ఈ–తాళం సురక్షితమేనా? | Websites taken down worldwide as AI reveals critical cyber | Sakshi
Sakshi News home page

ఈ–తాళం సురక్షితమేనా?

Oct 23 2026 5:57 AM | Updated on Oct 23 2026 5:57 AM

Websites taken down worldwide as AI reveals critical cyber

ఏఐతో వెబ్‌ భద్రతా లోపాలు బట్టబయలు

ఇంటర్నెట్‌ ప్రపంచంలో అలజడి

‘ఈ–ముద్ర’ ధ్రువీకరణ పత్రాల నిలిపివేత

ప్రపంచవ్యాప్తంగా ఆఫ్‌లైన్‌లోకి ప్రభుత్వ వెబ్‌సైట్స్‌

రంగంలోకి గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్‌

సాక్షి, హైదరాబాద్‌: బెంగళూరుకు చెందిన ప్రముఖ డిజిటల్‌ ధ్రువీకరణ సంస్థ ఈ–ముద్ర జారీ చేసిన సర్టీఫికెట్ల రహస్య తాళం చెవుల్లో (ప్రైవేట్‌ కీస్‌) తీవ్ర భద్రతా లోపాలు బయటపడటంతో ప్రపంచవ్యాప్తంగా సమాచార సాంకేతిక రంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏళ్ల తరబడి దాగి ఉన్న ఈ లోపాలను పరిశోధకులు ఏఐ సాయంతో గుర్తించడంతో గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, మొజిల్లా వంటి అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజాలు రంగంలోకి దిగి ఈ–ముద్ర సర్టీఫికెట్లను బ్లాక్‌ చేశాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా పలు ప్రభుత్వ వెబ్‌సైట్లు తాత్కాలికంగా నిలిచిపోయాయి. భారత ప్రభు త్వం దీనిపై తక్షణమే స్పందించి ఉన్నతస్థాయి దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. దేశీయ వెబ్‌సైట్లపై దీని ప్రభావం చాలా పరిమితమేనని కేంద్రం ప్రకటించింది. అయితే మనం రోజూ చూసే వెబ్‌సైట్లు సురక్షితమేనా అన్న సందేహం ఇప్పుడు నెటిజన్ల మదిలో రేగుతోంది. 

అసలైనదా? కాదా? 
సాధారణంగా ఒక వ్యక్తి ఎవరో గుర్తించడానికి ఆధార్‌ తదితర గుర్తింపు కార్డులను ప్రభుత్వాలు జారీ చేస్తాయి. అలాగే ఇంటర్నెట్‌ ప్రపంచంలో ఒక వెబ్‌సైట్‌ అసలైనదా, కాదా అని ధ్రువీకరించడానికి ఇచ్చే ఒక డిజిటల్‌ గుర్తింపు పత్రాన్ని డిజిటల్‌ సర్టిఫికేషన్‌ అంటారు. ఈ పత్రాలను జారీ చేయడానికి అధి కారిక సంస్థలు ఉంటాయి. భారత్‌లో ఈ–ముద్ర అటువంటిదే. ఒక వెబ్‌సైట్‌కు ఈ ధ్రువీకరణ ఉందంటే ఆ సైట్‌ సురక్షితమైనదని, హ్యాకర్లు సృష్టించిన నకిలీ సైట్‌ కాదని బ్రౌజర్లు గుర్తిస్తాయి.

తాళం వెనుక రక్షణ వ్యవస్థ.. 
ఏఐ సాయంతో జరిపిన భద్రతా తనిఖీల్లో ఈ–ముద్ర జారీ చేసిన కొన్ని ప్రధాన సర్టీఫికెట్ల రహస్య తాళం చెవులు చాలా బలహీనంగా ఉన్నట్లు తేలింది. దీనివల్ల హ్యాకర్లు ఆ రహస్య తాళం చెవులను దొంగిలించి ప్రభుత్వ లేదా బ్యాంకింగ్‌ వెబ్‌సైట్ల­ను పోలిన నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి, ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే ప్రమాదం ఏర్పడింది. అందుకే దిగ్గజ సాంకేతిక కంపెనీలు ఈ–ముద్ర సర్టీఫికెట్లను వెంటనే బ్లాక్‌ చేశాయి. మనం మొబైల్‌లో గానీ, కంప్యూటర్‌లో గానీ ఏదైనా వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసినప్పుడు పైన అడ్రస్‌ పట్టీ పక్కన ఒక చిన్న తాళం గుర్తు కనిపిస్తుంది. 

