
అమెరికాలోని ఆర్లింగ్టన్‌లో జరిగిన చెక్‌మేట్ ఈవెంట్ ఓపెనింగ్ లెగ్‌లో భారత్‌పై యూఎస్‌ఎ ఆధిపత్యం చెలాయించింది. ఆదివారం జరిగిన గేమ్‌లో అమెరికా గ్రాండ్ మాస్టర్ హికారు నకమురా.. ప్రపంచ ఛాంపియన్ డి గుకేష్‌ను 0-5 తేడాతో వైట్‌వాష్ చేశాడు.
దీంతో భారత్‌పై అమెరికా విజయం సాధించింది. అయితే విజయం అనంతరం హికారు నకమురా ఓవరాక్షన్ చేశాడు. గేమ్ ముగిసిన వెంటనే ఈ అమెరికా చెస్ స్టార్ గుకేష్ కింగ్‌ను ప్రేక్షకులపైకి విసిరి సెలబ్రేట్ చేసుకున్నాడు.
కానీ గుకేష్ మాత్రం సహనం కోల్పోకుండా పావులను అమర్చకుంటూ నవ్వుతూ ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ క్రమంలో అతడిపై నెటిజన్లు విమర్శలు వర్షం కురిపిస్తున్నారు.
మరీ అంత పొగరు పనికిరాదు అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే తన చర్యలపై నకమురా స్పందించాడు. తాను గెలిచిన ప్రతీసారి కింగ్‌ను విసిరేస్తాను అని నకమురా చెప్పుకొచ్చాడు.
HIKARU THROWS A PIECE TO THE CROWD TO CELEBRATE THE USA 5-0! @GMHikaru
What an event!! 🔥👏 @CheckmateUSAIND pic.twitter.com/LGnM8JLulJ— Chess.com (@chesscom) October 5, 2025
చదవండి: Pro Kabaddi League: తెలుగు టైటాన్స్ గెలుపు జోరు..