వైభవ్ సూర్యవంశీతో ప్రధాని మోదీ ముచ్చట్లు | Cricketer Vaibhav Suryavanshi Meets PM Modi At Patna Airport | Sakshi
Sakshi News home page

వైభవ్ సూర్యవంశీతో ప్రధాని మోదీ ముచ్చట్లు

May 30 2025 3:08 PM | Updated on May 30 2025 4:51 PM

Cricketer Vaibhav Suryavanshi Meets PM Modi At Patna Airport

పాట్నా:  యువ క్రికెట్ కెరటం, చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీతో ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చటించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.  ఈరోజు(శుక్రవారం, మే 30వ తేదీ) ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ పర్యటనలో భాగంగా పాట్నా ఎయిర్ పోర్ట్ లో కలిసిన వైభవ్ సూర్యవంశీతో సరదాగా మాట్లాడారు. తొలుత వైభవ్ సూర్యవంశీని ఆప్యాయంగా పలకరించిన మోదీ..క్రికెట్ కు సంబంధించిన విషయాలను  ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.  పాట్నా ఎయిర్ పోర్ట్ లో మోదీని కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవ్ సూర్యవంశీ కలిశారు.  ఈ విషయాన్ని  తన  సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు మోదీ.

‘వైభవ్ సూర్యవంశీ భవిష్యత్ ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అతడు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను. నా  ఆశీస్సులు అతడికి ఎప్పుడూ ఉంటాయి’ అని మోదీ పేర్కొన్నారు.

ఇదిలా ఉంచితే, వైభవ్ సూర్యవంశీ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఐపీఎల్ లో అరంగేట్రం ద్వారా సంచలన బ్యాటింగ్ తో మెరుపులు మెరిపిస్తున్న 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ.. ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకున్నాడు.  ఈ సీజన్ లో రాజస్తాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహించడం ద్వారా వైభవ్ సూర్యవంశీ తెరపైకి వచ్చాడు. 

 

Advertisement
 
Advertisement
Advertisement