భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటన.. షెడ్యూల్‌ విడుదల | Australia Women To Tour India For ODI Series In September | Sakshi
Sakshi News home page

భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటన.. షెడ్యూల్‌ విడుదల

May 29 2025 4:29 PM | Updated on May 29 2025 4:53 PM

Australia Women To Tour India For ODI Series In September

ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా మహిళా క్రికెట్‌ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ఇవాళ  విడుదల చేసింది. ఈ పర్యటనలో ఆసీస్‌ మహిళా టీమ్‌ భారత మహిళల క్రికెట్‌​ జట్టుతో మూడు వన్డేలు ఆడనుంది. సెప్టెంబర్‌ 14, 17, 20 తేదీల్లో చెన్నై వేదికగా ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి.

ఆస్ట్రేలియా-ఏ, సౌతాఫ్రికా-ఏ జట్లు కూడా..!
ఆస్ట్రేలియా మహిళా క్రికెట్‌ జట్టు భారత్‌లో పర్యటిస్తుండగానే ఆ దేశ పురుషుల ఏ టీమ్‌ కూడా భారత్‌లో పర్యటించనుంది. సెప్టెంబర్‌ 16- అక్టోబర్‌ 5 మధ్య తేదీల్లో ఆసీస్‌-ఏ టీమ్‌ భారత ఏ జట్టుతో రెండు అనధి​కారిక నాలుగు రోజుల టెస్ట్‌ మ్యాచ్‌లు, మూడు వన్డేలు ఆడుతుంది. టెస్ట్‌ మ్యాచ్‌లకు లక్నో ఆతిథ్యమివ్వనుండగా.. వన్డేలు కాన్పూర్‌లో జరుగనున్నాయి.

భారత్‌లో ఆస్ట్రేలియా-ఏ మెన్స్‌ టీమ్ షెడ్యూల్‌..
తొలి టెస్ట్‌: సెప్టెంబర్‌ 16-19 (లక్నో)
రెండో టెస్ట్‌: సెప్టెంబర్‌ 23-26 (లక్నో)

తొలి వన్డే: సెప్టెంబర్‌ 30 (కాన్పూర్‌)
రెండో వన్డే: అక్టోబర్‌ 3 (కాన్పూర్‌)
మూడో వన్డే: అక్టోబర్‌ 5 (కాన్పూర్‌)

ఆస్ట్రేలియా ఏ పురుషుల టీమ్‌ భారత్‌లో పర్యటిస్తుండగానే సౌతాఫ్రికా ఏ పురుషుల ఏ టీమ్‌ కూడా భారత్‌లో పర్యటిస్తుంది. ఆస్ట్రేలియా ఏ టీమ్‌ లాగే ఈ జట్టు కూడా భారత్‌ ఏ జట్టుతో రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లు, మూడు వన్డేలు ఆడుతుంది. టెస్ట్‌ మ్యాచ్‌లు బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సెలెన్స్‌లో జరుగనుండగా.. వన్డేలు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగనున్నాయి.

భారత్‌లో సౌతాఫ్రికా-ఏ మెన్స్‌ టీమ్ షెడ్యూల్‌..
తొలి టెస్ట్‌: అక్టోబర్‌ 30-నవంబర్‌ 2 (బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సెలెన్స్‌ గ్రౌండ్‌)
రెండో టెస్ట్‌: నవంబర్‌ 6-9 (బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సెలెన్స్‌ గ్రౌండ్‌)

తొలి వన్డే: నవంబర్‌ 13 (చిన్నస్వామి స్టేడియం​)
రెండో వన్డే: నవంబర్‌ 16 (చిన్నస్వామి స్టేడియం​)
మూడో వన్డే: నవంబర్‌ 19 (చిన్నస్వామి స్టేడియం​)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement