సౌత్ ఆఫ్రికాకు ఇండియా కార్లు! | Made In India Renault Duster Goes Global 750 Cars Shipped To Africa | Sakshi
Sakshi News home page

సౌత్ ఆఫ్రికాకు ఇండియా కార్లు!

Jun 22 2026 9:08 PM | Updated on Jun 22 2026 9:29 PM

Made In India Renault Duster Goes Global 750 Cars Shipped To Africa

రెనాల్ట్ ఇండియా తన సరికొత్త డస్టర్ ఎస్‌యూవీ ఎగుమతులను అధికారికంగా ప్రారంభించింది. తొలి విడతలో 750 డస్టర్ వాహనాలను చెన్నై ప్లాంట్ నుంచి సౌత్ ఆఫ్రికాకు పంపించింది. రాబోయే నెలల్లో మరిన్ని అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఈ మోడల్‌ను ఎగుమతి చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది.

కొత్త డస్టర్ భారతదేశంలో తొలిసారిగా రెనాల్ట్ గ్రూప్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమైంది. ఈ ప్లాట్‌ఫామ్ వివిధ రకాల పవర్‌ట్రెయిన్ టెక్నాలజీలకు అనుగుణంగా ఉంటుంది. అంతేకాకుండా.. అన్ని వేరియంట్లు, పవర్‌ట్రెయిన్‌లలో 5-స్టార్ భారత్ NCAP భద్రతా రేటింగ్‌ను పొందడం ద్వారా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పోటీపడే సామర్థ్యాన్ని నిరూపించింది.

2030 నాటికి భారత్ నుంచి సంవత్సరానికి 2 బిలియన్ యూరోల ఎగుమతులను సాధించాలనే లక్ష్యంతో రెనాల్ట్ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త డస్టర్ ఎగుమతుల ప్రారంభం భారత ఆటోమొబైల్ పరిశ్రమకు కూడా ఒక కీలక మైలురాయిగా నిలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement