ఇంగ్లండ్‌ క్రికెటర్‌ రిటైర్మెంట్‌ ప్రకటన | Joe Denly to retire at the end of the 2026 County Championship | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ క్రికెటర్‌ రిటైర్మెంట్‌ ప్రకటన

Jul 17 2026 5:03 PM | Updated on Jul 17 2026 5:19 PM

Joe Denly to retire at the end of the 2026 County Championship

Photo Credit : Cricinfo

ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జో డెన్లీ ప్రొఫెషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2026 కౌంటీ ఛాంపియన్‌షిప్ సీజన్ ముగిసిన తర్వాత అన్ని రకాల క్రికెట్‌ నుంచి తీసుకోనున్నట్లు ప్రకటించాడు.

2009లో ఐర్లాండ్‌పై వన్డేతో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన డెన్లీ, ఇంగ్లండ్ తరఫున 15 టెస్టులు, 16 వన్డేలు, 13 టీ20లు ఆడాడు. 2020లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్ అతని చివరి అంతర్జాతీయ మ్యాచ్‌గా నిలిచింది.

కెంట్‌తో చిరస్మరణీయ అనుబంధం
డెన్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువ కాలం​ కొనసాగనప్పటికీ.. దేశవాలీ క్రికెట్‌లో మాత్రం సుదీర్ఘ ప్రయాణం చేశాడు. మిడిల్‌సెక్స్ తరఫున మూడేళ్లు ఆడిన అతడు.. తన దేశవాళీ కెరీర్‌లో ఎక్కువ భాగం కెంట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 250కి పైగా ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 14 వేలకుపైగా పరుగులు చేశాడు. టీ20ల్లో 300కుపైగా మ్యాచ్‌లు ఆడి 7 వేలకుపైగా పరుగులు సాధించాడు.

అరుదైన రికార్డు, టైటిల్ విజయం
2018లో సర్రేతో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో డెన్లీ సెంచరీ చేయడంతో పాటు హ్యాట్రిక్ కూడా సాధించాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. అనంతరం 2022లో కెంట్ కెప్టెన్‌గా వన్డే కప్ టైటిల్ (1974 తర్వాత) అందించాడు.

డెన్లీ ఇంగ్లండ్‌ జాతీయ, దేశవాలీ క్రికెట్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్‌ ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL), పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL), బిగ్ బాష్ లీగ్ (BBL), ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ILT20) వంటి పలు ప్రముఖ ఫ్రాంచైజీ లీగ్‌ల్లో తన సేవలు అందించాడు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement