 ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 50-0శ్రేయస్ ఫిఫ్టీ, స్టొయినిస్ మెరుపులుఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ మెరుగైన స్కోరు చేసింది.. జైపూర్ వేదికగా శనివారం నాటి ఈ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (18 బంతుల్లో 28), జోష్ ఇంగ్లిస్ (12 బంతుల్లో 32) ఫర్వాలేదనిపించగా.. శ్రేయస్ అయ్యర్ 34 బంతుల్లో 53 పరుగులు సాధించాడు. మిగతా వారిలో మార్కస్ స్టొయినిస్ ( 16 బంతుల్లో 44 పరుగులు) మెరుపులు మెరిపించాడు. ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్ రహ్మాన్ మూడు వికెట్లు తీయగా.. విప్రాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ముకేశ్ కుమార్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.ఎనిమిదో వికెట్ కోల్పోయిన పంజాబ్19.3: ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగిన యాన్సెన్(0). పంజాబ్ స్కోరు: 197-8ఏడో వికెట్ డౌన్17.6: కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో సమీర్ రిజ్వీకి క్యాచ్ ఇచ్చి ఒమర్జాయ్ (1) పెవిలియన్ చేరాడు. పంజాబ్ స్కోరు: 174-7. మార్కో యాన్సెన్ క్రీజులోకి రాగా.. స్టొయినిస్ 20 పరుగులతో ఉన్నాడు.ఆరో వికెట్ కోల్పోయిన పంజాబ్17.1: కుల్దీప్ బౌలింగ్‌లో మోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి శ్రేయస్ అయ్యర్ (53) అవుటయ్యాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ క్రీజులోకి వచ్చాడు.శ్రేయస్ అయ్యర్ అర్ధ శతకం17 ఓవర్లలో పంజాబ్ స్కోరు 171/5 (17). శ్రేయస్ అయ్యర్ 53, స్టొయినిస్ 18 పరుగులతో ఉన్నారు.ఐదో వికెట్ కోల్పోయిన పంజాబ్15.4: శశాంక్ సింగ్ (11) రూపంలో పంజాబ్ ఐదో వికెట్ కోల్పోయింది. ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి శశాంక్ పెవిలియన్ చేరాడు. మార్కస్ స్టొయినిస్ క్రీజులోకి వచ్చాడు. శ్రేయస్ 48 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 146-5(16)హాఫ్ సెంచరీకి చేరువలో శ్రేయస్15 ఓవర్లు ముగిసే సరికి శ్రేయస్ 46 పరుగులతో ఉండగా.. శశాంక్ సింగ్ 9 పరుగులతో ఆడుతున్నారు. పంజాబ్ స్కోరు: 142/4 (15)12.3: నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి అవుటైన నేహాల్ వధేరా(16). శశాంక్ సింగ్ క్రీజులోకి వచ్చాడు. పంజాబ్ స్కోరు: 118-412 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ స్కోరు: 116/3 (12)శ్రేయస్ అయ్యర్ 33 పరుగులతో, నేహాల్ వధేరా 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.10 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ స్కోరు: 97/3 (10)శ్రేయస్ అయ్యర్ 18 పరుగులతో, నేహాల్ వధేరా 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్7.5: విప్రాజ్ నిగమ్ బౌలింగ్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ బౌల్డ్ (28). మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్. శ్రేయస్ 8 పరుగులతో ఉండగ.. నేహాల్ వధేరా క్రీజులోకి వచ్చాడు.ఏడు ఓవర్లలో పంజాబ్ కింగ్స్ స్కోరు: 71/2 (7)ప్రభ్‌సిమ్రన్ సింగ్ 23, శ్రేయస్ అయ్యర్ ఏడు పరుగులతో ఆడుతున్నారు.రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్5.3: విప్రాజ్ నిగమ్ బౌలింగ్‌లో జోష్ ఇంగ్లిస్(32) షాట్ ఆడేందుకు ప్రయత్నించి స్టంపౌట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. పవర్ ప్లేలో పంజాబ్ స్కోరు: 60-2ఐదు ఓవర్లలో పంజాబ్ కింగ్స్ స్కోరు: 44/1 (5)ప్రభ్‌సిమ్రన్ సింగ్ 15, జోష్ ఇంగ్లిస్ 22 పరుగులతో ఆడుతున్నారు. పంజాబ్‌కు భారీ షాక్.. ఆర్య ఔట్‌టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. 6 పరుగులు చేసిన ప్రియాన్ష్ ఆర్య.. ముస్తఫిజుర్ రెహ్మన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 2 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ వికెట్ నష్టానికి 10 పరుగులు చేసింది.ఐపీఎల్-2025లో భాగంగా జైపూర్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు కూడా ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ దూరమయ్యాడు. అతడి స్దానంలో ఫాఫ్ డుప్లెసిస్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. పంజాబ్ జట్టులోకి జోష్ ఇంగ్లిష్, మార్కస్ స్టోయినిష్ తిరిగి రాగా.. సెడిఖుల్లా అటల్ ఢిల్లీ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి టాప్-2 స్ధానాన్ని సుస్థిరం చేసుకోవాలని పంజాబ్ భావిస్తుంటే.. ఢిల్లీ మాత్రం కింగ్స్‌ను ఓడించి తమ పరువు నిలబెట్టుకోవాలని యోచిస్తోంది,తుది జట్లుపంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(c), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), సెడిఖుల్లా అటల్, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్(వికెట్ కీపర్), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముస్తాఫిజుర్ రెహమాన్, ముఖేష్ కుమార్ -
రాహుల్, అభిమన్యు, సుదర్శన్.. టీమిండియా ఓపెనర్ ఎవరు?
భారత కొత్త టెస్టు కెప్టెన్ ఎవరన్న ఉత్కంఠకు నేటితో తెరపడింది. టీమిండియా కెప్టెన్‌గా అంతా ఊహించినట్లే శుబ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. అయితే ఇప్పుడు టీమిండియా ఓపెనర్ ఎవరన్న ప్రశ్న అందరిలోనూ మొదలైంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో భారత ఇన్నింగ్స్‌ను జైశ్వాల్‌తో కలిసి ఎవరు ఆరభిస్తారన్న చర్చ నడుస్తోంది. భారత ఓపెనర్ స్దానం కోసం ముగ్గురు పోటీలో ఉన్నారు. వారే స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్, తమిళనాడు సంచలనం సాయిసుదర్శన్, బెంగాల్ మాజీ కెప్టెన్ అభిమాన్యు ఈశ్వరన్. కేఎల్ రాహుల్ వైపే మొగ్గు..?మిగితా ఇద్దరితో పోలిస్తే రాహుల్‌కే భారత ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాహుల్ ఒక సెల్ప్లెస్ ఆటగాడు. 2014లో అరంగేట్రం చేసినప్పటి నుంచి రాహుల్ ఓపెనర్‌గాను, మిడిలార్డర్లోనూ తన సేవలను అందించాడు. ఆఖరికి ఆరో స్ధానంలో కూడా బ్యాటింగ్ చేసిన సందర్బాలు ఉన్నాయి. గతంలో టెస్టుల్లో భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన అనుభవం రాహుల్‌కు ఉంది. టెస్టుల్లో అతడికి ఓపెనర్‌గా రెండు సెంచరీలు ఉన్నాయి. 2018-21 కాలంలో టెస్టుల్లో టీమిండియా ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్.. 18 ఇన్నింగ్స్‌లలో 37.31 సగటుతో 597 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా 83 ఇన్నింగ్స్‌లలో 35.03 సగటుతో 2803 పరుగులు చేశాడు. అదేవిధంగా ఇంగ్లండ్ వంటి బౌన్సీ కండిషన్స్‌లో నిలకడగా బ్యాటింగ్ చేసే సత్తా కూడా రాహుల్‌కు ఉంది. దీంతో రాహుల్-జైశ్వాల్ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించే సూచనలు కన్పిస్తున్నాయి.సాయిసుదర్శన్ మరో అప్షన్..!ఒక వేళ కేఎల్ రాహల్‌ను మిడిలార్డర్లో ఆడించాలని టీమ్ మెనెజ్‌మెంట్ భావిస్తే.. యువ ఆటగాడు సాయి సుదర్శన్‌ను ఓపెనర్‌గా పంపే అవకాశముంటుంది. సాయి సుదర్శన్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరపున సంచలనాలు సృష్టించాడు. వైట్ బాల్ క్రికెట్లోనూ కాదు రెడ్ బాల్ క్రికెట్లో కూడా సుదర్శన్‌ను తనను తాను నిరూపించుకున్నాడు.ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అతడికి మెరుగైన రికార్డు ఉంది. 2022-25 కాలంలో 49 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సుదర్శన్.. 39.93 సగటుతో 1957 పరుగులు చేశాడు. అందులో 7 హాఫ్ సెంచరీలు, 5 శతకాలు ఉన్నాయి. అదేవిధంగా ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడిన అనుభవం కూడా అతడికి ఉంది. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో సర్రే తరపున ఆడాడు. ఈ తమిళనాడు బ్యాటర్ కౌంటీల్లో 8 ఇన్నింగ్స్‌లలో 35.12 సగటుతో 281 పరుగులు చేశాడు.అభిమన్యు ఈశ్వరన్..భారత జట్టు మెనెజ్‌మెంట్‌కు ఓపెనర్‌గా అభిమన్యు ఈశ్వరన్ రూపంలో మరో అప్షన్ ఉంది. దశాబ్ద కాలంగా దేశీయ క్రికెట్లో పరుగులు వరద పారిస్తున్న ఈశ్వరన్.. ఇప్పటివరకు భారత జట్టు తరపున అరంగేట్రం చేయలేదు. పలుమార్లు భారత జట్టు ఎంపికైనా.. ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం చోటు దక్కలేదు. ఒకవేళ ఇంగ్లండ్ టూర్లో అతడు అరంగేట్రం చేస్తే.. కచ్చితంగా జైశ్వాల్ ఓపెనింగ్ పార్టనర్ అభిమన్యు అనే చెప్పాలి. ఎందుకంటే అతడికి అపారమైన అనభవం ఉంది. ఇప్పటివరకు 101 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఈశ్వరన్.. 48.87 సగటుతో 7674 పరుగులు చేశాడు. అతడి పేరిట 27 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా ప్రధాన సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ లయన్స్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో ఇండియా-ఎ టీమ్ కెప్టెన్‌గా అభిమన్యు వ్యవహరించనున్నాడు. ఈ అనాధికారిక సిరీస్‌లో అభిమన్యు రాణిస్తే.. ప్రధాన సిరీస్‌లో కూడా అడే అవకాశముంది.చదవండి: Shreyas Iyer: కెప్టెన్ అవుతాడన్నారు.. కట్ చేస్తే! ఇప్పుడు టీమ్‌లోనే నో ఛాన్స్ -
Shreyas Iyer: కెప్టెన్ అవుతాడన్నారు.. కట్ చేస్తే! ఇప్పుడు టీమ్‌లోనే నో ఛాన్స్
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు 18 సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. కొత్త టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్‌ను ఎంపిక చేసిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. కరుణ్ నాయర్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్లను తిరిగి పిలుపునిచ్చింది. అయితే ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్ అండ్ కో ఎంపిక చేసిన ఈ జట్టుపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను పక్కన పెట్టడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. ఇటీవల కాలంలో అయ్యర్ దేశవాళీ క్రికెట్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకోవడంలోనూ శ్రేయస్‌ది కీలక పాత్ర.అదేవిధంగా 2024-25 రంజీ ట్రోఫీ సీజన్లో శ్రేయస్ అయ్యర్ కేవలం ఏడు ఇన్నింగ్స్‌లలో 68.57 సగటుతో 480 పరుగులు చేశాడు. అయ్యర్ ఫార్మాట్‌తో సంబంధం లేకుండా దుమ్ము లేపుతున్నాడు. ఐపీఎల్-2025లో కెప్టెన్‌గా, ఆటగాడిగా ఈ ముంబై బ్యాటర్ అదరగొడుతున్నాడు. అయితే గతేడాది మాత్రం అయ్యర్ టెస్టుల్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.శ్రేయస్ గత 12 ఇన్నింగ్స్‌లలో 17 సగటుతో 187 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అందుకే సెలెక్టర్లు అతడిని పక్కన పెట్టి ఫామ్‌లో ఉన్న కరుణ్ నాయర్‌ను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. ఏదేమైనా ప్రస్తుత ఫామ్‌ను పరిగణలోకి తీసుకుని అయ్యర్‌ను ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేసి ఉంటే బాగుండేంది అని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు.అయ్యర్ జట్టులో ఉంటే మిడిలార్డర్ పటిష్టంగా ఉంటుందని మరి కొందరు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. శ్రేయస్ అయ్యర్ అభిమానులైతే ఒకడుగు ముందుకు వేసి సెలక్టర్లపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కెప్టెన్ కావాల్సిన ఆటగాడికి పూర్తిగా జట్టులోనే ఛాన్స్ ఇవ్వరా అంటూ మండిపడుతున్నారు. శ్రేయస్ అయ్యర్ ఇప్పటివరకు 14 టెస్టులు ఆడి 36.86 సగటుతో 811 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 5 హాఫ్ సెంచరీలతో పాటు ఒక సెంచరీ ఉంది.ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్చదవండి: IND vs ENG: టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్.. అధికారిక ప్రకటన -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
టీమిండియా స్టార్ బ్యాటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లెజెండ్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో ఒకే జట్టు తరపున 800 ఫోర్లు కొట్టిన తొలి ఆటగాడిగా విరాట్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ 2025 లో భాగంగా శుక్రవారం లక్నో వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి ఈ ఘనత అందుకున్నాడు. కోహ్లి ఇప్పటివరకు ఆర్సీబీ తరపున 801 ఫోర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి 25 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 43 పరుగులు చేశాడు. ఇక ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో ఇంగ్లండ్ ఆటగాడు జేమ్స్ విన్స్(694) రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. విన్స్ హాంప్‌షైర్ క్రికెట్ క్లబ్ తరపున ఆడి ఈ ఫీట్ నమోదు చేశాడు.టీ20ల్లో ఒకే జట్టు తరుపున అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాళ్లు వీరే..విరాట్ కోహ్లి (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) – 801 ఫోర్లుజేమ్స్ విన్స్ (హాంప్‌షైర్) – 694 ఫోర్లుఅలెక్స్ హేల్స్ (నాటింగ్‌హామ్‌షైర్) – 563 ఫోర్లురోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్) – 550 ఫోర్లుల్యూక్ రైట్ (సస్సెక్స్) – 529 ఫోర్లుఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఆర్సీబీకి సన్‌రైజర్స్ ఝులక్ ఇచ్చింది. బెంగళూరుపై 45 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ (94 నాటౌట్; 48 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా..అభిషేక్ శర్మ (34; 17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), అనికేత్ వర్మ(26; 9 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు), క్లాసెన్(24) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం లక్ష్య చేధనలో ఆర్సీబీ 19.5 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌటైంది.చదవండి: IPL 2025: ఆర్సీబీ కెప్టెన్‌కు భారీ షాక్.. రూ. 24 లక్షల జరిమానా -
ఇది కదా సక్సెస్ అంటే.. 25 ఏళ్లకే టీమిండియా కెప్టెన్‌గా
భారత టెస్టు క్రికెట్ జట్టుకు కొత్త నాయకుడొచ్చాడు. రోహిత్ శర్మ వారసుడు ఎవరో తేలిపోయింది. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. అందరూ ఊహించినట్టే గిల్‌కే భారత జట్టు పగ్గాలను బీసీసీఐ అప్పగించింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం అధికారికంగా ప్రకటించింది.దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ పంజాబీ క్రికెటర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశామని ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్పేర్కొన్నాడు.ఇక అరంగేట్రం చేసిన ఐదేళ్లలోనే భారత జట్టు కెప్టెన్‌గా ఎదిగిన గిల్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇది కదా సక్సెస్ అంటూ గిల్‌ను నెటిజన్లు కొనియాడుతున్నారు. గిల్ 2020లో ఆస్ట్రేలియాపై తన టెస్టు అరంగేట్రం చేశాడు.25 ఏళ్ల వయస్సులోనే?భారత టెస్టు జట్టుకు 17 ఏళ్ల తర్వాత యువ కెప్టెన్ వచ్చాడు. 2008లో దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే నుంచి భారత టెస్టు జట్టు పగ్గాలను ఎంఎస్ ధోని చేపట్టాడు. అప్పటికి ధోని వయస్సు 27 ఏళ్లు. ఆ తర్వాత 8 ఏళ్ల పాటు భారత జట్టును మిస్టర్ కూల్ నడిపించాడు. అనంతరం 2014 డిసెంబరులో ధోనీ నుంచి కోహ్లికి టెస్టు కెప్టెన్సీ దక్కింది. అప్పటికి విరాట్‌కు 27 ఏళ్లు. కోహ్లి సరిగ్గా ఏడేళ్ల పాటు రెడ్‌బాల్ ఫార్మాట్లో భారత జట్టుకు సారథ్యం వహించాడు. కోహ్లి నాయకత్వంలోనే తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ను భారత్ సొంతం చేసుకుంది. 2021 ఆఖరిలో కోహ్లి టెస్టు కెప్టెన్సీకి రాజీనామా చేయడంతో అతడి వారుసుడిగా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టాడు. రోహిత్ శర్మ టెస్టు కెప్టెన్‌గా ఎంపికయ్యేటప్పటికి అతడి వయస్సు 34 ఏళ్లు. ఇప్పుడు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో శుబ్‌మన్ గిల్ 25 ఏళ్ల వయస్సులోనే కొత్త టెస్టు కెప్టెన్‌గా నియిమితుడయ్యాడు. దీంతో దిగ్గజ కెప్టెన్లు ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల కంటే అతి తక్కువ వయస్సులోనే టీమిండియా నాయకుడిగా ఎంపికై గిల్ చరిత్ర సష్టించాడు.ఓవరాల్‌గా భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా ఎంపికైన ఐదవ అతి పిన్న వయస్కుడిగా గిల్ నిలిచాడు. గిల్ ప్రస్తుత వయస్సు 25 సంవత్సరాల 285 రోజులు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి (21 సంవత్సరాల 77 రోజులు) అగ్రస్దానంలో ఉన్నాడు.👉గిల్ ఇప్పటివరకు 32 టెస్టులు ఆడి 35.06 సగటుతో 1893 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 7 హాఫ్ సెంచరీలు, ఐదు శతకాలు ఉన్నాయి.టెస్టుల్లో అతి పిన్న వయస్కులైన భారత కెప్టెన్లు వీరే..మన్సూర్ అలీ ఖాన్ పటౌడి (21 సంవత్సరాల, 77 రోజులు)సచిన్ టెండూల్కర్ -(23 సంవత్సరాల, 169 రోజులు)కపిల్ దేవ్ (24 సంవత్సరాల, 48 రోజులు)రవి శాస్త్రి (25 సంవత్సరాల, 229 రోజులు)శుబ్మాన్ గిల్ (25 సంవత్సరాల, 285 రోజులు)చదవండి: ఇంగ్లండ్ టూర్.. అందుకే షమీని ఎంపిక చేయలేదు: అగార్కర్ క్లారిటీ -
ఇంగ్లండ్ టూర్.. అందుకే షమీని ఎంపిక చేయలేదు: అగార్కర్ క్లారిటీ
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు 18 సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ నియమితుడయ్యాడు. సాయిసుదర్శన్, అర్ష్‌దీప్ సింగ్ వంటి యువ ఆటగాళ్లు తొలి భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకోగా.. కరుణ్ నాయర్, శార్థూల్ ఠాకూర్ వంటి వెటరన్ ప్లేయర్లు తిరిగి రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ జట్టులో స్టార్ పేసర్ మహ్మద్ షమీకి చోటు దక్కకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. టెస్టు క్రికెట్లో అపారమైన అనుభవం ఉన్న షమీని సెలక్టర్లు ఎందుకు పక్కన పెట్టరాన్న ప్రశ్న అందరిలోనూ ఉత్పన్నమవుతోంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ టూర్‌కు షమీని ఎంపిక చేయకపోవడంపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ క్లారిటీ ఇచ్చాడు."షమీ గత వారం రోజులగా కాలి మడమ నొప్పితో బాధపడుతున్నాడు. కొన్ని ఎంఆర్ఐ స్కాన్లు కూడా చేయించుకున్నాడు. ఐదు టెస్టుల సిరీస్ మొత్తం ఆడే సామర్థ్యం అతనికి ఇంకా రాలేదు. సుదీర్ఘ స్పెల్స్ బౌలింగ్ చేస్తే షమీపై వర్క్ లోడ్ పడుతోంది. మా వైద్య బృందం సూచన మేరకు అతడిని ఈ సిరీస్‌కు పక్కన పెట్టాల్సి వచ్చింది. షమీ ఈ సిరీస్‌కు ఫిట్‌గా ఉంటాడని మేము కూడా ఆశించాము. కానీ దురదృష్టవశాత్తూ అతడి ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. ఫిట్నెస్ లేని ప్లేయర్ ఎంపిక చేయడం కంటే వేరే ఆటగాడికి అవకాశమివ్వడం ఉత్తమమని భావించాము. అందుకే షమీని ఇంగ్లండ్ టూర్‌కు ఎంపిక చేయలేదు" ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అగార్కర్ పేర్కొన్నాడు. షమీ తన చివరి టెస్టు మ్యాచ్.. డబ్ల్యూటీసీ ఫైనల్-2023లో ఆస్ట్రేలియాపై ఆడాడు. 34 ఏళ్ల మహ్మద్ షమీ తన కెరీర్లో ఇప్పటివరకు 64 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి.. 229 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ 3.30 ఉంది. ఈ ఫార్మాట్లో అతను 6 సార్లు 5 వికెట్ల హాల్‌తో సత్తా చాటాడు. ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్చదవండి: IND vs ENG: టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్.. అధికారిక ప్రకటన -
టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్.. అధికారిక ప్రకటన
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా స్టార్ ప్లేయర్ శుబ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. రోహిత్ శర్మ స్దానాన్ని గిల్ భర్తీ చేయనున్నాడు. అదేవిధంగా శుబ్‌మన్ గిల్ డిప్యూటీగా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌ను నియమించారు. ఇక ఐపీఎల్లో దుమ్ములేపుతున్న యువ సంచలనం సాయిసుదర్శన్, అర్ష్‌దీప్ సింగ్‌లకు తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు దక్కింది. మరోవైపు దేశవాళీ క్రికెట్లో పరుగులు వరద పారిస్తున్న మిడిలార్డర్ బ్యాటర్ కరుణ్ నాయర్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత భారత జట్టులోకి నాయర్ రీ ఎంట్రీ ఇచ్చాడు. కరుణ్ నాయర్‌తో పాటు శార్ధూల్ ఠాకూర్ కూడా తిరిగి టీమిండియాలోకి పునరాగమనం చేశాడు. ఈ జట్టులో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కకపోవడం అందరి ఆశ్చర్యపరిచింది.అదేవిధంగా ఆసీస్ టూర్లో భాగమైన హర్షిత్ రాణా, సర్ఫరాజ్ ఖాన్‌కు సెలక్టర్లు ఈసారి మొండి చేయి చూపించారు. కాగా ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో టీమిండియా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. జూన్ 20 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్Shubman Gill-led #TeamIndia are READY for an action-packed Test series 💪A look at the squad for India Men’s Tour of England 🙌#ENGvIND | @ShubmanGill pic.twitter.com/y2cnQoWIpq— BCCI (@BCCI) May 24, 2025 -
