breaking news
navanethem navi pillay
-
లాయర్ అవుతా..
ఈరోజు అంతర్జాతీయ బాలికల దినోత్సవం. ..ఎంతో మంది బాలికలకు స్ఫూర్తినిచ్చే చైతన్య తేజం పేరు... నవీ పిళ్లై దశాబ్దాల క్రితం... పదకొండు సంవత్సరాల బాలిక ‘నేను లాయర్ అవుతాను’ అని టీచర్‌తో సంతోషంగా చెప్పింది. ‘గుడ్’ అనలేదు టీచర్. అదోలా చూసి కళ్లతోనే వెక్కిరించారు. ‘లాయర్ కావాలంటే చాలా డబ్బు ఉండాలి. నీవల్ల కాదు’ అన్నట్లుగా మాట్లాడారు. ఆ బాలికకు డబ్బు లేదు. ధైర్యం ఉంది. బాలికలకు ధైర్యం ఉంటే చరిత్ర సృష్టించగలరని నిరూపించింది. ఆనాటి ఆ బాలిక పేరు... నవీ పిళ్లై. నోబెల్ శాంతి బహుమతితో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన, భారతీయ మూలాలు ఉన్న నవీ పిళ్లై అంతరంగ కథనం...మా నాన్న బస్సు డ్రైవర్‘నేను లాయర్ అవుతాను’ అని మా టీచర్‌తో చెప్పినప్పుడు ‘నువ్వు లాయర్ కావాలంటే, మీ నాన్న ధనవంతుడై ఉండాలి. లా చదవడానికి చాలా డబ్బులు కావాలి’ అన్నారు. మా నాన్న బస్సు డ్రైవర్. టీచర్ మాట నన్ను బాగా కుృంగదీసింది. సమాజ నిర్మాణం, పెద్దలు మనతో చెప్పే మాటలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఆ అడ్డంకులను అధిగమించడం పిల్లలకు చాలా కష్టంగా ఉంటుంది. ఆ కష్టాలను అధిగమించి లా చదివాను. లా పట్టా పుచ్చుకున్న తరువాత ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవడం మొదలు పెట్టాను. న్యాయసంస్థ(లా ఫర్మ్)లలో పనిచేసే వారంతా ఎక్కువగా శ్వేతజాతీయులే. ‘సారీ... నిన్ను ఉద్యోగంలోకి తీసుకోలేము’ అనేది వారి నుంచి వచ్చే మొదటి మాట. ‘ఎందుకో తెలుసుకోవచ్చా?’ అని అడిగితే... ‘బ్లాక్ పర్సన్ నుండి వైట్ సెక్రటరీ ఆదేశాలు అందుకోవడం ఎంతమాత్రం బాగుండదు’ అని చెప్పేవారు. ఇంత కంటే జాతివివక్ష ఏముంటుంది! జాతివివక్ష–వర్గవివక్షకేవలం జాతివివక్షే కాదు వర్గవివక్ష కూడా ఎదుర్కొన్నాను. ‘ఒక వేళ నీకు ఉద్యోగం ఇస్తే ఎలాంటి క్లయింట్లను తీసుకురాగలవు? మీ నాన్న వ్యాపారం చేస్తాడా?’ అని అడిగేవారు. ‘నాన్న బస్సు డ్రైవర్’ అనగానే వెటకారంగా మాట్లాడేవారు.‘నాకు ఈమధ్యే పెళ్లయింది’ అని చెప్పినప్పుడు... ‘ఒకవేళ నువ్వు ప్రెగ్నెట్ అయితే పరిస్థితి ఏమిటి!’ అనేవాళ్లు. దీంతో నేనే సొంతంగా లా ఫర్మ్‌ను ప్రారంభించాను. అప్పుడు కూడా వివక్ష తప్పలేదు. ‘ఎంత అహంకారం ఉంటే సొంతంగా లా ఫర్మ్‌ను ప్రారంభిస్తుంది! ఇది ఎంత కాలం నిలుస్తుంది?’ అనేవాళ్లు.వేరే మార్గం లేదు...ఉన్నది ఒకే మార్గం!