దీని వెనుక పెద్ద రక్షణ వ్యవస్థ దాగి ఉంది. తాళం గుర్తు ఉందంటే ఆ వెబ్‌సైట్‌ సురక్షితమైన ప్రసార సాంకేతికతను వాడుతోందని అర్థం. నేరగాళ్లు ఆ సమాచారాన్ని దొంగిలించినా వారికి ఏమీ అర్థం కాదు. తాళం గుర్తు ఉంటే సమాచారం ప్రయాణించే మార్గం సురక్షితమని మాత్రమే అర్థం. కానీ ఆ వెబ్‌సైట్‌ నడిపే వ్యక్తులు 100 శాతం నమ్మకమైన వారని గ్యారంటీ లేదు. ఈ రోజుల్లో సైబర్‌ నేరగాళ్లు కూడా డబ్బులు చెల్లించి తాళం గుర్తు ఉన్న నకిలీ వెబ్‌సైట్లను సులభంగా సృష్టిస్తున్నారు.

రెండు కీలు
డిజిటల్‌ ధ్రువీకరణ వ్యవస్థ మొత్తం రహస్య సంకేతాల విధానంపై పనిచేస్తుంది.
దీనికి రెండు ప్రధాన తాళం చెవులు ఉంటాయి:

1. పబ్లిక్‌ కీ:
అందరికీ అందుబాటులో ఉంటుంది. వెబ్‌సైట్‌కు వినియోగదారు పంపే సమాచారాన్ని లాక్‌ చేయడానికి ఇది దోహదపడుతుంది. ఒక వెబ్‌సైట్‌కు పాస్‌వర్డ్, బ్యాంక్‌ ఖాతా వివరాలు పంపినప్పుడు, బ్రౌజర్‌ ఈ ‘పబ్లిక్‌ కీ’ని ఉపయోగించి ఆ సమాచారాన్ని ఒక పెట్టెలో పెట్టి గట్టిగా లాక్‌ చేస్తుంది. ఈ సమాచారం ఇంటర్నెట్‌ ద్వారా ప్రయాణిస్తున్నప్పుడు ఎవరికీ అర్థం కాని రహస్య కోడ్‌ (ఎన్‌క్రిప్‌్ట)గా మారిపోతుంది.  

2. రహస్య తాళం చెవి (ప్రైవేట్‌ కీ):
అత్యంత రహస్యమైన నిజమైన తాళం చెవి. ఇది కేవలం వెబ్‌సైట్‌ యజమాని లేదా వారి ప్రధాన కంప్యూటర్‌ (సర్వర్‌) దగ్గర మాత్రమే భద్రంగా ఉంటుంది. పబ్లిక్‌ 
కీ ద్వారా లాక్‌ అయి ఉన్న రహస్య సమాచారాన్ని అన్‌లాక్‌ చేసి చదవడానికి ఈ ’ప్రైవేట్‌ కీ’ ఉపయోగపడుతుంది. ప్రపంచంలో మరే ఇతర కీతోనూ దీన్ని 
తెరవడం సాధ్యం కాదు.

సురక్షిత వెబ్‌సైట్‌ను ఇలా గుర్తించండి..
⇒ సైబర్‌ నేరగాళ్లు అసలైన వెబ్‌సైట్‌ పేరును పోలిన నకిలీ పే ర్లతో మోసగిస్తారు. ఉదాహరణకు అసలైన బ్యాంక్‌ వెబ్‌సై ట్‌ పేరులో ఒక అక్షరాన్ని మార్చి నకిలీది క్రియేట్‌ చేస్తారు.  

⇒ మీరు ఓపెన్‌ చేసే వెబ్‌సైట్‌ అడ్రస్‌   http://  తో కాకుండా కచ్చితంగా  https:// తో (చివర ’ఎస్‌’ అనగా సెక్యూర్‌) ప్రారంభం కావాలి. బ్రౌజర్‌లో తాళం గుర్తు ఉందో లేదో చూడండి. ఒకవేళ బ్రౌజర్‌ ‘సురక్షితం కాదు’అని ఎరుపురంగు హెచ్చరిక చూపిస్తే వెంటనే ఆ సైట్‌నుంచి బయటకు వచ్చేయండి. 
⇒  బ్రౌజర్‌ చిరునామా పట్టీలోని తాళం గుర్తుపై క్లిక్‌ చేస్తే ఆ ధ్రువీకరణ పత్రం ఏ సంస్థకు జారీ చేశారు, దాని గడువు ఎప్పటి వరకు ఉందనే వివరాలు కనిపిస్తాయి. భద్రతా లోపాలు బయటపడినప్పుడు గూగుల్, మైక్రోసాఫ్ట్, యా­పి­ల్‌ కంపెనీలు వెంటనే కొత్త సెక్యూరిటీ అప్‌డేట్లను విడుదల చేస్తాయి. కాబట్టి మొబైల్, ల్యాప్‌టాప్‌లలోని బ్రౌజర్ల­ను ఎల్లప్పుడూ సరికొత్త వెర్షన్‌కు అప్‌డేట్‌ చేస్తూ ఉండాలి. 

⇒  మొబైల్, కంప్యూటర్లలో మంచి కంపెనీకి చెందిన యాంటీవైరస్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోండి. ఇవి ప్రమాదకర, నకిలీ సర్టిఫికెట్లు ఉన్న వెబ్‌సైట్లను ఓపెన్‌ చేయకుండా ముందే అడ్డుకుంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement