breaking news
Funday
-
మొక్కల పెంపకం ఇక ఈజీ.. ఈ చిట్టి గాడ్జెట్లు ఉంటే చాలు!
మొక్కలు నాటడం ఈజీనే.. కానీ వాటిని పెంచడం మాత్రం కాస్త కష్టమే! కుండీలు కదపడం నుంచి నీళ్లు పోయడం వరకు.. గార్డెనింగ్‌లో ఈ చిన్న గాడ్జెట్లు ఉంటే పని సింపుల్! రూ.200 నుంచి అందుబాటులో ఉన్న ఈ మినీ గార్డెనింగ్ గాడ్జెట్లు ఏంటో చూద్దాం..మినీ మెషిన్లు... మెనీ ప్లాంటేషన్లుమొక్కలు నాటేయడం సులభమే కానీ, వాటిని పెంచడమే చాలా కష్టం. ఏ మొక్కకు ఏం కావాలో అర్థం చేసుకునేలోపే, ఒక్కోసారి మొక్క మన నుంచి చేజారిపోతుంది. అందుకే, మొక్కల పెంపకాన్ని కాస్త సింపుల్‌గా, కాస్త స్మార్ట్‌గా మార్చే ఈ చిట్టి గార్డెనింగ్ గాడ్జెట్లు!కుండీలతో ఖుషీ ఖుషీ!పెద్ద పెద్ద కుండీలను కాస్త కదిలించాలంటే ముందు మొక్కను చూసి, తర్వాత మన నడుమును చూసుకోవాల్సిందే! వాటిని మార్చాలంటే ఎత్తడం, లాగడం, తోయడం వంటి పనులతో చాలా అలసిపోతాం. ఇప్పుడు ఈ కష్టానికే ఈ ప్లాంట్ స్టాండ్ విత్ వీల్స్ చెక్ పెట్టేస్తుంది. కుండీని స్టాండ్‌పై పెట్టేసి, కావాల్సిన చోటికి సులభంగా తీసుకెళ్లొచ్చు.నాలుగు చక్రాలు 360 డిగ్రీలు తిరగడంతో దిశ మార్చడం కూడా ఈజీ. వీటి బలమైన నిర్మాణంతో బరువైన కుండీలను కూడా మోయగలదు. అంతేకాదు, స్టాండ్ కింద అదనపు నీటిని సేకరించడానికి ఒక ట్రే కూడా ఉంటుంది. దీంతో నేల మీద నీళ్లు కారే సమస్య కూడా తగ్గుతుంది. ఇంట్లో, బాల్కనీలో, బయట తోటలో– ఎక్కడైనా వాడుకోవచ్చు. ధర సైజ్, డిజైన్ బట్టి రూ.400 నుంచి మొదలు.పూలతో నీటి ఆహారం! మొక్కలు మనతో కలిసి ప్రయాణించలేవు. కానీ, ‘నాకు నీళ్లు ఎవరు పోస్తారు?’ అని మొక్క పడే టెన్షన్ మాత్రం తోడొస్తుంది! అందుకే, మొక్కలకు రోజూ నీళ్లు పోయడం మర్చిపోయే వాళ్లకు లేదా ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లేవాళ్లకు ఈ ట్యులిప్ సెల్ఫ్ వాటరింగ్ స్పైక్స్ బాగా పనిచేస్తాయి.పూల ఆకారంలో ఉండే దీని పైభాగంలో నీళ్లు నింపి, కింద స్పైక్‌ను మట్టిలో పెట్టేస్తే చాలు. రిజర్వాయర్‌లోని నీరు క్రమంగా వేర్లవైపు చేరుతూ మట్టిలో తేమను నిలబెడుతుంది. చిన్న కుండీలు, టేబుల్‌టాప్ మొక్కలు, ఇంటి మొక్కలు, బాల్కనీ గార్డెన్ – ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నాలుగు పీసుల ప్యాక్ ధర రూ.500 మాత్రమే!మొక్కకు సేఫ్టీ బెల్ట్!మొక్క పెరుగుతూ ఏ వైపు అంటే ఆ వైపు వంగిపోతూ మీ మాట వినట్లేదా! అందుకని తాడు, వైర్, ప్లాస్టిక్ టైలు అంటూ ఇంట్లో దొరికినవన్నీ మొక్కకు కట్టి, కష్టపడకండి. ఈ రీయూజబుల్ ప్లాంట్ టై టేప్ వాడండి. కావాల్సినంత పొడవు కట్ చేసుకుని మొక్క చుట్టూ చుట్టి టక్కున అంటించేయొచ్చు.ముడులు వేయాల్సిన అవసరం లేదు, బిగుతుగా కట్టి కాండాన్ని ఇబ్బంది పెట్టాల్సిన పనీ లేదు. మృదువైన పదార్థంతో తయారవటంతో మొక్కలకు సురక్షితంగా సపోర్ట్ ఇస్తుంది. గాలి, వాన, ఎండలోనూ పట్టును నిలబెట్టుకుంటుంది. మనీ ప్లాంట్, తీగజాతి మొక్కలు, చిన్న మొక్కలు, మొలకలు– ఇలా రకరకాల మొక్కలకు ఉపయోగించొచ్చు. అవసరం తీరాక తీసేసి మళ్లీ వాడుకోవచ్చు కూడా! ధర రూ.200 మాత్రమే!ఇదీ చదవండి: ప్లస్ సైజ్ బాడీనా? ఈ స్టైల్ టిప్స్ పాటిస్తే లుక్ అదిరిపోవాల్సిందే! -
పర్యాటకంతో కాసుల వర్షం.. టాప్–10 దేశాలు ఇవే!
టూరుకెళ్లడం అంటేనే చాలామందికి ఎక్కడలేని హుషారు! కాస్త సమయం చిక్కితే, కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని, అక్కడి వింతలను ప్రత్యక్షంగా తిలకించాలని ఉబలాటపడేవాళ్లు ప్రపంచమంతటా ఉంటారు. చారిత్రక ప్రదేశాలను చూడటానికి చాలామంది పర్యటనలు చేస్తారు.మన దేశంలో ఎక్కువమంది తీర్థ క్షేత్రాలను సందర్శించడానికి పర్యటనలు చేస్తారు. పర్యాటకం చాలా దేశాలకు ముఖ్యమైన ఆదాయ వనరు. కేవలం పర్యాటక ఆదాయమే ప్రధాన వనరుగా మనుగడ సాగిస్తున్న దేశాలు డజన్లలో ఉన్నాయి. నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రపంచ పర్యాటక విశేషాలను గణాంకాల్లో తెలుసుకుందాం...ప్రపంచంలో కొన్ని దేశాలు పర్యాటకుల రద్దీతో కిటకిటలాడుతుంటే, ఇంకొన్ని దేశాలు పర్యాటకుల రద్దీతోనే కాకుండా, పర్యాటక ఆదాయంతోనూ కళకళలాడుతున్నాయి. పర్యాటక ఆదాయంలో అత్యధికంగా కాసులు రాబట్టుకుంటున్న టాప్–10 దేశాల గణాంకాలు...ప్రపంచ జనాభాలో మన దేశం అగ్రస్థానంలో ఉన్నా, ప్రపంచ పర్యాటకంలో ఇంకా 39వ స్థానంలోనే ఉంది. మన పర్యాటక ఆదాయంలో అత్యధిక భాగం స్వదేశీ పర్యాటకుల ద్వారానే లభిస్తోంది. మన దేశానికి విదేశాల నుంచి వచ్చే పర్యాటకుల్లో ఎక్కువమంది ప్రవాస భారతీయులే ఉంటున్నారు. ఇక్కడ ఉంటున్న బంధుమిత్రులను చూడటానికి వచ్చేవారే వీరిలో ఎక్కువమంది ఉంటున్నారు. మన దేశ పర్యాటక వివరాలను గణాంకాల్లో చూద్దాం...ఇదీ చదవండి: ప్రేమా.. ధనమా.. ప్రతిష్ఠా? ముందుగా ఏది ఇంట్లోకి రావాలి? -
ప్రేమా.. ధనమా.. ప్రతిష్ఠా? ముందుగా ఏది ఇంట్లోకి రావాలి?
అనగనగా వెంకటాపురం అనే ఊరు ఉండేది. ఆ ఊరిలో రామేశ్వరమ్మ అనే ఇల్లాలు జీవించేది. ఆమె మంచి దైవ భక్తురాలు. అడిగితే లేదనకుండా ఉన్నంతలో దానం చేసేది. ఆమె భర్త ఆమెకు పూర్తి సహకారం అందించేది.ఒక రోజున ఆ ఊరికి ప్రేమ, ధనం, ప్రతిష్ఠ అనే పేర్లు గల ముగ్గురు సాధువులు వచ్చారు. వారి దినచర్యలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ భిక్షాటన చేసేవారు. ఇలా ఒక రోజున ఆ ఊరిలో దైవ భక్తురాలైన రామేశ్వరమ్మ ఇంటికి కూడా వచ్చారు.‘భిక్షాందేహి’ అంటూ ఇంటి ముందు ఆ సాధువులు నిలబడి అన్నారు. లోపల ఉన్న రామేశ్వరమ్మ గడప వద్దకు వచ్చి, ‘అదేం భాగ్యం అన్నదానం చేస్తే పుణ్యం వస్తుంది కదా!’ అనుకొని ‘‘కొద్దిసేపు ఆగండి. వంటపని ఇంకా పూర్తి కాలేదు. పూర్తి చేసి మీకు భోజనం పెడతాను. ఈలోపు బజారుకు వెళ్లిన మా భర్త కూడా వస్తాడు’’ అని చెప్పి ఆ ముగ్గురు సాధువులను లోపలికి వచ్చి కూర్చోమన్నది.‘‘ఏం ఫర్వాలేదు. మేము వెలుపల వున్న అరుగు మీద ఎదురుచూస్తూ కూర్చుంటాం. మీ పని కానివ్వండి’’ అని సాధువులు బదులిచ్చారు.ఈలోగా తన భర్త కూడా బజారు నుంచి ఇంటికి వచ్చాడు. భార్య భర్తతో సాధువులు వచ్చిన సంగతి చెప్పింది. వంట పూర్తి అయింది కదా. వారిని పిలిచి వడ్డించమని భార్యకు చెప్పాడు భర్త.రామేశ్వరమ్మ బయటకు వచ్చి ఆరుబయట ఎదురు చూస్తున్న సాధువులను ‘భోజనం సిద్ధంగా ఉంది రమ్మ’ని కోరింది.అయితే ఆ సాధువులు ‘‘ముగ్గురం ఒకేసారి లోపలికి రాకూడదు. మా నియమం ప్రకారం ఒకరి తర్వాత ఒకరం మాత్రమే వస్తాం. ప్రేమ, ధనం, ప్రతిష్ఠ అనే మా ముగ్గురిలో ముందు ఎవరు రావాలో మీరే నిర్ణయించి పిలవండి’’ అని చెప్పారు.ఈ మాటలు విన్న రామేశ్వరమ్మ లోపలికి వెళ్లి భర్తతో చెప్పింది. భర్త బాగా ఆలోచించి ‘‘ధనం ఉంటేనే కదా! ప్రేమ ప్రతిష్ఠలు కలిగేది. కాబట్టి ముందుగా డబ్బు లేదా ప్రతిష్ఠలలో ఎవరో ఒకరిని పిలువు’’ అని చెప్పాడు.భర్త మాట ప్రకారం ఆమె వెలుపలికి వచ్చి ముందుగా ఆ ఇద్దరినీ పిలిచింది. సాధువులు మాత్రం ‘‘ఎవరినో ఒకరిని మాత్రమే పిలవ వలసి ఉంటుంది’’ అని మళ్ళీ చెప్పారు. డబ్బు, ప్రతిష్ఠ అనే మీ ఇద్దరిలో ఎవరో ఒకరు అనేది మీరే నిర్ణయించుకోండి. ఆ ఒక్కరే లోపలికి రమ్మని ఇల్లాలు కోరింది.‘‘లేదు... లేదు... ఒకరినే పిలవండి’’ అని మళ్ళీ అన్నారు.రామేశ్వరమ్మ ఆలోచించి ముందుగా డబ్బును ఆహ్వానించింది లోపలికి.అప్పుడు డబ్బు అనే సాధువు ‘‘అమ్మ! లోకమంతా డబ్బునే రమ్మని ముందుగా ఆహ్వానిస్తున్నారు. లోకమంతా డబ్బుకే దాసోహం అయినట్లు ఇలా పిలవడం సరికాదు కదా! ముందుగా ప్రేమ ఉంటే తర్వాత డబ్బు, ప్రతిష్ఠ వాటంతట అవే వస్తాయి. అందుకే ముందుగా నీవు ప్రేమను పిలిచి ఉంటే మా నియమం ప్రకారం అందరం ఒకేసారి లోపలికి వచ్చేవాళ్ళం. నీ ఆతిథ్యం స్వీకరించే వాళ్ళం. కానీ అలా జరగలేదు’’ అంటూ ముగ్గురు తినకుండానే వెనుదిరిగి పోయారు.పాపం రామేశ్వరమ్మ జరిగిన విషయాన్ని లోపలికి వెళ్లి భర్తతో చెప్పి బాధపడింది. ముందుగా ఈ లోకంలో అందరూ ప్రేమ కలిగి ఉండాలని భార్యాభర్తలు తమ తమ మనసులో అనుకున్నారు.పరోపి హితవాన్ బంధుః బంధురప్యహితో పరఃఅహితర్దేహజర్వ్యాధి హితోరరణ్యమౌషధంపరుడైనా మేలు కోరేవాడు బంధువు. బంధువైనా కీడు కోరేవాడు పరుడు. కీడు కోరేవాడు శరీరంలోని రోగం లాంటి వాడు. మేలు కోరేవాడు అరణ్యంలో దొరికే వనౌషధం లాంటి వాడు.- కోమటిరెడ్డి బుచ్చిరెడ్డిఇదీ చదవండి: ఏనుగమ్మో ఏనుగు! -
Health: ఏనుగమ్మో ఏనుగు!
మానవ శరీర చరిత్రలో మొదట ఈ ‘ఏనుగు’ను ప్రాచీన ఈజిప్టులో (కీ.పూ. 1479–1458) గుర్తించారు. ‘అటి’ అనే పేరు గల ఈజిప్జు రాణి కాలు ఏనుగు కాలుగా మారటాన్ని చూసి రాజ వైద్యులు దిమ్మెర పోయారు.ఆ తర్వాత క్రీ.పూ. 6వ శతాబ్దపు భారతదేశ ప్రసిద్ధ ఆయుర్వేద గ్రంథం ‘సుశ్రుత సంహిత’లో ఈ ఏనుగు కాలుతో పాటుగా ఏనుగు చేయి ప్రస్తావన కూడా ఉన్నట్లు వైద్య ప్రపంచం దృష్టికి వచ్చింది.అనంతరం గ్రీసులో, క్రీ.పూ. 5 వ శతాబ్దపు వైద్యుడు ‘హిపోక్రటీస్’ ఏనుగు కాళ్ల వ్యాధిపై తొలినాళ్ల పరిశోధనలు జరిపారు.17వ శతాబ్దంలో నాటికి అధునికులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో వీటిపై పరిశోధనలు విస్తృతంగా జరిగాయి.తాజాగా సింగపూర్ వైద్య పరిశోధకులు ఏనుగు కాలును లేదా ఏనుగు చేతులను తిరిగి మానవ కాళ్లుగా, చేతులుగా మార్చే నివారణోపాయాన్ని కనిపెట్టే దిశగా కొంత విజయం సాధించారు.సాధారణంగా, కాన్సర్ చికిత్స పొందిన రోగులను కూడా వేధించే ఆ ఏనుగు కాలు వాధ్యే... ‘లింఫడీమా’! చేతులు, కాళ్లలో కూడా తీవ్రమైన వాపును కలిగించే ఈ సమస్యకు ఇప్పటివరకు మందుగానీ, శాశ్వత నివారణ గానీ లేదు. అయితే ఆహార పదార్థాలలో వాడే ఒక చవకైన ప్రత్యామ్నాయం దీనికి పరిష్కారంగా కనిపిస్తున్న విషయాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కణజాలాలలో పేరుకుపోయే కొలెస్ట్రాల్‌ను తొలగించడం ద్వారా ఈ లింఫడీమా వాపును తగ్గించవచ్చని వారి పరిశోధనలో తేలింది. ఈ కొత్త ఆవిష్కరణ బాధితుల జీవితాల్లో సరికొత్త ఆశలను చిగురింపజేస్తోంది.ఆపిల్ జ్యూస్, పెరుగు, రెడ్ వైన్లలో రుచిని పెంచడానికి వాడే ఫుడ్ ఆడిటివ్స్... లింఫడీమాను – అంటే చేతులు, కాళ్లలో వచ్చే తీవ్రమైన వాపును నయం చేసేందుకు ఉపయోగపడ తాయన్న ఈ పరిశోధ వివరాలు ‘నేచర్’ జర్నల్‌లో ప్రచురితం అయ్యాయి. ఆ వివరాల ప్రకారం, సైక్లోడెక్స్ట్రిన్స్ అని పిలిచే కాంపౌండ్లు (ఆడిటివ్ల రసాయన మూలకాలకు) లింఫడీమా వాపును తగ్గించగల గుణం ఉంది.జంతువులపై జరిపిన అధ్యయనాల ఆధారంగా తేలిన ఈ విషయాలు, ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధితో బాధపడుతున్న 14 కోట్ల నుంచి 25 కోట్ల మంది బాధితుల జీవితాలను మార్చే అవకాశం ఉంది. వీరిలో అధిక శాతం మందికి క్యాన్సర్ చికిత్స కారణంగానే ‘లింఫడీమా’ సమస్యలు వచ్చినట్లు పలు అధ్యయనాలను బట్టి తెలుస్తోంది. దుస్తులు ధరించటమూ కష్టమే!రొమ్ము క్యాన్సర్ చికిత్సలో భాగంగా లింఫ్ నోడ్స్ను తొలగించడానికి సర్జరీ చేసిన, లేదా రేడియోథెరపీ ఇచ్చిన... ప్రతి ఐదుగురిలో ఒకరికి చేతిలో లింఫడీమా వాపు వచ్చే అవకాశం ఉంది. లింఫ్ నోడ్స్ అనేవి శరీరం అంతటా ఉండే చిక్కుడు గింజ ఆకారపు నిర్మాణాలు. కణజాలాల నుండి వచ్చే వ్యర్థ ద్రవాన్ని (లింఫ్ ఫ్లూయిడ్) ఇవి వడకడతాయి. ఈ ద్రవం రక్తంలో కలవడానికి ముందే లింఫ్ నోడ్స్ దానిని శుభ్రపరుస్తాయి. రొమ్ము, తల లేదా మెడ భాగాల్లో క్యాన్సర్ కణాలు ఏర్పడినప్పుడు, అవి ఊపిరితిత్తుల వంటి ఇతర అవయవాలకు వ్యాపించే ముందు మొదట ఈ లింఫ్ నోడ్స్కే చేరుకుంటాయి.క్యాన్సర్ వ్యాపించకుండా ఉండటానికి ఈ లింఫ్ నోడ్స్ను సర్జరీ ద్వారా తొలగించడం లేదా రేడియోథెరపీ ఇవ్వడం వల్ల లింఫ్ వ్యవస్థ దెబ్బతిని మూసుకుపోతుంది. దీనివల్ల లింఫ్ ద్రవం పేరుకుపోయి తీవ్రమైన వాపు వస్తుంది. ఎంతలా అంటే... బట్టలు వేసుకోవడం లేదా బీరువాలోంచి సరిపోయే దుస్తులు వెతుక్కోవడం వంటి చిన్న చిన్న పనులు కూడా చాలా కష్టంగా మారతాయి.లింఫడీమా రోగుల జీవిత నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అంతేకాదు, దీనికి ప్రస్తుతం ఉన్న చికిత్సా మార్గాలు చాలా పరిమితంగా ఉన్నాయి. వాటిలో కొన్ని:కంప్రెషన్ దుస్తులు: బాధితులు మొదట ఈ ప్రత్యేకమైన బిగుతు దుస్తులను వాడాల్సి ఉంటుంది. కానీ వీటిని ప్రతిరోజూ వేసుకోవడం వల్ల చర్మం దురద, ఇరిటేషన్ వచ్చి కదలడం కూడా కష్టమవుతుంది.మసాజ్: చేతులతో చేసుకునే ఈ మసాజ్‌తో మంచి ఫలితం ఉండాలంటే క్రమం తప్పకుండా చేస్తూనే ఉండాలి.సర్జరీ: దెబ్బతిన్న లింఫ్ నాళాలను సరిచేసే సర్జరీ అందుబాటులో ఉన్నప్పటికీ, దీనికి దాదాపు 12 నుండి 25 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. అంతేకాకుండా సర్జరీ తర్వాత కూడా ఇతర చికిత్సలు అవసరమవుతాయి.లైపోసక్షన్: కిరణాలు లేదా శబ్ద తరంగాల ద్వారా కొవ్వును, ద్రవాన్ని కరిగించి బయటకు తీసే ఈ పద్ధతి కూడా అత్యంత ఖరీదైనది.చవకైన ప్రత్యామ్నాయంఈ క్రమంలోనే ఇప్పుడు నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ శాస్త్రవేత్తలు లింఫడీమాకు అతి తక్కువ ఖర్చుతో కూడిన ఆచరణాత్మక పరిష్కారాన్ని కనుగొన్నారు. కార్బోహైడ్రేట్స్ నుండి తయారయ్యే సెక్లోడెక్స్ట్రిన్ అనే పదార్థంపై దృష్టి పెట్టారు. ఆహార పదార్థాల్లోని అసహ్యకరమైన వాసనలను తమ కణాల నిర్మాణంలో బంధించే ప్రత్యేక గుణం సెక్లోడెక్స్ట్రిన్కు ఉంది. అందుకే ఆహార, పానీయాల పరిశ్రమలలో రుచిని, వాసనను పెంచడానికి దీనిని ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు.లింఫడీమా చరిత్రలింఫడీమా (కాళ్లూ చేతుల వాపు) ఆనవాళ్లు చరిత్రలో వేల సంవత్సరాల క్రితమే కనిపించాయి. శోషరస (లింఫాటిక్) వ్యవస్థ గురించి వైద్యులకు పూర్తిగా తెలియకముందే ఈ వ్యాధి ఆనవాళ్లను గుర్తించారు.పురాతన చిత్రాలు (క్రీ.పూ. 1500 ప్రాంతం)ఈ వ్యాధికి సంబంధించిన తొలి ఆధారాలు ఈజిప్టులోని రాతి చెక్కడాల్లో కనిపించాయి. పుంట్ దేశపు రాణి ‘అటి’ (రాణిగారి పేరు అటి) కాళ్లు విపరీతంగా వాచిపోవడం ఈ చెక్కడాల్లో చూడవచ్చు.పురాతన వైద్య గ్రంథాలు (క్రీ.పూ. 6వ – 5వ శతాబ్దం)భారతదేశం (సుశ్రుత సంహిత): సుశ్రుతుడు ఈ వ్యాధిని ‘శ్లీపద’ (ఏనుగు కాలు) అని పిలిచాడు. శరీరంలోని ద్రవాల అసమతుల్యత వల్లే ఈ వాపు వస్తుందని వివరించాడు. హిపోక్రటీస్ ఈ వాపును ‘ఎలిఫెంటియాసిస్’ అని వర్ణించాడు. కాళ్లలోని గ్రంథులు, నరాల గురించి కూడా రాశాడు.రోమన్, పర్షియన్ వైద్యం (క్రీ.శ. 2వ – 9వ శతాబ్దం)ప్రసిద్ధ వైద్యుడు గాలెన్ (రోమ్): వాపులున్న కాళ్లకు ప్రత్యేకమైన మసాజ్, వ్యాయామాలు అవసరమని చెప్పాడు. పర్షియన్ వైద్యులు ఈ సమస్యను ‘దా అల్–ఫిల్’ (ఏనుగు వ్యాధి) అని పిలిచారు.ఆధునిక వైద్య పరిశోధన (17వ శతాబ్దం)శరీరంలో లింఫ్ ద్రవం ప్రవహించే నరాలు మూసుకుపోవడం వల్లే ఈ నీటి వాపు వస్తుందని 17వ శతాబ్దంలో శాస్త్రవేత్తలు కనిపెట్టారు.శోషరస వ్యవస్థ అంటే?మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి, శరీర ద్రవాల సమతుల్యతను కాపాడటానికి పనిచేసే ఒక ముఖ్యమైన వ్యవస్థ. ఇది రక్త ప్రసరణ వ్యవస్థతో కలిసి పనిచేస్తుంది.ప్రధాన భాగాలుశోషరస ద్రవం: రక్తనాళాల నుండి కణజాలాల్లోకి కారిపోయే ప్రొటీన్లు, నీరు, తెల్ల రక్తకణాలతో కూడిన స్వచ్ఛమైన నీటి వంటి ద్రవం.శోషరస నాళాలు: శరీరం అంతటా విస్తరించి, శోషరస ద్రవాన్ని సేకరించి తిరిగి రక్తంలోకి చేర్చే సన్నని నాళాలు.శోషరస కణుపులు: గొంతు, బాహుమూలాలు, గజ్జల్లో ఉండే చిన్న గింజ వంటి నిర్మాణాలు. ఇవి ద్రవాన్ని వడపోసి హానికరమైన బాక్టీరియా, వైరస్‌లను నిర్మూలిస్తాయి.ముఖ్య అవయవాలు: ప్లీహం, థైమస్ గ్రంథి, టాన్సిల్స్ కూడా ఈ వ్యవస్థలో భాగమే. థైమస్ గ్రంథి మానవ రోగ నిరోధక వ్యవస్థలో అంతి కీలకమైన భాగం. ఇది గుండె, రొమ్ము ఎముక మధ్యలో, ఛాతీ ఎగువ భాగంలో ఉంటుంది.ముఖ్యమైన విధులుశరీర ద్రవాల సమతుల్యత: కణజాలాల్లో అదనంగా ఉన్న నీటిని, ద్రవాలను తొలగించి వాపులు రాకుండా చూస్తుంది.రోగనిరోధక శక్తి: ల్యూకోసైట్స్ (తెల్ల రక్తకణాలు) ద్వారా ఇన్ఫెక్షన్లు, వ్యాధులపై పోరాడుతుంది.కొవ్వుల శోషణం: జీర్ణవ్యవస్థ నుండి కొవ్వులను అనుమతించి రక్తంలోకి చేర్చుతుంది.శోషరస వ్యవస్థలోని నాళాలు దెబ్బతిన్నా లేదా మూసుకుపోయినా, ద్రవం ఒకే చోట నిలిచిపోయి కాళ్లు లేదా చేతులు విపరీతంగా వాచిపోతాయి. ఈ పరిస్థితినే లింఫడీమా అంటారు.సెక్లోడెక్స్ట్రిన్ ఎలా పని చేస్తుంది?చీజ్, బట్టర్ వంటి పాల ఉత్పత్తుల నుండి కొలెస్ట్రాల్‌ను తీసివేసి ‘లో–ఫ్యాట్’గా మార్చడానికి సెక్లోడెక్స్ట్రిన్ను విరివిగా వాడుతారు. ఇది కొలెస్ట్రాల్ స్ఫటికాలను తన గుల్లగా ఉండే నిర్మాణం లోపల బంధించి, నీటి ద్వారా బయటకు పంపివేస్తుంది.రొమ్ము క్యాన్సర్ చికిత్స పొందుతూ లింఫడీమా వచ్చిన మహిళల చర్మ కణజాలాలను శాస్త్రవేత్తలు పరిశీలించినప్పుడు లింఫ్ ప్రవాహం తగ్గడం వల్ల చుట్టూ ఉన్న కణజాలంలో అధిక పరిమాణంలో కొలెస్ట్రాల్ చేరుకోవటాన్ని గమనించారు. సాధారణంగా లింఫ్ నాళాలు కణజాలాల నుండి కొలెస్ట్రాల్‌ను తిరిగి రక్తంలోకి తీసుకెళ్తాయి. కానీ కణజాలంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్లే లింఫడీమా వస్తుందని వారి పరిశీలనలో తేలింది. ఈ కొలెస్ట్రాల్ వల్ల వాపు, మచ్చలు ఏర్పడి లింఫ్ ప్రవాహానికి అడ్డంకిగా మారాయి.దాంతో, సైక్లోడెక్స్ట్రిన్లలోని ‘కొలెస్ట్రాల్‌ను తగ్గించే శక్తి’ ఈ వాపును నయం చేయగలదా అని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు తదుపరి ప్రయోగం చేశారు. లింఫడీమా ఉన్న ఎలుకల శరీరంలోని ప్రభావిత ప్రాంతంలో 8 వారాల పాటు క్రమంగా సైక్లోడెక్స్ట్రిన్ ఇంజెక్షన్ ఇచ్చారు. అద్భుతమైన ఫలితాలు వచ్చాయి! సైక్లోడెక్స్ట్రిన్... వాపును, ఇన్ఫ్లమేషన్ను (శరీరంలో వచ్చే మంట/వాపు) గణనీయంగా తగ్గించింది. అంతకంటే ముఖ్యంగా, దెబ్బతిన్న లింఫ్ నాళాలను తిరిగి బాగు చేయడానికి ఇది సహాయపడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనివల్ల వ్యాధి లక్షణాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి.‘‘ఇది నిజంగానే విప్లవాత్మకమైన ఆవిష్కరణ. ఎందుకంటే లింఫడీమాకు ఇప్పటివరకు శాశ్వత నివారణ అనేదే లేదు. ప్రభావిత కణజాలంలో పేరుకుపోయే కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే లక్ష్యంగా చికిత్స చేయవచ్చని ఈ అధ్యయనం చూపించింది. అయితే మనుషులపై ఇది ఎంతవరకు సురక్షితం, ప్రభావవంతం అని తెలుసుకోవడానికి మానవులపై ప్రయోగాలు జరగాల్సి ఉంది’’ అని పరిశోధకులు అంటున్నారు. అలాగే రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించే స్టాటిన్ల వంటి సాధారణ మందులు దీనికి పనిచేయకపోవచ్చని వారు భావిస్తున్నారు. ఎందుకంటే ఆ మందులు రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి కానీ, ప్రత్యేకంగా లింఫ్ నాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌పై పనిచేయవు.మొత్తానికైతే లింఫడీమాతో బాధపడుతున్న లక్షలాది మంది రోగులకు గొప్ప ఊరటనిచ్చే పరిశోధనా ఫలితం ఇది. సాధారణంగా ఆహార పరిశ్రమలో వాడే ఒక చవకైన పదార్థం (సైక్లోడెక్స్ట్రిన్), ఇలా ప్రాణాంతకమైన శారీరక సమస్యకు çపరిష్కారం అయ్యే సూచనలు కనిపించటం నిజంగా మంచి విషయమే. త్వరలోనే మనుషులపై జరిపే ప్రయోగాల్లో కూడా ఇవే సానుకూల ఫలితాలు వస్తే, లింఫడీమా బాధితులకు తక్కువ ఖర్చుతోనే మెరుగైన శాశ్వత చికిత్స లభించే అవకాశం ఉంది.- సాక్షి స్పెషల్ డెస్క్ఇదీ చదవండి: ప్రసవ నొప్పులు రాకపోతే? -
దుర్వాసుడి కోపానికి భార్య భస్మం.. ఆమె పేరుతో పుట్టిన చెట్టు ఇదే!
ఒకానొకప్పుడు దుర్వాసుడు గంధమాదన పర్వతంపైనున్న వనంలో తపస్సు చేసుకుంటున్నాడు.ఆయన తపస్సు చేసుకుంటున్న కాలంలోనే ఒకనాడు బలిచక్రవర్తి మనవడైన సాహసికుడు, అప్సరస తిలోత్తమ తగిన ఏకాంతం కోసం వెదుకులాడుతూ అక్కడకు వచ్చారు. నిశ్చలంగా తపోనిష్ఠలో కూర్చున్న దుర్వాసుడిని వారు గమనించినా, అతడిని పట్టించుకోకుండా, అతడి ఎదుటనే వారు యథేచ్ఛగా సరస సల్లాపాలకు దిగారు.వారి మాటలకు, వారు చేసే శబ్దాలకు దుర్వాసుడి ఏకాగ్రతకు భంగం కలిగింది. ఆయన కళ్లు తెరిచి చూశాడు. తన ఎదుటనే సల్లాపాలు సాగిస్తున్న తిలోత్తమా సాహసికులు కనిపించారు. అసలే ముక్కోపి అయిన దుర్వాసుడు వారి చేష్టలకు మండిపడ్డాడు.‘దుర్మార్గులారా! తపోనిష్ఠలో ఉన్న నా ఎదుటనే మీరు నిర్లజ్జగా సల్లాపాలకు దిగారు. మీరు భూలోకంలో రాక్షసులై జన్మిస్తారు’ అని శపించాడు.దుర్వాసుడి ఆగ్రహానికి తిలోత్తమా సాహసికులు భయంతో వణికిపోయారు.‘మహర్షీ! మా అపరాధానికి మన్నించు. శాపోపశమనం నువ్వే అనుగ్రహించు’ అని ప్రార్థించారు.‘సాహసికుడికి బలరాముడి చేతిలో హతమయ్యాక శాప విమోచనం కలుగుతుంది. శ్రీకృష్ణుడి తనయుడితో కొంతకాలం జీవనం సాగించిన తర్వాత తిలోత్తమకు శాప విమోచనం కలుగుతుంది’ అని పలికాడు దుర్వాసుడు.తిలోత్తమా సాహసికుల కారణంగా తపోభంగం కలిగిన దుర్వాసుడికి తిరిగి ఏకాగ్రత కుదరలేదు. ఆయన మనస్సులో సంసార వాంఛ కలిగింది. దాంతో తపోనిష్ఠను విరమించుకున్నాడు. తనకు తగిన వధువును చూసుకుని, సంసారాశ్రమంలోకి ప్రవేశించాలని తలచాడు. ఔర్వ మహర్షి కుమార్తె కందళి వివాహానికి తగిన వయసులో ఉందని విన్నాడు. వెంటనే ఔర్వ మహర్షి ఆశ్రమానికి వెళ్లాడు. ‘మహర్షీ! నీ కుమార్తె వివాహానికి సిద్ధంగా ఉందని తెలుసుకున్నాను. నీకు అభ్యంతరం లేకుంటే, ఆమెను నేను వివాహం చేసుకుంటాను’ అని చెప్పాడు.‘దుర్వాసా! నా కుమార్తె కందళి అతిగారాబం వల్ల అవివేకిగా, కోపిష్టిగా తయారైంది. ఆమెను భరించడం కష్టం. అయినా నువ్వు ఆమెను పెళ్లాడతానంటే నాకు అభ్యంతరమేమీ లేదు’ అన్నాడు ఔర్వుడు.దుర్వాసుడు కందళిని వివాహం చేసుకోవడానికి తన సమ్మతి తెలిపాడు. ఔర్వుడు వారికి శాస్త్రోక్తంగా వివాహం జరిపించాడు.వివాహం తర్వాత దుర్వాసుడు భార్యను వెంటబెట్టుకుని తన ఆశ్రమానికి చేరుకున్నాడు. తన తపో మహిమతో ఆశ్రమంలో అన్ని భోగాలను కల్పించాడు. ఎన్ని భోగాలు కల్పించినా, కందళి తన ధోరణిని మార్చుకోలేదు. గయ్యాళితనంతో భర్తను నిత్యం దేనికో దానికి సాధించసాగింది. భరించినంత కాలం భరించిన దుర్వాసుడు తుదకు సహనం కోల్పోయాడు. ఒకనాడు ధ్యానం చేసుకుంటున్న దుర్వాసుడిని కందళి నిందించడం మొదలుపెట్టింది. ఒక్కసారిగా కళ్లు తెరిచి ఆమెను తీక్షణంగా చూశాడు. ఆమె అక్కడికక్కడే భస్మీపటలమైపోయింది.వెంటనే ఆమె భస్మమైన చోటకు ఎగువగా ఆకాశంలో ఒక సుందరి రూపం కనిపించింది. ‘స్వామీ! నా దోషాన్ని క్షమించు. నన్ను అనుగ్రహించు’ అని పలికి అదృశ్యమైపోయింది.ఆ దృశ్యాన్ని చూసిన దుర్వాసుడు తన భార్య కందళి పేరు భూమ్మీద శాశ్వతంగా నిలిచి ఉండేలా ‘కదళి’ వృక్షజాతిని సృష్టించాడు. దుర్వాసుడి భార్య పేరు కదళీ వృక్షాల ద్వారా చిరస్థాయిగా నిలిచిపోయింది.ఇదంతా జరిగిన కొన్నాళ్లకు ఔర్వుడు దుర్వాసుడి ఆశ్రమానికి వచ్చాడు. ఆశ్రమంలో తన కుమార్తె కందళి కనిపించలేదు. ఆయన దివ్యదృష్టితో జరిగినదంతా తెలుసుకున్నాడు. దుర్వాసుడిపై మండిపడ్డాడు.‘ఓరీ! నువ్వు అన్నీ తెలుసుకుని నా కుమార్తెను వివాహం చేసుకుని, ఆమెను భస్మీపటలం చేసి, నన్ను తీవ్రంగా అవమానించావు. దీనికి ఫలితంగా నువ్వు భవిష్యత్తులో అంబరీషుడి చేతిలో అవమానం పొంది మిగుల దుఃఖాన్ని అనుభవించగలవు’ అని శపించి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు.ఔర్వుడి శాపానికి దుర్వాసుడు కొంత చింతించాడు. అయినా జరిగేది జరగక మానదు అని తనను తాను సమాధానపరచుకుని, తిరిగి తపస్సు చేసుకోవడానికి బయలుదేరాడు.- సాంఖ్యాయనపురావిశేషం..ఈ ఏడాది పితృపక్షంగా పేరుపొందిన మహాలయపక్షం నేటితో మొదలవుతోంది. పితృతర్పణాలకు ప్రసిద్ధి పొందిన క్షేత్రం తమిళనాడులోని తిలతర్పణపురి. ఈ క్షేత్రంలోని ప్రధాన దైవం ముక్తీశ్వర స్వామి. అమ్మవారు స్వర్ణవల్లి. శైవక్షేత్రమైన ఈ ప్రదేశంలో పితృదేవతలకు తిలతండులాలతో తర్పణాలు విడిచిపెడితే వారికి ఉత్తమగతులు కలుగుతాయని భక్తుల విశ్వాసం.త్రేతాయుగంలో శ్రీరాముడు తన తండ్రి దశరథుడికి ఇక్కడే పిండప్రదానం చేశాడని, అలాగే, ద్వాపరయుగంలో పాండవులు కూడా తమ పితృదేవతలకు ఇదేచోట పిండప్రదానం చేశారని స్థలపురాణం చెబుతోంది. ఈ క్షేత్రంలో మరెక్కడా లేని విధంగా నరముఖ గణపతి ఆలయం ఉండటం విశేషం. ఆదివినాయకుడిగా పేరుపొందిన ఇక్కడి వినాయకుడు గజముఖంతో కాకుండా, మానవముఖంతో దర్శనమిస్తాడు.ఇదీ చదవండి: ఒకే నగరం.. ఎన్నో మ్యూజిక్ వేదికలు! ఎందుకంత స్పెషల్? -
ఒకే నగరం.. ఎన్నో మ్యూజిక్ వేదికలు! ఎందుకంత స్పెషల్?
నగర వీధుల్లో చిందులాడే అడుగుల చప్పుడు... రాత్రివేళల రంగుల వెలుగులు... వాటికి మృదువైన సాక్సోఫోన్ స్వరం తోడైతే? ఆ అనుభూతే వేరు! సంగీతానికి హద్దులు లేవని చాటుతూ, జాజ్ స్వరాలతో తైపీ నగరాన్ని ముంచెత్తేందుకు సిద్ధమవుతోంది 2026 తైపీ జాజ్ ఫెస్టివల్. సెప్టెంబర్ 4న ప్రారంభమై అక్టోబర్ 11 వరకు జరిగే ఈ వేడుకలను తిలకించేందుకు ఇప్పటికే ప్రపంచం నలుమూలలకు చెందిన పర్యాటకులు తైపీ నగరానికి క్యూ కట్టారు.ఈ ఏడాది 20వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటున్న ఈ తైపీ జాజ్ ఫెస్టివల్‌కి ఒక ప్రత్యేకత ఉంది. ఈసారి సంగీతాన్ని కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా నగర జీవనశైలిలో భాగంగా పరిచయం చేస్తోంది. జాజ్ సంగీతాన్ని వినడానికి ప్రత్యేకంగా ఒక హాలుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, నగర వీధుల్లో నడుస్తూ, పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తూ, విశ్రాంతి తీసుకుంటూ కూడా సంగీతాన్ని ఆస్వాదించేలా ఈ వేడుకను రూపొందిస్తున్నారు. జాజ్ క్లబ్బుల నుంచి సాంస్కృతిక ప్రదేశాల వరకు; చిన్న వేదికల నుంచి భారీ బహిరంగ ప్రదర్శనల వరకు; నగరాన్నే ఒక సంగీత వేదికగా మార్చేసింది ఈ జాజ్ ఫెస్టివల్. అందుకే ఈసారి తైపీ నగరం కేవలం సందర్శనకే కాదు, మ్యూజిక్‌ను కూడా వినిపించేస్తుంది.ఎన్నో సంగీత వేదికలుఈ ఫెస్టివల్లో భాగంగా 12 జాజ్ వేదికల్లో 19 ఇండోర్ ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. చిన్న వేదికలపై కళాకారులు ప్రేక్షకులకు దగ్గరగా ప్రదర్శనలు ఇవ్వడం వల్ల సంగీతాన్ని మరింత ఆత్మీయంగా ఆస్వాదించే అవకాశం ఉంటుంది. ఫెస్టివల్‌లోని ఆసక్తికరమైన కార్యక్రమాల్లో సెప్టెంబర్ 26న ట్రెజర్ హిల్ ఆర్టిస్ట్ విలేజ్‌లో జరిగే ప్రత్యేక ప్రదర్శన ఒకటి. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో తైవాన్ కు చెందిన తొలి పూర్తి స్థాయి స్కా సంగీత బృందంగా గుర్తింపు పొందిన ‘స్కారకియో’ ఉత్సాహభరితమైన సంగీతంతో ప్రేక్షకులను అలరించనుంది.ఒకవైపు వేగవంతమైన స్కా సంగీతం; మరోవైపు మృదువైన జాజ్, ఫ్రెంచ్ గీతాల సౌందర్యం. ఒకే వేదికపై ఇంత భిన్నమైన సంగీత ప్రపంచాలను పరిచయం చేయడం ఈ కార్యక్రమం ప్రత్యేకత. ఇందులో భాగంగా తైపీలోని ఐదు ప్రముఖ పర్యాటక, సాంస్కృతిక ప్రదేశాల్లో 12 ప్రత్యేక సంగీత ప్రదర్శనలు జరుగుతు న్నాయి. అంటే, సంగీతాన్ని వినడమే కాదు, నగర సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ జాజ్‌లో మునిగిపోయే అవకాశం అన్నమాట!సంగీతమే కాదు!తైపీ జాజ్ ఫెస్టివల్ లక్ష్యం కేవలం పెద్ద కచేరీలు నిర్వహించడం మాత్రమే కాదు. జాజ్ సంగీతాన్ని ప్రజల రోజూవారీ జీవితంలో ఒక ఆహ్లాదకరమైన భాగంగా మార్చడం కూడా ఈ వేడుక ఉద్దేశం. 2007 నుంచి కొనసాగుతున్న ఈ ఉత్సవం.. తైపీ నగర జీవనశైలిని జాజ్ సంగీతంలోని స్వేచ్ఛా భావంతో కలుపుతోంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కళాకారులు తమ సంగీతంతో తైపీకి అంతర్జాతీయ జాజ్ రంగును తీసుకువస్తున్నారు.మూడు రోజులు ప్రత్యేక ఆకర్షణఈ ఫెస్టివల్‌కు ప్రత్యేక ఆకర్షణ.. అక్టోబర్ 9 నుంచి 11 వరకు తైపీ మ్యూజిక్ సెంటర్లో మూడు రోజుల పాటు జరిగే బహిరంగ సంగీత వేడుక. ఈ ప్రధాన వేదికపై తైవాన్ కు చెందిన ప్రముఖ కళాకారులతో పాటు అంతర్జాతీయ జాజ్ బృందాలు కూడా ప్రదర్శనలు ఇవ్వనున్నాయి. మొత్తం 11 సంగీత బృందాలు తమ ప్రతిభను ప్రదర్శించనున్నాయి. అనుభవజ్ఞులైన కళాకారులతో పాటు కొత్త తరానికి చెందిన సంగీతకారులు ఒకే వేదికపై కనిపించనుండటం ఈ వేడుకకు మరింత ప్రత్యేకత తీసుకురానుంది.ఇదీ చదవండి: ఈ వారం కథ: చీమ బ్రతుకేనా? -
గుండెపోటు కాదు.. ఆ ఒక్క అనుమానమే కేసును మలుపుతిప్పింది!
హైదరాబాద్ నగరంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త విక్రమ్ అగర్వాల్ సాయంత్రం ఆఫీస్ నుంచి తన లగ్జరీ కారులో ఒంటరిగా బయలుదేరాడు. దారిలో కాస్త నీరసంగా అనిపించడంతో, కారును రోడ్డు పక్కకు ఆపి డ్యాష్‌బోర్డ్ తెరిచి తన గుండెజబ్బు మాత్రల డబ్బా తీసి ఒక క్యాప్సూల్ వేసుకున్నాడు. తిరిగి కారు స్టార్ట్ చేశాడు.సరిగ్గా నిమిషం గడిచిందో లేదో, అతని శరీరంలో అనూహ్యమైన మార్పులు ప్రారంభమయ్యాయి. గుండె కొట్టుకునే వేగం అమాంతం పెరిగిపోయి, ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. అతని కళ్లలో తీవ్రమైన ఆశ్చర్యం, ప్రాణం పోతుందన్న భయం కనిపించాయి. అప్పటికే స్టీరింగ్ మీద నియంత్రణ కోల్పోయిన అతని కారు పక్కనే ఉన్న డివైడర్‌ను బలంగా తాకుతూ వెళ్లి కీచుమనే పెద్ద శబ్దంతో ఆగింది.∙∙ జనం గుమిగూడారు. పోలీసులు వచ్చారు. క్లూస్ టీమ్ వచ్చింది. ఇన్స్పెక్టర్ అభిమన్యుని చూసి, పోలీసులు సెల్యూట్ చేసి పక్కకు తప్పుకున్నారు. ఆగివున్న కారులో బయటకు తలవాల్చి చనిపోయిన అరవైయేళ్ల అగర్వాల్ డెడ్‌బాడీ కనిపించింది.‘ఏమైంది? ముందుగా డెడ్‌బాడీని చూసింది ఎవరు?’ అని అభిమన్యు అడిగాడు.ట్రాఫిక్ కానిస్టేబుల్ ముందుకొచ్చి, ‘నేనే సార్... రోడ్డు పక్కనే ఆగివున్న కారును దగ్గరికొచ్చి చూస్తే, కారు డివైడర్‌ను రాసుకుంటూ వెళ్లింది. లోపల ఆయన చనిపోయి ఉన్నారు’ అని బదులిచ్చాడు.అతనెవరో తెలుసుకోవడానికి పెద్ద సమయం పట్టలేదు. అది గుండెపోటు మరణం అని పోస్ట్‌మార్టం రిపోర్ట్ చెబుతోంది. కానీ అభిమన్యు íసిక్త్స్ సెన్స్ మరోటి చెబుతోంది. రోడ్డు పక్కగా ఆగి ఉన్న ఆ కారు డ్రైవర్ వైపు గ్లాస్ కిందకు దించి ఉండటం, అగర్వాల్ తల కొద్దిగా కిటికీలోంచి బయటకు పెట్టి ఉండటం అభిమన్యులో మొదటి అనుమానాన్ని రేకెత్తించింది. గుండెపోటుతో చనిపోయిన వ్యక్తి కారు గ్లాస్ ఎందుకు దించుతాడు? ఎవరికోసమైనా తల బయటకు పెట్టి ఎదురుచూశాడా? ఆయన కళ్ళు ఏదో భయానక, నమ్మలేని విషయాన్ని చూస్తున్నట్లు ఉన్నాయి.అభిమన్యు ఆ మార్గంలో సీసీటీవీ ఫుటేజ్‌లను తెప్పించాడు. ఆ ఫుటేజ్ చూస్తున్న కొద్దీ అభిమన్యు బ్రెయిన్ క్రైమ్ సీ¯Œ ను రీక్రియేట్ చేస్తూనే ఉంది. అగర్వాల్ బిజినెస్ పార్ట్నర్ కేతన్‌ను విచారించాడు. లావాదేవీలు, ఫోన్ కాల్స్ చెక్ చేశాడు. మరో అనుమానితుడు అగర్వాల్ సెక్రెటరీ భూషణ్. అతని ఫోన్ కాల్ డేటాను పరిశీలించాడు. అగర్వాల్ భార్య ఏడాది క్రితమే మరణించింది. దాంతో ఆయన మానసికంగా కుంగిపోయాడు, వారసులు ఎవరూ లేరు.∙∙ ‘మిస్టర్ అభిమన్యు... అగర్వాల్ కేసు క్లోజ్ అయినట్టేగా, గుండెపోటు మరణం అని తేలింది కదా!’ అని కమిషనర్ అడిగాడు.‘హంతకుడిని పట్టుకోకుండా కేసు ఎలా క్లోజ్ చేస్తాం సర్!’ కూల్‌గా అన్నాడు ఇన్స్పెక్టర్ అభిమన్యు. కమిషనర్ మొహంలో ఆశ్చర్యం తొంగి చూసింది.అప్పుడే లోపలికి వచ్చారు అగర్వాల్ బిజినెస్ పార్ట్నర్ కేతన్, సెక్రటరీ భూషణ్.‘సర్ మృతదేహాన్ని అప్పగిస్తే మా బాస్‌కి ఘనంగా వీడ్కోలు చెబుతాం’ భూషణ్ అన్నాడు.ఇన్స్పెక్టర్ అభిమన్యు కేతన్ వైపు చూసి, ‘మీరేమంటారు మిస్టర్ కేతన్’ అని అడిగాడు.‘ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు సార్... ఒక మంచి బిజినెస్ పార్ట్నర్ని, అంతకుమించి మంచి స్నేహితుడిని పోగొట్టుకున్నాను’ బాధగా అన్నాడు కేతన్.‘మరి మీరేం పోగొట్టుకున్నారు మిస్టర్ భూషణ్... మంచి భవిష్యత్తును, సమాజంలో స్వేచ్ఛగా బతికే జీవితాన్ని పోగొట్టుకున్నారా?’ వ్యంగ్యంగా అడిగాడు అభిమన్యు.‘అంటే?’ భూషణ్ మొహంలో రంగులు మారాయి.అభిమన్యు అసలు నిజం బయటపెట్టాడు: ‘అగర్వాల్ రోజూ వాడే గుండె మాత్రల డబ్బాలో, క్షణాల్లో గుండె వేగాన్ని పూర్తిగా మార్చేయగల ఒక విషపూరిత డ్రగ్‌ను భూషణ్ ముందుగానే చేర్చాడు.పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో నువ్వు తెప్పించిన డ్రగ్ ఆనవాళ్లు దొరికాయి. సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు కేసును పూర్తిగా మార్చేశాయి. అగర్వాల్ కారు ఆగిన క్షణంలోనే, నువ్వు బైక్ మీద వేగంగా అక్కడకు చేరుకున్నావు. అగర్వాల్ గ్లాస్ కిందకు దించి తల బయటకు పెట్టి ‘భూషణ్... నువ్వా?’ అని అడుగుతుండగానే, నువ్వు చేసిన మోసాన్ని, ఆస్తులన్నీ నీవే అవుతాయని క్రూరంగా నవ్వుతూ చెప్పావు. దాంతో ఆయన తీవ్ర షాక్‌కు గురయ్యాడు. అతని కళ్ళలో కనిపించిన భయం ఆ నమ్మకద్రోహాన్నే చూపెట్టింది. నీ గురించి ఆరా తీస్తే అగర్వాల్ ఆస్తుల్లో కొన్నింటికి నువ్వే బినామీ అని తెలిసింది.అగర్వాల్ ఛస్తే ఆస్తిని కొట్టేయొచ్చని, బినామీ ఆస్తులు నీ సొంతం అవుతాయని ఆలోచించావు కానీ, చేసిన నేరం నుంచి తప్పించుకోలేమని తెలుసుకోలేకపోయావు.’ అని ఆగి అతని మొహంలోకి చూస్తూ,‘ఆ శవం చెప్పిన సాక్ష్యమే నీ నేరాన్ని పట్టించింది!’ అన్నాడు అభిమన్యు.∙∙ అగర్వాల్ మృతదేహం శ్మశానానికి చేరకముందే భూషణ్ కటకటాల వెనక్కి చేరాడు.- శ్రీసుధామయిఇదీ చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ శ్మశానం.. ఎందుకు కట్టారో తెలుసా? -
ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ శ్మశానం.. ఎందుకు కట్టారో తెలుసా?
ప్రపంచంలోనే అతిపెద్ద శ్మశాన వాటిక.. కానీ ఇక్కడ ఒక్క సమాధి కూడా నిజమైనది కాదు! చూస్తే అచ్చం నిజమైనదిలా కనిపించే ఈ ప్రదేశంలో ఏకంగా 5 వేల కృత్రిమ సమాధులు ఉన్నాయి. ఇంత భారీ కృత్రిమ శ్మశానాన్ని ఎందుకు నిర్మించారో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే!ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ శ్మశాన వాటిక. ఇందులో కనిపించేవన్నీ కృత్రిమ సమాధులే! పనికట్టుకుని మరీ ఈ కృత్రిమ శ్మశానాన్ని ఎందుకు నిర్మించారని అనుకుంటున్నారా? దీనిని 1966 నాటి సూపర్ డూపర్ హిట్ హాలీవుడ్ సినిమా ‘ది గుడ్, ది బ్యాడ్ అండ్ ది అగ్లీ’ కోసం శ్మశాన వాటికలో చిత్రించాల్సిన సన్నివేశాల కోసం దీనిని ప్రత్యేకంగా నిర్మించారు.స్పెయిన్ ఉత్తర ప్రాంతంలోని మిరాండిలా లోయలో పదిహేడున్నర ఎకరాల స్థలంలో ‘సేడ్హిల్ సెమట్రీ’ పేరుతో ఈ కృత్రిమ శ్మశానం సెట్‌ను నిర్మించారు. ఇది అత్యంత సహజంగా కనిపించడానికి ఇందులో ఏకంగా ఐదువేల కృత్రిమ సమాధులను, నలభై మీటర్ల వ్యాసంలో ఒక భారీ వధ్యశిలను కూడా ఏర్పాటు చేశారు.ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఈ సెట్‌ను అలాగే ఉంచేశారు. ఇది ఇప్పటికీ నిలిచి ఉంది. స్పెయిన్ పర్యటనకు వచ్చే హాలీవుడ్ అభిమానులు తప్పనిసరిగా దీనిని చూసి పోతుంటారు. వాతావరణ పరిస్థితుల వల్ల దెబ్బతిన్న ఈ కృత్రిమ శ్మశాన వాటికకు 2015లో ‘సేడ్హిల్ కల్చరల్ అసోసియేషన్’ వాలంటీర్లు మరమ్మతులు చేపట్టారు. ఇప్పటికీ వారు ఈ శ్మశాన వాటికను ఒక చారిత్రక ప్రదేశంలా కాపాడుతూ వస్తుండటం విశేషం.ఇదీ చదవండి: కొబ్బరి.. కాయా? పండా..? కోర్టు మెట్లు ఎక్కించిన ప్రశ్న! -
కొబ్బరి.. కాయా? పండా..? కోర్టు మెట్లు ఎక్కించిన ప్రశ్న!
భగవంతునికి భక్తునికి అనుసంధానమైన వాటిల్లో కొబ్బరికాయ ఒకటి. అయితే ఇది పండా? కూరగాయ? డ్రై ఫ్రూటా? ఈ మూడూ కాదా? వినడానికి ఇది చాలా చిన్న ప్రశ్నలానే అనిపిస్తోంది..కానీ ఇదే ప్రశ్న ఓ వ్యాపారిని కోర్టు మెట్లు ఎక్కించింది. కొబ్బరికాయ ‘గ్రీన్ ఫ్రూట్ ’ పరిధిలోకి వస్తుంది కాబట్టి దీనికి పన్ను మినహాయించాలని వ్యాపారి, మినహాయించరాదని మున్సిపల్ అధికారులు.. చివరికి ఈ ప్రశ్న సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఒకటీ రెండూ కాదు– పదేళ్లకు పైగా ఈ వివాదం సాగింది. చివరకు సుప్రీంకోర్టు తీర్పుతో దీనిపై ఒక స్పష్టత వచ్చింది.బరూచ్ కొబ్బరి ట్రేడింగ్ కంపెనీకి చెందిన వ్యాపారులు ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి కొబ్బరి బొండాలు, కాయలను దిగుమతి చేసుకుని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో విక్రయించేవారు. కొబ్బరికాయ పైన ఉండే డొక్కలు, పీచు తీసేసి వాటిని మార్కెట్‌కు తీసుకు వచ్చేవారు. వాటిలోని నీటిని పానీయంగా, కొబ్బరిని వంటలకు విక్రయించే వారు. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే, వెళ్లే వస్తువులపై ఆక్ట్రాయ్ పన్నును ఆ కార్పొరేషన్‌కు చెల్లించేలా విధించే వారు. నిబంధనల ప్రకారం కొన్ని వస్తువులకు పన్ను మినహాయింపు ఉండేది. వాటిలో గ్రీన్ ఫ్రూట్స్ ఒకటి. పన్నును వ్యతిరేకించిన వ్యాపారులుమున్సిపల్ కార్పొరేషన్ మొదట్లో కొబ్బరి బొండాలు/కాయలపై 100 కేజీలకు రూ.1 చొప్పును పన్ను విధించేంది. తర్వాత ఈ పన్నును రూ. 5కి పెంచింది. దీనిని కొబ్బరి వ్యాపారులు వ్యతిరేకించారు. కొబ్బరికాయలు కూడా గ్రీన్ ఫూట్స్ పరిధిలోకి వస్తాయి కాబట్టి పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు. దీనికి మున్సిపల్ అధికారులు అంగీకరించలేదు. కొబ్బరికాయలు ఆ పరిధిలోకి రావని తేల్చి చెప్పారు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు.హైకోర్టులో వాదనలుగుజరాత్ హైకోర్టు వ్యాపారుల వాదనను అంగీకరించలేదు. కొబ్బరి కాయను గ్రీన్ఫ్రూట్గా పరిగణించలేమని తేల్చింది. పన్ను మినహాయింపు పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆక్ట్రాయ్ నిబంధనల్లోని ఐటెమ్ 55 పరిధిలోకి వస్తుందని పేర్కొంది. అందువల్ల పన్ను చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పింది. హైకోర్టు తీర్పుతో సంతృప్తి చెందని వ్యాపారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తీర్పు వెలువరించిన సుప్రీంకొబ్బరి కాయ పైన ఉండే తొక్క లేదా డొక్క... పీచును తొలగించిన తర్వాత గోధుమ రంగులో ఉండే కొబ్బరికాయను గ్రీన్ ఫ్రూట్‌గా పరిగణించొచ్చా? లేదా? ఈ ప్రశ్నే సుప్రీంకోర్టు ముందు నిలిచింది. గ్రీన్ అనే పదానికి సాధారణ అర్థం, సాధారణ ప్రజలు ఫ్రూట్ అనే పదాన్ని ఎలా వినియోగిస్తారనే అంశాన్ని కోర్టు పరిశీలించింది. కోర్టు ఒక ఆసక్తికరమైన సందేహాన్ని ఈ సందర్భంగా వెలిబుచ్చింది. ‘ఒక ఇంట్లో ఎవరైనా వ్యక్తిని ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకురా అంటే? ఈ రెండింటిలో ఏ కేటగిరీ కిందా అయినా కొబ్బరికాయను తీసుకువస్తాడా? అని ప్రశ్నించింది. ఎవరూ కొబ్బరికాయను గ్రీన్ ఫ్రూట్‌గా గుర్తించరు. అందువల్ల అది కేవలం గ్రీన్ ఫ్రూట్ అని చెప్పడం ద్వారా పన్ను మినహాయింపు పొందలేరని కోర్టు స్పష్టం చేసింది. ఇక్కడే మరో వాదన కూడా వచ్చింది. దీన్ని డ్రైఫ్రూట్ కింద పరిగణించొచ్చా? అనే ప్రశ్న తలెత్తింది. దీన్నీ సుప్రీంకోర్టు తిరస్కరించింది. డ్రై ఫ్రూట్ అంటే అదొక ప్రత్యేకమైన వర్గంగా పేర్కొంది. దీన్ని ఆ కేటగిరీలోనూ చేర్చలేమని చెప్పింది. రెండు కేటగిరీల పరిధిలోకి రానందున ఏ కేటగిరీకి చెందని వస్తువులకు వర్తించే ఐటెమ్ 55 రూల్ 14 కింద కొబ్బరికాయను చేర్చవచ్చని పేర్కొంది. దీంతో వీటికి కూడా ఆక్ట్రాయ్ పన్ను విధించొచ్చని స్పష్టం చేసింది. ఈ తరహాలో పలు రాష్ట్రాల్లో సేల్స్ ట్యాక్స్ వంటి వివాదాలు వస్తుంటాయని కావున ఈ కేసును విస్తృత ధర్మాసనానికి అప్పగించాలని వ్యాపారుల తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఆ అవసరం లేదని ద్విసభ్య బెంచ్ పేర్కొంది. వ్యాపారుల అప్పీల్‌ను కొట్టివేసింది. ఈ కేసు మొత్తం కొబ్బరికాయ గ్రీన్ ఫ్రూటా? కాదా? అనే అంశంపైనే తిరిగింది. చట్టంలో ఓ పదానికి స్పష్టమైన నిర్వచనం, వివరణ లేనప్పుడు సాధారణంగా వాడుకలో ఉన్నవే ఒక్కోసారి కీలకంగా మారుతాయని ఈ తీర్పు స్పష్టం చేస్తుంది. కొబ్బరికాయపై పన్ను వివాదం చివరకు సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఆసక్తికరమైన అంశంగా మారింది.- దిలీప్ మాదిరెడ్డి ఇదీ చదవండి: Andy Allen Success Story: ఎలక్ట్రీషియన్ నుంచి మాస్టర్ చెఫ్ విజేత, రెస్టారెంట్ యజమాని రేంజ్‌కి..! -
ఈ వారం కథ: చీమ బ్రతుకేనా?
ఉదయం ఎనిమిది గంటలైంది.హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ నుంచి బయటికి వచ్చి రోడ్డు దాటుతున్నాను. ఎదురుగా గాజు గోడలతో మెరిసిపోతున్న నా కంపెనీ భవనం కనిపించింది. ఆ భవనం వైపు వందలమంది ఒకే దిశగా నడుస్తున్నారు. వాళ్ళందర్నీ చూస్తుంటే నాకు ఒక్కసారిగా చీమలు గుర్తొచ్చాయి.వాన పడే ముందు చీమలు వరుసగా ఆహారం మోసుకుంటూ వెళ్ళినట్టు... వీళ్ళు కూడా ల్యాప్‌టాప్ బ్యాగులు భుజాన వేసుకుని, ఐడీ కార్డులు మెడలో వేలాడదీసుకుని, ఒకే వేగంతో లోపలికి వెళ్ళి పోతున్నారు.ఎవరి ముఖంలోనూ చిరునవ్వు లేదు;ఎవరి కళ్ళల్లోనూ ఉత్సాహం లేదు;అయినా అడుగులు మాత్రం ఆగడం లేదు.ఆ దృశ్యం చూసిన ప్రతిసారీ నా మనసులో ఒకే ప్రశ్న తిరుగుతూనే ఉంటుంది.‘మనం ఉద్యోగం చేస్తున్నామా? లేక ఎవరో కనిపించని శక్తి మనల్ని నడిపిస్తే నడుస్తున్నామా?‘ఆ ప్రశ్నకు సమాధానం వెతుకుతూనే గడిచిపోయింది నా పదిహేనేళ్ళ కార్పొరేట్ జీవితం.నేను కూడా ఒకప్పుడు ఇదే భవనం ముందు నిలబడి ఫొటోలు దిగాను.మొదటి ఉద్యోగం.మొదటి జీతం.మొదటి ఐడీ కార్డు.ఆ రోజు నా నాన్న కళ్ళల్లో కనిపించిన గర్వం... నా అమ్మ చేతులతో తినిపించిన మొదటి జీతం భోజనం...ఇప్పటికీ మరచిపోలేను.అప్పుడు నాకు అనిపించింది.‘ఇక నా జీవితం సెటిల్ అయిపోయింది.‘కానీ జీవితం అప్పుడే మొదలైందని తెలియలేదు.మొదటి ఆరు నెలలు కలలా గడిచిపోయాయి.ఏసీ ఆఫీస్.ఫ్రీ కాఫీ.శుక్రవారం పార్టీలు.టీమ్ ఔటింగ్స్.అన్నీ కొత్తగా, అందంగా అనిపించాయి.ఏడో నెలలో మొదటి అప్రైజల్ వచ్చింది.‘నెక్స్ట్ లెవల్‌కు వెళ్ళాలంటే ఇంకా ఎక్కువ కమిట్మెంట్ చూపాలి.’ అని మేనేజర్ నవ్వుతూ చెప్పాడు.ఆ మాట నాకు ప్రశంసగా వినిపించింది. అదే రోజు నుంచి నేను ఇంటికి ఆలస్యంగా వెళ్ళడం మొదలుపెట్టాను.ఆదివారాలు కూడా ల్యాప్‌టాప్ తెరవడం మొదలుపెట్టాను.సెలవు అంటే నేరం చేసినట్టు అనిపించేది.నాకు తెలియకుండానే...నేను కూడా ఒక చీమగా మారిపోతున్నాను.ఒకరోజు క్యాంటీన్లో కిటికీ పక్కన కూర్చుని తింటున్నాను.కిటికీ అద్దం కింద చిన్న చీమల బారు కనిపించింది.ఒక్క చీమ బిస్కట్ ముక్కను మోస్తోంది.దాని వెనుక ఇంకో చీమ.దాని వెనుక ఇంకోటి.ఒక్కటీ దారి మార్చడం లేదు.అప్పుడే నా సహోద్యోగి రాహుల్ వచ్చి నా ఎదురుగా కూర్చున్నాడు.‘ఏం చూస్తున్నావు?’‘చీమలు.’అతను కిందికి చూసి నవ్వి,‘వాటిని ఎందుకు చూడడం?’ అన్నాడు. నేను నవ్వలేదు.‘వాటిలో మనల్ని చూస్తున్నాను.’అతనికి అర్థం కాలేదు.నాకు మాత్రం చాలా స్పష్టంగా కనిపించింది.మనం కూడా అలాగే ఉన్నాం.ఉదయం కార్డు స్వైప్.మీటింగ్,టాస్క్,డెడ్‌లైన్,అప్రైజల్,ప్రమోషన్,ఇంకో డెడ్‌లైన్,ఇంకో అప్రైజల్.ఇంకో సంవత్సరం...చీమల బారుకీ...మన జీవితానికీ...తేడా కనిపించలేదు.∙∙ ఆ రోజు నుంచి నేను మనుషుల్ని కాదు... వాళ్ళ మనస్తత్త్వాన్ని గమనించడం మొదలుపెట్టాను.లిఫ్ట్ ముందు నిలబడ్డ వాళ్ళందరి చూపు మొబైల్లోనే ఉంటుంది.లిఫ్ట్ తలుపు తెరుచుకోగానే, గూటిలోకి వెళ్ళే చీమల్లా అందరూ ఒక్కసారిగా లోపలికి దూసుకెళ్తారు.ఎవ్వరూ ఎవ్వరినీ చూడరు.‘గుడ్ మార్నింగ్‘ అనేది కూడా ఒక అలవాటే గానీ, పలకరింపు కాదు.ఆఫీస్ ఫ్లోర్లో అడుగు పెట్టగానే మరో ప్రపంచం మొదలవుతుంది.కీబోర్డుల శబ్దం.మీటింగ్ రూముల గాజు తలుపులు.చెవిలో హెడ్సెట్.ముఖంలో ఒత్తిడి.అంతా బతికే ఉన్నారు. కానీ జీవిస్తున్న వాళ్ళు మాత్రం చాలా తక్కువ.మా టీమ్‌లో సతీష్ అనే అబ్బాయి ఉండేవాడు.అతడు నాకు బాగా నచ్చేవాడు. కారణం, అతడు ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవాడు.ఒకరోజు రాత్రి పదకొండు గంటల వరకు ఇద్దరమే ఆఫీస్‌లో ఉన్నాం.అకస్మాత్తుగా అతడు, ‘సార్... చీమలు ఎందుకు పని చేస్తాయో తెలుసా?’ అని అడిగాడు. నేను నవ్వుతూ, ‘ఆహారం కోసం’ అన్నాను.‘కాదు సార్... వాటికి మరో మార్గం తెలియదు.’ఆ మాట నా గుండెల్లో దిగిపోయింది.అతడే మళ్ళీ అన్నాడు, ‘మన పరిస్థితీ అదే కాదా? ఉద్యోగం లేకపోతే జీవితం లేదని మనమే నమ్మేశాము.’అతని మాటల్లో తిరుగుబాటు లేదు.నిజం మాత్రమే ఉంది.మూడురోజుల తర్వాత సతీష్ ఆఫీస్‌కు రాలేదు.హార్ట్ ఎటాక్.ముప్పై నాలుగేళ్ళ వయసు.ఆ వార్త విన్నప్పుడు మొత్తం ఫ్లోర్ అంతా నిశ్శబ్దమైంది, ఐదు నిమిషాలు.అవును. అంతే! కేవలం ఐదు నిమిషాలు మాత్రమే.ఆ తర్వాత మళ్ళీ మీటింగులు మొదలయ్యాయి.మెయిళ్ళు మొదలయ్యాయి.డెడ్లైన్లు మొదలయ్యాయి.అతని సిస్టమ్ దగ్గర ఇంకొకరు కూర్చున్నారు.అతని ఐడీ డీయాక్టివేట్ అయిపోయింది.అతని పేరు ప్రాజెక్ట్ నుంచి తొలగించబడింది.అంతే! చీమల బారులో ఒక చీమ తగ్గితే, మరో చీమ ఆ ఖాళీని నింపినట్టే.ఆ రోజు నాకు అర్థమైంది.కార్పొరేట్ ప్రపంచంలో మనిషి విలువ, అతడు ఉన్నంత వరకే. అతడు కంపెనీకి కంట్రిబ్యూట్ చేస్తున్నంత వరకే. ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళాక నా కొడుకు నన్ను చూసి పరుగెత్తుకుంటూ వచ్చి, ‘నాన్నా! క్రికెట్ ఆడదాం.’ ‘రేపు ఆడదాం రా!’ అన్నాను. ‘రేపు కూడా ఇదే అంటావు.’అంతే! వాడు అలిగి లోపలికి వెళ్ళిపోయాడు. వాడన్న ఆ చిన్న మాటతో నా గుండెల్లో పెద్ద గాయమైంది.నేను ఎవరి కోసం పరుగెడుతున్నాను?వాడి కోసమే కదా!అయితే వాడికే సమయం ఇవ్వలేకపోతే ఈ పరుగు అర్థమేంటి? అన్న ఆలోచనలతో, ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు.బాల్కనీలో నిలబడి కిందకు చూస్తుంటే, వీధి దీపం కింద మళ్ళీ చీమల బారు కనిపించింది.ఒక చీమ దారి తప్పింది.మిగతావి ముందుకు వెళ్ళిపోయాయి. అది కాసేపు అటూ ఇటూ తిరిగి, మళ్ళీ తన దారిని వెతుక్కుంది.అప్పుడు నాకు అనిపించింది. చీమకు ఆలోచించే స్వేచ్ఛ లేదు. కానీ, మనిషికి ఉంది. అయినా, మనమే దాన్ని వాడుకోవడం మానేశాం. మరుసటి రోజు ఆఫీస్‌కు వెళ్ళాను. రాజీనామా లెటర్ ఇవ్వడానికి కాదు.నా రాజీ మనస్తత్త్వానికి రాజీనామా చెప్పడానికి.ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకే ల్యాప్‌టాప్ మూసేశాను.మేనేజర్ ఆశ్చర్యంగా చూసి, ‘ఏమైనా అర్జెంట్ పని ఉందా?’ అని అడిగాడు. ‘అవును.’‘ఏమిటది?’‘నా కుటుంబం.’అతడు ఏమీ మాట్లాడలేదు.నేను వెనక్కి తిరిగి చూడకుండా, ముందుకే నడిచాను.ఆ నడకలో ఓటమి లేదు.విముక్తి ఉంది.ఈ రోజుకి కూడా నేను అదే కంపెనీలో పనిచేస్తున్నాను.అదే కుర్చీ.అదే ల్యాప్‌టాప్.అదే మీటింగులు.కానీ, అదే మనిషిని కాదు. ఇప్పుడు పని నా జీవితంలో ఒక భాగం మాత్రమే. జీవితం కాదు.ప్రమోషన్ వస్తే సంతోషిస్తాను.రాకపోయినా ప్రశాంతంగా నిద్రపోతాను.డబ్బు సంపాదిస్తాను.కానీ నా అమూల్యమైన సమయాన్ని కోల్పోను.ఎందుకంటే, పిల్లల బాల్యం మళ్ళీ రాదు.తల్లిదండ్రుల వృద్ధాప్యం మళ్ళీ రాదు.మన ఆరోగ్యం మళ్ళీ రాదు.కానీ ఉద్యోగాలు మళ్ళీ వస్తాయి. ఇప్పటికీ ప్రతి ఉదయం ఆ గాజు భవనం ముందు నిలబడి, లోపలికి వెళ్తున్న జనాన్ని చూస్తుంటాను.వాళ్ళు నాకు ఇంకా చీమల్లాగే కనిపిస్తారు.కానీ ఇప్పుడు వాళ్ళను చూసి జాలి చెందను.ఎందుకంటే, చీమగా మారడం వాళ్ళ తప్పు కాదు.తాము చీమల్లా బతుకుతున్నామని గుర్తించకపోవడమే అసలు విషాదం.జీవితం అంటే కేవలం జీతం కాదు. జీవితం అంటే కేవలం ప్రమోషన్ కాదు. జీవితం అంటే కేవలం ఈఎంఐలు కాదు.మనల్ని ప్రేమించే వాళ్ళతో నవ్వుతూ గడిపిన క్షణాలు. మన కోసం మనం తీసుకున్న చిన్న విరామాలు. మనసుకు నచ్చిన పని.రాత్రి ప్రశాంతంగా పడుకునే నిద్ర.ఇవే నిజమైన సంపద.ఆ రోజు నుంచి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను.చీమల క్రమశిక్షణను నేర్చుకోవాలి. కానీ చీమల గమ్యంలేని పరుగు కాదు.ఎందుకంటే, చీమ పుడుతుంది, పని చేస్తుంది, చనిపోతుంది.మనిషి మాత్రం ఎందుకు పుట్టానో తెలుసుకునే అవకాశం ఉన్న ఏకైక జీవి.ఆ అవకాశాన్ని కూడా కేవలం జీతం కోసం మార్చేసుకుంటే, మనకు ‘ఆరు అంకెల జీతం’ ఉండొచ్చు.కానీ, మూడక్షరాల ‘జీవితం’ మాత్రం ఉండదు.- డాక్టర్ ప్రభాకర్ జైనీఇదీ చదవండి: మా అమ్మానాన్నల విడాకుల కేస్ కోర్ట్‌లో నడుస్తోంది... -
ప్రసవ నొప్పులు రాకపోతే?
నాకు డెలివరీ డేట్ వచ్చేసింది. కానీ లేబర్ పెయిన్స్ రావడం లేదు. సిజేరియన్ చేస్తారేమో! అని భయంగా ఉంది.– వాణి, గుంటూరు.ఇలాంటి సందేహాలు చాలామంది గర్భిణులకు ఉంటాయి. అయితే నొప్పులు రాకపోయిన ప్రతిసారీ సిజేరియన్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని పరిస్థితుల్లో మందుల సహాయంతో లేబర్‌ను ప్రారంభించే ఇండక్షన్ ఆఫ్ లేబర్ పద్ధతిని ఉపయోగిస్తారు. అంటే మందుల సహాయంతో లేబర్ పెయిన్స్‌ను ప్రారంభించి, ప్రసవం జరిగేలా చేయడం.ఇది ఎప్పుడు అవసరం అవుతుంది?సాధారణంగా తల్లి లేదా బిడ్డకు సంబంధించిన కారణాలు ఉండొచ్చు. ఉదాహరణకు తల్లికి డయాబెటిస్, అధిక రక్తపోటు లేదా కొన్ని ఇతర వైద్య సమస్యలు ఉన్నప్పుడు, బిడ్డ ఎదుగుదల సరిగా లేకపోవడం, ఉమ్మనీరు తక్కువగా ఉండటం వంటి పరిస్థితుల్లో ఇండక్షన్ ను పరిగణిస్తాం. డెలివరీ తేదీ దాటిపోయినా పెయిన్స్ రాకపోవడం, లేదా ఉమ్మనీరు ముందుగానే పోయి పెయిన్స్ ప్రారంభం కాకపోవడం వంటి సందర్భాల్లోనూ ఇండక్షన్ అవసరం కావచ్చు.వేచి చూడవచ్చా?తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండి ఎలాంటి సమస్యలు లేకపోతే, సాధారణంగా కొంత సమయం వరకు బిడ్డ కదలికలు, ఫీటల్ మానిటరింగ్, ఇతర పరీక్షలను గమనిస్తూ ఉంటాం. 40 నుంచి 41 వారాల సమయంలో ఇండక్షన్ చేయాలా వద్దా అనేది పరిస్థితిని బట్టి డాక్టర్ నిర్ణయిస్తారు. తల్లికి ఉన్న సమస్యలు, వాటి నియంత్రణ, బిడ్డ పరిస్థితి వంటి అంశాలను బట్టి 37, 38 లేదా 39 వారాల్లోనే ఇండక్షన్ అవసరం కావచ్చు.ప్రతి కేసులోనూ ప్రయత్నిస్తారా?కాదు. బిడ్డ తల కిందకు లేకుండా బ్రీచ్ పొజిషన్ లో ఉండటం, బిడ్డ అడ్డంగా లేదా వేరే తప్పు పొజిషన్ లో ఉండటం, కొన్ని ట్విన్ ప్రెగ్నెన్సీ పరిస్థితులు, ప్లాసెంటా చాలా కిందకు ఉండటం వంటి సందర్భాల్లో ఇండక్షన్ సరైన ఎంపిక కాకపోవచ్చు.తప్పకుండా నార్మల్ డెలివరీనేనా?అలా చెప్పలేం. ముందుగా గర్భాశయ ముఖద్వారం అంటే సర్విక్స్ ప్రసవానికి ఎంతవరకు సిద్ధంగా ఉందో చూస్తాం. దీనినే సర్వికల్ ఫేవరబిలిటీ అంటారు. ఇందుకోసం సాధారణంగా మోడిఫైడ్ బిషప్ స్కోర్ వంటి పద్ధతులను ఉపయోగిస్తారు. సర్విక్స్ మెత్తగా ఉందా, ఎంతవరకు తెరుచుకుంది, బిడ్డ తల ఎంత కిందకు దిగింది వంటి అంశాలను పరిశీలిస్తాం.ఈ ప్రక్రియ ఎలా ఉంటుంది?సాధారణంగా దశలవారీగా చేస్తారు. ముందుగా తల్లి, బిడ్డ పరిస్థితిని పరిశీలిస్తాం. సర్విక్స్ సిద్ధంగా లేకపోతే దాన్ని ప్రసవానికి అనుకూలంగా మార్చేందుకు కొన్ని మందులు ఉపయోగిస్తారు. తర్వాత లేబర్ పెయిన్స్ పెరగడానికి అవసరాన్ని బట్టి మందులు లేదా ఆక్సిటోసిన్ డ్రిప్ ఇస్తారు. సర్విక్స్ కొన్ని సెంటీమీటర్లు తెరుచుకుని, లేబర్ ముందుకు సాగుతున్నప్పుడు అవసరమైతే ఆర్టిఫిషియల్ రప్చర్ ఆఫ్ మెంబ్రేన్స్ చేస్తారు. అంటే ఉమ్మనీటిని కృత్రిమంగా బయటకు వచ్చేలా చేయడం.ఇక్కడ ప్రధానంగా మూడు విషయాలను గమనిస్తాం.1. తల్లి పరిస్థితి, బిడ్డ పరిస్థితి, లేబర్ పురోగతి. 2. తల్లి పల్స్, బీపీ, నీరసం వంటి అంశాలను చూస్తాం. 3. నొప్పి తగ్గించే సహాయం, ధైర్యం చెప్పడం కూడా చాలా ముఖ్యం.వీటితో పాటు బిడ్డకు ఫీటల్ హార్ట్‌రేట్‌ను గమనిస్తూ ఉంటాం. అలాగే లేబర్ పెయిన్స్ ఎంత తరచుగా వస్తున్నాయి, ఎంత బలంగా ఉన్నాయి, బిడ్డ తల కిందికి దిగుతోందా, సర్విక్స్ తెరుచుకుంటోందా వంటి అంశాలను పరిశీలిస్తాం. అలాగే ఉమ్మనీటి రంగు కూడా గమనించవచ్చు. అది క్లియర్‌గా ఉంటే సాధారణంగా బిడ్డ పరిస్థితి అప్పటివరకు బాగుందని అర్థం. గ్రీన్ కలర్లో ఉంటే బిడ్డ మెకోనియం పాస్ చేసిన అవకాశం ఉండటంతో, డెలివరీని మరింత జాగ్రత్తగా, త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉండొచ్చు.సమస్యలు ఉంటాయా?ఇచ్చిన మందులకు ప్రతి ఒక్కరూ ఒకేలా స్పందించరు. కొందరిలో అసలు పెయిన్స్ రాకపోవచ్చు. మరికొందరిలో చాలా ఎక్కువగా రావచ్చు. దాంతో బిడ్డ హార్ట్రేట్పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఉమ్మనీరు ముందుగానే పోవడం లేదా లేబర్ సరిగా ముందుకు సాగకపోవడం వల్ల చివరికి సిజేరియన్ అవసరం కావచ్చు. అయినప్పటికీ తల్లి, బిడ్డ భద్రత కోసం ఇండక్షన్ అవసరమైతే దాని ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటాం.చివరగా, ఇండక్షన్ అంటే సిజేరియన్ తప్పనిసరి అని కాదు. అలాగే ఇండక్షన్ చేస్తే నార్మల్ డెలివరీ ఖాయం అని కూడా కాదు. తల్లి, బిడ్డ భద్రతే ప్రధానంగా తీసుకుని, ప్రతి కేసుకు అనుగుణంగా డెలివరీ విధానాన్ని డాక్టర్ నిర్ణయిస్తారు.- డా. కప్పగంతుల అపర్ణ, సీనియర్ గైనకాలజిస్ట్, అబ్‌స్టెట్రీషియన్, ల్యాపరోస్కోపిక్ సర్జన్, సికింద్రాబాద్ఇదీ చదవండి: ఆరోగ్యంగా కనిపిస్తున్నా.. ఊపిరితిత్తుల సమస్య! -
ప్లస్ సైజ్ బాడీనా? ఈ స్టైల్ టిప్స్ పాటిస్తే లుక్ అదిరిపోవాల్సిందే!
బాడీ సైజ్ ప్లస్‌లో ఉందని వార్డ్రోబ్ మైనస్‌లో ఉండాలా? అస్సలు వద్దు! సైజు పెరిగిందని స్టయిల్లో తగ్గాల్సిన పనిలేదు. మీ సైజు ఏదైనా సరే, స్టయిలింగ్‌లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే లుక్ అదిరిపోవాల్సిందే! అందుకే, ప్లస్ సైజ్ అబ్బాయిల వార్డ్‌రోబ్‌లో ఏం ఉండాలి? ఇక్కడ చూద్దాం!లూస్‌గా కూల్‌గా!ప్లస్ సైజ్ అని మీ బాడీని దాచడానికి మాత్రమే బట్టలు వేసుకోవడం మానేసి, మీ స్టయిల్‌ను చూపించడానికి వేసుకోండి. అలాగని, మరీ లూజుగా ఉండకూడదు. బటన్ లు సరిగ్గా క్లోజ్ అయ్యేంత ఫిట్ ఉండాలి. బటన్ ల మధ్య గ్యాప్ వచ్చి పొట్టొచ్చినట్లు కనిపిస్తే మాత్రం ఫ్యాషన్ మొత్తం గాల్లోకి పోయినట్టే!డిజైన్లు మాట్లాడాలి!ఎప్పుడూ సాదా సీదా డిజైన్స్‌కు పరిమితం కాకుండా, నిలువు గీతలు, చిన్న ఫ్లోరల్ ప్రింట్లు, ట్రాపికల్ డిజైన్లు లాంటి వాటిని ట్రై చేయొచ్చు. ఇవి మొదట బాడీ షేప్‌ను కాకుండా, డిజైన్స్‌ను చూసేలా చేస్తాయి.సూట్ వేసుకుంటే... సీన్ మారాలి!మూడు ముక్కల సూట్‌తో ప్లస్ సైజ్ ఫ్లస్ట్ క్లాస్ మార్కులు కొట్టేయొచ్చు. రెడీమేడ్ సూట్ మీ బాడీకి సరిపోకపోతే దాన్ని బలవంతంగా ఒప్పించాల్సిన పనిలేదు. టైలర్ దగ్గర కొలతలు ఇచ్చి కుట్టించుకోవడమే ఇక్కడ అసలైన ఆయుధం!రంగులే మీ ఆయుధం!ఎప్పుడూ నలుపు, నేవీ బ్లూ, డార్క్ గ్రేలకు జీవితకాల సభ్యత్వం తీసుకోవాల్సిన పని లేదు. రంగులు మీకూ సొంతమే! గ్రే, మెరూన్ , డీప్ ఆలివ్ లాంటి షేడ్స్‌ను కూడా ప్రయత్నించండి. దానికి చక్కని టై, వాచ్, షూస్ జోడిస్తే లుక్ మరింత ఎలివేట్ అవుతుంది.డెనిమ్‌తో దుమ్మురేపొచ్చు!డెనిమ్ జాకెట్ సన్నగా ఉన్నవాళ్లకే పేటెంట్ కాదు. ప్లస్ సైజ్ అబ్బాయిలు కూడా దాన్ని ఫుల్‌గా వాడుకోవచ్చు. సింపుల్ టీషర్ట్ మీద లైట్ డెనిమ్ జాకెట్, కింద డార్క్ డెనిమ్ ప్యాంట్... అంతే, స్ట్రీట్ స్టయిల్ రెడీ! జాకెట్ హిప్స్ వరకు వచ్చేలా చూసుకుంటే బాడీ ప్రపోర్షన్ కూడా చక్కగా కనిపిస్తుంది.పోలో... ప్లస్ పాయింట్!పోలో టీషర్ట్ ఫ్యాషన్ లో ఎప్పటికీ ఫెయిల్ కాని ఫ్రెండ్. అలాగే, ఓవర్‌సైజ్ పేరుతో భుజాల దగ్గర బట్టలు వేలాడేలా మాత్రం వద్దు. దానికి చినోస్ లేదా ఖాకీ ప్యాంట్ జోడిస్తే లుక్ సింపుల్‌గా, స్మార్ట్‌గా మారిపోతుంది. ముఖ్యంగా తేలికైన, కొంత స్ట్రెచ్ ఉన్న ఫ్యాబ్రిక్ ఎంచుకుంటే రోజంతా కంఫర్ట్ కూడా మీతోనే ఉంటుంది.ర్యాపర్ వైబ్!గ్రాఫిక్ టీషర్ట్, రిప్డ్ డెనిమ్, బేస్‌బాల్ క్యాప్, స్టేట్మెంట్ సన్ గ్లాసెస్, హైటాప్ స్నీకర్స్... ఈ కాంబినేషన్ తో స్ట్రీట్ స్టయిల్‌కి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. టీషర్ట్ చేతులు పైచేయి వెడల్పైన భాగం దగ్గర ఉండేలా చూసుకుంటే ప్రొపోర్షన్ బాగుంటుంది. జతగా బాగీ జీన్ ్స వేసుకుంటే బెల్ట్‌తో ఫిట్‌ను కంట్రోల్లో ఉంచండి.ప్లస్ సైజ్ అంటే దుస్తుల ఎంపికలు తగ్గిపోవడం కాదు. సరైన ఫిట్, సరైన పొడవు, సరైన రంగు ఈ మూడు కుదిరితే సైజు ఏదైనా స్టయిల్ మాత్రం సూపర్‌గానే ఉంటుంది.- కొండి దీపికఇదీ చదవండి: మా అమ్మానాన్నల విడాకుల కేస్ కోర్ట్‌లో నడుస్తోంది... -
మా అమ్మానాన్నల విడాకుల కేస్ కోర్ట్‌లో నడుస్తోంది...
‘‘హలో. జస్ట్ మీ వాయిస్ విందామని చేశాను. వచ్చేప్పుడు తేగలు తెండి. ఇక్కడికన్నా రాజమండ్రిలో మంచి తేగలు దొరుకుతాయి.’’ సుదతి తన భర్తకి ఫోన్ చేసి చెప్పింది.‘‘గుర్తుంది. తెస్తాను. రేగుపళ్ళ గుజ్జుతో చేసే దాన్నేదో అంటారు. అదీ తెస్తాను.’’‘‘ఒరుగులు. అవి మనమ్మాయికి బాగా ఇష్టం.’’ఏభై ఒక్కేళ్ళ సుదతి ఆ కాల్ పూర్తయ్యాక భర్త పాత లుంగీని తీసుకొని బాత్రూంలోకి వెళ్ళింది. దాన్ని ఆమె వృథా పోనీకుండా టవల్‌గా వాడుతోంది. స్నానం చేస్తూ ఆ పూట ఏం వండాలని ఆలోచిస్తూ ఫ్రిజ్‌లోని కూరగాయలని గుర్తుచేసుకోసాగింది.వంట చేసేప్పుడు ఇంగువ ఐపోయిందని గ్రహించింది. ఉదయం తొమ్మిదికి వంట పూర్తి చేసి, కాలేజ్‌కి వెళ్ళే కూతురికి కేరియర్ ఇచ్చింది. వాళ్ళది మధ్యతరగతి కుటుంబం కాబట్టి హోటల్‌కి వెళ్ళడం ఆ కుటుంబంలోని ఎవరికీ అలవాటు లేదు.ఆమె వెళ్ళాక సుదతి సంచీ తీసుకుని పది నిమిషాల నడక దూరంలోని జయంట్ సూపర్ బజార్‌కి వెళ్ళింది. ఆవిడ సరాసరి ఆ ఐల్కి వెళ్ళి ఎల్.జి. ఇంగువ డబ్బాని తీసుకుంది. మరికొన్ని వస్తువులని కూడా తీసుకుని కూతురికి టెక్స్›్ట మెసేజ్ చేసింది. ఆవిడ చెక్ అవుట్ కౌంటర్లో ఉండగా కూతురు నుంచి ఫోన్ వచ్చింది.‘‘జయంట్లో ఉంటే శానిటరీ నేప్కిన్స్ తీసుకో. ఎర్రరంగు తిలకం కూడా. ఇంకేమైనా గుర్తొస్తే ఐదు నిమిషాల్లో మళ్ళీ ఫోన్ చేస్తాను.’’ఆవిడ క్యూలోంచి బయటకి వచ్చి ఆ ఐటమ్స్ దగ్గరికి వెళ్ళి వాటిని తీసుకుని మళ్ళీ వచ్చి చెకౌట్ క్యూలో నిలబడింది. తన ముందు నిలబడ్డ పద్దెనిమిదేళ్ళ కుర్రాడిని చూసి, ‘ఈ రోజుల్లో గడ్డం పెంచడం మగాళ్ళకి ఫేషన్ ఐపోయింది’ అని అనుకుంది.ఆ కుర్రాడి కళ్ళు పదే పదే తన చేతికున్న బ్రేస్లెట్ వంక చూడటం గమనించాక సుదతికి అతను దొంగేమో అన్న ఆలోచన కలిగింది. కొంగుతో దాన్ని కప్పుకోవాలి అని అనుకుంటూండగా అతను ప్రశ్నించాడు.‘‘మీరు పాలేశ్వరావు భార్య కదా?’’ఆవిడకి ఆ ప్రశ్నకి కొద్దిగా ఆశ్చర్యం వేసింది.‘‘అవును. ఆయన నీకు తెలుసా?’’ వెంటనే అడిగింది.‘‘తెలుసు. మా నాన్నగారు, ఆయన కొలీగ్స్.’’‘‘నన్ను ఎలా గుర్తుపట్టావు? మా ఇంటికి వచ్చావా?’’‘‘లేదు. మిమ్మల్ని చూడటం ఇదే మొదటిసారి.’’‘‘మరెలా గుర్తుపట్టావు?’’‘‘ఆ బ్రేస్లెట్ మీద మీ పేరుని చూసి. రావుగారు దాన్ని కొని మీకు ఇరవైయ్యవ మేరేజ్ ఏనివర్సరీకి సర్ప్రైజ్ గిఫ్ట్‌గా ఇచ్చారని మా ఇంట్లో అందరికీ తెలుసు. ఆయన మా కుటుంబానికి ఎంతో సాయం చేశారు. నాకు ఎడ్యుకేషన్ లోన్ తిరస్కరిస్తే ఆయనే ఇప్పించారు.’’‘‘మా వారికి ‘పరోపకారి పాపన్న’ అనే ముద్దు పేరు పెట్టాము. ఎవరికైనా ఏదైనా అవసరం ఉందని తెలిస్తే ఆయన అంతట ఆయనే వాళ్ళింటికి వెళ్ళి సాయం చేస్తారు.’’ సుదతి నవ్వుతూ చెప్పింది.‘‘ఆయన రాలేదా?’’ అతను ఆవిడ బుట్టలోని సామానుని కౌంటర్ మీద పెడుతూ అడిగాడు.‘‘కేంప్‌కి వెళ్ళారు.’’అతను ఆవిడ కేరీ బేగ్ బయటకి మోసుకువచ్చాడు. అతనేదో చెప్పడానికి సందేహిస్తున్నాడని గ్రహించిన సుదతి అడిగింది.‘‘ఏమిటి?’’‘‘మీరు పాలేశ్వరరావుగారికి ఫెయిత్ఫుల్గా ఉంటానని ఆయనకి మాట ఇవ్వండి. ఆయన తిరిగి వచ్చాక మీ ప్రేమని వ్యక్తం చేస్తూండండి.’’ఆ మాటలకి ఆవిడ తుళ్ళిపడింది.‘‘నా వయసు ఎంతో తెలిస్తే ఆ మాట అనవు. వచ్చే ఏడు ఏభై రెండు వస్తాయి.’’‘‘గతంలో హంస రాయబారాలు ఉన్నాయో లేవో నాకు తెలీదు. కాని నేడు ఆ పనిని వాట్సప్ చక్కగా చేస్తోంది. వివాహేతర సంబంధాలకి వయసు అడ్డురాదు. మా అమ్మ మీకన్నా ఓ ఏడాది పెద్దది. తన క్లాస్‌మేట్‌తో వాట్సాప్ ద్వారా టచ్‌లోకి వచ్చింది. అది ప్రేమగా అనను కాని కామంగా మారింది. ఆయనతో...’’ దుఃఖంగా ఆగాడు.సుదతి ఉలిక్కిపడింది.‘‘మా అమ్మానాన్నల విడాకుల కేస్ కోర్ట్‌లో నడుస్తోంది. మా అమ్మ చాపల్యం వల్ల ఓ చక్కటి కుటుంబం విడిపోయింది. మీరు మా అమ్మలా మీ కుటుంబానికి ద్రోహం చేయకండి అని చెప్పాలి అనిపించింది.’’ఆవిడ ఆ షాక్‌లోంచి తేరుకునేలోగా అతను తన సైకిల్ దగ్గరకి వెళ్ళిపోయాడు. ఆవిడకి తనతో ఆప్యాయంగా మాట్లాడే ఓ పాత క్లాస్మేట్ గుర్తుకి వచ్చాడు. వెంటనే మొబైల్ ఓపెన్ చేసి ఓల్డ్ స్కూల్ స్టూడెంట్స్ గ్రూప్‌లోంచి బయటకి వచ్చేసింది.ఆవిడ సామాను ఉంది కాబట్టి ఊబర్ ఆటోని బుక్ చేసింది. తర్వాత తన భర్తకి ఫోన్ చేసింది.‘‘ఏమిటి?’’ పాలేశ్వర్ అడిగాడు.‘‘ఐ లవ్ యు.’’‘‘ఇదేమిటి కొత్తగా?’’‘‘ఇప్పుడే మనకి మేలు చేసే ఓ ఆధునిక ఆర్తనాదం విన్నాను.’’ ఆవిడ నెమ్మదిగా చెప్పింది.- మల్లాది వెంకట కృష్ణమూర్తిఇదీ చదవండి: మశూచితో చనిపోయి... మళ్లీ పుట్టాడు? అసలేం జరిగిందంటే? -
2026 నోబెల్ సాహిత్య పురస్కారం.. ఈసారి ఎవరి పేరు వినిపిస్తోంది?
ప్రతి సంవత్సరం అక్టోబర్ 5–12 తేదీల మధ్యలో, ఆ ఏడాది నోబెల్ సాహిత్యపురస్కారం ఎవరు గెల్చుకున్నారో ప్రకటించడం స్వీడిష్ ఎకాడెమీకి ఆనవాయితీ. బహుశా ఈ ఏడాది కూడా అదే సమయంలో– అంటే, మరికొద్ది రోజుల్లో– 2026 సంవత్సరానికిగాను నోబెల్ సాహిత్యపురస్కారం ఎవరు గెల్చుకున్నారో ప్రకటితమవుతుంది. ఈ పురస్కారం ఎవరికి దక్కబోతోందన్న విషయంపై, ప్రపంచ సాహిత్యవర్గాల్లో కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి.2026 నోబెల్ సాహిత్యపురస్కారానికి సంబంధించినంత వరకూ వీటిని నామినేషన్లుగా పేర్కోవడం కద్దు. ఇంతవరకు, 287 నామినేషన్లు వచ్చాయని వినికిడి. వాటిల్లో కొందరికి విజయావకాశాలు పుష్కలంగా వున్నాయని కొందరు ‘నిపుణులు’ ఊహాగానాలు చేస్తున్నారు. ఈ ‘బుక్కీల’ ఊహాగానాలపై ఆధారపడి ‘బెట్టింగులు’ కూడా సాగుతున్నట్లు చెప్పుకుంటున్నారు.సాహిత్య బుక్కీల ఊహాగానాల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లలో, ముందుగా చెప్పుకోవలసిన పేరు చైనీస్ రచయిత్రి చాన్ ష్యూహ్. ‘కురిసే మంచు’ అనేది ఈ కలంపేరుకు అర్థమట. ఆమె అసలు పేరు డెంగ్ షియవోహువా. తొలితరం చైనీస్ రచయితల రచనాధోరణికి పూర్తి భిన్నమైన రీతిలో సాగింది చాన్ రచన.పదమూడు పద్నాలుగు శతాబ్దాలకు చెందిన ఇటాలియన్ కవి– తాత్త్వికుడు– రచయిత డాంటే, పందొమ్మిది– ఇరవై శతాబ్దాలకు చెందిన ప్రపంచ ప్రసిద్ధ చెక్ రచయిత కాఫ్కా, అతనికి సమకాలికుడైన అర్జెంటీన్ రచయిత– తాత్త్వికుడు– హొర్హే బొర్హే, చాన్‌ను గాఢంగా ప్రభావితం చేశారు. చాన్ నవల ‘చివరి ప్రేమికుడు’ 2015లో ఉత్తమ అనువాద గ్రంథంగా పురస్కారం పొందింది. మరో అయిదేళ్ళ తర్వాత, ఆమె రాసిన ‘మహారాణి’ కథానిక రెండేళ్ళకు ఒకసారి ప్రకటించే దాయీ సాహిత్య పురస్కారం దక్కింది. మరో రెండేళ్ళకు ‘మనోహరమైన ఇతరుల జీవితాలు’ నవలకు ‘హువా జాంగ్ ప్రపంచప్రసిద్ధ చైనీస్ రచన’ పురస్కారం దక్కింది. మరో రెండేళ్ళకు, అమెరికన్ సాహిత్య పురస్కారం గెల్చుకుంది. అప్పటినుంచీ నోబెల్ సాహిత్యపురస్కారానికి అర్హుల జాబితాలో, చాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తూనే వుంది.చాన్ నోబెల్ బుక్కీల తొలి ఎంపిక అయితే, మలి ఎంపికగా చెప్పుకోదగిన పేరు సర్ అహ్మద్ సల్మాన్ రష్డీ. భారత దేశం స్వాతంత్య్రం సంపాదించుకోడానికి రెండునెల్ల ముందు– ఆనాటి బొంబాయి మహానగరంలో– పుట్టారు రష్డీ. పద్నాలుగోయేట ఇంగ్లండ్ తరలివెళ్ళిన రష్డీ, మరో యేడేళ్ళకు కేంబ్రిజ్ విశ్వవిద్యాలయం నుంచి పట్టాపుచ్చుకున్నారు. 1900లో ఫ్రాంక్ బాం రాసిన నవల ఆధారంగా రూపొందించిన ‘ద విజార్డ్ ఆఫ్ ద ఓజ్’ చిత్రం చూసి తాను రచయితనయ్యానన్నారు రష్డీ.పీ.జీ.వుడ్‌హౌస్, అగాథా క్రిస్టీల రచనలు గుట్టలు గుట్టలుగా చదివిపారేశానన్నరాయన. కాపీరైటర్‌గా జీవితం మొదలుపెట్టిన పుష్కరానికి–1981లో– రష్డీ ప్రచురించిన నవలే ‘మిడ్నైట్స్ చిల్డ్రెన్’. ఈ రచన రష్డీకి నిత్యాధునికవాదిగానూ, అద్భుత వాస్తవవాదిగానూ పేరు తెచ్చిపెట్టింది. ఆ నవల బుకర్ పురస్కారం గెల్చుకుంది. ఇదే రచన 1993లో ‘బెస్ట్ ఆఫ్ బుకర్స్’ పురస్కారాన్నీ, 2008లో ‘బుకర్ ఆఫ్ బుకర్స్’ పురస్కారాన్నీ గెల్చుకుంది. దాంతో ఈ నవల అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అప్పటినుంచీ, రష్డీ పేరు కాబోయే నోబెల్ పురస్కార విజేతల జాబితాలో కనిపిస్తూనే వుంది. ఈసారి అతగాడి అదృష్టం ఎలావుందో మరి!హరూకీ మురకామి జపనీస్ కథకుడు, నవలా రచయిత, వ్యాసకర్త మురకామి రచనలు ఇప్పటికి యాభై భాషల్లోకి అనువాదమయ్యాయి. స్వదేశీ– విదేశీ మార్కెట్లలో, మురకామీ రచనల ప్రతులు మిలియన్ల కొద్దీ అమ్ముడయ్యాయి. ఆయన తొలి నవల ‘గాలిపాట వినండి!’ నూతన రచయితలకు ఇచ్చే ‘గుంజో’ పురస్కారాన్ని 1979లోనే గెల్చుకుంది. ఆ తర్వాత మురకామి –‘పిన్ బాల్’, ‘కొండగొర్రె వేట’, ‘డాన్స్ డాన్స్ డాన్స్’– అనే మరో మూడు గొలుసుకట్టు నవలలు వెలువరించారు.వాటిని అన్నింటినీ కలిపి ‘మూషిక చతుష్టయం’ అని కూడా పిలుస్తారు. 1982లో మురకామి నవల ‘కొండగొర్రె వేట’ నోమా సాహిత్యపురస్కారాన్ని గెల్చుకుంది. 2006లో మురకామికి ‘ఫ్రాంజ్ కాఫ్కా పురస్కారం’ దక్కింది. అదే సంవత్సరం మురకామి ‘ఫ్రాంక్ ఓకానర్ అంతర్జాతీయ కథా సాహిత్యపురస్కారం’ గెల్చుకున్నారు. ఆ పురస్కారానికి గాను 35 వేల డాలర్ల ప్రతిఫలం మురకామికి ముట్టింది. మురకామిపై కాఫ్కా ప్రభావం ఎంత ప్రగాఢమైందో ప్రపంచానికి తెలిసిందే! ఇన్ని బహుమతులు అందుకున్న హరూకీ మురకామియే 2026 నోబెల్ సాహిత్యపురస్కారం గెల్చుకుంటారన్నది కొందరు బుక్కీల అంచనా.సుప్రసిద్ధ అమెరికన్ నవలా రచయిత థామస్ పించాన్ పేరు, కెనడియన్ నవలారచయిత్రి– కవయిత్రి– విమర్శకురాలు– మార్గరెట్ యాట్వుడ్ పేరు కూడా కాబోయే నోబెల్ సాహిత్యపురస్కార విజేతల పేర్ల జాబితాలో ప్రముఖంగా కనిపిస్తున్నాయి. 66 పుస్తకాలు వెలువరించి, రెండుసార్లు బుకర్ పురస్కారం, అర్థర్ క్లార్క్ పురస్కారం, ఆర్డర్ ఆఫ్ కెనడా, కాఫ్కా పురస్కారం, ఆస్ట్రియా రాకుమారుడి సాహిత్య పురస్కారం, జాతీయ విమర్శకుల పురస్కారం, అమెరికన్ పెన్ జీవన సాఫల్య పురస్కారం అందుకున్న ప్రసిద్ధురాలు మార్గరెట్. ఈ అయిదుగిరిలో ఎవరికో ఒకరికి కచ్చితంగా నోబెల్ సాహిత్య పురస్కారం దక్కి తీరుతుందని బుక్కీలు ఢంకా బజాయించి చెప్తున్నారు. అదీ చూద్దాం!!- మందలపర్తి కిషోర్ఇదీ చదవండి: చిటికెడు ఉప్పుతో.. గిన్నిస్ రికార్డు! -
మశూచితో చనిపోయి... మళ్లీ పుట్టాడు? అసలేం జరిగిందంటే?
అది 1955 నాటి ఉత్తరప్రదేశ్... చిన్న పట్టణం ఛత్తా. అందులో సువిశాలమైన ఓ పెంకుటిల్లు... తల్లి తన నాలుగున్నరేళ్ల కుమారుడు ప్రకాశ్ వర్ణ్షేకి గోరుముద్దలు తినిపిస్తోంది. రెండు ముద్దలు తిన్న ఆ బాలుడు– మూడో ముద్ద పెడుతుంటే తల్లి చేతిని వెనక్కి నెట్టేశాడు. ‘‘నన్ను నా ఇంటికి తీసుకెళ్లండి. నా కోసం కోసికలాన్‌లో నా వాళ్లు ఎదురుచూస్తున్నారు’’ అనేసరికి తల్లి బిత్తరపోయింది.ఆ రాత్రి నిద్రలో నుంచి లేచిన బాలుడు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశాడు. తల్లిదండ్రులు ఎంత ఆపినా వినకుండా ఒకటే ఏడుపు. ‘‘నేను ఇక్కడివాడిని కాదు. కోసికలాన్‌లో నా ఇల్లు ఉంది. నా పేరు ప్రకాశ్ కాదు, నిర్మల్. వెంటనే నన్ను అక్కడకు తీసుకెళ్లండి’’ అని మారాం చేశాడు.నాలుగున్నరేళ్ల బాలుడు కోసికలాన్ గురించి మాట్లాడటమేంటి? అసలు ఆ ఊరి పేరు ఈ ఇంట్లో ఎవరూ ఎప్పుడూ ఎత్తలేదే! అని తల్లిదండ్రులు అయోమయానికి గురయ్యారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ప్రకాశ్ ప్రవర్తన మరింత విచిత్రంగా మారసాగింది. తన తండ్రి పేరు బోలానాథ్ అని, ఆయనకు నాలుగు దుకాణాలు ఉన్నాయని చెప్పేవాడు. పాత ఇంటికి తీసుకెళ్లాలని గట్టిగా పట్టుబట్టేవాడు. రాత్రిళ్లు ఉలిక్కిపడి లేచి, ‘‘నా కడుపు మండిపోతోంది. మంచం చుట్టూ జనం ఉన్నారు. నేను చనిపోతున్నాను!’’ అంటూ భయంతో వణికిపోయేవాడు.కోసికలాన్ తీసుకెళ్తే తప్ప తమ కుమారుడి విషయంలో మార్పు రాదని భావించిన తల్లిదండ్రులు 1956లో బాలుడిని తీసుకుని కోసికలాన్ వెళ్లారు. అయితే, ఆ సమయంలో బోలానాథ్ లేకపోవడం వల్ల కలవకుండానే వెనక్కి వచ్చేశారు. కానీ ప్రకాశ్ జ్ఞాపకాలు మాత్రం కోసికలాన్కు ప్రయాణిస్తూనే ఉన్నాయి. పలుమార్లు కొసికలాన్కు వెళ్లడానికి విఫలయత్నాలు చేశాడు.ఓరోజు పెద్ద మేకును పట్టుకుని కోసికలాన్ వైపు వెళ్లడానికి ప్రయత్నించాడు. ప్రకాశ్ నాన్న వెంటనే గమనించి ఆపాడు. చేతిలో ఉన్న మేకు ఏమిటని అడిగితే– ‘‘ఇది నా ఇనప్పెట్టె తాళం చెవి’’ అని చెప్పాడు. ప్రకాశ్‌కు పదేళ్ల వయసు వచ్చేసరికి కోసికలాన్ గురించి మరింత మారాం చేస్తుండటంతో 1961లో మళ్లీ అతడిని తీసుకుని వెళ్లారు. బస్సు దిగీదిగగానే వడివడిగా నడవడం మొదలుపెట్టాడు. ఆ వెనుకే అతడి తల్లిదండ్రులు కూడా అనుసరించారు. అలా వెళ్తూ వెళ్తూ ఒక పాత డాబా ఇంటి ముందు ఆగాడు.‘‘ఇదే నా ఇల్లు!’’ అన్నాడు గట్టిగా.ఇంట్లోంచి బయటకు వచ్చిన మహిళను చూడగానే ప్రకా‹శ్ కళ్లు చెమ్మగిల్లాయి. ‘అమ్మా!’ అంటూ ఆమెను హత్తుకున్నాడు. పక్కనే నిలబడిన ఓ యువకుడిని ‘‘నువ్వు నా తమ్ముడు దేవేంద్ర కదా’’ అని అడిగాడు. ‘‘తారక్క ఎక్కడుంది?’’ అని ప్రశ్నించాడు. ఇది చూసి అంతా నిశ్చేష్టులయ్యారు. బోలానాథ్ జైన్ కుమారుడు నిర్మల్ నిజంగానే ఉన్నాడని, 1950లో సుమారు పదేళ్ల వయసులో మశూచితో మరణించినట్లు తెలిసి అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు.ప్రకాశ్ అంతటితో ఆగలేదు. ఆ ఇల్లంతా తిరిగాడు. ఏ గది ఎక్కడుందో, వెనుక పెరట్లో ఏముందో చెప్పాడు.ఇవన్నీ చూసిన నిర్మల్ తల్లి కన్నీటిపర్యంతమైంది. మరోవైపు తమ బిడ్డ తమకు దక్కకుండా పోతాడేమోనని ప్రకాశ్ తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటూ చూశారు. ఆ క్షణంలో ఆ వాకిట్లో నిశ్శబ్దం ఆవరించింది. రెండు కుటుంబాల మధ్య మమకారాలు, అనుమానాలు, అంతుచిక్కని కాలచక్రపు రహస్యాలు ఎదురెదురుగా నిలబడ్డాయి. చివరకు, బాలుడి భవిష్యత్తు కోసం ప్రకాశ్‌ను అతడి తల్లిదండ్రులతోనే పంపాలని అందరూ నిర్ణయించుకున్నారు.ఈ విషయం పునర్జన్మలపై అధ్యయనం చేస్తున్న అమెరికా వర్జీనియా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్కు తెలిసింది. దీంతో ఆయన 1961లో భారత్‌కు వచ్చారు. ప్రకాశ్, అతడి కుటుంబం, జైన్ కుటుంబం, స్థానిక సాక్షులను ఇంటర్వ్యూ చేశారు. 1964లో మరోసారి భారత్‌కు వచ్చి వివరాలు సేకరించారు. ఈ కేసులో ఆయన దృష్టిని ఆకర్షించిన అంశం భౌగోళిక దూరం. ప్రకాశ్ కుటుంబం నివసించే ఛత్తా, నిర్మల్ కుటుంబం నివసించే కోసికలాన్ పట్టణాల మధ్య దూరం కేవలం 10 కిలోమీటర్ల లోపే! పైగా రెండు కుటుంబాలకు ముందుగా పరిచయం కూడా లేదు. డాక్టర్ స్టీవెన్సన్ ఈ కేసును ‘పునర్జన్మ కేసు’గా పరిగణించారు.ప్రకాశ్ చెప్పిన పేర్లు, కుటుంబ సంబంధాలు, దుకాణాల వివరాలు, ఇంటి నిర్మాణం వంటి కొన్ని అంశాలు జైన్ కుటుంబానికి సంబంధించిన సమాచారంతో సరిపోలినట్లు గుర్తించారు. పునర్జన్మలపై తాను రాసిన పుస్తకంలో ప్రకాశ్ ఉదంతం గురించి వివరంగా రాశారు. కాలం గడిచేకొద్దీ ప్రకాశ్ సాధారణ జీవితంలోకి వెళ్లాడు. అయితే బాల్యంలో తనకు కలిగిన నిర్మల్ జ్ఞాపకాల ప్రభావం పూర్తిగా మాయం కాలేదు.ఒక చిన్నారి తనకు తెలియని మరో కుటుంబం, మరో ఊరు, మరో వ్యక్తి పేరు ఎందుకు చెప్పాడు? ఆ కుటుంబాన్ని కలిసినప్పుడు కొన్ని వ్యక్తులను, ప్రదేశాలను గుర్తించినట్లు ఎందుకు ప్రవర్తించాడు? అతడు చెప్పిన కొన్ని వివరాలు అక్కడి వాస్తవాలతో ఎలా సరిపోయాయి? ఇవన్నీ పునర్జన్మకు సాక్ష్యాలేనా? లేక ఇప్పటికీ పూర్తిగా అర్థంకాని బాల్య జ్ఞాపకాలు, సమాచార మార్పిడి, మానసిక ప్రక్రియల ఫలితమా?ప్రకాశ్ వర్ణే›్ష ఉదంతం ఈ ప్రశ్నలకు తుది సమాధానం ఇవ్వకపోయినా, ‘మరణం తర్వాత కూడా జ్ఞాపకం కొనసాగుతుందా’ అనే ప్రశ్నను మరోసారి తెరపైకి తెచ్చింది.- సత్యకిశోర్ కొండ్రెడ్డిఇదీ చదవండి: చిటికెడు ఉప్పుతో.. గిన్నిస్ రికార్డు! -
చిటికెడు ఉప్పుతో.. గిన్నిస్ రికార్డు!
ఉప్పు అంటే కూరలో చిటికెడు, మిరియాలు అంటే సూప్‌లో కాస్తంత! కానీ అమెరికాలోని లిండా షుల్జ్‌కు మాత్రం ఇవే ప్రపంచ రికార్డుకు కావాల్సినంత సరుకు! 67 ఏళ్ల లిండా ఉప్పు, మిరియాల ప్యాకెట్లను ఎక్కడున్నా వెతికి పట్టుకుని దాచేస్తారు. అలా దాచుకుంటూ పోయి ఏకంగా ప్రపంచ రికార్డునే తన వంటింటి షెల్ఫ్పైకి తెచ్చుకున్నారు!ఇప్పటివరకు 754 జంటలను పోగేశారు. దీంతో అతిపెద్ద ఉప్పు మిరియాల ప్యాకెట్ల సేకరణగా గిన్నిస్ రికార్డును మరోసారి సొంతం చేసుకున్నారు. అంటే మనం రెస్టరెంట్లో భోజనం అయిపోయాక టేబుల్‌పై మిగిలిన చిన్న ప్యాకెట్‌ను పట్టించుకోకుండా వదిలేస్తే లిండా మాత్రం వాటితోనే రికార్డు సాధించారు. ఈ రికార్డు లిండాకు కొత్తేమీ కాదు.2024లో 494 జంటలతో తొలిసారి రికార్డు సాధించిన ఆమెను, మరుసటి ఏడాది 594 జంటలతో సలాక్నిబ్ సోనీ మోలినా దాటేశారు. కానీ లిండా అక్కడితో ఆగలేదు. మళ్లీ ప్యాకెట్ల వేట మొదలుపెట్టి ఈసారి 754 జంటలతో రికార్డును తిరిగి పట్టేశారు! ఆమె సేకరణలో ఎన్నో రకాల డిజైన్లు, ప్రత్యేక ప్యాకెట్లు ఉన్నాయి. అయితే లిండాకు అన్నింటికంటే ఇష్టమైనవి హవాయియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన హవాయియన్ షర్ట్ డిజైన్ నట. మొదట సరదాగా మొదలైన హాబీ... చివరికి గిన్నిస్ రికార్డుగా మారింది.ఇదీ చదవండి: ఆకాశం నుంచి.. వెండితెర పైకి! -
ఆకాశం నుంచి.. వెండితెర పైకి!
ఎయిర్‌హోస్టెస్‌గా ఆకాశంలో చక్కర్లు కొట్టే అమ్మాయి, కెమెరా ముందు నిలబడి చప్పట్లను వింటోంది. ఒకే ఒక్క ఇన్స్టాగ్రామ్ ఫొటోతోనే సినీ అవకాశం దక్కించుకున్న నటి రాశి సింగ్ చెబుతున్న తన సినీప్రయాణ విషయాలన్నీ ఆమె మాటల్లోనే మీకోసం...కెమెరా కోసమే పుట్టాను!ఛత్తీస్‌గఢ్‌లో పుట్టి, ఢిల్లీలో డిగ్రీ చేసిన వెంటనే, ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేశాను. ఫ్యాషన్ ఇండస్ట్రీలో స్థిరపడాలన్నది నా కోరిక. అందుకే, ఉద్యోగం చేస్తూనే మోడలింగ్ చేసేదాన్ని. ఒకసారి నా ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో చూసిన ఓ సినిమా మేనేజర్ నన్ను సంప్రదించారు. అలా సినిమాల్లోకి వచ్చేశాను. నిజం చెప్పాలంటే, కెమెరా ముందు నిలబడటం నాకు ఎప్పుడూ కొత్తగా అనిపించలేదు. నేను కెమెరా కోసమే పుట్టానేమో అనిపిస్తుంది!సెట్లో డ్యూటీ కష్టం!ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేసినప్పుడు నా పని కష్టమే అనుకున్నాను. కానీ సినిమాల్లోకి వచ్చాక అసలు పరీక్ష ఏంటో తెలిసింది! ఒక్కోసారి పద్దెనిమిది నుంచి ఇరవై గంటలు షూటింగ్ చేయాల్సి వస్తుంది. రాత్రంతా షూటింగ్ చేసి, మళ్లీ ఉదయాన్నే సెట్‌కు వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి. మొదట్లో ఇవన్నీ చూసి షాక్ అయ్యేదాన్ని. కానీ కెమెరా ముందుకొచ్చిన వెంటనే ఆ అలసట అంతా ఎక్కడికో వెళ్లిపోతుంది.వైరల్ అవ్వడం ఓ పని!నా ఎక్స్ప్రెషన్స్ గురించి చాలామంది మాట్లాడుతుంటారు. ఈ మధ్య ఫంక్షన్స్, ప్రమోషన్స్‌లో నా రియాక్షన్స్ వైరల్ అవుతుంటే నవ్వొస్తుంది. నేను ఏదైనా సీరియస్‌గా చూస్తుంటే అది కూడా మీమ్స్‌కు మెటీరియల్ అయిపోతుంది! అలా నాకు వైరల్ గర్ల్ అనే పేరు రావడం కాస్త సరదాగానే అనిపిస్తుంది.చలిలో.. చాలెంజింగ్!‘రంభ ఊర్వశి మేనక’ షూటింగ్ నాకు చాలా చాలెంజింగ్‌గా అనిపించింది. రాత్రి వేళల్లో షూట్ చేశాం. ఉష్ణోగ్రత ఆరు నుంచి ఏడు డిగ్రీలకు పడిపోయేది. అంత చలిలోనూ భారీ కాస్ట్యూమ్స్, నగలు వేసుకుని పనిచేయాలి. కొన్ని కాస్ట్యూమ్స్ అయితే చాలా క్లిష్టంగా ఉండేవి. వాటిని చూసుకోవడానికి ఏకంగా ముగ్గురు అవసరమయ్యేవారు!తగ్గిన బరువు... పెరిగిన టెన్షన్!కొన్ని పాత్రల కోసం నా లుక్ పూర్తిగా మార్చుకోవాల్సి వచ్చింది. అందులో భాగంగా బరువు కూడా తగ్గాను. బయటికి చూస్తే గ్లామరస్‌గా కనిపిస్తాను. కానీ దాని వెనుక డైట్, వర్కౌట్, క్రమశిక్షణ చాలా ఉంటాయి. ఒక పాత్ర కోసం మన శరీరాన్నే మార్చుకోవడం అంత ఈజీ కాదు.నా పని నాదే!ఇండస్ట్రీలో రాజకీయాలు, గ్రూపిజం ఉన్నాయా అంటే ఉన్నాయనే చెబుతాను. కొందరు తమకు దగ్గరగా ఉన్న వాళ్లకే అవకాశాలు వచ్చేలా ప్రయత్నిస్తారు. దాని వల్ల కొన్ని అవకాశాలు మన చేతి నుంచి వెళ్లిపోవచ్చు. కానీ నేను వాటి గురించి ఎక్కువగా ఆలోచించను.నా కలల హీరో!నాకు ఇష్టమైన హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. ఆయనతో కలిసి పనిచేయాలన్నది నా డ్రీమ్. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్, నటన అన్నీ నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే అసలు వదులుకోను. అలాగే, ఇంకా ఎన్నో రకాల పాత్రలు చేయాలి.ఇదీ చదవండి: అమ్మానాన్నల కోసం కార్పొరేట్ ఉద్యోగం వదులుకొని! -
నయా ట్రెండ్.. నయా లైఫ్! హాయిగా.. హ్యాపీగా..
‘కలకాలం కాకిలా బతకడం కంటే హంసలా ఆరునెలలు బతకడం మేలు’ అని మనకో నానుడి ఉంది. ‘దీర్ఘాయుష్మాన్ భవ’ అని పిన్నలను పెద్దలు దీవించే సంప్రదాయం కూడా మనకు ఉంది. పాతకాలం సామెతలతోనో, ఆచారాలతోనో నేటితరం సరిపెట్టుకోవడం లేదు. దీర్ఘాయుర్దాయాన్ని మాత్రమే కాదు, ఆయువు ఉన్నంత వరకు ఒంట్లో పట్టుసడలని ఆరోగ్యాన్ని కూడా కోరుకుంటున్నారు.పైపై పొగడ్తలను కాదు, ప్రేమతో పలకరించే మనుషులను కోరుకుంటున్నారు. సంపదను పోగేసుకోవడం కంటే జీవితంలో సంతృప్తిని కోరుకుంటున్నారు. ఖరీదైన వస్తువుల కోసం కంటే విలువైన అనుభవాల కోసం ఖర్చు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. సమాజం ఒరవడిలో కొట్టుకుపోకుండా, తమదైన సమయాన్ని తమ కోసం కోరుకుంటున్నారు. జీవితాన్ని మరింత అర్థవంతంగా మలచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకు అనుగుణంగా జీవనశైలిలో కొత్త ఒరవడిని అనుసరిస్తున్నారు.ఆరోగ్యాన్ని కాపాడుకోవడం నుంచి ఆనందాన్ని వెదుక్కోవడం వరకు; సామాజిక జీవితాన్ని ఆస్వాదించడం నుంచి తన కోసం తనదైన సమయాన్ని కేటాయించుకోవడం వరకు; కొత్త అనుభవాల కోసం అడుగులు వేయడం నుంచి జీవితాన్ని మరింత సరళంగా మార్చుకోవడం వరకు ఈతరం మనిషి కోరుకుంటున్నది ఒక్కటే– ‘జీవితాన్ని ఎలాగోలా గడపడం కాదు, మనస్ఫూర్తిగా జీవించాలి’. ‘తెల్లారిందా, నిద్రలేచామా, తిన్నామా, మళ్లీ నిద్రపోయామా’ అనేదే దినచర్య కాదు. ఆ పని జంతువులు కూడా చేస్తాయి. ఆలోచనల కోసం, ఆనందం కోసం ఆరోగ్యంగా బతకడమే జీవించడం.నేటి తరం మనిషి మళ్లీ తనను తాను వెతుక్కోవడం మొదలుపెట్టాడు. ఎక్కడ పోగొట్టుకుంటామో అక్కడే రాబట్టుకోవాలి అన్నట్లు మళ్లీ మొదటికే పయనమవుతున్నాడు. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు పరుగెడుతూనే ఉన్నాడు. శరీరం అలసిపోతూనే ఉంది. అయినా మరుసటి రోజు మళ్లీ అదే పరుగు. కానీ ఒక్కసారి ఆగి చూస్తే, అసలు ఎటు పరుగెడుతున్నాడో మాత్రం తెలియడం లేదు.ఉత్సాహమే ఊపిరి!ఇంతకాలం ‘ఎక్కువ కాలం బతకాలి’ అనేది ప్రధాన లక్ష్యం. ‘బతికినంత కాలం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి’ అనేది ఇప్పటి లక్ష్యం. వయసును ఆపడం ఎవరి చేతిలోనూ లేదు. కానీ వయసుతో పాటు ఆరోగ్యాన్ని, చురుకుదనాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే కొంతవరకు ఉంటుంది. మంచి ఆహారం, క్రమంతప్పని వ్యాయామం, తగినంత నిద్ర, నడక, ప్రకృతితో అనుబంధం, మానసిక ప్రశాంతత– ఇవి ఇప్పుడు అందమైన రూపం కోసం మాత్రమే కాదు, ఆనందభరితమైన, చురుకైన జీవితాన్ని కొనసాగించడానికి అవసరమైన అలవాట్లు.లక్ష్యం కేవలం ఎక్కువ రోజులు జీవించడం కాదు. బతికినంత కాలం మన పనులను మనమే చేసుకునేంత ఆరోగ్యంగా ఉండటం. అరవైలోనూ ఇరవైలా ఇష్టమైన ప్రయాణాలు చేయగలగాలి. డెబ్బై వచ్చినా మనకు నచ్చిన పనులు మనమే చేసుకోగలగాలి. అందుకు శరీరం సహకరించగలిగేలా చూసుకోవాలి. మనసు ఉత్సాహంగా ఉండాలి. అందుకే ఆరోగ్యం ఇప్పుడు అనారోగ్యం వచ్చిన తర్వాత చూసుకునే విషయం కాకుండా ప్రతిరోజూ నిర్మించుకునే జీవన విధానంగా మారాలి.అనుబంధాలకు అగ్రతాంబూలంమన చుట్టూ చాలామంది ఉంటారు. మనసు విప్పి మాట్లాడగలిగే వారు ఎంతమంది? మనపై ప్రేమ కురిపించేవారెందరు? అందుకే పెద్ద పెద్ద వేడుకలు, హడావుడి కార్యక్రమాల కంటే సమయం దొరికినప్పుడల్లా కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం, ఫ్రెండ్స్‌తో కాసేపు మాట్లాడటం, సాయంత్రం సరదాగా కలిసి నడవడం వంటి చిన్న చిన్న క్షణాలకు విలువ పెరుగుతోంది. సంతోషకరమైన జీవితం కావాలంటే ఎప్పుడూ ఖర్చుతో కూడిన వినోదాలే అవసరం లేదు. మనసును తాకే చిన్న ఆత్మీయత చాలాసార్లు పెద్ద ఆనందాన్ని ఇస్తుంది. సోషల్ మీడియాలో వందల మందితో కనెక్ట్ అయినా, మనస్ఫూర్తిగా మాట్లాడేందుకు సమయం లేకుండా పోతున్న తరుణంలో తక్కువ మంది సన్నిహితులు, గాఢమైన అనుబంధం అనే ఆలోచనకు ఈ ట్రెండ్ కొత్త ఉత్తేజాన్నిస్తోంది.ప్రయాణం పదిలం!ప్రయాణం అంటే ఇప్పుడు కేవలం కొత్త ప్రదేశాలను చూసి తిరిగి రావడం కాదు. కొత్త మనుషులను కలవడం, కొత్త సంస్కృతిని తెలుసుకోవడం, ప్రకృతిని ఆస్వాదించడం, మన ఆలోచనలను మార్చే అనుభవాలను పొందడం కూడా ప్రయాణంలో భాగమవుతోంది. ఒక మంచి ప్రయాణం ముగిసిన తర్వాత మన దగ్గర కొన్ని చిత్రాలు మాత్రమే కాదు, కొన్ని జ్ఞాపకాలు, కొన్ని కథలు, కొన్ని కొత్త ఆలోచనలు మిగలాలి.కొన్నిసార్లు ఖరీదైన టూర్ కంటే ఓ ప్రశాంతమైన ఉదయం, సముద్రపు అలల చప్పుడు, కొండల మధ్య నడక మనసుకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి. కొన్నిసార్లు ఫోన్ పక్కన పెడితేనే ప్రయాణం మొదలవుతుందనేది వందశాతం నిజం. ఎందుకంటే ప్రతి క్షణాన్ని కెమెరాలో బంధించాలనే ఆలోచనను పక్కనపెట్టి, ఒక్కసారి కళ్లతో చూసి మనసులో దాచుకుంటే ఆ అనుభవం మరింత ప్రత్యేకంగా అనిపిస్తుంది. ‘ప్రయాణం ముగిసేది మనం ఇంటికి చేరుకున్నప్పుడు కాదు, ఆ ప్రయాణం మనలో ఒక జ్ఞాపకంగా మిగిలినప్పుడు.’ట్రెండ్ సెట్ చేద్దామనుకుంటూ...వందేళ్లు బతకాలనే లక్ష్యంతో రోజూ పొద్దున్నే చేదు జ్యూస్‌లు తాగుతూ, ఆపిల్ సైడర్ వెనిగర్‌తో రోజు ప్రారంభించేవారు ఉంటారు. విడ్డూరమేంటంటే, అలా తాగేటప్పుడు వాళ్ల మొహం చూస్తే వందేళ్లు కాదు కదా, ఈ ఐదు నిమిషాలు బతికితే చాలు అనేలా ఎక్స్ప్రెషన్ పెడతారు. ప్రశాంతత కోసం హిమాలయాలకు వెళ్లిన వాళ్లు కూడా, అక్కడ ‘మ్యాగీ తింటూ రీల్స్ చేయడం’ మర్చిపోరు.హెల్దీ లైఫ్ కోసం కొన్న ఫిట్నెస్ బ్యాండులు రోజూ పదివేల అడుగులు వేయమని అలారమ్‌లు మోగిస్తుంటే, వాటిని ఇంట్లో ఆడుకునే పిల్లల చేతికి కట్టేసి కామ్‌గా టీవీ చూసే మహానుభావులు మన మధ్యే కనిపిస్తారు.ఒకప్పుడు ఫ్రెండ్స్ కలవడమంటే కలిసి టీ కొట్టు దగ్గర గంటలు గడపడం. కానీ నేటి రిలాక్స్డ్ సోషియబిలిటీ రూమ్‌లో అందరూ పక్కపక్కనే కూర్చుని, ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా రీల్స్ షేర్ చేసుకోవడం.‘మన మందరం కలిసి ఈ వీకెండ్ ట్రిప్ వెళ్లాలి’ అని వాట్సాప్ గ్రూప్‌లో ప్లాన్ వేయడమే అసలైన ఎంజాయ్మెంట్. ఆ ట్రిప్ ఎప్పటికీ క్యాన్సిల్ అవుతుందని గ్రూప్‌లో ఉన్న ప్రతీ ఒక్కరికీ తెలుసు!ఈరోజు నాకు ప్రశాంతత కావాలి, ఈ టైమ్ నాది అని ఫోన్ సైలెంట్లో పెట్టి డోర్ వేసుకుంటారు. కానీ సరిగ్గా 2 నిమిషాల్లో ‘ఎవరైనా మెసేజ్ చేశారేమో, నోటిఫికేషన్లు వచ్చాయేమో’ అని ఫోన్ అన్ లాక్ చేసి మరీ చూస్తుంటారు.బాత్ రూమ్‌లో షవర్ కింద నిలబడి జీవిత పాఠాల గురించి ఆలోచించే ఆ పదిహేను నిమిషాలే నేటి మానవుడికి దొరికే తనదైన సమయం.‘జీవితంలో కొత్త అనుభవం కావాలి, నన్ను నేను వెతుక్కోవాలి‘ అని కొండలు, కోనలు ఎక్కడానికి సోలో ట్రిప్‌లు వేస్తారు. తీరా అక్కడ కొండ కొనకి వెళ్లాక వెతికేది ‘తనను తాను’ కాదు, ఫోన్ లో ‘సిగ్నల్ వస్తుందా లేదా‘ అని!మనకంటూ మనదైన సమయంఅందరి కోసం పరుగెడుతూ, మనల్ని మనం మర్చిపోవద్దు. కుటుంబం కోసం, పిల్లల కోసం, ఉద్యోగం కోసం, బాధ్యతల కోసం– ఇలా అందరి కోసం సమయం కేటాయిస్తున్నాం. కానీ మన కోసం మనం ఎంత సమయం కేటాయించు కోగలుగుతున్నాం? పుస్తకం చదవడానికి కావచ్చు, సంగీతం వినడానికి కావచ్చు, నిశ్శబ్దంగా కూర్చోవడానికి కావచ్చు, ఇష్టమైన పని చేసుకోవడానికి కావచ్చు– రోజులో కొంత మనదైన సమయం మనకంటూ ఉండాలి.మనల్ని మనం చూసుకోవడం స్వార్థం కాదు. మనసు అలసిపోకుండా చూసుకోవడం. మన మనసుకు నచ్చిన పని చేసేందుకు, విశ్రాంతి తీసుకునేందుకు, మన గురించి మనం ఆలోచించేందుకు కాసేపు సమయం కేటాయించడం. ఇందులో పెద్ద లక్ష్యాలేమీ ఉండవు. మనసుకు కాస్త ఊరటనివ్వడమే లక్ష్యం. రోజులో గంటల సమయం అవసరం లేదు. పది నిమిషాలైనా మన కోసం కేటాయిస్తే, ఆ రోజు మనదిగా అనిపిస్తుంది. అందరి కోసం పరుగెత్తే జీవితంలో ఒక్కసారి మన కోసం ఆగడం కూడా అవసరమే!ప్రశాంతతకే ప్రాధాన్యంఇంతకు ముందు ఎంత లగ్జరీగా ఉంటే అంత సౌకర్యంగా, సంతోషంగా ఉంటారు అనే ఒక భావన ఉండేది. ఇల్లు నిండా వస్తువులు ఉంటేనే జీవితం సంతోషంగా ఉంటుందని లేదు. అవసరమైనవి మాత్రమే ఉంచుకోవడం, ఉపయోగించని వస్తువులను తగ్గించడం, ఉన్నవాటిని విలువగా ఉపయోగించడం ఇప్పుడు కొత్త జీవన విధానంలో భాగమవుతోంది. తక్కువ వస్తువులు అంటే తక్కువ జీవితం కాదు. తక్కువ గందరగోళంలో ఎక్కువ ప్రశాంతత.దుస్తులు, అలంకరణ వస్తువులు, ఇంటి సామగ్రి, ఉపయోగించని పరికరాలు– ఇలా అవసరంలేని వాటిని తగ్గించుకుంటూ సరళమైన జీవితం వైపు అడుగులు వేస్తున్నారు. ఇది కేవలం వస్తువులను తగ్గించుకోవడం కాదు. మన సమయాన్ని, మన డబ్బును, మన శక్తిని ఎక్కడ ఉపయోగించాలో ఎంచుకోవడం. ఇల్లు వస్తువులతో నిండిపోవడం కంటే మనసుకు ప్రశాంతంగా ఉండటం ముఖ్యమనే ఆలోచన పెరుగుతోంది. తక్కువ వస్తువులు, తక్కువ గందరగోళం, తక్కువ ఖర్చు, ఎక్కువ స్వేచ్ఛ.ఆహార శ్రద్ధతోనే ఆరోగ్యంఆహారం విషయంలోనూ కొత్త ఆలోచనలు కనిపిస్తున్నాయి. రుచితో పాటు అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా తయారైంది? శరీరానికి ఎంత ఉపయోగం? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇంటివంట, స్థానికంగా లభించే పదార్థాలు, కాలానుగుణంగా లభించే పండ్లు, కూరగాయలు, తక్కువగా తయారుచేసిన ఆహారం వంటి వాటికి ప్రాధాన్యం పెరుగుతోంది. ‘కడుపు నిండితే చాలు’ అనే ఆలోచన నుంచి ‘శరీరానికి మేలు చేసే ఆహారం కావాలి’ అనే ఆలోచన వైపు మార్పు కనిపిస్తోంది.ఫాస్ట్‌ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌కు బదులుగా ఇంటివంట, తాజా కూరగాయలు, పండ్లు, పప్పులు, చిరుధాన్యాలు, సంప్రదాయ ధాన్యాలు, స్థానికంగా లభించే పదార్థాలు వంటి వాటిపై ఆసక్తి పెరుగుతోంది. అంటే ఇప్పుడు ఆహారం అనేది కేవలం ఆకలి తీర్చేది మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని నిర్మించే రోజువారీ పెట్టుబడి అనే భావన నవతరంలో బలపడుతోంది. రుచిని వదులుకోకుండా, ఆరోగ్యాన్ని కూడా దృష్టి్టలో పెట్టుకుని తినడం నేటి జీవనశైలిలో ముఖ్యమైన మార్పుగా మారుతోంది.జీవితం పరుగు పందెం కాదుఅందరి కంటే ఎక్కువ సంపాదించాలి, అందరికన్నా మనమే ముందుండాలి అనే ఆలోచనతో పరుగులు పెడుతూనే ఉన్నాం. అదే మనల్ని, మన ఆరోగ్యాన్ని ప్రమాదపుటంచుల్లోకి తీసుకెళ్తోంది. మంచి ఉద్యోగం, డబ్బు, పేరు మాత్రమే విజయం కాదు. ఆరోగ్యంగా ఉండటం, మనకు నచ్చిన వారితో సమయం గడపడం, మనసుకు నచ్చిన జీవితం గడపడం కూడా విజయమే! జీవితమేమీ పరుగు పందెం కాదు, ప్రతి రోజూ గెలవాల్సిన పనిలేదు. రోజులో కొన్ని క్షణాలనైనా ఆనందంగా ఆస్వాదించడమే అసలైన జీవితం. జీవితాన్ని తర్వాత ఎప్పుడో ఆస్వాదిద్దాం అనుకుంటూ ఉంటే, ఆ ‘తర్వాత’ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు.సాంకేతిక పరిజ్ఞానం మన చేతుల్లోకి వచ్చిన కొద్దీ జీవితం మరింత సులభతరంగా, మరింత వేగవంతంగా మారింది. కానీ అదే సమయంలో నిశ్శబ్దం, విశ్రాంతి, ప్రకృతి, కుటుంబం, ఆరోగ్యం, వ్యక్తిగత సమయం వంటి వాటి విలువ కూడా మనకు మరింత స్పష్టంగా తెలుస్తోంది. అందుకే 2026 జీవనశైలి ఒక విచిత్రమైన మలుపులో నిలిచింది. ఈతరం పనుల్లో వేగాన్ని కోరుకుంటూనే, జీవితంలో నిదానానికి ప్రాధాన్యమిస్తోంది. సౌకర్యాలను ఆస్వాదిస్తూనే, సరళత వైపు అడుగులు వేస్తోంది. సాంకేతికతను అక్కున చేర్చుకుంటూనే, దాని నుంచి కొంత దూరం కావాలని కోరుకుంటోంది.కొత్తదనం కోసం కొత్తగా ప్రయత్నించక్కర్లేదు, ముందు ఆన్లైన్ చెత్తను డంప్ చేస్తే చాలు. జీవితం దానంతట అదే కొత్తగా అనిపిస్తుంది!- రమా జంబులఇదీ చదవండి: డాటర్ ఇన్లా మదర్ -
అందం కోసం సరికొత్త టెక్నాలజీ.. పూర్వీకుల పద్ధతులు కూడా భలే!