నా ధైర్యమే నన్ను నిలబెట్టింది. గృహహింస కేసులలో నైపుణ్యం ఉన్న న్యాయవాదిగా పేరు తెచ్చింది. వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్యకర్తలకు అండగా నిలబడి వారి తరపున ఎన్నో కేసులు వాదించాను. నేను వాదించిన కేసులు రాబెన్ ద్వీపంలోని ఖైదీల హక్కులను కాపాడడానికి సహాయపడ్డాయి. దక్షిణాఫ్రికా చట్టాలు నాకు అన్యాయంగా అనిపించేవి. వర్ణవివక్ష చట్టాలకు సంబంధించి నిష్పాక్షిక విచారణ జరిగేది కాదు. వర్ణవివక్ష పాలకుల పాలనలో నా చర్మరంగు కారణంగా న్యాయమూర్తి గదిలోకి ప్రవేశించకుండా నన్ను నిషేధించారు. 1995లో నెల్సన్ మండేలా నన్ను సుప్రీంకోర్టులో నియమించారు. అలా దక్షిణాఫ్రికాలో మొట్టమొదటి శ్వేతజాతీయేతర మహిళా న్యాయవాదిగా గుర్తింపు పొందాను.మానవ హక్కుల న్యాయవాదిగా నా వృత్తిజీవితాన్ని ప్రారంభించడానికి కారణం... నేను ఎదుర్కొన్న వర్ణవివక్ష. శ్వేతజాతీయుల కోసం ఏర్పాటైన పార్క్‌లు, బీచ్లలోకి నేను అడుగు పెట్టలేకపోయేదాన్ని. అందుకే... నేను వర్ణవివక్ష వ్యతిరేక కార్యకర్తల తరఫున కోర్టులో వాదించే రోజులలో...‘మీరు ఏదో చేస్తున్నారు. పరిస్థితులు ఇలాగే ఉండనివ్వండి. సమస్యలు తేకండి’ అని చాలామంది నాతో అనేవారు. నేను మాత్రం... పరిస్థితులు ఇలాగే ఉంటే ఇదే సహజం, నల్లజాతీయులను అలా చూడడం సరిౖయెనదే అనుకుంటారు. అందుకే...పరిస్థితులను మార్చాలనుకుంటున్నాను అని వారితో చెప్పేదానిని.గృహహింసకు వ్యతిరేకంగా...నేను న్యాయశాస్త్ర పాఠాలను యూనివర్శిటీలో కంటే నిజజీవిత అనుభవాల నుంచే ఎక్కువగా చదువుకున్నాను. ఎంతోమంది మహిళలు ఎన్నో రకాలుగా నా కళ్లు తెరిపించారు. వారి ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకోగలిగాను. 1960 దశకంలో ఎంతోమంది మహిళలు నా దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకునేవాళ్లు. వారు గృహహింస బాధితులు. వారికి అనేక రకాలుగా ధైర్యం చెప్పేదానిని. నిజానికి గృహహింస అనేది వ్యక్తిగత కేసులకు అతీతమైనది. ఈ సమస్యపై ప్రచారం చేయడానికి నడుం బిగించాను.దారుణంగా గృహహింసకు గురైన ఒక మహిళను టీవీలో చూపించిన మొదటి వ్యక్తిని నేనే. భర్త ఆమెను కత్తితో పొడిచాడు. నానా రకాలుగా హింసించాడు. ఇలాంటి ఎన్నో అనుభవాలు నా పోరాటానికి ప్రేరణ ఇచ్చాయి.‘ఈక్వాలిటీ నౌ’ అనే ఇంటర్నేషనల్ ఉమెన్స్ రైట్ ఆర్గనైజేషన్, గృహహింస నిరోధక స్వచ్ఛంద సంస్థ ‘అడ్వైస్ డెస్క్ ఫర్ ది అబ్యూజ్డ్’ ప్రారంభించడానికి కారణం అయ్యాయి. హింసకు గురైన మహిళలకు రక్షణగా నిలిచే చట్టంలోని లోపాలను ఈ సంస్థలు దృష్టి పెట్టాయి. గృహహింస నిరోధక చట్టాలను గట్టిగా అమలు చేయాలని ఈ సంస్థల ద్వారా ఉద్యమించాం.తల్లుల గర్భశోకంఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యూనల్ ఫర్ రువాండ(ఐసీటీఆర్)కు సంబంధించిన ఎన్నికల కోసం నన్ను జడ్జీగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి నామినేట్ చేశారు ప్రెసిడెంట్ నెల్సన్ మండేలా. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి ఎంపికైన ఆరుగురు న్యాయమూర్తులలో ఒకరిగా ఉండడం గొప్ప గౌరవం. ఆ ఆరుగురిలో నేను ఒక్కరినే మహిళను. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హైకమిషనర్‌గా పనిచేస్తున్నప్పుడు దక్షిణ సుడాన్‌కు అధికారిక పర్యటనకు వెళ్లాను. హెలికాప్టర్లో బ్లూ నైల్ ప్రాంతానికి వెళ్లాను. అది గ్రామీణ, కరడుగట్టిన సంప్రదాయాలు వేళ్లూనుకున్న ప్రాంతం. స్థానికులైన పదిహేను మంది మహిళలతో మాట్లాడాను. వారు వేర్వేరు తెగలకు చెందినవారు. కొందరి ముఖాలపై వారి తెగను గుర్తించేలా పచ్చబొట్లు కనిపించాయి. కొందరు మహిళలకు వారి తెగను గుర్తించేలా చేయడానికి ముందు పళ్లు తీస్తారు! తమ కంటే చాలా ఎక్కువ వయసు ఉన్న వారిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినందుకు తన భర్త, కుమారుడి చేతిలో పన్నెండేళ్ల కుమార్తె ఎలా హత్యకు గురైందో ఒక మహిళ హృదయ విదారకంగా వివరించింది. ఇలాంటి తల్లులు చాలామంది ఉన్నారు. తమ కుమార్తెలను ఇంటికి సమీపంలో పాతిపెట్టినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని చెప్పారు. నేను వారికి హక్కులు, చట్టాల గురించి చెప్పాను. అక్కడి నుండి బయలుదేరేటప్పుడు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యాను. నిస్సహాయతకు లోనయ్యాను. నేను మాట్లాడిన ఆ మహిళలు తమ హక్కుల కోసం సంఘటితమై పోరాడడం అనేది నాకు ఊరట కలిగించింది.– యాకుబ్ పాషా -
మతోన్మాది, అవినీతిపరురాలు.. నవీ పిళ్ళైపై నెతన్యాహు ఫైర్
నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న న్యాయకోవిదురాలు నవీ పిళ్ళై, గాజాలో ఇజ్రాయెల్ జాతి నిర్మూలనకు పాల్పడుతోందని చెప్పినందుకు, యూదుల పట్ల "మతోన్మాది" అని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం అభివర్ణించింది.నోబెల్ బహుమతి కమిటీ తన నైతికతను కోల్పోయింది. ఏకైక యూదు రాజ్యమైన ఇజ్రాయెల్‌పై రక్తపాత నిందలను సృష్టించింది. అలాంటి ప్రచారం చేయడం ద్వారా తన వృత్తిని నిర్మించుకున్న ఒక మతోన్మాదికి అది తన అత్యున్నత గౌరవాన్ని ప్రదానం చేసిందని నెతన్యాహు కార్యాలయం Xలో పోస్ట్ చేసింది. అంతేకాదు ఆమె యూదులను రాక్షసులుగా చిత్రీకరించడాన్ని ప్రోత్సహించిందని కూడా పేర్కొంది.The Nobel Prize committee has lost its moral compass. It has awarded its highest honor to a bigot who built her career around inventing and propagating blood libels against the one and only Jewish state. Navi Pillay’s proudest achievement was to legitimize a corrupt prosecutor who turned to her fabrications against Israel hoping that by joining her bigoted lynch mob, he would beat a