
భారత క్రికెట్ జట్టు టెస్టు కెప్టెన్‌గా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఇటీవలే టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ స్దానాన్ని గిల్ భర్తీ చేయనున్నాడు. వచ్చే నెలలో ఇంగ్లండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్ నుంచి భారత టెస్టు కెప్టెన్‌గా గిల్ ప్రయాణం ప్రారంభం కానుంది.
గిల్‌కు తన మొదటి పరీక్షలోనే కఠిన సవాలు ఎదురుకానుంది. ఎందుకంటే వారి సొంతగడ్డపై ఇంగ్లీష్ జట్టును ఓడించడం అంతసులువు కాదు. అంతకుతోడు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లు ఇప్పుడు జట్టులో లేరు. ప్రస్తుతం భారత జట్టులో ముగ్గురు నలుగురికి మినహా ఇంగ్లండ్‌లో ఆడిన అనుభవం పెద్దగా లేదు. గిల్‌కు కూడా ఇంగ్లీష్ కండీషన్స్‌లో ఆడిన అనుభవం లేదు.
దీంతో గిల్ కెప్టెన్‌గా తన మొదటి ఎసైన్‌మెంట్‌లో ఎలా రాణిస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గిల్‌ను ఉద్దేశించి భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గిల్‌పై ఇప్పుడు అదనపు ఒత్తిడి ఉంటుందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
"భారత కెప్టెన్‌గా ఎంపికైన ఆటగాడిపై ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే జట్టు సభ్యుడిగా ఉండటానికి, కెప్టెన్‌గా వ్యవహరించడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే టీమ్ మెంబర్‌గా ఉన్నప్పుడు సాధారణంగా మీకు క్లోజ్‌గా ఉన్న ఆటగాళ్లతో ఎక్కువగా సంభాషిస్తారు.
కానీ కెప్టెన్ అయినప్పుడు, జట్టులోని ఇతర ఆటగాళ్ళు మిమ్మల్ని గౌరవించే విధంగా మీరు ప్రవర్తించాలి. కెప్టెన్ ప్రవర్తన అతని ప్రదర్శన కంటే ముఖ్యమైనది" అంటూ స్పోర్ట్స్ టాక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది.
ఇంగ్లండ్‌తో టెస్టులకు భారత జట్టు
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, సిరాజ్
చదవండి: IPL 2025: 'పంత్‌ను చూసి నేర్చుకోండి'.. రహానేపై సెహ్వాగ్ ఫైర్