
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సోదరుడు, క్యాబ్ (బెంగాల్ క్రికెట్ అసోసియేషన్) అధ్యక్షుడు స్నేహశిష్ గంగూలీకి తృటిలో ప్రాణాపాయం తప్పింది. పూరీ బీచ్‌లో (ఒడిశా) అతను ప్రయాణిస్తున్న స్పీడ్ బోట్ బోల్తా పడింది. ప్రమాద సమయంలో స్నేహశిష్‌తో పాటు అతని భార్య అర్పిత గంగూలీ కూడా ఉన్నారు. స్నేహశిష్ దంపతులు సముద్ర నీటిలో మునిగిపోతుండగా కొందరు లోకల్ బోట్ డ్రైవర్లు, మత్స్యకారులు వారిని రక్షించారు.
ప్రాణాపాయం నుండి బయటపడిన స్నేహశిష్ దంపతులు ప్రస్తుతం కోల్‌కతాకు చేరుకున్నారు. మాకిది పునర్జన్మ అని గంగూలీ భార్య అర్పిత అన్నారు. అదో భయానక ఘటన అని అమె గుర్తు చేసుకున్నారు. పూరి జగన్నాథుని కృప వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడ్డామని తెలిపారు.