rape charge. Karim Khan, who was accused by his own ICC employees of raping and sexually molesting them, used Pillay’s lies to build a fake case against Israel. Pillay supplied the lies. Khan weaponized them. And now the misguided members of the Nobel Committee are honoring the woman who propagated this demonization of the Jews and this travesty of justice.— Prime Minister of Israel (@IsraeliPM) October 9, 2026భారతీయ తమిళ మూలాలున్న ఆమె అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్‌గా కూడా పనిచేశారు. యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకమైన నేరాలు, మారణహోమాలకు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా కృషి చేసినందుకు ఆమెకు ఈ పురస్కారం ప్రకటించినట్లు నోబెల్ కమిటీ తెలిపింది. డిసెంబర్ 10న నార్వే రాజధాని ఓస్లోలో ఈ పురస్కార ప్రదానోత్సవం జరగనుంది.ఇదీ చదవండి: ‘నోబెల్ శాంతి’ విజేతపై ట్రంప్ ఆగ్రహం -
‘నోబెల్ శాంతి’ విజేతపై ట్రంప్ ఆగ్రహం
2026 నోబెల్ శాంతి బహుమతి నావి పిళ్లైకు దక్కడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమెను ‘అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేకి’గా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో వచ్చిన విమర్శనాత్మక పోస్టును ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో రీపోస్ట్ చేశారు.నోబెల్ శాంతి బహుమతి అందుకున్న సందర్భంగా నావి పిళ్లై మాట్లాడుతూ.. చప్పట్లు మరింతగా కొడితే ఈ బహుమతిని ట్రంప్‌తో పంచుకోవచ్చంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతిపై ఉన్న తీవ్రమైన ఆసక్తిని ఉద్దేశించే ఆమె ఈ సెటైర్ వేశారు. అయితే దీనిపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. నోబెల్ కమిటీ నిర్ణయం ఆ బహుమతి గౌరవాన్ని తగ్గించిందని ఆ పోస్టులో విమర్శించారు. శాంతి స్థాపనకు తాను చేసిన ప్రయత్నాలను గుర్తించి తనకే ఈ పురస్కారం ఇవ్వాల్సిందని ఆ పోస్ట్‌లో ట్రంప్ పేర్కొన్నారు.85 ఏళ్ల నావి పిళ్లై దక్షిణాఫ్రికాకు చెందిన న్యాయవాది. భారతీయ తమిళ మూలాలున్న ఆమె అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్‌గా కూడా పనిచేశారు. యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకమైన నేరాలు, మారణహోమాలకు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా కృషి చేసినందుకు ఆమెకు ఈ పురస్కారం ప్రకటించినట్లు నోబెల్ కమిటీ తెలిపింది. ఈ బహుమతి కింద ఆమెకు 12 మిలియన్ స్వీడిష్ క్రోనాల విలువైన నగదు అందజేయనున్నారు. డిసెంబర్ 10న నార్వే రాజధాని ఓస్లోలో ఈ పురస్కార ప్రదానోత్సవం జరగనుంది.ఇదీ చదవండి: సీఎం సువేందు రికార్డును బద్దలు కొట్టిన పీఏ తల్లి! -