IPL 2025: ఆర్సీబీ కెప్టెన్‌కు భారీ షాక్.. రూ. 24 లక్షల జరిమానా
ఐపీఎల్-2025లో భాగంగా శుక్రవారం లక్నో వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 42 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది. అయితే ఓటమి బాధలో ఉన్న ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పాటిదార్‌కు భారీ షాక్ తగిలింది. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు గానూ పాటిదార్‌కు రూ. 24 లక్షల భారీ జరిమానా ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ విధించింది. అలాగే జట్టులో ఇంపాక్ట్ ప్లేయర్ సహా అందరూ రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది.ఈ సీజన్లో ఆర్సీబీ జట్టు స్లో ఓవర్ రేట్‌ను నమోదు చేయడం ఇది రెండో సారి. అందుకే అంత భారీ మొత్తంలో జరిమానా విధించారు. కాగా ఈ మ్యాచ్‌లో బెంగళూరు సారధిగా జితేష్ శర్మ వ్యవహరించినప్పటికి.. రూల్స్ ప్రకారం ఎవరైతే ఫుల్ టైమ్ కెప్టెన్‌గా ఉంటారో వారే ఫైన్‌ను భరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే పాటిదార్‌పై జరిమానా పడింది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ కు కూడా స్లో ఓవర్ రేట్ (Slow over rate) కారణంగా జరిమానా విధించారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం కమిన్స్ కు తొలిసారి స్లో ఓవర్ రేట్ కారణంగా రూ. 12 లక్షలు జరిమానా పడింది.చదవండి: ENG vs ZIM: 22 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌తో టెస్టు.. ఓటమి దిశగా జింబాబ్వే -
22 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌తో టెస్టు.. ఓటమి దిశగా జింబాబ్వే
ఇంగ్లండ్‌తో 22 ఏళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడుతున్న జింబాబ్వే జట్టుకు ఓటమి తప్పేలా లేదు. నాటింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న నాలుగు రోజుల ఈ ఏకైక టెస్టులో రెండో రోజు కూడా ఇంగ్లండ్‌దే పైచేయిగా నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 498/3తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 96.3 ఓవర్లలో 6 వికెట్లకు 565 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. తన ఓవర్‌నైట్ స్కోరుకు మరో రెండు పరుగులు జోడించి ఓలీ పోప్ (166 బంతుల్లో 171; 24 ఫోర్లు, 2 సిక్స్‌లు) అవుటయ్యాడు. హ్యారీ బ్రూక్ (50 బంతుల్లో 58; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. జింబాబ్వే బౌలర్లలో ముజరబాని 3 వికెట్లు తీయగా... చివాంగ, సికందర్ రజా, మధెవెరెలకు ఒక్కో వికెట్ లభించింది.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే జట్టు 63.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ బ్రియాన్ బెనెట్ (143 బంతుల్లో 139; 26 ఫోర్లు) వీరోచిత సెంచరీ చేశాడు. కెపె్టన్ క్రెయిగ్ ఇరి్వన్ (64 బంతుల్లో 42; 6 ఫోర్లు), సీన్ విలియమ్స్ (41 బంతుల్లో 25; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్ షోయబ్ బషీర్ 3 వికెట్లు తీయగా... అట్కిన్సన్, బెన్ స్టోక్స్‌లకు రెండు వికెట్ల చొప్పున లభించాయి. స్యామ్ కుక్, జోష్ టంగ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. 300 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించకుండా జింబాబ్వేకు ఫాలోఆన్ ఇచ్చింది. ఫలితంగా రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన జింబాబ్వే రెండో రోజు ఆట ముగిసే సమయానికి 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 30 పరుగులు చేసింది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే మరో 270 పరుగులు చేయాలి. -
క్రీడాకారుల మధ్య అనుబంధం ఉండాలి
గచ్చిబౌలి: ఆటగాళ్లకు అభిమానులు అందించే ప్రోత్సాహం, ఉత్సాహం ఎంతో శక్తిని అందిస్తాయని, వీరి మధ్య అనుబంధం ఎప్పటికప్పుడు బలోపేతం అవుతూ ఉండాలని ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్, అర్జున అవార్డ్ గ్రహీత పుల్లెల గోపీచంద్ అన్నారు. భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లను, అభిమానులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ‘ఫ్యాన్ లీ’ యాప్ ను గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ డిజిటల్ యుగంలో క్రీడాకారులపై సానుకూల ప్రభావాన్ని చూపించే విధంగా అభిమానులకు ఆరోగ్యకరమైన సమాచారాన్ని అందించే డిజిటల్ వేదికల అవసరం ఎంతైనా ఉందన్నారు. ‘బ్యాడ్మింటన్ ఇండియా’ పేరుతో దేశంలోని అగ్రశ్రేణి ఆటగాళ్లు, యువ ప్రతిభావంతులు, అభిమానులను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావడం అనే ఆలోచనను అభినందించారు. సోషల్ మీడియా యుగంలో ఆటగాళ్లతో అభిమానుల సత్సంబంధాలు ఉండాలని, ట్రోలింగ్స్ వంటివి దూరం కావాలని ఆకాంక్షించారు. ఈ ఆవిష్కరణలో ఫ్యాన్లీ సహ వ్యవస్థాపకులు శ్రీనివాసన్ బాబు, శరవణన్ కనగరాజు, శ్రీదేవి సిరాలతో పాటు రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
గార్సియా గుడ్‌బై.. అదే లాస్ట్
పారిస్: డబుల్స్‌లో రెండుసార్లు సొంతగడ్డపై ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ టైటిల్ గెలిచిన ఫ్రాన్స్ మహిళా టెన్నిస్ స్టార్ కరోలినా గార్సియా (Caroline Garcia)... తన కెరీర్లో చివరిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడనుంది. ఆదివారం నుంచి మొదలయ్యే టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆఖరిసారి బరిలోకి దిగుతున్నానని 31 ఏళ్ల గార్సియా శుక్రవారం ప్రకటించింది.2016లో, 2022లో ఫ్రాన్స్‌కే చెందిన క్రిస్టినా మ్లాడెనోవిచ్తో కలిసి ఫ్రెంచ్ ఓపెన్‌లో డబుల్స్ టైటిల్స్ సాధించిన గార్సియాకు సింగిల్స్ అంతగా కలిసి రాలేదు. వరుసగా 14వసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడుతున్న గార్సియా 2017లో క్వార్టర్ ఫైనల్ చేరుకొని తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. కెరీర్ మొత్తంలో 51 గ్రాండ్‌స్లామ్ టోర్నిలలో సింగిల్స్ విభాగంలో ఆడిన గార్సియా ఒక్కసారి మాత్రమే సెమీఫైనల్ దశకు (2022 యూఎస్ ఓపెన్) చేరుకోగలిగింది. 2018లో కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ నాలుగో స్థానాన్ని అందుకున్న గార్సియా 2022లో కాలి గాయంతో కొంతకాలం ఆటకు దూరమైంది. ఈ గాయం నుంచి తేరుకున్నాక గార్సియా అదే ఏడాది నాలుగు టైటిల్స్ సొంతం చేసుకోవడం విశేషం.‘వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది. 15 ఏళ్లుగా అత్యున్నత స్థాయిలో నిర్విరామంగా ఆడుతున్నాను. గత 25 ఏళ్లుగా ప్రతి క్షణం టెన్నిస్‌కే అంకితం చేశాను. ఇప్పుడు టెన్నిస్‌కు స్వస్తి చెప్పి కొత్త అధ్యాయం మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్నాను. ఫ్రెంచ్ ఓపెన్ (French Open) తర్వాత ఒకట్రెండు టోర్నిలు ఆడి ఆటకు గుడ్‌బై చెబుతాను’ అని గార్సియా తెలిపింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 145వ స్థానంలో ఉన్న గార్సియా ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్లో బెర్నార్డా పెరాతో ఆడుతుంది. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్11- కెరీర్లో గార్సియా సాధించిన సింగిల్స్ టైటిల్స్. 8- కెరీర్లో గార్సియా నెగ్గిన డబుల్స్ టైటిల్స్ 35- ఓవరాల్‌గా సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో గార్సియా ఫైనల్ చేరిన టోర్నిల సంఖ్య 471- సింగిల్స్‌లో గార్సియా గెలిచిన మ్యాచ్‌లు.Dear tennis,It’s time to say goodbye.After 15 years competing at the highest level, and more than 25 years putting pretty much every second of my life into it, I feel ready to start a new chapter.My tennis journey hasn’t always been easy. Since my early days, tennis has been… pic.twitter.com/6OLuSU4Se3— Caroline Garcia (@CaroGarcia) May 23, 2025 -
వారిద్దరు లేకపోవడం లోటే కానీ...
న్యూఢిల్లీ: టెస్టు క్రికెట్‌కు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడం వారి వ్యక్తిగత నిర్ణయమని, ఇందులో ఇతరుల పాత్ర ఏమీ లేదని భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. వారిద్దరు లేకపోవడం జట్టుకు లోటే అయినా...వారి స్థానాల్లో వచ్చే ఆటగాళ్లకు ఇది మంచి అవకాశమని అతను అన్నాడు. ‘ఒక ఆటగాడు కెరీర్ మొదలు పెట్టినప్పుడు తన ఇష్ట ప్రకారమే ముగింపు కూడా ఇవ్వాలనుకుంటాడు. అది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం. కోచ్, సెలక్టర్ లేదా దేశంలో ఎవరికి కూడా అతడు ఎప్పుడు రిటైర్ కావాలో ఎప్పుడు రిటైర్ కాకూడదో చెప్పే హక్కు లేదు. కాబట్టి వారిది తమ స్వంత నిర్ణయంగానే భావించాలి. ఈ ఇద్దరు అనుభవజు్ఞలు లేకపోవడం కొంత వరకు కష్టమే. అయితే ఇతర ప్లేయర్లకు ఇది చాలా మంచి అవకాశం. నేను సిద్ధంగా ఉన్నాను అన్నట్లుగా వారు బాధ్యత తీసుకోవాలి. చాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా దూరమైనప్పుడు కూడా నేను ఇదే చెప్పాను. ఇతర బౌలర్లు సత్తా చాటి జట్టును గెలిపించారు కదా. ఈసారి కూడా ఎంతో మంది తమ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు. కోహ్లి, రోహిత్ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడే విషయంపై తాను ఇప్పుడే ఏమీ చెప్పలేనని, అందుకు చాలా సమయం ఉందని భారత కోచ్ స్పష్టం చేశాడు. -
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ రిఫరీగా శ్రీనాథ్
దుబాయ్: ప్రపంచ టెస్టు చాంపియన్షషిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్‌ను పర్యవేక్షించే అధికారుల వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) శుక్రవారం ప్రకటించింది. భారత జట్టు మాజీ పేస్ బౌలర్, అనుభవజ్ఞుడైన జవగళ్ శ్రీనాథ్‌కు గొప్ప గౌరవం లభించింది. జూన్ 11 నుంచి 15వ తేదీ వరకు లండన్‌లోని విఖ్యాత లార్డ్స్ మైదానంలో డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియా, తొలిసారి తుది పోరుకు చేరిన దక్షిణాఫ్రికా జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక పోరుకు శ్రీనాథ్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరిస్తాడని ఐసీసీ తెలిపింది. ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లండ్), క్రిస్ గాఫెనె (న్యూజిలాండ్)... టీవీ అంపైర్‌గా రిచర్డ్ కెటెల్‌బొరో (ఇంగ్లండ్)... ఫోర్త్ అంపైర్‌గా నితిన్ మీనన్ (భారత్) పేర్లను ఐసీసీ ఖరారు చేసింది. మూడు డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో ఆన్ ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించిన తొలి అంపైర్‌గా ఇల్లింగ్‌వర్త్ గుర్తింపు పొందనున్నాడు. 2021, 2023 డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లోనూ ఇల్లింగ్‌వర్త్ అంపైర్‌గా వ్యవహరించాడు. -
జోరు కొనసాగించాలని...
జైపూర్: సుదీర్ఘ విరామం అనంతరం ‘ప్లే ఆఫ్స్’కు చేరిన పంజాబ్ కింగ్స్ జట్టు ఇప్పుడు పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలవడంపై దృష్టి పెట్టింది. 2014లో చివరిసారి ‘ప్లే ఆఫ్స్’కు చేరి రన్నరప్‌గా నిలిచిన పంజాబ్ కింగ్స్... ఆ తర్వాత 11 ఏళ్లకు మళ్లీ ఈ సీజన్లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ‘టాప్–4’లో చోటు దక్కించుకుంది. ఆ్రస్టేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ శిక్షణలో తొలి టైటిల్ వేట దిశగా సాగుతున్న పంజాబ్ కింగ్స్... ఇప్పటికే ‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి నిష్క్రమించిన ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం తలపడనుంది. ఇరు జట్ల మధ్య ఈ నెల 8న ధర్మశాల వేదికగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో... పాకిస్తాన్ క్షిపణి దాడులు చేయడంతో ఆ మ్యాచ్‌ను అర్ధాంతరంగా నిలిపివేశారు. ఇప్పుడు దాన్నే తాజాగా తటస్థ వేదిక జైపూర్‌లో నిర్వహించనున్నారు. ఈ సీజన్లో 12 మ్యాచ్‌లాడిన పంజాబ్ 8 విజయాలు, 3 పరాజయాలు, ఒక మ్యాచ్‌లో ఫలితం తేలకపోవడంతో... 17 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ పంజాబ్ నెగ్గితే... పాయింట్ల పట్టికలో టాప్–2లో నిలవడం ద్వారా ఫైనల్‌కు చేరేందుకు అదనంగా మరో అవకాశం పొందనుంది. మరోవైపు గత మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓడి ‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి తప్పుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు లీగ్‌లో ఇదే చివరి మ్యాచ్. ఆడిన 13 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 6 ఓటములు, ఒక మ్యాచ్‌లో ఫలితం తేలకపోవడంతో 13 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. మరి పంజాబ్ జోరు కొనసాగిస్తుందా... లేక ఢిల్లీ సత్తా చాటుతుందా చూడాలి! టాపార్డర్ ఫుల్ జోష్‌లో... ఇప్పటి వరకు రెండు వేర్వేరు జట్లను ‘ప్లే ఆఫ్స్’కు తీసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్‌పై పంజాబ్ కింగ్స్ భారీగా ఆశలు పెట్టుకుంది. 2019, 20లో ఢిల్లీ జట్టును ‘ప్లే ఆఫ్స్’ చేర్చిన శ్రేయస్... 2024లో కోల్‌కతాకు మూడోసారి కప్పు అందించాడు. తాజా సీజన్లో అతడు 174.69 స్ట్రయిక్‌రేట్‌తో 435 పరుగులు చేశాడు. గతేడాదితో పోల్చుకుంటే అతడి బ్యాటింగ్‌లో దూకుడు పెరిగింది. ఈ సీజన్లో పవర్‌ప్లే ముగిసిన తర్వాత అత్యధిక స్ట్రయిక్ రేట్‌తో పరుగులు చేసిన రెండో ఆటగాడు శ్రేయస్ అయ్యరే. నికోలస్ పూరన్ 211.51 స్ట్రయిక్ రేట్‌తో పరుగులు రాబడితే... శ్రేయస్ 182.19 స్ట్రయిక్‌రేట్‌తో దంచి కొట్టాడు. ఓపెనర్లు ప్రియాన్‡్ష ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్ జట్టుకు వరంగా మారారు. నిలకడ కొనసాగిస్తున్న ఈ జోడీ... ఢిల్లీతో ఈ నెలారంభంలో జరిగిన పోరులోనూ అదిరిపోయే ఆరంభం అందించింది. వీరిద్దరు తొలి వికెట్‌కు కేవలం 10 ఓవర్లలోనే 122 పరుగులు జోడించారు. ఈ సమయంలో అనివార్య కారణాల వల్ల మ్యాచ్ నిలిచిపోయింది. ఈ సీజన్లో ప్రభ్‌సిమ్రన్ 38.17 సగటుతో 458 పరుగులు చేయగా... ప్రియాన్‡్ష ఆర్య 356 పరుగులు సాధించాడు.ఇన్‌గ్లిస్, నేహల్ వధేరా, స్టొయినిస్, శశాంక్ సింగ్, యాన్సెస్ రూపంలో కింగ్స్‌కు మెరుగైన బ్యాటింగ్ దళం ఉంది. బౌలింగ్‌లో అర్‡్షదీప్, యుజువేంద్ర చాహల్, యాన్సెన్, జేమీసన్ కీలకం కానున్నారు. భారత్, పాకిస్తాన్ సరిహద్దుల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో... లీగ్ నుంచి తిరుగుపయనమైన విదేశీ ఆటగాళ్లంతా తిరిగి అందుబాటులోకి రావడంతో పంజాబ్ కింగ్స్ మరింత బలంగా తయారైంది. అక్షర్ పటేల్ అనుమానమే! సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో ఒకదశలో సునాయాసంగా ‘ప్లే ఆఫ్స్’ చేరుతుందనిపించిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు... ముంబై చేతిలో ఓటమితో రేసు నుంచి నిష్క్రమించింది. ఇక మిగిలిన ఏకైక మ్యాచ్‌లో మెరుగైన ఆటతీరు కనబర్చి గౌరవంగా సీజన్‌కు గుడబై చెప్పాలని చూస్తోంది. సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 56.00 సగటు, 148.67 స్ట్రయిక్‌రేట్‌తో 504 పరుగులు చేసి జట్టు తరఫున టాప్ స్కోరర్‌గా ఉండగా... అభిషేక్ పోరెల్ 301 పరుగులు చేశాడు. జ్వరం కారణంగా గత మ్యాచ్‌కు అందుబాటులో లేకపోయిన రెగ్యులర్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఈ మ్యాచ్‌లో ఆడతాడో లేదో చూడాలి. అతడు అందుబాటులో లేకపోతే మరోసారి డు ప్లెసిస్ ఢిల్లీ జట్టును నడిపించనున్నాడు. డు ప్లెసిస్, ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్‌తో జట్టుకు మెరుగైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.అయితే ఢిల్లీ అసలు సమస్య మాత్రం నిలకడగా వికెట్లు తీయగల ప్రధాన బౌలర్ లేకపోవడమే. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ దూరమవడంతో ఢిల్లీ బౌలింగ్ డీలా పడింది. ముకేశ్ కుమార్, ముస్తఫిజుర్, చమీరా, కుల్దీప్ యాదవ్ ఎలాంటి ప్రదర్శన చేస్తారనేది ఆసక్తికరం. తుది జట్లు (అంచనా) పంజాబ్ కింగ్స్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్ ), ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్, జోష్ ఇన్‌గ్లిస్, నేహల్ వధేరా, స్టొయినిస్, శశాంక్ సింగ్, మార్కో యాన్సెన్, జేమీసన్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్ దీప్ సింగ్, యుజువేంద్ర చహల్. ఢిల్లీ క్యాపిటల్స్: అక్షర్ పటేల్ (కెప్టెన్ ), కేఎల్ రాహుల్, డు ప్లెసిస్, అభిషేక్ పొరెల్, స్టబ్స్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, చమీరా, ముస్తఫిజుర్, ముకేశ్ కుమార్. -
విండీస్, ఐర్లాండ్ మ్యాచ్ రద్దు
డబ్లిన్: ఐర్లాండ్ చేతిలో తొలి వన్డేలో ఎదురైన ఓటమి నుంచి తేరుకున్న వెస్టిండీస్ రెండో వన్డేలో అదరగొట్టింది. భారీ స్కోరు చేసి విజయంపై ఆశలు పెంచుకున్న వెస్టిండీస్‌ను వరుణదేవుడు కరుణించలేదు. ఫలితంగా ఈ రెండు జట్ల మధ్య జరిగిన రెండో వన్డే ఫలితం తేలకుండానే ముగిసింది. వెస్టిండీస్ ఇన్నింగ్స్ ముగిశాక భారీ వర్షం రావడంతో ఐర్లాండ్ ఛేజింగ్ సాధ్యపడలేదు. వెరసి మూడు వన్డేల సిరీస్‌లో ఐర్లాండ్ ప్రస్తుతం 1–0తో ఆధిక్యంలో ఉంది. టాస్ గెలిచిన ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 352 పరుగులు సాధించింది. వన్‌డౌన్ బ్యాటర్ కేసీ కార్టీ (109 బంతుల్లో 102; 13 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్లో రెండో సెంచరీ నమోదు చేయగా... చివర్లో మాథ్యూ ఫోర్డీ (19 బంతుల్లో 58; 2 ఫోర్లు, 8 సిక్స్‌లు) శివమెత్తాడు. కేవలం 16 బంతుల్లోనే ఫోర్డీ అర్ధ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా ఏబీ డివిలియర్స్ (16 బంతుల్లో) పేరిట ఉన్న రికార్డును ఫోర్డీ సమం చేశాడు. కెప్టెన్ షై హోప్ (57 బంతుల్లో 49; 5 ఫోర్లు, 1 సిక్స్) పరుగు తేడాతో అర్ధ సెంచరీని చేజార్చుకోగా... జస్టిన్ గ్రీవెస్ (36 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడాడు. ఐర్లాండ్ బౌలర్లలో బ్యారీ మెకార్తీ, జోష్ లిటిల్ రెండు వికెట్ల చొప్పున తీయగా... లియామ్ మెకార్తీకి మూడు వికెట్లు దక్కాయి. ఈ రెండు జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే ఆదివారం జరుగుతుంది. -
నీరజ్ చోప్రాకు రెండో స్థానం
చోర్జో (పోలాండ్): ఈ సీజన్లో తాను పాల్గొన్న రెండో ఈవెంట్లోనూ భారత స్టార్ జావెలిన్ త్రోయర్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. శుక్రవారం జరిగిన జానుస్ కుసోన్స్కీ స్మారక అథ్లెటిక్స్ మీట్లో నీరజ్ చోప్రా చివరిదైన ఆరో ప్రయత్నంలో తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. 27 ఏళ్ల నీరజ్ చివరి ప్రయత్నంలో జావెలిన్‌ను 84.14 మీటర్ల దూరం విసిరి మూడో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకాడు. ఈనెల 16న జరిగిన దోహా డైమండ్ లీగ్ మీట్లోనూ నీరజ్ రెండో స్థానాన్ని సాధించాడు. దోహా డైమండ్ లీగ్ మీట్లో అగ్రస్థానంలో నిలిచిన జూలియన్ వెబెర్ (జర్మనీ) అదే జోరును ఇక్కడా కొనసాగించాడు. జూలియన్ వెబెర్ జావెలిన్‌ను 86.12 దూరం విసిరి తొలి స్థానాన్ని పొందగా... రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా; 83.24 మీటర్లు) మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. తొలి ప్రయత్నంలో ఫౌల్ చేసిన నీరజ్ రెండో ప్రయత్నంలో జావెలిన్‌ను 81.28 మీటర్ల దూరం విసిరాడు. ఆ తర్వాత మూడు, నాలుగు ప్రయత్నాల్లో ఫౌల్ చేసిన నీరజ్ ఐదో ప్రయత్నంలో జావెలిన్‌ను 81.80 మీటర్ల దూరం విసిరాడు. ఆ తర్వాత చివరి ప్రయత్నంలో తన ప్రదర్శనను మరింత మెరుగుపర్చుకొని రెండో స్థానాన్ని ఖరారు చేసుకున్నాడు. -
14 నెలల తర్వాత...