ఒకప్పుడు పింపుల్స్ వస్తే తెగ టెన్షన్ పడిపోయేవారు. కానీ నేటితరం వాటిని ఒక ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సరిగ్గా ఈ మైండ్‌సెట్‌ను క్యాచ్ చేస్తూ, నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ స్కిన్ కేర్ బ్రాండ్ ఫేవ్స్ ఒక సూపర్ కూల్ ప్రొడక్ట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. అదే... ‘క్లారిఫైయింగ్ ఎల్ఈడీ ప్యాచ్ ’. క్యాట్ షేప్, బ్రైట్ ఆరెంజ్ షేడ్‌లో ఉండి, సరికొత్త టెక్నాలజీతో రూపొందించిన ఈ డివైజ్ మొటిమలను తగ్గించడంలో సమర్థంగా పనిచేస్తుంది.ఈ పరికరంలో రెండు రకాల ఎల్ఈడీ లైట్లు (బ్లూ, రెడ్) ఉంటాయి. బ్లూ లైట్ మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపివేస్తుంది. రెడ్ లైట్ పింపుల్స్ వల్ల వచ్చే ఎరుపుదనం, మంట, వాపును తగ్గించి చర్మాన్ని కూల్‌గా ఉంచుతుంది. ఈ రెండింటి కాంబినేషన్ వల్ల మొటిమలు తగ్గడమే కాకుండా చర్మ రంధ్రాల పరిమాణం తగ్గి, స్కిన్ గ్లోయింగ్‌గా, స్మూత్‌గా మారుతుంది.మెరిపించే ఆల్మండ్..జుట్టు సంరక్షణకు అత్యంత ప్రభావవంతమైన సహజ నూనెల్లో బాదం నూనె ఒకటి. ఇందులో ఉండే విటమిన్ ‘ఇ’, బయోటిన్ కుదుళ్లను దృఢంగా మార్చి, జుట్టు రాలడాన్ని తగ్గించి వేగంగా పెరిగేలా చేస్తాయి. ఈ నూనె జుట్టు పొడిబారడాన్ని నివారించి, చిక్కులు పడకుండా సిల్కీగా, మెరిసేలా చేస్తుంది.అలాగే ఇందులోని యాంటీఫంగల్ గుణాలు తలలో వచ్చే చుండ్రు, దురదను తగ్గిస్తాయి. బాదం నూనె మంచి కండిషనర్‌గా కూడా పనిచేస్తుంది. గోరువెచ్చని నూనెను తలకు పట్టించి.. రాత్రంతా అలాగే ఉంచి మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.ఏనుగు దంతాలే దువ్వెనలు!ప్రాచీన కాలంలో ప్లాస్టిక్ దువ్వెనలు లేవు. ఆ రోజుల్లో సహజ సిద్ధమైన పదార్థాలతో తయారుచేసిన దువ్వెనలను మాత్రమే వాడేవారు. రాజుల కాలంలో రాజకుటుంబాలు ఏనుగు దంతాలు లేదా ఎద్దుల కొమ్ములతో తయారు చేసిన దువ్వెనలను ఉపయోగించేవారు. జుట్టును దువ్విన తర్వాత దాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేకమైన ముడులు వేసుకునేవారు.సామాన్య ప్రజలు వేప, గంధపు చెక్కతో చేసిన దువ్వెనలను ఉపయోగంచేవారు. వీటివల్ల తలలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు, చుండ్రు రాకుండా ఉండేవి. ఆవునేతిని మూలికలతో కలిపి కాచి జుట్టుకు పట్టించేవారు. జుట్టుకు సహజమైన సువాసన లభించేందుకు సంపెంగ, మల్లె, గులాబీ పువ్వులను జడలో తురుముకునేవారు.ఇదీ చదవండి: ఎగరలేని రామచిలుక కోసం.. యజమాని ఐడియా ఇప్పుడు వైరల్! -
ఎగరలేని రామచిలుక కోసం.. యజమాని ఐడియా ఇప్పుడు వైరల్!
రెక్కలు దెబ్బతింటే పక్షి ఎగరడం కష్టమే. కానీ ఈ రామచిలుక విషయంలో మాత్రం అలా జరగలేదు. యజమాని చేసిన ఓ అద్భుత ప్రయత్నంతో రెక్కలు పనిచేయకపోయినా.. అది మళ్లీ ఆకాశంలోకి ఎగరగలుగుతోంది.ఫిలిప్పీన్స్‌లోని డవావో నగరంలో మార్క్ జోసెఫ్ కొలాండో అనే వ్యక్తి ముచ్చటగా ఒక పంచవన్నెల రామచిలుకను పెంచుకుంటున్నాడు. ఒకనాడు రామచిలుకపై ఒక పిల్లి దాడిచేసింది. పిల్లి దాడిలో రామచిలుక రెక్కలు రెండూ దెబ్బతిన్నాయి. అప్పటి వరకు స్వేచ్ఛగా ఎగరగలిగే రామచిలుక ఎగరలేని స్థితిలో మూలపడింది.తన రామచిలుకను ఎగరలేని స్థితిలో చూసి మార్క్ కలత చెందాడు. గాయపడ్డ చిలుక తిరిగి ఎగరడానికి ఏదైనా చేయాలని తలచాడు. అప్పుడే అతడికి అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నుంచే ఈ డ్రోన్ రూపుదిద్దుకుంది. ఈ డ్రోన్‌కు రామచిలుక సౌకర్యంగా కూర్చునేలా ప్లాస్టిక్ క్యాబిన్‌ను అమర్చాడు. ఇప్పుడు ఈ రామచిలుక డ్రోన్‌కు అమర్చిన క్యాబిన్లో చక్కగా కూర్చుని, డ్రోన్ రెక్కల సాయంతో మళ్లీ ఎగరగలుగుతోంది.ఇదీ చదవండి: పూల రారాణి గులాబీ.. ప్రపంచాన్ని ఎలా చుట్టేసిందో తెలుసా? -
లంచ్ లేదా స్నాక్.. ఈ నాలుగు రెసిపీల్లో ఏది చేసినా టేస్టే!
రోజూ చేసే వంటలతో బోర్ కొట్టిందా? అయితే కాస్త వెరైటీగా, రుచిగా ఉండే ఈ నాలుగు వంటకాలను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి. క్రిస్పీ ఆలూ సూజీ పూరీ నుంచి నోరూరించే భర్వాన్ కరేలా వరకు.. ఒక్కో వంటకం ఒక్కో ప్రత్యేక రుచిని అందిస్తుంది.క్రిస్పీ ఆలూ సూజీ పూరీకావలసినవి..బంగాళాదుంపలు: 2,సూజీ రవ్వ: కప్పు,గోధుమపిండి: అర కప్పు,పచ్చిమిర్చి: 2,కొత్తిమీర: కొద్దిగా,కారం: హాఫ్ టీస్పూన్,జీలకర్ర: హాఫ్ టీస్పూన్,ఉప్పు: తగినంత,నూనె: వేయించడానికి.తయారీ..- ఉడికించిన బంగాళాదుంపలను మెత్తగా చేసి, రవ్వ, గోధుమపిండి, తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, కారం, జీలకర్ర, ఉప్పు వేసి కలపాలి.- కొద్దికొద్దిగా నీరు పోస్తూ గట్టిగా పిండిని కలిపి 10 నిమిషాలు నాననివ్వాలి.- చిన్న ఉండలు చేసి పూరీల్లా ఒత్తాలి.- వేడినూనెలో మీడియం ఫ్లేమ్‌పై రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.- వేడివేడిగా ఆలూ కర్రీ లేదా పెరుగుతో వడ్డిస్తే రుచిగా ఉంటుంది.ఖర్ వాంగ్..కావలసినవి..వంకాయలు: 6,వేరుశెనగలు: అర కప్పు,నువ్వులు: 2 టేబుల్‌స్పూన్లు,ధనియాలు: టేబుల్ స్పూన్,జీలకర్ర: టీస్పూన్,పచ్చిమిర్చి: 2,వెల్లుల్లి: 5 రెబ్బలు,అల్లం: చిన్న ముక్క,ఎండుకొబ్బరి: కొద్దిగా,ఉప్పు, పసుపు,కారం: తగినంత,నూనె: 2 టేబుల్‌స్పూన్లు.తయారీ..- వేరుశెనగలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, కొబ్బరిని వేయించి పొడిగా చేసుకోవాలి.- వంకాయలను మధ్యలో చీల్చి ఈ మసాలాను నింపాలి.- బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, కరివేపాకు, పసుపు వేసి వంకాయలను జాగ్రత్తగా ఉంచాలి.- కొద్దిగా నీరు పోసి మూత పెట్టి మెత్తగా ఉడికించాలి.- చివర్లో మిగిలిన మసాలా, ఉప్పు, కారం వేసి మరో ఐదు నిమిషాలు ఉడికిస్తే మంచి రుచితో ఖర్ వాంగ్ సిద్ధం.ఆలూ కుల్ఫీ సమోసాకావలసినవి..సమోసా షీట్లు: 6,ఉడికించిన బంగాళాదుంపలు: 2,పచ్చిమిర్చి: 2,కొత్తిమీర: కొద్దిగా,కారం: హాఫ్ టీస్పూన్,గరం మసాలా: హాఫ్ టీస్పూన్,జీలకర్ర: హాఫ్ టీస్పూన్,ఉప్పు: తగినంత,నూనె: వేయించడానికి.తయారీ..- ఉడికించిన బంగాళాదుంపలను మెత్తగా చేసి పచ్చిమిర్చి, కొత్తిమీర, కారం, గరం మసాలా, జీలకర్ర, ఉప్పు కలపాలి.- సమోసా షీట్‌ను కుల్ఫీ ఆకారంలో చేసి, ఆలూ మిశ్రమాన్ని నింపి అంచులను చక్కగా మూసివేయాలి.- వేడినూనెలో మీడియం ఫ్లేమ్‌పై బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.- అంతే వేడివేడి ఆలూ కుల్ఫీ సమోసా రెడీ! వీటిని టొమాటో సాస్ లేదా పుదీనా చట్నీతో తింటే రుచికరంగా ఉంటాయి.భర్వాన్ కరేలా..కావలసినవి..కాకరకాయలు: 5,ఉల్లిపాయలు: 2,వేరుశెనగ పొడి: 2 టేబుల్‌స్పూన్లు,ధనియాల పొడి: టీస్పూన్,కారం: టీస్పూన్,పసుపు: కొద్దిగా,ఆమ్చూర్ పొడి: హాఫ్ టీస్పూన్,ఉప్పు: తగినంత,నూనె: 2 టేబుల్‌స్పూన్లు.తయారీ..- కాకరకాయలను శుభ్రంగా కడిగి మధ్యలో చీల్చి గింజలు తీసేయాలి.- ఉల్లిపాయలు, వేరుశెనగ పొడి, ధనియాల పొడి, కారం, పసుపు, ఆమ్చూర్, ఉప్పు కలిపి మసాలా సిద్ధం చేసుకోవాలి.- ఈ మసాలాను కాకరకాయల్లో నింపాలి.- బాణలిలో నూనె వేడి చేసి కాకరకాయలను వేసి మూతపెట్టి తక్కువ మంటపై మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి.- మధ్యమధ్యలో తిప్పుతూ బంగారు రంగు వచ్చే వరకు వేయిస్తే రుచికరమైన భర్వాన్ కరేలా సిద్ధం.ఇదీ చదవండి: సూపర్మార్కెట్లో కూరగాయలపై నీళ్లు ఎందుకు చల్లుతారో తెలుసా? -
ఇంట్లోనే కుట్టు పని.. ఈ చిట్టి గాడ్జెట్లు ఉంటే చాలు!
చిన్న కుట్టు ఊడినా.. బటన్ ఊడిపోయినా.. టైలర్ షాప్ వరకు పరుగెత్తాల్సిందేనా? ఇక ఆ అవసరం లేదు. దుస్తులకు ఎదురయ్యే ఇలాంటి చిన్న చిన్న సమస్యలను ఇంట్లోనే చిటికెలో చక్కబెట్టుకునే చిట్టి గాడ్జెట్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. చేతిలో పట్టుకునేంత చిన్నగా ఉండే వీటితో కుట్టు వేయడం నుంచి బటన్ సెట్ చేయడం వరకు పనులు ఈజీగా చేసుకోవచ్చు. మరి ఆ గాడ్జెట్లు ఏంటి? వాటిని ఎలా ఉపయోగించాలి? వాటి ధర ఎంత? తెలుసుకుందాం..కుట్టు పనికి.. షార్ట్‌కట్!పెద్ద పెద్ద వీఐపీల రికమెండేషన్స్ కూడా పనిచేయని ప్లేసుల్లో టైలర్ షాప్ ఒకటి. చిరుగు చిన్నదే అయినా, దాన్ని సరిచేయడానికి ఏడాదైనా సరిపోదు. అందుకే, దుస్తులకు ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను చిటికెలో చక్కబెట్టే ఈ చిట్టి గాడ్జెట్లు ఇప్పుడు మీకోసం!చేతిలో చిట్టి టైలర్!బట్ట చిరిగితే టైలర్ షాపుకి పరుగెత్తడం, చిన్న కుట్టు ఊడితే సూది దారం కోసం ఇల్లంతా వెతకడం వంటి కష్టాలకు కాస్త సెలవివ్వండి. చూడటానికి అచ్చం స్టేప్లర్లా ఉండే ఈ మినీ హ్యాండ్ కుట్టు మిషన్, ఇప్పుడు చిన్నపాటి కుట్టుపనులను చకచకా చక్కబెట్టేస్తుంది. పైగా ఇందుకోసం కరెంట్ అవసరం లేదు. బ్యాటరీలు మార్చే టెన్షన్ లేదు... చేతితోనే నడిపించేయొచ్చు.షర్టులు, ప్యాంట్లు, కర్టెన్లు వంటి దుస్తుల్లో చిన్న చిరుగులు, ఊడిన కుట్లు వంటివాటిని సరిదిద్దుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. కాటన్ , లినెన్ వంటి పలచని వస్త్రాలకు కూడా అనువుగా ఉంటుంది. సైజులో చిన్నదే కాబట్టి బ్యాగులో వేసుకుని బయటకూ తీసుకెళ్లొచ్చు. ధర కేవలం రూ.300 మాత్రమే!బలన్ సెటిల్మెంట్! దుస్తుల బటన్ ఊడిందంటే చాలు. ఇక ఆ దుస్తులతో విడాకులు తీసుకుంటా అంటూ మొండిగా మారకండి! కాస్త దానికొక అవకాశం ఇవ్వండి. ఇందుకోసం పెద్దగా కష్టపడకుండా, ఒక్క క్లిక్ చేస్తే బటన్ సెట్ అయిపోతుంది. ఎందుకంటే, ఇప్పుడు ఈ మెటల్ స్నాప్ బటన్ కిట్‌తో కేవలం ఒక్క క్లిక్ చేస్తే చాలు. వెంటనే, బటన్ సెట్ చేసుకోవచ్చు. స్నాప్ బటన్లను బిగించేందుకు ప్రత్యేక ప్లయర్‌తో వచ్చే ఈ కిట్‌లో వంద సెట్ల బటన్లు ఉన్నాయి.షర్ట్స్, బేబీ డ్రెస్లులు, బట్ట సంచులు, బొమ్మల దుస్తులు, చేతిపనుల అలంకరణలు– ఇలా వస్త్రాలతో చేసే ఎన్నో పనుల్లో ఉపయోగించుకోవచ్చు. రాగితో తయారైన బటన్లు మన్నికగా ఉండేలా రూపొందించారు. చేతిలో పట్టుకునే ప్లయర్కు జారిపోకుండా పట్టుకునే పట్టు ఉండటంతో బటన్ ను సరిగ్గా అమర్చుకోవచ్చు. అయితే మొదటిసారి ఉపయోగించే ముందు పాత బట్ట ముక్కపై ఒకసారి ప్రయత్నిస్తే మంచిది. ధర రూ. 300 మాత్రమే.చిన్నబోతే... బుజ్జగిస్తుంది! జీన్స్ కొనేటప్పుడు పర్ఫెక్ట్గా ఉంది... రెండు నెలలు గడిచేసరికి మీ జీన్స్, ‘నడుము సైజ్‌కు నాకు ఏ మాత్రం ఇక కుదరదు!’ అన్నట్టు దూరంగా పోతుందా? ఈ సమస్యకు పరిష్కారమే ఈ డెనిమ్ బటన్ క్లిప్ కిట్. కుట్టు అవసరం లేకుండానే బటన్ ను సులభంగా అమర్చుకుని జీన్స్, ప్యాంట్లు, స్కర్ట్స్, షార్ట్స్, జాకెట్లు వంటి వాటి నడుము పరిమాణాన్ని అవసరానికి తగ్గట్టు సర్దుకోవచ్చు. ప్రత్యేకమైన పట్టుకునే విధానంతో బటన్ బిగుతుగా ఉండేలా రూపొందించారు. పైగా ఎనిమిది బటన్ ప్యాకేజ్ కావడంతో ఒకటి పోయినా, ఇంకొకటి ఊడిపోయినా ‘అయ్యో! ఇప్పుడు ఏం చేయాలి?’ అనే బాధ ఉండదు! మెటల్‌తో తయారైన ఈ బటన్లు రోజువారీ వాడకానికి అనువుగా ఉంటాయి. అందుకే, ఇకపై నడుము సైజ్ పెరిగిందని జీన్స్‌తో గొడవ పడకుండా, బటన్ తోనే రాజీ చేసుకోండి! ధర కేవలం రూ.250 మాత్రమే.ఇదీ చదవండి: బట్టతల వచ్చిందా? స్టయిల్ మార్చండి.. లుక్ అదిరిపోవాల్సిందే! -
అందరికంటే నేనే గొప్ప అనుకుంది.. చివరికి ఇలా అయింది!
పల్లమాల గ్రామంలో చెంగయ్య, బంగారమ్మ అనే రైతు దంపతులు ఉండేవారు. చెరువు కింద ఉన్న మూడు ఎకరాల మాగాణిలో వారు ఎంతో కష్టపడి వ్యవసాయం చేసేవారు. నాగలి, కాడి, పట్ర, పార, కొడవలి వంటి వ్యవసాయ పనిముట్లను పని ముగిసిన తర్వాత శుభ్రం చేసి ఒక గదిలో భద్రంగా ఉంచేవారు.రాత్రిళ్లు ఆ పనిముట్లన్నీ తమ యజమాని గురించి మాట్లాడుకునేవి. ‘మన రైతు కష్టానికి తగిన ఫలితం రావాలి’ అని అన్నీ కోరుకునేవి. కానీ కాడికి మాత్రం గర్వం ఎక్కువ. ‘నాగలి, ఎద్దులు ఉన్నా నేను లేకుండా పొలం దున్నలేరు. అందరిలో ముఖ్యమైనది నేనే!’ అని విర్రవీగేది.అప్పుడు పట్ర నవ్వుతూ, ‘బంగారమ్మ నీకే పసుపు రాసి బొట్టు పెట్టి నమస్కరిస్తుంది. నీ విలువ అందరికంటే ఎక్కువ కదా!’ అని అంది.‘అది నాకిచ్చే గౌరవం కాదు. ఎద్దుల మెడకు గాయాలు కాకూడదనే వారి జాగ్రత్త అంతే!’ అని కాడి నిర్లక్ష్యంగా జవాబిచ్చింది.మిగతా పనిముట్లన్నీ రైతు కష్టం, పంటల గురించి మాట్లాడుతుంటే, కాడి మాత్రం, ‘ఇకపై కష్టపడను. ఎప్పటికీ ఈ గదిలో హాయిగా విశ్రాంతి తీసుకునే ఉపాయం నాకు తెలుసు, తొందరలో చేసి చూపిస్తాను’ అని చెప్పింది.ఒక రోజు కాడి దుక్కి దున్నుతున్న సమయంలో ముందు చెప్పినట్లే చేసింది. కావాలనే రెండుగా విరిగి పోయింది. చెంగయ్య దానిని గదిలో పెట్టి, కొత్త కాడిని తయారు చేయించుకున్నాడు. ‘ఇప్పుడు నాకు శ్రమ లేదు!’ అని కాడి సంతోషపడింది. కానీ మిగతా పనిముట్లు దాని మూర్ఖత్వానికి బాధపడ్డాయి.కొన్ని రోజుల తర్వాత భోగి పండుగ వచ్చింది. భోగి పండుగ రోజు చెంగయ్య, ‘ధనయ్యా! గదిలో ఉండే విరిగిన కాడిని తీసుకురా. భోగి మంటలో వెయ్యి, బాగా మండుతుంది’ అన్నాడు.ధనయ్య కాడిని భోగి మంటల్లో వేశాడు. మంటలు ఎగసి పడుతుండగా, గర్వంతో పని చేయకుండా తప్పించుకోవాలని చూసిన కాడి తన తప్పు తెలుసుకుంది. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. మంటల్లో కాలిపోతున్న దాన్ని చూసి మిగిలిన పనిముట్లన్నీ మౌనంగా బాధపడ్డాయి. అలా కాడి అలిగింది. భోగిలో కాలింది.- పేరూరు బాలసుబ్రమణ్యంఇదీ చదవండి: ఇంటర్వ్యూలో సెలెక్ట్.. కానీ ఉద్యోగం ఇవ్వలేదు! కారణం తెలిస్తే షాకే! -
పూల రారాణి గులాబీ.. ప్రపంచాన్ని ఎలా చుట్టేసిందో తెలుసా?
ప్రపంచంలో గులాబీని పూల రారాణి అంటారు. గులాబీల గుబాళింపు ప్రపంచానికి సహస్రాబ్దాలుగా తెలుసు. భూమ్మీద ఉత్తరార్ధగోళంలో ఉన్న దాదాపు అన్ని దేశాలకు గులాబీలు పురాతన కాలం నుంచి తెలుసు.భారత భూభాగంలోని హిమాలయ ప్రాంతంలో గులాబీలు విరివిగా పూసేవి. మొఘల్ చక్రవర్తుల కాలంలో గులాబీలకు బాగా ఆదరణ పెరిగింది. కాకతీయుల కాలం నాటికి గులాబీలు దక్షిణ భారత ప్రాంతానికి కూడా విరివిగా విస్తరించాయి. గులాబీల గురించి మరిన్ని విశేషాలను గణాంకాల్లో...పంతొమ్మిదో శతాబ్దిలో ఇది దక్షిణార్ధగోళానికి కూడా వ్యాపించింది. ప్రాచీన గ్రీకు, రోమన్, మెసపటేమియన్ నాగరికతల ప్రజలు గులాబీ తోటలను విరివిగా పెంచేవారు. గులాబీలతో పరిమళ ద్రవ్యాల తయారీలోను, ఔషధాల తయారీలోను నాటి ప్రజలు ఉపయోగించేవారు.ఇదీ చదవండి: బట్టతల వచ్చిందా? స్టయిల్ మార్చండి.. లుక్ అదిరిపోవాల్సిందే! -
ఇంటర్వ్యూలో సెలెక్ట్.. కానీ ఉద్యోగం ఇవ్వలేదు! కారణం తెలిస్తే షాకే!
‘‘బి.కాం, ఎం.బి.ఏ. చేశాను సర్. బిజినెస్ మేనేజ్మెంట్లో నాకు ఆరేళ్ళ అనుభవం ఉంది.’’ ముప్ఫై రెండేళ్ళ అనీత్ చెప్పాడు.కంపెనీ యజమానికి అతని జవాబులు సంతృప్తిని ఇచ్చాయి. ఆయన అడిగాడు.‘‘ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు?’’జీతం మీద ఇద్దరికీ అవగాహన కుదిరాక, ఆయన ఇంటర్‌కంలో సెక్రటరీకి చెప్పాడు.‘‘అనీత్ పేరు మీద అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చే...’’ అకస్మాత్తుగా ఆయన చెప్పడం ఆపేశాడు.‘‘సరే. మళ్ళీ నీకు కబురు చేస్తాను.’’ లైన్ కట్ చేసి అనీత్‌తో చెప్పాడు.‘‘అదేమిటి సార్? నన్ను సెలెక్ట్ చేసుకున్నానని చెప్పారు?’’ అనీత్ ఆశ్చర్యంగా అడిగాడు.‘‘నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తేనే పక్కా ఐనట్లు.’’అనీత్ తనని ఆ కంపెనీకి రికమండ్ చేసిన తన మేనమామ దగ్గరకి వెళ్ళి జరిగింది వివరించి బాధగా చెప్పాడు.‘‘చివరి క్షణంలో ఆయన మనసు ఎందుకు మార్చుకున్నారో చెప్పలేదు.’’ఆయన వెంటనే బాగా మిత్రుడైన ఆ కంపెనీ యజమానికి ఫోన్ చేసి అడిగాడు.‘‘నీ దగ్గరకి అనీత్ అనే కేండిడేట్‌ని పంపించాను. ముందు సరేనని, తర్వాత వద్దన్నావుట?’’ ‘‘అవును. అతను నాకు సూటబుల్ కాదు అనిపించింది.’’‘‘అనిపించిందా? అకస్మాత్తుగా ఎందుకలా అనిపించింది?’’‘‘అతని వల్ల కంపెనీకి నష్టం వాటిల్లచ్చని గ్రహించాను.’’‘‘ఏం నష్టం?’’ అనీత్ మేనమామ అడిగాడు.‘‘మిత్రమా. వివరాలు అడక్కు.’’ ఆయన లైన్ కట్ చేసేశాడు.స్పీకర్లో ఆ సంభాషణని విన్న అనీత్ మొహం మాడిపోయింది.‘‘నావల్ల ఏం నష్టం వస్తుందట?’’ అడిగాడు.‘‘అక్కడ ఏం జరిగిందో చెప్పు.’’అనీత్ వివరించాడు. కాని ఆయనకి ఎందుకు తన మిత్రుడు విరమించుకున్నాడో బోధపడలేదు.∙∙ తన గదిలోకి వచ్చిన అనీత్ని చూసి ఆయన కరకుగా చెప్పాడు.‘‘మళ్ళీ వచ్చావా? నీకు ఉద్యోగం ఇవ్వను. మరో అభ్యర్థిని ఇంకో గంటలో ఇంటర్వ్యూ చేస్తున్నాను. గుడ్ డే.’’‘‘నావల్ల మీ కంపెనీకి ఏం నష్టం వాటిల్లవచ్చు? అది తెలుసుకోడానికే వచ్చాను. దయచేసి చెప్పండి.’’ అనీత్ అడిగాడు.‘‘నీ వ్యక్తిగత విషయాలు, దురలవాట్ల గురించి నీతో చర్చించను. గుడ్ డే అగైన్.’’‘‘ప్లీజ్ సర్. ఇది నా కెరీర్‌కి సంబంధించింది. నన్ను నేను సరిదిద్దుకునే అవకాశం ఇవ్వండి. నావల్ల మీ కంపెనీకి ఏం నష్టం వాటిల్లుతుంది? సప్లై చెయిన్ లోని నా అనుభవం విని ఇంప్రెస్ అయ్యారు. నిన్న మీరు అన్నిటికీ తృప్తి చెందినట్లుగానే కనిపించారు.’’‘‘ఈ చర్చ ఇంతటితో ముగిసింది.’’ ఆయన కఠినంగా చూస్తూ చెప్పాడు.‘‘లేదు. మీరు నాకు ఆ వివరణ ఇవ్వాలి. అది తెలుసుకునే హక్కు నాకుంది.’’ఆయన మౌనంగా బల్ల మీది మానిటర్ని చూస్తూ, మౌస్‌ని అందుకుని తన పనిని చేసుకోసాగాడు. ఐదు నిమిషాలు వేచి చూశాక అనీత్ చెప్పాడు.‘‘ఆల్రైట్. నావల్ల మీ కంపెనీకి ఎందుకు నష్టం వస్తుందో చెప్పేదాకా నేను ఇక్కడ నించి కదలను. మీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాను.’’ఆయన తన పనిని ఆపి ఏదో మాట్లాడబోయాడు. కాని ఆయన మొబైల్ మోగింది. ఆయన దాన్ని ఆన్సర్ చేసి మాట్లాడసాగాడు. అనీత్ ఓపికగా వేచి చూశాడు. దాదాపు పది నిమిషాల తర్వాత ఆ బిజినెస్ కాల్ ముగిసింది.‘‘చూడండి. ప్రతివారు తమ సంపదని రక్షించుకోవాలని అనుకుంటారు. సంపద అంటే ఆస్తిపాస్తులు, కేష్, బంగారాలే కాదు. గౌరవం కూడా. మీరు నా గౌరవానికి భంగం కలిగించారు. దాన్ని నేను కాపాడుకోవాలంటే, మీరు నాకా ఎక్స్ప్లనేషన్ ఇచ్చి తీరాలి.’’ అనీత్ కోపంగా అడిగాడు.అతని వంక నిరసనగా చూసి, ఆయన నెమ్మదిగా తన బల్ల కుడివైపు డ్రాయర్ని తెరిచి, అందులోంచి ఓ జిప్‌లాక్ కవర్ని తీసి అతని వైపు కోపంగా విసిరేశాడు. అందులో జెమ్ క్లిప్స్, గుండుసూదులు ఉన్నాయి. జెమ్ క్లిప్స్ పూర్తిగా పొడవు తీగల్లా తెరిచి ఉన్నాయి. గుండుసూదులు ‘యు’ ఆకారంలో వంచబడి ఉన్నాయి.ఆయన తను ఫోన్లో మాట్లాడేప్పుడు, అనీత్ కాలక్షేపానికి అలా చేసిన వాటిని కూడా చూపించి చెప్పాడు.‘‘నీ ఈ చెడ్డ అలవాటు చాలామంది ఉద్యోగస్తుల్లో ఉంది. నాశనం నేను సహించలేని మొదటిది. ఇది నా కంపెనీకి నష్టం కాదా? నీ ముందున్నది గంటలోపు నష్టం. ప్రభుత్వ ఆఫీసుల్లో, చాలా ప్రైవేట్ కంపెనీల్లో దీన్ని పట్టించుకోరు. నేను అలా కాదు. నీ కాలక్షేపానికి ఏడాదికి స్టేషనరీ రూపంలో ఎంత నష్టాన్ని కలిగించగలవో నువ్వే ఆలోచించు.’’- మల్లాది వెంకట కృష్ణమూర్తిఇదీ చదవండి: ఒక్కరోజూ కలిసి లేరు... విడిపోవడానికి 20 ఏళ్లు! ట్విస్ట్ ఏంటంటే? -
బట్టతల వచ్చిందా? స్టయిల్ మార్చండి.. లుక్ అదిరిపోవాల్సిందే!
‘గుండు గుండు గుండున్నర...’ అని తలపై తగ్గిన జుట్టును చూసి పాడే పాటను మరచిపోవాలంటే, తలకింద స్టయిల్ మారాలి. నిజానికి బట్టతల వచ్చిన తర్వాతే చాలామందికి స్టయిల్లో కొన్ని కొత్త దారులు తెరుచుకుంటాయి. అందుకు మీరు ఈ చిన్న చిన్న టిప్స్ ఫోలో అవ్వండి.యుద్ధం ఆపేయండి!జుట్టు పలుచబడుతూ మధ్యలో ఖాళీలు కనిపిస్తుంటే, మిగిలిన కొద్దిపాటి జుట్టును ఎలాగోలా కప్పిపుచ్చే ప్రయత్నం పలుచబడిన జుట్టును కప్పిపుచ్చడం కంటే చిన్నగా ట్రిమ్ చేయండి లేదా క్లీన్ గా షేవ్ చేయండి.గడ్డం పెంచండిబట్టతల లుక్‌లో గడ్డం చాలా బలమైన స్టయిలింగ్ టూల్. ముఖానికి ఆకారం ఇవ్వడమే కాకుండా, తల–ముఖం మధ్య మంచి విజువల్ బ్యాలెన్ ్స తీసుకొస్తుంది.సన్ గ్లాసెస్... బట్టతల లుక్‌కి బోనస్!స్టయిలింగ్‌లో సన్ గ్లాసెస్ ఒక షార్ప్ పాయింట్ ఇస్తాయి. మీ ముఖానికి సరిపోయే ఫ్రేమ్ పెట్టుకుంటే, అప్పుడు మీరు సింపుల్ టీ–షర్ట్ వేసుకున్నా, ‘కూల్’గా మారిపోతారు. అలాగే, వాచ్, చైన్ , బెల్ట్ వంటి చిన్న యాక్ససరీసే మొత్తం లుక్‌కి ఫినిషింగ్ ఇస్తాయి.క్రూ–నెక్కి ఓటేయండి!మెడ చుట్టూ ఎక్కువ ఖాళీ కనిపించకుండా చేసే నెక్‌లైన్‌లు బట్టతలను బ్యాలెన్ ్స చేస్తాయి. వీరికి లాంగ్–స్లీవ్ క్రూ–నెక్ స్వెటర్లు, బ్లేజర్లు అద్భుతంగా పనిచేస్తాయి. చాలా లోతైన వి–నెక్ కంటే క్రూ–నెక్, కాలర్ షర్ట్, లేయర్డ్ లుక్‌లు బెస్ట్. లోతైన వి–నెక్ పై ఛాతీ భాగాన్ని ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తుంది. ఇప్పటికే తల భాగం ఓపెన్ గా ఉండటంతో పై భాగంలో మరింత ఖాళీ కనిపించొచ్చు.చూపును కిందికి తీసుకెళ్లే మ్యాజిక్!లాంగ్–స్లీవ్ స్వెటర్‌పై జాకెట్, షర్ట్‌పై కార్డిగన్ , టీ–షర్ట్‌పై స్పోర్ట్స్ కోట్... ఇలా లేయర్స్ పెడితే దుస్తుల్లో టెక్స్చర్, డెప్త్ వస్తాయి. అంటే చూపు ఒక్క తలపైనే ఆగకుండా మొత్తం దుస్తుల మీదుగా కదులుతుంది. వీటికి జతగా క్రాప్డ్ లేదా కఫ్డ్ ప్యాంట్స్, బ్లాక్ లేదా బ్రౌన్ షూస్ బాగా కనిపిస్తాయి.డార్క్ రంగులే ముందు!నలుపు, చార్కోల్, నేవీ, డీప్ బ్రౌన్ , ఆలివ్ వంటి డార్క్ రంగులు బట్టతల లుక్‌కి బాగా పనిచేస్తాయి. వీటితో పాటు క్రీమ్, లైట్ బ్లూ లేదా తెలుపు వంటి రంగులను కాంట్రాస్ట్‌గా ఉపయోగించండి. అయితే, స్టయిలింగ్‌లో భుజాలు, ఛాతీ, నడుము దగ్గర సరైన ఫిట్ చాలా ముఖ్యం. చాలా బిగుతుగా కాదు. చాలా వదులుగా కాదు. మీ శరీరాకృతికి సరిపోయే దుస్తులే లుక్‌ని ఖరీదైనదిగా చూపిస్తాయి.టోపీ.. దాచడానికి కాదు! టోపీ పెట్టుకోవడం బట్టతలను దాచుకోవడానికి మాత్రమే కాదు. సరైన దుస్తులతో క్యాప్, ఫెడోరా, క్లాసిక్ హ్యాట్‌ను సందర్భానికి తగ్గట్టు యాక్సెసరీగా వాడండి. కానీ ప్రతి సందర్భంలో టోపీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక రోజు టోపీతో; మరో రోజు క్లీన్ షేవ్డ్ హెడ్‌తో... లుక్ మార్చుకుంటూ ఉండండి. చివరిగా, జుట్టు తగ్గొచ్చు... కానీ స్టయిల్ తగ్గకూడదు.ఇదీ చదవండి: అమ్మ కన్నా అందం ఏముంది? -
సైతాను సయ్యాట.. ఈ రచయిత ప్రత్యేకత ఇదే!
పోస్టల్ స్టాంపులు సేకరించే ఆసక్తి వున్న ఫిలాటెలిస్టులకు బాగా తెలిసిన పేరు ‘మాగ్యార్ పోస్ట’ హంగేరియన్ పోస్టల్ స్టాంపులను అలా పిలుస్తారు. హంగేరియన్ జాతీయులను కూడా మాగ్యార్లనడం కద్దు. యూరప్ నడిమధ్యలో, తూర్పు–పడమరలను కలిపే ప్రాంతంలో పుట్టి, నల్ల సముద్రంలో కలుస్తుంది డాన్యూబ్. ఆ నదీపరీవహక ప్రాంతం పొడుగునా విస్తరించిన దేశం హంగరీ. దాని జనాభా ప్రస్తుతం కోటికి కొంచెం అటూ–యిటూగా వుంటుంది.జాతుల కూర్పు విషయానికి వస్తే, చరిత్రకు తెలిసిన నాటినుంచి హంగరీ బహుళజాతీయ రాజ్యంగానే వుంటోంది! అదే అక్కడ సంకీర్ణ సంస్కృతి అభివృద్ధి చెందడానికి దారి తీసింది. అదే, హంగరీలో ఎందరో మహారచయితలు జన్మించి, ప్రపంచ ప్రసిద్ధి పొందడానికి సైతం కారణమయింది. పదమూడో శతాబ్దికి చెందిన సిమోన్ ఆఫ్ కేజా బహుశా వారందరిలోకీ ప్రాచీనుడు. ఇరవై ఒకటో శతాబ్ది ప్రథమ పాదం ముగియనుండగా నోబెల్ సాహిత్యపురస్కారం గెల్చుకున్న ల్యాజ్లో క్రాజ్నహార్కయ్ బహుశా ఈ తరానికి కూడా తెలిసిన బహుముఖ ప్రజ్ఞావంతుడు. ల్యాజ్లో అంటే మహారాజు, చక్రవర్తి లాంటి అర్థాలు చెప్తున్నాయి నిఘంటువులు.నవలాకారుడిగానూ, సినిమా స్క్రిప్టుల రచయితగానూ సుప్రసిద్ధుడు ల్యాజ్లో. ఆయన కొన్ని యాత్రా చరిత్రలు సైతం రాశారు. ఎవరో, ఆయన్ని వ్యాకులాత్ముడిగా చిత్రించారు– అందులో ఆవ గింజంతైనా అతిశయోక్తి లేదు! ల్యాజ్లో నవలల్లో భవిష్యత్తు మీద ఆశ కలిగించే లక్షణం దాదాపు శూన్యం. వర్తమానం పట్ల నిరాశనూ, నిర్వేదాన్నీ పెంచే ఆ క్షణమే ల్యాజ్లో నవలల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. పేరుపొందిన ఆయన నవలల జాబితాలో ‘సైతాను సయ్యాట’, ‘ప్రతిఘటన–వ్యాకులత’, ‘హోమర్ వేట’, ‘అదిగో అడుగున అమృతమూర్తి’ ప్రముఖంగా కనిపిస్తాయి. ‘నింగి నీడలో విధ్వంసం–విషాదం’ పేరిట ల్యాజ్లో తన చైనా–మంగోలియా యాత్రానుభవాలను గ్రంథస్థం చేశారు. ఈ పుస్తకాలన్నిటి గురించి చెప్పుకోవడం సాధ్యం కాదు కానీ, ల్యాజ్లో విశిష్ట రచనారీతికి ప్రాతినిధ్యం వహించే కొన్ని రచనల గురించి క్లుప్తంగానైనా ప్రస్తావించుకోవడం భావ్యమేమో!నోబెల్ సాహిత్యపురస్కారాన్ని 2025లో గెల్చుకోవడానికి 40 యేళ్ళకు ముందు ల్యాజ్లో రచించిన నవల ‘సైతాను సయ్యాట’. అదే ఆయన తొలి నవల కూడా. ఈ నవల నిత్యాధునికవాదం అనే పోస్ట్–మాడర్నిస్ట్ రచనా ధోరణికి చెందిందంటారు. ఇందులో ఇతివృత్తం (లాంటిది) ఒకటే కానీ, కథనం మాత్రం అనేక కోణాలనుంచి జరుగుతుంది. ఇది లోకానికి తెలియని కథన రీతేం కాదు– 1950లో అకిరా కురసావ రూపొందించిన ‘రషోమాన్’లోనూ ఇదే తరహా కథన రీతి కనిపిస్తుంది. దాదాపు యాభయ్యేళ్ళ తర్వాత జెర్మన్ దర్శకుడు టాం టైక్వా రూపొందించిన సినిమా ‘రన్ లోలా రన్!’లోనూ ఇదే తరహా కథనరీతి కనిపిస్తుంది.అయితే, ల్యాజ్లో ప్రత్యేకత కథనరీతిలో లేదు. లేదా, నవలలోని ప్రతి అధ్యాయాన్నీ టాంగో నృత్య ముద్రలను తలపించేలా తీర్చిదిద్దడంలోనూ లేదు. అంతకుమించి ఈ నవలను బెలా తార్ దర్శకత్వంలో ఏడుగంటల సినిమాగా రూపొందించడంలో అస్సలు లేదు– అలా చెయడంలోని సారాంశంలో ఉంది రచయిత– దర్శకుల విశిష్టత! ‘సైతాను సయ్యాట’ నవల మొత్తం ఓ పాడుపడిన పల్లెటురులో జరుగుతుంది. ఇందులో కథానాయకుడిలా ప్రవేశించిన పాత్రే నిజానికి ప్రతినాయకుడు.అతగాడే రచయిత దృష్టిలో సైతాను. వాడు చెప్పినట్లల్లా ఆడే కీలుబొమ్మల కదలికలే, అతని సయ్యాటలు. ఆ దిక్కుమాలిన పల్లెలో పడివుండే అమాయకుల్ని ఈ సైతాను మోసగించి వాళ్ళ కష్టార్జితం దోచుకుంటాడు; ఆ తర్వాత వాళ్ళు దేశాలు పట్టిపోయేలా చేస్తాడు. ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలు ఇలాంటి సైతాన్ల చేతజిక్కి వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మల్లా ఆడటం చూస్తూనే వున్నాంగా! ఈ పరిణామాన్ని నలభయ్యేళ్ళ కిందటే ఊహించడం, దాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దడం ల్యాజ్లో దార్శనికత! అదేమాట 14 సంవత్సరాల కిందటే ‘గార్డియన్’ పత్రికలో ఓ సమీక్షకుడు చెప్పాడు.ల్యాజ్లో 2019లో, హంగేరియన్ భాషలో రాసిన నవలిక ‘హోమర్ వేట.’ ఇది రెండేళ్ళ తర్వాత ఇంగ్లిషులోకి అనువాదమయింది. ప్రసిద్ధ జెర్మన్ చిత్రకారుడు మ్యాక్స్ న్యూమన్ ఈ నవలికకు బొమ్మలేశారు. నిజానికి ఈ నవలానాయకుడు ఓ అనామకుడు. ప్రాచీన కులీన జెర్మన్– పారశీకం– ల్యాటిన్– హీబ్రూ– మ్యాండరిన్– ఎనిమిదో శతాబ్ది నాటి జపనీస్ భాషల్లో ఈ అనామకుడు నిష్ణాతుడు. తనను హతమార్చడానికి తరుముకు వస్తున్న వారి నుంచి తప్పించుకుని పారిపోతున్నానంటాదు సదరు అనామకుడు.అయితే తనను తరుముతున్న వాళ్ళ రూపురేఖలను మాత్రం అతగాడు వివరించడు. మధ్యధరా సముద్రానికి ఉత్తరాది తీరం వెంబడి ఈ అనామకుడి పలాయనం సాగుతూవుంటుంది. హోమర్ ‘ఒడిస్సీ’లో ప్రస్తావించిన అగీజియా ద్వీపంగా చెప్పే ఓ దీవిలో కూడా ఈ అనామకుడి పలాయనం సాగుతుంది. (ఈ ద్వీపంలో వుండే జలదేవత క్యాలిప్సో, తనతో ఉండిపోతే అమరత్వం ప్రసాదిస్తానని యులిసెస్సుకు ఆశపెట్టిందని హోమర్ తన కావ్యం ఒడిస్సీలో పాడాడు!) ఈ నవలికకు ఇటు ప్రశంసలూ– అటు అభిశంసలూ బాగానే ప్రాప్తించాయి.శామ్యుఎల్ బెకెట్, ఫ్రాంత్జ్ కాఫ్కా, జ్షాన్ క్లాడ్ ఫాన్ డమ్మీల సాహిత్యాత్మల సంకీర్ణ సంతానంగా ఈ నవలికను అభివర్ణించింది ‘పబ్లిషర్స్ వీక్లీ.’ అయితే, ఈ నవలికను ‘పరాయీకరణ–ప్రవాసాల పోస్ట్–మాడర్న్ అధ్యయనం’గా అభివర్ణించింది కిర్కస్ రెవ్యూస్ పత్రిక ప్రశంసించింది. లోకో భిన్న రుచిః అన్నారు అందుకే!- మందలపర్తి కిషోర్ఇదీ చదవండి: అహం బ్రహ్మాస్మి: గడ్డిపరక ప్రశ్నకు.. సింహం సమాధానం ఏంటి? -
బాబు తినడం లేదా? అసలు కారణం ఇదే!
మా బాబు వయసు మూడున్నరేళ్లు. సరిగ్గా తినడం లేదు. కొంచెం తిన్న వెంటనే ఇక చాలు అంటున్నాడు. అందుకే, వయసుకు తగ్గట్టు ఎత్తు, బరువు పెరగడం లేదు అనుకుంటున్నాను. మా అబ్బాయి బాగా తినాలంటే ఏం చేయాలి?– రమణి, హైదరాబాద్.పిల్లల విషయంలో అసలు ప్రశ్న ‘ఎంత తిన్నాడు?’ అనేది కాదు ‘ఏం తిన్నాడు?’ అనేదే. పిల్లల కడుపు నిండితే సరిపోదు. మెదడు ఎదగాలి, ఎముకలు బలపడాలి, కండరాలు పెరగాలి, రోగనిరోధక శక్తి మెరుగవ్వాలి! పిల్లల పెరుగుదలకు క్యాలరీల కంటే క్వాలిటీ న్యూట్రిషన్ ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారం గురించి ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు..మెదడుకు ‘ఫ్యూయల్’ కావాలి!పిల్లల జీవితంలోని తొలి సంవత్సరాలు మెదడు అభివృద్ధికి ఎంతో కీలకం. ఈ సమయంలో ప్రొటీన్ , ఐరన్ , జింక్, అయోడిన్ , ఒమేగా–3 ఫ్యాటీ ఆసిడ్స్, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు అందేలా చూడాలి.ఐరన్ ఎంతో ముఖ్యమైనది! ఐరన్ తక్కువైతే రక్తహీనత మాత్రమే కాదు, ఏకాగ్రత, చురుకుదనం తగ్గి, నేర్చుకునే సామర్థ్యం ప్రభావితం కావచ్చు. అందుకే పప్పులు, ఆకుకూరలు, గుడ్డు, మాంసాహారం, రాగి వంటివి పిల్లల భోజనంలో చేర్చాలి. ఐరన్ ఉన్న ఆహారంతో పాటు నిమ్మ, జామ, ఉసిరి వంటి విటమిన్ –సి ఉన్న పదార్థాలు ఇస్తే ఐరన్ శరీరంలోకి బాగా చేరుతుంది.ప్రొటీన్ ఎదుగుదలకు బిల్డింగ్ బ్లాక్స్!‘బాబు బాగా తింటున్నాడు’ అనడం కంటే ‘బాబుకు రోజూ మంచి ప్రొటీన్ అందుతోందా?’ అని ఆలోచించండి. గుడ్డు, పాలు, పెరుగు, పప్పులు, శనగలు, పెసలు, చేపలు, మాంసం వంటివన్నీ పిల్లల ఎదుగుదలకు మంచి ప్రొటీన్ వనరులు.బలమైన ఎముకలకు పాలు!పాలు మంచివే. కానీ ఎముకల బలానికి పాలు ఒక్కటే సరిపోవు. కాల్షియం, విటమిన్ –డి, శారీరక చలనం కూడా అవసరం. పాలు, పెరుగు, రాగి, నువ్వులు, పనీర్ వంటి వాటి ద్వారా కాల్షియం అందుతుంది. వైద్యుల సూచన మేరకు అవసరమైతే మందుల ద్వారా కూడా తీసుకోవటం ఉత్తమం.జింక్ కొంచెమే... ఫలితమే ఘనంజింక్ పిల్లల ఎదుగుదలకు, కణాల అభివృద్ధికి, రోగనిరోధకతకు సహాయపడుతుంది. పప్పులు, గింజలు, నువ్వులు, గుడ్లు, చేపలు, మాంసాహారం వంటి వాటిలో జింక్ లభిస్తుంది.విటమిన్ –ఏ అంటే క్యారెట్ మాత్రమేనా?కాదు. విటమిన్ –ఏ కళ్ల ఆరోగ్యంతో పాటు రోగనిరోధక శక్తికి కూడా ముఖ్యమైనది. క్యారెట్‌తో పాటు గుమ్మడికాయ, ఆకుకూరలు, మామిడి, బొప్పాయి వంటి రంగురంగుల పండ్లు, కూరగాయలను పిల్లల ఆహారంలో చేర్చాలి. పిల్లల ప్లేట్లో రంగులు పెరిగితే, పోషకాల్లో కూడా వైవిధ్యం పెరుగుతుంది.ఒమేగా–3 ఎందుకు అవసరం?ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు, కళ్ల అభివృద్ధికి ఉపయోగపడతాయి. చేపలు దీనికి మంచి వనరులు. శాకాహారంలో అవిసె గింజలు, చియా గింజలు, వాల్నట్స్ వంటి వాటి ద్వారా కూడా ఇవి లభిస్తాయి. అయితే చిన్నపిల్లలకు గింజలు, నట్స్ ఇస్తున్నప్పుడు వయసుకు తగినట్లు సురక్షిత రూపంలోనే ఇవ్వాలి.పిల్లల ప్లేట్‌కి ‘5 కలర్స్’ చాలెంజ్!పిల్లల ప్లేట్లో పసుపు రంగులో ధాన్యం అన్నం, రొట్టె, రాగి, జొన్న; ఆకుపచ్చ రంగులో కూరగాయలు, ఆకుకూరలు; ఎరుపు రంగులో పప్పు, గుడ్డు, చేప, మాంసం; నారింజ రంగులో పండు; తెలుపు రంగులో పాలు, పెరుగు ఉండేలా ప్రయత్నించండి. వివిధ రకాల ఆహారాలను కలిపి ఇవ్వడం వల్ల పిల్లలకు అనేక రకాల పోషకాలు అందుతాయి.చిరుతిండ్లు పూర్తిగా మానేయాలా?పూర్తిగా నిషేధించడం కంటే వాటిని అలవాటుగా మారకుండా చూడటం ముఖ్యం. రోజూ కాకుండా అప్పుడప్పుడు మాత్రమే ఇవ్వడం మంచిది. తరచుగా ప్యాకెట్ ఆహారం, తీపి పానీయాలు అధికంగా ఇవ్వడం వల్ల పిల్లల ఆహార నాణ్యత తగ్గుతుంది.మొబైల్ చూపిస్తూ తినిపించడం తప్పా?తినేటప్పుడు మొబైల్ చూపించడం అలవాటుగా మారితే పిల్లలు ఆకలి, తృప్తి సంకేతాలను గమనించకుండా తినే అవకాశం ఉంటుంది. భోజనం చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు మొబైల్‌ను పక్కన పెట్టి, పిల్లలతో మాట్లాడటం, వాళ్లు తినే ఆహారంపై దృష్టి పెట్టేలా చేయడం మంచిది.బొద్దుగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టేనా?అసలు కాదు. పిల్లల ఆరోగ్యాన్ని కేవలం బరువుతో నిర్ణయించలేం. ఎత్తు, బరువు, వయసుకు తగిన శరీర బరువు సూచిక, ఎదుగుదల పట్టికలను కలిపి చూడాలి. బరువు తక్కువగా ఉండటమే ఆందోళనకరం కాదు, అధిక బరువు కూడా అంతే శ్రద్ధ పెట్టాల్సిన విషయమే.ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?పిల్లల బరువు సరిగ్గా పెరగకపోతే, ఎత్తు పెరుగుదల మందగిస్తే, తరచు అనారోగ్యానికి గురైతే, చాలాకాలంగా ఆకలి తగ్గిపోయి ఉంటే లేదా ఎప్పుడూ నీరసంగా కనిపిస్తే దాన్ని కుటుంబంలో అందరికీ ఇలాగే ఉంటుంది అని వదిలేయకండి. పిల్లల వైద్య నిపుణుడిని సంప్రదించడం మంచిది.చివరగా ఒక మాట– పిల్లల ప్లేట్ నిండితే సరిపోదు, అది పోషకాలతో నిండాలి.- డా‘‘ కె. పవన్ కుమార్, సీనియర్ పీడియాట్రిషియన్, పీడియాట్రిక్ అలర్జిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ఇదీ చదవండి: Health: నో ఆపరేషన్, నో చిప్స్... కేవలం ఐ డ్రాప్స్‌తో మళ్లీ చూపు! -
Health: నో ఆపరేషన్, నో చిప్స్... కేవలం ఐ డ్రాప్స్‌తో మళ్లీ చూపు!
కంటి చూపుతో చంపేస్తానంటాడు ఒక తెలుగు సినిమాలో హీరో. అవును! కంటికి అంత పవర్ ఉంది. ఆ పవర్ అంతా ఆ కన్ను చూసే చూపులో ఉంది. అంతటి శక్తిమంతమైన చూపు... క్షీణిస్తే?! జీవితం అనుక్షణ దుర్భరం అవుతుంది. ఆ దుర్భర త్వాన్ని తొలగించి తిరిగి చూపును రప్పించే ‘చుక్కల మందు’ను శాస్త్ర పరిశోధకులు తాజాగా కనిపెట్టారు. ఎలుకలు, జెబ్రాఫిష్పై ఫలించిన ఆ ప్రయోగాలు ఇప్పుడు మానవుల మీద మొదలవుతున్న దశలో ఉన్నాయి.చూపు కోల్పోయిన ఎలుకలపై శాస్త్రవేత్తలు చేసిన ఈ ప్రయోగం నిజంగా అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. కాంతికి స్పందించే ఒక ప్రత్యేకమైన రసాయనాన్ని తయారుచేసి, దానిని కంటి చుక్కల మందు రూపంలో అందించినప్పుడు, చూపు లేని ఆ ఎలుకలు మళ్లీ వెలుగును గుర్తించటమే కాకుండా వెలుగుకు అనుగుణంగా స్పందించడం ప్రారంభించాయి!సాధారణంగా చూపు పునరుద్ధరణ కోసం సంక్లిష్టమైన జన్యు చికిత్సలు (జీన్ థెరపీ), కంటిలో ఆపరేషన్ చేసి ఇంప్లాంట్లు అమర్చడం లేదా ప్రత్యేకమైన లైటింగ్‌ను వాడటం వంటివి చేస్తుంటారు. కానీ ఎలాంటి సర్జరీలు లేదా చిప్‌ల అవసరం లేకుండా, కేవలం కంటి చుక్కల మందుతోనే చూపును తిరిగి తీసుకురావటం ఇది! రెండు రకాల మందుల మిశ్రమంతో శాస్త్రవేత్తలు కనిపెట్టిన దివ్యౌషధం వంటి ఈ చుక్కల మందు ఎలుకల్లో, జెబ్రాఫిష్లో చాలా బాగా పనిచేసింది. భవిష్యత్తులో దృష్టి లోపాలు, పూర్తి అంధత్వంతో బాధపడే మానవులకు కూడా చూపు తెప్పించే చికిత్సను అందించవచ్చనే ఆశను ఈ ప్రయోగం శాస్త్రవేత్తల్లో కలిగిస్తోంది.వెలుగును గుర్తించే శక్తి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 కోట్ల మంది ప్రజలు వయసు పైబడటం వల్ల వచ్చే ‘మాక్యులర్ డిజెనరేషన్’ (ఎ.ఎం.డి.), ‘రెటినైటిస్ పిగ్మెంటోసా’ (ఆర్.పి.) వంటి వ్యాధుల వల్ల చూపు కోల్పోతున్నారు. ఈ అంధత్వం కారణంగా వ్యక్తుల రోజువారీ జీవితం, స్వేచ్ఛ దెబ్బతినడమే కాకుండా, వైద్య ఖర్చులు, ఉత్పాదకత తగ్గడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఏటా రూ. 33,40,000 కోట్లకు పైగా భారం పడుతోంది.మన కంటిలోని రెటీనాలో ఉండే ‘ఫొటోరిసెప్టర్’ కణాలు కాంతిని గుర్తుపట్టి దాన్ని సంకేతాలుగా మారుస్తాయన్నది తెలిసిందే. అయితే ఎ.ఎం.డి., ఆర్.పి. వ్యాధులలో ఈ ఫొటోరిసెప్టర్ కణాలు నెమ్మదిగా క్షీణించి చనిపోతాయి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ ఫొటోరిసెప్టర్లు చనిపోయినప్పటికీ, కంటి లోపల ఉండే మిగిలిన నరాల వ్యవస్థ మాత్రం చాలా వరకు ఆరోగ్యంగానే పనిచేస్తూ ఉంటుంది! కానీ కాంతిని గ్రహించే ఫొటోరిసెప్టర్లు లేకపోవడం వల్ల, ఈ నరాలకు వెలుగు సంకేతాలు అందక మెదడుకు సమాచారం వెళ్లదు.అందుకే శాస్త్రవేత్తలు కంటిలో సజీవంగా ఉన్న ఈ మిగిలిన నరాల వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని, వాటికి మళ్లీ కాంతిని గుర్తించే శక్తిని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న జన్యు చికిత్సలు కేవలం కొద్దిమంది రోగులకు మాత్రమే ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఎలక్ట్రానిక్ రెటీనా పరికరాలు చాలా ఖరీదైనవి, సర్జరీ అవసరమైనవి. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తల ఈ చుక్కల మందు మంచి ఫలితాలు సాధించినప్పటికీ, అంధులకు సాధారణ కాంతిలో కూడా స్పష్టమైన దృష్టిని అందించడం ఇప్పటికీ ఒక పెద్ద సవాలుగానే మిగిలింది.చికిత్స సరళం.. సురక్షితంఇన్స్టిట్యూట్ ఫర్ బయోఇంజినీరింగ్ ఆఫ్ కెటలోనియా ఆధ్వర్యంలోని పరిశోధకుల బృందం కాంతి ఆధారంగా స్విచ్‌లా పనిచేసే ఈ కొత్త రకం చుక్కల మందు అణువులను తయారుచేసింది. ఈ పరిశోధన ఫలితాలు ‘జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కెమికల్ సొసైటీ’ లో ప్రచురితమయ్యాయి.చనిపోయిన ఫొటోరిసెప్టర్లు చేసే పనిని తమపైన వేసుకునే విధంగా ఈ రసాయన సమ్మేళనాలను పరిశోధకులు రూపొందించారు. వీటిని కంటికి ఇంజెక్షన్ ద్వారా లేదా కంటి చుక్కల మందు రూపంలో నేరుగా వేయవచ్చు. దీనికోసం ఎలాంటి జన్యు మార్పులు, లేదా కంటిలో పరికరాలు అమర్చడం వంటివి చేయాల్సిన అవసరం లేదు. అలాగే, ఇవి సురక్షితమైనవని కూడా రుజువైంది.‘‘ఈ అణువులు అంధత్వాన్ని శాశ్వతంగా నయం చేయలేవు, ఎందుకంటే ఇవి ఫొటోరిసెప్టర్ కణాలు చనిపోవడాన్ని నిలిపివేయలేవు. కానీ, ఇవి చూపును తిరిగి తెప్పించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. అంధులకు అత్యంత తేలికైన, సులువైన పద్ధతిలో చూపును అందించడం వీటి ప్రధాన విశేషం’’ అని కెటలోనియా ప్రొఫెసర్ పావ్ గోరోస్టిజా అంటున్నారు. ఈ అధ్యయన సహ రచయిత్రి రోసల్బా సోర్టినో మాట్లాడుతూ.. ‘‘ఆరోగ్యవంతమైన కంటి రెటీనా ఏ విధంగా పనిచేస్తుందో, సరిగ్గా అదే రకమైన అణు ప్రక్రియ ద్వారా చూపును పునరుద్ధరించడమే మా లక్ష్యం. కంటి నరాల వ్యవస్థను దాటి పోకుండా, చనిపోయిన ఫొటోరిసెప్టర్ల స్థాయిలోనే రెటీనాను మళ్లీ క్రియాశీలం చేయడానికి మేము ప్రయత్నించాం’’ అని తెలిపారు.సుమారు 10 ఏళ్లకు పైగా సాగిన సుదీర్ఘ పరిశోధనల ఫలితంగా ఈ విజయం సాధ్యమైంది. ఆల్కాలా విశ్వవిద్యాలయం, స్పెయిన్ జాతీయ పరిశోధనా మండలి, బార్సిలోనా విశ్వవిద్యాలయం, ఇంకా పలు ప్రముఖ పరిశోధన సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు కలిసి ఈ అద్భుతాన్ని సాధించారు.మందు పని చేసే విధానంమన కంటిలో కాంతిని గుర్తించే ‘ఫొటోరిసెప్టర్లు’ సాధారణంగా సమాచారాన్ని ‘ఆన్ బైపోలార్’ అనే కంటి నరాల కణాలకు అందిస్తాయి. ‘‘ఆరోగ్యవంతమైన కంటిలో వెలుగు పడినప్పుడు ఆ సమాచారాన్ని మెదడుకు పంపడంలో ఈ ఆన్ బైపోలార్ కణాలు కీలక పాత్ర పోషిస్తాయి. కంటి వ్యాధుల వల్ల ఫొటోరిసెప్టర్లు చనిపోయినప్పటికీ, వాటి కింద ఉన్న ఈ నరాల వ్యవస్థ సజీవంగానే ఉంటుంది కానీ నిద్రావస్థలో ఉండిపోతుంది. సరిగ్గా ఇక్కడే వైద్య చికిత్సకు ఒక గొప్ప అవకాశం లభించింది’’ అని ఈ పరిశోధనకు సహ నేతృత్వం వహించిన దే లా విల్లా వివరించారు.ప్రోతే6 మందు కంటి సజీవ నరాల వ్యవస్థలోని ఎంగ్లూ6 అనే ప్రోటీన్‌ను టార్గెట్ చేస్తుంది. ఇలా చేయడం ద్వారా చనిపోయిన ఫొటోరిసెప్టర్లు చేయాల్సిన పనిని ప్రోతే6 తనే స్వయంగా పూర్తి చేస్తుంది. కంటిపై వెలుగు పడగానే ఈ మందు అణువులు తమ ఆకారాన్ని మార్చుకుంటాయి. ఈ ఆకార మార్పు వల్ల కంటిలో సహజంగా జరిగే చూపు ప్రక్రియ లాగానే విద్యుత్ సంకేతాలు మొదలవుతాయి. ఎటువంటి ఆపరేషన్లు, ఇంప్లాంట్లు లేదా జన్యు మార్పులు లేకుండానే రెటీనా మళ్లీ వెలుగును గుర్తించేలా చేస్తున్నందున శాస్త్రవేత్తలు వీటిని ‘మాలిక్యులర్ ప్రోస్థెసిస్’ (అణు పరికరాలు) అని పిలుస్తున్నారు.ఈ విధానంలో ఉన్న మరో గొప్ప విశేషం ఏంటంటే... ఇది సాధారణ వెలుతురులో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. కొన్ని ఇతర పద్ధతుల్లో లాగా కంటికి ప్రత్యేకమైన బ్రైట్ లైట్లు లేదా కాంతిని పెంచే పరికరాలు అమర్చే అవసరం ఇందులో అవసరం లేదు. ఈ అణువులు చాలా చిన్నవి, నీటిలో కరిగే గుణం ఉన్నవి. ఇవి మనం ఇంట్లో వాడే సాధారణ లైటింగ్ లేదా బయట ఉండే పగటి వెలుతురుకి కూడా స్పందించి చూపును పునరుద్ధరిస్తాయి.అంధులకు వరంఒకవేళ ఈ కంటి చుక్కల ప్రయోగం మానవులపై కూడా అనుకున్నట్లుగా విజయవంతమైతే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఖరీదైన చూపు–పునరుద్ధరణ సాంకేతికతలకు ఇది ఒక సులువైన, అందుబాటు ధరలోని ప్రత్యామ్నాయం అవనుంది.. ముఖ్యంగా తీవ్రమైన అంధత్వంతో బాధపడుతూ, ఇప్పటివరకు ఎలాంటి చికిత్సా మార్గం లేని లక్షలాది మందికి ఇది ఒక గొప్ప వరంగా మారుతుంది.దారి చూపిన జెబ్రాఫిష్, ఎలుకలు ఈ చుక్కల ముందు చికిత్స ‘ఫొటోఫార్మకాలజీ’ అనే విధానంపై ఆధారపడి పనిచేస్తుంది. అంటే, మందు పనితీరును కాంతి సహాయంతో నియంత్రించటం జరుగుతుంది. శాస్త్రవేత్తలు ఏం చేశారంటే, మందు రసాయన నిర్మాణంలో కాంతికి స్పందించే ఒక చిన్న ‘లైట్ స్విచ్’ను అమర్చారు. కంటిపై వెలుగు పడగానే ఈ స్విచ్ ఆన్ అయ్యి మందు తన పని ప్రారంభిస్తుంది.ఈ పద్ధతిని ఉపయోగించి పరిశోధకులు ‘ప్రోతే6’ అని పిలిచే రసాయన సమ్మేళనాల సమూహాన్ని తయారుచేశారు. ఇవి కంటిలోని ‘ఆన్ బైపోలార్’ నరాలపై పనిచేస్తాయి. మన కంటిపై వెలుగు పడినప్పుడు, ఆ వెలుగు/కాంతి సంకేతాలను గుర్తించి, వాటిని విద్యుత్ తరంగాలుగా మార్చి మెదడుకు పంపడంలో ఈ ఆన్ బైపోలార్ నరాలు కీలక పాత్ర పోషిస్తాయి. (కంటిపై వెలుతురు పడగానే ఈ నరాలు ఉత్తేజితమై పనిచేయడం ప్రారంభిస్తాయి కనుకనే వీటిని ‘ఆన్’ బైపోలార్ కణాలు అంటారు. చీకటి పడినప్పుడు పనిచేసేవాటిని ‘ఆఫ్’ బైపోలార్ కణాలు అంటారు). దృష్టి స్పష్టతను పరీక్షించడానికి ఉపయోగించే ‘జెబ్రాఫిష్’ లార్వాలలో ఈ మందు వేయగానే, అవి తమ చూపు శక్తితో కంటి గుడ్లను తిప్పడం ప్రారంభించాయి. జెబ్రాఫిష్ లార్వాలే ఎందుకంటే, వాటి కంటి నిర్మాణం, నాడీ వ్యవస్థ.. మానవుల కంటిని పోలి ఉంటాయి.అంతేకాకుండా, మాక్యులర్ డీజెనరేషన్, రెటినైటిస్ పిగ్మెంటోసా వల్ల అంధత్వం వచ్చిన ఎలుకల్లో కూడా ఈ మందుతో వెలుగును గుర్తించే సహజ ప్రవర్తన తిరిగొచ్చింది. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న ఎలుకలు ఎక్కువ వెలుగు ఉన్న ప్రాంతాల కంటే చీకటి ప్రాంతాల్లోనే ఉండటానికి ఇష్టపడతాయి. కానీ చూపు కోల్పోయిన ఎలుకలు వెలుగు–చీకటి తేడా తెలియక అన్ని చోట్లా తిరుగుతాయి. అయితే, ఈ ఎలుకలకు ‘ప్రోతే6’ మందు ఇవ్వగానే, అవి మళ్లీ స్వచ్ఛందంగా చీకటి ప్రాంతాల వైపు వెళ్లడం ప్రారంభించాయి. అంటే ఎలాంటి శిక్షణ లేకుండానే ఇవి కాంతిని గుర్తించి, దానికి అనుగుణంగా ప్రవర్తించగలుగుతున్నాయని స్పష్టం అయింది. మన ఇంట్లో ఉండే సాధారణ వెలుతురు లేదా మేఘావృతమైన రోజున బయట ఉండే వెలుతురులో కూడా ఈ మందు చాలా బాగా పనిచేసింది.ముఖ్యంగా ‘ప్రోతే6–12’, ‘ప్రోతే6–15’ అనే రెండు రకాల సమ్మేళనాలు అద్భుతమైన ఫలితాలను ఇచ్చాయి. ఇవి కంటిలోకి ఇంజెక్షన్ ద్వారా ఇచ్చినప్పుడు మాత్రమే కాకుండా, కేవలం కంటి చుక్కల మందు రూపంలో వేసినప్పుడు కూడా ఎలుకలకు చూపు తిరిగొచ్చింది!మానవుల్లో మొదలైన టెస్ట్ డోస్లుఅంధత్వ నివారణ కోసం ఈ ‘ఫొటోఫార్మాకోలాజికల్’ చుక్కల మందు మానవులపై క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకుంది. ఫొటోఫార్మాకాలజీ అనేది కేవలం ఒక ప్రయోగశాల పరిశోధనగానే మిగిలిపోకుండా, నిజమైన వైద్య చికిత్సగా మారుతోందని ఇది నిరూపిస్తోంది.ప్రోతే6 సాంకేతికత ఇప్పటికే పేటెంట్ హక్కులను పొందింది. పరిశోధకులు ప్రస్తుతం దీని సురక్షితత్వాన్ని పరీక్షించడంతో పాటు, ఒక్కసారి చుక్కల మందు వేస్తే ఆ చూపు ఎంత ఎక్కువ సమయం నిలిచి ఉంటుందో పరిశీలించేందుకు, అలాగే చూపు సమయాన్ని పెంచేందుకు రసాయన సమ్మేళనాన్ని మెరుగుపరుస్తున్నారు. ఈ సాంకేతికతను మానవ ప్రయోగాలకు, క్లినికల్ ట్రయల్స్‌కు తీసుకువెళ్లడానికి అవసరమైన పెట్టుబడులను సమకూర్చుకోవడానికి శాస్త్రవేత్తల బృందం ‘ఐల్యూమినియా’ అనే స్టార్టప్ కంపెనీతో కలిసి పనిచేస్తోంది.‘‘ఈ పరిశోధనను ఒక పరిపూర్ణ వైద్య చికిత్సగా మార్చడం సుదీర్ఘమైన, కష్టమైన ప్రక్రియ. కానీ, ఎలాంటి ఆపరేషన్లు లేకుండా, అత్యంత సురక్షితమైన రీతిలో మందుల ద్వారానే మెరుగైన చూపును తిరిగి తెప్పించవచ్చని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి. రోగికి ఎలాంటి జన్యు లోపం లేదా ఎలాంటి కంటి వ్యాధి ఉన్నప్పటికీ, దాదాపు అందరికీ ఇది పనిచేస్తుంది’’ అని పరిశోధక ప్రొఫెసర్ గోరోస్టిజా నమ్మకంగా చెబుతున్నారు.చీకటిని తరిమికొట్టి కొత్త ఆశల కాంతులు నింపడమే శాస్త్రసాంకేతికత సాధించే అసలైన విజయం. చూపు లేని జీవుల్లో వెలుగులు నింపిన ఈ కంటి చుక్కల మందు ప్రయోగం, రేపటి రోజున లక్షలాది మంది అంధుల జీవితాల్లో సరికొత్త రంగులను నింపుతుందని శాస్త్రవేత్తలు నమ్మకంతో ఉన్నారు. నల్లని చీకటి తెరల వెనుక వెలుగుల కోసం ఎదురుచూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఈ పరిశోధన ఒక వెలుగు దివ్వెగా మారి, వాళ్లు మళ్లీ ఈ అందమైన ప్రపంచాన్ని చూసేలా చేయాలి.- సాక్షి స్పెషల్ డెస్క్ఇదీ చదవండి: అల్జీమర్స్ నివారణకు... -
ది మైక్రో స్పై: సీల్ చెక్కుచెదరలేదు.. అయినా లీక్!
డీజీపీ చాంబర్...మేజర్ సూరజ్ మెహతా మొహంలో ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.ఎదురుగా క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అభిమన్యు.‘దేశ సరిహద్దు రక్షణకు సంబంధించిన అత్యంత రహస్యమైన డ్రోన్ ఆటోమేషన్ బ్లూప్రింట్స్– కీలకమైన డిఫెన్స్ డాక్యుమెంట్స్ ఉన్న కవరును తీసుకుని ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చారు. మేజర్ సూరజ్ మెహతా– ఆ పత్రాలను ఐటీ కారిడార్‌లోని డిఫెన్ ్స రీసెర్చ్ విభాగానికి అందజేయాల్సి ఉంది.‘మేజర్ సూరజ్ మెహతా నిన్న రాత్రి బంజారాహిల్స్‌లోని ఒక లగ్జరీ హోటల్లో బస చేశారు. రాత్రి ఆయన భద్రంగా దాచుకున్న ఆ రహస్య కవరు ఉదయం చూసేసరికి మాయమైంది. ప్రభుత్వ అధికారిక లక్క ముద్ర ఉన్న ఆ కవరు పోవడం చాలా ప్రమాదకరం...’ డీజీపీ గంభీరంగా చెప్పాడు.‘అవును మిస్టర్ అభిమన్యు! ఎన్ ఐఏ, సీబీఐ ఇప్పటికిప్పుడు రంగంలోకి దిగే పరిస్థితి లేదు. చాలా కాన్ఫిడెన్షియల్... మీ ప్రతిభ గురించి విన్నాం... మీరే ఈ కేసును సాల్వ్ చేయాలి.’ మేజర్ మెహతా అన్నాడు.‘డోంట్ వర్రీ... దేశ రక్షణ మన బాధ్యత, మీరు నిశ్చింతగా వుండండి.’ చెప్పి బయటకు నడిచాడు అభిమన్యు.అతడిని అనుసరించాడు మేజర్ సూరజ్ మెహతా.అభిమన్యు వెంటనే మేజర్ సూరజ్ మెహతాతో కలిసి హోటల్ రూమ్ నంబర్ 404కి చేరుకున్నాడు. రూమ్‌లో ఎలాంటి గొడవ జరిగిన ఆధారాలు లేవు. లాకర్ తాళాలు మేజర్ సూరజ్ పాకెట్లోనే ఉన్నాయి. ‘రాత్రి నేను గది తాళం వేసుకుని పడుకున్నాను. కిటికీలు కూడా లోపలి నుంచే బంధించి ఉన్నాయి. మరి కవరు ఎలా మాయమైంది?’హోటల్లో ఉన్న అన్ని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్న అభిమన్యుకు గ్రౌండ్ ఫ్లోర్లో డస్ట్ బిన్లను తీసుకువెళ్తున్న రూమ్ బాయ్ కనిపించాడు. ఆ డస్ట్ బిన్లలో ఉన్న చెత్తను ఇంకా మునిసిపల్ వ్యాన్‌లో తరలించలేదు. వెంటనే ఆ చెత్తలో వెతికితే కవర్ దొరికింది.‘కవర్ దొరికింది. కానీ డస్ట్ బిన్‌లోకి ఎలా వెళ్ళింది?’ తనలో తానే గొణుక్కుంటున్నట్టు అన్నాడు మేజర్ సూరజ్ ఆ కవర్ వంక చూసి.ఇన్స్పెక్టర్ అభిమన్యు తన ట్రెంచ్ కోట్ జేబులోంచి భూతద్దం తీసి ఆ కవర్‌ను పరిశీలించాడు. ‘లక్క ముద్ర అలాగే ఉంది కానీ, లోపల ఉన్న దేశ రహస్యాలు ఇప్పటికే లీక్ అయిపోయాయి!’ అభిమన్యు అన్నాడు.మేజర్ సూరజ్ షాకింగ్‌గా చూస్తూ వుండిపోయాడు ‘ ఇప్పుడెలా? అతని గొంతులో ఆందోళన.‘లీకైన రహస్యాలు బయటకు పొక్కకముందే లాక్ అవుతాయి.’ అభిమన్యు చెప్పాడు. అప్పటికే అతని బ్రెయిన్ మ్యాప్ పనిచేస్తోంది.అభిమన్యు వెంటనే హోటల్లో బస చేసిన వారి రికార్డులను పరిశీలించాడు. అదే ఫ్లోర్లో ఉన్న ఒక విదేశీ ప్లాస్టిక్ సర్జన్ ప్రొఫైల్ అతని దృష్టికి వచ్చింది.వెంటనే డూప్లికేట్ కీతో గది ఓపెన్ చేశాడు.∙∙ ఫెడరిక్ మాస్టర్ కీతో గది తలుపు తెరిచి షాకయ్యాడు. అతనిలో ఏదో అనుమానం.‘హలో మిస్టర్ ఫ్రెడరిక్ అమెరికా ఎఫ్‌బీఐకి కూడా దొరక్కుండా మా దేశానికి ఎందుకు వచ్చావ్? ఆ మాటలు విని ఆ స్పై సర్జన్ ఫెడరిక్ జేబులో నుంచి రివాల్వర్ తీయబోయాడు. అప్పటికే అతని వెనుక రివాల్వర్‌తో అభిమన్యు.∙∙ ‘ఫెడరిక్ మిమ్మల్ని ఢిల్లీ నుంచి ఫాలో అవుతూ వచ్చాడు. ఒక ప్రొఫెషనల్ మాత్రమే ఇలా చేయగలడు. అతని గురించి ఆరా తీస్తే డొంక కదిలింది. ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో వున్నాడు.కవరు సీల్ పాడవకుండా ఉండటానికి, దాని అంచున ఒక చిన్న సూదితో రంధ్రం చేశాడు. ఆ రంధ్రం గుండా 0.5 ఎంఎం వ్యాసం కలిగిన అత్యంత సన్నని ఆప్టికల్ ఫైబర్ ఎండోస్కోపీ స్పై కెమెరా కేబుల్‌ను కవరు లోపలికి చొప్పించాడు. వైద్య రంగంలో శరీర భాగాలను పరీక్షించడానికి వాడే ఈ సాంకేతికతను, నేరగాళ్లు మన దేశ రహస్యాలను దొంగిలించడానికి వాడారు. లోపల ఉన్న పేపర్ల మడతలను, అందులోని అక్షరాలను ఆ కెమెరాకు ఉన్న మైక్రో–లైట్ సాయంతో స్పష్టంగా స్కాన్ చేశాడు. ఆ డేటా మొత్తం వై–ఫై ద్వారా వాళ్ల సర్వర్‌కు సెకన్ల వ్యవధిలో చేరిపోయింది. పని పూర్తయ్యాక, కెమెరాను బయటకు తీసి, ఆ రంధ్రం ఎవరికీ కనపడకుండా ఒక ప్రత్యేకమైన బూడిద రంగు గ్లూతో మూసేసి, కవరును డస్ట్‌బిన్ లో పడేశాడు. కవర్ దొరికిందని మీరు అనుకుంటారు. కానీ రహస్యాలు వెళ్లిపోతాయి.’ఫెడరిక్ లగేజీని తనిఖీ చేయగా, అందులో ఫెడరిక్ వాడిన మైక్రో–ఎండోస్కోపీ పరికరం ల్యాప్‌టాప్ దొరికాయి. ల్యాప్‌టాప్‌ను పరిశీలించగా, డిఫెన్ ్స పేపర్ల డిజిటల్ కాపీలు అందులో ఉన్నాయి. వాటిని ఇంకా వేరే సర్వర్‌కు అప్లోడ్ చేయలేదు. మన దేశ రక్షణకు ఏ సమస్యా లేదు. ఇతడిని ఎఫ్‌బీఐకి అప్పగించండి.ఒక చిన్న సూది రంధ్రం వెనుక ఉన్న అంతర్జాతీయ సాంకేతిక నేరాన్ని ఇన్స్పెక్టర్ అభిమన్యు ఎనలైజ్ చేస్తూ చెప్పాడు.‘థాంక్యూ మిస్టర్ అభిమన్యు. మీ మేలు మర్చిపోలేను... మీరు జీనియస్.. బుద్ధిబలం, భుజబలం, మీ సొత్తు. మీ శక్తియుక్తులు రెండు రాష్ట్రాలకే కాదు మొత్తం దేశానికే అవసరం. మా ఆర్మీ మీ కోసం ఎదురు చూస్తుంది.’ అంటూ కరచాలనం చేస్తూ వీడ్కోలు తీసుకున్నాడు సూరజ్ మెహతా.అవును... అభిమన్యుకు ఏదో రోజు దేశ రక్షణకు పిలుపు వస్తుంది.- శ్రీసుధామయిఇదీ చదవండి: కూతురి కోసం తండ్రి మొక్కు.. 75 ఏళ్లుగా దేశానికే పండుగ! -
అహం బ్రహ్మాస్మి: గడ్డిపరక ప్రశ్నకు.. సింహం సమాధానం ఏంటి?
తెలుగు సినిమాలు, తెలుగు రాజకీయాలు బాగా ఫాలో అవుతుందేమో, సింహం అద్దం ముందు నిలబడి గడ్డం సవరించుకుంటూ దరహాసంతో ‘నేను సింహంలాంటి దాన్ని’ అనుకుంది.వెంటనే, ‘ఛ... ఛ... నేను సింహంలాంటి దాన్నేమిటీ? నేనే సింహాన్ని’ ఆలోచనను సవరించుకుంది. ‘ఈ అడవికి రాజును. ఏనుగు నుంచి ఎలుకపిల్ల వరకు, మహావృక్షం నుంచి గడ్డిపరక వరకు, పక్షి నుంచి పారాడే పురుగు వరకు ప్రతిదీ నా అదుపాజ్ఞల్లో ఉండాల్సిందే!’ఒక్కసారి ఒళ్ళు విరుచుకుని, గుహ బయటికి రావటానికి సమాయత్తమవుతుంటే, మనసుకు ఏదో సంకేతం అందుతున్నట్టు అనిపించింది.ఏమిటది?కొత్త ఉపద్రవమా?అడవుల్లో వుండే జంతువులకి, పక్షులకి, ఇతర జీవచరాలకీ దినదినగండం నూరేళ్ళ ఆయుష్షు జీవితమే! ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి సెకనూ ఉపద్రవమే! క్రూర జంతువుల రూపంలో, వేటగాళ్ల రూపంలో. అయినా తను ఈ అడవికి రారాజు. తనకి ఎవరివల్ల ఉపద్రవం ఉంటుంది? తనే మిగిలిన జంతుజాలానికి ఉపద్రవం కాని. తనని తాను సమాధానపరచుకుంది సింహం.ఆలోచిస్తూ గుహ బయటికి వచ్చి బోర విరుచుకు నిలబడి చుట్టూ ఒకసారి తేరిపార చూసింది. ఎదురుగా కుక్క, నక్క!పుట్టుకతో బద్ధశత్రువులైన రెండూ అక్కడ ఒకదాని పక్క మరోటి నిలబడి వున్నాయి– అదీ పెళ్లి చేసుకున్న ఆనవాళ్లతో, అలంకరణలతో...సింహాన్ని చూసి కుక్క అంది ‘మహారాజా, కొత్తగా పెళ్లి చేసుకున్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి.’సింహం తన కళ్ళని తానే నమ్మలేక పోయింది.‘పెళ్లా? మీరా?’ అన్నది పైకి.‘చరిత్రలో ఎప్పుడైనా, ఎక్కడైనా ఇలాంటిది జరిగిందా? పరస్పరం కలహించుకునే రెండు జాతులు పెళ్లి చేసుకోవటం ఉపద్రవం కాక మరేమిటీ?’ మనసులో అనుకుంది.‘అవును మహారాజా. ఒకళ్ళనొకళ్ళం ఇష్టపడ్డాం. పెళ్లి చేసుకున్నాం. ఆశీర్వదించండి’ ఈసారి నక్క అంది వినయంగా. దాని వినయం తెలుస్తూనే వుంది.‘మీ ఇళ్లల్లో ఒప్పుకున్నారా ఈ పెళ్ళికి?’‘లేదు మహారాజా. విభిన్న జాతుల మధ్య ప్రేమను సమాజం ఎప్పుడూ సులభంగా అంగీకరించలేదు. అయినా మేము ఒకరినొకరం ఎంచుకున్నాం. మా అభిప్రాయాలు కలిశాయి. మేము పెళ్లి చేసుకున్నాము. ఇతరులతో మాకు పనేముంది మహారాజా?’ అంది కుక్క.‘అభిప్రాయాలు కలవటమా? అసలు మీ జాతులే వేరైనప్పుడు, అలవాట్లే వేరైనప్పుడు, అభిప్రాయాలు కలవటం వింతగా వుంది.’‘అభిప్రాయాలు కలవటానికి, జాతులు వేరవటానికి సంబంధమేమిటి మహారాజా. ఆ మాటకొస్తే ఎన్ని సినిమాల్లో చూళ్ళేదూ హీరో హీరోయిన్లు దెబ్బలాడుకుంటూనే ప్రేమలో పడటం. ఇదీ అంతే అనిపించింది.’‘మనుషుల గురించి వదిలెయ్యండి. సృష్టిలో వాళ్ళని మించిన నమ్మక ద్రోహులు, స్వార్థపరులు మరెవరూ వుండరు. ఒక పని చేస్తే కొంత లాభం వస్తుందనుకుంటే స్వంత వాళ్లనే వదులుకోవడానికి సిద్ధపడతారు. అలాంటి నీతి, జాతి లేని వాళ్ళతో– మనకి పోలికేమిటి?’ సింహం గర్జించింది.ఆ అరుపుకు కుక్క, నక్క గాభరా పడ్డాయి.‘అవసరం కోసం మనుషులు ఎంతకిందికైనా దిగజారతారు. డబ్బుకోసం నానా గడ్డీ కరుస్తారు. అలాంటి వాళ్ళు అంతకంటే మంచి సినిమాలు తియ్యలేరులే. అయినా– సినిమాలు చూసే మీరు ఇవన్నీ చేశారా?’ సింహం అడిగింది.‘అవును, కాదు’ల మధ్యగా రెండూ తల ఊపాయి.‘అయినా ఒక విషయం అడుగుతాను. సూటిగా సమాధానం చెప్పండి. రేపు మీ పిల్లల్ని తోటి సమాజం సంకర జాతి అని హేళన చెయ్యదా?’రెండూ తలలు వంచుకున్నాయి– తప్పు చేసిన వాళ్ళలా.‘దానికంటే ముఖ్యంగా’ సింహం కుక్కని చూసి, ‘విశ్వాసానికి ప్రతీకగా నిన్నూ’ అని నక్క వైపు చూసి, ‘వంచనకు, అతి వినయానికి గుర్తుగా నిన్నూ చెప్తారు కదా. రేపెప్పుడైనా ఈ అడవిలో మిగిలిన జంతువులు మిమ్మల్ని ఒకరి గురించి మరొకరి ముందు అలా అవహేళన చేస్తే మీరు తట్టుకోగలరా?’సమాధానం ఏం చెప్పాలో తెలీక కుక్కా, నక్కా రెండూ మౌనంగా ఉండిపోయాయి.సింహమే అంది ‘రేపు మీ పిల్లలకి మీ అసలు బుద్దులు తారుమారై.. నక్క విశ్వాసం, కుక్క వినయం వస్తే, మిగిలినవి వాటిని ఎగతాళి చేస్తే వాటి చిన్ని మనసుకు గాయం అవ్వదా?’‘మహారాజా, క్షమించండి. దాని గురించి మేము ఇంకా ఆలోచించలేదు కానీ, విషయం అంతదాకా వస్తే, మా పిల్లలు ఈ అడవిలోనే, ఈ జంతువుల మద్యే ఉండాలన్న నియమమేమీ లేదు కదా. రేపు మా పిల్లలు మెరుగైన జీవితం కోసం, దేశంలోని ఇంకో అడవికో, మరోదేశానికో వలస పోవచ్చు. మనుషులు కూడా అలానే దేశాంతరం వెళుతున్నారు కదా?’ ప్రశ్నించింది నక్క.సింహానికి ఇది వాదనలతో తెగే వ్యవహారంలా అనిపించలేదు. ‘మూర్ఖులతో వాదించటమంత మూర్ఖత్వం లేదు’ అనుకుంది.చివరగా అంది ‘సరే అయిందేదో అయింది. ఇద్దరూ కుటుంబ సమస్యలతో వీధికెక్కకుండా నడుచుకోండి. ఇప్పటి ఏకాభిప్రాయాలు రేపటి అభిప్రాయభేదాలు కానివ్వకండి. అలాటిదేదైనా ఉంటే, ఇద్దరూ సామరస్యంగా చర్చించి పరిష్కరించుకోండి. జంతు సమాజం మొత్తం కళ్లన్నీ మీమీదే ఉంటాయి. రేపేదైనా జరిగితే మీ బతుకు ఎగతాళి అవుతుంది. జాగ్రత్తగా మసలుకోండి. నా అవసరం మీకు రాకూడదనే కోరుకుంటున్నా. ఒక వేళ వస్తే మాత్రం నాకు కబురుపెట్టి కలవండి.’దీవించినట్టు చెయ్యెత్తింది సింహం. కుక్క, నక్క కృతఙ్ఞతలు చెప్పి బయలుదేరాయి. ఆ ఇద్దరూ వెళ్లిపోయాక అడవి మళ్లీ నిశ్శబ్దమైంది.కానీ ఆ నిశ్శబ్దంలో ఒక గడ్డిపరక మాత్రమే వంగి నిలబడింది. ఏడురోజులుగా అది నీటిని తాకలేదు; సూర్యరశ్మిని కూడా స్వీకరించలేదు. బాగా వడలిపోయివుంది. దాని సమస్యేమిటో ఎవ్వరికీ తెలీదు. తన సమస్య ఎవరితో చెప్పుకోవాలో తెలీక అది కూడా సతమతమవుతోంది. ఈ విషయం ఆకాశంలో ఎగురుతున్న పాలపిట్ట ఒకటి గమనించింది. దాన్ని రారాజు సింహం వేగుగా నియమించుకుంది. రాజ్యంలోని క్షేమసమాచారాల్ని రాజుకు విన్నవించటమే దాని పని. సరిగ్గా– రెండురోజుల తర్వాత సింహం నుంచి గడ్డిపరకకు పిలుపొచ్చింది. గడ్డి భయంభయంగానే రాజు దగ్గిరకి పయనమయ్యింది.∙∙ పులులు, సింహాలు, ఏనుగులు, గుర్రాలు, గాడిదలు, కుందేళ్లు, నక్కలు, జింకలు, పాములు, పక్షులు, చెట్టు, పుట్ట సహా అడవిలోని ప్రతి ప్రాణి, జీవి ఈ సమావేశానికి హాజరు కావలసిందే అని సింహం హుకుం జారీచేసింది. అన్నీ వచ్చి ఆసీనులయ్యాయి.సమావేశం ప్రారంభమయింది. క్షేమసమాచారాలయ్యాక– సింహం గడ్డిపరకని ఎగాదిగా చూసి ‘ఏమిటి నీ సమస్య?’ అడిగింది.‘వ్యక్తిగతంగా అయితే నాకు ఏ సమస్యా లేదు మహారాజా. ఇది మా సమూహం మొత్తం సమస్య. సమస్యలు ఎవరూ తమ దృష్టికి తీసుకురావటంలేదు అంటే దానర్థం సమస్యల్లేవని కాదు మహారాజా. పరిష్కారం లభిస్తుందో లేదోనని’ అర్ధోక్తిలో ఆపుచేసింది గడ్డిపరక.‘పరిష్కారం లేని సమస్యలేమీ వుండవు. కాకపోతే, చిత్తశుద్ధే కావాలి. ముందసలు నీ సమస్యేమిటో చెప్పు, పరిష్కరించ టానికి ప్రయత్నిస్తా’ అంది సింహం.‘మహారాజా, మా సమస్యలు రెండు. ఒకటి ఆత్మగౌరవం. రెండు సామాజికం.’సింహం ఆశ్చర్యంగా చూసింది.గడ్డిపరక చెప్పటం మొదలెట్టింది.‘అవును మహారాజా, అందరూ... ముఖ్యంగా మనుషులు మమ్మల్ని ‘గడ్డిపరక’ అంటూ హేళనగా మాట్లాడతారు. మేము వారికి ఎంత సేవ చేస్తామో, ఎంతగా ఉపయోగపడతామో తమకు మాత్రం తెలీదా? అందరూ పలుచన చేస్తున్నట్టు మేమంతా విడివిడిగా పరకలమే కావొచ్చు కానీ, ఐకమత్యంగా ఏనుగునే బంధించిన మా చరిత్ర గురించి అందరూ కథలు కథలుగా చెప్పుకోవటం వింత కాదు, కొత్త కూడా కాదు.’గడ్డిపరక గతవారం రోజుల్నించి ఆహారంగా కనీసం నీటిని కూడా పీల్చుకోకపోవటాన వచ్చిన నీరసంతో ఆగింది. క్షణం తర్వాత తిరిగి కొనసాగించింది.‘సమస్త భూమండలంలో మనుషులకి, పక్షులకి, జంతువులకి మాత్రమే కాదు, మాకు కూడా ప్రాణం ఉంటుంది మహారాజా. ఆ మాటకొస్తే అన్నిటికంటే అల్పప్రాణులం మేమే. ఈ సృష్టిలో మిగతా ఎవ్వరికీ అపకారం తలపెట్టని జాతి అంటే మాదే. మనుషులు ప్రకృతిని, మిగిలిన ప్రాణుల్ని నాశనం చేస్తారు. కొన్ని క్రూర జంతువులు వేటాడి మరీ అవతలివాటిని చంపుతాయి. ప్రకృతి సిద్ధమైన నీరు ఇళ్లనీ, ఊళ్ళనీ ముంచేస్తుంది. నిప్పు దేన్నయినా తగలబెడుతుంది. గాలి ఎంతటి దాన్నయినా చెదరగొడుతుంది. మేమొక్కళ్ళమే– కేవలం మేమొక్కళ్ళమే ఎవరికీ ఏ హానీ తలపెట్టకుండా మా బతుకేదో మేం బతుకుతుంటాము. అలాంటిది మమ్మల్ని బతకనీయకుండా చేస్తున్నారు మహారాజా.ఏనుగుల్లాంటి బలమైన జంతువులు ఒకసారి మా మీద కాలేస్తే అధఃపాతాళానికి వెళ్ళిపోతాము. కొన్ని కొన్నిసార్లు పునర్జన్మ అంటూ కూడా ఉండదు. మేకలు, గొర్రెలు, కుందేళ్లు తమతమ కోర పళ్లతో కొరికి పరపరా నములుతుంటే మా బాధ వర్ణనాతీతం. అదైనా పర్లేదు మహారాజా, పుట్టి నాల్రోజులు కూడా కాని పచ్చటి పసికందు పసరికల్ని కూడా వదలకుండా అలానే తింటుంటే, మా కళ్ళముందే అవి నిర్జీవమై పోతుంటే, మా గోడు ఎవరికి చెప్పుకోవాలి మహారాజా. తలచుకుంటుంటేనే కడుపు తరుక్కుపోతుంది.’ గడ్డిపరక కన్నీరు పెట్టుకుంది.సింహానికి జాలేసింది. కానీ, దాని బాధ విచిత్రంగా అనిపించింది. ఏనుగులాంటివి నడుస్తుంటే గడ్డి నలగదా? కుందేళ్ళ ఆహారమే పసిరిక ఐతే వాటిని తినకూడదా? మరి జంతువులు నడవకూడదా? మేకలు పస్తులుండాలా? సృష్టిలోని ప్రతి జీవి మనుగడకి ప్రకృతి కొన్ని దిశానిర్దేశాలు చేసింది కదా. అది కాకూడదంటే ఎలా? ఆ మాటే గడ్డిపరకతో అంది.‘గడ్డీ! నీ కోరికెందుకో విచిత్రంగా అన్పిస్తుంది. ప్రకృతి ధర్మం ప్రకారం పులులు, సింహాలకి మిగిలిన జంతువులే ఆహారం.గద్దలకి కోడిపిల్లలు ఆహారం. పాములకు కప్పలు ఆహారం. అలాగే నువ్వూ కొన్నిటికి ఆహారం. పెద్దపెద్ద జంతువులు నడుస్తుంటే నువ్వే కాదు, కొన్ని వేల జీవరాశులు కంటికి కనిపించనివి మరణిస్తుంటాయి. అంత మాత్రం చేత అవన్నీ నిషిద్ధమైతే ఎలా? అయినా– నీ బాధేమిటో నాకు స్పష్టంగా అర్థం కావటం లేదు. ఇంకొంచం వివరంగా చెప్పు.’‘అదే మహారాజా, నేనూ అక్కడికే వస్తున్నా. ప్రకృతి ధర్మం ఎప్పుడూ బలవంతుల వైపే ఉంటుంది. ఎందుకంటే– అది తయారుచేసేది బలవంతులు, అధికారం ఉన్నవాళ్ళే కదా. అల్పప్రాణులమైన మాలాంటి వాళ్ళు వాటిని కచ్చితంగా పాటించాల్సిందే. అంతెందుకు మహారాజా, ఒక ప్రశ్న అడుగుతాను. నిజాయితీగా సమాధానం చెప్పండి. ఒక మనిషి కారులో వెళుతున్నాడనుకోండి. ఒక సైకిలో, స్కూటరో తెలిసో, తెలియకో ఆ కారుకి అడ్డంగా వస్తే అతడెంత కోప్పడతాడు? వీలైతే ఒకసారి తొక్కిస్తే, జీవితంలో ఇంకెప్పుడూ ఇలా ఎవరికీ అడ్డుపడకూడదనే గుణపాఠం నేర్పించాలనుకుంటాడా లేదా? మరి అదే మనిషి కారుకి ఏ లారీనో, బస్సో ఎదురుగా వస్తే ఏమనుకుంటాడు? మనసులో వాళ్ళను తిట్టుకున్నా ‘వాడితో మనకెందుకులే గొడవ? పక్కకి జరిగి వెళితే మనకే మంచిది’ అనుకుంటాడు కదా.ఒకే మనిషి ఒకే సందర్భంలో రెండు రకాలుగా ఎందుకు ఆలోచించాడు? తనకంటే బలహీనమైన సైకిలువాణ్ణి చూస్తే ఎందుకు కొట్టాలనిపించింది? బలవంతుణ్ణి చూస్తే శాంతం దానంతట అదే ఎందుకు, ఎలా వచ్చింది? అంటే – మనిషి ఆలోచన, ధర్మం.. సందర్భాన్ని బట్టి మారాయి తప్ప ప్రకృతి నిర్దేశించిన నియమాల ప్రకారం కాదు కదా? ఐతే – ఇక్కడ నేను మనిషి ఆలోచనా విధానం గురించి ఎందుకు చెప్పానంటే, మనలో చాలామంది ఇప్పుడు మానవుల్లాగే ఆలోచిస్తున్నారు కాబట్టి. ఇప్పుడు చెప్పండి మహారాజా, నా ప్రశ్న న్యాయమైనదా కాదా? పరిష్కరించవలసిందా కాదా?’అన్ని ప్రాణులు ఆశ్చర్యంగా చూస్తుంటే, గడ్డిపరక చేతులు జోడించి ‘మహారాజా, ఇప్పుడు మీరు చెప్పబోయే పరిష్కారం భవిష్యత్ తరాలకు, మాలాంటి అల్ప జీవులకు ఒక వేదం కావాలి. దయచేసి అన్నీ అలోచించి నిర్ణయం తీసుకోండి. మీ నిర్ణయమే మాకు శిరోధార్యం’ వినమ్రంగా అంది.మిగిలిన జంతువులు, పక్షులు అప్పటివరకూ నిశ్శబ్దంగా వున్నాయి. ఇన్నాళ్లూ తాము ఎప్పుడూ ఈ కోణంలోంచి ఆలోచించలేదు. ఏదో పుట్టాం... తింటున్నాం... బతుకుతున్నాం... అనుకుంటున్నామే గానీ, మొదలేదో తుదియేదో తెలీని అంత అల్పప్రాణి గడ్డిపోచలో ఇంత ఆలోచన ఉందా? దాని గుండెల్లో ఇంత విషాదం గూడుకట్టుకుని ఉందా?రాజైన సింహం దానికి ఏం సమాధానం చెప్పబోతుందో అని జంతువులు, పక్షులు, మిగిలిన జీవజాలం అన్నీ చెవులు రిక్కించి వినటానికి సిద్ధంగా వున్నాయి. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని మరీ అందుకోసం ఎదురుచూస్తున్నాయి.ఇప్పుడు సింహం చెప్పబోయే సమాధానం భవిష్యత్ తరాలకు ఒక మార్గనిర్దేశనం అవుతుంది. చరిత్ర పుస్తకంలో అది ఒక పాఠమవుతుంది. ఎన్నో ఒడిదుడుకులు చూసి, జీవితాన్ని కాచి వడబోసిన సింహం దీనికి ఏం సమాధానం చెబుతుంది?ఇన్ని రోజులూ ఒకెత్తు! ఇక మీదట మరోఎత్తు! సృష్టిలో ప్రతి జీవికీ జీవించే హక్కు ఉంటుంది. అవతలి వాళ్ళని బాధపెట్టి, వారి బలహీనతల్ని సోపానాలుగా మార్చుకుని పైకెదిగే, ఎదగాలనుకునే వాళ్ళ ఆలోచనలకు ఇపుడు సింహం ఇవ్వబోయే తీర్పు ఒక చెంపపెట్టు కావాలి. అన్నీ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. సింహం కూడా ఆలోచనలో పడింది. ఇప్పటివరకూ ఎవరూ స్పృశించని కోణం ఇది. ఎప్పుడూ ఎదుర్కోని ప్రశ్న. ప్రశ్న చాలా చిన్నదే. కానీ, జవాబు చాలా పెద్ద చిక్కే. ఏం సమాధానం చెప్పాలి? ఎదో ఒక తీర్పయితే చెప్పొచ్చు, కానీ అది ఎవ్వరినీ నొప్పించకూడదు. అందరినీ ఒప్పించగలగాలి. చరిత్రాత్మకమైన తీర్పు ఇవ్వబోయేటప్పుడు అన్ని విషయాలూ కూలంకషంగా ఆలోచించాలి.తప్పొప్పుల్ని బేరీజు వేసుకోవాలి. సమస్యను అన్ని వైపులనించీ నిశితంగా పరిశీలించాలి. రేప్పొద్దున ఎవరూ తనని గాని, తానిచ్చిన తీర్పుని గాని వేలెత్తి చూపకూడదు. దానికి గానూ, సింహానికి తనకున్న అనుభవం చాలదనిపించింది. దీని గురించి తన మంత్రులతో, న్యాయ కోవిదులతో, మేధావులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలి. అందుకు గానూ కొంత సమయం పడుతుంది.ఆ మాటే చెప్పింది ‘ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. గడ్డిపరక చిన్నదే కానీ, అదడిగిన ప్రశ్న భూమండలమంత పెద్దది. అంతపెద్ద సమస్యకి సమాధానం ఒక నిమిషంలో వెల్లడించతరం కాదు. దానికిగానూ నాక్కొంత సమయం కావాలి. నాలుగోరోజు ఉదయం తిరిగీ మనందరం ఇక్కడే కలుద్దాం. అప్పటికి నేను దీనికి ఒక న్యాయసమ్మతమైన పరిష్కారం కనుగొనగలనని భావిస్తున్నాను. అందరూ సహకరించగలరని విజ్ఞప్తి.’సింహం లేచింది. అన్ని జంతువులూ అక్కణ్ణించి నిష్క్రమించాయి. ఆ రాత్రి అడవిలో ప్రతి జీవి ఒకే ప్రశ్నతో నిద్రపోయింది– గడ్డిపరకకు న్యాయం జరుగుతుందా?∙∙ అయితే– రేపు తీర్పు అనగా, ముందురోజు రాత్రి. చిన్నగా ప్రారంభమైన వర్షం పెనుతుఫానుగా మారింది. చెట్లు నేల కూలాయి, రాళ్లు విరిగి పడ్డాయి, కొండలమీది నుంచి ప్రవహించిన నీరు అడ్డొచ్చిన ప్రతి ఊరునీ, వాడనీ తనలో కలిపేసుకుని సముద్రంలో లీనమైంది. అడవిలోని జంతువులు చెల్లాచెదురయ్యాయి. మిగిలిన జీవరాశులు కకావికలమయ్యాయి. ఎన్ని బతికాయో, ఎన్ని చనిపోయాయో ఎవరికీ తెలీదు. సింహం గుహ మొత్తం కూలబడింది. ఆ అర్ధరాత్రిలో, ఆ నిశీధిలో ఎవరు ఎటువైపు వెళ్లాలో తెలీక పక్షుల అరుపులు, జంతువుల రోదనలు, హాహాకారాలు... వెరసి అదొక శ్మశానాన్ని తలపిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా – నేనే బలవంతుడినని గర్వపడిన ఏనుగుల్లేవు.రాజునని అహంకరించిన సింహాల్లేవు. పరులని మోసగించే నక్కల్లేవు. పక్షులకి గూళ్ళులేవు. పాములకు బొరియల్లేవు.పులులూ, అడవి దున్నలూ, జింకలూ, కొమ్ములు విసిరే ఎద్దులూ– ఏవీ లేవు. దేని జాడా తెలియటం లేదు. ఉన్నదల్లా నిర్జనమైన అడవి, నిర్వీర్యమైన ప్రకృతి, శ్మశాన నిశ్శబ్దం!అప్పడు, ఆ దృశ్యం ‘ఎంతటి బలవంతుడైన ప్రకతి ముందు దిగదుడుపే’ అన్న జీవిత సత్యాన్ని చెబుతుంది.తెలుసుకున్న వాళ్లకి తెలుసుకున్నంత.తెల్లవారింది.ఆ నిర్జనారణ్యంలో, ఆ శ్మశాన సమాధుల్లో, అల్లకల్లోలాల మధ్యలో... కొండాకోనల వెనకనించి దిక్కుల్ని చీల్చుకుంటూ వస్తున్న ప్రభాత సూర్యకిరణాలు.! భూమి బద్దలైనా, ఆకాశం తలక్రిందులైనా, సముద్రాలు ఉప్పొంగినా... అలుపెరగని సైనికుడిలా, నిద్రావస్థ నుంచి ప్రపంచాన్ని జాగృతం చేయటానికి అప్పుడప్పుడే భూమిపైకి వస్తున్న తొలి రవికిరణాలు! వాటినే చూడటానికన్నట్టు ధీటుగా నిలబడ్డ గడ్డిపోచ ఒకటి! నడుము మీద చెయ్యేసి, రొమ్ము విరగదీసి సూర్యుడికి అభిముఖంగా, దమ్ము చూపిస్తూ నిటారుగా నిలబడ్డ ఆ గడ్డి పరక... ఏం పాఠం చెబుతుంది?కొన్నిసార్లు తగ్గటమే– నెగ్గటం – ప్రపంచంలో అయినా, జీవితంలో అయినా!‘ప్రకృతికి, పరమాత్ముడికి ఎంతటి వీరుడైనా, ధీరుడైనా తలవంచాల్సిందే’ అర్థం చేసుకున్నోళ్లకి అర్థం చేసుకున్నంత!!తనను తాను బ్రహ్మంగా భావించిన సింహం కనుమరుగైంది. బ్రహ్మంలో తానొక భాగమని తెలుసుకున్న గడ్డిపరక మాత్రం నిలిచింది.అహం బ్రహ్మాస్మి!! సడ్డా సుబ్బారెడ్డిఇదీ చదవండి: ‘అమ్మా.. నా ఇంటికి నన్ను తీసుకెళ్లు!’ బాలుడి మాటలలో మిస్టరీ! -
ఒక్కరోజూ కలిసి లేరు... విడిపోవడానికి 20 ఏళ్లు! ట్విస్ట్ ఏంటంటే?
ఇదో విచిత్రమైన విడాకుల కేసు. పెళ్లి జరిగింది కానీ, ఇద్దరూ ఒక్క రోజూ కలిసి జీవించలేదు, కాపురం చేయలేదు. దాంపత్య జీవితం మొదలుకాకముందే వారి వివాహ బంధం ముగిసిపోయింది. అయితే వీరు వేరు పడడానికి, విడాకులు తీసుకోవడానికి 20 ఏళ్లు పట్టింది. కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఈ కేసు నడిచింది. చివరికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించి సుప్రీంకోర్టు ఈ వివాహాన్ని రద్దు చేసి, ఈ కేసుకు ముగింపు పలికింది.తమిళనాడుకు చెందిన శివశంకరన్, సంతిమీనాల్కు 2002లో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఆమె అత్తారింటికి వెళ్లలేదు. ఎవరికీ చెప్పకుండా పెళ్లి రోజు రాత్రి కల్యాణమండపం నుంచి సొంతూరికి వెళ్లిపోయింది. మరుసటి రోజు బంధువులు ఆమెను తిరిగి తీసుకొచ్చి కాపురం చక్కబెట్టేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. పెళ్లి ఆమె సమ్మతితో జరగలేదని భావిస్తోందని, అందుకే ఈ విధంగా చేస్తోందని భర్త పేర్కొన్నాడు. భార్య ప్రవర్తనతో తాను మానసికంగా కుంగిపోయానని పేర్కొంటూ హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13(1)(ఐ–ఏ)కింద 2002లోనే విడాకుల నోటీసు పంపాడు.వివాహ పునరుద్ధరణ కోరిన భార్య‘అదనపు కట్నం కోసం తనను వేధించారని, తన భర్త నుంచి అతని సోదరులే తనని దూరం చేశారని సంతిమీనాల్ ఆరోపించారు. వివాహ పునరుద్ధరణ కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు..ఆమె భర్త సోదరులపై చేసిన ఆరోపణలు మౌఖికంగా తప్ప సాక్ష్యాధారాలను సమర్పించలేదు. భార్యభర్తలు కలిసి జీవించకపోవడం, వివాహ పునరుద్ధరణ కోసం చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోవడం తదితర కారణాలను దృష్టిలో ఉంచుకుని 2008లో ట్రయల్ కోర్టు విడాకులు మంజూరు చేసింది. అప్పటికి వారికి వివాహం జరిగి ఆరేళ్లు.ఆరు రోజులకే రెండో పెళ్లివిడాకుల తీర్పు వచ్చిన ఆరు రోజులకే భర్త రెండో వివాహం చేసుకున్నాడు. విడాకుల తీర్పుపై మొదటి భార్య అప్పీల్‌కు Ðð ళ్లింది. అప్పిలేట్కోర్టు ఆమె వాదనను అంగీకరిస్తూ వివాహ బంధాన్ని కొనసాగించాలని తీర్పు ఇచ్చింది. విడాకుల డిక్రీని రద్దు చేసింది. భర్త ఈ తీర్పును హైకోర్టులో సవాలు చేశాడు. అప్పీలు కోర్టు తీర్పును పక్కన పెట్టి, ట్రయల్ కోర్టు ఇచ్చిన విడాకుల డిక్రీని సమర్థిస్తూ హైకోర్టు 2018లో తీర్పు ఇచ్చింది. అప్పటికే వారికి పెళ్లయి 15 సంవత్సరాలకు పైగా గడిచిపోయాయి.రివ్యూ పిటిషన్ దాఖలువివాహ బంధం కొనసాగడం లేదన్న ఒక్క కారణంతో విడాకులు మంజూరు చేసే అధికారం ట్రయల్, హైకోర్టులకు లేవని పేర్కొంటూ ఆమె రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. చివరకు ఈ వివాదం సుప్రీంకోర్టు చేరింది. భర్త నుంచి ఎటువంటి మెయింటెనెన్స్ కోరడం లేదని, రెండో వివాహ స్థితిని ప్రభావితం చేయాలని మొదటి భార్య భావించడం లేదని ఆమె తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చాడు. అయితే ‘మొదటి వివాహం ముగిసిపోయిందనే వాదనను ఆమె సమ్మతించడం లేదని పేర్కొన్నాడు.’ ఈ దశలో ఏం చేయాలనేదే సుప్రీంకోర్టు ముందున్న అసలు సమస్య.ఆర్టికల్ 142ని వినియోగించుకున్న ‘సుప్రీం’భర్తతో కలిసి ఉంటానని భార్య చెప్పినప్పటికీ ఏళ్ల తరబడి ఆమె వేరుగా ఉంటోంది. వారి బంధం కొనసాగించేందుకు మధ్యవర్తుల ప్రయత్నాలూ ఫలించలేదు. ఈ కారణాలతో వివాహ బంధం కొనసాగే పరిస్థితులు కనిపించడం లేదని కోర్టు నిర్ధారణకు వచ్చింది. పైగా ఆర్టీఐ కింద భర్త వ్యక్తిగత వివరాలు కోరడం, రెండో వివాహంపై భర్త పని చేసే కార్యాలయ ఉన్నతాధికారులకు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం. ఐపీసీ సెక్షన్ 494 కింద కేసు పెట్టడం వంటి అంశాలను సుప్రీంకోర్టు పరిశీలించింది. కేవలం విడిగా ఉన్నారనే అంశమే కాకుండా, ఇతర వాటినీ పరిశీలించింది. తిరిగి చక్కదిద్దలేని విధంగా వివాహ బంధం వికటించిందనే అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు– భారతరాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద ప్రత్యేక అధికారాల్ని వినియోగించుకుని వారికి విడాకులు మంజూరు చేసింది. వారి వివాహ బంధానికి ముగింపు పలికింది. దీంతో పాటు ఆమె ఆర్థిక ప్రయోజనాలను కాపాడడానికి ప్రాధాన్యం ఇచ్చింది. ఆమెకు శాశ్వత భరణం ఏకమొత్తం ఒకేసారి చెల్లించాలని ఆదేశించింది.ఈ కేసులో కేవలం ఏళ్ల తరబడి విడిగా ఉండడం, మానసిక క్రూరత్వాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోలేదు. ఈ రెండు ఉన్న అన్నీ కేసుల్లోనూ ఆర్టికల్ 142 కింద విడాకుల మంజూరుకు అవకాశం లేదు. ప్రత్యేక పరిస్థితులను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. కలిసి జీవించలేని ఇద్దర్ని ఒక వివాహ బంధం పేరుతో బంధించి ఉంచడం కంటే విడివిడిగా అయినా ప్రశాంత జీవితం గడపడమే మేలని భావించింది. వారి వివాహ బంధానికి, సుదీర్ఘన్యాయ పోరాటానికి సుప్రీంకోర్టు ముగింపు పలికింది. ఇద్దరికీ కొత్త జీవితానికి మార్గం చూపింది.- దిలీప్ మాదిరెడ్డిఇదీ చదవండి: కూతురి కోసం తండ్రి మొక్కు.. 75 ఏళ్లుగా దేశానికే పండుగ! -
కూతురి కోసం తండ్రి మొక్కు.. 75 ఏళ్లుగా దేశానికే పండుగ!
కొన్ని పండుగల వెనుక సంస్కృతీ సంప్రదాయాల చరిత్ర ఉంటే, మరికొన్ని పండుగలు భావోద్వేగాలు, విశ్వాసాలతో ముడిపడి ఉంటాయి. అలాంటి అరుదైన పండుగే ‘నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లా మెజొరానా’. పనామాలోని గ్వరారేలో ప్రతి ఏడాది సెప్టెంబర్ మాసంలో ఈ వేడుకలను నిర్వహిస్తారు. పనామా ప్రజల గ్రామీణ సంస్కృతి, సంగీతం, నృత్యం, సంప్రదాయ దుస్తులు, రైతుల జీవన విధానాన్ని ప్రతిబింబించే ఈ ఉత్సవం 1949లో ప్రారంభమైంది.ఈ మెజొరానా పండుగ ప్రారంభం వెనుక ఓ తండ్రి వేదన ఉంది. ఈ పండుగ నిర్వాహకులలో ఒకరైన మాన్యుయెల్ ఫెర్నాండో జారాతె కుమార్తె లుకీమియాతో బాధపడేది. దీంతో జారాతె ‘వర్జిన్ డి లాస్ మెర్సిడెస్’ అమ్మవారిని వేడుకున్నాడు. తన కుమార్తె ఆరోగ్యం బాగుపడితే, అమ్మవారి దయకు కృతజ్ఞతగా ప్రతి ఏడాది జానపద సంస్కృతిని ప్రతిబింబించేలా ఒక గొప్ప ఉత్సవాన్ని నిర్వహిస్తానని మొక్కుకున్నాడు. ఆశ్చర్యకరంగా ఆ బాలిక కోలుకోవడంతో– ఇచ్చిన మాట ప్రకారం 1949లో మొదటిసారి ఈ జానపద సంబరాలకు శ్రీకారం చుట్టారు. ప్రతి ఏటా సెప్టెంబర్‌లో నిర్వహించే ఈ వేడుకలకు వేలాదిమంది భక్తులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు తరలివస్తారు. ఈ ఏడాది ఈ వేడుకలను సెప్టెంబర్ 19 నుంచి 28 వరకు నిర్వహించనున్నారు.పనామా గ్రామీణ సంప్రదాయాలను కాపాడటమే ఈ మెజొరానా పండుగ లక్ష్యం. ముఖ్యంగా రైతుల జీవన విధానం, వారి పాటలు, సంగీతం, నృత్యాలు, దుస్తులు, చేతివృత్తులు, స్థానిక కళలను తరువాతి తరాలకు అందించాలనుకున్నారు. అందులో ప్రధాన పాత్రను ‘మెజొరానా’ అనే ఒక ప్రత్యేకమైన సంప్రదాయ సంగీత వాయిద్యానికి ఇచ్చారు. పరిమాణంలో చిన్నదిగా కనిపించినా దాని శబ్దానికి ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా పనామా గ్రామీణ కవులు పాడే ‘దెసిమా’ పాటలకు ఇది సంగీత సహకారం అందిస్తుంది. సెడార్, బాల్సో, వోలడార్ వంటి స్థానిక కలపతో ఈ మెజొరానాలను తయారు చేస్తారు. గతంలో వీటి తంత్రుల కోసం కోడి పేగులను ఉపయోగించేవారు, ప్రస్తుతం నైలాన్ తీగలను ఉపయోగిస్తున్నారు.కారెటాస్ పరేడ్ మరో ప్రత్యేకత అలంకరించిన ఎద్దుల బండ్ల ఊరేగింపు. పండుగ ముగింపు వేడుకల్లో ఈ ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.‘ఫెస్టివల్ ఆఫ్ మెజొరానా’ కేవలం ఒక సంగీత వేడుక కాదు. అనేక సంప్రదాయ కళలకు వేదిక. దాదాపు 75 ఏళ్లకు పైగా కొనసాగుతున్న ఈ వేడుక ప్రాంతీయ అస్తిత్వాన్ని బలోపేతం చేయడంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల సాంస్కృతిక వైవిధ్యానికి కూడా వేదిక కల్పిస్తోంది. ఒక కుటుంబం మొక్కుకున్న మొక్కు ఓ దేశానికి పండుగగా మారి, జానపద సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది.పాటల్లో పలికే రైతు జీవితం..ఈ ఉత్సవంలోని ‘దెసిమా’ పాటలు ప్రత్యేక ఆకర్షణ. గ్రామీణ జీవితం, రైతుల కష్టాలు, ప్రేమ, ప్రకృతి వంటి ఎన్నో విషయాలను పాటల రూపంలో చెప్పే సంప్రదాయం ఇది. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ పోటీల్లో పాల్గొంటారు.- రమా జంబులఇదీ చదవండి: శాపంతో చెట్లుగా మారిన దంపతులు.. వినాయక పూజలో దాగిన కథ! -
శాపంతో చెట్లుగా మారిన దంపతులు.. వినాయక పూజలో దాగిన కథ!
పూర్వం మాళవదేశంలో ఔరవుడు అనే విప్రుడు ఉండేవాడు. అతడు వేదవేదాంగవేత్త, పండితుడు, మేధావి. అతడి భార్య సుమేధ. భర్తకు తగిన ఇల్లాలు. ఆ దంపతులకు ఒక బాలిక జన్మించింది. వారు ఆమెకు శమీక అని నామకరణం చేసి, అల్లారుముద్దుగా పెంచసాగారు.శమీకకు ఎనిమిదేళ్లు వచ్చాక ఔరవుడు కుమార్తె కోసం వరాన్వేషణ ప్రారంభించాడు. ధౌమ్యుడి పుత్రడు, శౌనక మహర్షి శిష్యుడు, గురుసేవాతత్పరుడు అయిన మందారుడు అనే బాలుడి గురించి విన్నాడు. ధౌమ్య శౌనకులతో తన ఇంటికి సకుటుంబ సపరివారంగా ఆహ్వానించి, మందారుడితో తన కుమార్తె శమీక వివాహాన్ని జరిపించాడు. వివాహం తర్వాత మందారుడు తన గురుకులానికి వెళ్లిపోయాడు.కొంతకాలానికి శమీక వ్యక్తురాలైంది. ఈ సంగతి తెలుసుకుని, మందారుడు అత్తవారింటికి వచ్చాడు. ఔరవుడు అతడికి మృష్టాన్న భోజనం పెట్టి, అల్లుడి మర్యాదలన్నీ చేశాడు. ధన కనక రాశులతో కుమార్తెను అప్పగించాడు. ‘విప్రపుత్రా! నా కుమార్తెను విధి విధానంగా నీకు అప్పగిస్తున్నాను. ఆమెను అత్యంత ప్రేమగా చూసుకుంటూ, జాగ్రత్తగా దాంపత్యం చేయాలి’ అని పరిపరి విధాలుగా జాగ్రత్తలు చెప్పి, సాగనంపాడు. శమీక మందారులు వెంటనే ఆశ్రమానికి వెళ్లక వనంలోనే సల్లాపాలాడుతూ గడపసాగారు. కొద్ది రోజులకు వారు ఉంటున్న వనానికి భృశుండి మహర్షి వచ్చాడు. దీర్ఘతపస్సు ఆచరించడం వల్ల ఆయన భ్రూమధ్యంలో తొండం అంకురించింది. నుదుట తొండం ఉన్న ఆ మహర్షి రూపాన్ని చూసి, శమీక మందారులు యవ్వన చాపల్యంతో పరిహసించారు.వారి పరిహాసానికి భృంశుడికి కోపం వచ్చింది. ‘మూర్ఖులారా! మీరు నన్ను పరిహసించి నవ్వారు. అందువల్ల మీరు సర్వప్రాణులూ వర్జించే వృక్షాలుగా మారిపోండి’ అని శపించారు. భృంశుడి శాపానికి శమీక మందారులు భయంతో వణికిపోయారు. వెంటనే క్షమించమంటూ ఆయన పాదాల ముందు మోకరిల్లారు.‘మీరు నా నుదుటనున్న తొండాన్ని చూసి నవ్వారు. అందువల్ల తొండమున్న దేవుడైన వినాయకుడు మిమ్మల్ని కటాక్షించినప్పుడు మీకు మీ నిజరూపాలు తిరిగి వస్తాయి’ అని చెప్పి, వెళ్లిపోయాడు. శమీక శమీవృక్షంగా, మందారుడు మందారవృక్షంగా మారిపోయారు. అత్తవారింటికి వెళ్లిన శిష్యుడు ఎన్నాళ్లయినా తిరిగి రాకపోవడంతో శౌనకుడు శిష్య సమేతంగా ఔరవుని ఇంటికి వెళ్లి, మందారుడి గురించి అడిగాడు. తాను కూతురితో సహా అల్లుడిని చాలారోజుల కిందటే పంపానని ఔరవుడు బదులిచ్చాడు. పిల్లలు జాడలేకుండా పోవడంతో శౌనకుడు, ఔరవుడు– ఇద్దరూ చింతాక్రాంతులయ్యారు. అడవిమార్గంలో వారిని ఏ క్రూరమృగాలైనా చంపేసి ఉంటాయేమోనని లేదా చోరుల బారినపడి హతమైపోయి ఉంటారేమోనని భయపడ్డారు. చివరకు ఇద్దరూ కలసి శమీక మందారులను వెదకడానికి అడవిలోకి వెళ్లారు. అటవీమార్గంలో వారి పాదచిహ్నాలను గుర్తించారు. అలసిపోవడంతో ఔరవ శౌనకులు అడవిలోని కొలనులో స్నానం చేసి, ధ్యానమగ్నులయ్యారు. ధ్యానంలో వారికి జరిగినదంతా తెలిసింది.‘మందారుడిని చదువు కోసం అతడి తండ్రి నా గురుకులంలో వదిలి వెళ్లాడు. అతడికి నేనిప్పుడు ఏమని బదులివ్వాలి?’ అని శౌనకుడు శోకతప్తుడయ్యాడు. ఔరవుడిదీ అదే పరిస్థితి. గణేశుడిని ఆరాధించి, వీరి శాపవిమోచనను కోరుకుందాం అని ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు. వెంటనే వారు ఒంటికాలిపై నిలబడి గణేశుని కోసం తపస్సు ప్రారంభించారు. నిరాహారులై వారు ఒంటికాలిపై ఏకధాటిగా సాగిస్తున్న తపస్సుకు గణేశుడు ప్రసన్నుడయ్యాడు. వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఏకదంతుడు కళ్లముందు నిలిచే సరికి శౌనక ఔరవులు భక్తిపారవశ్యంతో అతడిని స్తుతించారు.‘భక్తులారా! మీ తపస్సుకు మెచ్చాను. మీ మనోభీష్టమేమిటో చెప్పండి, నెరవేరుస్తాను’ అని పలికాడు గజాననుడు. శౌనక ఔరవులు శమీక మందారుల వృత్తాంతాన్ని చెప్పి, వారికి శాపవిమోచనం కలిగించాలని కోరారు. గణేశుడు ‘తథాస్తు’ అని పలికాడు.‘నేను ఎల్లప్పుడూ మందారవృక్ష మూలంలో నిలిచి ఉంటాను. శమీవృక్షంలోనూ కొలువై ఉంటాను. నాకు దూర్వాంకురాలే కాకుండా శమీపత్రాలు కూడా ప్రీతిపాత్రమవుతాయి. దూర్వాంకురాలు, మందార పత్రాలు లభించనప్పుడు శమీపత్రాలతో పూజిస్తే, నేను ప్రసన్నుడనవుతాను. దూర్వాంకుర, మందారపత్ర, శమీపత్రాలతో నన్ను పూజించేవారికి మనోవాంఛిత సిద్ధి, మోక్షప్రాప్తి కలుగుతాయి’ అని పలికి గణపతి అంతర్ధానమయ్యాడు.పురావిశేషం..ఇది దేశంలోనే అత్యంత అరుదైన ఆలయం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరా జిల్లా కుమావూ కొండల ప్రాంతంలో చితాయి గ్రామంలో ఉన్న ఈ ఆలయాన్ని స్థానికులు ‘గోలూ దేవతా’ ఆలయంగా పిలుస్తారు. ఇక్కడి మూలవిరాట్టు ‘చితాయీ గోలూ దేవత’ శివుడి అవతారమైన గౌరభైరవుడు. గౌరభైరవుడు సత్వరన్యాయం చేస్తాడని భక్తుల విశ్వాసం. న్యాయం కోరుతూ రాసే విజ్ఞాపనపత్రాలను భక్తులు ఈ ఆలయంలో వేలాడదీస్తారు. తమకు న్యాయం జరిగితే, ఆలయానికి తిరిగి వచ్చి కంచు లేదా రాగి లేదా ఇత్తడి లోహాలతో తయారు చేసిన గంటలను వేలాడదీస్తారు. ఈ ఆలయంలో ఎక్కడ చూసినా, అసంఖ్యాకంగా గంటలు, భక్తులు వేలాడదీసే విజ్ఞాపనపత్రాల కాగితాలు కనిపిస్తాయి.- సాంఖ్యాయనఇదీ చదవండి: కృష్ణాష్టమి తెలిసిందే.. ‘రాధాష్టమి’ ఎంతమందికి తెలుసు? -
‘అమ్మా.. నా ఇంటికి నన్ను తీసుకెళ్లు!’ బాలుడి మాటలలో మిస్టరీ!
2010... ఓక్లహామానగరం ప్రశాంతంగా నిద్రపోతోంది. రోడ్డుపై అడపాదడపా వెళ్లే వాహనాలు మినహా ఎలాంటి అలికిడీ లేదు. అంతలో ర్యాన్ హ్యామన్స్ అనే నాలుగేళ్ల బాలుడు నిద్రలోనే గట్టిగా ఏడవడం ప్రారంభించాడు. అది విని తల్లి సిండీ మేలుకుంది. ఏదైనా పీడకల వచ్చేందేమో అనుకుని ర్యాన్‌ను దగ్గరకు తీసుకుని ఓదార్చింది. అయినా ఆ బాలుడు గుక్క తిప్పుకోకుండా ఏడుస్తూనే ఉన్నాడు. కాసేపటి తర్వాత నెమ్మదిగా కళ్లు తెరిచాడు.‘అమ్మా... నన్ను హాలీవుడ్‌లోని నా ఇంటికి తీసుకెళ్లు. అక్కడున్న నా వాళ్లను వెంటనే చూడాలి’ అని అనేసరికి సిండీకి ఏమీ అర్థం కాలేదు. ఏదైనా కల వచ్చి అలా అన్నాడేమో అని సరిపెట్టుకుంది. రోజులు గడిచేకొద్దీ ర్యాన్ మాటలు మరింత విచిత్రంగా మారాయి. ‘నాకు పెద్ద ఇల్లు, కారు ఉండేవి. ఇంటి ముందు స్విమ్మింగ్ పూల్ కూడా ఉండేది. నేను చాలా డబ్బున్నవాడిని’ అని తరచుగా చెబుతుండేవాడు. తాను గతంలో మరో కుటుంబంతో జీవించానని, అక్కడికి తిరిగి వెళ్లాలని పట్టుబట్టేవాడు. అతడి మాటల్లో ఏౖదైనా నిజం ఉందేమో తెలుసుకోవాలని భావించిన సిండీ, ఓ రోజు లైబ్రరీ నుంచి హాలీవుడ్‌కు సంబంధించిన కొన్ని పుస్తకాలు తెప్పించి కుమారుడికి ఇచ్చింది.అవి చూస్తున్న ర్యాన్‌కు 1932లో వచ్చిన ‘నైట్ ఆఫ్టర్ నైట్’ సినిమా ఫొటో ఒకటి బాగా ఆకర్షించింది. అందులో ఓ వ్యక్తిని చూపిస్తూ, ‘ఇది నేనే...’ అంటూ బిగ్గరగా అరిచాడు. ఆ వ్యక్తిని చూసిన తల్లికి ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆ వ్యక్తి సినిమాలో హీరో కాదు. పెద్ద నటుడు కూడా కాదు. ఆయన పేరు కూడా ఫొటోలో లేదు. ఆ ఫొటోలోని ఓ వ్యక్తిని చూపించి, అతడు జార్జ్ అని చెప్పాడు. నిజంగానే అతడు ప్రముఖ నటుడు జార్జ్ రాఫ్ట్ కావడంతో సిండీ అయోమయానికి గురైంది.‘ఇది కేవలం ఓ చిన్నారి ఊహా? లేక నిజంగా అతడి జ్ఞాపకాల్లో దాగిన ఏదైనా గతం ఉందా?’ ఈ ప్రశ్నే చివరకు ఈ కేసును డాక్టర్ జిమ్ టక్కర్ వద్దకు తీసుకెళ్లింది. గత జన్మ జ్ఞాపకాలపై పరిశోధనలు చేస్తున్న ఆయన, ఈ ఉదంతంపై లోతుగా అధ్యయనం చేశారు. ఆ ఫొటోలోని వ్యక్తిని మార్టీ మార్టిన్ అని గుర్తించారు. ‘నైట్ ఆఫ్టర్ నైట్’ సినిమాలో చిన్న పాత్ర చేసిన మార్టిన్, తర్వాత నటనను పక్కనపెట్టి హాలీవుడ్లో టాలెంట్ ఏజెంట్‌గా ఎదిగాడని, 1964లో మరణించాడని తెలుసుకున్నారు.ఇక్కడి నుంచి ర్యాన్ కథ మరింత ఆసక్తికరంగా మారింది. దీంతో అతడు చెబుతున్న విషయాలను సిండీ డైరీలో రాయడం ప్రారంభించింది. తనకు ఒక కుమార్తె ఉందని చెప్పిన ర్యాన్, తాను ఎన్నో సముద్ర ప్రయాణాలు చేశానని, అందమైన మహిళలతో కలిసి డ్యాన్స్ చేశానని చెప్పాడు. ఇవన్నీ సరిపోల్చుకోవాలని టక్కర్ భావించారు. దీంతో ర్యాన్ కు కొన్ని ఫొటోలను చూపించారు. వాటిలో మార్టీకి తెలిసిన వ్యక్తులతోపాటు ఎలాంటి సంబంధంలేని వారు కూడా ఉన్నారు.‘వీరిలో ఎవరైనా నీకు పరిచయంగా అనిపిస్తున్నారా?’ అని టక్కర్ అడిగితే, ర్యాన్ కొన్ని ఫొటోలను ఎంచుకున్నాడు. అందులో ఒకరు మార్టీకి పరిచయం ఉన్న వ్యక్తిగా తేలారు. మార్టీ నాలుగో భార్య ఫొటోను కూడా చూపించాడు. అయితే ఈ పరీక్షలో కొన్ని విషయాలు సరిపోలలేదు. దీంతో టక్కర్ ఈ కేసును మరింత జాగ్రత్తగా పరిశీలించారు.ఈ క్రమంలో మార్టిన్ కుమార్తెతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అప్పటిదాకా బయటి ప్రపంచానికి తెలియని, కుటుంబానికి మాత్రమే తెలిసిన చాలా అంశాలను ఆ బాలుడు చెప్పడంతో ఆమె నిశ్చేష్టురాలైంది. మార్టిన్ నివసించిన పాత ఇంటి అడ్రస్, ఆయనకు నలుగురు భార్యలు ఉన్నారనే రహస్యం వంటివి చెప్పడంతో ఆశ్చర్యపోయింది. ర్యాన్ చెప్పిన చాలా అంశాలు సరైనవేనని నిర్ధారించింది.అయితే ర్యాన్ది నిజంగానే పునర్జన్మా? అనే విషయంలో పూర్తి స్పష్టత రాలేదు. డాక్టర్ జిమ్ టక్కర్ పరిశోధనలు ఈ కేసును అసాధారణమైనదిగా తేల్చినా, శాస్త్రీయంగా ‘పునర్జన్మకు రుజువు’ అని చెప్పలేకపోయాయి. నాలుగేళ్ల వయసులో ఎంతో స్పష్టంగా కనిపించిన ఆ ప్రపంచం, కాలం గడిచేకొద్దీ మసకబారిపోయింది. పెద్దయ్యేసరికి ర్యాన్ కు ఆ జ్ఞాపకాలు దాదాపుగా కనుమరుగయ్యాయి. నిజంగా అది గత జన్మ జ్ఞాపకమా? బాల్యంలో ఏర్పడిన ఏదైనా మానసిక ప్రభావమా? లేక ఇప్పటికీ శాస్త్రానికి అంతుపట్టని మరో రహస్యమా?సమాధానం ఏదైనా కావచ్చు కానీ, 1932 నాటి ఓ సినిమాలోని మరుగునపడిన వ్యక్తిని నాలుగేళ్ల బాలుడు గుర్తించిన ఆ క్షణం మాత్రం ఇప్పటికీ ఓ ప్రశ్నగానే మిగిలిపోయింది.- సత్యకిశోర్ కొండ్రెడ్డిఇదీ చదవండి: పాస్ పోర్ట్ కెనడాది... పల్స్ ఇండియాది -
నో బై చాలెంజ్.. కొనకపోవటం ఒక కళ!
