నోబెల్ కమిటీ కన్నెర్ర.. డొనాల్డ్‌ ట్రంప్‌కు బిగ్‌ షాక్‌! | Donald Trump has once again missed out on the Nobel Peace Prize | Sakshi
Sakshi News home page

నోబెల్ కమిటీ కన్నెర్ర.. డొనాల్డ్‌ ట్రంప్‌కు బిగ్‌ షాక్‌!

Oct 9 2026 3:56 PM | Updated on Oct 9 2026 4:03 PM

Donald Trump has once again missed out on the Nobel Peace Prize

ఓస్లో: ప్రతిష్టాత్మక నోబెల్‌ శాంతి పురస్కారాన్ని దక్కించుకోవాలనుకున్న అమెరికా అధ్యక్షుడు డొలాల్డ్‌ ట్రంప్‌ ఆశలు అడియాశలయ్యాయి. ట్రంప్ కల కలగా మిగిలింది. ప్రపంచ దేశాల్లో శాంతి కోసం పాటు పడుతున్న తనకు నోబెల్‌ శాంతి బహుమతి ఇవ్వాలంటూ ఓవల్ ఆఫీస్‌లో హుకుం జారీచేసిన ట్రంప్‌కు నోబెల్ కమిటీ కన్నెర్ర చేసింది. 

ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతికి దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు, భారతీయ తమిళ సంతతికి చెందిన నవనీతమ్‌ నవీ పిళ్లైని ఎంపిక చేసింది. నార్వేజియన్ నోబెల్ కమిటీ ఈ అత్యున్నత పురస్కారాన్ని అధికారికంగా ప్రకటించింది.

అంతర్జాతీయ చట్టాలు పటిష్టం కావడంలో, ప్రపంచ శాంతి స్థాపనలో, మానవ హక్కుల పరిరక్షణ కోసం ఆమె దశాబ్దాలుగా అందించిన అమూల్యమైన సేవలను నార్వేజియన్ నోబెల్ కమిటీ గుర్తించి ఈ అత్యున్నత పురస్కారాన్ని కట్టబెట్టింది. నవీ పిళ్లై ఈ ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాన్ని దక్కించుకోవడం పట్ల ప్రపంచ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతుండగా.. నవీ పిళ్లైని చూసి భారత్ గర్వపడుతోంది.

ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు 
ఇటీవల తనకు నోబెల్‌ శాంతి బహుమతి కావాలనే ఆశను ట్రంప్‌ బహిరంగంగా బయటపెట్టారు. తాను అనేక వివాదాలను, యుద్ధాలను పరిష్కరించానని, చరిత్రలో ఎవరూ చేయని విధంగా శాంతి స్థాపనకు కృషి చేశానని బహిరంగంగానే ప్రకటించుకున్న ఆయన, తనకు ఈసారైనా నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాలని గట్టిగా కోరారు.

ఒకవేళ తనకు ఇవ్వకపోతే అది నార్వేజియన్ నోబెల్ కమిటీకి కూడా పెద్ద అవమానమని, కమిటీ తనను విస్మరిస్తే వారి చరిత్రాత్మక తప్పిదమవుతుందని ఇటీవల ఓవల్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ట్రంప్ అంచనాలు తలకిందులవుతూ నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రకటన వెలువడింది. అందరూ ఊహించినట్లుగానే ట్రంప్‌ ఆశలు అడియాశలయ్యాయి.

ఇదీ చదవండి : నవీ పిళ్లైకి నోబెల్‌ శాంతి బహుమతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement