బెర్లిన్ : ప్రతిష్టాత్మ నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. యుద్ధ నేరాలు, మానవాళికి వ్యతిరేకంగా జరిగే అకృత్యాలు, జాతి విద్వేషాలపై సుదీర్ఘకాలంగా పోరాడుతూ అంతర్జాతీయ చట్టాల అమలుకు కృషి చేసిన ప్రముఖ దక్షిణాఫ్రికా న్యాయనిపుణురాలు,భారత సంతతికి నవనీతమ్ పిళ్లై ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు.
అయితే, ఈ పురస్కారం దక్కడంపై ఆమె స్పందించిన తీరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చాంశనీయంగా మారింది. జర్మనీలోని నూరెమ్ బెర్గ్‌లో ఆమె విజయాన్ని ప్రకటించిన సందర్భంగా అక్కడి ప్రముఖులు హర్షధ్వానాలు తెలుపుతుండగా.. పిళ్లై చేసిన సరదా వ్యాఖ్యలు సభికుల్ని నవ్వులు పూయించాయి.
‘మీరు ఇంకొంచెం గట్టిగా చప్పట్లు కొడితే.. బహుశా ఈ నోబెల్ బహుమతిలో కొంత భాగం డొనాల్డ్ ట్రంప్‌తో పంచుకుంటానేమో!’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు నోబెల్ శాంతి బహుమతిపై ఉన్న తీవ్రమైన ఆసక్తిని ఉద్దేశించే ఆమె ఈ సెటైర్ వేశారు.
నవనీతమ్ పిళ్లై అసాధారణ ప్రయాణం..
దక్షిణాఫ్రికా డర్బన్‌లో వర్ణవివక్ష కాలంలో భారతీయ తమిళ సంతతి కుటుంబంలో జన్మించిన పిళ్లై.. అంతర్జాతీయ న్యాయ రంగంలో అసాధారణ శిఖరాలను అధిరోహించారు. దక్షిణాఫ్రికా హైకోర్టులో తొలి మహిళా న్యాయమూర్తిగా, రువాండా అంతర్జాతీయ ట్రిబ్యునల్ న్యాయమూర్తిగా ఆమె సేవలు అందించారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు న్యాయమూర్తిగా, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
అత్యాచారాలు, లైంగిక హింసను జాతి విద్వేషాలు,మానవాళికి వ్యతిరేకంగా జరిగే నేరాలుగా పరిగణించడంలో ఆమె కీలక తీర్పులు ఇచ్చారు. మీడియా ప్రచారాలు హింసను ఎలా ప్రేరేపిస్తాయనే దానిపై ఆమె చేసిన న్యాయ పోరాటాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయి.
ప్రస్తుతం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌లో జడ్జిగా కొనసాగుతున్న ఆమె..మయన్మార్‌పై జరుగుతున్న జాతివివక్ష ఆరోపణల కేసులను విచారిస్తున్న కమిషన్‌లోనూ కీలక భూమిక పోషిస్తున్నారు. ప్రపంచంలో అంతర్జాతీయ చట్టాల బలహీనతను, అధికార రాజకీయాల ప్రభావాన్ని ఎత్తిచూపుతూ.. శాంతి స్థాపనలో న్యాయం యొక్క ప్రాముఖ్యతను చాటిచెప్పిన నవనీతమ్ పిళ్లైకి నోబెల్ పురస్కారం దక్కడం పట్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