బ్రష్ అయిపోతే.. కొత్తది కొనొద్దు. ఉప్పు, నిమ్మకాయ ఉన్నాయి కదా!టిఫిన్ కావాలంటే.. యాప్ తెరవొద్దు. వంటింట్లో బియ్యం, పప్పు ఉన్నాయి కదా!దుస్తులు చిరిగిపోతే... పారేయొద్దు. సూది, దారం ఉన్నాయి కదా!కూరగాయలు అయిపోతే... కార్ట్ నింపొద్దు. ఉన్న నాలుగింటితోనే కొత్త రుచిని పుట్టించొచ్చు. షాంపూ... క్రీమ్... మగ్... ఫోన్ ... డెకర్ ఐటమ్స్... ఇలా ప్రతి ‘కావాలి’కీ వెంటనే ‘కొనాలి’ అనకుండా, ‘కాసేపు ఆగండి’ అంటున్నది పాతతరం పొదుపరి పెద్దమనుషులు కాదు, కొత్తదనం కోరుకునే కొత్తతరం! ‘నో బై చాలెంజ్’ అంటూ కొత్తతరం నేడు కొత్త కొనుగోళ్లు, కోరికలు కళ్లెం వేస్తూ... ఆనందానికి ఆహ్వానం పలుకుతోంది.ప్రపంచం మనకు ప్రతి వస్తువునూ ‘కొత్తది కొనండి’ అని రోజూ మెసేజ్‌లు పంపుతుంటే, కొత్త తరం మాత్రం ‘ఒక్క నిమిషం, నా దగ్గర ఉన్నది ముందు వాడేస్తా!’ అంటూ కార్ట్‌కు బ్రేక్ వేస్తోంది. చాలామంది ఇప్పుడు ‘నో బై’ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. అంటే, కొత్త బట్టలు కొనకపోవడం, కొత్త కాస్మెటిక్స్ తెచ్చుకోకపోవడం, ఆఫర్ చూసి కూడా యాప్ మూసేయడం, అవసరం లేని వస్తువుల్ని ‘ఈసారి వద్దు’ అనడం ఇలా కొనుగోళ్లకు గేట్లు మూసేసి, ఉన్నవాటికి రెడ్ కార్పెట్ పరుస్తున్న ఈ కొత్త పిచ్చి ట్రెండ్ పేరు‘నో–బై చాలెంజ్!’ అలా ఈ తరం ‘అసలు బతకడానికి మనకు ఎంత కావాలి?’ అని పరీక్షించుకుంటోంది!నంబర్లు కూడా చెప్తున్నాయి!ఇది కేవలం సోషల్ మీడియాలో కనిపించే మరో హ్యాష్‌ట్యాగ్ మాత్రమే కాదని కొన్ని సర్వేలు నిరూపించాయి. 2025లో అమెరికాలో 1,015 మంది పెద్దలపై నిర్వహించిన ఓ సర్వేలో 42 శాతం మంది ‘నో బై చాలెంజ్’లో ఇప్పటికే పాల్గొంటున్నామని చెప్పారు. మరో 44 శాతం మందిలో ‘బై చాలెంజ్’ గురించి అదే విధంగా చెప్పినట్లు వెల్లడైంది. దీని వెనుక ప్రధాన కారణాల్లో 42 శాతం మందికి పొదుపు పెంచుకోవడం, 26 శాతం మందికి అప్పులు తగ్గించుకోవడంలో ఉన్నారు. అయితే ఇదే సర్వే మరో ఆసక్తికరమైన విషయం తెలిపారు. చాలెంజ్‌లో పాల్గొన్న వారిలో 25 శాతం మందికి డబ్బు దాచుకోలేకపోయారు, ఎందుకంటే వారి ఆదాయం అవసరమైన ఖర్చులకే సరిపోతోంది. వీరంతా కూడా ఈ ట్రెండ్‌లో భాగంగానే ఉన్నదానిలో సర్దుకొని జీవితం సాగిస్తున్నారు.భారత్‌లో బడ్జెట్ పద్మనాభం!భారతీయ కుటుంబాల్లో పిల్లలకు చిన్నప్పటి నుంచే ఒక మాట బాగా వినిపిస్తుంది. ‘డబ్బు దాచుకోవాలి. రేపటికి పనికొస్తుంది!’ కానీ అదే పిల్లలు పెరిగి చూసేది మరో లెక్క. పెళ్లి అంటే భారీ ఖర్చు, పండగ అంటే షాపింగ్, ఇంట్లో ఫంక్షన్ అంటే అప్పు చేసైనా ఘనంగా చేయాలి, బంధువుల ముందు తక్కువ కాకూడదు! అంటే మాటల్లో ఉన్న పొదుపు జీవితంలో కనిపించదు. పొదుపు పాఠాలు చెప్పే ఈ పెద్దలందరూ సామాజిక వేడుకల కోసం అవసరానికి మించి ఖర్చు చేయడానికి వెనుకడుగు వేయరు. అయితే, ఈ సామాజిక ఒత్తిడి మధ్య కొత్త తరం ఇరుక్కుపోవడం లేదు. ఆర్థిక విషయాలపై చాలా స్పష్టంగా ఉంటున్నారు. ‘నా డబ్బు నిజంగా దేనికి వెళ్లాలి?’ అనే ఆలోచనతో ప్రతి ఖర్చు చేస్తున్నారు. 2025లో జెన్ జీ ఆర్థిక మనసత్వంపై చేసిన ఒక అధ్యయనం ప్రకారం, 57 శాతం మంది సాధారణ నెలలో బట్టలు, గాడ్జెట్ల వంటి వాటిపై ఖర్చు చేస్తున్నప్పటికీ, 62 శాతం మంది పొదుపు, పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. అంటే ఖర్చు చేస్తూనే, భవిష్యత్తు కోసం దాచుకోవాలనే ఆలోచన బలంగానే ఉంది. మరో 33 శాతం మంది బడ్జెట్ పెట్టుకున్నా అప్పుడప్పుడూ దాన్ని మించిపోతున్నామని చెప్పారు. కేవలం 15 శాతం మంది మాత్రం ఎలాంటి ప్రణాళిక లేకుండా ఖర్చు చేస్తున్నారు. అందుకే ఈ చాలెంజ్ కొందరికి ట్రెండ్ కంటే అవసరంగా మారుతోంది.ఆఫర్ చూసి ఆశ!అతి సులభంగా మోసం చేయటంలో ఆఫర్స్‌కి ఆస్కార్ ఇవ్వొచ్చు. ‘50% ఆఫర్!’, ‘బై వన్ గెట్ వన్ !’, ‘ఫ్లాట్ 70% తగ్గింపు!’ఈ మాటలు కనిపించగానే మన కళ్లలో మెరుపు, మనసులో ఆశ మేల్కొంటుంది. ‘ఆఫర్ అయిపోబోతోంది’ అని తొందరపెడితే ఆశ ఇంకా పెరుగుతుంది. ‘ఇంత మంచి డీల్ మళ్లీ రాదు’ అనగానే మనసు లెక్కలు మానేసి కొనుగోలుకు ఓటేస్తుంది. ఇక లేచిన వెంటనే లేటుగా... ఇక నేరుగా షాపింగ్ వైపు మిమ్మల్ని నడిపిస్తుంది ఈ ఆఫర్. నిన్నటివరకు అసలు అవసరం లేని వస్తువు కూడా ఇవాళ ఆఫర్లో కనిపిస్తే ‘ఈ అవకాశాన్ని వదులుకోవడం మహాపాపం!’ అన్నట్టుగా అనిపిస్తుంది. రూ. రెండు వేల విలువైన వస్తువు, రూ. వెయ్యికే దొరికిందంటే వెయ్యి రూపాయలు ఆదా చేశామనుకుంటాం. కానీ ఆ వస్తువు మనకు అవసరమే లేకపోయినా వెయ్యి రుపాయలు వృథా చేశాం. ఇక్కడ మనకు మిగిలింది పొదుపు కాదు, మరో సామాను! చివరికి ఇంటికి వచ్చాకే తెలుస్తుంది. కొన్నది ఆఫర్ కాదు, ఆశ! అందుకే కొన్నిసార్లు కొనకుండా వదిలేసిన ఆఫరే మనకు దొరికిన బెస్ట్ డీల్!కొత్తదే అడుగుతోందా! ఫోన్ బాగానే పనిచేస్తోంది. కానీ కొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చేసరికి అది ఒక్కసారిగా మీ ఫోన్ పాతకాలపు వస్తువులా రిటైర్మెంట్కు దగ్గరైనట్టుగా కనిపిస్తుంది! అల్మరా నిండా బట్టలున్నాయి. అయినా కొత్త డ్రెస్ కనిపిస్తే ‘ఇది మాత్రం లేదు!’ అనిపిస్తుంది. నాలుగు జతల షూస్ సరిపోతున్నా, ఐదో జతకు మాత్రం ‘ఈ రంగు వేరే!’ అనే ప్రత్యేక హోదా ఇచ్చేస్తాం! మేకప్ బాక్స్ తెరిస్తే చోటే లేదు. అయినా కొత్త షేడ్ కోసం ఖాళీ వెతుకుతాం. ఇలా మనకు వస్తువుల కొరత కాదు, మనసుకు కొత్తదనం కొరత! కొత్తది కనిపిస్తే కొనాలనిపించడం. ట్రెండ్ మారితే మనమూ మారాలని అనిపించడం ఇవన్నీ కలిసి అవసరానికి ఆకర్షణకి మధ్య గీతను చెరిపేస్తున్నాయి. అందుకే, ఇప్పుడు నోబై చాలెంజ్‌ను ఫాలో అవుతున్నారు. అయితే, ఇది కూడా మనసు కోరే కొత్తదనం కోరిక తీర్చడానికే అన్నట్లు మరో కొత్త ట్రెండ్ కనిపిస్తే దాని వెంట పరుగులు తీయడం మొదలుపెడుతున్నారు!రియలా... రీల్ చెబుతోందా?ఒక ఇన్ ఫ్లుయెన్సర్ ఓ కొత్త బ్యాగ్ చూపించాడు. మనకు అసలు అవసరం లేదు. కానీ అదే బ్యాగ్ ఒక రీల్లో మరో రీల్లో ఇంకో ‘మస్ట్ హ్యావ్’ వీడియోలో కనిపిస్తే చాలు! నిన్నటివరకు మనకు తెలియని ఆ బ్యాగ్ ఇవాళ లేకపోతే మన జీవితం ఏదో మిస్సవుతున్నట్టుగా అనిపిస్తుంది! ఇదే సోషల్ మీడియా షాపింగ్ మ్యాజిక్! రీల్స్ చూపిస్తాయి. ఇన్ ఫ్లుయెన్సర్లు నచ్చచెప్తారు. ప్రకటనలు గుర్తు చేస్తాయి. ట్రెండ్స్ ఒత్తిడి పెంచుతాయి. చివరికి మన వేలు ‘బై నౌ’ మీద పడుతుంది! భారతీయ ఆన్ లైన్ షాపర్లపై 2026లో ప్రచురితమైన ఒక పరిశోధనలో 413 మంది పాల్గొనగా, వారిలో 280 మంది ఆవేశపూరిత కొనుగోళ్లు తర్వాత పశ్చాత్తాపానికి గురైనట్లు తెలిపారు. ముఖ్యంగా అందరూ ఏదో కొత్తది వాడుతున్నట్టు కనిపిస్తే, మనం మాత్రం వెనకబడిపోయామేమో అన్న భావన మొదలవుతుంది. అందుకే ఇకపై ఏదైనా కొత్తగా కొనేముందు, అది నిజంగా కావాలా? లేక రీల్ చూసిన తర్వాతే కావాలనిపించిందా?’ అని ప్రశ్నించుకోవడం మంచిది!ఏం చేయాలి?నో బైని ఒక్కరోజు ఉత్సాహంతో కాకుండా, చిన్న చిన్న రూల్స్‌తో మొదలుపెడితేనే ఎక్కువ రోజులు నిలుస్తుంది. ఇలా కార్ట్‌కు బ్రేక్, వాలెట్‌కు ఊరట, మనసుకు క్లారిటీ ఇచ్చే నో బై స్టెప్స్ ఇవే!కొన్ని రోజులే అనుకోండి!ఈరోజు నుంచి ఏమీ కొననని ప్రతిజ్ఞ చేస్తే మొదటి రోజే మనసు తిరుగుబాటు చేస్తుంది. అందుకే దీన్ని చిన్న ప్రయోగంలా మొదలు పెట్టాలి. ముందుగా 30 రోజుల చాలెంజ్ పెట్టుకోండి. 30 రోజులు పూర్తయ్యాక ఎలా అనిపించిందో చూసి మరో నెల కొనసాగించవచ్చు.ఫిక్స్ చేసుకోండి!అనవసర కొనుగోళ్లకు మాత్రమే అని ఫిక్స్ చేసుకోండి. అంటే కొత్త బట్టలు, షూస్, మేకప్, ఇంటి అలంకరణ వస్తువులు, అవసరం లేని గాడ్జెట్లు. ఈ చాలెంజ్‌ను ఆహారం, మందులు, ప్రయాణం లేదా తప్పనిసరి ఇంటి వస్తువులు వంటి అవసరాలను ఇందులో పెట్టాల్సిన పనిలేదు.క్యూలో పెట్టండి!ఏదైనా నచ్చగానే వెంటనే కొనకుండా ఒక జాబితాలో రాసుకోండి. ఇప్పుడే కాదు తర్వాత ఆలోచిద్దాం! అనే రూల్ పెట్టుకోండి. చాలాసార్లు కొన్ని రోజుల తర్వాత అదే వస్తువును చూసి ‘ఇది నాకు ఎందుకు నచ్చింది?’ అనిపించొచ్చు!షాపింగ్‌కి సెలవులు!డిస్కౌంట్ నోటిఫికేషన్ రాగానే మనసు బలహీనపడితే, నోటిఫికేషన్లనే ఆపేయాలి. అవసరం లేకుండా షాపింగ్ యాప్‌లు తెరవడం తగ్గిస్తే కొనాలనే ఆలోచన కూడా తగ్గుతుంది. ఫ్రెండ్స్‌తో తోడుగా కూడా షాపింగ్‌కి వెళ్లకండి. కొన్ని రోజులు షాపింగ్‌కి సెలవులు ఇవ్వండి.ఉన్నదానికి కొత్త జీవితం!అల్మరాలో దాగి ఉన్న పాత డ్రెస్‌ను కొత్తగా రీ డిజైన్ చేయండి. ఇంట్లో ఉన్న డేకర్ ఐటమ్స్‌ను మరోలా అమర్చండి. నో బై అసలు గెలుపు కొత్తది కొనకపోవడం మాత్రమే కాదు, ఉన్నదాన్ని మళ్లీ ప్రేమించడం!ఆఫర్ కనిపిస్తే ఆగిపోండి!ఆఫర్ ఉన్నదని కాదు. లేకున్నా కూడా మీరు ఆ వస్తువును కొనేవారా? అని ప్రశ్నించుకోండి. దానికి సమాధానం ‘నో’ అయితే, అది అవసరం కాదు, ఆఫర్ వేసిన ఆశ! అందుకే, ఇకపై ఆఫర్ వేసే వలలో పడకండి.లెక్క వేయండి!30 రోజులు పూర్తయ్యాక ‘ఎంత డబ్బు ఖర్చు చేయలేదు?’, ‘ఏవి కొనాలనిపించాయి?’, ‘వాటిలో నిజంగా ఎన్ని అవసరమయ్యాయి?’ అని చూసుకోండి. అప్పుడే ఈ చాలెంజ్ మీకు కేవలం పొదుపు మాత్రమే కాకుండా, మీ కొనుగోలు అలవాట్లను కూడా ఒక అద్దంలా చూపిస్తుంది.భావాలతో భారీ నష్టాలు!బోర్ కొట్టిందా? షాపింగ్‌కి వెళ్దాం! స్ట్రెస్ వచ్చిందా? ఫుడ్ ఆర్డర్ చేసేద్దాం! పుట్టినరోజా? మనకో గిఫ్ట్ మనమే ఇచ్చుకుందాం! జీతం వచ్చిందా? ఇన్ని రోజులు కష్టపడ్డా కదా ఏదైనా కొనాలి! జీతం రాలేదా? ‘పర్లేదు, తర్వాత చూసుకుందాం!’ అంటూ అదే షాపింగ్! ఇలా... కారణం ఏదైనా పరిష్కారం మాత్రం కార్ట్నే అన్నట్టుగా మారిపోయింది. కొన్నిసార్లు అవసరం కంటే, కొత్తది కొన్న ఆ క్షణంలో వచ్చే చిన్న ఆనందమే కావాలి. కొత్త డ్రెస్ తెరిచినప్పుడు వచ్చే ఉత్సాహం, పార్సెల్ చేతికి అందినప్పుడు కలిగే కుతూహలం, ‘ఆర్డర్ ప్లేస్డ్’ అని కనిపించినప్పుడు వచ్చే చిన్న గెలుపు ఇవన్నీ కలసి షాపింగ్‌ను వస్తువు కొనడం నుంచి ఒక మూడ్ మార్చే అలవాటుగా మార్చేస్తాయి. కానీ ఆ ఆనందం ఎంతసేపు ఉంటుంది? ఇది గమనించండి. ఇలా అవసరం లేకుండానే ఆ ఆనందాన్ని వెతుక్కోవద్దు, ఇదే అలవాటు. తర్వాత భారీ నష్టాలను తెస్తుంది.మొదలవ్వక ముందే ముగిస్తే!మొదటి రోజు మన కాన్ఫిడెన్స్ చూస్తే, షాపింగ్ మాల్ మొత్తం మన కోసం మూతపడాల్సిందే అనిపిస్తుంది! ‘ఈ నెల ఏమీ కొనను. ఒక్క రూపాయి కూడా!’ అని శపథం చేస్తాం. మూడో రోజుకే ఒక డ్రెస్ కనిపిస్తుంది. ‘ఇది చాలా అవసరం!’ అన్నట్లుగా... ఇక ఐదో రోజు ఆఫర్ ఆశ చూపిస్తుంది. సరే, ఇది ఒక్కటే అన్నారో, ఇక ఎనిమిదో రోజు మరో పార్సెల్ ఆన్లైన్ ఆర్డర్ అంటూ ఇంటి గుమ్మం దగ్గరికి వస్తుంది. ‘ఇది ఎవరు ఆర్డర్ చేశారు?’ అని అడిగితే ‘అది నేను కాదు నా పాత నిర్ణయం!’ మన మనసుకు మనమే సర్ది చెప్పుకుంటాం.ఆ పశ్చాతాపంతో వెంటనే, షాపింగ్ యాప్ డిలీట్ చేసినా, ఐదు నిమిషాల్లో మళ్లీ డౌన్ లోడ్! అప్పటికే నో బై కాస్త దారి తప్పేసింది! కానీ అసలు ప్రమాదం, చాలెంజ్ ఫెయిల్ అయింది కదా! అని ఇంకొన్ని కూడా కొందామనుకోవడంలో ఉంది. ఇక్కడే బ్రేక్ వేయాలి. డైట్లో ఒక స్వీట్ తిన్నామని మిగతా బాక్స్ మొత్తం తినం కదా అలాగే! ఒక కొనుగోలు జరిగిందంటే మిగతా రోజులకు ‘బై’ పాస్ ఇవ్వొద్దు. ఒక తప్పు జరిగితే మరుసటి కొనుగోలును ఆపడం నుంచే మళ్లీ మొదలు పెట్టొచ్చు.కలలకు కష్టకాలమా?‘నో బై చాలెంజ్’ మొదలుపెట్టగానే వాలెట్ నవ్వుతుంది. కానీ మనసు మాత్రం కొంచెం మొహం చాటేస్తుంది! కొంతమంది అసలు ఏమీ కొననని, అత్యవసరమైన వాటిల్లోనూ ఆదా చేయటానికి ప్రయత్నిస్తుంటారు. ఆహారం, మందులు అంటూ ఆరోగ్యంపై కూడా ఖర్చు చేయకుండా ఉంటే, చివరికి ఆ డబ్బంతా ఆసుపత్రిలో బిల్లు కట్టడానికే వాడతారు. అలాగే, అవసరమైన కోర్సుకు ఫీజు పెట్టడం, పని కోసం ఉపయోగపడే ల్యాప్‌టాప్ కొనకపోవటం, కొత్త నైపుణ్యం నేర్చుకోవడానికి ఖర్చు చేయడంం ఇవన్నీ కూడా ‘ఖర్చే కదా!’ అంటూ ఆపేస్తే? ఆదే మీ రేపటి పెద్ద కలలకే బ్రేక్ పడొచ్చు. మరికొంతమంది ఇన్నాళ్లు ఆపుకున్న కోరికలతో చాలెంజ్ పూర్తయ్యాక ఒక్కసారిగా ‘ఇప్పుడైనా అన్నీ కొనేయాలి!’ అని 30 రోజుల సేవింగ్‌కి 30 నిమిషాల్లో ఫుల్స్టాప్ పెట్టేస్తారు. అందుకే, ఇక్కడ కేవలం చిన్న కోరికల్ని కాస్త వాయిదా వేసి, పెద్ద కలలకు కాస్త ముందడుగు వేయాలి. ఎందుకంటే కలల కోసం ఖర్చు చేయడం నష్టం కాదు. కలల్ని వదిలేసి పొదుపు చేయడమే అసలు నష్టం!డబ్బే కాదు, దొరికేవి చాలా!ఒక వస్తువు కొనలేదు అంటే మనకు మిగిలేది కేవలం డబ్బు మాత్రమే కాదు, ఇంకా చాలా ఉంటాయి. ఇంట్లో అవి చేసుకునే కబ్జాను కూడా ఆపేయొచ్చు. అంటే కొత్త బాక్స్, కొత్త బాటిల్, కొత్త డ్రెస్, కొత్త డెకర్ అంటూ ఇంట్లోకి వస్తువులు వరుస కట్టకపోతే అల్మరా కూడా మనల్ని చూసి ‘ధన్యవాదాలు!’ అంటుంది. దానికి తోడు సమయం కూడా మిగులుతుంది. ఏది కొనాలి? ఏది బాగుంటుంది? ఏ బ్రాండ్? ఏ రంగు? ఎక్కడ చౌక? రివ్యూలు ఎలా ఉన్నాయి? అంటూ గంటల తరబడి స్క్రోల్ చేయాల్సిన పని తగ్గుతుంది. ఒకసారి కొన్నాక దానికి చోటు చూడాలి, సర్దాలి, శుభ్రం చేయాలి, పాడైతే రిపేర్ చేయించాలి– ఇలా ఒక చిన్న కొనుగోలు వెనక వచ్చే చిన్న చిన్న పనుల బెడద కూడా తగ్గిపోతుంది. అలా చివరికి ఈ చాలెంజ్ మనకు చాలా లాభం చూపిస్తుంది.కొత్తది కొనకుండా ఉండటమే ఈ చాలెంజ్ విజయం కాదు. మన డబ్బు, మన కోరికలు, మన నిర్ణయాల మీద పట్టు తెచ్చుకోవడమే అసలు గెలుపు.∙ కొండి దీపిక -
అతివృద్ధ పర్వతారోహకుడు
నడివయసులోకి వచ్చాక చాలామంది మెట్లెక్కడానికే ఆయాసపడతారు. తొంభైఏళ్లు దాటిన ఈ అమెరికన్ వృద్ధుడు మాత్రం పడుతూ లేస్తూ... మొత్తానికి పర్వత శిఖరాన్నే అధిరోహించాడు. అమెరికా ఈశాన్యాన ఉన్న న్యూఇంగ్లండ్ ప్రాంతంలోని ‘మౌంట్ మీన్’ శిఖరాన్ని అధిరోహించిన ఈ పెద్దాయన పేరు డేల్ సాండర్స్. ఈయన వయసు 91 ఏళ్లు. ‘మౌంట్ మీన్’ శిఖరారోహణ కోసం ఈ పెద్దమనిషి జార్జియాలోని స్ప్రింగర్ పర్వతం నుంచి న్యూఇంగ్లండ్లోని ‘మౌంట్ మీన్’ వరకు ఏకంగా 3,529 కిలోమీటర్లు కొండదారిలో ప్రయాణించాడు. ఈ ప్రయాణంలో ఆయన 71 సార్లు జారిపడ్డాడు. పడిన ప్రతిసారీ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో తిరిగి పైకిలేచాడు. పట్టువదలకుండా, విజయవంతంగా శిఖరారోహణ చేశాడు. ఈ శిఖరాన్ని అధిరోహించడం సాండర్స్‌కు ఇదే మొదటిసారి కాదు, ఇదివరకు 2017లో కూడా తన 82 ఏళ్ల వయసులోనూ ఆయన ఈ శిఖరాన్ని అధిరోహించాడు. తాజాగా తన రికార్డును తానే పునరావృతం చేశాడు. -
పాస్ పోర్ట్ కెనడాది... పల్స్ ఇండియాది
రెండు ప్రపంచాల మధ్య పెరిగినా, ఆమె గొంతులో మాత్రం ఎప్పుడూ సంగీతమే ఉంటుంది. మైక్ చేతిలో పడితే భాష ఏదైనా, గానం మాత్రం తనదే! కలలకు హద్దులు పెట్టుకోకుండా, తనదైన స్వరాలతో దారులను వేసుకుంటూ ముందుకు సాగుతున్న జోనితా గాంధీ చెప్పిన కొన్ని ఆసక్తికర సంగీత సంగతులు మీకోసం!ఇండియా అంతా ఇంట్లోనే! ఢిల్లీలో పుట్టినా కానీ, పెరిగిందంతా కెనడాలోనే. ఇంటి బయట కెనడియన్ లైఫ్ ఉంటే, అమ్మానాన్నలు ఇంట్లో ఎప్పుడూ లతాజీ, కిశోర్ కుమార్ పాటలు పెట్టి ఇండియానే ఇంట్లోకి తెచ్చారు! అందుకే నా యాక్సెంట్ కెనడియన్ గా ఉన్నా, నా పాటల్లో మాత్రం ఇండియన్ ఫ్లేవర్ ఎప్పుడూ ఉంటుంది. అందుకే, నన్ను ‘టొరంటోస్ నైటింగేల్’ అని పిలిచేవారు. ఆ పేరు నాకు చాలా ఇష్టం.రెండు డిగ్రీలు ఉన్నాయి!సంగీతం అంటే ఎంత ఇష్టమో చదువు కూడా అంతే. హెల్త్ సైన్సెస్‌తో పాటు బిజినెస్‌లోనూ డిగ్రీ చేశాను. ఒకవైపు క్లాసులు, మరోవైపు పాటలు... మధ్యలో కార్పొరేట్ కంపెనీలో పనిచేశాను. అప్పట్లో నా జీవితం చూస్తే ‘సింగర్? బిజినెస్? డాక్టర్?’ ఏ రంగంలోకి వెళ్తానో నాకే అనుమానం వచ్చేది! చివరికి మైక్ నన్ను గెలిచేసింది.యూట్యూబ్‌లో యెస్!నాకు పదహారేళ్ల వయసులో ‘కెనడియన్ ఐడల్’కి ఆడిషన్ ఇచ్చాను. మొదటి రౌండ్లోనే నో చెప్పారు! అప్పట్లో బాధగానే అనిపించింది. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే... ఆ ‘నో’ లేకపోతే నా ‘యెస్’ కథ ఇంత ఆసక్తికరంగా ఉండేది కాదేమో అనిపిస్తుంది. తర్వాత యూట్యూబ్‌లో పాటలు పాడుతూ నా సొంత దారిని వెతుక్కున్నాను.ట్వీట్ చూసి... రెహమాన్ సర్! కొన్ని అవకాశాలు సినిమాటిక్‌గా వచ్చాయి. రెహమాన్ సర్ నా పాటను ఒక ట్వీట్ ద్వారా విన్నారు. అది నా కెరీర్‌కు కొత్త తలుపు తెరిచింది. తర్వాత ‘కహా హూ మై’లాంటి పాట పాడే అవకాశం రావడం ఒక కలలా అనిపించింది.డ్యాన్స్ నా మొదటి స్టేజ్ లవ్!నేను మొదట స్టేజ్‌పైకి వచ్చింది డ్యాన్సర్‌గా! మూడున్నరేళ్ల వయసులోనే ‘చన్నే కే ఖేత్ మే’ పాటకు స్కూల్లో డ్యాన్స్ చేశాను. ఇప్పుడు పాట పాడుతూ డ్యాన్స్ చేసే అవకాశం వస్తే, చిన్నప్పటి ఆ అమ్మాయి ఇంకా నాలోనే ఉందనిపిస్తుంది. ఆ అమ్మాయే అప్పుడప్పుడు సినిమాల్లోనూ నటిస్తోంది.పాట కోసం, భాషే నేర్చుకోవాలి!చాలా భాషల్లో పాటలు పాడాను. కానీ ప్రతి భాష నాకు వచ్చు అనుకోను. కొత్త భాషలో పాట వచ్చినప్పుడు ఒక్కో పదం ఎలా పలకాలో, దాని యాస, అర్థం రాసుకుంటాను. సింగర్ ఎడ్ షీరన్ తో చేసిన పని నాకు చాలా ప్రత్యేకం. ఇలాగే, భవిష్యత్తులో వేర్వేరు దేశాల కళాకారులతో కలిసి పనిచేయాలని ఉంది.పాటల్లో ‘క్లోసెట్’ కూడా ఉంది!పాటలు పాడటం ఒక ప్రపంచం అయితే, రాయటం మరో ప్రపంచం. పదిహేడేళ్ల వయసు నుంచే పాటలు రాస్తున్నాను. కానీ వాటిని బయటకు చూపించడానికి భయపడ్డాను. రాసిన పాటను బయటకు పెడితే, అందులో మనమే కనిపిస్తాం కదా! ఇప్పుడు నా సొంత సంగీతానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నాను.పెళ్లి వేడుకల్లో... ‘ఫ్రీ రిహార్సల్’!పెళ్లిళ్ల సీజన్ లో మా లైవ్ షోలు చాలా పెరుగుతాయి. కొన్నిసార్లు జనాలు తినడంలో, మాట్లాడుకోవడంలో బిజీగా ఉంటారు. అప్పుడు నేను ఏం చేస్తానో తెలుసా? దాన్ని ‘పెయిడ్ రిహార్సల్’గా భావిస్తాను! బ్యాండ్‌తో కొత్త వోకల్ రన్స్ ట్రై చేస్తాను, కొత్తగా పాడి చూస్తాను. వాళ్లు వినకపోయినా... కనీసం మాకు ప్రాక్టీస్ అయిపోతుంది కదా! -
అష్టగణపతుల ఆలవాలం... శ్రీముఖలింగం
శ్రీకాకుళంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగం. ఈ క్షేత్రంలో మరో అరుదైన విశేషం ఉంది. ఇక్కడ అష్టగణపతులు కొలువై ఉండి, భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారంగా పూజలందుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడకు భక్తులు వస్తుంటారు. 1. శక్తి గణపతిదీర్ఘకాలిక బాధలు, వ్యాధులు శక్తిగణపతిని పూజిస్తే నయమైపోతాయని భక్తుల నమ్మకం. తూర్పువైపున ఉన్న ఈ ఆలయంలో శక్తిగణపతి పశ్చిమాభిముఖంగా భక్తులకు దర్శనమిస్తాడు. 2. చింతామణి గణపతిజీవితంలోని ఈతిబాధలు, మానసిక చింతలు, దుఃఖాలను పోగొట్టే స్వామిగా ఇక్కడి చింతామణి గణపతి పూజలు అందుకుంటున్నాడు. దక్షిణం వైపు ఉన్న ఈ ఆలయంలో చింతామణి గణపతి ఉత్తరాభిముఖంగా దర్శనమిస్తాడు.3,4. ఢుంఢి గణపతులుపంచాయతన క్షేత్రానికి సంబంధించి ఢుంఢి గణపతుల విగ్రహాలు కాశిలో రెండు, అలాగే శ్రీముఖలింగంలో రెండు ఒకే చోట ఉంటాయి. ఈ ఢుంఢి గణపతులను దర్శనం చేసుకుంటే మనోభీష్టాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో ఢుంఢి గణపతులు ఉత్తరాభిముఖంగా దక్షిణ దిశలో కొలువు దీరి ఉంటారు.5. సాక్షి గణపతి:భక్తులు ఆలయానికి వచ్చిన తరువాత ముందుగా ఈ స్వామిని దర్శనం చేసుకుంటే ఈయన తన తండ్రి అయిన పరమేశ్వరునికి భక్తుల రాక గురించి సాక్ష్యం చెబుతారట! ‘ఈ భక్తులు నా అనుమతి తీసుకున్నారు. తండ్రీ, వీరికి నీ దర్శన దర్శనభాగ్యం కల్పించ’ని కోరుతాడట! ఈ ఆలయంలో సాక్షి గణపతి ఉత్తర దిశలో దక్షిణాభిముఖంగా కొలువై ఉంటాడు.6. నాట్యగణపతినాట్యం సహా లలితకళలు నేర్చుకునేవారు ముందుగా ఇక్కడి నాట్యగణపతిని దర్శనం చేసుకుంటే సకలు కళలలో త్వరితిగతిని ప్రావీణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. పశ్చిమ దిశలో తూర్పు అభిముఖంగా నాట్యగణపతి భక్తులకు దర్శనమిస్తాడు. 7. కార్యసిద్ధి గణపతిమనసులో తలచిన కార్యాలను ఇక్కడి కార్యసిద్ధి గణపతికి నివేదించుకుంటే చాలు, అవి నిర్విఘ్నంగా నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ స్వామి ఉత్తర దిశలో దక్షిణాభిముఖంగా కొలువై ఉంటాడు.8. వరసిద్ధి గణపతిభక్తులకు కోరిన వరాలను అనుగ్రహించే స్వామిగా ఇక్కడి వరసిద్ధి గణపతిని భక్తులు పూజిస్తారు. ఈ ఆలయంలో వారాహి అమ్మవారి ముందు ఎడమవైపుగా దక్షిణాభిముఖంగా వరసిద్ధి వినాయకుడు భక్తులకు దర్శనమిస్తాడు. - సుంకరి శాంత భాస్కరరావుజలుమూరు, శ్రీకాకుళం జిల్లా -
గాడ్జెట్ల గల్లీలో బప్పా ఎంట్రీ!
ఇంటికి గణపయ్య వచ్చారంటే పండగ కళ రావాల్సిందే! ఇప్పుడు ఆ కళను కాస్త స్మార్ట్‌గా పెంచే చిట్టి గాడ్జెట్లు ఇవిగో... దరలో చిన్నవి, పండుగ పనిలో మాత్రం పవర్‌ఫుల్‌గా పనిచేస్తాయి.బప్పా మండపంలో బీట్ అదిరిపోవాల్సిందే! పిల్లల వినాయక మండపం అంటే పూజలతో పాటు ఆటలు, పాటలు, సందడి కూడా ఉండాల్సిందే! మరి ఆ చిన్నారుల సందడికి పెద్ద సౌండ్ సిస్టమ్ ఎందుకు? తక్కువ ఖర్చులో ఈ చిన్న బ్లూటూత్ స్పీకర్ చాలు! 10 వాట్ల సౌండ్‌తో భక్తి పాటలు, గణేశ్ పాటలు, పిల్లల ఫేవరెట్ మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు. మ్యూజిక్కు తగ్గట్టు రంగురంగుల డిస్కో లైట్లు మెరుస్తూ ఉంటే... చిన్న మండపమే మినీ డ్యాన్స్ ఫ్లోర్లా మారిపోతుంది! ఫోన్‌తో బ్లూటూత్ ద్వారా సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. చిన్న సైజులో ఉండటంతో పిల్లలు నిర్వహించే చిన్న వినాయక మండపాలకు ఇది బాగా సరిపోతుంది. పైగా పెద్ద స్పీకర్లు, ఖరీదైన సౌండ్ సిస్టమ్‌లకు అయ్యే ఖర్చు కూడా ఉండదు. ధర కేవలం రూ.500 మాత్రమే!గణపయ్యకు... మేకప్ రెడీ!గణపయ్యను తీసుకొచ్చాక... ఆయన మండపం అలంకరణే అతిపెద్ద టాస్క్! పూలు, లైట్లు, అలంకరణ సామాన్లు అంటూ మార్కెట్ చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా... గణపయ్య వెనుక ఈ మండపం పెట్టేస్తే పూజా స్థలానికే ఓ పండగ లుక్ వచ్చేస్తుంది. కాగితంతో తయారైన ఈ పర్యావరణహిత అలంకరణను 9 నుంచి 16 అంగుళాల విగ్రహాలకు సరిపడేలా రూపొందించారు. కొద్ది నిమిషాల్లోనే కుటుంబంతో కలిసి దీన్ని తయారు చేసుకోవచ్చు కాబట్టి... పిల్లలకు ఫన్, పెద్దలకు డెకరేషన్ బాధ్యత రెండూ ఒకేసారి! వాడిన తర్వాత మడిచి దాచుకోవచ్చు, పైగా వినాయక చవితి తర్వాతి పండుగల్లో మళ్లీ ఉపయోగించుకోవచ్చు. ధర సుమారు రూ. 800.మంత్రాల మినీ మాస్టర్!గణపయ్యపై విపరీతమైన ప్రేమ ఉంది. కానీ మంత్రాలు రావా? పూజ చేయడం కూడా రాదా? పర్లేదు... ఇకపై పూజ చేయటానికి పూజారి కోసం వెతకాల్సిన పనిలేకుండా. ఈ చిన్న మంత్ర బాక్స్ పనిచేస్తుంది. ఇందులో 35 రకాల ముందే నిక్షిప్తమైన మంత్రాలు ఉండటంతో పూజ, ధ్యానం, జపం... ఏ సందర్భానికైనా వినొచ్చు. పెద్ద స్పీకర్ సెటప్ అవసరం లేదు. చిన్న సైజులోనే పూజ గదిలో చక్కగా సరిపోతుంది. బ్యాటరీ లేదా చార్జింగ్ టెన్షన్ లేకుండా నేరుగా విద్యుత్ సాకెట్‌కు అమర్చుకుని ఉపయోగించవచ్చు. కొన్ని క్షణాల్లోనే మనసు భక్తిమయంగా మారిపోయేలా, కావాల్సిన మంత్రాన్ని , శబ్దాన్ని మనకు నచ్చిన స్థాయిలో సర్దుకోవచ్చు. ధర రూ.300. -
దూర్వాంకుర మహిమ
కౌండిన్య మహర్షి గణేశుని పరమభక్తుడు. ఆయన తన ఆశ్రమంలోని గణేశ ప్రతిమకు దూర్వాంకురాలతో నిత్యం పూజించేవాడు. ఆయన భార్య ఆశ్రయ ఒకనాడు ‘స్వామీ! మీరు దూర్వాంకురాలతో గణేశుని ఎల్లప్పుడూ పూజిస్తుంటారు కదా, దూర్వాంకురాలు అంత మహిమాన్వితమైనవా?’ అని అడిగింది. కౌండిన్యుడు ఆమెకు దూర్వాంకుర మహిమ గురించి అనేక పురాణగాథలు చెప్పాడు. కౌండిన్యుడు చెప్పిన గాథలను ఆలకించినప్పటికీ ఆశ్రయకు దూర్వాంకుర మహిమ పట్ల మనసులో సంశయాలు తొలగిపోలేదు. కౌండిన్యుడు తన భార్య మనోగతాన్ని గ్రహించాడు. ఆమె సంశయాలు తొలగిపోవాలంటే, దూర్వాంకుర మహిమ ఎంతటితో ఆమెకు స్వయంగా తెలిసిరావాలి అని భావించాడు.కౌండిన్యుడు ఆమె చేతికి ఒక దూర్వాంకురాన్ని ఇచ్చి, ‘దేవీ! నువ్వు ఈ దూర్వాంకురాన్ని తీసుకుని ఇంద్రుడి వద్దకు వెళ్లు. దీనికి సరిసమానమైన స్వర్ణాన్ని నేను అడిగినట్లు అతడికి చెప్పుడు. ఈ దూర్వాంకురం కంటే ఏమాత్రం ఎక్కువ గాని, తక్కువ గాని స్వర్ణాన్ని స్వీకరించకు’ అని చెప్పాడు.భర్త ఆదేశంతో ఆశ్రయ దేవేంద్రుడి వద్దకు వెళ్లి, భర్త తనకు ఇచ్చిన దూర్వాంకురాన్ని అతడికి ఇచ్చి, ‘దేవేంద్రా! ఈ దూర్వాంకురానికి సరిసమానమైన స్వర్ణాన్ని తీసుకురమ్మని నా భర్త నీ వద్దకు పంపాడు. దీని కంటే నాకు లేశమైనా ఎక్కువా వద్దు, తక్కువా వద్దు’ అని పలికింది.‘సాధ్వీమణీ! ఈమాత్రం దానికి నువ్వు ఇక్కడి వరకు రావాలా? నీ భర్త ఆదేశమై సందేశాన్ని పంపితే, సాక్షాత్తూ స్వర్గాన్ని పంపమన్నా పంపుతాను కదా’ అని, ఒక దేవదూతను పిలిచి, ‘ఈ సాధ్వీమణిని కుబేరుని వద్దకు తీసుకుపోయి, ఈమెకు ఈ దూర్వాంకుర సమానమైన స్వర్ణాన్ని ఇవ్వమని నా ఆజ్ఞగా చెప్పు’ అని పంపాడు.దేవదూత ఆశ్రయను తీసుకుని కుబేరుడి వద్దకు వెళ్లి, దేవేంద్రుడి సందేశాన్ని చెప్పాడు. ‘దూర్వాంకుర సమానమైన స్వర్ణాన్ని కోరడానికి ఇంతదూరం వచ్చిన కౌండిన్య పత్నికి ఏమైనా మతిభ్రమణం కలిగిందా? ఈమెను నా వద్దకు పంపిన దేవేంద్రుడు ఏమైనా మాయలో పడ్డాడా?’ అని అనుకుని, కొద్దిసేపు ఆలోచించాడు కుబేరుడు.కేవలం దూర్వాంకుర పరిమాణంలోని స్వర్ణాన్ని మాత్రమే ఇచ్చి పంపిస్తే, ధనాధిపతి అయిన తన పరువు ఏం కావాలని భావించి, ఆశ్రయ ముందు అనేక మణుగుల బంగారం ఉంచాడు. ఆమెకు కాస్త ఆశ పుట్టినా, భర్త పట్ల భయం వల్ల ‘నా భర్త ఆదేశం మేరకు దూర్వాంకుర పరిమాణంలోని స్వర్ణమే చాలు. అంతకు ఎక్కువా వద్దు, తక్కువా వద్దు’ అని పలికింది.కుబేరుడు ఒక చిన్న త్రాసు తెప్పించి, ఒకవైపు దూర్వాంకురాన్ని ఉంచి మరోవైపు బంగారాన్ని వేయడం మొదలుపెట్టాడు. ఎంత బంగారం వేసినా, చాలడం లేదు. కుబేరుడు ఒక పెద్ద త్రాసు తెప్పించి బంగారం వేసినా, ఫలితం లేకపోయింది. ఈసారి మరింత భారీ తక్కెడను తెచ్చి, అందులో తన యావత్ సంపదను వేసినా, అదంతా దూర్వాంకురానికి సమానం కాలేదు. సర్వాలంకార భూషిత అయిన తన భార్యను తక్కెడలో కూర్చోబెట్టాడు, చివరకు తాను కూడా స్వయంగా కూర్చున్నాడు. అయినా దూర్వాంకురం ఉంచిన వైపు తక్కెడ పాత్ర వీసమంతైనా పైకి లేవలేదు. దిక్కుతోచని కుబేరుడు తన సాటి దిక్పాలకులకు, త్రిమూర్తులకు కబురు పెట్టాడు. వారందరూ తమ తమ సమస్త సంపదలను తీసుకువచ్చినా, ఫలితం కనిపించలేదు. వారందరికీ ఇదేదో పెనుమాయగా అనిపించింది.ఇదేదో కౌండిన్యుడినే అడిగి తెలుసుకోవాలని భావించి, దేవతలందరూ కలసి కౌండిన్యుడి వద్దకు వెళ్లారు. ‘మహానుభావా! పూర్వపుణ్యం వల్ల నీ దర్శనభాగ్యం లభించింది. నీ ధర్మపత్ని మా అహంకారాన్ని సర్వం హరించింది. మాకు దూర్వాంకుర మహిమ తెలియదు. త్రిలోకాలు కూడా దీని మహిమకు సాటిరావు. నువ్వు భక్తిగా గణేశుడి మస్తకాన్ని అలంకరించిన ఈ దూర్వాంకుర మహిమను ఎవరు తెలుసుకోగలరు? సమస్త యజ్ఞ, దాన, తపో, వ్రత, స్వాధ్యాయములలో ఏదీ దూర్వాంకుర సమర్పణకు సరిసాటి కాదు. శ్రీగణేశుని అనునిత్యం ఆరాధించే నీ మహిమను మాత్రం ఎవరు తెలుసుకోగలరు?’ అని కౌండిన్యుడిని కొనియాడారు. అనంతరం వినాయకుడిని వేనోళ్ల స్తుతించి, తమ తమ లోకాలకు తిరిగి వెళ్లిపోయారు.ఈ సంఘటనతో ఆశ్రయకు తన భర్త గణనాథుని అర్చనకు ఉపయోగించే దూర్వాంకుర మహిమ పూర్తిగా అవగతమైంది. ‘స్వామీ! మీ మాటలను శంకించాను, మన్నించండి.’ అని పలికింది. ఆమె కూడా భర్తతో కలసి దూర్వాంకురాలతో శ్రీగణేశుని భక్తితో అర్చించడం ప్రారంభించింది. ప్రతిరోజూ ఆ దంపతులు ప్రాతఃకాలంలో దూర్వాంకురాలతో గణపతిని అర్చించసాగారు. కొన్నాళ్లకు గణేశుడు వారికి మోక్షాన్ని అనుగ్రహించాడు.∙సాంఖ్యాయన -
శ్రీనాథ విరచిత వినాయక దండకం
జయ జయ జగదేక రక్షామణీ!దేవ చూడామణీ శ్రేణి శోణ ప్రభాజాల బాలా తప స్మేర పాదారవిందా!ముకుందప్రియా! యిందుధారీ!కటస్యంది దానాంబుధారా ధునీ ధోరణీ గాహ కౌతూహలాయత్త మత్త ద్విరేఫాంగనా గాన సంగీత రంగీకృతస్వాంత!దంతావ ళాస్యా! నమస్యా! త్రిలోకైక వశ్యా! యవశ్యాయ శైలాత్మజా ధర్మసంతాన!సంతాన కల్పద్రు పుష్పావతంసా! యసారోరు సంసార మాయాంధకారా హృతిప్రక్రియా భాస్కరా!కోటిభాస్వన్నిరాఘాట దేహ ప్రభాభాస్వరా! దేవ! హేరంబ! లంబోదరా! యేక దంతా! మహాకాయ! సంతప్త కార్తస్వరాభా!విశాలాక్ష మౌంజీధరా! నాగ యజ్ఞోపవీతా సమన్విత కృష్ణాజినా!యాఖువాహా! కుఠారాయుధా! విఘ్నరాజా! గణాధ్యక్ష!కారుణ్య లీలా కటాక్షంబునన్ మమ్ము వీక్షించి రక్షింపుమీ!క్షీర వారాళి నీ మందరక్ష్మాధర స్వామి కవ్వంబుగా, నీ భుజంగాధినాథుండు సూత్రంబుగా, గచ్ఛపాధీశుడాధార పీఠంబుగా, సర్వదివ్వౌషధీ వల్లులన్ వైచి, నానా పదార్థంబుల న్వెన్నలం బంచుకో గోరి యున్నార, మిక్కార్య మే విఘ్నముం బొందకుండంగ, నే విక్రియం జెంద కిష్టార్థ సంసిద్ధులం గైకొనుం గాక నీ యాజ్ఞ సర్వేశ సర్వాత్మకా!నిర్వికల్పా! నిరీహా! నిరాంతక! నిశ్శంక! యోంకార మూర్తీ! నమస్తే! నమస్తే! నమఃఇవీ చదవండి: వరసిద్ధి వినాయక పూజ.. విఘ్నేశ్వరుని పూజాద్రవ్యములు -
ఈ సండే సరదాగా ఈ హెల్దీ స్వీట్స్ చేసేయండిలా
గోపాలకాలాకావలసినవి: అటుకులు: కప్పు, పెరుగు: అర కప్పు, తాజా వెన్న: 2 టేబుల్ స్పూన్లు, దోసకాయ ముక్కలు: 1/4 కప్పు, దానిమ్మ గింజలు: 1/4 కప్పు, పచ్చిమిర్చి: 2 (సన్నగా తరిగినవి), అల్లం తురుము: 1/2 టీస్పూన్, కొత్తిమీర: కొద్దిగా, బెల్లం: అర టీస్పూన్, ఉప్పు: రుచికి సరిపడా, తాళింపు కోసం– నెయ్యి: టీస్పూన్, జీలకర్ర: 1/2 టీస్పూన్, ఇంగువ: చిటికెడు. తయారీ: అటుకులను శుభ్రంగా కడిగి.. నీళ్లు పోయేలా పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో మెత్తబడిన అటుకులు, పెరుగు, వెన్న, దోసకాయ ముక్కలు, దానిమ్మ గింజలు, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు, బెల్లం, రుచికి సరిపడా ఉప్పు వేయండి. చిన్న పాన్‌లో నెయ్యి వేడి చేసి, జీలకర్ర వేసి వేయించండి. జీలకర్ర చిటపటలాడాక చిటికెడు ఇంగువ వేసి స్టవ్ ఆపేయండి. ఈ తాళింపును అటుకుల మిశ్రమంలో పోసి, కొత్తిమీర చల్లి మెల్లగా బాగా కలపండి.ధనియా పంజీరికావలసినవి: ధనియాల పొడి: కప్పు, నెయ్యి: 4 టేబుల్ స్పూన్లు, బెల్లం పొడి: అర కప్పు, మఖానా: అర కప్పు, జీడిపప్పు, బాదం: 3 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి తురుము: 2 టేబుల్ స్పూన్లు, గుమ్మడి లేదా పుచ్చగింజలు: టేబుల్ స్పూన్, ఏలకుల పొడి: అర టీస్పూన్.తయారీ: మఖానాను ఒక టేబుల్ స్పూన్ నెయ్యిలో వేయించి, చల్లారాక కచ్చాపచ్చాగా పొడి చేసుకోవాలి. అదే కడాయిలో ఇంకో అర చెంచా నెయ్యి వేసి జీడిపప్పు, బాదం, ఎండు కొబ్బరి తురుము వేసి దోరగా వేయించి వేరే ప్లేట్లోకి తీసుకోండి. మిగిలిన నెయ్యి వేసి, ధనియాల పొడిని సన్నని మంటపై సువాసన వచ్చే వరకు వేయించండి. తరువాత చల్లారిన ధనియాల పొడిలో చక్కెర పొడి, ఏలకుల పొడి, మఖానా పొడి, డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలపండి. అంతే ధనియా పంజీరి రెడీ!సింధీ స్వీట్ రైస్కావలసినవి: బాస్మతీ బియ్యం: కప్పు, తురిమిన బెల్లం: 3/4 కప్పు, నెయ్యి: 3 టేబుల్ స్పూన్లు, సోంపు: టీస్పూన్, ఏలకులు: 4, లవంగాలు: 2, దాల్చిన చెక్క: చిన్నముక్క, జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష: గుప్పెడు, కుంకుమపువ్వు: చిటికెడు, నీళ్ళు: 2 కప్పులు.తయారీ: ఒక పాత్రలో నీటిని తీసుకుని బెల్లం వేసి చిన్నమంటపై కరిగించాలి. ఒక పాన్‌లో నెయ్యి తీసుకుని డ్రై ఫ్రూట్స్‌ని వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో మసాలా దినుసుల్ని కూడా వేసి అరనిమిషం వేయించాలి. ఇప్పుడు నానబెట్టిన బాస్మతీ బియ్యం వేసి, నెయ్యిలో జాగ్రత్తగా 2 నిమిషాలు వేయించండి. ఇందులోనే కుంకుమపువ్వు వేసి, ముందుగా సిద్ధం చేసుకున్న బెల్లం నీళ్ళు కూడా పోసి బాగా కలపండి. మూత పెట్టి మీడియం మంటపై 10–12 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి. ఆవిరి పూర్తిగా పోయాక, వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ చల్లి మెల్లగా కలపండి. అంతే నోరూరించే సింధీ స్వీట్ రైస్ రెడీ(చదవండి: మెడ మెరిసేలా ఇలా చేయండి..! దెబ్బకు నలుపు మాయం) -
చూస్తే వావ్... వాడితే ఇంకా వావ్!
ఇంట్లో పెట్టుకున్న డెకర్ పీస్ అంటే రోజంతా మూలన కూర్చుని అందంగా కనిపించడం మాత్రమే కాదు! అందుకే, ఇప్పుడు ఇల్లు అందంగా కనిపించేలా చేస్తూనే... రోజువారీ పనుల్లోనూ చక్కగా చేయూతనిచ్చే ఈ డ్యూయల్ డ్యూటీ గాడ్జెట్లు మీకోసం!గోడ మీద గొడుగు!తాళాలు ఎక్కడ? కత్తెర ఎక్కడ? టవల్ ఎక్కడ? అని ఇంట్లో రోజూ జరిగే ‘పోయిన వస్తువుల వేట’కు ఇక సెలవు చెప్పొచ్చు! ఎందుకంటే, ఈ చిన్న గొడుగు ఆకారపు హుక్ గోడకు అతుక్కుని, ఇంట్లో చెల్లాచెదురుగా తిరిగే చిన్నచిన్న వస్తువులన్నింటికీ ఓ చిరునామా ఇస్తుంది! చూడ్డానికి ముద్దుగా ఉండే ఈ గొడుగు హుక్‌లో తాళాలు, టవల్స్, చిన్న ఉపకరణాలు వంటి వాటిని వేలాడదీయొచ్చు. అవసరాన్ని బట్టి దీన్ని తిప్పి చిన్న వస్తువులు పెట్టుకునే హోల్డర్లా కూడా వాడుకోవచ్చు. గోడకు అతికించే విధానంలో ఉండటంతో డ్రిల్, మేకులు అంటూ గోడకు కొత్త గాయాలు చేయాల్సిన పనిలేదు! బాత్రూమ్లో ఒకటి... కిచెన్‌లో ఒకటి... ఆఫీసు టేబుల్ దగ్గర ఇంకొకటి పెట్టుకుంటే చాలు... ‘ఎక్కడ పెట్టాను?’ అనే ప్రశ్నకు ఈ గొడుగులే సమాధానం చెబుతాయి! ఆరు హుక్‌ల ప్యాక్ ధర రూ.250 మాత్రమే!పిల్లి పంజాకు మురికి పరార్!అద్దం ముందు నిలబడి ఫొటో తీసుకోవాలంటే, మన ముఖం కంటే ముందే అద్దంపై ఉన్న నీటి చారలే కనిపిస్తున్నాయా? సింక్ దగ్గర సబ్బు మరకలు చూస్తూ ‘రేపు క్లీన్ చేద్దాంలే’ అని వాయిదా వేస్తున్నారా? అయితే ఈసారి క్లీనింగ్ పనికి ఓ క్యూట్ పిల్లిని పెట్టుకోండి! అదీ... పంజాలతో పని చేసే పిల్లి! పిల్లి పంజా ఆకారంలో ఉండే ఈ చిన్న స్పాంజ్‌తో అద్దాలు, గ్లాస్ ఉపరితలాలు, టైల్స్, సింక్‌లను తుడిచేయొచ్చు. నీటి చారలు, వేలిముద్రలు, సబ్బు మరకలు వంటి మచ్చలను సులభంగా శుభ్రం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. చిన్నగా, తేలికగా ఉండటంతో అవసరమైనప్పుడు చేతిలోకి తీసుకుని పని పూర్తి చేయొచ్చు. ధర రూ.300 మాత్రమే!గదిలోనే చిన్న స్పా!ఇంట్లో కూర్చుంటేనే కాస్త రిలాక్స్ అవ్వాలని అనిపిస్తుందా? అయితే... గదిలో పరిమళం, చుట్టూ మెల్లని వెలుగు, చెవుల్లో నచ్చిన పాటలు ఉంటే ఎలా ఉంటుంది? అందుకోసం ఒక్కో పనికి ఒక్కో పరికరం పెట్టాల్సిన అవసరం లేదు. ఈ ఒక్కటే మూడు పనులు చేసేస్తుంది! ఇది ఒకేసారి హ్యూమిడిఫైయర్, అరోమా డిఫ్యూజర్, బ్లూటూత్ స్పీకర్లా పనిచేస్తుంది. 350 మిల్లీలీటర్ల ట్యాంక్‌తో సుమారు 8 గంటల వరకు మిస్ట్ అందిస్తుంది. ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుంటే గదంతా ఆహ్లాదకరమైన పరిమళం వ్యాపిస్తుంది. బ్లూటూత్‌తో ఫోన్‌ను కనెక్ట్ చేసి నచ్చిన పాటలు వినొచ్చు. ఎల్ఈడీ లైటింగ్‌తో గదికి మూడ్ లైటింగ్ కూడా వచ్చేస్తుంది. ఇక సెట్టింగ్స్ మార్చడానికి ప్రతిసారీ లేవాల్సిన పనిలేదు... యాప్ ద్వారా మిస్ట్, టైమర్, లైటింగ్ వంటివి నియంత్రించుకోవచ్చు. నీరు అయిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా ఆఫ్ అయ్యే సదుపాయం కూడా ఉంది. గదినే చిన్న స్పాగా మార్చేసే దీని ధర రూ. 2000. (చదవండి: -
మూత్ర పరీక్షలు నార్మల్‌గానే ఉన్నా..ఎందుకు ఆ సమస్య?
నా వయసు ముప్పై ఒకటి. యూరిన్‌కి వెళ్లేటప్పుడు చాలా మంటగా, దురదగా ఉంటుంది. ఆ ప్రాంతంలో చర్మం రంగు మారినట్లు కనిపిస్తోంది. మూత్ర పరీక్షలు చేయించుకున్నాను. ఫలితాలు సాధారణంగానే వచ్చాయి. ఇది సాధారణమేనా?– స్వప్న, కర్నూలు. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే, యోని బయట భాగంలో చర్మానికి సంబంధించిన చికాకు లేదా వాపు ఉండే అవకాశం ఉంది. యోని చుట్టూ ఉండే చర్మం, పెదవుల వంటి భాగాలు, ఇతర సున్నితమైన ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్, అలర్జీ లేదా చర్మ సమస్యల వల్ల మార్పులు రావచ్చు. ఈ ప్రాంతంలో వాపు లేదా చికాకు ఏర్పడినప్పుడు మూత్ర విసర్జన సమయంలో మంటగా అనిపించవచ్చు. మూత్ర పరీక్షలు సాధారణంగా వచ్చినా, సమస్య యోని బయట భాగంలోని చర్మానికి సంబంధించినదై ఉండవచ్చు. అందువల్ల స్త్రీల వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. వైద్యులు అవసరమైతే అంతర్గత పరీక్ష చేసి సమస్యను గుర్తిస్తారు. మీరు ఇటీవల ఏవైనా యాంటీబయోటిక్ మందులు లేదా ఇతర ఔషధాలు వాడారా, గతంలో అలర్జీలు, ఉబ్బసం వంటి సమస్యలు ఉన్నాయా అనే వివరాలను కూడా అడుగుతారు. వేడిమి, తేమ, ఎక్కువగా చెమట పట్టడం వల్ల కూడా ఆ ప్రాంతంలో దురద, మంట పెరగవచ్చు. మధుమేహం, థైరాయిడ్ సమస్యలు, రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో కూడా ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపించవచ్చు. కొన్నిసార్లు యోనిలో లేదా బయట ఉపయోగించే క్రీములు, లోషన్లు కూడా అలర్జీకి కారణం కావచ్చు. అందువల్ల వైద్యుల సలహా లేకుండా ఏ మందు లేదా క్రీమునూ ఉపయోగించకండి. అవసరాన్ని బట్టి యోని నుంచి నమూనా తీసి పరీక్ష చేస్తారు. ఇన్ఫెక్షన్ ఉందా లేదా తెలుసుకోవడానికి రక్త పరీక్షలు, చక్కెర స్థాయిలు, థైరాయిడ్ పరీక్షలు కూడా చేయవచ్చు. కొన్ని ప్రత్యేక చర్మ వ్యాధుల్లో కూడా ఇలాంటి దురద, మంట, చర్మం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అన్ని పరీక్షల తర్వాత సమస్యను బట్టి క్రీములు, లోషన్లు లేదా ఇతర మందులను సూచిస్తారు. కొన్నిసార్లు చికిత్సను కొన్ని వారాలు లేదా ఎక్కువ కాలం కొనసాగించాల్సి రావచ్చు. శిలీంద్రాల వల్ల ఇన్ఫెక్షన్ ఉంటే, దానికి తగిన మాత్రలు, పూతమందులు లేదా యోనిలో ఉపయోగించే ఔషధాలను సూచిస్తారు.చికిత్సతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా తప్పనిసరియోని బయట భాగాన్ని శుభ్రమైన నీటితో కడుక్కోవాలి.ఆ ప్రాంతాన్ని తేమ లేకుండా పొడిగా ఉంచుకోవాలి.సువాసన సబ్బులు, పరిమళ ద్రవ్యాలు, డియోడరెంట్లు వాడకండి.బిగుతుగా ఉండే దుస్తులు ధరించకుండా, వదులుగా ఉండే పత్తి దుస్తులు వాడండి.రోజంతా ప్యాడ్లు లేదా లోదుస్తుల్లో ఉపయోగించే పలుచటి రక్షణ పొరలను అనవసరంగా వాడకండి.దుస్తులు ఉతికేటప్పుడు గాఢ సువాసన కలిగిన ద్రావకాలు ఉపయోగించకండి.వైద్యుల సలహా లేకుండా క్రీములు లేదా ఇతర మందులు వాడకండి.ఇలాంటి సమస్యలు కొన్నిసార్లు పూర్తిగా తగ్గడానికి సమయం పడుతుంది. అందువల్ల చికిత్స మధ్యలో ఆపకుండా, వైద్యులు సూచించిన విధంగా క్రమం తప్పకుండా పరీక్షలకు వెళ్లాలి. సమస్య తగ్గుతోందా లేదా, చికిత్సలో మార్పులు అవసరమా అనే విషయాన్ని వైద్యులు పరిశీలించి తదుపరి చికిత్సను నిర్ణయిస్తారు. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్హైదరాబాద్(చదవండి: మతిమరుపు నివారణ ఇలా..!) -
బొప్పాయి మన దేశంలో పుట్టలేదా? ఘనాంకాలు ఏం చెప్తున్నాయంటే?
మన దేశంలో ఏడాది పొడవునా దొరికే పండ్లలో బొప్పాయి ఒకటి. నిజానికి బొప్పాయి మన దేశానికి స్థానిక ఫలం కాదు. బొప్పాయి ఉత్పాదనలో ఇప్పుడు మన భారత దేశమే అగ్రస్థానంలో కొనసాగుతోంది. బొప్పాయి విశేషాలను గణాంకాల్లో తెలుసుకుందాం...చాలా పండ్ల జాతుల మాదిరిగానే పోర్చుగీసు నావికుల ద్వారా పదహారో శతాబ్దంలో మన దేశానికి చేరుకుంది. బొప్పాయిని భారతీయులు అమితంగా ఇష్టపడటంతో దీని సాగును బాగా పెంచారు. ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ బొప్పాయిని పండిస్తున్నారు.ఇవి కూడా చదవండి: గతం గతః! ఆలోచన మారితే ఆరోగ్యం మారుతుందా? -
గతం గతః! ఆలోచన మారితే ఆరోగ్యం మారుతుందా?
ఒక అడవికి రాజు సింహం. సింహం అంటేనే గజగజలాడే భయం. కానీ, ఇప్పుడు ఆ మృగరాజు ఒక చీకటి గుహలో దీనంగా పడి ఉంది. కొద్దిరోజుల కిందటే తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఒక క్రూరమైన పులితో చేసిన పోరాటంలో సింహం తీవ్రంగా గాయపడింది. ఆ గాయాలు మానినా, ఆనాటి భయంకరమైన దృశ్యాలు సింహం మనసును వదలడం లేదు.రాజవైద్యుడైన ఎలుగుబంటి ఎన్ని ఔషధాలు ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. సింహం నిరాశతో, ‘నా పరాక్రమం ముగిసింది మిత్రమా! ఈ గాయాలే నా మరణానికి దారి తీస్తాయి. నేను మళ్ళీ గర్జించలేను.’ అంటూ నిట్టూర్చింది.అదే సమయంలో, పొరుగు అడవి నుంచి తన మిత్రుడైన ఏనుగును కలవడానికి ఒక కోతి వచ్చింది. ఏనుగు తన రాజు ఆరోగ్య పరిస్థితిని వివరించగా, అంతా విన్న కోతి గంభీరంగా ఇలా అంది: ‘మిత్రమా! మృగరాజుకు ఇప్పుడు కావాల్సింది మూలికల వైద్యం కాదు, మానసిక వైద్యం!’ఏనుగు ఆశ్చర్యపోయి, ‘వైద్యం గురించి నీకు ఇవన్నీ ఎలా తెలుసు?’ అని అడిగింది. అప్పుడు కోతి తన గతాన్ని వివరిస్తూ, ‘నేను ఒకప్పుడు గొప్ప వైద్యురాలిని. కానీ, ఒక చిన్న పొరపాటు వల్ల ఒక జీవి ప్రాణం పోయింది. ఆ అపరాధ భావంతో అప్పటి నుండి వైద్యం చేయడమే మానేశాను. ఎవరికీ ఈ విషయం చెప్పలేదు.’ అని కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా చెప్పింది.ఏనుగు వెంటనే కోతి భుజంపై తొండం వేసి, ‘మిత్రమా! గతాన్ని తలచుకుంటూ కూర్చుంటే ప్రయోజనం లేదు. మన పొరపాట్ల నుంచే మనం పాఠాలు నేర్చుకోవాలి. ఇప్పుడు సింహాన్ని కాపాడటం నీ బాధ్యత. నీలో నిద్రాణమైన వైద్యుడిని నిద్రలేపు!’ అని ప్రోత్సహించింది.ఏనుగు మాటలతో కోతిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. కోతి, ఏనుగు కలిసి సింహం గుహకు వెళ్లాయి. అవి రాజవైద్యుడు ఎలుగుబంటికి విషయం చెప్పాయి. ఎలుగుబంటి సంబరపడి, మృగరాజుకు వైద్యం చేయటానికి కోతిని అనుమతించింది. కోతి సింహాన్ని పూర్తిగా పరీక్షించి ఒక నిర్ణయానికి వచ్చింది. తనకు కావలసిన మూలికలు సేకరించడానికి గుహ బయటకు వెళ్ళింది.ఆ సమయంలో ఏనుగు ఇలా అంది: ‘మృగరాజా! గతం గతః. మీ పరాక్రమాన్ని మళ్ళీ చాటే సమయం వచ్చింది. ఈమె సామాన్యమైన కోతి కాదు, గొప్ప వైద్యురాలు.’మూలికలు సేకరించి తిరిగి గుహలోకి వచ్చిన కోతి, సింహం కళ్ళలోకి సూటిగా చూస్తూ, ‘రాజా! మీ వ్యాధి మీ దేహంలో లేదు, మీ ఆలోచనల్లో ఉంది. నాడు మీరు పులిని తరిమికొట్టినప్పుడు తగిలిన ఈ గాయాలు మీ వీరత్వానికి సజీవ సాక్ష్యాలు! అవి మిమ్మల్ని భయపెట్టకూడదు, మీ గుండెను మరింత బలంగా మార్చాలి.’ అని నొక్కి చెప్పింది. అనంతరం మూలికలతో ఒక లేహ్యం తయారుచేసి సింహానికి తాగించింది.ఆశ్చర్య కరంగా, మరుసటి రోజు ఉదయానికే మృగరాజు తన నిస్సత్తువను వదిలి ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. అడవి మొత్తం దద్దరిల్లేలా గర్జించాడు! నిజానికి కోతి ఇచ్చిన ఆ ‘మందు’ కేవలం తీపి పండ్ల రసం మాత్రమే. సింహం రోగం నయం కావడానికి కారణం ఆ రసం కాదు; కోతి తన మనసులో నింపిన ధైర్యం, గతాన్ని మర్చిపోవాలనే సంకల్పం మాత్రమే!సింహం తన తప్పు తెలుసుకుంది. ఆలోచన మారితే ఆరోగ్యం మారుతుందని గ్రహించింది. తనను మళ్ళీ కర్తవ్యోన్ముఖుడిని చేసిన కోతిని ఘనంగా సత్కరించి, తన ఆస్థాన వైద్యురాలిగా నియమించుకుంది. అలాగే కోతిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన ఏనుగును తన రాజ సలహాదారునిగా నియమించుకుంది. రాజవైద్యుడు ఎలుగుబంటి కూడా వారి సమయస్ఫూర్తిని చూసి మురిసిపోయాడు.హితవచనం..అసంవిభాగీ దుష్టాత్మా కృతఘ్నో నిరపత్రపఃతాదృగ్నరాధిపో లోకే వర్జనీయో నరాధిపఇవ్వవలసిన వాళ్లకు ఇవ్వనివాడు, దుష్టబుద్ధి, కృతజ్ఞత లేనివాడు, సిగ్గులేనివాడు అయిన రాజును పరిత్యజించాలి.- ముద్దు హేమలతఇవీ చదవండి: బెండకాయ వండకూడదట.. నీళ్లు చల్లకూడదట.. ఎందుకో తెలుసా? -
బెండకాయ వండకూడదట.. నీళ్లు చల్లకూడదట.. ఎందుకో తెలుసా?
నైజీరియాలోని ఓండో రాష్ట్రంలో ఉన్న ఓవో నగరం శోభాయమానంగా వెలిగిపోతోంది. 600 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ‘ఇగోగో’ మహోత్సవ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. ఆగస్టు చివరిలో ప్రారంభమై, సెప్టెంబరు మాసమంతా ఈ పండుగ సాగుతుంది. ఇది నైజీరియన్ల స్థానిక జ్ఞాపకాలతో, రాచరికంతో, సామాజిక గుర్తింపుతో ముడిపడి ఉన్న వేడుక. ఎంతో ఉత్సాహంగా సాగే ఈ వేడుకలను తిలకించడానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఇప్పటికే ఓవో నగరానికి క్యూకట్టారు.నైజీరియాలో వర్షాకాలం ముగిసే వేళ జరిగే సాంస్కృతిక పండుగల కాలంలోనే ఈ ఉత్సవం కూడా జరుగుతుంది. ఈ ఇగోగో వేడుక మూలాలు పురాణ కాలపు రాణి ఒరోన్సే చరిత్రతో ముడిపడి ఉన్నాయి. దేవలోకం నుంచి దివికి దిగివచ్చిన ఒరోన్సే, ఓవో రాజును వివాహమాడి, రాజసౌధంలో కొన్ని నియమాలను విధించింది. తనకు ఇష్టంలేని బెండకాయలను వండరాదని, తన సమక్షంలో తలపాగాలు ధరించరాదని, తన దారిలో నీరు చల్లకూడదని కోరింది.ప్రజలు కొన్నేళ్లపాటు ఆ నిబంధనలను గౌరవించినప్పటికీ, కాలక్రమంలో వాటిని ఉల్లంఘించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాణి ఒరోన్సే, అడవుల్లోకి వెళ్లి అదృశ్యమైపోయింది. కానీ వెళ్లేముందు తన జ్ఞాపకార్థం ప్రతి ఏటా ఇగోగో ఉత్సవాన్ని నిర్వహించాలని, అలా చేస్తే రాజ్యానికి శుభం కలుగుతుందని వరమిచ్చింది. నాటి నుంచి ఇగోగో పండుగ ఆచారంగా మారింది. వేడుకకు కొన్ని వారాల ముందునుంచే నగరం నూతన శోభను సంతరించుకుంటుంది. ఊరంతా పండుగ వాతావరణం నెలకొంటుంది.మహిళలు ఊదా, తెలుపు, పసుపు రంగుల ప్రత్యేక వస్త్రాలను నేస్తారు. సంగీత, నృత్య కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పిల్లల నుంచి పెద్దవారి వరకు సన్నద్ధమవుతారు. విదేశాల్లో స్థిరపడినవారు తమ మాతృభూమికి చేరుకుంటారు. మహిళలు పగడపు పూసల ఆభరణాలు ధరించి, ఒరోన్సే రాణి గుణగణాలను, ఆమె త్యాగాన్ని కీర్తిస్తూ తరతరాలుగా వస్తున్న సంప్రదాయ గీతాలను ఆలపిస్తారు. ఈ వేడుకల్లో ఆనాడు రాణి ఒరోన్సే విధించిన నిబంధనలను ప్రజలంతా కచ్చితంగా పాటిస్తారు. నేడు ఇగోగో పండుగ కేవలం సంప్రదాయానికే పరిమితం కాకుండా, పర్యాటకంగానూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రత్యేక ఆకర్షణ ఒలోవో రాజుఇగోగో ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ ఓవో సామ్రాజ్య అధిపతి అయిన ‘ఒలోవో’ రాజు ప్రత్యేకమైన అలంకరణ. సాధారణ రోజుల్లో కిరీటాలు, మిరుమిట్లుగొలిపే వస్త్రాలు ధరించే రాజు, ఈ పండుగ రోజుల్లో విభిన్నంగా కనిపిస్తాడు. తలపాగా లేకుండా, పగడాల పూసల టోపీని, పగడాల హారాలను ధరిస్తాడు. అంతేకాక, రాణి ఒరోన్సే స్త్రీత్వాన్ని, ఆమె పట్ల ఉన్న గౌరవాన్ని చాటడానికి చీర వంటి ప్రత్యేక వస్త్రాన్ని ధరిస్తాడు. రాజ పురోహితులు, సర్దారులతో కలిసి వీథుల్లో నృత్యం చేస్తూ సాగుతాడు.- రమా జంబులఇవి కూడా చదవండి: బ్రేకింగ్ న్యూస్! -
బ్రేకింగ్ న్యూస్!
బ్రేకింగ్ న్యూస్... పత్రికల్లోను, టీవీ స్క్రీన్లపైన ఆ వార్త చూడగానే రాష్ట్రమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ‘నగరంలో సంచలనం సృష్టించిన కిల్లర్స్ గ్యాంగ్ ఘాతుకం! నేరస్తుల గుండెల్లో సింహస్వప్నం అయిన ఇన్స్పెక్టర్ అభిమన్యు శత్రువుల దొంగచాటు కాల్పుల్లో మృతి! ఆయన మృతదేహంతో పరారైన కిల్లర్స్ గ్యాంగ్!’ఈ వార్త తెలిసిన వెంటనే అభిమన్యు అభిమానులు, ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేశారు. అభిమన్యు మృతితో నగరంలో తీవ్ర ఉద్రిక్తత, ఆగ్రహం కట్టలు తెంచుకున్నాయి. ఈ కేసు తీవ్రతను గుర్తించిన ఉన్నతాధికారులు వెంటనే రంగంలోకి దిగారు.ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా హుటాహుటిన డిటెక్టివ్ సిద్ధార్థ నగరానికి చేరుకున్నాడు. స్థానిక ఇన్ స్పెక్టర్ ప్రద్యుమ్నతో కలిసి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.‘కిల్లర్స్ గ్యాంగ్‌ని ప్రపంచంలో ఎక్కడ వున్నా వెతికి పట్టుకుని అంతం చేస్తాను’ అని ప్రద్యుమ్న సవాల్ చేశాడు. పోలీసులు కిల్లర్స్ గ్యాంగ్ ఆనవాళ్ల కోసం నగరాన్ని అణువణువు జల్లెడ పట్టడం ప్రారంభించారు. అదే సమయంలో బీహార్ గ్యాంగ్, హైదరాబాద్‌లోని గోకుల్ చాట్ తరహాలో గోల్కొండ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బాంబు పేలుళ్లు సృష్టించడానికి ప్లాన్ చేసింది. అభిమన్యు మరణ వార్తతో పోలీసులు తలమునకలై ఉన్న సమయంలోనే, నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో మారణహోమం సృష్టించాలనేది వారి కుట్ర.అదే సమయంలో రామ్పూర్లోని ఒక పాడుబడ్డ ఇంట్లో ఒక షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. అక్కడ ఇన్ స్పెక్టర్ అభిమన్యు చనిపోలేదని, కొనప్రాణాలతో ఉన్నాడనే విషయం తెలిసింది. అభిమన్యుని అడ్డుపెట్టుకుంటే తమ ప్లాన్ విజయవంతం అవుతుందని భావించిన బీహార్ గ్యాంగ్, కిల్లర్స్ గ్యాంగ్‌పై అనుకోని దాడిచేసి, అపస్మారక స్థితిలో ఉన్న అభిమన్యుని గోల్కొండ ప్రాంతానికి తరలించింది. బాంబులను నగరంలోని వివిధ ప్రాంతాలకు తరలించే సమయం ఆసన్నమైన తరుణంలో, డిటెక్టివ్ సిద్ధార్థ, ఇన్ స్పెక్టర్ ప్రద్యుమ్నలు నిఘా ద్వారా బీహార్ గ్యాంగ్ డెన్ ను గుర్తించి మెరుపు దాడి చేశారు. పోలీసుల రాకతో కంగారుపడిన ఉగ్రమూక, కొనప్రాణాలతో ఉన్న అభిమన్యుని బందీగా చేసుకుని, ‘ఇప్పుడే ఇతన్ని కడతేరుస్తాం’ అని హెచ్చరించింది.డిటెక్టివ్ సిద్ధార్థ చిరునవ్వుతో, ‘ఇన్ స్పెక్టర్ అభిమన్యుని ఎవరూ చంపలేరు. సమాజంలో నేరాలు, దేశద్రోహం జరుగుతున్నంత కాలం అభిమన్యు బ్రతికే ఉంటాడు!’ అన్నాడు.వెంటనే బీహార్ గ్యాంగ్ చీఫ్ ముక్తార్ మంచం మీద రక్తంతో ఉన్న అభిమన్యు తలకు రివాల్వర్ గురి పెట్టాడు. ‘కమాన్ షూట్’ అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన ప్రద్యుమ్న.ముక్తార్ వేలు ట్రిగ్గర్ మీద బిగుసుకుంది.‘ఇంకా ఆలస్యం ఎందుకు ముక్తార్?’ అంటూ అభిమన్యు కళ్ళు తెరిచాడు. కన్నుమూసి తెరిచేలోగా అభిమన్యు కుడిచేతిలో ఉన్న పిడిబాకు ముక్తార్ కుడి అరచేతిలోకి దిగింది.∙∙ ‘ముక్తార్ నీ ఆట కట్టింది. నువ్వు నగరంలో విధ్వంసం సృష్టించడానికి బీహార్ నుంచి బయల్దేరావన్న సమాచారం రాగానే, నిన్ను వెతుక్కుంటూ వచ్చేలోగా జరిగే ప్రమాదాన్ని ఊహించి, నీ ఆలోచనలను డైవర్ట్ చేసి, నీ ద్వారానే ఇక్కడికి వచ్చేలా ప్లాన్ చేశాడు ఇన్స్పెక్టర్ అభిమన్యు.‘నిజానికి ఇక్కడ కిల్లర్స్ గ్యాంగ్ అంటూ వేరేగా ఏదీ లేదు. పోలీసులే ఆ గ్యాంగ్‌గా నటించారు. నగరంలో బాంబులతో విధ్వంసం సృష్టించాలనుకునే మీలాంటి దేశద్రోహుల ఆట కట్టించడానికి అభిమన్యు వేసిన మాస్టర్ ప్లాన్ ఇది’ చెప్పాడు ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న.అదే సమయంలో పోలీసులు ఆ స్థావరాన్ని చుట్టుముట్టారు. బీహార్ నుంచి హైదరాబాద్‌లోకి అడుగు పెట్టిన ఇరవై నాలుగు గంటల్లో బీహార్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు.∙∙ సీఎం ఛాంబర్..‘థాంక్యూ మిస్టర్ అభిమన్యు! నీ ప్రాణాలను పణంగా పెట్టి, చనిపోయినట్టు నాటకమాడి రాష్ట్రంలో కొన్ని వేల ప్రాణాలు కాపాడారు. రెండు రాష్ట్రాల ప్రజల్లో మీరంటే ఎంత అభిమానమో తెలిసింది. వాళ్ళ అభిమానాన్ని ఆపడం మా తరం కాలేదు. మీరు కనిపించాకే శాంతించారు’ మనస్పూర్తిగా అభినందించాడు ముఖ్యమంత్రి.‘ఈ అభిమన్యు ప్రాణాలు నావి కావు, నా ప్రజలవి’... అని చెప్పి, డిటెక్టివ్ సిద్ధార్థ వైపు, ప్రద్యుమ్న వైపు చూసి థాంక్యూ మై డియర్ ఫ్రెండ్స్’ అన్నాడు.‘మీ లాంటి పోలీస్ అధికారిని ఎవ్వరైనా ప్రేమించకుండా ఉండలేరు. మీ దిష్టి ఇలా పోయింది.’ ఢిల్లీకి బయలుదేరుతూ చెప్పాడు డిటెక్టివ్ సిద్ధార్థ.- శ్రీసుధామయిఇవీ చదవండి: తలుపు: ‘మన ఇల్లు ఇనప్పెట్టెలా భద్రం’.. నెలకే ఏమైంది? -
ఇది నాణెమా.. వెండి కొండా? చూస్తే షాక్ అవుతారు!
రెండు అడుగుల వ్యాసం.. దాదాపు 79 కిలోల బరువు.. చూస్తే ఇది నాణెమని నమ్మడం కష్టమే! అచ్చం వెండి కొండలా కనిపిస్తున్న ఈ భారీ నాణెం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. అసలు ఈ నాణెం ప్రత్యేకత ఏంటి? దీని విలువ ఎంత? ఇప్పుడు తెలుసుకుందాం!ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వెండినాణెం. అమెరికా 250వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టెక్సస్‌కు చెందిన ‘టెక్సస్ ప్రీషియస్ మెటల్స్ ఎల్ఎల్సీ’ కంపెనీ ఈ నాణేన్ని ‘సన్‌షైన్ మింటింగ్’ కంపెనీతో కలసి రూపొందించింది. దీని తయారీ కోసం స్వచ్ఛమైన వెండిని ఉపయోగించింది. రెండు అడుగుల వ్యాసం గల ఈ నాణెం బరువు 78.881 కిలోలు. సన్‌షైన్ మింటింగ్ కంపెనీకి చెందిన హస్త కళాకారులు దీనిని తయారు చేశారు.ఒకవైపు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీలో కాగడా ధరించిన చేతిని, నక్షత్రాలను; మరోవైపు గద్దను అమెరికా వైభవానికి ప్రతీకలుగా తీర్చిదిద్దారు. ఈ నాణెం ముఖవిలువ 250 డాలర్లు. దీనిని కస్టమ్ డిస్ప్లే బాక్స్‌లో పెట్టి, ప్రదర్శనకు అనువుగా భద్రపరచారు. ఇప్పటి వరకు ఇంత భారీనాణెం ఎక్కడా లేకపోవడంతో గిన్నిస్ బుక్ ఈ నాణేన్ని ప్రపంచంలోనే అతిపెద్ద నాణెంగా గుర్తించింది. టెక్సస్‌లోని ఆస్టిన్ నగరంలో దీనిని ప్రజల కోసం ప్రదర్శనకు పెట్టారు.ఇవి కూడా చదవండి: సెరిబ్రల్ పాల్సీతో జీవిస్తూ..12 వేల అడుగుల ఎత్తులో 10 కిలోమీటర్ల పరుగు! -
మెడ మెరిసేలా ఇలా చేయండి..! దెబ్బకు నలుపు మాయం
కళ్ల రక్షణ కోసం పర్యావరణానికి హానిచేయని హైడ్రోజెల్ మాస్క్ అందుబాటులోకి వచ్చింది. ఈ మాస్క్ కంటికి అవసరమైన తేమను, పోషణను అందిస్తుంది. ఇది కాగితపు మాస్క్ కంటే భిన్నంగా, అత్యంత వేగంగా చర్మానికి తేమను అందిస్తుంది. జెల్ రూపంలో ఉండటం వల్ల ఇవి అధిక పరిమాణంలో తేమను, పోషక సీరమ్‌ను నిల్వ చేసుకుంటాయి. చర్మంపై ఉంచినప్పుడు ఈ జెల్ చల్లటి హాయిని ఇస్తూ, తేమను క్రమంగా విడుదల చేస్తుంది. ఈ మాస్క్‌ని ఉపయోగించడం పూర్తయిన తరువాత వేడినీటిలో వేస్తే పది సెకన్ల కంటే తక్కువ సమయంలోనే కరిగిపోతుంది. ఈ హైడ్రోజెల్ మాస్క్ ఉపయోగించడం కూడా సులభంగా ఉంటుంది. ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించే ఈ విధానం పర్యావరణ ప్రియులను, సౌందర్య ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది.రాణిగారి జుట్టు రహస్యంఆస్ట్రియా రాణి ఎలిజబెత్ జుట్టు పాదాల వరకు ఉండేది. ఆమె తన జుట్టు సంరక్షణకోసం ఒక ప్రత్యేక మిశ్రమాన్ని వాడేవారు. గుడ్డు సొన, కొద్దిగా బ్రాందీ కలిపిన మిశ్రమాన్ని ప్రతి రెండు వారాలకొకసారి జుట్టుకు పట్టించేవారు. గుడ్డులోని ప్రొటీన్లు జుట్టుకు బలాన్ని ఇస్తే, బ్రాందీ తలలో ఉన్న నూనెలను శుభ్రం చేసి మెరుపును ఇస్తుందని ఆమె నమ్మేవారు. ప్రపంచ చరిత్రలోనే అత్యంత అందమైన, పొడవైన, ఒత్తైన జుట్టు కలిగిన రాణిగా ఆమె ప్రసిద్ధి చెందారు.మెడ మెరిసేలా!ముఖం మెరిసిపోతున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో మెడ వద్ద చర్మం నల్లగా మారుతుంటుంది. హార్మోన్ల అసమతుల్యత, మురికి పేరుకుపోవడం వల్ల వచ్చే ఈ నలుపును చిన్నచిన్న చిట్కాలతో ఇంట్లోనే సులభంగా తగ్గించుకోవచ్చు. పసుపు, శనగపిండి, పెరుగు– ఈ మూడింటిని కలిపి పేస్ట్‌లా చేసి మెడపై రాసి 20 నిమిషాల తరువాత కడిగేయాలి. బంగాళాదుంపలో చర్మాన్ని ప్రకాశవంతం చేసే సహజ సిద్ధమైన సమ్మేళనాలు ఉంటాయి. బంగాళాదుంప రసాన్ని రోజూ మెడకు పట్టించి పదిహేను నిమిషాల తర్వాత కడిగితే నలుపు త్వరగా మాయమవుతుంది. కలబంద జెల్‌ను ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు మెడకు మర్దన చేసి, ఉదయాన్నే కడిగితే చర్మం మృదువుగా మారడమే కాకుండా రంగు కూడా మెరుగుపడుతుంది. దోసకాయ రసంతో నిమ్మరసాన్ని సమపాళ్లలో కలిపి రాసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.(చదవండి: తలగడలోని డస్ట్‌మైట్స్‌తో అలర్జీలు!) -
తలుపు: ‘మన ఇల్లు ఇనప్పెట్టెలా భద్రం’.. నెలకే ఏమైంది?
పగడాలు కుటుంబం తూర్పు గోదావరి జిల్లా నుంచి హైద్రాబాద్‌కి వలస వచ్చింది. వారిది కొంకుదురు అనే చిన్న పల్లెటూరు. పగడాలు, ఆమె భర్త వ్యవసాయ కూలీలుగా పనిచేసేవారు.పగడాలు తమ్ముడు కొంకుదురు వచ్చినప్పుడల్లా ‘హైద్రాబాద్‌కి వెళ్తే బాగుపడని వారు లేరు. ఇక్కడ ఉంటే ఇలాగే ఉంటాం’ అని ఆమెతో పదేపదే చెప్పడంతో, పగడాలు ఓ రోజు తన భర్తతో చెప్పింది.‘‘వెళ్ళి చూద్దాం. నచ్చకపోతే మళ్ళీ కోతల సమయానికి వచ్చేద్దాం.’’‘‘సరే, ఇక్కడ ఎటూ మనకి సంవత్సరం పొడుగూతా పని దొరకటం లేదు కదా.’’ అతను ఒప్పుకున్నాడు.అతని బావమరిది ఓ బిల్డర్ దగ్గర పని చేస్తున్నాడు. తన సూపర్వైజర్తో మాట్లాడి అక్కా బావలకి పని ఇప్పించాడు. ప్రతి శనివారం ఆ వారానికి చేసిన పనికి డబ్బు ముట్టడం ఆ దంపతులు ఇద్దరికీ నచ్చింది.వాళ్ళు ఓ స్లమ్‌లోని చిన్న గుడిసె అద్దెకి తీసుకుని దిగారు. రెండు సంవత్సరాల తర్వాత ఆ దంపతులకి సొంత ఇల్లు నిర్మించుకోవాలనే ఆలోచన వచ్చింది. స్వంత స్థలం కొనేంత డబ్బు వారికి లేదు. మిగిలిన కూలీలు చేసే పనే వాళ్ళూ చేశారు. ఓ రౌడీకి నెల నెలా అద్దె చెల్లిస్తున్నంత కాలం ఓ పోరంబోకు స్థలంలో యాభై చదరపు గజాల మేర ఏదైనా కట్టుకోవచ్చు. రైలు పట్టాల పక్కనే కొత్తగా విస్తరించిన పట్టణంలో, అపార్ట్మెంట్స్ బాగా అభివృద్ధి చెందే చోటది. అది పనికి కూడా దగ్గర్లోనే ఉంటుంది.పగడాలు, ఆమె భర్త కాగితాలు లేని, నోటి మాట మీద నడిచే ఓ యాభైమంది గల చిట్టీలో చేరి, అవసరమైన సొమ్ముని తీసుకున్నారు.తనకున్న నైపుణ్యంతో పగడాలు భర్త, అతని బావమరిది ఆ ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. సిమెంట్ ఖర్చు కాబట్టి బంక మట్టిని ఉపయోగించి గోడలని లేపారు. పైన నల్లటి టార్పాలి¯Œ ని కప్పుగా వేశారు. ఆ ఇంటికి ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. తలుపుకి డబ్బు చాలక తెర కట్టారు. ఓ శుభముహూర్తంలో గృహప్రవేశం చేశారు.స్వంత ఇల్లు అనేది వారికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. క్రమంగా వాళ్ళు ఆ ఇంటిని అభివృద్ధి చేసుకోసాగారు. ముందుగా పగడాలు భర్త లోపలి మట్టి నేల మీద గచ్చు చేశాడు. తర్వాత వర్షాకాలంలో గోడలని కాపాడటానికి బయటివైపు సిమెంట్ చేశాడు. ఆ తర్వాత పైన టార్పాలిన్ స్థానంలో సెకండ్ హేండ్ ఇనుప రేకులను కొని కప్పాడు. వాటికున్న చిల్లుల్లోంచి వర్షం కారకుండా వాటిని సీసంతో మూసేశాడు.ఆ తర్వాత గోడల లోపలి వైపు సిమెంట్ చేశాడు. వారు కూలీకి వెళ్ళి చేసే ఈ పనులన్నీ తమ స్వంతానికి చేస్తూండటంతో ఆ పనులు మునుపు ఇవ్వని ఆనందాన్ని ఇవ్వసాగాయి.పగడాలు ఆ ఇంట్లోకి ప్రవేశించినప్పటి నుంచి తన భర్తని ఇంటికి తలుపు పెట్టించమని అడుగుతూనే ఉంది. తెర తీసుకుని ఎవరైనా, ఎప్పుడైనా లోపలికి రావచ్చు. రాత్రి తాము నిద్రలో ఉండగా దొంగ చొరబడొచ్చు. కాని ప్రతిసారి తలుపు కన్నా చేయాల్సిన ఇతర పనులే ముఖ్యం అవడం వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది.ఇంట్లోని మట్టి నేలలో జెర్రులు తిరుగుతూండటంతో ఆ నేలని గచ్చు చేయించాల్సి వచ్చింది. వర్షాకాలంలో ఇటుకల మధ్య ఉన్న మట్టి కారి గోడలు కూలకుండా సిమెంట్ చేయాల్సి వచ్చింది. అరబస్తా సిమెంట్ మిగలడంతో అది వృథా కాకుండా దాంతో ఇంట్లో వంటకి ఓ చిన్న గట్టుని కట్టాడు. వర్షానికి కప్పు మీంచి గోడల మీదకి కారే నీటిని ఆపటానికి పైకప్పు వేయించాల్సి వచ్చింది. ఇలా వాళ్ళా ఇంట్లోకి ప్రవేశించాక తలుపు కన్నా మిగిలినవే ముఖ్యమైనవి అయ్యాయి.అవన్నీ పూర్తయ్యాక పగడాలు భర్త ముందు గోడకి గుమ్మం తెచ్చి పెట్టాడు. తర్వాతి సంవత్సరం తలుపుని అమర్చాడు.‘‘నాలుగేళ్లకి ఇది కుదిరింది. ఇంక దొంగలు ఎవరూ చొరబడరు. మన ఇల్లు ఇనప్పెట్టెలా భద్రం.’’ పగడాలు ఆ రాత్రి తలుపు లోపల టవర్ బోల్ట్ పెట్టి సంతృప్తిగా చెప్పింది.తలుపు అమర్చిన నెల రోజులకి పగడాలు భర్త పనిలో జరిగిన ప్రమాదంలో మరణించాడు. అతని మరణం అందరికీ షాక్.∙∙ ఆ రాత్రి స్పర్శకి పగడాలుకి మెలకువ వచ్చింది. కళ్ళు తెరచి చూస్తే ఓ మగాడు తనని తడుముతూ కనిపించాడు. ఆమె ఒక్క ఉదుటున బయటికి దూకి, తలుపు బయట గొళ్ళెం పెట్టి దొంగ అని అరవసాగింది. క్షణాల్లో ఆడ, మగ చాలామంది పక్క గుడిసెల్లోంచి లేచి వచ్చారు.ఆ దొంగ ఆమె పక్కింటివాడు. ఆమె భర్త వయసున్న అతను చిత్తూరు జిల్లా నుంచి వలస వచ్చాడు. అంతా అతనికి దేహశుద్ధి చేసి, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలని తీర్పు చెప్పారు.మర్నాడు పగడాలు తన మరదలితో చెప్పింది.‘‘ఇంతకాలం నేను తలుపే రక్షణ ఇస్తుంది అనుకున్నాను. కాదు. తెర ఉండగా ఎన్నడూ వాడు రాలేదు. అప్పుడు నా భద్రతకి మా ఆయన అనే బలమైన తలుపు ఉందని నాకు తెలీలేదు. ఆడదానికి నిజమైన తలుపు మగాడే.’’- మల్లాది వెంకట కృష్ణమూర్తిఇవి కూడా చదవండి: ఈ వారం కథ: 'ఆత్మబలం' -
పెట్రోలు కొరతతో క్యూబా ఏం చేసిందో తెలుసా?
పెట్రోలు కొరతతో అల్లాడుతున్న క్యూబా.. ఇప్పుడు సరికొత్త దారిని ఎంచుకుంది! బస్సులు, ట్యాక్సీలు కనిపించాల్సిన రోడ్లపై.. సోలార్ ఆటోలు దూసుకెళ్తున్నాయి! చైనాలో తయారైన ఈ వాహనాలు క్యూబా రవాణా ముఖచిత్రాన్నే మార్చేస్తున్నాయి!అమెరికా–ఇరాన్ యుద్ధం ఒకవైపు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మరోవైపు కొనసాగుతున్న నేపథ్యంలో చాలా దేశాలు పెట్రోలు కొరతతో ఇబ్బందిపడుతున్నాయి. చాలా దేశాల్లో ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరుగుతూ వస్తోంది. అయితే, పెట్రోలు సమస్యను అధిగమించడానికి, ప్రజల రవాణా సౌకర్యాన్ని సులభతరం చేయడానికి క్యూబా ఇటీవల సోలార్ ఆటోలను రంగంలోకి దించింది. చైనాలో తయారైన సోలార్ ఆటోలను దిగుమతి చేసి, స్థానిక ఆటో డ్రైవర్లకు అందుబాటులోకి తెచ్చింది. వీటి ధర ఒక్కొక్కటి రెండువేల నుంచి నాలుగువేల డాలర్ల వరకు ఉంటోంది. వీటిని ప్రజల రవాణాతో పాటు సరుకుల రవాణా కోసం కూడా వాడుతున్నారు. క్యూబా నగరాలు, పట్టణాల్లో ఒకప్పుడు బస్సులు, ట్యాక్సీలు తిరిగిన వీథుల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా సోలార్ ఆటోలే దూసుకుపోతూ కనిపిస్తున్నాయి.ఇవీ చదవండి: ఏఐతో వైరస్ సృష్టి.. మానవాళికి వరమా? శాపమా? -
ఆమె రచనల వెనుక దాగిన ఆ విషాద చరిత్ర ఏంటి?
కవితాత్మక వచన రచయిత్రిగా రాణించి, వచన కవనాల మధ్య సరిహద్దులు చెరిపేసిన సాహసి హాన్ కాంగ్. ఆమె 2024లో నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకున్నారు. హాన్ కాంగ్ విజయానికి బలమైన నేపథ్యమే వుంది. అది ఆమె ఇంట్లో నెలకొన్న సాహిత్య వాతావరణం. హాన్ కాంగ్ తండ్రి, హాన్ స్యూంగ్ వాన్ ప్రముఖ కొరియన్ రచయిత– ఆమె అన్న హాన్ డాంగ్ రిమ్, తమ్ముడు హాన్ కాంగ్ యిన్ కూడా రచయితలే.కొరియా ద్వీపకల్పంలో ప్రవహించే హాన్ నది పేరే ఆమె వంశ నామం. ఆమె తొమ్మిదో యేట, హాన్ కుటుంబం సియోల్ సమీపంలోని సుయూ–రీ పట్టణప్రాంతానికి తరలిపోయింది. ఆమె తండ్రి ఉపాధ్యాయ వృత్తికి ఉద్వాసన చెప్పి పూర్తికాలం రచయితగా బతకాలని నిర్ణయించుకోవడమే దానికి కారణం. ఆ నిర్ణయం కాబోయే రచయిత్రి హాన్ కాంగ్ జీవితాన్ని చిన్న మలుపు తిప్పింది. 1982లో, ఆమె జీవితాన్ని మరో మలుపు తిప్పిన సంఘటన మరొకటి జరిగింది. తమ యింట్లో పడివున్న ఓ ఆల్బం హాన్ కాంగ్ కంటపడ్డమే ఆ మలుపు! 1980 మే నెలలో– హాన్ కుటుంబం సియోల్ సమీపంలోని ఓ శివారు పట్టణానికి తరలిపోవడానికి కొద్ది నెలల ముందు– దక్షిణ కొరియాలో గ్వాంగ్ జూ తిరుగుబాటు చెలరేగింది. అక్కడి సైనిక పాలకులు దాన్ని ఎంత నిర్దాక్షిణ్యంగా అణిచేశారో ఆ ఆల్బం ద్వారా హాన్ కాంగ్ తెలుసుకోగలిగింది. సదరు ఆల్బంలోని ఫొటోలు తీసినవాడు యెర్గెన్ హింట్జ్–పియెర్ అనే పాత్రికేయుడు, ఫొటోగ్రాఫర్.ఇరవై మూడేళ్ళ వయసులో, కొరియన్ భాషాసాహిత్యాల్లో పట్టా పుచ్చుకుని, యోన్సెయ్ విశ్వవిద్యాలయం నుంచి బయటపడిన హాన్, కొంతకాలం పత్రికల్లో పనిచేసింది. అదే సంవత్సరం ఆమె ‘అచ్చులోన తన పేరును ముచ్చటగా’ చూసుకున్నారు! ‘సాహిత్యం–సమాజం’ అనే త్రైమాసిక పత్రికలో ఆమె రాసిన అయిదు కవితలు అచ్చయ్యాయి. మరుసటి సంవత్సరం ‘సియోల్ షిన్మున్’ అనే వార్తాపత్రిక నిర్వహించిన కథానికల పోటీలో హాన్ కథానిక ‘ఎర్ర లంగరు’ బహుమతి పొందింది.ఆ పై సంవత్సరం, అంటే 1995లో, హాన్ తొలి కథా సంకలనం ‘యోసూ– ఓ ప్రేమకథ’ విడుదలైంది. అందులోని ప్రతి ఒక్క వాక్యం –కాలెరిజ్ చెప్పినట్లు– ‘అత్యుత్తమ క్రమంలో పేర్చిన, ఉత్తమమైన పదాల’తో అలరారి, అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆమె తన జర్నలిస్టు ఉద్యోగాన్ని వదిలిపెట్టి, పూర్తికాలం రచనలకే కేటాయించే నాటికి, హాన్ వయసు అక్షరాలా పాతిక సంవత్సరాలు!2007లో, హాన్ జీవితం ఇంకో మలుపు తిరిగింది. ‘తీయగా చల్లగా పాడుకునే పాట’ శీర్షికతో ఆమె మరో కథాసంకలనం వెలువరించారు. హాన్ జియోంగ్–రిమ్ అనే సంగీతజ్ఞుడూ, సంగీత దర్శకుడు ఆ కథలన్నీ హాన్ సొంతగొంతులో పాడి వినిపించి తీరాలని పట్టుబట్టారట! ఆయన మాట కొట్టిపారేయలేక రచయిత్రి అలానే చేశారట! ఆ తర్వాత, ఆమె ప్రధానంగా నవలలపై దృష్టి కేంద్రీకరించారు. ఇంతవరకూ ఆమె ఏడు నవలలు వెలువరించారు. వాటిల్లో ‘శాకాహారి’ సుప్రసిద్ధం. ఈ మూడు భాగాల గొలుసుకట్టు రచనకు చిన్న నేపథ్యముంది.కొరియన్ కవయిత్రి యీ–సాంగ్ కవితలోని ‘మనుషులు మొక్కలైతే ఎంత బాగుంటుంది?’ అనే పాదంలోని అంతరార్థం ఏమిటనే అన్వేషణ హాన్‌లో విద్యార్థి దశలోనే మొదలైంది. యీ–సాంగ్ ఆ కవితను ఎప్పుడు రాశారు? దాని చారిత్రక నేపథ్యమేమిటి? అన్న ప్రశ్నలకు జవాబు వెతికే క్రమంలో కవయిత్రి హృదయం ఈ రచయిత్రికి బోధపడింది. అలా ‘శాకాహారి’ అనే నవలా త్రయానికి ఇతివృత్తం రూపొందింది. ఆ త్రయంలో రెండు–మూడు భాగాలుగా ‘మంగోలియన్ ముద్ర’, ‘అగ్నివృక్షం’ వెలువడ్డాయి.ఇరవయ్యో శతాబ్ది అంతం కాబోతోందనగా, హాన్–కాంగ్ విజయ ప్రస్థానం మొదలైందని చెప్పొచ్చు. హాన్ నవలిక ‘బుద్ధ శిశువు’ 1995లో కొరియన్ నవలా పురస్కారం గెల్చుకుంది. ఇరవై ఒకటో శతాబ్ది తొలిపాదం ముగియబోతోందనగా నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకోవడంతో ఈ యాత్ర పతాకస్థాయికి చేరినట్లయింది. ‘శాకాహారి’ నవలా త్రయంలో ‘మంగోలియన్ ముద్ర’ 2005లో ‘యీ– సాంగ్ సాహిత్యపురస్కారం’ గెల్చుకుంది.పదకొండేళ్ళ తర్వాత ‘శాకాహారి’ నవలకు డెబోరా స్మిత్ చేసిన ఆంగ్లానువాదం అంతర్జాతీయ బుకర్ పురస్కారం గెల్చుకుంది. అదే సంవత్సరం– 2016లోనే– ‘ద న్యూ యార్క్ టైమ్స్ బుక్ రెవ్యూ’ ఎంపిక చేసిన పది ఉత్తమ రచనల జాబితాలో ఈ నవలకు స్థానం దక్కడం విశేషమే మరి! అదే సంవత్సరం హాన్ వెలువరించిన ‘మనుషుల చేతలు’ నవలకు అడల్ఫీ ఎడిజియోనీ చేసిన ఇటాలియన్ అనువాదం, ‘ప్రీమియో మలపార్టీ’ పురస్కారం గెల్చుకుంది.2021లో వెలువడిన హాన్ అయిదో నవల ‘మనం విడిపోం’ రెండేళ్ళ తర్వాత ఫ్రెంచ్ భాషలోకి అనువాదమై ‘ప్రీ మెడిసిస్’ పురస్కారం గెల్చుకుంది. ప్రతిభకు తగినంత పేరు పొందని రచయితలకిచ్చే పురస్కారమిది! హాన్ సాధించిన ఈ విజయంతో పాశ్చాత్య సాహిత్య ప్రపంచం పెద్దలు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఆ ఉలికిపాటుకు పర్యవసానమే, 2024లో హాన్ నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకోవడం!- మందలపర్తి కిషోర్ఇవి కూడా చదవండి: నాన్నకు చేయాల్సిన కర్మలు వద్దన్నాడు.. చివరికి ఏం జరిగిందంటే? -
ఈ వారం కథ: 'ఆత్మబలం'
‘నేను ఇప్పట్లో ఇండియా రాలేను. ఫుల్ బిజీగా ఉన్నాను. మీరే చూసుకోండన్నయ్యా!’ ఇక అంతకన్నా చెప్పాల్సిందేమీ లేదన్నట్లు ఫోన్ చేసి చెప్పాడు రాఘవ.‘అది కాదురా రాఘవా! నాన్న సంవత్సరీకానికయినా రాకపోతే ఎలారా? ఒకసారి ఆలోచించు.!’ ‘లేదన్నయ్యా! అర్థం చేసుకో! కావాలంటే వీడియో కాల్లో అటెండ్ అవుతానులే!’ అంటూ ఫోన్ కట్ చేశాడు రాఘవ.మాధవరావు, సుమతి దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు రామారావు హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిరపడ్డాడు. చిన్న కొడుకు రాఘవ అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసుకుని, అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరికీ పెళ్లిళ్లయి ఎవరికి వారు జీవిస్తున్నారు. తల్లి సుమతి పెద్ద కొడుకు రామారావు వద్దనే ఉంటుంది.మాధవరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగ విరమణ పొంది, అంతా సెటిల్ అయ్యారు అనుకుంటున్న తరుణంలో అనారోగ్యంతో సంవత్సరం క్రితం కాలం చేశాడు.యాభై సంవత్సరాల పాటు ఏమాత్రం అరమరికలు లేకుండా, అన్యోన్యంగా జీవించిన తమ బంధం భౌతికంగా వీడటంతో ఆనాటి నుంచి కుమిలి కుమిలి రోదిస్తూనే ఉంది సుమతి. అంత్యక్రియలు, కర్మకాండలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తే తన భర్త ఆత్మ శాంతిస్తుందని, ఆ విధంగానే శ్రాద్ధ కర్మలు నిర్వహించాలని కొడుకులను కోరింది సుమతి. పెద్ద కొడుకు రామారావు ఆచార వ్యవహారాలను అనుసరిస్తుంటాడు. కానీ చిన్న కొడుకు రాఘవ మాత్రం ఆస్తికులకు నాస్తికులకు మధ్యలో ఉండి, కొన్నింటిని అనుసరిస్తూ, కొన్నింటిని త్యజిస్తూ ఉండే స్వభావం. అదీగాక తన తండ్రి తనకేమీ చేయలేదనే కోపంతో ఉంటుంటాడు. అన్నను చూసుకున్నట్లుగా తనను చూసుకోలేదని బాధపడుతుంటాడు. మాధవరావు చనిపోయిన రోజు అన్న రామారావు బలవంతం మీద అమెరికా నుంచి వచ్చి చివరి చూపు చూసి, అంత్యక్రియల్లో పాల్గొని, వెంటనే వెళ్లిపోయాడు.అంత్యక్రియల తర్వాత మాధవరావు కుటుంబ స్నేహితుడు నారాయణ శాస్త్రిగారితో మిగతా కర్మకాండల విషయమై చర్చించిన విషయాలు ఒక్కొక్కటిగా రామారావు మదిని తొలుస్తున్నాయి.ప్రతి నెలా మాసికం పెడుతూ, శాస్త్రోక్తంగా సంవత్సరీకం వరకు జరపాలని అమ్మ కోరడంతో పాటు, శాస్త్రిగారు కూడా శాస్త్రం ప్రకారం నిర్వహించాలని కుటుంబ సభ్యులకు సూచించాడు. దీనికి అసహనానికి గురైన రాఘవ, ‘శాస్త్రిగారూ! మళ్లీ ఇండియా నేను రాలేను. నన్ను ఇబ్బంది పెట్టకండి’ అనడంతోశాస్త్రిగారికి కోపం వచ్చి, ‘చిన్నపిల్లోడిలా మాట్లాడకు రాఘవా! నాన్న ఎంత నిష్టాగరిష్ఠుడో అందరికీ తెలుసు. నాన్న ఆత్మ శాంతించాలంటే సంవత్సరం వరకు అన్ని తిథులూ పెట్టాల్సిందే. ఆ విధంగా చేయకపోతే మీ కుటుంబానికే అరిష్టం.’ అని హెచ్చరించారు.‘భయపెట్టి నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారా? ఇక్కడ ఉన్నవాళ్లు చేస్తే చేసుకోండి.. నాకవసరం లేదు.’ అని రాఘవ కరాఖండిగా చెప్పాడు.‘కర్మాధికారంతో పెద్దవాడు కర్మ చేస్తున్నప్పటికీ, ఒకే చోట అన్నదమ్ములిద్దరూ ఈ క్రతువును చేయాల్సిందే. అంతేకాదు ఏటి సూతకం కూడా ఉంటుంది. సంవత్సరం పాటు మరే శుభకార్యాలు చేపట్టకూడదు. పితరుల ఆత్మశాంతికి, కుటుంబ సభ్యుల అభివృద్ధికి తర్పణాలు విడవాల్సిందే రాఘవా!’ హెచ్చరించాడు శాస్త్రిగారు.‘శాస్త్రిగారూ! ప్రతినెలా మాసికం, మధ్యలో వచ్చే తిథులు, ఇవన్నీ కాకుండా సంవత్సరానికి ఒకసారే పెట్టుకోవచ్చు కదా! మాకంతా టైం వేస్ట్. వ్యయ ప్రయాసలతో కూడినది. కాస్త ఆలోచించండి మా వైపు కూడా!’ రాఘవ తనకు అనుకూలమైన సమాధానాన్ని తెప్పించుకునేందుకు ప్రయత్నించాడు.‘పురాణాల ప్రకారం అంత్యక్రియలు, కర్మ కాండలు మరణానంతరం జీవికి శాంతి చేకూర్చడమే కాక, కుటుంబ సభ్యుల శ్రేయస్సు, ధార్మిక సంప్రదాయాన్ని చాటుతాయి. సంవత్సరం వరకు కూడా ఆత్మ కుటుంబ సభ్యుల మధ్యనే తిరుగుతూనే ఉంటుంది. విధిగా అన్ని తిథులలో శ్రాద్ధాలు పెట్టాల్సిందే. సంవత్సర దీక్ష తప్పదు.’ అని శాస్త్రిగారు మరింత వక్కాణించడంతో, గుటకలు మింగిన రాఘవ..‘సరేలెండి! ఏం చేస్తాం!? నేను లేకపోయినా ప్రతినెలా అన్నయ్య ఇక్కడ ఏర్పాటు చేస్తాడు. నేను సంవత్సరీకానికి వస్తాను. వీలైతే ప్రతి నెలా నేనక్కడ పెట్టుకుంటాలేండి.’ అసహనంగా చెప్పాడు రాఘవ.‘లేదు రాఘవ! అన్నదమ్ములిద్దరూ ఒకే చోట కలిసి చేయాల్సిందే. ఇది శాస్త్రమే కాదు. కలిసి మెలిసి ఉండే కుటుంబ ఐక్యత సూత్రం, మాసిక ధర్మాన్ని చాటుతుంది. నాన్నగారి ఆత్మశాంతికి ఆ మాత్రం సమయం కేటాయించలేవా..?‘ నిలదీస్తున్నట్లు ప్రశ్నించడంతో, చేసేది చేయొచ్చు ఈయనతో వాదనెందుకని మాట్లాడకుండా ఉండిపోయాడు రాఘవ.కొత్తగా పెళ్లయిన తన తమ్ముడిని ఇబ్బంది పెట్టటం ఎందుకనుకుని..‘సరే రాఘవ! కనీసం నాన్నగారి సంవత్సరీకానికైనా తప్పనిసరిగా నువ్వు, వనజ వచ్చేయండి.’ అన్నాడు. ముసిరిన జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చాడు రామారావు. సంవత్సరీకానికైనా తమ్ముడొస్తే బాగుండు అనుకుంటూ, వచ్చే నెలలో వున్న నాన్న సంవత్సరీకం ఏర్పాట్ల ఆలోచనలో నిమగ్నమయ్యాడు.∙∙ ‘ఏవండీ! మామగారి సంవత్సరీకం వచ్చేనెల ఉంది కదా! ఇండియా వెళ్దామండి.’‘నీకేమైనా పిచ్చా? ఇక్కడ బోలెడన్ని పనులున్నాయి. అదేదో వాళ్లే చేసుకుంటారు. ఏదో ఒక సాకు చెప్పొచ్చులే.’ విసుగ్గా అన్నాడు రాఘవ.‘అదేంటండి అలా అంటారు? తండ్రికి శ్రాద్ధ కర్మలు పెట్టకపోతే, మనకు మంచిది కాదండి. ప్లీజ్ కొన్ని పాటించాలి. అయినా తండ్రి ఋణం తీర్చుకోవడం, ఆయన ఆత్మశాంతికి ఈ మాత్రం చేయడానికి వెనుకాడటం ఏమాత్రం బాగోలేదు.’ వనజ గట్టిగానే అంది.‘వనజా...నీకేం తెలియదు ఊరుకో! నాకేం చేశాడని మా నాయన? అందరిలాగే చదువుకున్నాను. సొంతంగా కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నాను. అన్నయ్యను చూసినట్లు నన్నేమైనా చూశాడా? ఆ రోజు ఏదో ఒకటి చెప్పి, అక్కడి కార్యక్రమం వీడియో కాల్లో చూసి ఓ నమస్కారం పెట్టేద్దాం సరిపోతుంది. ఎటువంటి సంస్కారాలు చేయనవసరం లేదు. ఇక నన్ను విసిగించకు.’ అంటూ అగ్గిమీద గుగ్గిలమయ్యాడు రాఘవ.‘జన్మనిచ్చి, పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు ఏంచేస్తే ఋణం తీరుతుంది? జీవించినంత కాలం సేవ చేయాలి. చనిపోయిన తర్వాత శ్రాద్ధకర్మలు పెట్టి వారి ఆత్మను శాంతింపచేయాలి.’ అంటూ రాఘవను కన్విన్స్ చేయబోయింది వనజ.‘ఏమోలే! పనికిరాని టాపిక్. ఎట్టి పరిస్థితుల్లో నాన్న తిథికి తిరిగి ఇండియాకు వెళ్ళేది లేనేలేదు.ఉన్నాడుగా అన్న... ఆయన చూసుకుంటాడులే. ఇక దాని గురించి వదిలేయ్! అవునూ! నాన్న అంత్యక్రియలకు వెళ్లినప్పుడు హైదరాబాదులో ఒక విల్లా చూశాను కదా! దానికి అడ్వాన్స్ ఇవ్వాలి. ఈ వారం రోజుల్లో చెల్లిస్తాను.’ ‘అదేమిటండీ! మీకు మొన్ననే ఉద్యోగం కూడా పోయింది కదా, మళ్లీ ఇంకో ఉద్యోగం వచ్చేవరకు ఆగుదాం. పైగా మామగారు పోయి సంవత్సరం కూడా కాలేదు. సంవత్సరం లోపు ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు కదా! ఇప్పుడు డబ్బు కట్టడం అంత శ్రేయస్కరం కాదు, ఆలోచించండి.’ భర్తకు నచ్చచెప్పడానికి ప్రయత్నించింది వనజ.‘ఛత్! చాదస్తం మాటలు మాట్లాడకు. ఇవన్నీ ట్రాష్. మానసిక బలహీనతతో ఆడుకునే శాస్త్రాలు. వీటిని నమ్మను. సిద్ధాంతాలు, సంప్రదాయాలు, నమ్మకాలు, మూఢత్వాలతో ప్రాక్టికల్ లైఫ్‌కు అడ్డం చెప్పకు. ఇప్పటివరకు నేను దాచుకున్న డబ్బుతో వచ్చేవారం అడ్వాన్స్ చెల్లిస్తాను.’ అంటూ ఒంటి కాలిపై లేచాడు రాఘవ. ఇక ఆ విషయం కొనసాగిస్తే భర్త సీరియస్ అవుతున్నాడని గ్రహించింది వనజ.‘సర్లేండి... రేపు ఆదివారం ఎక్కడికో వెళ్దామని చెప్పారు.’ టాపిక్ మార్చడానికి ప్రయత్నం చేసింది వనజ.‘యస్. బాగా గుర్తు చేశావు. మనం రేపు పిక్నిక్కి వెళ్దామనుకున్నాము. కాస్త మనసన్నా రిలాక్స్డ్గా ఉంటుంది, వెళదాం.’ ఉద్యోగం, సంవత్సరీకం ఈ రంధి నుంచి కాస్తంత ఉపశమనం కావాలనుకున్నాడు రాఘవ.∙∙ ఆరోజు ఆదివారం సమీపంలోని వాటర్ ఫాల్ సైట్ సీయింగ్‌కు వచ్చారు రాఘవ, వనజలు. వాటర్ ఫాల్స్ సమీపంలో ఓ నది ప్రవహిస్తోంది. అందులో పర్యాటకులు బోటింగ్ షికారు చేస్తున్నారు.‘ఏవండీ..! మనం కూడా బోటింగ్ చేద్దామండి.‘ గోముగా అడిగింది వనజ.‘వామ్మో! నాకు నీళ్లంటే భయం. ఆడపిల్లవైనా మీ నాన్న నీకు ఈత నేర్పాడు. మీ మామగారున్నారే– అదే– మా నాయన– మా ఊరి చెరువులో కొన్ని రోజులే సగం వరకే ఈత నేర్పారు. పూర్తిగా నేర్చుకోకముందే నుమోనియా రావడంతో, ఇక నేర్పలేకపోయాడు. దాంతో నాకు ఈత రాకుండా పోయింది. అందులో కూడా ఆయన వల్లే ఫెయిలయ్యాను.’ అని గతాన్ని గుర్తు చేసుకుంటూ...‘వెళితే నువ్వు వెళ్ళు. నేను ఇక్క డే ఉంటాలే’ అన్నాడు.‘అదేంటండి చోద్యం కాకపోతే! షికారు ఎవరైనా ఒక్కరే చేస్తారా? జంటగా వెళితేనే సరదా ఉంటుంది. అయినా ప్రతి ఒక్కరికి బెల్టు పెడతారు. భద్రంగానే ఉంటుంది. మగవారయుండి అంత భయపడితే ఎలా? పదండి పోదాం.’ అనగానే తన ఇగో పనిచేసి, బోటింగ్‌కు సిద్ధమయ్యాడు రాఘవ.బోట్లో నదిలో కొద్ది దూరం వెళ్లేసరికి ఒకచోట ప్రవాహం ఉద్ధృతమై, బోటులో చివర కూర్చున్న రాఘవ బెల్టు ఊడి అదుపు తప్పి నీళ్లలో పడిపోయాడు. పడీ పడగానే నీటిలో మునుగుతూ హాహాకారాలు చేస్తున్నాడు. భర్త ప్రమాదాన్ని గమనించిన వనజ వెంటనే నీటిలో దూకింది. కానీ ఇద్దరికీ పోను పోను చాలా దూరం పెరగడంతో, ఆమె రాఘవను అందుకోలేకపోతుంది. రాఘవ నీటిలో మునుగుతూ తేలుతూ, నీళ్లు మింగుతూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.కాకతాళీయంగా పైకి ఒక్కసారి ఆకాశం వైపు చూపు పడిన రాఘవకు నాన్న ఆకారం కనిపించినట్లయింది. ఆనాడు తమ ఊరి చెరువులో నాన్న ఈత నేర్పిన దృశ్యం గుర్తుకొచ్చింది. టైరు మధ్యలో తనను కట్టి ఈత ప్రాక్టీస్ చేయించిన దృశ్యం కళ్ళ ముందు కదలాడింది.పైనుంచి నాన్న...‘కమాన్ రాఘవా! కమాన్! అలాగే చేతులు, కాళ్లు ఆడించి పైకి తేలు... మునగకు... శరీరాన్ని తేలికగా చేసుకో... కాళ్లు చేతులు వేగంగా ఆడించు కమాన్... కమాన్... అలాగే... ఇంకా ముందుకు... ఇంకా ముందుకు... అంటున్నట్లుగా, ఉత్సాహపరుస్తూ, తనకు మరోసారి ఈత నేర్పుతున్నట్లుగా అనిపించి తన శక్తినంత కూడ తీసుకొని ఈత కొడుతూనే ఉన్నాడు రాఘవ. ‘నీకు ఈత బాగా వచ్చు... బాగా ఈదుతున్నావు. వెరీ గుడ్... అలాగే వచ్చేయ్..! అలాగే...’ అంటూ వెన్ను తడుతున్నట్లుగా నాన్న ఆత్మదర్శనంతో రాఘవ మరింత బలాన్ని కూడతీసుకొని చేతులు కాళ్లు వేగంగా కదిలిస్తూ, నీటిపై తెలియాడటం మొదలెట్టాడు. ఇంతలో ఎవరో ఒకరు బలంగా ఒక్క తోపు తోసినట్లు అనిపించడంతో, ఒక్కసారిగా ఒడ్డు సమీపంలోని చిన్న చెట్టును అందుకోగలిగాడు. ఆ చెట్టు ఆసరాతో నెమ్మదిగా ఒడ్డుకు చేరుకున్నాడు రాఘవ. ఒడ్డుకు చేరిన రాఘవ అంత చల్లదనంలో కూడా చెమటలు కక్కుతూ, ప్రాణ భయంతో వణుకుతూ ఆయాసపడుతూ కూర్చున్నాడు. ఇంతలో వెనకనుంచి వచ్చి భర్తను పట్టుకున్న వనజకు దుఃఖం కట్టలు తెంచుకుంది.లోపల నుంచి పీలగా వస్తున్నట్లుగా, జీర గొంతుతో, రోప్పుతూ...‘వనజా... వనజా..! నాన్న కనిపించాడు. ఆత్మదర్శనమైంది.’ అంటూ తల పైకెత్తి చూపించాడు.‘నన్ను రక్షించింది... పునర్జన్మ నిచ్చింది నాన్నే వనజా..! ఆనాడు సగం నేర్పిన ఈత, ఈనాడు పైనుంచి పూర్తిగా నేర్పాడు. అంతేకాకుండా అదృశ్య శక్తిగా, నేను కొట్టుకుపోకుండా బలంగా ఒడ్డుకు నెట్టడంతో నేను బతికాను వనజా..!’ అంటూ వల వల ఏడుస్తున్న భర్త వైపు లాలనగా చూసింది వనజ.అంత బాధలోనూ ఆమె మోములో ఓ చిరుదరహాసం మెరిసింది. తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ, ‘మీ సంకల్పం గొప్పది మామగారు..! ఎవరితో ఏ పని చేయించాలో ఆ పని చేయించే ఆత్మబలం మీది. మీ కుమారుడిని కాపాడటానికి ఆత్మ శక్తిగా సగం మీరు పనిచేస్తే, వేగంగా డైవ్ చేసుకుంటూ నా భర్తను రక్షించుకునే మిగతా సగం బాధ్యతను నేను పూర్తి చేశాను. నేను చేసిన ఆ సగం మీ అదృశ్య శక్తిగా విశ్వసిస్తున్న నా భర్తకు, మీపై కలకాలం అదే గౌరవం, నమ్మకం ఉండే విధంగా, ఈ విషయాన్ని మనసులోనే దాచుకుంటాను మామగారు.’ అంటూ వనజ చేతులెత్తి నమస్కరించింది.∙∙ ‘అన్నయ్యా..! నాన్న తిథికి నేనూ వనజ ఇద్దరం వచ్చేస్తున్నాం! అన్ని ఏర్పాట్లు ఘనంగా చేయండి..! టికెట్లు కూడా తీసుకున్నాం.’ రామారావుకి ఫోన్ చేసి చెప్పాడు రాఘవ.‘వనజా..వనజా.’ అంటూ గట్టిగా పిలిచాడు రాఘవ.‘ఏంటండీ..! ప్రతిదానికి హడావుడే... మీకు ఏదొచ్చినా తట్టుకోలేము. ఏంటో చెప్పండి.’ అంటూ వంటింట్లో నుంచి వచ్చింది వనజ.‘ఏం లేదు వనజా! గత నెల నాకు లేఆఫ్‌లో ఉద్యోగం పోయిందిగా... ఈ రోజు మెయిల్ వచ్చింది వేరే కంపెనీలో మరింత ప్యాకేజ్‌తో పైస్థాయి ఉద్యోగం వచ్చింది.’ అంటూ సంతోషంతో వనజను కౌగిలించుకుని ఉక్కిరిబిక్కిరి చేశాడు రాఘవ.‘ఓహ్! సూపర్... మంచి వార్త చెప్పారు. మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. హైదరాబాదులో విల్లాకు అడ్వాన్స్ చెల్లించవద్దని మా అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు. అదేదో డబుల్ రిజిస్ట్రేషన్ వివాదంలో ఉందట.’ వనజ చెప్పడంతో మరింత ఆనందంతో మరోసారి నాన్నను మనసులో తలచుకున్నాడు రాఘవ.‘యస్... వనజా..! సంవత్సరంలోపు శుభకార్యం మన చేత చేయించకుండా అడ్డుపడి, మనకు మేలు చేసింది మీ మామగారే. శాస్త్రాన్ని నమ్మకపోవడంతో చేయాల్సిన కర్మలు సరిగా చేయలేదేమో, అందుకే ఆ రోజున నాకు ఉద్యోగం పోయింది. నాన్న ఆత్మ దర్శనం కావడంతో, నాన్నపై విశ్వాసం పెరగడంతో, మళ్లీ పాత దానికన్నా పెద్ద ఉద్యోగం వచ్చింది. నిజంగా ఇది నాన్న ఇచ్చిన వరప్రసాదమే కదా వనజ!’ అంటూ ఆత్మ సంతృప్తితో ఆనందాన్ని వ్యక్తం చేశాడు రాఘవ. మంచి పరివర్తనతో తన భర్తలో వచ్చిన మార్పుకు వనజ లోలోన సంతోషించి, మామగారికి కృతజ్ఞతలు చెప్పుకుంది. మాధవరావు సంవత్సరీకానికి రాఘవ, వనజలు ఇండియా బయలుదేరారు.∙∙ ఇల్లు చేరీ చేరగానే అమ్మను పట్టుకొని, కుమిలి కుమిలి ఏడ్చాడు రాఘవ. ‘నాన్నను తప్పుగా అర్థం చేసుకున్నానమ్మా! నాకు నాన్న ఆత్మ దర్శనమైంది.’ అంటూ జరిగిందంతా చెప్పాడు. నేను మళ్ళీ బతికి నీ ముందున్నాను అంటే, నాన్న ఇచ్చిన పునర్జన్మేనమ్మా!’ అంటున్న రాఘవను పొదివి పట్టుకుని ఓదార్చింది సుమతి.‘నీకు ఇంకో విషయం చెప్పనా రాఘవా! నాన్న విషయంలో ఇంకోటి కూడా పూర్తిగా అర్థం చేసుకోలేకపోయావు. నాన్న నీకు చెరువులో ఈత నేర్పుతున్న కాలంలో, నాన్నకు న్యుమోనియా వచ్చింది. దాంతో పూర్తిగా ఈత నేర్పలేకపోయాడు.కాలం గడుస్తున్నా కొద్దీ, వ్యాధి ముదిరి ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. ఆ పరిస్థితుల్లోనే నీ అమెరికా ప్రయాణం రావడంతో చికిత్సకు వెచ్చించాల్సిన డబ్బును నీ అమెరికా ప్రయాణానికి, చదువుకు పెట్టాడు. సరైన సమయంలో చికిత్స లేకపోవడంతో, వ్యాధి ముదిరి ప్రాణాంతకమైంది. ఒక రకంగా తన ప్రాణాన్ని నీ చదువు, ఉన్నతికి పణంగా పెట్టాడు.అంతే కాదు రాఘవా..! నువ్వు అనుకున్నట్లు అన్నయ్యను ఎక్కువగా ఏమీ చూడలేదు. ఇంకా.. అన్నయ్యే నీకోసం త్యాగం చేశాడు తెలుసా..? మీ ఇద్దరికీ సమానంగా వచ్చిన వాటాలో, అన్నయ్యకు వచ్చిన ఎకరం పొలంలో సగం అమ్మి నీ చదువుల ఖర్చుకు పెట్టాడు. నీకు నాన్న, అన్నయ్యల పట్ల అపోహలు ఉండటంతో, ఇప్పటివరకు ఈ విషయాలు చెప్పలేకపోయాను. నీ అంతట నీవే పరివర్తన చెందావు కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు చెప్పగలిగాను.’ అమ్మ చెబుతున్న విషయాలు వింటున్న రాఘవ ఒక్కసారిగా నిలువెల్లా ద్రవించిపోయాడు. అంతలో అప్పుడే అటుగా వస్తున్న రామారావును పరుగు పరుగున వెళ్లి గాఢంగా హత్తుకున్నాడు.‘నన్ను మన్నించు అన్నయ్యా...! నన్ను క్షమించు నాన్నా..!’ అంటూ పశ్చాత్తాపంతో కుంగిపోతూ గుక్కపట్టి ఏడుస్తుంటే, అమ్మ, అన్నయ్యలు మరింత ప్రేమ పూర్వకంగా అక్కున చేర్చుకుని ఓదార్చారు.‘ఇదే రాఘవా..! మన ఆత్మ బలం’ అని రామారావు తమ్ముడిని ఆప్యాయంగా నిమిరాడు.మాధవరావు సంవత్సరీకానికి కావలసిన ఏర్పాట్లను చర్చించటానికి అక్కడికి వచ్చిన నారాయణ శాస్త్రిని చూసిన రాఘవ కన్నీటిని ఆపుకోలేకుండానే‘శాస్త్రిగారూ...! నా మూర్ఖత్వానికి మన్నించండి.’ అంటూ ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాడు. జరిగిందంతా తెలుసుకున్న నారాయణ శాస్త్రి ‘మాధవా..నీ ఆత్మ సంకల్పం గొప్పది.’ అనుకుంటూ మనసులోనే అభినందించాడు.‘కర్మాణ్యే వాధికారస్తే, మా ఫలేషు కదాచనా... కర్తవ్యాన్ని చేయడమే నీ బాధ్యత, ఫలములపై ఎప్పుడూ హక్కు లేదు. ఇది నిష్కామ కర్మ సిద్ధాంతం రాఘవా!’ అంటూ వేదాంత ధోరణిలో వివరించాడు నారాయణ శాస్త్రి. ‘అంతేకాదు..! శాస్త్రం, శాస్త్రీయత, విశ్వాసం, సంప్రదాయం, ఆచార వ్యవహారాలు, విలువలు, కుటుంబ బంధాల మేళవింపే జీవిత సారం..! అదే మన ఆత్మబలం..!’ అని సత్ జీవన విధాన బోధ చేసిన నారాయణ శాస్త్రికి వినమ్రంగా నమస్కరించారు అందరూ.- మంత్రిప్రగడ శ్రీనివాసరావుఇవీ చదవండి: 104 ఏళ్లకు బెయిల్... 105లో స్వేచ్ఛ -
గడ్డం ఉంటే గమ్మత్తే! అస్సలు తగ్గేదేలే!!
షేవింగ్ మర్చిపోవడం వల్ల పెరిగిన గడ్డం... ఇప్పుడు మెన్స్ ఫ్యాషన్‌లో ఫుల్‌టైమ్ హీరో! అందుకే, గడ్డాన్ని అడవిలా అడ్డదిడ్డంగా కాకుండా, అదిరిపోయేలా ఎలా పెంచాలి? ఎలాంటి ముఖానికి ఏ స్టయిల్ సెట్ అవుతుంది? ఎలా మ్యానేజ్ చేయాలి? వంటి విషయాలన్నీ సెప్టెంబర్ 7 ‘వరల్డ్ బియర్డ్ డే’ సందర్భంగా, కొన్ని సూపర్ బియర్డ్ ఫ్యాషన్ టిప్స్ మీకోసం!ముఖానికి తగ్గ గడ్డం!అభిమాన హీరోకి ఫుల్ బియర్డ్ బాగుందని మీరూ అలాగే పెంచేస్తే, మీ అద్దమే మిమ్మల్ని చూసి నవ్వే అవకాశం ఉంది. గుండ్రటి ముఖం ఉంటే కాస్త పొడవుగా కనిపించేలా గడ్డాన్ని షేప్ చేయండి. పొడవాటి ముఖం ఉంటే సైడ్స్‌లో కాస్త ఫుల్‌గా ఉంచవచ్చు. స్క్వేర్ ఫేస్‌కు షార్ట్ బాక్స్ బియర్డ్ లేదా స్టబుల్ బాగా సెట్ అవుతుంది.మీసం కూడా గడ్డం టీమ్‌లోనే!గడ్డాన్ని బాగా సెట్ చేసి... మీసాన్ని మాత్రం దేవుడి దయకు వదిలేయొద్దు! మీసం కూడా బియర్డ్ క్లాస్మేటే! షార్ట్ బియర్డ్‌కు నీట్ మీసం, ఫుల్ బియర్డ్‌కు కాస్త ఫుల్‌గా ఉండే మీసం బాగుంటుంది. గుర్తుంచుకోండి.. మీ మీసం నోట్లోకి వచ్చి టీ తాగేటప్పుడు టేస్ట్ చూస్తోందంటే, ట్రిమ్మింగ్ టైమ్ వచ్చిందన్న మాట!చిన్నదే కానీ చురుకుదనం ఎక్కువ!పూర్తి గడ్డం పెంచాలని లేదనుకుంటే, స్టబుల్ స్టయిల్ బెస్ట్. రెండు మూడు రోజుల గడ్డంలా కనిపించే ఈ లుక్ చాలా క్యాజువల్‌గా ఉంటుంది. అయితే దీనికీ కేర్ అవసరం! మెడ చుట్టూ, చెంపల దగ్గర అలా పెరగనిస్తే స్టయిలిష్ స్టబుల్ కాస్తా పాపం షేవింగ్‌కి డబ్బులు లేవు అనిపించుకోవచ్చు! అందుకే, ఎడ్జెస్ను ఎప్పుడూ నీట్‌గా ఉంచండి.ఫుల్ బియర్డ్... ఫుల్ బాధ్యత!గడ్డం పెంచడం అంటే, ముఖం మీద వెంట్రుకలకు ఫ్రీడమ్ ఇవ్వడం కాదు! దాన్ని మెయింటైన్ చేయడమే అసలు పరీక్ష! క్రమం తప్పకుండా ట్రిమ్ చేయండి. గడ్డం వెంట్రుకలు అటూ ఇటూ ఎగరకుండా దువ్వండి. అవసరమైతే బియర్డ్ ఆయిల్ లేదా బామ్ వాడి నీట్‌గా సెట్ చేసుకోండి.కాంబో ముఖ్యం!తల మీద ఒక సినిమా, గడ్డం మీద ఇంకో సినిమా వద్దు! హెయిర్‌కట్‌ను కూడా బియర్డ్ స్టయిల్‌కి తగ్గట్టుగా ఎంచుకోవడం మంచిది. షార్ట్ హెయిర్‌తో షార్ట్, మీడియం బియర్డ్, కొంచెం లాంగ్ హెయిర్‌తో ఫుల్ బియర్డ్ వంటి కాంబినేషన్లు బాగుంటాయి.నెక్లైన్ మర్చిపోతే... గేమ్ ఓవర్!చాలామంది గడ్డం ముందు భాగాన్ని మాత్రమే ట్రిమ్ చేసి, మెడ కింద పెరిగే వెంట్రుకలను అలాగే వదిలేస్తారు. అప్పుడు ఎంత మంచి బియర్డ్ స్టయిల్ అయినా నీట్‌గా కనిపించదు. కాబట్టి నెక్లైన్ ను క్రమం తప్పకుండా షేప్‌లో ఉంచండి.కలర్స్ ప్లే!గడ్డంలో కాస్త బ్రౌన్ , గ్రే లేదా సాల్ట్ అండ్ పెప్పర్ షేడ్స్ కనిపిస్తున్నాయా? వాటిని వెంటనే దాచేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా గ్రే బియర్డ్‌ను చక్కగా ట్రిమ్ చేసి, హెయిర్‌తో మ్యాచ్ చేస్తే చాలా క్లాసీ లుక్ వస్తుంది.బట్టలకు బియర్డ్‌తో సంబంధం ఉంది!బియర్డ్ ఉన్నవాళ్లు సింపుల్ టీషర్ట్, డెనిమ్, షర్ట్, కుర్తా... ఏదైనా క్యారీ చేయొచ్చు. నీట్‌గా ట్రిమ్ చేసిన బియర్డ్‌తో ఫార్మల్ షర్ట్ క్లాసీగా కనిపిస్తుంది. ఫుల్ బియర్డ్‌తో డెనిమ్ జాకెట్ లేదా కుర్తా కాస్త బోల్డ్ లుక్ ఇస్తుంది.కడగండి... పెంచొద్దు!ఇది చాలా ముఖ్యం! గడ్డం అంటే కేవలం పెంచుకోవడం కాదు, శుభ్రంగా ఉంచుకోవడం కూడా! తిన్నది, తాగింది, దుమ్ము అన్నీ గడ్డంలో డెస్ట్ బిన్ కలెక్షన్ లా అవ్వకముందే క్లీన్ చేసుకోండి!ఇవి కూడా చదవండి: తలగడలోని డస్ట్‌మైట్స్‌తో అలర్జీలు! -
మనిషి శరీరం లేకుండానే మెదడు ఎదగగలదా?
ఒక చిన్న మిరియం గింజంత పరిమాణం. కానీ అందులో స్పందించే శక్తి, ఎదిగే జీవం!! ల్యాబ్‌లో మానవ కణాలతో సృష్టించిన ఆ మిరియపు గింజంత మెదడు భాగాలు (ఆర్గనాయిడ్స్) కొన్ని నెలలో, ఏడాదో కాదు... తొలిసారిగా ఏడేళ్ల పాటు విరామం లేకుండా జీవించి ఉండి, శాస్త్రవేత్తలనే విస్మయానికి గురిచేస్తున్నాయి. మెదడు రహస్యాలను ఛేదించే ఈ అపూర్వ ప్రయోగం, వైద్య రంగాన్ని మలుపు తిప్పే ఒక అద్భుత ఘట్టం! అందుకే ఇప్పుడిది శాస్త్ర పరిశోధనా రంగంలో అత్యంత ఆశాజనకమైన ముందడుగుగా నిలిచింది.ఆసక్తికరమైన విషయమేమిటంటే, మన తలలోని నిజమైన మెదడు.. కాలంతో పాటు ఎలా వికసిస్తుందో, ల్యాబ్‌లోని ఈ చిన్న మెదడు కణాలు కూడా సరిగ్గా అలాగే వయసుతోపాటు (కాలంతో పాటు) ఎదుగుతూ వచ్చాయి! అంతేకాదు, ఇవి తమ పెరిగిన ‘సమయ గమనాన్ని’ తమలో నమోదు చేసుకోవటం కూడా పరిశోధకులు గుర్తించారు. అంటే, మనలాగా చిన్ననాటి పుట్టినరోజు వేడుకల జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకునే తెలివితేటలు వీటికి ఉన్నాయని కాదు. ఇవి పెరిగే క్రమంలో ఏయే మార్పులు దాటుకుంటూ వచ్చాయో, ఆ సమాచారం మొత్తం వాటి కణాల లోపల ఒక గుర్తులా ముద్రపడి ఉంది! అందుకే సైంటిస్టుల పాలిట ఈ బ్రెయిన్ ఆర్గనాయిడ్స్ పరిశోధన ఒక కల్పవృక్షం అయింది.బ్రెయిన్ ఆర్గనాయిడ్స్ అంటే?బ్రెయిన్ ఆర్గనాయిడ్స్ అనేవి ల్యాబ్‌లో మానవ స్టెమ్ సెల్స్ (మూల కణాలు) ఉపయోగించి తయారు చేసిన అతి చిన్న, 3–డి రూపంలో ఉండే మెదడు కణజాల నమూనాలు. అయితే ఇవి మన తలలో ఉండే నిజమైన మెదడుకు చిన్న రూపాలు మాత్రం కావు. ఇవి మెదడు ఎదుగుదలకు సంబంధించిన కొన్ని లక్షణాలను మాత్రమే పోలి ఉంటాయి తప్ప, నిజమైన మెదడులో ఉండే సంక్లిష్టమైన నిర్మాణాలు లేదా నరాల అనుసంధానాలు వీటికి ఉండవు. కాకపోతే వీటి ద్వారా న్యూరాన్లు, వాటికి సహాయపడే ఇతర మెదడు కణాలను పెంచవచ్చు.అలాగే మనుషుల ప్రారంభ మెదడు ఎదుగుదల ఎలా ఉంటుందో కూడా వీటి ద్వారా పరిశీలించవచ్చు. అసలు మెదడు ఎలా పెరుగుతుంది; నాడీ వ్యవస్థ, మెదడు ఎదుగుదలకు సంబంధించిన జబ్బులు వచ్చినప్పుడు ఎలాంటి లోపాలు జరుగుతాయి అనేది అధ్యయనం చేయడానికి పరిశోధకులకు ఈ ప్రయోగాలు ఉపయోపడతాయి. మరొక అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఒక రోగి సొంత కణాల నుండి కూడా ఈ ఆర్గనాయిడ్స్‌ను తయారు చేయవచ్చు. దీనివల్ల నిర్దిష్టమైన జన్యు మార్పులు మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో పరిశోధకులు సులభంగా తెలుసుకోవచ్చు.పరిశోధన కాలక్రమం2019: డాక్టర్ పౌలా అర్లోటా నేతృత్వంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మానవ మూల కణాల నుండి 3–డి ఆర్గనాయిడ్లను (మిరియపు గింజ పరిమాణంలో ఉండే చిన్న మెదడు కణజాలాలు) తయారు చేయడం ప్రారంభించారు. కణాలు ఎక్కువ కాలం జీవించడానికి వీలుగా వాటికి ప్రత్యేకమైన పోషక ద్రావణాన్ని అందించారు.తొలి మూడు నెలలు: ఈ ల్యాబ్ మెదళ్లు మానవ పిండం మొదటి మూడు నెలల మెదడు ఎదుగుదలకు సమానమైన జన్యు సంకేతాలను, ప్రారంభ నాడీ కణాలను ప్రదర్శించడం ప్రారంభించాయి!6–12 నెలల మధ్య: మొదటి సంవత్సరం పూర్తయ్యేసరికి, ఇవి విద్యుత్ సంకేతాలను ప్రసారం చేయడం, సైనాప్స్ (రెండు నాడీ కణాల మధ్య ఉండే సమాచార మార్పిడి కేంద్రం) ను ఏర్పాటు చేసుకోవడం, గ్లియల్ మద్దతు కణాలను (నాడీ కణాలకు నిరంతరం సహకరిస్తూ వాటిని సంరక్షించే సహాయక కణాలు) అభివృద్ధి చేయడం ప్రారంభించాయి.1–2 సంవత్సరాలు: రెండు సంవత్సరాలకు పైగా ఇవి సమన్వయంతో కూడిన విద్యుత్ సంకేతాలను కొనసాగించాయి. నాడీ తంత్రువులపై రక్షణ పొర అయిన ‘మైలిన్’ ఏర్పడటం ప్రారంభమైంది. ఇది పుట్టిన తర్వాత శిశువు మెదడులో జరిగే మార్పులకు సమానంగా ఉంది.3–5 సంవత్సరాలు: సింగిల్–సెల్ ఆర్ఎన్ఏ సీక్వెన్సింగ్, డీఎన్ఏ మిథైలేషన్ పరీక్షల ద్వారా, ఈ కణాలు పిండం దశ నుండి చిన్నపిల్లల మెదడు కణాల జన్యు లక్షణాలకు మారటం కనిపించింది.5 సంవత్సరాల తర్వాత: శాస్త్రవేత్తలు పాత ఆర్గనాయిడ్ కణాలను, కొత్త కణాలతో కలిపినప్పుడు ఒక విచిత్రం జరిగింది. ఈ పాత కణాలు ప్రారంభ దశలను దాట వేసి, నేరుగా తదుపరి దశ నాడీ కణాలను తయారు చేశాయి! అంటే తమకు ఎంత వయస్సు ఉందో గుర్తుపెట్టుకునే ‘ఎపిజెనెటిక్ క్లాక్’ కణాలు వృద్ధి చెందినట్లు పరిశోధకులు గమనించారు.2026 ఆగస్టులో 7 ఏళ్ల రికార్డు వెల్లడి: హార్వర్డ్ బృందం తమ పరిశోధన ఫలితాలను ‘నేచర్’ జర్నల్‌లో ప్రచురించింది. మానవ మెదడు కణాలు శరీరం వెలుపల కూడా 7 ఏళ్ల పాటు జీవించడమే కాకుండా, కాలాన్ని కూడా గుర్తుంచుకోగలవని అధికారికంగా నిరూపణ అయింది.- ప్రొఫెసర్ పౌలా ఆర్లోటా, హార్వర్డ్ స్టెమ్ సెల్ ఇన్స్టిట్యూట్పెద్ద లోటు భర్తీ అయిందిబ్రెయిన్ ఆర్గనాయిడ్స్ అనేవి మన నిజమైన మెదడు కంటే చాలా సరళమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. వీటికి బయటి ప్రపంచం నుండి ఎలాంటి స్పర్శ కానీ, జ్ఞానేంద్రియ సమాచారం కానీ అందవు. అందుకే వీటికి స్పృహ, ఆలోచించే శక్తి, ఆత్మజ్ఞానం లేదా మెదడుకు ఉండే ఏ ఇతర ఉన్నత స్థాయి శక్తులు ఉండవు. అయినప్పటికీ, ఇవి మన నిజమైన మెదడు తీరును పోలి ఉంటాయి కాబట్టి మెదడు ఎదుగుదలను, వ్యాధులను అర్థం చేసుకోవడానికీ పరిశోధకులకు ఇవి ఒక అద్భుతమైన ‘బయోలాజికల్ మోడల్’గా ఉపయోగపడతాయి. అయితే ఇంతవరకు ఇందులో ఒక పెద్ద సమస్య ఉండేది. ఈ ఆర్గనాయిడ్స్ ల్యాబ్‌లో ఎదిగే క్రమంలో కొన్ని నెలలు మాత్రమే బతికేవి. దీనివల్ల పరిశోధనల్లో ఏర్పడిన పెద్ద లోటును, ఇప్పుడు ఏడేళ్ల పాటు బతికిన ఈ కృత్రిమ మెదడు కణాలు భర్తీ చేసే ఆవకాశాలు ఉండొచ్చని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.ఆర్గనాయిడ్లలో ఆలోచనలు!శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారా కృత్రిమ మెదడు కణాలకు కావాల్సిన సరైన పరిస్థితులను అందించి, వాటిని ఏడేళ్ల సుదీర్ఘ కాలం పాటు సజీవంగా ఉంచగలిగారు. ఆ తర్వాత కణాల జీవసంబంధ వయస్సును అంచనా వేసే మూడు కొత్త ‘జెనెటిక్ క్లాక్స్’ ఆధారంగా వీటిని పరీక్షించారు. ఆశ్చర్యకరంగా, నిజమైన మెదడులోని కణాలు కాలక్రమేణా ఎలాగైతే రూపాంతరం చెందుతాయో, ఈ ఆర్గనాయిడ్ కణాలు కూడా సరిగ్గా అలాగే వయసు పైబడుతూ, ఆ ఎదుగుదలకు సంబంధించిన ‘కణాల జ్ఞాపకాలను’ తమలో భద్రపరుచుకున్నాయని తేలింది! ‘హార్వర్డ్ స్టెమ్ సెల్ ఇన్స్టిట్యూట్’ ప్రొఫెసర్ పౌలా ఆర్లోటా చెబుతున్న దానిని బట్టి – ‘‘మనుషులతో సంబంధం లేకుండా, వారి శరీరాల బయట కూడా మానవ మెదడు ఇంత సుదీర్ఘకాలం పాటు పెరుగుతూ ఉండటం నిజంగా ఒక సంచలనం! భవిష్యత్తులో ఈ పరిశోధన ఆటిజం, స్కీజోఫ్రెనియా వంటి తీవ్రమైన మానసిక, నరాల సమస్యలు అసలు ఎలా మొదలవుతాయి, కాలక్రమేణా ఎలా తీవ్రం అవుతాయి అనే విషయాలను అర్థం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది’’.విస్తృతంగా మస్తిష్క ప్రయోగాలునిజానికి ఇప్పటికే అల్జీమర్స్, పార్కిన్సన్స్, వెన్నుపాము గాయాలకు చికిత్సలు కనిపెట్టడానికి ఈ ఆర్గనాయిడ్లపై విస్తృతంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. వాటిలో భాగమే ‘యాక్సోనిస్ థెరప్యూటిక్స్’ అనే బయోటెక్నాలజీ సంస్థ చేసిన ఒకానొక ప్రయోగం! నాడీ వ్యవస్థలోని కణాలకు ప్రయోజనకరమైన జన్యు చికిత్సను అందించడానికి వీరు ఒక వైరస్‌ను ప్రత్యేకంగా రీప్రోగ్రామ్ చేశారు. ఈ చికిత్స ఎంతవరకు పనిచేస్తుందో పరీక్షించడానికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పెంచిన బ్రెయిన్ ఆర్గనాయిడ్స్‌ను ఉపయోగించారు. ఎందుకంటే అంతరిక్షంలో ఉండే మైక్రోగ్రావిటీ (తక్కువ గురుత్వాకర్షణ) వాతావరణంలో ఇవి చాలా వేగంగా పెరుగుతాయి. అయితే ఈ కృత్రిమ మెదడు భాగాలు అసలు ఎంత కాలం బతుకుతాయి అనేది ప్రస్తుతం సైంటిస్టులకు కూడా ఒక మిస్టరీనే. వీటికి జబ్బులు పడటానికి గానీ, ఇన్ఫెక్షన్లు రావడానికి గానీ నిజమైన శరీరం ఏదీ ఉండదు కాబట్టి.. సైద్ధాంతికంగా చూస్తే ఇవి ఒక సాధారణ మనిషి కంటే కూడా ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని ప్రొఫెసర్ ఆర్లోటా అంటున్నారు. ప్రస్తుతానికైతే వీటి ఆయుష్షు ఎంతో శాస్త్రవేత్తలు అంచనా వేయలేకపోతున్నారు.దిగ్భాంతిగొల్పిన ‘కైమీరా’! కణాల వయసు పెరిగే తీరును ఇంకా లోతుగా పరిశోధించడానికి, ప్రొఫెసర్ ఆర్లోటా ఒక ‘పిచ్చి ప్రయోగం’ చేశారు! ఏడాది వయసున్న కృత్రిమ మెదడు కణాలను తీసుకుని, కేవలం రెండు వారాల వయసున్న కృత్రిమ మెదడు కణాలతో కలిపి ఒక కొత్త ‘కైమీరా’ను తయారు చేశారు. రెండు వేర్వేరు జీవులకు లేదా రకాలకు చెందిన కణాలను కలిపి తయారు చేసిన ఒక కొత్త జీవి లేదా కణజాలమే ‘కైమీరా’.ఇందులో చిన్న వయసు కణాలు సాధారణంగానే స్పందించినప్పటికీ, పెద్ద వయసు కణాలు మాత్రం ఒక పెద్ద వింతను ప్రదర్శించాయి. అవి తమ ఎదుగుదల క్రమంలో చాలా ముందుకు దూసుకెళ్లిపోయాయి! అసలు సాధారణంగా రూపుదిద్దుకోవడానికి నాలుగు నెలల సమయం పట్టే నాడులను ఈ పెద్ద కణాలు తక్షణం తయారు చేయడం మొదలుపెట్టాయి. ఈ ప్రయోగం మెదడు ఎదుగుదల విషయంలో ‘సమయాన్నే మార్చేసిందని’, ఇది నిజంగా ఒక అద్భుతమైన విషయమని ప్రొఫెసర్ ఆర్లోటా అభివర్ణించారు. మున్ముందు జరగబోయే ప్రయోగాల కోసం మెదడు కణాల ఎదుగుదలను వేగవంతం చేయడానికి ఈ వినూత్న కైమీరా పద్ధతి ఎంతగానో ఉపయోగపడుతుందని పరిశోధకులు ఆశిస్తున్నారు. దీనివల్ల వయసు పైబడినప్పుడు వచ్చే మెదడు సంబంధిత సమస్యలను అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తలు ఏకంగా 20 ఏళ్ల పాటు వేచి చూడాల్సిన అవసరం కూడా ఉండదు!- సాక్షి స్పెషల్ డెస్క్ఇవీ చదవండి: ‘ఇదే నా ఇల్లు.. ఈయనే నా రాజు!’ పురావస్తు శాస్త్రవేత్తలకే షాక్! -
‘ఇదే నా ఇల్లు.. ఈయనే నా రాజు!’ పురావస్తు శాస్త్రవేత్తలకే షాక్!
అది 1907... లండన్‌లోని ఓ సువిశాలమైన భవనం... డోరతి లూయిస్ ఈడీ అనే మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ మెట్లపై నుంచి జారి కిందపడిపోయింది. తలకు గట్టి దెబ్బ తగలడంతో ఎలాంటి చలనం లేదు. వెంటనే వైద్యుడు వచ్చి పరిశీలించారు. ‘పాప శ్వాస ఆడటంలేదు. గుండె కొట్టుకోవడంలేదు. ఆమె చనిపోయింది’ అని చెప్పడంతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.కొద్దిసేపటికే అద్భుతం జరిగింది. చనిపోయిందనుకున్న ఆ చిన్నారి కళ్లు తెరిచి, ‘అమ్మా...’ అని పిలిచేసరికి శోకసంద్రంలో ఉన్న ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. అయితే, ఆ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. ఎందుకంటే, బతికిన ఆ పాప డోరతీ ఈడీ కాదు ప్రమాదం తర్వాత డోరతి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఇంగ్లిష్ కుటుంబంలో పుట్టిన ఆ చిన్నారి, స్పష్టమైన బ్రిటిష్ యాక్సెంట్ మరచిపోయి, వింతైన ప్రాచీన ఈజిప్షియన్ శైలిలో మాట్లాడటం మొదలుపెట్టింది.నిద్రలో లేచి కూర్చుని ‘నన్ను మా ఇంటికి తీసుకెళ్లండి... ఇది నా ఇల్లు కాదు’ అని ఏడ్చేది. తలకు దెబ్బ తగలడం వల్ల పాప మానసిక స్థితి సరిగ్గా లేదని తల్లిదండ్రులు భావించేవారు. కానీ రోజులు గడుస్తున్నా పరిస్థితిలో ఎలాంటి మార్పూ కనిపించలేదు. ఒకరోజు డోరతిని ఆమె తల్లిదండ్రులు బ్రిటిష్ మ్యూజియానికి తీసుకెళ్లారు. అక్కడ ఉన్న పురాతన ఈజిప్ట్ విగ్రహాలు, ఫారోల శిల్పాలను చూడగానే డోరతి కళ్లు మెరిసిపోయాయి. ఒక్కసారిగా ఆ విగ్రహాల వైపు పరుగెత్తుకెళ్లి, వాటి పాదాలను ముద్దాడి, గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది.ఒక ఫారో ప్రతిమను చూపిస్తూ, ‘ఇదిగో... ఇది నా ఇల్లు. ఈయన నా రాజు సెటి–1’ అని బిగ్గరగా కేకలు వేసింది. దీంతో ఆమె తల్లిదండ్రులు అయోమయం చెందారు.ఆ తర్వాత ఆమెకు ప్రాచీన ఈజిప్ట్‌పై ఆసక్తి రోజురోజుకూ పెరిగింది. ఈజిప్టు చరిత్ర, హైరోగ్లిఫిక్స్, దేవాలయాల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది.కొంచెం పెద్దయ్యాక తన గతజన్మ గురించిన జ్ఞాపకాలను స్పష్టంగా వివరించడం ప్రారంభించింది. తన పేరు బెంట్రెషిట్ అని, మూడేళ్ల వయసులో తల్లి చనిపోగా, తండ్రి తనను వదిలేయడంతో అబిడో‹స్లోని సెటి–1 ఆలయ పూజారి తనను పెంచినట్టు చెప్పింది.అక్కడ పూజారిణిగా ఉన్న తాను కఠినమైన బ్రహ్మచర్యం పాటించాలని, కానీ ఈజిప్ట్ రాజు సెటి–1 ఆ ఆలయ సందర్శనకు వచ్చినప్పుడు తమ ఇరువురి మధ్య ప్రేమ చిగురించి గర్భవతిని అయ్యానని చెప్పింది. విషయం బయటకు వస్తే తీవ్ర పరిణామాలు తప్పవని భావించి, ఆత్మహత్య చేసుకున్నానని పేర్కొంది. తనకు రాత్రివేళల్లో ‘హోర్–రా’ అనే ఆత్మ కనిపించేదని ఆమె చెప్పింది. ఆ ఆత్మ తన గతజన్మ కథను నెమ్మదిగా చెప్పేదని, దాన్ని తాను హైరోగ్లిఫిక్ లిపిలో రాసుకున్నానని పేర్కొంది.డోరతి మాటలను ప్రపంచం మొదట్లో పట్టించుకోలేదు. ఆమెను ఓ పిచ్చి వ్యక్తిలానే చూశారు. అయితే, ఆమె పెద్దయ్యాక ఇంగ్లండ్ వదిలి ఈజిప్ట్ చేరుకుంది. అక్కడ ఈజిప్షియన్ డిపార్ట్మెంట్ ఆఫ్ యాంటిక్విటీస్‌లో పనిచేసే పరిశోధకులతో తన గతజన్మ వివరాలను పంచుకుంది. పురావస్తు శాస్త్రవేత్తలు ఆమె చెప్పేది నిజమో కాదో తేల్చడానికి సిద్ధమయ్యారు. ‘అబిడోస్ సెటి–1 ఆలయం’ వద్ద ఆమెకు కఠినమైన పరీక్ష పెట్టారు.చీకటి పడిన తర్వాత, ఎలాంటి వెలుతురు లేని సమయంలో డోరతిని ఆలయ ప్రాంగణంలోకి తీసుకెళ్లారు. గతంలో అక్కడ ఉన్న కుడ్య చిత్రాల లొకేషన్లు, భూగర్భంలో దాగి ఉన్న తోటల అమరికను గుర్తించమన్నారు. ఆ చీకటిలోనే ప్రాచీన కుడ్య చిత్రాలతోపాటు రాజభవన తోటల సరిహద్దులు ఎక్కడున్నాయో చెప్పడం చూసి పరిశోధకులు ఆశ్చర్యపోయారు. ఆమె సూచించిన ప్రదేశాలను పరిశీలిస్తే, అక్కడి పురాతన నిర్మాణాలకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించడం వారిని ఆశ్చర్యపరచింది.ఈ విషయం అలా బయటకు రావడంతో ఈజిప్షియన్లు ఆమెను గౌరవంతో ‘ఓమ్ సెటి’ అని పిలవడం ప్రారంభించారు. అనంతరం ఈజిప్షియన్ వ్యక్తిని వివాహం చేసుకున్న డోరతికి ఓ కుమారుడు జన్మించాడు. ఆ బాలుడికి సెటీ అని పేరు పెట్టారు. జీవితాంతం గతజన్మ తాలూకు జ్ఞాపకాలతోనే బతికిన డోరతి 1981లో కన్నుమూసింది.ఆమె నిజంగానే బెంట్రెషిటా? లేక ప్రాచీన ఈజిప్ట్‌పై ఉన్న చిన్ననాటి మక్కువ ఒక అసాధారణమైన మానసిక ప్రపంచాన్ని సృష్టించిందా? డోరతి చెప్పిన విషయాల్లో చరిత్ర ఎంత? జ్ఞాపకం ఎంత? ఊహ ఎంత? ఈ ప్రశ్నలకు శాస్త్రం ఇప్పటికీ తుది సమాధానం ఇవ్వలేదు. కానీ, లండన్ లో పుట్టిన ఓ చిన్నారి.. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అబిడోస్ అనే పురాతన నగరంతో ఏర్పరచుకున్న అనుబంధం సాధారణ కథ కాదు.డోరతీ ఈడీ చనిపోయింది. కానీ ‘ఓమ్ సెటీ’గా ఆమె వదిలిన మిస్టరీ మాత్రం ఇంకా బతికే ఉంది.- సత్యకిశోర్ కొండ్రెడ్డిఇవి కూడా చదవండి: ఏఐతో వైరస్ సృష్టి.. మానవాళికి వరమా? శాపమా? -
104 ఏళ్లకు బెయిల్... 105లో స్వేచ్ఛ
జీవిత చరమాంకంలో ఉన్న ఓ వృద్ధుడికి కోర్టు స్వేచ్ఛ ప్రసాదించింది. శిక్షా కాలాన్ని రద్దు చేసింది. 30 ఏళ్ల జైలు జీవితానికి ‘సుప్రీం’ తీర్పుతో తెరపడింది. పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లాలో పాతకక్షల నేపథ్యంలో ఓ హత్య జరిగింది. రసిక్‌చంద్ర మండల్ అనే వ్యక్తిపై హత్యానేరం కింద అభియోగాలు నమోదయ్యాయి. అప్పుడు అతని వయస్సు 68 ఏళ్లు. ట్రయల్ కోర్టు 74 ఏళ్ల వయసులో యావజ్జీవ శిక్ష విధించింది. 104 ఏళ్ల వయసులో మధ్యంతర బెయిల్ మంజూరైంది. వృద్ధాప్యం, అనారోగ్యంతో ఉన్న అతడ్ని తిరిగి జైలుకు పంపకూడదని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. ప్రస్తుతం అతని వయస్సు105 ఏళ్లు.1998 నవంబరు8న మాల్దా జిల్లాకు చెందిన సురేష్ మండల్ తన ఇంట్లో భోజనం చేస్తున్నాడు. అదే సమయంలో రసిక్‌చంద్ర మండల్‌తో పాటు మరికొందరు అక్రమంగా ఆ ఇంట్లోకి ప్రవేశించి సురేష్‌పై కాల్పులు జరిపిఅక్కడి నుంచి పరారయ్యారని వారిపై అభి యోగం నమోదైంది. తీవ్రంగా గాయపడిన సురేష్‌ను అతడి భార్య, చుట్టుపక్కల వారు స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మాల్దా సర్దార్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ రెండు రోజుల తర్వాత సురేష్ మృతి చెందాడు. ఈ ఘటనపై మాణిక్ఛక్ పోలీస్‌స్టేషన్‌లో నిందితులపై ఐపీసీ సెక్షన్ 302/34, ఆయుధాల చట్టం సెక్షన్ 25/27 కింద కేసులు నమోదయ్యాయి. ట్రయల్ కోర్టులో విచారణమాల్దా అడిషనల్ సెషన్స్ జడ్జి కోర్టులో విచారణ జరిగింది. నిందితులు తాము నిర్దోషులమని వాదించారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాలకు, మృతుడి భార్య వాంగ్మూలానికి మధ్య అనేక వైరుధ్యాలున్నాయని నిందితుల తరపు న్యాయవాది వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు రసిక్‌చంద్ర, మరో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ 1994లో తీర్పు ఇచ్చింది. రెండో నిందితుడికి ఆర్మ్స్ యాక్ట్ కింద ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష అదనంగా విధించింది. మిగిలిన నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. ఉన్నత, సర్వోన్నత న్యాయస్థానాల్లో చుక్కెదురు ట్రయల్ కోర్టు తీర్పుపై నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. మృతుడి బంధువుల సాక్ష్యం చెల్లదని, ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనని రెండో నిందితుడు పేర్కొన్నాడు. పలు సాక్ష్యాలను కోర్టు ముందుంచాడు. ఇరుపక్షాల వాదనలు, మెడికల్ రికార్డులు పరిశీలించిన హైకోర్టు ట్రయల్ కోర్టు తీర్పులో జోక్యం చేసుకునే అంశాలేవీ కనిపించలేదని పేర్కొంటూ అప్పీల్‌ను డిస్మిస్ చేసింది. దీంతో మండల్ 2019లో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సరైన ఆధారాలు లేవని ఈ అప్పీల్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. 99 ఏళ్ల వయసులో మధ్యంతర బెయిల్ మండల్ 30 ఏళ్లు జైలులోనే ఉన్నాడు. అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా ముందస్తు విడుదల కోరుతూ 99 ఏళ్ల వయసులో 2020లో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. మండల్ శారీరక, ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కోర్టు ప్రభుత్వాన్ని కోరింది. అనంతరం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ట్రయల్ కోర్టు విధించే షరతులకు లోబడి అతడ్ని విడుదల చేయాలని ఆదేశించింది. అప్పటికి అతని వయసు 104 ఏళ్లు. 2026లో సుప్రీంకోర్టు ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. అతని వయసును పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం తిరిగి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని స్వేచ్ఛను ప్రసాదించింది.. ‘వృద్ధాప్యం, అనారోగ్య కారణాలను దృష్టిలో ఉంచుకుని ఈ కేసును ముగిస్తు్తన్నాం. మిగిలిన శిక్షాకాలాన్ని మాఫీ చేస్తున్నాం’ అని సీజే బెంచ్ తీర్పు ఇచ్చింది. జీవిత ఖైదు శిక్షాకాలం పూర్తి కాకపోయినా అతడ్ని మళ్లీ కస్టడీలోకి తీసుకోరని ధర్మాసనం పేర్కొంది. 2024లో మండల్‌కు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వును తుది ఉత్తర్వుగా వెల్లడించింది. ఈ కేసులో మండల్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించలేదు; దోషిగా నిర్ధారించిన తీర్పునూ మార్చలేదు. అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో జీవిత ఖైదును కొనసాగించాల్సిన అవసరం లేదని భావించింది. శిక్ష నుంచి విముక్తి కల్పించింది. మానవీయ ముగింపును ఇచ్చింది.దిలీప్ మాదిరెడ్డి(చదవండి: చిన్నారులు ఏఐ నేర్చుకునేలా శృతి ధరివాల్ గేమ్ స్ట్రాటజీ..!) -
సంకష్టహర చతుర్థి వ్రతం.. తన జీవితాన్నే మార్చేసింది!
పూర్వం హైహయ వంశానికి చెందిన కృతవీర్యుడు అనే రాజు ఉండేవాడు. అతడు అమిత బలసంపన్నుడు, ధర్మపరాయణుడు. అతడి భార్య సుగంధి. సంపదలకు లోటు లేకున్నా, వారికి సంతానమే లేదు. సంతాన ప్రాప్తికి వారు చేయని వ్రత, దాన, యజ్ఞ యాగాలు లేవు. ఎన్ని చేసినా, పురాకృత పాపఫలితంగా వారికి సంతానం కలగలేదు.సంతాన రాహిత్యంతో రాజదంపతులు నిరాశలో కూరుకుపోయారు. రాజ్యాన్ని, సంపదను అమాత్యులకు విడిచి, తపోనిష్ఠతో కాలం గడపడానికి అడవులకు బయలుదేరారు. అడవులలో వారు కఠిన నియమాలను పాటిస్తూ, తపోనిష్ఠలో కాలం గడపసాగారు. కేవలం చెట్ల నుంచి రాలిన ఆకులను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తుండటంతో కృశించిపోయారు. వారు ధ్యానంలో ఉన్నప్పుడు వారి శరీరాలను క్రిమి కీటకాదులు తినేయసాగాయి. కొన్నాళ్లకు రాజదంపతులు శల్యావశిష్టులుగా మిగిలారు.ఒకనాడు గగనమార్గాన పోతున్న త్రిలోక సంచారి నారద మహర్షి కృతవీర్య దంపతుల పరిస్థితిని గమనించాడు. ఆయన వెంటనే పితృలోకానికి చేరుకుని, అక్కడ కృతవీర్యుడి తండ్రి వద్దకు వెళ్లి, ‘మర్త్యలోకంలో నీ కొడుకు, కోడలు సంతానం కోసం అలమటిస్తూ, తపశ్చర్యలో నిమగ్నులై, శల్యావశిష్టులుగా మిగిలారు. వారి పరిస్థితి నేడో రేపో అన్నట్లుగా ఉంది.’ అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు.దారిలో నారదుడికి ఒక దారుణ దృశ్యం కనబడింది. భృంశ మహర్షి తల్లిదండ్రులు, బంధువులు కుంభీపాక నరకంలో అధోముఖులై వేలాడుతూ, యమభటుల దండనలకు తాళలేక హాహాకారాలు చేస్తున్నారు. ఈ దృశ్యం చూసి, నారదుడు విచలితుడయ్యాడు. వెంటనే, భృంశుడి వద్దకు వెళ్లాడు. ‘మహర్షీ! నువ్వు సాక్షాత్తు సర్వజ్ఞుడవు. సాక్షాత్తు గణేశ సమానుడవు. కపిలాది మహర్షులు నీ దర్శనం కోరి వస్తుంటారు. అలాంటి నీ తల్లిదండ్రులు, బంధువులు నరకంలో యమబాధలు అనుభవిస్తుండటం బాధ కలిగిస్తోంది. నీ పూర్వుల నరక విమోచనం కోసం చేయదగిన పరిహారం ఏదైనా ఉంటే, నువ్వు ఉపేక్షించక దానిని వెంటనే ఆచరించు’ అని పలికాడు.నారదుడి ద్వారా తన పితరుల బాధలు తెలుసుకున్న భృంశుడు చింతాక్రాంతుడై, కొద్దిసేపు ఆలోచించాడు. తాను ఏళ్లతరబడి ఆచరిస్తూ వచ్చిన సంకష్టహర చతుర్థి వ్రతఫలంలో ఒకరోజు వ్రతఫలాన్ని ససంకల్పితంగా తన పితరులకు ధారపోశాడు. అతడు తన వ్రతఫలాన్ని ధారపోసిన వెంటనే భృంశుడి పితరులందరూ నరక కూపం నుంచి విముక్తి పొందారు. దేవతలు తీసుకువచ్చిన దివ్యవిమానంలో వారందరూ స్వర్గానికి చేరుకున్నారు. ఇదిలా ఉండగా, నారదుడి ద్వారా తన కుమారుడి పరిస్థితి తెలుసుకున్న కృతవీర్యుడి తండ్రి బ్రహ్మలోకానికి వెళ్లి, ‘బ్రహ్మదేవా! నా కుమారుడు కృతవీర్యుడు సంతానం లేకపోవడం వల్ల తపోనిష్ఠలో శల్యావశిష్టుడిగా మిగిలాడు. నా కుమారుడి సంతానలేమికి కారణమేమిటి? అతడి పురాకృత పాపకర్మ నశించడానికి తగిన తరుణోపాయమేది? నువ్వే చెప్పాలి’ అని అడిగాడు.‘నీకు నీ తనయుడి పూర్వజన్మ విశేషాలు చెబుతాను, విను. నీ రాజ్యంలోనే సామ అనే దుష్టుడు ఉండేవాడు. అతడు నిష్కారణంగా పన్నెండుమంది బ్రాహ్మణులను వధించి, వారి మృతదేహాలను ఒక కొండగుహలో పారవేశాడు. ఒకనాడు అతడికి పొద్దుగూకే వరకు ఎక్కడా తిండి, నీళ్లు దొరకలేదు. అలసి సొలసి పొద్దు గూకిన తర్వాత ఇంటికి చేరుకున్న మరుక్షణమే, తన కొడుకును ‘గణేశా! గణేశా!’ అని పిలిచాడు. కొడుకుతో కలసి భోజనం చేశాడు. సామకు తెలియకున్నా, ఆరోజు మాఘ కృష్ణ చతుర్థి. మరికొన్నాళ్లకు అదే తిథినాడు సామ కాలధర్మం చెందాడు. సంకష్టహర చతుర్థినాడు తెలియక చేసిన పుణ్యఫలితంగా మరణానంతరం స్వర్గానికి చేరుకున్నాడు. ఆ పుణ్యశేషం వల్లనే నీకు కొడుకుగా పుట్టాడు. పురాకృత పాపకర్మ మిగిలి ఉండటం వల్ల అతడికి సంతానం కలగలేదు’ అని బ్రహ్మదేవుడు చెప్పాడు.‘విరించీ! పాపాకర్మ పరిహారానికి తరుణోపాయమేమిటో నువ్వే చెప్పు’ అడిగాడు కృతవీర్యుడి తండ్రి.‘సంకష్టహర చతుర్థి వ్రతాన్ని నియమానుసారం ఆచరిస్తే, అతడికి పాప విముక్తి కలుగుతుంది’ అని చెప్పి, వ్రత విధానాన్ని వివరించాడు బ్రహ్మదేవుడు.బ్రహ్మదేవుడి ద్వారా సంకష్టహర వ్రత విధానాన్ని తెలుసుకున్న అతడు తన కొడుకు వద్దకు చేరుకుని, ‘కృతవీర్యా! పురాకృత పాపకర్మ ఫలితంగానే నీకు సంతానం కలగలేదు. సంకష్టహర చతుర్థివ్రతం ఆచరించినట్లయితే, నీకు పాపవిమోచనం కలిగి, సంతానం కలుగుతుంది’ అని చెప్పి, బ్రహ్మదేవుడు చెప్పిన వ్రత విధానాన్ని బోధించాడు.కృతవీర్యుడు పత్నీసహితంగా నియమానుసారంగా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాడు. అతడి పాపకర్మ నశించింది. కొన్నాళ్లకు కృతవీర్యుడి భార్య సుగంధి గర్భం దాల్చింది. నెలలు నిండాక ఆమెకు పండంటి కొడుకు పుట్టాడు. అయితే, అతడికి చేతులు లేవు. పెరిగి పెద్దయ్యాక అతడు తీవ్ర తపస్సుతో దత్తాత్రేయుడిని ప్రసన్నం చేసుకుని, సహస్రబాహువులు పొందాడు. సహస్రబాహు అర్జునుడిగా, కార్తవీర్యార్జునుడిగా పేరు పొందాడు.- సాంఖ్యాయనఇవి చదవండి: ఒకనాటి ఆదివారం -
ఏఐతో వైరస్ సృష్టి.. మానవాళికి వరమా? శాపమా?
వైరస్లు, బ్యాక్టీరియాల వంటి ఇతరేతర రోగకారక జీవకణాలు ప్రకృతిలో అసంఖ్యాకంగా ఉన్నవే మనకు తెలుసు. ఏఐ సాయంతో వీటిని కృత్రిమంగా కూడా సృష్టించడం సాధ్యమేనని ఇటీవల అమెరికన్ శాస్త్రవేత్తలు నిరూపించారు. ప్రకృతిలో లేని పదహారు వైరస్‌లను కొత్తగా సృష్టించారు. ఏఐతో కృత్రిమ వైరస్లు, ఇతరేతర జీవకణాలను సృష్టించే పరిజ్ఞానం వల్ల జరగబోయే మేలేమిటి? వాటిల్లబోయే కీడేమిటి? శాస్త్ర సాంకేతిక రంగాల్లో చర్చకు దారితీస్తున్న ఈ అంశం గురించి తెలుసుకుందాం...నిజానికి నిండు కణం కూడా కాదు – జీవకణాల్లో ఉండే ఆర్ఎన్ఏ లేదా డీఎన్ఏతో కూడిన అతిసూక్ష్మ కణశకలం. ప్రొటీన్ కవచంతో ఉండే ఈ కణశకలమే వైరస్. ఇది ఏదైనా జీవకణంలోకి చొరబడితే, అసంఖ్యాకంగా వృద్ధి చెందుతుంది. అలవికాని అలజడి సృష్టిస్తుంది. జీవకణాల మనుగడకు ముప్పు తెస్తుంది. జీవుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తుంది. జీవకణాలతో రూపొందిన మనుషుల శరీరాలలోకి రకరకాల వైరస్లు చొరబడుతుంటాయి. వీటిలో కొన్ని వైరస్లు ప్రాణాంతక వ్యాధులను కూడా కలిగిస్తాయి. వైరస్ ధాటి ఎలా ఉంటుందో ‘కోవిడ్–19’ ద్వారా ఇప్పటి ప్రపంచానికి బాగా బోధపడింది.ఇప్పటి వరకు ప్రపంచానికి తెలిసినవి ప్రకృతిలో పుట్టిన వైరస్లు మాత్రమే! ఇటీవల శాస్త్రవేత్తలు ఏఐతో పదహారు సరికొత్త వైరస్లు సృష్టించారు. ఇవి ఇంతవరకు ప్రకృతిలో ఎక్కడా లేనివి. ప్రస్తుతానికి ఏఐ సాంకేతికతతో సృష్టించిన వైరస్లు సానుకూల ఫలితాల కోసమే రూపొందించినవి. ఇదే సాంకేతికతతో ప్రమాదకరమైన వైరస్‌లను సృష్టించే అవకాశం కూడా ఉండటమే ఆందోళనకు కారణమవుతోంది. ప్రపంచంలో కలకలం రేపుతున్న ఈ ‘కృత్రిమ కణ’కలం గురించి ఈ ప్రత్యేక కథనం...ప్రకృతిలో ఉన్న వైరస్లతోనే మానవాళి ఇప్పటికీ సతమతవుతుంటే, తాజాగా ఏఐతో తయారైన కృత్రిమ వైరస్లు పుట్టుకొచ్చాయి. ఏఐ సాయంతో వైరస్లు, ప్రొటీన్ కణాలను రీడిజైన్ చేసే ఈ కొత్త ప్రక్రియకు శాస్త్రవేత్తలు ‘సింథటిక్ బయాలజీ’ అనే పేరు పెట్టారు. అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆర్క్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఏఐ సాంకేతికతో పదహారు కొత్త వైరస్‌లను తయారు చేశారు. ఈ వైరస్లు ఇదివరకు ప్రకృతిలో ఎక్కడా లేనివి. స్టాన్‌ఫర్డ్ శాస్త్రవేత్తలు ఏఐకి వైరస్ల డీఎన్ఏ నమూనాలను ఇచ్చి, వాటి ఆధారంగా కొత్తగా పదహారు వైరస్ జీనోమ్లను రూపొందించారు. ఇవి బ్యాక్టీరియా కణాల్లోకి చొరబడి వాటిని నాశనం చేయగలవు. లాబొరేటరీల్లో జరిపిన పరీక్షల్లో ఈ పదహారు వైరస్లు ఇ–కోలి బ్యాక్టీరియా కణాలను విజయవంతంగా అరికట్టగలిగాయి.స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్, కంప్యూటేషనల్ బయాలజిస్ట్ డాక్టర్ బ్రియాన్ హై ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తల బృందం ఏఐకి వైరస్ల డీఎన్ఏ నమూనాలను ఇచ్చి, వాటిలో తాము కోరుకున్న మార్పులను సూచించి, ఇదివరకు ప్రకృతిలో ఎక్కడాలేని పదహారు సరికొత్త వైరస్‌లను సృష్టించింది. కొత్త వైరస్ల సృష్టి కోసం ఏఐ రూపొందించిన జీనోమ్ నమూనాలకు ‘ఇవో–1’, ‘ఇవో–2’ అని శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. ఈ వైరస్‌లను ప్రధానంగా మానవాళికి హాని చేసే ‘ఇ–కోలి’ తరహా బ్యాక్టీరియాలను తుదముట్టించే లక్ష్యంతో రూపొందించారు. ఈ ప్రయత్నంలో భాగంగా డాక్టర్ బ్రియాన్ హై నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం నిజానికి వందలాది కృత్రిమ వైరస్ నమూనాలను ఏఐ సాయంతో పరీక్షించింది. వీటిలో పదహారు వైరస్లు మాత్రమే శాస్త్రవేత్తలు ఆశించినట్లుగా బ్యాక్టీరియా కణాలను నిర్మూలించగలిగాయి.శాస్త్రవేత్తల జాగ్రత్తలుఏఐ సాయంతో కృత్రిమ వైరస్‌లను సృష్టించడంలో స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆర్క్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఏఐకి వైరస్ జన్యు సమాచారం ఇవ్వడంలో గరిష్ఠస్థాయి అప్రమత్తత పాటించారు. ఏఐకి కేవలం బ్యాక్టీరియాను నిర్మూలించగలిగే ‘బ్యాక్టీరియోఫేజ్’ వైరస్ల జన్యు సమాచారం మాత్రమే ఇచ్చారు. ఇందులోంచి మనుషులకు, జంతువులకు, మొక్కలకు సోకే వైరస్ జన్యు సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా తొలగించారు. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు తమ ప్రయోగాల్లో ఉనికిలో ఉన్న వైరస్‌లకే జన్యు ఉత్పరివర్తనలు జరపడం మాత్రమే చేస్తూ వచ్చారు.ఏఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా జన్యు విశ్లేషణల కోసం, జన్యు మార్పిడి సూచనలు తెలుసుకోవడం మాత్రమే దానిని వాడుతూ వచ్చారు. ఇప్పుడు తొలిసారిగా ఏఐతోనే వైరస్ జీనోమ్‌లకు రూపకల్పన చేసి, కొత్త వైరస్‌లను సృష్టించారు. ఏఐ అందించిన జీనోమ్ నమూనాల ఆధారంగా ప్రయోగశాలలో సృష్టించిన ఈ వైరస్లు పూర్తిస్థాయి కృత్రిమ వైరస్లు. జీవశాస్త్ర ప్రయోగాల్లో దీనినొక గొప్ప మైలురాయిగా కొందరు శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. ఏఐ సాయంతో రూపొందించే కృత్రిమ వైరస్ల ద్వారా సాధించగల సానుకూల ఫలితాల గురించి వారు చాలా విశేషాలే చెబుతున్నారు. అయినా, ఏఐ కృత్రిమ వైరస్‌లను సృష్టించగలగడం పట్ల శాస్త్ర సాంకేతిక వర్గాల్లోనే కాకుండా, అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో కూడా కొన్ని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.- డాక్టర్ బ్రియాన్ హైఇవీ సానుకూలతలుఏఐ సాయంతో కృత్రిమ వైరస్‌లను సృష్టించడం ఇదివరకటి ప్రక్రియల కంటే చాలా సులువైనది. దీని వల్ల చాలావరకు సమయం కలిసొస్తుంది. ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుంది. ఇదివరకు లాబొరేటరీల్లో ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో రకరకాల ప్రయత్నాలు సాగిస్తే తప్ప వైరస్లలో ఆశించిన జన్యు ఉత్పరివర్తనలు తీసుకురావడం సాధ్యమయ్యేది కాదు. ఇదంతా వ్యయ ప్రయాసలతో కూడిన ప్రక్రియ. ఇప్పుడు ఏఐకి ఈ పని అప్పగించడం వల్ల వేగంగా ఫలితాలు వస్తున్నాయి. ఏఐ తనకు అందించిన జీవ సమాచారాన్ని శరవేగంగా ఆకళింపు చేసుకుని, కొత్త జన్యు నమూనాలకు రూపకల్పన చేయగలుగుతోంది.బ్యాక్టీరియాను నాశనం చేయగల వైరస్‌లను ఏఐ సాయంతో సృష్టించడం ద్వారా వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తేవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వారి వాదన ప్రకారం ఇప్పటికే కొన్ని ప్రమాదకరమైన వ్యాధులను కలిగించే బ్యాక్టీరియా కణాలు యాంటీ బయోటిక్స్‌ను తట్టుకునే శక్తిని సంతరించుకున్నాయి. వీటిని అరికట్టడానికి మరింత శక్తిమంతమైన యాంటీ బయోటిక్స్‌ను తయారు చేసే బదులుగా ఏఐ సాయంతో తయారు చేసిన వైరస్‌లనే ఆయుధాలుగా ఉపయోగిస్తే సత్ఫలితాలను సాధించవచ్చని చెబుతున్నారు.శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం ఏఐ సాయంతో కృత్రిమ వైరస్ల సృష్టి వల్ల కలిగే ఉపయోగాలు ఇవీ:1. వ్యాక్సిన్లుఏఐ సాంకేతికతతో రూపొందించిన కృత్రిమ వైరస్‌లతో మెరుగైన వ్యాక్సిన్లను తయారు చేయడం సులువుగా మారుతుంది. కృత్రిమ వైరస్‌లతో తయారు చేసిన వ్యాక్సిన్ల ద్వారా ప్రమాదకరమైన వైరస్ల వల్ల వచ్చే వ్యాధులను శాశ్వతంగా అరికట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటికే ప్రమాదకర వ్యాధుల వ్యాప్తికి కారణమవుతున్న వైరస్లలో జరగబోయే ఉత్పరివర్తనలను ముందుగానే ఏఐతో అంచనా వేసి, వాటిని అరికట్టే వ్యాక్సిన్లను తయారు చేయడానికి కూడా వీలవుతుంది.2. జన్యు చికిత్సజన్యు వ్యాధులను నయం చేయగల జన్యుచికిత్స పద్ధతులు మరింత తేలికవుతాయి. జన్యులోపాల వల్ల తలెత్తే వ్యాధులను నయం చేయడానికి జన్యువులను సరిచేసే పదార్థాలను జన్యుకణాల్లోకి పంపాల్సి ఉంటుంది. సమీప భవిష్యత్తులో ఏఐ సాంకేతికతతో తయారు చేసే హానికరం కాని ‘ఆర్టిఫిషియల్ వైరల్ వెక్టర్స్’ను జన్యుకణాల్లోకి పంపడం ద్వారా జన్యులోపాలను సవరించడం సులువుగా మారుతుంది. ఈ ‘ఆర్టిఫిషియల్ వైరల్ వెక్టర్స్’ ఆరోగ్యకరమైన కణాలకు ఎలాంటి హాని కలిగించకుండా, లోపాలు ఉన్న జన్యుకణాలకే నేరుగా జన్యు పదార్థాలను చేరవేస్తాయి.3. క్యాన్సర్ చికిత్సఏఐ సాయంతో రూపొందించే కృత్రిమ వైరస్‌లతో క్యాన్సర్ చికిత్స మరింత మెరుగుపడుతుంది. ఏఐ సాయంతో క్యాన్సర్ కణాలను నిర్మూలించగలిగే ‘ఆంకోలైటిక్ వైరస్’లను రూపొందించవచ్చు. ‘ఆంకోలైటిక్ వైరస్ థెరపీ’ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఇవి ఆరోగ్యకరమైన కణాలకు హాని చేయకుండా, క్యాన్సర్ కణాలనే నిర్మూలిస్తాయి. క్యాన్సర్ చికిత్సలో ఇప్పటికే వాడుకలో ఉన్న రేడియో థెరపీ, కీమో థెరపీ వంటి పద్ధతులు తీవ్ర దుష్ప్రభావాలను కలిగిస్తుండటం తెలిసిందే! ‘ఆంకోలైటిక్ వైరస్ థెరపీ’ అందుబాటులోకి వస్తే, క్యాన్సర్ రోగులకు ఈ చికిత్స వరంగా మారుతుంది.4. ఫేజ్ థెరపీకృత్రిమ వైరస్లు ‘యాంటీబయెటిక్ రెసిస్టెన్స్’కు విరుగుడు కాగలవు. వీటి ద్వారా చేసే చికిత్సను ‘ఫేజ్ థెరపీ’ అంటున్నారు. ‘ఫేజ్ థెరపీ’లో ఉపయోగించే కృత్రిమ వైరస్లు అత్యంత శక్తిమంతమైన యాంటీ బయోటిక్‌లకు లొంగని జగమొండి బ్యాక్టీరియా కణాలను సైతం నిర్మూలించగలవు.ఇంకొన్ని ఇబ్బందులుఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా, ఏఐతో రూపొందించే కృత్రిమ వైరస్‌లతో కొన్ని ఇబ్బందులు తప్పవు. ప్రకృతిలో సహజసిద్ధంగా ఉండే వైరస్లు మన శరీరంలోకి చేరితే, వాటిని ఎదుర్కోవడానికి మన శరీరంలో ఎంతో కొంత నిరోధకత ఉంటుంది. మన శరీరంలోని యాంటీబాడీలు వైరస్‌లతో శక్తిమేరకు పోరాటం సాగిస్తాయి. కృత్రిమ వైరస్లు శరీరంలోకి చేరి వ్యాధులను కలిగిస్తే, మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ వాటిని గుర్తించలేదు.మన శరీరంలోని యాంటీబాడీలు వాటితో పోరాడే ప్రయత్నం కూడా చేయకపోవచ్చు. పైగా, వాటిని అరికట్టే మందులు, వ్యాక్సిన్లు కూడా అందుబాటులో ఉండవు. కృత్రిమ వైరస్‌లను కట్టడి చేసే మందులు, వ్యాక్సిన్లు రూపొందించడానికి చాలా కాలమే పట్టవచ్చు. ఏఐ సాంకేతికత శరవేగంగా విస్తరిస్తోంది గాని, దానిని నియంత్రించే చట్టాలు, అంతర్జాతీయ నిబంధనలు ఇంకా పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏఐ సాంకేతికతను వాడుకుని సృష్టించే కృత్రిమ వైరస్ నమూనాలను డిజిటల్ డేటా ఆధారంగా గుర్తించడం దుస్సాధ్యం.ఇక భయాలెందుకు?ఏఐతో రూపొందించే కృత్రిమ వైరస్‌లతో ఇన్ని సానుకూలతలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతుంటే, వీటిపై భయాలెందుకు? అనే అనుమానం ఎవరికైనా వస్తుంది. కృత్రిమ వైరస్‌లపై శాస్త్రవేత్తల సమూహం నుంచే భయాలు వ్యక్తమవుతున్నాయి. వారి భయాలు ఎందుకంటే, ప్రపంచంలో దాదాపు డజను దేశాలు ‘బయో వెపన్స్’ను సమకూర్చుకుని ఉన్నాయి. ఈ దేశాలు ఆ సంగతిని బాహాటంగా ప్రకటించకపోయినా, అంతర్జాతీయ గూఢచర్య సంస్థల సమాచారం ప్రకారం ఇవి పకడ్బందీగా కట్టుదిట్టమైన లాబొరేటరీల్లో జన్యు ఉత్పరివర్తనల ద్వారా ప్రమాదకరమైన వైరస్లు, బ్యాక్టీరియాలు వంటి వాటిని రూపొందించి, ఇప్పటికే నిల్వ చేసుకుని ఉన్నాయి. ఇలాంటి మరికొన్ని బయో వెపన్స్‌ను రూపొందించేందుకు రహస్య ప్రయోగాలను ముమ్మరంగా సాగిస్తున్నాయి. దేశాల మధ్య యుద్ధాలు తలెత్తే సందర్భాల్లో ‘బయో వెపన్స్’ను వినియోగించరాదనే ఐక్యరాజ్య సమితి ఒడంబడికను 185 దేశాలు ఆమోదించాయి. ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల్లో మిగిలిన డజను దేశాలు ఈ ఒడంబడికపై ఇంతవరకు కనీసం సంతకాలు కూడా చేయలేదు. అంతర్జాతీయ గూఢచర్య సంస్థల సమాచారం ప్రకారం చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా, సిరియా సహా డజను దేశాల వద్ద ఇప్పటికే ‘బయో వెపన్స్’ ఉన్నాయి.ఈ దేశాలు మరింత ప్రమాదకరమైన ‘బయో వెపన్స్’ తయారీ కోసం రహస్య ప్రయోగాలను ఇంకా కొనసాగిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి ఒడంబడికను ఖాతరు చేయని ఇలాంటి దేశాలకు కృత్రిమ వైరస్‌లను సృష్టించగలిగే ఏఐ సాంకేతికత చేతికందితే, అవి మరిన్ని బయో వెపన్స్‌ను తక్కువ ఖర్చుతో తయారు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇతర దేశాలతో యుద్ధాలు తలెత్తితే అవి విచక్షణారహితంగా బయోవెపన్స్ను బయటకు విడిచిపెట్టి, మహమ్మారి వ్యాధులను వ్యాప్తి చేసి, భారీ జనహననానికి తెగబడవచ్చు. ఐక్యరాజ్య సమితిని ఖాతరు చేయని ధూర్త దేశాలు మాత్రమే కాదు, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు కూడా ఇదే పద్ధతిలో ‘బయో వెపన్స్’ తయారీకి సిద్ధపడవచ్చు.ఉగ్రవాద సంస్థల చేతికి ఈ పరిజ్ఞానం చేరితే, వాటి వల్ల ఎలాంటి విపత్తులు ఏర్పడవచ్చో ఊహించడం కూడా కష్టమే! ధూర్త దేశాలు, ఉగ్రవాద సంస్థలు ఇష్టానుసారం ఏఐ సాంకేతికతతో ప్రమాదకరమైన వైరస్‌లను రూపొందించే ప్రక్రియలో లాబొరేటరీల్లోంచి పొరపాటున లీకైతే, అవి వాతావరణంలో కలిసిపోయి, మహమ్మారి వ్యాధులు వ్యాపించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏఐతో రూపొందించే కృత్రిమ వైరస్ల వల్ల ఎన్ని సానుకూలతలు ఉన్నాయో, వాటి వల్ల ప్రమాదావకాశాలు అంతకు మించే ఉన్నాయి.నియంత్రణకు శాస్త్రవేత్తల సూచనలుకృత్రిమ వైరస్ల వల్ల ప్రపంచానికి ముప్పు తలెత్తకుండా ఉండాలంటే, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, బయో సెక్యూరిటీ నిపుణులు కొన్ని జాగ్రత్తలను సూచిస్తున్నారు. అవేమిటంటే, ఏఐతో వైరస్‌లను రూపొందించే సాంకేతికత దుర్వినియోగం కాకుండా ఉండటానికి, బయో టెర్రరిజం వ్యాపించకుండా చూడటానికి జీన్ డేటాను ప్రాసెస్ చేసే ఏఐ నమూనాలకు కఠిన నియమావళిని అమలులోకి తేవాలి. డీఎన్ఏ విశ్లేషణలు జరిపే కంపెనీలను ఎవరెవరు ఆర్డర్లు ఇస్తున్నారు, వారు ఎలాంటి జన్యు నమూనాలను ప్రింట్ చేయిస్తున్నారు అనే దానిపై కచ్చితమైన తనిఖీలు ఉండాలి.అన్నింటి కంటే ముఖ్యంగా ప్రాణాంతకమైన వైరస్లు, పాథోజెన్ల డేటాను ఏఐ నమూనాల నుంచి తొలగించాలి. ఆర్టిఫిషియల్ బయో–డిజైనింగ్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అంతర్జాతీయ ఒప్పందం దిశగా ఐక్యరాజ్య సమితి చొరవ తీసుకోవాలి. ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రపంచ దేశాలన్నీ కట్టుదిట్టమైన చట్టాలను వీలైనంత త్వరగా అమలులోకి తేవాలి. ఇకపై ఏఐ ద్వారా సృష్టించే కృత్రిమ వైరస్లు, బ్యాక్టీరియాల ఆర్ఎన్ఏ, డీఎన్ఏ నమూనాలు స్క్రీనింగ్‌ను తప్పించుకునే అవకాశాలు లేకుండా నిబంధనలను కట్టుదిట్టం చేయాలని బయో సెక్యూరిటీ నిపుణులు ప్రభుత్వాలను కోరుతున్నారు.ఇదే అంశమై ఓపెన్ ఏఐ అధినేత సామ్ ఆల్ట్‌మన్, ఆంథ్రోపిక్ అధినేత డేరియో అమోడి, గూగుల్ డీప్‌మైండ్ అధినేత డెమిస్ హసబీస్, మైక్రోసాఫ్ట్ ఏఐ అధినేత ముస్తఫా సులేమాన్, మెటా చీఫ్ ఏఐ ఆఫీసర్ ఆలెగ్జాండర్ వాంగ్ తదితర ఏఐ నిపుణులు అమెరికా కాంగ్రెస్‌కు ఇటీవల లేఖ రాశారు. ఏఐ సాయంతో కృత్రిమ వైరస్ల వంటి వాటి తయారీపై శాస్త్రవేత్తల ఆందోళనలను ప్రభుత్వాలు పట్టించుకుని, సత్వర చర్యలకు నడుం బిగించాలి. ప్రభుత్వాలు అలసత్వం ప్రదర్శిస్తే, తర్వాత తలెత్తబోయే అనర్థాలకు ప్రపంచ దేశాలు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది.- పన్యాల జగన్నాథదాసుఇవి కూడా చదవండి: ఏమిటీ టెక్ నెక్! -
అమ్మ చీరలే నా స్టైల్.. నివేతా థామస్ ఆసక్తికర విషయాలు
పాత్ర ఏదైనా, అందులో పూర్తిగా ఒదిగిపోవడమే ఆమెకు తెలుసు! సినిమాలకు అతీతంగా తనకంటూ ఓ ప్రత్యేక ప్రపంచాన్ని ఆస్వాదించే నటి నివేతా థామస్. ఆమె చెప్పిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మీకోసం...చిన్నప్పుడే కెమెరా ముందుకు!చిన్నప్పుడే టీవీ సీరియల్స్‌లో నటించే అవకాశం వచ్చింది. ‘మై డియర్ భూతం’తో ఎన్నో ఏళ్లు టీవీలో పనిచేశాను. కాని, సినిమాల్లోకి వచ్చాకే నటిగా నన్ను నేను కొత్తగా తెలుసుకున్నాను.బిల్డింగ్స్ కూడా డిజైన్ చేస్తా!నేను ఆర్కిటెక్చర్ చదివింది సినిమాలకు బ్యాకప్‌గా కాదు. నిజంగానే ఆర్కిటెక్ట్‌గా పనిచేయగలిగేలా చదివాను. కాలేజీ, షూటింగ్స్... రెండింటినీ ఒకేసారి బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు. మా అమ్మానాన్న నటనతో పాటు చదువుకూ ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు ఆ రోజులు తలచుకుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది.పాత్ర కోసమే బరువు పెరిగాను? ఒక పాత్ర కోసం నా రూపాన్ని మార్చుకోవడానికి ఎప్పుడూ వెనకాడను. ‘35– చిన్న కథ కాదు’లో సరస్వతి పాత్ర కోసం బరువు పెరిగాను. ఆ పాత్రకు అది అవసరమనిపించింది. ఇప్పుడు కొత్త పాత్రల కోసం మళ్లీ ఫిట్‌గా మారుతున్నాను. అది లుక్ మార్చుకోవడం కాదు, పాత్రలోకి వెళ్లే ప్రయాణం.భాషలు నా బలం!కొత్త భాష నేర్చుకోవడం ఆసక్తి ఎక్కువ. ఒక్కో భాషలోని యాస, పదాల వెనకున్న భావాన్ని తెలుసుకోవడం నటిగా చాలా ముఖ్యం. ప్రస్తుతం మలయాళం, తమిళం, తెలుగు, ఇంగ్లిష్, హిందీతో పాటు ఫ్రెంచ్ కూడా మాట్లాడగలను. వీలైనంత వరకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటాను. అదే నా బలం. ప్రేక్షకులతో నా స్వరం ద్వారా కనెక్ట్ అవ్వడం ప్రత్యేకంగా అనిపిస్తుంది.కెమెరా వెనుక!ఖాళీ సమయం దొరికితే ఫొటోగ్రఫీ చేస్తుంటాను. ప్రయాణాలు చేయడం, కొత్త ప్రదేశాలను చూడడం, అక్కడి చిన్న చిన్న క్షణాలను కెమెరాలో బంధించడం చాలా ఇష్టం. పుస్తకాలు చదవడం కూడా నా ఫేవరెట్ టైమ్‌పాస్.శుక్రవారం అంటే నాకు పండగే!అందరికీ ఆదివారం సెలవు. కానీ శుక్రవారం నాకు చాలా స్పెషల్! సినిమా విడుదలైతే థియేటర్లో ప్రేక్షకుల రియాక్షన్ చూడాలనే టెన్షన్ , ఎగై్జట్‌మెంట్ రెండూ ఉంటాయి. షూటింగ్ లేకపోతే మాత్రం ఫోన్ పక్కనపెట్టి, ప్రపంచాన్ని కాస్త మర్చిపోయి ప్రశాంతంగా ఆలస్యంగా నిద్రలేవొచ్చు. అందుకే... రిలీజ్ ఉన్నా, రిలాక్స్ అయినా... శుక్రవారం అంటే నాకు పండగే!డైట్ నా వల్ల కాదు!నేను డైట్ ఫాలో అయ్యే రకం కాదు. ఫుడ్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా బిర్యానీ కనిపిస్తే, దాన్ని వదిలేసి సలాడ్ తినడం నా వల్ల కాదు. ఆరోగ్యంగా ఉండటానికి ఎన్నీ వ్యాయామాలైనా చేస్తా కాని, ఇష్టమైన ఆహారాన్ని తినడాన్ని మర్చిపోవడం మాత్రం చేయలేను.అమ్మ చీరల్లోనే అసలైన స్టయిల్!ఖరీదైన బ్రాండెడ్ దుస్తుల కంటే అమ్మ దగ్గరున్న పాత చీరలు నాకు చాలా ప్రత్యేకం. వాటిలో ఒక జ్ఞాపకం ఉంటుంది; ఒక కథ ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు అమ్మ పాత చీరలను వేసుకుంటూ ఉంటాను. -
పండుగ వేళ కొత్త రుచులు కావాలా? ఈ వంటకాలు ట్రై చేయండి..
పండుగైనా.. ప్రత్యేకమైన రోజైనా.. ఇంట్లోకి వచ్చే అతిథులకు వెరైటీ వంటకాలు వడ్డించాలంటే ఈ రెసిపీలు మీకు బాగా ఉపయోగపడతాయి. రుచితో పాటు చూడటానికి కూడా ఆకట్టుకునేలా ఉండే ఈ మూడు వంటకాలను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. నవరతన్ కుర్మా, క్రిస్పీ పొటాటో క్యూబ్స్, కాజూ కలశ్ ఎలా తయారు చేయాలో చూద్దాం.నవరతన్ కుర్మాకావలసినవి..తొమ్మిది రకాల కూరగాయల ముక్కలు (క్యారెట్, బీన్స్, బఠాణీ, ఆలుగడ్డ, కాలీఫ్లవర్, పనీర్, జీడిపప్పు, బాదం, కిస్మిస్): 2 కప్పులు, ఉల్లిపాయలు: 2 (తరిగినవి),టొమాటోలు: 2 (తరిగినవి),అల్లం వెల్లుల్లి పేస్ట్: టీస్పూన్,గసగసాలు– జీడిపప్పు పేస్ట్: 2 టేబుల్ స్పూన్లు,ఫ్రెష్ క్రీమ్: 2 టేబుల్ స్పూన్లు,గరం మసాలా: 1/2 టీస్పూన్,కసూరీ మేథీ: 1/2 టీస్పూన్,కారం, పసుపు: రుచికి తగినంత,నెయ్యి లేదా నూనె: 2 టేబుల్ స్పూన్లు,ఉప్పు: తగినంత.తయారీ..ముందుగా క్యారట్, బీన్స్, బఠాణీ, ఆలుగడ్డ, కాలీఫ్లవర్ ముక్కలను కొద్దిగా ఉప్పు వేసి 50 శాతం వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పనీర్ ముక్కలు, జీడిపప్పు, బాదం, కిస్మిస్లను నెయ్యిలో దోరగా వేయించాలి.తరువాత మసాలా పేస్ట్ తయారీ కోసం ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, టొమాటోలను మెత్తగా రుబ్బుకోవాలి.విడిగా నానబెట్టిన గసగసాలు, జీడిపప్పును కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి.పాన్ లో నెయ్యి వేసి ఉల్లిపాయ–టొమాటో పేస్ట్ వేసి నూనె తేలే వరకు వేయించాలి.అందులో పసుపు, కారం, ఉప్పు, గసగసాలు–జీడిపప్పు పేస్ట్ వేసి కలపాలి.ఇందులోనే ఉడికించిన కూరగాయలు, వేయించిన పనీర్, జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసి బాగా కలపాలి.తగినన్ని నీళ్లు లేదా పాలు పోసి మూతపెట్టి 5–7 నిమిషాలు తక్కువ మంటపై ఉడికించాలి.చివరగా గరం మసాలా, ఫ్రెష్ క్రీమ్, కసూరీ మేథీ చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి.ఈ నవరతన్ కుర్మా నాన్ లేదా జీరా రైస్‌లోకి చాలా రుచిగా ఉంటుంది.క్రిస్పీ పొటాటో క్యూబ్స్కావలసినవి..బంగాళాదుంపలు: 3 పెద్దవి (చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి),వంట సోడా: 1/2 టీస్పూన్,నూనె: 3 టేబుల్ స్పూన్లు,కార్న్‌ఫ్లోర్: 1 టేబుల్ స్పూన్,వెల్లుల్లి పొడి: 1 టీస్పూన్,కారం: 1 టీస్పూన్,మిరియాల పొడి: 1/2 టీస్పూన్,ఉప్పు: తగినంత.తయారీ..ఒక పాత్రలో నీళ్లు తీసుకుని ఉప్పు, బేకింగ్ సోడా వేసి మరిగించాలి.అందులో బంగాళ దుంపల ముక్కలు వేసి, ఐదు నిమిషాలు సగం ఉడికేలా మరిగించి నీటిని వడకట్టాలి.ఆ తరువాత నీళ్లు తీసేసిన పొటాటో ముక్కలను అదే పాత్రలో ఉంచి, బాగా కుదపాలి.ఈ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకుని నూనె, కార్న్‌ఫ్లోర్, వెల్లుల్లి పొడి, కారం, మిరియాల పొడి, ఉప్పు వేసి ముక్కలన్నింటికీ పట్టేలా బాగా కలపాలి.పాన్ లో నూనె వేసి వేడయ్యాక, ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్ మీద 12–15 నిమిషాల పాటు తిప్పుతూ బంగారం రంగు వచ్చే వరకు వేయించాలి.అంతే వేడి వేడి క్రిస్పీ పొటాటో క్యూబ్స్ రెడీ. వీటిని వేడిగా ఉన్నప్పుడే సాస్‌తో తింటే రుచిగా ఉంటాయి.కాజూ కలశ్కావలసినవి..జీడిపప్పు: కప్పు,పంచదార: 1/2 కప్పు,నీళ్లు: 1/4 కప్పు,ఏలకుల పొడి: 1/4 టీస్పూన్,నెయ్యి: టీస్పూన్,స్టఫింగ్ కోసం (సన్నగా తరిగిన బాదం, పిస్తా, జీడిపప్పు): 3 టేబుల్ స్పూన్లు,కుంకుమపువ్వు / గ్రీన్ ఫుడ్ కలర్: కొద్దిగాతయారీ..జీడిపప్పును మిక్సీలో వేసి మెత్తని పొడి చేసుకోవాలి.పాన్‌లో పంచదార, నీళ్లు పోసి తీగ పాకం వచ్చే వరకు ఉడికించాలి.పాకంలో తయారుచేసి పెట్టుకున్న జీడిపప్పు పొడి వేసి తక్కువ మంటపై కలుపుతూ ఉండాలి.మిశ్రమం దగ్గరపడ్డాక, టీస్పూన్ నెయ్యి, ఏలకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని, పిండిని చపాతీ పిండిలా మెత్తగా ఒత్తుకోవాలి.ఇపుడు పిండిని కలశం ఆకారంలో తయారు చేసుకునేందుకు, పిండి నుంచి ఒక చిన్న ఉండను తీసుకుని బొటనవేలితో మధ్యలో నొక్కుతూ చిన్న కలశం ఆకారంలో చేసుకోవాలి.లోపలి భాగంలో సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ స్టఫ్ చేయాలి.పైన పిస్తా లేదా కుంకుమపువ్వు నీళ్లతో చిన్న బొట్టు పెట్టి అలంకరించుకోవాలి. అంతే రుచికరమైన, అందమైన కాజు కలశ్ రెడీ!ఇవి కూడా చదవండి: చిన్నవే.. కానీ ఇంటి పనుల్లో ఫుల్ హెల్ప్! -
చిన్నవే.. కానీ ఇంటి పనుల్లో ఫుల్ హెల్ప్!
ఇంట్లో పెద్ద సమస్యలకే కాదు, చిన్న చిన్న చికాకులు చాలు.. రోజంతా తల పట్టుకోవడానికి! ఈ రోజువారీ తలనొప్పులకు టెక్నాలజీ కాస్త చిలిపిగా సాయం చేస్తే? చూడటానికి ముద్దుగా, వాడటానికి సులభంగా, పనిలో నిజాయితీగా ఉండే కొన్ని చిట్టి గ్యాడ్జెట్లు ఇప్పుడు మీకోసం!చేతులు కడుక్కో... ఆడుతూ నేర్చుకో!‘చేతులు కడుక్కున్నావా?’ అని అమ్మ రోజుకు ఎన్నిసార్లు అడిగినా... బుజ్జోడికి మాత్రం ఆ ప్రశ్న వినిపించనట్టే! అందుకే, ఇప్పుడు చేతులు కడుక్కోవడం ఒక పనిలా కాకుండా, చిన్న సరదా గేమ్‌లా మార్చేందుకు వచ్చిందే ఈ క్యూట్ నత్త సోప్ డిస్పెన్సర్. నత్త ఆకారం పిల్లలను ఆకట్టుకోవడంతో సబ్బు తీసుకోవడానికి వాళ్లే ముందుకొచ్చేలా చేయొచ్చు.చిన్నగా ఉండటంతో సింక్ దగ్గర పిల్లలకు సులభంగా అందుబాటులో పెట్టుకోవచ్చు. ఇందులో 120 మిల్లీలీటర్ల వరకు లిక్విడ్ సోప్ నింపుకోవచ్చు. పంప్ నొక్కగానే సబ్బు బయటకు రావడంతో చేతులు కడుక్కోవడమూ వాళ్లకు ఒక చిన్న గేమ్‌లా అనిపిస్తుంది. తినే ముందు, బయట ఆడుకుని వచ్చిన తర్వాత, బాత్రూమ్ నుంచి వచ్చిన వెంటనే చేతులు శుభ్రం చేసుకునే అలవాటును ఇలా సరదాగా నేర్పించొచ్చు. మార్కెట్లో మరెన్నో బొమ్మల రూపాల్లోనూ ఈ సోప్ డిస్పెన్సర్ బాక్స్‌లు ఉంటాయి. ధర రూ.300 మాత్రమే!బట్టలు ఆరేయడానికి... గోడే గ్రౌండ్!వానాకాలంలో బట్టలు ఉతకడం ఓ సమస్య అయితే... వాటిని ఆరేయడం మరో పెద్ద సమస్య! ఇంట్లో తాడు కడితే దానికి బట్టలే కాదు... మన ఇల్లు మొత్తం వేలాడుతున్నట్టుంటుంది. ఇక స్టాండ్ పెడితే నడవడానికి దారి ఉండదు. ఈ సమస్యకు ఒక తెలివైన పరిష్కారమే ఈ రిట్రాక్టబుల్ క్లాత్స్లైన్. దీన్ని గోడకు అమర్చి, అవసరమైనప్పుడు బయటకు లాగితే నాలుగు లైన్లు రెడీ!బట్టలు, టవల్స్, బెడ్‌షీట్స్ వంటివి ఆరేసుకోవచ్చు. పని అయిపోయాక లైన్లను మళ్లీ లోపలికి పంపేస్తే... గోడ మీద చిన్న బాక్స్లా సైలెంట్‌గా ఉండిపోతుంది. ఇంట్లో స్థలం తక్కువగా ఉన్నా, బాత్రూమ్ నుంచి బాల్కనీ వరకు ఎక్కడైనా అమర్చుకోవచ్చు. అలా ఇప్పుడు బట్టలు ఆరేయడానికి ఇల్లు పెద్దగా ఉండాల్సిన పనిలేదు... గోడ ఉంటే చాలు! ధర రూ.750 మాత్రమే!బ్యాగ్‌లో పట్టే కెటిల్!ప్రయాణాల్లో టీ కావాలి... కాఫీ కావాలి... నూడుల్స్ కావాలి! అదీ... ఇంట్లో చేసుకున్నట్టుగా! కానీ కెటిల్ తీసుకెళ్దామంటే బ్యాగ్‌లో ప్లేస్ ఉండదు. అయితే, ఈ కెటిల్ మాత్రం అలా కాదు! వాడేటప్పుడు కెటిల్‌లా.. పని అయిపోయాక మడిస్తే చిన్న స్నాక్ బాక్స్లా పనిచేస్తుంది. 600 మిల్లీలీటర్ల సామర్థ్యంతో నీటిని త్వరగా మరిగించి టీ, కాఫీ, నూడుల్స్, ఓట్స్, సూప్ వంటివి సిద్ధం చేసుకోవచ్చు. 600 వాట్ల పవర్‌తో పనిచేసే ఇందులో నీరు మరిగిన తర్వాత ఆటోమేటిక్‌గా ఆఫ్ అయ్యే సదుపాయంతో పాటు, నీరు లేకుండా వేడెక్కకుండా రక్షణ కూడా ఉంది. హాస్టల్ నుంచి హోటల్ వరకు... ప్రయాణం నుంచి క్యాంపింగ్ వరకు ఎక్కడైనా వెంట తీసుకెళ్లొచ్చు. అంటే... బ్యాగ్‌లో బట్టలకే చోటు లేకపోయినా... కెటిల్‌కు మాత్రం చోటు దొరికేస్తుంది! ధర రూ.500 మాత్రమే!ఇవి చదవండి: ‘చిన్న ముల్లుకే ఏడుస్తావా?’.. కోతికి చివర్లో దిమ్మతిరిగే గుణపాఠం! -
‘చిన్న ముల్లుకే ఏడుస్తావా?’.. కోతికి చివర్లో దిమ్మతిరిగే గుణపాఠం!
అనగనగా ఒక అడవిలో ఒక కోతి ఉండేది. ఆ కోతి చాలా తుంటరిది. ఎప్పుడూ చెట్ల మీద గంతులు వేస్తూ అడవిలో ఉన్న జంతువులను వెక్కిరిస్తూ ఉండేది. ఏవైనా జంతువులు కష్టంలో ఉంటే సహాయం చేయకపోగా, వాటిని ఎగతాళి చేస్తూ కాలక్షేపం చేసేది.ఒకరోజు కోతి విహారానికి నడుచుకుంటూ వెళుతుండగా, దారిలో ఒక ఎలుగుబంటికి కాలికి ముల్లు గుచ్చుకొని బాధపడుతూ కనిపించింది. ఎలుగుబంటి ఆ ముల్లును బయటకు తీయడానికి నానా ఇబ్బందులు పడుతోంది. అది చూసిన కోతి, ‘ఛీ! ఇంత చిన్న ముల్లుకి ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? నువ్వు చాలా పిరికిదానివి!’ అని ఎలుగుబంటిని చూసి ఎగతాళి చేసింది. ఎలుగుబంటి బాధగా, ‘ఇది నీకు చిన్న విషయంగా అనిపించవచ్చు. కానీ, నొప్పి ఎలా ఉంటుందో తెలిస్తే ఇలా అనవు!’ అని అక్కడి నుండి కుంటుతూ వెళ్లిపోయింది. కోతి మాత్రం నవ్వుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది.దారిలో ఒక ఏనుగు గుండ్రంగా తిరుగుతూ, తొండాన్ని ఊపుతూ కనిపించింది. తొండానికి తేలు కుట్టడంతో ఏనుగు నొప్పిని భరించలేక అల్లాడిపోతోంది. అప్పుడు అక్కడికి వచ్చిన కోతి, ‘ఏంటీ? ఒక చిన్న తేలు కుడితేనే కొండలా ఉన్న నువ్వు ఇంతలా విలవిల్లాడిపోతున్నావా? నేనైతే అస్సలు పట్టించుకోను. నువ్వు ఎంత పిరికి దానివి!’ అని ఏనుగును కూడా వెక్కిరించింది. కోతి మాటలకు ఏనుగు ఎంతో బాధపడింది. ఏనుగు బాధను చూసి కోతి ఏమాత్రం కనికరించకుండా తన దారిలో వెళ్ళిపోయింది.మరో రోజు, ఒక నెమలి వర్షంలో తడిసి రెక్కలు బరువెక్కడంతో ఎగరలేక కిందపడి ఇబ్బంది పడుతుంటే, కోతి చెట్టు మీద నుండి పండ్లు విసురుతూ, ‘పురివిప్పి నాట్యం చేయలేని నెమలి దేనికీ పనికిరాదు. రెక్కలు మొద్దుబారిన నువ్వు అడవిలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే!’ అని వెక్కిరించింది. ఇలా ఎదుటివారి బాధను చూసి కోతి ప్రతిసారీ నవ్వుకుంటూనే ఉండేది.కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! ఒకరోజు కోతి చెట్టు మీద నుండి కిందకు దూకుతుండగా, ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కుకుంది. ఆ వలలో ఉన్న పదునైన ఇనుప ముళ్లు కోతి కాలికి, తోకకు బలంగా గుచ్చుకున్నాయి. కోతి నొప్పి తట్టుకోలేక, ‘అమ్మో! ఎంత నొప్పి! ఎవరైనా నన్ను కాపాడండి! నేను భరించలేకపోతున్నాను!’ అని పెద్దగా అరుస్తూ ఏడవసాగింది.కోతి అరుపులు దూరంగా ఉన్న ఏనుగుకి, ఎలుగుబంటికి, నెమలికి వినిపించాయి. అవి వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాయి. కోతి తన కాలికి ముళ్లు గుచ్చుకుని, విలవిల్లాడుతుండటం చూశాయి.అప్పుడు కోతికి అర్థమైంది, ఎదుటివారి బాధను తక్కువ చేసి మాట్లాడటం తప్పు అని. ఎలుగుబంటి, ఏనుగు, నెమలి అన్నీ కలిసి కోతి దగ్గరకు వచ్చాయి. ఆ జంతువులన్నింటినీ చూసి కోతి కళ్లు చెమ్మగిల్లాయి. ఎలుగుబంటి, ఏనుగు జాగ్రత్తగా వల నుండి కోతిని విడిపించి, ఆ ముళ్లను తొలగించి దానికి సహాయం చేశాయి.తను చేసిన తప్పుకు చాలా సిగ్గుపడింది కోతి. ‘మిమ్మల్ని ఇంతకుముందు నేను ఎంతగానో ఆటపట్టించాను. కానీ, మీరు ఇప్పుడు నాకు సహాయం చేశారు. ఎవరి బాధ ఎంతటిదో, అది మనదాకా వస్తేనే తెలుస్తుంది!’ కన్నీళ్లతో అంది కోతి. అప్పటి నుండి కోతి ఏ జంతువునూ తక్కువ చేసి మాట్లాడలేదు. ‘ఎదుటివారి కష్టాన్ని చూసి నవ్వడం కంటే, ఆదుకోవడం మిన్న!’ అని తెలుసుకుంది. హితవచనం..అపకృత్య బుద్ధిమతో దూరస్థోస్మీతి నాశ్వసేత్దీర్ఘా బుద్ధిమతో బాహూ యాభ్యాం హింసతి హింసితః - బుద్ధిమంతుడికి అపకారం చేసి, దూరంగా పారిపోయి, ‘అతడికి దూరంగానే ఉన్నాను కదా, నాకేం భయంలేదు’ అనుకోవడం బుద్ధితక్కువ పని. బుద్ధిమంతుడు తనను హింసించినవాడు ఎక్కడున్నా పట్టుకుని, ప్రతీకారం తీర్చుకోగలడు.- శోభా సురేష్ -
ఒక్కసారి సిజేరియన్..మళ్లీ అదేనా?
నా మొదటి ప్రసవం సిజేరియన్ ద్వారా జరిగింది. ఇప్పుడు నాకు తొమ్మిదో నెల నడుస్తోంది. ఈసారి సాధారణ ప్రసవం అయితే త్వరగా కోలుకుంటానని, ఇద్దరు పిల్లలను చూసుకోవడం కూడా సులభంగా ఉంటుందని అనుకుంటున్నాను. నాకు సాధారణ ప్రసవం అయ్యే అవకాశం ఉందా?– రాధిక, నెల్లూరు. ఒకసారి సిజేరియన్ జరిగినంత మాత్రాన, తర్వాతి ప్రసవం కూడా తప్పనిసరిగా సిజేరియన్ ద్వారానే జరగాలనే నియమం లేదు. సరైన పరిస్థితులు ఉంటే, తర్వాతి గర్భంలో సాధారణ ప్రసవానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది. అయితే అందరికీ ఇది ఒకే విధంగా సాధ్యం కాదు. మొదటి సిజేరియన్ ఎందుకు చేయాల్సి వచ్చింది, గర్భాశయంపై ఎలాంటి కోత పెట్టారు, ప్రస్తుతం తల్లికి లేదా బిడ్డకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా వంటి అనేక అంశాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. సాధారణంగా, మొదటిసారి సిజేరియన్ అయిన మహిళలు ఈసారి గర్భం చివరి దశలో సహజంగానే ప్రసవ నొప్పుల్లోకి వెళితే, కొందరిలో సాధారణ ప్రసవం విజయవంతమయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇది వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఈ అవకాశం ఉండాలంటే మొదటి సిజేరియన్‌కు కారణం ఏమిటి, ప్రస్తుతం బిడ్డ ఎదుగుదల ఎలా ఉంది, తల్లికి అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు ఉన్నాయా, శరీర బరువు సరైన స్థాయిలో ఉందా వంటి అంశాలను పరిశీలిస్తారు. అయితే కొన్ని పరిస్థితుల్లో సాధారణ ప్రసవానికి ప్రయత్నించడం మంచిది కాదు. ఉదాహరణకు బిడ్డ ఎదుగుదలలో తీవ్రమైన సమస్యలు ఉండటం, తల్లికి అధిక రక్తపోటు లేదా ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉండటం, బిడ్డ అడ్డంగా లేదా తల కిందికి కాకుండా వేరే స్థితిలో ఉండటం, మాయ కిందకు ఉండటం వంటి పరిస్థితుల్లో వైద్యులు సిజేరియన్‌ను సూచించవచ్చు. గర్భం ముప్పై ఎనిమిది వారాలు దాటిన తర్వాత తల్లి, బిడ్డ ఆరోగ్య పరిస్థితులను పూర్తిగా పరిశీలిస్తారు. బిడ్డ కదలికలు, గుండె స్పందన, ఎదుగుదల, ఇతర పరీక్షల ఫలితాలు అన్నీ సంతృప్తికరంగా ఉంటే కొంతకాలం వేచి చూసే అవకాశం గురించి వైద్యులు నిర్ణయిస్తారు. అయితే నిర్ణీత సమయానికి సహజంగా ప్రసవ నొప్పులు ప్రారంభం కాకపోతే, తదుపరి మార్గాల గురించి వైద్యులు వివరంగా చర్చిస్తారు. ఒకసారి సిజేరియన్ అయినవారిలో మందులు లేదా ఇంజెక్షన్ల ద్వారా ప్రసవ నొప్పులను ప్రారంభించడం కొన్ని సందర్భాల్లో ప్రమాదాన్ని పెంచవచ్చు. ముఖ్యంగా గర్భాశయం చిట్లిపోయే ప్రమాదం ఉన్నందున, ప్రతి మహిళకు ఈ విధానం సరిపోదు. పరీక్షలో ప్రసవానికి అవసరమైన మార్గం అనుకూలంగా ఉంటే, మందులు కాకుండా ప్రత్యేక పద్ధతుల ద్వారా ప్రసవాన్ని ప్రారంభించే అవకాశాన్ని వైద్యులు పరిశీలించవచ్చు. దీనివల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాదాలను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ సాధారణ ప్రసవానికి ప్రయత్నించడం సురక్షితం కాదని తేలితే, ముప్పై ఎనిమిది నుంచి ముప్పై తొమ్మిది వారాల మధ్య ముందస్తుగా ప్రణాళిక ప్రకారం సిజేరియన్ చేయవచ్చు. తల్లి ఆరోగ్యంగా, ఇతర సమస్యలు లేకుండా ఉంటే కోలుకునే ప్రక్రియ కూడా సాధారణంగానే ఉంటుంది.ముఖ్యంగా, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సౌకర్యాలు ఉన్న ఆసుపత్రిలోనే చేయాలి. ప్రసవ సమయంలో బిడ్డ గుండె స్పందనను నిరంతరం గమనించడం చాలా అవసరం. కాబట్టి మీ పరిస్థితిని బట్టి మీ వైద్యులతో అన్ని పరీక్షల ఫలితాలను చర్చించండి. సాధారణ ప్రసవం సాధ్యమేనా, లేక సిజేరియన్ సురక్షితమా అన్నది మీ ఆరోగ్యం, బిడ్డ పరిస్థితిని బట్టి నిర్ణయించాలి.∙ -
నైటింగేల్ ఫేషియల్! చర్మానికి నిగారింపు, మెరిసేలా..
పూర్వం జపాన్‌లోని కళాకారులు తమ అందం కోసం ఉపయోగించే సాధనాల్లో ‘ఉగుయిసు నో ఫున్’ ఒకటి. అంటే జపనీస్ నైటింగేల్‌గా పిలిచే ‘బుష్ వార్బర్’ అనే ఒక పక్షి విసర్జన. దీనిని ఎండబెట్టి, శుద్ధిచేసి, మెత్తని పొడిలా చేసి నీటితో కలిపి ఉపయోగించేవారు. ఉగుయిసు నో ఫుడ్‌లో యూరియా, గ్వానిన్, ఇతర నైట్రోజన్ సమ్మేళనాలు ఉంటాయి. ముఖ్యంగా యూరిక్ యాసిడ్ నుంచి ఉత్పన్నమయ్యే గ్వానిన్ అనే పదార్థం దీనిలో ఉంటుంది. ఇది చర్మానికి నిగారింపునిస్తుందని వారు నమ్మేవారు. కొన్ని బ్యూటీ ఉత్పత్తుల్లో ఇప్పటికీ దీనిని ఉపయోగిస్తున్నారు.చర్మసంరక్షణ కోసం ‘ల్యాంకోమ్ రెనర్జీ నానో రీసర్ఫేసర్’ పరికరం అందుబాటులోకి వచ్చింది. ఇందులో నాలుగువందల అతిసూక్ష్మమైన నానో–టిప్స్‌తో కూడిన నానోచిప్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇది చర్మంపై కంటికి కనిపించని సూక్ష్మ మార్గాలను ఏర్పాటు చేయడం ద్వారా, మనం వాడే స్కిన్ కేర్ సీరమ్‌లు చర్మంలోకి వేగంగా, లోతుగా ఇంకేలా చేస్తుంది. సాధారణంగా క్లినిక్‌లలో సూదులతో చేసే చికిత్సలో నొప్పి ఉండటంతో పాటు చర్మం కోలుకోవడానికి సమయం పడుతుంది. కానీ ఈ పరికరం ఎలాంటి నొప్పి లేకుండా సున్నితంగా పనిచేస్తుంది. ల్యాంకోమ్ ట్రిపుల్ సీరమ్‌తో కలిసి పనిచేసే ఈ డివైజ్.. ముడతలు తగ్గించడం, సన్నని గీతలు పోగొట్టడం, చర్మం బిగుతుగా మారడం, చర్మ ఛాయను మెరుగుపరచడంలో సమర్థంగా పనిచేస్తుంది. అత్యంత సున్నితమైన చర్మతత్వం ఉన్నవారితో సహా ప్రతి ఒక్కరూ దీనిని ఉపయోగించవచ్చు. సిల్కీగా.. జాలువారేలా!జుట్టు పట్టులా మృదువుగా ఉంచుకోవడానికి ఇంట్లోనే చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. తలకు గోరువెచ్చని కొబ్బరినూనె రాసి, సుతారంగా మర్దన చేసి, అరగంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. దీనివల్ల జుట్టు పొడిబారకుండా ఉంటుంది. తల పొడిబారిపోకుండా ఉండటానికి గోరువెచ్చని నీరు ఉపయోగించడం మంచిది. షాంపూ చేసిన ప్రతిసారీ జుట్టు మధ్య భాగం నుంచి చివర్ల వరకు కండిషనర్ రాసి.. కొన్ని నిమిషాల తర్వాత కడిగేయాలి. తడిగా ఉన్నప్పుడు జుట్టు సులభంగా తెగిపోవచ్చు. అందుకని వెంటనే గట్టిగా దువ్వకుండా, కొద్దిగా ఆరిన తర్వాత వెడల్పాటి పళ్లున్న దువ్వెనతో మెల్లగా చిక్కులు తీయాలి. -
‘లీఫ్రానిక్స్’! వాడేసి పడేస్తే మట్టిలో కలిసిపోతాయి.. ఇవే భవిష్యత్ గ్యాడ్జెట్స్!
మన స్మార్ట్ఫోన్లు లేదా ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు పాడైపోతే చెత్తకుప్పల్లో ప్లాస్టిక్ వ్యర్థాలుగా మిగిలిపోతాయి కదా. అలా కాకుండా ప్లాస్టిక్ స్థానంలో రాలిపోయిన ఆకుల ఈనెలను సర్క్యూట్ బోర్డులుగా వాడుకుని సర్క్యూట్లను తయారుచేసే కొత్త సైన్స్ మ్యాజిక్కే లీఫ్ట్రానిక్స్. అన్బి‘లీఫ’బుల్ అనిపిస్తోందా! వాడేశాక, లేదా కాలం తీరిపోయాక ఈ లీఫ్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ని చెత్తలో పడేసినా, ప్లాస్టిక్‌లా అవి పర్యావరణాన్ని పాడుచేయకుండా మట్టిలో సహజంగానే కుళ్లిపోయి, ఎరువుగా మారిపోతాయి. అంటే, రాబోయే తరాల వారి కోసం ఒక ఆకుపచ్చని భవిష్యత్తు ఎదురు చూస్తోందన్నట్లే!ఎలక్ట్రానిక్స్ రంగంలో ఇదొక కొత్త, ప్రకృతి హితమైన సాంకేతికత. సాధారణంగా మనం వాడే ఎలక్ట్రానిక్ వస్తువుల సర్క్యూట్ బోర్డులు, ప్లాస్టిక్ మెటీరియళ్లు పర్యావరణానికి చాలా హాని చేస్తాయి. అవి త్వరగా భూమిలో కలిసిపోవు. దీనికి పరిష్కారంగా జర్మనీ శాస్త్రవేత్తలు ఇప్పుడు ఆకుల సహాయంతో ఎలక్ట్రానిక్స్‌ను కనిపెట్టే ప్రయోగాల్లో తలమునకలై ఉన్నారు. ఈ టెక్నాలజీనే ‘లీఫ్ట్రానిక్స్’ అంటున్నారు.ఆకులలో ఉండే ‘ఈనెల’ నెట్వర్క్ నిర్మాణం చాలా గట్టిగా, ప్లాస్టిక్ లాంటి మన్నికను కలిగి ఉంటుంది. శాస్త్రవేత్తలు ఆకులలోని మెత్తని భాగాన్ని తొలగించి, ఆ ఈనెల అస్థిపంజరం లాంటి నిర్మాణాన్ని ప్లాస్టిక్ లేదా గాజుకు బదులుగా ఎలక్ట్రానిక్స్ సర్క్యూట్స్ తయారు చేయడానికి వాడేందుకు పరిశోధనలు జరుపుతున్నారు. ఈ టెక్నాలజీతో తయారైన ఎలక్ట్రానిక్ పరికరాలు భూమిలో సులభంగా కలిసిపోతాయి. దీనివల్ల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు (ఇ–వేస్ట్) చాలా వరకు తగ్గుతాయి.రెండేళ్ల క్రితమే దాదాపుగా విజయంజర్మనీలోని ప్రఖ్యాత ‘డ్రెస్డెన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ’ శాస్త్రవేత్తలు 2024 నవంబరులో ఈ టెక్నాలజీని ఒక కొలిక్కి తెచ్చారు. ఈ పరిశోధన బృందానికి ప్రొఫెసర్ కార్ల్ లియో, భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త రాకేష్ ఆర్. నాయర్ నేతృత్వం వహించారు. లీఫ్ట్రానిక్స్పై వారి కృషికి సంబంధించిన పరిశోధన వివరాలు ప్రసిద్ధ సైన్స్ జర్నల్ ‘సైన్స్ అడ్వాన్సెస్’ లో ప్రచురితమయ్యాయి. భూమిపై నానాటికీ వేగంగా పెరిగిపోతున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ఈ బృందం రీసెర్చ్ ప్రారంభమైంది.పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు మొదట మగ్నోలియా చెట్ల ఆకులను తీసుకుని, అందులోని మెత్తని కణాలను పూర్తిగా తొలగించారు. కేవలం బలమైన ఈనెల అస్థిపంజరం మాత్రమే మిగిలేలా చేశారు. ఆ అస్థిపంజరం ‘లిగ్నోసెల్యులోజ్’ అనే పదార్థంతో కూడి ఉంటుంది. ప్రకృతి సిద్ధమైన ఆ ఈనెల నిర్మాణానికి పాలిమర్ కోటింగ్ ఇచ్చారు. ఎలాగంటే, ఈనెను ‘ఇథైల్ సెల్యులోజ్’ అనే ప్లాస్టిక్ లాంటి గట్టి, పర్యావరణ హితమైన (భూమిలో కలిసిపోయే) ద్రవ పదార్థంలో ముంచటం ద్వారా! సాధారణంగా పర్యావరణానికి హాని చేయని పదార్థాలు త్వరగా వేడికి కరిగిపోతాయి.కానీ, ఈ ఆకు ఈనెలల ఆధార (బేస్) నిర్మాణం వల్ల ఆ ‘ఇథైల్ సెల్యులోజ్’ పదార్థానికి ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకునే దృఢమైన బలం చేకూరింది! దీనిపై లేజర్ కటింగ్ ద్వారా సర్క్యూట్లు ప్రింట్ చేసి, ఎలక్ట్రానిక్ విడిభాగాలను అమర్చారు. ఈ విధంగా ఆకుల సహజ నిర్మాణాన్ని ఉపయోగించి, పర్యావరణానికి హాని చేయని ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డులను తయారు చేసే విధానాన్ని కనిపెట్టి, దానికి ‘లీఫ్ట్రానిక్స్’ అని పేరు పెట్టారు. వాడేసిన తర్వాత వాటిని పారేస్తే సుమారు నెల రోజుల్లో శిథిలమైపోయి, మట్టిలో కలిసిపోతాయి.మాగ్నోలియా చెట్టు కథలీఫ్ట్రానిక్స్ పరిశోధనకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్ కార్ల్ లియో... డ్రెస్డెన్ యూనివర్శిటీలో సీనియర్ ప్రొఫెసర్. ఆర్గానిక్ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఎన్నో పురస్కారాలు అందుకున్నవారు. ఆయనతో పాటుగా డాక్టర్ హాన్స్ క్లీమాన్ అనే శాస్త్రవేత్త అదే విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ గ్రూప్ లీడర్‌గా ఉన్నారు. ఆయన కూడా ప్రొఫెసర్ కార్ల్ లియో ఆధ్వర్యంలో పనిచేస్తూ, ఈ లీఫ్ట్రానిక్స్ ప్రాజెక్ట్‌లో కీలకమైన పాత్ర పోషించారు. వీళ్లిద్దరూ ఒకే విశ్వవిద్యాలయంలో, ఒకే ల్యాబ్‌లో కలిసి పనిచేస్తున్న సహచర శాస్త్రవేత్తలు అయినప్పటికీ ఈ లీఫ్ట్రానిక్స్ అనే ఐడియా వచ్చింది మాత్రం వీరిద్దరికీ కాదు. అక్కడే పీహెచ్డీ చేసిన రాకేష్ నాయర్‌కి వచ్చిన ఆలోచన అది! యూనివర్సిటీ ప్రాంగణంలోని మాగ్నోలియా చెట్టు కింద నడుస్తున్నప్పుడు రాకేష్‌కి లీఫ్ట్రానిక్స్ ఆలోచన తట్టింది. అంటే లీఫ్ట్రానిక్స్ అనే భావన ఏ రసాయన ప్రయోగశాలలోనో పుట్టలేదు. యూనివర్సిటీ ఆవరణలోని ఒక మాగ్నోలియా చెట్టు కింద జీవం పోసుకుంది.దానికి ముందరి కథ..!క్లీమాన్ దగ్గర పీహెచ్డీ చేసిన డాక్టర్ రాకేష్ నాయర్, ప్లాస్టిక్ లేదా గాజుకు బదులుగా పర్యావరణంలో సులభంగా కుళ్లిపోయే, లేదా శిథిలమైపోయే సహజ పదార్థాల కోసం వెతుకుతున్నారు. ఇద్దరూ కలిసి రకరకాల కాగితాలు, ప్లాస్టిక్, రబ్బరు, నైలాన్ పాలిథిన్ కవర్లను, సెల్యులోజ్‌ను పరీక్షించినప్పటికీ, ఎలక్ట్రానిక్స్ తయారీలో అవసరమైన వేడిని అవి తట్టుకోలేక కరిగిపోవటమో లేదా వంకరపోవటమో జరిగింది. ఏం చేయాలా అని సతమతమవుతున్న సమయంలో, రాకేష్ నాయర్ ఒక రోజు మాగ్నోలియా చెట్టు పక్కనుండి నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడే ఆయనకు.. ప్రకృతిలోని చెట్ల ఆకులు ఈ సమస్యకు పరిష్కారం చూపగలవనే ఆలోచన వచ్చింది.ప్రయోగశాలలో నిర్ధారణమాగ్నోలియా ఆకులు చాలా గట్టిగా, బలమైన ఈనెల నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. నాయర్ వెంటనే ఆ ఆకులు సేకరించి ల్యాబ్‌కి తీసుకెళ్లారు. ఆకులపై ఉన్న మెత్తని భాగాన్ని తొలగించి, కేవలం బలమైన ఈనెల అస్థిపంజరాన్ని మాత్రమే మిగిల్చారు. ఆ ప్రకృతి సిద్ధమైన ఈనెల నిర్మాణం, పర్యావరణ హితమైన పదార్థాలకు 180 సెల్సియస్ డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను తట్టుకునే సామర్థ్యాన్ని ఇస్తుందని కనుగొన్నారు. అలా ఆ మాగ్నోలియా చెట్టు కింద కలిగిన చిన్న ఆలోచనే నేడు ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న ‘లీఫ్ట్రానిక్స్’కు దారితీసింది!ఐదు శాస్త్ర విభాగాలు కలవాలిలీఫ్ట్రానిక్స్ సాంకేతికత విజయవంతమై, ల్యాబ్ నుండి మన రోజువారీ వినియోగంలోకి రావాలంటే ప్రధానంగా 5 ముఖ్యమైన శాస్త్ర విభాగాలు కలిసి పనిచేయాల్సి ఉంటుంది.అవి: మెటీరియల్స్ సైన్స్, బయో–మెటీరియల్స్ ఇంజనీరింగ్ (ఆకుల నుండి రసాయనాలను తొలగించి, కేవలం గట్టి పీచు చట్రాన్ని వేరు చేయడం; అది తేమకు, వేడికి దెబ్బతినకుండా స్థిరపరచడం ఈ విభాగం బాధ్యత); ఆర్గానిక్–ఫ్లెక్సిబుల్ ఎలక్టాన్రిక్స్ (సహజమైన ఆకు ఉపరితలంపై ప్రవహించే వెండి/రాగి లిక్విడ్ ఇంక్‌లు, విద్యుత్ ప్రసరించే ఆర్గానిక్ పొరలు, సర్క్యూట్లు, ఒలెడ్ డిస్ప్లేలను డిజైన్ చేయడానికి ఈ శాస్త్రం అవసరం); ప్లాంట్ బయాలజీ–బయోమిమెటిక్స్ (ఏ రకం ఆకులు, వాటి ఈనెల ఆకారాలు ఎలక్ట్రానిక్స్‌కు బాగా సరిపోతాయో అధ్యయనం చేయడం, మొక్కల కణజాలం, వాటి బలాన్ని అర్థం చేసుకోవడంలో ఈ శాస్త్రం తోడ్పడుతుంది); కెమికల్ ఇంజనీరింగ్– సర్ఫేస్ సైన్స్ (ఆకు పొరలపైన లోహపు మార్గాలు ఊడిపోకుండా ఉండేలా చూడటం, లోహాల అణువులు ఆకు కణాల్లోకి వ్యాపించి సర్క్యూట్ పాడవకుండా ఉండేలా కెమికల్ బాండింగ్‌ను నిర్వహించడం ఈ విభాగం కిందకు వస్తుంది); ఎన్విరాన్మెంటల్ సైన్స్–ఎకో టాక్సికాలజీ (ఈ పరికరాలు వాడి పడేసిన తర్వాత మట్టిలో ఎంత త్వరగా కుళ్లిపోతాయి? వీటిలోని లోహాలు మట్టిని లేదా నీటిని విషపూరితం చేస్తాయా? అనే అంశాలను పరిశోధించి పర్యావరణానికి పూర్తిగా సురక్షితమని ధ్రువీకరించటానికి ఈ విభాగం అవసరం).భవిష్యత్ ప్రయోజనాలులీఫ్ట్రానిక్స్ సాంకేతికత అందుబాటులోకి వస్తే, మానవ జీవితం మీద, పర్యావరణంపైన దాని ప్రభావం చాలా విస్తృతంగా ఉంటుంది. ముఖ్యంగా ఎలక్టాన్రిక్ వ్యర్థాల సమస్యను నివారించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.వ్యవసాయ పొలాల్లో, అడవుల్లో నీటి శాతం, నేల సారం లేదా వాతావరణ మార్పులను పర్యవేక్షించే సెన్సర్లను తయారు చేయవచ్చు. ఇవి పని పూర్తయ్యాక నేలలో కలిసిపోతాయి కాబట్టి వీటిని తిరిగి సేకరించాల్సిన అవసరం ఉండదు.మానవ శరీరంపై అంటించే స్మార్ట్ హెల్త్ ప్యాచెస్, షుగర్ టెస్ట్ స్టిప్స్ర్, ఈసీజీ సెన్సర్ల తయారీలో వాడవచ్చు. ఇవి చర్మానికి ఎలాంటి హానీ చేయవు. ప్లాస్టిక్ వ్యర్థాలను పెంచవు.కొరియర్ ప్యాకింగ్‌లపై వాడే స్మార్ట్ ట్రాకింగ్ ట్యాగ్లు, తాత్కాలిక డిస్ప్లేలు, స్మార్ట్ లేబుల్స్గా వాడొచ్చు.ఆకుల ఈనెల ఆకారాన్ని ఉపయోగించి, వాటిపై రాగి లేదా వెండి పూత పూసి సూక్ష్మక్రిములను సంహరించే సహజమైన ఫిల్టర్లుగా మార్చవచ్చు. ఇది తక్కువ ఖర్చుతో ఇ–కోలి వంటి బ్యాక్టీరియాలను నీటి నుండి తొలగిస్తుంది.వంగే స్వభావం ఉండే ఫ్లెక్సిబుల్ సోలార్ ప్యానెళ్లు, సూపర్ కెపాసిటర్లు, తేలికపాటి ఒలెడ్ (ఆర్గానిక్ లైట్–ఎమిటింగ్ డయోడ్) డిస్ప్లేల తయారీలో ఉపయోగించవచ్చు. ప్రస్తుతం మనం వాడే ఎలక్ట్రానిక్స్ ప్లాస్టిక్, పలు విషపూరితమైన కెమికల్స్‌తో తయారై వేల సంవత్సరాలు మట్టిలో కరగకుండా ఉండిపోతున్నాయి. అలా కాకుండా, లీఫ్ట్రానిక్స్ ద్వారా ‘వాడేసి పడేశాక మట్టిలో కలిసిపోయే’ ఆకుపచ్చని భవిష్యత్తును నిర్మించవచ్చు.తయారీలో ప్రధాన సవాళ్లు ‘లీఫ్ట్రానిక్స్’ అనేది సహజమైన ఆకుల ఈనెల వ్యవస్థను, ప్లాంట్ స్కాఫోల్డ్లను (ఆకుల అస్థిపంజరాలు) ఉపయోగించి పర్యావరణ రహిత, బయోడిగ్రేడబుల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్లను తయారుచేసే ఒక నూతన సాంకేతిక రంగం కనుక సహజంగానే పరిశోధకులకు కొన్ని సవాళ్లూ ఎదురౌతున్నాయి. మొదటది, ప్రతి ఆకు పరిమాణం, మందం, ఈనెల నిర్మాణం వేర్వేరుగా ఉంటాయి. అందుకే పరిశ్రమలలో ఒకే ప్రమాణంతో మాస్ ప్రొడక్షన్ చేయడం పెద్ద సవాలు. రెండవది, ఆకులలో ఉండే పీచు పదార్థాలు గాలిలోని తేమను త్వరగా పీల్చుకుంటాయి. దీనివల్ల ఆకుల సర్క్యూట్లలో షార్ట్ సర్క్యూట్లు కావడం లేదా పొరలు విడిపోవడం జరిగే అవకాశం ఉంది.మూడు, సాధారణ ఎలక్ట్రానిక్ (ఎఫ్.ఆర్.–4) బోర్డులతో పోలిస్తే ఆకుల పీచు, బయో–పాలిమర్లు అధిక ఉష్ణోగ్రతల వద్ద (ఉదాహరణకు సోల్డరింగ్ చేసేటప్పుడు) దెబ్బతినే అవకాశం ఉంది. నాలుగు, సర్క్యూట్ మార్గాల కోసం వాడే వెండి లేదా రాగి లోహాల సూక్ష్మ అణువులు కాలక్రమేణా ఆకు కణజాలంలోకి విస్తరించి సర్క్యూట్ పనితీరును దెబ్బతీస్తాయి. చివరిగా, లీఫ్ట్రానిక్స్ సాంకేతికత తక్కువ విద్యుత్ వాడే, స్వల్పకాలిక లేదా పునర్వినియోగ పరికరాలకు మాత్రమే అనుకూలం. హై–పెర్ఫార్మెన్స్ ప్రాసెసర్ల స్థానంలో దీనిని ఇప్పటికిప్పుడే వాడలేము.పదహారేళ్లుగా ప్రయోగాలు!లీఫ్ట్రానిక్స్ను ఆవిష్కరించేందుకు 2010 చివర్ల నాటి నుంచీ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇక ఆకుల నిర్మాణాన్ని సోలార్ సెల్స్, సూపర్ కెపాసిటర్లు, ఫ్లెక్సిబుల్ ఎనర్జీ స్టోరేజ్ కోసం ఉపయోగించడంపై విశ్వవిద్యాలయాలలో గత పదేళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. తొలిసారి 2024 చివరిలో ముందడుగు పడింది! వీరు ఆకుల స్కాఫోల్డ్లపై ఆధారపడి పనిచేసే ‘ఆర్గానిక్ లైట్–ఎమిటింగ్ డయోడ్’ (ఒలెడ్)ను, ట్రాన్సిస్టర్లను విజయవంతంగా తయారు చేసి చూపించారు.ప్రస్తుతం వివిధ విశ్వవిద్యాలయాలు గ్రీన్–టెక్ స్టార్టప్‌లు దీనిని వ్యాపారాత్మకంగా వినియోగంలోకి తీసుకురావడానికి పైలట్ ప్రాజెక్ట్‌లను నిర్వహిస్తున్నాయి. లీఫ్ట్రానిక్స్ కేవలం ఒక కొత్త టెక్నాలజీ మాత్రమే కాదు, ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుండి మన భూమిని రక్షించే ఒక తిరుగులేని పరిష్కారం. ప్రకృతి ఇచ్చిన ఆకులతో భవిష్యత్ ఎలక్ట్రానిక్స్‌ను నిర్మించడం ద్వారా టెక్నాలజీ అంటే పర్యావరణాన్ని నాశనం చేయడం కాదు, దానితో కలిసి జీవించడమే అని ఈ సాంకేతికత నిరూపిస్తోంది. రాబోయే కాలంలో మనం వాడే గ్యాడ్జెట్స్ పర్యావరణానికి భారం కాకుండా, తిరిగి మట్టికి ప్రాణం పోసేలా మారనున్నాయనే అనుకోవాలి!- సాక్షి స్పెషల్ డెస్క్ఇవి కూడా చదవండి: కొబ్బరిచెట్టు కోసం కేసు.. ‘టీ తాగుతూ మాట్లాడుకోండి’ అన్న కోర్టు! -
కొబ్బరిచెట్టు కోసం కేసు.. ‘టీ తాగుతూ మాట్లాడుకోండి’ అన్న కోర్టు!
‘సొంత లాభము కొంత మానుకు పొరుగువానికి తోడుపడవోయ్’ అన్నారు మహాకవి గురజాడ. కానీ కేరళలో ఓ వ్యక్తి ‘పక్కవాని కొబ్బరిచెట్టు పెకలించేదాక నిదురపోనోయ్’ అన్నట్టు కంకణం కట్టుకున్నాడు. పంచాయతీ నుంచి హైకోర్టు దాకా కేసులు పెట్టాడు. కల్పవృక్షంగా ఉండాల్సిన కొబ్బరిచెట్టు కలహాల చెట్టుగా ఎందుకు మారింది? కేసుల వరకు వెళ్లడానికి కారణం ఏంటి? ఈ కేసులో హైకోర్టు తీర్పు ఎందుకు ఆసక్తికరంగా మారిందనేదే ఈ వారం ‘లీగలాటా’...కేరళలోని తిరువనంతపురం జిల్లాలోని కారేకులం గ్రామంలో గోపీనాథ్, రంజిత్ పక్క పక్క ఇళ్లల్లో నివసిస్తున్నారు. ఇద్దరి ఇళ్లకు సరిహద్దుగా ఉన్న గోడకు ఆనుకుని రంజిత్ స్థలంలో ఓ కొబ్బరి చెట్టు ఉంది. ఆ చెట్టు తన ఇంటివైపునకు వాలి ఉందని, అది కూలి ఇంటిపై పడితే పాడవుతుందని గోపీనాథ్ ఫిర్యాదు. కొబ్బరి ఆకులు, కాయలు పడి తన రెండు కార్లు దెబ్బతినే అవకాశం ఉందని అతని వాదన.తన సమస్యను వివరిస్తూ పంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. అది పడిపోయే స్థితిలో ఉంటే తప్ప పంచాయతీరాజ్ చట్టం ప్రకారం తాము ఎలాంటి చర్యలు తీసుకోలేమని పంచాయతీ అధికారులు చెప్పారు. దీంతో రెవెన్యూ అధికారులకు, తర్వాత స్థానిక సంస్థలకు చెందిన అంబుడ్స్‌మెన్‌కు సైతం ఫిర్యాదు చేశాడు. వారు సూచించిన పరిష్కారాలతో సంతృప్తి చెందని గోపీనాథ్ చివరకు హైకోర్టును ఆశ్రయించాడు.చెట్టు పరిశీలనకు రూ. లక్షకొబ్బరిచెట్టుపై ఉన్న అభ్యంతరాలు, ఆందోళనలను పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. దీనిపై సమగ్ర పరిశీలనకు కోర్టు కమిషనర్‌ను నియమించాలని అభ్యర్థించాడు. ఖర్చులను భరిస్తే నియమిస్తామని కోర్టు చెప్పడంతో అంగీకరించారు. కోర్టు కమిషనర్ ఫీజును రూ. లక్షగా నిర్ణయించి చెల్లించాలని ఆదేశించింది. పిటిషనర్ ఆ మొత్తాన్ని చెల్లించారు.ఆ సెక్షన్ వర్తించదుకొబ్బరి చెట్టు ఉన్న ప్రాంతాన్ని కోర్టు కమిషనర్ పరిశీలించారు. చెట్టు బలమైన వేళ్లతో ఉందని వెంటనే పడిపోయే ప్రమాదం లేదని తేల్చారు. చెట్టు పడిపోకుండా ఇప్పటికే ఇనుప తీగతో కట్టి ఉంచారని, కొబ్బరికాయలు, ఆకులు పక్కస్థలంలో పడకుండా నెట్ కూడా ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. రక్షణ వలను మరింత వెడల్పు చేసి, క్రమం తప్పకుండా శుభ్రం చేస్తే సరిపోతుందని తన నివేదికలో పేర్కొన్నారు. కమిషనర్ నివేదికతోనూ పిటిషనర్ సంతృప్తి చెందలేదు.కేరళ పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 238 కింద చర్యలు తీసుకోవాలని అభ్యర్థించాడు. ఈ సెక్షన్ ప్రకారం చెట్టు కొమ్మలు లేదా చెట్టు కూలిపోయి వ్యక్తులు, భవనాలు, పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పంచాయతీ, అంబుడ్స్‌మెన్, కోర్టు కమిషనర్ నివేదికలన్నీ ఆ చెట్టు వల్ల ప్రస్తుతానికి ఎలాంటి నష్టం జరిగే అవకాశం లేదని తేల్చాయి. అందువల్ల ఈ సెక్షన్ కింద చర్యలు తీసుకోలేమని కోర్టు తేల్చింది.విలక్షణ తీర్పుపొరుగింటి వారితో ఉన్న చిన్న సమస్య పట్టుదల, అహంకారాల కారణంగా న్యాయవివాదంగా మారిందని కోర్టు వ్యాఖ్యానించింది. ‘ఈ కొబ్బరిచెట్టుకే గనుక నవ్వే శక్తి ఉంటే, ఇద్దరు పొరుగువారు తన కోసం కొట్టుకోవడం చూసి అది నవ్వుకునేదేమో!’ అని న్యాయమూర్తి చమత్కరించారు. ఇంత చిన్న సమస్యకు కోర్టు సమయాన్ని వృథా చేశారని ఇప్పటికే సివిల్, క్రిమినల్ కేసుల పెండింగ్ భారం కోర్టులపై ఉందని జడ్జి అసహనం వ్యక్తం చేశారు.‘పొరుగు వానిని నీలాగే ప్రేమించు’ అనే వాక్యాన్ని ప్రస్తావిస్తూ, ఇద్దరూ కలిసి టీ లేదా కాఫీ తాగుతూ కూర్చుని చర్చించుకుని ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. హైకోర్టు ఈ పిటిషన్లో జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదని తేల్చారు. భవిష్యత్తులో నిజమైన ప్రమాదం ఏర్పడితే పంచాయతీ జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని సూచించారు. ‘విలువైన కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు ఇద్దరి నుంచి ఖర్చులు వసూలు చేయవచ్చు కానీ, కోర్టు ఉదారంగా వ్యవహరించి ఆ చర్యలు తీసుకోవడం లేదు’ అంటూ పిటిషన్‌ను కొట్టేశారు.- దిలీప్ మాదిరెడ్డిఇవీ చదవండి: ఒకే ఊరు.. కొందరికే వినిపించే వింత శబ్దం! అసలు రహస్యం ఏంటి? -
ఇంద్రపదవి అడిగిన రజి.. దేవతలు చెప్పిన మాటతో కథే మారిపోయింది!
పురూరవుడి కొడుకు ఆయువుకు నహుషుడు, క్షుత్రవృద్ధుడు, రంభుడు తర్వాత మహా బలసంపన్నుడైన రజి అనే కొడుకు కలిగాడు. రజికి ఐదువందల మంది కొడుకులు కలిగారు. రజి తన రాజ్యాన్ని వైభవోపేతంగా పరిపాలిస్తున్న సమయంలో దేవ దానవుల నడుమ భీకర సంగ్రామం జరిగింది. రోజులు గడుస్తున్న కొద్ది పోరు మరింత ఘోరంగా పరిణమిస్తోందే తప్ప, జయాపజయాలు ఎటూ తేలడం లేదు. ఎటూ తోచక ఉభయపక్షాలవారు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి, ‘బ్రహ్మదేవా! ఈ పోరులో అంతిమ విజయం ఎవరికి దక్కుతుందో నువ్వే చెప్పాలి’ అని అడిగారు.అప్పుడు బ్రహ్మదేవుడు, ‘నాయనలారా! రజి మహారాజు మీలో ఎవరి పక్షం వహిస్తే, పోరులో విజయం వారినే వరిస్తుంది’ అని చెప్పాడు.వెంటనే మొదట దానవులు రజి మహారాజు వద్దకు వెళ్లారు. రజి వారిని సాదరంగా ఆహ్వానించి, వచ్చిన పనేమిటో చెప్పమన్నాడు.‘మహారాజా! మాకు, దేవతలకు సంగ్రామం జరుగుతోంది. నువ్వు మా పక్షాన యుద్ధంలో పాల్గొనాలని మా కోరిక’ అని చెప్పారు దానవులు.‘మీ తరఫున యుద్ధం చేయాలంటే, నాదొక్కటే షరతు. యుద్ధం ముగిశాక నాకు ఇంద్రపదవి ఇస్తామని మాట ఇవ్వండి’ అన్నాడు రజి మహారాజు.దానవులు తమలో తాము తర్జన భర్జనలు పడి, ‘రాజా! ఇప్పుడు మాట ఇచ్చి, తర్వాత కాదనడం ధర్మం కాదు. అంత్య నిష్ఠురం కంటే ఆది నిష్ఠురమే మంచిది. మా లోకానికి రాజు ప్రహ్లాదుడు. ఆయనకు ఇంద్ర పదవి దక్కాలనే మేమంతా దేవతలతో యుద్ధానికి సిద్ధపడ్డాం. కాబట్టి నీకు ఇంద్రపదవిని ఇవ్వలేము. మరింకేదైనా కోరుకుంటే తప్పక ఇస్తాము’ అని చెప్పారు.‘ఇంద్ర పదవి తప్ప మరేదీ నాకు సమ్మతం కాదు’ తెగేసి చెప్పాడు రజి మహారాజు.చేసేది లేక దానవులు వెళ్లిపోయారు.దానవులు వెళ్లిపోయిన కొద్దసేపటికే దేవతలందరూ రజి మహారాజు వద్దకు వచ్చారు. యుద్ధంలో తమ పక్షాన పాల్గొనాలని అభ్యర్థించారు.దానవులతో చెప్పినట్లే, ‘యుద్ధం ముగిశాక నాకు ఇంద్ర పదవి ఇవ్వడానికి అంగీకరిస్తేనే మీ తరఫున యుద్ధంలో పాల్గొంటాను’ అని కరాఖండిగా చెప్పాడు.దేవతలు ఎక్కువగా ఆలోచించకుండా, రజి మహారాజు షరతుకు తమ సమ్మతి తెలిపారు.రజి మహారాజు తన సేనలను వెంటబెట్టుకుని దేవతల తరఫున యుద్ధంలో పాల్గొన్నాడు. యుద్ధరంగంలో వీరవిహారం చేస్తూ, శత్రువులు కని విని ఎరుగని దివ్యాస్త్రాలను ప్రయోగించాడు. అనాయాసంగానే అశేష దానవ వాహినిని పరాజితులను చేశాడు. అతడి అస్త్రాల ధాటికి మరణించిన వారు మరణించగా, మిగిలిన దానవులు పలాయనం చిత్తగించారు. రజి మహారాజు సాయంతో దేవతలు విజేతలయ్యారు.యుద్ధం ముగిశాక దేవేంద్రుడు రజి మహారాజు పాదాల ముందు మోకరిల్లి, ‘మహానుభావా! ఆర్తుడనైన నాకు అభయప్రదానం చేసి, స్వర్గలోకాన్ని కాపాడావు. అభయప్రదాతవు గనుక నువ్వు నాకు సాక్షాత్తు పితృసమానుడవు. ముల్లోకాలకూ ఆరాధ్యుడవైన పురుషోత్తముడవు నువ్వు. నన్ను నీ పుత్రుడిగా స్వీకరించు’ అని ప్రార్థించాడు.దేవేంద్రుడి ప్రణుతి వాక్యాలలోని అంతరార్థాన్ని గ్రహించిన రజి మహారాజు చిరునవ్వు చిందించాడు. ‘శరణు కోరినవాడు పగవాడైనా తిరస్కరించడం వీరధర్మం కాదు. నర్మగర్భంగా, నయంగా మాట్లాడి నువ్వు నా మనసు చూరగొన్నావు. నీ మనోగతం నాకు అవగతమైంది. నీ స్వర్గాన్ని నీకు పునర్దత్తం చేస్తున్నాను’ అని పలికి, తనకు దేవతలు ఇచ్చిన ఇంద్రపదవిని తిరిగి దేవేంద్రుడికే కట్టబెట్టి, నిజ నివాసానికి బయలుదేరాడు.రజి మహారాజు తన నివాసానికి చేరుకునేలోగానే, నారద మహర్షి అతడి ఐదువందల మంది కొడుకులను రెచ్చగొట్టాడు. ‘మీ తండ్రికి ఇంద్రపదవి ఇస్తామని మాట ఇచ్చి, మాయోపాయంతో దేవేంద్రుడు తిరిగి ఆ పదవిని దక్కించుకున్నాడు’ అని నూరిపోశాడు.నారదుడి మాటలతో రెచ్చిపోయిన రజి మహారాజు కొడుకులు మూకుమ్మడిగా స్వర్గంపైకి దండయాత్రకు వెళ్లారు. తమ తండ్రి సాధించిన ఇంద్రపదవి వారసత్వ పరంపరగా తమకే దక్కాలంటూ ఇంద్రుడితో వాదించారు. అతడు కాదనడంతో, అతడిని సింహాసనం పైనుంచి ఈడ్చి పడేసి, స్వర్గం నుంచి తరిమి కొట్టి, స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు.పురావిశేషం..ఇది ఉత్తరప్రదేశ్‌లోని ప్రసిద్ధ శివాలయాలలో ఒకటి. ఈ ప్రదేశంలో 1844లో నేలను తవ్వుతుండగా, రాతి శివలింగం కనిపించింది. శివలింగాన్ని వెలికి తీసి, పూజలు జరిపిన స్థానికులు ఆలయాన్ని నిర్మించారు. సిపాయిల తిరుగుబాటు సమయంలో ఈ ఆలయ ప్రాంగణం సిపాయిల రహస్య సమావేశాలకు వేదికగా ఉండేది. నాటి సిపాయిల దళాన్ని ‘బ్లాక్ ప్లటూన్’గా ‘కాలీ పల్టన్’గా పిలుచుకునేవారు. ఏటా శ్రావణ మాసంలో కావడి యాత్రికులు ఇక్కడకు పెద్దసంఖ్యలో వస్తుంటారు. అప్పట్లో ఆలయం కొంత దెబ్బతింటే, 1968లో ఇప్పుడు ఉన్న విధంగా పునర్నిర్మంచారు.- సాంఖ్యాయనఇవి కూడా చదవండి: ఉగాండాలో మొదలైన బయింబా ఫెస్టివల్.. ప్రత్యేకతలేంటో తెలుసా? -
ఉగాండాలో మొదలైన బయింబా ఫెస్టివల్.. ప్రత్యేకతలేంటో తెలుసా?
ఉగాండా అంటే ప్రకృతి అందాలు, వన్యప్రాణులు మాత్రమే కాదు.. వైవిధ్యమైన సంగీతం, కళలు, సంప్రదాయాలతో కళకళలాడే దేశం కూడా. ఆ దేశంలోని సాంస్కృతిక, సృజనాత్మక ప్రపంచాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రముఖ వేడుక బయింబా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ ది ఆర్ట్స్. ఆగస్టు 28న మొదలైన ఈ వేడుకలు 30న ముగుస్తున్నాయి. ఈ ఫెస్టివల్లో సంగీత నాటక నృత్యాలు సహా పలు దృశ్య కళల ప్రదర్శనలు జరుగుతాయి.ఉగాండా సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటాలనే లక్ష్యంతో 2006లో బయింబా ఫౌండేషన్ ప్రారంభమైంది. ఈ ఫౌండేషన్ 2008లో తొలిసారిగా బయింబా ఫెస్టివల్ నిర్వహించింది. అప్పటి నుంచి ఏటా క్రమం తప్పకుండా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోంది. ఈ ఉత్సవం తూర్పు ఆఫ్రికాలోని ప్రముఖ బహుళ కళా ఉత్సవాల్లో ఒకటిగా ఎదిగింది. లంకులు ఐలండ్ వేదికగా ఈ ఉత్సవాన్ని మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. ఉగాండా సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడమే ఈ బయింబా ఫెస్టివల్ ప్రధాన లక్ష్యం.అంతేకాకుండా సృజనాత్మక రంగానికి దీర్ఘకాలిక మౌలిక సదుపాయాలు, కళావిద్య, కళాకారుల అభివృద్ధి, సాంస్కృతిక వ్యాపార అవకాశాలను పెంచడం కూడా దాని కార్యక్రమాల్లో భాగం. ఉగాండా ఆర్థికాభివృద్ధిలో కూడా ఈ ఉత్సవం తోడ్పడుతుంది. బయింబా ఫెస్టివల్‌కు ఉన్న ప్రత్యేకతల్లో అంతర్జాతీయ భాగస్వామ్యాలు ఒకటి. వివిధ దేశాలు, విభిన్న సాంస్కృతిక నేపథ్యాలకు చెందిన కళాకారులు, సంగీతకారులు, ప్రదర్శనకారులు ఇక్కడ కలుసుకుంటారు. వారంతా తమ తమ అనుభవాలను పంచుకుంటారు.ఈ బయింబా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ ది ఆర్ట్స్– కళాభిమానులకు, పర్యాటకులకు, ప్రపంచ సంస్కృతులను తెలుసుకోవాలనుకునే వారికి ఒక ప్రత్యేక అనుభవంగా నిలుస్తుంది. ఈ ఫెస్టివల్ కోసం ఈ ఏడాది బయింబా అంతర్జాతీయ కళాకారుల నుంచి కూడా దరఖాస్తులు ఆహ్వానించింది. సంగీతం, నృత్యం, సినిమా, ఫ్యాషన్, ఫోటోగ్రఫీ, స్టోరీ టెల్లింగ్, థియేటర్ తదితర విభాగాలకు చెందిన కళాకారులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.ఇవి చదవండి: ఒకే ఊరు.. కొందరికే వినిపించే వింత శబ్దం! అసలు రహస్యం ఏంటి? -
'చనిపోవడానికి అనుమతించండి’.. కలెక్టర్‌కు ఓ తండ్రి రాసిన లేఖ!
‘ఓ పెద్దాయనా.. పెద్ద సారు రావడానికి చాలా టైం పడుతుంది. పోయి రేపు రా’ అన్న అటెండర్ మాటలతో ఆయన ఆ లోకంలోకి వచ్చాడు. వయసు 70 పైబడి ఉంటాయి.. ముఖంలో వయసు తాలూకు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నెరిసిన జుట్టు, కళ్లజోడు, పెద్ద గళ్ల చొక్కా, పాతకాలపు ప్యాంటు, భుజాన గుడ్డ సంచి.. అందులో కొన్ని పేపర్లు, సుగర్, బీపీ ట్యాబ్లెట్లు.. నడిచినప్పుడు పట్టు తప్పకుండా ఉండేందుకు ఊతకర్ర. ఇవే ఆయన ఆస్తి.‘వస్తావ్.. వెళతావ్.. ఏనాడైనా టీ తాగమని పది రూపాయలైనా ఇచ్చావా? పైసల్లేకుండా పని ఎలా అవుతుందనుకుంటున్నావ్’ అన్న అటెండర్ మాటలకు ఓ నిట్టూర్పు విడిచాడు. ఒకప్పుడు ఎంతోమందికి సాయం చేసిన ఈ చేయి ప్రస్తుతం అదే సాయం కోసం దీనంగా అర్ధించే స్థితిలో ఉండటం చూసుకుని నిర్వేదం ఆవహించింది. కలెక్టర్ ఆఫీసులోని ఆ పాత గోడ గడియారం రెండు గంటల సమయాన్ని సూచిస్తోంది. ఇక చేసేదేమీ లేక భారంగా పైకి లేచి అంతే భారంగా అడుగులు బయటకు వేశాడు.ఆయన పేరు రాఘవరావు. తహశీల్దార్ ఆఫీసులో క్లర్క్‌గా పని చేసి రిటైర్ అయ్యాడు. ఓ కూతురు, ఇద్దరు కొడుకుల బాధ్యతలు అన్నీ నెరవేర్చాడు. భార్య ఉన్నంత కాలం ఆయన జీవితం బానే గడిచింది. కానీ బ్లడ్ కేన్సర్ ఆమె ప్రాణాలను బలి తీసుకుంది. తన సహ ధర్మచారిణిని కాపాడుకుందామని రాఘవరావు ఎంతగా తపించినా, బ్లడ్ కేన్సర్ ముందు ఓడిపోయాడు. ఆమె కాలం చేసినప్పటి నుంచి అందరూ ఉన్న అనాథయ్యాడు. ఎప్పుడో ఓసారి కూతురు నుంచి వచ్చే ఫోన్ పలకరింపు తప్ప ఇతర బంధాలేవీ ఆయన దరిదాపుల్లో లేవు.ఇద్దరు కొడుకులు ఉన్నా తండ్రిని పట్టించుకునే తీరిక, పట్టించుకోవాలనే బాధ్యత లేనట్టుగా ఎవరి పనుల్లో వారు ఉండిపోయారు. దీంతో ఆయన జీవితంలాగే రోజులు కూడా చాలా భారంగా గడుస్తున్నాయి. నెలనెలా వచ్చే కాసిని పింఛను డబ్బులతోనే కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇంట్లో తినీ తినక అలా జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు.కలెక్టరాఫీసు నుంచి బయటకు వచ్చిన రాఘవరావు.. కాస్త అలసటగా అనిపించి ఓ టీ కొట్టు దగ్గర ఆగి టీ తాగాడు. జేబులో నుంచి రూ.20 నోటు తీసి ఇచ్చి వెళ్లబోయాడు. రాఘవరావులాగే చాలా ముడతలు పడి మాసిపోయి, చిరిగి ఉన్న నోటు వంక టీకొట్టు యజమాని తేరిపార చూసి, ‘ఈ నోటు మారదు మరొకటి ఇవ్వండి’ అంటూ వెనక్కి ఇచ్చాడు.జేబు మొత్తం వెతికి చిల్లరంతా తీసినా కూడా రెండు రూపాయలు తగ్గింది. టీకొట్టు యజమాని వాటిని తీసుకుని.. ‘డబ్బుల్లేకుండా టీ ఎందుకు తాగుతారు’ అంటూ గొణుక్కున్నాడు.రెండు రూపాయలు తగ్గాయని ఆ హోటల్ యజమాని ముఖం తిప్పుకునేసరికి రాఘవరావు మనసు చివుక్కుమంది. కళ్లలో వస్తున్న నీళ్లను బలవంతంగా అదిమి పెట్టుకుని రోడ్డు పైకి వచ్చాడు. జేబులో డబ్బుల్లేవు. ఇంటికి నడిచి వెళ్లేంత ఓపిక అసలే లేదు. ఓ వైపు ఎండ నిప్పులు చెరుగుతోంది. రోడ్డు తారు కరిగి కాళ్లను గుంజుతున్నట్లుంది.అప్పుడే ఆ రోడ్డుపై నుంచి పోలీస్ జీపు వస్తోంది. అందులో ఉన్న ఎస్సైని రాఘవరావు గుర్తుపట్టారు. ఆయన ఉండేది తమ కాలనీలోనే.. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆ ఎస్సైకి తెలిసిన వాళ్ల ఫైల్ ఒకదానిని త్వరగా పరిష్కరించి సహాయం చేసిన సంగతి గుర్తొచ్చింది. దీంతో లిఫ్ట్ ఇస్తారేమో ఆశతో.. ‘సార్.. కాస్త ఇంటి వరకు లిఫ్ట్ ఇస్తారా?’ అని చేయి ఊపాడు. కానీ ఆ ఎస్సై కనీసం జీపు ఆపలేదు సరికదా, కళ్లద్దాల వెనుక నుంచి ఒక చులకన భావంతో చూస్తూ స్పీడుగా వెళ్లిపోయాడు. జీపు వెదజల్లిన ధూళి రాఘవరావు కళ్లల్లో పడింది. అయితే, ఆ బాధ కంటే ఆ ఎస్సై చూసిన చూపు తీవ్రమైన బాధ కలిగించింది.అలా అతికష్టమ్మీద నాలుగడుగులు వేశాడు. ఓ వైపు ఎండ తీవ్రత పెరిగిపోతోంది. వయసు సహకరించడం లేదు. గొంతు ఎండిపోతోంది. శ్వాస భారమైంది. కంటి చూపు మసకబారుతోంది. రోడ్డు పక్కన ఎవరైనా నీళ్లు ఇస్తారేమోనని చూశాడు. కానీ ఎవరి బిజీలో వాళ్లున్నారు. ఆ నడిరోడ్డుపైనే ఆయన కాళ్లు తడబడ్డాయి. చేతిలోని ఊతకర్ర జారిపోయింది. భుజాన ఉన్న గుడ్డ సంచితో సహా రాఘవరావు అక్కడే రోడ్డుపై కుప్పకూలిపోయాడు. ఆ మసకబారుతున్న చూపుల వెనుక.. ఆయన జీవితం మొత్తం సినిమా రీలులా గిర్రున తిరిగింది.తహశీల్దార్ ఆఫీసులో రోజంతా ఫైళ్లతో నడుము విరగ్గొట్టుకుని పనిచేసి, సాయంత్రం కాగానే విశ్రాంతి ఎరుగకుండా మరొక చిన్న ఉద్యోగం కోసం పరుగెత్తిన రోజులు గుర్తొచ్చాయి. ‘పిల్లలకు లోటు రాకూడదు.. వాళ్ల చదువులు ఆగకూడదు.. రేపు వాళ్లు గొప్ప స్థాయికి వెళ్లాలి’ అనే తపనతో ఎంత కష్టపడ్డాడో సగం తెరిచిన కళ్లలో కదలాడింది.సాయంత్రాలు టీ కొట్టు దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకునే స్నేహితులు గుర్తొచ్చారు. ‘రారా రాఘవా.. కాసేపు కూర్చో’ అని పిలిచినా, ‘లేదురా.. అర్జెంట్ పని ఉంది’ అంటూ నవ్వుతూ దాటవేసిన క్షణాలు కళ్లముందు కదిలాయి. రూపాయి రూపాయి కూడబెట్టే ఆ తాపత్రయంలో ఏనాడూ తనకోసం, తన సంతోషం కోసం ఆయన బతకలేదు. పిల్లలే ముఖ్యమనుకుని, వారి కోసమే జీవితం మొత్తం అంకితమయ్యాడు. రోజులు గడిచేకొద్దీ ఆత్మీయులు, స్నేహితులు ఒక్కరొక్కరుగా దూరమయ్యారు. ఆనాడు పిల్లల భవిష్యత్తు కోసం స్నేహాన్ని, సరదాలను త్యాగం చేస్తే, ఈనాడు కనీసం ‘బాగున్నావా’ అని పలకరించడానికి ఒక్క స్నేహితుడు కూడా లేని నిశ్శబ్దం మిగిలింది.కొడుకులు, కూతురు చిన్నతనంలో తన భుజాలెక్కి ఆడుకున్న రోజులు కనిపించాయి. ‘నాన్నే నా హీరో’ అన్న పెద్దోడి మాటలు చెవుల్లో రింగుమన్నాయి. ‘నాన్నా! నేను పెద్దయ్యాక నిన్ను మహారాజులా చూసుకుంటా’ అన్న చిన్నోడి మాటలు ఇంకా మరచిపోలేదు. వారి ముద్దుముద్దు మాటలకు ఎంతో మురిసిపోయిన రాఘవరావు– రెక్కలు ముక్కలు చేసుకుని వారిని ప్రయోజకులను చేశాడు. కానీ వారు మాత్రం పెద్దయి, పెళ్లిళ్లు చేసుకున్నాక కన్న తండ్రిని పూర్తిగా పక్కన పెట్టేశారు.‘ఇలా రెండు ఉద్యోగాలు చేస్తూ సరిగా తిండి కూడా తినకపోతే మీ ఆరోగ్యం ఏం కావాలి’ అంటూ ప్రేమతో కోప్పడే భార్య గుర్తొచ్చింది. ‘నేను పడ్డ కష్టాలు నా పిల్లలు పడకూడదు. అందుకే వారికి ఏ లోటూ రాకూడదని ఇంత కష్టపడుతున్నా. రేపు వాళ్లు పెద్దయ్యాక మన ఇద్దరినీ నెత్తిమీద పెట్టుకుని చూసుకుంటారు’ అంటూ భార్యతో అన్న మాటలు గుర్తొచ్చి, ఆయన కళ్లల్లో నుంచి చివరి కన్నీటి చుక్క చెంపల మీదుగా జారి రోడ్డుపై పడి ఆ వేడికి ఆవిరైపోయింది.మరుక్షణం తన తండ్రి వెంకటరామయ్య గుర్తొచ్చారు. ఆయన అవసాన దశలో తాను సరిగా చూసుకోని సంగతులు లీలగా మెదిలాయి. ‘ఒరేయ్.. రాఘవా? ఈ మధ్య అస్సలు నువ్వు నాతో మాట్లాడటంలేదురా.. ఏం అడిగినా బిజీ, టైం లేదు అంటున్నావ్. కళ్ల ముందే మీరంతా ఉన్నా ఒంటరితనం బాధిస్తోందిరా. చేవలేని ఈ ముదిమి వయసులో చేతికర్రలా ఉండాల్సిన నువ్వు.. కనీసం నా ముఖం కూడా చూడటంలేదనే బాధ నా గుండెను పిండేస్తోంది. ఈ వయసులో మాకు కావాల్సింది ఆస్తులు, అంతస్తులు కాదురా.. నాన్నా ఎలా ఉన్నావు అనే ఆత్మీయమైన పిలుపు. మీ అనురాగాలు మాత్రమే. మీ అమ్మ అదృష్టవంతురాలు.. నా కంటే ముందే వెళ్లిపోయింది.ఇంకా ఈ కట్టె ఎన్నిరోజులు ఇలా ఉండాలో’ అంటూ మథనపడిన సంగతి గుర్తొచ్చింది. ఇక కన్నీటి చుక్కలు రావడానికి ఆయన ఒంట్లో నీళ్లు కూడా లేవు. ఆ వయసులో తన తండ్రి అనుభవించిన బాధే ఇప్పుడు తాను అనుభవిస్తున్నా అని అర్థమైంది. కర్మ సిద్ధాంతాన్ని నమ్మే తాను.. ఎందుకు ఇలా చేశానా అనే పశ్చాత్తాపం మూసుకుపోతున్న కళ్లల్లో కనిపించింది. బలవంతంగా కళ్లు తెరిచి ఆకాశంలో ఎక్కడో ఒకచోట ఉండే తండ్రికి క్షమాపణ చెప్పాలని రాఘవరావు చేసిన ప్రయత్నం నెరవేరలేదు. ఆ కళ్లు అలా నెమ్మదిగా మూతపడ్డాయి.త్యాగానికి నిర్వచనమైన ఓ సగటు తండ్రి ఆఖరి శ్వాస అనంత వాయువుల్లో కలిసిపోయింది.క్షణాల మీద అక్కడ జనం చేరారు. ‘అయ్యో.. ఎవరో పెద్దాయన పాపం శోష వచ్చి పడిపోయినట్టున్నాడు. పక్కన కూర్చోబెట్టి నీళ్లివ్వండి’ అని గుంపులో ఎవరో అన్నారు. ‘వడదెబ్బ తగిలినట్టుంది.. అంబులెన్స్‌కు ఫోన్ చేయాలి’ అని మరొకరు.. ఇలా మాటలు చెబుతున్నారే తప్ప ఎవరూ ముందుకు రావడంలేదు.ఇంతలో ఆ గుంపులోకి ఒక జేబుదొంగ చొరబడ్డాడు. ఓ పెద్దాయన లాల్చీ జేబులో నుంచి పర్సు కొట్టేశాడు. ఈ రోజు నా అదృష్టం బాగుంది అనుకుంటూ.. ఇంకా ఎవరి దగ్గరైనా కొట్టేసే అవకాశం ఉందా అని పరిశీలిస్తున్నాడు. అప్పుడే ఆ టీకొట్టు యజమాని అక్కడ జనాన్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. రాఘవరావు ముఖం చూడగానే షాక్ అయ్యాడు. ‘అయ్యో.. ఇందాకే నా కొట్టు దగ్గర టీ తాగాడు. రెండు రూపాయలు తక్కువయ్యాయని కాస్త గింజుకున్నాను. ఆ చిల్లరంతా నేను తీసుకోకుండా ఉంటే బస్సు ఎక్కి ఇంటికి వెళ్లేవాడేమో..’ అన్న భావన అతని గుండెను పిండేసింది.అప్పుడే అటుగా వెళ్తున్న ఎస్సై జీపు జనాలను చూసి ఆగింది. కాసేపటి క్రితం లిఫ్ట్ ఇవ్వకుండా వెళ్లిన అదే ఎస్సై జీపు దిగి గంభీరంగా జనాన్ని తోసుకుంటూ వచ్చాడు. రాఘవరావు శవాన్ని చూసి, ‘అరే.. ఇందాక లిఫ్ట్ అడిగింది ఈయనే కదా? ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే చనిపోయేవాడు కాదేమో’ అని మనసులో ఉలిక్కిపడ్డాడు.సరిగ్గా అదే సమయానికి సైరన్ మోగుతూ కలెక్టర్ కారు వచ్చి ఆగింది. రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అవ్వడంతో కలెక్టర్ స్వయంగా కారు దిగి వచ్చారు. జనమంతా పక్కకు తప్పుకున్నారు. రాఘవరావు అచేతనంగా పడి ఉండటాన్ని చూశారు. పక్కనే పడి ఉన్న గుడ్డసంచి, అందులోంచి రోడ్డుపై పడిన కాగితాలు కలెక్టర్ దృష్టిని ఆకర్షించాయి. ఒక తెల్లటి కాగితంపై పెద్ద అక్షరాలతో ‘అర్జీ’ అని రాసి ఉంది.కలెక్టర్ వంగి ఆ కాగితాన్ని చేతిలోకి తీసుకుని చదవడం ప్రారంభించారు:గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి...అయ్యా,నా పేరు రాఘవరావు. రిటైర్డ్ క్లర్క్.ఒకప్పుడు నా సంతకం పడితే కానీ ఆఫీసుల్లో ఫైళ్లు ముందడుగు వేసేవి కావు. కానీ ఇప్పుడు అడుగు తీసి అడుగు వేయలేని స్థితికి వచ్చేశాను. రెక్కలు ముక్కలు చేసుకుని, తినీ తినక పిల్లల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేశాను. సంపాదించినదంతా వారి కోసమే ఖర్చు చేశాను. కానీ వారికి రెక్కలొచ్చాక తల్లిదండ్రులనే భావన కూడా వారికి లేకుండా పోయి అనాథల్లా వదిలేశారు.నా భార్య కాలం చేశాక, ఆకలి కంటే ఈ ఒంటరితనమే నన్ను రోజురోజుకూ నమిలి మింగేస్తోంది. ఎంతో ఆశగా పెంచి పెద్ద చేసిన నా పిల్లల ఇళ్లలోనే కాదు.. వారి మనసులో కూడా నాకు చోటు లేదు. వారి సమయాన్ని, ప్రేమను కొనుక్కోవడానికి నా దగ్గర ధనం లేదు.నేను బతికి ఉన్న ప్రతి క్షణం వారికి భారంగా మారింది. నా పింఛను డబ్బులు నా పొట్ట నింపగలవేమో కానీ, నా మనసు పడే ఆక్రందనను ఆపలేకపోతున్నాయి. రోజంతా ఖాళీ గోడల వైపు చూస్తూ బతుకును భారంగా ఈడుస్తున్నాను. ఏనాడైనా ఎవరో ఒకరు నా తలుపు తట్టి ’బాగున్నావా నాన్నా’ అని అడగరా అని ఎదురుచూసి చూసి అలసిపోయాను.అందరికీ బరువుగా ఉన్న ఈ జీవితం నాకు అంతకుమించిన భారంగా అనిపిస్తోంది. చావలేక బతుకుతున్న నేను.. ఇలా బాధలు పడుతూ చస్తూ బతకడం కంటే చనిపోవడమే మేలు అని నిర్ణయానికి వచ్చాను. ప్రభుత్వ ఉద్యోగంలో అడుగు పెట్టినప్పటి నుంచి చట్టాన్ని గౌరవిస్తూ.. ఒక్క తప్పు పని కూడా చేయలేదు. ఆత్మహత్య చేసుకోవడం నేరమని తెలుసు. అందుకే ఆ తప్పు కూడా చేయకూడదనే భావనతో ఈ అర్జీ పెట్టుకుంటున్నాను.అక్కడి వరకు చదివిన కలెక్టర్‌కు ఆపై అక్షరాలు కాస్త మసకబారినట్టు అనిపించాయి. కళ్లజోడు తీసి, కళ్లలో నుంచి ఉబికివస్తున్న నీళ్లను తుడుచుకుని.. మళ్లీ దానిని చదవడం ప్రారంభించారు.ఒక పౌరుడిగా, ఒక నిస్సహాయ తండ్రిగా, అంతకంటే బాధ్యతాయుతమైన మాజీ ప్రభుత్వ ఉద్యోగిగా మిమ్మల్ని అర్థిస్తున్నాను... నేను చనిపోవడానికి చట్టబద్ధమైన అనుమతి ప్రసాదించండి. కారుణ్య మరణం పొందడానికి వీలు కల్పించండి. ఈ వయసులో ఇంతకుమించి నేను ఏమీ అడగలేను. మీ అనుమతి కోసం.. ఆశగా ఎదురుచూస్తూ ఉంటాను.ఇట్లు,ఆకలితో కాదు.. అనురాగానికి అలమటించి చనిపోతున్న ఒక నిస్సహాయ తండ్రి రాఘవరావు.ఉత్తరం చదవడం ముగిసేసరికి కలెక్టర్ కళ్లల్లో నీళ్లు ఆగలేదు. కాసేపు అలాగే మౌనంగా ఉండిపోయారు. గాలికి కలెక్టర్ చేతిలోని కాగితం ఎగిరి అక్కడే ఉన్న 10 ఏళ్ల పిల్లాడిపై పడింది. అతడు దానిని తీసుకుని పైకి చదవడం ప్రారంభించాడు. అది పూర్తయ్యే సరికి అక్కడ నిశ్శబ్దమే రాజ్యమేలింది.మొదటగా టీకొట్టు యజమాని కళ్లు రాఘవరావు నెరసిన జుట్టు వైపు చూశాయి. అతనికి ఊళ్లో ఉన్న తన ముసలి తండ్రి గుర్తొచ్చాడు. ‘నా తండ్రి కూడా ఇలాగే ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నాడేమో? నేను డబ్బు సంపాదనలో పడి నాన్నను సరిగ్గా చూసుకోవడం లేదు’ అనిపించి అతని గుండె బరువెక్కింది. వెంటనే జేబులోంచి ఫోన్ తీసి, వస్తున్న కన్నీళ్లను ఆపుకొంటూ నాన్న నంబర్‌కు డయల్ చేశాడు.ఎస్సై ఆ అర్జీ వైపు, రాఘవరావు చేతికర్ర వైపు చూశాడు. అతని కళ్లముందు తను నిర్దాక్షిణ్యంగా జీపు పోనిచ్చిన దృశ్యం కదిలింది. ‘నన్ను పెంచి పెద్ద చేసి, పోలీస్ ఆఫీసర్‌ను చేసిన నా తండ్రి కూడా ఇవాళ ఊళ్లో ఒంటరిగా ఉంటున్నారు. నేను హోదా పెరిగాక బిజీబిజీ అంటూ ఆయనతో మాట్లాడటమే మానేశాను. ఇకపై నేను ఇలా ఉండకూడదు’ అని మనసులో అనుకుని.. వెంటనే జేబులోంచి ఫోన్ తీసి తండ్రికి కాల్ చేశాడు.ఇక దొంగ ఆ మందు బిళ్లల వైపు చూశాడు. అతడికి జబ్బుతో మంచాన పడ్డ తన తండ్రి గుర్తొచ్చాడు. ‘దొంగ సొమ్ము మంచిది కాదురా.. కష్టపడి పనిచేసి సంపాదించినదాంట్లో ఎంతో తృప్తి ఉంటుందని పదేపదే చెప్పే నాన్న మాటలు గుర్తుకొచ్చాయి. ఇక దొంగతనాలు ఆపేసి నాన్న చెప్పినట్టే చేయాలి’ అని కళ్ల నీళ్లు తుడుచుకున్నాడు. తాను కొట్టేసిన పర్సును మళ్లీ ఆ పెద్దాయన జేబులో పెట్టేసి గుండెల నిండా తృప్తితో ఇంటికి పరుగెత్తాడు. నాన్నతో మాట్లాడాలనే ఆరాటం అతడి కళ్లల్లో స్పష్టంగా కనిపించింది.చివరగా కలెక్టర్ ఆ అర్జీని పిల్లాడి దగ్గర నుంచి తీసుకుని తన డైరీలో భద్రపరచుకున్నారు. ఈ పెద్దాయన చావుకు కారణం ఎవరు? ఆస్తులన్నీ పంచుకుని గుప్పెడు అనురాగాన్ని కూడా పంచకుండా ఆయన్ను అనాథలా వదిలేసిన కన్నపిల్లలా? ఇలాంటి కొడుకులను సరిగా గాడిలో పెట్టలేకపోతున్న ఈ వ్యవస్థా? బంధాలు, అనుబంధాలను చాలా తేలికగా తీసుకుంటున్న నేటి తరం ఆలోచనలా? అని మథనపడ్డారు. ఇలాంటి పెద్దలను ఆదుకోవడానికి ఏదైనా చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు.అలాగే.. ఆ క్షణంలో తాను చేసిన తప్పేంటో గుర్తొచ్చి కుమిలిపోయారు. వెంటనే ఫోన్ తీసి.. ఓ నెంబర్ డయల్ చేశారు. అక్కడకు కొన్ని కిలోమీటర్ల దూరంలోని ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్న అవతల వ్యక్తి ఫోన్ తీయగానే.. కలెక్టర్ నోటి నుంచి వచ్చిన మాట.. ‘నాన్నా..’ఈలోగా అంబులెన్స్ వచ్చింది. కలెక్టర్‌తో పాటు ఎస్సై, టీకొట్టు యజమాని అంతా కలిసి రాఘవరావు భౌతికకాయాన్ని అందులోకి ఎక్కించారు. బతికుండగా ఎన్నో కష్టాలు అనుభవించిన రాఘవరావు.. ఇప్పుడు చలనం లేకుండా ప్రశాంతంగా నిద్రపోతున్నారు.అప్పుడు వెంకట రామయ్య... ఇప్పుడు రాఘవరావు.. రేపు రాఘవరావు కొడుకులు...!!- కొండ్రెడ్డి సత్యకిషోర్ఇవి కూడా చదవండి: దెయ్యమా? మనిషేనా? హాలోవీన్ హత్యలో ఊహించని ట్విస్ట్! -
తెల్ల జుట్టే మీ స్టయిల్..! అస్సలు తగ్గేదేలే..!!
‘స్టయిల్ గురించి నీకేం తెలుసు నాన్నా!’ అని చెప్పగానే, మైండ్‌లో పాత సోగ్గాడిని గుర్తుచేసుకోకండి! తలలో తెలుపు కనిపిస్తే, స్టయిల్‌కు రిటైర్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. గ్రే హెయిర్‌నే స్టేట్మెంట్గా మార్చి, సరికొత్త సాల్ట్ అండ్ పెప్పర్ స్టయిల్‌తో నాన్నలు కూడా కొడుకులతో పోటీ పడొచ్చు– ఇలా!రంగు దాచొద్దు!స్టయిల్‌గా కనిపించడానికి తెల్ల జుట్టును ప్రతిసారీ రంగు వేసి దాచాల్సిన అవసరం లేదు. చక్కగా ట్రిమ్ చేసి, సెట్ చేస్తే సాల్ట్ అండ్ పెప్పర్ హెయిర్ లుక్కే ప్రత్యేకమైన గాంభీర్యం వస్తుంది. ఇక్కడ గడ్డం కూడా గేమ్‌లోనే ఉంచండి. నీట్‌గా ట్రిమ్ చేసిన గడ్డం మొత్తం లుక్కు మరింత క్యారెక్టర్ ఇస్తుంది.షర్ట్‌లో కాస్త క్లాస్!లినెన్ , కాటన్ షర్ట్స్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్కు చాలా బాగా సెట్ అవుతాయి. వైట్, నేవీ, ఆలివ్, బీజ్, లైట్ బ్లూ వంటి క్లాసిక్ రంగులు ఎంచుకోండి. మరీ పెద్ద ప్రింట్లు, ఎక్కువ డిజైన్లకు బదులుగా సింపుల్ షర్ట్ ప్లస్ పర్ఫెక్ట్ ఫిట్‌పై దృష్టి పెట్టండి.జీన్స్.. జాగ్రత్తగా!లూజ్‌గా వేలాడే ప్యాంట్లకు బదులుగా జీన్స్ సెలక్ట్ చేసుకోండి. అయితే, జీన్స్ ఎంపికలో కాస్త జాగ్రత్త! మరీ టైట్‌గా లేదా రిప్డ్గా కాకుండా స్ట్రెయిట్ లేదా రిలాక్స్డ్ ఫిట్ జీన్స్ ఎంచుకోండి. డార్క్ జీన్స్ + లైట్ షర్ట్ + స్నీకర్స్ చాలు.. ఇక కొడుకుతో ఫ్యాషన్ పోటీ పెట్టుకోవడానికి!బ్లేజర్ వేస్తే... గేమ్ మారిపోతుంది!సింపుల్ షర్ట్‌పై బ్లేజర్ వేసుకుంటే ఒక్కసారిగా లుక్కు ప్రీమియం టచ్ వస్తుంది. అయితే, వీటికి నేవీ, చార్కోల్, బీజ్ వంటి రంగులు సేఫ్ అండ్ స్టయిలిష్. ఇక్కడ టై అవసరం లేదు... బ్లేజర్ వేసుకుని, చేతికి మంచి వాచ్ పెట్టుకుంటే చాలు.టీషర్ట్కి నో చెప్పొద్దు!టీషర్ట్ అంటే కుర్రాళ్లకే అనుకోవద్దు. సాలిడ్ కలర్ పోలో టీషర్ట్స్, కాలర్ టీషర్ట్స్ చాలా స్మార్ట్‌గా కనిపిస్తాయి.వైట్, నేవీ, బ్లాక్, గ్రే వంటి సింపుల్ రంగులు ఎంచుకుని చినోస్ లేదా డెనిమ్‌తో జత చేయండి.నాన్నల సీక్రెట్ వెపన్! యువత స్మార్ట్‌వాచ్‌ల వెంట పరుగెత్తినా... క్లాసిక్ వాచ్ ఇచ్చే హంగు వేరే! లెదర్ స్ట్రాప్ లేదా మెటల్ స్ట్రాప్‌తో ఉండే మంచి డయల్ వాచ్ ఎంచుకోండి. వాచ్ పెద్దదిగా ఉండాల్సిన అవసరం లేదు... క్లాస్‌గా ఉంటే చాలు!షూస్ కూడా మాట్లాడాలి!పాత షూస్నే ప్రతి డ్రెస్‌కు జత చేయడం మానేయండి. క్యాజువల్ లుక్కు క్లీన్ స్నీకర్స్, స్మార్ట్ క్యాజువల్కు లోఫర్స్, ఫార్మల్ లుక్కు క్లాసిక్ షూస్ ఎంచుకోండి. షూస్ శుభ్రంగా ఉంటే... సగం స్టయిల్ అక్కడే సెట్!సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ అంటే వయసు పెరిగింది అనే సంకేతం కాదు... ‘స్టయిల్లో కూడా అనుభవం ఉంది’ అనే స్టేట్మెంట్గా మార్చుకుంటే.. ట్రెండ్‌ను ఫాలో అయ్యే జెనరేషన్‌కు కూడా ట్రెండ్ క్లాస్ నేర్పించొచ్చు!- దీపిక కొండిఇవీ చదవండి: హైబ్రిడ్ మంచేనా? ముంచేనా? -
భార్య హత్యకు పుస్తకంలో ప్లాన్.. మరదలి ట్విస్ట్‌తో కథ రివర్స్!
బ్రిటీష్ లైబ్రరీలో నాకు ‘ఫన్నీ లైఫ్’ అనే పుస్తకం కనిపించింది. అట్టమీది దృశ్యాన్ని బట్టి అది నాన్ ఫిక్షన్ అని, ఓ సర్కస్ బఫూన్ ఆత్మకథని గ్రహించాను. లోపల అక్కడక్కడా చదివితే అది ఇటలీకి చెందిన బీద భర్త, తన సంపన్న భార్యతో పడక పడ్డ అవస్థలు ఉన్నాయి.ఆమె అతన్ని సరిగ్గా నా భార్య నన్ను చూసేట్లుగా చూస్తోందని కూడా కొన్ని పేజీలు చదివాక తెలుసుకున్నాను. పాపం అతను కూడా నాలా టంగ్ క్లీనర్ కొనడానికి కూడా ఆర్థికంగా భార్య మీద ఆధారపడ్డవాడే.ఓ చిన్న అధ్యాయంలో ఆ బఫూన్ భర్త తన భార్యని చంపే పథకం గురించి ఉంది. భార్య మరణిస్తే మొదటగా పోలీసులు అనుమానించేది భర్తనే. కాబట్టి పట్టుబడని విధంగా భార్యని చంపాలని అనుకున్నాడు. ఆ అధ్యాయంలో దాని గురించి వివరంగా రాశాడు. నేను దాన్ని శ్రద్ధగా చదివాను.ఆ బఫూన్ ఓ లైబ్రరీలో ‘యురోపియన్ పాయిజన్స్’ అనే పుస్తకంలో పోస్ట్‌మార్టంలో బయటపడని ఓ విషం గురించి చదివాడు. పద్దెనిమిదో శతాబ్దంలో వెనిస్ నగరానికి చెందిన ఓ ఇటాలియన్ జిప్సీ మంత్రగత్తె ఎవరూ కనుక్కోలేని విషాన్ని కనిపెట్టి, తమ ఊళ్ళోని భర్తలని చంపాలనుకునే భార్యలకి అమ్మేది. వారు దాన్ని వై¯Œ లో కలిపి తమ భర్తలకి ఇచ్చి చంపేవారు. దాని పేరు ‘వెనీషియన్ విషం.’ అలా ఆమె ఆ విషాన్ని నూటముప్ఫై ఏడుమంది ఇల్లాళ్ళకి అమ్మింది! వారిలో వెనిస్ బయటి ఊరువాళ్ళు కూడా ఉన్నారు. ఆవిడ జీవించి ఉండగా అది బయటకి రాకపోవడానికి కారణం, తమ భర్తని చంపడానికి తాము ఆవిడ నుంచి విషం కొన్నామని ఎవరు చెప్తారు? ఆ విషం గురించి వారంతా రహస్యంగా ఉంచారు. ఆ మంత్రగత్తె మరణానంతరమే ఇది బయటపడింది. ఆవిడ మనవరాలు తన అమ్మమ్మ రాసుకున్న డైరీలని చదివినప్పుడు అందులో ఈ ఉదంతం, ఏ తారీకున ఎవరికి, ఎంతకి ఆ విషాన్ని అమ్మిందో వివరాలు రాసి ఉన్నాయి.బఫూన్ భర్తకి ఆ వివరాలు దొరకడంతో ఆ విషాన్ని తయారుచేసి తన భార్యని చంపాడు. ఆ విషం తయారీ పద్ధతి గురించి కూడా రాశాడు. తేలు విషం, మండ్రగబ్బ మాంసం, కరక్కాయ, తెల్ల ఉమ్మెత్త మొదలైనవి వాడాలి. నేనా పేజీని ఫొటో తీసుకున్నాను. దాన్ని శుభం దాకా జాగ్రత్తగా చదివాను. డాక్టర్స్ ఆ విషం గురించి పరిశోధన చేసి, అది పోస్ట్‌మార్టంలో కనుక్కోలేమని నిర్ధారించారని ఆ పుస్తకం చివర్లోని ఎపిలాగ్లో రాశారు. భార్య అనుమానాస్పదంగా మరణిస్తే పోలీసులు ముందుగా అనుమానించేది భర్తనే అని చెప్పాను కదా. అది చాలా క్రైమ్ నవలల్లో చదివాను. అదే నన్ను ఇంతకాలం ఆపింది. ఇప్పుడు నాకో దారి దొరకడంతో ఆ పుస్తకాన్ని యథాస్థానంలో ఉంచి ఆనందంగా బయటకి నడిచాను.∙∙ నేను ఆ వస్తువులన్నీ ఒకే షాప్‌లో, ఒకే రోజు, ఒకే ఊళ్ళో కొనలేదు. ఆ పుస్తకం రాసిన బఫూ¯Œ లా అనేక ఊళ్ళల్లోని అనేక షాపుల్లో కొన్నాను. వాటిని ఇంట్లో మా ఆవిడ చూడని రహస్య ప్రదేశంలో దాచాను. వంటగదిలోని పై షెల్ఫ్‌లో. ఆ షెల్ఫ్‌పై అర నేల నుంచి ఏడు అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడ ఉన్నవి తీయాలంటే ఐదడుగుల అంగుళం ఎత్తుండే మా ఆవిడ నా మీదే ఆధారపడుతుంది. మా మధ్య ఎత్తులోని అడుగుకి నేను కాంప్రమైజ్ అవడానికి కారణం ఆమె సంపదే.అన్నీ సేకరించాక నేను ఫొటో తీసుకున్న పేజీలోని రెసిపీ ప్రకారం సరైన పాళ్ళల్లో, సరైన పద్ధతిలో, సరైన విరామాల్లో, సరైన టెంపరేచర్లలో వాటిని కలిపాను. తర్వాత దాన్ని డిలీట్ చేసేశాను. సంక్రాంతి రోజు తను చేసిన స్వీట్ పొంగల్‌లో మా ఆవిడ తినే బౌల్లో దాన్ని కలిపాను. అది తిన్న నలభై ఎనిమిది గంటల్లో మా ఆవిడ మరణించింది. అందులో రాసినట్లుగానే మరణానికి మునుపు వివిధ లక్షణాలని గమనించాను.ఇలాంటి కథల్లో ట్విస్ట్ చివర్లో వస్తుంది. నా కథలోని ట్విస్ట్ మా మరదలే. తన అక్కని నేను చంపి ఉండచ్చని పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఆమెది తేలు స్వభావం అని తెలుసు కాబట్టి ఇ¯Œ స్పెక్టర్ అది చెప్పినప్పుడు నేను పెద్దగా షాక్ అవలేదు.‘‘పరిశోధించండి. ఆమె చెప్పింది తప్పని ఆమెకి దయచేసి ఋజవు చెయ్యండి.’’ కోరాను.వాళ్ళు నా భార్య దేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం చేశారు. నాకేం కాదనే ధీమాలో ఉన్న నాకు వాళ్ళు షాకింగ్ న్యూస్ చెప్పారు. పోస్ట్‌మార్టంలో నా భార్య విషప్రయోగంతో మరణించిందని తేలిందని పోలీస్ డాక్టర్ నిర్ధారించాడు! సీసీటీవీ కెమేరాలు పాడుగాను. ఆ విషానికి అవసరమైన పదార్థాలని నేను కొన్నాననే ఋజువులని కూడా సంపాదించారు. నా నేరం ఋజువయ్యాక నాకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. నా సెల్ గార్డ్‌కి సెన్సాఫ్ హ్యూమర్ ఉంది.‘‘నీకు అవసరమైనప్పుడల్లా నన్ను అడిగితే టైం చెప్తాను.’’ నన్ను సెల్‌లోకి పంపాక తాళం వేస్తూ చెప్పాడు.∙∙ ఆ రోజు లైబ్రరీ అవర్‌లో జైల్ లైబ్రరీలో పుస్తకాల కోసం వెదుకుతూంటే నాకు ఆ బఫూన్ ఆత్మకథ పుస్తకం కనిపించింది. ఆ పుస్తకమే నన్ను జైలుకి పంపిందని జైలుకి వచ్చిన అక్కడున్న ఓ ఖైదీకి చెప్పాను. అతను దాన్ని చదవడానికి తీసుకున్నాడు.మర్నాడు లైబ్రరీ అవర్‌లో ఆ ఖైదీ నవ్వుతూ నాకు ఓ పేజీని చూపించాడు. శుభం తర్వాత నేను చదివిన పుస్తకంలో లేని ఓ కొత్త పేజీ కనిపించింది. అది పబ్లిషర్స్ నోట్. అందులో ఇలా ఉంది.హెచ్చరిక: వెనీషియన్ విషాన్ని ఎవరూ ప్రయత్నించకండి. అది కల్పితం కాదు. ఇప్పుడు పోస్టుమార్టంలో ఆ విషాన్ని కనుక్కోగలుగుతున్నారు.బ్రిటీష్ లైబ్రరీలో నేను చదివిన ఆ పుస్తకంలోని ఈ ఆఖరు కాగితాన్ని ఎవరు, ఎందుకు చింపారో నాకు తెలీదు. వాడివల్ల నేను జీవితఖైదు అనుభవిస్తున్నానని ఆ వెధవకి తెలీదు.- మల్లాది వెంకట కృష్ణమూర్తిఇవి చదవండి: భాష మార్చలేదు.. తలవంచలేదు! నోబెల్ గెలిచిన రచయిత కథ! -
భాష మార్చలేదు.. తలవంచలేదు! నోబెల్ గెలిచిన రచయిత కథ!
అయిదేళ్ళ కిందట నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకున్న బ్రిటిష్–జాంజిబార్ నవలా రచయిత అబ్దుల్ రజాక్ గుర్నా అప్పటికే, యూరపియన్ దేశాల్లో స్థిరపడిన ఆఫ్రో–ఆసియన్ దేశాల రచయితల్లో ప్రముఖుడిగా గుర్తింపు పొందివున్నారు. రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్‌లో సభ్యులుగా వున్న ఎనిమిది వందలమంది ‘శిష్టుల్లో‘ గుర్నా ఒకరు. అబ్దుల్ రజాక్ గుర్నా రచనల్లో పాత్రలుండవు– రక్తమాంసాలతో తిరుగాడే మనుషులే కనిపిస్తారు వాటిల్లో.గుర్నా రచనల్లో కనిపించే మనుషుల్లో అత్యాధునిక భావాలు– ఆదిమ స్వభావాలూ ఏకకాలంలోనే దర్శనమిస్తాయి. ఆ విలక్షణ లక్షణం రచయిత స్వభావంలోనే కనిపిస్తుంది, చూడగలిగిన వారికి. ఈ లక్షణాన్నే, ‘సామ్రాజ్యవాద పర్యవసానాల గురించి ఆయనది రాజీపడని స్వభావమ’నీ, ‘భిన్న ఖండాల నుంచి వచ్చిన శరణార్థులు విభిన్న సంస్కృతుల మధ్య వున్న అగాధం కారణంగా అనుభవించిన ఆవేదన విషయంలో గుర్నాది ఉదార స్వభావమ’నీ అభివర్ణించింది స్వీడిష్ ఎకాడెమీ. ఈ లక్షణం, బహుశా, అబ్దుల్ రజాక్ గుర్నా చారిత్రక నేపథ్యం నుంచే ఆయనకు సంక్రమించి వుంటుంది!అబ్దుల్ రజాక్ పుట్టిందీ, పదహారేళ్ళు పెరిగిందీ, జాంజిబార్ ద్వీపసమూహంలో. గత ఇరవైవేల సంవత్సరాలుగా ఆ గడ్డపై మానవ సమాజం వర్ధిల్లుతోందని పురాచరిత్ర చెప్తోంది. సోమాలియా, అరేబియా, ఇరాన్ (పర్షియా), ఒమాన్, యెమెన్, భారతదేశం తదితర ఆఫ్రో– ఆసియా దేశాలనుంచి నావికులూ, వర్తకులూ, చేతివృత్తులవాళ్ళూ, కూలీలూ, వారందరినీ పోషించే రైతులూ జాంజిబార్ గడ్డపై చేరి స్థిరపడ్డారు. పదిహేనో శతాబ్దిలో పోర్చుగీస్ సామ్రాజ్యవాదులు జాంజిబార్ ద్వీపసమూహాన్ని ఆక్రమించి 200 సంవత్సరాలు పెత్తనం చెలాయించారు.పదిహేడో శతాబ్ది మొదలుకొని జాంజిబార్ దాదాపు నూరేళ్ళపాటు ఒమానీ సుల్తానత్ పెత్తనంలో నలిగిపోయింది. ఆ తర్వాత, ఈ ద్వీపసమూహం రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం ‘కాపుదల రెక్కల‘ కిందకు చేరింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యానికి ఇలాంటి ‘బాధ్యతలు’ మోయలేని భారాలుగా మారాయి. ఆ నేపథ్యంలో 1964లో, జాంజిబార్ స్వాతంత్య్రం సాధించుకుంది. (అంతకు 17 సంవత్సరాల ముందు స్వతంత్రమైన మన దేశం కథ కూడా దీనికి పెద్దగా భిన్నమైందేం కాదు!) కొద్దికాలానికే, జాంజిబార్ పొరుగున వున్న టాంజానికాతో కలిసిపోయి, టాంజానియా రిపబ్లిక్‌గా అవతరించింది. అది నచ్చని జాంజిబార్ పౌరులు ఎందరో అప్పుడే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని శరణుకోరి ఆశ్రయించారు. అబ్దుల్ రజాక్ గుర్నా అలాంటి శరణార్థుల్లో ఒకరు.గుర్నా సాహిత్యం విషయానికి వస్తే– మొదట్లో, ఓ అరడజను కథానికలు రాశారాయన. కారణం స్పష్టంగా తెలియదు కానీ, ఆయన క్రమంగా నవలా రచన వైపు మళ్ళిపోయారు; ముప్ఫైతొమ్మిదో యేట, గుర్నా వెలువరించిన తొలినవల ‘నిష్క్రమణ స్మృతులు.’ వాస్తవానికి ఈ నవల గుర్నా తొలి కథల సారాంశమని చెప్పొచ్చు. ఆ తర్వాత ఏడేళ్ళకు వెలువడిన ‘స్వర్గం’ నవలతోనే, గుర్నాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఆ నవల అటు బుకర్ పురస్కారానికీ, ఇటు విట్ బ్రెడ్ పురస్కారానికీ జరిగిన ఎంపికలో గట్టిపోటీనే ఇచ్చింది కానీ విజేతగా నిలవలేక పోయింది.2001లో గుర్నా వెలువరించిన ‘కడలి ఒడ్డున’ నవల లాస్ ఏంజెలిస్ టైమ్స్ బుక్ ప్రైజ్ కోసం కడదాకా బరిలో నిలవగలిగిందే కానీ దాన్ని గెల్చుకోలేక పోయింది. అలాగే, 2005లో గుర్నా వెలువరించిన ‘ఉద్వాసన’ నవల కూడా కామన్వెల్త్ రైటర్స్ ప్రైజ్ కోసం కడదాకా పోటీపడిందే తప్ప బహుమతి పొందలేకపోయింది. ఒక్కముక్కలో చెప్పుకుంటే, 2021లో నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకునేంత వరకూ అబ్దుల్ రజాక్ గుర్నా చెప్పుకోదగిన విజయమేదీ సాధించలేదనే చెప్పాలి. దానికి కొన్ని కారణాలు లేకపోలేదు! మొదటి కారణం గుర్నా నవలల్లో వాడేభాష. గుర్నా మాతృభాష స్వాహిలి. అలాగే, సాంప్రదాయికంగా వాళ్ళ కుటుంబాల్లో వాడే భాష అరబిక్. ఇంగ్లీషు చదువులు మొదలుపెట్టక ముందు గుర్నా నేర్చుకున్న భాష జెర్మన్. అయితే, ఆయన ఆ మూడు భాషల్లో ఏ ఒక్కదానిలోనూ రచనలు చేయలేదు. సాహిత్య మాండలికంగా గుర్నా స్వీకరించినది ఈ మూడు భాషల కలగలుపు భాష. అలా చెయ్యడం రచయితగా గుర్నా హక్కు. కానీ, స్వేచ్ఛా స్వాతంత్య్రాల జపం చేసే పాశ్చాత్య ప్రచురణకర్తలు గుర్నా భావప్రకటన స్వేచ్ఛను గౌరవించలేదు.ఆంగ్లేతర పదాలను ‘ఇటాలిక్స్’లో సూచించమనీ, వాటన్నిటితో ఓ పదకోశాన్ని రూపొందించి అనుబంధంగా ఇవ్వమనీ రచయితకు ఉచిత సలహాలు ఇచ్చారు ఈ అర్ధాక్షరాస్యులు. వాటిని గుర్నా– సహజంగానే – ఖాతరు చెయ్యలేదు. దాంతో అతని భాషకు ‘ప్రవాసీ భాష’గా ముద్రకొట్టి, గుర్నా రచనలను పక్కనపెట్టారు. గుర్నా పాశ్చాత్య ప్రపంచంలో పెద్దగా గుర్తింపుకు నోచుకోకపోవడానికి మరో కారణం కూడా వుంది. అది, గుర్నా రచనల్లో కొట్టొచ్చినట్లు కనిపించే సామ్రాజ్యవాద– వలసవాద వ్యతిరేకత! 1987లో అబ్దుల్ రజాక్ వెలువరించిన తొలి నవల ‘నిష్క్రమణ స్మృతులు మొదలుకొని ప్రతి ఒక్క రచనలోనూ ఈ స్వరం, అదే శ్రుతిలో వినిపిస్తూ వుంటుంది. 2021లో నోబెల్ సాహిత్యపురస్కారం పొందిన తర్వాత కూడా గుర్నా రచనల్లో అదే స్వరం– అదే శ్రుతీ కొనసాగాయి. కానీ, అప్పుడది పాశ్చాత్య ప్రచురణకర్తలకు అభ్యంతరకరం కాకుండా పోయింది. ప్రచురణ హక్కుల కోసం వారు తమలో తాము పెనుగులాడి రచయిత నెత్తిన పాలుపోశారు. అలా, ‘తలవంచని ఉదారవాది’ అబ్దుల్ రజాక్ గుర్నా పాశ్చాత్య ప్రపంచంలో ప్రముఖుడు కాగలిగారు!- మందలపర్తి కిషోర్ఇవి కూడా చదవండి: డిగ్రీ కాదు.. స్కిల్స్ ఉంటే చాలు! ఈ రాష్ట్రం టాప్‌లో! -
దెయ్యమా? మనిషేనా? హాలోవీన్ హత్యలో ఊహించని ట్విస్ట్!
నగరం చీకటి దుప్పటి కప్పుకున్న వేళ... అక్కడ హాలోవీన్ వేడుకలు మొదలయ్యాయి. వ్యాపారవేత్త చేతన్ విల్లా అంతా వింత ఆకారాలు, భయంకరమైన అలంకరణలతో నిండిపోయింది. మోడల్ నమిత, యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ మిత్రా, జర్నలిస్ట్ శుక్లా, నమిత స్నేహితురాలు వినతి, రమ్య అక్కడ చేరారు. అందరూ విభిన్నమైన ఫ్యాన్సీ డ్రెస్సుల్లో, ముసుగుల్లో ఉన్నారు. నమిత తెల్లటి దుస్తుల్లో ప్రేతాత్మలా భ్రమను కలిగిస్తోంది.వేడుక పీక్స్‌కి చేరింది. అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకు హారర్ ఎఫెక్ట్ కోసం ఇంట్లోని లైట్లన్నీ ఆపేశారు. ఐదు నిమిషాల పాటు అంతా కారుచీకటి. కేవలం భయంకరమైన నవ్వుల సౌండ్ ట్రాక్ మాత్రమే వినిపిస్తోంది. సరిగ్గా ఐదు నిమిషాల తర్వాత లైట్లు ఆన్ అయ్యాయి.ఒక్కసారిగా అక్కడ కనిపించిన దృశ్యానికి అందరూ షాకయ్యారు. హాల్లో ఉన్న సోఫాపై నమిత నిర్జీవంగా రక్తం మడుగులో పడి ఉంది. ఆమె గుండెల్లో పదునైన కత్తి దిగి ఉంది. ఆ గదిలో మంత్రాల్లా గోడపై రక్తం గుర్తులు రాసి ఉన్నాయి. అక్కడి వారంతా ఇది ‘ఆత్మ చేసిన హత్య’ అని ప్రచారం మొదలుపెట్టారు.∙∙ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అభిమన్యు రంగంలోకి దిగాడు. మీడియాలో ‘హాలోవీన్ రాత్రి ఆత్మ చేసిన హత్య’ అంటూ అప్పటికే రూమర్స్ మొదలయ్యాయి. రక్తం మడుగులో నమిత– లక్షలాది మంది మగవాళ్ల హార్ట్ బీట్. తక్కువ సమయంలో ఎక్కువ పేరు తెచ్చుకున్న మోడల్. డెడ్ బాడీని పోస్ట్‌మార్టమ్‌కు పంపి, అక్కడ ఉన్న ఐదుగురినీ విచారించడం ప్రారంభించాడు ఇన్స్పెక్టర్ అభిమన్యు.డైరెక్టరు మిత్రా తన తదుపరి యాడ్ ఫిలింలో చేయమని నమితను కోరితే, ఆమె చేయనంది. అతనికి నమిత మీద పీకల దాకా కోపం వుంది.జర్నలిస్ట్ శుక్లా– నమితకు కెరీర్ మొదట్లో సాయం చేసి, ఫేమస్ చేశాడు. కానీ స్టార్ అయ్యాక నమిత అతన్ని దూరం పెట్టడంతో లోలోపల రగిలిపోతున్నాడు.బిజినెస్‌మేన్ చేతన్ నమితను పిచ్చిగా ప్రేమించి ప్రపోజ్ చేశాడు. నమిత అతని ప్రపోజల్‌ను తిరస్కరించింది. అతని ఈగో దెబ్బతింది.ఇక వినతి, రమ్యలకు పెద్దగా మోటివ్స్ లేవు. అభిమన్యు నోటీసులోకి రెండు విషయాలు వచ్చాయి. ఒకటి, నమిత గుండెల్లో దిగిన కత్తిని కుడిచేత్తో బలంగా పొడిచారు. రెండు, లైట్లు ఆపే సమయానికి, ఆన్ అయ్యే సమయానికి అందరూ ఒకే చోట ఉన్నారా లేదా?అభిమన్యు క్రైమ్ సీన్ ను పరిశీలించాడు. గోడపై రాసిన రక్తపు గుర్తులు ఆత్మ చేసిందిగా నమ్మించడానికి కావాలనే రాసినట్టు అర్థమైంది. హాల్లోని స్మార్ట్ హోమ్ లైటింగ్ సిస్టమ్ డేటాను ఫోరెన్సిక్ టీమ్ పరిశీలించింది. లైట్లు స్విచ్ బోర్డు నుండి కాకుండా, మొబైల్ యాప్ ద్వారా కంట్రోల్ అయినట్లు గుర్తించింది.అభిమన్యు అందరినీ ఒకే గదిలో కూర్చోబెట్టి. ‘లైట్లు పోయిన ఆ ఐదు నిమిషాలు ఎవరెవరు ఎక్కడ ఉన్నారు?’ అని అడిగాడు.మిత్రా తాను స్విచ్ బోర్డు వైపు వెళ్లానని చెప్పాడు. చేతన్ తను అక్కడే వున్నానని చెప్పాడు. లైట్లు ఆఫ్‌లో ఉండటం వాళ్ళ సీసీ కెమెరాలు పని చేయలేదు.అందరి మొహాల్లో టెన్షన్– పోలీసులు సంకెళ్లతో సిద్ధంగా ఉన్నారు. బయట మీడియా హడావుడి. .∙∙ అక్కడ అంతా నిశ్శబ్దం. అభిమన్యు పోలీసుల వైపు చూశాడు.‘మిస్టర్ మిత్రా! పదండి’ అన్నాడు.‘ఎందుకు? మిత్రా అడిగాడు.‘నమితను హత్యకు కారణమైనందుకు’, అని చేతన్ వైపు తిరిగి ‘మిస్టర్ చేతన్! మీరు కూడా... నమితను కత్తితో పొడిచి చంపినందుకు’ అన్నాడు.మిత్రాను, చేతన్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.∙∙ మీడియా చుట్టుముట్టింది.‘హత్య జరిగి గంట గడవక ముందే వీళ్ళే హంతకులని ఎలా తెలుసుకున్నారు?’ మీడియా అడిగింది.మిత్రా తాను స్విచ్ బోర్డు వైపు వెళ్లానని అబద్ధం చెప్పాడు. కానీ ఫోన్లో యాప్ లాగ్స్‌లో అసలు నిజం బయటపడింది.అతడి కుడిచేతికి ఫ్రాక్చరై బెల్ట్ ఉంది. ఎడమచేత్తో అంత బలంగా పొడవడం సాధ్యం కాదు. అప్పుడే సందేహం వచ్చింది. లైట్లను ఆర్పింది మిత్రా... నమితను చంపే ప్రయత్నంలో నమిత గట్టిగా గోళ్లతో గీరింది. చేతన్ కుడి చేతి మణికట్టుపై ఉన్న గాయం, ఆ గోళ్ల ముక్కల్లో ఉన్న చర్మం మ్యాచ్ అయ్యాయి. అతను వేసుకున్న దెయ్యం కాస్ట్యూమ్‌పై నమిత రక్తం చిందింది. వాటిని విల్లా వెనుక డస్ట్ బిన్ లో దాచాడు. దాన్ని నా టీమ్ స్వాధీనం చేసుకుంది’ చెప్పాడు అభిమన్యు.‘హాలోవీన్‌లో కనిపించే ఆత్మల కన్నా మన కళ్ళ ముందు స్వార్థం, ద్వేషంతో ఘోరాలు, నేరాలు చేసే మనుష్యులే అసలైన ప్రేతాత్మలు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి’ చెప్పి ముందుకు కదిలాడు ఇన్స్పెక్టర్ అభిమన్యు.- శ్రీసుధామయిఇవీ చదవండి: ఒకే ఊరు.. కొందరికే వినిపించే వింత శబ్దం! అసలు రహస్యం ఏంటి? -
ఒకే ఊరు.. కొందరికే వినిపించే వింత శబ్దం! అసలు రహస్యం ఏంటి?
అది 1990వ దశకం... అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్రంలోని చిన్న పట్టణం థావోస్. అర్ధరాత్రి దాటింది. పట్టణమంతా ప్రశాంతంగా ఉంది. అంతలో ఒక్కసారిగా మంచంపై నుంచి లేచి కూర్చున్నాడు 52 ఏళ్ల మైకేల్. చెవులను చేతులతో నొక్కుకుంటూ చిరాకుగా కిటికీ బయటకు చూశాడు.‘ఎక్కడో డీజిల్ ఇంజిన్ నడుస్తున్నట్లుంది... ఆపరా బాబోయ్’ అంటూ విసుక్కున్నాడు.పక్కనే నిద్రిస్తున్న అతడి భార్య సారా కళ్లు తెరిచి ఏమైందని అడిగింది... ‘ఏంటా గోల? ఎక్కడి నుంచి వస్తోందది’ అని చిరాకుగా అడిగాడు. ‘నాకేం వినిపించడంలేదే. కల ఏమైనా వచ్చిందా?’ అని సారా అడిగే సరికి మైకేల్ కళ్లు నులుముకున్నాడు. అతడికి చెవుల్లో ఆ శబ్దం ఇంకా వినిపిస్తూనే ఉంది. ఇంట్లో ఎలాంటి యంత్రం లేదు. బయట రోడ్డు మీద వాహనాలూ లేవు. కానీ అతడి చెవుల్లో మాత్రం ఒకే శబ్దం...‘హ్మ్...’ అది దగ్గరగా ఉన్నట్లూ కాదు, చాలా దూరంలో ఉన్నట్లూ కాదు– వినిపిస్తుంది, అంతలోనే మాయమైపోతుంది. చెవులు మూసుకున్నా వినిపిస్తూనే ఉంటుంది. ఇక ఆ రాత్రి అతడికి నిద్ర లేదు. మరుసటి రోజు పక్కింటి వాళ్లను అదే విషయం గురించి అడిగాడు. ‘ఏ శబ్దం? మాకేమీ వినిపించలేదు’ అని చెప్పడంతో మైకేల్ అయోమయానికి గురయ్యాడు.క్రమంగా ఆ శబ్దం గురించి చెబుతున్న వారి సంఖ్య పెరిగింది. ‘రాత్రిళ్లు ఓ వింత శబ్దం వినిపిస్తోంది. ఎక్కడి నుంచి వస్తోందో అర్థం కావడం లేదు. రోజంతా ఉండదు కానీ, రాత్రి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు స్పష్టంగా వినిపిస్తుంది’ అంటూ వారంతా ఒకే విధంగా వర్ణించారు. అది దూరంలో డీజిల్ ట్రక్కు ఇంజిన్ నడుస్తున్నట్లు; భారీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మోగుతున్నట్లు; ఒక పెద్ద ఈగ చెవి దగ్గర నిరంతరం రొద పెడుతున్నట్లు గంభీరమైన ‘హ్మ్...’ అనే ధ్వనిలా ఉంటుందని చెప్పారు.అయితే, అదే ప్రాంతంలో నివసిస్తున్న చాలా మందికి ఆ శబ్దం అసలు వినిపించకపోవడం; కొందరికే అది తెలుస్తుండటం వింతగా అనిపించింది. ఒకే ఇంట్లో భార్యాభర్తల్లో ఒకరికి వినిపిస్తే, మరొకరికి అసలు వినిపించకపోవడం సాధారణమైపోయింది. కొంతమంది చెవులు మూసుకున్నా వినిపిస్తోందని చెబితే, ఇంకొందరు అది తమ తలలోనే ప్రతిధ్వనిస్తున్నట్లుగా అనిపిస్తోందన్నారు.మొదట్లో చిన్న అసౌకర్యంగా భావించిన ఈ హమ్... క్రమంగా చాలామందిని మానసికంగా వేధించడం ప్రారంభించింది. రాత్రిళ్లు నిద్ర పట్టేది కాదు; పగలు పనిపై దృష్టి నిలిచేది కాదు. తలనొప్పి, చిరాకు, ఒత్తిడి వెంటాడేవి. ఈ బాధ పడలేక కొందరు వేరే ఊరికి వెళ్లిపోయారు కూడా. మరికొందరు వైద్యులను ఆశ్రయించారు. కానీ పరీక్షల్లో పెద్దగా సమస్యలు కనిపించలేదు.ఈ శబ్దం గురించి ఫిర్యాదులు పెరగడంతో 1993లో అమెరికా అధికారులు శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, వినికిడి నిపుణులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందం విద్యుత్ లైన్లు, ఫ్యాక్టరీలు, భూకంప ప్రకంపనలు, రేడియో తరంగాలు, సైనిక స్థావరాలు– అన్నింటినీ పరిశీలించింది. కానీ ఆ శబ్దానికి కచ్చితమైన మూలం మాత్రం దొరకలేదు. పట్టణమంతటా అత్యంత సున్నితమైన, అత్యాధునిక అకోస్టిక్ రికార్డర్లను, వైబ్రేషన్ డిటెక్టర్లను అమర్చారు. కానీ ఏ ఒక్క డిజిటల్ మెషిన్ కూడా ఆ శబ్దాన్ని కచ్చితంగా రికార్డు చేయలేకపోయింది.ఈ హమ్పై ఎన్నో సిద్ధాంతాలు ప్రచారంలోకి వచ్చాయి. దూరంలోని పరిశ్రమల యంత్రాల శబ్దమని కొందరు చెప్పారు. భూమి లోపల జరిగే సూక్ష్మ ప్రకంపనలేనని మరికొందరు అభిప్రాయపడ్డారు. మనిషి వినలేని అత్యల్ప ఫ్రీక్వెన్సీ శబ్దాలు కారణమై ఉండవచ్చని అనుకున్నారు. చెవులకు సంబంధించిన టిన్నిటస్ అనే వైద్య సమస్యతో ముడిపడి ఉండవచ్చని కొందరు భావించారు. అయితే ఈ వివరణల్లో ఏదీ అందరికీ సరిపోయేలా రుజువు కాలేదు.శాస్త్రవేత్తలకు సమాధానం దొరకకపోవడంతో ఊహాగానాలు మరింత పెరిగిపోయాయి. ఇది అమెరికా సైన్యం రహస్య ప్రయోగాల ప్రభావమని, భూగర్భంలో దాగి ఉన్న రహస్య కేంద్రాల నుంచే ఈ శబ్దం వస్తోందని, గ్రహాంతరవాసుల సంకేతాలేనని– ఇలా ఎన్నో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ వాటిలో దేనికీ విశ్వసనీయమైన ఆధారాలు లభించలేదు.ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మూడు దశాబ్దాలు గడిచినా కొందరు థావోస్ నివాసితులు ఇప్పటికీ అదే హమ్ వినిపిస్తోందని చెబుతున్నారు. మరికొందరికి మాత్రం అసలు అలాంటి శబ్దం ఎప్పుడూ వినిపించలేదు. అంటే, శబ్దం నిజంగానే ఉందా? లేక కొందరు మాత్రమే గ్రహించే సహజ ధ్వనా? అనే ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు.ప్రపంచం ఎన్నో మిస్టరీలను ఛేదించింది. సముద్రపు అడుగున ఏముందో తెలుసుకుంది. అంతరిక్షంలో కోట్ల కిలోమీటర్ల దూరంలోని గ్రహాల చిత్రాలు తీసింది. కానీ అమెరికాలోని ఒక చిన్న పట్టణంలో కొందరి చెవుల్లో మాత్రమే వినిపించే ఆ ‘హ్మ్...’ అనే శబ్దం వెనుక రహస్యాన్ని మాత్రం ఛేదించలేకపోయింది. అందుకే, థావోస్ హమ్ ఇప్పటికీ ప్రపంచంలోని అత్యంత విచిత్రమైన, అంతుచిక్కని రహస్యాల్లో ఒకటిగా నిలిచిపోయింది.- సత్యకిశోర్ కొండ్రెడ్డిఇవి కూడా చదవండి: అంతరిక్షంలో వరిపంట -
సిల్కీగా.. జాలువారేలా!
జుట్టు పట్టులా మృదువుగా ఉంచుకోవడానికి ఇంట్లోనే చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. తలకు గోరువెచ్చని కొబ్బరినూనె రాసి, సుతారంగా మర్దన చేసి, అరగంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. దీనివల్ల జుట్టు పొడిబారకుండా ఉంటుంది. తల పొడిబారిపోకుండా ఉండటానికి గోరువెచ్చని నీరు ఉపయోగించడం మంచిది. షాంపూ చేసిన ప్రతిసారీ జుట్టు మధ్య భాగం నుంచి చివర్ల వరకు కండిషనర్ రాసి.. కొన్ని నిమిషాల తర్వాత కడిగేయాలి. తడిగా ఉన్నప్పుడు జుట్టు సులభంగా తెగిపోవచ్చు. అందుకని వెంటనే గట్టిగా దువ్వకుండా, కొద్దిగా ఆరిన తర్వాత వెడల్పాటి పళ్లున్న దువ్వెనతో మెల్లగా చిక్కులు తీయాలి. -
నారికేళ వైభవం
మన దేశంలో కొబ్బరి వేలాది సంవత్సరాలుగా వినియోగంలో ఉంది. మన దేశమే కాదు, ఇండో–పసిఫిక్ ప్రాంతం అంతటా కొబ్బరి వినియోగం అప్పటి నుంచే ఉంది. మన దేశంలో కొబ్బరికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం కూడా ఉంది. సంస్కృతంలో నారికేళఫలంగా పిలుచుకొనే కొబ్బరిని పూజాదికాల్లోను, యజ్ఞయాగాలలోను, శుభకార్యాలలోను విరివిగా ఉపయోగిస్తారు. నారికేళాన్ని ‘శ్రీఫలం’ అని కూడా అంటారు. ఆధ్యాత్మిక ప్రశస్తి అటుంచితే, కొబ్బరిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి పీచును, కొబ్బరి కలపను వివిధ రకాల వస్తువుల తయారీ కోసం పారిశ్రామికంగా కూడా వినియోగిస్తుంటారు. కొబ్బరి ఉత్పాదనలో మన దేశం రెండో స్థానంలో ఉంది. కొబ్బరి విశేషాలను గణాంకాలలో తెలుసుకుందాం.కొబ్బరికాయలోను, కొబ్బరినీరులోను పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరికాయలో తినే భాగంలో ఎక్కువగా కొవ్వులు ఉంటాయి. దీని నుంచే కొబ్బరి నూనె తీస్తారు. కొబ్బరి తురుమును, కొబ్బరి నూనెను రకరకాల వంటకాల తయారీలో ఉపయోగిస్తారు. కొబ్బరినీరు వేసవిలో దాహార్తి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కొబ్బరినీటిలోని ఖనిజాలు తక్షణ శక్తినిస్తాయి. -
హైబ్రిడ్ మంచేనా? ముంచేనా?
ఉదయాన్నే ఆఫీస్ క్యాబ్ కోసం ఎదురుచూడక్కర్లేదు. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద గంటల తరబడి టైమ్ వేస్ట్ చేయక్కర్లేదు. ఇంట్లో హాయిగా కాఫీ తాగుతూ లాప్టాప్ ఆన్ చేస్తే చాలు... ఆఫీస్‌లో అడుగుపెట్టినట్లే... అటెండెన్స్ పడినట్లే... ప్రపంచాన్ని చుట్టేసిన ‘కరోనా’ కార్పొరేట్ రంగానికి నేర్పిన అతిపెద్ద పాఠం ‘‘హైబ్రిడ్ వర్క్ కల్చర్’’ వారంలో మూడు రోజులు డెస్క్ వర్క్, రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్... వారాంతాల్లో సరదాలు... అసలు ఈ సరికొత్త సంస్కృతి ఉద్యోగుల జీవితాలను, కంపెనీల భవిష్యత్తును ఎలా మార్చింది? మారుస్తోంది? ఒక ప్రత్యేక కథనం.ఎక్కడ పనిచేస్తున్నారనేది కాదు... ఎంత సమర్థంగా పనిచేస్తున్నారు... ఔట్పుట్ ఎంత వచ్చిందనేదే ముఖ్యం అంటున్నాయి నేటి గ్లోబల్ కంపెనీలు. నాలుగు గోడల మధ్య మూస ధోరణిలో ఆఫీసులో పనిచేయడం... లేదా వర్క్ ఫ్రమ్ హోమ్‌తో విసిగి పోవడం వంటిæరోజులు ముగిశాయి. ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో హైబ్రిడ్ వర్క్ కల్చర్ ఒక ట్రెండ్‌గా మారింది. సంస్థల ఉత్పాదకత, ఉద్యోగుల సౌకర్యంతో పాటు లైఫ్‌ను సమన్వయం చేస్తూ ఈ నూతన పని సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది.ఫలితమే ఫైనల్!ఉద్యోగులు తమ పనిదినాలను ఇల్లు, ఆఫీసు మధ్య పంచుకునే వెసులుబాటే హైబ్రిడ్ వర్క్. ఈ విధానంలో ఉద్యోగులు తమ సౌకర్యాన్ని బట్టి ఆఫీసు నుంచి, ఇంటి నుంచి లేదా వారికి నచ్చిన ఏ ప్రాంతం నుంచైనా పనిచేసుకునే వీలును కల్పిస్తున్నాయి కొన్ని సంస్థలు. ఏ ప్రాంతం, ఏ దేశం అనే వాటితో సంబంధం లేకుండా కేవలం ప్రతిభను ఆధారంగా చేసుకుని ఉద్యోగులను ఎంపిక చేసుకునే సౌలభ్యం ఉంటుంది. పని ఎక్కడి నుంచి చేసినా ఫలితమే ఫైనల్ అనేది ఈ ఆధునిక విధానంలోని ముఖ్య ఉద్దేశం. డిజిటల్ టూల్స్ సహాయంతో సాధించిన విజయాలను చూసిన కంపెనీలు ఇప్పుడు దీనిని శాశ్వత మోడల్‌గా మారుస్తున్నాయి.కాఫీషాప్ ఆఫీసైతే!ఒకప్పుడు ఆఫీస్ అంటే నాలుగు గోడల మధ్య అమర్చిన డెస్క్‌లు, వరుసగా కూర్చునే ఉద్యోగులు. నిర్దిష్టమైన పని వేళలు. కానీ ఇప్పుడది పాత పద్ధతయ్యింది. ఇంటి లివింగ్ రూమ్, నచ్చిన కాఫీ షాప్, పల్లెలోని ప్రశాంతమైన వాతావరణం... ప్రదేశం ఏదయినా లాప్టాప్, మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు, ప్రతి చోటూ ఒక వర్క్‌స్పేస్‌గా మారిపోతోంది.రెండు పడవలపై ప్రయాణం!సోమవారం పొద్దున్నే సగం తెరిచిన కళ్లతో అలారం సైలెంట్ చేయడం... ఉదయం 8:15 గంటలకు బంపర్–టు–బంపర్ ట్రాఫిక్, హారన్ల గోల మధ్య ప్రెజెంటేషన్ డెక్ గురించి ఆలోచించడం.అదే బుధవారం ఉదయం... హాయిగా ఉదయం 8:30 గంటలకు లేచి, చేతిలో కాఫీ కప్పుతో లాప్టాప్ ఆన్ చేస్తూనే, పక్కన ‘నాన్నా.. నా బార్బీ బొమ్మ కనిపించడం లేదు!’ అని అరిచే నాలుగేళ్ల చిన్నారిని శాంతింపజేయడం.ఒకే మనిషి... ఒకే ఉద్యోగం... కానీ రెండు వేర్వేరు ప్రపంచాలు! ఐటీ ఉద్యోగి జీవితంలో ‘హైబ్రిడ్ వర్క్’ తెచ్చిన తిప్పలివి. ఆఫీస్ రోజున అస్తవ్యస్తమైన ట్రాఫిక్‌లో గమ్యం చేరుకోవడం ఒక యుద్ధమైతే... ఇంటి నుంచి పనిచేసే రోజున ‘హోమ్’కి, ‘వర్క్’కి మధ్య గోడలు కూలిపోయి, పని ఎప్పుడు పూర్తవుతుందో తెలియని ఆందోళన, ఒకవేళ పూర్తయినా ‘ఆఫీస్ ముగిసింది’ అనే మానసిక భావన రాదు. వీకెండ్లో కూడా మెయిల్స్, స్లాక్ మెసేజ్‌లు చూడాలనే మానసిక తాపత్రయం వీడదు. అంటే హైబ్రిడ్ ఉద్యోగులు రెండు పడవలపై ప్రయాణం చేస్తూ నరకయాతన పడుతున్నారు.నెగ్గుకొచ్చేదెలా?హైబ్రిడ్ కల్చర్‌లో సమయం కలసిరావడం, ప్రయాణ భారం తగ్గడం లాంటి ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఈ పద్ధతి వల్ల ఉద్యోగులు పరోక్షంగా కొన్ని మానసిక, వృత్తిపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ⇒ ఈ విధానంలో ప్రధానమైన సమస్య వర్క్: లైఫ్ బ్యాలెన్స్ లోపించడం. ఇంటి నుంచి పనిచేసే రోజుల్లో ‘పని వేళలు’ ముగిసినా లాప్టాప్ ముందే గడపాల్సి వస్తోంది. ఇది తీవ్ర మానసిక ఒత్తిడికి దారితీస్తోంది. అందువల్ల ఆఫీస్ టైమింగ్స్ పూర్తికాగానే లాప్టాప్ క్లోజ్ చేయడాన్ని అలవాటు చేసుకోవాలి.⇒ ఒంటరితనం: రోజూ సహచరులను కలవకపోవడం వల్ల టీమ్‌తో సంబంధాలు తగ్గుతాయి. ఒక్కోసారి కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడి పొరపాట్లూ జరుగుతుంటాయి. ఇంట్లో ఒక్కరే పనిచేసుకుంటూ ఉంటే, చుట్టుపక్కల మాట్లాడే మనిషి లేక ఒంటరితనం ఆవరిస్తుంది.⇒ వర్క్ బర్నౌట్: ఆఫీసులో మాదిరిగా ఇంట్లో సౌకర్యవంతమైన కుర్చీలు, టేబుళ్లు లేకపోవడం వల్ల వెన్నునొప్పి, మెడనొప్పి సమస్యలు వెంటాడుతున్నాయి. నిరంతరం స్క్రీన్ ముందే ఉండటంతో వర్క్ బర్నౌట్ పెరుగుతోంది. అందువల్ల ప్రతి 45 నిమిషాలకోసారి చిన్న బ్రేక్ తీసుకుని స్ట్రెచింగ్ చేయాలి. అంతేకాకుండా టీమ్ సభ్యులతో కేవలం వర్క్ గురించే కాకుండా వారానికి ఒకసారి వర్చువల్ భేటీ లేదా క్యాజువల్ కాల్స్ ద్వారా నెట్వర్క్ పెంచుకోవాలి.⇒ ఎదుగుదలకూ ఆటంకం: ఆఫీసుకు క్రమం తప్పకుండా వచ్చేవారికే మేనేజర్లు, హెచ్ఆర్లు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారని, ఇంటి నుంచి పనిచేసే వారి కష్టం సరిగ్గా గుర్తింపు పొందదనే ఆందోళన ఉద్యోగుల్లో ఉంటోంది. అందువల్ల మేనేజర్లతో నిరంతరం మీ వర్క్ ప్రోగ్రెస్ పంచుకోవాలి.నిజంగా వరమేనా?గ్యాలప్ జాతీయ సర్వే (8,090 మంది ఉద్యోగులు) ప్రకారం... హైబ్రిడ్ విధానం ఉద్యోగుల జీవితాల్లో సానుకూల మార్పు తెచ్చినట్లు తేలింది. కుటుంబానికి తగిన సమయం దొరికి ప్రశాంతత పెరగడంతో పాటు రోజుకు రెండు నుంచి మూడు గంటలపాటు ప్రయాణ భారం తగ్గుతోంది. అలాగే పనిలో ఏకాగ్రత పెరిగి వేగంగా సాగుతూ ఉత్పాదకత పెరుగుతోంది. వారంలో మూడు రోజులు ఆఫీసులో, మరో రెండు రోజులు ఇంట్లో పనిచేయడం అనే ఫ్లెక్సిబిలిటీ వల్ల మహిళా ఉద్యోగుల రాజీనామాలు తగ్గినట్లు తేలింది.ఏది బెటర్?వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఉద్యోగులు నిరంతరం ఇంటి నుంచి పనిచేస్తారు. కానీ హైబ్రిడ్ వర్క్‌లో ఉద్యోగులకు ఇల్లు, ఆఫీస్ రెండింటిలో ఏది కావాలనుకుంటే అది తమ వీలును బట్టి ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది. అందువల్ల వారు ఒంటరితనానికి దూరంగా ఉంటారు. పరిశోధనల ప్రకారం 49% మంది రిమోట్ వర్కర్లు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు.సవాళ్లతో సవారీకంపెనీ యాజమాన్యాలు కూడా ఈ మార్పును సానుకూలంగానే చూస్తున్నాయి. పెరిగిన రియల్ ఎస్టేట్ ఖర్చులు, ఆఫీస్ మెయింటెనెన్స్ బిల్లులు తగ్గించుకోవడానికి ఇది ఒక చక్కని మార్గంగా మారింది. అంతేకాకుండా, గ్లోబల్ టాలెంట్‌ను ఆకర్షించడానికి కంపెనీలు హైబ్రిడ్/ రిమోట్ ఆప్షన్లను ఒక ఆకర్షణీయమైన ఆఫర్‌గా చూపుతున్నాయి. అయితే ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. మరోవైపు ఊహించని సవాళ్లు కూడా ఇందులో ఉన్నాయి.లివ్ ఎనీవేర్.. వర్క్ ఎనీవేర్!కరోనా విజృంభించిన సమయంలో ప్రపంచవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఉద్యోగాల నిర్వహణలో సరికొత్త సంస్కృతికి నాంది పలికింది. అయితే ఐదేళ్ల తర్వాత కొన్ని సంస్థలు మాత్రం ఆఫీస్‌కి వచ్చి పనిచేయాల్సిందేనంటూ ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ, మార్పు తప్పనిసరైంది. ఇల్లు, ఆఫీసు అని రెండింటినీ సమన్వయం చేస్తూ హైబ్రిడ్ వర్క్‌కి శ్రీకారం చుట్టాయి. వాటిల్లో గూగుల్, మెటా, ఎయిర్‌బీఎన్‌బీ, సిస్కో సిస్టమ్స్, సిటీ గ్రూప్, గ్రామర్లీ, హబ్ స్పాట్, స్పాటిఫై వంటి ఎన్నో ప్రసిద్ధ సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా ‘లివ్ ఎనీవేర్ అండ్ వర్క్ ఎనీవేర్’ (ఎక్కడైనా నివసించండి... ఎక్కడి నుంచైనా పనిచేయండి) అంటూ పనిలో స్వేచ్ఛా విధానాన్ని ప్రకటించాయి.సైన్స్ రూట్స్ నుంచి..ఐటీ, కార్పొరేట్ డిక్షనరీలో ఒక సర్వసాధారణమైన పదం ‘హైబ్రిడ్ వర్క్’. నిజానికి హైబ్రిడ్ అనే పదం బయాలజీ రంగానికి చెందిన పదం. బయాలజీ పరిభాషలో హైబ్రిడ్ అంటే రెండు వేర్వేరు జాతులకు చెందిన విత్తనాలు, లేదా జీవులను కలిపి ఒక కొత్త రకాన్ని తయారుచేస్తే దాన్ని ‘హైబ్రిడ్’ అంటారు. ఇక ఆటోమొబైల్ రంగంలో పెట్రోల్, బ్యాటరీ రెండింటి ద్వారా నడిచే వాహనాలను ‘హైబ్రిడ్ కార్లు’ అంటారు. మరి ఈ పదం ఆఫీస్ కల్చర్ మారింది కొన్ని దశాబ్దాలే కిందటే. 1970లో ‘టెలి కమ్యూటింగ్’ పేరుతో ఇంటినుంచి పనిచేసే విధానం వచ్చినప్పటికీ అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. 2010 తరువాత ఇదే ఫ్లెక్సిబుల్ వర్క్‌గా మారింది. హైబ్రిడ్ వర్క్‌కి 2020 ఒక టర్నింగ్ పాయింట్. కరోనా విజృంభించడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలన్నీ కూడా ఇంటి వద్ద నుంచి పనిచేసే సౌలభ్యాన్ని కలిగించాయి. ఆ తరువాత సంస్థలకి, ఉద్యోగులకు అనుకూలంగా ఉండేలా సైన్స్ రంగంలో ఉన్న ‘హైబ్రిడ్’ పదాన్ని వర్క్స్పేస్కి వర్తింపజేశారు. 2021 నాటికి టైమ్స్, ఫోర్బ్స్, హార్వర్డ్ బిజినెస్ రివ్యూ వంటి అంతర్జాతీయ పత్రికలు ఈ పదాన్ని విరివిగా ఉపయోగించడంతో ఇది కార్పొరేట్ భాషలోకి చేరింది. ఆ తరవాత ప్రపంచమూ ఈ పదానికి ఆమోదం తెలిపింది.ఫార్మల్ వర్సెస్ క్యాజువల్⇒ మల్లెట్ డ్రెస్ కోడ్: సగం ఫార్మల్, సగం క్యాజువల్ దుస్తులు ధరించడమే మల్లెట్ డ్రెస్ కోడ్. హైబ్రిడ్ ఉద్యోగుల్లో 70 శాతం కంటే ఎక్కువ మంది పై భాగాన ఫార్మల్ షర్ట్, సూట్ వేసుకుని కింద మాత్రం షార్ట్స్, ట్రాక్ ప్యాంట్స్‌తో మీటింగ్స్ కానిచ్చేస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. ⇒ థర్డ్ పీక్ అవర్: సాధారణంగా ఉద్యోగుల్లో మార్నింగ్, ఆఫ్టర్నూన్ సమయాల్లో వర్క్ పీక్‌లో ఉంటుంది. కానీ హైబ్రిడ్ విధానం వచ్చాక థర్డ్ పీక్ అవర్ తయారైంది. అదే రాత్రి 8 నుంచి 10 గంటల సమయం. డిన్నర్, ఫ్యామిలీ టైమ్ పూర్తయ్యాక ప్రశాంతంగా మిగిలిన పని చేసుకునేందుకు లాగిన్ అవుతున్నారు. ⇒ రోజుకి 4 స్నాక్ బ్రేక్స్: ఇంటి నుంచే పనిచేసే సమయంలో రోజుకి కనీసం నాలుగుసార్లు స్నాక్స్, టీలు తీసుకుంటున్నట్లు 48 శాతం మంది ఒప్పుకున్నారు. ఇది వారికి బాగా నచ్చిన విషయం కూడా. ⇒ పెట్ కొలీగ్స్: ఇంట్లో పనిచేస్తుంటే ఉద్యోగుల పెంపుడు కుక్కలు, పిల్లులు హఠాత్తుగా కెమెరా ముందుకు రావడం, కీబోర్డ్ పైకి ఎక్కి గందరగోళం చేయడం సర్వసాధారణమైపోయింది.⇒ తగ్గిన ఫార్మల్స్: హైబ్రిడ్ కల్చర్ దెబ్బకి ప్రపంచవ్యాప్తంగా టైలు, బ్లేజర్లు, సూట్లు, ఫార్మల్ షూస్ అమ్మకాలు 20% పైగా తగ్గిపోయాయి. వీటి స్థానంలో కంఫర్ట్ వేర్, క్యాజువల్ దుస్తుల అమ్మకాలు భారీగా పెరిగాయి.⇒ ఓన్లీ 30 మినిట్స్!: హైబ్రిడ్ మోడల్ వచ్చాక గతంలో గంటల కొద్దీ సాగే మీటింగ్‌లు కేవలం 30 నిమిషాలకు కుదించుకుపోయాయి. అయితే, చిన్న చిన్న ఆన్ లైన్ చెక్–ఇన్ మీటింగ్‌ల సంఖ్య ఏకంగా 60% పెరిగింది!భవిష్యత్తేంటి? రాబోయే రోజుల్లో హైబ్రిడ్ వర్క్ కల్చర్ ఒక ఆప్షన్ మాత్రమే కాదు, ఉద్యోగ ప్రపంచంలో ఒక ప్రధాన భాగంగా మారిపోతుంది. ఉద్యోగం చేయడం అంటే ఒక నిర్దిష్ట ప్రదేశానికి వెళ్లడం అనేది పాతదైపోతుంది, ఎక్కడి నుంచైనా సమర్థంగా పనిని పూర్తి చేయడం మాత్రమే ఉంటుంది! నియమిత పనివేళల కంటే, సాధించే ఫలితాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అర్ధరాత్రి పనిచేస్తారో, తెల్లవారుజామున పూర్తి చేస్తారో అది పూర్తిగా ఎంప్లాయీకే వదిలేస్తారు. నగరాల్లోనే ఉండాల్సిన అవసరం ఉండదు. సొంత ఊరిలో కూర్చునే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద సంస్థల్లో ఉద్యోగాలు చేయవచ్చు. సాంకేతికత పెరిగేకొద్దీ ఇంట్లోనే ఉన్నా ఆఫీస్‌లో ఉన్నట్లే సహజమైన అనుభూతిని పొందే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. భవిష్యత్తులో ఉద్యోగం అనేది ఒక ప్రదేశానికి పరిమితమైన పని కాదు, అదొక ఉత్పాదకత పెంచే పని మాత్రమే!ఇదివరకు ఉద్యోగం అంటే నాలుగు గోడల మధ్య బందీ కావడం... ఇప్పుడు ఉద్యోగం అంటే స్వేచ్ఛగా ఆలోచనలను పంచుకోవడం! హైబ్రిడ్ సాంప్రదాయం అనేది కేవలం పని చేసే పద్ధతిని మాత్రమే మార్చలేదు, మనుషుల జీవన శైలినే కొత్తగా నిర్వచించింది. ప్రదేశం ఏదైనా, సమయం ఏదైనా... ఉద్యోగికి–సంస్థకు మధ్య ఉండాల్సిన నమ్మకం, బాధ్యత అనే పునాదులే ఈ విధానాన్ని నడిపిస్తాయి. కాలంతో పాటు మారుతున్న ఈ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టడమే కాదు, దాన్ని స్వీకరించడమే మన ముందున్న అసలైన భవిష్యత్తు! హైబ్రిడ్ వర్క్ ఒక ప్రయోగం కాదు, అదొక సానుకూలమైన మార్పు.∙ రమా జంబుల -
యంత్ర కూర్మం
ఇవాన్ బడ్జ్ అనే ఈ 16ఏళ్ల కెనడియన్ కుర్రాడు యంత్ర కూర్మాన్ని రూపొందించాడు. సముద్రపు తాబేలు మాదిరిగా కనిపించే ఈ రోబో తాబేలు ఏఐ సాయంతో పనిచేస్తుంది. సముద్ర జలాల్లోకి దీనిని విడిచిపెడితే, అసలు తాబేలు మాదిరిగానే లోలోతుల వరకు చొరబడి ఈదులాడుతుంది. ఇందులోని శక్తిమంతమైన సెన్సర్లు, దీని ముందు భాగంలోను, అడుగు భాగంలోను అమర్చిన కెమెరాలు సముద్ర జలాల్లోని మైక్రోప్లాస్టిక్ కణాలను గుర్తించి, తొలగిస్తాయి.పగడపు దిబ్బల స్థితిగతుల సమాచారాన్ని సేకరించి, ఎప్పటికప్పుడు యాప్ ద్వారా మొబైల్‌ఫోన్‌కు చేరవేస్తాయి. ‘బయోనిక్ అండర్‌వాటర్ రోబోటిక్ టర్టల్’ (బర్ట్) పేరుతో రూపొందించిన ఈ యంత్ర కూర్మం సాగర జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషించగలదని చెబుతున్నారు. నమూనా యంత్ర కూర్మం పనితీరు పరిశీలించాక, మరిన్ని యంత్ర కూర్మాలను సముద్ర జలాల్లోకి విడిచిపెట్టాలని కెనడియన్ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. -
అంతరిక్షంలో వరిపంట
చైనీస్ అంతరిక్ష శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సాధించారు. చైనాకు చెందిన టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో తొలిసారిగా భూమికి 400 కిలోమీటర్లకు పైగా దూరంలోనున్న కక్ష్యలో వరిపంట పండించారు. ఈ అంతరిక్ష కేంద్రంలో పనిచేస్తున్న ‘షెంఝౌ–23 మిషన్’ బృందం శాస్త్రవేత్తలు గడచిన నాలుగేళ్లలో అంతరిక్షంలోనే వరి విత్తనాలను అభివృద్ధి చేశారు. అంతరిక్షంలో అభివృద్ధి చేసిన విత్తనాలతో ఇటీవల పూర్తిస్థాయిలో వరిపంట పండించారు.అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) సహా వివిధ అంతరిక్ష కేంద్రాలలో పనిచేసే శాస్త్రవేత్తల కోసం భూమి నుంచి ఆహార పదార్థాలు సహా నిత్యావసరాలను సరఫరా చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. భూమి పైనుంచి వచ్చే సరఫరాలపై ఆధారపడకుండా, అంతరిక్షంలోనే ఆహారపంటలు పండించే దిశగా శాస్త్రవేత్తలు కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. అంతరిక్షంలో ఆహారధాన్యాన్ని పండించడంలో చైనీస్ శాస్త్రవేత్తలు తొలి విజయాన్ని సాధించారు. -
మరో కియారాను చూస్తారు!
పెళ్లి.. ప్రెగ్నెన్సీ.. పేరెంట్‌హుడ్... ఇలా జీవితంలో ఎన్ని కొత్త దశలు వచ్చినా కెమెరాకు మాత్రం కియారా అద్వానీ బ్రేక్ చెప్పలేదు! వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తూనే, నటిగా తన ప్రయాణాన్నీ అంతే జోరుగా కొనసాగిస్తోంది. ఈ నిరంతర ప్రయాణం వెనుక ఉన్న విషయాలన్నీ ఆమె మాటల్లోనే!పేరులో చిన్న ట్విస్ట్!నా అసలు పేరు ఆలియా. సినిమాల్లోకి రాకముందు పేరు మార్చుకోవాల్సి వచ్చింది. ‘అంజానా అంజానీ’లో ప్రియాంక చోప్రా పోషించిన కియారా పాత్ర నాకు చాలా ఇష్టం. సల్మాన్ ఖాన్ కూడా అదే సూచించారు. అలా... నాకు ‘కియారా’ పేరు ఫిక్స్ అయిపోయింది.టీచర్ అవుతాననుకున్నా!మా అమ్మ టీచర్ కావడంతో.. చిన్నప్పుడు నేను కూడా అచ్చం అమ్మలాగే టీచర్ అవుదామనుకున్నా. కానీ జీవితం మనం అనుకున్నట్టే ఉండదు కదా! పిల్లలకు చదువు చెప్పాల్సిన నేను... ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చాను.ఇన్నేళ్లకు... వర్షంలో తడిశా!ఇన్ని సినిమాలు చేసినా ఇప్పటివరకు పక్కా సినిమాటిక్ వర్షపు సీన్ చేయలేదు. ‘టాక్సిక్’లో ఆ చాన్స్ వచ్చింది. స్క్రీన్ పై వర్షంలో తడుస్తూ కనిపించడం చాలా రొమాంటిక్‌గా ఉంటుంది కదా... కానీ షూటింగ్ సమయంలో మాత్రం ‘ఇంకెంతసేపు ఈ వర్షం!’ అనిపిస్తుంది!అది కనిపిస్తే డైట్‌కి బై చెప్తా!ఫిట్‌గా ఉండటానికి డైట్ చేస్తాను కానీ... తిండిని పూర్తిగా వదిలేయలేను! ముంబై మసాలా టోస్ట్ నా చిన్నప్పటి ఫేవరెట్. ఢిల్లీకి వెళ్తే మటర్ కుల్చా తినాల్సిందే. ఇంట్లో చేసే సింధీ వంటకాలంటే ఇంకా ఇష్టం. రాత్రి డార్క్ చాక్లెట్ కనిపిస్తే మాత్రం నా డైట్ కాస్త నన్ను వదిలేస్తుంది!కెరీర్‌కు ముందు, తర్వాత!‘టాక్సిక్’ సినిమాతో నేను ఇంతకుముందెప్పుడూ కనిపించని విధంగా కనిపిస్తాను. నిజంగా చెప్పాలంటే... టాక్సిక్‌కి ముందు ఒక కియారా, తర్వాత మరో కియారాను ప్రేక్షకులు చూస్తారు.‘ధోనీ’తో... నా ఆట మొదలైంది!‘ఫగ్లీ’తో మొదలుపెట్టినా... ‘ఎంఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ’ నా కెరీర్‌కు మంచి మలుపు. సాక్షి పాత్రను ప్రేక్షకులు అంతగా ఆదరిస్తారని ఊహించలేదు. ఆ సినిమా తర్వాత ‘కియారా’ అనే పేరు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది.బాడీగార్డ్‌లా చూసుకుంది!‘టాక్సిక్’ షూటింగ్ సమయంలో నా జీవితంలో చాలా ప్రత్యేకమైన దశ నడుస్తోంది. అప్పుడు నేను ప్రెగ్నెంట్‌ని. నేను సేఫ్‌గా ఉండేలా యశ్, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ చాలా జాగ్రత్త తీసుకున్నారు. వాళ్లు సెట్లో సహనటులు, దర్శకురాలు కంటే... నా బాడీగార్డ్స్‌లా మారిపోయారు!నా బ్యాగ్‌లోని బుక్!ఖాళీ సమయం దొరికితే ఇంట్లో కూర్చొని స్కెచ్‌లు వేస్తుంటాను. అందుకే, నా బ్యాగ్‌లో ఎప్పుడూ స్కెచ్‌బుక్ ఉంటుంది. కొన్నిసార్లు అమెరికన్ సిరీస్‌లు, సైకలాజికల్ థ్రిల్లర్స్ చూస్తూ టైమ్ పాస్ చేస్తాను. షూటింగ్ ప్రపంచం నుంచి కాస్త బయటకు రావడానికి ఇవే నా చిన్న చిన్న ఎస్కేప్స్.ఫిట్నెస్ ఫైట్!ఫిట్నెస్ అంటే నాకు బోరింగ్ వర్కౌట్స్ మాత్రమే కాదు. ఎంఎంఏ, కిక్‌బాక్సింగ్ లాంటివి కూడా చేస్తాను. అవి ఫిట్‌గా ఉంచడంతో పాటు చాలా ఎనర్జీ ఇస్తాయి. పైగా యాక్షన్ సినిమాల్లో పనిచేసేటప్పుడు ఆ ట్రైనింగ్ బాగా ఉపయోగపడుతుంది. -
ఈ రాఖీ పండుగకు ఇలాంటి తీపి రెసిపీలను చేసేయండిలా..!
బెంగాలీ చమ్ చమ్కావలసినవి..ఛెనా తయారీకి– చిక్కటి పాలు: 1 లీటరు, నిమ్మరసం: 2 టేబుల్ స్పూన్లు, కార్న్‌ఫ్లోర్: టీస్పూన్, పాకం కోసం– పంచదార: ఒకటిన్నర కప్పులు, నీళ్ళు: 4 కప్పులు, ఏలకుల పొడి: 1/2 టీస్పూన్, కుంకుమపువ్వు: కొన్ని రేకలు, స్టఫింగ్ కోసం: కోవా (3–4 టేబుల్ స్పూన్లు), డ్రైఫ్రూట్స్: పిస్తా, బాదం ముక్కలు, ఎండు కొబ్బరి పొడి, ఫుడ్ కలర్: 2 చుక్కలు.తయారీ..ముందుగా పాలను ఒక గిన్నెలో పోసి బాగా మరిగించండి. పాలు మరిగిన తర్వాత స్టవ్ ఆపి, 2 నిమిషాలు చల్లారాక అందులో నీటిలో కలిపిన నిమ్మరసాన్ని కొద్దికొద్దిగా వేస్తూ పాలు విరిగేలా తిప్పాలి. పాలు, నీరు వేరయ్యాక, ఒక పలచని కాటన్ క్లాత్‌లో వడకట్టి, వెంటనే చల్లని నీటితో కడిగి నీరంతా పోయేలా 30 నిమిషాల పాటు వేలాడదీయాలి. ఇప్పుడు ఈ ఛెనాని ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకుని ఒక టీ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసి అరచేతితో మెత్తగా ఒత్తాలి. రంగు కావాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని సమానమైన భాగాలుగా చేసుకుని పగుళ్లు లేకుండా కోలగా ఒత్తుకోవాలి. తరువాత ఒక వెడల్పాటి పాత్రలో చక్కెర, 4 కప్పుల నీళ్ళు పోసి మరిగించాలి. చక్కెర కరిగిన తర్వాత పాకం బాగా మరుగుతున్నప్పుడు, తయారుచేసి పెట్టుకున్న ఛెనా రోల్స్‌ను ఒక్కొక్కటిగా నెమ్మదిగా అందులో వేయాలి. ఇవి 15–20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌పై ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత పాకం నుంచి చమ్ చమ్‌లను బయటకు తీసి మధ్యలో చిన్నగా గాటు పెట్టాలి. అందులో కొద్దిగా కోవా నింపాలి. చివరిగా ఎండు కొబ్బరి పొడిలో వీటిని దొర్లించి, పైన పిస్తా, బాదం ముక్కలతో అలంకరిస్తే ఎంతో రుచికరమైన బెంగాలీ చమ్ చమ్ సిద్ధం!బనారసీ పాన్ ఫడ్జ్కావలసినవి..ఫడ్జ్ బేస్ కోసం– వైట్ చాక్లెట్: 400 గ్రాములు, స్వీటెండ్ కండెన్స్డ్ మిల్క్: 1 కప్పు, వెన్న: 2 టేబుల్ స్పూన్లు, గ్రీన్ ఫుడ్ కలర్: 2 చుక్కలు, తాజా తమలపాకులు: 8, పాన్ మసాలా (ఫ్లేవర్ కోసం), గుల్కంద్: 3 టేబుల్ స్పూన్లు, స్వీట్ సోంప్: 2 టేబుల్ స్పూన్లు, టూటీ ఫ్రూటీ: 2 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి పొడి: 2 టేబుల్ స్పూన్లు, ఏలకుల పొడి: 1/2 టీస్పూన్, పాన్ ఎసెన్స్: కొన్ని చుక్కలు, గార్నిషింగ్ కోసం: సన్నగా తరిగిన పిస్తా, బాదం, ఎండిన గులాబీ రేకులు, సిల్వర్ ఫాయిల్.తయారీ..ముందుగా ఒక పాత్రలో పార్చ్మెంట్ పేపర్‌ను తీసుకుని దానికి కొద్దిగా వెన్నపూసి పక్కన పెట్టుకోవాలి. తరువాత పాన్పేస్ట్ కోసం బ్లెండర్లో తమలపాకులతో పాటు కండెన్స్డ్ మిల్క్ పోసి, మెత్తగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి మరిగించి, దానిపై వేడి తగిలేలా మరొక గిన్నెను ఉంచండి. అందులో తురిమిన వైట్ చాక్లెట్, వెన్న, తయారుచేసి పెట్టుకున్న తమలపాకు–కండెన్స్డ్ మిల్క్ మిశ్రమాన్ని వేయండి. చాక్లెట్ పూర్తిగా కరిగే వరకు కలపండి. ఈ మిశ్రమంలోనే ఒక చుక్క గ్రీన్ కలర్, పాన్ ఎసెన్స్ కలపవచ్చు. తరువాత స్టవ్ ఆపి, ఆ మిశ్రమంలో గుల్కంద్, స్వీట్ సోంపు, టూటీ ఫ్రూటీ, ఎండు కొబ్బరి పొడి, ఏలకుల పొడి వేసి బాగా కలపండి. ఇపుడు సిద్ధంగా ఉన్న ట్రేలోకి ఈ మిశ్రమాన్ని పోసి, గరిటెతో సమంగా ఒత్తుకొని.. పైన తరిగిన పిస్తా, గులాబీ రేకులు, టూటీ ఫ్రూటీ, సిల్వర్ ఫాయిల్‌తో అందంగా అలంకరించండి. ఈ ట్రేని 3 నుంచి 4 గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచి.. ఫడ్జ్ బాగా గట్టిపడిన తర్వాత, పేపర్ సాయంతో బయటకు తీసి, వేడి నీటిలో ముంచి తుడిచిన పదునైన చాక్‌తో చిన్న చిన్న చతురస్రాకార ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే బనారసీ పాన్ ఫడ్జ్ సిద్ధం. దీనిని గాలి చొరబడని డబ్బాలో ఉంచి ఫ్రిజ్‌లో పెడితే 2 వారాల వరకు తాజాగా ఉంటుంది.ఫిర్నీకావలసినవి..బాస్మతీ బియ్యం: 3 టేబుల్ స్పూన్లు, చిక్కటి పాలు: 1 లీటరు, పంచదార: 1/2 కప్పు, ఏలకుల పొడి: 1/2 టీస్పూన్, కుంకుమపువ్వు: 10–12 రేకలు (పాలలో నానబెట్టినవి), రోజ్ వాటర్: టీస్పూన్, డ్రై ఫ్రూట్స్: బాదం, జీడిపప్పు, పిస్తా ముక్కలుతయారీ..30 నిమిషాల పాటు నానబెట్టిన బాస్మతీ బియ్యాన్ని పూర్తిగా వడకట్టి, నీళ్లు కలపకుండా మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత ఒక మందపాటి పాత్రలో లీటరు పాలు పోసి మీడియం ఫ్లేమ్‌పై మరిగించి.. పాలు ఒక పొంగు వచ్చాక.. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం రవ్వను అందులో వేయాలి. సన్నని మంటపై మిశ్రమం చిక్కగయ్యే వరకు కలుపుతూ ఉడికించాలి. బియ్యం రవ్వ పూర్తిగా మెత్తగా ఉడికి, పాలు చిక్కగా అయ్యాక అందులో పంచదార, నానబెట్టిన కుంకుమపువ్వు పాలు, ఏలకుల పొడి వేసి బాగా కలపాలి. పంచదార కరిగే వరకు మరో 5 నిమిషాలు ఉడికించాలి. స్టవ్ ఆపేసి, అందులో రోజ్‌వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా తయారైన ఫిర్నీని మట్టి గ్లాసులలో లేదా గాజు బౌల్స్‌లో పోసి, పైన తరిగిన బాదం, పిస్తా ముక్కలతో అలంకరించాలి. దీనిని కనీసం 2–3 గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచి, బాగా కూల్ అయిన తర్వాత తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.(చదవండి: హై‘టెక్’ రాఖీ..! చూడ్డానికి చిన్నవే..సర్ప్రైజ్లో మాత్రం..) -
అది మలబద్ధకమేనా? పిల్లలు ఎందుకు ఆపుకుంటారు ?
మా ఐదేళ్ల బాబుకు రోజూ మలవిసర్జన కావడం లేదు. రెండు మూడు రోజులకు ఒకసారి వెళతాడు. మలవిసర్జనకి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ, నొప్పిగా ఉందని ఏడుస్తాడు. ఇంట్లో వాళ్లు పిల్లాడు మొండిగా చేస్తున్నాడంటున్నారు. ఇంకొందరు ఇది మలబద్ధకమే అంటున్నారు. ఏం చేయాలి? – లక్ష్మి, గుంటూరుమీ సందేహం చాలా సహజం. పిల్లలకు మలవిసర్జన సరిగ్గా రాకపోతే తల్లిదండ్రులు ముందుగా ఆందోళన పడేది ఇదే. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. రోజూ మలవిసర్జన రాకపోవడం ఒక్కటే మలబద్ధకం కాదు. కొంతమంది పిల్లలకు రోజూ రావచ్చు; మరికొందరికి రెండు రోజులకు ఒకసారి రావచ్చు. మలం మెత్తగా ఉండి, పిల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తుంటే పెద్దగా ఆందోళన అవసరం లేదు. కానీ మలం చాలా గట్టిగా ఉండటం, మలవిసర్జన చేసేటప్పుడు నొప్పి రావడం, బాగా ఒత్తిడి చేయాల్సి రావడం, మలం పూర్తిగా బయటకు రాకపోవడం, పిల్లలు కావాలనే మలవిసర్జన ఆపుకోవడం వంటి లక్షణాలు ఉంటే మాత్రం మలబద్ధకం గురించి ఆలోచించాలి.పిల్లలుఎందుకు ఆపుకుంటారు?ఇక్కడే చాలామంది తల్లిదండ్రులు పిల్లలను తప్పుగా అర్థం చేసుకుంటారు. పిల్లాడు కావాలనే మలవిసర్జన ఆపుకుంటున్నాడని, మొండితనం చేస్తున్నాడని అనుకుంటారు. కానీ చాలా సందర్భాల్లో అసలు కారణం నొప్పి భయం. ఒకసారి మలం చాలా గట్టిగా వచ్చి నొప్పి కలిగితే, మళ్లీ విసర్జన చేస్తే అదే నొప్పి వస్తుందని పిల్లలు భయపడతారు. అందుకే మలవిసర్జన వచ్చినా ఆపుకుంటాడు. అలా ఆపుకోవడంతో మలం మరింత గట్టిగా మారుతుంది. తర్వాత విసర్జన చేసేటప్పుడు ఇంకా ఎక్కువ నొప్పి వస్తుంది. దీంతో మళ్లీ ఆపుకుంటాడు. ఇలా నొప్పి, భయం, విసర్జన ఆపుకోవడం ఒక చక్రంలా మారుతుంది. అందుకే పిల్లలను తిట్టడం లేదా బలవంతంగా మరుగుదొడ్డిపై కూర్చోబెట్టడం సమస్యను మరింత పెంచవచ్చు. ముందుగా పిల్లవాడు ఎందుకు మలవిసర్జన ఆపుకుంటున్నాడో అర్థం చేసుకోవాలి.పండ్లు పెడితే తగ్గిపోతుందా?పండ్లు, కూరగాయలు, పీచు ఎక్కువగా ఉండే ఆహారం మలబద్ధకం తగ్గడానికి సహాయపడుతుంది. కానీ కేవలం పండ్లు పెట్టడంతోనే సమస్య వెంటనే పూర్తిగా తగ్గిపోతుందని అనుకోకండి. పిల్లల ఆహారంలో పండ్లు, కూరగాయలు, పప్పులు, సంపూర్ణ ధాన్యాలు వంటి పీచు పదార్థాలు ఉండేలా చూడాలి. అలాగే పిల్లలకు సరిపడా నీరు అందాలి. రోజూ కొంతసేపు ఆడుకోవడం, నడవడం వంటి శారీరక కదలికలు కూడా అవసరం.పాలు ఇస్తే బలంగా పెరుగుతారా?పాలు పిల్లల ఎదుగుదలకు అవసరమే. కానీ అవసరానికి మించి పాలు మాత్రమే ఇస్తూ, ఇతర ఆహారాన్ని తగ్గించడం మంచిది కాదు. అలా చేస్తే పీచు పదార్థాలు తక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే పాలు మాత్రమే కాకుండా పండ్లు, కూరగాయలు, పప్పులు, ధాన్యాలతో కూడిన సమతుల ఆహారం ఇవ్వాలి.అలవాటు కూడా ముఖ్యమే?ముఖ్యంగా ఉదయం అల్పాహారం తర్వాత పిల్లలను కొంతసేపు ప్రశాంతంగా మరుగుదొడ్డిపై కూర్చోబెట్టే అలవాటు చేయవచ్చు. తొందరపెట్టకుండా, భయపెట్టకుండా ప్రశాంతంగా ఉండేలా చూడాలి. మరుగుదొడ్డిపై కూర్చున్నప్పుడు పిల్లల కాళ్లు వేలాడకుండా కింద చిన్న పీట ఉంచితే మంచిది. కాళ్లకు సరైన ఆధారం ఉండటం వల్ల మలం సులభంగా బయటకు రావడానికి సహాయపడుతుంది.మలవిసర్జన చేయకపోతే తిట్టాలా? అసలు వద్దు. మలబద్ధకంలో పిల్లలను తిట్టడం, అవమానించడం, బలవంతం చేయడం వల్ల వాళ్లలో మలవిసర్జన చేయడంపై భయం మరింత పెరగవచ్చు. బదులుగా పిల్లలను ప్రోత్సహించాలి. విసర్జన చేయడానికి ప్రయత్నించినా ప్రశంసించాలి. సమస్య గురించి పిల్లలతో ఓపికగా మాట్లాడాలి.మందులు ఇవ్వొచ్చా?అవసర మైనప్పుడు వైద్యుల సూచనతో మందులు ఇవ్వవచ్చు. ముఖ్యంగా మలం చాలా గట్టిగా ఉండి పిల్లలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నప్పుడు లేదా సమస్య పదేపదే వస్తున్నప్పుడు వైద్యుడు తగిన చికిత్స సూచించవచ్చు. అయితే ఇంట్లో పెద్దలకు ఉపయోగించిన మందులను పిల్లలకు స్వయంగా ఇవ్వకండి. అలాగే ఎవరో చెప్పారని మలబద్ధకం మందులు మొదలుపెట్టి, సమస్య తగ్గగానే మీకు మీరే ఆపేయడం కూడా మంచిది కాదు. పిల్లల వయసు, బరువు, సమస్య తీవ్రతను బట్టి చికిత్స మారుతుంది.వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?పుట్టినప్పటి నుంచే తీవ్రమైన మలబద్ధకం ఉండటం, పుట్టిన తర్వాత మొదటి రెండు రోజుల్లో మలం రాకపోవడం, పొట్ట ఎక్కువగా ఉబ్బడం, తీవ్రమైన పొట్ట నొప్పి, పదేపదే వాంతులు, మలంలో రక్తం కనిపించడం, బరువు సరిగా పెరగకపోవడం, జ్వరం, పిల్ల చాలా నీరసంగా కనిపించడం లేదా ఇంట్లో తీసుకున్న జాగ్రత్తలతో సమస్య తగ్గకుండా పదేపదే వస్తుండటం వంటి లక్షణాలు ఉంటే పిల్లల వైద్యుడిని సంప్రదించాలి.చివరగా ఒక మాట... పిల్లవాడు విసర్జన ఆపుకుంటున్నాడంటే ముందుగా అతను ఎందుకు అలా చేస్తున్నాడో తెలుసుకోండి. చాలాసార్లు దాని వెనుక మొండితనం కాదు. నొప్పి, ఆ నొప్పిపై భయం ఉంటాయి. ఆ భయాన్ని అర్థం చేసుకోండి. మలబద్ధకాన్ని చిన్న సమస్యగా కాకుండా.. పిల్లల మాట వినండి, కారణాన్ని అర్థం చేసుకోండి, సరైన సమయంలో పరిష్కరించండి.- డా. కె. పవన్ కుమార్, సీనియర్, పీడియాట్రిషియన్, పీడియాట్రిక్ అలర్జిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ -
శ్రీలంకలో ఘనంగా పెరహెర వేడుకలు.. ఎందుకు జరుపుతారంటే?
సంస్కృతి, ఆధ్యాత్మికతతో ముడిపడినటువంటి ‘కాండీ ఎసల పెరహెర వేడుకలు’ శ్రీలంకలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆగస్టు 18 నుంచి 28 వరకు సాగే ఈ వేడుకలను మొత్తం 10 రాత్రులు, 11 రోజులు పాటు అత్యంత కోలాహలంగా నిర్వహిస్తారు. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఊరేగింపులు, కళాకారుల ప్రదర్శనలు, అలంకరణలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ మహోత్సవంలో తుది ఘట్టమైన ‘రాందోళి పెరహెర’ ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.కాండీ ఎసల పెరహెర ఉత్సవాల తేదీలు ప్రతి సంవత్సరం మారుతున్నప్పటికీ, ఈ పండుగ నిర్వహణ ఎప్పుడూ ఒకేలా సాగుతుంది. ఈ సంబరాలు ప్రధానంగా మూడు ఘట్టాలుగా కొనసాగుతాయి.ఉత్సవాల్లో ప్రారంభ క్రతువు కప్ సిటువీమ. ఈ వేడుకలు శ్రీ దళదా మాలిగావా (బుద్ధుని పవిత్ర దంత అవశేషం ఉన్న దేవాలయం) ప్రాంగణంలో ప్రారంభమవుతాయి. ఉత్సవ ప్రారంభానికి సూచికగా ఆలయ ప్రాంగణంలో ఒక పవిత్ర వృక్షాన్ని నాటుతారు. ఇది ప్రధానంగా మతపరమైన ఆచారం అయినప్పటికీ, పెరహెర సీజన్ కు ఇది అధికారిక ప్రారంభ ఘట్టంగా నిలుస్తుంది.ఉత్సవాల్లో రెండో ఘట్టం కుంభాల్ పెరహెర. పండుగ మొదటి ఐదు రాత్రులను ‘కుంభాల్ పెరహెర’ అని పిలుస్తారు. ఈ ప్రారంభ ఊరేగింపులు పరిమాణంలో కాస్త చిన్నవిగా, సంప్రదాయబద్ధంగా సాగుతాయి. ఎక్కువ రద్దీ లేకుండా పండుగ వాతావరణాన్ని ప్రశాంతంగా ఆస్వాదించడానికి ఇవి చక్కటి అవకాశం. ఈ రాత్రులలో సంప్రదాయ కాండియన్ నృత్యకారులు, కొరడా ఝళిపించే ప్రదర్శకులు, మేళతాళాల వాయిద్యకారులు, అలంకరించిన ఏనుగులు, దివిటీలు పట్టిన సేవకులు పాల్గొంటారు.మూడో ఘట్టం రాందోళి పెరహెర. అంటే మహా ఊరేగింపులు. ఆఖరి ఐదు రాత్రులను ‘రాందోళి పెరహెర’ అని పిలుస్తారు. పండుగ మొత్తంలోనే అత్యంత అద్భుతంగా, వైభవంగా సాగే రాత్రులు ఇవే! ఈ ఊరేగింపులు జరిగేటప్పుడు కాండీ నగర వీథులు వేలాదిమంది భక్తులతో, పర్యాటకులతో నిండిపోతాయి. వందలాది మంది నృత్యకారులు, కళాకారులు, వాద్యకారుల బృందాలు, రాత్రి ఆకాశాన్ని కాంతులతో నింపే అగ్ని విన్యాసకులు, విద్యుత్ దీపాలతో ప్రకాశించే వస్త్రాలు ధరించిన గజరాజులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇవి కాండీ పెరహెరకే అత్యంత ముఖ్యమైన ఘట్టాలు కావడంతో అంతర్జాతీయ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.ఈ ఉత్సవాల్లో చివరి ఊరేగింపు రాత్రి వేకువ జామున జరిగే వేడుక దహవల్ పెరహెర. ఇందులో భాగంగా మహావలి నది ఒడ్డున జరిగే ‘దియా–కెపీమ’ అంటే ‘జలఖండన’ కార్యక్రమంతో ఎసల పెరహెర ముగుస్తుంది. ఇందులో భాగంగా నదీ జలాలను లాంఛనప్రాయంగా ఖండించినట్లు నీళ్లల్లో కత్తులను తాటిస్తారు. ఈ క్రతువును వీక్షించేందుకు సాధారణ ప్రజలకు అనుమతి ఉండదు.శ్రీలంకలో జరిగే ప్రసిద్ధ ‘కాండీ ఎసల పెరహెర’ ఉత్సవం కేవలం ఒక సాంస్కృతిక ప్రదర్శన మాత్రమే కాదు. ఇది శతాబ్దాలుగా కొనసాగుతున్న ఒక ఆధ్యాత్మిక సంప్రదాయం. గౌతమ బుద్ధుని పవిత్ర దంత అవశేషానికి అత్యంత భక్తిశ్రద్ధలతో గౌరవం అర్పిస్తూ, దేశానికి సమృద్ధిగా, సమయానుకూల వర్షాలు, ప్రజలకు శుభాలు కలగాలని కోరుకుంటూ ఈ పండుగను నిర్వహిస్తారు. ఈ చారిత్రాత్మక వేడుక శ్రీలంక బౌద్ధ సంస్కృతి విశిష్టతను ప్రపంచానికి చాటిచెబుతోంది.- రమా జంబుల -
సంప్రదాయానికి స్టైల్ జోడిస్తే.. లుక్ తగ్గేదేలే!
అబ్బాయిల కోసం... పెళ్లి వస్తే షేర్వానీ, పండగ వస్తే కుర్తా! అంతే... కథ క్లోజ్! అనుకుంటే మీ పొరపాటే! ఇప్పుడు మెన్స్ ఫ్యాషన్ బాగా మారింది. సంప్రదాయానికి కాస్త స్టయిల్ జతచేస్తే ఫ్యాషన్ తో పోటీపడే సంప్రదాయ రాయలు మీరే అవుతారు! అయితే, ముందు మీరు ఈ టిప్స్ తెలుసుకోండి!పెళ్లికి వచ్చిన హీరో!పెళ్లి వేడుకలో అందరి చూపు మీవైపు ఉండాలంటే షేర్వానీకి మించిన ఆప్షన్ కష్టం. అయితే, అదే షేర్వానీని సిల్క్, బ్రొకేడ్ వంటి రిచ్ ఫ్యాబ్రిక్స్, ఎంబ్రాయిడరీ వర్క్‌తో రాయల్ లుక్ కనిపిస్తుంది. దీనికి ధోతీ ప్యాంట్ జత చేస్తే లుక్ పూర్తవుతుంది. అయితే ఎంబ్రాయిడరీ ఎక్కువగా ఉన్న షేర్వానీ అయితే మిగతా యాక్సెసరీస్‌ను కాస్త సింపుల్‌గా ఉంచండి.కూల్ కజిన్!షేర్వానీ రిచ్‌గా అనిపిస్తుంది... కుర్తా కాస్త క్యాజువల్‌గా అనిపిస్తుంది. ఈ రెండింటి మధ్యలో చక్కగా బ్యాలెన్స్ చేసేది యాచ్కన్ . పొడవు కాస్త తక్కువగా ఉండటంతో ఇది సంప్రదాయంగానూ, సౌకర్యంగానూ ఉంటుంది. ఎంగేజ్మెంట్, పండగ, పెళ్లి వేడుక... సందర్భాన్ని బట్టి చుడీదార్ లేదా ధోతీ ప్యాంట్‌తో జత చేసుకోవచ్చు.ఫెయిల్ కాని బ్యాక్‌బెంచర్!మెన్స్ ఎథ్నిక్ వేర్లో కుర్తా అంటే... టాప్బ్యాక్బెంచర్. కుర్తా ఒకసారి వార్డ్‌రోబ్‌లోకి వచ్చిందంటే చాలు. ఇక మిమ్మల్ని ఏ అకేషన్‌లోనూ ఫెయిల్ కానివ్వదు. ఆ ఒక్క డ్రెస్‌తో ఎన్నో అవతారాలు! కాటన్ కుర్తా అయితే సింపుల్ అండ్ కూల్. సిల్క్ లేదా ఎంబ్రాయిడరీ కుర్తా అయితే పండగ లుక్. ప్యాంట్‌తో వేసుకుంటే క్లాసీ... జీన్స్‌తో వేసుకుంటే యూత్‌ఫుల్! అయితే, కుర్తా రంగుకి కాస్త కాంట్రాస్ట్‌లో రంగులో జాకెట్ ఉంటే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.సూట్ కాస్త స్టయిల్‌గా! సంప్రదాయంగా కనిపించాలి... కానీ మరీ పెళ్లి కొడుకులా కాకూడదు అనుకుంటే జోధ్‌పురి లేదా బంధ్‌గలా బెస్ట్. సాధారణ సూట్‌కి, కాస్త ఇండియన్ స్టయిల్ కలిస్తే అదే జోధ్‌పురి మ్యాజిక్! హై నెక్ కాలర్, స్ట్రక్చర్డ్ ఫిట్ దీనికి ప్రత్యేక ఆకర్షణ. రిసెప్షన్ , ఫార్మల్ ఫంక్షన్ , కల్చరల్ ఈవెంట్... ఎక్కడైనా ఇది చాలా క్లాసీగా ఉంటుంది.మూలాలు మర్చిపోకుండా! ధోతీ అంటే పెద్దల డ్రెస్ అనుకునే రోజులు పోయాయి. సరైన కుర్తా, జాకెట్, ఫుట్‌వేర్‌తో ధోతీని కూడా చాలా స్టైలిష్‌గా క్యారీ చేయొచ్చు. పండగలు, దేవాలయ వేడుకలు, సంప్రదాయ కార్యక్రమాలకు ఇది ప్రత్యేకమైన లుక్ ఇస్తుంది. ట్రెండ్ మారొచ్చు... కానీ కొన్ని స్టయిల్స్ మన రూట్స్‌ను ఎప్పటికీ మర్చిపోనివ్వవు!చివరిగా... ఎథ్నిక్ అంటే పాతకాలం కాదు! డ్రెస్ ఏదైనా... దాన్ని ఎలా క్యారీ చేస్తున్నారన్నదే అసలైన ఫ్యాషన్! కాబట్టి ఈసారి ఎథ్నిక్ వేర్ వేసుకునేటప్పుడు సంప్రదాయాన్ని మాత్రమే కాదు, మీ స్టయిల్‌ను కూడా వెంట తీసుకెళ్లండి!- కొండి దీపిక -
భీమరాజు బలానికి జాలయ్య గొంతు తోడైతే.. దొంగలు పరార్!
కంచిపేటలో భీమరాజు అనే వస్తాదు ఉండేవాడు. అతని ఆకారం కండలు తిరిగిన దేహంతో భారీగా బలిష్టంగా ఉండేది. కానీ స్వతహాగా అతను చాలా పిరికివాడు. దానికితోడు అతని గొంతు కూడా ఆకారానికి సంబంధం లేకుండా పీలగా ఉండేది.దాంతో భీమరాజు వీలైనంత తక్కువగా మాట్లాడుతూ న్యూనతతో ఉండేవాడు. కానీ చుట్టుపక్కల గ్రామాల్లో జరిగే కుస్తీ పోటీల్లో మాత్రం చురుగ్గా పాల్గొని తప్పనిసరిగా బహుమతులు గెలుచుకునేవాడు.ఒకసారి రాజధానిలో భారీఎత్తున కుస్తీపోటీలు నిర్వహిస్తున్నట్టు, బహుమతి కూడా చాలా అధిక మొత్తంగా ఉంటుందనీ రాజుగారు చాటింపు వేయించారు.ఆ పోటీల్లో గెలిస్తే బహుమతితో పాటు పేరుప్రతిష్ఠలు కూడా పెరుగుతాయి కాబట్టి పోటీలో పాల్గొనడానికి రాజధానికి బయలుదేరేందుకు సిద్ధపడ్డాడు భీమరాజు. కానీ వచ్చిన చిక్కల్లా ఏమిటంటే, కంచిపేటకు రాజధానికి మధ్య ఒకరోజు ప్రయాణదూరం, అదీ చిక్కని అడవిమార్గం గుండా. స్వతహాగా పిరికివాడైన భీమరాజు ఈ సమస్యని అధిగమించి రాజధాని చేరడమెలా అని ఆలోచిస్తున్నాడు. అప్పుడే అతనికి జాలయ్య తనకి సహాయపడగలడని అనిపించింది.జాలయ్య శారీరకంగా భీమరాజుకి భిన్నంగా బక్కపల్చగా ఉన్నా చాలా ధైర్యశాలి. అతని గొంతు కూడా గంభీరంగా ఉండి ఊళ్లో చాలా చురుకైనవాడిగా పేరు ఉంది. జాలయ్యని కలిసి భీమరాజు రాజధాని వరకు తనకు తోడుగా వచ్చి సహాయపడమని కోరాడు. జాలయ్యకి కూడా ఎప్పటినుంచో రాజధానికి వెళ్లి ఏదైనా ఉద్యోగం సంపాదించి స్థిరపడాలని ఉంది. అందుకే జాలయ్య వెంటనే భీమరాజు ప్రతిపాదనని అంగీకరించాడు.పోటీలకు రెండు రోజుల ముందు భీమరాజు, జాలయ్య కంచిపేట నుండి రాజధానికి బయలుదేరారు. ఎంత ప్రయత్నించినా చీకటి పడేసరికి అడవిని దాటలేక మార్గమధ్యంలోనే రాత్రి బస చేయవలసివచ్చింది. అడవిలో ఒక పాడుబడ్డ ఆలయం ఆవరణలో ఇద్దరూ విశ్రమించారు. భయంతో భీమరాజుకి నిద్ర పట్టలేదు.అర్ధరాత్రి సమయంలో ఏదో అలికిడికి జాలయ్యకి కూడా మెలకువ వచ్చింది.కొందరు బందిపోటు దొంగలు అటువేపుగా వస్తున్నట్టు ఇద్దరికీ అర్థమైంది. ఇద్దరూ ఒక స్తంభం చాటుగా ఉండి గమనించసాగారు. ఓ నలుగురు దొంగలు పెద్ద పెద్ద నగల మూటలతో ఆ ఆవరణలోకి వచ్చారు.భీమరాజుని ఆ దొంగలమీదికి ఉసిగొల్పి వాళ్లని కాళ్లకి బుద్ధి చెప్పేలా చేస్తే ఆ నగలు తామిద్దరూ చెరిసగం పంచుకోవచ్చన్న ఉపాయం జాలయ్యకి తట్టింది. అదే విషయం భీమరాజుకి చెప్పగా భయంతో అతనికి నోట మాట పెగల్లేదు. కానీ జాలయ్య అతనికి ధైర్యాన్ని నూరిపోసి, కేవలం తన ఆకారాన్ని మాత్రమే వాళ్ల ముందు ప్రదర్శించమనీ, వెనుకనుండి తాను తన గొంతుతో మాట్లాడి మిగతా తంతు నడిపిస్తాననీ చెప్పి ఒప్పించాడు. తన గొంతుపై కాకపోయినా, భుజబలం మీద అమితమైన నమ్మకమున్న భీమరాజు అయిష్టంగానైనా జాలయ్య ఉపాయానికి తలొగ్గక తప్పలేదు.జాలయ్య తన గొంతుతో ‘‘ఎవడ్రా అక్కడ! ప్రాణాల మీద తీపి ఉంటే వెంటనే పారిపోండి!’’ అంటూ భీకరంగా హుంకరిస్తుంటే, మహాకాయుడైన భీమరాజు నీడ ఆ దొంగలపై పడుతుండగా కాస్త దూరంగా నిల్చున్నాడు. నలుగురు దొంగలూ ఆ మహాకాయాన్ని చూసి అతనితో బాహాబాహీకి దిగితే సున్నంలోకి ఎముకలు కూడా మిగలవని తలచి ఆ నగల మూటలు అక్కడే పడేసి కాళ్లకి బుద్ధి చెప్పారు.జాలయ్య ఉపాయం పారింది. ఆ నగల మూటలతో ఉదయానికి వాళ్లిద్దరూ రాజధానికి చేరుకున్నారు.తన భుజబలంతో భీమరాజు పోటీలన్నిటిలోనూ నెగ్గి, బహుమతి పైకంతో పాటు రాజుగారి అభిమానాన్నీ పొందాడు.తమవికాని నగలు రాజుగారికి అప్పగించేద్దామని భీమరాజు జాలయ్యని కోరాడు. ఉపాయం తనదే అయినా భీమరాజు వల్లే తమకి ఆ నగలు దక్కాయి కాబట్టి జాలయ్య కూడా భీమరాజు కోరికని అంగీకరించాడు. అలా దొంగలనుండి తమకి దొరికిన నగల మూటల్ని రాజుగారికి అందిస్తూ తాను అక్కడి వరకు చేరుకునేందుకు జాలయ్య ఎలా సహాయపడ్డాడో పూసగుచ్చినట్టు వివరించాడు భీమరాజు.గత కొద్దిరోజులుగా రాజ్యంలో జరిగిన దొంగతనాల్లో పోయిన నగలు ఈవిధంగా తమకి తిరిగి అప్పగించిన భీమరాజునీ, జాలయ్యనీ మెచ్చుకుని, వాళ్లిద్దరికీ తగిన ఉద్యోగాలిచ్చి తన కొలువులోనే ఉంచుకున్నారు రాజుగారు. అలా అప్పటినుండీ అందరూ ‘అసలైన వస్తాదు’గా భీమరాజునీ, ‘గొంతు వస్తాదు’గా జాలయ్యనీ పిలవసాగారు.- మల్లారెడ్డి మురళీ మోహన్హితవచనం..అనాహూతః ప్రవిశతి అపృష్టో బహు భాషతేఅవిశ్వస్తే విశ్వసితి మూఢచేతా నరాధమః - మూఢులైన నరాధములు ఆహ్వానం లేకుండానే లోపలకు ప్రవేశిస్తారు. ఏమీ అడగకపోయినా అనవసరంగా అతిగా మాట్లాడతారు. తమను నమ్మనివాళ్లను నమ్ముతారు. -
పూర్వజన్మ పాపం.. రాజును వెంటాడిన వ్యాధి!
పూర్వం సౌరాష్ట్ర రాజ్యాన్ని సోమకాంతుడు సర్వసుభిక్షంగా పరిపాలించేవాడు. అతడి భార్య సుధర్మ. ఆ దంపతులకు హేమకంఠుడు అనే పుత్రుడు కలిగాడు. హేమకంఠుడు దినదిన ప్రవర్ధమానంగా ఎదిగి, సకల విద్యలూ అభ్యసించి, యువరాజు అయ్యాడు.కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! సర్వసౌఖ్యాలూ అనుభవిస్తూ, సమస్త వైభోగాలతో తులతూగుతూ ఉన్న సోమకాంతుడు జన్మాంతర పాపఫలితంగా కుష్టువ్యాధి బారిన పడ్డాడు. శరీరమంతా వ్రణాలు ఏర్పడి, నిరంతరం చీము కారుతూ, దుర్గంధభూయిష్టంగా మారింది. వ్యాధి నివారణ కోసం సోమకాంతుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అవేవీ ఫలించలేదు. చివరకు సోమకాంతుడు వానప్రస్థానికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. సమస్త పరివారాన్నీ పిలిచి, తన నిర్ణయాన్ని ప్రకటించాడు. అతడి నిర్ణయానికి అంతఃపుర కాంతలు, అమాత్యులు, భృత్యులు పెద్దపెట్టున రోదించారు. తాము కూడా వానప్రస్థానికి వస్తామని అన్నారు. సోమకాంతుడు వారికి నచ్చజెబుతూ, ‘నా కుమారుడు హేమకంఠుడికి రాజ్యాన్ని అప్పగిస్తున్నాను. అతడికి పట్టాభిషేకం చేయండి. మీరంతా నన్ను సేవించుకున్నట్లే, అతడిని సేవించండి’ అని పలికాడు.మహారాణి సుధర్మ ‘భర్తను అనుసరించడమే పతివ్రతా ధర్మం’ అని చెప్పి, సోమకాంతుడితో పాటు తాను కూడా వానప్రస్థానికి సిద్ధపడింది. కొద్దిమంది పరివారం వెంటరాగా రాజ దంపతులు వానప్రస్థానికి బయలుదేరారు. సోమకాంతుడు, సుధర్మ తమ పరివారం వెంటరాగా అడవుల్లో అక్కడక్కడా మజిలీలతో కొన్నాళ్ల ప్రయాణం తర్వాత వారంతా ఒక దుర్గమారణ్యానికి చేరుకున్నారు. అక్కడ ఒక సరోవరం కనిపించింది. రాజ పరివారం ఆ సరోవరంలో స్నానాలు చేసి, అందులోని నీళ్లు తాగి, అక్కడి చెట్ల నుంచి కోసుకున్న పండ్లు ఆరగించి, వాటి నీడలో సేదదీరసాగారు. సోమకాంతుడి కోరికపై అతడి పరివారం అడవిలోని కందమూలాలు, తామరతూళ్లు సేకరించుకుని రావడానికి వెళ్లారు.కొద్దిసేపటికి దివ్యతేజస్సు ఉట్టిపడుతున్న ఒక బాలకుడు కలశం చేతపట్టుకుని సరోవరం వద్దకు వచ్చాడు. సుధర్మ అతడిని చూసి ముచ్చట పడింది. అతడి వద్దకు వెళ్లి, ‘అబ్బాయి! నువ్వు ఎవరివి? నీ పేరేంటి? ఎక్కడి నుంచి వస్తున్నావు?’ అని ప్రశ్నించింది.‘అమ్మా! నా పేరు చ్యవనుడు. నా తండ్రి భృగుమహర్షి, తల్లి పులోమ. ఆశ్రమానికి నీళ్లు తీసుకువెళ్లడానికి ఇక్కడకు వచ్చాను. ఇంతకీ మీరెవరు? మీ సేవలు పొందుతున్న ఆ పురుషుడు ఎవరు? ఆయన శరీరమంతా వ్రణాలతో నిండి ఉందేమి?’ అని అడిగాడు.సుధర్మ దుఃఖాశ్రువులతో తమ వృత్తాంతమంతా అతడికి చెప్పింది. చ్యవనుడు సరోవరంలోని నీళ్లు తీసుకుని, ఆశ్రమానికి వెళ్లిపోయాడు. నీటికుండతో ఆశ్రమానికి చేరుకున్న కొడుకు ముఖం దిగులుగా ఉండటం గమనించాడు భృగుమహర్షి.‘కుమారా! ఎందుకలా దిగులుగా ఉన్నావు? కారణమేమిటి?’ అని అడిగాడు.అప్పుడు చ్యవనుడు తండ్రికి రాజదంపతులైన సోమకాంతుడు, సుధర్మల వృత్తాంతం చెప్పాడు.‘రాజదంపతులను, వారి పరివారాన్ని మన ఆశ్రమానికి పిలుచుకునిరా! నేను ఆహ్వానిస్తున్నానని చెప్పు’ అని కొడుకును తిరిగి అడవికి పంపాడు. చ్యవనుడు వచ్చి పిలవడంతో సోమకాంతుడు, సుధర్మ దంపతులు పరివారంతో పాటు భృగు ఆశ్రమానికి చేరుకున్నారు. భృగు మహర్షికి వారంతా నమస్కరించారు. భృగు మహర్షి వారికి షడ్రసోపేతమైన విందుతో ఆతిథ్యమిచ్చి, వారి విశ్రాంతికి తగిన ఏర్పాట్లు చేయించాడు. సోమకాంతుడు భృగుమహర్షి వద్ద తన బాధ చెప్పుకున్నాడు. భృగుమహర్షి దివ్యదృష్టితో చూసి, ‘రాజా! ఇదంతా పూర్వజన్మ పాపం వల్ల సంప్రాప్తించిన బాధ’ అని చెప్పి, అతడి పూర్వజన్మ వృత్తాంతమంతా తెలిపాడు. సోమకాంతుడు అంతా విని కూడా, మనసులో ఒక క్షణం భృగుమహర్షిని సందేహించాడు. వెంటనే అతడి శరీరం నుంచి పక్షులు పుట్టుకొచ్చి, వాడి ముక్కులతో అతడి దేహంపై వ్రణాలను పొడవసాగాయి. ‘మహర్షీ! మీరే నన్ను కాపాడాలి’ అంటూ ఆర్తనాదాలు చేశాడు.‘రాజా! నువ్వు నన్ను సంశయించావు. అందుకు ఫలితమే ఇది’ అంటూ భృగువు ఒక్క హుంకారం చేయడంతో ఆ పక్షులన్నీ మాయమయ్యాయి. ‘నీ వ్యాధినివారణకు తరుణోపాయం చెబుతాను విను. నువ్వు గణేశపురాణ శ్రవణం చేసినట్లయితే, పాప విమోచన జరిగి, వ్యాధి నుంచి బయటపడగలవు’ అని చెప్పాడు. గణేశ స్తోత్రాన్ని పఠించి, మంత్రజలాన్ని సోమకాంతుడిపై ప్రోక్షించాడు. వెంటనే సోమకాంతుడి ముక్కు నుంచి ఒక క్రిమిలాంటి నల్లని పురుషుడు బయటపడ్డాడు. చూస్తుండగానే అతడు పర్వతమంత పెరిగాడు. తనను తాను ‘పాప పురుషుడు’ అని చెప్పుకున్న ఆ భీకరాకారుడిని భృగుమహర్షి తన తపోబలంతో భస్మీపటలం చేశాడు. సోమకాంతుడి ప్రార్థన మేరకు భృగుమహర్షి అతడికి గణేశపురాణం చెప్పి, కొద్దిరోజుల్లోనే అతడికి రోగవిముక్తి కలిగించాడు.- సాంఖ్యాయనపురావిశేషం..శ్రావణ పూర్ణిమను దేశవ్యాప్తంగా చాలా చోట్ల రాఖీ పండుగ జరుపుకొంటారు. ఇదేరోజు బలరామ జయంతి కూడా. దేశంలో కొద్దిసంఖ్యలో మాత్రమే ఉన్న బలరామ ఆలయాల్లోను, శ్రీకృష్ణ దేవాలయాల్లోను శ్రావణ పూర్ణిమ రోజున బలరామ జయంతి వేడుకలు కూడా ఘనంగా జరుపుతారు. ఒడిశాలోని ఢంకనాల్, కేంద్రపడా జిల్లాల్లోను, పశ్చిమబెంగాల్లో ని ఖొయిరాసోల్, కోల్కతాలలోను, కేరళలోని నెన్మినిలోను, ఉత్తరప్రదేశ్‌లోని గోవర్ధన్లోను, గుజరాత్‌లోని చిత్రసానిలోను బలరాముడికి ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి. -
30 సెకన్ల చీకటి.. మాయమైన కోట్ల విలువైన పెయింటింగ్!
ప్రముఖ ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకుడు దేశ్‌పాండే ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది.హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ఆర్ట్ గ్యాలరీ ఆ రాత్రి నిశ్శబ్దంగా ఉన్నా, అక్కడ ఉత్కంఠ గాల్లో తేలుతోంది. మరుసటి రోజు ఉదయం భారత ప్రధాని ఆ గ్యాలరీని సందర్శించనున్నారు. దేశంలోనే అత్యంత ఖరీదైన, చరిత్రాత్మకమైన ఒక అరుదైన చిత్రపటాన్ని ప్రధానికి కానుకగా ఇవ్వడానికి దేశ్‌పాండే అన్ని ఏర్పాట్లూ చేశారు. ఆ చిత్రపటం చుట్టూ లేజర్ కిరణాలు, బయోమెట్రిక్ లాకులు, నిరంతరం నిఘా ఉంచే సీసీటీవీ కెమెరాలతో కూడిన పటిష్ఠమైన సెక్యూరిటీ ఉంది.కానీ, అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో హఠాత్తుగా గ్యాలరీలో పవర్ కట్ అయ్యింది. కేవలం ముప్పై సెకన్లలోనే బ్యాకప్ సిస్టమ్ ఆన్ అయ్యింది. కానీ, ఆ ముప్పై సెకన్ల చీకట్లోనే జరగరాని ఘోరం జరిగిపోయింది. లేజర్ వలయాన్ని ఛేదించి, ఆ కీలకమైన చిత్రపటం మాయమైంది! దేశ్‌పాండే గుండె ఆగినంత పనైంది. తెల్లవారితే ప్రధాని వస్తారు. ఈలోగా చిత్రపటం దొరకకపోతే, దేశవ్యాప్తంగా తన ప్రతిష్ఠ గంగలో కలిసిపోతుంది. ఆయన వెంటనే సిటీ పోలీస్ కమిషనర్‌కు ఫోన్ చేసి అత్యవసర సహాయం కోరారు. కేసు తీవ్రతను బట్టి కమిషనర్, క్రైమ్ బ్రాంచ్ నెంబర్ వన్ ఇన్వెస్టిగేటివ్ ఇన్స్పెక్టర్ అభిమన్యును రంగంలోకి దించారు. తెల్లవారేలోగా, అంటే కేవలం ఐదు గంటల్లో ఈ మిస్టరీని ఛేదించాల్సిన బాధ్యత అభిమన్యుపై పడింది.∙∙ గ్యాలరీకి చేరుకున్న అభిమన్యు చురుకైన కళ్లతో క్రైమ్ సీ¯Œ ను పరిశీలించాడు. అక్కడ ఎలాంటి బలాత్కారపు గుర్తులు లేవు. అంటే, లోపలి వ్యక్తుల ప్రమేయం లేకుండా ఈ దొంగతనం అసాధ్యం. అభిమన్యు వెంటనే సెక్యూరిటీ చీఫ్ సాహూ, అసిస్టెంట్ మేనేజర్ రాహుల్, ఐటీ హెడ్ కిరణ్, ఎగ్జిబిషన్ డిజైనర్ శ్రుతిలను ఒకే గదిలో కూర్చోబెట్టాడు. ఇక్కడే అభిమన్యు అసలైన మైండ్ గేమ్ ప్రారంభమైంది.‘‘సార్, పవర్ కట్ కాగానే మెయిన్ సర్వర్ హ్యాక్ అయ్యింది. డిజిటల్ లాక్ ఎలా ఓపెన్ అయ్యిందో మాకే అర్థం కావడం లేదు. బహుశా అంతర్జాతీయ దొంగల ముఠా పని అయి ఉంటుంది.’’ అని సాహూ చాలా కంగారుగా, ఆవేదనగా వివరించాడు.సమయం తెల్లవారుజామున మూడు గంటలు అవుతోంది. అతను అందరి ముఖాల్లోని హావభావాలను గమనిస్తూ, ‘‘దొంగ ఎవరో నాకు తెలిసిపోయింది. చిత్రపటం గ్యాలరీ దాటి బయటకు వెళ్ళలేదు. ఎందుకంటే పవర్ పోయిన వెంటనే గ్యాలరీ చుట్టూ ఉన్న ఆటోమేటిక్ గేట్లు లాక్ అయిపోయాయి. దొంగ ఆ పెయింటింగ్‌ను ఇక్కడే ఎక్కడో దాచాడు. నేను గ్యాలరీ మొత్తం సెర్చ్ చేయిస్తున్నాను.అప్పుడే ఒక ఇన్స్పెక్టర్ వచ్చి, అభిమన్యు వైపు చూసి, ‘‘సర్... ఆ చిత్రపటం ఎక్కడ ఉందో ట్రేస్ చేశాం...’’ అంటూ చెవిలో ఏదో చెప్పాడు.అది అభిమన్యు మైండ్ గేమ్‌లో ఒక భాగం అని వాళ్లకు తెలియదు.అభిమన్యు కావాలనే ఆ గదిలో ఒక నకిలీ వైర్లెస్ స్పీకర్‌ను వదిలి, బయటకు వచ్చి సీసీటీవీ కంట్రోల్ రూమ్ నుంచి వారిని గమనించసాగాడు. ఇది అతను ఆడిన మైండ్ గేమ్. దొంగతనం చేసిన వ్యక్తి కచ్చితంగా భయపడి, పెయింటింగ్ దాచిన చోటు మార్చడానికి ప్రయత్నిస్తాడని అభిమన్యు వ్యూహం. గదిలో ఉన్న నలుగురిలో టెన్షన్ పెరిగింది. సమయం నాలుగు దాటింది. హఠాత్తుగా సెక్యూరిటీ చీఫ్ సాహూ వాష్‌రూమ్‌కి వెళ్తానని చెప్పి బయటకు వచ్చాడు. అతను నేరుగా గ్యాలరీ బేస్మెంట్లోని ఏసీ డక్ట్ పైపుల వైపు వెళ్లాడు. సాహూ నేరుగా గ్యాలరీ బేస్మెంట్లోని ఏసీ డక్ట్ పైపుల వైపు వెళ్లి, అక్కడ దాచిన రోల్ చేసిన చిత్రపటాన్ని తీస్తుండగా, ఒక్కసారిగా లైట్లు ఆన్ అయ్యాయి. ఎదురుగా ఇన్స్పెక్టర్ అభిమన్యు నిలబడి ఉన్నాడు! సాహూ షాక్ తిన్నాడు.‘‘కంచె చేను మేసినట్టుంది మిస్టర్ సాహూ! నమ్మకద్రోహానికి నువ్వే బెస్ట్ ఉదాహరణ’’ అన్నాడు అభిమన్యు.‘‘ఇది నమ్మకద్రోహం కాదు, ప్రతీకారం...’’ సాహూ ముఖంలో పశ్చాత్తాపం లేదు, కేవలం కసి మాత్రమే ఉంది. ‘‘నమ్మాడా? అందరిముందు నన్ను అవమానించాడు. ఒక చిన్న పొరపాటుకు నా ముప్పై ఏళ్ల సర్వీసును మరిచిపోయి నన్ను చెంపదెబ్బ కొట్టాడు. అందుకే అతని ప్రతిష్ఠను ప్రధాని ముందు దెబ్బతీయాలని అనుకున్నాను.’’ అన్నాడు సాహూ.‘‘వ్యక్తిగతమైన ప్రతీకారాన్ని అతని ప్రతిష్ఠ దెబ్బ తీయడానికి వాడావు. ముఖ్యంగా నీ వృత్తికి అన్యాయం చేశావ్..‘నువ్వు ఐటీ రూమ్ పాస్వర్డ్ వాడి పవర్ కట్ చేశావు కానీ, ఏసీ డక్ట్ లోపల ఉన్న డస్ట్ సెన్సర్స్ నీ షూస్ గుర్తులను రికార్డ్ చేస్తాయని మర్చిపోయావు...’’ నేరం చేసినవాడు ఎప్పటికైనా సాక్ష్యానికి దొరుకుతాడు. నీ వృత్తికి కళంకం తెచ్చావు. నీలాంటివాళ్ళకి ఇదొక గుణపాఠం కావాలి’’ చెప్పాడు అభిమన్యు.సెక్యూరిటీ చీఫ్æ సాహూ పోలీసుల మధ్య సంకెళ్లతో... ∙∙‘‘ఇచ్చిన మాట ప్రకారం తెల్లవారేలోగా కేసును సాల్వ్ చేశారు. చిన్న రిక్వెస్ట్. ప్రధానికి చిత్రపటం బçహూకరిస్తున్నప్పుడు మీరు నా పక్కన ఉండాలి.’’ అభిమన్యుతో అన్నాడు దేశ్‌పాండే కృతజ్ఞతా పూర్వకంగా.- శ్రీసుధామయి -
Louise Gluck: ఆమె కవిత్వంలో అంతటి ప్రత్యేకత ఏమిటి?!
‘ఆకసాన నాకంటూ ఓ దేవుడున్నాడు అతగాణ్ణి సూర్యుడంటార్లే! అతనికి నా మనసు విప్పి చెప్పుకున్నానోసారి, మనసులో రగిలే మంటను అతని ముందుంచా, అది నా దేవుడి సన్నిధిలా భగ్గుమంది! అయినా, మనసుకు మించిన వైభోగం మరేముందని?’ అడిగిన బేల ఆ ‘గసగసాల పువ్వు‘ (రెడ్ పాపీ). మన–సుకవి మనకున్నట్లే, అమెరికన్ల సుకవయిత్రి వాళ్ళకూ ఉన్నారు. ఆమె పేరు లూయీజ్ గ్లూక్ (1943–2023).బేలలూ, బాలలూ అలాగే వుండిపోతారా? కాలంతో పాటు కరకుతేరరూ? మన వాడుక భాషలో చెప్పుకుంటే గ్లూక్ భావకవయిత్రిగా మొదలై, క్రమంగా స్త్రీవాద కవయిత్రిగా ఎదిగారు. భావకవిత్వమంటే ఏమిటో మనకు– తెలుగువాళ్ళకు– తెలియనిదేం కాదు. 1910 మొదలుకొని ’40 దశకాంతం వరకూ తెలుగునాట కలంపట్టిన కవిగణమంతా అరగదీసి విరగదీసిన ధోరణే అది! దేవులపల్లి మొదలుకొని దేవరకొండ వరకూ ఎందరో భావుకులైన భావకవుల్లో ఇలాంటి లక్షణాలు ప్రతి అక్షరంలోనూ గోచరిస్తాయి. కృష్ణశాస్త్రి ‘ఏల ప్రేమింతు?’ లాంటి చిరుకవితల్లో మనసుకవిత్వమే నాలుగుపాదాలతో నాట్యం చేసింది.అయితే ఆత్రేయ ఈ పలుకుబడిని సినిమాలకెక్కించి ‘మనసుకవి’ అనిపించుకున్నారు. అమెరికన్ కవుల్లో లూయీజ్ గ్లూక్ అదే ఘనకార్యం చేశారు. మనకి ఆత్రేయ తొలి మనసుకవి కానట్లే అమెరికన్ కవితలో కూడా ఈ పోకడ లూయీజ్ గ్లూక్ తోనే మొదలుకాలేదు. అయితే, కాలానుగుణమైన మార్పు కవుల స్వరంలో కన్నా శ్రుతిలో– ‘టోన్’లో– ఎక్కువ ప్రతిధ్వనిస్తుంది. ఇది గ్లూక్ ‘టోన్’కు సైతం వర్తిస్తుంది. ఆమెది ఇరవయ్యో శతాబ్ది ఉత్తరార్ధంలో పదునెక్కిన ఆత్మాశ్రయ శ్రుతి. ఆమె కవితలో భావకవితా ధోరణి మాత్రమే కాదు– స్త్రీవాద వైఖరి కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని చదువుకున్నవారికి తెలుసు!గ్లూక్ గురించి మాట్లాడే వాళ్ళెవరూ ఆమె స్వరం గురించీ, శ్రుతి గురించీ ప్రస్తావించకుండా ఉండలేరు. అందుకే 2020లో ఆమె నోబెల్ సాహిత్యపురస్కారం గెల్చుకున్నట్లు ప్రకటిస్తూ స్వీడిష్ ఎకాడెమీ ప్రతినిధులు చెప్పిన మాటల్లోనూ వాటి ప్రస్తావన ప్రముఖంగానే వుంది. ‘అసందిగ్ధమైన ఆమె కవితాత్మక స్వరమూ, దాని సరళ శ్రుతీ వ్యక్తిగత సౌందర్యాన్ని విశ్వజనీనంగా మారుస్తాయ’ని ప్రశంసించారు. నోబెల్ సాహిత్యపురస్కారం సాధించడానికి ముందే ఆమె పులిట్జర్ పురస్కారం (1993), బాలింజెన్ పురస్కారం (2001), జాతీయ పుస్తక పురస్కారం (2014), జాతీయ సామాజికశాస్త్ర పురస్కారం (2015) గెల్చుకునివున్నారు. 2003–04 సంవత్సరాల మధ్యకాలంలో లూయీజ్ గ్లూక్ అమెరికా ఆస్థాన కవయిత్రిగా కూడా వున్నారు.తూర్పు యూరప్ దేశాల నుంచి– ఇరవయ్యో శతాబ్దంతో పాటే– అమెరికాకు వలస వచ్చింది గ్లూక్ కుటుంబం. ఆమెను తీర్చిదిద్దిన అంశాల్లో కుటుంబ నేపథ్యం ప్రముఖమైంది. న్యూయార్క్ సమీపంలోని లాంగ్ ఐలండ్ సంపన్న కుటుంబాలకు నెలవు. పుట్టింది అక్కడ కాకపోయినా, గ్లూక్ పెరిగింది మాత్రం అక్కడే! బాల్యం నుంచీ గ్రీకు పురాగాథలు వింటూ పెరిగిన గ్లూక్ కవిపండితురాలిగా ఎదగడంలో వింతేముంది? ఆత్మాశ్రయ మనస్తత్వం ఉన్నవాళ్ళు చాలామందిలో కనిపించే ఎనరెక్సియా నెర్వోజా అనే మానసిక రుగ్మత గ్లూక్ కు కౌమారదశలో సంక్రమించింది. ‘బరువు పెరిగిపోతామేమో!’ అనే భయంతో ఈ రోగులు బొత్తిగా తిండితినరు. అది వాళ్ళ శారీరక మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.అయితే, ఆమె త్వరలోనే ఈ రుగ్మతను అదుపు చేసుకోగలగడం విశేషం. ఇరవైమూడేళ్ళ ప్రాయంలో గ్లూక్ తొలి కవిత ‘మదాంవజెల్’ అనే అమెరికన్ ఫ్యాషన్ పత్రికలో ప్రచురించారు. త్వరలోనే ఆమె కవితలు అమెరికాలోని ప్రముఖ పత్రికలన్నింట్లోనూ అచ్చవుతూ పోయాయి. రెండేళ్ళలోనే ఆమె తొలి కవితా సంకలనం కూడా వెలువడింది. అప్పట్లో, ఆమె కవిత్వంపై అమెరికన్ కవయిత్రి సిల్వియా ప్లాథ్ ప్రభావం గాఢంగా వుందనే విమర్శ వినిపించింది. నడివయసుకు చేరువయ్యే కొద్దీ, క్రమంగా గ్లూక్ స్వరమూ– శ్రుతీ స్థిమితత్వాన్నీ, స్వతంత్ర మూర్తిమత్వాన్నీ సంతరించుకున్నాయి. అవే మనకు తెలిసిన మనసు కవయిత్రిని ప్రపంచం ముందు ఆవిష్కరించాయి.‘మహాప్రస్థానం’ సంకలనానికి ‘యోగ్యతాపత్రం’ దయశాయిస్తూ చెలం గొప్ప విషయాలు ఎన్నో అలవోకగా చెప్పారు. కవి తాను చెప్పదల్చుకున్నదేదో ‘సులభంగా, సూటిగా చెప్పేసి, ఇంత ధ్యానానికీ, మౌనానికీ, కార్యాలకీ, విజయాలకీ వ్యవధినివ్వరాదా అని చెలం కోర్కె. ఆ పని స్త్రీలూ చెయ్యరు; దేశనాయకులూ చెయ్యరు; కవులూ చెయ్యర’న్నారాయన. కానీ ఆయన ‘కోర్కె’ తీర్చిన కొద్దిమంది స్త్రీలూ, కవుల్లో లూయీజ్ గ్లూక్ ఒకరు. ఇక్కడే ఓ చిత్రమైన విషయం చెప్పుకోవాలి– ప్రగాఢమైన ప్రేమ తత్త్వం గురించీ, దిగజారిన వివాహ వ్యవస్థ గురించీ 1996లో గ్లూక్ ఓ కవితా సంకలనం వెలువరించారు. దాని పేరు ‘మెడోల్యాండ్స్’– అంటే (పచ్చిక) మైదానాలు! చెలం కన్నుమూసిన 17 యేళ్ళకు, ఓ అమెరికన్ కవయిత్రి వెలువరించిన పుస్తకమిది!1985లో వచ్చిన గ్లూక్ కవితాసంకలనం ‘ఎఖిలిస్ ఘనవిజయం’లో ‘మాక్ ఆరెంజ్’ అనే కవిత వుంది. (మాక్ ఆరెంజ్ అంటే ‘అడవి కరివేపాకు’, ‘కుంతి పువ్వు’, ‘నాగ గొలంగ’ లాంటి అర్థాలు కనిపిస్తున్నాయి నిఘంటువుల్లో. విషయమేమిటంటే, ఇది నారింజ మాత్రం కాదు– సువాసన కోసం పెంచే పూలమొక్క!) స్త్రీ శరీరాన్ని భోగవస్తువుగా పరిగణించడాన్ని గ్లూక్ ఈ కవితలో తీవ్రంగా నిరసించారు. దాన్ని ‘ఆధునిక స్త్రీవాద అధికార గీతం’గా పరిగణిస్తారట. ఇలాంటి కవితలే ఈ కవయిత్రికి అంతర్జాతీయంగా పేరు ప్రతిష్ఠలు సంపాదించిపెట్టాయి. 2023లో కన్నుమూసే వరకూ కలం దించని కవయిత్రి, వ్యాసకర్త, బోధకురాలిగా లూయీజ్ గ్లూక్ నిలిచిపోయారు.- మందలపర్తి కిషోర్ -
పేదవాడే.. కానీ నిజాయితీలో కోటీశ్వరుడు!
పోలీస్ స్టేషన్ ముందో టేక్సీ ఆగింది. ఆ సమయంలో ఓ ఫిర్యాదుదారుడు ఎస్.ఐ. బల్లమీది ఐ.పి.సి. కోడ్ పుస్తకంలో ఓ కవర్ని ఉంచి కోరాడు.‘‘సర్. ఎలాగైనా మీరు నాకు న్యాయం చెయ్యాలి సర్.’’‘‘తప్పకుండా. ఫికర్ పడకు.’’ ఎస్.ఐ. చెప్పాడు.ఆ ఎస్.ఐ.కి ఉద్యోగంలో చేరాక వచ్చిన మొదటి కవర్ కాదు అది. అప్పటికే ఆ పుస్తకంలో అలాంటి వందల కవర్లు ఉంచబడ్డాయి. అవి ఉంచబడ్డప్పుడల్లా కొన్ని సందర్భాల్లో న్యాయాన్ని గెలిపించాడు. చాలా సందర్భాల్లో అన్యాయాన్ని గెలిపించాడు.ఏ.సి.బి. భయంతో ఎస్.ఐ. డబ్బుని తన చేత్తో ముట్టడు. దాని మీద వారు రాసే రహస్య ఇంక్ తన చేతికి అంటుకోవడం తను లంచం తీసుకున్న సాక్ష్యం అవుతుందని అతనికి తెలుసు. ఇంటికి ఆ పుస్తకంతో వెళ్ళాక తన ఆరేళ్ళ కొడుకు చేత దాంట్లోని డబ్బు బయటకి తీయిస్తాడు. అలా ఆ రోజు ఆ పుస్తకంలో రెండు కవర్లు చేరాయి.అతని పక్కనే బల్లలముందు కూర్చున్న మరో ఇద్దరు ఎస్.ఐ.లు కూడా జరిగేది చూసారు. కాని జోక్యం చేసుకోరు. వారికీ కవర్లు అందుతూంటాయి. సగటున వారి నెల సంపాదన వారి జీతానికి చాలా రెట్లు ఉంటుంది. కేస్ తీవ్రతని బట్టి ఒకోసారి వందరెట్లు కూడా ఉంటుంది. ఆ టేక్సీ డ్రైవర్ ఏర్బేగ్తో స్టేషన్లోకి నడిచాడు. ఆ గదిలోకి చేతిలో ఏర్బేగ్తో బిత్తరచూపులు చూస్తూ వచ్చిన ఏభై పైబడ్డ డ్రైవర్ ఆ గదిలోని అందరి వంకా చూశాడు. కవర్ ఇచ్చిన అతను తన పక్క నించి వెళ్ళాక ఆ ఎస్.ఐ. బల్ల దగ్గరికి నడిచాడు. తెల్ల జుట్టు. సన్నగా లోతుకు పోయిన బుగ్గలతో ఉన్న అతను ఆట్టే చదువుకున్నవాడిలా కనిపించడం లేదు. ఎస్.ఐ. అతన్ని కూర్చోమని చెప్పలేదు. అసలు అతని వంకే చూడలేదు. కొద్దిసేపు తన మొబైల్‌ని చూసుకున్నాక తలెత్తి అతన్ని, అతని చేతిలోని ఏర్బేగ్ని చూసి అడిగాడు.‘‘ఏమిటి?’’ అతని స్వరంలో అలవాటైన గద్దింపు ఉంది.డ్రైవర్ మౌనంగా ఆ ఏర్బేగ్ని బల్ల మీద ఉంచి, దాని జిప్ తెరిచి అందులోని నోట్లకట్టలు, ఓ నగల పెట్టె బల్ల మీద కుమ్మరించాడు.‘‘ఏమిటిది?’’ ఎస్.ఐ. ఆశ్చర్యంగా అడిగాడు.‘‘నేను ఊబర్ టేక్సీ డ్రైవర్ని సర్. ఇందాకే ఓ పేసెంజర్ని ఏర్పోర్ట్లో దింపాను. అతను వెళ్ళాక తుడుద్దామని చూస్తే వెనక సీట్లో ఇది కనిపించింది. వెంటనే పార్క్ చేసి అతనికి ఇవ్వడానికి వెళ్తే సెక్యూరిటీ వాళ్ళు నన్ను లోపలకి వెళ్ళనివ్వలేదు. ఏం చేయాలో తెలీక మీ దగ్గరకి వచ్చాను.’’ అతనిలోని నిజాయితీకి ఎస్.ఐ. కొద్దిసేపు అవాక్కయ్యాడు. అతని హిందీని బట్టి బీహారీ అని ఎస్.ఐ.కి అనిపించింది.తర్వాత నోట్లని లెక్క కట్టి ఓ కాగితం మీద రాశాడు. నగదు, బంగారం విలువ కలిసి ఎనిమిది లక్షలు దాకా ఉండచ్చని అంచనా వేశాడు. అందులోని శుభలేఖలని చూసి పెళ్ళికి వెళ్తున్నాడని ఎస్.ఐ. ఊహించాడు. దాన్ని స్వంతం చేసుకోవాలనే ఆలోచన తక్షణం కలిగింది.‘‘నువ్వు ఎందుకు తెచ్చిస్తున్నావు? మొత్తం ఇదేనా? లేక కొంత కాజేశావా?’’ గద్దించాడు.‘‘నేను బీదవాడినే. కాని నిజాయితీపరుడ్ని సర్. కాజేసే బుద్ధే ఉంటే అసలు దీంతో ఇక్కడికి రాకపోదును కదా సర్? మాది బీహార్‌లోని పహార్గంజ్. మూడేళ్ళ క్రితం బేంక్‌లో ఎనిమిది లక్షలు అప్పు చేసి టేక్సీని కొన్నాను. నాకు ముగ్గురు అమ్మాయిలు. సిటీలో కాపురం ఖర్చుతో కూడింది కాబట్టి అప్పు తీరాక వాళ్ళని తీసుకురావాలని అనుకున్నాను. నిజం చెప్పాలంటే, దీన్ని స్వంతం చేసుకుని బేంక్ అప్పు తీరిస్తే, కాపురం పెట్టచ్చనే ఆలోచన మొదట్లో వచ్చింది సార్. అరగంట మీమాంసలో పడ్డాను. కాని నాలోని రావణాసురుడ్ని రాముడు చంపేశాడు సార్. దాంతో తెచ్చి మీకు ఇస్తున్నాను.’’ఎస్.ఐ.తో పాటు మిగిలిన సిబ్బంది కూడా అతని మాటలని వింటూ ఆసక్తిగా చూశారు. అతని పేరు, టేక్సీ నంబర్, డ్రైవింగ్ లైసె¯Œ ్స వివరాలు, అడ్రస్ రాసుకున్నాక ఆ వ్యక్తి ఎస్.ఐ.ని అడిగాడు.‘‘ఇంక నేను వెళ్ళచ్చా సార్?’’ఎస్.ఐ. సరే అన్నట్లుగా తల ఊపాడు. వెళ్ళబోయే ముందు అతను చెప్పాడు.‘‘నా మనసు ఇప్పుడు చాలా తేలిగ్గా ఉంది సార్. నెత్తి మీంచి వంద కిలోల బండ దింపినట్లుగా ఉంది.’’∙∙ ఆ సంఘటన నాలుగు పరిణామాలకి దారి తీసింది. మొదటిది, ఎస్.ఐ. ఆ బండని మోయదలచుకోలేదు. వెంటనే ఏర్పోర్ట్లోని పోలీసులకి తనకి టేక్సీ డ్రైవర్ తెచ్చిచ్చిన ఓ ప్రయాణికుడి ఏర్ బేగ్ వర్ణనని, అందులో ఉన్న వాటి వివరాలని అందచేశాడు.రెండోది ఆ రెండు కవర్లు ఇచ్చిన వారికి ఎస్.ఐ. ఫోన్ చేసి పిలిపించి, వాటిని వెనక్కి ఇచ్చేసి తన అశక్తతని తెలియచేశాడు.మూడోది ఇంకాస్త పెద్దది. ఎస్.ఐ. ఓ పోలీస్ రిపోర్టర్‌కి ఫోన్ చేసి ఆ డ్రైవర్ మంచితనం గురించి తెలియచేశాడు. అతన్ని ఆ రిపోర్టర్ ఇంటర్వ్యూ చేసి ఆ సొమ్ముతో సహా అతని ఫొటో తీసుకున్నాడు. అది పేపర్లలోకి ఎక్కాక దాన్ని చదివిన ఓ ఎఫ్.ఎం. రేడియో జాకీ ఆ డ్రైవర్ని ఇంటర్వ్యూ చేసి, అతని బేంక్ ఎకౌంట్ వివరాలు శ్రోతలకి తెలియజేశాడు. నాలుగోది, ఆ సంఘటన జరిగిన ముప్ఫై ఆరు గంటల్లో ఆ డ్రైవర్ బేంక్ ఎకౌంట్లో పబ్లిక్ నుంచి 1,92,173 రూపాయలు జమయ్యాయి.- మల్లాది వెంకట కృష్ణమూర్తి -
‘ఒక్క రోజు ఆగండి’ అన్నాడు.. ఆ తర్వాత రూ.5 కోట్ల ఆఫర్!
