ప్రపంచ రెండో ర్యాంకర్‌ నకమురాపై అర్జున్‌ గెలుపు | Arjun wins over world number two Nakamura | Sakshi
Sakshi News home page

ప్రపంచ రెండో ర్యాంకర్‌ నకమురాపై అర్జున్‌ గెలుపు

Jun 2 2025 1:21 AM | Updated on Jun 2 2025 1:21 AM

Arjun wins over world number two Nakamura

స్టావెంజర్‌: నార్వే చెస్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ అద్భుత విజయం అందుకున్నాడు. ప్రపంచ రెండో ర్యాంకర్‌ హికారు నకమురా (అమెరికా)తో జరిగిన ఐదో రౌండ్‌ గేమ్‌లో అర్జున్‌ అర్మగెడాన్‌ టైబ్రేక్‌ గేమ్‌లో గెలుపొందాడు. వీరిద్దరి మధ్య జరిగిన క్లాసికల్‌ ఫార్మాట్‌ గేమ్‌ 76 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. దాంతో విజేతను నిర్ణయించేందుకు అర్మగెడాన్‌ గేమ్‌ను నిర్వహించారు. ఈ గేమ్‌లో అర్జున్‌ 48 ఎత్తుల్లో నకమురాపై విజయం సాధించాడు. 

మరోవైపు ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌ ఐదో రౌండ్‌ గేమ్‌లో 56 ఎత్తుల్లో వె యి (చైనా) చేతిలో ఓడిపోయాడు. ఇదే టోర్నీ మహిళల విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి చైనా గ్రాండ్‌మాస్టర్‌ లె టింగ్‌జీపై అర్మగెడాన్‌ టైబ్రేక్‌ గేమ్‌లో 38 ఎత్తుల్లో గెలిచింది. అంతకుముందు వీరిద్దరి మధ్య క్లాసికల్‌ ఫార్మాట్‌ గేమ్‌ 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది.  భారత మరో గ్రాండ్‌మాస్టర్‌ వైశాలి 35 ఎత్తుల్లో స్పెయిన్‌కు చెందిన సారా ఖాడెమ్‌ను ఓడించింది. 

Advertisement
 
Advertisement
Advertisement