
ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆర్జే మహ్‌వశ్ పేరు మార్మోగిపోతోంది. చాహల్‌తో కలిసి ఛాంపియన్ ట్రోఫీలో కనిపించడంతో ఆమె పేరు ఒక్కసారిగా వైరలైంది. ఇంకేముందు టీమిండియా క్రికెటర్ చాహల్‌తో డేటింగ్ చేస్తున్నారంటూ ఒకటే టాక్. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ ప్రతి మ్యాచ్‌కు ఆర్జే హాజరు కావడం ఆ రూమర్స్‌కు మరింత బలం చేకూరింది. ఇటీవల ఆర్సీబీ- పంజాబ్ మ్యాచ్‌లోనూ మహ్‌వశ్ స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించింది.
ఈ నేపథ్యంలోనే ఆర్జే మహ్‌వశ్ మరో పోస్ట్‌తో వార్తల్లో నిలిచింది. నీ జీవితంలో ఏది ముఖ్యమో అది నీకే తెలుసు.. నువ్వు ఎవరితోనూ ఎప్పుడు తప్పు చేయవని తెలుసు.. నీ లక్ష్యం విషయంలో క్లారిటీ ఉంది.. మీరు నిజాయితీగా జీవించండి.. ఎవరెమనుకున్నా హ్యాపీగా వాటిని వదిలేయండి. అంటూ ఇన్‌స్టాలో షేర్ చేసింది. అయితే ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ చాహల్‌తో డేటింగ్ వార్తలపైనే స్పందించిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల తనపై వస్తున్న వార్తల నేపథ్యంలోనే ఆర్జే మరోసారి క్లారిటీ ఇచ్చేసిందని అంటున్నారు.
కాగా.. ఆర్జే మహ్‌వశ్..చాహల్ గతేడాది మొదటిసారి జంటగా కనిపించారు. కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మను వివాహం చేసుకున్న చాహల్ ఇటీవలే విడాకులు కూడా తీసుకున్నారు. అందుకే మహ్‌వశ్‍తో డేటింగ్ చేస్తున్నాడని రూమర్స్ వినిపించాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో వీరిద్దరు కనిపించడంతో అప్పటి నుంచే మరింత వైరలయ్యాయి.