కౌలాలంపూర్: ఎట్టకేలకు భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేశాడు. మలేసియా ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో 32 ఏళ్ల శ్రీకాంత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 65వ ర్యాంకర్ శ్రీకాంత్ 24–22, 17–21, 22–20తో ప్రపంచ 18వ ర్యాంకర్ టోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. 74 నిమిషాలపాటు హోరాహోరీగా జరిగిన పోరులో శ్రీకాంత్ కీలకదశలో చెలరేగి తుది ఫలితాన్ని శాసించాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో శ్రీకాంత్ ఒకదశలో 7–11తో వెనుకబడ్డాడు. కానీ సంయమనం కోల్పోకుండా తన అనుభవాన్నంతా రంగరించి పోరాడిన శ్రీకాంత్ 14–14తో స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత 16–14తో ఆధిక్యంలోకి వెళ్లిన శ్రీకాంత్ అదే జోరును కొనసాగించి 20–17తో విజయం అంచుల్లో నిలిచాడు. అయితే పొపోవ్ వరుసగా మూడు పాయింట్లు నెగ్గి స్కోరును 20–20తో సమం చేశాడు. కానీ శ్రీకాంత్ మరో అవకాశం ఇవ్వకుండా వరుసగా రెండు పాయింట్లు నెగ్గి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. 2024 మార్చిలో స్విస్ ఓపెన్‌లో చివరిసారి శ్రీకాంత్ సెమీఫైనల్ చేరుకున్నాడు. ఆ తర్వాత శ్రీకాంత్ 14 అంతర్జాతీయ టోర్నీల్లో పోటీపడ్డా క్వార్టర్ ఫైనల్ దశను దాటి ముందుకెళ్లలేకపోయాడు. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ 23వ ర్యాంకర్ యుషి తనాకా (జపాన్)తో శ్రీకాంత్ తలపడతాడు. మరోవైపు మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) జోడీ పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో తనీషా–ధ్రువ్ ద్వయం 22–24, 13–21తో జియాంగ్ జెన్ బాంగ్–వె యా జిన్ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
SRH Vs RCB: బెంగళూరుకు రైజర్స్ బ్రేక్
లక్నో: ‘ప్లే ఆఫ్స్’కు దూరమైన అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతోంది. గత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ‘ప్లే ఆఫ్స్’ ఆశలపై నీళ్లుచల్లిన రైజర్స్... శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ని మరింత ముందుకు వెళ్లకుండా అడ్డుకట్ట వేసింది. శుక్రవారం జరిగిన పోరులో సన్‌రైజర్స్ 42 పరుగుల తేడాతో బెంగళూరుపై గెలుపొందింది. మొదట సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇషాన్ కిషన్ (48 బంతుల్లో 94 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) దంచికొట్టగా... అభిషేక్ శర్మ (17 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), హెన్రిచ్ క్లాసెన్ (13 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), అనికేత్ వర్మ (9 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించారు. అనంతరం లక్ష్యఛేదనలో బెంగళూరు 19.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. ఫిల్ సాల్ట్ (32 బంతుల్లో 62; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (25 బంతుల్లో 43; 7 ఫోర్లు, 1 సిక్స్) ఆరంభంలో భయపెట్టినా... చివర్లో ఒత్తిడి పెంచిన రైజర్స్ ఫలితం రాబట్టింది. సన్‌రైజర్స్ కెపె్టన్ కమిన్స్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఆరంభం నుంచే దంచుడు... ఎలాంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. రెండో ఓవర్లో హెడ్ ఫోర్‌తో ఖాతా తెరవగా... భువనేశ్వర్ వేసిన రెండో ఓవర్లో హెడ్ ఫోర్, అభిషేక్ 4, 6 బాదారు. మూడో ఓవర్లోనూ అభిషేక్ 4, 6 దంచగా... నాలుగో ఓవర్లో ఈ జోడీ 4, 6, 4 కొట్టింది. వీరిద్దరూ మూడు బంతుల వ్యవధిలో అవుట్ కాగా... పవర్‌ప్లే ముగిసేసరికి రైజర్స్ 71/2తో నిలిచింది. క్లాసెన్ ఉన్నంతసేపు మెరుపులు మెరిపించగా... ఇషాన్ కిషన్ నిలకడ కనబర్చాడు. సుయాశ్ శర్మ వేసిన 11వ ఓవర్లో అనికేత్ 6, 4, 6 కొట్టి కాసేపటికే ఔట్ కాగా... ఆంధ్రప్రదేశ్ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి (4) ప్రభావం చూపలేకపోయాడు. అభినవ్ మనోహర్ (12) కూడా ఎక్కువసేపు నిలవలేకపోగా... ఆఖర్లో బాదే బాధ్యత ఇషాన్ భుజాలకెత్తుకున్నాడు. 28 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్న కిషన్... చివర్లో మరింత వేగం పెంచి సెంచరీకి 6 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఓపెనర్లు మినహా... పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన బెంగళూరు... భారీ లక్ష్యం కళ్ల ముందు కనిపిస్తున్నా ఏమాత్రం వెరవలేదు. తొలి రెండు ఓవర్లలో ఒక్కో ఫోర్ కొట్టిన కోహ్లి, మూడో ఓవర్లో రెండు ఫోర్లు దంచాడు. నాలుగో ఓవర్ వేసిన హర్షల్‌కు అదే శిక్ష వేశాడు. కోహ్లి 7 ఫోర్లు కొట్టేవరకు ఒక్క బౌండ్రీ బాదలేకపోయిన సాల్ట్ ఆ తర్వాత జూలు విదిల్చాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి చాలెంజర్స్ 72/0తో నలిచింది. తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించిన అనంతరం విరాట్ అవుట్ కాగా... పడిక్కల్ స్థానంలో జట్టులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్ (11) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. 27 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న సాల్ట్ కాసేపటికి వెనుదిరగగా... జితేశ్ శర్మ, రజత్ పాటీదార్ జోరు కొనసాగించారు. దీంతో 14 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 163/3తో నిలిచింది. విజయానికి 36 బంతుల్లో 69 పరుగులు అవసరమైన దశలో... బెంగళూరు బ్యాటర్లు తడబడటంతో పరాజయం తప్పలేదు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) సాల్ట్ (బి) ఇన్‌గిడి 34; హెడ్ (సి) షెఫర్డ్ (బి) భువనేశ్వర్ 17; ఇషాన్ కిషన్ (నాటౌట్) 94; క్లాసెన్ (సి) షెఫర్డ్ (బి) సుయాశ్ 24; అనికేత్ (సి) భువనేశ్వర్ (బి) కృనాల్ 26; నితీశ్ రెడ్డి (సి) కృనాల్ (బి) షెఫర్డ్ 4; అభినవ్ మనోహర్ (సి) సాల్ట్ (బి) షెఫర్డ్ 12; కమిన్స్ (నాటౌట్) 13; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 231. వికెట్ల పతనం: 1–54, 2–54, 3–102, 4–145, 5–164, 6–188. బౌలింగ్: యశ్ దయాళ్ 3–0–36–0; భువనేశ్వర్ 4–0–43–1; ఇన్‌గిడి 4–0–51–1; సుయాశ్ శర్మ 3–0–45–1; కృనాల్ పాండ్యా 4–0–38–1; షెఫర్డ్ 2–0–14–2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: ఫిల్ సాల్ట్ (సి) హర్షల్ (బి) కమిన్స్ 62; కోహ్లి (సి) అభిషేక్ (బి) హర్‡్ష దూబే 43; మయాంక్ (సి) ఇషాన్ (బి) నితీశ్ 11; పాటీదార్ (రనౌట్) 18; జితేశ్ శర్మ (సి) అభినవ్ (బి) ఉనాద్కట్ 24; షెఫర్డ్ (సి అండ్ బి) మలింగ 0; కృనాల్ (హిట్ వికెట్) (బి) కమిన్స్ 8; టిమ్ డేవిడ్ (సి) క్లాసెన్ (బి) మలింగ 1; భువనేశ్వర్ (బి) కమిన్స్ 3; యశ్ దయాళ్ (సి) అభిషేక్ (బి) హర్షల్ పటేల్ 3; ఇన్‌గిడి (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 189. వికెట్ల పతనం: 1–80, 2–120, 3–129, 4–173, 5–174, 6–174, 7–179, 8–186, 9–187, 10–189.బౌలింగ్: కమిన్స్ 4–0–28–3; ఉనాద్కట్ 4–0–41–1; హర్షల్ పటేల్ 3.5–0–39–1; ఇషాన్ మలింగ 4–0–37–2; హర్‡్ష దూబే 2–0–20–1; నితీశ్ రెడ్డి 2–0–13–1. ఐపీఎల్లో నేడుఢిల్లీ X పంజాబ్‌వేదిక: జైపూర్ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో -
IPL 2025: ఆర్సీబీకి ఝులక్ ఇచ్చిన ఎస్ఆర్హెచ్.. టాప్-2 కష్టమే?
ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కు సన్‌రైజర్స్ హైదరాబాద్ బిగ్ షాకిచ్చింది. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీపై 42 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. 232 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 19.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైందిఆర్సీబీ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్(62), విరాట్ కోహ్లి(43) అద్బుత ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికి మిడిలార్డర్ విఫలం కావడంతో ఆర్సీబీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఇషాన్ మలింగ రెండు, ఉనద్కట్, దూబే, నితీష్ కుమార్ రెడ్డి, హర్షల్ పటేల్ తలా వికెట్ సాధించారు. ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ మూడో స్దానానికి పడిపోయింది. టాప్-2లో గుజరాత్,పంజాబ్ కొనసాగుతున్నాయి. ఇషాన్ సూపర్ ఇన్నింగ్స్..అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 48 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో కిషన్ 94 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.అతడితో పాటు అభిషేక్ శర్మ(17 బంతుల్లో 34), క్లాసెన్(24), హెడ్(17), అనికేత్ వర్మ(9 బంతుల్లో 26) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆర్సీబీ బౌలర్లలో రొమారియో షెపర్డ్ రెండు వికెట్లు పడగొట్టగా.. సుయాష్, ఎంగిడీ,భువనేశ్వర్, పాండ్యా తలా వికెట్ సాధించారు.చదవండి: WI vs IRE: వెస్టిండీస్ వీరుడి విధ్వంసం.. వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ! -
వెస్టిండీస్ వీరుడి విధ్వంసం.. వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ!
డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో రెండో వన్డేలో వెస్టిండీస్ ఆటగాడు మాథ్యూ ఫోర్డ్ విధ్వంసం సృష్టించాడు. ఎనిమిదో స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఈ కరేబియన్ వీరుడు.. ఐర్లాండ్ బౌలర్లను ఊతికారేశాడు. ఈ క్రమంలో ఫోర్డ్ కేవలం 16 బంతుల్లోనే 50 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు.తద్వారా అంతర్జాతీయ వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా దక్షిణాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ వరల్డ్ రికార్డును ఫోర్డ్ సమం చేశాడు. 2015లో జోహన్నెస్‌బర్గ్‌లో వెస్టిండీస్‌పై ఏబీ డివిలియర్స్ 16 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు.తాజా మ్యాచ్‌తో డివిలియర్స్‌తో సంయుక్తంగా ఫోర్డ్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 19 బంతులు ఎదుర్కొన్న ఈ విండీస్ ఆల్‌రౌండర్.. 8 సిక్సర్లు, 2 ఫోర్లతో 58 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు కీసీ కార్తీ(109 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 102 పరుగులు) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి352 పరుగులు చేసింది.వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు చేసిన జాబితా ఇదేఏబీ డివిలియర్స్ - 16 బంతులు - దక్షిణాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ (2015)మాథ్యూ ఫోర్డ్ - 16 బంతులు - వెస్టిండీస్ వర్సెస్ ఐర్లాండ్ (2025)సనత్ జయసూర్య - 17 బంతులు - శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ (1996)కుశాల్ పెరెరా - 17 బంతులు - శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ (2015)మార్టిన్ గుప్టిల్ - 17 బంతులు - న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక (2015)లియామ్ లివింగ్‌స్టోన్ - 17 బంతులు - ఇంగ్లాండ్ వర్సెస్ నెదర్లాండ్స్ (2015)చదవండి: IND vs ENG: టీమిండియా సారథిగా శుబ్‌మన్ గిల్ ఫిక్స్!.. వైస్ కెప్టెన్ ఎవరంటే? -
టీమిండియా సారథిగా శుబ్‌మన్ గిల్ ఫిక్స్!.. వైస్ కెప్టెన్ ఎవరంటే?
టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్ ఎవరన్న ఉత్కంఠకు మరో 24 గంటల్లో తెరపడనుంది. బీసీసీఐ శనివారం ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టుతో పాటు కొత్త టెస్టు కెప్టెన్ పేరును కూడా వెల్లడించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ పేరును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.అదేవిధంగా గిల్‌కు డిప్యూటీగా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను నియమించాలని అజిత్ అగార్కర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అదేవిధంగా ఇంగ్లండ్ పర్యటనకు స్టార్ పేసర్ మహ్మద్ షమీని పక్కన పెట్టాలని సెలక్టర్లు డిసైడనట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. షమీ తన మడమ గాయం కారణంగా లాంగ్ స్పెల్స్ వేసేందుకు ఇంకా సిద్దంగా లేనట్లు బీసీసీఐ వైద్య బృందం ధ్రువీకరించనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు సాయిసుదర్శన్, కరుణ్ నాయర్లకు భారత టెస్టు జట్టులో చోటు ఖాయమైనట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఇక ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో భారత్ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. జూన్ 20 నుంచి 24 లీడ్స్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. కాగా ఈ కీలక సిరీస్‌కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి టెస్టులకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టు(అంచనా): శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, సాయి సుదర్శన్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, రిషబ్ పంత్, దృవ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, హర్షి దేష్, ప్రశీద్, షర్షి దేష్, ప్రశిద్ కుల్దీప్ యాదవ్.చదవండి: రూ.25 లక్షలు మోసపోయిన దీప్తీ శర్మ..? సహచర క్రికెటర్‌పై కేసు నమోదు -
రూ.25 లక్షలు మోసపోయిన దీప్తీ శర్మ..? సహచర క్రికెటర్‌పై కేసు నమోదు
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ దీప్తి శర్మ ఇంట్లో చోరీ జరిగింది. అగ్రాలోని దీప్తీకి చెందిన ఫ్లాట్ నుంచి విలువైన వస్తువులను ఢిల్లీ ఉమెన్స్ క్రికెటర్ ఆరుషి గోయల్ దొంగతనం చేసినట్లు ఆమె సోదరుడు సుమిత్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇండియన్ రైల్వేలో జూనియర్ క్లర్క్‌గా పనిచేస్తున్న ఆరుషి.. మహిళల ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్స్ తరపున దీప్తీతో కలిసి ఆడింది. అదేవిధంగా దీప్తీని ఆరుషి రూ.25 లక్షలు మోసం చేసిందని సుమిత్ శర్మ ఆరోపించాడు."తన సోదరి ఇంట్లో దొంగతనం జరిగిందని దీప్తీ సోదరుడు సుమిత్ శర్మ అగ్రాలోని సదర్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించారు. ప్రాథమిక విచారణ అనంతరం మేము పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేశాము. అరుషి, దీప్తీ కలిసి ఒకే జట్టుకు ఆడడం ఇద్దరూ మధ్య మంచి అనుబంధం ఏర్పడింది.ఈ క్రమంలో ఆరుషీ కుటుంబ అత్యవసర పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులను చూపుతూ దీప్తీ నుంచి పలుమార్లు నగదు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మేము పూర్తి స్దాయి విచారణ జరుపుతామని" ఏసీపీ (ఆగ్రా సదర్), సుకన్య శర్మ తెలిపినట్లు టైమ్స్ ఇండియా తమ రిపోర్ట్‌లో పేర్కొంది.దీప్తీ శర్మ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనకు సిద్దమవుతోంది. ఇంగ్లండ్‌తో వైట్‌బాల్ సిరీస్‌లకు ప్రకటించిన భారత జట్టులో ఆమె సభ్యురాలిగా ఉంది. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా హర్మాన్ ప్రీత్ సేన ఆతిథ్య జట్టుతో ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది.చదవండి: పుజారా ఆల్‌టైమ్ భారత జట్టు ఇదే.. రోహిత్, పంత్‌కు నో ఛాన్స్? -
IPL 2025 RCB vs SRH: ఆర్సీబీని చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్..
IPL 2025 RCB vs SRH Live Updates: ఆర్సీబీని చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్..ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ బిగ్ షాకిచ్చింది. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీపై 42 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. 232 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 19.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైందిఆర్సీబీ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్(62), విరాట్ కోహ్లి(43) అద్బుత ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికి మిడిలార్డర్ విఫలం కావడంతో ఆర్సీబీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఇషాన్ మలింగ రెండు, ఉనద్కట్, దూబే, నితీష్ కుమార్ రెడ్డి, హర్షల్ పటేల్ తలా వికెట్ సాధించారు.ఒకే ఓవర్లో రెండు వికెట్లు ఒకే ఓవర్లో ఆర్సీబీ రెండు వికెట్లు కోల్పోయింది. 16 ఓవర్ వేసిన ఇషాన్ మలింగ బౌలింగ్‌లో తొలుత రజిత్ పాటిదార్(18) రనౌట్ కాగా.. ఆ తర్వాత షెఫర్డ్(0) ఔటయ్యాడు. ఆర్సీబీ విజయానికి 24 బంతుల్లో 58 పరుగులు కావాలి.ఆర్సీబీ మూడో వికెట్ డౌన్129 పరుగుల వద్ద ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. 62 పరుగులు చేసిన సాల్ట్.. కమ్మిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 3 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది.ఆర్సీబీ రెండో వికెట్ డౌన్..మయాంక్ అగర్వాల్ రూపంలో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్.. నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్‌లో ఔటయ్యాడు.ఫిల్ సాల్ట్ ఫిప్టీ..సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ వికెట్ కీపర్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ హాఫ్ సెంచరీ సాధించాడు. 27 బంతుల్లో సాల్ట్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 10 ఓవర్లకు ఆర్సీబీ వికెట్ నష్టానికి 118 పరుగులు చేసింది.ఆర్సీబీ తొలి వికెట్ డౌన్..విరాట్ కోహ్లి రూపంలో ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 43 పరుగులు చేసిన కోహ్లి.. హర్ష్ దూబే బౌలింగ్‌లో ఔటయ్యాడు. 8 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది. క్రీజులో ఫిల్ సాల్ట్(38), మయాంక్ అగర్వాల్(5) ఉన్నారు.6 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 72/06 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(42), ఫిల్ సాల్ట్(20) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న విరాట్..2 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(11), ఫిల్ సాల్ట్(2) ఉన్నారు. ఇషాన్ కిషన్ విధ్వంసం.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్లక్నో వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు దుమ్ములేపారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 48 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో కిషన్ 94 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు అభిషేక్ శర్మ(17 బంతుల్లో 34), క్లాసెన్(24), హెడ్(17), అనికేత్ వర్మ(9 బంతుల్లో 26) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆర్సీబీ బౌలర్లలో రొమారియో షెపర్డ్ రెండు వికెట్లు పడగొట్టగా.. సుయాష్, ఎంగిడీ,భువనేశ్వర్, పాండ్యా తలా వికెట్ సాధించారు.ఎస్ఆర్హెచ్ ఐదో వికెట్ డౌన్నితీష్ కుమార్ రెడ్డి రూపంలో ఎస్ఆర్హెచ్ ఐదో వికెట్ కోల్పోయింది. కేవలం 4 పరుగులు మాత్రమే చేసిన నితీష్.. రొమోరియా షెఫర్డ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 15 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ అనికేత్ వర్మ రూపంలో ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన అనికేత్ శర్మ.. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. క్రీజులో ఇషాన్ కిషన్(48), నితీష్ కుమార్‌రెడ్డి(3) ఉన్నారు.క్లాసెన్ ఔట్..హెన్రిచ్ క్లాసెన్ రూపంలో ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన క్లాసెన్.. సుయాష్ శర్మ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 8.5 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ మూడు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది.7 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 84/27 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ రెండు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. క్రీజులో క్లాసెన్(18), ఇషాన్ కిషన్(11) పరుగులతో ఉన్నారు.ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ డౌన్ట్రావిస్ హెడ్ రూపంలో ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన హెడ్.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ డౌన్..అభిషేక్ శర్మ రూపంలో ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 34 పరుగులు చేసిన అభిషేక్..ఎంగిడీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది.దూకుడుగా ఆడుతున్న అభిషేక్, హెడ్..టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్ దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ వికెట్ నష్టపోకుండా 39 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(24), హెడ్(12) పరుగులతో ఉన్నారు.ఐపీఎల్-2025లో భాగంగా ఎకానా స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పాటిదార్ గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్ధానంలో జితేష్ శర్మ బెంగళూరు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.తుది జట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, జితేష్ శర్మ(కెప్టెన్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, లుంగి ఎన్గిడి, సుయాష్ శర్మసన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ -
పుజారా ఆల్‌టైమ్ భారత జట్టు ఇదే.. రోహిత్, పంత్‌కు నో ఛాన్స్?