‘‘ఇలాంటి పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోవడం, గాల్లో మేడలు కట్టడం ఆపకపోతే నడిరోడ్డున నిలబడతాం జగన్నాథం! నీ ఆకాశంలో ఎప్పుడూ మేఘాలే ఉంటాయి... ఈ నీడల వెనుక ఎండ ఉంటుందనే నీ నమ్మకం మనల్ని ముంచేస్తుంది, రాసి పెట్టుకో!’’సుమిత్ర గొంతులో నిరాశ, కోపం, అంతకుమించి రేపటి గురించిన భయం స్పష్టంగా వినిపించాయి. చేతిలో ఉన్న పాత పానెల్ బోర్డు డిజైన్‌ను పక్కన పెట్టి, కళ్లద్దాలు తీసి నుదురు నొక్కుకున్నాడు జగన్నాథం. ఆయన ముఖంలో అలసట ఉన్నా, కళ్లల్లో ఏదో తెలియని ప్రశాంతత ఇంకా మిగిలే ఉంది. ఆ ప్రశాంతతే సుమిత్రకు మరింత మంట పుట్టిస్తోంది.ముప్పై ఏళ్ల సంసార జీవితంలో ఆమె చూసింది ఒక్కటే– జగన్నాథం ప్రతికూల పరిస్థితుల్లోనూ వెతుక్కునే ఒక చిన్న ఆశాకిరణం. కానీ, ఆ ఆశలు కడుపు నింపవు కదా? ఐదు పదుల వయసు దాటాక, చేతిలో ఉన్న ఉద్యోగం ఊడి, సొంతంగా ఏదో సాధిస్తానంటూ ఇంట్లో ఉన్న అరకొర పొదుపు మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి ‘జె.ఎన్. ఇన్నోవేషన్స్’ అనే చిన్న స్టార్టప్ పెట్టాడు జగన్నాథం. ఫలితం? గత ఎనిమిది నెలలుగా ఒక్క ఆర్డర్ కూడా లేదు, బ్యాంకు నుండి నోటీసులు, ఇంటి అద్దె బాకీలు.‘‘నువ్వు నన్ను తిట్టినా నేను తప్పుబట్టను సుమీ!’’ జగన్నాథం గొంతు శాంతంగా సాగింది. ‘‘కానీ ఆకాశంలో ఎప్పుడూ దిగులు మేఘాలే ఉండవు. వర్షం పడ్డాక ఇంద్రధనుస్సు రాక మానదు. ప్రకృతి నియమమే అది. మన కష్టాలు కూడా అంతే!’’‘‘చాల్లెండి మీ తత్త్వాలు! ఆ ఇంద్రధనుస్సు వచ్చి మన అప్పులు తీరుస్తుందా? వచ్చేనెల మన అమ్మాయి కావ్య పెళ్లి చూపులు ఉన్నాయి. వాళ్లకు కట్నకానుకల మాట దేవుడెరుగు, కనీసం వచ్చిన వాళ్లకు మర్యాద చేయడానికి కూడా మన దగ్గర డబ్బుల్లేవు. మీ అబ్బాయి ఆకాష్ చూస్తే ఉద్యోగం రాక, మీలాగే ఏదో సాధిస్తానని తిరుగుతున్నాడు. ప్రాక్టికల్‌గా ఆలోచించడం నేర్చుకోండి!’’ అని విసురుగా లోపలికి వెళ్ళిపోయింది సుమిత్ర.సుమిత్ర అన్న ప్రతి మాటలోనూ నిజం ఉంది. అది జగన్నాథానికి తెలుసు. కానీ, ఆశను వదిలేస్తే మనిషి బ్రతకడం ఎలా?మరుసటి రోజు ఉదయం ఇల్లు ఎప్పటిలా ప్రశాంతంగా లేదు. ఒక రకమైన నిశ్శబ్దం ఇల్లంతా ఆవరించింది.కావ్య వంటింట్లో కాఫీ కలుపుతూ తండ్రి వైపు చూసింది. ఆమె కళ్లల్లో పెళ్లి గురించిన ఆనందం కంటే, తండ్రి పడుతున్న ఇబ్బంది గురించిన బెంగే ఎక్కువగా ఉంది.‘‘నాన్నా ...’’ కావ్య నెమ్మదిగా పిలిచింది.‘‘చెప్పమ్మా కావ్యా’’ పేపర్ చూస్తున్న జగన్నాథం తల పైకెత్తాడు.‘‘వచ్చే వారం వచ్చేవాళ్లు చాలా పెద్దవాళ్లంట నాన్నా! అమ్మ చెబుతోంది... మన పరిస్థితి చూసి వాళ్లు వెనకాడుతారేమో అని. నా పెళ్లి కోసం మీరు అంతగా ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు. అసలు ఈ పెళ్లి ఇప్పుడే వద్దు నాన్నా!’’జగన్నాథం నవ్వి, కావ్య తల నిమిరాడు. ‘‘పిచ్చితల్లీ, నీ పెళ్లి ఘనంగా జరుగుతుంది. మీ అమ్మ భయం ఆమెది. కానీ నా మేధస్సు మీద, నా హార్డ్‌వర్క్ మీద నాకు నమ్మకం ఉంది. నేను కనిపెట్టిన ఈ ‘సోలార్ పవర్ సేవర్’ డివైజ్ కచ్చితంగా మార్కెట్లోకి వెళ్తుంది. ఒక్క పెద్ద కంపెనీ దీని వాల్యూ గుర్తిస్తే చాలు.’’సరిగ్గా అదే సమయంలో ఆకాష్ హాల్లోకి వచ్చాడు. అతని ముఖం కమిలిపోయి ఉంది.‘‘ఏమైందిరా ఆకాష్? ఇంటర్వ్యూ ఏమైంది?’’ జగన్నాథం అడిగాడు.ఆకాష్ తన బ్యాగ్‌ను సోఫాపైకి విసిరికొట్టాడు. ‘‘ఏం కాలేదు నాన్నా! వాళ్లకు కావాల్సింది టాలెంట్ కాదు, రికమండేషన్ లేదా లంచం. నువ్వేమో ఎప్పుడూ నిజాయతీ, కష్టపడే తత్వం అంటావు. నీ ఆదర్శాలు వినడానికి బాగుంటాయి కానీ, ఈ సమాజంలో బతకడానికి పనికిరావు. చూడు, ఈరోజు నా ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అయ్యారు, నేనేమో ఇలా మిగిలిపోయాను. నీలాగే నేను కూడా గాల్లో దీపం పెట్టి దేవుడా అని అడగాలా?’’కొడుకు మాటలు జగన్నాథం గుండెను తాకాయి. భార్య అన్న మాటల కంటే కొడుకు తార్కికంగా అడిగిన ప్రశ్న ఆయనను ఆలోచనలో పడేసింది. ‘ఔను, తను నమ్మిన సిద్ధాంతాలు తన పిల్లల భవిష్యత్తుకు శాపంగా మారుతున్నాయా?’రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితి మరింత దిగజారింది. జగన్నాథం ఆఫీస్ అద్దె కట్టలేక దాన్ని ఖాళీ చేసి, తన ల్యాబ్ సామాగ్రిని ఇంటి వరండాలోనే సర్దుకున్నాడు. ఇరుగుపొరుగు వాళ్ల చూపులు, గుసగుసలు సుమిత్రను మరింత కుంగదీశాయి.ఒక సాయంత్రం, జగన్నాథం పాత స్నేహితుడు, ఇప్పుడు పెద్ద బిజినెస్ మాగ్నెట్ అయిన రాజశేఖర్ ఆయనను కలవడానికి వచ్చాడు. కాఫీ తాగుతూ రాజశేఖర్ అసలు విషయం తీశాడు.‘‘జగన్... నీ ప్రాజెక్ట్ రిపోర్ట్, నీ డివైజ్ డెమో నేను చూశాను. అద్భుతంగా ఉంది. కానీ, ఈ రోజుల్లో ఇంత చిన్న కంపెనీని ఎవరూ నమ్మరు. నీ పేటెంట్ రైట్స్ నాకు అమ్మేసేయ్. నేను నీకు యాభై లక్షలు ఇస్తాను. నీ అప్పులు తీరిపోతాయి, కూతురి పెళ్లి ఘనంగా చేయొచ్చు, కొడుక్కి ఏదైనా బిజినెస్ పెట్టించొచ్చు. ఏమంటావు?’’యాభై లక్షలు! ఆ మాట వినగానే లోపల ఉన్న సుమిత్ర, ఆకాష్ ల కళ్లల్లో ఆశ మెరిసింది. ఆ డబ్బు వస్తే వాళ్ల జీవితంలో ఉన్న చీకట్లన్నీ ఒక్క నిమిషంలో తొలగిపోతాయి.కానీ జగన్నాథం ముఖం గంభీరంగా మారింది. ‘‘రాజశేఖర్, ఈ డివైజ్ నా ఐదు సంవత్సరాల రక్తం, చెమట. ఇది పేద ప్రజల ఇళ్లల్లో కరెంట్ బిల్లులు తగ్గించడానికి నేను కనిపెట్టింది. దీన్ని నీకు అమ్మేస్తే, నువ్వు దీని ధరను పదింతలు చేసి కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకుంటావు. నా ఆశయం చచ్చిపోతుంది. నేను నా నమ్మకాన్ని అమ్మలేను.’’రాజశేఖర్ నవ్వి లేచాడు. ‘‘జగన్, నువ్వు ఇంకా కాలేజీ రోజుల్లోనే ఉన్నావు. ప్రాక్టికల్ వరల్డ్‌లోకి రా. మేఘాలు నిన్ను పూర్తిగా ముంచేయక ముందే నా ఆఫర్ గురించి ఆలోచించు. వచ్చే వారం నేను సింగపూర్ వెళ్తున్నా, ఈలోగా చెప్తే డీల్ ఓకే చేద్దాం...’’ అని వెళ్ళిపోయాడు.రాజశేఖర్ వెళ్లగానే ఇల్లంతా ఒక్కసారిగా బద్దలైంది.‘‘మీకు అసలు బుద్ధి ఉందా నాన్న?’’ ఆకాష్ గట్టిగా అరిచాడు. ‘‘యాభై లక్షలు అంటే సామాన్యమైన విషయమా? మన కష్టాలన్నీ తీరిపోయే అవకాశం వస్తే, నీ ఆశయం కోసం మమ్మల్ని బలిపెడతావా? నువ్వు స్వార్థపరుడివి నాన్నా !’’‘‘ఆకాష్! నాన్నతో మాట్లాడే పద్ధతి ఇదేనా?’’ కావ్య ఆపబోయింది.‘‘నువ్వు ఊరుకో కావ్యా! నీ పెళ్లి ఆగిపోయే పరిస్థితి వస్తే ఈయనకు లేని ఆశయాలు మనకెందుకు?’’ సుమిత్ర ఏడుస్తూ అంది. ‘‘జగన్నాథం, ఇన్నాళ్లూ నీ వెనుక నడిచాను. కానీ ఇక నా వల్ల కాదు. నా పిల్లల భవిష్యత్తు నాశనమవుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. రేపు పొద్దునే నేను పిల్లల్ని తీసుకుని మా అమ్మగారింటికి వెళ్ళిపోతున్నాను. నీ ఆశయాలతో నువ్వు ఒంటరిగా ఇక్కడే ఉండు.’’జగన్నాథం ఏమీ మాట్లాడలేదు. ఆయన కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తను నమ్మిన సత్యం, తను ప్రేమించిన కుటుంబం– ఈ రెండింటి మధ్య నలిగిపోతున్నాడు. ఆ రాత్రి ఇంట్లో ఎవరూ అన్నం తినలేదు. ఒక్కొక్కరూ ఒక్కో గదిలో, గుండె నిండా నిరాశతో పడుకున్నారు.ఈ మానసిక సంఘర్షణల నడుమ జగన్నాథానికి రాత్రిళ్లు నిద్ర కరవైంది. పడకపై అటు ఇటు దొర్లుతున్నా, మనసులోని ఆందోళనల వల్ల కనుపాపలకు నిద్ర రాక భౌతికంగా తీవ్ర అవస్థలు పడ్డాడు. మంచం దిగి ల్యాబ్ రూమ్‌లోకి వచ్చి, ఎర్రబడిన కళ్లతో, నీరసించిన శరీరంతో కుర్చీలోనే కూలబడ్డాడు. నిద్రలేమి కారణంగా ఆయన తల పగిలిపోతున్నట్లు అనిపించినా, చేతులు వణుకుతున్నా మొండిగా డిజైన్ పత్రాలను సరిచూసుకోసాగాడు. తెల్లవారేసరికి నిద్రలేని ఆ రాత్రి ఆయన ముఖంపై స్పష్టమైన అలసటను, భారాన్ని మిగిల్చింది.మరుసటి రోజు ఉదయం 4 గంటలు. ఇల్లంతా చీకటిగా ఉంది. బయట చిరుజల్లులు పడుతున్నాయి.సుమిత్ర సామాన్లు సర్దుతోంది. ఆకాష్ నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నాడు.జగన్నాథం తన ల్యాబ్ టేబుల్ దగ్గర కూర్చుని, ఆ ఫోటో ఫ్రేమ్ వైపు చూశాడు. అందులో వాట్సాప్ స్టేటస్‌లలో కనిపించే ఒక కొటేషన్ ఉంది. ‘కష్టాల మేఘాలూ ఉంటాయ్, ఇంద్రధనుస్సులు కూడా ఉంటాయి’ అని ఆయన ఆ కొటేషన్‌ను గట్టిగా చదివాడు. ఆ గొంతులో వణుకు లేదు, ఒక దృఢత్వం ఉంది.‘‘సుమీ...’’ జగన్నాథం పిలిచాడు.సుమిత్ర లగేజ్ బ్యాగ్ పట్టుకుని హాల్లోకి వచ్చింది. ఆకాష్, కావ్య కూడా వచ్చారు.‘‘నువ్వు వెళ్లాలనుకుంటే నేను ఆపను సుమీ! ఒక భర్తగా, తండ్రిగా మీకు కావాల్సిన సౌకర్యాలు ఇవ్వలేకపోయిన మాట నిజమే కానీ, ఒక అబద్ధాన్ని, ఒక ఓటమిని అంగీకరించి మీ ముందు తలవంచడం నా వల్ల కాదు. నా జీవితంలో ఇప్పుడు నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి, నిజమే. కానీ ఈ మేఘాల వెనుకే కాంతి ఉంది. నేను నా ప్రయత్నాన్ని ఆపను. ఈరోజు ఒక పెద్ద గ్రీన్ ఎనర్జీ కాన్ఫరెన్స్ ఉంది. నా డివైజ్ డెమో అక్కడ ప్రెజెంట్ చేస్తున్నాను. నాకు తెలుసు, ఇదే నా చివరి అవకాశం అని. ఇది ఫెయిల్ అయితే, నువ్వు చెప్పినట్టే రాజశేఖర్‌కు పేటెంట్ అమ్మేసి, మీ అందరికీ దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాను. కానీ ఒక్క రోజు... ఒక్కటే ఒక్క రోజు నాకు సమయం ఇవ్వు. నా ఆకాశంలో ఇంద్రధనుస్సు వస్తుందో లేదో నువ్వే చూద్దువు గాని...’’ జగన్నాథం కళ్లల్లో ఒక వింత మెరుపు కనిపించింది.ఆయన మాటల్లోని తీవ్రత, ఆ కళ్లల్లోని ఆత్మవిశ్వాసం సుమిత్రను కదలించాయి. ముప్పై ఏళ్లుగా తను ప్రేమించిన జగన్నాథం ఇతనే. ఓటమిని ఒప్పుకోని ధీరుడు. ఆమె చేతిలోని బ్యాగ్ కిందపడిపోయింది.‘‘సరే... ఈ ఒక్క రోజు. మేము ఎక్కడికీ వెళ్లడం లేదు. కానీ గుర్తుంచుకోండి, ఇది కేవలం మీ పరీక్ష కాదు, మన కుటుంబం నమ్మకానికి పరీక్ష.’’ అంది సుమిత్ర కళ్లు తుడుచుకుంటూ.ఆకాష్ కూడా తండ్రి వైపు చూశాడు. అతని మనసులో ఎక్కడో ఒక మూల తండ్రి గెలవాలనే ఆశ చిగురించింది.కాన్ఫరెన్స్ హాల్ అంతా దేశ విదేశాల నుండి వచ్చిన ప్రముఖ పారిశ్రామికవేత్తలతో నిండిపోయింది. జగన్నాథం తన పాత మోపెడ్ మీద, ఒక చిన్న బాక్స్‌లో తన డివైజ్ పెట్టుకుని అక్కడికి చేరుకున్నాడు. ఆయనతో పాటు ఆకాష్ కూడా వచ్చాడు– తండ్రికి సాయంగా కాదు, ఆయన ఓడిపోతే పేటెంట్ పేపర్స్ మీద సంతకం చేయించడానికి రాజశేఖర్‌ను కూడా అక్కడికే పిలిపించాడు.జగన్నాథం పేరు పిలిచారు. వేదికపైకి వెళ్లిన జగన్నాథం రూపం చూసి కొందరు నవ్వుకున్నారు. పాత కోటు, చేతిలో సాదాసీదా డివైజ్.కానీ జగన్నాథం మాట్లాడటం మొదలుపెట్టగానే హాల్ అంతా నిశ్శబ్దం ఆవరించింది. ఆయన ఇంగ్లీష్‌లోనే కాకుండా, ఆవిష్కరణ వెనుక ఉన్న సామాన్యుడి బాధను హృదయాలకు హత్తుకునేలా వివరించాడు.‘‘ఇది కేవలం ఒక మిషన్ కాదు. ప్రతినెలా కరెంట్ బిల్లు చూసి, పిల్లల పాలు, చదువుల ఖర్చులు తగ్గించుకునే కోట్లాది మంది మధ్యతరగతి తండ్రుల కన్నీళ్లకు పరిష్కారం. కార్పొరేట్ లాభాల కోసం కాదు, సామాన్యుడి ప్రగతి కోసం చేసిన ప్రయత్నం.’’ఆయన డివైజ్ డెమో చూపించారు. పవర్ కన్జంప్షన్ రీడింగ్స్ ఒక్కసారిగా యాభై శాతం పడిపోయాయి. హాల్లో ఉన్న టెక్నికల్ టీమ్ అంతా ఆశ్చర్యంతో లేచి నిలబడింది.ప్రెజెంటేషన్ ముగియగానే, హాల్ అంతా చప్పట్లతో మారుమోగిపోయింది.స్టేజ్ కింద ఉన్న రాజశేఖర్ ముఖం మాడిపోయింది. ఆకాష్ కళ్లల్లో ఆనందబాష్పాలు తిరిగాయి. తను తక్కువ అంచనా వేసిన తన తండ్రి, ఈరోజు వందలాది మేధావుల ముందు ఒక విజేతగా నిలబడ్డాడు.కాన్ఫరెన్స్ ముగిసేసరికి, భారతదేశపు అతిపెద్ద ఎలక్టాన్రిక్స్ సంస్థ ‘టాటా గ్రీన్ ఎనర్జీ’ ప్రతినిధులు జగన్నాథం దగ్గరకు వచ్చారు.‘‘మిస్టర్ జగన్నాథం! మీ ఆవిష్కరణ అద్భుతం. మేము మీ కంపెనీతో జాయింట్ వెంచర్ పెట్టుకోవాలనుకుంటున్నాము. మీ బ్రాండ్ పేరు ‘జె.ఎన్. ఇన్నోవేషన్స్’ అలాగే ఉంటుంది. మేము ఐదు కోట్ల రూపాయల పెట్టుబడితో పాటు, మీకు యాభై శాతం భాగస్వామ్యం ఇస్తున్నాము. మీరే ఈ ప్రాజెక్ట్‌కి హెడ్...’’ అంటూ అగ్రిమెంట్ పేపర్స్ అందించారు.ఐదు కోట్లు! రాజశేఖర్ ఇచ్చిన ఆఫర్ కంటే ఇది పదింతలు ఎక్కువ, పైగా ఆశయం చావలేదు సజీవంగా నిలిచింది.సాయంత్రం 5 గంటలు.ఆకాశంలో వర్షం వెలిసింది. మేఘాలన్నీ పక్కకు తొలగిపోయి, స్వచ్ఛమైన నీలి ఆకాశం కనిపిస్తోంది. సరిగ్గా తూర్పు దిక్కున ఒక సుందరమైన, స్పష్టమైన ఇంద్రధనుస్సు ఆవిష్కృతమైంది.ఇంటి గుమ్మం ముందు మోపెడ్ ఆగింది. జగన్నాథం, ఆకాష్ లోపలికి వచ్చారు.సుమిత్ర, కావ్య ఆత్రుతగా వాళ్ల ముఖాల వైపు చూశారు.ఆకాష్ ఒక్క ఉదుటున వెళ్లి అమ్మను గట్టిగా కౌగిలించుకున్నాడు. ‘‘అమ్మా! నాన్న గెలిచాడమ్మా! మనల్ని నడిరోడ్డున పడేస్తానన్న లోకం ముందు, నాన్న ఇండస్ట్రీ లీడర్‌గా నిలబడ్డాడు. నేను తప్పుగా మాట్లాడాను నాన్నా, నన్ను క్షమించు...’’ అంటూ తండ్రి కాళ్లపై పడ్డాడు.జగన్నాథం కొడుకును పైకి లేపి గుండెలకు హత్తుకున్నాడు. సుమిత్ర ఆనందంతో ఏడుస్తూ జగన్నాథం వంక చూసింది. ఆమె కళ్లల్లో ఇన్నాళ్లూ ఉన్న భయం పోయి, భర్తపై అపారమైన గౌరవం, గర్వం కనిపించాయి.జగన్నాథం నెమ్మదిగా సుమిత్ర చేతిలో ఐదు కోట్ల అగ్రిమెంట్ పేపర్స్ పెట్టాడు. ఆపై వరండాలో ఉన్న ఆ కొటేషన్ బోర్డు వైపు చూశాడు.‘‘చూశావా సుమీ... నేను చెప్పింది నిజమైంది. జీవితంలో కష్టాలు అనే మేఘాలు రావడం ఎంత సహజమో... శ్రమ, నమ్మకం ఉంటే విజయం అనే ఇంద్రధనుస్సు రావడం కూడా అంతే సహజం. ఇప్పుడు చెప్పు... నా ఆకాశంలో ఇంద్రధనస్సు వచ్చిందా, లేదా?’’ అన్నాడు జగన్నాథం చిరునవ్వుతో.సుమిత్ర భర్త భుజంపై తల వాల్చి, బయట కనిపిస్తున్న ఇంద్రధనుస్సు వైపు చూస్తూ, ‘‘వచ్చింది నా జగన్నాథం... మన జీవితంలోకి ఎప్పటికీ వెళ్ళిపోని ఇంద్రధనుస్సు వచ్చింది...’’ అంది. ఆ ఇల్లాలు కళ్లల్లోని ఆనందబాష్పాలు, ఆ కుటుంబంలో కురిసిన విజయపు వెలుగులు, ఆ సాయంత్రాన్ని చిరస్మరణీయం చేశాయి.కుటుంబం అంటేనే కష్టసుఖాల కలయిక, చీకటి తర్వాత వెలుగు వస్తుందని నమ్మడమే జీవితం అనే సత్యాన్ని ఆ ఇంద్రధనుస్సు సాక్షిగా ఆ ఇల్లు చాటిచెప్పింది.- డా. చిట్యాల రవీందర్ -
అనీమియా @ డిమెన్షియా!
అరవై ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న పెద్దవారిలో రక్తహీనత (అనీమియా) ఉంటే ‘డిమెన్షియా’ అనే ఒకరకం ‘మతిమరపు’ వచ్చే ముప్పు కూడా ఎక్కువేనంటూ ఇటీవలి ఓ అధ్యయనం పేర్కొంటోంది. జామా నెట్వర్క్ ఓపెన్ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనంలో... 60 ఏళ్లు పైబడి... అధ్యయన ప్రారంభ సమయానికి డిమెన్షియా లేని 2,282 మంది స్వీడన్ వాసులను పరిశోధకులు పరిశీలించారు. అధ్యయనం మొదట్లో వీళ్లలో సుమారు 15 శాతం మందికి రక్తహీనత ఉన్నట్లు గుర్తించారు. 10 ఏళ్ల పాటు పరిశీలించగా వాళ్లలో మొత్తం 362 మందికి డిమెన్షియా వచ్చింది. అధ్యయనం మొదట్లో రక్తహీనత లేనివారితో పోల్చినప్పుడు... ప్రారంభంలో రక్తహీనత ఉన్నవారికి డిమెన్షియా వచ్చే అవకాశం 46 శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలింది.ఈ ధోరణి మహిళలతో పోలిస్తే పురుషుల్లో స్పష్టంగా కనిపించింది. దీనికి ఒక కారణం ఏమిటంటే... రక్తహీనత వల్ల కాలక్రమంలో మెదడుకు చేరే ఆక్సిజన్ మోతాదు తగ్గిపోవచ్చు. ఇదే దీర్ఘకాలం కొనసాగితే మెదడు కణాలు, రక్తనాళాలు దెబ్బతినే అవకాశం ఉంది. దాంతో న్యూరాన్లు దెబ్బతినడానికి అవకాశాలు ఉన్నాయి. రక్తహీనత ఉన్నవారి మెదడు స్కాన్లలో కూడా మెదడు సైజు తగ్గడం, కణజాలం దెబ్బతినడం వంటి మార్పులనూ కొన్ని అధ్యయనాలు గుర్తించాయి.వైద్యపరంగా చూస్తే డిమెన్షియాకు రక్తహీనత వచ్చే ముప్పునకు ఒక కారణం కావచ్చని ఈ పరిశోధన ఫలితాలు సూచిస్తున్నాయి. అంతేకాదు, రక్తహీనతను గుర్తించి తగిన విధంగా చికిత్స చేయడం ద్వారా భవిష్యత్తులో అల్జీమర్స్ వ్యాధి నివారణకు ఇది కొంతవరకు ఉపయోగపడే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. (చదవండి: కళ్లకింద క్యారీబ్యాగులు ఉండకూడదంటే..!) -
ప్రింట్ కొడితే బాడీ పార్ట్లు వస్తాయా? షాకింగ్ నిజాలు!
త్రీడీ ప్రింటర్ల సహాయంతో ఇప్పటికే చిన్న చిన్న రాకెట్లు లేదా గేమింగ్ వస్తువులను తయారు చేస్తున్నాం. అదే ప్రింటర్లు మన చెవి, ఊపిరితిత్తులు లేదా చర్మం వంటి శరీర భాగాలను కూడా తయారు చేయగలిగితే? ఆ ప్రయత్నమూ జరగబోతోంది! శాస్త్రవేత్తలు ఇప్పటికే జీవకణాలను ‘ఇంక్’ (సిరా)గా ఉపయోగించి మానవ అవయవాల నమూనాలను తయారు చేసే పనిలో ఉన్నారు. బొమ్మలు, విగ్రహాలు లేదా లోహపు వస్తువులను తయారు చేయడానికి ఉపయోగించే త్రీడీ ప్రింటింగ్ పద్ధతినే ఇక్కడ కూడా ఉపయోగిస్తున్నారు. ఇందులో ప్లాస్టిక్ లేదా లోహానికి బదులుగా జీవకణాలు ఉంటాయి. అయితే... ఇలా ప్రింట్ కొడితే అలా బాడీ పార్ట్లు వచ్చేయటం అన్నది ఫలించే ప్రయోగమేనా?!నిజానికి, ఇది అనుకున్నంత సులభం కాదు. మామూలు వస్తువులను తయారు చేసే ప్రింటర్లతో శరీర భాగాలను ప్రింట్ చేయలేం. పైగా కణాలను ఒకదానిపై ఒకటి పేర్చుకుంటూ పోతే అవి అవయవాలుగా మారవు. ఆ కణాలు ఒకదానితో ఒకటి కలిసి పనిచేయడానికి, వాటిని జెల్ లాంటి ఒక మెత్తటి పదార్థంతో కలపాల్సి ఉంటుంది. అది ఇంకా పరిశోధనల దశలోనే ఉంది. అయినప్పటికీ శాస్త్రవేత్తలు ఇప్పటికే చర్మం, మృదులాస్థి (కార్టిలేజ్), రక్తనాళాల నమూనాలను ప్రింట్ చేయగలిగారు. 2025లో ఆస్ట్రేలియాలోని పరిశోధకులు ఒక కొత్త పద్ధతిని ఉపయోగించి, ఒక బాధితురాలి చర్మ కణాలతో చేసిన ఇంక్‌ను నేరుగా ఆమె కాలిన గాయాలపై ప్రింట్ చేసి చికిత్స అందించారు.అంతా ‘ఇంక్’ లోనే ఉంది!సాధారణ త్రీడీ ప్రింటర్లలో ప్లాస్టిక్ లేదా లోహాలను ఇంక్గా ఉపయోగిస్తారు. కానీ ఈ బయోప్రింటర్లు... జీవకణాలను, వాటిని బతికించే ఒక పదార్థాన్ని ఇంక్గా ఉపయోగిస్తాయి. బయోఇంక్స్ అనేవి జీవకణాలను కలిగి ఉండే ఒక రకమైన ప్రత్యేకమైన జెల్లీ పదార్థాల వంటివి. ఇవి మెత్తగా, కాస్త కదులుతూ ఉన్నప్పటికీ, తమ రూపాన్ని కోల్పోకుండా లోపల ఉన్న కణాలకు రక్షణగా నిలుస్తాయి. వీటిని హైడ్రోజెల్స్ అని అంటారు. శాస్త్రవేత్తలు ఈ హైడ్రోజెల్స్‌ను తయారు చేయడానికి ‘ఆల్జినేట్’, ‘కోలాజెన్’ వంటి పదార్థాలను ఉపయోగిస్తారు.ఆల్జినేట్ సముద్రపు పాచి నుండి లభిస్తుంది. కోలాజెన్ అనేది మన చర్మం, ఎముకలలో ఉండే ఒక రకమైన ప్రొటీన్. అయితే, ఈ బయోఇంక్స్లో కేవలం కణాలు, జెల్ మాత్రమే ఉండవు. మన శరీరంలో కణాల చుట్టూ ఉండే వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించటానికి ఈ మిశ్రమంలో కొన్ని అదనపు పోషకాలను కూడా చేరుస్తారు. సాధారణ త్రీడీ సిరాలకు, బయోఇంక్స్కు ఉన్న ప్రధాన తేడా ఏమిటంటే వీటిలో ప్రాణమున్న కణాలు ఉంటాయి. ప్రింటింగ్ ప్రక్రియలో ఇవి చిన్న చిన్న నాజిల్స్ (గొట్టాల) ద్వారా ఒత్తిడికి గురవుతూ బయటకు వస్తాయి, అలాగే ఉష్ణోగ్రత మార్పులను తట్టుకోవాల్సి ఉంటుంది. కణాలు ఈ మార్పులన్నింటినీ తట్టుకుని బతికి ఉండేలాగే ఈ మిశ్రమాన్ని తయారుచేస్తారు.ప్రింటింగ్ పూర్తయిన తర్వాత, ఆ నిర్మాణాలను ‘ఇంక్యుబేటర్లు’ అనే ప్రత్యేక పెట్టెలలో ఉంచుతారు. ఇవి కణాలు పెరగడానికి కావలసిన సరైన వాతావరణాన్ని అందిస్తాయి. అక్కడ ఈ కొత్త కణాలు బలంగా తయారై, ఒకదానితో ఒకటి కలిసి కణజాలాలుగా (ఉదా : కీళ్లలోని గుజ్జు లేదా రక్తనాళాలు ఉన్న చర్మం పొరలుగా) ఎదుగుతాయి.దారికి రాని గుండె, కిడ్నీలుగుండె, మూత్రపిండాలు (కిడ్నీలు) వంటి సంక్లిష్టమైన, పూర్తిస్థాయిలో పనిచేసే అవయవాల తయారీపై పరిశోధనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కొన్ని మిల్లీమీటర్ల కంటే ఎక్కువ మందం ఉండే కణజాలాలలో ఒక పెద్ద సమస్య ఎదురవుతోంది: ప్రింట్ చేసిన కొద్దిసేపటికే ఆక్సిజన్, పోషకాలు అందక లోపల ఉన్న కణాలు చనిపోతున్నాయి. ‘రక్తనాళాలు’ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. కణజాలాల లోపల ఉండే కణాలకు ఆక్సిజన్ అందించడానికి, వ్యర్థాలను బయటకు పంపడానికి రక్తనాళాలు చాలా అవసరం. అవి లేకపోతే కణాలు బతకలేవు. అందుకే పూర్తిస్థాయి అవయవాలను ప్రింట్ చేయడానికి రక్తనాళాలను తయారు చేయడమే శాస్త్రవేత్తల ముందున్న అతి పెద్ద సవాలు.‘శాక్రిఫిషియల్ ఇంక్’ ప్రయోగంఈ సమస్యను వ్యాపనం (డిఫ్యూజన్) ప్రక్రియ ద్వారా అర్థం చేసుకోవచ్చు. (ద్రవాలు లేదా వాయువుల్లోని అణువులు, కణాలు ఎక్కువ సాంద్రత ఉన్న ప్రాంతం నుండి తక్కువ సాంద్రత ఉన్న ప్రాంతానికి వాటంతటవే కదిలే ప్రక్రియను వ్యాపనం అంటారు). ఆక్సిజన్.. కణజాలం లోపలికి కేవలం కొన్ని మిల్లీమీటర్ల వరకు మాత్రమే ప్రసరించగలదు. మందపాటి అవయవాలలో, ఆక్సిజన్ అందక లోపల ఉండే కణాలు ఊపిరాడక చనిపోతాయి. దీన్ని రోడ్లు లేని ఒక పెద్ద నగరంతో పోల్చవచ్చు. రోడ్లు లేకపోతే ఆహార పదార్థాల ట్రక్కులు లోపలికి రాలేవు, చెత్తను తీసుకువెళ్లే ట్రక్కులు బయటకు వెళ్లలేవు! ఈ సమస్యను దాటేందుకు శాస్త్రవేత్తలు కొన్ని మార్గాలలో ప్రయత్నిస్తున్నారు. అందులో ఒకటి.. ‘శ్యాకిఫిషియల్ ఇంక్’లను ఉపయోగించడం.మొదట ఈ ఇంక్‌తో రక్తనాళాల ఆకారంలో తాత్కాలిక నమూనాను ప్రింట్ చేస్తారు. దాని చుట్టూ అసలైన కణజాలాన్ని ప్రింట్ చేస్తారు. కణజాలం గట్టిపడిన తర్వాత, లోపల ఉన్న ఈ తాత్కాలిక ఇంక్ కరిగిపోతుంది. దాని స్థానంలో ఖాళీ గొట్టాల్లాంటి మార్గాలు ఏర్పడతాయి, వీటి ద్వారా రక్తం ప్రవహిస్తుంది. దీనితో పాటు, కణజాలాన్ని ప్రింట్ చేస్తున్నప్పుడే నేరుగా రక్తనాళాలను కూడా అందులోనే తయారుచేసే పద్ధతులపై శాస్త్రవేత్తలు ప్రస్తుతం పరిశోధనలు చేస్తున్నారు.అంతరిక్షంలో బయోప్రింటింగ్2025 సెప్టెంబర్ 17న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో, నాసా వ్యోమగామి జానీ కిమ్ ఒక ప్రత్యేక గ్లోవ్-బ్యాగ్ లో బయోప్రింట్ చేసిన కాలేయ కణజాలాన్ని పరీక్షించారు. లాబొరేటరీలో తయారు చేసిన త్రీడీ కణజాలాలు గురుత్వాకర్షణ లేని అంతరిక్ష వాతావరణంలో రక్తనాళాలుగా ఎలా రూపాంతరం చెందుతాయో అధ్యయనం చేయడానికి జానీ కిమ్ ఈ నమూనాలను మరొక పరిశోధనా పరికరంలోకి పంపారు.జీవకణాలను ఎలా ప్రింట్ చేస్తారు?!బయోఇంక్స్ ద్వారా టిష్యూలను (జీవకణాలను) తయారు చేయడానికి ఇంజనీర్లు అనేక రకాల పద్ధతులను అభివృద్ధి చేశారు. తాము తయారు చేయాలనుకుంటున్న అవయవాన్ని బట్టి ఆ పద్ధతిని ఎంచుకుంటారు. చాలా సందర్భాల్లో, టూత్‌పేస్ట్ ట్యూబ్ నుండి పేస్టును బయటకు నొక్కినట్లుగానే బయోఇంక్ కూడా ఒక గొట్టం ద్వారా బయటకు వస్తుంది. ఈ పద్ధతిని ‘ఎక్స్‌ట్రూజన్’ అంటారు. ఒక యంత్రం సహాయంతో ఈ ఇంక్ వచ్చే వేగాన్ని నియంత్రిస్తూ, ఒక పొర తర్వాత మరొక పొరను తయారుచేస్తారు.ఉదాహరణకు: చర్మాన్ని తయారుచేయడానికి మొదట చర్మం లోపలి పొరలో ఉండే ఫైబ్రోబ్లాస్టులు అనే కణాలను ప్రింట్ చేస్తారు. ఆ తర్వాత చర్మం వెలుపలి పొరను నిర్మించే కెరాటినోసైట్స్ అనే కణాలను దానిపై పొరలుగా వేస్తారు. ఇలా ప్రింట్ చేసిన నిర్మాణాన్ని ‘ఇంక్యుబేటర్’లో ఉంచుతారు. అది పూర్తి చర్మంగా ఎదుగుతుంది. చర్మం, మృదులాస్థి వంటి కాస్త మందంగా ఉండే భాగాలను తయారు చేయడానికి ఈ ఎక్స్‌ట్రూజన్ పద్ధతి చక్కగా పనిచేస్తుంది. కానీ ఇది కొంచెం నెమ్మదిగా జరిగే ప్రక్రియ. అంతే కాకుండా, సన్నని గొట్టం ద్వారా నొక్కి పంపడం వల్ల కణాలు స్వల్పంగా ఒత్తిడికి గురవుతాయి.ఇక, ఇంక్జెట్ బయోప్రింటింగ్ అనేది మరింత వేగవంతమైన, సున్నితమైన పద్ధతి. మనం ఆఫీసుల్లో ఉపయోగించే ప్రింటర్ కాగితంపై సిరా చల్లినట్లే, ఇది కూడా బయోఇంక్ చుక్కలను ట్రే ఉపరితలంపై చల్లుతుంది. ఇది సన్నని, పలుచని కణాల పొరలను తయారుచేయడానికి (ఉదా : రక్తనాళాల లోపలి పొరలు) బాగా ఉపయోగపడుతుంది. మరొక ఆధునిక పద్ధతిలో, పొరలు పొరలుగా కాకుండా మొత్తం నిర్మాణాన్ని ఒకేసారి తయారుచేస్తారు. ఇందులో కణాలు ఉన్న ఒక ప్రత్యేకమైన జెల్ కలిగిన గొట్టాన్ని వేగంగా తిప్పుతూ, దానిపై లేజర్ కాంతిని ప్రసరింపజేస్తారు. ఆ కాంతి పడగానే జెల్ క్షణాల్లో ఘనరూపంలోకి మారి మనకు కావలసిన ఆకారంలోకి వస్తుంది.ఈ లేజర్ పద్ధతి ద్వారా శాస్త్రవేత్తలు అనేక శాఖలుగా విడిపోయే సన్నని రక్తనాళాల వ్యవస్థను కేవలం కొన్ని సెకన్లలోనే తయారుచేయగలరు. కణాలు ఎక్కువ సేపు బయట వాతావరణంలో ఉంటే పాడైపోతాయి కాబట్టి, వేగంగా ప్రింట్ చేయడం చాలా ముఖ్యం.ఏమేమి ప్రింట్ చేస్తున్నారు?2022లో ఒక రోగికి వారి సొంత కణాలతో తయారు చేసిన త్రీడీ ప్రింటెడ్ చెవిని అమర్చారు. 2025 చివరిలో, చూపు లేని ఒక వ్యక్తికి శాస్త్రవేత్తలు బయోప్రింట్ చేసిన ‘కార్నియా’ (కనుగుడ్డు వెలుపలి పారదర్శక పొర)ను విజయవంతంగా అమర్చారు.చర్మ మార్పిడి (స్కిన్ గ్రాఫ్టింగ్) అనేది బయోప్రింటింగ్‌లో అత్యంత పురోగతి సాధించిన విభాగం. దెబ్బతిన్న చర్మం స్థానంలో కొత్త చర్మాన్ని అమర్చడాన్ని స్కిన్ గ్రాఫ్టింగ్ అంటారు. 2025లో ఆస్ట్రేలియాలో, కాలిన గాయాల బాధితులపై బయోప్రింటెడ్ చర్మాన్ని అతికించి పరీక్షించారు. ఈ చికిత్స పొందిన మొదటి మహిళ, తన కాలిపై ఉన్న గాయం పూర్తిగా నయమైందని విలేకరుల సమావేశంలో చూపించారు.ఇక ఎముకలను ప్రింట్ చేయడమైతే కాస్త కష్టమైన పనే. చర్మం లేదా మృదులాస్థి కాకుండా, ఎముకల్లో జీవకణాలతో పాటు గట్టి ఖనిజాలు కూడా ఉంటాయి. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఎముకల నిర్మాణాలు (స్కాఫోల్డ్స్) తయారుచేస్తున్నారు. ఇవి శరీరంలోని సొంత ఎముక కణాలు వృద్ధి చెందేందుకు సహాయపడతాయి. అయితే, ప్రాణమున్న కణాలతో కూడిన అసలైన ఎముకను ప్రింట్ చేసి మనుషులకు అమర్చడం ఇంకా సాధ్యపడలేదు.ముందుడుగు ఎప్పటికి?2025 సెప్టెంబర్‌లో, పరిశోధకులు ‘గ్రేస్’ అనే త్రీడీ బయోప్రింటింగ్ విధానంతో ఒక ఆశాజనకమైన పురోగతిని సాధించారు. ఈ సాంకేతికత ద్వారా ప్రింట్ చేసిన కణజాలం చుట్టూ నేరుగా రక్తనాళాలను ప్రింట్ చేయడం సాధ్యమవుతుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే : మొదట ఒక ‘కంప్యూటర్–విజన్’ వ్యవస్థ కణాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తిస్తుంది. తర్వాత, ఆ కణాలన్నింటికీ ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని అందించడానికి ఏ ఆకారంలో రక్తనాళాలు ఉంటే బాగుంటుందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిర్ణయిస్తుంది.అనంతరం, కేవలం కొద్ది సెకన్లలోనే, బయోప్రింటర్.. గొట్టం లాంటి నిర్మాణాలను (రక్తనాళాలను) ప్రింట్ చేసి రక్తాన్ని సరఫరా చేయడం ప్రారంభిస్తుంది. ఇక్కడ వేగం అనేది అత్యంత ముఖ్యమైన అంశం. పాత పద్ధతుల్లో రక్తనాళాల వ్యవస్థను పొరలు పొరలుగా ప్రింట్ చేయడానికి గంటల సమయం పట్టేది. కానీ ‘గ్రేస్’ పద్ధతి ద్వారా కొన్ని సెకన్లలోనే ఇది పూర్తవుతుంది. దీనివల్ల ఆక్సిజన్ అందక కణాలు చనిపోయే ప్రమాదం తగ్గుతుంది.ఏమైనా, పూర్తిస్థాయి అవయవాలను తయారు చేయడానికి ఇంకా కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. పెద్ద ధమనుల నుండి చిన్న సన్నని రక్తనాళాల (క్యాపిల్లరీస్) వరకు చెట్టు కొమ్మల్లా ఉండే రకరకాల పరిమాణాల రక్తనాళాలను తయారుచేసి, వాటిని మనుషుల రక్త ప్రసరణ వ్యవస్థతో సజావుగా అనుసంధానించడం ఇప్పటికీ ఒక పెద్ద సవాలు. అయితే, బయోఇంక్స్, ప్రింటింగ్ వేగం పెరుగుతున్న కొద్దీ, రక్తనాళాలతో కూడిన కృత్రిమ అవయవాలను అమర్చే రోజులు చాలా వేగంగా దగ్గరపడుతున్నాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, త్రీడీ బయోప్రింటింగ్ ద్వారా అవయవాలను తయారు చేయడం సాధ్యమా, కాదా అని కాదు... ఎప్పుడు సాధ్యమవుతుంది అని మాత్రమే!- సాక్షి స్పెషల్ డెస్క్ -
కళ్లకింద క్యారీబ్యాగులు ఉండకూడదంటే..!
కొందరికి కళ్ల కింద చర్మం క్యారీబ్యాగుల్లా వదులొదులుగా ఉబ్బిపోయినట్లు ఉంటుంది. నిద్రలేమి సహా రకరకాల సమస్యల వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది. ముఖంలో చూడగానే ఆకట్టుకునేవి కళ్లే! అలాంటి కళ్ల కింద క్యారీబ్యాగులు ఏర్పడితే ఎంత ఇబ్బందిగా ఉంటుంది! వీటిని తొలగించుకోవడానికి చాలామంది నానా తంటాలు పడుతుంటారు. ఇంటి చిట్కాలతో అంత సులువుగా మాయమయ్యే సమస్య కాదిది. అయితే, ‘థెరాఫేస్ డీపఫింగ్ వాండ్’ చేతిలో ఉంటే చాలు, కళ్ల కింద క్యారీబ్యాగులను ఇట్టే మటుమాయం చేసుకోవచ్చు. ఇది మూడు మోడ్లతో పనిచేస్తుంది. ఇందులోని కూలింగ్ మోడ్ అలసిన కళ్లకు విశ్రాంతినిచ్చి, చర్మరంధ్రాలను సంకోచింపజేస్తుంది. హీటింగ్ మోడ్ కళ్ల చుట్టూ ఉండే చర్మంలో రక్తప్రసరణను ఉత్తేజపరుస్తుంది. కాంట్రాస్ట్ మోడ్ చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. అన్ని రకాల చర్మతత్త్వాల వారికి ఈ పరికరం అనుకూలంగా ఉంటుంది.తడిసినా సమస్యలేదిక!వర్షాకాలంలో జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండేందుకు జుట్టును పొడిగా, శుభ్రంగా ఉంచుకోవాలి. వర్షంలో తడిస్తే వెంటనే మైల్డ్, సల్ఫేట్–ఫ్రీ షాంపూతో తలస్నానం చేయాలి. తడి జుట్టును అస్సలు ముడివేయవద్దు. తేమ ఉన్నట్లయితే కుదుళ్ళు బలహీనపడతాయి. జుట్టును గాలికి సహజంగా ఆరనివ్వాలి. జుట్టు చిక్కులు తీయడానికి వెడల్పాటి పళ్ళున్న దువ్వెనను ఉపయోగించాలి. వారానికి రెండు మూడుసార్లు మాత్రమే తలస్నానం చేయాలి, లేదంటే జుట్టు నిర్జీవంగా మారుతుంది. శరీరంలో పోషకాల లోపం వల్ల కూడా వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా రాలుతుంది. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే గుడ్లు, పప్పు ధాన్యాలు, ఆకుకూరలు, బాదం వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి. రోజంతా సరిపడా నీరు తాగడం వల్ల కుదుళ్ళు తేమగా, బలంగా ఉంటాయి. దువ్వెనలు, పిల్లో కవర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.స్నానానికి గాడిద పాలుఈజిప్టు రాణి క్లియోపాత్రా తన చర్మాన్ని మృదువుగా, యవ్వనంగా ఉంచుకోవడం కోసం ప్రతిరోజు గాడిద పాలతో స్నానం చేసేది. ఆమె ఒక స్నానానికి కావలసిన పాల కోసం దాదాపు 700 గాడిదలను పోషించేవారు. ఆమె తన ప్రయాణాలలో కూడా గాడిదలను తీసుకువెళ్లేది. ఈ పాలలోని ‘లాక్టిక్ యాసిడ్’ చర్మాన్ని మృదువుగా, కాంతిమంతంగా మార్చడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా చర్మం లోపలి పొరల నుంచి తేమను అందించి హైడ్రేటెడ్‌గా ఉంచడంలో తోడ్పడుతుంది. -
ఫేస్బుక్లో ఫోటోకి క్యాప్షన్ పెడుతున్నారా? పాపం ఆ వ్యక్తి ఏకంగా..
మీ సంతోషాన్ని, విషాదాన్ని, ప్రతి చిన్న విషయాన్నీ ఫేస్బుక్లో పోస్టు చేస్తున్నారా? ఫొటోలు పెట్టి క్యాప్షన్లు పెడుతున్నారా?... అయితే తస్మాత్ జాగ్రత్త! మీరు పెట్టేవి ఒక్కోసారి అపార్థాలకు దారితీయొచ్చు; మిమ్మల్ని కోర్టుల చుట్టూ తిప్పొచ్చు. అలాంటిదే ఓ సంఘటన తమిళనాడులో జరిగింది. ఓ వ్యక్తి ఎఫ్బీలో చేసిన పోస్టు పెద్ద దుమారమే రేపింది. చివరికి కుట్ర కేసు వరకు వెళ్లింది. ఆ కేసు ఏమిటో, దాని కథా కమామిషు ఏమిటో తెలుసుకుందాం..తమిళనాడుకు చెందిన మథివనన్ ఓ రాజకీయపార్టీకి చెందిన నాయకుడు. అతడు తన కుమార్తె, అల్లుడితో కలిసి 2021 సెప్టెంబరులో సిరుమలై కొండ ప్రాంతానికి విహారయాత్రకు వెళ్లాడు. ఆ జ్ఞాపకాలను పదిలపరచుకునేందుకు ఫొటోలు తీసుకున్నాడు. వాటిలో ఓ ఫొటోను ఫేస్బుక్లో పోస్టు చేసి, ‘షూటింగ్ ప్రాక్టీస్ కోసం సిరుమలై ప్రయాణం’ అనే అర్థం వచ్చేలా ఓ క్యాప్షన్ పెట్టాడు. ఎఫ్బీలో అది చూసి కొంతమంది లైక్ కొట్టారు. సన్నిహితులు కామెంట్ పెట్టారు. పోలీసులు మాత్రం కేసు పెట్టారు.‘జిహ్వకో రుచి... పుర్రెకో బుద్ధి’ అంటారు. పోలీసుల బుర్రకు ఆ క్యాప్షన్ మరోలా తోచింది. షూటింగ్ ప్రాక్టీస్ అంటే వేరేలా అర్థం చేసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 120(బి), సెక్షన్ 122, సెక్షన్ 505(1)(బి), సెక్షన్ 507 కింద ఎడాపెడా కేసులు నమోదు చేశారు. హడావుడిగా మథివనన్ను అరెస్ట్ చేసి, వాడిపట్టి కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచారు. రిమాండ్ ఇవ్వాలని కోరారు. మేజిస్ట్రేట్ తిరస్కరించారు.హైకోర్టులో ఆసక్తికర వాదనలుకేసు హైకోర్టు మధురై బెంచ్‌కి చేరింది. వాడిపట్టి మేజిస్ట్రేట్ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. అరెస్ట్ చేసిన ప్రతి వ్యక్తినీ యాంత్రికంగా రిమాండ్‌కు పంపడం కుదరదని తేల్చింది. రిమాండ్ అవసరమా, లేదా? అన్నది మేజిస్ట్రేట్ పరిశీలిస్తారని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘నవ్వడం కూడా పౌరుల విధుల్లో ఒకటిగా ఉండాలేమో!’ అంటూ వ్యాఖ్యానించింది. హాస్యం, ఎగతాళి రెండూ వేర్వేరు అంశాలని పేర్కొంది.సెక్షన్ల వారీగా వివరణ‘ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధం అవడానికి కేవలం ఒక క్యాప్షన్ సరిపోదు. వ్యక్తులను సమీకరించడం, ఆయుధాలను సేకరించడం, ఇతర సన్నాహాలు’ ఉండాలి. ఆ ఫొటోల్లో ప్రకృతి, కూతురు, అల్లుడు తప్ప అలాంటి చర్యలేవీ కనపడడం లేదు. పోలీసులు ఎలాంటి ఆయుధాలనూ స్వాధీనం చేసుకున్నట్టు రిపోర్టులో రాయలేదు. కాబట్టి సెక్షన్ 122 వర్తించదని కోర్టు స్పష్టం చేసింది.సెక్షన్ 505(1)(బి) వర్తించాలంటే, ఒక ప్రకటనతో ప్రజల్లో భయం కలగాలి; అలజడి రేగాలి. ప్రభుత్వానికి/ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రజలను ప్రేరేపించాలి. కానీ ఆ క్యాప్షన్ చూస్తే నవ్వు వస్తుంది తప్ప పైన పేర్కొన్నవేవీ కలగడం లేదు. కాబట్టి ఈ సెక్షన్ అసంబద్ధమైంది.అజ్ఞాతంలో ఉండి బెదిరింపులకు పాల్పడే వారికి సంబంధించింది సెక్షన్ 507. అతను సామాజిక మాధ్యమంలో బహిరంగంగా క్యాప్షన్ పెట్టాడు. ఇక్కడ అజ్ఞాత కమ్యూనికేషన్ ఏం ఉంది? ఇదీ చెల్లదని పేర్కొంది. మథివనన్ ఒక్కడ్నే నిందితుడిగా చేర్చారు. కుట్ర అంటే కనీసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒక నేరం చేయడానికి కలవాలి. ఒక వ్యక్తి తనతో తానే కుట్ర చేయలేడని వ్యాఖ్యానించింది. కుట్రకు ఆధారమైన ఇతర ఆరోపణలూ నిలవలేదు. ఇక ఈ సెక్షన్ కూడా వర్తించదని స్పష్టం చేసింది.పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ అసంబద్ధమైనది, న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేసేదిగా ఉందని పేర్కొంటూ ఆ ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టేసింది. ఒక క్యాప్షన్ తెచ్చిన తంటా చివరికి హైకోర్టు జోక్యంతో ప్రశాంతంగా ముగిసింది. ఎరక్కపోయి ఇరుక్కుపోవడం అంటే ఇదేనేమో!- దిలీప్ మాదిరెడ్డి -
అసలు ఆ రాత్రికి ఏ జరిగింది? ఇప్పటికీ మిస్టరీగానే ఆ ఘటన!
1959 ఫిబ్రవరి ఒకటో తేదీ... రష్యాలోని యూరల్ పర్వత ప్రాంతం– సంధ్యకాంతుల్లో ఆ మంచు పర్వతం శోభాయమానంగా కనిపిస్తోంది. అప్పుడే అక్కడకు ఓ పర్వతారోహకుల బృందం వచ్చింది. ‘‘ఈ రాత్రికి ఇక్కడ బస చేద్దాం’’ అని 23 ఏళ్ల ఇగోర్ డియాట్లోవ్ తన సహచరులను ఉద్దేశించి అనడంతో అందరూ టెంట్ వేయడానికి ఉపక్రమించారు.గంటలు గడిచాయి. అందరూ గాఢనిద్రలోకి జారుకున్నారు. చుట్టూ తెల్లటి మంచుకొండలు తప్ప ఎలాంటి అలికిడీ లేదు. బయట ఉష్ణోగ్రత మైనస్ 30 డిగ్రీలకు పడిపోయి భయంకరమైన నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. అంతలోనే ఏమైందో తెలియదు– టెంటులో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. లోపలున్నవారు విపరీతమైన భయంతో టెంట్‌ను కత్తితో చీల్చుకుని బయటకు వచ్చారు. పెద్దగా అరుస్తూ ప్రాణభయంతో తలోదిక్కుకు పరుగులు తీశారు. ఆ రాత్రి వారి జీవితంలో కాళరాత్రిగా మిగిలిపోయింది.ఆ భయానక రాత్రికి ఎనిమిది రోజుల ముందు– అంటే, 1959 జనవరి 23న రష్యాలోని యూరల్ పాలిటెక్నిక్ ఇన్ స్టిట్యూట్‌కు చెందిన ఎనిమిది మంది యువకులు, ఇద్దరు యువతులు ‘ఓటోర్టెన్’ అనే ప్రమాదకరమైన మంచు పర్వతాన్ని అధిరోహించడానికి బయలుదేరారు. అనారోగ్యం కారణంగా ‘యూరీ యుడిన్’ అనే యువకుడు వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు.మిగిలిన తొమ్మిదిమంది ఫిబ్రవరి 1న ‘ఖోలాట్ స్యాఖ్ల్’ అనే కొండపైకి చేరుకుని అక్కడ టెంట్ వేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 12 నాటికి తిరిగి రావాలి. కానీ ఫిబ్రవరి 20 వచ్చినా వారి నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీంతో కుటుంబసభ్యుల విన్నపం మేరకు రష్యా ప్రభుత్వం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఫిబ్రవరి 26న సహాయక బృందాలు ఆ కొండ వద్దకు చేరుకుని అక్కడి దృశ్యాలు చూసి షాక్ తిన్నాయి.టెంట్‌ను లోపల నుంచి కోసిన ఆనవాళ్లు కనిపించాయి. కానీ చుట్టుపక్కల ఎవరూ లేరు. టెంట్‌కు దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఓ చెట్టు కింద ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. వారి ఒంటిపై లోదుస్తులు మాత్రమే ఉన్నాయి. మరికొంత దూరంలో డియాట్లోవ్ సహా మరో ముగ్గురి శవాలు మంచులో గడ్డకట్టి కనిపించాయి. మిగిలిన నలుగురి మృతదేహాలు మే నెలలో కరిగిన మంచు ప్రవాహంలో దొరికాయి. వీరిలో కొందరి పక్కటెముకలు విరిగిపోగా, ఒకరి పుర్రె పగిలిపోయింది. ల్యూడ్మిలా దుబినినా అనే యువతి నాలుక, కళ్లు కనిపించలేదు. మరొకరి కనుగుడ్లు లేవు. వారి ఒంటిపై అంతటి గాయాలు ఉన్నప్పటికీ, బయటి నుంచి దెబ్బలు తగిలిన గుర్తులు లేవు. కొందరి దుస్తులపై రేడియోయాక్టివ్ ఆనవాళ్లు కూడా కనిపించాయి.ఈ మరణాలపై దశాబ్దాల పాటు రకరకాల ప్రచారాలు సాగాయి. ఆ రాత్రి ఆకాశంలో వింత కాంతులు కనిపించాయని స్థానికులు చెప్పడంతో ఏలియన్స్ లేదా యూఎఫ్ఓల దాడే కారణమని కొందరు నమ్మారు. రష్యా మిలిటరీ అక్కడ రేడియేషన్ ఆయుధాలను పరీక్షించిందని, అది వికటించి వీరు చనిపోయారని ప్రచారం జరిగింది. ఆ ప్రాంతంలో ఉండే ‘మాన్సీ’ అనే గిరిజన తెగకు చెందిన వ్యక్తులు తమ పవిత్ర స్థలంలోకి వచ్చినందుకు వీరిని హత్య చేశారని అనుకున్నారు.భారీ ఆకారం కలిగిన యతి అనే మంచు మనిషి దాడి చేయడం వల్లే వారికి ఎముకలు విరిగిపోయాయని మరో ఊహాగానం సాగింది. కానీ వీటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లభించలేదు. చివరకు ప్రభుత్వం– ‘నిరోధించలేని ఒక అపరిమితమైన ప్రకృతి శక్తి’ వల్ల వీరు చనిపోయారని 1959లోనే ఆ కేసును మూసివేసింది. అనంతరం ఆ ప్రాంతం ఆ గ్రూప్ లీడర్ పేరుతో ‘డియాట్లోవ్ పాస్’గా ప్రసిద్ధికెక్కింది.మిస్టరీగా మిగిలిపోయిన ఆ మరణాలపై 2021లో స్విట్జర్లాండ్‌కు చెందిన శాస్త్రవేత్తలు జోహన్ గౌమే, అలెగ్జాండర్ పుజ్రిన్ కలిసి కంప్యూటర్ మోడళ్లు, స్నో ఫిజిక్స్ ఆధారంగా అధ్యయనం చేసి, శాస్త్రీయ వివరణ ఇచ్చారు. ఆ రాత్రి వీచిన బలమైన గాలుల వల్ల ఒక భారీ మంచుపలక టెంట్‌పై పడిందని, దీంతో అందులో ఉన్నవారి పక్కటెముకలు విరిగిపోయాయని అంచనా వేశారు.మంచు పలకలు పడతాయనే భయంతో వారు టెంట్‌ను లోపలి నుంచి కోసుకుని బయటకు పరిగెత్తారని, మైనస్ 30 డిగ్రీల చలిలో ‘హైపోథెర్మియా’ (శరీర ఉష్ణోగ్రత పడిపోవడం)తో చనిపోయారని వివరించారు. మృతదేహాలు చాలారోజులు మంచులో ఉండటంతో పక్షులు, అడవి జంతువులు కళ్లు, నాలుకలను తినేసి ఉంటాయని పేర్కొన్నారు. అందులో కొందరు గతంలో రేడియేషన్ కు గురయ్యే వాతావరణంలో ఉన్నందున వారి దుస్తులపై రేడియేషన్ ఆనవాళ్లు కనిపించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే, ఈ వివరణపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.ఇంతకీ అసలా రాత్రి ఏం జరిగింది? వారంతా ఎలా చనిపోయారు... అనే ప్రశ్నలకు సమాధానాలు మాత్రం నేటికీ ఆ యూరల్ పర్వతాల మంచు పొరల కిందే నిక్షిప్తమై ఉండిపోయాయి.- సత్యకిశోర్ కొండ్రెడ్డి -
రాఖీ పండుగ.. మార్కెట్ అమ్మకాలు ఎన్నివేల కోట్లంటే?
మన దేశమంతటా వేడుకగా జరుపుకొనే పండుగల్లో రాఖీ పండుగ విశిష్టమైనది. సోదరీ సోదరుల అనుబంధానికి ప్రతీకగా ‘రక్షాబంధనం’ తరతరాల ఆనవాయితీగా వస్తోంది. ఏటా శ్రావణ పూర్ణిమ రోజున సోదరీమణులు తమ సోదరులకు రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపిస్తారు. సోదరుల నుంచి కానుకలు అందుకుంటారు.రాఖీ పండుగ మొదలవడానికి దాదాపు నెల్లాళ్ల నుంచి మార్కెట్లో రాఖీ కళ కనిపిస్తుంది. రాఖీ పండుగ కోసం సీజనల్‌గా ఊరూరా రాఖీ దుకాణాలు వెలుస్తాయి. స్వీట్ షాపుల్లో అమ్మకాల జోరు విపరీతంగా పెరుగుతుంది. రాఖీ సీజన్లో దేశవ్యాప్తంగా జరిగే రాఖీల అమ్మకాల విలువ దాదాపు రూ.17,000 కోట్లకు పైగా ఉంటుందని ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్’ (సీఏఐటీ) చెబుతోంది.గత ఏడాది రాఖీ మార్కెట్లో 42 శాతం వృద్ధి నమోదైంది. ఈసారి కూడా రాఖీల అమ్మకాల విలువ మరో 40 శాతానికి పైగా పెరగవచ్చని సీఏఐటీ అంచనా. రాఖీ జోరు గురించి గణాంకాల్లో తెలుసుకుందాం...మన దేశంలో రాఖీల తయారీ సంఘటిత రంగంలో కంటే అసంఘటిత రంగంలోనే ఎక్కువగా జరుగుతుంది. సంఘటిత రంగానికి సంబంధించిన లెక్కలు మాత్రమే పారిశ్రామిక సమాఖ్యలకు, ఇతర సంస్థలకు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ చూపిన అంకెల కంటే వాస్తవానికి రాఖీల తయారీ, విక్రయాలు మరింత ఎక్కువగానే జరుగుతుంటాయి. -
తడిసినా సమస్యలేదిక!
వర్షాకాలంలో జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండేందుకు జుట్టును పొడిగా, శుభ్రంగా ఉంచుకోవాలి. వర్షంలో తడిస్తే వెంటనే మైల్డ్, సల్ఫేట్–ఫ్రీ షాంపూతో తలస్నానం చేయాలి. తడి జుట్టును అస్సలు ముడివేయవద్దు. తేమ ఉన్నట్లయితే కుదుళ్ళు బలహీనపడతాయి. జుట్టును గాలికి సహజంగా ఆరనివ్వాలి. జుట్టు చిక్కులు తీయడానికి వెడల్పాటి పళ్ళున్న దువ్వెనను ఉపయోగించాలి. వారానికి రెండు మూడుసార్లు మాత్రమే తలస్నానం చేయాలి, లేదంటే జుట్టు నిర్జీవంగా మారుతుంది. శరీరంలో పోషకాల లోపం వల్ల కూడా వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా రాలుతుంది. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే గుడ్లు, పప్పు ధాన్యాలు, ఆకుకూరలు, బాదం వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి. రోజంతా సరిపడా నీరు తాగడం వల్ల కుదుళ్ళు తేమగా, బలంగా ఉంటాయి. దువ్వెనలు, పిల్లో కవర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. -
వడాపావ్‌కు అరవయ్యేళ్లు
‘ఇండియన్ బర్గర్’గా, ‘బాంబే బర్గర్’గా పేరుపొందిన ‘వడాపావ్’ పుట్టి నేటికి అరవయ్యేళ్లవుతోంది. ముంబైలో పుట్టిన ఈ సత్వరాహార పదార్థం అనతి కాలంలోనే ముంబై ప్రజల ఆహార సంస్కృతిలో భాగంగా మారింది. అంతటితోనే ఆగిపోకుండా, శరవేగంగా ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు కూడా వ్యాపించింది. అసలు వడాపావ్ ఆవిష్కరణే ఒక ఆసక్తికరమైన చరిత్ర. అవసరమే ఆవిష్కరణకు పునాదిఎటు చూసినా, నిరంతర జనసమ్మర్దంతో కిటకిటలాడే మహానగరం ముంబై. అరవయ్యేళ్ల కిందట ముంబై కార్మికవర్గం ఎక్కువగా ఉదయం చపాతీలు తినేవారు. చపాతీలతో పాటు ఉడికించిన బంగాళ దుంపలను ముద్దలా చిదిమేసి, కాస్త వేయించి, మసాలాలు కలిపిన కూరను నంజుకునేవారు. హడావుడి పనివేళల్లో వీటిని తినడం కొంత ఇబ్బందిగా ఉండేది. ఈ ఇబ్బందిని అధిగమించడానికి ముంబై నడిబొడ్డులోని దాదర్ ప్రాంతానికి చెందిన అశోక్ వైద్య అనే పాకనిపుణుడు 1966లో ‘వడాపావ్’ను ఆవిష్కరించాడు.బన్ రొట్టెను అడ్డంగా చీల్చి, అందులో మసాలాలు దట్టించి, వేపిన బంగాళదుంపల ముద్దను కూరి, నంజుకోవడానికి వేపిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి చేర్చిన కొబ్బరి చట్నీతో పాటు వడ్డించడం మొదలుపెట్టాడు. ఎక్కడైనా తినడానికి సులువుగా ఉండటమే కాకుండా, అతి రుచిగా ఉండటంతో వడపావ్ ముంబై జనాలను ఆకట్టుకుంది. అశోక్ వైద్య దాదర్ రైల్వేస్టేషన్ ఎదుట తన వడాపావ్ స్టాల్‌ను ఏర్పాటు చేశాడు. డెబ్బయిల ప్రారంభంలోనే ఇలాంటి స్టాల్స్ పదుల సంఖ్యలో ముంబై నలుమూలలా ఏర్పడ్డాయి. ప్రస్తుతం కేవలం ముంబై నగరంలోనే ఏకంగా ఇరవైవేలకు పైగా వడాపావ్ స్టాల్స్ ఉన్నాయి. వీటికి తోడు స్టార్ హోటళ్లు కూడా వడాపావ్‌ను వడ్డిస్తున్నాయి. తొంభైల నాటికి దేశంలోని ప్రధాన నగరాలన్నింటితో పాటు విదేశాల్లోని భారతీయ రెస్టరెంట్లకు కూడా వడాపావ్ విస్తరించింది.వడాపావ్ ఒక సాంస్కృతిక ప్రతీకఒకప్పుడు ముంబైలో ఎక్కువగా ఉడుపి హోటళ్లు ఉండేవి. ముంబై కార్మికుల్లో ఎక్కువమంది కాటన్ మిల్లుల్లో పనిచేసేవారు. అరవైల కాలంలో కాటన్ మిల్లులు మూతపడటంతో చాలామంది కార్మికులు ఉపాధి పోగొట్టుకున్నారు. అప్పటి శివసేన అధినేత బాల్ ఠాక్రే స్థానికంగా చిరువ్యాపారాలు సొంతగా ప్రారంభించి, ముంబై కార్మికులు ఎదగాలని పిలుపునిచ్చారు. ఆ స్ఫూర్తితోనే అశోక్ వైద్య వడాపావ్‌ను ఆవిష్కరించి, సొంత వ్యాపారం ప్రారంభించాడు. అతడి వ్యాపార విజయం స్ఫూర్తితో మరింతమంది ఈ రంగంలోకి వచ్చారు. వడాపావ్ ప్రపంచవ్యాప్తంగా ఉనికి చాటుకోవడంతో దీని గౌరవార్థం ఏటా ఆగస్టు 23న ‘ప్రపంచ వడపావ్ రోజు’గా జరుపుకోవడాన్ని 2001 నుంచి ప్రారంభించారు. -
అవకాశం వస్తే వదులుకోను!
ప్రతి అడుగులోనూ ఓ కొత్త పాత్ర... ప్రతి మలుపులోనూ ఓ కొత్త అనుభవం! నటిగా తన పరిధిని ఎప్పటికప్పుడు విస్తరించుకుంటూ, విభిన్న పాత్రలతో అలరిస్తోంది నటి వామికా గబ్బి. అనుకోకుండా మొదలైన ఆ ప్రయాణంలోని ఎదురైన మలుపుల గురించి ఆమె మాటల్లోనే మీకోసం!తెలియకుండా వచ్చా! చిన్నప్పుడే కథక్ నేర్చుకున్నాను. నా ఎక్స్ప్రెషన్స్ నచ్చి, అడగకుండానే ‘జబ్ వి మెట్’లో చిన్న పాత్ర చేసే అవకాశం వచ్చింది. అలా సినిమా అంటే ఏంటో కూడా తెలియకుండానే సినిమాల్లోకి వచ్చాను. సినిమానే వదిలేద్దామనుకున్నా!ఒకానొక దశలో సినిమాలే వద్దనుకున్నాను. నేను ఎటు వెళ్తున్నానో అర్థంకాక నిరాశపడ్డాను. కానీ వచ్చిన కొన్ని మంచి అవకాశాలు మళ్లీ నాలోని నటిని నమ్మేలా చేశాయి. ఇప్పుడు హిందీ, పంజాబీ, మలయాళం, తమిళం, తెలుగు... ఇలా విభిన్న భాషల్లో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది.మరో కొత్త అడుగు!‘డీసీ’ నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. కొత్త కథ, కొత్త ప్రపంచం... నటిగా నన్ను నేను మరోసారి పరీక్షించుకునే అవకాశం వచ్చింది. అదే సమయంలో ‘గూఢచారి 2’తో కూడా త్వరలోనే వస్తున్నాను. యాక్షన్ స్పై థ్రిల్లర్‌లో నటించడం నాకు కొత్త అనుభూతి. ప్రేక్షకులు నన్ను మరో కొత్త కోణంలో చూడబోతున్నారనే ఆలోచనే చాలా ఎగై్జటింగ్‌గా ఉంది.ఐదుగురు పిల్లలు నాకుజంతువులంటే చాలా ఇష్టం. ముఖ్యంగా కుక్కలంటే చెప్పలేనంత ప్రేమ. నాకు ఐదుగురు అబ్బాయిలు ఉన్నారు. వాళ్లంతా నా పిల్లలే. షూటింగ్ కోసం దూరం వెళ్లినప్పుడు వాళ్లను మిస్ అవుతుంటాను. అంతేకాదు, నేను పూర్తిగా వీగన్ జీవనశైలిని పాటిస్తాను. దానికి ప్రధాన కారణం జంతువులపై నాకున్న ప్రేమే.అదొక క్రేజీ కలెక్షన్ !నేను ఎక్కడికి వెళ్లినా అక్కడి నుంచి ఏదో ఒక ప్రత్యేకమైన ఉంగరం తీసుకురావడం అలవాటు. చిన్నదైనా సరే, ఆ ప్రదేశాన్ని గుర్తు చేసేలా ఉండాలి. అందుకే నా దగ్గర చాలా రకాల ఉంగరాలు ఉన్నాయి. ఒక్కో ఉంగరం వెనుక ఒక్కో ప్రయాణం ఉంటుంది.‘దేవదాస్’లో పారుగా కనిపించాలి!నా డ్రీమ్ రోల్ ఏంటని అడిగితే.. ‘దేవదాస్’లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ పోషించిన పారు పాత్ర నాకు చాలా ఇష్టం. అదే పాత్రను ఒక కొత్త కోణంలో చేసే అవకాశం వస్తే వదులుకోను. ఆ పాత్రలో చాలా బలమైన భావోద్వేగాలు ఉన్నాయి.ప్రశాంతత ఒక కళ!సినిమాల్లోకి వచ్చాక అందరూ మనల్ని ఎలా చూస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనే దానిపై ఎక్కువగా ఆలోచిస్తే మన ప్రశాంతత పోతుంది. అందుకే ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతుంటాను. ఇతరుల అభిప్రాయాల కంటే... మన గురించి మనకు ఉన్న స్పష్టతే ముఖ్యమని ఇక్కడి నుంచి చాలా నేర్చుకున్నాను.కెమెరా చూసి భయపడేదాన్ని!మోడలింగ్ మొదట్లో కెమెరా కనిపిస్తే కాస్త ఇబ్బందిగా అనిపించేది. ఫ్రీజ్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. అదే కెమెరా ముందు ఇప్పుడు ఇన్ని పాత్రలు చేయడం చూస్తే నాకే నవ్వొస్తుంది!పేరు మార్చలేదు‘గబ్బి’ అనేది మా నాన్న పెట్టుకున్న కలం పేరు. ఆయన రచయిత. అదే పేరు ఇప్పుడు, నా స్క్రీన్ నేమ్‌గా వచ్చింది. నా పేరులో నాన్న సృజనాత్మక ప్రపంచం ఒక భాగంగా ఉండటం గర్వంగా ఉంటుంది. -
స్నానానికి గాడిద పాలు
ఈజిప్టు రాణి క్లియోపాత్రా తన చర్మాన్ని మృదువుగా, యవ్వనంగా ఉంచుకోవడం కోసం ప్రతిరోజు గాడిద పాలతో స్నానం చేసేది. ఆమె ఒక స్నానానికి కావలసిన పాల కోసం దాదాపు 700 గాడిదలను పోషించేవారు. ఆమె తన ప్రయాణాలలో కూడా గాడిదలను తీసుకువెళ్లేది.ఈ పాలలోని ‘లాక్టిక్ యాసిడ్’ చర్మాన్ని మృదువుగా, కాంతిమంతంగా మార్చడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా చర్మం లోపలి పొరల నుంచి తేమను అందించి హైడ్రేటెడ్‌గా ఉంచడంలో తోడ్పడుతుంది. -
జలఖండన పర్వదినం
సంస్కృతి, ఆధ్యాత్మికతతో ముడిపడినటువంటి ‘కాండీ ఎసల పెరహెర వేడుకలు’ శ్రీలంకలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆగస్టు 18 నుంచి 28 వరకు సాగే ఈ వేడుకలను మొత్తం 10 రాత్రులు, 11 రోజులు పాటు అత్యంత కోలాహలంగా నిర్వహిస్తారు. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఊరేగింపులు, కళాకారుల ప్రదర్శనలు, అలంకరణలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ మహోత్సవంలో తుది ఘట్టమైన ‘రాందోళి పెరహెర’ ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కాండీ ఎసల పెరహెర ఉత్సవాల తేదీలు ప్రతి సంవత్సరం మారుతున్నప్పటికీ, ఈ పండుగ నిర్వహణ ఎప్పుడూ ఒకేలా సాగుతుంది. ఈ సంబరాలు ప్రధానంగా మూడు ఘట్టాలుగా కొనసాగుతాయి. ఉత్సవాల్లో ప్రారంభ క్రతువు కప్ సిటువీమ. ఈ వేడుకలు శ్రీ దళదా మాలిగావా (బుద్ధుని పవిత్ర దంత అవశేషం ఉన్న దేవాలయం) ప్రాంగణంలో ప్రారంభమవుతాయి. ఉత్సవ ప్రారంభానికి సూచికగా ఆలయ ప్రాంగణంలో ఒక పవిత్ర వృక్షాన్ని నాటుతారు. ఇది ప్రధానంగా మతపరమైన ఆచారం అయినప్పటికీ, పెరహెర సీజ¯Œ కు ఇది అధికారిక ప్రారంభ ఘట్టంగా నిలుస్తుంది.ఉత్సవాల్లో రెండో ఘట్టం కుంభాల్ పెరహెర. పండుగ మొదటి ఐదు రాత్రులను ‘కుంభాల్ పెరహెర’ అని పిలుస్తారు. ఈ ప్రారంభ ఊరేగింపులు పరిమాణంలో కాస్త చిన్నవిగా, సంప్రదాయబద్ధంగా సాగుతాయి. ఎక్కువ రద్దీ లేకుండా పండుగ వాతావరణాన్ని ప్రశాంతంగా ఆస్వాదించడానికి ఇవి చక్కటి అవకాశం. ఈ రాత్రులలో సంప్రదాయ కాండియన్ నృత్యకారులు, కొరడా ఝళిపించే ప్రదర్శకులు, మేళతాళాల వాయిద్యకారులు, అలంకరించిన ఏనుగులు, దివిటీలు పట్టిన సేవకులు పాల్గొంటారు.మూడో ఘట్టం రాందోళి పెరహెర. అంటే మహా ఊరేగింపులు. ఆఖరి ఐదు రాత్రులను ‘రాందోళి పెరహెర’ అని పిలుస్తారు. పండుగ మొత్తంలోనే అత్యంత అద్భుతంగా, వైభవంగా సాగే రాత్రులు ఇవే! ఈ ఊరేగింపులు జరిగేటప్పుడు కాండీ నగర వీథులు వేలాదిమంది భక్తులతో, పర్యాటకులతో నిండిపోతాయి. వందలాది మంది నృత్యకారులు, కళాకారులు, వాద్యకారుల బృందాలు, రాత్రి ఆకాశాన్ని కాంతులతో నింపే అగ్ని విన్యాసకులు, విద్యుత్ దీపాలతో ప్రకాశించే వస్త్రాలు ధరించిన గజరాజులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇవి కాండీ పెరహెరకే అత్యంత ముఖ్యమైన ఘట్టాలు కావడంతో అంతర్జాతీయ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఈ ఉత్సవాల్లో చివరి ఊరేగింపు రాత్రి వేకువ జామున జరిగే వేడుక దహవల్ పెరహెర. ఇందులో భాగంగా మహావలి నది ఒడ్డున జరిగే ‘దియా–కెపీమ’ అంటే ‘జలఖండన’ కార్యక్రమంతో ఎసల పెరహెర ముగుస్తుంది. ఇందులో భాగంగా నదీ జలాలను లాంఛనప్రాయంగా ఖండించినట్లు నీళ్లల్లో కత్తులను తాటిస్తారు. ఈ క్రతువును వీక్షించేందుకు సాధారణ ప్రజలకు అనుమతి ఉండదు. శ్రీలంకలో జరిగే ప్రసిద్ధ ‘కాండీ ఎసల పెరహెర’ ఉత్సవం కేవలం ఒక సాంస్కృతిక ప్రదర్శన మాత్రమే కాదు. ఇది శతాబ్దాలుగా కొనసాగుతున్న ఒక ఆధ్యాత్మిక సంప్రదాయం. గౌతమ బుద్ధుని పవిత్ర దంత అవశేషానికి అత్యంత భక్తిశ్రద్ధలతో గౌరవం అర్పిస్తూ, దేశానికి సమృద్ధిగా, సమయానుకూల వర్షాలు, ప్రజలకు శుభాలు కలగాలని కోరుకుంటూ ఈ పండుగను నిర్వహిస్తారు. ఈ చారిత్రాత్మక వేడుక శ్రీలంక బౌద్ధ సంస్కృతి విశిష్టతను ప్రపంచానికి చాటిచెబుతోంది. ∙ రమా జంబుల -
స్క్రీన్ మార్చిన సీరియల్స్
మనిషి పుట్టినప్పటి నుంచి వినోదం ఉంది. మాటల్లోనూ, బొమ్మల్లోనూ, గోడమీద గీతల్లోనూ, కాగితపు రాతల్లోనూ మనిషిలోని చిలిపితనం తాలూకు చమక్కులు కనిపిస్తూ, వినిపిస్తూనే ఉన్నాయి. నాగరికతలు అభివృద్ధి దిశగా పయనం మొదలుపెట్టినప్పుడు వినోదం రంగస్థలమంటూ మన చుట్టూ కాస్త స్థలాన్ని సంపాదించుకుంది. దాని తర్వాత సాంకేతికత పల్లకినెక్కిన వినోదం – మొదట మూకీగా, తర్వాత టాకీగా సినిమాలు తెరకెక్కి, బాక్సాఫీసు లెక్కలంటూ అంకెలు చూపించి రంకెలు వేసింది. ఆ తర్వాత టీవీ పెట్టెలో బుల్లితెర మనింటి బంధువై, పొరుగింటి చుట్టమై మనతో కలసిపోయి ఓ వెలుగు వెలిగింది. అక్కడితో ఊరుకుందా? జెన్ జీలతోనే పోటీ పడుతూ కాలంతో పాటు వినోదం కూడా వేగమందుకుంది. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్‌స్టా అంటూ యమస్పీడు పెంచింది. ఇప్పుడు మైక్రోడ్రామా (చిట్టి కథ) అంటూ మరో మెట్టుకెక్కింది. ఒకప్పుడు మనల్ని వెండితెర వింతలు చూపించి అబ్బురపరిస్తే, దాని వెనుక వచ్చిన బుల్లితెర సందడులెన్నో మోసుకొచ్చి సంబరపరచింది. కాని ఇది వెండితెర యుగం కాదు బుల్లితెర యుగం కాదు ఇది వేళ్లతెర (టచ్ ఫోన్) యుగం. వర్చువల్ వరల్డ్‌లో వినోదానికి కొత్త ప్లాట్‌ఫాం ఈ వర్టికల్ వరల్డ్. వెల్కమ్ టు మైక్రో‘డ్రామేనియా!’ఎమోషనల్ టచ్టర్టెయిన్మెంట్... మాటలురాని చంటి పిల్లవాడి నుంచి మంచంపట్టిన నానమ్మ, తాతయ్యల వరకు అందరికీ అవసరమైనది ఇదే... నచ్చిన సినిమా కోసం డబ్బులు పోగేసుకుని థియేటర్‌కి వెళ్లి చూస్తారు. రోజుకోసారి వచ్చే సీరియల్ కోసం రోజంతా వెయిట్ చేస్తారు. కాని ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎంటర్టెయిన్మెంట్ గేర్ మార్చింది. రిమోట్ పట్టుకుని చానల్స్ మార్చే చేయి ఇప్పుడు రీల్స్ స్క్రోల్ చేస్తోంది. హాలీవుడ్ స్టార్ సినిమా విశేషాల దగ్గర నుంచి లోకల్ గ్యాంగ్æటాలెంట్ వరకు కాదేదీ రీల్స్‌కి అనర్హం అంటూ పుంఖానుపుంఖాలుగా లెక్కకు మించి ఇన్బాక్స్లోకొచ్చి పడుతున్నాయి. ఈ రీల్స్ ట్రెండ్ పరిధిని పెంచుతూ మైక్రోడ్రామా సిరీస్‌లు ప్రపంచవ్యాప్తంగా ఎంటర్టెయిన్మెంట్ రంగాన్ని ఉర్రూతలూపుతున్నాయి. ఒక్కో మైక్రో డ్రామా ఎపిసోడ్ నిడివి ఒకటి నుంచి మూడు నిమిషాల వరకు ఉంటుంది. ప్రతి ఎపిసోడ్‌లోనూ భావోద్వేగాలను తారస్థాయిలో చూపిస్తారు. మైక్రోడ్రామాలకి ఇదే ఆయువుపట్టు. ఈ చిట్టి కథలు 60 నుంచి 100 ఎపిసోడ్ల వరకు ఉంటాయి. అంటే ఇంచుమించు సినిమా నిడివికి సమానం..ఎలా మొదలైందంటే!కోట్లాది వీక్షకులు చూస్తున్న మైక్రోడ్రామా చైనాలో పురుడు పోసుకుంది. 2018లో డౌయిన్ (ప్రస్తుతం చైనా టిక్‌టాక్ వర్షన్) తొలుత షార్ట్ వర్టికల్ వీడియోలు రిలీజై యూత్‌ని బాగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత 2019లో ‘డ్వాన్జు’ పేరుతో మొదటి కమర్షియల్ మైక్రో డ్రామాలు విడుదలయ్యాయి. 2020 కరోనా లాక్డౌన్లో ఇంటికే పరిమితమైన ప్రేక్షకులకు అపరిమితమైన వినోదాన్ని పంచి అటు వెండితెరకు, ఇటు బుల్లితెరకు ప్రత్యామ్నాయంగా మారి అనతికాలంలోనే విస్తరించాయి. అలా కేవలం మూడేళ్లలోనే చైనావాల్ దాటి ప్రపంచ కాంపౌండ్‌లోకి దూకాయి.కమింగ్ టు అమెరికా... (2022 –2024)చైనాలో మైక్రోడ్రామాల ఫార్మాట్ హాలీవుడ్‌ను కూడా ఆకర్షించింది. పాశ్చాత్య ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా టేకింగ్, అందుకు అనుగుణంగా బడ్జెట్లు మారాయి. కథల్లో పూర్తిగా మార్పులు వచ్చాయి. బిలియనీర్ రొమాన్స్, మాఫియా రొమాన్స్, క్యాంపస్ రొమాన్స్ వంటి కథలు వచ్చాయి. విడుదలైన ప్రతి మైక్రో సిరీస్‌కు అనూహ్యంగా ప్రేక్షకుల నుంచి స్పందన రావడంతో హాలీవుడ్ పరిశ్రమ కూడా ఈ ఫార్మాట్‌ను సీరియస్‌గా తీసుకోవడం మొదలుపెట్టింది.జపాన్ వయా కొరియా (2024)ఈ చిట్టికథలు సృష్టించిన సునామీ సౌత్ కొరియా, జపాన్ తీరాలను తాకింది. రొమాంటిక్ కామెడీ, ఐడియల్ డ్రామా, ఫాంటసీ డ్రామా, రొమాన్స్ జానర్లలో కొరియన్ డ్రామాలు ఆ దేశంలోనే కాదు విదేశాలలో కూడా ‘కె–డ్రామా’ పేరిట ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ముఖ్యంగా క్వాలిటీ విషయంలో మునుపెన్నడూ లేని విధంగా ప్రతి సిరీస్‌ను మలచడంతో అనతికాలంలో కె–డ్రామాలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇక జపాన్‌లో అయితే వారి సంస్కృతిలో భాగమైన యానిమి, మాంగా కథలను చిట్టికథల్లోకి ప్రవేశపెట్టారు. అలాగే స్లైస్ ఆఫ్ లైఫ్, స్కూల్ రొమాన్స్ సీరిస్ వంటి జానర్లలో మైక్రో సిరీస్‌లను రూపొందించడంతో అవి కూడా విశేషాదరణ పొందాయి.మన దేశంలోకిలా.. (2024 –2026)భారత్‌లోకి కాస్త ఆలస్యంగా ప్రవేశించిన చిట్టికథల ట్రెండ్ గట్టిగానే సౌండ్ చేస్తోంది. మధ్య తరగతి కుటుంబ నేపథ్యం, బాధ్యతలు, రాజు–పేద తారతమ్యం, కాలేజ్ లవ్ వంటి జానర్ల మీద ప్రధానంగా మైక్రోడ్రామాలు రూపొందుతున్నాయి. అయితే భారత్‌లో ఇంకా ఈ ఫార్మాట్ ప్రారంభ« దశలోనే ఉందని చెప్పాలి. అంటే దాని అర్థం ఈ రంగంలో అవకాశాలు అపారంగా ఉన్నాయనే! చౌక అయిన మొబైల్ డేటా, పెరుగుతున్న సోషల్ మీడియా వినియోగం, ప్రాంతీయ భాషలలో డబ్బింగ్‌కు పెరుగుతున్న డిమాండ్, అధిక జనాభా మొబైల్ వాడకం ఇవన్నీ మనదేశంలో మైక్రోడ్రామా పరిశ్రమ అభివృద్ధికి ఊతమిచ్చేలా సంకేతాలిస్తున్నాయి.రిస్క్ తక్కువ రాబడి ఎక్కువమూడు గంటల సినిమా నిర్మించడానికి నెలల తరబడి ప్రీ–ప్రొడక్షన్, భారీ సెట్లు, హీరో, హీరోయిన్ల డేట్లు, కోట్ల రూపాయల ఖర్చు అవసరమవుతుంది. ఇంతా చేసి సినిమా హిట్ అయ్యిందా సరే, లేదంటే నిర్మాత కోట్ల నష్టాలు మూట గట్టుకోవాలి. కాని మైక్రో డ్రామాల్లో మాత్రం ఇంత ఖర్చు అక్కర్లేదు. కోట్లకు కోట్లు కుమ్మరించాల్సిన పని లేదు. డేట్ల కోసం హీరోల వెంట పడక్కర్లేదు. మంచి కథ ఎంచుకుని చిన్న బడ్జెట్‌తో పరిమితమైన లొకేషన్లలో కొత్తవారితోనే సీరిస్ తీసేయవచ్చు. ఇక్కడ చిన్న బడ్జెట్ అంటే నాణ్యతలో రాజీ పడడం కాదు, ఈ ఫార్మాట్‌కు ఎంత అవసరమో అంతే ఖర్చు పెట్టడం.ఎందుకింత క్రేజ్మొదటి ఐదారు సెకండ్లలో హుక్ చేయడం, కొన్ని ఎపిసోడ్ల వరకు ఉచితంగా వీక్షకులకు చూపించడం, కీలకమైన ఎపిసోడ్ దగ్గర కంటెంట్‌ను లాక్ చేసి సబ్‌స్క్రైబ్ చేసుకోమనడం వల్ల సగటు వీక్షకులు కాస్తా చందాదారులుగా మారుతారు. ఆ రెగ్యులర్ సబ్స్క్రైబర్లు చూసే కంటెంట్‌లో ప్రతి ఎపిసోడ్‌లోనూ చివర ఒక షాకింగ్ మూమెంట్ పెట్టడం, లేదా ఎమోషన్‌కు గురి చేయడం వల్ల ఆయా ఎంటర్టైన్మెంట్ ప్రొవైడర్లు వీక్షకుల ఆసక్తి తగ్గకుండా చూసుకోవచ్చు. అలాగే నచ్చని కంటెంట్‌ను క్షణ కాలంపాటు కూడా వృథా చేసుకోకుండా స్క్రోల్ చేసి వేరే కంటెంట్‌ను చూసే వీలు ఉండడం వల్ల వర్టికల్ డ్రామా సీరిస్‌కి యమ క్రేజ్ ఏర్పడింది. కొత్త ఆర్థికశక్తిగా...ఒకప్పుడు రంగస్థలానికి పరిమితమైన వినోద రంగాన్ని సినిమా థియేటర్ పూర్తిగా మార్చేసింది. టెలివిజన్ ఇంటిని మార్చేసింది. లాక్డౌన్లో పలకరించిన ఓటీటీ ఎంటర్టెయిన్మెంట్ రూపురేఖలను పూర్తిగా వ్యక్తిగతంగా మార్చేసింది. తాజాగా మైక్రోడ్రామాలు ప్రేక్షకుడి ఖాళీ సమయాన్ని కూడా ఒక మార్కెట్లా మార్చేశాయి. ఒకప్పుడు ఐదు నిమిషాలు ఖాళీగా ఉంటే పెద్దగా ఆలోచించేవాళ్లం కాదు. కాని, ఇప్పుడు అదే ఐదు నిమిషాలలోనే ఓ కథను చూస్తున్నాం. అంటే మన ఖాళీ సమయం కూడా ఒక యాప్‌లో ఆదాయం తెస్తున్నాయి. అదే మైక్రోడ్రామాకి ఇంధనంగా మారుతున్నాయి.1.5 బిలియన్ డాలర్ల మార్కెట్ప్రపంచవ్యాప్తంగా మైక్రో డ్రామా మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోంది. నిపుణుల అధ్యయనాల ప్రకారం, భారత మార్కెట్ 2026లో సుమారు 1.5 బిలియన్ అమెరికన్ డాలర్లు స్థాయిలో ఉండగా, 2033 నాటికి అది 6.5 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. చైనాలో అయితే 2024లోనే మైక్రో డ్రామా మార్కెట్ 6.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2029 నాటికి చిట్టికథల స్థాయి దాదాపుగా 20 బిలియన్ డాలర్లకు పైనే ఉండొచ్చని విశ్లేషకుల అంచనా. ఇక అమెరికా అయితే 2025లో మైక్రోడ్రామా మార్కెట్ 1.3 బిలియన్ డాలర్లు ఉంటే రానున్న రెండు సంవత్సరాల్లో ఇది రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఇక యూరప్ దేశాలలో మైక్రోడ్రామా ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోంది. అలాగే లాటిన్ అమెరికా దేశాలలో కూడా వేగంగా విస్తరిస్తోంది. మొత్తంగా చూస్తే, ప్రస్తుతం ప్రపంచ మైక్రోడ్రామా మార్కెట్ విలువ 60 బిలియన్ డాలర్లకు చేరుకుంది.భారత్‌లో తొలి మైక్రోడ్రామా యాప్భారత్లో తొలి మైక్రోడ్రామా యాప్ ‘బుల్లెట్’ ఏడాది కిందట మొదలైంది. దీనిని ‘జీ ఎంటర్టైన్మెంట్’ భాగస్వామ్యంతో అజీమ్ లలానీ, సౌరభ్ కుష్వా 2025 జూలై 22న ప్రారంభించారు. ‘హర్ మినిట్ మజేదార్’ (ప్రతి నిమిషం ఆనందభరితం) అనే నినాదంతో ప్రచారాన్ని ఊదరగొట్టిన ‘బుల్లెట్’ యాప్– పేరుకు తగ్గట్లే బుల్లెట్లాగానే దూసుకుపోతోంది. ప్రారంభంలోనే ఈ యాప్ ఏకంగా 34 మైక్రోడ్రామాలను ఏడు ప్రాంతీయ భాషలలో– హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ, మలయాళ, మరాఠీలలో అందించి దేశం నలుమూలలకు చెందిన ప్రేక్షకులకు చేరువైంది.‘బుల్లెట్’ అందించిన ‘రిక్షా రోమియో’, ‘మిన్మిని’, ‘బీరువా’, ‘గృహప్రవేశ్’ వంటి మైక్రోడ్రామాలు అత్యధిక వ్యూయర్షిప్ను రాబట్టాయి. ‘బుల్లెట్’ యాప్ వార్షికాదాయం దాదాపు 500 మిలియన్ డాలర్ల వరకు ఉంటోంది. ‘బుల్లెట్’ ఘనవిజయంతో మన దేశంలో మరిన్ని మైక్రోడ్రామా యాప్స్ కూడా మొదలయ్యాయి. వీటిలో ‘కుకు టీవీ’, ‘స్టోరీ టీవీ’, ‘క్లిప్’, ‘పాకెట్ ఫిల్మ్స్’, ‘క్విక్ టీవీ’, ‘డ్రామా బాక్స్’ వంటివి దాదాపు ఇరవై వరకు ఉన్నాయి. మన దేశంలో మైక్రోడ్రామా యాప్స్ మొదలై కేవలం ఏడాది గడిచింది. ఈ రంగం త్వరలోనే మరింత ఆర్థిక వృద్ధి సాధించగలదని మార్కెట్ వర్గాల అంచనా.ఉపాధి మైక్రోడ్రామాలు కేవలం కొత్త వినోద రూపమే కాదు, కొత్త ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తున్నాయి. మైక్రో స్క్రీన్‌ప్లే రచయితలు, వర్టికల్ వీడియో దర్శకులు, ఎడిటర్లు, మొబైల్ సినిమాటోగ్రాఫర్లు, ప్రాంతీయ భాషా డబ్బింగ్ కళాకారులు– ఇలా చాలామంది యువతకు, ఔత్సాహికులకు మైక్రోడ్రామా వారి ప్రతిభను చూపించుకునే ఓ కొత్త ప్లాట్‌ఫాంలా తయారైంది. అలాగే ఒకప్పుడు ప్రకటనలు 30 సెకన్లు ఉండేవి. కాని ఇప్పుడు చిన్నచిన్న నిడివి గల కథల ద్వారా తమ ఉత్పత్తులను పరిచయం చేస్తున్నారు. దాని వల్ల ప్రేక్షకుడికి తాను ఓ ప్రకటనని చూస్తున్నాననే భావన లేకుండా, కథాచిత్రాన్ని వీక్షిస్తున్నంత ఆసక్తిగా వీక్షిస్తున్నాడు. బిజినెస్‌లో ఇదే సెల్లింగ్ పాయింట్. ఇది మాత్రమే కాదు సబ్స్క్రిప్షన్ ప్లాన్లు, బ్రాండ్ ఇంటిగ్రేషన్లు, ఒకే కథను పలు భాషల్లో డబ్బింగ్ చేయించడం వల్ల కోట్లలో ఆదాయం వస్తోంది. తెలుగులో కూడా భావోద్వేగం, కుటుంబ అనుబంధాలు, హాస్యం, థ్రిల్లర్, జానపద కథలు ఇలా– మన దగ్గర కథలకు కొదవే లేదు. కావాల్సిందల్లా వాటిని చెప్పే విధానంలో మార్పు మాత్రమే! ఇదే మైక్రోడ్రామాలకు ఊతమిస్తోంది. దేశవ్యాప్తంగా మైక్రోడ్రామాలు తీసేవారిలో, చూసేవారిలో తెలుగువారు హిందీ తర్వాత రెండో స్థానంలో ఉన్నారు.వెండితెర నుంచి వేళ్ల తెరవినోద ప్రపంచ చరిత్రను ఒక వాక్యంలో చెప్పాలంటే ఒకప్పుడు ప్రేక్షకుడు వెండితెర ముందుకు వెళ్లేవాడు. తర్వాత వచ్చిన బుల్లితెర ప్రేక్షకుడి ఇంటికి వచ్చింది. ఇప్పుడు అరచేతిలోకి వచ్చి మునివేళ్లతోటే నచ్చిన కంటెంట్‌ను చూసుకునే వీలు కల్పిస్తోంది టచ్ ఫోన్. దీనిని వేళ్ల తెర అనాలో లేక రీళ్ల తెర అనాలో అనేది ప్రేక్షకుడికే వదిలేయాలి. సరిగ్గా చెప్పాలంటే వినోదం అనే వాకిట్లో మైక్రోడ్రామా అనే రంగుల ముగ్గు అందంగా అమరిపోయింది. ∙శ్రావణ్ జయ -
పిల్లలతో బయటకు వెళ్తే.. ఈ గాడ్జెట్స్ మర్చిపోవద్దు!
పిల్లలు చిన్నవాళ్లే, కానీ వాళ్ల అవసరాలకు మాత్రం పెద్ద లిస్టే ఉంటుంది. అందుకే, బుజ్జాయికి కంఫర్ట్‌తో పాటు పేరెంట్స్‌కు పీస్ ఇచ్చే ఈ చిన్న చిన్న గాడ్జెట్స్ మీకోసం...శబ్దాలకు... బుజ్జి బుజ్జి బ్రేక్!బుజ్జాయి నిద్రలోకి వెళ్లడం ఒక పెద్ద టాస్క్ అయితే, వెళ్లాక లేవకుండా కాపాడటం అంతకంటే పెద్ద టాస్క్! అందుకే, చుట్టూ ఎంత హడావుడి ఉన్నా శబ్దాన్ని తగ్గించే ఈ చిన్న ఇయర్‌మఫ్స్, ప్రతి పేరెంట్స్ బ్యాగ్‌లో ఉండాల్సిందే! ఇది చుట్టూ ఉన్న పెద్ద శబ్దాలను అనుకూలమైన వాల్యూమ్‌లో తగ్గించేలా రూపొందించారు.మృదువైన ఇయర్ ప్యాడ్స్, సర్దుబాటు చేసుకునే హెడ్‌బ్యాండ్ ఉండటంతో చిన్నారులకు సౌకర్యంగా పెట్టుకోవచ్చు. చెవులపై ఎక్కువ ఒత్తిడి పడకుండా డిజైన్ చేయడంతో విమాన ప్రయాణాలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు, కచేరీలు లేదా రద్దీ ప్రదేశాల్లోనూ ఉపయోగపడతాయి. మడిచి చిన్నగా చేసుకోవచ్చు కాబట్టి ట్రావెల్ బ్యాగ్‌లో పెట్టుకోవడమూ ఈజీ. అప్పుడే పుట్టిన బుజ్జాయిల నుంచి మూడు సంవత్సరాల వయసు బుజ్జాయిల కోసం ప్రత్యేకంగా రూపొందించిన వీటి ధర రూ.1000.కింద పడినా... స్నాక్ పడదు!అమ్మ కష్టపడి స్నాక్ రెడి చేసి పెడితే... బుజ్జోడు మాత్రం ఒక్క సెకనులో బోర్లించేయడం కామనే! ఇక స్నాక్స్ నేలపాలయ్యే సీన్ కు ఈ స్పిల్ ప్రూఫ్ కప్‌తో చెక్ పెట్టొచ్చు. పిల్లలు కప్‌ను షేక్ చేసినా, పిండినా, కింద పడేసినా... లోపలున్న స్నాక్స్ బయటకు రాకుండా సిలికాన్ ఫ్లాప్ అడ్డుకుంటుంది. ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారైన ఈ కప్ చిన్న చేతులకు సులభంగా పట్టుకునేలా ఉంటుంది. పిల్లలు తమంతట తామే స్నాక్స్ తినడం నేర్చుకోవడానికీ ఉపయోగపడుతుంది. మూత ఉండటంతో బ్యాగ్‌లో పెట్టుకుని బయటకు తీసుకెళ్లడమూ ఈజీ. కారులో, పార్కులో, ట్రావెల్లో... ఎక్కడైనా స్నాక్ టైమ్ నో టెన్షన్! అన్ని భాగాలనూ విడదీసి శుభ్రం చేసుకోవచ్చు. డిష్వాషర్లోనూ వేయొచ్చు. బుజ్జోడు కింద పడినా, స్నాక్స్ మాత్రం పడవు! ధర రూ.500.ఎక్కడైనా బుజ్జాయికి బెడ్రూమ్!పిల్లలతో ప్రయాణం అంటే... టికెట్ ఒక్కరికే, టెన్షన్ మాత్రం మొత్తం ఫ్యామిలీకి! కాసేపు కూర్చోబెట్టినా కాళ్లు చాపాలని, పడుకోవాలనిపిస్తే సీటు సరిపోదు. ఇలాంటి సమయంలో ఈ చిన్న ట్రావెల్ యాక్సెసరీ కాస్త అదనపు స్పేస్ ఇచ్చేస్తుంది.విమానం సీట్ల మధ్య అమర్చుకుని పిల్లలు కాళ్లు చాపుకోవడానికి, కాసేపు రిలాక్స్ అవ్వడానికి ఫుట్రెస్ట్లా ఉపయోగించుకోవచ్చు. నిద్రొస్తే చిన్న హ్యామాక్లా కూడా సెట్ చేసుకోవచ్చు. పాలిస్టర్ మెటీరియల్‌తో తయారైన ఇది మడిచి బ్యాగ్‌లో పెట్టేసుకుని ఈజీగా తీసుకెళ్లొచ్చు. విమానంలోనే కాదు... రైలు, షిప్ లేదా కార్ జర్నీలోనూ పనికొస్తుంది. ధర రూ.1,500. -
రుచుల విందుకు ఈ మూడు వంటకాలు చాలా స్పెషల్!
వేడివేడి బీటెన్ కాఫీ నుంచి ఘుమఘుమలాడే కాశ్మీరీ మటన్ రోగన్ జోష్ వరకు.. చివర్లో నోట్లో కరిగే ధార్వాడ్ పేడాతో ఈరోజు మీ రుచుల పండుగను పూర్తి చేసుకోండి. సులభమైన తయారీ విధానంతో ఇంట్లోనే చేసుకోగలిగే ఈ మూడు వంటకాలు రుచితోపాటు ప్రత్యేకతను కూడా అందిస్తాయి. మరి ఈ వంటకాల తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం..బీటెన్ కాఫీ..కావలసినవి:ఇన్ స్టంట్ కాఫీ పొడి: 2 టేబుల్ స్పూన్లు,పంచదార: 2 టేబుల్ స్పూన్లు,వేడి నీళ్లు: 2 టేబుల్ స్పూన్లు,పాలు: 2 కప్పులు (చిక్కటివి),గార్నిష్ కోసం: కొద్దిగా కోకో పౌడర్ లేదా కాఫీ పొడి.తయారీ:ఒక కప్పులో లేదా గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల కాఫీ పొడి, 2 టేబుల్ స్పూన్ల పంచదార, రెండు టేబుల్ స్పూన్ల వేడి నీళ్లు పోయాలి.మొదట్లో ఇది చిక్కటి నల్లని ద్రవంలా కనిపిస్తుంది.ఈ మిశ్రమాన్ని ఒక స్పూన్ లేదా విస్కర్‌తో వేగంగా తిప్పుతూ చిలకాలి.తిప్పుతున్న కొద్దీ కాఫీ రంగు నలుపు నుంచి క్రమంగా లేత గోధుమ వర్ణంలోకి మారి, చిక్కటి నురగలాగా తయారవుతుంది.ఒక పాత్రలో రెండు కప్పుల పాలను బాగా మరిగించాలి.పాలు పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.ఇపుడు మనం తయారుచేసి పెట్టుకున్న కాఫీ క్రీమ్‌ను రెండు సర్వింగ్ కప్పులలో సమానంగా వేయాలి.దానిపై వేడివేడి పాలను కొద్దిగా పైనుంచి ధారగా పోయాలి.ఇలా పోయడం వల్ల కాఫీ క్రీమ్ పైన తేలుతూ మంచి నురగలా వస్తుంది.స్పూన్ తో మెల్లగా ఒకసారి కలిపి, పైన కొద్దిగా కోకో పౌడర్ లేదా కాఫీ పొడి జల్లి వేడివేడిగా సర్వ్ చేయడమే! కాఫీ చిలికేటప్పుడు బాగా చిక్కగా అనిపిస్తే, చుక్కల చొప్పున వేడి నీళ్లను మాత్రమే చేర్చుకోవాలి.కాశ్మీరీ మటన్ రోగన్ జోష్కావలసినవి:మటన్: 1/2 కేజీ,నెయ్యి : 4–5 టేబుల్ స్పూన్లు,పెరుగు: 1/2 కప్పు,ఉల్లిపాయలు: 2 (సన్నగా తరిగినవి),అల్లం వెల్లుల్లి పేస్ట్: అర టీస్పూన్,కశ్మీరీ మిర్చి పౌడర్: 2 టేబుల్ స్పూన్లు,సోంపు పౌడర్: టేబుల్ స్పూన్,సొంటి పొడి: అర టీస్పూన్,హోల్ గరం మసాలాలు: ఏలకులు (4), లవంగాలు (4), దాల్చిన చెక్క (2 ముక్కలు), బిర్యానీ ఆకు (2), గరం మసాలా పొడి 1/2 టీస్పూన్,ఉప్పు: రుచికి సరిపడా.తయారీ:ముందుగా మటన్ ను శుభ్రంగా కడిగి, అందులో చిలికిన పెరుగు, కొద్దిగా కశ్మీరీ కారం, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి కనీసం 30 నిమిషాల పాటు పక్కన ఉంచాలి.ఒక మందపాటి పాత్రలో నెయ్యి వేసి వేడెక్కాక బిర్యానీ ఆకు, లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క వేసి కొద్దిగా వేగించాలి.అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.ఆపై అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపాలి.ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ను వేసి మీడియం ఫ్లేమ్‌పై 8–10 నిమిషాలు బాగా వేయించాలి.మటన్ నుంచి నీరు బయటకు వచ్చే వరకు తిప్పుతూ ఉండాలి.అందులో సోంపు పొడి, సొంటి పొడి, మిగిలిన కాశ్మీరీ కారం వేసి బాగా కలపాలి.తగినంత నీరు పోసి మూత పెట్టి మటన్ మెత్తగా ఉడికించుకోవాలి.చివరగా పైన గరం మసాలా చల్లుకొని, నెయ్యి పైకి తేలే వరకు సన్నని మంటపై 5 నిమిషాలు ఉడకనివ్వాలి. అంతే! ఘుమఘుమలాడే వేడివేడి కాశ్మీరీ మటన్ రోగన్ జోష్ సిద్ధమైనట్లే! దీనిని వేడివేడి అన్నం, నాన్ లేదా పరాటాతో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.ధార్వాడ్ పేడాకావలసినవి:చిక్కటి పాలు: ఒకటిన్నర లీటరు (తాజా పనీర్ కోసం),నిమ్మరసం: 2 టేబుల్ స్పూన్లు,చక్కెర: ముప్పావు కప్పు (తీపికోసం), మరో 2 టేబుల్ స్పూన్లు క్యారమెల్ కోసం,నెయ్యి: 4 టేబుల్ స్పూన్లు,పాలు: పావు కప్పు,ఏలకుల పొడి: అర టీస్పూన్,చక్కెర పొడి: 3 టేబుల్ స్పూన్లు.తయారీ:ముందుగా పాలను మరిగించి, అందులో కొద్దికొద్దిగా నిమ్మరసం వేస్తూ కలపాలి.పాలు విరిగి నీరు వేరయ్యాక, కాటన్ క్లాత్‌లో వడకట్టి, తిరిగి చల్లని నీటితో కడిగి నీళ్లన్నీ పిండేయాలి.వడకట్టిన పనీర్‌ను ఒక వెడల్పాటి ప్లేట్లో వేసి కలుపుతూ ఎక్కడా గడ్డలు లేకుండా మెత్తటి ముద్దలా చేసుకోవాలి.ఆ తరువాత ఒక బాణలిలో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి పనీర్ తురుమును వేయాలి.సన్నని మంటపై కలుపుతూ వేయించాలి.పనీర్ పొడిగా మారుతున్నప్పుడు మధ్యమధ్యలో కొద్దిగా నెయ్యి, పాలు చల్లుతూ వేయించాలి.పనీర్ గోధుమ రంగులోకి మారే వరకు వేయించాలి.ఆ తరువాత మరొక చిన్న పాత్రలో 2 స్పూన్ల చక్కెర వేసి సన్నని మంటపై నీళ్లు పోయకుండా కరగనివ్వాలి.చక్కెర బ్రౌన్ కలర్ క్యారమెల్గా మారిన వెంటనే వేయించిన పనీర్‌లో పోయాలి.అలాగే చక్కెర, ఏలకుల పొడి, 2 స్పూన్ల పాలు వేసి చక్కెర కరిగే వరకు కలపాలి.మిశ్రమం దగ్గరపడి డార్క్ రంగులోకి వస్తుంది. ఇపుడు దీనిని కొద్దిగా చల్లారనిచ్చి, మిక్సీ జార్లో వేసి ఒక్కసారి పల్స్ చేసి తీస్తే మెత్తగా తయారవుతుంది.చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని, మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే కొద్దికొద్దిగా తీసుకుంటూ కోలగా తయారుచేసుకోవాలి.తర్వాత చక్కెర పొడిలో దొర్లించి కోటింగ్ ఇవ్వాలి. అంతే ధార్వాడ్ పేడా రెడీ! వీటిని గాలి చొరబడని డబ్బాలో ఉంచితే వారం రోజులకు పైగా తాజాగా ఉంటుంది. -
పుడమితల్లి వేడుక 'పాచామామా'!
దక్షిణ అమెరికా దేశమైన పెరూ ‘పాచామామా’ వేడుకకు సిద్ధమైంది. పుడమితల్లికి కృతజ్ఞతలు తెలిపే ఈ వేడుకలను ఆగస్టు మాసమంతా అండీస్ పర్వత ప్రాంతాల్లోని ప్రాచీన తెగలు, గ్రామీణ ప్రజలు, పెరూ పౌరులందరూ ఏకమై ఘనంగా నిర్వహిస్తారు. స్పానిష్ వలస పాలకుల రాకకు శతాబ్దాల ముందు నుంచే కొనసాగుతున్న ఈ సంప్రదాయం నేటికీ ఆండియన్ క్యాలెండర్లో అత్యంత ముఖ్యమైన పండుగగా నిలుస్తోంది.పాచామామా అంటే...‘పాచా’ అంటే ప్రపంచం, భూమి, స్థలం, సమయం, విశ్వం అని అర్థం. ‘మామా’ అంటే తల్లి అని అర్థం. అంటే ‘విశ్వానికి మూలమైన నేలతల్లి’అని అర్థం. ఆండియన్ ప్రజల దృష్టిలో భూమి అనేది అందరినీ పోషించే ఒక జీవ వ్యవస్థ.ఆగస్టులోనే ఎందుకు?ఆండియన్ సంప్రదాయాల ప్రకారం, ఆగస్టు నెలలో భూమాత తన నోరు తెరుస్తుందని, మానవులు సమర్పించే నైవేద్యాలను స్వీకరిస్తుందని నమ్ముతారు. పంటల కాలం పూర్తయి, కొత్త వ్యవసాయ చక్రం ప్రారంభమయ్యే సమయం కాబట్టి, భూమి సారవంతంగా ఉండాలని, కుటుంబానికి ఆరోగ్యం ప్రసాదించాలని, వ్యాపారంలో అభివృద్ధి ఉండాలని కోరుకుంటూ ఆగస్టు ఒకటో తేదీ నుంచి నెలాఖరు వరకు భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.ప్రధాన ఆచారాలుఈ ఉత్సవాల్లో షామన్లుగా పిలిచే ప్రాచీన పూజారుల నేతృత్వంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ముందుగా భూమి తల్లికి పూలు, పండ్లు, జొన్నలతో నైవేద్యం సమర్పించే ‘దేశ్పాచో’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం ‘పాగో అ లా తియెర్రా’ అని నిర్వహించే ‘నేలతల్లికి చెల్లింపు’ కార్యక్రమంలో అనేక ప్రత్యేక కానుకలను అగ్నిదేవునికి సమర్పించి, పాటలు, ప్రార్థనల ద్వారా భవిష్యత్తు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారు. చివరగా వనమూలికలతో ధూపం వేసి వాతావరణాన్ని, మనుషులను శుద్ధి చేసే కార్యక్రమం నిర్వహిస్తారు. ఇది దుష్టశక్తులను పారద్రోలి, నూతనోత్తేజాన్ని ఇస్తుందని ఆండియన్ ప్రజల నమ్మకం.ఆండియన్ సంస్కృతిలో ప్రపంచాన్ని మూడు లోకాలుగా విభజించారు. ఈ మూడింటి మధ్య సమతుల్యత సాధించడమే ‘పాచామామా’ పూజ ప్రధాన ఉద్దేశం. మొదటిది ‘హనన్ పాచా’– అంటే ఆకాశం, సూర్యుడు, నక్షత్రాలు, వాతావరణాన్ని సూచించే ఊర్ధ్వలోకం. రెండోది ‘కే పాచా’ అంటే మానవులు సహా సమస్త జీవజాలం నివసించే నేల ఉపరితలం. మూడవది ‘ఉఖు పాచా’ అంటే భూమి లోపలి భాగం. విత్తనాల మొలకెత్తే శక్తికి ప్రతిరూపం.ఈ పాచామామా ఉత్సవాలు కేవలం స్థానికులకే కాక, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులకు కూడా ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తాయి. అయితే ఈ వేడుకల్లో పాల్గొనాలనుకునేవారు ఈ ప్రాంత ఆచార సంప్రదాయాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఉత్సవాల్లో అందరిపట్ల గౌరవంగా మెలగడం, ఫొటోలు, వీడియోలు తీసుకోవాలనుకుంటే స్థానికుల అనుమతి తీసుకోవడం వంటి నిబంధనలుంటాయి. పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం అనే సూత్రం ఆధారంగా ఈ పండుగను నిర్వహించుకుంటారు. అంటే ప్రకృతి మనకు జీవనాన్ని ఇచ్చినపుడు, మనం తిరిగి కృతజ్ఞతగా నైవేద్యాలను సమర్పించి ప్రకృతి సమతుల్యతను కాపాడాలి అనేది వీరి సిద్ధాంతం. ∙ రమా జంబుల -
క్లూ..! హత్యకు టూత్‌పిక్ సాక్ష్యం!
డిటెక్టివ్లు ఇద్దరూ ఇన్ స్పెక్టర్ బుల్లెబ్బాయ్ చెప్పిన అడ్రస్‌కి చేరుకున్నారు.హతుడి శవం బెడ్రూమ్లో మంచంమీద ఉంది. ‘ఆయన వయసు అరవై ఐదు, డెబ్భై మధ్య ఉండచ్చ’ని డిటెక్టివ్ పెద్దబ్బాయి అనుకున్నాడు.‘‘ఈయన పేరు ఐలయ్య. కోటీశ్వరుడు. ఉదయం బట్లర్ నిద్ర లేచేసరికి ఇలా కనిపించాడు. డాక్టర్ ప్రాథమిక పరీక్ష ప్రకారం ఎనిమిది గంటల క్రితం గొంతు పిసికి చంపబడ్డాడు. తెల్లవారుజామున. ఈయన ఆస్తికి ఇద్దరు వారసులు. కొడుకు వయసు ముప్ఫై ఎనిమిది, కూతురి వయసు ముప్ఫై రెండు. రాత్రిళ్ళు ఇంట్లో పనివాడు మాత్రమే ఉంటాడు.’’ ఇన్ స్పెక్టర్ వివరించాడు.పెద్దబ్బాయి ఆ గదిని పరిశీలనగా చూసి తల ఊపాడు. మంచం చుట్టూ తిరిగి, దాని వెనుక నేల మీద పడివున్న టూత్‌పిక్ తీసి పరిశీలించాడు.‘‘దాని మీద వేలిముద్రలు దొరకవు.’’ ఇన్ స్పెక్టర్ చెప్పాడు.‘‘కాని పళ్ళముద్రలు, డీఎన్ఏ దొరుకుతాయి. హంతకుడితో హతుడు పెనుగులాడినప్పుడు హంతకుడి నోట్లోంచి ఇది నేల మీదికి పడి ఉంటుంది.’’‘‘అది హంతకుడిదే అని ఎలా చెప్పగలరు? హతుడిదీ అయి ఉండొచ్చుగా?’’ ఇన్ స్పెక్టర్ బుల్లెబ్బాయి ప్రశ్నించాడు.‘‘పరిశీలన. ఊహ. ఈ రెండింటినీ ఉపయోగించాను. శవం పళ్ళని పరిశీలిస్తే ఆయనవి కట్టుడు పళ్ళని తెలిసింది. వాళ్ళకి టూత్‌పిక్ అవసరం ఉండదు. రాత్రిళ్ళు నక్షత్రాల్లా డెంచర్లు కూడా బయటికి వస్తాయి. రాత్రి వాటిని నీళ్ళల్లో ఉంచి, ఉదయం శుభ్రం చేసి పెట్టుకుంటారు. మీ సార్ టూత్‌పిక్స్ వాడుతారా?’’ పెద్దబ్బాయి పనివాడి వైపు చూసి అడిగాడు.అతను తల అడ్డంగా ఊపాడు.‘‘నిన్న రాత్రి మీ అయ్యగారిని ఆఖరిసారి ఎప్పుడు చూశావు?’’‘‘రాత్రి పదిన్నరకి పాలగ్లాస్ ఇచ్చి గుడ్ నైట్ చెప్పి, రెండో అంతస్తులోని నా గదికి వెళ్ళాను. ఉదయం ఆరున్నరకి కిందికి వచ్చాక చూశాను. వెంటనే పోలీసులకి ఫోన్ చేశాను.’’‘‘దొంగతనంగా ఇంట్లోకి ఎవరూ వచ్చిన దాఖలాలు లేవు సార్.’’ అసిస్టెంట్ చిన్నబ్బాయి ఇల్లంతా తిరిగి చూసి వచ్చి చెప్పాడు.‘‘ఈ ఇంటి డూప్లికేట్ తాళంచెవులు ఎవరి దగ్గర ఉన్నాయి?’’‘‘వీరి పిల్లలు... కూతురు, కొడుకుల దగ్గర.’’ పనివాడు జవాబు చెప్పాడు. ‘‘వాళ్ళు నిన్న వచ్చారా?’’‘‘ఇవాళ ఆయన విల్లు రాయాలని అనుకున్నారు. నిన్న మధ్యాహ్నం కొడుకు వచ్చి ఆస్తిని ఆయన ఇంటి పేరుగల వారికే, అంటే తనకే రాయాలని కోరాడు. ఆయన కూతురు సాయంత్రం వచ్చి, తన తల్లి తన అన్నని ఎలా కష్టపడి కన్నదో తనని కూడా అలాగే కన్నదని, తనకి సగం ఆస్తి రాయడం న్యాయమని కోరింది.’’‘‘వాళ్ళిద్దరిలో ఎవరికి టూత్‌పిక్ అలవాటు ఉంది?’’‘‘కొడుక్కి ఉంది. నాకు అదే ఆశ్చర్యం. సినిమాల్లో విలన్లు టూత్‌పిక్‌లు నోట్లో పెట్టుకుని అటూ ఇటూ తిప్పుతుంటారు కదా! అతను అచ్చం అలా తిప్పుతాడు.’’‘‘నువ్వు ఇల్లు సరిగ్గా ఊడుస్తావా?’’‘‘ఊడుస్తాను సార్.’’‘‘మరి ఈ టూత్‌పిక్ ఊడవలేదే?’’‘‘అది నిన్న రాత్రి ఏడు తర్వాత పడి ఉంటుంది. నేను ప్రతి సాయంత్రం చీకటి పడకముందే వాక్యూమ్ చేస్తాను.’’కబురు అందుకుని ఆయన కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు వచ్చారు. కొడుకు, అల్లుడి నోళ్ళల్లో టూత్‌పిక్‌లు ఉన్నాయి. ఆ నలుగురి కళ్ళ వెంటా నీళ్ళు కారుతున్నాయి.‘‘మీరు మీ నోట్లోని టూత్‌పిక్‌ని ఇస్తారా?’’ పెద్దబ్బాయి తనని పరిచయం చేసుకుని అడిగాడు.‘‘దేనికి?’’ ఇద్దరూ ఇచ్చి ఆశ్చర్యంగా అడిగారు.‘‘హంతకుడిని కనుక్కోడానికి.’’పెద్దబ్బాయి టూత్పిక్లని పరిశీలించి,ఇన్ స్పెక్టర్ వైపు తిరిగాడు.‘‘మిస్టర్ ఇన్ స్పెక్టర్. దయచేసి హంతకుడిని అరెస్టు చేయండి. అల్లుడిదే ఈ గిల్లుడు.’’‘‘ఎలా చెప్పగలరు?’’ అల్లుడు అదిరిపడి అడిగాడు.‘‘మీ మామగారి గొంతు పిసికినప్పుడు కిందపడ్డ మీ టూత్‌పిక్ చెప్పింది.’’‘‘అది నాదేనని ఏమిటి? నా బావమరిదిదై ఉండొచ్చుగా?’’ సీరియస్‌గా అడిగాడు.‘‘మిస్టర్ అల్లుడు. టూత్‌పిక్స్ రెండు రకాలు ఉన్నాయి. పిసినారి వాళ్ళ కోసం చేసే వాటికి అటూ ఇటూ సూది మొనలు ఉంటాయి. కాని మామూలు వాళ్ళు వాడే వాటికి వాడి మొన ఒకవైపు మాత్రమే ఉంటుంది. అది మీ బావమరిదిదైతే రెండో వైపు మొన ఉండేది కాదు. ఇల్లు ఊడ్చాక తెల్లారజామున మీరీ హత్య చేయడంతో నా పని తేలికైంది. మీరు ఇది మీ పని కాదనడం సహజం. అది ప్రతి నేరస్తుడి వాదనే. కాని డీఎన్ఏ క్లూని ఎవరూ కాదనలేరు.’’అల్లుడు బయటకి వేగంగా నడుస్తూంటే కాన్ స్టబుల్స్ ఆపారు.లోపలకి వస్తున్న ఓ ఏభై ఏళ్ళ వ్యక్తిని చూసి పెద్దబ్బాయి చెప్పాడు.‘‘మీరు లాయరైతే ఇక మీకు ఇక్కడ పని లేదు.’’- మల్లాది వెంకట కృష్ణమూర్తి -
మూగవాని పిల్లనగ్రోవి!
‘నేను ఒంటరిగా కూర్చుని రాసుకునే సమయంలోనే నాకు ఇతరులతో సంభాషిస్తున్నట్లు అనిపిస్తుంద’న్న పాపానికి ఆ కవి, నాటకకర్త, నవలా రచయిత, సినిమా దర్శకుడు– రచయిత, నోబెల్ సాహిత్య పురస్కార విజేత ‘ఉలిపికట్టె‘ అనే బిరుదు సంపాదించుకున్నాడు. ‘గడ్డకట్టించే చల్లదనం లాంటిది ఒంటరితనం; అది వేధించే శూన్యతలాంటిది.అలాంటి సందర్భాల్లో, మనం మరీ అంత దిగజారిపోలేదని నచ్చజెప్పే తోడొకటి అవసరమ’ని చెప్పిన ఆ రచయితను పట్టుకుని ‘ఉలిపికట్టె‘గా జమకట్టడం సరైందేనా? ‘కళాకారుల సృజనలో జీవనగమనం ప్రతిఫలించినప్పుడే, వాళ్ళు ఆదర్శవ్యక్తులు కాగలుగుతార’న్న ఆ పెద్దమనిషిని పదిమందితో కలవడానికి ఇష్టపడని ‘నామాల కాకి’గా పరిగణించడం భావ్యమేనా? కానీ జెర్మన్ రచయిత పీటర్ హాంట్కె మొహాన యూరపియన్ పీఠాధిపతులు అవే ముద్రలు కొట్టారు. అలా మనుషుల మొహాలపై ముద్రలు కొట్టే పీఠాధిపతుల్లో చాలామందికి – సాధారణంగా – స్పందించే హృదయం ఉండదంటారు. హాంట్కె కథ వింటే ఆ మాట నిజమేననిపిస్తుంది! ముందు అతని కథ చెప్పుకుని, అప్పుడతని కళాకౌశలం గురించి చెప్పుకుందాం.దాదాపు వెయ్యిన్నర సంవత్సరాలుగా ఆగ్నేయ యూరపులోని బాల్కన్ ద్వీపకల్పం సమీపంలో నివసిస్తున్నది సెర్బు జాతి. రెండు ప్రపంచ యుద్ధాల్లోనూ, తదనంతర మారణకాండల్లోనూ తీవ్రంగా నష్టపోయిన జాతుల్లో అదీ ఒకటి. మొదటి ప్రపంచయుద్ధం నాటికి సెర్బుల జనసంఖ్య 45 లక్షలు. వాళ్ళలో 17శాతం– ఎనిమిది లక్షల వరకు– ఆ యుద్ధానికి బలయ్యారు. రెండో ప్రపంచయుద్ధం నాటికి సెర్బుల జనసంఖ్య 55 లక్షలు కాగా, వారిలో పదిశాతం ఆ యుద్ధంలో తుడిచిపెట్టుకు పోయారు. అటు తర్వాత 1990 నాటికి సెర్బుల జనాభా 85 లక్షలకు చేరుకుంది.ఆ దశకంలో జరిగిన మారణకాండల్లో దాదాపు యాభైవేలమంది సెర్బులు బలైపోయారు; ఏడు లక్షలమంది ఇల్లూ వాకిలీ పొలమూ పుట్రా లేకుండాపోయారు. అలాంటి బాధిత జాతిలో పుట్టినవాడు పీటర్ హాంట్కె! ఇప్పుడు మనం ఆస్ట్రియాగా పిలిచే ప్రాంతమంతా ఒకప్పుడు ఐక్య జెర్మన్ సామ్రాజ్యంలో భాగంగా వుండేది. ఆరోజుల్లో– 1942లో– హాంట్కె అక్కడ పుట్టాడు. దక్షిణ ఆస్ట్రియాలో, కొండలూ కొలనులకు నెలవై వుండే ప్రాంతం కెరెంథియా. అందులో భాగంగా వుండే గ్రిఫిన్ అనే పట్టణం హాంట్కె స్వస్థలం.హాంట్కె కుటుంబ జీవనం స్థిమితంగా సాగిన సందర్భం లేదనే చెప్పాలి. అతని తల్లి ప్రపంచయుద్ధాలూ– ఆర్థికమాంద్యం– ద్రవ్యోల్బణం తదితర పరిణామాల నేపథ్యంలో తెగిన గాలిపటంగా మారిన మనిషి. కాకుల్లా పొడిచే పలుగాకుల మధ్యన అలాంటి బతుకు బతకలేక 1971లో అతని తల్లి మారియా ఆత్మహత్య చేసుకుంది. ‘పుర్రచేతి వాటం స్త్రీ’ అనే నవలికను 1972లో తన తల్లి జ్ఞాపకంగా హాంట్కె రాశారు; తర్వాత నాలుగేళ్ళకు ఆ నవలికనే ‘కలలను మీరిన ఖేదం’ పేరిట స్వీయ దర్శకత్వంలో సినిమాగానూ రూపొందించారు. సినిమా రంగంతో అతనికి అంతకు పదేళ్ళకు ముందు నుంచీ సంబంధముంది.తనే స్వయంగా నాలుగు సినిమాలు తీసిన హాంట్కె, 1969 నుంచి ’87 వరకూ విమ్మ్ వెండెర్స్ తీసిన నాలుగు సినిమాలకు స్క్రిప్టులు రాశాడు. వ్లాదిమిర్ గెరిక్ దర్శకత్వంలో రూపొందిన యుగోస్లావీన్ టీవీ ఫిల్మ్ ‘క్యాస్పర్’ స్క్రిప్టును కూడా హాంట్కెయే రచించారు. ‘క్యాస్పర్ హాసర్ జీవితకథ’గా పందొమ్మిదో శతాబ్దిలో ప్రచురమైన కల్పితగాథ ఆధారంగా హాంట్కె ముందో రూపకం రాశాడు. దాన్నే తర్వాత టీవీ స్క్రిప్టుగా రూపొందించాడు. (రడ్యార్డ్ కిప్లింగ్ ప్రసిద్ధ రచన ‘జంగిల్ బుక్’లోని మౌగ్లీ కూడా క్యాస్పర్ హాసర్ కోట్ జేబులోంచే ఊడిపడ్డాడంటారు! –అదలా వుంచండి.)దృశ్యమాధ్యమాల కోసం హాంట్కె రూపొందించిన ఈ రెండు స్క్రిప్టులకూ కొంత సామ్యముంది– కొంత వైరుద్ధ్యమూ వుంది. హాంట్కె తల్లి లోకరీతి ప్రకారం బతికిన మనిషి కాదు; అలా బతకాలని ఆమె అనుకోనూ లేదు! క్యాస్పరుకు ‘నాగరికుల’ భాష రానట్లే, ఆమెకి లోకం పోకడ తెలీదు. వాళ్ళిద్దరూ– ఓ రకంగా– మూగవాళ్ళే! సామాజిక కట్టుబాట్లను ఖాతరు చెయ్యనివాళ్ళే!! అయితే, క్యాస్పర్ లోకంపోకడ ఒంటబట్టించుకుని, సామాజిక జీవనంలో కలిసి పోవాలనుకున్నాడు. కానీ, అలా చెయ్యలేకపోయాడు.అతని మృతికి కారణమైన గాయం ఇతరులు చేసిందా? స్వయంగా తనను తానే పొడుచుకున్నాడా అనే ప్రశ్నకు గత రెండువందల యేళ్ళుగా సమాధానం దొరకనే లేదు! పోతే– మారియా మాత్రం తనకు నచ్చినట్లే బతకాలని ప్రయత్నించి, పదేపదే విఫలమై విసిగిపోయిన మనిషి. వాళ్ళ మూగ ఆవేదనలే ఇతివృత్తంగా హాంట్కె ఈ రెండు స్క్రిప్టులూ రచించాడు. కట్టుబాట్ల అరదండాల మధ్య ఊపిరిసలపని మూగవాళ్ళ మూలుగులను మనకు వినిపించిన పిల్లనగ్రోవే హాంట్కె కలం.వాస్తవానికి, హాంట్కె రాసిన 40 నవలల్లోనూ, 15 రూపకాల్లోనూ, అసంఖ్యాకమైన అతని స్క్రీన్ ప్లేలలోనూ అంతర్లీనంగా వుండే సామాన్య సూత్రమిదే! ‘కళ అటు ఆనందంలోంచీ, ఇటు ఆవేదనలోంచీ కూడా పుడుతుంది; అయితే చాలామటుకు ఉత్తమ కళాఖండాలు వేదనలోంచే రూపుదిద్దుకుంటాయ’న్నాడు నార్వీజియన్ పెయింటర్ ఎడ్వాడ్ మూంక్. 2019లో నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకున్న హాంట్కె అలాంటి అభిప్రాయాలను అంత సూటిగా ఎప్పుడూ చెప్పలేదు. కానీ అతని సాహిత్యమంతటా అలముకుని వున్న తాత్త్వికత అదే!- మందలపర్తి కిషోర్ -
వెండి తాళంచెవి : ఇంట్లోకి చొరబడ్డారు.. కానీ ఒక్క వస్తువూ పోలేదు!
చంద్రయ్య సీతాపురం గ్రామం నుంచి సంతకు బయలుదేరాడు. తోవలో వెళుతుండగా, అతడికి ఒక వెండి తాళంచెవి దొరికింది. దానిని తీసుకువెళుతుండగా, ఒక వ్యక్తి ఎదురయ్యాడు. ‘‘నా పేరు భూషయ్య. నేను ఈ ఊరికి కొత్త. సంతకు ఎలా వెళ్లాలి?’’ అని అడిగాడు.‘‘నాతో పాటు రా చూపిస్తాను’’ అన్నాడు చంద్రయ్య. కలిసి నడుస్తూ, ‘‘నీ పేరెంటి?’’ అని అడిగాడు భూషయ్య. ‘‘నా పేరు చంద్రయ్య’’ అన్నాడు.‘‘అబ్బో!.. నీ చేతిలో వెండి తాళంచెవి ఉంది. అంటే ఇంటికి వెండి తాళం వేసి వచ్చావన్నమాట’’ అన్నాడు భూషయ్య.‘‘అదేం కాదు ఇది నాకు దారిలో దొరికింది. ఏం చేద్దామా? అని ఆలోచిస్తున్నాను’’ అన్నాడు చంద్రయ్య. ‘‘ఇందులో ఆలోచించడానికేముంది? ఈ తాళం చెవితో ఆ ఇంటి తాళం తెరవచ్చు’’ అన్నాడు భూషయ్య. ‘‘అంటే దొంగతనం చేద్దామంటావా?’’ అన్నాడు చంద్రయ్య. ‘‘అవును ఇది చాలా సులువైన పని. ఎందుకంటే తాళం చెవి ఉంది కదా! వెండి తాళం వేసి ఉన్న ఇల్లు గుర్తించడం చాలా సులువు’’ అన్నాడు భూషయ్య. ‘‘సరే పద... ఆ ఇల్లు ఏ వీధిలో ఉందో వెదుకుదాము’’ అన్నాడు చంద్రయ్య.దారిలో భూషయ్యకు ఒక లావుపాటి దారం దొరికింది. అది తీసుకుని చంద్రయ్య వద్ద తాళంచెవి తీసుకుని, దానిని దారానికి మధ్యలో ముడి వేసి ‘‘ఈ దారాన్ని ఇద్దరం చెరో వైపు పట్టుకుందాం’’ అన్నాడు భూషయ్య. ‘‘అలాగే’’ అన్నాడు చంద్రయ్య. ఇద్దరూ వెళుతుండగా ఒక లావుపాటి మనిషి ఎదురై, ‘‘ఏంటి తాళం చెవిని చెరో వైపు పట్టుకున్నారు?’’ అని అడిగాడు. వాళ్ళు విషయం చెప్పారు.‘‘అలాగా నా పేరు భీమయ్య నాకు బాగా బలం ఉంది. నేను కూడా దొంగతనానికి సిద్ధం!. నేను కూడా వస్తాను’’ అన్నాడు. ‘‘సరే పద’’ అన్నారు ఇద్దరూ.వీధిలో వెండితాళం వేసి ఉన్న ఇల్లు కనిపించింది. ముగ్గురూ ఆ ఇంటి వద్దకు వెళ్ళి ఆ తాళంచెవితో తాళాన్ని తెరిచి, ఇంటి గడియ తీసి లోపలకు వెళ్లారు. ‘‘అబ్బో..! ఇల్లు చాలా బాగుంది. మనం అలసిపోయి ఉన్నాం. ముందుగా ఏమైనా తిందాము’’ అన్నాడు భీమయ్య. ‘‘అలాగే’’ అన్నారు చంద్రయ్య, భూషయ్యలు. బల్ల మీద కొన్ని రకాల పండ్లు కనిపించాయి వారికి. వాటిని ముగ్గురూ సమంగా పంచుకుని తింటుండగా బయట నుండి గడియ పెట్టిన చప్పుడు అయ్యింది.‘‘ఎవరో గడియ పెట్టినట్టున్నారు. ఇప్పుడెలాగ?’’ అన్నాడు చంద్రయ్య. ‘‘ఆ... ఏం భయం లేదు నేనున్నాగా!’’ అన్నాడు భీమయ్య. కాసేపటికి గడియ తీసిన చప్పుడయ్యింది నలుగురు భటులతో ఒకతను వచ్చి ‘‘ఊ... ఈ దొంగలను బంధించండి’’ అన్నాడు. భటులు ఆ ముగ్గురునీ బంధించి కోటకు తీసుకెళ్లారు.రాజు కొలువుతీరి ఉన్నాడు. ‘‘మహారాజా! నేను నా ఇంటి తాళం చెవిని పోగొట్టుకున్నాను. అది వీరికి దొరికినట్టుంది నా ఇంటి తాళం తీసి దర్జాగా కూర్చుని పండ్లు ఆరగిస్తుండగా పక్క వీధిలో మంత్రిగారి ఇంటి వద్ద ఉన్న భటులను పిలిచి బంధించి తెచ్చాను’’ అన్నాడు విదూషకుడు.‘‘మహారాజా! మేము దొంగలం కాదు. మాకు వెండి తాళంచెవి దొరికింది. దానితో దొంగతనం చేయాలనే ఆలోచన వచ్చింది’’ అన్నారు ముగ్గురూ. న్యాయాధికారి సలహా అడిగాడు రాజు.‘‘మీ ఇంట్లో వస్తువులు ఏమైనా పోయాయా?’’ అని విదూషకుణ్ణి అడిగాడు న్యాయాధికారి.‘‘ఏమీ పోలేదు.’’ అన్నాడు విదూషకుడు. ‘‘నీవు కోటలో పని చేస్తున్నావని అందరికీ తెలియాలని ఇంటికి వెండి తాళం వేశావా?’’ అన్నాడు న్యాయాధికారి. ‘‘తప్పయ్యింది’’ అన్నాడు విదూషకుడు.‘‘మన రాజ్యంలో దొంగతనాలకు తావు లేదు. వేసి ఉన్న ఇంటి తాళం తెరవడం నేరం. ఆకలి తీరాక ఈ ముగ్గురూ కచ్చితంగా దొంగతనం చేసేవారు. మహారాజా! వీరికి మూడు మాసాలు చెరసాల శిక్షతో పాటు చేతివృత్తులలో శిక్షణ ఇప్పించి జీవనోపాధి కల్పించగలరు. అలాగే దొంగతనానికి ప్రేరణ కలిగించింది వెండితాళం. అందుకు కారణం మన విదూషకుడు ఇతనికి కూడా పది రోజుల పాటు చెరసాల శిక్ష విధించండి మహారాజా!’’ అని అన్నాడు న్యాయాధికారి.మహారాజు అలాగే ఉత్తరువులు జారీ చేశాడు.- యు.విజయశేఖర రెడ్డిహితవచనం..'అనర్హేధికృతి శోచ్యా యథార్హస్య పదచ్యుతిఃదుష్టేషు కరుణా దూష్యా సాధుష్వపకృతిర్యథా'అర్హుడికి అధికారం పోతే ఎంత విచారించాలో, అనర్హుడికి అధికారం దక్కినప్పుడు అంతే విచారించాలి. సజ్జనులకు అపకారం జరిగితే ఎంత బాధపడాలో, దుష్టుల పట్ల జాలి చూపినా అంతే బాధపడాలి. -
సర్వర్ సైలెంటైతే... పంటనష్టం వయొలెంట్!
ఆహార భద్రత అంటే పొలాల్లో పంటలు బాగా పండటం, పశువులు ఆరోగ్యంగా పెరగడం. అంతే కదా! ఇక సూపర్ మార్కెట్లకు వెళ్లినప్పుడు అక్కడ వరుసగా సర్ది ఉన్న తాజా పండ్లు, కూరగాయలు, నాణ్యమైన ధాన్యాలను చూసినప్పుడు మన ఆహార సరఫరా వ్యవస్థలు ఎంత సమర్థంగా పనిచేస్తున్నాయో అని కూడా ఆశ్చర్యం కలుగుతుంది. అయితే ఇప్పుడంతా డిజిటల్ అయిపోయాక.. ఈ సమృద్ధి, సరఫరాల వెనుక ఒక ప్రమాదం పొంచి ఉండటం కూడా కనిపిస్తుంది. అదే.. ‘డేటాబేస్ వైఫల్యం’! కంప్యూటర్ చెప్పినట్లుగా డేటాబేస్ ‘రైట్, రైట్’ అని అనకపోతే.. పండ్లు, కాయగూరలు, ఇతర ఆహార పదార్థాల లోడ్‌తో ఉన్న ట్రక్కులు ఎన్నాళ్లయినా ఎక్కడివక్కడే ఉండిపోతాయి! కదలటం ఆలస్యం అయ్యే కొద్దీ ట్రక్కులోని ఆహార, పంట పదార్థాలు పాడైపోతాయి.మన ఆహార సరఫరా వ్యవస్థలు పైకి ఎంత స్థిరంగా, ఆధునికంగా కనిపిస్తాయో... లోపల అంతకంటే ఎక్కువగా డిజిటల్ సిస్టమ్‌లు, సాఫ్ట్వేర్లు, కంప్యూటర్ నెట్‌వర్క్‌ల పైన ఆధారపడి ఉంటున్నాయి. ఈ డిజిటల్ సదుపాయాలలో ఒక చిన్న సాఫ్ట్వేర్ లోపం వచ్చినా లేదా సైబర్ దాడి జరిగినా, లారీలకు లారీల ఆహారం మన కళ్లముందే కుళ్లిపోయే ప్రమాదం ఉంటుంది.ఈ దృశ్యాన్ని ఊహించుకోండిగోదాముల్లో టన్నుల కొద్దీ బియ్యం, చికెన్, తాజా పండ్లు సిద్ధంగా ఉన్నాయి. బయట లారీలు హార్న్ కొడుతూ రవాణాకు రెడీగా ఉన్నాయి. డ్రైవర్లు స్టీరింగ్ మీద చేతులు వేసి ‘ఎప్పుడు బయలుదేరాలి?’ అని వేచి చూస్తున్నారు. కానీ, లోపల డిజిటల్ సిస్టంలో పని నడవటం లేదు. అది నడిస్తేనే లారీ ముందుకు కదిలేందుకు అనుమతి లభిస్తుంది. సరకు రవాణా పత్రాలు ఎంతకూ రావు. ఆ పత్రాలు ఇవ్వవలసిన కంప్యూటర్.. ‘‘నా డేటాబేస్‌లో ఈ షిప్‌మెంట్‌కు ఇంకా ఆమోదం రాలేదు, కాబట్టి రవాణా పత్రాలను ఇవ్వలేను’’ అని సైలెంట్ అయిపోతుంది. అలా, ప్రజా పంపిణీకి వెళ్లవలసిన ఆహారం... కంప్యూటర్ పచ్చజెండా ఊపకపోవటం వల్ల – ఎన్ని గంటలైనా, ఎన్ని రోజులైనా ఎక్కడిదక్కడే నిలబడిపోతుంది. ఎందుకంటే, ఈ రోజుల్లో ఏదైనా ఒక కంటెయినర్ ఒక చోటు నుండి మరో చోటికి వెళ్లాలన్నా, అందులోని సరకు పంపిణీ కావాలన్నా లేదా ఇన్సూరెన్స్ పరిధిలోకి రావాలన్నా... అది తప్పనిసరిగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, ఆటోమేటిక్ కంప్యూటర్ వ్యవస్థల ద్వారా ‘ధ్రువీకరణ’ పొంది ఉండాలి.డిజిటల్ సిస్టమ్ ధ్రువీకరించకుంటే..?ఇంకో ప్రమాదం కూడా ఉంది. ఆహారం ఎంత నాణ్యమైనదైనా, డిజిటల్ రికార్డుల్లో ఆ నాణ్యత నమోదు కాకపోతే దానిని సూపర్ మార్కెట్లు అంగీకరించవు. చట్టబద్ధమైన పంపిణీ అయినా సరే నిలిచిపోతుంది. సరైన సమయంలో గోదాముల నుండి బయటకు రాని పండ్లు, మాంసం, పాల వంటి తక్కువ కాలపరిమితి గల ఆహార పదార్థాలు గంటల వ్యవధిలోనే పాడైపోతాయి. ఇక చివరి నిమిషంలో సరఫరా చేసే ఆధునిక పద్ధతుల్లో ఒక్క చోట సిస్టమ్ ఆగిపోయినా, మొత్తం నెట్వర్క్ స్తంభించిపోతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. డిజిటల్ వ్యవస్థల కంటికి ‘కనపడని‘ (గుర్తింపు పొందని) ఆహారం ఎంత ఉన్నా, అది నిరుపయోగంగానే మిగిలిపోతుంది.ప్రధానమైన ముప్పులునేడు వ్యవసాయం నుండి ఆహార పంపిణీ వరకు ప్రతి దశలోనూ కీలక నిర్ణయాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేటెడ్ డిజిటల్ సిస్టమ్‌లే నిర్దేశిస్తున్నాయి. ఏ ప్రాంతంలో ఎంత ఆహారానికి డిమాండ్ ఉందో లెక్కిస్తున్నాయి. పంటలను ఎప్పుడు వేయాలో, ఎప్పుడు కోత కోయాలో మార్గనిర్దేశం చేస్తున్నాయి. గోదాముల్లో ఎంత సరుకు ఉంది, ఎప్పుడు పంపాలి అనే రవాణా ప్రాధాన్యాలను నిర్ణయిస్తున్నాయి. ఇలా, అత్యంత వేగంగా పనులు జరగడానికి, ఖర్చులు తగ్గించుకోవడానికి కంపెనీలు ఏఐ పైన ఎక్కువగా ఆధారపడుతున్నాయి. కానీ ఇందులో రెండు ప్రధాన ముప్పులు ఉన్నాయి. ఒకటి : మనుషులు తమ నిర్ణయాధికారం కోల్పోతారు. ఆహార పంపిణీకి సంబంధించిన కీలక నిర్ణయాలను సాఫ్ట్వేర్ ఏ ప్రాతిపదికన తీసుకుందో మనుషులు సులభంగా అర్థం చేసుకోలేరు, ప్రశ్నించలేరు. రెండవది : సైబర్ దాడుల భయం. శత్రుదేశాలు లేదా హ్యాకర్లు మన డిజిటల్ ఫుడ్ నెట్‌వర్క్‌లపై సైబర్ దాడులు జరిపితే, దేశం మొత్తం ఆహార కొరతను ఎదుర్కోవాల్సి వస్తుంది.అత్యవసర సమయాలుసాంకేతికత ఎంత వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, ఈ డిజిటల్ విప్లవంలో అతిపెద్ద లోపం– మానవ వనరులను పక్కన పెట్టటం. కంప్యూటర్లతో కాకుండా మనుషులతో పని చేయించటం అనేది అనవసరమైన ఖర్చుతో కూడుకున్నదని భావించి, కంపెనీలు పాత పద్ధతులను పూర్తిగా రద్దు చేస్తున్నాయి. అత్యవసర సమయాల్లో కంప్యూటర్ సిస్టమ్‌తో పనిలేకుండా చేసి, చేతితో రికార్డులు రాసి పనులు జరిపేలా సిబ్బందికి ఎలాంటి శిక్షణ ఇవ్వడం లేదు. ఈ కారణంగా అత్యవసర సమయంలో తీవ్రమైన పరిణామాలు సంభవిస్తాయి. ఆహారాన్ని గోదాము నుండి బయటకు పంపే రిలీజ్ కోడ్లు నిలిచిపోతాయి. ముందే చెప్పినట్లు... డ్రైవర్లు లారీలతో సిద్ధంగా ఉన్నా, ఆమోదముద్ర లేక వేచి చూడక తప్పదు. గోదాములో టన్నుల కొద్దీ ఆహారం ఉన్నా, సర్వర్లలో సరుకు ‘సున్నా’ అని చూపించవచ్చు. కొన్ని పరిశోధనల నివేదికల ప్రకారం, సిస్టమ్ నిలిచిపోయిన 72 గంటల (3 రోజుల) తర్వాత తప్పనిసరిగా మనుషులు జోక్యం చేసుకుని కాగితాల ద్వారా రవాణా ప్రారంభించాలి. కానీ, ప్రస్తుత సిబ్బందికి కాగితపు పద్ధతులపై కనీస అవగాహన కూడా ఉండటం లేదు!నియంత్రణ ఎవరి చేతిలో ఉండాలి?కంప్యూటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఆహార రంగానికి కచ్చితమైన వ్యవసాయ సమాచారం అందుతుంది. ఎప్పుడు నీళ్లు పెట్టాలి, ఎప్పుడు ఎరువులు వేయాలి? అనే వివరాలు తెలుసుకుని దిగుబడిని పెంచుకోవడం మంచిదే. అయితే సమస్యల్లా సాంకేతికతను వాడటంలో లేదు... ఆ సాంకేతికతను ఎవరు నియంత్రిస్తున్నారు? అత్యవసరంలో స్టీరింగ్ ఎవరి చేతిలో ఉంది? అనే దానిలోనే ఉంది. అందుకు కొన్ని మార్పులు చేసుకోవాలి. ఆహార వ్యవస్థల్లో ప్రతి దశలోనూ మనుషుల పర్యవేక్షణ ఉండాలి. సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు పాత పద్ధతుల్లో పనులు నిర్వహించేలా సిబ్బందికి నిరంతరం మాక్ డ్రిల్స్, శిక్షణ ఇస్తుండాలి. ఆహార పంపిణీకి వాడే సాఫ్ట్వేర్ కోడ్లను, ఆల్గారిథమ్‌లను ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు ఆడిట్ చేసేలా పారదర్శకత ఉండాలి. కంపెనీల వ్యాపార రహస్యాల కంటే ప్రజల ఆహార భద్రతే ముఖ్యం. రైతులు, స్థానిక ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తి డేటాపై పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి.సేవకులే కాదు, యజమానులు కూడా!సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేవి గొప్ప సేవకులు. కానీ అత్యంత ప్రమాదకరమైన యజమానులు కూడా! మనం వేగం, డబ్బు ఆదా చేసుకోవడానికి డిజిటల్ సిస్టమ్‌లపై ఆధారపడటంలో తప్పులేదు. కానీ, మన కడుపు నింపే ఆహారాన్ని బతికించేది నేల, రైతు, మనిషి శ్రమ మాత్రమే తప్ప ఒక కంప్యూటర్ కోడ్ కాదు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు.అసలు ప్రశ్న ‘కంప్యూటర్లు లేదా డిజిటల్ వ్యవస్థలు విఫలమవుతాయా లేదా?’ అనేది కాదు... ‘ఒకవేళ కంప్యూటర్ వ్యవస్థలు విఫలమైనా తట్టుకుని నిలబడి, ప్రజలకు ఆహారాన్ని అందించే ప్రత్యామ్నాయ ప్రణాళికలు మన దగ్గర ఉన్నాయా లేదా?’ అన్నదే. సాంకేతికత సమస్య వచ్చినప్పుడు కంప్యూటర్ ‘సిస్టమ్ డౌన్’ అనవచ్చు. కానీ, మానవత్వంతో కడుపు నింపే వ్యవస్థలు ఎప్పటికీ డౌన్ కాకూడదు. – సాక్షి స్పెషల్ డెస్క్నిజంగా జరిగిన రెండు ఘటనలుసైబర్ దాడులు, డేటాబేస్ వైఫల్యం వంటివి భవిష్యత్తులో ఎప్పుడో రాగల అవకాశం ఉన్న ఊహాజనిత ప్రమాదాలైతే కాదు. ఇప్పటికే ప్రపంచంలో పలుచోట్ల సంభవించిన నిజమైన సంఘటనలు కొన్ని, హెచ్చరికలుగా మన కళ్ల ముందే ఉన్నాయి.జేబీఎస్ ఫుడ్స్‌పై దాడి (2021)బ్రెజిల్లో ప్రపంచంలోనే అతిపెద్ద మాంసం ప్రాసెసింగ్ కంపెనీ అయిన జేబీఎస్ ఫుడ్స్‌పై హ్యాకర్లు సైబర్ దాడి చేశారు. పశువులు, పనిచేసే సిబ్బంది, గోదాములు అన్నీ సిద్ధంగా ఉన్నప్పటికీ... కంప్యూటర్ సిస్టమ్‌లు హ్యాక్ అవ్వడం వల్ల ఆస్ట్రేలియా, అమెరికాలోని ప్లాంట్లు పూర్తిగా మూతపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో రైతులు సిస్టమ్‌ను పక్కనపెట్టి సొంతంగా పని చేయడానికి ప్రయత్నించినప్పటికీ, సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వల్ల భారీగా ఆహారం వృథా అయ్యింది. ఇటీవల యూకేలోని ప్రధాన సూపర్ మార్కెట్ నెట్‌వర్క్‌లకు సరుకు అందించే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో సాఫ్ట్వేర్ సమస్య తలెత్తటం వల్ల, షెల్ఫ్‌లు ఖాళీగా మారిపోయాయి. ఆహారం దగ్గరలోని గోదాముల్లోనే ఉన్నప్పటికీ, డెలివరీ కోడ్లు జనరేట్ కాకపోవడం వల్ల ప్రజలకు ఆహారం అందలేదు. -
శవపేటిక: షాప్‌లో కెమెరా ఆఫ్.. శ్మశానంలో కెమెరా ఆన్!
