
టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ గస్ అట్కిన్సన్ గాయం బారిన పడ్డాడు. జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో అట్కిన్సన్ తొడ కండరాలు పట్టేశాయి. అతడు గాయం నుంచి కోలుకోవడానికి రెండు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. అతడు ప్రస్తుతం ఇంగ్లండ్ క్రికెట్ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు.
ఈ క్రమంలో వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు అట్కిన్సన్ దూరమయ్యాడు. అతడు విండీస్‌తో టీ20లలో కూడా ఆడేది అనుమానమే. కాగా జూన్ 20న ప్రారంభమయ్యే భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ సమయానికైనా 27 ఏళ్ల గస్ అట్కిన్సన్ ఫిట్‌నెస్ సాధిస్తాడో లేదో వేచి చూడాలి.
కాగా విండీస్‌తో వన్డేలకు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఇప్పటికే స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ సేవలను కోల్పోయింది. గాయం కారణంగా ఆర్చర్ విండీస్ టూర్‌కు దూరమయ్యాడు. అతడి స్ధానాన్ని లూక్ వుడ్‌తో ఇంగ్లండ్ సెలక్టర్లు భర్తీ చేశారు. ఇక ఇంగ్లండ్-విండీస్ మధ్య మూడు వన్డేల సిరీస్ గురువారం నుంచి ప్రారంభం కానుంది.
ఇంగ్లండ్ వన్డే జట్టు:
హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్, విల్ జాక్స్, జో రూట్, బెన్ డకెట్, జోఫ్రా ఆర్చర్, గుస్ అట్కిన్‌సన్, టామ్ బాంటన్, జేకబ్ బెథెల్, బ్రైడన్ కార్స్, టామ్ హార్ట్‌లే, సాకిబ్ మహమూద్, మాథ్యూ పాట్స్, జేమీ ఒవర్టన్, ఆదిల్ రషీద్, జేమీ స్మిత్.
ఇంగ్లండ్ టీ20 జట్టు:
హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జేకబ్ బెథెల్, టామ్ బాంటన్, జోస్ బట్లర్, బ్రైడన్ కార్స్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, సాకిబ్ మహమూద్, మాథ్యూ పాట్స్, జేమీ ఒవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, ల్యూక్ వుడ్.