భారత టెస్టు క్రికెట్ హిస్టరీలో వెటరన్ ఆటగాడు చతేశ్వర్ పుజారా తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్నాడు. తన అద్బుత బ్యాటింగ్‌తో టీమిండియా నయా వాల్‌గా పేరు గాంచాడు. అయితే ఫామ్ లేమితో సతమతవుతున్న పుజారా కొంత కాలంగా భారత జట్టుకు దూరంగా ఉటున్నాడు.ఈ మధ్య కాలంలో కామెంటేర్‌గా కూడా పుజారా అవతారమెత్తాడు. ఇప్పటికీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కొనసాగుతున్న ఈ సౌరాష్ట్ర ఆటగాడు.. భారత సెలక్టర్ల నుంచి పిలుపు వస్తే రీ ఎంట్రీకి సిద్దంగా ఉన్నాడు. ఇక ఇది ఇలా ఉండగా.. తాజాగా స్పోర్ట్స్ తక్ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుజారా తన ఆల్ టైమ్ ఇండియా టెస్ట్ ఎలెవన్‌ను ఎంచుకున్నాడు.చతేశ్వర్ తన ఎంచుకున్న జట్టులో ఓపెనర్లగా దిగ్గజ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌లకు అవకాశమిచ్చాడు. అయితే పుజారా మూడో స్ధానంలో తనకు కాకుండా ది గ్రేట్ వాల్ రాహుల్ ద్రవిడ్‌కు చోటు ఇచ్చాడు. నాలుగు, ఐదు స్ధానాల్లో వరుసగా సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లిలకు ఛాన్స్ దక్కింది.ఆరో స్దానంలో వీవీఎస్ లక్ష్మణ్‌ను పుజారా ఎంపిక చేశాడు. ఇక వికెట్ కీపర్‌గా పంత్‌కు కాకుండా లెజెండరీ ఎంఎస్ ధోని అతడు సెలక్ట్ చేశాడు. స్పిన్నర్లగా అనిల్ కుంబ్లే, అశ్విన్.. ఫాస్ట్ బౌలర్లగా జస్ప్రీత్ బుమ్రా, కపిల్ దేవ్‌లకు పుజారా చోటిచ్చాడు. కాగా పుజారా ఎంపిక చేసిన జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ, గ్రేట్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాలకు చోటు దక్కకపోవడం గమనార్హం.పుజారా ఆల్-టైమ్ టెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్: సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, వీవీఎస్ లక్ష్మణ్, ఎంఎస్ ధోనీ (వికెట్‌కీపర్), అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, కపిల్ దేవ్ మరియు జస్ప్రీత్ బుమ్రా. -
ఇంగ్లండ్ బ్యాటర్ల సెంచరీల మోత.. ఏకంగా 565 పరుగులు
సొంత గడ్డపై టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు అదిరిపోయే ప్రాక్టీస్ లభించింది. నాటింగ్‌హామ్ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్లు దంచి కొట్టారు. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ సాధించింది. 498/3 ఓవర్ నైట్‌స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. తమ మొదటి ఇన్నింగ్స్‌ను 565/6 వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు జాక్ క్రాలీ (171 బంతుల్లో 124; 14 ఫోర్లు), బెన్ డకెట్ (134 బంతుల్లో 140; 20 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఒలీ పోప్ (163 బంతుల్లో 171, 24 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీ శతకాలతో కదం తొక్కగా... హ్యారీ బ్రూక్(58), రూట్(34) పరుగులతో రాణించారు. జింబాబ్వే బౌలర్లలో ముజారబానీ మూడు వికెట్లు పడగొట్టగా.. చవింగా, మాధవీరే, రజా తలా వికెట్ సాధించారు.కాగా ఇంగ్లండ్ జట్టు తొలి రోజే రికార్డు స్థాయిలో 88 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 498 పరుగులు చేసింది. టెస్టు క్రికెట్లో తొలి రోజు నమోదైన రెండో అత్యధిక స్కోరు ఇదే కావడం గమనార్హం. అంతకుముందు 2022లో పాకిస్తాన్‌పై ఇంగ్లండ్ తొలి రోజు 506/4 పరుగులు చేసింది. మరో 9 పరుగులు చేసుంటే ఇంగ్లీష్ జట్టు తమ రికార్డును తామే బ్రేక్ చేసేది.తుది జట్లుఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, జో రూట్, ఓల్లీ పోప్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), గస్ అట్కిన్సన్, సామ్యూల్ జేమ్స్ కుక్, జోష్ టంగ్, షోయబ్ బషీర్జింబాబ్వే: బెన్ కర్రాన్, బ్రియాన్ బెన్నెట్, క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), సీన్ విలియమ్స్, సికందర్ రజా, వెస్లీ మాధేవెరే, తఫాద్జ్వా త్సిగా (వికెట్ కీపర్), రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీ, తనకా చివంగ, విక్టర్ న్యౌచి -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్..
శ్రీలంక స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటించాడు. జూన్ 17న గాలే వేదికగా బంగ్లాదేశ్‌తో జరగనున్న తొలి టెస్టు అనంతరం రెడ్ బాల్ క్రికెట్ నుంచి మాథ్యూస్ తప్పుకోనున్నాడు. ఈ విషయాన్ని మాథ్యూస్ శుక్రవారం వెల్లడించాడు."జూన్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే తొలి టెస్టు మ్యాచ్ అనంతరం రెడ్ బాల్ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను. ఇప్పటికే ఈ విషయాన్ని సెలక్టర్లకు తెలియజేశాను. అయితే వైట్ బాల్ ఫార్మాట్లో మాత్రం జట్టుకు అవరసమైనప్పుడు కచ్చితంగా సెలక్షన్‌కు అందుబాటులో ఉంటాను. ప్రస్తుతం మా టెస్టు జట్టులో చాలా మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. అందులో కొంతమంది భవిష్యత్తులో గొప్ప ఆటగాళ్లు అవుతారు. మరో టాలెంటెడ్ యంగ్ క్రికెటర్‌కు అవకాశమివ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. గత 17 ఏళ్లగా శ్రీలంక క్రికెట్‌కు ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. నా కెరీర్ అంతటా మద్దతుగా నిలిచిన శ్రీలంక క్రికెట్‌కు, నా తోటి ఆటగాళ్లకు, అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను" అని మాథ్యూస్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. శ్రీలంక తరపున 118 టెస్టులు ఆడిన 44 సగటుతో 8167 పరుగులు చేశాడు. అదేవిధంగా అతడి పేరిట 33 వికెట్లు కూడా విన్నాయి. 2009లో ఆస్ట్రేలియాపై టెస్టు అరంగేట్రం చేసిన మాథ్యూస్.. 34 టెస్ట్ మ్యాచ్‌ల్లో శ్రీలంక జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. అతడు చివరగా శ్రీలంక తరపున టీ20 ప్రపంచకప్-2024లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు.చదవండి: ENG vs IND: ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్.. భారత స్టార్ పేసర్ ఔట్?pic.twitter.com/nqsnpkpekD— Angelo Mathews (@Angelo69Mathews) May 23, 2025 -
ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్.. భారత స్టార్ పేసర్ ఔట్?
ఇంగ్లండ్, భారత్ మధ్య జరిగే ఐదు టెస్టుల (ENG vs IND) సిరీస్‌కు ముందే టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు భారత్ స్టార్ పేసర్ మహమ్మద్ షమీ (Mohammed Shami) దూరమయ్యే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. టెస్టు మ్యాచ్‌లో షమీ సుదీర్ఘ స్పెల్స్ వేయలేడని బీసీసీఐ (BCCI) వైద్యబృందం చెప్పినట్లు తెలుస్తోంది.బీసీసీఐ అధికారి ఒకరు.. షమీ ఐపీఎల్లో సన్‌రైజర్స్ తరఫున నాలుగు ఓవర్లు వేశాడు. షమీ ఒక రోజులో పది ఓవర్ల కంటే ఎక్కువ ఓవర్లు వేస్తాడా.. అన్న విషయం బోర్డుకు, సెలెక్టర్లకు తెలియదు. ఇంగ్లండ్‌లో టెస్టుల్లో పేసర్లు ఎక్కువ స్పెల్స్ వేసే అవసరం ఉండొచ్చు. అక్కడి పిచ్‌లు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటాయి. ఎక్కువగా పేసర్లే వికెట్లు తీస్తారు. అందుకే మేం ఎలాంటి ఛాన్స్‌లు తీసుకోలేం అని నేషనల్ మీడియాకు చెప్పుకొచ్చారు.మరోవైపు.. ఇంగ్లండ్ సిరీస్‌కు మరో 20 రోజులే సమయంలో షమీపై (BCCI) వైద్యబృందం కూడా ఓ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. షమీ టెస్టుల్లో సుదీర్ఘ స్పెల్స్ వేయలేడని బీసీసీఐ వైద్యబృందం యాజమాన్యానికి చెప్పినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతడిని జట్టులోకి తీసుకుంటే.. ఐదు టెస్టులూ ఆడే అవకాశాలు చాలా తక్కువని ఆ కథనాల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ షమీని టెస్టు సీరిస్‌కు ఎంపిక చేయకపోతే అతడి స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌కు అవకాశం లభించవచ్చు. షమీ టెస్టుల్లో చివరిసారిగా ఓవల్‌లో ఆస్ట్రేలియాపై 2023 WTC Finalలో ఆడిన సంగతి తెలిసిందే.🚨 NO SHAMI IN ENGLAND TOUR 🚨 - Mohammed Shami is unlikely to play in the Test series against England. (Devendra Pandey/Express Sports). pic.twitter.com/tjIlRHFgR7— Tanuj (@ImTanujSingh) May 23, 2025ఇదిలాఉండగా.. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ కోసం బీసీసీఐ.. భారత జట్టును శనివారం ప్రకటించనుంది. రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో.. ఎవరికి సారథ్య బాధ్యతలు అప్పగిస్తారన్న విషయం ఆసక్తికరంగా మారింది. రోహిత్, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత తొలిసారి భారత జట్టు ఎంపిక ఉండనుంది అనే చర్చ నడుస్తోంది. ఇక టెస్టు కెప్టెన్సీ రేసులో శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా పోటీలో ఉన్నారు. కోహ్లీ, రోహిత్.. స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారని అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
హాకీ ఇండియా లీగ్.. పాకిస్తాన్ ఆడుతుందా?
నోయిడా: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) 2026 సీజన్ వచ్చే ఏడాది జనవరి 5న ప్రారంభం కానుంది. ఈ మేరకు హాకీ ఇండియా (హెచ్ఐ) కార్యదర్శి భోళానాథ్ సింగ్ వివరాలు వెల్లడించారు. ఏడేళ్ల విరామం తర్వాత గతేడాది తిరిగి నిర్వహించిన హెచ్ఐఎల్కు మంచి ఆదరణ లభించగా ఈసారి మహిళల లీగ్‌లో మరో రెండు జట్లను పెంచనున్నట్లు భోళానాథ్ తెలిపారు. ‘హెచ్ఐఎల్ (HIL 2026) వచ్చే సీజన్ తేదీలు ఖరారయ్యాయి. పురుషుల విభాగంలో 8 ఫ్రాంఛైజీలు యథావిథిగా పాల్గొంటుండగా... మహిళల విభాగంలో గత సీజన్లో పాల్గొన్న నాలుగు జట్లతో పాటు మరో రెండు జట్లు అదనంగా చేరనున్నాయి. వేదిక ఇంకా ఖరారు కాలేదు. విదేశీ ఆటగాళ్ల వెసులుబాటుకు తగ్గట్లే షెడ్యూల్‌ను జనవరి 5 నుంచి ప్రారంభిస్తున్నాం’ అని భోళానాథ్ వెల్లడించారు.ఇక గత సీజన్‌కు సంబంధించి కొంత మంది ప్లేయర్లకు డబ్బులు చెల్లించలేదనే వార్తల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. ఫ్రాంఛైజీలన్నీ హెచ్ఐఎల్ నియమావళిని పాటిస్తున్నాయని తెలిపారు. హాకీ ప్లేయర్లు (Hockey Players) చదువు కొనసాగించేందుకు వీలుగా అమిటీ యూనివర్సిటీతో హాకీ ఇండియా ఎంఓయూ కుదుర్చుకుంది. దీని ద్వారా ప్లేయర్లు ఎక్కడి నుంచి అయినా ఆన్లైన్ ద్వారా తమ చదువు కొనసాగించే అవకాశం దక్కింది.కేంద్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం మరోవైపు భారత్ వేదికగా ఈ ఏడాది చివర్లో జరగనున్న ఆసియా కప్ హాకీ (Asia Cup Hockey) టోర్నమెంట్లో పాకిస్తాన్ పాల్గొనే అంశంలో తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదే అని హాకీ ఇండియా వెల్లడించింది. ప్రభుత్వం సూచనల మేరకే నడుచుకుంటామని వెల్లడించింది. చదవండి: ప్రొ హాకీ లీగ్‌కు భారత్ జట్టు ప్రకటన -
వారి ఆట అద్భుతం.. మేం కూడా నిరూపించుకున్నాం: పంత్
ఐపీఎల్-2025లో లక్నోసూపర్ జెయింట్స్ ఎట్టకేలకు మరో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన లక్నో.. టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్‌కు చెక్ పెట్టింది. గుజరాత్ జట్టును 33 పరుగుల తేడాతో మట్టికరిపించింది. 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 202 పరుగులకు పరిమితమైంది. లక్నో విజయంపై కెప్టెన్ రిషబ్ పంత్ ఆనందం వ్యక్తం చేశాడు.మ్యాచ్ ముగిసిన అనంతరం, లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ.. విజయం పట్ల కచ్చితంగా సంతోషంగా ఉంది. ఓ జట్టుగా మేము మంచి క్రికెట్ ఆడగలమని నిరూపించాం. టోర్నమెంట్లో మాకు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశాలు ఒకప్పుడు ఉన్నాయి. ఇప్పుడు గెలిచినా రేసులో లేము. కానీ అది ఆటలో భాగం. ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి. టాప్ త్రీలో చోటు సంపాదించడం ఎప్పుడూ సులభం కాదు. మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్‌లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఫీల్డింగ్‌లో కొన్ని తప్పిదాలు చేశాం. మరికొంత మెరుగు కావాల్సి అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.గుజరాత్ కెప్టెన్ శుభమన్ గిల్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్ ఓటమి ద్వారా జట్టులో కొన్ని లోపాలు, సానుకూల అంశాలను తెలుసుకున్నాం. పవర్‌ప్లేలో మేము బాగా బౌలింగ్ చేశాం. కానీ, అనుకున్న ప్రకారం వికెట్టు సాధించలేకపోయాం. మా బౌలర్లు భారీగా పరుగులిచ్చారు. 15-20 పరుగులు అదనంగా ఇచ్చాం. వారిని 210 దగ్గర ఆపాలనుకున్నాము. 210కి 230 మధ్య భారీ తేడా ఉంటుంది. 240 పరుగులను ఛేదించడం ఎప్పుడూ సులభం కాదు. రూథర్‌ఫోర్డ్, షారుఖ్ బ్యాటింగ్ మాకు పెద్ద పాజిటివ్ అంశం. ప్లేఆఫ్‌లోకి వెళ్లే క్రమంలో మళ్లీ పుంజుకుని విజయం సాధిస్తామని తెలిపాడు.ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (117; 64 బంతుల్లో 10×4, 8×6) మెరుపు శతకం సాధించడంతో ఎల్ఎస్జీ 2 వికెట్లకు 235 పరుగుల భారీ స్కోరు సాధించింది. నికోలస్ పూరన్ (56 నాటౌట్; 27 బంతుల్లో 4×4, 5×6), మార్క్రమ్ (36; 24 బంతుల్లో 3×4, 2×6) కూడా రాణించారు. అనంతరం ఛేదనలో గుజరాత్ 9 వికెట్లకు 202 పరుగులే చేయగలిగింది. షారుఖ్ ఖాన్ (57; 29 బంతుల్లో 5×4, 3×6) టాప్‌స్కోరర్. ఎల్ఎస్జీ బౌలర్లలో ఒరూర్క్ (3/27), ఆయుష్ బదోని (2/4) రాణించారు. 13 మ్యాచ్‌ల్లో గుజరాత్‌కిది 4వ ఓటమి కాగా.. లక్నో ఆరో విజయం నమోదు చేసింది. ఈ సీజన్లో నిలకడకు మారుపేరుగా నిలిచిన సాయి సుదర్శన్ (21) ఇన్నింగ్స్‌ను మెరుగ్గానే ఆరంభించినా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. -
అండర్–19 సారథిగా ఆయుశ్
న్యూఢిల్లీ: ఐపీఎల్లో అదరగొడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ ఆయుశ్ మాత్రే భారత అండర్–19 జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రాజస్తాన్ రాయల్స్ తరఫున ఈ సీజన్ ఐపీఎల్లో అరంగేట్రం చేసి... 35 బంతుల్లోనే సెంచరీతో సంచలనం రేకెత్తించిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. వచ్చే నెలలో భారత అండర్–19 జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఇందులో భాగంగా... 5 యూత్ వన్డేల సిరీస్‌తో పాటు 2 నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడనుంది. అంతకుముందు జూన్ 24న ఇంగ్లండ్ అండర్–19 జట్టుతో 50 ఓవర్ల వార్మప్ మ్యాచ్ కూడా ఆడనుంది. ఇప్పటికే యువ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆయుశ్, వైభవ్‌పై ఐపీఎల్‌తో మరిన్ని అంచనాలు పెరిగాయి. గతేడాది ఆ్రస్టేలియా అండర్–19 జట్టుపై వైభవ్ సెంచరీతో ఆకట్టుకోగా... 17 ఏళ్ల ఆయుశ్ 9 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 7 లిస్ట్ ‘ఎ’ మ్యాచ్‌లాడి 962 పరుగులు చేశాడు. ముంబై వికెట్ కీపర్ బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు ఈ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గతేడాది ఆస్ట్రేలియా అండర్–19 జట్టుతో రెండు మ్యాచ్‌ల యూత్ టెస్టు సిరీస్ 16 వికెట్లతో అదరగొట్టిన కేరళ లెగ్‌స్పిన్నర్ మొహమ్మద్ ఇనాన్‌తో పాటు పంజాబ్ ఆఫ్‌స్పిన్నర్ అన్మోల్జీత్ సింగ్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు. స్టాండ్‌బై ఆటగాళ్ల జాబితాలో హైదరాబాద్ వికెట్‌కీపర్ రాపోలు అలంకృత్‌కు స్థానం లభించింది. భారత అండర్–19 జట్టు: ఆయుశ్ మాత్రే (కెపె్టన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్‌సింగ్, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు, హర్వంశ్ సింగ్, అంబరీశ్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, యుధజిత్ గుహ, ప్రణవ్ రాఘవేంద్ర, మొహమ్మద్ ఇనాన్, ఆదిత్య రాణా, అన్మోల్జీత్ సింగ్. స్టాండ్‌బై ప్లేయర్లు: నమన్ పుష్పక్, దీపేశ్, వేదాంత్ త్రివేది, వికల్ప్ తివారీ, రాపోలు అలంకృత్. -
ప్రొ హాకీ లీగ్‌కు భారత జట్టు ప్రకటన
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరగనున్న ఎఫ్ఐహెచ్ హాకీ ప్రొ లీగ్ యూరప్ అంచె పోటీల కోసం హాకీ ఇండియా (హెచ్ఐ) జట్టును ప్రకటించింది. జూన్ 7 నుంచి యూరప్‌లోని అమ్స్టెల్వీన్, నెదర్లాండ్స్, అంట్వెర్ప్, బెల్జియంలో భారత పురుషుల హాకీ జట్టు మ్యాచ్‌లు ఆడనుంది. దీని కోసం గురువారం 24 మందితో కూడిన జట్టును ప్రకటించింది. జూన్ 7, 9న నెదర్లాండ్స్‌తో, 11, 12న అర్జెంటీనాతో టీమిండియా తపలడుతుంది. ఆ తర్వాత 14, 15న ఆ్రస్టేలియాతో, 21, 22న బెల్జియంతో మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ ఏడాది ఆరంభంలో భువనేశ్వర్ వేదికగా జరిగిన హాకీ ప్రొ లీగ్ అంచె పోటీల్లో 8 మ్యాచ్‌లాడిన భారత్ 5 విజయాలతో 15 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ‘అనుభవజు్ఞలు, యువ ఆటగాళ్లతో జట్టు సమతూకంగా ఉంది. ప్లేయర్లంతా బాగా సాధన చేశారు. హాకీ ప్రపంచకప్‌నకు అర్హత సాధించే నేపథ్యంలో... ప్రతి పాయింట్ కీలకం కావడంతో అన్నీ మ్యాచ్‌ల్లో విజయాలు సాధించేందుకు ప్రయత్నిస్తాం. పెనాల్టీ కార్నర్లను సది్వనియోగం చేసుకునే అంశంలో మరింత దృష్టిపెట్టాం’అని భారత హెడ్ కోచ్ క్రెయిగ్ ఫాల్టన్ అన్నాడు. పరాజయాలను ‘డ్రాలుగా... ‘డ్రా’లను విజయాలుగా మలచడమే లక్ష్యంగా ఉన్నామన్నాడు. భారత పురుషుల హాకీ జట్టు గోల్‌కీపర్స్: కృషన్ బహదూర్ పాఠక్, సూరజ్, డిఫెండర్స్: సుమిత్, అమిత్ రొహిదాస్, జుగ్రాజ్ సంగ్, నీలమ్ సంజీప్, హర్మన్‌ప్రీత్ సింగ్, జర్మన్‌ప్రీత్ సింగ్, సంజయ్, యశ్దీప్ సివాచ్, మిడ్ఫీల్డర్స్: రాజ్ కుమార్ పాల్, నీలకంఠ శర్మ, హార్దిక్ సింగ్, రాజిందర్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, శంషేర్ సింగ్, ఫార్వర్డ్స్: గుర్జాంత్ సింగ్, అభిషేక్, శైలానంద్ లక్రా, మన్దీప్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, దిల్‌ప్రీత్ సింగ్, సుఖ్జీత్ సింగ్. -
భారత క్రికెట్లో ‘సుదర్శన’ మంత్రం
దాదాపు రెండున్నరేళ్ల క్రితం ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్, తమిళనాడు మధ్య రంజీ ట్రోఫీ మ్యాచ్... తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ తరఫున రెండు, తమిళనాడు తరఫున మూడు సెంచరీలు నమోదయ్యాయి. మ్యాచ్ సాధారణ ‘డ్రా’ దిశగా సాగుతున్నట్లు అనిపించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ కుప్పకూలింది. దాంతో చివరి రోజు తమిళనాడు విజయలక్ష్యం 11 ఓవర్లలో 144... సాధారణంగా ఇలాంటి స్థితిలో బ్యాటర్లు మైదానంలోకి దిగి లాంఛనంగా కొన్ని బంతులు ఆడి ‘షేక్ హ్యాండ్’కు సిద్ధమవుతారు. కానీ తమిళనాడు టి20 శైలిలో గెలుపుపై గురి పెట్టింది. ఒకవైపు సీనియర్ జగదీశన్ చెలరేగుతుండగా మరో ఓపెనర్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో 20 బంతుల్లోనే 5 సిక్సర్లతో 42 పరుగులు బాదాడు. 7 ఓవర్లలో స్కోరు 108/1. అనూహ్యంగా వెలుతురులేమితో మ్యాచ్‌ను అంపైర్లు నిలిపివేయడంతో హైదరాబాద్ బతికిపోయింది. అయితే 21 ఏళ్ల ఆ ఓపెనర్ ఆటపై అన్ని వైపుల నుంచి అసాధారణ ప్రశంసలు వెల్లువెత్తాయి. తొలి ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ బాది ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన ఆ కుర్రాడే సాయి సుదర్శన్. అతనికిదే తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కావడం విశేషం. నాలుగు సీజన్ల పాటు దేశవాళీ క్రికెట్లో నిలకడైన ఆటతో ‘ఆల్ ఫార్మాట్’ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సుదర్శన్ ఇప్పుడు ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేయనున్న ఆటగాళ్లలో ముందు వరుసలో ఉన్నాడు. - సాక్షి క్రీడా విభాగం రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేయడానికి ముందే సాయి సుదర్శన్ ఐపీఎల్లో ఒక సీజన్ ఆడాడు. 2022లో ఐదు మ్యాచ్‌లలో కలిపి 114 బంతులు ఎదుర్కొని ఒక హాఫ్ సెంచరీ సహా 145 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. అయితే ఐపీఎల్లో ఒక ఏడాది బాగా ఆడి ఆ తర్వాత ఎంతో మంది కనుమరుగైన ఉదంతాలు ఉన్నాయి కాబట్టి అతని ప్రదర్శనను ఎవరూ అంత సీరియస్‌గా చూడలేదు. కానీ రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్‌లోనే అతని ఆటను చూశాక భవిష్యత్తులో చాలా తొందరగా భారత్‌కు ఆడగల సత్తా ఉన్న ప్లేయర్‌గా సుదర్శన్‌కు గుర్తింపు లభించింది.రంజీ ఆరంభానికి చాలా ముందే ‘ఈ అబ్బాయిలో ఎంతో ప్రత్యేకత ఉంది. సాధ్యమైనంత తొందరగా ఇతడిని తమిళనాడు జట్టులోకి తీసుకోండి’ అంటూ స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ చేసిన సూచనను సెలక్టర్లు పరిగణనలోకి తీసుకుంటూ ‘ఫాస్ట్ ట్రాక్’తో ముందు టి20ల్లోకి, ఆ తర్వాత వన్డేల్లోకి, ఆపై రంజీ టీమ్‌లోకి ఎంపిక చేశారు. తనపై ఉంచిన ఆ నమ్మకాన్ని అతను నిలబెట్టుకున్నాడు. ఒక్కసారి తమిళనాడు జట్టులోకి వచ్చాక తనకు లభించిన ప్రతీ అవకాశాన్ని సుదర్శన్ సమర్థంగా ఉపయోగించుకున్నాడు. చూడచక్కటి ఆటతో... సుదర్శన్ బ్యాటింగ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘క్లాస్’ తరహా శైలి అతనిది. చక్కటి డ్రైవ్‌లతో అలవోకగా ఫోర్లు రాబట్టడం అతనికి బాగా తెలిసిన విద్య. అవసరమైన సమయంలో గేర్లు మార్చి సిక్స్‌లు కొట్టినా అందులోనూ ఒక కళ ఉంటుంది. అప్పుడప్పుడు పుల్, హుక్ షాట్లతో పాటు స్లాగ్ స్వీప్‌లు, స్కూప్ షాట్లను కూడా ఐపీఎల్లో సుదర్శన్ చూపించాడు. టి20లు అయినా సరే లెక్క లేనితనంతో గుడ్డిగా బ్యాట్ ఊపే తత్వం కాదు. తనకు ఏం కావాలనే దానిపై అతనికి మంచి అవగాహన ఉంది. ఐపీఎల్లో నాలుగు సీజన్ల కెరీర్ చూస్తే అతని బ్యాటింగ్‌లో ఎక్కడా తడబాటు కనిపించకపోవడమే కాదు... అనవసరపు చెత్త షాట్లతో అవుటైన సందర్భాలు చాలా అరుదు. ఇదే అతడిని ఇతర దేశవాళీ బ్యాటర్లతో పోలిస్తే భిన్నంగా నిలబెట్టింది. అందుకే ఐపీఎల్లో చెలరేగుతున్న సమయంలో అతడిని టెస్టు జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ అన్ని వైపుల నుంచి వినిపించడం సుదర్శన్ బ్యాటింగ్‌పై నమ్మకాన్ని చూపిస్తోంది. సరిగ్గా చెప్పాలంటే టి20 ఫార్మాట్లో ఇప్పుడు అందరినీ ఆకట్టుకున్నా... సుదర్శన్ వన్డేలూ బాగా ఆడగలడు కాబట్టే ముందుగా అదే ఫార్మాట్లో తొలి అవకాశం దక్కింది. ఇక టెస్టు క్రికెట్‌కు సరిపోగల బ్యాటింగ్ నైపుణ్యం, పట్టుదల, టెక్నిక్ అతనిలో పుష్కలంగా ఉన్నాయి. అమ్మా నాన్న అండతో... సాయి సుదర్శన్ ఇప్పటికే భారత సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 3 వన్డేలు ఆడితే వరుసగా 55 నాటౌట్, 62, 10 పరుగులు సాధించాడు. బరిలోకి దిగిన ఏకైక టి20లో బ్యాటింగ్ అవకాశం రాలేదు. వేర్వేరు కారణాలతో ఆ తర్వాత అతనికి అవకాశాలు లభించలేదు. సుదర్శన్ టి20 సామర్థ్యమేమిటో ఐపీఎల్ చూపించింది. నిజానికి ఈ ఫార్మాట్లో తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో అదరగొట్టడంతోనే అతను ముందుగా వెలుగులోకి వచ్చాడు. అయితే అనూహ్యంగా మెరిసి ఆపై మళ్లీ కనబడకుండా పోయే ఆటగాళ్ల జాబితాలో అతను చేరరాదని సుదర్శన్ తల్లిదండ్రులు భావించారు. అందుకే పక్కా ప్రణాళికతో, సరైన కోచింగ్‌తో అతడికి వారు మార్గనిర్దేశనం చేశారు. క్రీడాకారుల కుటుంబం నుంచి రావడం కూడా అతనికి ఎంతో మేలు చేసింది. అథ్లెట్ అయిన తండ్రి భరద్వాజ్ ‘శాఫ్’ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించగా...తల్లి ఉష తమిళనాడు రాష్ట్ర జట్టు తరఫున వాలీబాల్ ఆడింది. పదేళ్ల వయసులో క్రికెట్ మొదలు పెట్టిన సుదర్శన్ ఆ తర్వాత మెల్లగా ఒక్కో మెట్టే ఎక్కుతూ వివిధ వయో విభాగాల్లో రాణిస్తూ ముందంజ వేశాడు. అండర్–19 చాలెంజర్ ట్రోఫీ తర్వాత భారత్ ‘ఎ’కు ఆడిన తర్వాత రెగ్యులర్‌గా మారాడు. వరుసగా రెండు ఐపీఎల్‌లలో 500కు పైగా పరుగులు సాధించి తన విలువేమిటో అతను చూపించాడు. టెస్టులకు చేరువలో...దేశవాళీలో నిలకడైన ప్రదర్శన, ప్రస్తుత ఫామ్, రోహిత్, కోహ్లిల రిటైర్మెంట్తో ఖాళీలు... ఇప్పుడు అన్నీ సరిగ్గా సరిపోయే సందర్భం 24 ఏళ్ల సుదర్శన్ కోసం వచ్చింది. దాదాపు 40 పరుగుల ఫస్ట్ క్లాస్ సగటు అసాధారణం కాకపోయినా... 29 మ్యాచ్‌లలో 1957 పరుగుల అనుభవం టెస్టు టీమ్‌లో అవకాశం కల్పించడానికి సరిపోతుంది. ప్రస్తుత టీమ్‌లో రాహుల్ ఓపెనింగ్ స్థానానికి మారితే మిడిలార్డర్ సుదర్శన్‌కు సరైన స్థానం కాగలదు. పైగా రెండు సీజన్ల పాటు ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో ‘సర్రే’ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించడం కూడా అతనికి మరో అదనపు అర్హతగా మారనుంది. భారత్ తరఫున టెస్టు ఆడే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు ఇటీవల వెల్లడించిన సుదర్శన్ కోరిక త్వరలోనే తీరవచ్చు. ఇదే జోరును అతను కొనసాగిస్తే స్థానం సుస్థిరం కూడా కావచ్చు. -
పతకమే లక్ష్యంగా...
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజి ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ కోసం ముమ్మరంగా సాధన చేస్తోంది. ఈ నెల 27 నుంచి 31 వరకు దక్షిణ కొరియాలో జరగనున్న ఈ టోర్నీ మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. 2023లో బ్యాంకాక్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో తెలుగమ్మాయి స్వర్ణం సాధించింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో నిరాశజనక ప్రదర్శన తర్వాత గాయాల నుంచి కోలుకున్న 25 ఏళ్ల జ్యోతి పూర్తి స్థాయిలో సత్తా చాటేందుకు తన టెక్నిక్‌లో మార్పులు చేసుకొని పాత పద్ధతిలోనే ప్రాక్టీస్ చేస్తున్నట్లు వెల్లడించింది. ‘పారిస్ విశ్వక్రీడల కోసం ‘సెవెన్ స్ట్రయిడ్’ టెక్నిక్ ప్రయత్నించాను. కానీ అది నాకు ఉపయోగపడలేదు. దాని వల్ల రెండుసార్లు గాయపడ్డా. అందుకే పాత పద్దతైన ‘ఎయిట్ స్ట్రయిడ్’లోనే పరుగెత్తాలని నిర్ణయించుకున్నా. గాయాల బారిన పడకుండా ఉంటే 13 సెకన్ల లోపే లక్ష్యాన్ని చేరుతాననే నమ్మకముంది’ అని జ్యోతి చెప్పింది. హర్డిల్స్ మధ్య అడుగుల వ్యూహాన్ని స్ట్రయిడ్ అంటారు. 100 మీటర్ల హర్డిల్స్‌లో జాతీయ రికార్డు (12.78 సెకన్లు) కలిగిన జ్యోతి... గత ఆసియా చాంపియన్‌షిప్ 200 మీటర్ల పరుగులో రజత పతకం కూడా నెగ్గింది. ఈ క్రీడల్లో పాల్గొనేందుకు 59 మందితో కూడిన భారత అథ్లెట్ల బృందం గురువారం దక్షిణ కొరియాకు బయల్దేరింది. -
క్వార్టర్ఫైనల్లో శ్రీకాంత్
కౌలాలంపూర్: తొలి రౌండ్లో మెరుగైన ర్యాంకింగ్ ప్లేయర్లపై రాణించిన భారత షట్లర్లకు ప్రిక్వార్టర్స్‌లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మలేసియా ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా, హెచ్.ఎస్.ప్రణయ్, ఆయుశ్ శెట్టి, సతీశ్ కుమార్ కరుణాకరన్‌లకు పరాజయం ఎదురైంది. మిక్స్డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో జోడీ క్వార్టర్స్ చేరగా... మహిళల డబుల్స్‌లో ప్రేరణ అల్వేకర్–మృణ్మయి దేశ్‌పాండేలకు నిరాశ ఎదురైంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రేరణ–మృణ్మయి జంట 9–21, 14–21తో సూ యిన్ హుయ్–లిన్ జి యున్ (చైనీస్ తైపీ) జంట చేతిలో పరాజయం చవిచూసింది. మిక్స్డ్ డబుల్స్‌లో తనీషా–ధ్రువ్ కపిల జోడీ 21–17, 18–21, 21–15తో ఫ్రాన్స్‌కు చెందినలీ పాలెర్మో–జులియెన్ మైమో జంటపై గెలిచింది. శ్రీకాంత్ వరుస గేముల్లో... పురుషుల సింగిల్స్‌లో ఒక్క శ్రీకాంత్ మాత్రమే ముందంజ వేశాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 65వ ర్యాంక్ ప్లేయర్ శ్రీకాంత్ 23–21, 21–17తో తనకన్నా మెరుగైన 33వ ర్యాంకర్ ఎన్‌హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)పై వరుస గేముల్లో విజయం సాధించాడు. ఈ రెండు గేములు గెలిచేందుకు శ్రీకాంత్ 59 నిమిషాలు పాటు చెమటోడ్చాడు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ ఫ్రాన్స్‌కు చెందిన తొమా పొపొవ్‌తో తలపడతాడు. మిగతా పురుషుల సింగిల్ పోటీల్లో సతీశ్ కరుణాకరన్ 14–21, 16–21తో క్రిస్టో పొపొవ్ (ఫ్రాన్స్) చేతిలో పరాజయం చవిచూశాడు. ఆశించిన స్థాయి ఆటతీరు కనబరచలేకపోయిన ప్రణయ్ 9–21, 18–21తో వరుస గేముల్లో యుషి తనక (జపాన్) చేతిలో కంగుతినగా... ఆయుశ్ శెట్టి 13–21, 17–21తో తొమ పొపొవ్ ధాటికి నిలువలేకపోయాడు. -
LSG Vs GT: గుజరాత్‌కు లక్నో షాక్
అహ్మదాబాద్: ఐపీఎల్లో ప్లేఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ తదుపరి లక్ష్యం టాప్–2లో చేరడం. ఈ ప్రయత్నానికి లక్నో సూపర్‌జెయింట్స్ అడ్డొచ్చింది. గురువారం జరిగిన పోరులో లక్నో 33 పరుగుల తేడాతో గుజరాత్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్‌జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 235 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ మార్ష్ (64 బంతుల్లో 117; 10 ఫోర్లు, 8 సిక్స్‌లు) శతక్కొట్టగా, నికోలస్ పూరన్ (27 బంతుల్లో 56 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగాడు. అనంతరం గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 202 పరుగులు చేసి ఓడింది. షారుఖ్ ఖాన్ (29 బంతుల్లో 57; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), రూథర్‌ఫర్డ్ (22 బంతుల్లో 38; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మాత్రమే రాణించారు. క్యాన్సర్ అవగాహన–ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రతీ సీజన్ తరహాలోనే ఈ సారి కూడా ఒక మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ లావెండర్ రంగు జెర్సీతో బరిలోకి దిగింది. ఓపెనింగ్ ధాటితో... ఓపెనర్లు మార్ష్, మార్క్రమ్ జోడీ లక్నోకు శుభారంభం ఇచ్చింది. గుజరాత్ బౌలర్లపై మార్ష్ విరుచుకుపడటంతో 5.3 ఓవర్లో లక్నో స్కోరు ఫిఫ్టీ దాటింది. మరోవైపు నుంచి మార్క్రమ్ (24 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా షాట్లతో పరుగుల వేగం పెంచాడు. ఈ క్రమంలో మార్ష్ 33 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓపెనర్ మార్క్రమ్ను కిషోర్ అవుట్ చేసి 91 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు. రషీద్‌ఖాన్‌పై మార్ష్ పిడుగల్లే చెలరేగాడు. అతను వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో వరుసగా 6, 4, 6, 4, 4, 1లతో ఏకంగా 25 పరుగుల్ని రాబట్టాడు. మార్ష్ సెంచరీ, పూరన్ ఫిఫ్టీ మార్‡్షతో పాటు వన్‌డౌన్ బ్యాటర్ పూరన్ కూడా ధాటిగా ఆడటంతో ప్రతీ ఓవర్‌కు 10 పైచిలుకు రన్‌రేట్‌తో పరుగులు వచ్చాయి. మార్ష్ 56 బంతుల్లో సెంచరీ సాధించాడు. కాసేపటికే పూరన్ కూడా 23 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరి వీరవిహారంతో లక్నో 17.4 ఓవర్లలో 200 మార్క్ దాటింది. డెత్ ఓవర్లలో భారీ షాట్లు ఆడేక్రమంలో మార్ష్ అవుట్‌కాగా... రెండో వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. పూరన్‌తో పంత్ (6 బంతుల్లో 16 నాటౌట్; 2 సిక్స్‌లు) అజేయంగా నిలిచాడు. షారుఖ్ పోరాడినా... కష్టమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆరంభం నుంచే దంచేందుకు దిగిన టాపార్డర్ బ్యాటర్లు అంతే వేగంగా వికెట్లు పారేసుకున్నారు. సాయి సుదర్శన్ (21; 4 ఫోర్లు), శుబ్‌మన్ గిల్ (20 బంతుల్లో 35; 7 ఫోర్లు), బట్లర్ (18 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) నిష్క్రమించడంతో లక్నో శిబిరం సంబరం చేసుకుంది. కానీ రూథర్‌ఫర్డ్, షారుఖ్ ఖాన్లు ధనాధన్ షోకు శ్రీకారం చుట్టడంతో లక్నో గుండెల్లో గుబులు రేగింది. చెరోవైపు నుంచి రూథర్‌ఫొర్డ్, షారుఖ్‌లు సిక్స్‌లు, ఫోర్లతో విజృంభించారు. అంతే... 16 ఓవర్లు గడిచేసరికి స్కోరు 182/3కి చేరింది. 24 బంతుల్లో 54 పరుగుల సమీకరణం గుజరాత్‌ను ఆశల పల్లకిలో ఉంచింది. రూథర్‌ఫొర్డ్, షారుఖ్ నాలుగో వికెట్‌కు 40 బంతుల్లో 86 పరుగులు జోడించారు. అయితే 17వ ఓవర్లో రూథర్‌ఫర్డ్, తెవాటియా (2), మరుసటి ఓవర్లో అర్షద్ ఖాన్ (1) అవుట్ కావడంతో లక్నో కు ఊరట లభించింది. 22 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న షారుఖ్ ఖాన్ పోరాటం సరిపోలేదు. స్కోరు వివరాలు లక్నో సూపర్‌జెయింట్స్ ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) షారుక్ (బి) సాయి కిషోర్ 36; మార్ష్ (సి) రూథర్‌ఫొర్డ్ (బి) అర్షద్ 117; పూరన్ నాటౌట్ 56; రిషభ్ పంత్ నాటౌట్ 16; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 235. వికెట్ల పతనం: 1–91, 2–212. బౌలింగ్: సిరాజ్ 4–0–37–0, అర్షద్ ఖాన్ 3–0–36–1, రబడ 4–0–45–0, ప్రసి«ద్‌కృష్ణ 4–0–44–0, సాయి కిషోర్ 3–0–34–1, రషీద్ ఖాన్ 2–0–36–0. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) మార్క్రమ్ (బి) రూర్కే 21; గిల్ (సి) సమద్ (బి) అవేశ్ 35; బట్లర్ (బి) ఆకాశ్ సింగ్ 33; రూథర్‌ఫర్డ్ (సి)సబ్–బిష్ణోయ్ (బి) రూర్కే 38; షారుఖ్ (సి) సబ్–బిష్ణోయ్ (బి) అవేశ్ 57; తెవాటియా (సి) హిమ్మత్ (బి) రూర్కే 2; అర్షద్ (సి) రూర్కే (బి) షాబాజ్ 1; రషీద్ ఖాన్ నాటౌట్ 4; రబడా (బి) బదోని 2; సాయి కిషోర్ (బి) బదోని 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 202. వికెట్ల పతనం: 1–46, 2–85, 3–96, 4–182, 5–186, 6–193, 7–197, 8–200, 9–202. బౌలింగ్: ఆకాశ్ సింగ్ 3.1–0–29–1, ఆకాశ్‌దీప్ 4–0–49–0, రూర్కే 4–0–27–3, అవేశ్‌ఖాన్ 3.5–0–51–2, షాబాజ్ 4–0–41–1, బదొని 1–0–4–2. ఐపీఎల్లో నేడుబెంగళూరు X హైదరాబాద్‌వేదిక: లక్నోరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో -
చరిత్ర సృష్టించిన జో రూట్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో మ్యాచ్‌లు పరంగా అత్యంతవేగంగా 13000 పరుగుల మైలు రాయిని అందుకున్న బ్యాటర్‌గా రూట్ చరిత్ర సృష్టించాడు. నాటింగ్‌హామ్ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్టులో టెస్టులో 28 పరుగుల వ్యక్తి గత స్కోర్ వద్ద రూట్ ఈ ఫీట్ సాధించాడు.ఈ రేర్ ఫీట్‌ను రూట్ కేవలం 153 మ్యాచ్‌లలో నమోదు చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డు దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాక్వస్ కల్లిస్ పేరిట ఉండేది. కల్లిస్ 159 మ్యాచ్‌ల్లో ఈ రికార్డును సాధించాడు. తాజా మ్యాచ్‌తో కల్లిస్ రికార్డును రూట్ బ్రేక్ చేశాడు. కల్లిస్తో పాటు దిగ్గజ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్(160), రికీ పాంటింగ్(162), సచిన్ టెండూల్కర్(163)ను అధిగమించాడు.అయితే మ్యాచ్‌ల పరంగా మాత్రం ఈ ఫీట్ సాధించిన జాబితాలో సచిన్(266) అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో రూట్(279 మ్యాచ్‌లు) ఐదో స్ధానంలో ఉన్నారు. ఇక టెస్టుల్లో 13,000 పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి ఇంగ్లీష్ క్రికెటర్ కూడా జో రూట్‌నే కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 498 పరుగులు చేసింది. క్రీజులో పోప్(169), బ్రూక్(9) ఉన్నారు. అంతకుముందు డకెట్(140), క్రాలీ(124) సెంచరీలు సాధించారు -
మార్ష్ సూపర్ సెంచరీ.. గుజరాత్‌పై లక్నో విజయం
