
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి... వరల్డ్ బౌలింగ్ లీగ్ (డబ్ల్యూబీఎల్)లో అడుగు పెడుతున్నాడు. ఇప్పటికే పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టిన కోహ్లి... డబ్ల్యూబీఎల్‌లో వ్యూహాత్మక పెట్టుబడిదారుడిగా మారాడు. డబ్ల్యూబీఎల్‌లో భాగంగా ఇటీవల తొలి జట్టు ఓఎమ్‌జీ ఫ్రాంచైజీని ప్రకటించింది.
ఇప్పుడు తాజాగా క్రికెట్ సూపర్ స్టార్ కోహ్లి భాగస్వామ్యాన్ని బహిర్గతం చేసింది. ‘నేను 11 ఏళ్ల వయసులో బౌలింగ్ చేయడం ప్రారంభించా. 12 ఏళ్ల వయసు నుంచి బంతిని తిప్పేందుకు ప్రయతి్నస్తున్నా. ఈ లీగ్‌లో భాగస్వామి కావడం ఆనందంగా ఉంది.
వ్యాపారాభివృద్ధి కోణంలోనూ ఇది మంచి అడుగు అనుకుంటున్నా. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొత్త క్రీడలను ప్రోత్సహించాల్సిందే. ఈ1 సిరీస్‌లో మా జట్టు పురోగతి చూస్తే ముచ్చటేస్తోంది. డబ్ల్యూబీఎల్ వ్యూహాత్మక పెట్టుబడి దారుడిగా, సహ యజమానిగా ఉండడం ఉత్సాహాన్నిస్తోంది’అని విరాట్ కోహ్లి వెల్లడించాడు.