కాంగ్రెస్, ఇండికూటమి ప్రచారాన్నితిప్పికొట్టేలా కార్యాచరణ
బీజేపీ ముఖ్య నేతల సమావేశంలో నిర్ణయాలు
సాక్షి, హైదరాబాద్: సర్ ప్రక్రియతోపాటు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఇతర అంశాలపై కాంగ్రెస్, ఇండి కూటమి చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ‘ప్రజాస్వామ్యాన్ని రక్షి ద్దాం. విద్రోహులను తరిమికొడదాం’ అనే నినాదంతో ప్రజ ల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. విపక్షాల ప్రచారాన్ని ఎండగడుతూ వివిధ రూపాల్లో నిరసనలు, అవగాహన కార్యక్రమాలు చేప ట్టాలని తీర్మానించింది. ఇందులో భాగంగా నవంబర్ 1న హైద రాబాద్‌లో బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ఆధ్వర్యంలో మహా పాదయాత్ర, దాని ముగింపుగా బహిరంగసభ నిర్వహించనున్నారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్‌రావు అధ్యక్షతన జరిగిన ముఖ్యనేతల సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. శుక్రవారం నుంచి నవంబర్ 3 వరకు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు, ప్రజలను చైతన్యపరిచేలా అవగా హన కార్యక్రమాలను చేపట్టనున్నట్టు రాంచందర్ రావు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుపుతున్న ప్రచారానికి విదేశాల నుంచి నిధు లు వస్తున్న తీరు, కొన్ని వర్గాలు కావాలనే పనిగట్టుకుని పదేపదే తప్పుడు ప్రచారాన్ని చేయడాన్ని, వీటి వెనక ఉన్న శక్తులు, వాటి ఉద్దేశా లను ప్రజలకు వివరించనున్నట్టు ‘సాక్షి’కి రాంచందర్‌రావు తెలి పారు. సమావేశంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎం.రఘునందన్ రావు, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, కొమరయ్య, పాల్గొన్నారు.
3న కరీంనగర్‌లో ర్యాలీ: ‘వచ్చే నెల 1న హైదరాబాద్‌లో, 3న కరీంనగర్‌లో 10 వేల మందితో ర్యాలీ నిర్వహిస్తాం. కరీంనగర్ ర్యాలీలో బీజేపీ ప్రధానకార్యదర్శి, కేంద్రమాజీ మంత్రి స్మృతి ఇరానీ పాల్గొంటారు’ అని బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి డా.ఎన్. గౌతంరావు తెలిపారు. హైదరాబాద్, ఇతర నగరాలతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలోని కళాశాలల్లోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.


