
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ 238 పరుగుల తేడాతో విండీస్‌పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 400 పరుగులు చేసింది. బ్రూక్ కెప్టెన్సీలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఇంగ్లండ్ భారీ స్కోరుతో విజృంభించింది.
జాకబ్ బెథెల్ (53 బంతుల్లో 82; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు), బెన్ డకెట్ (60; 6 ఫోర్లు, 1 సిక్స్), జో రూట్ (57; 5 ఫోర్లు), హ్యారీ బ్రూక్ (58; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. జెమీ స్మిత్ (37), బట్లర్ (37), విల్ జాక్స్ (39) కూడా రాణించారు. విండీస్ బౌలర్లలో జైడెన్ సీల్స్ 4, అల్జారీ జోసెఫ్, జస్టిన్ గ్రేవ్స్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్యఛేదనలో వెస్టిండీస్ 26.2 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. జైడెన్ సీల్స్ (29; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెపె్టన్ షై హోప్ (25) కాస్త పోరాడగా... మిగిలిన వాళ్లు ప్రభావం చూపలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో సాఖీబ్ మహమూద్, జేమీ ఓవర్టన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య ఆదివారం రెండో వన్డే జరగనుంది.
చదవండి: నేను అతడికి పెద్ద అభిమానిని.. ఇంకా ఒకే ఒక మ్యాచ్: ఆర్సీబీ కెప్టెన్