రాచ సాలీడు..! టాలెంట్‌కి ఫిదా అవ్వాల్సిందే.. | Darwins Bark Spiders Spin The Worlds Biggest Orb Webs | Sakshi
Sakshi News home page

ఈ సాలీడు టాలెంట్‌కి సాటిలేరెవ్వరూ..! కటౌట్‌తో పనిలేదు బ్రదర్‌..

Jun 1 2025 12:07 PM | Updated on Jun 1 2025 12:14 PM

Darwins Bark Spiders Spin The Worlds Biggest Orb Webs

‘కటౌట్‌ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్‌’ అనే సినిమా డైలాగ్‌లా కాదు. కొన్నిసార్లు కటౌట్‌తో పనిలేకుండా కూడా కొన్ని కొన్ని నమ్మేయాలి. ఎందుకంటే, ఫొటోలో చిన్నగా బొద్దుగా ఉండే ఈ సాలీడు టాలెంట్‌ తెలిస్తే అలాగే అనిపిస్తుంది. 

ఇది సాలీడు జాతికే రారాజులాంటిది. పేరు ‘డార్విన్‌ బార్క్‌ స్పైడర్‌’. కేవలం ఇరవై రెండు మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుంది. కాని, అది అల్లే సాలెగూడు పరిమాణం ముందు సినిమాల్లోని స్పైడర్‌ మాన్‌ కూడా తలదించుకోవాల్సిందే! గాలిలోకి దాని జిగురు దారాలను వదిలి, ఎక్కడో ఓ చెట్టుకి అంటుకునేలా చేస్తుంది. అలా మొదలైన దాని సాలెగూడు ఏకంగా ఇరవై ఐదు మీటర్ల దూరం ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత విశాలమైన గూడు నిర్మించుకునే సాలీడుగా ఇది రికార్డులకెక్కింది. 

గూడు ఎంత పెద్దదైతేనేం అంత బలంగా ఉండదనుకోకండి. దాని జిగురు దారాల బలం, పట్టుదారం కంటే పదిరెట్లు ఎక్కువ బలంగా ఉంటుంది. దాని సాలెగూడులో పడి, ఒకేసారి దాదాపు ఇరవై దోమలు, ఈగలు బ్రేక్‌ఫాస్ట్‌ బఫేగా మారిపోగలవు. దీని గురించి తెలిస్తే స్పైడర్‌మాన్‌ కంటే ఈ నిజమైన వెబ్‌ హీరోకే ఫిదా అయిపోతారు.   

(చదవండి:  కింగులా బతికాడు సింగిల్‌గా..!)

Advertisement
 
Advertisement
Advertisement