నోబెల్లో కొంత భాగం ట్రంప్‌కూ ఇస్తానేమో!.. పిళ్లై సెటైర్లు మాములుగా లేవుగా
బెర్లిన్ : ప్రతిష్టాత్మ నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. యుద్ధ నేరాలు, మానవాళికి వ్యతిరేకంగా జరిగే అకృత్యాలు, జాతి విద్వేషాలపై సుదీర్ఘకాలంగా పోరాడుతూ అంతర్జాతీయ చట్టాల అమలుకు కృషి చేసిన ప్రముఖ దక్షిణాఫ్రికా న్యాయనిపుణురాలు,భారత సంతతికి నవనీతమ్ పిళ్లై ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు.అయితే, ఈ పురస్కారం దక్కడంపై ఆమె స్పందించిన తీరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చాంశనీయంగా మారింది. జర్మనీలోని నూరెమ్ బెర్గ్లో ఆమె విజయాన్ని ప్రకటించిన సందర్భంగా అక్కడి ప్రముఖులు హర్షధ్వానాలు తెలుపుతుండగా.. పిళ్లై చేసిన సరదా వ్యాఖ్యలు సభికుల్ని నవ్వులు పూయించాయి.‘మీరు ఇంకొంచెం గట్టిగా చప్పట్లు కొడితే.. బహుశా ఈ నోబెల్ బహుమతిలో కొంత భాగం డొనాల్డ్ ట్రంప్‌తో పంచుకుంటానేమో!’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు నోబెల్ శాంతి బహుమతిపై ఉన్న తీవ్రమైన ఆసక్తిని ఉద్దేశించే ఆమె ఈ సెటైర్ వేశారు.నవనీతమ్ పిళ్లై అసాధారణ ప్రయాణం..దక్షిణాఫ్రికా డర్బన్‌లో వర్ణవివక్ష కాలంలో భారతీయ తమిళ సంతతి కుటుంబంలో జన్మించిన పిళ్లై.. అంతర్జాతీయ న్యాయ రంగంలో అసాధారణ శిఖరాలను అధిరోహించారు. దక్షిణాఫ్రికా హైకోర్టులో తొలి మహిళా న్యాయమూర్తిగా, రువాండా అంతర్జాతీయ ట్రిబ్యునల్ న్యాయమూర్తిగా ఆమె సేవలు అందించారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు న్యాయమూర్తిగా, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.అత్యాచారాలు, లైంగిక హింసను జాతి విద్వేషాలు,మానవాళికి వ్యతిరేకంగా జరిగే నేరాలుగా పరిగణించడంలో ఆమె కీలక తీర్పులు ఇచ్చారు. మీడియా ప్రచారాలు హింసను ఎలా ప్రేరేపిస్తాయనే దానిపై ఆమె చేసిన న్యాయ పోరాటాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయి.ప్రస్తుతం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌లో జడ్జిగా కొనసాగుతున్న ఆమె..మయన్మార్‌పై జరుగుతున్న జాతివివక్ష ఆరోపణల కేసులను విచారిస్తున్న కమిషన్లోనూ కీలక భూమిక పోషిస్తున్నారు. ప్రపంచంలో అంతర్జాతీయ చట్టాల బలహీనతను, అధికార రాజకీయాల ప్రభావాన్ని ఎత్తిచూపుతూ.. శాంతి స్థాపనలో న్యాయం యొక్క ప్రాముఖ్యతను చాటిచెప్పిన నవనీతమ్ పిళ్లైకి నోబెల్ పురస్కారం దక్కడం పట్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. -
నోబెల్ కమిటీ కన్నెర్ర.. డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్!
ఓస్లో: ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారాన్ని దక్కించుకోవాలనుకున్న అమెరికా అధ్యక్షుడు డొలాల్డ్ ట్రంప్ ఆశలు అడియాశలయ్యాయి. ట్రంప్ కల కలగా మిగిలింది. ప్రపంచ దేశాల్లో శాంతి కోసం పాటు పడుతున్న తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ ఓవల్ ఆఫీస్‌లో హుకుం జారీచేసిన ట్రంప్‌కు నోబెల్ కమిటీ కన్నెర్ర చేసింది. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు, భారతీయ తమిళ సంతతికి చెందిన నవనీతమ్ నవీ పిళ్లైని ఎంపిక చేసింది. నార్వేజియన్ నోబెల్ కమిటీ ఈ అత్యున్నత పురస్కారాన్ని అధికారికంగా ప్రకటించింది.అంతర్జాతీయ చట్టాలు పటిష్టం కావడంలో, ప్రపంచ శాంతి స్థాపనలో, మానవ హక్కుల పరిరక్షణ కోసం ఆమె దశాబ్దాలుగా అందించిన అమూల్యమైన సేవలను నార్వేజియన్ నోబెల్ కమిటీ గుర్తించి ఈ అత్యున్నత పురస్కారాన్ని కట్టబెట్టింది. నవీ పిళ్లై ఈ ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాన్ని దక్కించుకోవడం పట్ల ప్రపంచ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతుండగా.. నవీ పిళ్లైని చూసి భారత్ గర్వపడుతోంది.ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు ఇటీవల తనకు నోబెల్ శాంతి బహుమతి కావాలనే ఆశను ట్రంప్ బహిరంగంగా బయటపెట్టారు. తాను అనేక వివాదాలను, యుద్ధాలను పరిష్కరించానని, చరిత్రలో ఎవరూ చేయని విధంగా శాంతి స్థాపనకు కృషి చేశానని బహిరంగంగానే ప్రకటించుకున్న ఆయన, తనకు ఈసారైనా నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాలని గట్టిగా కోరారు.ఒకవేళ తనకు ఇవ్వకపోతే అది నార్వేజియన్ నోబెల్ కమిటీకి కూడా పెద్ద అవమానమని, కమిటీ తనను విస్మరిస్తే వారి చరిత్రాత్మక తప్పిదమవుతుందని ఇటీవల ఓవల్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ట్రంప్ అంచనాలు తలకిందులవుతూ నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రకటన వెలువడింది. అందరూ ఊహించినట్లుగానే ట్రంప్ ఆశలు అడియాశలయ్యాయి.ఇదీ చదవండి : నవీ పిళ్లైకి నోబెల్ శాంతి బహుమతి -
భారత సంతతి నవనీతమ్ నవీ పిళ్లైకి నోబెల్ శాంతి బహుమతి!
ఓస్లో: ప్రపంచ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా భావించే 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతి ప్రకటన వెలువడింది. అంతర్జాతీయ చట్టాల పరిరక్షణకు, ప్రపంచ శాంతి స్థాపనకు, మానవ హక్కుల పరివర్తనకు దశాబ్దాలుగా అంకితభావంతో సేవలందిస్తున్న ప్రముఖ దక్షిణాఫ్రికా న్యాయకోవిదురాలు, భారతీయ తమిళ సంతతికి చెందిన నవనీతమ్ నవీ పిళ్లై ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.నవనీతమ్ నవీ పిళ్లై 2008 నుంచి 2014 వరకు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్‌గా ఆమె ప్రపంచ వ్యాప్తంగా అణగారిన వర్గాల గొంతుకగా నిలిచారు. వివక్షకు వ్యతిరేకంగా, మహిళల హక్కులు, శరణార్థుల రక్షణ కోసం నిర్విరామంగా పోరాడారు. మానవ హక్కుల పరిరక్షణలో ఆమె చేసిన విశేష కృషికి గాను గతంలో అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు ఆమెను వరించాయి.ఇందులో భాగంగానే 2024 సంవత్సరానికి గాను ఆమెకు ప్రతిష్టాత్మక సిడ్నీ శాంతి పురస్కారం లభించింది. తాజాగా ఆమె సేవలను గుర్తించిన నార్వే నోబెల్ కమిటీ అత్యున్నతమైన ‘నోబెల్ శాంతి బహుమతి-2026’ను ప్రకటించడంతో భారతీయులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మానవ హక్కుల పరిరక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.నవీ పిళ్లై తల్లిదండ్రులు భారత్ నుంచి వలస వెళ్లిన తమిళ కుటుంబానికి చెందినవారు. దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో ఆమె సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. సౌతాఫ్రికా హైకోర్టులో తొలి మహిళా జడ్జిగా,యుగోస్లేవియా అంతర్జాతీయ క్రిమినల్ ట్రిబ్యునల్ జడ్జిగా, రువాండా నరమేధ ట్రిబ్యునల్ అధ్యక్షురాలిగా ఆమె కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇదీ చదవండి : ఆన్ కార్సన్‌కు సాహిత్యంలో నోబెల్ పురస్కారం