ఐపీఎల్-2025లో లక్నోసూపర్ జెయింట్స్ ఎట్టకేలకు మరో విజయాన్ని నమోదు చేసింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా గురువారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో లక్నో విజయం సాధించింది. 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 202 పరుగులకు పరిమితమైంది.టైటాన్స్ బ్యాటర్లలో షారుఖ్ ఖాన్(57) టాప్ స్కోరర్‌గా నిలవగా.. షెర్ఫన్ రూథర్‌ఫర్డ్(38),బట్లర్(33), శుబ్‌మన్ గిల్(35) తమవంతు ప్రయత్నం చేశారు. లక్నో బౌలర్లలో విలియం ఓ రూర్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. బదోని రెండు, ఆకాష్ మహారాజ్ సింగ్,అవేష్ ఖాన్ తలా వికెట్ సాధించారు.మార్ష్ సూపర్ సెంచరీ..ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 64 బంతులు ఎదుర్కొన్న మార్ష్.. 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో 117 పరుగులు చేశాడు. అతడితో పాటు నికోలస్ పూరన్(56), మార్క్రమ్(36) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో ఆర్షద్ ఖాన్, సాయి కిషోర్ తలా వికెట్ సాధించారు. -
చరిత్ర సృష్టించిన నికోలస్ పూరన్.. ఐపీఎల్ హిస్టరీలోనే
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ తన ఫామ్‌ను తిరిగి అందుకున్నాడు. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో పూరన్ చెలరేగాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ వచ్చిన పూరన్.. ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశాడు.కేవలం 24 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పూరన్..4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 56 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పూరన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజన్లో 25 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో అత్యధిక సార్లు 50 పరుగులు చేసిన ప్లేయర్‌గా పూరన్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ పేరిట ఉండేది. ఐపీఎల్-2024 సీజన్లో హెడ్ నాలుగు సార్లు 25 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో తన ఫిప్టీ మార్క్‌ను అందుకున్నాడు. తాజా హాఫ్ సెంచరీతో హెడ్ రికార్డును పూరన్ బ్రేక్ చేశాడు. ఇక ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన పూరన్.. 46.45 సగటుతో 511 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 64 బంతులు ఎదుర్కొన్న మార్ష్.. 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో 117 పరుగులు చేశాడు.చదవండి: IND vs ENG: టీమిండియా బౌలర్లకు వార్నింగ్.. సెంచరీతో చెలరేగిన డకెట్ -
మిచెల్ మార్ష్ విధ్వంసకర సెంచరీ.. 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ ఓపెనర్ మిచెల్ మార్ష్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. గురువారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో మిచెల్ మార్ష్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్లను మార్ష్ ఊతికారేశాడు. నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ ఆస్ట్రేలియన్ సిక్సర్ల వర్షం కురిపించాడు. అతడిని ఆపడం ఎవరి తరం కాలేదు. బౌలర్లను ఎంతమందిని మార్చినా మార్ష్ నుంచి వచ్చిన సమాధానమే ఒక్కటే. లక్నో ఇన్నింగ్స్ 12 ఓవర్ వేసిన రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మార్ష్ రెండు సిక్స్‌లు, మూడు ఫోర్లతో ఏకంగా 25 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో కేవలం 56 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను మార్ష్ అందుకున్నాడు. మార్ష్‌కు ఇదే తొలి ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం. ఓవరాల్‌గా 64 బంతులు ఎదుర్కొన్న మార్ష్.. 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో 117 పరుగులు చేశాడు. కాగా ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన మార్ష్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.మార్ష్ సాధించిన రికార్డులు ఇవే..👉ఒకే సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్‌గా మార్ష్ నిలిచాడు. ఈ ఏడాది సీజన్లో మార్ష్ ఇప్పటివరకు 560 పరుగులు చేశాడు. ఈ జాబితాలో కేఎల్ రాహుల్(616) అగ్రస్ధానంలో ఉన్నాడు. 👉అదేవిధంగా ఒక సీజన్లో లక్నో తరపున అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు చేసిన కేఎల్ రాహుల్ రికార్డును మార్ష్ సమం చేశాడు. ఐపీఎల్-2022 సీజన్లో రాహుల్ 6 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు చేయగా.. ఈ ఏడాది సీజన్లో మార్ష్ కూడా సరిగ్గా ఆరు సార్లు ఏభై పైగా పరుగులు చేశాడు. మార్ష్ మరో హాఫ్ సెంచరీ చేస్తే రాహుల్‌ను అధిగమిస్తాడు.𝗠𝗔𝗜𝗗𝗘𝗡 𝗜𝗣𝗟 𝗖𝗘𝗡𝗧𝗨𝗥𝗬 𝗙𝗢𝗥 𝗠𝗔𝗥𝗦𝗛! 💯As rightly said in the Bhojpuri commentary box, it’s been a "𝘿𝙖𝙣𝙙𝙞 𝙈𝙖𝙧𝙨𝙝" in Ahmedabad! 😁Will his knock prove to be a hurdle in Gujarat Titans' #Race2Top2 tonight? 🤔Watch the LIVE action in Bhojpuri ➡… pic.twitter.com/fmKMj5z25j— Star Sports (@StarSportsIndia) May 22, 2025 -
టీమిండియా బౌలర్లకు వార్నింగ్.. సెంచరీతో చెలరేగిన బెన్ డకెట్
టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు జస్ప్రీత్ బుమ్రా అండ్ కోకు ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ బెన్ డకెట్ హెచ్చరికలు జారీ చేశాడు. నాటింగ్‌హామ్ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో డకెట్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో వన్డేను తలపిస్తూ తన ఐదో టెస్టు సెంచరీ మార్క్‌ను డకెట్ అందుకున్నాడు. 134 బంతులు ఎదుర్కొన్న డకెట్.. 20 ఫోర్లు, 2 సిక్స్‌లతో 140 పరుగులు చేసి ఔటయ్యాడు. జాక్ క్రాలీతో కలిసి తొలి వికెట్‌కు 235 పరుగుల భాగస్వామ్యాన్ని డకెట్ నెలకొల్పాడు. ఇక మొదటి ఇన్నింగ్స్‌లలో ఇంగ్లండ్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. స్టోక్స్ సేన తమ మొదటి ఇన్నింగ్స్‌లో 63 ఓవర్లకు వికెట్ నష్టానికి 359 పరుగులు చేసింది. క్రీజులో జాక్ క్రాలీ(121), ఓలీ పోప్(79) ఉన్నారు. కాగా ఈ ఏకైక మ్యాచ్ తర్వాత ఇంగ్లండ్ జట్టు భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్ కోసం ఇంకా ఇరు దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించలేదు. భారత జట్టును మే 24న బీసీసీఐ ప్రకటించే అవకాశముంది.జింబాబ్వేతో ఏకైక టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టుజాక్ క్రాలే, బెన్ డకెట్, జో రూట్, ఓల్లీ పోప్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), గస్ అట్కిన్సన్, సామ్యూల్ జేమ్స్ కుక్, జోష్ టంగ్, షోయబ్ బషీర్చదవండి: IPL 2025: 'ఆ రెండు ఓవర్లే మా కొంపముంచాయి.. లేదంటే విజయం మాదే' -
'అతడొక అద్బుతం.. ఇంగ్లండ్ టూర్‌కు సెలక్ట్ చేయండి'
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభానికి ఇంకా నాలుగు వారాల సమయం మాత్రమే మిగిలింది. ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి 24 వరకు జరగనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది.అయితే ఇంగ్లండ్ టూర్‌కు ఇంకా భారత జట్టును బీసీసీఐ ఖారారు చేయలేదు. క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం.. మే 24న భారత జట్టును బీసీసీఐ ప్రకటించే అవకాశముంది. అయితే ఈ సిరీస్‌కు టీమిండియాను ఎంపిక చేయడం సెలక్టర్లకు బిగ్ ఛాలెంజ్ వంటిదే అని చెప్పాలి. ఇందుకు ఈ కీలక పర్యటనకు ముందు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి టెస్టులకు వీడ్కోలు పలికారు. దీంతో వారిద్దరూ స్ధానాలను భర్తీ చేసే పనిలో సెలక్టర్లు ఉన్నారు. ఈ పర్యటనలో భారత టెస్టు జట్టులో కొన్ని కొత్త ముఖాలను చూసే అవకాశముంది. సాయిసుదర్శన్, అర్షదీప్ సింగ్‌లు టీమిండియా తరపున టెస్టు అరంగేట్రం చేయడం దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యంలో భారత సెలక్టర్లకు హర్యానా స్పీడ్ స్టార్ అన్షుల్ కాంబోజ్‌ను ఇంగ్లండ్ టూర్‌కు ఎంపిక చేయాలని చెన్నైసూపర్ కింగ్స్ హెడ్‌కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సూచించాడు. ఐపీఎల్-2025 సీజన్లో కాంబోజ్ సీఎస్కే తరపున ఆడుతున్నాడు."కాంబోజ్ అద్బుతమైన బౌలర్. అతడు గంటకు 138-139 కి.మీ వేగంతో బౌలింగ్ చేయగలడు. అతడు తన పేస్ బౌలింగ్‌తో బ్యాటర్లను బోల్తా కొట్టించగలడు. కాంబోజ్ వేసే బంతులు ఎల్లప్పుడూ చేతి గ్లౌవ్స్ దగ్గరగా వెళ్తూ ఉంటాయి.దీంతో బ్యాటర్లు వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హైట్ ఎక్కువగా ఉండడంతో బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడు. ప్లాట్ వికెట్లపై కూడా అతడు అద్బుతంగా బౌలింగ్ చేయగలడు.ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఫ్లాట్ వికెట్లపై ఎలా రాణించాడో చూశాము. కొంచెం సీమ్, స్వింగ్ ఉన్న పరిస్థితుల్లో ఇంకా బాగా రాణిస్తాడు. కాబట్టి ఇంగ్లండ్‌కు వెళ్లే భారత జట్టులో అతడు ఉంటాడని ఆశిస్తున్నానని" ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. -
గుజరాత్‌కు షాకిచ్చిన లక్నో..
IPL 2025 GT vs LSG Live Updates: ఐపీఎల్-2025లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి.గుజరాత్‌కు షాకిచ్చిన లక్నో..గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో లక్నో విజయం సాధించింది. 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 202 పరుగులకు పరిమితమైంది.టైటాన్స్ బ్యాటర్లలో షారుఖ్ ఖాన్(57) టాప్ స్కోరర్‌గా నిలవగా.. షెర్ఫన్ రూథర్‌ఫర్డ్(38),బట్లర్(33), శుబ్‌మన్ గిల్(35) తమవంతు ప్రయత్నం చేశారు. లక్నో బౌలర్లలో విలియం ఓ రూర్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. బదోని రెండు, ఆకాష్ మహారాజ్ సింగ్,అవేష్ ఖాన్ తలా వికెట్ సాధించారు.గుజరాత్ నాలుగో వికెట్ డౌన్..రూథర్‌ఫర్డ్ రూపంలో గుజరాత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 38 పరుగులు చేసిన రూథర్‌ఫర్డ్.. ఓ రూర్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. గుజరాత్ విజయానికి 23 బంతుల్లో 54 పరుగులు కావాలి. క్రీజులో షారుఖ్ ఖాన్(49) ఉన్నాడు.దూకుడు పెంచిన షారుఖ్, రూథర్‌ఫర్డ్14 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. క్రీజులో షారుఖ్ ఖాన్(27),రూథర్ ఫర్డ్(25) ఉన్నారు.గుజరాత్ మూడో వికెట్ డౌన్..జోస్ బట్లర్ రూపంలో గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది. 33 పరుగులు చేసిన బట్లర్.. ఆకాష్ మహారాజ్ సింగ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 11 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది.గుజరాత్ రెండో వికెట్ డౌన్శుబ్మన్ గిల్ రూపంలో గుజరాత్ టైటాన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన గిల్.. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ రెండు వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది.గుజరాత్ తొలి వికెట్ డౌన్..సాయిసుదర్శన్ రూపంలో గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన సాయిసుదర్శన్.. విలియం ఓ రూర్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు గుజరాత్ వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(24), జోప్ బట్లర్(20) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న గుజరాత్..33 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(15), సాయిసుదర్శన్(16) ఉన్నారు.గుజరాత్ ముందు భారీ టార్గెట్..అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాటన్స్తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 64 బంతులు ఎదుర్కొన్న మార్ష్.. 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో 117 పరుగులు చేశాడు. అతడితో పాటు నికోలస్ పూరన్(56), మార్క్రమ్(36) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో ఆర్షద్ ఖాన్, సాయి కిషోర్ తలా వికెట్ సాధించారు.మిచెల్ మార్ష్ సూపర్ సెంచరీ..లక్నో బ్యాటర్ మిచెల్ మార్ష్ తొలి ఐపీఎల్ సెంచరీ సాధించాడు. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాఛ్‌లో ఈ ఫీట్ నమోదు చేశాడు. కేవలం 56 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో మార్ష్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 16 ఓవర్లకు లక్నో స్కోర్: 180/115 ఓవర్లకు లక్నో స్కోర్: 160/115 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టానికి 160 పరుగులు చేసింది. క్రీజులో మిచెల్ మార్ష్(89), పూరన్(29) ఉన్నారు.లక్నో తొలి వికెట్ డౌన్..ఐడైన్ మార్క్రమ్ రూపంలో లక్నో తొలి వికెట్ కోల్పోయింది. 36 పరుగులు చేసిన మార్క్రమ్.. సాయికిషోర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. క్రీజులో మార్ష్(51), పూరన్(6) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న లక్నో ఓపెనర్లు..6 ఓవర్లు ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. క్రీజులో ఐడైన్ మార్క్రమ్(28), మార్ష్(22) ఉన్నారు.నిలకడగా ఆడుతున్న లక్నో ఓపెనర్లు..3 ఓవర్లు ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. క్రీజులో మార్ష్(8), మార్క్రమ్(15) ఉన్నారు.ఐపీఎల్-2025లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ నామాత్రపు మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమానికి మద్దతుగా లావెండర్ జెర్సీతో బరిలోకి దిగింది.తుది జట్లులక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్), ఆయుష్ బడోని, అబ్దుల్ సమద్, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, విలియం ఒరూర్కేగుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ -
'ఆ రెండు ఓవర్లే మా కొంపముంచాయి.. లేదంటే విజయం మాదే'
ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ కథ ముగిసింది. బుధవారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో 59 పరుగుల తేడాతో ఢిల్లీ జట్టు ఓడి పోయింది. దీంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ నిష్కమ్రించింది.181 పరుగుల లక్ష్యాన్ని అక్షర్ సేన ఛేదించిలేక చతికల పడింది. ఢిల్లీ క్యాపిటల్స్ 18.2 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం ఓటమిపై ఢిల్లీ హెడ్ కోచ్ హేమాంగ్ బదానీ స్పందించాడు. ఆఖరి రెండు ఓవర్లే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిందని అతడు అభిప్రాయడ్డాడు."ఈ మ్యాచ్‌లో మేము 18 ఓవర్ల వరకు అద్బుతంగా బౌలింగ్ చేశాము. కానీ ఆఖరి రెండు ఓవర్లు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాయి. చివరిలో మా ప్రణాళికలను సరిగ్గా ఆమలు చేయలేకపోయాము. 12 బంతుల్లో ఏకంగా 48 పరుగులు ఇచ్చాము. ఆఖరి రెండు ఓవర్లలో పిచ్ కండీషన్స్ తగ్గట్టు మా బౌలర్లు బౌలింగ్ చేయలేకపోయారు. వికెట్ స్లోగా ఉన్నందున కట్టర్లు కానీ వైడ్ యార్కర్లు గానీ ప్రయత్నించుంటే బాగుండేది.కానీ మా బౌలర్లు అది చేయలేకపోయారు. సూర్యకుమార్ యాదవ్ ఎటువంటి ఆటగాడో మనందరికి తెలుసు. అటువంటి బ్యాటర్‌కు స్లాట్‌లో బంతులు వేస్తే శిక్షించుకుండా ఎలా వదులుతాడని" పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బదానీ పేర్కొన్నాడు.అదేవిధంగా ఈ ఏడాది సీజన్లో తమ జట్టు ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. ఈ ఏడాది సీజన్‌ను నేను ఒక మారథన్గా భావించాము. మొదటిలో మాకు అద్బుతమైన ఆరంభం లభించింది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించాము.అయితే కొన్ని గెలవాల్సిన మ్యాచ్‌లలో మేము ఓడిపోయాము. ఫ్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే కొన్ని మ్యాచ్‌లను టార్గెట్‌గా పెట్టుకోవాలి. ఆ మ్యాచ్‌లలో గెలవకపోతే తప్పు మనదే అవుతుంది. అందుకు ఎవరిని బాధ్యులు చేయలేము. ఏదేమైనప్పటికి ఒక జట్టుగా మేము బాగా రాణించాము" అని బదానీ చెప్పుకొచ్చారు. కాగా ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ ఆరు విజయాలు, మరో ఆరింట ఓటములను చవిచూసింది.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. భారత జట్టులోకి స్టార్ ప్లేయర్! ఎవరంటే? -
కెప్టెన్ సెంచరీ వృధా.. విండీస్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్
వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌ను ఇంగ్లండ్ మహిళల జట్టు విజయంతో ఆరంభించింది. కాంటర్బరీ వేదికగా జరిగిన తొలి టీ20లో విండీస్‌ను 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ అమ్మాయిల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.విండీస్ బ్యాటర్లలో కెప్టెన్ హీలీ మాథ్యూస్ అద్బుతమైన సెంచరీతో చెలరేగారు. మిగితా బ్యాటర్లు విఫలమైనప్పటికి మాథ్యూస్ మాత్రం ఇంగ్లీష్ బౌలర్లను ఊతికారేసారు. మాథ్యూస్ 67 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 100 పరుగులు చేసి ఆజేయంగా నిలిచింది. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఆర్లోట్, స్మిత్, వాంగ్ తలా వికెట్ సాధించారు.అనంతరం 147 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఓపెనర్ సోఫియా డంక్లి(56 బంతుల్లో 12 ఫోర్లతో 81) టాప్ స్కోరర్‌గా నిలవగా.. హీథర్ నైట్(27 బంతుల్లో 6 ఫోర్లతో 43 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. విండీస్ బౌలర్లలో జేమ్స్, ఫ్లేచర్ తలా వికెట్ పడగొట్టారు. మిగితా బౌలర్లందరూ చేతులెత్తేశారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 మే 23న కౌంటీ గ్రౌండ్, హోవ్ వేదికగా జరగనుంది.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. భారత జట్టులోకి స్టార్ ప్లేయర్! ఎవరంటే? -
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. భారత జట్టులోకి స్టార్ ప్లేయర్! ఎవరంటే?
టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ త్వరలోనే టెస్టు అరంగేట్రం చేయనున్నాడు. ఇంగ్లండ్ పర్యటనకు 26 ఏళ్ల అర్ష్‌దీప్ ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణంయిచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు సిద్దంగా ఉండాలని ఈ పంజాబ్ పేసర్‌కు సెలక్టర్లు సూచించినట్లు సమాచారం.అర్ష్‌దీప్ రాకతో భారత టెస్టు జట్టులో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ లేని లోటు తీరనుంది. కాగా వన్డే, టీ20ల్లో భారత తరపున అరంగేట్రం చేసిన అర్ష్‌దీప్.. టెస్టుల్లో మాత్రం ఇంకా డెబ్యూ చేయలేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో రెగ్యూలర్‌గా ఆడుతున్నప్పటికి టీమిండియా తరపున టెస్టుల్లో ఆడే అవకాశం మాత్రం సింగ్‌కు రాలేదు. ఇంగ్లండ్ టూర్‌తో అతడు మూడు ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేయడం ఖాయమన్పిస్తోంది. అర్ష్‌దీప్‌కు ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడిన అనుభవం ఉంది. అక్కడి పరిస్థితులు అర్ష్‌దీప్‌కు బాగా తెలుసు. ఈ క్రమంలోనే అతడిని ఇంగ్లండ్‌కు పంపాలని అగర్కాకర్ అండ్ కో భావిస్తున్నట్లు వినికిడి.తన కెరీర్లో ఇప్పటివరకు 21 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అర్ష్‌దీప్.. 66 వికెట్లు పడగొట్టాడు. గత రంజీ సీజన్లో అతను రెండు మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు. ఇక ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ మే 23న ప్రకటించే అవకాశముంది. కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు విడ్కోలు పలకడంతో కొత్త కెప్టెన్‌తో మెన్ ఇన్ బ్లూ ఇంగ్లండ్‌కు పయనం కానుంది. భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ ఎంపిక దాదాపు ఖారరైనట్లు సమాచారం. మరోవైపు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతడి స్ధానాన్ని ఎవరి భర్తీ చేస్తారో వేచి చూడాలి. జూన్ 20 నుంచి భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.ఇంగ్లండ్‌తో సిరీస్‌కు భారత జట్టు(అంచనా)కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్,, ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, సాయి సుదర్శన్, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.చదవండి: ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా ఆయుశ్, వైభవ్ సూర్యవంశీకి చోటు -
IPL 2025 Play-Offs: ఆర్సీబీలోకి పవర్ హిట్టర్.. ప్రకటన విడుదల
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులోకి కొత్త ఆటగాడు చేరాడు. ఇంగ్లండ్ బ్యాటర్ జేకబ్ బెతెల్ (Jacob Bethel) స్థానాన్ని యాజమాన్యం న్యూజిలాండ్ స్టార్ టిమ్ సీఫర్ట్ (Tim Seifert)తో భర్తీ చేసింది. ఇందుకు సంబంధించి ఐపీఎల్ గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.కాగా ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో ఐపీఎల్-2025 వారం పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మే 17 నుంచి లీగ్ పునః ప్రారంభమైంది. అయితే, మధ్యలో విరామం వచ్చిన కారణంగా మే 25న జరగాల్సిన ఫైనల్.. జూన్ 3కు షెడ్యూల్ అయింది.మే 24న స్వదేశానికిఈ నేపథ్యంలో జాతీయ జట్టు విధుల దృష్ట్యా పలు ఫ్రాంఛైజీలకు చెందిన విదేశీ ఆటగాళ్లు ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు దూరం కానున్నారు. జేకబ్ బెతెల్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. ఇంగ్లండ్ జట్టుతో చేరే క్రమంలో అతడు ఆర్సీబీని వీడనున్నాడు. మే 24న అతడు స్వదేశానికి వెళ్లనున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత జేకబ్ బెతెల్ ఆర్సీబీని వీడనున్నాడు.సెంచరీ మిస్ఈ క్రమంలో అతడి స్థానాన్ని కివీస్ వికెట్ కీపర్ బ్యాటర్ టిమ్ సీఫర్ట్‌తో ఆర్సీబీ భర్తీ చేసింది. కాగా న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో 66 మ్యాచ్‌లు ఆడిన టిమ్ సీఫర్ట్ 1540 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో పది అర్ధ శతకాలు ఉండగా.. అత్యధిక స్కోరు 97. కాగా టిమ్ సీఫర్ట్ రూ. 2 కోట్ల ధరతో ఆర్సీబీలో చేరనున్నాడు. మే 24 నుంచి అతడు జట్టుకు అందుబాటులోకి వస్తాడు.కాగా జేకబ్ బెతెల్ ఆర్సీబీ తరఫున ఈ సీజన్లో కేవలం రెండు మ్యాచ్‌లు ఆడి 67 పరుగులు సాధించాడు. ఇందులో ఓ అర్ధ శతకం (55) ఉండటం విశేషం. మరోవైపు ఆర్సీబీకి ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం (మే 23) సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో, మంగళవారం (మే 27) లక్నో సూపర్ జెయింట్స్‌తో పాటిదార్ సేన తలపడనుంది.ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు కాగా ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరగా.. ముంబై ఇండియన్స్ బుధవారం తమ బెర్తును ఖరారు చేసుకుంది. ఇక టాప్-4లో ఉన్న గుజరాత్ టైటాన్స్ కూడా ఇంగ్లండ్ బ్యాటర్ జోస్ బట్లర్ సేవలను ప్లే ఆఫ్స్‌లో కోల్పోనుంది. వెస్టిండీస్‌తో సొంతగడ్డపై సిరీస్ నేపథ్యంలో బట్లర్ గుజరాత్‌కు దూరం కానున్నాడు.మరోవైపు.. ఈ నెల 26 తర్వాత దక్షిణాఫ్రికాకు చెందిన రికెల్టన్, కార్బిన్ బాష్... ఇంగ్లండ్ ప్లేయర్ విల్ జాక్స్ ముంబై జట్టును వీడనున్నారు. ఈ క్రమంలో ఫ్రాంఛైజీ వారి స్థానాలను జానీ బెయిర్‌స్టో (రూ. రూ.5.25 కోట్లు), రిచర్డ్ గ్లీసన్ (రూ. కోటి)తో పాటు శ్రీలంక ఆటగాడు చరిత అసలంక (రూ. 75 లక్షలు)తో భర్తీ చేసిన విషయం తెలిసిందే.చదవండి: ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా ఆయుశ్, వైభవ్ సూర్యవంశీకి చోటు -
కెప్టెన్‌గా బుమ్రా.. సుదర్శన్‌కు దక్కని చోటు!.. శార్దూల్‌కు ఛాన్స్!
భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్ ఎవరు?.. ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడే జట్టు ప్రకటన ఎప్పుడు?.. భారత క్రికెట్ వర్గాల్లో ఇప్పుడిదే చర్చనీయాంశం. మాజీ క్రికెటర్లలో దిగ్గజం సునిల్ గావస్కర్ సహా వసీం జాఫర్, క్రిష్ణమాచారి శ్రీకాంత్ తదితరులు జస్ప్రీత్ బుమ్రాకే పగ్గాలు అప్పగించాలని సూచిస్తున్నారు.మరోవైపు.. రవిశాస్త్రి వంటి మరికొంత మంది మాజీలు యువకుడైన శుబ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా నియమించాలని, పేస్ దళాన్ని ముందుకు నడిపిస్తున్న బుమ్రాపై అదనపు భారం వద్దని అభిప్రాయపడుతున్నారు.కాగా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. ఈ సిరీస్‌తో టీమిండియా టెస్టు చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. ఇద్దరు స్టార్ల నిష్క్రమణ తర్వాత తొలిసారి విదేశీ గడ్డపై రెడ్‌బాల్ క్రికెట్లో భారత జట్టు ఎలా రాణిస్తుందనే అంశంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.వసీం జాఫర్ ఎంచుకున్న జట్టు ఇదేఇక మే 24న బీసీసీఐ ఇంగ్లండ్ టూర్‌కు జట్టును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈలోపే భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ పదహారు మంది సభ్యులతో కూడిన తన జట్టును ప్రకటించాడు. ఈ జట్టుకు బుమ్రాను కెప్టెన్‌గా ఎంపిక చేసిన వసీం.. శుబ్‌మన్‌ను అతడికి డిప్యూటీగా నియమించాడు.సాయి సుదర్శన్, నితీశ్‌లకు మొండిచేయిఅయితే, మొదటి నుంచి రేసులో ఉన్న సాయి సుదర్శన్ పేరును మాత్రం వసీం జాఫర్ పరిగణనలోకి తీసుకోలేదు. ఐపీఎల్-2025లో అదరగొడుతున్న ఈ గుజరాత్ టైటాన్స్ బ్యాటర్‌ను కాదని.. టెస్టు స్పెషలిస్టు, ఇంగ్లండ్ లయన్స్‌తో తలపడే భారత్-ఎ జట్టు కెప్టెన్ అయిన అభిమన్యు ఈశ్వరన్‌కు పెద్దపీట వేశాడు.అంతేకాదు.. ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీతో ఆకట్టుకున్న ఆంధ్ర పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి కూడా వసీం జాఫర్ మొండిచేయి చూపాడు. అతడికి బదులు సీనియర్ శార్దూల్ ఠాకూర్‌వైపే మొగ్గుచూపాడు.శ్రేయస్ అయ్యర్ లేదంటే కరుణ్ నాయర్ఇక వికెట్ కీపర్ల కోటాలో రిషభ్ పంత్‌తో పాటు ధ్రువ్ జురెల్‌కు స్థానమిచ్చిన వసీం జాఫర్.. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్ లేదంటే కరుణ్ నాయర్లకు ప్రాధాన్యం ఇస్తానని తెలిపాడు. ఇక స్పిన్ దళంలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌తో పాటు.. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజాతో పాటు వాషింగ్టన్ సుందర్‌కు చోటిచ్చాడు ఈ మాజీ క్రికెటర్.అదే విధంగా.. ఫాస్ట్ బౌలర్ల బృందంలో బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీలకు చోటిచ్చిన వసీం జాఫర్.. నాలుగో ఆప్షన్‌గా అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్‌లలో ఒకరిని ఎంచుకుంటానని తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఇంగ్లండ్‌తో టెస్టులకు తన జట్టును ప్రకటించిన వసీం జాఫర్.. మరి మీ ఎంపిక ఏమిటంటూ క్రికెట్ ప్రేమికులను అడగ్గా.. మెజారిటీ మంది అతడి జట్టుతోనే ఏకీభవిస్తున్నారు. కాగా జూన్ 20 నుంచి ఇంగ్లండ్- టీమిండియా మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.ఇంగ్లండ్‌తో టెస్టులకు వసీం జాఫర్ ఎంచుకున్న భారత జట్టుయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), శ్రేయస్ అయ్యర్/కరుణ్ నాయర్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), మహ్మద్ సిరాజ్, అభిమన్యు ఈశ్వరన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్/ప్రసిద్ కృష్ణ/ అకాశ్‌దీప్, వాషింగ్టన్ సుందర్.చదవండి: ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా ఆయుశ్, వైభవ్ సూర్యవంశీకి చోటు -
ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి చోటు
India U-19 squad Announced for tour of England: ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే అండర్-19 జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జూనియర్ సెలక్షన్ కమిటీ గురువారం ప్రకటించింది. ఐదు వన్డే, రెండు మల్టీ- డే మ్యాచ్‌లు ఆడేందుకు సెలక్టర్లు పదహారు మందితో కూడిన జట్టును ఎంపిక చేశారు. జూన్ 24- జూలై 23 వరకు సుదీర్ఘకాలం పాటు భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనుంది.ఇందులో భాగంగా తొలుత 50 ఓవర్ల ఫార్మాట్లో వార్మప్ మ్యాచ్ జరుగనుంది. అనంతరం ఐదు మ్యాచ్‌ల యూత్ వన్డే సిరీస్‌కు ఇంగ్లండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. అనంతరం ఇరుజట్ల మధ్య రెండు మల్టీ-డే మ్యాచ్‌లు (Multi Day Matches) జరుగుతాయి.కెప్టెన్‌గా ఆయుశ్, వైభవ్ సూర్యవంశీకి చోటుఇక ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లే భారత యువ జట్టుకు ముంబై ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ యువ సంచలనం ఆయుశ్ మాత్రే కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతడికి డిప్యూటీగా అభిజ్ఞాన్ కుందును సెలక్ట్ చేశారు. అదే విధంగా.. ఐపీఎల్-2025లో దుమ్మురేపిన రాజస్తాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది.ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఆయుశ్, వైభవ్‌ల ఆట తీరుపైనే ఉండనుంది. పొట్టి క్రికెట్లో అదరగొట్టిన ఈ ఇద్దరు యంగ్ స్టార్లు.. యాభై ఓవర్లు, రెడ్ బాల్ క్రికెట్లో యూకేలో ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కాగా ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీ.. మొత్తంగా ఏడు మ్యాచ్‌లు ఆడి 252 పరుగులు సాధించాడు.మరోవైపు.. ఆయుశ్ మాత్రే చెన్నై తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగి.. ఆరు మ్యాచ్‌లు ఆడి 206 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఐపీఎల్-2025లో తమదైన ముద్ర వేయగలిగారు.ఇంగ్లండ్ పర్యటనకు భారత అండర్-19 పురుషుల జట్టుఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్‌సింగ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), హర్వన్ష్ సింగ్ (వికెట్ కీపర్), ఆర్.ఎస్. అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, యుధాజిత్ గుహ, ప్రణవ్ రాఘవేంద్ర, మొహ్మద్ ఇనాన్, ఆదిత్య రానా, అన్మోల్జీత్ సింగ్.స్టాండ్ బై ప్లేయర్లు: నమన్ పుష్కక్, డి. దీపేశ్, వేదాంత్ త్రివేది, వికల్ప్ తివారి, అలంకృత్ రాపోలే (వికెట్ కీపర్).భారత్ అండర్-19 వర్సెస్ ఇంగ్లండ్ అండర్-19: 2025 షెడ్యూల్👉జూన్ 24- 50 ఓవర్ల వార్మప్ గేమ్- లోబోరో యూనివర్సిటీ👉జూన్ 27- తొలి వన్డే- హోవ్👉జూన్ 30- రెండో వన్డే- నార్తాంప్టన్👉జూలై 2- మూడో వన్డే- నార్తాంప్టన్👉జూలై 5- నాలుగో వన్డే- వోర్సెస్టర్👉జూలై 7- ఐదో వన్డే- వోర్సెస్టర్👉జూలై 12- తొలి మల్టీ డే మ్యాచ్- బెకింగ్‌హామ్👉జూలై 20- రెండో మల్టీ డే మ్యాచ్- చెమ్స్‌ఫోర్డ్.చదవండి: వాళ్లిద్దరి వల్లే నా పని సులువు.. అతడొక అద్భుతం: హార్దిక్ పాండ్యా -
ఢిల్లీ క్యాపిటల్స్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఇలా
ఐపీఎల్-2025 (IPL 2025)ఆరంభంలో అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు నిరాశే మిగిలింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది. తద్వారా టాప్-4 నుంచి అధికారికంగా నిష్క్రమించగా.. ముంబై ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించింది.గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్‌తో పాటు ముంబై టైటిల్ పోరులో నిలిచింది. మరోవైపు.. ముంబై చేతిలో ఓడిపోయిన ఢిల్లీ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఐపీఎల్ సీజన్లో తొలి నాలుగు మ్యాచ్‌లలో గెలిచి కూడా.. ప్లే ఆఫ్స్ చేరని ఏకైక జట్టుగా నిలిచింది.వరుసగా నాలుగు విజయాలుకాగా ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ (Axar Patel) పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. అతడి సారథ్యంలో తొలుత లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడ్డ ఢిల్లీ.. ఒక వికెట్ తేడాతో గెలుపొందింది. మరుసటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీకొట్టిన అక్షర్ సేన.. చెపాక్‌లో సీఎస్కేను 25 పరుగుల తేడాతో ఓడించింది. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును తమ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇలా సీజన్‌లోని తొలి నాలుగు మ్యాచ్‌లలో గెలుపొందిన ఢిల్లీ.. ఆ తర్వాత అదే జోరును కనబరచలేకపోయింది.ముంబై చేతిలో అపుడూ ఓడిన ఢిల్లీముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన(ఏప్రిల్ 13) ఢిల్లీ సీజన్లో తొలి పరాజయం చవిచూసింది. అయితే, మరుసటి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో తలపడ్డ ఢిల్లీ అదృష్టవశాత్తూ సూపర్ ఓవర్లో గెలుపొందింది. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిన అక్షర్ సేన.. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్‌పై సీజన్లో రెండో విజయం సాధించింది.అయితే, ఆర్సీబీ మాత్రం ప్రతీకారం తీర్చుకుని ఢిల్లీలోనే ఢిల్లీ జట్టును ఓడించింది. అనంతరం కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలోనూ అక్షర్ సేన ఓడిపోయింది. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో గట్టెక్కింది. అనంతరం పంజాబ్ కింగ్స్‌తో ఢిల్లీ మ్యాచ్ సాంకేతిక కారణాల (ఆపరేషన్ సిందూర్) వల్ల ఆగిపోయింది.ఆ తర్వాత గుజరాత్‌ను ఢీకొట్టిన ఢిల్లీ పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. తాజాగా ముంబై ఇండియన్స్ చేతిలో మరోసారి ఓటమిని చవిచూసింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో వాంఖడే వేదికగా ఢిల్లీ జట్టు.. హార్దిక్ సేనతో తలపడింది.సూర్య, నమన్ ధనాధన్టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఆతిథ్య జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (73 నాటౌట్), నమన్ ధీర్ (24 నాటౌట్) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ రెండు వికెట్లు కూల్చగా.. దుష్మంత చమీర, ముస్తాఫిజుర్ రహ్మాన్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.లక్ష్య ఛేదనలో ఢిల్లీ విలవిలఇక లక్ష్య ఛేదనలో ఢిల్లీ చేతులెత్తేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (11), తాత్కాలిక కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (6).. వన్‌డౌన్ బ్యాటర్ అభిషేక్ పోరెల్(6) దారుణంగా విఫలమయ్యారు. సమీర్ రిజ్వీ (39), విప్రాజ్ నిగమ్ (20) కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది.మిగతా వారంతా మూకుమ్మడిగా విఫలం కావడంతో 18.2 ఓవర్లలో కేవలం 121 పరుగులు మాత్రమే చేసి ఢిల్లీ ఆలౌట్ అయింది. దీంతో ముంబై చేతిలో 59 పరుగుల తేడాతో ఓడిపోయి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఇలా ఐపీఎల్ సీజన్ ఆరంభంలో వరుసగా తొలి నాలుగు మ్యాచ్‌లు గెలిచినప్పటికీ.. ప్లే ఆఫ్స్ చేరకుండా ఇంటిబాట పట్టిన తొలి జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ అపవాదును మూటగట్టుకుంది. కాగా లీగ్‌లో తమ చివరి మ్యాచ్‌లో ఢిల్లీ పంజాబ్‌తో తలపడనుంది.చదవండి: వారికి నేనిచ్చే సలహా ఇదే: వైభవ్ సూర్యవంశీపై ధోని కామెంట్స్Dominant victory ✅Playoffs ✅A dream outing for #MI in their last match at Wankhede this season as they secure a 59-run win over #DC 💙👏Scorecard ▶ https://t.co/fHZXoEJVed#TATAIPL | #MIvDC | @mipaltan pic.twitter.com/mitYRgtqlZ— IndianPremierLeague (@IPL) May 21, 2025 -
UAE vs BAN: బంగ్లాదేశ్‌కు ఘోర పరాభవం.. చరిత్ర సృష్టించిన యూఏఈ
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) చేతిలో చిత్తుగా ఓడి టీ20 సిరీస్‌ను చేజార్చుకుంది. కాగా మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ (T20 Series) ఆడేందుకు బంగ్లాదేశ్ యూఏఈ పర్యటనకు వెళ్లింది.ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య గత శనివారం (మే 17) తొలి టీ20 జరుగగా.. బంగ్లాదేశ్ 27 పరుగుల తేడాతో గెలిచింది. అయితే, మరుసటి మ్యాచ్‌లో యూఏఈ బంగ్లాదేశ్‌కు షాకిచ్చింది. లిటన్ దాస్ బృందాన్ని రెండు వికెట్ల తేడాతో ఓడించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది.తాంజిద్ హసన్ ధనాధన్అనంతరం బుధవారం రాత్రి జరిగిన మూడో టీ20లోనూ యూఏఈ జయభేరి మోగించింది. షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు.. బంగ్లాదేశ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనర్ పర్వేజ్ హొసేన్ ఎమాన్ (0) డకౌట్ కాగా.. మరో ఓపెనర్ తాంజిద్ హసన్ (18 బంతుల్లో 40) ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు.మిగతా వాళ్లలో కెప్టెన్ లిటన్ దాస్ (14) సహా తౌహీద్ హృదోయ్(0), మెహదీ హసన్ మిరాజ్ (2) పూర్తిగా విఫలమయ్యారు. షమీమ్ హొసేన్ (9), రిషాద్ హొసేన్ (0), తాంజిమ్ హసన్ సకీబ్ (6) కూడా చేతులెత్తేశారు. అయితే, ఆఖర్లో హసన్ మహమూద్ (15 బంతుల్లో 26 నాటౌట్), షోరిఫుల్ ఇస్లాం (7 బంతుల్లో 16 నాటౌట్) మాత్రం దంచికొట్టారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లాదేశ్ తొమ్మిది వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. యూఏఈ బౌలర్లలో హైదర్ అలీ మూడు వికెట్లతో చెలరేగగా.. సఘీర్ ఖాన్, మతియుల్లా ఖాన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. మిగతా వాళ్లలో ఆకిఫ్ రాజా, ధ్రువ్ పరాషర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.అర్ధ శతకంతో మెరిసిన అలిషాన్ షరాఫూఇక లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే యూఏఈ ఓపెనర్, కెప్టెన్ ముహమద్ వసీం (9) అవుటయ్యాడు. అయితే, మరో ఓపెనర్ ముహమద్ జోహైబ్ (29)తో కలిసి వన్‌డౌన్ బ్యాటర్ అలిషాన్ షరాఫూ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వికెట్ కీపర్ రాహుల్ చోప్రా (13) విఫలం కాగా.. ఆసిఫ్ ఖాన్‌తో కలిసి అలిషాన్ యూఏఈని గెలుపు తీరాలకు చేర్చాడు.అలిషాన్ షరాఫూ కేవలం 47 బంతుల్లోనే 68 పరుగులతో, ఆసిఫ్ ఖాన్ 26 బంతుల్లో 41 రన్స్‌తో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే కేవలం మూడు వికెట్లు నష్టపోయి యూఏఈ లక్ష్యాన్ని ఛేదించింది.తద్వారా బంగ్లాదేశ్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలిచి టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. కాగా పొట్టి ఫార్మాట్లో యూఏఈకి బంగ్లాదేశ్‌పై ఇదే తొలి ద్వైపాక్షిక సిరీస్ విజయం కావడం విశేషం. ఇక ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అలిషాన్ షారిఫూ దక్కించుకోగా.. ముహమద్ వసీం ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు.చదవండి: MI Vs DC: ముందు చేతులు శుభ్రం చేసుకో బుమ్రా!.. నీతా అంబానీ చర్య వైరల్ -
