నేను సెలక్టర్‌ను కాదు.. నన్ను ఎందుకు అడుగుతారు: గంభీర్‌ | "I am Not A Selector...": Gautam Gambhir Breaks Silence On Snubbing Shreyas Iyer For England Test Series | Sakshi
Sakshi News home page

Gautam Gambhir: నేను సెలక్టర్‌ను కాదు.. నన్ను ఎందుకు అడుగుతారు

May 29 2025 8:35 AM | Updated on May 29 2025 8:59 AM

Gautam Gambhir Breaks Silence On Snubbing Shreyas Iyer For England Test Series

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు 18 స‌భ్యుల‌తో కూడిన భార‌త జ‌ట్టును బీసీసీఐ ఇటీవ‌లే ప్ర‌కటించిన సంగ‌తి తెలిసిందే. ఈ జ‌ట్టుకు కెప్టెన్‌గా శుబ్‌మ‌న్ గిల్‌, అత‌డి డిప్యూటీగా వికెట్ కీపర్ రిష‌బ్ పంత్ ఎంపిక‌య్యాడు. సాయిసుద‌ర్శ‌న్‌, అర్ష‌దీప్ సింగ్ వంటి యువ ఆట‌గాళ్ల‌కు తొలి భార‌త టెస్టు జ‌ట్టులో చోటు ద‌క్కింది.

అదేవిధంగా క‌రుణ్ నాయ‌ర్‌, శార్ధూల్ ఠాకూర్ వంటి వెట‌ర‌న్ ఆట‌గాళ్లకు సెల‌క్ట‌ర్లు తిరిగి పిలుపునిచ్చారు. అయితే ఈ జ‌ట్టులో మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు చోటు ద‌క్క‌లేదు. రంజీ ట్రోఫీ సహా ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో కూడా చక్కటి రికార్డు ఉన్న అయ్యర్‌ పేరును సెల‌క్ట‌ర్లు పరిశీలించకపోవడం ఆశ్చర్యపర్చింది.

క్రికెటేతర కారణాలతో అతడిని పక్కన పెడుతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఇదే విష‌యంపై భార‌త హెడ్ కోచ్ గౌతమ్‌ గంభీర్‌ను ప్ర‌శ్నించ‌గా సూటిగా సమాధానం ఇవ్వలేదు.  ‘నేను సెలక్టర్‌ను కాదు’ అంటూ ఒక్క ముక్కలో గంభీర్‌ స్పందించాడు.కానీ ఐపీఎల్‌ ఫైనల్‌కు త్రివిధ దళాల అధిపతులను ఆహ్వానించినందుకు బీసీసీఐని గంభీర్‌ ప్రశంసించాడు. 

అది నమ్మశక్యం కాని నిర్ణయమని అన్నాడు. దేశం మొత్తం మ‌న సాయుధ ద‌ళాల‌కు సెల్యూట్ చేయాల‌ని గంభీర్ పేర్కొన్నాడు. కాగా భార‌త్‌-ఇంగ్లండ్ మ‌ధ్య ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ సైకిల్‌2025-27లో భాగంగా జ‌ర‌గ‌నుంది.
చదవండి: IPL 2025: రిషబ్ పం‍త్‌కు భారీ షాకిచ్చిన బీసీసీఐ
 

Advertisement
 
Advertisement
Advertisement