breaking news
hikaru Nakamura
-
ప్రపంచ రెండో ర్యాంకర్ నకమురాపై అర్జున్ గెలుపు
స్టావెంజర్: నార్వే చెస్ టోర్నమెంట్లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ అద్భుత విజయం అందుకున్నాడు. ప్రపంచ రెండో ర్యాంకర్ హికారు నకమురా (అమెరికా)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో అర్జున్ అర్మగెడాన్ టైబ్రేక్ గేమ్‌లో గెలుపొందాడు. వీరిద్దరి మధ్య జరిగిన క్లాసికల్ ఫార్మాట్ గేమ్ 76 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. దాంతో విజేతను నిర్ణయించేందుకు అర్మగెడాన్ గేమ్‌ను నిర్వహించారు. ఈ గేమ్‌లో అర్జున్ 48 ఎత్తుల్లో నకమురాపై విజయం సాధించాడు. మరోవైపు ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ఐదో రౌండ్ గేమ్‌లో 56 ఎత్తుల్లో వె యి (చైనా) చేతిలో ఓడిపోయాడు. ఇదే టోర్నీ మహిళల విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి చైనా గ్రాండ్‌మాస్టర్ లె టింగ్జీపై అర్మగెడాన్ టైబ్రేక్ గేమ్‌లో 38 ఎత్తుల్లో గెలిచింది. అంతకుముందు వీరిద్దరి మధ్య క్లాసికల్ ఫార్మాట్ గేమ్ 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. భారత మరో గ్రాండ్‌మాస్టర్ వైశాలి 35 ఎత్తుల్లో స్పెయిన్‌కు చెందిన సారా ఖాడెమ్ను ఓడించింది. -
ఆనంద్ రెండో రౌండ్ గేమ్ డ్రా
స్టావెంజర్ (నార్వే): ఆల్టిబాక్స్ నార్వే చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ వరుసగా రెండో ‘డ్రా’ నమోదు చేశాడు. హికారు నకముర (అమెరికా)తో మంగళవారం జరిగిన రెండో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 39 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. లెవాన్ అరోనియన్ (అర్మేనియా)తో సోమవారం జరిగిన తొలి రౌండ్ గేమ్‌ను ఆనంద్ 31 ఎత్తుల్లో ‘డ్రా’ చేశాడు. 10 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో రెండో రౌండ్ తర్వాత ఆనంద్ ఒక పాయింట్‌తో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. -
జ్యూరిచ్ చెస్ టోర్నీ రన్నరప్ ఆనంద్
భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ జ్యూరిచ్ చెస్ చాలెంజ్ టోర్నమెంట్లో రన్నరప్‌గా నిలిచాడు. ర్యాపిడ్, బ్లిట్జ్ విభాగాల గేమ్‌లు ముగిశాక హికారు నకముర (అమెరికా), ఆనంద్ 10.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా నకముర విజేతగా అవతరించగా... ఆనంద్ రన్నరప్‌తో సంతృప్తి పడ్డాడు. 9.5 పాయింట్లతో వ్లాదిమిర్ క్రామ్నిక్ (రష్యా) మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.