పులిలా కనిపించే పిల్లి..! | It Identifies As A House Cat Its Look Like A Tiger Goes Viral On Socialmedia | Sakshi
Sakshi News home page

పులిలా కనిపించే పిల్లి..!

Jun 1 2025 4:59 PM | Updated on Jun 1 2025 4:59 PM

It Identifies As A House Cat Its Look Like A Tiger Goes Viral On Socialmedia

ఈ పిల్లి వాక్‌ చేస్తే ఫర్నిచర్‌ వణుకుతుంది. ఓరకంట ఒక్క చూపు చూస్తే మొరుగుతున్న కుక్కలు కూడా గప్‌చిప్‌గా నోరు మూసుకుంటాయి. అది పిల్లి కాదు, పులి అని అనుకుంటున్నారా? కానేకాదు, నిజంగానే అది పిల్లే, పేరు జ్యూస్‌. చూడ్డానికి పెద్దపులిలాగా కనిపిస్తుంది.  పదమూడు కిలోల బరువు, నాలుగు అడుగుల మూడు అంగుళాల పొడవుతో ఎదుగుతున్న పులిపిల్లలా ఉంటుంది. 

దానికున్న భారీ ఆకారమే జ్యూస్‌ను తమ వీథిలోని పెంపుడు జంతువులకు డాన్‌గా మార్చేసింది. ఆహారం కూడా దాని సైజుకు తగ్గట్టుగానే రోజుకు రెండు కిలోల మాంసం, టాప్‌ బ్రాండ్‌ ట్రీ ట్స్‌తో స్పెషల్‌ డైట్‌ ఫుడ్‌ మాత్రమే తీసుకుంటుంది. ఇక సోషల్‌ మీడియాలో దీనికున్న క్రేజ్‌ మామూలుగా ఉండదు. జ్యూస్‌ నిద్రపోయే వీడియోకు కూడా మిలియన్స్‌లో లైక్స్‌ వస్తాయి. 

జ్యూస్‌ గురించి దాని యజమానురాలు డానియేలా మాట్లాడుతూ ‘నాకు ఇది చిన్న పిల్లికూనగా వీథిలో దొరికింది. ఇంటికి తెచ్చుకొని పెంచుకుంటుంటే, రోజు రోజూకు భారీగా పెరిగిపోయింది. ఇది ఇంత పెద్దగా మారుతుందని అసలు అనుకోలేదు. మీరెవరైనా ఇకపై పిల్లిని పెంచుకోవాలనుకుంటే ఒకసారి ఆలోచించుకోండి.’ అని చెప్పింది.  

(చదవండి: ఈ సాలీడు టాలెంట్‌కి సాటిలేరెవ్వరూ..! కటౌట్‌తో పనిలేదు బ్రదర్‌..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement