
ఇండియా-ఎ జట్టు మాజీ కెప్టెన్, గుజరాత్ స్టార్ బ్యాటర్ ప్రియాంక్ పంచల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని సోమవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు కొనసాగిన తన దేశవాళీ కెరీర్‌కు ముగింపు పలికాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాను. నాకు ఈ క్షణం చాలా భాగోద్వేగంతో కూడుకున్నది. అంతే గర్వంగా కూడా ఉంది. నాకు మద్దతుగా నిలిచిన గుజరాత్ క్రికెట్ ఆసోషియేషన్‌కు, అభిమానులకు, సహచర ఆటగాళ్లు ధన్యవాదాలు అని తన రిటైర్మెంట్ నోట్‌లో పంచల్ పేర్కొన్నాడు.
ప్రియాంక్‌కు దేశవాళీ క్రికెట్‌లో అద్బుతమైన రికార్డులు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్, లిస్ట్-ఎ క్రికెట్‌లో పరుగులు వరద పారించాడు. ప్రియాంక్ తన 17 ఏళ్ల కెరీర్‌లో127 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి 8856 పరుగులు చేశాడు. ఇందులో 29 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ముఖ్యంగా 2016-17 రంజీ సీజన్‌లో ఈ గుజరాతీ బ్యాటర్ భీబత్సం సృష్టించాడు. ఆ సీజన్‌లో ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. ఓవరాల్‌గా ఆ ఎడిషన్‌లో 1310 పరుగులు చేశాడు. అదేవిధంగా97 లిస్ట్ ఏ మ్యాచుల్లో 8 సెంచరీలతో కలిపి 3,672 పరుగులు చేశాడు. 59 టీ20లు ఆడిన ప్రియాంక్ 28.71 సగటుతో 1,522 పరుగులు సాధించాడు.
కాగా ప్రియాంక్ 2021లో టీమిండియాకు రిజర్వ్ ఓపెనర్‌గా ఎంపికయ్యాడు. కానీ భారత తరుపన అరంగేట్రం చేసే అవకాశం మాత్రం లభించలేదు. 2022 శ్రీలంక టూర్‌కు కూడా సెలక్ట్ అయ్యాడు. అక్కడ కూడా అతడికి డెబ్యూ చేసే ఛాన్స్ రాలేదు.