
లివర్‌పూల్ టీమ్ విక్టరీ పరేడ్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. ప్రీమియర్ లీగ్‌లో 20వ టైటిల్‌ను లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం లివర్‌పూల్‌లో విక్టరీ పరేడ్‌ను నిర్వహించారు. తమ ఆరాధ్య ప్లేయర్లను అభినందించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు ఈ విజయోత్సవ ర్యాలీలో పాల్గోన్నారు.
ఈ క్రమంలో విక్టరీ పరేడ్‌లోకి ఓ దుండగుడు కారుతో దూసుకొచ్చాడు. విచక్షణారహితంగా పలువురిని ఢీకొట్టుకుంటూ ముందుకెళ్లాడు. ఈ ప్రమాదంలో 27 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

వాహనదారుడిని అరెస్ట్ చేసినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. అయితే ఇది ఉగ్రవాద చర్య కాదని పోలీసులు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Car drives into Liverpool fan crowd. pic.twitter.com/Q4422ueYIo
— RedandWhite Ireland (@RIreland29776) May 26, 2025
చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్..