సిక్స్ బాదాడని బ్యాట‌ర్‌ను కొట్టిన బౌల‌ర్‌! వీడియో వైర‌ల్‌ | South African Bowler Pushes Bangladesh Batter | Sakshi
Sakshi News home page

SA vs BAN: సిక్స్ బాదాడని బ్యాట‌ర్‌ను కొట్టిన బౌల‌ర్‌! వీడియో వైర‌ల్‌

May 29 2025 10:39 AM | Updated on May 29 2025 10:56 AM

South African Bowler Pushes Bangladesh Batter

మిర్పూర్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికా-ఈ, బంగ్లాదేశ్ మ‌ధ్య జ‌రుగుతున్న అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో వివాదం చెల‌రేగింది. ఈ మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా ఫాస్ట్ బౌల‌ర్ షెప్టో తులి జెంట‌ల్‌మేన్ గేమ్‌కు మాయని మ‌చ్చ తీసుకొచ్చేలా ప్ర‌వ‌ర్తించాడు. క్రికెట్‌లో చిన్న చిన్న‌ గొడ‌వ‌లు సాధారణంగా మ‌నం చూస్తూ ఉంటాము.

కానీ ఈ యువ బౌలర్‌ తులి మాత్రం ప్రత్యర్ధి బ్యాటర్ సిక్స్ బాదడని దాడికి దిగాడు. బంగ్లా ఇన్నింగ్స్ 105వ ఓవర్ వేసిన తులి బౌలింగ్‌లో తొలి బంతిని రిపోన్ మోండోల్ స్ట్రైయిట్‌గా సిక్సర్ బాదాడు. దీంతో సహనాన్ని కోల్పోయిన సఫారీ బౌలర్.. రిపోన్‌తో గొడవపడ్డాడు. ఈ క్రమంలో అతడి వద్దకు వెళ్లి చేయి చేసుకున్నాడు.

రిపోన్ కూడా తిరగబడడంతో గొడం పెద్దదైంది. ఇద్దరు ఆటగాళ్ళు ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో అంపైర్‌లు, సహచర ఆటగాళ్లు జోక్యం చేసుకోవడంతో గొడవసద్దుమణిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. 

క్రిక్ ఇనో ఫో రిపోర్ట్ ప్రకారం.. ఈ ఇద్దరి ఆటగాళ్లపై మ్యాచ్ రిఫరీ క్రికెట్ సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులకు తన నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరిపై వారి క్రికెట్ బోర్డు సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశముంది.


 

 

Advertisement
 
Advertisement
Advertisement