వాళ్లిద్దరి వల్లే నా పని సులువు.. అతడొక అద్భుతం: హార్దిక్ పాండ్యా
ఢిల్లీ క్యాపిటల్స్ (MI vs DC)తో కీలక పోరులో విజయం సాధించడం పట్ల ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) హర్షం వ్యక్తం చేశాడు. జట్టు ప్రదర్శన పట్ల తాను సంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు. కాగా గతేడాది హార్దిక్ సేన.. పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన విషయం తెలిసిందే.టాప్-4లో అడుగుఇక ఐపీఎల్-2025 (IPL 2025) ఆరంభంలోనూ వరుస ఓటములతో చతికిలపడ్డ ముంబై.. ఆ తర్వాత అనూహ్య రీతిలో పుంజుకుని డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించింది. తద్వారా ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు దూసుకువచ్చిన హార్దిక్ సేన.. బుధవారం ఢిల్లీపై గెలిచి టాప్-4లో అడుగుపెట్టింది.సూర్య, నమన్ ఫటాఫట్సొంత మైదానం వాంఖడేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు సాధించింది. సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 73 నాటౌట్), నమన్ ధీర్ (8 బంతుల్లో 24 నాటౌట్) వల్లే ఈ మేర స్కోరు సాధ్యమైంది.ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే ముంబై బౌలర్లు ఢిల్లీ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. పవర్ ప్లేలో వరుస విరామాల్లో వికెట్లు తీసి ఫాఫ్ బృందాన్ని కోలుకోనివ్వకుండా చేశారు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(6)ను అవుట్ చేసి దీపక్ చహర్ శుభారంభం అందించగా.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (11)ను బౌల్డ్ పెవిలియన్‌కు పంపాడు.సాంట్నర్, బుమ్రా అదరగొట్టారుఆ తర్వాత మిచెల్ సాంట్నర్, జస్ప్రీత్ బుమ్రా ఆకాశమే హద్దుగా చెలరేగి ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. క్రీజులో పాతుకుపోవాలని చూసిన సమీర్ రిజ్వీ (39), విప్రాజ్ నిగమ్ (20)ల రూపంలో కీలక వికెట్లు తీసిన సాంట్నర్.. మరో హిట్టర్ అశుతోష్ శర్మ (18) వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక బుమ్రా ట్రిస్టన్ స్టబ్స్ (2) రూపంలో ప్రమాదకర బ్యాటర్‌ను వెనక్కి పంపడంతో పాటు.. మాధవ్ తివారి (3), ముస్తాఫిజుర్ రహ్మమాన్ (0)లను బౌల్డ్ చేసి.. ముంబైని విజయతీరాలకు చేర్చాడు. ముంబై బౌలర్ల ధాటికి ఢిల్లీ క్యాపిటల్స్ 18.2 ఓవర్లలో 121 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ కాగా.. హార్దిక్ సేన 59 పరుగుల తేడాతో గెలిచింది. సీజన్లో ఎనిమిదో గెలుపు నమోదు చేసి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది.వాళ్లిద్దరి వల్లే నా పని సులువు.. అతడొక అద్భుతంఈ నేపథ్యంలో విజయానంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ‘‘ఎలాంటి పరిస్థితుల్లోనైనా.. ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను సాంట్నర్, బుమ్రాలకు బంతిని ఇచ్చేందుకు వెనుకాడను. ఎందుకంటే వారిద్దరు మ్యాచ్‌ను ఆధీనంలోకి తెచ్చుకోవడంలో దిట్ట.అంతేకాదు.. ఏ పని చేసినా దాని అంతు చూసేదాకా వదిలిపెట్టరు. వాళ్లిద్దరి వల్లే నా పని సులువైంది. ఈ పిచ్‌పై 160 పరుగుల రావడమే ఎక్కువ అనుకున్నాం. అలాంటి స్థితిలో సూర్య, నమన్ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా.. నమన్.. వికెట్ కఠినంగా మారుతున్న వేళ కూడా అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు’’ అని సహచర ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించాడు. ఇక ఈ మ్యాచ్‌లో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. కేవలం మూడు పరుగులే చేశాడు. అదే విధంగా ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ వేయలేదు.చదవండి: MI Vs DC: ముందు చేతులు శుభ్రం చేసుకో బుమ్రా!.. నీతా అంబానీ చర్య వైరల్Dominant victory ✅Playoffs ✅A dream outing for #MI in their last match at Wankhede this season as they secure a 59-run win over #DC 💙👏Scorecard ▶ https://t.co/fHZXoEJVed#TATAIPL | #MIvDC | @mipaltan pic.twitter.com/mitYRgtqlZ— IndianPremierLeague (@IPL) May 21, 2025 -
అతడి బాటలో నడుస్తా.. ప్రొఫెషనల్‌గా సిమ్రన్‌జీత్ కౌర్
న్యూఢిల్లీ: భారత మహిళా బాక్సర్ సిమ్రన్‌జీత్ కౌర్ ప్రొఫెషనల్‌గా మారనుంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన 29 ఏళ్ల సిమ్రన్‌జీత్ కౌర్ (Simranjeet Kaur)... అమెరికా మాజీ బాక్సర్ రాయ్ జోన్స్, భారత బాక్సర్ మన్దీప్ జాంగ్రాతో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది భారత్ నుంచి నిశాంత్ దేవ్, అమిత్ పంఘాల్ ప్రొఫెషనల్‌గా మారగా... ఇప్పుడు ఆ జాబితాలో సిమ్రన్‌జీత్ కూడా చేరింది.కాగా 2020 టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన సిమ్రన్‌జీత్... ఆసియా చాంపియన్‌షిప్స్‌లో పలు పతకాలు నెగ్గింది. ఈ ఏడాది జాతీయ చాంపియన్‌షిప్ 65 కేజీల విభాగంలో రెండో స్థానంలో నిలిచిన కౌర్... అమెచ్యూర్ బాక్సింగ్ నుంచి ప్రొఫెషనల్‌గా మారాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.అతడి బాటలోనే నడుస్తూ‘ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. మన్దీప్ జాంగ్రా ఇప్పటికే దేశం గర్వపడే విజయాలు సాధించారు. అతడి బాటలోనే నడుస్తూ మెరుగైన ఫలితాలు సాధించేందుకు నావంతు ప్రయత్నం చేస్తా. ఈ ప్రయాణంలో రాయ్ జోన్స్ సహకారం మరవలేను’ అని సిమ్రన్‌జీత్ పేర్కొంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన భారత బాక్సర్ విజేందర్ సింగ్... దేశం నుంచి తొలి ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారగా... ఆ తర్వాత వికాస్ కృషన్, సరితా దేవి, నీరజ్ గోయత్ వంటి పలువురు బాక్సర్లు ప్రొఫెషనల్స్‌గా మారారు. కాగా పంజాబ్ నుంచి తొలి మహిళా ప్రొఫెషనల్ బాక్సర్‌గా సిమ్రన్ నిలవనుండటం విశేషం. భారత జట్టు పసిడి బోణీన్యూఢిల్లీ: జూనియర్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత జట్టు పసిడి బోణీ కొట్టింది. జర్మనీ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో హరియాణాకు చెందిన యువ షూటర్ కనక్ స్వర్ణ పతకంతో మెరిసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో బుధవారం 17 ఏళ్ల కనక్ 239 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. 8 మంది షూటర్లు పాల్గొన్న 24 షాట్ల తుదిపోరులో కనక్ తన గురితో అదరగొట్టింది.‘ఆరంభంలో కాస్త ఒత్తిడికి లోనయ్యా. కానీ ఆ తర్వాత మెరుగైన ప్రదర్శన చేయడం ఆనందంగా ఉంది.’ అని కనక్ వెల్లడించింది. మాల్దోవాకు చెందిన అన్నా డుల్స్ 1.7 పాయింట్ల తేడాతో రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకోగా... చెన్ యెన్ చింగ్ (చైనీస్ తైపీ) కాంస్యం గెలుచుకుంది. అంతకుముందు జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్లో భారత్ నుంచి ఇద్దరు షూటర్లు ఫైనల్‌కు అర్హత సాధించారు. కనక్ 571 పాయింట్లతో, ప్రాచి 572 పాయింట్లతో తుదిపోరుకు చేరారు. -
MI Vs DC: ముందు చేతులు శుభ్రం చేసుకో బుమ్రా!.. నీతా అంబానీ చర్య వైరల్
గతేడాది చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న ముంబై ఇండియన్స్.. ఐపీఎల్-2025 (IPL 2025)లో మాత్రం అదరగొట్టింది. సీజన్ ఆరంభంలో తడబడ్డా.. ఆతర్వాత తిరిగి పుంజుకుని ఏకంగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. వాంఖడేలో ఢిల్లీ క్యాపిటల్స్ (MI vs DC)తో బుధవారం నాటి మ్యాచ్‌లో ఘన విజయం సాధించి.. టాప్-4కు అర్హత సాధించింది.కుమారుడితో కలిసి మ్యాచ్ వీక్షించిన నీతాఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ యజమానులు నీతా అంబానీ (Nita Ambani), ఆమె కుమారుడు ఆకాశ్ అంబానీ ఆనందంలో మునిగిపోయారు. వాంఖడేలో ప్రత్యక్ష్యంగా మ్యాచ్ వీక్షిస్తూ ఆద్యంతం తమ హావభావాలతో హైలైట్ అయ్యారు. ఆటగాళ్లతో కలిసి జట్టు విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.ముందు చేతులు శుభ్రం చేసుకోఈ సందర్భంగా నీతా అంబానీ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆటగాళ్లతో కరచాలనం చేసే సమయంలో నీతా.. ముంబై ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఆవిడే స్వయంగా బుమ్రా చేతులపై సానిటైజర్ పోశారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కోవిడ్ కేసుల నేపథ్యంలోకాగా ఇటీవలి కాలంలో కోవిడ్-19 కేసులు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇక ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ట్రవిస్ హెడ్‌కు ఇటీవల కోవిడ్ పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా నీతా అంబానీ.. బుమ్రా చేతులను సానిటైజ్ చేయడం గమనార్హం.సెలైవాతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశంకాగా ఈసారి ఐపీఎల్లో బౌలర్లు సెలైవా (ఉమ్మి)ను ఉపయోగించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అనుమతించిన విషయం తెలిసిందే. స్వింగ్ రాబట్టేందుకు పేసర్లు బంతిపై లాలాజలం ఉపయోగించే వీలు కల్పించింది. కరోనా కాలంలో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా.. విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇక బుమ్రా కూడా పేసర్ అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరోగ్య స్పృహతో నీతా అంబానీ చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.దంచికొట్టిన సూర్య, నమన్ఇక బుమ్రా ఒక్కడికే కాకుండా సూర్యకుమార్ యాదవ్, దీపక్ చహర్ తదితరులకు సానిటైజర్ అందించారు నీతా. అందరు ఆటగాళ్లను చేతులను శుభ్రం చేసుకోమని చెప్పారు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సొంత మైదానంలో టాస్ ఓడిన ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో రోహిత్ శర్మ (5) విఫలం కాగా.. రియాన్ రెకెల్టన్ (25) ఫర్వాలేదనిపించాడు. విల్ జాక్స్ (13 బంతుల్లో 21) కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. తిలక్ వర్మ (27) కూడా చేతులెత్తేశాడు.ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 73 నాటౌట్), నమన్ ధిర్ (8 బంతుల్లో 24 నాటౌట్) ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టి ముంబై శిబిరంలో ఉత్సాహం నింపారు. వీరిద్దరి కారణంగా ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.బౌలర్లు చెలరేగడంతోఇక లక్ష్య ఛేదనలో ఢిల్లీని 18.2 ఓవర్లలో 121 పరుగుల వద్ద ముంబై ఆలౌట్ చేసింది. జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ సాంట్నర్ మూడేసి వికెట్లతో చెలరేగగా.. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చహర్, విల్ జాక్స్, కర్ణ్ శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇలా ముంబై బౌలర్లంతా సమిష్టిగా రాణించి జట్టు గెలుపులో భాగం పంచుకున్నారు. సూర్యకుమార్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఇక ఢిల్లీని 59 పరుగుల తేడాతో ఓడించిన ముంబై ప్లే ఆఫ్స్ చేరగా.. ఢిల్లీ టోర్నీ నుంచి నిష్క్రమించింది.చదవండి: Vaibhav Suryavanshi: ఫోన్ ఆన్ చేయగానే 500 మిస్స్డ్ కాల్స్ Seeing Nita Ambani, Rohit Sharma, Suryakumar and other players using sanitizer reminded me of covid-19.😂😭 pic.twitter.com/20ArDT2BXt— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) May 21, 2025 -
MI vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్‌కు ఎదురుదెబ్బ
ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ ముకేశ్ కుమార్ (Mukesh Kumar)కు ఐపీఎల్ పాలక మండలి జరిమానా విధించింది. అతడి మ్యాచ్ ఫీజులో పది శాతం కోత విధించడంతో పాటు.. ఓ డీమెరిట్ పాయింట్ కూడా జత చేసింది. ఐపీఎల్-2025 (IPL 2025)లో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు బుధవారం ముంబై ఇండియన్స్‌తో తలపడింది.సూర్య, నమన్ ధనాధన్ముంబై సొంత మైదానం వాంఖడేలో జరిగిన ఈ పోరులో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ చేసింది. ఆరంభంలో ఆకట్టుకున్నా.. ఆఖర్లో ఢిల్లీ బౌలర్లు తేలిపోయారు. సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 73 నాటౌట్), నమన్ ధిర్ (8 బంతుల్లో 24 నాటౌట్) అద్భుతంగా రాణించడంతో ముంబై మెరుగైన స్కోరు సాధించింది.నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ (2/48) రెండు వికెట్లతో రాణించగా.. దుష్మంత చమీర, ముస్తాఫిజుర్ రహ్మాన్, కుల్దీప్ యాదవ్ తలా ఓ వికెట్ పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఆరంభం నుంచే తడబడింది.ఢిల్లీ తడ‘బ్యా’టుఓపెనర్లు కేఎల్ రాహుల్ (11), కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (6) పూర్తిగా విఫలమయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన అభిషేక్ పోరెల్ (6) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో సమీర్ రిజ్వీ (39), విప్రాజ్ నిగమ్ (20) కాసేపు పోరాడే ప్రయత్నం చేశారు.అయితే, ముంబై బౌలర్ల ధాటికి ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్ ఎక్కువ సేపు నిలవలేకపోయింది. 18.2 ఓవర్లలో కేవలం 121 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో 59 పరుగుల తేడాతో గెలిచిన ముంబై ప్లే ఆఫ్స్ చేరగా.. ఢిల్లీ టోర్నీ నుంచి నిష్క్రమించింది.అనుచిత ప్రవర్తనఇక ఈ మ్యాచ్ సందర్భంగా అనుచితంగా ప్రవర్తించినందుకు గానూ ముకేశ్ కుమార్‌కు జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘ఐపీల్ ప్రవర్తనా నియమావళిలలోని ఆర్టికల్ 2.2 (ఆటకు సంబంధించిన వస్తువులు, దుస్తులు, గ్రౌండ్‌కు చెందిన ఎక్విప్మెంట్ను డ్యామేజ్ చేయడం) ప్రకారం ముకేశ్ కుమార్ లెవల్ 1 తప్పిదానికి పాల్పడ్డాడు.ఇందుకు సంబంధించి మ్యాచ్ రిఫరీ తీసుకున్న నిర్ణయాన్ని అతడు అంగీకరించాడు’’ అని ఐపీఎల్ పాలక మండలి తెలిపింది. అయితే, ముకేశ్ కుమార్ చేసిన తప్పేమిటో మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. కాగా డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్న వేళ ఈ ఢిల్లీ పేసర్ కాస్త అసహనానికి లోనైన విషయం తెలిసిందే.ఇక ముంబైతో కీలక మ్యాచ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ దూరమైన విషయం తెలిసిందే. అనారోగ్యం కారణంగా ఈ ఆల్‌రౌండర్ సేవలను జట్టు వినియోగించుకోలేకపోయింది. అతడి స్థానంలో వైస్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఢిల్లీని ముందుకు నడిపించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓడిపోవడంతో ఇంటిబాట పట్టింది.చదవండి: Vaibhav Suryavanshi: ఫోన్ ఆన్ చేయగానే 500 మిస్స్డ్ కాల్స్ Dominant victory ✅Playoffs ✅A dream outing for #MI in their last match at Wankhede this season as they secure a 59-run win over #DC 💙👏Scorecard ▶ https://t.co/fHZXoEJVed#TATAIPL | #MIvDC | @mipaltan pic.twitter.com/mitYRgtqlZ— IndianPremierLeague (@IPL) May 21, 2025 -
వెస్టిండీస్‌కు ‘భారీ’ షాకిచ్చిన ఐర్లాండ్.. చిత్తు చిత్తుగా ఓడించి..
వెస్టిండీస్‌కు ఐర్లాండ్ క్రికెట్ జట్టు భారీ షాకిచ్చింది. విండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ (ODI Series)ను ఘనంగా ఆరంభించింది. డబ్లిన్ వేదికగా బుధవారం జరిగిన తొలి పోరులో ఐర్లాండ్ వెస్టిండీస్‌ను ఏకంగా 124 పరుగుల తేడాతో చిత్తు చేసింది. కాగా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడే నిమిత్తం వెస్టిండీస్ ఐర్లాండ్‌లో పర్యటిస్తోంది.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం తొలి వన్డే జరిగింది. ‘ది విలేజ్’ మైదానంలో టాస్ గెలిచిన విండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. నిర్ణీత యాభై ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 303 పరుగులు చేసింది.ఓపెనర్లలో ఆండీ బాల్బిర్నీ (138 బంతుల్లో 112; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా... కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ (54; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు).. నాలుగో నంబర్ బ్యాటర్ హ్యారీ టెక్టర్ (56; 6 ఫోర్లు) అర్ధశతకాలు బాదారు. ఇక విండీస్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డ్ 3 వికెట్లు పడగొట్టాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 34.1 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. రోస్టన్ చేజ్ (55; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో మెక్‌కార్తీ 4 వికెట్లు తీశాడు. సెంచరీ హీరో బాల్బిర్నీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. తొలి వన్డేలో విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఐర్లాండ్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం రెండో వన్డే జరగనుంది. కాగా ఓవరాల్‌గా వెస్టిండీస్‌పై ఐర్లాండ్కిది నాలుగో విజయం కావడం విశేషం. ఇదీ చదవండి: విండీస్‌తో సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు షాక్లండన్: ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జోఫ్రా ఆర్చర్ గాయంతో వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. 29న ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగే తొలి వన్డేతో మూడు మ్యాచ్‌ల సిరీస్ మొదలవుతుంది. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆర్చర్‌కు కుడిచేతి బొటనవేలికి గాయమైంది. లీగ్ వారం వాయిదా పడగానే స్వదేశానికి చేరుకున్న అతను తిరిగి ఐపీఎల్ పునఃప్రారంభమైనప్పటికీ గాయం కారణంగానే భారత్‌కు రాలేకపోయాడు.గాయపడిన అతని పరిస్థితిని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) వైద్య బృందం పర్యవేక్షిస్తోందని, రెండు వారాల తర్వాత మరోసారి గాయం తీవ్రతను సమీక్షిస్తుందని బోర్డు వర్గాలు తెలిపాయి. అయితే ఆర్చర్‌కు గాయమవడం... జట్టుకు దూరమవడం ఇదేం కొత్త కాదు. సుదీర్ఘకాలంగా అతను మోచేతి గాయంతో సతమతమయ్యాడు. పలుమార్లు సర్జరీలు కూడా జరిగాయి.తర్వాత వెన్నెముక గాయంతో చాన్నాళ్ల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఎట్టకేలకు గతేడాది అమెరికా, కరీబియన్లు ఆతిథ్యమిచ్చిన టీ20 ప్రపంచకప్‌తో పునరాగమనం చేశాడు. ఈ ఏడాది పాక్‌లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. అతని స్థానంలో లాంకషైర్‌కు చెందిన లెఫ్టార్మ్ సీమర్ ల్యూక్ వుడ్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇదివరకే టీ20 జట్టుకు ఎంపికైన వుడ్‌కు ఇప్పుడు వన్డే జట్టులోనూ స్థానం దక్కింది. 2022–23 సీజన్లో రెండు వన్డేలాడిన ల్యూక్ వుడ్ ఒక వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. చదవండి: IPL 2025: ‘ప్లే ఆఫ్స్’కు ముంబై█▓▒▒░░░Score update░░░▒▒▓█What a hundred from Balbo 👏👏👏▪️Ireland 256-3 (44 overs)👀 WATCH: TNT Sport 2 (411)📝 SCORECARD: https://t.co/9cwPX120LU#BackingGreen #TokenFi @solar_failte☘️🏏 pic.twitter.com/Sgvq0EOBDp— Cricket Ireland (@cricketireland) May 21, 2025