
గోల్ఫ్ సామ్రాజ్యానికి రారాజు, అంతర్జాతీయ గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్ కుమారుడు చార్లీ వుడ్స్ తన తండ్రి బాటలోనే నడుస్తున్నాడు. 16 ఏళ్ల చార్లీ వుడ్స్ తన తొలి అమెరికన్ జూనియర్ గోల్ఫ్ అసోసియేషన్ (AJGA) టైటిల్‌ను గెలుచుకున్నాడు.
బుధవారం ఫ్లోరిడాలోని బౌలింగ్ గ్రీన్‌లో జరిగిన టీమ్ టేలర్ మేడ్ ఇన్విటేషనల్ టోర్నీ విజేతగా నిలిచాడు. అమెరికన్ జూనియర్ గోల్ఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో చార్లీ అదరగొట్టాడు. చివరి రౌండ్ సమయానికి ఓవర్‌నైట్ లీడర్ ల్యూక్ కోల్టన్ కంటే జూనియర్ వుడ్స్ వెనకబడి ఉన్నాడు.
కానీ ఆఖరి రౌండ్‌లో మాత్రం చేసిన చార్లీ.. సిక్స్-అండర్ పార్ 66 సాధించి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ రౌండ్‌లో చార్లీ వుడ్స్ ఎనిమిది బర్డీలు, రెండు బోగీలు సాధించాడు. ఓవరాల్‌గా 15-అండర్ 201తో వుడ్స్ ముగించాడు.
చదవండి: Gautam Gambhir: నేను సెలక్టర్‌ను కాదు.. నన్ను ఎందుకు అడుగుతారు