
ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సమయం అసన్నమవుతోంది. జూన్ 20 నుంచి ఈ హైవోల్టేజ్ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ప్రధాన సిరీస్‌కు ముందు భారత-ఎ జట్టు ఇంగ్లండ్ లయన్స్‌తో రెండు అనాధికారిక టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.
తొలి టెస్టు మే 30 నుంచి జూన్ 2 వరకు కాంటర్బరీ వేదికగా, రెండో టెస్టు నార్తాంప్టన్‌లో జూన్ 6 నుంచి 9 వరకు జరగనున్నాయి. అయితే ఈ అనాధికారిక టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇండియా- ఎ జట్టు నుంచి తప్పుకోవాలని గిల్ నిర్ణయించుకున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఈ సిరీస్‌కు ఎంపిక చేసిన భారత-ఎ జట్టులో గిల్ సభ్యునిగా ఉన్నాడు. ఇంగ్లండ్ కండీషన్స్‌కు అలవాటు పడేందుకు గిల్‌కు ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఉపయోగపడతాయని సెలక్టర్లు భావించారు.
ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కారణంగా తొలి వార్మాప్ మ్యాచ్‌కు గిల్ దూరంగా ఉంటాడని, రెండవ ప్రాక్టీస్ మ్యాచ్ కోసం ఇండియా-ఎ జట్టులో చేరతారని భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలిపాడు. కానీ ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్న గిల్‌కు విశ్రాంతి ఇవ్వాలని సెలక్టర్లు కూడా యోచిస్తున్నట్లు సమాచారం.
ఇక ఇప్పటికే భారత-ఎ జట్టు ఇంగ్లండ్‌కు పయనమైంది. ఈ జట్టు కెప్టెన్‌గా దేశవాళీ దిగ్గజం అభిమాన్యు ఈశ్వరన్ వ్యవహరించనున్నాడు. జూన్ 13 నుంచి బెకెన్‌హామ్ వేదికగా మూడు రోజుల పాటు జరిగే ఇంట్రా స్వ్కాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో గిల్ పాల్గోనే అవకాశముంది.
ఇంగ్లండ్ పర్యటనకు భారత- ఎ జట్టు:
అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, ధృవ్ జురెల్ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మానవ్ సుతార్, తనుష్ కోటియన్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే, హర్ష్ దూబే
చదవండి: ఏయ్ నీవు ఏమి చేస్తున్నావు.. కోపంతో ఊగిపోయిన కోహ్లి! వీడియో వైరల్