నగర శివార్లలో శవపేటికలు తయారు చేసే డేవిడ్, తన తమ్ముడు జోసెఫ్ కనిపించడం లేదని ఆందోళనగా పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. ‘సార్, జోసెఫ్ రోజూలాగే షాప్‌కు వచ్చాడు, కానీ రాత్రికి ఇంటికి రాలేదు. నేను షాప్ మూసేసి వెళ్లాను కానీ, అనుమానం వచ్చి తిరిగి చూస్తే జోసెఫ్ లేడు.’ అని ఫిర్యాదు చేశాడు. అన్నదమ్ములు ఇద్దరూ నగర శివార్లలో శవపేటికలు తయారు చేసే వృత్తిలో ఉన్నారు. ‘రాత్రి నా ఒంట్లో నలతగా ఉంటే పెందరాళే ఇంటికి వెళ్ళాను.’ అని డేవిడ్ చెప్పాడు ఆందోళన నిండిన స్వరంతో...క్రైమ్ బ్రాంచ్ ఇన్ స్పెక్టర్ అభిమన్యు డేవిడ్ వైపు పరిశీలనగా చూశాడు. నిజం బయటపడే వరకు, సరైన సాక్ష్యం దొరికేవరకు అందరూ అనుమానితులే అని బలంగా నమ్ముతాడు అభిమన్యు.ఇన్ స్పెక్టర్ అభిమన్యు నేరుగా శవపేటికల తయారీ షాప్‌కు చేరుకున్నాడు. షాప్ మొత్తం వెతికిన అభిమన్యుకు ఒక కీలక విషయం తెలిసింది. ఆ రోజు రెండు శవపేటికలకు ఆర్డర్ వచ్చింది. అయితే, దర్యాప్తులో తేలిందేంటంటే, ఆర్డర్ తీసుకున్న వ్యక్తి రెండు శవపేటికలు తీసుకువెళ్లలేదు, కేవలం ఒకటే తీసుకువెళ్లాడు. మరి రెండో శవపేటిక ఏమైంది? అక్కడ ఉన్న సీసీ కెమెరాలు అదే రోజు పని చేయకపోవడం అనుమానానికి తావిచ్చింది. ఎవరో కావాలనే వాటిని నిలిపివేశారని అభిమన్యు గ్రహించాడు.అభిమన్యు తన పరిశోధనను మరింత లోతుగా పెంచాడు. అతను కేవలం ఫిర్యాదుపై ఆధారపడకుండా, ఆ ప్రాంతంలోని ఇతర వ్యాపారులను విచారించాడు. జోసెఫ్ చివరిగా ఎవరితో మాట్లాడాడో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. శవపేటికల ఆర్డర్ ఇచ్చిన వ్యక్తుల వివరాలు సేకరించినప్పుడు, అతనికి ఒక విషయం స్పష్టమైంది.వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, నగరం శివార్లలోని శ్మశానవాటిక ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించాడు. దూరంగా ఉన్న ఒక కెమెరాలో అతనికి ఒక దృశ్యం కనిపించింది. అర్ధరాత్రి, ముఖానికి మాస్క్ వేసుకున్న వ్యక్తి ఒక శవపేటికను తీసుకువచ్చి అక్కడ పాతిపెడుతున్నాడు. ఆ వ్యక్తి నడక, అభిమన్యులో అనుమానాన్ని పెంచింది. నేర పరిశోధనలో అతని మెదడు చురుగ్గా పని చేస్తుంది. వెంటనే తన బృందంతో శ్మశానానికి చేరుకున్న అభిమన్యు, ఆ కొత్తగా పాతిపెట్టిన శవపేటికను బయటకు తీయించాడు. లోపల విగతజీవిగా పడి ఉన్న జోసెఫ్‌ను చూసి అందరూ షాకయ్యారు. తమ్ముడిని డేవిడే చంపాడని అభిమన్యుకు పూర్తి స్పష్టత వచ్చింది.∙∙తలుపుల మీద బాదుతున్న శబ్దం విని తాగుతున్న విస్కీ గ్లాస్ తీసి టీపాయ్ కింద దాచేసి తలుపులు తెరిచాడు డేవిడ్. ఎదురుగా ఇన్స్పెక్టర్ అభిమన్యును చూసి కంగారు పడ్డాడు. ‘మీరా... మా తమ్ముడు దొరికాడా?’ అని తడబడుతూ అడిగాడు. ‘దొరికాడు.. నువ్వు చంపి దాచిపెట్టిన శవపేటికలో... నువ్వు పాతిపెట్టిన శ్మశానంలో...’ అని అభిమన్యు డేవిడ్ వైపే చూస్తూ చెప్పాడు. డేవిడ్ ముఖంలో రంగులు మారాయి. అప్పటికే పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు.‘నేనా... నేను నా తమ్ముడిని చంపుకుంటానా?’ డేవిడ్ కోపాన్ని నటిస్తూ అన్నాడు.‘చంపుకుంటావు... ఎందుకంటే నీ తమ్ముడి ఆస్తిని కాజేయాలని... ఆర్డర్ చేసినవాళ్లు ఒక శవపేటిక మాత్రమే తీసుకువెళ్లారు. మరో శవపేటికలో నీ తమ్ముడిని చంపి శవపేటికలో పెట్టి, ఖాళీ శవపేటిక తీసుకువెళ్తున్నట్టు నమ్మించావు. నీ షాప్‌లో ఉన్న సీసీ కెమెరాలు పనిచేయకుండా చేశావు. కానీ, శ్మశానంలో వున్న కెమెరాలు పనిచేయకుండా చేయలేకపోయావు. అక్కడి సమాధులు సాక్ష్యం చెప్పకపోవచ్చు. కానీ ఆ కెమెరాలు సాక్ష్యం చెప్పాయి.ఆస్తి కోసం సొంత తమ్ముడినే చంపేసి, అనుమానం రాకుండా తనే తయారు చేసిన శవపేటికలోనే శవాన్ని దాచి, ఆన్ లైన్ ఆర్డర్ పేరుతో దాన్ని బయటకు పంపి శ్మశానంలో పాతిపెట్టాలని డేవిడ్ ప్లాన్ చేశాడు. డేవిడ్ తన స్వార్థం కోసం చేసిన ఘాతుకాన్ని ఆధారాలతో సహా అభిమన్యు బయటపెట్టాడు. ‘ఆస్తి కోసం తమ్ముడిని శవపేటికలో పంపి, నువ్వు కటకటాల్లోకి వెళ్ళడానికి సిద్ధమయ్యావు. నీ గురించి తెలియని నీ తమ్ముడు తన కోసం తానే శవపేటికను తయారు చేసుకున్నాడు. కానీ ఒక్క విషయం మర్చిపోయావు డేవిడ్... నువ్వు కూడా ఏదో ఒకరోజు శవపేటికలోకి వెళ్లవలసిన వాడివే!’ అభిమన్యు హెచ్చరికగా అన్నాడు.పోలీసులు డేవిడ్‌ను చుట్టుముట్టారు. కటకటాల్లోకి నెట్టారు.‘చేసిన తప్పుకు శిక్షగా ఉరిశిక్షతో తమ్ముడిని చేరుకొని క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా వుండు’ చెప్పి బయటకు నడిచాడు ఇన్స్పెక్టర్ అభిమన్యు.- శ్రీసుధామయి -
వందల అస్థిపంజరాల వెనుక అసలు కథేంటి?
అది 1942 సంవత్సరం... రెండో ప్రపంచ యుద్ధ సమయం...సముద్ర మట్టానికి 16,500 అడుగుల ఎత్తులో ఉన్న అవిభాజ్య ఉత్తరప్రదేశ్‌లోని రూప్‌కుండ్ ప్రాంతం. గడ్డకట్టే చలి– చుట్టూ తెల్లటి మంచు పర్వతాలు– ఆ కొండల నడుమ ఒక చిన్న సరస్సు– ప్రకృతి అందం అంతా అక్కడే ఉందా అని పరవశించేంత సోయగం ఆ ప్రాంతం సొంతం. ‘నందాదేవి అభయారణ్యం’ ఫారెస్ట్ రేంజర్ హరికిషన్ మధ్వాల్ రోజువారీ విధుల్లో భాగంగా పరిసరాలను పరిశీలిస్తున్నారు. వేసవి కాలం కావడం వల్ల సరస్సులోని మంచు కొద్దికొద్దిగా కరుగుతోంది.అలా చూస్తూ వెళ్తున్న హరికిషన్‌కు సరస్సులో నుంచి తెల్లగా మెరుస్తున్న వస్తువు ఒకటి బాగా ఆకర్షించింది. దగ్గరకు వెళ్లి పరిశీలనగా చూశారు. అక్కడి దృశ్యం చూడగానే కాళ్లూ చేతులూ వణికిపోయి, అంతటి చలిలోనూ ముచ్చెమటలు పట్టేశాయ్. సరస్సు అంచున, నీటి లోపల వందలాది మానవ కంకాళాలు, కపాలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మంచు వాతావరణం వల్ల కొన్ని శవాలకు ఇంకా మాంసం, జుట్టు కూడా అలాగే ఉండిపోయాయి.సరస్సులో కేవలం అస్థిపంజరాలే కాదు, మంచు తీవ్రత వల్ల వందల ఏళ్లు గడిచినా చెడిపోకుండా భద్రంగా ఉన్న కొన్ని అద్భుతమైన పురాతన వస్తువులను కూడా గుర్తించారు. చనిపోయిన వారు ధరించిన తోలు చెప్పులు, బూట్లు, ఉన్ని దుస్తుల ముక్కలు గడ్డకట్టిన మంచు వల్ల అలాగే ఉండిపోయాయి. మహిళలు ధరించిన గాజులు, వెండి, రాగి నగలు లభించాయి. రక్షణ లేదా వేట కోసం ఉపయోగించిన ఇనుప ఈటెలు, కత్తుల ముక్కలు, బాణాలు కూడా దొరికాయి.కొండలు ఎక్కడానికి వారు ఉపయోగించిన గట్టి వెదురు కర్రల ముక్కలు కూడా బయటపడ్డాయి. బ్రిటిష్ ప్రభుత్వం ఈ వార్త వినగానే ఉలిక్కిపడింది. ఆ సమయంలో భారతదేశంపై దాడి చేయడానికి రహస్యంగా వస్తున్న జపాన్ సైనికుల బృందం ఏమైనా ఇక్కడ చనిపోయిందా? అని అనుమానించింది. వెంటనే సైనిక నిపుణులు రంగంలోకి దిగి ఆ ఎముకలను పరీక్షించారు. అవి దాదాపు 600 నుంచి 800 మందివి అయి ఉండొచ్చని అంచనాకు వచ్చారు. కానీ, అవి ఇటీవలివి కావని, శతాబ్దాల క్రితం నాటివని పరీక్షల్లో తేలడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టుల దృష్టి ఈ ‘అస్థిపంజరాల సరస్సు’పై పడింది.ఈ అస్థిపంజరాల వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి హైదరాబాద్‌కు చెందిన సీసీఎంబీతోపాటు అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అత్యాధునిక డీఎన్ఏ, కార్బన్ డేటింగ్ పరీక్షలు నిర్వహించారు. అందులో తేలిన విషయాలు పరిశోధకులను నివ్వెరపరచాయి. వారంతా ఒకేసారి చనిపోలేదని, ఎక్కువ శాతం మంది క్రీ.శ. 800 ప్రాంతంలో (1200 ఏళ్ల క్రితం) చనిపోగా.. కొంతమంది క్రీ.శ. 1800 (226 ఏళ్ల క్రితం) ప్రాంతంలో ప్రాణాలు కోల్పోయారని గుర్తించారు.మరింత విచిత్రం ఏమిటంటే, అక్కడ దొరికిన పుర్రెలు, ఎముకలపై ఎలాంటి కత్తుల గాయాలు కానీ, బుల్లెట్ గుర్తులు కానీ లేవు. అంటే అక్కడ ఎలాంటి యుద్ధం జరగలేదు. మరి అంతమంది ఒకేసారి ఎలా చనిపోయారు? ఎముకల తీరును పరిశీలించిన నిపుణులు ఒక సంచలన విషయాన్ని కనుగొన్నారు. ఆ పుర్రెల పైభాగంలో లోతైన ఫ్రాక్చర్లు ఉన్నాయి. అంటే తలపై గట్టి వస్తువు ఏదో బలంగా తాకడం వల్లే వారు చనిపోయినట్టు నిర్ధారించారు.ఆ ప్రాంతంలో ప్రాచుర్యం పొందిన నందాదేవి యాత్రకు వెళ్తున్న బృందంలోని వారివే ఆ మృతదేహాలు అయి ఉంటాయని అంచనా వేశారు. అకస్మాత్తుగా వచ్చిన భయంకరమైన తుఫానులో భారీ వడగళ్లు ఆకాశం నుంచి బాంబుల్లా కురిసి ఉండొచ్చని, తల దాచుకోవడానికి చెట్లు కూడా లేని ఆ గుట్టలపై, ఆ వడగళ్ల దెబ్బలకు తాళలేక వారంతా అక్కడికక్కడే ప్రాణాలు విడిచి ఉండొచ్చని భావించారు.డీఎన్ఏ పరీక్షల్లో మరో ఆసక్తికరమైన విషయం బయటపడింది. అక్కడ చనిపోయిన వారిలో మన భారతీయులతో పాటు వేల మైళ్ల దూరంలో ఉన్న తూర్పు మధ్యధరా ప్రాంతానికి (గ్రీస్, క్రేట్ దీవుల పరిసరాలు) చెందిన ప్రజల డీఎన్ఏ కూడా ఉండటంతో శాస్త్రవేత్తలు అవాక్కయ్యారు. అసలు 1800ల కాలంలో అక్కడి ప్రజలు అంత ఎత్తైన హిమాలయ పర్వతాల పైకి ఎందుకు వచ్చారు? ఎలా చనిపోయారు? అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు.రూప్‌కుండ్ చుట్టుపక్కల గ్రామాల్లో శతాబ్దాలుగా ఒక జానపద కథ ప్రచారంలో ఉంది. కన్నౌజ్ దేశానికి చెందిన రాజా జస్ధవాల్, తన గర్భిణి భార్య రాణి బాలాంపాతో కలిసి నందాదేవి యాత్రకు వెళ్లారు. అయితే యాత్ర నియమాలను ఉల్లంఘించి.. వారు సంగీత నృత్యాలతో, ఆడంబరాలతో ఆ పవిత్ర పర్వతాలపై ప్రయాణించారు. దీంతో తీవ్ర ఆగ్రహం చెందిన నందాదేవి... ఇనుప గుండ్ల లాంటి వడగళ్ల వానను కురిపించి రాజును, అతని సైన్యాన్ని సర్వనాశనం చేసిందని స్థానికులు నమ్ముతారు.రూప్‌కుండ్ సరస్సు కేవలం ఒక మిస్టరీ మాత్రమే కాదు, అదొక ప్రమాదకరమైన పర్యాటక ప్రాంతం కూడా. ట్రెక్కర్లు ఇప్పటికీ అక్కడికి వెళ్లినప్పుడు సరస్సు చుట్టూ ఎముకలు కనిపిస్తుంటాయి. అయితే, చాలామంది పర్యాటకులు ఆ పురాతన అస్థిపంజరాలను నాశనం చేయడం లేదా లగేజీల్లో దొంగిలించుకుపోతుండటం వల్ల ఈ చారిత్రక సంపద క్రమంగా కనుమరుగవుతోంది.ఎముకలు కొరికే చలిలో, మంచుకొండల మధ్య పడి ఉన్న ఆ అస్థిపంజరాలు... సహజ విపత్తుకు సాక్ష్యాలా లేక ఇంకా ఛేదించని చరిత్రకు ఆనవాళ్లా? సై న్స్ ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నా.. రూప్‌కుండ్ సరస్సు రహస్యం ఇప్పటికీ మానవాళికి అంతుచిక్కని మిస్టరీనే!- సత్యకిశోర్ -
పుణ్యఫలం: ధర దగ్గరే మొదలైన అసలు పంచాయితీ..!
‘‘రేపు ఉదయమే కార్యక్రమం. ఇంకా గోవు సిద్ధం కాకపోతే ఎలా?’’‘‘మీరేం ఆందోళన చెందకండి. అనుకున్నట్టుగానే కార్యక్రమం పూర్తవుతుంది’’.‘‘పదిరోజుల నుంచి మీ వెంట పడుతున్నాను. ఇప్పటి వరకూ ఏదీ ముడిపడలేదు. అందుకే భయంగా ఉంది.’’‘‘మీకిది మొదటిసారేమో! మేము ఎన్ని కార్యక్రమాలు చేయలేదు. ఉదయం చెప్పి ఆవు పంపమని అడిగినా క్షణాల్లో సిద్ధం చేసేస్తాం’’.‘‘ఏదో మిమ్మల్నే నమ్ముకున్నాను... ’’.‘‘మనకు ఎప్పుడూ సప్లై చేసేవాడి దగ్గర ఆవు చనిపోయింది. మనుషుల్లాగానే ఇప్పుడు ఆవులకు కూడా ఇన్సూరెన్సు ఉంటోంది. ఆ గొడవల్లో మునిగి ఉన్నాడతను.’’.‘‘అతను కాకపోతే, ఇంకెవరయినా...’’.‘‘మొన్న రెండు ఆవుల ఫొటోలు పంపాను కదండీ..’’‘‘ఆ... తెల్లటిచర్మం పైన నల్లటి మచ్చలున్న ఆవు... చూడగానే అదోలా ఉంది. అందుకే...’’‘‘ఫరవాలేదు. మీకు నచ్చిన ఆవునే అనుకున్న బడ్జెట్లో వచ్చేలా చూసే పూచీ నాది. మీరేం ఫికర్ కాకండి’’.‘‘తెల్ల ఆవు అయితే బావుంటుందని చెప్పాను తప్ప రంగు పట్టింపు అంత లేదు. మంచి ఆరోగ్యంగా ఉన్న ఆవుని చూసి పంపండి.’’‘‘సరేనండి...’’‘‘మధ్నాహ్నం 12.30 కల్లా మీకు ఫొటోలు వచ్చేస్తాయి. మీకు నచ్చిన ఆవును ఎంపిక చేసుకోండి. మరణించిన మీ బంధువుల ఆత్మశాంతి కోసం ఈ పనికి పూనుకుంటున్నారు. మిమ్మల్ని అభినందించాలి’’.‘‘అంతా సజావుగా జరిగితే ఫరవాలేదు, లేకపోతే నలుగురి ముందూ నవ్వుల పాలవుతాను.’’‘‘ఆ విషయం నాకు వదిలెయ్యండి. మీరు చెప్పిన టైమ్ కంటే ఓ అర్ధగంట ముందే సత్రం దగ్గర ఆవు ఉంటుంది. నా మాట నమ్మండి’’.∙∙ ‘‘అయ్యా, సమయం 5.30 దాటుతోంది. ఆవు సంగతి తేలలేదు. అనుకున్న పని సజావుగా పూర్తవుతుందా లేదా అని భయంగా ఉంది?’’‘‘నాకొదిలెయ్మన్నా కదా... జహీరాబాద్ వాడు ఫోన్ ఎత్తటం లేదు. చాలాసార్లు ట్రై చేశా. ఇప్పుడు చింతలకుంట మార్కెట్ అతను మాట్లాడాడు. ఇప్పుడే ఫొటోలు వచ్చాయి. పంపుతున్నాను.’’‘‘మరి ధర విషయం?’’‘‘కాస్త ఎక్కువ చెబుతున్నాడు.’’‘‘మీరే మాట్లాడి నా బడ్జెట్ ప్రకారం తెగ్గొట్టండి.’’‘‘నా వంతు ప్రయత్నం చేస్తాను.’’‘‘మధ్యాహ్నం అనగా మాట్లాడాను. ఇప్పుడు రాత్రి 7.30 దాటింది. కొన్ని గంటల్లో కార్యక్రమం పెట్టుకుని ఆవు సిద్ధం కాకపోతే ఎలా?’’‘‘తను ఆవు ధర చెప్పాడు. తగ్గటం కుదరదని బిగుసుకుపోయాడు. ఏం చేయాలో తోచక..’’‘‘ఇంతకీ ఎంత చెబుతున్నాడేమిటి?’’‘‘మీకు మెసేజ్ పెట్టాను. వాట్సాప్ ఓపెన్ చేసి చూడండి.’’‘‘అమ్మో.. ఇంతా? బడ్జెట్ పదివేలు దాటుతుంది’’.‘‘అందుకే నేనే తగ్గించమని బతిమాలుతున్నా’’.‘‘ఎలాగోలా అయ్యేటట్టు చూడండి’’.‘‘చూద్దాం. మనకు బానే పరిచయం ఉన్నవాడు. తగ్గుతాడనే అనుకుంటున్నాను’’.‘‘ప్లీజ్. ఏదో రకంగా సెటిల్ చేయండి.’’∙∙ ‘‘రెండు గంటల నుంచి మీ కోసం ఎదురుచూస్తున్నాను. ఈ టెన్షన్ భరించటం నా వల్ల కావటం లేదు. ఎంతో కొంతకి సెట్ చేయండి. ఇప్పుడు రాత్రి 9 అవుతోంది’’‘‘చాలాసార్లు మాట్లాడి చూశాను. ధర తగ్గించటం కుదరదంటున్నాడు. మీరే ఆలోచించి ఏదో ఒకటి ఫైనల్ చేసుకోండి.’’‘‘ఇప్పుడు నేను మాత్రం చేయగలిగింది ఏముంది?’’‘‘అలా కాదు. మీ ఇద్దరికీ కాన్ఫరెన్సు కాల్ ఏర్పాటు చేస్తాను. మీరు కూడా మాట్లాడి ఓ నిర్ణయానికి వస్తే బావుంటుంది.’’‘‘ఆ అవసరం ఎంత మాత్రం లేదు. మీపైన బాధ్యత పెట్టాను. అతను తగ్గనంటే నేను మాత్రం ఏం చేస్తాను. ఆ రేటుకే కానిచ్చేయండి.’’‘‘సరే. వాట్సాప్‌లో లొకేషన్ పంపితే వచ్చి మీ ఇంటికొచ్చి డబ్బులు తీసికెళతాడు. పురోహితుడు కూడా కావాలన్నట్టున్నారు. మాకు తెలిసిన ఓ పెద్దాయన్ని పంపుతాను.’’‘‘ఆయనకు సంభావన, ఇతర ఖర్చులు..’’‘‘గోదానానికి రెండువేల నుంచి మూడువేల వరకూ తీసుకుంటారు. దానితో పాటు పెట్రోలు ఖర్చులు నాలుగైదు వందలు ఉంటుందేమో? అంత వరకూ ముట్టచెప్పండి చాలు...’’‘‘అలాగే. సత్రం చిరునామా పంపుతాను. ఉదయం 8, 8.30 కల్లా వచ్చెయ్యమని చెప్పండి.‘‘అలాగే..’’∙∙ ‘‘అదేంటి? ఉదయం ఆరుగంటలకే బయలుదేరతానన్నావు కదా?’’‘‘మీరు చెప్పిన ధరకయితే రాలేను.’’‘‘అదేంటి? బేరం మాట్లాడుకున్న తర్వాత ఇలా చేస్తారా ఎవరైనా?’’‘‘ఓసారి మీరన్నది గుర్తు చేసుకోండి. ఆవుకు డబ్బులిచ్చాను. మళ్లీ ట్రాన్సుపోర్టుకు అదనమని నాకు తెలీదు అని మీరు వాదించారు..’’‘‘అవును, గుర్తుంది. ఆవు అమ్మిన అతన్ని దగ్గర నంబరు తీసుకుని నీతో మాట్లాడాను. ఇప్పటికే ఖర్చు తడిసిమోపెడయ్యింది. నేను ఇంతే ఇస్తాను. మిగతా ఎమౌంట్ అతని దగ్గర తీసుకోమన్నాను.’’‘‘ఆ..’’‘‘అంటే నువ్వు ఒప్పుకున్నట్టే కదా, ఇప్పుడు పంచాయతీ చేస్తున్నావేంటి?’’‘‘బాడుగ గిట్టదు..’’‘‘సరే, ఏం చేస్తాం? నువ్వడిగినదంతా ఇస్తాను, ఆవు, దూడలతో వచ్చెయ్యి’’‘‘డబ్బులు ఫోన్ పే చెస్తే.. బయలుదేరతా.’’∙∙ ‘‘అయ్యా, కార్యక్రమం ప్రారంభిద్దాం. ఆవుని, దూడని పసుపు, కుంకుమలతో చక్కగా అలంకరించండి.’’రామశర్మ కారు దిగి అక్కడ అడుగుపెట్టగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.నుదుటిన పెద్ద బొట్టు, మెడలో రుద్రాక్ష మాల, చేతికి బంగారు కడియాలు, వేళ్లకు తళతళా మెరుస్తున్న ఉంగరాలు, ఖరీదైన సిల్కులాల్చీ... బాగా ఖరీదయిన మనిషిలాగా కనిపించాడు.నిన్న ఉదయం నుంచి పడిన శ్రమ సార్థకమయ్యే సమయం వచ్చింది. క్రతువు ఘనంగా చేయాలనే సంకల్పంతో ఉన్నా. అందుకే మనసులో ఆందోళనగా ఉన్నా, మిగతా అన్ని ఆలోచనలను పక్కకు నెట్టి చేస్తున్న పనిమీద మనసు నిలిపాను. చుట్టూ ఉన్న వాళ్లని హుషారు చేశాను. ఆవు అలంకరణ పూర్తి కావటానికి ఎంతో సమయం పట్టలేదు. పసుపు, కుంకుమ అలంకరించిన తర్వాత కొత్తగా కొన్న చీర, బ్లౌజ్ పైన పరిచాం. రామశర్మ పెదవులు కదులుతున్నాయి. బయటకు వినిపించటం లేదు గానీ ఆయన ఏవో మంత్రాలు చదువుతున్నాడని అర్థమైంది. ఓ పదినిముషాల తర్వాత ‘‘మీ కుటుంబ సభ్యులంతా దంపతులుగా వచ్చి ముమ్మారు ప్రదక్షిణ చేయండి’’ గట్టిగా చెప్పారు.ఆయన ఆదేశాలు తు.చ. తప్పకుండా అమలు చేశాం. అపరకర్మల కోసం అక్కడకు వచ్చిన వాళ్లు, సత్రం గదుల్లో ఉన్న వాళ్లు బిలబిలమంటూ బయటకు వచ్చి ఈ తంతు చూడటం ప్రారంభించారు. యూట్యూబ్ వచ్చిపడ్డ తర్వాత జనాల్లో చాలా మార్పు వచ్చింది. దానిని భక్తి అనాలో, మరొకటనలో.. అంతమందిని చూడగానే రామశర్మలో ఎక్కడలేని హుషారు వచ్చింది.‘‘మీకు గోదానం ప్రాశస్త్యాన్ని వివరిస్తాను’’ ఆయన కంఠం ఖంగుమంది.‘‘గోవులను దానం చేయటం వల్ల దారిద్య్రం తొలగి సంపదలు కలుగుతాయి. అనారోగ్య, అపమృత్యు భయాలు తొలగిపోతాయి. గృహదోషాలు మాయమవుతాయి. జన్మజన్మల పాపాలు హరించుకుపోతాయి. మరణానంతరం ‘వైతరణి’ దాటే క్రమం సులభమవుతుంది. కొన్ని వేల సంవత్సరాల పాటు పితృదేవతలు ఉత్తమగతులు పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి.’’రామశర్మ చెప్పేది అందరూ సావధానంగా వింటున్నారు. టీవీ కార్యక్రమాల్లో ప్రయోక్త మాదిరిగా హావభావాలను ప్రదర్శిస్తూ ఆయన సంభాషణను రక్తికట్టిస్తున్నాడు.‘‘గోవు సకల దేవతా స్వరూపం. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి తర్వాత, కన్నతల్లి తర్వాత, ఒక్క ఆవును మాత్రమే గోమాత అని పిలుస్తారు...’’ అని వివరించిన తర్వాత.. కాస్త విరామం ఇచ్చి.. ‘‘గోమాత నమోనమో నమోనమో నమః’’ అన్నాడు రామశర్మ.‘‘ఈ నామాన్ని మీరంతా మూడుసార్లు అనండి’’ అని అందరి చేత అనిపించాడు.అందరి మొహాలు ఒక్కసారిగా వెలిగిపోయాయి. ఈ క్షణంలో ఇక్కడ లేకపోయుంటే ఎంత పుణ్యాన్ని కోల్పోయేవాళ్లమో అనుకున్నారు.‘‘మీలో చాలా మందికి గోదానం చేయాలని ఉంటుంది. అదెలాగో తెలియదు. అలాగే కొందరికి ఆసక్తి ఉంటుంది కాని, ఆర్థికంగా స్తోమత ఉండదు. అలాంటి వాళ్లందరి కోసం నా దగ్గర చిట్కా ఉంది. మీరు నెలనెలా వెయ్యి రూపాయలు ఖర్చుపెడితే చాలు, మీ పేరుతో ఆవుకి మేత వేస్తాం. ఆవుల సంతతి పెరుగుతుంది. మీకు పుణ్యం వస్తుంది. వెయ్యి అనే కాదు. ఇవ్వగలిగిన వాళ్లు అంతకంటే ఎక్కువ ఇచ్చినా ఇబ్బంది లేదు.’’‘‘మీకు ఆవులు ఉన్నాయా పంతులు గారూ?’’ ఎవరో ఒకావిడ అడిగింది.‘‘ఎంతమాట అన్నావమ్మా! పెద్ద గోశాలనే నడుపుతున్నా. అక్కడ చాలా ఆవులు ఉంటాయి. దానాలు అవసరం అయిన వాళ్లు ఫోన్ చేయవచ్చు. కావాలనుకుంటే వచ్చి చూడొచ్చు’’.లాల్చీ జేబులో నుంచి విజిటింగ్ కార్డుల కట్ట బయటకు తీశాడు. చుట్టూ ఉన్న జనం ఒక్కసారిగా మీద పడ్డారు.‘‘వెయ్యి కష్టం అనుకున్న వాళ్లు కనీసం ఐదు వందలయినా ఇవ్వండి. పుణ్యం మూటకట్టుకోండి.’’ అప్పటికప్పుడు రాయితీ కూడా ప్రకటించారు.రామశర్మ మాటలతో మైకం కమ్మిందో, అప్పటికే పుణ్యం అన్న మాట చాలాసార్లు విని ఉండటం వల్లనో తెలియదు అందరికీ పూనకం వచ్చిందో తెలియదు గాని, వెనకా ముందు చూసుకోలేదు. జేబుల్లో నుంచి నోట్లు తీసి రామశర్మ చేతుల్లో కుక్కారు. మరికొందరు డిజిటల్ పేమెంట్ మోడ్‌లోకి వెళ్లారు. రామశర్మ ఓ వైపు నోట్లు సరిచూసుకుంటూ దాతలకు అక్షతలు వేసి ఘనంగా దీవించారు. అందరూ తలో వైపు వెళ్లిపోయారు. ఇది ప్రైవేటు కార్యక్రమం. మా కుటుంబానికి పరిమితమైన వ్యవహారం. దానిని పక్కన పెట్టి ఆయన తన సొంత బిజినెస్‌లో నిమగ్నం కావటం నాకు ఇబ్బంది అనిపించింది. అయినా నోరు మెదపలేకపోయాను. మా కుటుంబంలో మిగతావాళ్లదీ దాదాపుగా అదే పరిస్థితి. అంతలోనే ఆయన నా వైపు చూస్తూ ‘కార్యక్రమం ముగిసింది’ అన్నట్టుగా కళ్లతోనే చెప్పాడు. నేను పర్సులో నుంచి డబ్బులు తీసి ఆయన చేతిలో పెట్టాను.వాటిని లెక్క పెట్టుకుని ‘‘ఇదేంటి?’’ అన్నాడు సీరియస్‌గా.‘‘నేను ఒప్పుకున్నది అంతకేగా.. ఆవు పంపిన వ్యక్తి.. పేరు చెప్పాను. ఆయన చెప్పిన మొత్తం ఇదేగా?’’ అన్నాను అదే స్థాయిలో తీవ్రంగా స్పందిస్తూ.‘‘ఈ చిల్లర తీసుకోవటానికి నేనేం ఆషామాషీ వ్యక్తిని కాదండీ.’’ఎంత ఇవ్వాలో అంకె చెప్పాడు. అది వినేసరికి నా కళ్లు బైర్లు కమ్మాయి.‘‘జంటనగరాల్లో నేను ఫేమస్. సినిమావాళ్లు, పొలిటీషియ¯Œ ్స, బిజినెస్ బిగ్ షాట్స్ అందరూ నా క్లయింట్స్. వాళ్లందరికీ నా మాట మీద గురి. నేను చెప్పినట్టల్లా నడుచుకుంటారు. నా నాలిక మీద సరస్వతి నాట్యం చేస్తుంది. నేను ఒక మాట అన్నానంటే అంతే...’’ప్రవాహంలా ఆయన మాటలు సాగుతున్నాయి. ఆ సొద వినటం నాకు ఇబ్బందిగా ఉంది.‘‘నేను సోషల్ మీడియా చూడను. నాకు ఇవేమీ తెలియవు’’ అన్నాను చికాకు బయటకు కనపడకుండా.‘‘నా యూట్యూబ్ చానల్‌కి లక్షల్లో సబ్ స్క్రైబర్లు ఉన్నారు.’’ అన్నాడు దర్పాన్ని ప్రదర్శిస్తూ.అప్పటి వరకు నేను పెద్దగా పట్టించుకోలేదు. ఓ పన్నెండేళ్ల కుర్రాడు మొబైల్లో వీడియో తీయటాన్ని ఇంతకు ముందు గమనించాను. ఇప్పుడు ఆయన చెబుతుంటే అర్థం అవుతోంది. ఒకేసారి స్వామికార్యం, స్వకార్యం పూర్తి చేస్తున్నాడన్నమాట. డబ్బు పుచ్చుకుని కార్యక్రమాలు చేయటానికి వస్తాడు. వాటిని షూట్ చేసి యూట్యూబ్‌లో పెట్టి తిరిగి డబ్బు సంపాదిస్తాడు.ఆయన నా ఆలోచనలు తుంచేస్తూ. ‘‘సర్సరే. అవతల నాకు వేరే కార్యక్రమం ఉంది. డబ్బులిస్తే బయలుదేరతాను’’ అన్నాడు దబాయించినట్టుగా. ఆయన అడిగిన మొత్తం చేతిలో పెట్టి నమస్కారం చేశాను. ఆ డబ్బుల్ని లాల్చీలోకి నెట్టుకుని క్షణాల్లోనే మాయమయ్యాడు. నేను ఊపిరి పీల్చుకున్నాను. అప్పటికే నాకు ఓర్పు సడలింది. పని ముగించుకుని ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి పారిపోదామా అనిపిస్తోంది. కాని అదంత సజావుగా ముగిసేటట్టు లేదు.∙∙ ‘‘ఉదయం 8గంటలకు రమ్మని పిలిచారు. నాలుగు గంటలు వెయిట్ చేయించారు. ఇంకో వెయ్యి అదనంగా ఇవ్వండి’’ ఆవును వెంట తెచ్చిన వ్యాన్ డ్రైవర్ డిమాండ్ చేశాడు.‘‘ఓ ఐదొందలు.. కాదంటే అదనంగా ఇంకో వంద.. తప్ప అంత కంటే ఎక్కువ ఇవ్వలేను. అంతా లెక్క వేసుకుని డబ్బులు తెచ్చాను. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు’’ బతిమాలుతున్నట్టుగా అడిగాను.‘‘మీరిచ్చే దానిలో రెండు వందలు చీటీకే పోతుంది’’ నిర్లక్ష్యంగా చెప్పాడతను.‘చీటీ అంటే..?’’‘‘సంతలో ఆవును కొన్నప్పుడు దానికి రిసీప్టు ఇస్తారు. మీ పేరుతో తీసుకున్నాను. కావాలంటే చూడండి’’ చీటీ తీసి నా చేతిలో ఉంచాడు.‘‘పరిస్థితి చాలా అన్యాయంలా ఉందే. ఆవు కొన్నందుకు డబ్బు చెల్లించటం కాకుండా మళ్లీ అదనంగా ఇంకో ఖర్చా? నా దగ్గర ఉన్నవి ఇవే. వీటితో సర్దుకో. విసిగించొద్దు’’.‘‘మిగిలిన డబ్బులు గూగుల్ పే చేయండి’’.‘‘బాబూ, నీకో దండం. ఈ పని తలకెత్తుకుని నేను పడ్డ నరకయాతన చాలు. ఇచ్చింది పుచ్చుకుని వెళ్లు’’.‘‘ఛీ... వెధవ బేరం’’అతని నోటి నుంచి వచ్చిన బూతులు విన్న తర్వాత డబ్బులు ఇచ్చినా బావుండేదని అనిపించింది.∙∙ ఈ తంతులో ఆఖరి ఘట్టంలోకి ప్రవేశించాం. ఓ వైపు భోజనాలకు ఏర్పాట్లు సాగుతున్నాయి. కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు, మనవలు, మనవరాళ్లు, మునిమనవలు, మునిమనవరాళ్లు... అటూ ఇటూ ఐదు తరాల వాళ్లు ఒకచోట చేరారు. అనుబంధాలను నెమరువేసుకుంటున్నారు.‘‘ఆవిడ పరిపూర్ణ జీవితాన్ని గడిపింది. ఇన్ని తరాల వాళ్లను చూసుకుంది అదృష్టవంతురాలు...’’‘‘పెట్టుపోతలంటే ఆవిడ తర్వాతనే ఇంకెవరయినా. ఇంటికొస్తే ఎంగిలిపడకుండా తిరిగి వెళ్లనిచ్చేది కాదు..’’‘‘ఎవరు ఎన్ని మాటలన్నా మౌనంగా ఊరుకునేది. పరుషంగా ఒక్కరిని నిందించటం చూళ్లేదు..’’‘‘ఇంత పెద్ద సంసారాన్ని ఒంటి చేతిమీద నెట్టుకొచ్చింది.’’నాకు తెలిసి నిన్న మొన్నటి వరకూ వీళ్లంతా ‘ఈ ముసలమ్మ నస భరించలేకపోతున్నాం’ అని విసుక్కున్న వాళ్లే. మరి ఇప్పుడేంటి వింతగా ప్రవర్తిస్తున్నారు? వ్యక్తుల మరణంతో అన్నీ తుడిచిపెట్టుకుపోయాయా? ఈ సంభాషణ ఒక వైపు సాగుతూండగానే మాకు కొద్ది దూరంలో.. తోడికోడళ్లు నలుగురు పోగయి మాట్లాడుకుంటున్నారు. అక్షరం పొల్లుపోకుండా అవన్నీ నా చెవిలో పడుతున్నాయి.‘‘ఇదంతా పెద్ద షో అక్కా? నెలనెలా జీతం రాళ్లతో బతికేవాళ్లు... వేలకు వేలు పోసి ఆవు కొనగల సత్తా ఉందా? ఎక్కడో ఆవును, దూడను తెచ్చి తంతు ముగించేసి ఉంటారు. దానికి పెద్దగా ఖర్చు కూడా కాదట!’’‘‘ఈ ముసల్ది కూతురికి పెద్ద మూట ఇచ్చి ఉంటుంది. అందుకే ఘనంగా గోదానం చేస్తున్నారు. ’’‘‘అమ్మ బతికున్నప్పుడు ఉన్న ఊళ్లోనే అయినా ఒక్కసారి కూడా చూడటానికి రాలేదు గానీ, టింగురంగా అంటూ ఇప్పుడొచ్చి ప్రేమ ఉన్నట్టు వేషాలేస్తోంది చూడు. ఆ అల్లుడుగాడు ఏదో గొప్ప పని చేసినట్టు ఫోజు కొడుతున్నాడు. పాపం ఊరికే పోతుందా? వీళ్లను కట్టి కుడపదూ?’’‘‘అత్తగారి వైపు నుంచి బాగా ఆస్తి వచ్చి ఉంటుంది? కొడుకు అమెరికాలో ఉన్నాడుగా.. నెలనెలా డాలర్లు పంపుతూ ఉండుంటాడు. డబ్బులు ఏం చేసుకోవాలో తెలియక, నలుగురి ముందు గొప్ప చాటుకోవాలని..’’‘‘ఇవన్నీ కాదు అక్కా... ముసలమ్మ వాటా కొట్టెయ్యటానికి ప్లాన్ చేశారేమో?’’‘‘మేం చేతగాని వాళ్లమా? అదెలా జరగుతుందో చూస్తాం...’’మా దంపతుల్ని లక్ష్యంగా చేసుకుని మాటల దాడి కొనసాగుతోంది. ఇతరుల ప్రశంసల కోసమో, గొప్ప కోసమో ఈ పని చేయలేదు. అసలు గోదానం కొడుకులు చేయవలసిన పని అన్న స్పృహ కూడా నాకు లేదు. నా సమక్షంలో గోదానం గురించి చర్చ సాగుతున్నప్పుడు ‘నేను చూసుకుంటాను’ అని చెప్పి ఇందులోకి దిగాను. అంతకు తప్ప... పక్కనే ఉన్న నా భార్య ఈ మాటలు విన్నట్టుంది. గట్టిగా శోకాలు అందుకుంది. ఆమెను అక్కడ నుంచి పక్కకు తీసికెళ్లి ఓదార్చాక గాని తను మామూలు కాలేకపోయింది. భోజనాలు ముగిశాయి. ఆ తర్వాత ఆశీర్వచన కార్యక్రమం పూర్తయ్యింది.‘‘ఎవరికీ వెళ్లొస్తామని చెప్పకూడదు. పొద్దుగూకక ముందే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి’’అక్కడున్న వాళ్లెవరో చెప్పారు. ఒక్కొక్కళ్లు లేవటం మొదలుపెట్టారు.ఏ కర్మఫలం నన్ను ఇందుకు పురిగొల్పిందో? నా పుర్రెకు పుట్టిన బుద్ధి... నా భార్యతో సహా మిగిలిన వాళ్లందరినీ ఆశ్చర్యపరచి ఉండొచ్చు. నాకు మా అత్తగారి వైపు వాళ్లతో అంత సాన్నిహిత్యం లేదు. పండగలు, పెట్టుపోతలు లాంటి వాటికి దూరంగా ఉన్న వాడిని. ఇప్పుడిలా.. ఓ మంచి పని చేయటంలో ఉండే తృప్తిని మిగుల్చుకోవాలన్న తాపత్రయం తప్ప దీని వెనక నాకు ఎలాంటి స్వార్థం లేదు. ఈ మాటలు బయట పెట్టి నేను చేసిన పని విలువను దిగజార్చుకోదలచుకోలేదు.‘‘మరణించిన పెద్దావిడకు భగవంతుడు సద్గతులు ప్రసాదించాలి’’ అనుకున్నాను.రామశర్మ చెప్పినట్టు.. ‘‘ఆమె హాయిగా వైతరణి దాటాలి. దానం చేసిన ఈ గోవు ఆమెకు దీపధారిగా నిలవాలి’’ అని వేడుకున్నాను.ఓ సత్కార్యం చేయటానికి అవకాశం ఇచ్చిన ఆ భగవంతుని మనసారా ధన్యవాదాలు చెప్పుకుని నిశ్శబ్దంగా అక్కడ నుంచి బయటపడ్డాం.సూర్యుడు పడమటి కొండల్లోకి దిగుతున్నాడు.- డాక్టర్ పార్థసారథి చిరువోలు -
సినిమాలో పాట లేదని కోర్టు మెట్లు ఎక్కిన మహిళ
ట్రైలర్లో ఉన్న పాట సినిమాలో లేకపోతే ఏం చేస్తారు? తిట్టుకుంటూ బయటకు వస్తారా? డబ్బులు వృథా అయ్యాయని బాధపడతారా? అయితే ఓ మహిళా ప్రేక్షకురాలు ఇలా చేయలేదు. కోర్టుకెక్కింది... వినియోగదారుగా తన హక్కుల కోసం పోరాడింది. ఆ పాట కోసం ఔరంగాబాద్ నుంచి ఢిల్లీ వరకు న్యాయ పోరాటం సాగించింది. చివరకు సుప్రీంకోర్టు తీర్పుతో ఈ సమస్యకు శుభం కార్డు పడింది.బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ హీరోగా యశ్‌రాజ్ ఫిలిమ్స్(వైఆర్ఎఫ్) 2016లో ‘ఫ్యాన్’ సినిమాను నిర్మించింది. సినిమా విడుదలకు ముందు టెలివిజన్, సోషల్ మీడియాలో ప్రమోషనల్ ట్రైలర్ విడుదల చేసింది. ట్రైలర్‌లోని ‘జబ్రా’ ఫ్యాన్ పాట సినీ అభిమానులను ఉర్రూతలూగించింది. సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఔరంగాబాద్‌కు చెందిన ఓ స్కూల్ టీచర్ ఈ ట్రైలర్ చూసి కుటుంబంతో సినిమాకు వెళ్లారు. సినిమా పూర్తయినా ఆ పాట మాత్రం రాలేదు. దీంతో ఆమె నిరుత్సాహానికి గురై జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు.ట్రైలర్‌లోని పాటను తొలగించి చిత్ర నిర్మాణ సంస్థ మోసం చే సిందని , దీనివల్ల తాను మానసిక వేదనకు గురయ్యానని జిల్లా వినియోగదారుల ఫోరంలో కేసు వేశారు. రూ. 60,500 నష్టపరిహారం కోరారు. టికెట్ కొనుగోలు చేసినంత మాత్రాన నిర్మాత నేరుగా సేవలందించే సంస్థగా మారడని ఫోరం పేర్కొంది. వినియోగదారుడికి..సంస్థకు మధ్య ఎలాంటి చట్టబద్ధమైన హామీ లేదని.. కేసు చెల్లదని కేసు తిరస్కరించింది.ఫిర్యాదుదారుకు అనుకూలంగా..ఆ తీర్పుపై ఫిర్యాదుదారు రాష్ట్ర వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించారు. .సినిమా ప్రదర్శన వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టంలోని ‘సేవ’ నిర్వచనం పరిధిలోకి వస్తుందని, వైఆర్ఎఫ్ ఆ సేవను అందించే సంస్థగా కమిషన్ పేర్కొంది. జబ్రాఫ్యాన్ పాటను తొలగించి సంస్థ ప్రేక్షకులను పక్కదోవ పట్టించింది. ఇది అన్యాయ వాణిజ్య పద్ధతి కిందకు వస్తుందని అభిప్రాయపడింది. . పరిహారంగా రూ. 10,000, కేసు ఖర్చుల నిమిత్తం మరో రూ.5,000 పిర్యాదుదారుకి చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పుపై జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్(ఎన్సీడీఆర్సీ)ను సంస్థ ఆశ్రయించింది. రాష్ట్ర కమిషన్ అభిప్రాయాన్నే ఎన్సీడీఆర్సీ కూడా సమర్థించింది.ఆఫర్.. అంగీకారం ఉండాలి..ఈ తీర్పుపై వైఆర్ఎఫ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ట్రైలర్ సినిమాకు సంబంధించిన ప్రకటన మాత్రమే అని కోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) కల్పించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కింద రక్షణ ఉంటుందని పేర్కొంది. అయితే మోసపూరితమైన, అన్యాయమైన, తప్పుదోవ పట్టించే ప్రకటనలకు రాజ్యాంగ రక్షణ ఉండదని స్పష్టం చేసింది. ట్రైలర్ చూసి ప్రేక్షకుడు ప్రభావితం కావొచ్చు..కానీ చట్టబద్ధమైన హామీగా దీన్ని భావించలేమని కోర్టు వివరించింది. టికెట్ కొని సినిమా చూసే ప్రతీ వ్యక్తి వినియోగదారుడే అనడంలో సందేహం లేదని పేర్కొంది. సేవల్లో లోపం జరిగిందా? లేదా? అనేదే ఈ కేసులో కీలకాంశమని చెప్పింది.అసంపూర్ణత, నాణ్యతలో నాసిరకం, పనితీరు సక్రమంగా లేకపోవడం, తయారీలో తగిన ప్రమాణాలు పాటించకపోవడాన్నే సేవల్లో లోపంగా గుర్తించాలని పేర్కొంది. సినిమాలో ఆ పాట తప్పనిసరిగా ఉంటుందనేది ఫిర్యాదుదారు వ్యక్తిగత అంచనా మాత్రమే అని తెలిపింది. దీన్ని చట్టపరంగా సేవల్లో లోపంగా పరిగణించలేమని స్పష్టం చేసింది.చట్టబద్ధమైన ఒప్పందం ఏర్పడాలంటే ‘ఆఫర్’ ఉండాలి..ఆ ఆఫర్‌ను మరో పక్షం అంగీకరించాలని చెప్పింది. ట్రైలర్‌ను ‘ఆఫర్’గా భావించలేమని అందువల్ల కాంట్రాక్టు చట్టం ప్రకారం ఈ వాదన సరైంది కాదని తేల్చింది. ప్రతి చిన్న తేడా లేదా ప్రతి నిరాశ ‘అన్యాయ వాణిజ్య పద్ధతి’ నిర్వచనం పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. తప్పుడు సమాచారం, తప్పుదోవ పట్టించే ప్రచారం, ప్రకటన, వాస్తవానికి విరుద్ధంగా ఉన్నప్పుడే అది ‘అన్యాయ వాణిజ్య పద్ధతి’ కిందకు వస్తుందని పేర్కొంది. ఈ కేసులో ఇవేవీ రుజువు కాలేదని వివరించింది.యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఉద్దేశపూర్వకంగా ప్రేక్షకులను మోసం చేసిందని, తప్పుదోవ పట్టించిందని నిరూపించే బలమైన ఆధారాలను ఫిర్యాదుదారు సమర్పించలేదని కోర్టు పేర్కొంది. సినిమా నిర్మాణ ప్రక్రియలో ఉన్న పలు అంశాలు చివరి దశలో మారడం సహజమేనని కళాత్మక సేవలను సాధారణ సేవలతో పోల్చలేమని వివరించింది. అన్ని అంశాలను పరిశీలించిన సుప్రీంకోర్టు ఎన్సీడీఆర్సీ ఉత్తర్వును రద్దు చేసింది. ప్రచార ట్రైలర్లో కనిపించిన పాట సినిమాలో లేకపోవడం సేవల్లో లోపం, అన్యాయ వాణిజ్య పద్ధతి కిందకు రాదని తీర్పు ఇచ్చింది.- దిలీప్ మాదిరెడ్డి -
పుండరీకుడి వృత్తాంతం: తపస్సుకు ప్రసన్నుడైన శ్రీమహావిష్ణువు!
పూర్వం పుండరీకుడు అనే మహారాజు ఒకనాడు వేటకు వెళ్లాడు. అడవిలో యథేచ్ఛగా జంతువులను వేటాడుతూ, కపిల మహర్షి ఆశ్రమ పరిసరాలకు చేరుకున్నాడు. అప్పటికి మిట్టమధ్యాహ్నమైంది. వేటలో పుండరీకుడు బాగా అలసిపోయాడు. కపిలుడి ఆశ్రమానికి చేరువలో ఒక సరోవరం కనిపించింది.పుండరీకుడు ఆ సరోవరంలో నీళ్లు తాగి, దప్పిక తీర్చుకున్నాడు. ఇంతలోనే ఒక లేడికూన ఆ సమీపంలోనే పరుగుతీస్తూ కనిపించింది. వేట ఉత్సాహం తగ్గని పుండరీకుడు వెంటనే, విల్లంబులు అందుకుని, దానిని గురిచూసి బాణం విడిచాడు. బాణం తగిలిన లేడికూన గాయపడి, ఒక్క పరుగున కపిల మహర్షి ఆశ్రమ ప్రాంగణానికి చేరుకుని, అక్కడ ప్రాణాలు విడిచింది.ఆ దృశ్యం చూసిన కపిలుడు ఉగ్రుడయ్యాడు. ‘ఎవడా మూర్ఖుడు? ఆశ్రమ పరిసరాల్లో ఇంతటి హింసకు పాల్పడినవాడు’ అని బిగ్గరగా అరిచాడు. ఇంతలో లేడిని తరుముతూ పుండరీకుడు అక్కడకు చేరుకున్నాడు. కపిలుడి ఉగ్రరూపం చూసి, భయంతో గడగడ వణుకుతూ, ‘మునివర్యా! నా అపరాధాన్ని మన్నించండి’ అంటూ కాళ్ల మీద పడ్డాడు.కపిలుడు కొంత శాంతించాడు. పుండరీకుడు తనను తాను పరిచయం చేసుకున్నాడు.కపిలుడు తీక్షణంగా పుండరీకుని చూశాడు. ‘క్షణభంగురమైన తుచ్ఛ శరీరంపై ఆశలు పెట్టుకుని, ఇంతటి పాపానికి ఒడిగట్టావే, దీనికి కారణమేమిటి? నీ విలాసం కోసం ఒక లేడికూన నిండుప్రాణాన్ని బలిగొనడం ఏమి న్యాయం?’ అని పలికి, పుండరీకుడికి వైరాగ్యబోధ చేశాడు.కపిలుడి మాటలకు పుండరీకుడు పశ్చాత్తాపంతో దహించుకుపోయాడు. పాపిష్టి దేహాన్ని ఇక్కడే త్యాగం చేయడం మంచిదని తలచి, తన తల నరుక్కుని, ఆత్మాహుతి చేసుకోవడానికి ఒర నుంచి కత్తి దూశాడు. కపిలుడు అతడి ప్రయత్నాన్ని నివారించాడు. పుండరీకుడికి హితబోధ చేశాడు.‘మోక్షేతి జ్ఞానం అన్యత్ర విజ్ఞానం’ అని పలికి, ‘రాజా! మానవునకు మోక్షమే పరమావధి. మోక్షాన్ని ఆపేక్షించే మానవుడు పూర్వదానఫలం వల్ల కలిగే సంపదలు క్షణికమైనవని, పరహింసాపరాయణత్వం పాపహేతువని తెలుసుకుని, గురువును ఆశ్రయించాలి. గురువు ద్వారానే తత్త్వాన్ని తెలుసుకుని, ఆధ్యాత్మిక మార్గం వైపు ప్రయాణించాలి’ అని బోధించి, రాజధానికి వెళ్లి రమ్మని చెప్పి సాగనంపాడు.రాజధానికి తిరిగి వెళ్లినా, పుండరీకుడి మనసు మనసులో లేదు. తన శరాఘాతంలో మరణించిన లేడికూన, ఆ తర్వాత కపిల మహర్షి చేసిన ఉద్బోధ అతడి మనసులో మెదలసాగాయి. రాజ్యపాలనపై దృష్టిపెట్టడం అతడి దుస్సాధ్యంగా మారింది. వ్యాకులచిత్తుడైన పుండరీకుడు తన రాణికి, మంత్రులకు సైతం చెప్పకుండా, అన్నీ విడిచిపెట్టి ఒంటరిగా బయలుదేరాడు.కొద్దిరోజుల్లోనే పుండరీకుడు కపిల మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు.కపిలుడు ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన వెంటనే, అతడికి నమస్కరించాడు.‘మహర్షీ! నా రాజ్యాన్ని, సర్వసంపదలను విడిచిపెట్టి మీ చెంతకు వచ్చాను. నన్ను శిష్యుడిగా స్వీకరించి, అనుగ్రహించండి’ అని ప్రార్థించాడు.కపిలుడు అతడిని కన్నెత్తి చూడక, పన్నెత్తి పలుకరించక తృణీకరించాడు.అయినా, పుండరీకుడు అక్కడి నుంచి వెనుదిరగలేదు. ఆశ్రమ ప్రాంగణంలోనే కూర్చుని, ధ్యానం చేయడం ప్రారంభించాడు. పద్నాలుగు రోజులు అలాగే అన్నపానాదులు లేకుండా, ధ్యానంలో ఉన్నాడు. అతడి పరిస్థితి చూసి, కపిలుడి మనసు కరిగింది.శిష్య సమేతంగా పుండరీకుడి వద్దకు వెళ్లి, అతడిని పలకరించాడు.పుండరీకుడు కన్నీళ్లతో కపిలుడికి నమస్కరించాడు. తనను అనుగ్రహించాలని ప్రార్థించాడు.కపిలుడు అతడికి కర్మ, భక్తి, జ్ఞాన యోగాలను బోధించాడు.పుండరీకుడు కపిలుడినే గురువుగా భావించి, అతడు ఉపదేశించిన మంత్రాన్ని జపిస్తూ, చిరకాలం తపస్సు కొనసాగించాడు.పుండరీకుడి తపస్సుకు ప్రసన్నుడైన శ్రీమహావిష్ణువు అతడికి ప్రత్యక్షమయ్యాడు.పుండరీకుడు కోరుకున్నట్లుగానే అతడికి మోక్షాన్ని అనుగ్రహించాడు.- సాంఖ్యాయనపురావిశేషం..శ్రావణమాసంలో దేశవ్యాప్తంగా చాలాచోట్ల శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చేస్తారు. ఇవి చాలామందికి తెలిసిన ఆచారాలే! కొంకణ ప్రాంతంలో శ్రావణమాసంలో ‘చుడీపూజ’ పేరుతో గాజుల పూజ చేస్తారు. తులసికోట వద్ద గాజులు, పువ్వులు, పండ్లు ఉంచి పూజ జరిపి, మహిళలకు ఫలతాంబూలాలతో పాటు గాజులను కూడా పంచిపెడతారు. శ్రావణమాసంలో శుక్రవారం, ఆదివారం రోజుల్లో తులసికోటకు, సూర్యుడిని పూజించి, మహిళలకు గాజులు కానుకగా ఇస్తారు. ఇవే రోజుల్లో కొందరు ‘దేవీసాధన’ పేరిట అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుపుతారు. -
కూరగాయలలో రారాజు
వంకాయ దాదాపు ప్రపంచవ్యాప్తంగా దొరుకుతుంది. ఏడాది పొడవునా పండుతుంది. వంకాయ ప్రస్తావన ప్రాచీన సాహిత్యంలోనూ కనిపిస్తుంది. బహు భాషలలో కవుల ప్రశంసలు పొందిన ఘనత కూరగాయలలో వంకాయకు మాత్రమే ప్రత్యేకం. వంకాయ తొలుత భారత్ సహా దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాలలో పండేది. ఈ ప్రాంతం నుంచి పశ్చిమాసియాకు, ఉత్తరాఫ్రికాకు చేరింది. అక్కడి నుంచి మధ్యయుగాల నాటికి యూరోప్ దేశాలకు చేరింది. వంకాయలో వందలాది రకాలు ఉన్నాయి. వంకాయతో వందలాది వంటకాలు ఉన్నాయి. వంకాయ ఉత్పాదనలో ఇప్పటికీ ఆసియా దేశాలే ముందంజలో ఉంటున్నాయి. వంకాయ విశేషాలను గణాంకాలలో తెలుసుకుందాం.వంకాయలో పోషకాలుబరువు తగ్గాలనుకునేవారికి, మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి వంకాయ తగిన ఆధరువు. వంకాయలో అతి తక్కువ కేలరీలు ఉంటాయి. ఇందులో కొవ్వులు నామమాత్రంగా ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వంద గ్రాముల వంకాయలు 20 కిలోకేలరీల శక్తిని మాత్రమే ఇస్తాయి. వంకాయలోని పోషకాల వివరాలు...వంకాయ ఉత్పాదనలో చైనా, భారత్ మొదటి రెండు స్థానల్లో ఉన్నా, ఎగుమతుల విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. వంకాయలు ఎక్కువకాలం నిల్వ ఉండవు. కాబట్టి వీటిని సుదూర దేశాలకు ఎగుమతి చేయడం దాదాపు అసాధ్యం. తగిన చల్లదనంలో భద్రపరచి, సమీప దేశాల్లోని మార్కెట్లలోకి మాత్రమే వీటిని ఎగుమతి చేసే వీలుంటుంది. వంకాయ ఎగుమతుల గణాంకాలు చూద్దాం. -
మెన్ మేకప్ మంత్రం!
ముఖంపై మచ్చలు, మొటిమలు, డార్క్ సర్కిల్స్ మగాళ్లను వదిలేస్తాయా? మరి ఫేస్ కాస్త ఫ్రెష్‌గా, షార్ప్‌గా కనిపించడానికి అబ్బాయిలు మేకప్ చేసుకుంటే తప్పేంటి? కానీ, ఇక్కడ రూల్ ఒక్కటే... మేకప్ కనిపించకూడదు. కానీ, లుక్ మాత్రం అదిరిపోవాలి. అందుకే, అబ్బాయిల సింపుల్ మేకప్ గైడ్ ఇప్పుడు మీకోసం..ముందు మేల్కొలుపు!ఒక్కసారిగా ముఖంపై ఫౌండేషన్ పూసుకుంటే, మేకప్ కూడా షాక్ అవుతుంది! ముందుగా ఫేస్‌వాష్‌తో ముఖాన్ని క్లీన్ చేసుకొని, తర్వాత చర్మం కొద్దిగా తడిగా ఉన్నప్పుడే తేలికపాటి మాయిశ్చరైజర్ లేదా హైడ్రేటింగ్ జెల్ రాయండి. చర్మం డ్రైగా ఉంటే మేకప్ పొరలుగా కనిపిస్తుంది. ముక్కు, నుదురు, గడ్డం చుట్టూ ఆయిల్ ఎక్కువగా వస్తే అక్కడ మాత్రమే కొద్దిగా ప్రైమర్ వాడండి. అంతేకానీ... ప్రైమర్‌తో ముఖంపై సిమెంట్ కోటింగ్ వేయొద్దు!ఎక్కడ అవసరమో... అక్కడే!రోజువారీ లుక్కు లైట్ బీబీ క్రీమ్ లేదా టింటెడ్ ఫ్లూయిడ్ సరిపోతుంది. ముఖం మధ్యలో కొద్దిగా పెట్టి బయటివైపు బ్లెండ్ చేయండి. ఎక్కడైనా మొటిమ, మచ్చ లేదా రెడ్నెస్ ఉంటే అక్కడ మాత్రమే స్కిన్ టోన్ కు మ్యాచ్ అయ్యే కన్సీలర్ పెట్టండి. చిన్న డాట్... చిన్న ట్యాప్... అంతే!షాడో కావాలి... షో కాదు!మెన్ కాంటూరింగ్ అంటే ముఖంపై బ్రౌన్ గీతలు గీసుకుని కొత్త మ్యాప్ తయారు చేయడం కాదు! జా లైన్ కింద, చెంప ఎముకల కింద, ముక్కు పక్కన సహజంగా పడే నీడను, కూల్ టోన్ కాంటూర్ స్టిక్ లేదా మ్యాట్ బ్రాంజర్‌తో కాస్త హైలైట్ చేయడమే.కనుబొమ్మలు కూడా ముఖ్యమే!జుట్టు దువ్వుకుంటారు... గడ్డం సెట్ చేసుకుంటారు... కానీ కనుబొమ్మల సంగతే మర్చిపోతారు! అవి ముఖానికి ఫ్రేమ్లాంటివి. క్లీన్ స్పూలీతో పైకి, బయటికి బ్రష్ చేసి సెట్ చేయండి. ఖాళీలు ఉంటే మీ సహజ రంగుకు దగ్గరగా ఉండే బ్రో పెన్సిల్‌తో చిన్న చిన్న హెయిర్ స్ట్రోక్స్ వేయొచ్చు.గడ్డంలో దొరకకూడదు!మేకప్ వేసుకున్నట్టు కనిపించే అబ్బాయిల దగ్గర ఒక కామన్ తప్పు... గడ్డంలో ఇరుక్కున్న పౌడర్! బేస్ వేసుకున్న తర్వాత శుభ్రమైన, కొద్దిగా తడిగా ఉన్న స్పూలీతో గడ్డం, మీసాలను మెల్లగా బ్రష్ చేయండి. అదనపు పౌడర్, క్రీమ్ తొలగిపోతాయి. అప్పుడు గడ్డం కూడా సహజంగా కనిపిస్తుంది.పెదాలకు కూడా అవసరమే!పెదాలు పొడిబారిపోయి ఉంటే... ఎంత గ్రూమింగ్ చేసినా లుక్ పూర్తిగా రాదు. అలాగని లిప్‌స్టిక్ వేయొద్దు. నేచురల్ లేదా మ్యాట్ ఫినిష్ ఉన్న లిప్ బామ్ వాడండి. అయితే మరీ షైనీగా ఉండే దాన్ని వాడితే... దొరికిపోతారు!ఫైనల్ ఇంటర్వ్యూ!మేకప్ అయిపోయిందా? వెంటనే బయటికి వెళ్లొద్దు. ముందుగా సహజమైన వెలుతురులో ముఖాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. కొన్నిసార్లు లైట్ మిమ్మల్ని మోసం చేయొచ్చు. కిటికీ దగ్గర నిలబడి చూడండి. మేకప్ గీతలు, కలర్ తేడాలు, ఎక్కువగా కనిపించే కాంటూర్ ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకోండి.మచ్చలు, డార్క్ సర్కిల్స్ దాక్కోని, జా లైన్ హైలైట్ అవ్వాలి. కాని మేకప్ మాత్రం ఎక్కడా కనిపించకూడదు! బదులుగా... ‘ఏంటి బ్రో... ఇంత హ్యాండ్సమ్గా కనిపిస్తున్నావ్?’ అని మాత్రం అందరూ అడగాలి! అదే అసలు సీక్రెట్ మేకప్ స్టయిల్! -
నా కధే కాస్త వెరైటీ!
కొన్ని ప్రయాణాలకు మ్యాప్ కంటే, మలుపులే ఎక్కువ! నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ జీవిత ప్రయాణం కూడా అలాంటిదే. ఎన్నో ట్విస్టులు, మలుపులు దాటుకుంటూ, సీరియస్ విషయాల్నీ సరదాగా తీసుకోవడం నేర్చుకున్న ఆమె– తన నవ్వుల మధ్యే దాగున్న ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మనతో పంచుకున్నారు.ఎటు తీసుకెళ్తే .. అటు.. చిన్నప్పటి నుంచి రకరకాల సంస్కృతుల మధ్య పెరిగాను. బహ్రెయిన్ లో పుట్టి, శ్రీలంకలో మాస్ కమ్యూనికేషన్స్ చదివి, టీవీ రిపోర్టర్‌గా పనిచేశాను. 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంక కిరీటం గెలిచిన, తర్వాత ముంబై వచ్చి సినిమాల్లోకి అడుగుపెట్టాను. ఇలా జీవితం ఎటు తీసుకెళ్తుంటే అటు వెళ్తూ హ్యాపీగా ఉంటున్నా.అమ్మకి నేనొక ‘బటర్‌ఫ్లై’!నా కెరీర్లో ఎన్ని ఎత్తుపల్లాలు వచ్చినా మా అమ్మానాన్నలు మాత్రం ఎప్పుడూ నా పక్కనే ఉన్నారు. అమ్మ నన్ను ప్రేమగా ‘బటర్‌ఫ్లై’ అని పిలుస్తుంది. ఆ మాట వింటే చాలు, నేనింకా చిన్న పాపనే అనిపిస్తుంది.భయపెట్టాలని ఉందినన్ను ఎక్కువగా కమర్షియల్, కామెడీ సినిమాల్లో చూసి ఉంటారు. అయితే, లాస్ ఏంజెలెస్‌లో ఇవానా చబ్బక్ దగ్గర యాక్టింగ్ మాస్టర్ క్లాసెస్ చేసినప్పటి నుంచే నా స్క్రిప్ట్ సెలెక్షనే మారిపోయింది. నటిగా భిన్నమైన జానర్స్ చేయాలని ఉంది. భయపెట్టే పాత్రలు చేయాలని ఉంది.నా శరీరమే నాకు థ్యాంక్స్ చెప్పింది!శాకాహారిగా మారిన తర్వాత నా శరీరంలో చాలా మార్పులు గమనించాను. మొటిమలు తగ్గిపోయాయి. బరువు కంట్రోల్లో ఉంటోంది. ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోయాయి. నాకు మాత్రం మొక్కల ఆధారిత ఆహారం చాలా బాగా పనిచేసింది. అయితే ఇలా అందరికీ సరిపోవాలని లేదు కదా!ముంబైకి వచ్చాక... మళ్లీ మొదటి నుంచి!ముంబైకి వచ్చాక హిందీ నేర్చుకోవడం దగ్గర్నుంచి ప్రతి అడుగూ ఒక సవాలే. ‘అలాదిన్ ’ నుంచి ‘కిక్’, ‘హౌస్‌ఫుల్’, ‘రేస్ 3’ వరకు వచ్చిన ప్రతి సినిమా ఎన్నో నేర్పించింది. ప్రస్తుతం ఇంగ్లిష్, హిందీతో పాటు స్పానిష్, ఫ్రెంచ్, అరబిక్ కూడా మాట్లాడగలను. నా రెస్టరెంట్లో అమ్మమ్మ వంటకాలు!ఇప్పుడు కాస్త ఆహారంపై శ్రద్ధ చూపిస్తున్నా. కానీ, నేనొక ఫుడీని. అందుకే శ్రీలంకలో రెస్టరెంట్ కూడా పెట్టాను. అక్కడి మెనూలో మా అమ్మమ్మ పాత రెసిపీ పుస్తకంలో ఉన్న కొన్ని వంటకాలనే పెట్టా. అమ్మమ్మ చేతి రుచిని ఇలా అందరితో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది.రహస్యంగా వీడియో తీశారు!ఒకసారి ఢిల్లీలో రెస్టరెంట్లో స్నేహితుడితో మాట్లాడుతున్న నన్ను ఎవరో రహస్యంగా వీడియో తీశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. నేను కోపం తెచ్చుకోకుండా, ఆ వీడియో కింద ‘ఔను... అది నేనే’ అని కామెంట్ చేశాను. ఇలాంటి విషయాలను హాస్యంగా తీసుకుంటేనే మంచిది.నా కొత్త మోజు!నా బ్యాగ్‌లో ఎప్పుడూ చాలా లిప్స్టిక్స్ ఉంటాయి! లిప్స్టిక్స్ ఎన్ని ఉన్నా ఇంకా కొత్తవి కావాలనిపిస్తూనే ఉంటుంది. ఇటీవల చెస్ నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఇప్పుడు ఖాళీ సమయం దొరికితే చాలు చెస్ బోర్డు ముందు కూర్చుంటాను. -
మెదడుకు కావాలి ఒక సెలవు
ఉదయం మీరు లేవకముందే లేస్తుంది. మంచం దిగక ముందే పని మొదలుపెడుతుంది. రాత్రి నిద్రపోయాక కూడా పని చేస్తూనే ఉంటుంది. ఆఫీస్‌కు వెళ్లినా... ఇంట్లో ఉన్నా... ట్రిప్‌కు వెళ్లినా... ఒక్క సెకను కూడా విరామం తీసుకోకుండా... ప్రతి మెసేజ్‌లు చదువుతుంది... రీల్స్ చూస్తుంది... పనులు ప్లాన్ చేస్తుంది... భవిష్యత్తు గురించి భయపడుతుంది... ఇంత చేసినా... జీతం అడగదు... బోనస్ కోరదు... అదే మన మెదడు! ఇలా 24 గంటలు... 365 రోజులు... ఓవర్‌టైమ్ చేసే మెదడుకు? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైద్యులు, మనోవైజ్ఞానిక నిపుణులు ఒకటే చెబుతున్నారు. శరీరానికే కాదు... మెదడుకూ ఒక సెలవు అవసరం! అదే ఆరోగ్యమూ కూడా!బ్రెయిన్ హాలిడే ఎలా పుట్టిందిఇది క్యాలెండర్లో ఉండే పండుగ కాదు... ఎవరో ఒక్కరు కనిపెట్టిన ఆవిష్కరణా కాదు. 2000ల తర్వాత స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా, 24/7 వర్క్ కల్చర్, వర్క్ ఫ్రం హోమ్, డిజిటల్ జీవితం పెరిగేకొద్దీ... మానసిక అలసట, బర్నౌట్, స్క్రీన్ ఒత్తిడిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. అప్పుడు వైద్యులు, మనోవైజ్ఞానిక నిపుణులు, నిద్రా నిపుణులు ఒకే మాట చెప్పారు... ‘మెదడు కూడా విశ్రాంతి కోరుకుంటుంది.’ అలా అప్పటి నుంచి డిజిటల్ డిటాక్స్, మైండ్‌ఫుల్‌నెస్, స్లో లివింగ్ వంటి భావనలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. అలా ఇవన్నీ చేస్తున్నప్పటికీ మెదడు ఇంకా బ్రేక్ కోరుకుంటూనే ఉంది. అందుకే, ఇప్పుడు తాజాగా... పూర్తి బ్రెయిన్ హాలిడే ట్రెండ్ మొదలైంది. ఇది ఒక ట్రావెల్ డెస్టినేషన్ కాదు. మెదడుకు ఇచ్చే చిన్న విరామం.హాలిడే... మెదడుకే ఎందుకు?శరీరం అలసిపోతే మనకు వెంటనే తెలుస్తుంది. కాళ్లు నొప్పి, కళ్లు బరువు, నీరసం, కానీ మెదడు అలసిపోతే? అదే పనిని మళ్లీ మళ్లీ వాయిదా వేయడం; చిన్న విషయానికే చిరాకుపడటం; ఏకాగ్రత లేకపోవడం; ఏమీ చేయాలనిపించకపోవడం; ఎప్పుడూ ఫోన్ చూడాలనిపించడం– ఇలా చిన్న చిన్న సిగ్నల్స్ ఇస్తుంది. అప్పుడు ‘కాఫీ తాగాలి’ అనుకునే ముందు ‘ఒక్క బ్రేక్ తీసుకోవాలి’ అని ఆలోచించండి.అంటే ఏంటి?బ్రెయిన్ హాలిడే అంటే, చాలామంది ఏదైనా కొండెక్కి, చెట్టు కింద కూర్చుని ధ్యానం చేయాలని అనుకుంటారేమో! కానీ, బ్రెయిన్ హాలిడే అంటే అది కాదు. మెదడుకి కాసేపు ‘ఏం చేయొద్దు బాస్!’ అని చెప్పడమే. అసలూ ఏ పనీ లేకుండా, కాసేపు ఏమీ ఆలోచించకుండా అలా కూర్చోవడమే అసలైన బ్రెయిన్ హాలిడే! అయితే ఇదే ఇప్పుడు చాలామందికి కష్టంగా మారింది.ఎందుకంటే, ఒకప్పుడు ‘ఏమీ చేయకుండా ఉండటం’ బద్ధకం అంటుంటే, ఇప్పుడది ఒక విలాసమే! కాదు, అవసరం కూడా! ఎందుకంటే, 2025లో 36,245 మందిపై జరిగిన 54 పరిశోధనల విశ్లేషణలో బోర్ కొట్టే భావనకు, లేజీనెస్‌కు సంబంధం లేదని తేల్చారు. మరోవైపు, అమెరికాలో 2025లో నిర్వహించిన సర్వేలో 62 శాతం మంది ‘ఫోన్ లేకున్నా, ఏ పని చేయకుండా ఉన్నా, ఆందోళనగా అనిపిస్తుంద’ని చెప్పారు. దీంతో ఆరోగ్యం కోసం శరీరానికే కాదు, బ్రెయిన్‌కి కూడా విరామం తప్పనిసరి అయింది.ఫోన్ పక్కన పెట్టినా సరిపోదు!బ్రెయిన్ హాలిడే కోసం ‘ఫోన్ ఎక్కువగా వాడొద్దు’ అనేది కొత్త సలహా కాదు. కానీ అసలు సమస్య ఏంటంటే... ఫోన్ మన చేతిలో ఉన్నంతకాలం అది కేవలం ఫోన్ గా ఉండటం లేదు! అది ఆఫీస్, సినిమా హాల్, షాపింగ్ మాల్, న్యూస్ చానెల్స్, ఫ్రెండ్స్, బ్యాంక్, కెమెరా, మ్యాప్, ఎంటర్టైన్మెంట్... ఇలా ఒకేసారి అన్నీ అయిపోతోంది! ఇలా ప్రతి చిన్న ఖాళీని ఫోన్ తో నింపేస్తుండటంతో మన మెదడుకి కాసేపు ఊపిరి పీల్చుకునేంత ఖాళీ కూడా దొరకడం లేదు. అందుకే కొన్ని దేశాల్లో ఫోన్ రహిత కార్యక్రమాలు, ఫోన్ లేకుండా గడిపే సమావేశాలు, తెరలకు దూరంగా ఉండే అనుభవాలు పెరుగుతున్నాయి.బ్రిటన్ లో 2024 నుంచి 2025 మధ్య ఇలాంటి ఫోన్ రహిత కార్యక్రమాలకు హాజరయ్యే వారి సంఖ్య 21 శాతం పెరిగిందని ‘ది గార్డియన్ ’ అనే సర్వే నివేదించింది. కానీ ఇక్కడే మరో ఆసక్తికరమైన విషయం! ఫోన్ కి దూరంగా ఉండటమూ కూడా మెదడుకి పూర్తి సెలవు కాదని కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి. ఫోన్ లేకపోయినా మన మనసు, మెదడును మరో ఆలోచనతో బిజీగానే ఉంటుంది. మరి మెదడుకి కావాల్సిన సెలవు ఏంటి? అనేదే ఇక్కడ అసలు ప్రశ్న!ఖాళీగా ఉండటం కష్టమైపోయింది?ఒకప్పుడు ఖాళీ దొరికితే, కాసేపు అలా కూర్చునేవాళ్లం. కిటికీలోంచి బయటకు చూస్తూ ఏవేవో ఆలోచించేవాళ్లం. ఇప్పుడు మాత్రం రెండు నిమిషాలు ఖాళీగా ఉంటే చాలు... ‘ఏదైనా చూద్దాం!’ అంటూ ఫోన్ చేతిలోకి వచ్చేస్తుంది. బోర్ కొట్టినా ఫోన్ ... ట్రాఫిక్‌లో వాహనాలు కదలకపోయినా ఫోన్ ... భోజనం ముందున్నా ఫోన్ ... ఎవరైనా రెండు నిమిషాలు ఆలస్యమైనా ఫోన్ ... చివరికి నిద్ర రావడం లేదని ఫోన్ తీసుకుని, ఫోన్ చూసి నిద్ర పారిపోయిందని బాధపడటం కూడా మనదే! ఇలా మన జీవితంలో దొరికే ప్రతి చిన్న ఖాళీని సందేశాలు, వార్తలు, చిన్నచిన్న వీడియోలు, ప్రకటనలు, వినోదంతో నింపేస్తున్నాం. అసలు మనకు బోర్ కొట్టడం లేదు... బోర్ కొట్టేంత ఖాళీనే ఇవ్వడం లేదు! అందుకే, ప్రస్తుతం చాలామందికి ఖాళీగా ఉండటమే అసలైన పెద్ద సమస్యగా మారింది.ట్రిప్‌కి వెళ్లి... ట్రాప్‌లో పడొద్దు!హాలిడే అంటే ఒత్తిడికి బ్రేక్ చెప్పడానికి వెళ్లేది. కానీ చాలామంది ట్రిప్‌కి వెళ్లాక కూడా అదే టెన్షన్ ను వెంట తీసుకెళ్తారు. ఎక్కడ తినాలి? ఏం చూడాలి? ఫొటోలు ఎన్ని తీయాలి? రీల్ ఎప్పుడు పెట్టాలి? ఆఫీస్ మెయిల్ వచ్చిందా? ఇలా ట్రిప్‌ని కూడా మరో పనిలా చేస్తుంటారు. అందుకే, ఈసారి ట్రిప్‌కు వెళ్లినప్పుడు, హాలిడే ట్రాప్‌లో పడకుండా ఉండాలంటే ఇవీ గుర్తుంచుకోండి!ప్లాన్ మొత్తం ముందే!చివరి నిమిషంలో టికెట్లు, హోటళ్లు, బ్యాగులు, బడ్జెట్ గురించి టెన్షన్ పడితే, హాలిడే మొదలయ్యేలోపే మెదడు అలసిపోతుంది. అందుకే ముందుగానే ప్లాన్ చేసుకోండి. అప్పుడే ప్రయాణం మొదలయ్యే ముందే హాలిడే ఫీలింగ్ మొదలవుతుంది.కొత్త ప్రదేశం... కొత్త మెదడు!ఎప్పుడూ చూసిన రోడ్లు, అదే రెస్టరెంట్లు, అదే రొటీన్ ... ఇవి మెదడుకు కొత్తదనం ఇవ్వవు. కొత్త ప్రదేశాలు, కొత్త రుచులు, కొత్త అనుభవాలు మాత్రం మెదడుకు చిన్న పండుగలాంటివి.అడ్రెస్ మర్చిపోకండి!కొత్తదనం బాగానే ఉంటుంది. కానీ మరీ దారి తెలియని అడవులు, భాష రాని ఊళ్లు, ప్లాన్ లేని ప్రయాణాలు– చివరికి హాలిడేను సర్వైవల్ చాలెంజ్‌గా మార్చొచ్చు. కొత్తదనం ఉండాలి, కానీ కంఫర్ట్ కూడా ఉండాలి.సరైన వాళ్లతో వెళ్లండి!ట్రిప్‌ను గుర్తుండిపోయేలా చేసేది ప్రదేశం కంటే... తోడున్న వాళ్లు. నవ్వించే వాళ్లతో వెళ్లండి. ప్రతి ఐదు నిమిషాలకు గొడవపడే వాళ్లతో కాదు, లేకపోతే ట్రిప్ ముగిసేలోపే గ్రూప్ కూడా ముగిసిపోతుంది!బ్రెయిన్ కు వార్మప్!రోజంతా స్క్రీన్ లో మునిగిపోయిన మెదడు– హాలిడే మొదలైందని ఒక్కసారిగా ప్రశాంతంగా మారదు. అందుకే ట్రిప్‌కు కొన్ని రోజుల ముందే రాత్రిళ్లు ఫోన్ ను కాస్త దూరంగా పెట్టడం, ప్రశాంతంగా గడపడం అలవాటు చేసుకోండి.మొదటి రోజే మ్యాజిక్!ట్రిప్‌లో మొదటి అనుభవాలే ఎక్కువకాలం గుర్తుంటాయి. అందుకే మొదటి రోజే మీకు బాగా నచ్చే పని చేయండి. మంచి సూర్యోదయం కావచ్చు, ఇష్టమైన రెస్టరెంట్ కావచ్చు, ఎప్పటి నుంచో చూడాలనుకున్న ప్రదేశం కావచ్చు.ట్రిప్ ముగిసిందా... పరవాలేదు!హాలిడే ముగిసిన వెంటనే రొటీన్ లోకి దూకేయకండి. సూట్‌కేస్ తెరిచినంత ఈజీగా మెదడు హాలిడే మూడ్ నుంచి బయటకు రాదు. ఇంటికి వచ్చాక నెమ్మదిగా గడపండి. ట్రిప్ ఫొటోలు చూడండి. జ్ఞాపకాలను గుర్తు చేసుకుని నవ్వుకోండి. ఆఫీస్ పనులకు దూరంగా ఉండండి.హాలిడే అంటే కేవలం ప్రదేశం మార్చడం కాదు, మనసును మళ్లీ ఉల్లాసపరచడం! అలా ఉల్లాసపరచాక వెంటనే, తిరిగి వెంటనే కష్టపెట్టకుండా జాగ్రత్తగా చూసుకోండి.సెలవిస్తే... ఏం లాభం?రోజంతా ఆగకుండా పరిగెత్తిన మెదడుకు కూడా కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం దొరికితే? ముందుగా ఒత్తిడి తగ్గుతుంది. మనసు తేలికగా అనిపిస్తుంది. ఏకాగ్రత మెరుగవుతుంది. చిన్న చిన్న విషయాలకే వచ్చే చిరాకు తగ్గుతుంది. నిర్ణయాలు కూడా స్పష్టంగా తీసుకోగలుగుతాం. కొన్నిసార్లు గంటల తరబడి ఆలోచించిన సమస్యకు... నిశ్శబ్దంగా కూర్చున్న పది నిమిషాల్లోనే పరిష్కారం దొరుకుతుంది.కొత్త ఉత్సాహం మొదలవుతుంది... చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందం కనిపించడం మొదలవుతుంది. ముఖ్యంగా ఎప్పుడూ ఏదో ఒకటి చూస్తూ, వింటూ, స్క్రోల్ చేస్తూ, ఆలోచిస్తూ ఉండే మెదడుకు కాసేపు విరామం దొరుకుతుంది. అక్కడే కొత్త ఆలోచనలు పుడతాయి. కొన్నిసార్లు జీవితాన్ని మార్చే ఐడియాలు కూడా అక్కడి నుంచే మొదలవుతాయి. అందుకే మెదడుకు హాలిడే అంటే సమయాన్ని వృథా చేయడం కాదు. ఆలోచనలకు కొత్త చిరునామా ఇవ్వడం కూడా!ఆఫ్‌లో ఉన్నప్పుడే ఆన్ !మన మెదడు ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. కానీ మనం కాసేపు చేసేపనిని ఆపేసినప్పుడు, మెదడు కూడా పూర్తిగా ఆగిపోదు. బదులుగా ‘డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్’ (డీఎమ్ఎన్) అనే సిస్టమ్ యాక్టివ్ అయి, ఆ రోజంతా దొరికిన సమాచారాన్ని మెదడు సర్దుకుంటుంది. పాత జ్ఞాపకాలను కొత్త సమాచారంతో కలుపుతుంది. సంబంధం లేని రెండు ఆలోచనల మధ్య కొత్త లింక్ కూడా కనిపెడుతుంది. అందుకే, షవర్లో ఉన్నప్పుడు సూపర్ ఐడియా రావడం; వాకింగ్ చేస్తుంటే సమస్యకు సొల్యూషన్ దొరకడం; నిద్రకు ముందు ఒక్కసారిగా ‘అరే... ఇదే కదా!’ అనిపించడం; ఇవన్నీ అంత యాదృచ్ఛికం కాకపోవచ్చు! అందుకే, మీరు పూర్తిగా బ్రెయిన్‌కి సెలవు ఇవ్వాలంటే ఈ చిన్న చిన్న పనులను తప్పకుండా చేయాలి.అన్నింటికీ దూరంగా.. మెదడుకు హాలిడే ఇవ్వాలంటే ముందుగా దానికి వచ్చే సమాచార ప్రవాహాన్ని తగ్గించాలి. వారానికి ఒకరోజు డిజిట్ డిటాక్స్: ఒంటరిగా ఉండటం, ఎక్కడికీ వెళ్లకుండా ఉండటం, ఇంటి పనులకు కూడా దూరంగా ఉండడం లాంటి చిన్న మార్పులు ఉపయోగపడొచ్చు.కళ్లకు 20 –20 బ్రేక్! మొదడకు హాలిడే ఇచ్చేటప్పుడు ప్రకృతితో 20 నిమిషాల డీల్‌ని తప్పకుండా చేసుకోవాలి. ఎందుకంటే, పచ్చని చెట్లు, ఓపెన్ స్పేస్, నిశ్శబ్దమైన వాతావరణాన్ని అలా ఒక ఇరవై నిమిషాలు చూస్తే, అదే మెదడుకు మంచి బ్రేక్! అయితే, హాలిడేకి వెళ్లేంత బడ్జెట్, టైమ్ లేనివాళ్లు, ప్రతి 20 నిమిషాలకు... 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును అసలు ఏమీ ఆలోచించకుండా కనీసం 20 సెకన్లు చూస్తే చాలు.డూ నథింగ్!ఇది చాలా కష్టం! ఎందుకంటే, మనకు చిన్నప్పటి నుంచి ‘ఖాళీగా కూర్చోకు!’, ‘ఏదో ఒకటి చేయి!’, ‘టైమ్ వేస్ట్ చేయకు!’ అంటూనే పెంచుతారు. కానీ, మెదడు ఎప్పుడూ పనిలోనే ఉండాల్సిన అవసరం లేదు కాసేపు ఖాళీగా కూర్చోవటం. ఒంటరిగా గడపటం వంటివేవి ఎవరూ నేర్పించరు. ఇవన్నీ మీ ఆరోగ్యం కోసం మీరే నేర్చుకోవాలి.నిశ్శబ్దమూ కావాలి!రోజులో కొద్దిసేపు ఇష్టమైన పాట వినండి. వర్షం శబ్దం వినండి. పక్షుల కిలకిలలు వినండి. మెదడుకు నిరంతరం కంటెంట్ మాత్రమే కాదు, అప్పుడప్పుడు కాస్త నిశ్శబ్దమూ కావాలి!నిద్రతో రీచార్జ్!మెదడుకు అసలు విశ్రాంతి ఇచ్చేది అంతరాయం లేని మంచి నిద్ర. నిద్రలోనే మెదడు రోజంతా సేకరించిన సమాచారాన్ని క్రమబద్ధీకరిస్తుంది. అందుకే హాలిడేలో కనీసం ఒకరోజైనా అలారం లేకుండా ప్రశాంతంగా నిద్రపోండి.చిన్న హాలిడే! మెదడుకు హాలిడే ఇవ్వాలంటే ఒకరోజు మొత్తం ఖాళీ చేయాల్సిన అవసరం లేదు. రోజుకు 15–30 నిమిషాల చిన్న విరామమే చాలాసార్లు మంచి ఆరంభం అవుతుంది. కాసేపు అన్నింటినీ పక్కన పెట్టి, నిశ్శబ్దంగా నడవండి. ఈ చిన్న అలవాటే, మెదడుకు మంచి హాలిడే!ఒక్కరోజు ప్రయోగం!ఒక్కరోజు మీ మెదడును వీఐపీ గెస్ట్‌లా ట్రీట్ చేసి చూడండి. ఉదయం లేచిన వెంటనే ప్రపంచాన్ని కాదు, మీ చుట్టూ ఉన్న ప్రశాంతతను పలకరించండి. రోజంతా తొందరపడకుండా, ఒకసారి ఒక పనికే సమయం ఇవ్వండి. మధ్యలో కొద్దిసేపు నిశ్శబ్దాన్ని ఆస్వాదించండి. సాయంత్రం మీకు నిజంగా ఆనందం ఇచ్చే పనిలో మునిగిపోండి. రాత్రి నిద్రకు గంట ముందు అన్నింటినీ పక్కన పెట్టి, మీ మెదడుకు కూడా ‘ఇవాళ్టి డ్యూటీ అయిపోయింది... వెళ్లి హాయిగా నిద్రపో!’ అని చెప్పండి.ఇది కేవలం సరదా చాలెంజ్ కాదు, చిన్న సైన్స్ కూడా! కొన్ని పరిశోధనల ప్రకారం మన మెదడు రోజుకు సుమారు ఆరువేలకు పైగా ఆలోచనలు చేస్తుంది. అలాంటి మెదడుకు కొద్దిసేపు నిశ్శబ్దం దొరికినా, రోజంతా సేకరించిన సమాచారాన్ని క్రమబద్ధీకరించుకునే అవకాశం లభిస్తుంది. అలాగే ప్రకృతిలో కేవలం 20 నిమిషాలు గడిపినా ఒత్తిడి తగ్గుతుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఒక్క రోజు ఇలా గడిపి చూడండి– వచ్చే హాలిడే కోసం ఎదురుచూసేది మీరు కాదు, మీ మెదడే! కుటుంబంలో అందరికీ!బ్రెయిన్ హాలిడే అంటే ఉద్యోగస్తులకు మాత్రమే కాదు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికీ అవసరమే. పిల్లలు రోజంతా చదువు, హోంవర్క్, క్లాసులతో అలసిపోతారు. టీనేజర్లు సోషల్ మీడియా, పరీక్షల ఒత్తిడితో సతమతమవుతారు. తల్లిదండ్రులు ఉద్యోగం, ఇంటి పనులు, బాధ్యతల మధ్య తమ కోసం క్షణం కూడా కేటాయించలేరు. పెద్దవాళ్లు కూడా ఆందోళనలు, ఆరోగ్య సమస్యలతో మానసికంగా అలసిపోతారు.అందుకే వారానికి ఒకరోజు ఇంట్లో ‘నో స్క్రీన్ డే’ పెట్టండి. టీవీ ఆఫ్, ఫోన్లు పక్కన, ల్యాప్‌టాప్‌లకు సెలవు. కలిసి అల్పాహారం చేయండి... పార్క్‌కు వెళ్లండి... బోర్డ్ గేమ్స్ ఆడండి... పాత ఫొటోలు చూస్తూ నవ్వుకోండి... లేదా గంటసేపు కబుర్లు చెప్పుకోండి. ఆ రోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు... ఆ రోజు జ్ఞాపకం మీ మెదడులో సేవ్ అయితే చాలు! కొన్నిసార్లు కుటుంబంతో కలిసి గడిపే క్షణాలు కూడా బెస్ట్ హాలిడేనే! శరీరానికి విశ్రాంతి ఇస్తే, అలసట పోతుంది. మనసుకు ప్రశాంతత ఇస్తే, ఉల్లాసం వస్తుంది. అదే మెదడుకు సెలవిస్తే, జీవితం మళ్లీ కొత్తగా కనిపిస్తుంది. ఎందుకంటే, మెదడు హ్యాంగ్ అయితే జీవితం బఫరింగ్‌లో పడిపోతుంది!∙కొండి దీపిక -
మెరిసే ముఖానికి కుంకుమాది తైలం
ముఖానికి నూనెలు పట్టించుకోవడం భారతీయ సౌందర్యపోషణ పద్ధతుల్లో పురాతన కాలం నుంచి ఉంది. ముఖానికి పూసుకొనే నూనెలు చర్మానికి పోషణను అందించడంలో సమర్థంగా పనిచేస్తాయి. ముఖానికి రాసుకొనే నూనెల్లో కుంకుమాది తైలం ఎంతో ప్రసిద్ధి చెందింది. చర్మానికి యవ్వనాన్ని, మెరుపును ప్రసాదించేదిగా ఈ తైలానికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే దీనిని ఆనాటి ప్రాచీన ఈజిప్ట్ రాణి క్లియోపాత్రా సైతం ఉపయోగించేదట! ఆధునిక కాలంలో దీనినే గోల్డెన్ సీరమ్‌గా పిలుస్తున్నారు.పదేపదే తాకవద్దు!మనం నిర్లక్ష్యం చేసే చిన్నచిన్న అలవాట్లు మన చర్మ సౌందర్యానికి ఎంతగానో హాని చేస్తాయి. అదే తరచుగా ముఖాన్ని చేతివేళ్లతో తాకడం. ఒక వ్యక్తి సగటున గంటకు 23 సార్లు తన ముఖాన్ని తాకుతుంటాడని కొన్ని పరిశోధనల్లో తేలింది. దీనివల్ల చేతిపై ఉన్న బ్యాక్టీరియా, దుమ్ము, ధూళి నేరుగా చర్మ రంధ్రాల్లోకి చేరుతుంది. అలాగే ఫోన్ స్క్రీన్‌ను చెంపకు ఆనించి ఉంచడం వల్ల దానిపైన ఉండే క్రిములు, దుమ్ము నేరుగా చర్మ రంధ్రాల్లోకి చేరిపోతాయి. దీనివల్ల చర్మంపై మొటిమలు, నల్లటి మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ వైప్స్ లేదా మైక్రోఫైబర్ క్లాత్‌తో ఫోన్‌ను తరచుగా తుడుస్తుండాలి. అంతేకాకుండా ముఖాన్ని పదేపదే చేతులతో రుద్దడం వల్ల కొలాజెన్ తగ్గిపోయి చర్మం సాగిపోతుంది. అందువల్ల ఫోన్‌ను తరచుగా శుభ్రం చేసుకోవడం, చేతివేళ్లను ముఖానికి ఆనించడం వంటి పొరపాట్లు చేయకుండా చూసుకోవడం ద్వారా సగం చర్మ సమస్యల్ని తగ్గించుకోవచ్చు.(చదవండి: సీతాఫలం... పోషకాల సిరులఫలం) -
వంటింట్లోనే రెస్టారెంట్ రుచి.. ఈ రెసిపీలు ట్రై చేయండి!
రోజూ ఒకే రకమైన వంటకాలతో బోర్ కొడుతుందా? అయితే ఈసారి కాస్త వెరైటీగా, ఇంట్లోనే సులభంగా చేసుకునే రుచికరమైన వంటకాలను ట్రై చేయండి. పనసకాయ దమ్ బిర్యానీ, ఆకాకరకాయ వేపుడు, సబుదానా వడ.. మూడు వంటకాలూ రుచితో పాటు మీ భోజనానికి మంచి వెరైటీని తీసుకొస్తాయి.సబుదానా వడకావలసినవి:సగ్గుబియ్యం: కప్పు,బంగాళాదుంపలు: 2 పెద్దవి (ఉడికించి మెత్తగా చిదుముకోవాలి),వేయించిన పల్లీల పొడి: 1/2 కప్పు,పచ్చిమిర్చి: 3 (సన్నగా తరిగినవి),అల్లం తరుగు: టీస్పూన్,జీలకర్ర: టీస్పూన్,నిమ్మరసం: టీస్పూన్,కొత్తిమీర తరుగు: 2 టేబుల్ స్పూన్లు,ఉప్పు: రుచికి సరిపడా,నూనె: వేయించడానికి సరిపడా.తయారీ:ముందుగా సగ్గుబియ్యాన్ని 2–3 సార్లు శుభ్రంగా కడిగి, నీళ్లు పోసి కనీసం 4 నుంచి 5 గంటలు నానబెట్టాలి.తర్వాత అదనంగా ఉన్న నీటిని వంపేయాలి.తరువాత ఒక వెడల్పాటి గిన్నెలో బాగా నానిన సగ్గుబియ్యం, ఉడికించి, చిదుముకున్న బంగాళాదుంపలు, పల్లీల పొడి, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు వేసి చపాతీ పిండిలా బాగా కలుపుకోవాలి.చేతులకు కొద్దిగా నూనె లేదా నీళ్లు రాసుకుని, మిశ్రమాన్ని చిన్న నిమ్మకాయ సైజు ఉండలుగా చేసి, అరచేతిలో పెట్టి వడలాగా ఒత్తుకోవాలి.మందం ఎక్కువగా లేకుండా, పగుళ్లు రాకుండా చూసుకోవాలి. తరువాత కడాయిలో నూనె వేడి చేసి.. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి వడలను ఒక్కొక్కటిగా వేయాలి.ఒక నిమిషం పాటు కదపకుండా ఉంచి, తర్వాత రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించి తీసేయాలి. అంతే వేడి వేడి సబుదానా వడ రెడీ!పనసకాయ దమ్ బిర్యానీకావలసినవి:పచ్చి పనసకాయ ముక్కలు: 250 గ్రాములు,బాస్మతీ బియ్యం: రెండు కప్పులు (నానబెట్టినవి),పెరుగు: 1/2 కప్పు,అల్లంవెల్లుల్లి పేస్ట్: ఒకటిన్నర టీ స్పూన్,కారం: సరిపడా,పసుపు: 1/2 టీ స్పూన్,బిర్యానీ మసాలా: ఒకటిన్నర టీ స్పూన్,ధనియాల పొడి: టీ స్పూన్,ఉల్లిపాయలు: 2 (సన్నగా తరిగి ఫ్రై చేసినవి),పచ్చిమిర్చి: 4 (నిలువుగా చీల్చినవి),పుదీనా, కొత్తిమీర: గుప్పెడు,హోల్ బిర్యానీ దినుసులు, నెయ్యి, నూనె: సరిపడా,నిమ్మరసం: టేబుల్ స్పూన్,ఉప్పు: రుచికి సరిపడా.తయారీ:ఇందుకోసం కుక్కర్లో పనసకాయ ముక్కలు, కొద్దిగా నీళ్లు, పసుపు, పావు టీస్పూన్ ఉప్పు వేసి మీడియం మంటపై ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించి నీళ్లు వడకట్టండి.తరువాత ఈ పనస ముక్కలలో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, బిర్యానీ మసాలా, ధనియాల పొడి, సగం ఫ్రైడ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం, సరిపడా ఉప్పు, స్పూన్ నూనె వేసి బాగా కలిపి మ్యారినేట్ చేయండి.మరొక పెద్ద పాత్రలో నీళ్లు మరిగించి, అందులో షాజీరా, ఏలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, సరిపడా ఉప్పు, స్పూన్ నూనె వేయండి.నీళ్లు మరిగాక నానబెట్టిన బాస్మతీ బియ్యం వేసి 70 శాతం వరకు ఉడికించి నీళ్లను వడకట్టండి.అనంతరం బిర్యానీ పాత్రలో 2 స్పూన్ల నూనె, స్పూన్ నెయ్యి వేసి మ్యారినేట్ చేసిన పనసకాయ ముక్కలను వేసి సన్నని మంటపై 5 నిమిషాలు మగ్గనివ్వండి.దీనిపైన ఉడికించిన బాస్మతీ బియ్యాన్ని లేయర్‌గా పరవండి. దానిపైన మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా నెయ్యి వేయండి.మూతపెట్టి ఆవిరి బయటకు పోకుండా 5 నిమిషాలు మీడియం మంటపై, ఆ తర్వాత 10–12 నిమిషాలు సన్నని మంటపై దమ్ చేయండి. అంతే çఘుమఘుమలాడే పనసకాయ దమ్ బిర్యానీ రెడీ!ఆకాకరకాయ వేపుడుకావలసినవి:ఆకాకరకాయలు: 250 గ్రాములు (సన్నగా కట్ చేసిన ముక్కలు),ఉల్లిపాయ: 1 పెద్దది (సన్నగా తరిగినది),పసుపు: 1/2 టీస్పూన్,కారం: రుచికి తగినట్లు,ధనియాల పొడి: టీస్పూన్,వెల్లుల్లి రెబ్బలు: 6 (కచ్చాపచ్చాగా దంచినవి),ఉప్పు: రుచికి సరిపడా,నూనె: 3 టేబుల్ స్పూన్లు,తాళింపు గింజలు: టీస్పూన్,ఎండుమిర్చి: 2,కరివేపాకు: ఒక చిన్న రెమ్మ.తయారీ:ఆకాకరకాయలను శుభ్రంగా కడిగి, సన్నని చక్రాల్లా లేదా పొడవు ముక్కలుగా కట్ చేసుకోవాలి.తరువాత ఒక మూకుడులో నూనె వేడి చేసి కట్ చేసుకున్న ఆకాకరకాయ ముక్కలు, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి బాగా కలపండి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌పై దోరగా వేయించండి.ముక్కలు సగం వేగాక, వాటిని బాణలికి ఒకవైపు జరిపి, మిగిలిన నూనెలో తాళింపు గింజలు, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి, కరివేపాకు వేసి వేయించండి.తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి.ఇప్పుడు ఉల్లిపాయలు, ఆకాకరకాయ ముక్కలన్నింటినీ బాగా కలుపుకోవాలి.చివరగా కారం, ధనియాల పొడి వేసి.. ముక్కలు క్రిస్పీగా అయ్యే వరకు వేయించి దించేయండి.వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని ఈ ఫ్రైౖ తింటే చాలా రుచిగా ఉంటుంది. -
వానాకాలంలో ఈ గాడ్జెట్లు రెడీగా పెట్టుకోండి!
వాన వస్తూ వస్తూ... చిన్న చిన్న ఆనందాలతో పాటు కొన్ని చికాకులను కూడా తెస్తుంది. ఎప్పుడు కరెంట్ పోతుందో, ఎప్పుడు చలి పెరుగుతుందో, ఎప్పుడు ఏది తినాలనిపిస్తుందో అస్సలు అర్థం కాదు. అందుకే, ఇలాంటి వానాకాలపు చికాకులకు చెక్ పెట్టేందుకు కొన్ని క్యూట్ గాడ్జెట్లే ఇవి!చిన్న సూర్యుడు!దుప్పటి కప్పుకున్నా సరే... చేతులు మాత్రం చలికి బయటకు రావడానికి ఒప్పుకోవడం లేదా? ఇలాంటి సమయంలో పెద్ద హీటర్ పెట్టి గది నిండా వేడి చేయాల్సిన పనిలేదు. ఈ చిన్న హీటర్ ఉంటే చాలు. ఎక్కువ స్థలం ఆక్రమించకుండా గోడకు అమర్చేయొచ్చు. ఇందులోని రెండు రకాల గాలి వేగాలతో కావాల్సినంత వెచ్చదనాన్ని వెంటనే పొందొచ్చు. పెద్ద శబ్దం చేయకుండా పనిచేయడం వలన చదువుకునేటప్పుడు, పని చేసేటప్పుడు, నిద్రపోయేటప్పుడు కూడా ఇబ్బంది ఉండదు. బెడ్రూమ్, చిన్న ఆఫీస్, స్టడీ రూమ్, వర్క్‌స్పేస్ వంటి చిన్న ప్రదేశాల్లో వ్యక్తిగత వెచ్చదనం కోసం ఉపయోగపడుతుంది. కేవలం 200 గ్రాముల బరువుండటంతో ఒక చోటు నుంచి మరోచోటుకు తీసుకెళ్లడమూ ఈజీ. వర్షాకాలంలో చలి పెరిగినప్పుడు... చిన్న గదికి ఇది చిట్టి హీటింగ్ బడ్డీ! ధర రూ.700.చిల్ బ్రో.. లైట్ తీసుకో!వర్షాకాలం వచ్చిందంటే చాలు... వాన ఒకవైపు, కరెంట్ కోతలు మరోవైపు! చీకట్లో టార్చ్ కోసం వెతికే టెన్షన్ లేకుండా ఈ చిన్న రీచార్జబుల్ హ్యాంగింగ్ బల్బ్‌ను ఇంట్లో ఉంచుకుంటే చాలు. కరెంట్ పోయిన వెంటనే వెలిగించేయొచ్చు. హుక్తో ఎక్కడైనా వేలాడదీయొచ్చు. అవసరమైతే చేతిలో పట్టుకుని తీసుకెళ్లొచ్చు. మూడు లైటింగ్ మోడ్స్ ఉండటంతో అవసరాన్ని బట్టి వెలుతురు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. రెండు గంటలు పూర్తిగా చార్జ్ చేస్తే, దాదాపు 8 గంటల వరకు పనిచేస్తుంది. బలమైన, నీటిని తట్టుకునే డిజైన్ ఉండటంతో ఔట్‌డోర్ వినియోగానికీ పనికొస్తుంది. రెండు బల్బుల ప్యాక్ కావడంతో ఇంట్లో ఒకటి, కారు, ట్రావెల్ బ్యాగ్‌లో మరొకటి పెట్టుకోవచ్చు. ధర రూ. 450 మాత్రమే!పొగ లేదు, పొయ్యి లేదు... గ్రిల్రెడీ!బార్బెక్యూ తినాలనిపిస్తే బొగ్గులు వెతకాలి... పొయ్యి వెలిగించాలి... పొగతో ఇల్లు నింపాలి! ఇక ఈ హడావుడంతా ఎందుకు? ఈ ఎలక్ట్రిక్ బార్బెక్యూ గ్రిల్ ఉంటే చాలు... ప్లగ్ పెట్టి గ్రిల్ మొదలుపెట్టేయొచ్చు. 2000 వాట్ల పవర్‌తో పనీర్, కబాబ్స్, కూరగాయలు, స్క్యూయర్స్ ఇలా నచ్చినవన్నీ గ్రిల్ చేసుకోవచ్చు. ఉష్ణోగ్రతను మనకు కావాల్సినంత సర్దుకోవచ్చు. బొగ్గులు, కట్టెలు, పొయ్యి అవసరం లేదు... పొగ కూడా తక్కువగా ఉండేలా రూపొందించారు. కింద ఒక ట్రే ఉండటంతో శుభ్రం చేయడమూ ఈజీ. గ్రిల్లింగ్ ర్యాక్, స్క్యూయర్ సపోర్ట్ ఉండటంతో ఒకేసారి రకరకాల వంటకాలు సిద్ధం చేసుకోవచ్చు. వంటగదిలోనే కాదు... బాల్కనీ, టెర్రస్ లేదా చిన్న గ్యాదరింగ్లోనూ వాడుకోవచ్చు. అంటే... బార్బెక్యూ కోసం బయటకు వెళ్లాల్సిన పని లేదు. ధర రూ.1,800. -
సీతాఫలం... పోషకాల సిరులఫలం
వానాకాలంలో దొరికే పండ్లలో సీతాఫలం ప్రత్యేకమైనది. సీతాఫలం పోషకాల సిరులఫలం. సీతాఫలాల ఉత్పాదనలో మన భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. దక్షిణ అమెరికా, మధ్య అమెరికా, కరీబియన్ దీవులకు స్థానిక ఫలమైన సీతాఫలం కూడా పోర్చుగీసు వర్తకుల ద్వారా పదహారో శతాబ్దిలో భారత్‌కు చేరింది. సీతాఫలాన్ని అమితంగా ఇష్టపడే భారతీయులు ఈ పంటను విరివిగా పండిస్తూ ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకున్నారు. సీతాఫలం విశేషాలు గణాంకాల్లో...సీతాఫలాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతి వంద గ్రాముల సీతాఫలం 94 కిలోకేలరీల శక్తినిస్తుంది. ఇందులో 71 శాతం నీరు ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. సీతాఫలంలో పోషకాల వివరాలు...(చదవండి: మధుమేహం వల్ల వినికిడి శక్తి తగ్గుతుందా?) -
బక్కగా ఉన్నా.. ఈ లేయరింగ్లతో బాస్‌లా కనిపించొచ్చు!
అందరికీ సిక్స్‌ప్యాక్ హీరోలే నచ్చితే, మరి స్లిమ్బాబులను ఎవరు చూస్తారు? సన్నగా ఉండటం క్రైమ్ కాదు, స్టయిల్‌గా లేకపోవడమే సమస్య. అందుకే, మరి స్లిమ్ అబ్బాయిలు కూడా స్టయిలిష్ హీరోల్లా మెరవాలంటే ఈ మూడు గోల్డెన్ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే!ఒక్క టీషర్ట్‌తో సరిపెట్టొద్దు... లేయర్లు వేసుకోండి!ప్లెయిన్ టీషర్ట్ ఒక్కటే వేసుకుని బయటికి వస్తే, మీ బాడీ ఎంత సన్నగా ఉందో అదే హైలైట్ అవుతుంది. అందుకే స్టయిల్లో మొదటి మంత్రం... లేయరింగ్! తెల్లటి లేదా సాలిడ్ టీషర్ట్‌పై చెక్స్ షర్ట్ వేసుకుని, బటన్లు మాత్రం వేయొద్దు. ఓపెన్ గా వదిలేస్తే చాలు! ఒక్కసారిగా లుక్‌లో డెప్త్ వచ్చేస్తుంది. చలికాలమైతే హుడీపై డెనిమ్ జాకెట్ లేదా ఓవర్షర్ట్ ట్రై చేయండి. చూసేవాళ్లు... ‘జిమ్ మొదలుపెట్టాడేమో!’ అని అనుకునేంత మార్పు ఒక్కసారిగా కనిపిస్తుంది.స్కిన్నీ జీన్స్‌తో యుద్ధం ఆపేయండి!సన్నగా ఉన్న అబ్బాయిలు చేసే అతి పెద్ద పొరపాటు– స్కిన్నీ జీన్స్. అవి వేసుకుంటే కాళ్లు జీన్స్‌లో ఉన్నాయా, లేక జీన్స్ కాళ్లకు అతుక్కుపోయాయా అన్న డౌట్ వస్తుంది! దానికి బదులుగా స్ట్రెయిట్ ఫిట్ జీన్స్, రిలాక్స్డ్ ఫిట్ ప్యాంట్స్, చినోస్ లేదా కార్గోస్ ఎంచుకోండి. ఇవి బాడీకి సరైన బ్యాలెన్స్ ఇచ్చి, లుక్‌ను కాస్త బల్కీగా చూపిస్తాయి. గుర్తుంచుకోండి... ప్రతి ట్రెండ్ మన కోసం కాదు, మనకు సెట్ అయ్యేదే అసలు ట్రెండ్.యాక్సెసరీస్‌ను బోల్డ్‌గా ఉంచండిసన్నగా ఉన్నవాళ్లు మరీ సన్నటి చైన్లు, చిన్న రింగులు, చిన్న డయల్ వాచ్‌లు.. ఇవన్నీ స్లిమ్ లుక్‌ను ఇంకా హైలైట్ చేస్తాయి. కానీ స్టయిల్ కనిపించదు. అందుకే కాస్త పెద్ద డయల్ ఉన్న వాచ్, బోల్డ్ ఫ్రేమ్ సన్ గ్లాసెస్, కొంచెం మందంగా ఉండే బ్రేస్లెట్ లేదా చైన్ ఎంచుకోండి. ఇవి మీ లుక్కు వెయిట్ ఇవ్వడమే కాదు, కాన్ఫిడెన్స్‌ను కూడా పెంచుతాయి.బాడీని మార్చడానికి నెలలు పడుతుంది... కానీ స్టయిల్‌ను మార్చుకోవడానికి మూడు నిమిషాలు చాలు! కాబట్టి బక్కగా ఉన్నందుకు బాధపడటం మానేసి, సరైన దుస్తులను ఎంచుకోండి. స్టయిల్‌గా కనిపించండి. -
శ్వేతాశ్వం..! ప్రేమ కోసం శ్మశానానికి వెళ్లిన రాజకుమారి..
కుండిన రాజ్యం రాజు ప్రతాపవర్మకు కాంచనవల్లి ఒకతే కూతురు. ఆమెకు అన్ని విద్యలూ నేర్పాడు. తనకు కొడుకులు లేరని తెలిస్తే, పొరుగు రాజ్యాల రాజులు ఎక్కడ దండెత్తి వస్తారోననే భయంతో తనకు ఏకైక కుమారుడు ఉన్నట్లు, అతడి పేరు కాంచనవర్మ అని లోకాన్ని మభ్యపెట్టసాగాడు.కాంచనవల్లి తరచుగా మగవేషంలో వనవిహారానికి, దేశాటనకు వెళుతూ వుండేది. అలా ఒకసారి తన భటులు, మగవేషం ధరించిన కొందరు చెలికత్తెలతో వనవిహారానికి వెళ్ళినప్పుడు ఒక పచ్చగడ్డి బయలులో గడ్డిమేస్తున్న మేలుజాతి శ్వేతాశ్వం కనిపించింది.దాన్నిచూసి ముచ్చటపడిన కాంచనవల్లి– తన భటులకుచెప్పి, అశ్వశాలకు తరలించింది. ఆరాత్రి ఎంతసేపటికీ ఉదయం అడవి నుంచి తెచ్చిన శ్వేతాశ్వం మీది ఆలోచనలే కలుగుతుండటంతో ఒకసారి చూడాలని అశ్వశాలకు వెళ్ళింది. కాని, అక్కడ గుర్రానికి కట్టిన తాడు మాత్రమే ఉంది తప్ప, గుర్రం కనిపించలేదు. అశ్వశాల కాపలాదారును అడిగితే, వణికిపోతూ తాను జాగ్రత్తగానే కాపలా ఉన్నానని, కానీ గుర్రం ఎలా మాయమైందో తెలియలేదని చెప్పాడు. యువరాణి మర్నాడు తగిన చర్యలు తీసుకోవచ్చని, తన మందిరానికి తిరిగివచ్చి నిద్రపోయింది.ఉదయాన్నే అశ్వశాల కాపలాదారు పరుగు పరుగున వచ్చి, గుర్రం అశ్వశాలలోనే ఉందని చెప్పాడు. కాంచనవల్లి వెళ్ళి గుర్రాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఆరోజు రాత్రి ఎవరికీ చెప్పకుండా చీకటిపడగానే అశ్వశాల దగ్గర రహస్యంగా కాపుకాసి గుర్రాన్నే పరికిస్తూ ఉండగా ఉన్నట్టుండి ఎవరూ లేని సమయంలో శ్వేతాశ్వం ఒక అందమైన రాజకుమారుడిగా మారి ఆకాశంలోకి ఎగిరెళ్ళిపోయాడు. ఆశ్చర్యంతో ఇదంతా గమనించిన కాంచనవల్లి మర్నాడు సాయంత్రమే గుర్రాన్ని తనమందిరంలో కట్టేయించింది. చీకటివేళకి గుర్రం మనిషిగా మారే సమయంలో పెద్ద పంజరంలో ఎగరనివ్వకుండా బంధించి ‘ఎవరు నువ్వు?’ అని అడిగింది.దానికతను గిర్రున తిరుగుతూ, ‘నేను మాళవరాజ్య యువరాజును. ఒక గంధర్వకాంత అడవిలో విహరిస్తుండగా, తనను చూసినందుకు ప్రతిరాత్రి మనిషిగా మారి ఆకాశంలో గిరికీలు కొట్టమని, పగలు శ్వేతాశ్వంగా బతకమని నన్ను శపించింది’ అని చెప్పాడు. అతని కథ విని విచారించిన కాంచనవల్లి, శాపవిమోచనం గురించి అడిగింది.‘ఊరికి ఉత్తరాన ఉన్న శ్మశానంలో ఒకరాత్రి నిద్రచేసిన అమ్మాయిని పెళ్ళిచేసుకుంటే నాకు శాపవిమోచనం కలుగుతుందని గంధర్వకాంత చెప్పింది. అలాంటి అమ్మాయి కోసం ప్రతిరోజూ ప్రయత్నిస్తున్నాను. కానీ, భయంవల్ల ఎవరూ సాహసించడం లేదు’ అని చెప్పి వాపోయాడు రాజకుమారుడు.అప్పుడు కాంచనవల్లి నవ్వి ‘త్వరలోనే నీకోరిక నెరవేర్చుతాను’ అని పలికి తన మందిరంలోనే అశ్వాన్ని వుంచి కాపలాదారుల్ని పెట్టింది.మరునాటి రాత్రి యువరాణి కనిపించక రాజు, రాణి కంగారు పడ్డారు. సైనికులు నలుదిక్కులా వెదకడానికి వెళ్ళారు. తెలతెలవారుతుండగా కాంచనవల్లి తానే గుర్రంపైన కోటలోకి ప్రవేశించింది. అదిచూసి రాజు ‘రాత్రంతా ఏమైపోయావు’ అని కంగారుగా అడిగాడు. ఆమె నేరుగా శ్వేతాశ్వం దగ్గరికెళ్ళి ’ఈ గుర్రాన్ని పెళ్ళికొడుకులా అలంకరించండి. రాత్రికి నేను పెళ్ళాడుతాను’ అని చెప్పి, తన మందిరానికి వెళ్ళి వివాహానికి కావలసిన ఏర్పాట్లలో మునిగిపోయింది.అందరూ అయోమయంతో పెళ్ళిసన్నాహాలు పూర్తిచేశాక, చీకటివేళ పీటమీద నిలబడ్డ గుర్రం రాజకుమారుడిగా మారాడు. వెంటనే కాంచనవల్లి తన మెడలో తాళి కట్టి శాప విమోచన పొందమని చెప్పగానే, రాజకుమారుడు ఆమె మెడలో తాళి కట్టాడు. అప్పుడు కాంచనవల్లి, తాను రాత్రంతా ఈ యువరాజుని శాపవిముక్తుడిని చేసి పెళ్ళాడాలని సంకల్పించుకుని, శ్మశానంలో ఒంటరిగా గడిపి వచ్చానని చెప్పింది.యువరాజుకి శాపవిముక్తి కలిగి మరెపుడూ అశ్వంగా మారలేదు. మాళవ రాజ్యంతో పాటు కాంచనవల్లితో కలిపి కుండిన రాజ్యాన్ని కూడా కలుపుకుని చాలాకాలం హాయిగా పరిపాలన సాగించాడు.- డేగల అనితాసూరి -
పెళ్లైన మహిళల్లో ఆ సమస్య ఎందుకు వస్తుంది?
నా వయసు ఇరవై ఆరు సంవత్సరాలు. పెళ్లై మూడేళ్లు అయింది. నాకు ప్రతి నెలా యోనిలో దురద వస్తోంది. కొన్నిసార్లు ఆ భాగం ఎర్రగా కూడా మారుతోంది. మందులు వాడినా మళ్లీ మళ్లీ వస్తోంది. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది?– రాజేశ్వరి, నంద్యాలమీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే, మీకు యోని ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంది. ఇది మహిళల్లో చాలా సాధారణంగా కనిపించే సమస్య. ముఖ్యంగా పెళ్లైన మహిళల్లో, ప్రసవ వయసులో ఉన్నవారిలో ఈ సమస్య అప్పుడప్పుడు లేదా తరచుగా మళ్లీ మళ్లీ రావచ్చు. సాధారణంగా యోనిలో కొన్ని మేలు చేసే సూక్ష్మజీవులు సహజంగానే ఉంటాయి. ఇవి ఆ ప్రాంతాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే కొన్ని కారణాల వల్ల శిలీంద్రాల పెరుగుదల అధికమైతే ఈ సమతుల్యత దెబ్బతిని ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ సమస్య ఉన్నప్పుడు యోని లోపల, బయట తీవ్రమైన దురద ఉంటుంది. ఆ భాగం ఎర్రగా మారుతుంది. మంటగా అనిపిస్తుంది. మూత్రం విసర్జించే సమయంలో మంట కలగవచ్చు. ఎక్కువగా గోకడం వల్ల గీతలు పడే అవకాశం ఉంటుంది. అలాగే చిక్కగా, తెల్లగా ఉండే స్రావం కూడా రావచ్చు.ఈ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే...బిగుతుగా ఉండే దుస్తులు ధరించకండి.గాలి సులభంగా ఆడే కాటన్ లోదుస్తులు వాడండి. ∙లోదుస్తులు ఉతికేటప్పుడు బలమైన సువాసన కలిగిన ద్రావకాలు ఉపయోగించకండి.యోని భాగంలో సువాసన క్రీములు, సుగంధ ద్రవ్యాలు, స్నాన ద్రావకాలు వాడకండి.మృదువైన సబ్బులు మాత్రమే ఉపయోగించండి.వైద్యుల సలహా లేకుండా యాంటీబయోటిక్ మందులు తీసుకోవద్దు.ఆ భాగాన్ని ఎప్పుడూ శుభ్రంగా, పొడిగా ఉంచుకోండి.కొంతమందిలో ఈ ఇన్ఫెక్షన్ దానంతట అదే తగ్గిపోవచ్చు. అయితే చాలామందికి మాత్రం సరైన చికిత్స అవసరమవుతుంది. తరచుగా మళ్లీ మళ్లీ వస్తుంటే దానిని నిర్లక్ష్యం చేయకూడదు. అలాంటి సందర్భాల్లో కారణాన్ని తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు అవసరమవుతాయి. యోని నుంచి నమూనా తీసి పరీక్ష చేయడం ద్వారా ఏ రకమైన ఇన్ఫెక్షన్ ఉందో, ఏ శిలీంద్రం కారణమైందో, దానికి ఏ మందు ప్రభావవంతంగా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు. అలాగే మూత్ర పరీక్షలు, రక్తంలో చక్కెర స్థాయులు, శరీర రోగనిరోధక శక్తికి సంబంధించిన పరీక్షలు కూడా అవసరమవుతాయి. మధుమేహం ఉన్నవారిలో లేదా రక్తంలో చక్కెర స్థాయులు అధికంగా ఉన్నవారిలో ఇలాంటి ఇన్ఫెక్షన్లు తరచు కనిపిస్తాయి.కొన్నిసార్లు ఇతర వైరస్ ఇన్ఫెక్షన్లు లేదా రోగనిరోధక శక్తి తగ్గడం కూడా దీనికి కారణం కావచ్చు. అందుకే, తరచుగా వచ్చే యోని ఈస్ట్ ఇన్ఫెక్షన్ చికిత్సను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. సాధారణంగా ఫ్లుకోనాజోల్ 150 మిల్లీగ్రాముల మాత్రను మూడు రోజులకోసారి చొప్పున మొత్తం మూడు మోతాదులు ఇవ్వవచ్చు. ఆ తర్వాత ఇన్ఫెక్షన్ మళ్లీ రాకుండా ఉండేందుకు నిర్వహణ చికిత్సలో భాగంగా వారానికి ఒక మాత్ర చొప్పున ఆరు నెలల పాటు వాడాలని వైద్యులు సూచిస్తారు. లేదా క్లోట్రిమాజోల్ 500 మిల్లీగ్రాముల మాత్రలను రెండు వారాల పాటు వాడమని చెప్తారు. అనంతరం ఆరు నెలల పాటు వారానికి ఒకసారి చొప్పున వాటిని ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగే యోని నుంచి నమూనా సేకరించి పరీక్ష చేయించడం ద్వారా ఏ రకమైన శిలీంద్రం కారణమైందో గుర్తించి, దానికి తగిన చికిత్స అందిస్తారు. ఇలా పూర్తి చికిత్స తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గడమే కాకుండా, మళ్లీ మళ్లీ వచ్చే అవకాశాన్ని కూడా గణనీయంగా తగ్గించవచ్చు.మేనిమాట! మెదడులో చెత్తబండి!మనం దుప్పటి కప్పుకుని రాత్రిళ్లు ‘ఆఫ్’లో ఉంటే.. మెదడు మాత్రం ‘క్లీనింగ్ మోడ్ ఆన్ !’ చేసి, వ్యర్థాలను బయటకు పంపే పనిలో బిజీగా ఉంటుంది. అవును.. నిద్రలో ‘గ్లింపాటిక్ సిస్టమ్’ చురుగ్గా పనిచేసి, మెదడులో పేరుకునే కొన్ని వ్యర్థ పదార్థాలను ‘సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ’ ప్రవాహం ద్వారా తొలగించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా స్లో వేవ్ స్లీప్ సమయంలో ఈ ప్రక్రియ మరింత చురుగ్గా సాగుతుంది.- డా, భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
బడబానల తీర్థం.. పూర్వం ఒకానొక కాలంలో..
పూర్వం ఒకానొక కాలంలో మహర్షులందరూ నైమిశారణ్యంలో సుదీర్ఘ సత్రయాగాన్ని ప్రారంభించారు. ఆ యాగంలో మృత్యువును శమితృ పదవిలో నియోగించారు. ఆ సత్రయాగం కొనసాగుతున్న కాలంలో మృత్యువు యజ్ఞకార్యంలో నియుక్తమై ఉన్నందున మానవులు మృత్యువాత పడకుండా, అమరులుగా మారిపోయారు. భూలోకంలో మరణాలు పూర్తిగా లేకుండా పోయి, జననాలు అంతకంతకు పెరగసాగాయి. మర్త్యుల రాకడ ఆగిపోవడంతో స్వర్గలోకం వెలవెలబోసాగింది.మృత్యువు తన విధి నిర్వర్తించడంలో ఉపేక్ష వహిస్తూ, యజ్ఞకార్యంలో నిమగ్నం కావడం వల్ల దేవతలు దిక్కుతోచనివారయ్యారు. చివరకు దేవతలందరూ కలసి రాక్షసుల వద్దకు వెళ్లి, ‘మీరంతా వెళ్లి మునులు సాగిస్తున్న సత్రయాగాన్ని ధ్వంసం చేయండి’ అని చెప్పారు.‘మునుల యాగాన్ని నిష్కారణంగా ధ్వంసం చేస్తే మాకు ఒరిగేదేమిటి?’ అని అడిగారు రాక్షసులు.‘మీకు యాగార్ధభాగాన్ని ఇస్తాం’ అని చెప్పారు దేవతలు.అప్పుడు మునుల యాగభంగం చేయడానికి రాక్షసులు అంగీకరించారు. మహర్షులకు ఈ సంగతి తెలిసింది. అప్పుడు వారు, ‘ఓ మృత్యువా! రాక్షసులు యాగభంగం చేయడానికి వస్తున్నారు. ఇప్పుడు మేమేం చేయాలి? తరుణోపాయం నువ్వే చెప్పు!’ అని అడిగారు.‘యాగ సామగ్రినంతా ఇక్కడే విడిచిపెట్టి, అగ్నిని మాత్రం తీసుకుని గౌతమీ తీరానికి వెళ్లండి. అక్కడ పరమశివుడిని ప్రార్థించండి’ అని మృత్యువు చెప్పాడు.మహర్షులు యాగసామగ్రిని ఎక్కడివక్కడే విడిచిపెట్టి, కొంత అగ్నిని తీసుకుని గౌతమీ తీరానికి తరలి వెళ్లారు. యాగకార్యంలో నియుక్తమై ఉన్నందున మృత్యువు కూడా వారిని అనుసరించాడు.మహర్షులందరూ పవిత్ర గౌతమీ నదిలో స్నానమాచరించారు. అనంతరం మహాదేవుడైన పరమేశ్వరుని వేనోళ్ల స్తుతిస్తూ ప్రార్థించసాగారు.అప్పుడు మృత్యువు కూడా మహాదేవుని ప్రార్థించింది. ‘పరమేశ్వరా! శంభో శంకరా! నీవు మహాకాయుడవు, మహానలుడవు, మహానీలుడవు. మహేశ్వరా నీవే మమ్ము రక్షించాలి’ అని ప్రార్థించాడు.పరమశివుడు వారి ప్రార్థనలకు ప్రసన్నుడై అక్కడ ప్రత్యక్షమయ్యాడు.‘వరమేమి కావాలో కోరుకోండి’ అన్నాడు పరమశివుడు.అప్పుడు మృత్యువు ‘పరమేశ్వరా! రాక్షసుల వలన మా యాగానికి మహాపద వాటిల్లింది. మహర్షులు తలపెట్టిన ఈ సత్రయాగం సఫలమయ్యేంత వరకు మమ్మల్నందరినీ నువ్వే రక్షించాలి’ అని ప్రార్థించాడు.పరమశివుడు ‘తథాస్తు!’ అని అనుగ్రహించాడు.పరమశివుడి వరానుగ్రహంతో మృత్యువు సాయంతో మహర్షులు తమ సత్రయాగాన్ని విజయవంతంగా పరిసమాప్తి చేశారు.యాగం పూర్తవుతూనే దేవతలు హవిర్భాగాల కోసం ఒక్కొక్కరే రావడం ప్రారంభించారు.మృత్యువు వారిని చూసి, ‘మా యాగ విధ్వంసానికి మీరు రాక్షసులను ప్రేరేపించారు. హవిర్భాగాహారులైన మీరు అకార్యానికి పాల్పడ్డారు. ఇప్పటి నుంచి మీకు రాక్షసులతో శత్రుత్వం తప్పదు’ అని శపించాడు.మృత్యువు శాప ఫలితంగా దేవతలకు, రాక్షసులకు అప్పటి నుంచి బద్ధవైరం ఏర్పడింది.అప్పుడు మహర్షులు మృత్యువు పట్ల సంప్రీతులయ్యారు. వారు బడబ అనే కృత్యను సృష్టించి, ఆమెతో మృత్యువుకు వేదోక్తంగా వివాహం జరిపించారు. వివాహ సమయంలో బడబకు మంగళస్నానం జరిపించినప్పుడు ప్రవహించిన నీరు అక్కడ బడబానదిగా ప్రవహించింది. వివాహానంతరం మృత్యువు అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ శివలింగం మహానలేశ్వరుడి పేరిట ప్రసిద్ధి పొందింది. అప్పటి నుంచి ఆ తీర్థానికి బడబానల తీర్థమనే పేరు వచ్చింది. మహానలేశ్వరుడు వెలసిన బడబానల తీర్థం భక్తులకు భుక్తి ముక్తిప్రదమైనది. - సాంఖ్యాయనపురావిశేషం..ఈశాన్య రాష్టమైన మేఘాలయలో ఉన్న అరుదైన శివాలయం ఇది. తూర్పు ఖాసీ కొండల ప్రాంతంలోని మావ్సిన్రామ్ గ్రామానికి చేరువలో దట్టమైన అడవిలోని ఒక కొండ గుహలో సహజసిద్ధంగా వెలసిన శివలింగాన్ని ఇక్కడి ప్రజలు తరతరాలుగా పూజిస్తున్నారు. సున్నపురాతి గుహ పైకప్పు నుంచి రాలిన నీటిబిందువులు గట్టిబడి శివలింగం ఆకారం ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, స్థానికులు మాత్రం దీనిని స్వయంభూ లింగంగానే భావించి, పూజిస్తున్నారు. స్థానిక ఖాసీ ప్రజలు దీనిని ‘మావ్జిన్ బుయి’ శివలింగంగా వ్యవహరిస్తారు. ఏటా శ్రావణమాసంలో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాగే, మహాశివరాత్రి పూజలు కూడా ఘనంగా జరుగుతాయి. -
తనలో తానే పాడుకున్న తత్త్వజ్ఞ!
‘మన మాటల్లో అత్యుత్తమమైనవి మనతో మనం చెప్పుకునేవే!’నన్నారు పోలిష్ రచయిత్రి ఓల్గ తొకార్చుక్. ‘మిగతా విషయాలెలా వున్నా, వాటిని ఎవరూ అపార్థం చేసుకోర’ని కూడా అన్నారామె. ఈ మాటలన్న మనిషి, ‘జైళ్ళు మన లోపలే వుంటాయి– బయట వుండవు; ఎటొచ్చీ మనలో చాలామందికి ఈ అంతర్గత కారాగారాల్లో ఎలావుండాలో తెలియదంతే!’ అనడంలో విడ్డూరమేముంది? అయినా, మానసిక చికిత్స పద్ధతుల్లో –క్లినికల్ సైకాలజీలో– పట్టా పొందిన ఓల్గా మాటతీరు మరోలా ఎందుకుంటుంది?ఆమె తల్లి వాండా, తండ్రి జోసెఫ్ ఇద్దరూ ‘పీపుల్స్ యూనివర్సిటీ’లో అధ్యాపకులే. వాస్తవానికి అది ఓ విశ్వవిద్యాలయం కాదు– హైస్కూల్ మాత్రమే. పోలండ్ వాయవ్య ప్రాంతంలోని శివారు నగరం మ్యేర్జిన్లో వుండే జానపద విజ్ఞాన కేంద్రాన్నే ‘పీపుల్స్ యూనివర్సిటీ’గా పిలుస్తారు. జెర్మన్ సరిహద్దులకు కొద్ది నిమిషాల దూరంలో ఉంటుంది మ్యేర్జిన్. పైగా, అప్పట్లో జోసెఫ్ ఆ స్కూల్ లైబ్రరీ కూడా నడిపేవాడు. అలా, చిన్న వయసు నుంచీ ఓల్గ ఆడుకున్నదీ– పాడుకున్నదీ పుస్తకాలతోనే!బాల్యంలో ఓల్గకు నచ్చిన పుస్తకం హెన్రిక్ సియెంకియేవిచ్ రాసిన ప్రేమకథ ‘క్వో–వాడిస్’. 1905లో నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకున్న తొలినాటి రచయిత సియెంకియేవిచ్ రాసిన ఈ ప్రేమకథకే ‘ఎడారి–అడవి’ అనేది మరోపేరు. లాటిన్ భాషలో ఈ ప్రశ్నకు ‘ఎక్కడికి వెళ్తున్నావు?’ అనే అర్థం! నీరో చక్రవర్తి రోమ్ నగర రాజ్యాన్ని పాలించే రోజుల్లో జరిగిన ప్రేమకథగా ఈ నవలను రచించాడు సియెంకియేవిచ్. మరో 113 సంవత్సరాల తర్వాత ఓల్గ కూడా నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకోవడానికి వున్న చారిత్రక నేపథ్యం ఇదన్నమాట. ఈ పరిసరాలే, రచయిత్రిగా ఆమె సొంత గొంతు సవరించడానికి అవసరమైన స్వరాన్నిచ్చాయి.పదహారేళ్ళ ప్రాయంలోనే కలంపట్టి కథనరంగంలోకి దిగింది ఓల్గ! అయితే యువరచయితలకు సహజమైన బెరుకు కారణంగా ఆమె ‘నతాషా బరోదిన్’ అనే మారుపేరును ఆశ్రయించారు. యువ రచయితల కోసం ఉద్దేశించిన ‘కాలిబాట’ అనే చిన్నపత్రికలో అచ్చయిన మొదటి రెండు కథలనూ ఆ పేరుతోనే ప్రచురించారామె. దాదాపు దశాబ్దకాలం ఓల్గ కథలూ కాకరకాయలూ పక్కన పెట్టి సైకో థెరపిస్టుగా ఉద్యోగం చేసుకున్నారు. అప్పట్లో ఆమె విస్తృతంగా కవిత్వం రాశారు; అనేక పత్రికల్లో ప్రచురించారు; విస్తారమైన గుర్తింపు కూడా పొందారు. అప్పట్లోనే ఆమె ఓ కవితా సంపుటి కూడా అచ్చు వేసుకున్నారు. మూడు పదుల వయసు దాటిన తర్వాత, 1996లో ఓల్గ ‘ఆదిమ యుగం– ఇతర యుగాలు’ అనే ప్రయోగాత్మక నవల రాసి పదిమంది దృష్టిలో పడ్డారు. ఈ నవలను ఓల్గ 60 ఖండికలుగా విభజించారు. ఈ ప్రయోగం జాతీయ స్థాయిలో కన్నా, అంతర్జాతీయ స్థాయిలో పెద్దపేరు తెచ్చుకుంది. ఈ పరిణామం వెనుక చిన్న నేపథ్యం లేకపోలేదు!ఇరవయ్యో శతాబ్ది చివర్లో పోలండ్ రాజకీయ– సామాజిక వ్యవస్థ సమూలమైన మార్పులకు గురైంది. అంతర్జాతీయంగా గొర్బచ్యేఫ్, జాతీయ స్థాయిలో పోలిష్ కార్మిక నేత వవుంజా (వలేజా) పరిచయం చేసిన భావాలే ఆ మార్పులకు ప్రాతిపదికలు. పోలండ్ సమాజంలో పడమటి గాలులు బలంగా వీస్తున్న పోకడ కనిపెట్టి ఎందరో సాహిత్యవేత్తలు తమ రంగు మార్చారు. ఎందుకైనా మంచిదని ఓల్గ తొకార్చుక్ కూడా వారిని అనుసరించారు. అలాంటి పెద్దల ప్రోత్సాహంతోనే ఆమె 1990 దశాబ్ది తొలినాళ్ళలో ఓల్గ కొన్నాళ్ళు ఇంగ్లండులో ఉండి, ఆంగ్లభాషా ప్రావీణ్యం సాధించారు. మరో అయిదేళ్ళ తర్వాత ఆమె రెండు స్కాలర్షిప్పులు సంపాదించి అమెరికాలోనూ– జెర్మనీ (బెర్లిన్)లోనూ రెండేళ్ళు గడిపి రావడం ఓల్గ జీవితాన్ని మలుపు తిప్పింది. ఆనాటి నుంచీ ఆమెకి స్వదేశంలో కన్నా విదేశాల్లోనే ఎక్కువ గుర్తింపు దక్కుతూ వచ్చింది. 1999లో ఓల్గ ‘పోలిష్ పెన్ క్లబ్’లో చేరడంతో ఈ మార్పు పరిపూర్ణమైంది. 2014లో ఓల్గ రాసిన ‘ద బుక్స్ ఆఫ్ జేకబ్’ అనే సుదీర్ఘ నవల ఆమె రచనలన్నింట్లోకీ ఉత్తమమని విమర్శకులు అంటారు. పదిహేడో శతాబ్దానికి చెందిన జేకబ్ ఫ్రాంక్ అనే ‘అవతార పురుషుడి’ జీవితకథ నేపథ్యంగా రాసినదీ 900 పేజీల నవల. ఈ నవల రాయడానికి ఓల్గ ఏడేళ్ళపాటు పరిశోధన చేశారట! ఈ నవల రాయడానికి ఏడేళ్ళ ముందు, ఓల్గ ‘దిమ్మరులు’ అనే చారిత్రక నవల పోలిష్ భాషలో వెలువరించారు. ‘ప్రాచీన విశ్వాసులు’గా ప్రసిద్ధులైన ఓ క్రై స్తవ శాఖకు చెందిన సంచారజీవన సమూహాల కథనే ఈ నవలకు ఇతివృత్తంగా తీసుకున్నారు ఓల్గ. 116 ఖండికలుగా ఈ నవలను నిర్మించి ఓల్గ తన ముద్ర గట్టిగానే వేశారు. చిత్రమేమిటంటే, కొన్ని ఖండికలు, ఏకవాక్య నిర్మాణాలే! 2008లో నైకీ సాహిత్య పురస్కారం ఓల్గ రచనకు తొలిసారి దక్కింది.అమెరికన్ అనువాదకురాలు జెనిఫర్ క్రాఫ్ట్ దాని ఆంగ్లానువాదం వెలువరించే వరకూ ఓల్గ రచనకు అంతర్జాతీయ స్థాయిలో పెద్దగుర్తింపు దక్కలేదు (2018 మే నెల్లో ఓల్గ తొకార్చుక్– అమెరికన్ అనువాదకురాలు జెనిఫర్ క్రాఫ్ట్ మ్యాన్ బుకర్ బహుమతి సొమ్మును పంచుకున్నారు– అది అలా వుంచండి!) అదే సంవత్సరం అక్టోబర్‌లో ఓల్గ నోబెల్ సాహిత్యపురస్కారం గెల్చుకోవడానికి మ్యాన్ బుకర్ పురస్కారం ఎంతగానో సహకరించింది. ఈ రెండూ పురస్కారాలు దక్కిన తర్వాతనే, ఓల్గ రచనలకు అనేక భాషల్లో అనువాదాలు వెలువడ్డాయి. అయినా, నోబెల్ పురస్కారం పొందిన వాళ్ళ రచనలను సొమ్ముచేసుకునే సువర్ణావకాశాన్ని పెంగ్విన్ లాంటి వాణిజ్య ప్రచురణ సంస్థలు వదులుకుంటాయా?- మందలపర్తి కిషోర్ -
లెమనేడింగ్ ఏడో రుచి.. కష్టాలను తట్టుకునే శక్తి!
మానవాళికి ప్రకృతి షడ్రుచులను ప్రసాదించింది. శాస్త్రవేత్తలు ఇప్పుడు ఏడో రుచిని కనిపెట్టారు. ఆ ఏడో రుచి పేరే... ‘లెమనేడింగ్’! నిజానికి ఇది రుచి కాదు. కష్టాలు వచ్చినప్పుడు వాటిని సరదాగా తీసుకుని... చేదు అనుభవాల నుండి తీపి అనుభూతులను పొందే జీవన విధానం. ఈ స్వభావం మానవుల్లో మునుపు లేదని కాదు. దాన్నిప్పుడు పరిశోధకులు ఉందని రూఢీగా వెల్లడించారు. చెడు కాలంలోనూ చెదరని గుండెతో ఉండటమే లెమనేడింగ్.‘‘జీవితం మీకు నిమ్మకాయలను ప్రసాదిస్తే, నిమ్మరసమే చేసుకుని తాగండి’’ : 20వ శతాబ్దపు ప్రముఖ అమెరికన్ రచయిత, తత్త్వవేత్త, వ్యాపారవేత్త ఎల్బర్ట్ హబ్బర్డ్ చెప్పిన మాట ఇది. 1909లో ‘లిటరరీ డైజెస్ట్’ అనే పత్రికలో ఎల్బర్ట్ ఇలా రాశారు : ‘విధి తనకిచ్చిన నిమ్మకాయలను తీసుకుని, వాటితో నిమ్మరసం వ్యాపారం మొదలుపెట్టేవాడే అసలైన మేధావి’ – అని. అప్పట్నుంచీ ఈ మాట పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులలో వాడుకగా వినిపిస్తోంది. నిమ్మరసాన్ని ‘లెమనేడ్’ అంటారు. కనుక ఇది ‘లెమనేడ్ ఫిలాసఫీ’ అయింది. తాజాగా అమెరికన్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశీలనలో లెమనేడ్ ఫిలాసఫీ మానవ జీవితానికి ప్రశాంతతను చేకూర్చే మాట నిజమే అని నిర్థారణ అవటం విశేషం!నవ్వుతూ బతకాలిరా..!జీవితాన్ని సరదాగా తీసుకునే అలవాటు వల్ల కష్టాలను తట్టుకునే శక్తి పెరుగుతుందట! కష్టాలు, అడ్డంకులు ఎదురైనప్పుడు మనుషులు ఆ పరిస్థితులకు ఎలా స్పందిస్తారో తెలుసుకోవడానికి ఇటీవల శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అధ్యయనం కోసం వారు కోవిడ్–19 సమయంలోని 503 మంది అమెరికన్ల ప్రవర్తన, వారి భావోద్వేగాలను పరిశీలించారు.ఈ పరిశీలనలో శాస్త్రవేత్తలు ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనించారు. జీవితాన్ని కాస్త సరదాగా, ప్రశాంతంగా తీసుకునే మనస్తత్వం ఉన్నవారు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను నిజాయితీగా అంగీకరిస్తూనే, భవిష్యత్తు పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారని తేలింది. వీరు తమకు ఎదురయ్యే సవాళ్లకు త్వరగా అలవాటు పడటమే కాకుండా, రోజువారీ పనులను ఆనందంగా, ఆ పనుల్లో లీనమై మరీ చేయగలిగారు. ఎలాంటి కష్టాలనైనా తట్టుకునే శక్తిని (రెజిలియన్స్) కనబరచారు.ఆలోచనా విధానాన్ని, ప్రవర్తనను మార్చుకుంటూ, సృజనాత్మకంగా ఆలోచిస్తూ, అనుకూలమైన ఫలితాల కోసం ప్రయత్నించే ఈ అలవాటుకు శాస్త్రవేత్తలు ‘లెమనేడింగ్’ అని పేరు పెట్టారు. అంటే ‘చేదు’ లాంటి కష్టాలను కూడా నిమ్మరసంలా తీపిగా/సానుకూలంగా మార్చుకోవడం. దీనినే ఇంకోలా చెప్పాలంటే – జీవితంలో మనకు ఏది ఎదురైతే దానినే, దాని కోసమే ఎదురు చూస్తున్నట్లుగా స్వీకరించటం.చేదులోనే తియ్యని రుచి!జీవితాన్ని కాస్త సరదాగా తీసుకోవడం అంటే, మనం ఉన్న పరిస్థితిని తేలికగా తీసుకుంటున్నామని కాదు, ఆ పరిస్థితిని ఎదుర్కొనే శక్తి మనలో పెరుగుతోందని అర్థం అని పరిశోధకులు చెబుతున్నారు. కోవిడ్–19 లాక్డౌన్ సమయంలో ప్రజల అనుభవాలను వీరు అధ్యయనం చేసినప్పుడు ఓ నిజం వెల్లడైంది. సరదా మనస్తత్వం ఉన్నవారు భవిష్యత్తు పట్ల సానుకూలంగా ఉంటూ, సమస్యలను చాలా చురుగ్గా, సృజనాత్మకంగా ఎదుర్కొన్నారు. అంటే, జీవితం వారికి చేదు వాస్తవాలను (నిమ్మకాయలు) ఇచ్చినప్పుడు, వారు వాటిని తీపి అనుభవాలుగా (నిమ్మరసం) మార్చుకున్నారు!దీనికి సంబంధించిన పరిశోధనా వ్యాసం ‘ఫ్రంటియర్స్ ఇన్ సైకాలజీ’ పత్రిక తాజా సంచికలో అచ్చయింది. ‘‘మా పరిశోధనలో తేలిందేమిటంటే సరదా మనస్తత్త్వం, మానసిక స్థైర్యం అనేవి ‘లెమనేడింగ్’ అనే భావన ద్వారా ఒకదానికొకటి చాలా బలంగా ముడిపడి ఉన్నాయి. కష్ట సమయాల్లో కూడా సానుకూల అనుభవాలను సృష్టించుకునే సామర్థ్యమే ఈ లెమనేడింగ్’’ అని వ్యాసకర్త, ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ షియాంగ్యూ ‘షారన్’ షెన్ అంటున్నారు.‘‘పాండమిక్ (మహమ్మారి) సమయంలో సరదా మనస్తత్వం ఉన్నవారు, లేనివారు ఇద్దరూ ఒకే రకమైన భయాన్ని, ఒంటరితనాన్ని అనుభవించారు. కానీ సరదాగా ఉండే వ్యక్తులు ఆ కష్టతరమైన పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. పోగొట్టుకున్న వాటికి ప్రత్యామ్నాయాలను వెతుక్కున్నారు, అడ్డంకులను ఎదిగే అవకాశాలుగా చూశారు. అన్నిటికంటే ముఖ్యంగా, ఆ పరిస్థితికి ఎలా స్పందించాలన్న విషయాన్ని తమ నియంత్రణలోనే ఉంచుకున్నారు’’ అని షెన్ తెలిపారు.‘లెమనేడింగ్’ పరిశోధన వెనుకడాక్టర్ షెన్, ఆమె సహచర శాస్త్రవేత్తలు మనుషుల సరదా మనస్తత్త్వం (ప్లేఫుల్నెస్) అనేది కష్ట సమయాల్లో జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి చాలా కాలంగా ఆసక్తితో చూస్తున్నారు. కోవిడ్ మహమ్మారి వారికి ఆ విషయాన్ని పెద్ద ఎత్తున పరిశోధించడానికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది. ఇందుకోసం వారు అమెరికాలో నివసిస్తున్న 503 మంది వయోజనులను ఎంచుకుని, 2021 ఫిబ్రవరి (కోవిడ్ రెండవ వేవ్, వ్యాక్సిన్ ప్రారంభ సమయం) ఒక సర్వే నిర్వహించారు.ఈ సర్వేలో పాల్గొన్నవారిని – కరోనా సోకుతుందేమో అనే భయం ఎంతవరకు ఉంది? పరిస్థితులు బాగుపడతాయని నమ్ముతున్నారా? వారికి ఇతరుల మద్దతు ఉందా? వారి భావోద్వేగాలు ఎలా ఉన్నాయి? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. దాంతో పాటు, వారు ఎంత సరదాగా ఉంటారు? ఎంత స్పాంటేనియస్‌గా (సహజంగా / వెంటనే) స్పందిస్తారు? ఆనందంగా ఉండటానికి ఎంతవరకు ప్రయత్నిస్తారు? అనే అంశాల ఆధారంగా వారి సరదా మనస్తత్వాన్ని కొలిచారు.ఈ వివరాల ఆధారంగా శాస్త్రవేత్తలు, సర్వేలో పాల్గొన్న వారిని వారి సరదా మనస్తత్వ స్థాయిని బట్టి నాలుగు భాగాలుగా విభజించారు. సరదా మనస్తత్వం అనేది మనుషుల ఆలోచనలను, ప్రవర్తనను ఎలా మారుస్తుందో స్పష్టంగా అర్థం చేసుకోవడానికి అత్యంత సరదాగా ఉండే మొదటి 126 మందిని, అసలు సరదా లేని చివరి 126 మందితో పోల్చి చూశారు.సానుకూల అవకాశాలపై దృష్టిఅత్యంత సరదాగా ఉండే వ్యక్తులు భవిష్యత్తు పట్ల చాలా ఆశావాదంతో ఉన్నారని, వ్యాక్సిన్ విజయవంతంగా అందుబాటులోకి వస్తుందని; జీవితం మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటుందని నమ్మారని ఈ పరిశోధన వివరాలు స్పష్టం చేశాయి. అయితే దీని అర్థం వారు అప్పటి పరిస్థితిని పట్టించుకోకుండా, ఊహల్లో బతికారనడం కాదు!‘‘అతిగా ఆశావాదంతో ఉన్నవారు వాస్తవాలను గుర్తించకుండా ప్రతిదీ బాగుందని భ్రమిస్తుంటారు. కానీ మేము గమనించిన ‘స్పాట్లైట్’ (దృష్టి) ప్రభావం అలా కాకుండా చాలా స్పష్టంగా ఉంది’’ అని డాక్టర్ షెన్ వివరించారు. ‘‘సరదా మనస్తత్వం ఉన్నవారు కోవిడ్–19 ప్రమాదాలను తేలికగా తీసుకోలేదు, అలాగని రక్షణ చర్యల ప్రభావంపై అతిగా అంచనాలూ వేసుకోలేదు. వారు తమ ‘స్పాట్లైట్’ ని కేవలం సానుకూల మార్పులు, మెరుగవటానికి ఉండే అవకాశాలపైకి మళ్లించారు. చీకటి లాంటి కష్టసమయాల్లో కూడా ముందుకు సాగే మార్గాలను వెలుగులోకి తెచ్చుకున్నారు’’ అంటారు షెన్.అధిక సరదా మనస్తత్త్వం కలిగినవారు ఆనందాన్ని వెతుక్కోవడానికి ఎక్కువ ఉత్సాహపడ్డారు, సంకోచించకుండా ఆలోచించారు. ఇది అనిశ్చిత పరిస్థితుల్లో కూడా అనేక సానుకూల అవకాశాలను ఊహించడానికి వారికి సహాయపడింది. దీనికి తోడు వారి ప్రవర్తనలో ఉన్న సరళత, పనుల్లో వారు చూపించే శ్రద్ధ.. కష్టాలను తట్టుకునే మానసిక స్థైర్యాన్ని అందించాయి.చిన్న చిన్న మార్పులు చేసుకున్నారుపాండమిక్ సమయంలో ఇరు వర్గాల వ్యక్తులూ సమానంగానే ఒంటరితనాన్ని, భయాన్ని అనుభవించారు. కానీ సరదాగా ఉన్నవారు ఆ పరిస్థితులను తట్టుకోవడానికి సృజనాత్మక, క్రియాశీలక అడుగులు వేశారు. వారు వేరే ఏవో కొత్త వినోద కార్యక్రమాలలో పాల్గొనలేదు, కానీ తాము చేసే పనుల్లోనే సమయాలను మార్చుకోవడం, కొత్త ప్రదేశాలను అన్వేషించడం లేదా చురుగ్గా ఉండటానికి కొత్త మార్గాలు వెతకడం ద్వారా పరిస్థితులకు అనుగుణంగా మారారు. వారు తమ రోజువారీ జీవితంలో మరింత చురుగ్గా, ఆనందంగా, లీనమై గడిపారు.‘‘మా పరిశోధన సరదా మనస్తత్త్వాన్ని కొలవడంపైనే దృష్టి పెట్టినప్పటికీ, ఈ గుణాన్ని పెంపొందించుకోవడానికి కొన్ని మార్గాలను పరిశోధనలు సూచిస్తున్నాయి. ఉదాహరణకు, మీకు ఆనందాన్నిచ్చే పనుల్లో పాల్గొనండి, కొత్త అనుభవాలకు సిద్ధంగా ఉండండి, మిమ్మల్ని నవ్వించే వ్యక్తులతో సమయం గడపండి. సరదాగా ఉండటానికి ఆటలే ఆడాల్సిన పనిలేదు. మన రోజువారీ క్షణాల్లో కాస్త ఆనందం, స్వేచ్ఛ, అనుకూలమైన ఆలోచనా విధానాన్ని తెచ్చుకుంటే చాలు’’ అని షెన్ చెబుతున్నారు. జీవితంలో సరదాలు ఉండాలి‘‘ముఖ్యంగా కష్టకాలంలో మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరదా మనస్తత్వం అనేది చాలా కీలకమైనది. కానీ చాలామంది దీని ప్రాముఖ్యతను గుర్తించరు’’ అని అంటారు షెన్. ‘‘సరదాగా ఉండే వ్యక్తులు.. కష్టాలను ఎంత సమర్థవంతంగా ఎదుర్కొంటారో అర్థం చేసుకోవడం వల్ల, ఇతరులు కూడా ఒత్తిడిని, అనిశ్చితిని జయించే వ్యూహాలను రూపొందించవచ్చు. మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రపంచ స్థాయి సవాళ్లకు వాస్తవిక అంచనా, సృజనాత్మకమైన సర్దుబాటు రెండూ అవసరం కాబట్టి, ఈ విషయం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది’’ అని ఆమె అభిప్రాయపడ్డారు.అయితే, ఈ పరిశోధన ఫలితాలను ప్రతి పరిస్థితికీ లేదా అందరికీ ఒకేలా వర్తింపజేయలేమని షెన్, ఆమె సహచరులు హెచ్చరిస్తున్నారు. వేర్వేరు పరిస్థితుల్లో ఈ సరదా మనస్తత్త్వం వేర్వేరు వ్యక్తులపై భిన్నమైన ప్రభావం చూపవచ్చు. అలాగే, అత్యంత సరదాగా ఉండేవారికి, లేనివారికి మధ్య ఉన్న తేడాలన్నీ కేవలం ఈ ఒక్క గుణం వల్లే వచ్చాయని చెప్పలేము. ‘‘మనుషుల మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలను మేము గుర్తించినప్పటికీ, రోజువారీ సంఘటనలకు వారు ఎలా స్పందిస్తారనే దానిపై ప్రభావం చూపే ఈ సరదా మనస్తత్త్వం ఇతర పరిస్థితులకు కూడా (రోజువారీ కానివీ, వివిధ రంగాలకు చెందినవీ) వర్తిస్తుందని చెప్పలేం అని షెన్ పేర్కొన్నారు. ‘‘ఈ ‘సరదా ఆలోచనా విధానం’ ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో మరింత పూర్తిగా అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తులో జీవితంలోని ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని పరిశోధనలు జరపవలసి ఉంది’’ అని షెన్ అంటున్నారు. – సాక్షి స్పెషల్ డెస్క్- షియాంగ్యూ ‘షారన్’ షెన్, ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ -
ప్రేమయాత్ర.. చివరి రోజు ఊహించని మలుపు!
ఇంటర్ ఫస్టియర్ చదివే అతనికి ఇంకొన్ని వారాల్లో పదిహేడు వస్తుంది. ఆ వయసులో శరీరంలోని హార్మోన్స్ ఉత్పత్తి వల్ల మానసిక, శారీరక అవసరమైన కోరిక పుడుతుంది. ఆ సమయంలో టీనేజర్ ప్రేమలో పడతాడు. అతని ప్రేమయాత్ర మొదలవుతుంది.అతను తన క్లాస్మేట్ వాల్గంటితో ప్రేమలో పడ్డాడు. క్లాస్‌లోని ఇరవై ఏడుమంది అమ్మాయిల్లో వాల్గంటే అతన్ని ఎందుకు ఆకర్షించింది? ఇది సమాధానం లేని ప్రశ్న. ఎవరు ఎవరితో ఎందుకు ప్రేమలో పడతారనే దానికి ఇదమిత్థమైన కారణం పడ్డవాడితో సహా ఎవరూ చెప్పలేరు. దానికి ‘కెమిస్ట్రీ’ అనే ఆధునిక జవాబు స్థిరపడింది.ఆమె తనని ప్రేమిస్తోందా అనే ప్రశ్న అతన్ని తొలచసాగింది. వాల్గంటి అతని మీద ఎలాంటి ప్రత్యేక ఆసక్తిని చూపించలేదు. ప్రేమయాత్రలో ఒకరు తమ ప్రేమని తెలియచేస్తే, రెండోవారు దాన్ని అంగీకరించాలి. అప్పుడు అది కొనసాగుతుంది. తిరస్కరిస్తే ఆ ప్రేమయాత్ర అంతటితో ముగుస్తుంది.అతనికి తన ప్రేమని ఆమెకి తెలియచేయాలని ఉంది. కాని ఆ ధైర్యం చేయలేకపోయాడు. టీచర్‌కి చెప్తే? తిరస్కరిస్తే? తనని చెడ్డవాడిగా భావిస్తే లాంటి భయాలు అతనిలో కలిగాయి.క్లాస్‌లోకి రాగానే ఆమె వచ్చిందా అని చూస్తాడు. కనపడకపోతే ‘అసలు ఇవాళ వస్తుందా?’ అనే అనుమానం అతన్ని బాధిస్తుంది. ఆమె వస్తే ఆనందం కలుగుతుంది. ఆమె ఎదురు పడినప్పుడు రెండు మూడు సార్లు చిరునవ్వులు నవ్వాడు. ఆమె అతనివైపు చూడకపోవడంతో అది గమనించలేదు. ఆమెకి తన ప్రేమ గురించి ఎలా తెలియచేయాలో అతనికి తోచలేదు. మధ్యవర్తి ఆలోచన వచ్చింది. కాని మిత్రుడి దగ్గర మాటలు నోట్లోంచి బయటికి రాలేదు.ఓరోజు వాల్గంటి లంచ్‌లో కాలేజీ బయట బండి దగ్గర పానీపూరీ తింటూ కనిపించింది. అతను కూడా వాటిని తిన్నాడు. మొదటిసారి ఆమెతో మాట్లాడాడు.‘‘నీ డబ్బు కూడా నేను పే చేస్తాను.’’ అతను చెప్పాడు.‘‘ఒద్దు.’’ ఆమె జవాబు చెప్పింది.తన డబ్బు చెల్లించి ఆమె వెళ్ళిపోయింది.చివరికి అతను ఆమెకి ఉత్తరం ద్వారా తన ప్రేమని తెలియచేయాలని అనుకున్నాడు. నోట్ బుక్‌లోంచి ఓ కాగితం చింపి రాశాడు.‘డియర్ వాల్గంటి,నువ్వు నాకు ఎందుకు నచ్చావ్ అని అడక్క. నా దగ్గర జవాబు లేదు. కాని నువ్వు నాకు బాగా నచ్చావు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు క్లాస్‌కి రాకపోతే నాకు చాలా డల్‌గా ఉంటుంది. నీకు నా ప్రేమని తెలియచేయకుండా ఉండలేకపోతున్నాను. ఐ లవ్ యు వెరీ మచ్...’’తర్వాత ఏం రాయాలో తెలీలేదు. దాన్ని మడిచి జేబులో ఉంచుకున్నాడు. ఆ ఉత్తరం ఎప్పుడు ఆమెకి ఇద్దామా అని తహతహగా ఉంది. అది అతని జేబులోనే ఉంది. అంతా చూస్తూండగా దాన్ని ఆమెకి ఇవ్వలేకపోతున్నాడు. ఆమె ఒంటరిగా చిక్కడం లేదు. ∙∙ మర్నాడు ఓ సంఘటన జరిగింది. క్లాస్‌లోని టీచర్ ఓ విద్యార్థితో చెప్పాడు.‘‘నువ్వు ప్రిన్సిపాల్ దగ్గరకి వెళ్ళు. ఆయన పిలుస్తున్నారు.’’‘‘దేనికి సర్?’’ అతను లేచి నించుని అడిగాడు.‘‘తిరిగి వచ్చాక నువ్వే దానికి జవాబు చెప్పు.’’ ఆయన చెప్పాడు.అతను వెళ్ళిన పావుగంట తర్వాత వచ్చాడు. అతని మొహం వాడిపోయి ఉండటం అంతా గమనించారు. అతను తలవంచుకొని కూర్చున్నాడు. టీచర్ అతన్ని ఎందుకని అడగలేదు. అతనూ చెప్పలేదు. తర్వాత తోటి విద్యార్థులకి ఆ విషయం తెలిసింది. తమ క్లాస్మేట్ మరో క్లాస్ అమ్మాయికి ప్రేమలేఖని రాస్తే ఆమె దాన్ని తన తండ్రికి చూపించింది. ఆయన దాంతో ప్రిన్సిపాల్ దగ్గరకి వచ్చాడు. ఆవిడ ఆ ఉత్తరం చూసి మండిపడి, వెంటనే అతని తల్లితండ్రులని పిలిపించి వారి ముందే నానా చివాట్లు వేసింది.‘‘ఇంకోసారి ఇలా జరిగితే టీసీ ఇచ్చి పంపిస్తాను.’’ హెచ్చరించింది.‘‘ఇష్టం లేకపోతే ఉత్తరం చింపేయాలి కదా?’’ కొందరు చెప్పారు.‘‘నోటితో చెప్తే అంత దూరం వచ్చేది కాదుగా.’’ మరికొందరు చెప్పారు.అతను తన జేబులోని లేఖని చింపి డస్ట్ బిన్ లో పడేశాడు. ఆ తర్వాత తన ప్రేమని వాల్గంటికి తెలియచేసే ప్రయత్నాన్ని విరమించుకోవడంతో అతని ప్రేమయాత్రకి అంతరాయం కలిగింది. ప్రేమ ఉద్ధృతి మాత్రం తగ్గలేదు. ప్రేమలో పడి దాన్ని వ్యక్తం చేయకపోవడం ఎంత దుర్భర పరిస్థితి అనేది అతనికి అర్థమైంది.త్వరలోనే ఇంటర్ ఫస్టియర్ చివరికి వచ్చింది. విద్యార్థులంతా ఎంతో ఉత్సాహంగా పరీక్షలయ్యాక వాళ్ళ ప్లాన్స్ గురించి చెప్పుకుంటున్నారు. అతనికి మాత్రం సంతోషంగా లేదు. ఆఖరి క్లాస్ అయ్యాక అతను కాలేజీ ఆవరణలోంచి బస్ స్టాప్‌కి వెళ్ళాడు.అక్కడ వాల్గంటి, మరికొందరు అమ్మాయిలు, అబ్బాయిలు నిల్చుని ఉన్నారు. అతన్ని చూడగానే వాల్గంటి చిరునవ్వు నవ్వింది. అతనూ బదులుగా నవ్వాడు.‘‘కాఫీ తాగుదామా? కెఫేకి వెళ్దాం రా.’’ ఆమె అతని దగ్గరికి వచ్చి చెప్పింది.‘‘కెఫేకి?’’ తడబడుతూ అడిగాడు.‘‘అవును. ఐ థింక్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ యు.’’ఆమె నవ్వింది. ఆ బస్ స్టాప్ నుంచి ‘‘24/7 కెఫే’’ కి అతని చేతిని పట్టుకుని నిర్భయంగా నడిచింది.- మల్లాది వెంకట కృష్ణమూర్తి -
విమానం కాలిపోతోంది... కాపాడండి! అర్ధరాత్రి బాలుడి కేకలు..
1945 మార్చి 3 – జపాన్ రాజధాని టోక్యో సమీపంలోని ఇవోజిమా ద్వీపం...రెండో ప్రపంచ యుద్ధం ఉద్ధృతంగా సాగుతున్న సమయం... అప్పుడే అమెరికాకు చెందిన యుద్ధ విమాన పైలట్ జేమ్స్ హూస్టన్– యుద్ధనౌక నుంచి టేకాఫ్‌కు సిద్ధమయ్యాడు.‘జాక్! ఈరోజు శత్రువుల పీచమణిచి విజయంతో తిరిగొస్తా. పార్టీ చేసుకుందాం’ అని తన సహచరుడికి చెప్పి ఇవోజిమా ద్వీపం వైపు దూసుకెళ్లాడు జేమ్స్ హూస్టన్. జపాన్ సేనలపై బాంబుల వర్షం కురిపించాడు. అయితే, జపాన్ సైన్యం చేసిన దాడిలో ఇంజిన్‌కు మంటలంటుకుని విమానం సముద్రంలో కూలిపోయింది. విమానంలో ఉన్న జేమ్స్ చనిపోయాడు.2000 ఏప్రిల్ 10 – అమెరికాలోని లూసియానాలో నివసించే బ్రూస్ లైనింజర్, ఆండ్రియా లైనింజర్ దంపతులు తమ రెండేళ్ల కుమారుడు జేమ్స్ లైనింజర్తో కలిసి ఎప్పటిలాగే నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి అకస్మాత్తుగా ఆ బాలుడు గట్టిగా కేకలు వేశాడు.‘విమానం కాలిపోతోంది! మంటలు అంటుకున్నాయి! ఆ చిన్న మనిషి బయటకు రాలేకపోతున్నాడు... కాపాడండి!’ అంటూ అరిచాడు. దీంతో ఉలిక్కిపడ్డ అతడి తల్లిదండ్రులు జేమ్స్‌ను దగ్గరకు తీసుకుని బుజ్జగించి నిద్రపుచ్చారు. ఇక ఆ రోజు నుంచి వారికి నిద్ర కరువైంది. ప్రతిరోజూ రాత్రివేళ నిద్రపోతున్న బాలుడు ఉన్నట్టుండి గాల్లో కాళ్లు, చేతులు విసిరేస్తూ, ఊపిరి ఆడనట్లు విలవిలలాడిపోయేవాడు. చెమటలతో తడిసిపోతూ గట్టిగా కేకలు వేసేవాడు.వారంలో నాలుగైదు రోజులు ఇదే సీన్. మొదట్లో తల్లిదండ్రులు ఏదో పీడకల అనుకున్నారు. కానీ అంతకంతకూ ఆ చిన్నారి ప్రవర్తన విచిత్రంగా మారింది. బొమ్మ విమానాలతో ఆడుకుంటూ, వాటిని నేలకేసి కొడుతూ ‘విమానం క్రాష్ అయిపోయింది’ అని అరిచేవాడు.రోజులు గడిచేకొద్దీ ఆ చిన్నారి చెబుతున్న మాటలకు తల్లిదండ్రులు షాకయ్యేవారు. ఆ వయసు పిల్లలకు అస్సలు తెలియని ‘విమాన çపరిభాష’ గురించి జేమ్స్ మాట్లాడటం చూసి నిర్ఘాంతపోయేవారు. విమానం కింద ఉండే ‘డ్రాప్ ట్యాంక్’ గురించి, దాన్ని ఎలా డిస్కనెక్ట్ చేయాలో స్పష్టంగా చెప్పేవాడు. దీంతో ఒకరోజు తండ్రి బ్రూస్ తన కొడుకుని దగ్గరకు తీసుకుని నెమ్మదిగా ఆరా తీశాడు.‘నాన్నా, అసలు ఆ విమానం ఎక్కడి నుంచి ఎగిరేది?’ అని అడిగితే, ‘అది నటోమా అనే పెద్ద యుద్ధనౌక మీద నుంచి ఎగిరేది డాడీ’ అని బదులిచ్చాడు. ఆ చిన్న మనిషి ఎవరు నాన్నా అని ప్రశ్నిస్తే, ‘అది నేనే.. నా పేరు కూడా జేమ్సే’ అని సమాధానమిచ్చాడు. ‘నీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా?’ అంటే.. ‘నా బెస్ట్ ఫ్రెండ్ జాక్ లార్సన్ నాతోనే ఉండేవాడు’ అని చెప్పాడు. ‘జపాన్ సైనికులు తన విమానం ఇంజిన్ పై దాడి చేసి కూల్చివేశారు. విమానానికి మంటలు అంటుకుని సముద్రంలో పడిపోయి చనిపోయాను’ ఆ పసివాడు కళ్లు పెద్దవి చేసి మరీ వివరించాడు.ఇదంతా పసివాడి ఊహాజనిత కథ అని నిరూపించాలని బ్రూస్ నిశ్చయించుకున్నాడు. సైనిక రికార్డులు, రెండో ప్రపంచ యుద్ధ పత్రాలను జల్లెడ పట్టాడు. అవి చూసిన తర్వాత ఆయన వెన్నులో వణుకు పుట్టింది.పసిఫిక్ మహాసముద్రంలో రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న అమెరికన్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ పేరు యూఎస్ఎస్ నటోమా బే అని, ఆ నౌకపై జాక్ లార్సన్ అనే పైలట్ పనిచేశాడని, అప్పటికి ఆయన ఇంకా జీవించే ఉన్నాడని తెలుసుకున్నాడు.1945 మార్చి 3న జేమ్స్ హూస్టన్ జూనియర్ అనే 21 ఏళ్ల పైలట్ విమానంపై జపాన్ సైనికులు దాడి చేయడంతో అది సముద్రంలో కూలిపోయి అతడు మరణించాడని మిలిటరీ రికార్డులను బట్టి బ్రూస్ నిర్ధారణకు వచ్చాడు. ఈ నమ్మలేని నిజాలను ప్రత్యక్షంగా నిరూపించుకోవడానికి లైనింజర్ కుటుంబం– చనిపోయిన పైలట్ జేమ్స్ హూస్టన్ సోదరి యాన్ బారన్ దగ్గరకు వెళ్లింది. అప్పటికి వృద్ధురాలైన యాన్ బారన్ ను చూడగానే జేమ్స్– పరిగెత్తుకుంటూ వెళ్లి ‘అక్కా’ అంటూ ఆప్యాయంగా హత్తుకున్నాడు. వారి చిన్నతనంలో ఆడుకున్న ఆటలు, హూస్టన్ ఇంట్లో ఉన్న బొమ్మల పేర్లు, కేవలం ఆ ఇద్దరికీ మాత్రమే తెలిసిన కుటుంబ విషయాలను పూసగుచ్చినట్లు చెప్పాడు.అవన్నీ విన్న తర్వాత ఆనందబాష్పాలతో యాన్ బారన్ అన్న మాట: ‘ఇతడు నా తమ్ముడు జేమ్స్ హూస్టన్... నా తమ్ముడే మళ్లీ పుట్టాడు’ అని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. అనంతరం అప్పటికి బతికి ఉన్న సహచర పైలట్ జాక్ లార్సన్ను కలిసినప్పుడు కూడా చిన్నారి జేమ్స్ ఆయనను గుర్తుపట్టి, నాటి యుద్ధ జ్ఞాపకాలను పంచుకున్నాడు.చిన్నారి జేమ్స్ లైనింజర్ కథ ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మీడియాను, పారాసైకాలజీ పరిశోధకులను ఆకర్షించింది. గత జన్మ వివరాలన్నీ చెప్పిన జేమ్స్... తను మరణించిన జపాన్ సముద్ర తీర ప్రాంతానికి వెళ్లి నివాళులర్పించాడు. అంతే, అప్పటి నుంచి అతడికి పీడకలలు రావడం ఆగిపోయాయి. శాస్త్రవేత్తలు, డాక్టర్లు దీనికి ఎటువంటి శాస్త్రీయ వివరణ ఇవ్వలేకపోయారు. ప్రస్తుతం సాధారణ యువకుడిలా జీవితం గడుపుతున్న జేమ్స్ లైనింజర్ కథ– ‘పునర్జన్మ’ ఉందనే నమ్మకానికి ప్రపంచంలోనే అత్యంత బలమైన, సజీవ ఆధారంగా ఉంది.- సత్యకిశోర్ కొండ్రెడ్డి -
ఫొటోలు సరిగా తీయలేదని...
పెళ్లంటే పందిళ్లు ... సందళ్లు... తప్పెట్లు... తాళాలు... రెండు మనసుల కలయికే కాదు, జీవితంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాల వేడుక. ఆ జ్ఞాపకాలను పదిలంగా ఉంచి కలకాలం గుర్తుండేలా వాటికి శాశ్వత రూపం ఇచ్చేవి ఫొటోలు, వీడియోలు. ప్రీ వెడ్డింగ్ షూట్ల నుంచి పెళ్లిలో బంధువుల సందడి, ఆప్యాయ ఆలింగనాలు, వధువును అత్తారింటికి పంపే తల్లిదండ్రుల కంటతడి వరకు ప్రతి ఆనంద క్షణాలూ భావోద్వేగాలూ కాలగర్భంలో కలిసి పోకుండా అవి పదిలంగా ఉంచుతాయి. అందుకే నేటి పెళ్లి తంతులో ఈ ఖర్చు తప్పని సరైంది. లక్షలకు చేరింది.అయితే వీటి చిత్రీకరణలో పొరపాటు జరిగితే; ఆ జ్ఞాపకాలను సరిగా బంధించకపోతే; ఫొటోలు, వీడియోలు ఆశించిన స్థాయిలో రాకపోతే; ఒప్పందం అమలు చేయకపోతే; మానసిక వేదనే మిగులుతుంది. అయితే ఓ జంట ఇలా వేదనతో సరిపుచ్చుకోలేదు. ఒప్పంద ఉల్లంఘనపై వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించింది. తమ మనో వేదనకు మూల్యం చెల్లించేలా ఆదేశించాలని, ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు పరిహారాన్ని ఇప్పించాలని వేడుకుంది. సేవల్లో లోపంతో పాటు భావోద్వేగాలను ఫోరం అర్థం చేసుకుని తీర్పు వెలువరించింది.కేరళకు చెందిన ఓస్టిన్ ఊమచెన్, కావ్య సంతోష్ ఇద్దరూ వైద్యులు. వీరిద్దరికి పెళ్లి నిశ్చయం అయింది. కొచ్చిలోని పికోలో వెడ్డింగ్స్ సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పెళ్లి ఫొటోలు, వీడియోలు చూశారు. తమ వివాహ వేడుకను అలాగే పదిలపరుచుకోవాలని భావించి, ఆ సంస్థను సంప్రదించారు.ఒప్పందం... ఉల్లంఘన...బ్రైడ్ అండ్ గ్రూమ్ సైడ్ ప్యాకేజీని ఆ జంట ఎంచుకుంది. ఆ ప్యాకేజీ కింద అందించే సేవలను సంస్థ వివరించింది. మొత్తం రూ.95 వేలకు వారి మ«ధ్య ఒప్పందం కుదిరింది. రూ.10 వేలు అడ్వాన్స్‌గా, పెళ్లిరోజు మరో రూ. 70 వేలు చెల్లించారు. 2024లో వీరి వివాహం ఘనంగా జరిగింది. అయితే ఒప్పందంలో పేర్కొన్న ప్రకారం డ్రోన్ కెమెరా ద్వారా పెళ్లిని షూట్ చేయలేదు. ఆ విషయాన్ని ముందుగా తెలియజేయలేదు. దీంతో మరొకరిని ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని ఆ జంట వాదన. మరోవైపు వధువు ఇంట్లో జరిగే వివాహ తంతును చిత్రీకరించేందుకు వెళ్లాల్సిన క్యాండిడ్ ఫొటోగ్రాఫర్ వెళ్లలేదు. ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన మూడు వెడ్డింగ్ రీల్స్ ఊసే ఎత్తలేదు. వివాహం జరిగిన ఆరు నెలల తర్వాత హైలైట్స్ వీడియోను వాట్సాప్ ద్వారా పంపారు. యూఎస్బీలో ఇచ్చిన వెడ్డింగ్ స్టోరీ కరెప్ట్ అయింది. ఫొటోలు, వీడియో ఎడిటింగ్ పరమ నాసిగా ఉన్నాయి. ముఖ్యమైన వేడుకల ఫొటోలు, ఆనంద క్షణాలు క్యాప్చర్ కాలేదు. ఇలా ఒప్పందంలోని పలు అంశాలను సంస్థ ఉల్లంఘించింది.ఫోరంలో ఫిర్యాదుఒప్పందాన్ని సంస్థ ఉల్లంఘించిందంటూ ఆ జంట కొట్టాయంలోని వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించింది. అయితే కమిషన్ జారీ చేసిన నోటీసులకు పికోలో వెడ్డింగ్స్ సంస్థ స్పందించలేదు. చివరకు ఓ దినపత్రికలో పబ్లిక్ నోటీసు ఇచ్చినప్పటికీ ఆ సంస్థ కమిషన్ ఎదుట హాజరు కాలేదు. దీంతో ఎక్స్‌పార్టీగా ఫోరం కేసును కొనసాగించింది. ఫిర్యాదుదారులు సమర్పించిన ఆధారాలను పరిశీలించింది. హెలీకామ్(డ్రోన్) సేవలను అందించనందుకు బిల్లులో ఆ మేరకు తగ్గిస్తూ సంస్థ రశీదు ఇవ్వడాన్ని కోర్టు గుర్తించింది. యూఎస్బీ కరెప్ట్ అయిన విషయాన్ని పరిశీలించి నిర్ధారించింది. వినియోగదారుల పరిరక్షణ చట్టం–2019 ప్రకారం ఇటువంటి చర్య ‘సేవల్లో లోపం’ పరిధిలోకి వస్తుందని ఫోరం స్పష్టం చేసింది.తీర్పు ఇలా...సంస్థకు చెల్లించిన మొత్తాన్ని ఫిర్యాదుదారులకు తిరిగి ఇవ్వాలని ఫోరం ఆదేశించింది. ఒప్పందాన్ని ఉల్లంఘించి మానసిక వేదనకు గురిచేసినందుకు రూ.2.50 లక్షలు, కోర్టు ఖర్చుల నిమిత్తం మరో 10,000 చెల్లించాలని ఆదేశిస్తూ ఫోరం తీర్పు వెలువరించింది. నిర్ణీత గడువులోగా ఈ మొత్తం అందించకపోతే 9% వడ్డీ చెల్లించాలని పేర్కొంది. ఈ తీర్పు కేవలం ఓ జంటకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించిన కేసు మాత్రమే కాదు. వృత్తి పరమైన సేవలు అందించే ప్రతి సంస్థపై ఉన్న బాధ్యతను గుర్తు చేసే తీర్పు. ఈ తరహా ఒప్పందాలు కేవలం వ్యాపార లావాదేవీలు కావని, విశ్వాసం, జవాబుదారీతనం, ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది.- దిలీప్ మాదిరెడ్డి -
చేదుకట్టు..! చేతిలో చిల్లిగవ్వ లేదు.. కానీ తలలో
కొత్తగా పనిలో చేరిన సావిత్రి మాటతీరు చూసిన రేవతి ‘‘దీనికి ఎంత తెలివో?’’ బుగ్గలు నొక్కుకుంటూ ఆశ్చర్యపోయింది. ఆమె తెలివైన మాటల వెనుక జీవితాన్ని తీర్చిదిద్దుకునే ధ్యాస తప్ప మరో ఆలోచన కనబడలేదు రేవతికి. పనిలో చలాకీతనం, శ్రద్ధ చూసి ముచ్చట వేసింది. కోనసీమలో ఒక పల్లెటూరు నుండి హైదరాబాద్ అపార్టుమెంటు కాపలాపనికి మొగుడు సూరిబాబుని తీసుకుని రావడమే తరవాయి, ఫ్లాట్స్ అన్నీ తిరిగి తనని పనిలో పెట్టుకొమ్మని కోరింది సావిత్రి.అశోకా పౌడర్ ముఖానికి రాసుకుని, ముప్పేట కొబ్బరికాయలా ఉన్న తలకు కొబ్బరినూనె పాముకుని, తలలో మందార పువ్వు పెట్టుకుని, నుదుట సన్నని తిలకం దిద్దుకుని, పొట్టిగా, సన్నగా, శుభ్రంగా ఉన్న సావిత్రి మొదటి చూపులోనే నచ్చేసింది రేవతికి.‘‘చక్కని గాలి, బోల్డు నీళ్ళు, పచ్చని వరిచేలతో కోనసీమ బావుంటుంది కదే అక్కడే సుఖంగా ఉండక, సామాన్యుడు బతకలేని ఈ మహానగరానికి ఎందుకు వచ్చావు?’’ అడిగింది ఆరాగా.‘‘మా వూళ్ళో పనులేం ఉండడం లేదమ్మా. ఈ మధ్య పొలం పనులు కూడా బాగా తగ్గిపోయాయి. సేలన్నీ రొయ్యల సెరువులవడంతో సానా కట్టంగా ఉంది పని దొరకడం. దానికి తోడు మా వోడు బద్ధకస్తుడు, అన్నీ ఒళ్ళోకి వచ్చి వాలాలను కుంటాడు. మగాడని గోరోజనం. మా వూళ్ళో ఉంటే కట్టబడి కూడబెట్టిన డబ్బులతో తాగడం తిరగడం తప్ప, పిల్లల ఆలనా పాలనా సూడడం లేదు. దొరికిన ఈ కాపలా పనైనా జాగ్రత్తగా సేసుకోమని బతిమాలి ఇక్కడకు లాక్కొచ్చాను, పిల్లల్ని కూడా సక్కని బళ్ళో ఎయ్యొచ్చు కదమ్మా,’’ మంచి భవిష్యత్తు ఊహిస్తూ చెప్పింది.‘‘అమ్మా! సెల్లి కొడతందే’’ అంటూ కీచులాడుకొంటూ ఏడుస్తున్న పిల్లల చేతుల్లో బిస్కెట్లు పెట్టి ఊరుకోబెట్టింది రేవతి. సావిత్రి రాకతో రేవతికి ఇంటి పని చాలా తగ్గింది. రోజూ రేవతి ఆ చిరు కుటుంబం కోసం తమతో పాటే కాసిని బియ్యం పోసి అన్నంతో పాటు కాస్త కూర, పచ్చడి లాంటివి ఇవ్వడంతో, రేవతి పట్ల సావిత్రి మనసు కృతజ్ఞతతో నిండిపోయింది.∙∙ అపార్ట్మెంట్లో పనులన్నీ అయిపోయాక, విశ్రాంతి తీసుకోకుండా ఏదో పని చేసి డబ్బులు సంపాదించడం అలవాటుగా మారింది సావిత్రికి. ‘‘వయసున్నప్పుడే ఒళ్ళొంచి పనిచెయ్యాలి, నాలుగు డబ్బులు కూడబెట్టుకోవాలే సాయిత్రి!’’.. అమ్మ రాజేశ్వరి మాటలు ఆమె మస్తిష్కంలో ఇంకా సజీవంగా ఉన్నాయి.సావిత్రి పుట్టుక ఒక విషాదం. రాజేశ్వరి వయసులో ఉన్నప్పుడు ఆమె ఎంతగానో నమ్మిన మగాడు మోజు తీరిపోయాక తల్లినీ, పసిగుడ్డుగా ఉన్న సావిత్రినీ వదిలేసి వెళ్ళిపోయాడు. ఊళ్ళో బంధువులు ఎన్ని సూటిపోటి మాటలన్నా, కన్నకూతుర్ని ఎంతో ధైర్యంతో పెంచిన తన తల్లి మనోబలమే సావిత్రికి ఆమె నుంచి వచ్చిన ఆస్తి. తన కంటే పెద్దదైన కూతురున్న వాడిని మారుమనువాడింది తల్లి. పెంపుడు తండ్రి ప్రేమ పొందకపోయినా, సవతి అక్క, బావ ఆమెను బానే చూసుకోవడం కాస్త ఊరట.ఇద్దరు కూతుళ్ళకు ఏదో రకంగా సాయపడవచ్చని, వాళ్లకు భారం కాకూడదని నడి వయస్సులో ‘కొయిటా’ వెళ్ళిన తల్లి మరికాస్త ఆలంబన సావిత్రికి. ఇళ్ళల్లో పనులన్నీ గబా గబా అవగొట్టుకుని, చాప పరుచుకుని, జనుముతో తయారుచేసిన పేపర్లతో వంద కవర్లు పూర్తి అయ్యాక వాటిని ఎండలో ఆరబెట్టి, గదిలోకి వెళ్లి గోధుమ పిండి, పెనం, స్టవ్వు, గిన్నెలు సర్దుకుంది. సాయంత్రం నాలుగు గంటలు అయ్యింది. ఇంతలో స్కూల్ నుంచి పిల్లలు రావడంతో వాళ్ళకు స్నానాలు చేయిస్తాడేమోనని ఆశతో సూరిబాబు కేసి చూసింది. బయట కుర్చీలో దర్జాగా కూర్చుని ఆమెకేసి తల కూడా తిప్పకుండా మొబైల్లో ఆన్లైన్ గేమ్స్ ఆడుకుంటూ కూర్చొన్నాడు.‘‘పిల్లల్ని దగ్గరకు తీసుకుని, తానం సేయిద్దారని కూడా లేదు’’ ఉసూరుమంటూ, వాళ్ళకి నీళ్ళు పోసి, ఉతికిన బట్టలు వేసి, చేతుల్లో చిరుతిళ్ళు పెట్టింది. కాస్త చీకటి పడగానే, గోధుమపిండి, సామాన్లు, సంచిలో పెట్టుకుని కాలనీలో నాలుగు రోడ్ల జంక్షన్ వద్దకు బయలుదేరడానికి సిద్ధం అయ్యింది. ఆమె వైపు తల కూడా తిప్పకుండా మొబైల్ చూసుకుంటున్న మొగుడిని చూడగానే ఆమెకు చిర్రెత్తు కొచ్చింది.‘‘ఎప్పుడు సూసినా పోనట్టుకుని ఆడుకోడమేనా, కాంత సాయం సెయ్యలేవా’’ అతని చేతిలో ఫోన్ లాక్కోడానికి ప్రయత్నం చేసింది. ఆమెని పక్కకు తోసేసి, ‘‘ఉండేహే ఆట మంచి రంజుగా ఉంది, నీ పని నువ్వు సూసుకో, మద్దెలో అడ్డం రాకు! ఎన్నాళ్ళు ఈ సిన్నా సితకా పనులు సేత్తాం డబ్బుల కోసం? కొట్టేదేదో గట్టిగా కొట్టాలి’’ అంటూ బెట్టింగ్ గేమ్స్‌లో దూరిపోయాడు. ఉసూరుమంటూ సంచీని మోసుకుని వెళ్లి, నాలుగు రోడ్ల జంక్షన్లో ఒక పక్కగా సామాను చేర్చి గోధుమ రొట్టెలు కాల్చి అమ్మడం మొదలుపెట్టింది. అలా రాత్రి తొమ్మిది వరకూ అమ్ముకుంది. ఇంతలో సూరిబాబు నుంచి ఫోన్ రాగానే, ‘‘అయిపోయింది వత్తన్నా!’’ అంటూ అన్నీ సర్దుకుని ఇంటికి బయలుదేరింది. తనకున్న చిన్నపాటి తెలివితో, చిరు సంపాదనకి చిన్న చిన్న మార్గాలు వెతకడం, ఎంత చిన్న ఆలోచన వచ్చినా దాన్ని అమలుపరచడం నిరంతరం చేసేదామే. పండగలు వస్తే వినాయక చవితికి మట్టి వినాయక బొమ్మలు, దీపావళికి మతాబులు చేసి అమ్ముకునేది.∙∙ ఒకరోజు ఆమె చేసిన కవర్లు తీసుకువెళ్ళడానికి వచ్చినతను, ‘‘సాయిత్రి! మా సేటుకి యాపారం మంచిగ లేదుట, ఆయన దుకాన్ బంద్ జేస్తుండు, ఇంగ కవర్లు వద్దుట, నీకివ్వలసిన పైసల్ తీసుకో’’.. చేతిలో పెట్టి స్కూటర్ మీద వెళ్ళిపోయాడు.హఠాత్తుగా ఆధరువు పోవడం ఆమె చిన్న జీవితానికి తగిలిన పెద్ద దెబ్బ. దాన్ని తట్టుకునే లోపు మరో దెబ్బ ఆమె జీవనానికి మరింత గట్టిగా తగిలింది. రోడ్డుపక్కన రొట్టెలు అమ్ముకునే ప్రదేశంలో కంకర గుట్టలు పోసేశారు. అక్కడ ఆకాశ హర్మ్యం నిర్మాణం మొదలైంది. ఆమె ఆశల భవంతి కూలిపోయింది. ఎక్కడైనా ఖాళీ ఉన్న చోటు దొరికితే, అమ్ముకుందామని తిరిగి తిరిగి ఎక్కడా దొరక్క, దిగాలుగా ఇంటికి తిరిగి వచ్చింది. సూరిబాబు ఆమెను చూసి, ‘‘అప్పుడే వచ్చేశావే, ఎంత గిరాకి అయ్యింది ఇయ్యాల’’ వెటకారంగా అన్నాడు నవ్వుతూ. రోడ్డు మీద కంకర పోశారనే విషయం తెలిసి కూడా చెప్పలేదని, కోపంగా చూసింది అతనికేసి. అతను నిర్లక్ష్యంగా తల విసిరి, కంచంలో అన్నం కలుపుకుంటూ, పక్కనున్న మొబైల్ చూసుకుంటున్నాడు. నిద్రపోతున్న పిల్లల్ని లేపి, అన్నాలు పెట్టే పనిలో పడింది సావిత్రి.మర్నాడు ఉదయం అన్యమనస్కంగా పనిచేస్తున్న సావిత్రిని గమనించిన రేవతి, ‘‘ఏంటే ఇవ్వాళ నీరసంగా ఉన్నావు? టీ తాగుతావా?’’ అడిగింది. చేస్తున్న రెండు పనుల ప్రవాహానికి గండి పడిందని నిరాశగా చెప్పింది.‘‘అయ్యో! బాధపడకు. నువ్వు తెలివైనదానివి, వేరే ఏదైనా దొరుకుతుందిలే, కష్టించి పని చేసేవాళ్ళకు ఎదో కొత్త దారి దొరుకుతూనే ఉంటుందిలే’’ ఓదార్చింది.ఖాళీగా ఉండడం అంటే సావిత్రికి భయం. తమ ఊళ్ళో ఏ పనీ చేయకుండా కాళ్ళ దాకా వచ్చింది, నోటి దాకా రాకుండా పోతుందా అనే ధీమాతో బతికేస్తూండే చాలామందిని చూస్తే చాలా భయం. కాళ్ళదాకా వచ్చేది హఠాత్తుగా ఆగిపోతే భవిషత్తులో ఎలా జీవించాలో అనే భీతి లేకుండా బ్రతికేవాళ్ళని చూస్తే మరీ భయం. భర్తను చూశాక, ఆ భయం మరీ ఎక్కువైంది. అతని సోమరితనం, జీవితం పట్ల నిర్లక్ష్యం చూసి, అతనంటే అసహ్యం మరింత పెరిగింది. ఎవ్వరిమీద ఆధారపడకుండా, తన కష్టాన్ని నమ్ముకుని పైకి రావాలనే తపన ఆమెను మరిన్ని కొత్త ఆలోచనలకు పురికొల్పుతూ ఉంటుంది.∙∙ ధనుర్మాసం వచ్చింది. కాలనీలో ఉండే వెంకటేశ్వరస్వామి గుడిలో తిరుప్పావై వైభవంగా జరుగుతోంది. గుడి ప్రాంగణంలో ప్రవచనం వినడానికి రేవతి సావిత్రిని కూడా తీసుకుని వెళ్ళింది. ప్రవచనకర్త చెప్పిన ఆధ్యాత్మిక విషయాలు సావిత్రికి అర్థం కాలేదు. కానీ ఆయన చెప్తున్న ఉపన్యాసంలో జీవితాన్ని ఎలా సరిదిద్దుకోవాలో, కష్టాలని ఎలా అధిగమించాలో, ఎలా పోరాడాలో చెప్పడం మాత్రం ఆమెకు బాగా నచ్చింది. ఇంతలో ఆయన ధనుర్మాసం అంతరార్థం చెప్తూ, రాబోయే పండుగలు చాలా విశిష్టమైనవని, ఇంటి ముందు ముగ్గులు వెయ్యడం శరీరానికి మంచి వ్యాయామం అని, ఆవు పేడతో గొబ్బెమ్మలు పెట్టడం వలన లక్ష్మీదేవి ఇంటిలో కొలువై ఉంటుంది అని భక్తిని మేళవించి చెప్పడం వలన ఆ కాలనీ వాసుల బుర్రలోకి ఆయన వాక్కులు బాగా ఎక్కాయి.కాలనీ వాసులలో పెళ్లి కాని అమ్మాయిలకు ముగ్గుల పోటీ పెట్టాలనే ఆలోచన మహిళా కార్పొరేటర్ బుర్రలో మొలకెత్తింది. ఆ వార్త విన్న సావిత్రి బుర్రలో రెండు కొత్త ఐడియాలు పురుడు పోసుకున్నాయి. కాలనీలో ఇంటింటికీ వెళ్లి, తనకు ముగ్గులు వేయడం బాగా వచ్చని, ముగ్గు చేతకాని ఆడపిల్లలకు నేర్పి కొన్ని డబ్బులు సంపాదించింది. అలాగే గుడి పక్క గోశాలకు వెళ్లి ఆవు పేడ తెచ్చుకుని, గొబ్బెమ్మలు చేసి, అందంగా బంతి పూలు అమర్చి అమ్మింది. కనుమ పండుగ నాడు ముగ్గుల పోటీలో బహుమతి వచ్చిన అమ్మాయి, సావిత్రి కష్టానికి జాలిపడి, తనకి వచ్చిన క్యాష్ బహుమతిలో కొంత ఇచ్చేసింది. ఆ డబ్బులు కూతురి భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని బ్యాంకులో డిపాజిట్ వేసింది. ఆ విషయం తెలిసిన రేవతి సావిత్రిని అభినందిస్తూ, ‘‘చూశావా సావిత్రి! దేనికీ నిస్పృహ చెందకుండా కాస్త ఆలోచిస్తే ఇలాంటి పనులు సంవత్సరమంతా ఏవో ఒకటి దొరుకుతూనే ఉంటాయి’’ అంది రేవతి.‘‘అవును అమ్మగారు!’’ ఆనందం వ్యక్తపరచింది. ఇలాగే డబ్బులు సంపాదిస్తున్న సావిత్రి ముందు ముందు తనని లెక్కచేయదేమోననే అనుమానం జెర్రిగొడ్డులా సూరిబాబు మనసులో ప్రవేశించింది.∙∙ వేసవికాలంలో అక్క, బావలతో కలిసి తిరుపతి మొక్కు తీర్చుకుందామని వెళ్ళింది సావిత్రి. తిరుపతి నుంచి సావిత్రి తిరిగి రాగానే, సూరిబాబు, ‘‘మా యమ్మకి సానా తేడా సేసిందంట, మనం కొన్ని రోజులు అక్కడే ఉండాలి’’ స్వంతవూరికి బయలుదేరదీశాడు. అత్తకి సుస్తీ అన్నది అబద్ధం, అతనికి పనిచేయడం ఇష్టం లేదు అన్నది నిజమని తెలుసుకున్న సావిత్రి అతన్ని నిలదీస్తే, ఆమె కంఠ శోష గోదావరి రైలు వంతెన ఘోషలో కలిసిపోయింది. సావిత్రి కష్టపడి కూడబెట్టిన డబ్బులన్నీ సూరిబాబు చేతిలో పడి బెట్టింగ్ పాలైపోయాయి. సావిత్రికి గుండె మండిపోయింది. గట్టిగా నిలదీస్తే, ‘‘దర్జాగా హైడ్రాబాడ్ లో తిరుగుదారని అనుకుంటున్నావేమో! మనతో కుదరదు, సిటీ ఓళ్ళ మాటలు బాగా సెవికెక్కి నన్ను పట్టించుకోవడమే మానేహావు’’ అంటూ ప్రతీరోజూ మాటలతో మానసికంగా హింసించేవాడు. పెల్లుబుకుతున్న కన్నీటి గోదారిని అదుపుచేసుకుంటూ..‘నానేం తప్పు సెయ్యలేదే, నానెందుకు ఏడవాలి? సదువు సంజలులేని మొరటోడు, జీవితం ఇలువ తెలియని సన్నాసి ఆడేదో అన్నాడని ఏడవడం ఏంటి? నాను సావిత్రి! ఐదో కలాసు. ఆడు నిసానీ గాడు’ మనసుకు నచ్చ చెప్పుకుంది. అలా అనుకోవడమే తడవుగా గుండెల్లో కలిగిన బాధ మటుమాయం అయ్యింది. గబ గబా అన్నం వండి పిల్లలలకి పెట్టి, నాలుగు మెతుకులు నోట్లో వేసుకుని, కొబ్బరిచెట్టు కింద నులకమంచం వాల్చుకుని, పక్కలో పిల్లల్ని వేసుకుని ఆలోచిస్తూ నడుం వాల్చింది. కొబ్బరి ఆకుల మీద నుంచి ఆమెపై పడుతున్న కొబ్బరి పువ్వుల్లా ఆలోచనలకు రూపం వచ్చి ఒక్కటి ఒక్కటీ ఆమె ముందు సాక్షాత్కారిస్తున్నాయి.‘అవును ఆ పని చేస్తాను, కొబ్బరిసెట్టులా నిబ్బరంగా నిలబడతాను’ మనస్సుకి ధైర్యం చెప్పుకుని, నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. మధ్యరాత్రి వేళ హఠాత్తుగా వచ్చిన అంతు తెలియని కడుపు నొప్పి తీవ్రమై సొమ్మసిల్లి పడిపోయింది. ఆసుపత్రిలో జాయిన్ చేశారు సావిత్రి అక్క, బావ. చేతిలో ఒక్క పైసా కూడా లేని సూరిబాబు చేతులు నలుపుకుంటూ బయట కూర్చున్నాడు. జీవితంలో ఎంతో పైకి ఎదుగుదామనుకున్న సావిత్రికి, ఆమె కడుపులోని చేదుకట్టుకి వచ్చిన రోగం యముడిలా ఆమె ఆశలకు అడ్డుకట్టు వేసింది. ఆపరేషన్ చేసి చేదుకట్టు తొలగిస్తే గాని బతకదని డాక్టర్ చెప్పాడు. చావు బతుకుల మధ్య ఊగిసలాడుతోంది సావిత్రి.సావిత్రి ఎందుకు తిరిగి రాలేదో కనుక్కోవడానికి రేవతి ఫోన్ చేసింది. సావిత్రి బావ ఫోన్ ఎత్తి, ‘‘సావిత్రికి సానా తేడా సేసింది ఆపరేసన్ సేసి సేదుకట్టు తీసేశారు’’ అన్నాడు. ‘‘చేదుకట్టు అంటే’’ అడిగింది ? అదేనమ్మ గాల్... గాల్ అని తడుముకుంటుంటే, గాల్ బ్లేడరా ? ‘‘అవునమ్మా అదే’’ అన్నాడు. చాలా బాధపడింది రేవతి. కొంత డబ్బు పంపించింది.శల్యం మీద కోత వలన పార్వతి చిక్కి శల్యమయ్యింది. బలం పుంజుకొని తన పని తాను చేసుకోవడానికి మూడు నెలలు పట్టింది. రోజు రోజుకి ఇంట్లో పరిస్థితులు దిగజారుతున్నాయి. దాచిన డబ్బులన్నీ అనారోగ్యానికి, ఇల్లు గడవడానికి ఖర్చు అయిపోయాయి. తల్లి, బావ చాలారోజులు సాయం చేసి, ఇంక మీ బాధలు ఏవో మీరే పడండని వదిలేసారు. పిల్లలకి కడుపునిండా అన్నం పెట్టలేకపోతోంది. అయినా సూరిబాబు ధోరణి మారలేదు. కష్టమైన పనైనా, కొబ్బరి వలుపు తీసే కొట్లో చేరింది. రోజంతా పని ఉండడం వలన శరీరం కష్టపడుతున్నా, మనసు మటుకు హాయిగా ఉంది. పనంతా చక్కబెట్టి, ఇంటికి వచ్చి పెరట్లో బట్టలు ఆరేస్తూ ఆలోచనలో పడింది. ఇంతలో ఇంటి గోడను వొరుసుకుంటూ వడివడిగా ప్రవహిస్తూ వెడుతున్న గోదావరిలో పయనిస్తున్న పడవను చూశాకా, రేవతి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ‘నది ప్రయాణంలో నావకు తగులుతున్న నీటి దెబ్బలను, ఒడిదుడుకులు చూస్తే అవతలి ఒడ్డుకి చేరగలదా అని మొదట కంగారు పడతాం. కానీ అది చేరుకున్నాక, ఇంతేనా అనిపిస్తుంది. జీవితం కూడా అంతే!’ ఆ మాటలు తలుచుకోగానే ఉత్సాహం వచ్చింది. మెదడులో మరో కొత్త ఆలోచన ఉదయించింది.∙∙ నిన్ను ఈ స్థాయిలో చూస్తుంటే చాలా గర్వంగా ఉందే సావిత్రి! అంటూ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది రేవతి.‘‘ఆ రోజు మీరన్న మాటలే నన్ను కట్టంలో కూడా దైర్యంగా నిలబడమని సెప్పేయమ్మా! లోకంలో పనికిరాని వస్తువంటూ ఏదీ లేదు, ప్రతీది మనకి ఉపయోగ పడేదే అని గుడిలో ఆ రోజు గురువుగారు సెప్పిన మాటలు నన్ను ఈ యాపారం సెయ్యమని సెప్పినట్టు అనిపించి ధైర్యంగా దిగిపోయాను.’’ అంది వినయంగా...‘‘అది సర్లే గానీ, కొబ్బరి పెంకులతో, పీచుతో చేసిన బొమ్మలు, గ్రామీణ ఉత్పత్తుల మార్కెటింగ్ మటుకు భలే కొత్త తరహాలో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రాంలో నీ పిల్లలతో చేయిస్తున్నావు చూడూ! అదీ నీ తెలివి. భలేగా ఉందే నీ ఐడియా’’ అంటూ అభినందించింది రేవతి.‘‘మీరు ఇచ్చిన పాత ఫోన్లో అయన్నీ నేర్సుకున్నాను అమ్మా’’ చెప్పింది వినయంగా.ఇంతలో శిల్పారామం దర్శించడానికి వచ్చిన వాళ్ళు సావిత్రి, పిల్లలను గుర్తుపట్టి ఫొటోలు తీయించుకుంటున్నారు.‘‘నాకు కూడా ఒక సెల్ఫీ ఇవ్వవే నువ్వు ఇంకా పైకి ఎదిగిపోతే మాకు దొరకవు కూడానూ’’ నవ్వుతూ అంది రేవతి . ‘‘అయ్యో అమ్మగారు! మిమ్మల్ని మర్చిపోవడమా, ధైర్యంగా బతకడం ఎలాగో నేర్పినది మీరే.’’ అంటూ ఇద్దరినీ ఫ్రేములోకి బిగించి క్లిక్‌మనిపించింది. సావిత్రి మొహంలో చిరుగర్వం, ఆత్మవిశ్వాసం.. ఎదురుదెబ్బలెన్ని తగిలినా, గండాలు వచ్చినా స్థిరంగా తన కాళ్ల మీద నిలబడగలిగాననే చిరుగర్వం! రేవతి మొహంలో సంతృప్తి... తన కళ్లెదుటే మారాకు తొడిగిన మొక్క, మహావృక్షంగా ఎదిగిన క్రమంలో తాను కూడా కొంత చేదోడు కాగలిగాననే సంతృప్తి! ఆ ఆనందసమయంలో సూరిబాబు గురించి అడగలేకపోయింది రేవతి.పని చేయలేని అశక్తుడితో, చేతకానివాడితో సర్దుకుపోవచ్చు. పని చేయదలచుకోని వాడితో ఎంతకాలం సర్దుకుపోగలం?బాధ్యత తెలియని వాడితో సర్దుకుపోవచ్చు. బాధ్యతల నుంచి తప్పించుకోవాలని చూసేవాడితో ఎలా సర్దుకుపోవడం?సుఖపడేవాళ్లను చూసి ఓర్వలేని వాడి నైచ్యం అర్థం చేసుకోవచ్చు. కానీ కష్టపడేవాళ్లని చూసి కూడా ఓర్వలేని వాడిని ఎలా సహించడం? ఆస్పత్రి పాల్జేసి మంచం పట్టించిన అనారోగ్యం సావిత్రికి ఓ బతుకుపాఠం నేర్పింది! చేదుకట్టు దేహానికి అవసరమే! అది ఎందుకూ కొరగాకుండా పోయినప్పుడు, ఉపేక్ష కూడా కూడా ప్రమాదమే... కత్తిరించి తీసేయడమే దేహానికి రక్ష! బతికినంత కాలమూ కొన్ని జాగ్రత్తలు తప్పవు. నిజమే, తాళికట్టిన పెనిమిటే. జీవితానికి అవసరమే. కాని, ఒక నిర్ణయానికి వచ్చింది సావిత్రి. సావిత్రి చేసింది తప్పో ఒప్పో ఎవరు చెప్పగలరు? ఆమె అనుభవించిన ఆనందమైనా, బాధైనా ఆమె స్వంతం కదా మరి.- చాగంటి ప్రసాద్ -
డిజిటల్ మైండ్ గేమ్.. కూతురి పెళ్లికి 24 గంటల ముందు కిడ్నాప్!
హోమ్ మినిస్టర్ బెనర్జీ ఇల్లు..టెర్రస్ మీద వున్నాడు హోమ్ మినిస్టర్ బెనర్జీ. అతని ఎదురుగా క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న.‘ప్రద్యుమ్న! ఇది డిపార్ట్మెంట్ ఆర్డర్ కాదు. ఒక తండ్రిగా అడుగుతున్న సాయం. నా కూతురు నీల పెళ్లి మరో 24 గంటల్లో ఉంది. కానీ ఆమెను ‘విక్టర్’ అనే వంచకుడు మాయమాటలతో లొంగదీసుకుని ఎత్తుకెళ్లాడు. వాడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఇదిగో వాడి క్రిమినల్ డేటా ఫైల్’ అని ఒక ఫైల్ అందించాడు.ఆ ఫైల్లో విక్టర్ క్రిమినల్ రికార్డ్ వుంది. అతని ఫోటో కూడా వుంది. ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న క్రైమ్ ఆపరేషన్ మొదలుపెడితే ముందు కీలక ఆధారాలేవో చూస్తాడు. క్రాస్ వెరిఫికేషన్ చేస్తాడు. హోమ్ మినిస్టర్ ఇచ్చిన విక్టర్ ఫైల్ ఓపెన్ చేశాడు. ఫైల్ ఓపెన్ చేయగానే అతని పదునైన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్రెయిన్ పనిచేయడం ప్రారంభించింది.క్రైమ్ బ్రాంచ్ సెంట్రల్ డేటాబేస్‌తో ప్రద్యుమ్న క్రాస్ వెరిఫికేషన్ చేశాడు. అందులో విక్టర్ ఫోటో అతికించిన పేజీ దగ్గర పిక్సెల్ వ్యత్యాసం, మార్ఫింగ్ గుర్తులు స్పష్టంగా కనిపించాయి. విక్టర్ ఫోటోను మార్ఫింగ్ చేసి తగిలించాడు. ప్రద్యుమ్న హ్యాకింగ్ టీమ్‌తో ఇంటర్‌పోల్ డేటాను స్కాన్ చేయించగా, ఆ క్రిమినల్ రికార్డ్ అంతా విక్టర్‌ది కాదు, ‘బెన్నీ’ అనే కిల్లర్‌ది అని తేలిపోయింది. విక్టర్ కేవలం ఒక విద్యాధికుడైన సామాన్య యువకుడని, బెనర్జీ డ్రైవర్‌గా పనిచేస్తూ నీలను ప్రేమించాడని ప్రద్యుమ్న కనిపెట్టాడు. ఇక్కడ ప్రద్యుమ్న తన మైండ్ గేమ్‌ను మొదలుపెట్టాడు.∙∙ కొత్త సిమ్ సిగ్నల్ ఏ టవర్ పరిధిలో ఉందో తెలుసుకోవడానికి ప్రద్యుమ్న ‘టవర్ ట్రయాంగులేషన్’ సాంకేతికతను వాడాడు. మూడు వేర్వేరు మొబైల్ టవర్ల సిగ్నల్ రేడియస్‌ను విశ్లేషించి, వారు కచ్చితంగా నగర శివార్లలోని పాత వంతెన పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారని కనిపెట్టి, వారి లైవ్ లొకేషన్ ను లాక్ చేశాడు. సిగ్నల్ క్లోనింగ్ లొకేషన్ దొరకగానే ప్రద్యుమ్న వారి సిగ్నల్‌ను తన రూట్ మ్యాప్‌కు క్లోన్ చేసుకుని, అక్కడికి వెళ్ళాడు. అక్కడ బిక్కుబిక్కుమంటూ వున్నారు విక్టర్... నీల..అదే సమయంలో హోమ్ మినిస్టర్ సుపారీ ఇచ్చి పంపిన కిల్లర్ బెన్నీ కంటే ముందే అక్కడికి చేరుకోగలిగాడు.కిల్లర్ బెన్నీ తుపాకీ గురిపెట్టి విక్టర్‌పై కాల్పులు జరపబోయాడు. సరిగ్గా అదే సమయంలో ప్రద్యుమ్న తన సర్వీస్ రివాల్వర్‌ను బయటకు తీశాడు. బుల్లెట్లు కిల్లర్ బెన్నీ బాడీలోకి దూసుకువెళ్లాయి.∙∙ ‘సార్, మీరు చెప్పినట్టే మీ కూతురు నీలను ఎత్తుకెళ్లిన పేరుమోసిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను షూట్ చేసి చంపేశాను. కాకపోతే అతని పేరు విక్టర్ కాదు, బెన్నీ. మీరు ఫైల్లో ఇచ్చిన అన్ని వివరాలు మ్యాచ్ అయ్యాయి, ఫోటో తప్ప... అన్నట్టు ఈ ఆపరేషన్‌లో మీ కూతురు నీల, ఆమెను ప్రేమించిన విక్టర్ సాయపడ్డారు...’ అంటూ తల వెనక్కి తిప్పాడు.నీల, విక్టర్ లోపలికి వచ్చారు.బెనర్జీ తన టేబుల్ సొరుగులో ఉన్న రివాల్వర్ తీశాడు పట్టరాని కోపంతో...ప్రద్యుమ్న కూల్‌గా టేబుల్‌పై ఒక పెన్ డ్రైవ్ పెట్టాడు. ‘సార్, చనిపోయింది మీ హిట్‌మ్యాన్ బెన్నీ... ఇంటర్‌పోల్ క్రిమినల్ ఫైల్‌ను మీరు మార్ఫింగ్ చేసిన సాక్ష్యం, బెన్నీతో మీరు మాట్లాడిన ఆడియో రికార్డింగ్ ఇందులో ఉన్నాయి. మీరు నోరు తెరిస్తే ఈ నిజం బయటపడి మీ పరువు, పదవి రెండు పోతాయి. విక్టర్ యోగ్యుడు. వాళ్ళను ఆశీర్వదిస్తే మీరు చేసిన పాపం, నేరం కొంతవరకైనా తగ్గుతాయి. లేదంటే మీ ఇష్టం’ అని వెనుదిరిగాడు.∙∙ హోమ్ మినిస్టర్ కూతురిని కిడ్నాప్ చేసిన పేరుమోసిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బెన్నీని వెంటాడి ఎదురు తిరగడంతో షూట్ చేసిన ప్రద్యుమ్న.. కిడ్నాపర్‌ను పట్టుకోవడానికి సహకరించిన హోమ్ మినిస్టర్ కారు డ్రైవర్ విక్టర్ తో పెళ్లి జరిపించిన హోమ్ మినిస్టర్ గొప్ప మనసు.మీడియాలో బ్రేకింగ్ న్యూస్...అంతకు మించి ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న ‘డిజిటల్ మైండ్ గేమ్’లో నుంచి బయట పడడానికి మరో ఆప్షన్ లేదు హోమ్ మినిస్టర్‌కు.- శ్రీసుధామయి -
జుట్టు రాలే సమస్యకు స్మార్ట్ టెక్నాలజీ!
నేటి ఆధునిక జీవనంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జుట్టు రాలడమనేది సహజమైపోయింది. జుట్టు రాలడాన్ని తగ్గించేందుకు అచ్చంగా హెల్మెట్‌లా కనిపించే అత్యాధునిక పరికరం మార్కెట్లోకి చేరింది. అదే ‘లో లెవల్ లైట్ థెరపీ’ ఆధారంగా పనిచేసే కరెంట్ బాడీ స్కిన్ ఎల్ఈడీ హెయిర్ గ్రోత్ డివైస్. సర్జరీలతో పనిలేకుండా, నాన్–ఇన్వేసివ్ పద్ధతిలో పనిచేసే ఈ పరికరంలో 120 ఎల్ఈడీ బల్బులను అమర్చారు. ఇవి తల ఉపరితలం అంతటా నిర్దిష్ట కాంతి తరంగాలను ప్రసరింపజేసి కుదుళ్లను తిరిగి ఉత్తేజపరుస్తాయి.అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం పొందిన ఈ హెడ్సెట్ స్త్రీ, పురుషులిద్దరిలోనూ హార్మోన్ల వల్ల లేదా జన్యుపరంగా వచ్చే జుట్టు నష్టాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ 10 నిమిషాల చొప్పున, 16 వారాలు దీనిని వాడితే మెరుగైన ఫలితాలు పొందవచ్చు. ఈ డివైస్ కేవలం హెయిర్ కేర్కే పరిమితం కాకుండా వినోదాన్ని కూడా పంచుతుంది. ఇందులో బ్లూటూత్ హెడ్‌పోన్స్ కూడా ఉంటాయి. చికిత్స పొందుతున్న సమయంలో తమకు ఇష్టమైన పాటలు, పాడ్‌కాస్ట్‌లు వినవచ్చు. -
అవా ఒడోరి... డాన్స్ హుషారే!
జపాన్‌లో షికోకు దీవిలోని తోకుషిమా నగరంలో సందడి మొదలైంది. నాలుగు శతాబ్దాల చరిత్ర కలిగిన ‘అవా ఒడోరి’ సంప్రదాయ నృత్యోత్సవ సంరంభానికి సిద్ధమైంది. ఏటా ఆగస్టు 12 నుంచి 15 వరకు జరిగే ఈ వేడుకలను తిలకించడానికి పదిలక్షల మంది సందర్శకులు తరలి వస్తారని అంచనా. ఈ వేడుకల్లో వేలాదిమంది సంప్రదాయ నర్తకులు పాల్గొంటున్నారు.మామూలు రోజుల్లో ప్రశాంతంగా ఉండే తోకుషిమా నగరం ఈ నాలుగు రోజులు మాత్రం రంగుల ప్రపంచంగా మారిపోతుంది. రాత్రి వేళల్లో ప్రధాన రహదారులను మూసివేసి డాన్స్ షోల కోసం ప్రత్యేకమైన స్టేజ్‌లు, సందర్శకుల కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. నది ఒడ్డున వెలిసే సంప్రదాయ స్ట్రీట్ ఫుడ్ షాపులు పండుగ వాతావరణాన్ని మరింత రెట్టింపు చేస్తాయి. ఈ ఉత్సవ వైభవం బ్రెజిల్‌లోని రియో కార్నివాల్‌ను తలపిస్తుంది.వందల ఏళ్ల చరిత్ర..ఈ నృత్యోత్సవం ఆవిర్భావం వెనుక మూడు ప్రత్యేకమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మొదటిది బోన్ ఒడోరి. జపాన్‌లో ఏటా వేసవిలో పితృదేవతల జ్ఞాపకార్థం జరుపుకునే ఒబోన్ పండుగలో చేసే బోన్– ఒడోరి నృత్యం నుంచి ఈ పండుగ ఆవిర్భవించిందని ఒక నమ్మకం. రెండోది ఒక కోట నిర్మాణం. క్రీ.శ. 1587లో హాచిసుకా ఇయెమాసా అనే రాజు తోకుషిమా కోట నిర్మాణాన్ని పూర్తి చేసిన సందర్భంగా ప్రజలకు విందు ఇచ్చాడు. ఆ ఆనందంలో సామాజిక హోదాలతో సంబంధం లేకుండా ప్రజలంతా మైమరిచి చేసిన బృంద నర్తనమే కాలక్రమేణా ‘అవా ఒడోరి’గా మారిందంటారు. మూడోది జాపనీస్ నోహ్ నాటకాలకు మూలమైన ఫుర్యూ నృత్యం నుంచి ఈ పండుగ వచ్చిందనేది మరో కథనం. అందరూ ఆహ్వానితులే!ఈ అవా ఒడోరి వేడుకల్లో ఎవరైనా పాల్గొనవచ్చు. ఇందులో నృత్యకారులు ‘రెన్’, ‘నివాకా రెన్’ అని పిలిచే బృందాలుగా ఏర్పడతారు. సాధారణ ప్రజలు, పర్యాటకుల కోసం నివాకా రెన్ అనే వేదికను ఏర్పాటు చేస్తారు. వీరు ప్రత్యేక దుస్తులు ధరించాల్సిన అవసరం లేదు. డాన్స్ ప్రారంభించే ముందు ప్రసిద్ధ కళాకారుల నుంచి ఉచితంగా స్టెప్పులు నేర్చుకుని వేడుకల్లో పాల్గొనవచ్చు. సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ప్రధాన రహదారులను మూసివేసి డాన్సులు చేస్తుంటారు. అంతేకాదు, ఆగస్టు నెలలో జరిగే ఈ వేడుకల్లో పాల్గొనలేని పర్యాటకుల కోసం నగర కేంద్రంలోని ‘అవా ఒడోరి కైకాన్’ భవనంలో ఏడాది పొడవునా ఈ ప్రదర్శనలు అందుబాటులో ఉంటాయి. పగటిపూట ప్రత్యేక షోలతో పాటు, ప్రతిరోజూ రాత్రి ప్రసిద్ధ డాన్స్ గ్రూపులు ఇక్కడ ప్రదర్శనలు ఇస్తాయి. సందర్శకులకు డాన్స్ నేర్పి, వారితో కలిసి స్టెప్పులు వేయిస్తారు.విభిన్న నృత్య శైలులు ఈ అవా ఒడోరిలో మహిళలు, పురుషుల డాన్స్స్టైల్ వేరువేరుగా ఉంటుంది. మహిళలు ఎంతో సొగసుగా, కాలివేళ్లపై నిల్చుని నాట్యం చేస్తారు. ఇందుకోసం నల్లటి సంప్రదాయ చెక్క చెప్పులను ధరిస్తారు. వీటి నుంచి వచ్చే క్లిక్–క్లాక్ శబ్దాలు ప్రదర్శనకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తలపై విసనకర్ర ఆకారంలో ఉండే ‘అమిగాసా’ అనే గడ్డితో చేసిన టోపీలను ధరిస్తారు. ఇక పురుషులు ‘హప్పి’ అనే వదులైన సంప్రదాయ దుస్తులు ధరించి చాలా ఫాస్ట్‌గా కదులుతూ డాన్స్‌లు చేస్తుంటారు. పేపర్ లాంతర్లను గాల్లో వేగంగా తిప్పుతూ వెలుగులతో విన్యాసాలు చేస్తారు. ఈ వేడుకలు జరిగే నాలుగు రోజుల పాటు షామిసేన్ అనే మూడు తీగల వాయిద్యం, యోకోబుయె అనే వెదురు పిల్లన గ్రోవి, కానే (గంట), తైకో (పెద్ద డ్రమ్స్) వంటి సంప్రదాయ సంగీత వాయిద్యాలను ఉపయోగిస్తారు. ఇదే సమయంలో పర్యాటకులు సైతం సంప్రదాయ పాటలు పాడుతూ అందరినీ ఉత్సాహపరుస్తుంటారు.∙ రమా జంబుల -
80వ ఏట అడుగిడుతున్న స్వాతంత్య్రం
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఈ ఆగస్టు 15 నాటితో 79 ఏళ్లు పూర్తవుతున్నాయి. మన స్వాతంత్య్రం 80వ ఏట అడుగిడుతోంది. స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్‌వారు మన దేశాన్ని దాదాపు రెండువందల సంవత్సరాలు పాలించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా 1857లో సిపాయిల తిరుగుబాటు చెలరేగింది. దేశ స్వాతంత్య్రం కోసం జరిగిన తొలి పోరాటమది. ఆ పోరాటం విఫలమైన తర్వాత కూడా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పలు ఉద్యమాలు నడిచాయి. దక్షిణాఫ్రికాలో 1906లో అహింసా పోరాటంతో విజయం సాధించిన గాంధీజీ స్వదేశానికి తిరిగి వచ్చాక 1917 ఏప్రిల్ 17న తొలిసారిగా ‘చంపారన్ సత్యాగ్రహ’ ఉద్యమంలో పాల్గొన్నారు. గాంధీజీ నాయకత్వంలో ఏకమైన ప్రజానీకం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలను ఉద్ధృతం చేసింది. చివరకు బ్రిటిష్ పాలకులు గద్దె దిగడంతో 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్య్రం వచ్చింది.భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవానికి ప్రభుత్వం ‘స్వేచ్ఛను గౌరవిస్తూ, భవితకు స్ఫూర్తిన్తూ’ నినాదాన్ని నేపథ్యంగా ఎంచుకుంది. గడచిన 79 ఏళ్లలో అధిగమించాల్సిన సమస్యలు చాలానే ఉన్నా, మన దేశం శాస్త్ర సాంకేతిక ఆర్థిక రంగాలలో గణనీయమైన పురోగతి సాధించింది. ఈసారి ఆగస్టు 15న ఎర్రకోట వద్ద జరగనున్న వేడుకల్లో తొలిసారిగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన సైనిక సామగ్రిని ప్రదర్శించనున్నారు. ప్రధాని ప్రసంగాన్ని ‘డిజిటల్ ఇండియా భాషిణి’ ద్వారా ఏకకాలంలో ఇరవై భాషల్లో అప్పటికప్పుడే ప్రసారం చేయనున్నారు.ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్య్ర పోరాటంలో కొన్ని కీలకమైన మైలురాళ్లు...1857ఆనాటి బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా సిపాయిల తిరుగుబాటు జరిగింది.1858భారత ప్రజల రాజకీయ ఆకాంక్షల సాధన కోసం భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది.1905బెంగాల్ విభజన. దీనికి పర్యవసానంగా స్వదేశీ ఉద్యమం మొదలైంది.1919జలియన్‌వాలాబాగ్ దురంతం జరిగింది. తర్వాత దేశవ్యాప్తంగా ఉద్యమజ్వాలలు ఎగసిపడ్డాయి.1920–22గాంధీజీ నాయకత్వంలో సహాయ నిరకరణోద్యమం దేశవ్యాప్తంగా ఉద్ధృతంగా నడిచింది.1930గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించారు.1942‘క్విట్ ఇండియా’ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమంలో ఊరూరా నిరసనలు జరిగాయి.1947 ఆగస్టు15బ్రిటిష్ ప్రభుత్వం భారత్‌కు స్వాతంత్య్రాన్ని ప్రకటించింది. -
లెఫ్ట్..! రైటే
‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్’ అన్నాడో కవి. ప్రపంచంలో కుడిచేతివాటం వాళ్ల జనాభాదే మెజారిటీ. మెజారిటీని ఆమోదించడమే ప్రజాస్వామ్యం కదా! కుడిచేతివాటం వాళ్లకు పెద్దగా సమస్యలు లేవు. విరివిగా దొరికే వస్తువులన్నీ వారు వాడటానికి అనువైనవే! అలాగని ఎడమచేతివాటం వాళ్లు నిరాశపడాల్సిందేమీ లేదు. ఇప్పుడిప్పుడే వాళ్ల కోసమూ ప్రత్యేకంగా వస్తువులు వస్తున్నాయి. ఎడమచేతివాటం వస్తువుల దుకాణాలు ప్రత్యేకంగా వెలుస్తున్నాయి. ఎడమచేతివాటం వాళ్లలో ఎందరెందరో ప్రముఖులు ఉన్నారు. సినీ, క్రీడా, రాజకీయ రంగాలలో తమదైన ముద్రవేసిన వారు ఉన్నారు. అలాంటి లెఫ్ట్ హ్యాండర్స్ ఎందరో ‘లెఫ్ట్’ రైటేనని నిరూపిస్తున్నారు.కుడిచేత్తో రాయడం... తినడం... ఆడటం... ఇవన్నీ మనకు సహజంగానే కనిపిస్తాయి... కానీ ప్రపంచంలో పదిమందిలో ఒకరు మాత్రం తొమ్మిది మందికి భిన్నంగా ఎడమ చేతిని ఈ పనులకు ఉపయోగిస్తారు. ఈ చిన్న తేడానే వారిని ప్రత్యేకంగా నిలుపుతోంది. ఎన్నో అపోహలకు, వివక్షకు, పరిశోధనలకు ఇదే కారణమైంది. కానీ కాలం మారింది... ‘ఎప్పుడొచ్చామని కాదు అన్నయ్య.. బుల్లెట్ దిగిందా?.. లేదా?’ అని పండుగాడి డైలాగ్‌లా... ఏ చేయి వాడామన్నది కాదు... పోటీప్రపంచంలో నిలదొక్కుకున్నామా? లేదా? అనేదే ప్రస్తుతం సమాజం చూస్తోంది.ప్రపంచ వ్యాప్తంగా ఏటా ఆగస్టు 13న ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డే నిర్వహిస్తారు. డీన్ ఆర్. క్యాంప్‌బెల్ అనే వ్యక్తి 1992లో ఈ క్లబ్ అధికారికంగా లెఫ్ట్ హ్యాండర్స్ డేని నిర్వహించింది. ఆగస్టు 13నే ఎందుకు నిర్వహిస్తున్నారనే దానికి ప్రత్యేక కారణం ప్రకటించనప్పటికీ 1992లో ఆ రోజునే మొదటి అవగాహన కార్యక్రమం నిర్వహించడంతో అదే తేదీన ఏటా లెఫ్ట్ హ్యాండర్స్ డేని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఎడమచేతి వాటం వారిపై ఉన్న అపోహలను తొలగించడం, వారి అవసరాలను తయారీ సంస్థలకు తెలియజేయడం, వారికి అనుకూలంగా ఉండే వస్తువులు తయారు చేసేలా అవగాహన కల్పించడం ఈ క్లబ్ ముఖ్య ఉద్దేశాలు.ఎడమ చేతి వాటం ఉన్న వారికి కలిగే ప్రయోజనాలు, సవాళ్ల గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడమే దీని ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం ఈ దినోత్సవాన్ని ప్రపంచంలోని అనేక దేశాల్లో జరుపుకుంటున్నారు. ఆ రోజు వివిధ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, లెఫ్ట్ హ్యాండ్ వస్తువుల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఎడమ చేతి వాటం ఉన్నవారు ప్రత్యేకమైన వారు అని కాదు, అందరూ సమానమే అని చాటి చెబుతారు. ప్రతి వ్యక్తి తన సహజమైన చేతివాటంతో నేర్చుకునే, జీవించే, పనిచేసే హక్కు కలిగి ఉన్నాడనే సందేశాన్ని ఆ రోజు ప్రపంచానికి తెలియజేస్తారు.ఎడమచేతి వాటానికి కారణం?శాస్త్రవేత్తలు ఇప్పటికీ దీనికి ఒకే కారణాన్ని నిర్ధారించలేదు. ఎడమచేతి వాటానికి జన్యువులు కీలక పాత్ర పోషిస్తాయని ఎక్కువ మంది పరిశోధకుల అభిప్రాయం. మన శరీరంలో కుడి–ఎడమ వైపుల అభివృద్ధిని ప్రభావితం చేసే కొన్ని జన్యు మార్పులు ఎడమ చేతివాటంతో సంబంధం కలిగి ఉండవచ్చని పీఎల్ఓఎస్ జెనిటిక్స్ జర్నల్‌లో ఓ పరిశోధన ఫలితాల్ని ప్రచురించారు.సెంట్ అండ్రూస్ విశ్వవిద్యాలయం నిర్వహించిన మరో అధ్యయనంలో ఎడమ చేతి వాటం గల వారిలో కనిపించే కొన్ని జన్యు లక్షణాలు ‘సీటస్ ఇన్ వర్సస్’ అనే అరుదైన పరిస్థితితో పోలికలు కలిగి ఉండవచ్చని సూచించారు. ఈ పరిస్థితిలో గుండె, కాలేయం వంటి ప్రధాన అవయవాలు సాధారణ స్థానానికి వ్యతిరేక దిశలో ఉంటాయి. అయితే ఎడమచేతి వాటం ఉన్న వారందరికీ ఈ పరిస్థితి ఉంటుందన్న అర్థం కాదు. కొంతమంది పరిశోధకుల అభిప్రాయం ప్రకారం జన్యువులు చేతివాటాన్ని నిర్ణయించే అంశాల్లో ఒకభాగం మాత్రమే. మిగిలిన భాగం గర్భంలో జరిగే అభివృద్ధి, జీవసంబంధ ప్రక్రియలు, ఇతర పర్యావరణ ప్రభావాలు కూడా ఉండొచ్చు.రాతి యుగంలోనూ...ఎడమ చేతి వాటం ఆధునిక కాలంలోనే ఏర్పడిన అలవాటు కాదు. ఇది ఏళ్ల తరబడి మానవ జన్యు, మెదడు అభివృద్ధికి సంబంధించిన సహజ లక్షణం. రాతి యుగంలో మనుషులు తయారు చేసిన పనిముట్లు కుడి, ఎడమ రెండు చేతులతోనూ ఉపయోగించేందుకు అనువుగా ఉండేవి. గుహల్లో కనిపించే వివిధ చిత్రాలను పరిశీలించిన ప్పుడు ఆదిమానవులు వాటిని చెక్కడానికి ఎడమ చేతిని ఎక్కువగా వినియోగించినట్టు కొంతమంది పరిశోధకులు గుర్తించారు. అయితే కాలక్రమేణా పనిముట్లు మరింత అభివృద్ధి చెందడంతో ఒకే చేతిని ఎక్కువగా ఉపయోగించే అలవాటు ఏర్పడింది. తరువాత సూర్యారాధన వంటి ఆధారాల ప్రభావంతో కుడిచేతి వినియోగం మరింత ప్రాచుర్యం పొందిందని కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు.అపోహలుచాలాకాలం పాటు ఎడమచేతి వాటాన్ని సహజ లక్షణంగా కాకుండా ఒక లోపంగా భావించారు. ప్రసవ సమయంలో సమస్య వల్ల పిల్లలకు ఎడమ చేతివాటం వస్తుందని నమ్మేవారు. రోజువారీ పనులను ఎడమ చేతితో చేయడం అనాగరికం లేదా గౌరవం లేనిదిగా భావించే సంప్రదాయం సమాజంలో క్రమంగా ఏర్పడింది. మనదేశంలో చేతి వాడకంపై సేకరించిన వివిధ సర్వేల ఆధారంగా స్త్రీలతో పోలిస్తే పురుషులే ఎక్కువగా ఎడమచేతి వాటం కలిగి ఉన్నారు.దేశంలో ఎడమచేతితో పనులు చేయడాన్ని చాలామంది ఇప్పటికీ అసాధారణంగా భావిస్తుంటారు. ఎడమచేతివాటం కలిగిన వ్యక్తి సహజంగానే ఎడమచేతితోనే రాస్తాడు, మిగతా పనులకు ఎక్కువగా అదే చేతిని ఉపయోగిస్తాడు. ఎందుకంటే మెదడులోని కుడి భాగం (రైట్ హ్యామ్స్ఫియర్) ఎక్కువగా పనిచేసే వ్యక్తులు సహజంగానే ఎడమచేతిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ⇒ ఎడమ చేతివాటం వారు తక్కువ కాలం జీవిస్తారనే ప్రచారం ఉంది. దానికి బలమైన ఆధారాలు లేవని పరిశోధకులు నిరూపించారు. 1988లో అమెరికాకు చెందిన ఇద్దరు పరిశోధకులు స్టాన్లీ కోరెన్, డయాస్ హాల్పెర్న్లు– ఎడమ చేతివాటం ఉన్న వారు కుడిచేతి వాటం ఉన్న వారికంటే సగటున 8–9 సంవత్సరాలు తక్కువ జీవిస్తారని పేర్కొన్నారు. ఈ అధ్యయనం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ పరిశోధనలో లోపం ఉందని తర్వాత శాస్త్రీయ అధ్యయనాలు వెల్లడించాయి. అయితే కుడిచేతి వారిని దృష్టిలో ఉంచుకుని తయారు చేసిన పరికరాలు, యంత్రాలను వాడే సమయంలో వీరు ప్రమాదాల బారిన పడే అవకాశం ఎక్కువ అని పరిశోధకులు పేర్కొన్నారు.రోజువారీ సవాళ్లు⇒ ప్రపంచంలోని చాలా వస్తువులు, పరికరాలు, పని విధానాలు కుడి చేతివాటం వారిని దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఫలితంగా ఎడమ చేతివాటం ఉన్న వారు రోజువారీ జీవితంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది.⇒ మార్కెట్లో తయారు చేసే కత్తెరలు కుడిచేతి వారికోసం తయారు చేసినవే. ఫలితంగా ఎడమ చేతివారు వాటితో కత్తిరించేటప్పుడు. బ్లేడ్ సరిగా కనిపించకపోవడం, ఎక్కువ ఒత్తిడి పెట్టాల్సి రావడం, చేతికి అసౌకర్యం కలగడం వంటి సమస్యలు ఎదురవుతాయి.⇒ పాఠశాలలు, కళాశాలల్లో ఉండే అటాచ్డ్ రైటింగ్ డెస్కులు కుడిచేతివారిని దృష్టిలో పెట్టుకుని తయారవుతాయి. ఫలితంగా ఎడమచేతివాటం ఉన్న వారి చేయికి సరైన ఆధారం దొరకదు. ఎక్కువ సేపు రాయడం అసౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా పరీక్షల సమయంలో త్వరగా అలసిపోతారు.⇒ బాటిల్ మూత తెరిచే ఓపెనర్లు, స్పైరల్ నోట్‌బుక్స్, కిచెన్ సామగ్రి, గిటారు, కంప్యూటర్ మౌస్ వంటి పరికరాలు ప్రధానంగా కుడిచేతి వారిని దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. వీటిని ఉపయోగించడం వీరికి కొంత అసౌకర్యంగా ఉంటుంది.ఇది సహజమే... మార్చొద్దు...కుడిచేతితో ఇవ్వడాన్ని, తీసుకోవడాన్ని శుభకరంగా భావించే సంప్రదాయం, అలవాటు మన సమాజంలో బలంగా ఉంది. ఎడమ చేతితో ఆ పనుల్ని చేయడాన్ని అశుభంగా భావిస్తారు. దీంతో అనేకమంది ఎడమచేతి వాటాన్ని బలవంతంగా మార్చేందుకు ప్రయత్నిస్తారు. గతంలో పాఠశాలల్లో ఉపాధ్యాయులు సైతం విద్యార్థుల అలవాటు మార్చేందుకు ప్రయత్నించేవారు. కుడిచేతితో బలవంతంగా రాయించేవారు.దీనివల్ల ఆ పిల్లల సహజమైన ఎదుగుదల దెబ్బతింటుంది. అందరూ నిరుత్సాహం కలిగిస్తే వారి ప్రతిభ వెలుగులోకి రావడం కష్టమవుతుంది. ఎడమ చేతి వాటం లోపం కాదు. అది మనిషి సహజమైన జీవ వైవిధ్యంలో ఒక భాగం. వారిని మార్చాలని ప్రయత్నించకుండా, వారి సహజ స్వభావాన్ని అర్థం చేసుకుని గౌరవించడం అవసరం. సమాజంలో వారికి సమాన అవకాశాలు, ప్రోత్సాహం, గౌరవం లభించినప్పుడే వారి ప్రతిభ పూర్తిగా వికసిస్తుంది.ఎందరో ప్రముఖులుకళలు, క్రీడలు, రాజకీయరంగం, వ్యాపారం వంటి అనేక రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు ఎడమచేతి వారే. ఎడమ చేతివాటం వారిలో అనేక మంది ప్రముఖ శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, సంగీత విద్వాంసులు, రచయితలు ఉండడం వల్ల సహజంగానే సృజనాత్మకత ఎక్కువ అనే అభిప్రాయం ఏర్పడింది. ఒక సమస్యకు అనేక ప్రత్యామ్నాయ పరిష్కారాలు సూచించే సామర్థ్యంలో ఎడమచేతివారు కొంతమెరుగ్గా ఉండొచ్చని కొన్ని పరిశోధనల్లో గుర్తించారు. అయితే ఎడమచేతి వాటం కలిగిన అందరికీ ఇవి తప్పనిసరిగా వర్తిస్తాయని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. విజయానికి కారణం కేవలం ఎడమచేతి వాటమే అని చెప్పలేం. ప్రతిభ, కృషి, అవకాశాలు, శిక్షణ వంటి అనేక అంశాలు కలిసి వారి విజయాన్ని నిర్ణయించాయి. పలు దేశాల అధ్యక్షులు ఎడమ చేతివాటం వారే... అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్, బ్రిటన్ మాజీ ప్రధాని విన్‌స్టల్ చర్చిల్, బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియం. మన దేశంలో.. అమితాబ్‌బచ్చన్, రజనీకాంత్, రతన్ టాటా, సచిన్ టెండూల్కర్.నేను చిన్నప్పుడు ఎడమ చేత్తో రాయడం ప్రారంభించాను... నాకు నాలుగైదేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఇది గమనించిన నా తండ్రి నాపై కోప్పడ్డారు. కుడి చేత్తో రాయాలని సూచించారు. దీంతో నేను ఇప్పుడు రెండు చేతులతో రాయగలను. అయినా కొన్ని పనులకు ఎడమ చేతినే ఎక్కువగా ఉపయోగిస్తా. – అమితాబ్ బచ్చన్ఎడమ చేతితో రాసే వారికి రాస్తున్నప్పుడు చేయి కళ్లకు, ఇప్పటికే రాసిన అక్షరాలకు మధ్య అడ్డుగా వస్తుంది. దాంతో ఏం రాస్తున్నారో స్పష్టంగా కనిపించక చాలా మంది లెఫ్ట్‌హ్యాండర్స్ చేతిని పైకి ఎత్తి రాయడానికి ప్రయత్నిస్తారు. దీంతో కొంతమందిలో చేయి కొక్కెం మాదిరిగా వంగిపోతుంది. దీనినే హుక్డ్ పొజిషన్ అంటారు. ఇది కీళ్లపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. ఫలితంగా ఎక్కువ సేపు రాయలేరు.⇒ ఉపాధ్యాయులకు ఎన్సీఈఆర్టీ రూపొందించిన ఇన్క్లూడింగ్ చిల్ట్రన్ మార్గదర్శక పుస్తకంలో... పిల్లవాడు ఎడమ చేతితో రాస్తున్నాడు. కానీ తల్లిదండ్రులు కుడి చేతితోనే రాయాలని పిల్లాడిపై ఒత్తిడి తెస్తున్నారు. అప్పుడు ఉపాధ్యాయుడు ఏం చేయాలని ప్రశ్నించారు. దీనికి ఎన్సీఈఆర్టీ ఈ విధంగా పేర్కొంది: ‘భారతీయ సమాజంలో కుడిచేతికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం సామాజిక సంప్రదాయం. ఎడమచేతి వాటం పిల్లలను బలవంతంగా కుడిచేత్తో రాయించడం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల మెదడు సహజంగా పనిచేసే విధానానికి ఆటంకం కలగవచ్చు. ఇలా చేయడం వల్ల పిల్లలు రాయడానికి ఎక్కువ సమయం పడుతుంది. త్వరగా అలసిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది’ అని హెచ్చరించింది.⇒ రెండేళ్ల వయస్సు వచ్చే వరకు చిన్న పిల్లలు రెండు చేతులూ ఉపయోగిస్తారు. తర్వాత ఒక చేతినే ఎక్కువగా ఉపయోగించడం ప్రారంభిస్తారు. తల్లిదండ్రుల్లో ఒకరికి లేదా ఇద్దరికీ ఎడమ చేతి వాటం ఉంటే, పిల్లలకు కూడా ఎడమ చేతి వాటం వచ్చే అవకాశం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది కచ్చితంగా వస్తుందని చెప్పలేం.⇒ ఒకే గర్భంలో ఉన్న కవలలు ఒకే జన్యువులు పంచుకున్నా కొన్నిసార్లు ఒకరు ఎడమచేతి వాటం, మరొకరు కుడిచేతి వాటం కలిగి ఉండొచ్చు. జన్యువులతో పాటు గర్భంలో మెదడు అభివృద్ధి సమయంలో జరిగే ఇతర జీవ సంబంధ ప్రక్రియలు కూడా ప్రభావం చూపుతాయి.⇒ క్రికెట్, టెన్నిస్, బాక్సింగ్, బ్యాడ్మింటన్ వంటి క్రీడల్లో ఎడమ చేతివాటం వారికి కొంత ప్రయోజనం ఉండొచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఎందుకంటే ఎక్కువమంది ఆటగాళ్ల కుడిచేతివారితో ఆడేందుకు అలవాటు పడతారు. ఎడమ చేతివాటం వారిని ఎదుర్కొన్నప్పుడు వారి బంతుల కోణం, షాట్లు, కదలికలు భిన్నంగా ఉండడంతో ప్రత్యర్థులు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది.⇒ కొన్ని జంతువులు కూడా ఎడమచేతి వాటాన్ని ప్రదర్శిస్తాయి. కాకపోతే మనుషుల్లా అంత స్పష్టత వీటిలో కనిపించదు. కంగారూలు తినడానికి, ముఖం నిమురుకోవడానికి ఎక్కువగా ఎడమ కాలిని వాడతాయని పరిశోధనల్లో తేలింది. మగ కుక్కలు ఎడమ పాదాన్ని ఎక్కువగా వాడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.చెట్టు నుంచి యాపిల్ కిందకే ఎందుకు పడిందనే దగ్గర మొదలైన ఆలోచన గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొనడానికి న్యూటన్‌కు ప్రేరణ అయింది. అలాగే తన కొడుకు స్కూల్లో మిగతా విద్యార్థులకంటే ఎందుకు ఆలస్యంగా రాస్తున్నాడనే ఓ తండ్రి ఆవేదన ఎడమచేతివాటం వాళ్ల కోసం కొత్త ఉత్పత్తుల తయారీకి పురిగొల్పింది.. ఒకప్పుడు బలవంతంగా కుడిచేత్తో రాయించే తల్లిదండ్రుల్లా కాకుండా, కొడుకు ఎడమచేతివాటానికి అనుగుణంగా ఉండేలా వస్తువుల తయారీకి ముందడుగు వేసేలా చేసింది. ఎందరో లెఫ్ట్ హ్యాండర్స్‌కు చేయూతను అందించేలా చేసింది. ప్రత్యేక స్టోర్లు ప్రపంచ జనాభాలో దాదాపు 10 శాతం మంది మాత్రమే ఎడమచేతివారు. మిగిలిన 90 శాతం మంది కుడి చేతివారు. వీరి అవసరాలను దృష్టిలో ఉంచుకుని తయారైన వస్తువులనే ఇద్దరూ వాడాల్సి వస్తోంది. దాంతో ఏదైనా కత్తిరించడం, రాయడం, గిటార్ వాయించడం ఇలా చిన్న చిన్న పనులు కూడా ఎడమచేతి వాటం ఉన్న వారికి అసౌకర్యంగా మారుతున్నాయి. ఫలితంగా లెఫ్ట్ హ్యాండర్స్ కోసం ప్రత్యేకంగా షాపులు వెలుస్తున్నాయి. ఆన్లైన్ స్టోర్లు అందుబాటులోకి వచ్చాయి. ఫుణేలో ఓ తండ్రి తన కుమారుడు చదువులో రాణించలేకపోవడానికి కారణం కుడి చేతి వస్తువులను ఉపయోగించాల్సి రావడమే అని గుర్తించాడు. అలా మొదలైన ఆలోచన ‘ది లెఫ్ట్ హ్యాండ్ షాప్’కి అంకురార్పణ జరిగింది. హైదరాబాద్, పూణేల్లో పేరెంట్స్ చేసిన ఇలాంటి ప్రయత్నమే పలువురు లెఫ్ట్ హ్యాండర్స్‌కు ప్రయోజనకరంగా మారింది.ఏమిటి తేడాలెఫ్ట్హ్యాండ్ కత్తెరకు బ్లేడ్లు రివర్స్‌లో ఉంటాయి. పైన ఉండే బ్లేడ్ ఎప్పుడూ ఎడమ చేతి వైపు ఉంటుంది. దీని వల్ల కత్తిరించాలనుకున్న భాగాన్ని సులభంగా కట్ చేసే వీలవుతుంది. పెన్నును ప్రత్యేకంగా డిజైన్ చేశారు. పెన్కు ఉండే నిబ్ చివర రౌండ్‌గా ఉండి మధ్యలో కట్ అయి ఉంటుంది. దీని వల్ల ఇంక్ సులభంగా ఫ్లో అవుతూ రాయడానికి అనువుగా ఉంటుంది. అలాగే షార్ప్‌నర్‌లో పెన్సిల్‌ను ఉంచి అపసవ్య దిశలో తిప్పాలి. 15 సెం.మీ, ఆరు ఇంచులు ఉన్న స్కేలులో సంఖ్యలు కుడి నుంచి ఎడమకు ఉంటాయి. ఇలా ప్రతీ వస్తువు వారి ఎడమ చేతి వాటానికి అనుకూలంగా ఉండేలా తయారు చేశారు. మొదట్లో వీటిని వినియోగించే వారి సంఖ్య తక్కువగా ఉండడంతో ధరలు ఎక్కువగా ఉండేవి. అయితే ఇటీవల వీటిపై అవగాహన, వినియోగం పెరగడంతో ధరలు కొంత అందుబాటులోకి వచ్చాయి. ప్రత్యేక షాప్‌లతో పాటు ఆన్‌లైన్‌లోనూ అమ్ముతున్నారు. ఒకప్పుడు ఎడమచేతి వాటం వారి పట్ల వివక్ష ఉండేది. బలవంతంగా వారి అలవాట్లను మార్చేందుకు ప్రయత్నించేవారు. ఆ దశ నుంచి ఎడమ చేతివాటం సహజ వైవిధ్యంగా గుర్తింపు పొందుతోంది. ఈ నేపథ్యంలో లెఫ్ట్ హ్యాండర్స్ డే కేవలం ఎడమచేతి వారికి సంబంధించిన వేడుక మాత్రమే కాదు, ప్రతి మనిషిలోని భిన్నత్వాన్ని గౌరవించాలనే సందేశాన్ని గుర్తు చేసే రోజు.∙దిలీప్ మాదిరెడ్డి -
మార్చింది ఒక్క నిర్ణయమే!
కలలను నమ్మి ధైర్యంతో ఉద్యోగాన్ని వదులుకున్న సాధారణ అమ్మాయి శ్రీనిధి శెట్టి. పట్టుదలతో ముందుకు సాగి అందాల కిరీటాన్ని సొంతం చేసుకోవడమే కాదు; వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపును కూడా సంపాదించుకుంది. ఆ ప్రయాణంలో ఎదురైన ఎన్నో ఆసక్తికరమైన విషయాలన్నీ ఆమె మాటల్లోనే మీకోసం...ఉద్యోగం వదిలేశాను... మాది మంగళూరు. చిన్నప్పుడు డాక్టర్ అవ్వాలనుకునేదాన్ని. కాలేజీ రోజుల్లో మోడలింగ్ వైపు మనసు మళ్లింది. కానీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేసి, సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరాను. చాలాసార్లు కంప్యూటర్ ముందు కూర్చొని ఉన్నా, నా మనసు మాత్రం కెమెరా ముందే కనిపించేది. అందుకే, భయపడకుండా ఉద్యోగానికి గుడ్‌బై చెప్పా. ఆ నిర్ణయమే నా జీవితాన్ని మార్చేసింది.కిరీటం తెచ్చిన అవకాశాలు‘మిస్ సుప్రానేషనల్–2016’ టైటిల్ గెలవడం నా జీవితంలో పెద్ద మలుపు. ప్రపంచ వేదికపై భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. అదే నన్ను సినిమాలవైపు నడిపించింది. ఇక ‘కేజీఎఫ్’ సినిమాతో ప్రేక్షకులు నన్ను ఎంతగా ఆదరించారో మాటల్లో చెప్పలేను. ఆ ప్రేమే నాకు మరింత బాధ్యతను గుర్తు చేస్తుంది.కొరియన్ భాష అంటే ప్రత్యేకమైన ఆసక్తి!కొత్త భాషలను నేర్చుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా తూర్పు ఆసియా భాషలపై ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. అందుకే, కొరియన్ భాషను బాగా అర్థం చేసుకోగలను. ప్రస్తుతం తుళు, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో నేను సులభంగా మాట్లాడగలను. తెలుగు ప్రేక్షకుల ప్రేమకు ప్రతిఫలంగా ఇకపై నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పాలని నిర్ణయించుకున్నాను. అది వాళ్లకు నేను ఇచ్చే చిన్న బహుమతి.నేనూ ఆడిషన్ కే వెళ్తాను‘కేజీఎఫ్’ తర్వాత అవకాశాలు నన్నే వెతుక్కుంటూ వస్తాయని, వాటిల్లో చాలా పెద్ద హీరోల సినిమాలను తిరస్కరించానని చాలామంది అనుకున్నారు. కానీ అందులో నిజం లేదు. నేను కూడా ఆడిషన్ లకు వెళ్తాను. ప్రతి పాత్రను సంపాదించుకోవాల్సిందే. చివరికి ఏ పాత్రకు ఎవరు సరిపోతారో నిర్ణయించేది దర్శకుడే.నా తొలి సంపాదన... కేవలం రూ.500ఈరోజు ఎంత సంపాదించినా... 2011లో మొదటిసారి అందుకున్న రూ.500 నాకు అత్యంత విలువైనది. ఒక కార్పొరేట్ ఈవెంట్లో పేపర్‌వర్క్, గేమ్ సెటప్లలో సహాయం చేసినందుకు ఆ డబ్బు వచ్చింది. అదే నా జీవితంలో తొలి సంపాదన. చిన్న మొత్తమే అయినా, అది నాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది.సీత పాత్ర రాకపోయినా... బాధపడలేదునితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణం’లో సీత పాత్ర కోసం నేను కూడా ఆడిషన్ ఇచ్చాను. ఆ అవకాశం నాకు రాలేదు. కానీ ఆ పాత్రకు సాయిపల్లవి ఎంపిక కావడం చాలా సంతోషంగా అనిపించింది. ఆమె ఆ పాత్రకు అద్భుతంగా సరిపోతుందని నేను నమ్ముతున్నాను.నా సీక్రెట్ అసలు ఫాలో కాకండి ఫిట్‌గా ఉండేందుకు నేను పెద్దగా కష్టపడను. అన్ని రకాల ఫుడ్స్ తింటాను. హోమ్ ఫుడ్ అంటే ఇష్టం. అయితే, రోజుకు రెండు పూటలే తింటాను. అదే నా సీక్రెట్. ఇది ఎవరూ ఫాలో కాకండి.పార్టీల కంటే ప్రశాంతతే ఇష్టం పార్టీల కంటే ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లడం నాకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. ప్రశాంతమైన సాయంత్రాలు నాకు చాలా ఇష్టం. జీవితాన్ని సింపుల్‌గా ఆస్వాదించడం నేర్చుకున్నాను.అలవాటు మానేశానుసోషల్ మీడియాలో అభిమానుల ప్రేమ, కామెంట్స్, గాసిప్స్, వైరల్ న్యూస్ చదువుతుంటాను. కానీ వాటి గురించి ఆలోచించడం చాలా ఏళ్ల క్రితమే మానేశాను. ప్రస్తుతం నా ప్రతి సినిమా, మరో కొత్త ఆరంభంగా ఉండేలా చూసుకుంటున్నాను. మంచి కథలు, గుర్తుండిపోయే పాత్రలు చేయాలని ఎదురుచూస్తున్నాను. -
రుచి... ఆరోగ్యం... సింపుల్ కుకింగ్!
ఉదయం టిఫిన్‌కు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? ఇంట్లో మిగిలిపోయిన బ్రెడ్తోనే కేవలం 10 నిమిషాల్లో రుచికరమైన బ్రెడ్ ఉప్మా తయారు చేసుకోవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ రుచి ఇచ్చే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి.కావలసినవి:5 నుంచి 6 బ్రెడ్ స్లైస్‌లు, నూనె లేదా బటర్: 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు: 1/2 టీస్పూన్, జీలకర్ర: 1/2 టీస్పూన్, మినపప్పు: 1/2 టీస్పూన్, ఉల్లిపాయ: 1 (సన్నగా తరిగినది), టొమాటో: 1 (చిన్నగా తరిగినది), పచ్చిమిర్చి: 2 (సన్నగా తరిగినవి), అల్లం తరుగు: 1/2 టీస్పూన్, కరివేపాకు: ఒక రెమ్మ, పసుపు: 1/4 టీస్పూన్, కారం: 1/2 టీస్పూన్, నిమ్మరసం: టీస్పూన్, కొత్తిమీర: కొద్దిగా, ఉప్పు: రుచికి సరిపడాతయారీ:- ముందుగా బ్రెడ్ స్లైసెస్ను ప్యాన్ పై కొద్దిగా కాల్చుకుని, చల్లారాక చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోండి.- ఆ తరువాత తాలింపు కోసం ఒక బాణలిలో నూనె వేసి వేడి చేయండి.- అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి చిటపటలాడనివ్వండి.-ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం తరుగు, కరివేపాకు వేసి ఉల్లిపాయలు దోరగా అయ్యే వరకు వేయించండి.- అందులోనే తరిగిన టొమాటో ముక్కలు, పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి.-టొమాటోలు మెత్తగా అయ్యే వరకు 2–3 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను వేసి, మసాలా అంతా బ్రెడ్ ముక్కలకు పట్టేలా చిన్నగా కలపండి.-బ్రెడ్ క్రిస్పీగా అయ్యేంతవరకు 2–3 నిమిషాలు వేయించండి. చివరగా నిమ్మరసం పిండి, పైన సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆపేయండి. అంతే వేడివేడిగా సర్వ్ చేయడమే!క్యారెట్ పొరియల్కావలసినవి: 5 క్యారెట్లు: 250 గ్రాములు (తురుము లేదా సన్నని ముక్కలు), నూనె: టేబుల్ స్పూన్, ఆవాలు: 1/2 టీ స్పూన్, మినపప్పు: టీ స్పూన్, శనగపప్పు: టీస్పూన్, పచ్చిమిర్చి: 2 (సన్నగా తరిగినవి), ఎండుమిర్చి: 1, కరివేపాకు: ఒక రెమ్మ, ఇంగువ: చిటికెడు, ఉల్లిపాయ: 1 (చిన్నగా తరిగినది), పచ్చి కొబ్బరి తురుము: 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు: రుచికి సరిపడా.తయారీ:- ముందుగా బాణలిలో నూనె వేసి వేడి చేయండి. అందులో ఆవాలు వేసి చిటపటలాడనిచ్చిన తర్వాత మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసి పప్పులు దోరగా మారే వరకు వేయించండి.- అందులోనే కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువతో పాటు తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి.. అవి మెత్తబడే వరకు 2 నిమిషాలు వేయించండి.- ఇప్పుడు తరిగిన క్యారెట్ తురుము, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి.- మూత పెట్టి సన్నని మంటపై 5 నుంచి 7 నిమిషాల పాటు ఉడికించండి.- క్యారెట్ మెత్తగా ఉడికిన తర్వాత మూత తీసి పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలిపి స్టవ్ ఆపేయండి.- మరింత హెల్తీ ఫుడ్‌గా మారాలంటే 15 నిమిషాలు నానబెట్టిన పెసరపప్పును కూడా క్యారెట్‌తో పాటు వేసి వేయించుకోవచ్చు. అంతే! కలర్‌ఫుల్ క్యారెట్ పొరియల్ రెడీ!సూజీ కేక్ కావలసినవి: ఉప్మా రవ్వ: కప్పు, పెరుగు: 1/2 కప్పు, చక్కెర: 3/4 కప్పు, పాలు: 1/2 కప్పు (కాచి చల్లార్చినవి), నూనె లేదా వెన్న: 1/4 కప్పు, ఏలకుల పొడి లేదా వెనిలా ఎసెన్ ్స: 1/2 టీస్పూన్, బేకింగ్ పౌడర్: టీస్పూన్, బేకింగ్ సోడా: 1/4 టీస్పూన్, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్: 2 టేబుల్ స్పూన్లు.తయారీ:- ఒక బౌల్లో పెరుగు, పంచదార పొడి, నూనె వేసి పంచదార కరిగే వరకు బాగా కలపండి.- ఇప్పుడు అందులో రవ్వ, సగం పాలు పోసి బాగా కలిపి 15 నుంచి 20 నిమిషాలు పక్కన పెట్టండి.- ఇపుడు ఒక పెద్ద ప్రెజర్ కుక్కర్ లేదా మందపాటి కడాయిలో అడుగున కప్పు ఉప్పు లేదా ఇసుక వేసి, దానిపై ఒక స్టాండ్ ఉంచండి.- విజిల్, గాస్కెట్ తీసేసి మూత పెట్టి మీడియం మంటపై 10 నిమిషాలు ప్రీ–హీట్ చేయండి.- ఆ తరువాత కేక్ గిన్నెకి కొద్దిగా నూనె రాసి, పొడి పిండి చల్లండి లేదా బటర్ పేపర్ వేసి పక్కన పెట్టండి.- నానిన రవ్వ మిశ్రమం గట్టిపడితే మిగిలిన పాలు పోసి కేక్ బ్యాటర్‌ని చక్కగా కలుపుకోవాలి.- ఇప్పుడు అందులో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఏలకుల పొడి/వెనిలా ఎసెన్ ్స వేసి ఒకే దిశలో నెమ్మదిగా కలపండి.- ఈ మిశ్రమాన్ని కేక్ టిన్ లో పోసి, పైన టూటీ ఫ్రూటీ లేదా జీడిపప్పు ముక్కలు చల్లండి.- ప్రీ–హీట్ చేసిన కుక్కర్లో ఈ గిన్నెను ఉంచి మూత పెట్టి చిన్న మంటపై 35 నుంచి 45 నిమిషాలు బేక్ చేయండి.- తరువాత కేక్ మధ్యలో టూత్‌పిక్ లేదా చాకు గుచ్చి చూడండి.- అది క్లీన్ గా బయటకు వస్తే కేక్ సిద్ధమైనట్లే! కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గిన్నె నుంచి బయటకు తీసి ముక్కలుగా కోయాలి. -
అశ్వనీకుమారుల శాపవిమోచనం!
పూర్వం భరద్వాజ వంశంలో సుతపుడు అనే విప్రుడు ఉండేవాడు. శ్రీహరి భక్తుడైన అతడు హిమాలయాలపై నివసించేవాడు. శ్రీకృష్ణుడి ప్రీతి కోసం హిమాలయాలలో అతడు సుదీర్ఘకాలం తపస్సు చేశాడు. తపస్సు కొనసాగిస్తున్న సుతపుడు బ్రహ్మతేజంతో వెలుగొందసాగాడు. గగనమార్గంలో సంచరించే దేవ గంధర్వ కిన్నర కింపురాషుదులు సుతపుడి తపోనిష్ఠకు, అతడి తేజస్సుకు విస్మయం చెందేవారు. ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు సుతపుడికి సాక్షాత్కారమిచ్చాడు.‘వత్సా! నీ తపస్సుకు సంతసించాను. వరమేదైనా కోరుకో’ అన్నాడు.శ్రీకృష్ణుడి దర్శనం కలగడంతో సుతపుడు పరమానంద పరవశుడయ్యాడు. శ్రీకృష్ణుడికి సాష్టాంగ ప్రణామం చేసి, వేనోళ్ల స్తుతించాడు.‘ప్రభూ! నేను ఆత్మనిష్ఠుడను. నాకు మోక్షం అక్కర్లేదు. అనునిత్యం నీ సన్నిధిలో ఉండేలా అనుగ్రహించు. నీ పట్ల అనన్య దాస్యభక్తిని ప్రసాదించు. అంతే చాలు!’ అని కోరుకున్నాడు.‘మునివర్యా! ముందుగా నువ్వు వివాహమాడు. సంసార జీవితంలో నీ ప్రారబ్ద కర్మలు క్షీణించిన తర్వాత నీకు నా దాస్యభక్తి తప్పక లభించగలదు’ అని వరమిచ్చాడు శ్రీకృష్ణుడు.సుతపుడు తనకు తగిన వధువు కోసం అన్వేషిస్తూ బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లాడు.బ్రహ్మదేవుడు అతడికి పితృలోకానికి చెందిన మానసి అనే కన్యను ఇచ్చి వివాహం జరిపించాడు. కొన్నాళ్లకు మానసి గర్భం దాల్చింది. ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. సుతపుడు ఆ బాలుడికి కల్యాణమిత్రుడు అని నామకరణం చేశాడు. కల్యాణమిత్రుడు అశ్వనీదేవతల అనుగ్రహంతో జన్మించాడు. సుతపుడు ఈ సంగతిని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. వెంటనే తన భార్యను విడిచిపెట్టాడు. అశ్వనీదేవతలపై ఆగ్రహం చల్లారక ‘నాకు ద్రోహం తలపెట్టిన మీరు రోగగ్రస్తులవుతారు.మీకు యజ్ఞయాగాదులలో హవిర్భాగాలకు అర్హత లేకుండా పోతారు’ అని శపించాడు. తర్వాత కొడుకును వెంటబెట్టుకుని తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. సుతపుడి శాప ఫలితంగా అశ్వనీదేవతలు రోగగ్రస్తులయ్యారు. యజ్ఞయాగాదులలోని హవిర్భాగాలు దక్కక వారు బలహీనులైపోయి నానాటికీ క్షీణించసాగారు. దేవవైద్యులైన అశ్వనీకుమారులే రోగులుగా మారడంతో దేవలోకంలో కల్లోలం రేగింది. శాపవశాన సోకిన వ్యాధిని నయం చేసుకునే మార్గం తోచక అశ్వనీదేవతలు తమ తండ్రి సూర్యభగవానుడి వద్దకు వెళ్లి, తమ గోడు చెప్పుకున్నారు. సూర్యుడు వారిద్దరినీ సుతపుడి వద్దకు తీసుకుపోయాడు.‘మునిపుంగవా! నా తనయుల అపరాధాలను మన్నించు. నీవంటి సద్బ్రాహ్మణుడు సంతుష్టుడైతే సాక్షాత్తు శ్రీహరి సంతుష్టుడవుతాడు. శ్రీహరి సంతుష్టుడైతే, సకల దేవతలూ సంతుష్టులవుతారు. కాస్త దయ చూపు. నా తనయులకు శాపవిమోచనం కల్పించు’ అని అభ్యర్థించాడు.సూర్యభగవానుడి ప్రార్థనకు సుతపుడి మనసు కరిగింది. కాసేపు ఆలోచనలో పడ్డాడు. తన తపోబలంతో అశ్వనీదేవతలకు తక్షణమే రోగ విముక్తులను చేశాడు.‘దివాకరా! త్వరలోనే నీ తనయులకు యజ్ఞ యాగాదులలో హవిర్భాగాలు పొందే యోగ్యత కూడా లభిస్తుంది’ అని పలికాడు.సుతపుడి సహృదయానికి సూర్యుడు వేనోళ్ల కీర్తించాడు. ‘శ్రీహరి భక్తులైన నీవంటి సద్బ్రాహ్మణులే లోకాలకు వెలుగు చూపగలరు. నా తనయులకు శాపవిమోచనం కలిగించావు. ధన్యోస్మి!’ అని పలికాడు.రోగ విముక్తులైన అశ్వనీదేవతలు ఆనంద బాష్పాలతో సుతపుడికి సాష్టాంగపడ్డారు. అశ్వనీదేవతలకు శాపవిమోచనం కలిగించాక సుతపుడు తపస్సు చేసుకోవడానికి గంగా తీరానికి బయలుదేరాడు. సూర్యుడు తనయులతో కలసి తన స్వలోకానికి బయలుదేరాడు.- సాంఖ్యాయన -
కూలీ నుంచి రాజకొలువుకు... కారణం ఇదే!
కోసల రాజ్యంలోని ముకుందపురం గ్రామంలో కేశవుడు అనే వ్యక్తి ఉండేవాడు. అతడు చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ బతికేవాడు. పగలంతా కూలి పనులు చేసుకుంటూ రాత్రి ఊరి గుడి దగ్గర అరుగు మీద పడుకునేవాడు. చిన్ననాటి నుంచి గుడి పూజారి దగ్గర ధర్మబద్ధంగా జీవితం ఎలా గడపాలో నేర్చుకున్నాడు. తను ఒక చోట కూలీ పనికి ఒప్పుకుంటే మరొకరు వచ్చి ఎక్కువ కూలీ ఇస్తామన్నా ససేమిరా ఒప్పుకునే వాడు కాదు. ఊరి వాళ్ళు, తోటి కూలీలు ఇతని నిజాయతీని చూసి నవ్వుకునే వాళ్ళు. కేశవుడు మాత్రం ధర్మం, నిజాయతీ ఎప్పటికైనా గెలుస్తాయని నమ్మేవాడు.ఒకరోజు కోసల రాజు విక్రమసేనుని ఉద్యానవనంలో తోటపని చేయడానికి ముకుందపురం నుంచి కూలీలతో పాటు కేశవుడు కూడా వెళ్ళాడు. కేశవుడు తోటలో పని చేస్తున్నప్పుడు ఒక రంగురాయి దొరకటంతో దాని గురించి ఎవరికీ చెప్పకుండా బొడ్లో జాగ్రత్తగా దాచుకున్నాడు. సాయంత్రం వరకు తోటలో పనిచేసి, కూలి డబ్బులు తీసుకున్నాడు. ఇంటికి బయలుదేరుతూ, మెల్లగా రాజప్రాసాదంవైపు అడుగులు వేశాడు. సింహద్వారం వద్ద భటులతో తను రాజుగారిని కలవాలి అని చెప్పాడు. విషయం ఏమిటని భటులు ప్రశ్నిస్తే విషయం కేవలం రాజుగారికి మాత్రమే చెబుతాను అనటంతో ఒక భటుడు అంతఃపురంలోకి వెళ్ళి వచ్చి, ‘‘రేపు ఉదయం వరకు రాజుగారిని కలవటం కుదరదు, పొద్దున్నే రాపో’’ అని చెప్పారు.కేశవుడు చేసేది లేక ఊరికి వెళ్లకుండా, సింహద్వారం పక్కగా ఒక చోట ఒదిగి కూర్చొని రాత్రంతా అక్కడే గడిపాడు. అలసిపోయి అక్కడే పడుకున్న కేశవుడిని ఉదయాన్నే ఒక భటుడు నిద్రలేపి, ‘‘రాజుగారు పిలుస్తున్నారు’’ అని చెప్పటంతో భయం భయంగా కోటలోకి అడుగు పెట్టాడు. కోసల రాజు విక్రమసేనుడు కేశవుడిని చూసి ‘‘నన్ను ఎందుకు కలవాలనుకున్నావు?’’ అని అడిగాడు. కేశవుడు రాజుగారికి నమస్కరించి, ‘‘మహారాజా! నిన్న తమరి తోటలో పనిచేస్తుంటే, నాకు ఈ రంగురాయి దొరికింది. తమరి వస్తువు తమరికే అప్పగించి పోదామని వచ్చాను’’ అని చెప్పి, తన బొడ్లో జాగ్రత్తగా దాచుకున్న రంగురాయిని విక్రమసేనుడికి అప్పగించాడు. రంగురాయిని తీసుకున్న విక్రమసేనుడు ‘‘దీని విలువ ఎంతో నీకు తెలుసునా?’’ అని అడిగాడు. ‘‘నాది కాని వస్తువు విలువ ఎంత అయితే నాకెందుకు మహారాజా!’’ అన్నాడు కేశవుడు వినయంగా.ఇంతలో అక్కడకు వచ్చిన మహామంత్రి సూరవర్మ ‘‘ప్రభూ! మన ఖజానాలో పని చేయటానికి నిజాయతీ గల వ్యక్తి కావాలన్నారు కదా, అందుకు ఇతనే సరైన వ్యక్తి. నిజాయతీ గల వ్యక్తి కోసం వెదుకులాటలో భాగంగా తమరి తోటలో చాలా రంగు రాళ్లని నేనే కావాలని భూమిలో పాతించి, కూలీలను అందులో పనికి పురమాయించి, దూరం నుంచి గమనిస్తూనే వున్నాను. ఇతనితో పాటు మరికొందరికి ఈ రంగురాళ్ళు దొరికాయి.ఇవి విలువ చేయని రంగురాళ్ళు అని తెలియక మిగతా అందరూ లోలోపల సంతోషపడుతూ వాటిని తీసుకుని వెళ్లిపోయారు. కాని, ఇతను మాత్రం ఆశకు లోను కాకుండా నిజాయతీగా ఈ రంగురాయిని తమకు అప్పగించడానికి వచ్చాడు. నిన్న రాత్రి కూడా నేను కావాలనే ఇతనికి తమ దర్శన భాగ్యం కలిగించలేదు. ఆ రంగురాయి ఒక రాత్రంతా ఇతని దగ్గర వుంటే ఇతని మనసు ఏమైనా చాంచల్యానికి లోనవుతుందేమో అనుకున్నాను. అయినా, ఇతను తన నిజాయతీని కోల్పోలేదు’’ అని చెప్పాడు.‘‘మహామంత్రీ! మీరు చెప్పింది నిజమే, తక్షణమే ఇతనిని మన ఖజానా ఉద్యోగిగా నియమించండి. వెంటనే ఇతని నివాసానికి రాజోద్యోగుల భవంతిని ఒకటి సిద్ధం చేయండి’’ అని చెప్పి విక్రమసేన మహారాజు లోనికి వెళ్లిపోయాడు.ముకుందపురం చేరుకున్న కేశవుడు గుడి పూజారిని కలుసుకొని, తనకు వచ్చిన కొలువు గురించి చెప్పి, పాదాలకు నమస్కరించాడు. ‘‘నీ నిజాయతీనే నిన్ను కాపాడింది. లే నాయనా!’’ అని కేశవుడిని లేవదీసి, ఆలింగనం చేసుకున్నాడు పూజారి.- ఎన్.వి.శ్రీధర శర్మ -
ఈ గ్యాడ్జెట్ ఉంటే సెలూన్ అవసరమే లేదు!
తలకు మర్దన చేయించుకోవడానికి ఇకపై సెలూన్‌కో, బ్యూటీపార్లర్కో వెళ్లనక్కర్లేదు. ‘ఎలక్ట్రిక్ హెడ్ అండ్ స్కాల్ప్ మసాజర్’ చెంతనుంటే చాలు. ఇంట్లోనే కూర్చుని మర్దన చేసుకోవచ్చు. దీనిని తలకు ఆనించి, తల చుట్టూ తిప్పుతూ ఉంటే ఇది జుట్టు కుదుళ్ల వరకు మసాజ్ చేస్తుంది.ఇందులోని సిలికాన్ బ్రష్ ఫ్లెక్సిబుల్‌గా ఉండి, జుట్టుపై సున్నితంగా పనిచేస్తుంది. ఐదు రకాల వైబ్రేషన్ మోడ్స్‌లో ఇది పనిచేస్తుంది. ఈ మసాజర్ రక్తపోటును అదుపుచేసి, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మైగ్రేన్ సహా రకరకాల తలనొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తలపై చర్మంలో సహజమైన తేమ ఆరిపోకుండా చేసి, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అరచేతిలో ఇమిడిపోయేలా రూపొందించిన ఈ పరికరాన్ని ఎక్కడికైనా ఇట్టే తీసుకుపోవచ్చు. రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేసే దీనిని తక్కువ సమయంలోనే చార్జ్ చేసుకోవచ్చు.ఇలా చేస్తే కళ్లకు కొత్తందం!అమ్మాయిల ముఖంలో మొదటి చూపులోనే ఆకట్టుకునేవి కళ్ళు. మరి ఆ కళ్లు ఆకర్షణీయంగా, అందంగా కనిపించాలంటే కేవలం ఆకారం మాత్రమే సరిపోదు, కాంతిమంతంగా అవి మెరుస్తూ ఉండాలి కూడా. ఇందుకోసం చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్ళ ద్వారా వ్యక్తమయ్యే చిరునవ్వు, ఆత్మీయత, ఆత్మవిశ్వాసం కళ్ళకు అసలైన అందం.ఇందుకోసం ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. కీరాదోస రసంలో ముంచిన కాటన్ ప్యాడ్స్‌ను కళ్లపై ఉంచడం ద్వారా కళ్ల అలసట తగ్గి కళ్లు తాజాగా మారుతాయి. వాడిన గ్రీన్ టీ బ్యాగ్స్‌ని ఫ్రిజ్‌లో ఉంచి చల్లబడిన తరువాత వాటిని తరచుగా కళ్లపై పెట్టుకోవడం వల్ల కంటి వాపు, కళ్లకింద వచ్చే నల్లటి వలయాలు తగ్గుతాయి. విల్లులాంటి కనుబొమ్మలు, ఒత్తయిన కనురెప్పలు కళ్ల రూపాన్ని రెట్టింపు చేస్తాయి. నిద్రించే ముందు కనురెప్పలకు కొద్దిగా ఆముదం రాసుకోవడం వల్ల కనురెప్పల వెంట్రుకలు ఒత్తుగా, పొడవుగా పెరుగుతాయి. అలాగే తగినంత నిద్ర ఉండేలా చూసుకోవడం, స్క్రీన్ టైమ్ తగ్గించడం ద్వారా కళ్లు అలసట లేకుండా ప్రకాశవంతంగా కనిపిస్తాయి. వీటన్నింటితో పాటు కంటి ఆరోగ్యానికి, అందానికి సరైన పోషకాహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. -
తిమింగలాల వమనంతో పరిమళద్రవ్యం..!
సాధారణంగా పర్ఫ్యూమ్ల తయారీలో పువ్వులు, వేర్లు; కొన్నిరకాల జంతువుల నుంచి సేకరించిన పదార్థాలను ఉపయోగిస్తారు. తిమింగలాల వమనం(వాంతి)తో కూడా పర్ఫ్యూమ్ను తయారు చేస్తారంటే నమ్మశక్యంగా ఉండదు గాని, ఇది నిజం.ఈజిప్టు నాగరికత కాలం నుంచి వాడుకలో ఉన్న అత్యంత పురాతన పరిమళద్రవ్యం ఇది. తిమింగలాలు తినే కదంబ చేపలు, కనవ చేపలలోని అరగని భాగం గట్టి వ్యర్థపదార్థంగా మారి, తిమింగలాల వమనంలో బయటకు వస్తుంది. దీనిని ‘అంబర్గ్రిస్’ అంటారు. దీనిని ఇప్పటికీ పర్ఫ్యూమ్ల తయారీలో వినియోగిస్తున్నారు. -
చైన్ స్నాచింగ్.. నగర కమిషనర్ భార్య నిహారిక మెడలో..
నగర కమిషనర్ భార్య నిహారిక మెడలోని ఐదు తులాల బంగారు గొలుసు పట్టపగలే చోరీకి గురైంది. వీఐపీ ఏరియాలో జరిగిన ఈ సంఘటన పోలీస్ శాఖ ప్రతిçష్ఠకు సవాలుగా మారింది. కమిషనర్ ఈ కేసును క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్నకు అప్పగిస్తూ, ‘ఇది మన పోలీస్ శాఖకే కాదు, వ్యక్తిగతంగా నాకు కూడా ఇబ్బందికరమైంది. మీ గురించి తెలుసు కాబట్టి ఈ కేసును మీరే సాల్వ్ చేయగలరని నమ్ముతున్నాను.’ అన్నాడు కమిషనర్.ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న రంగంలోకి దిగి సీసీటీవీ విజువల్స్‌ను నిశితంగా పరిశీలించాడు. దొంగలు బైక్‌పై వచ్చిన విధానం, చైన్ లాగిన తీరు చూస్తే ఎక్కడో తేడాగా అనిపించింది. సాధారణంగా చైన్ స్నాచర్లు గొలుసు లాగేటప్పుడు మహిళలు కింద పడిపోవడం లేదా మెడకు గాయాలు కావడం జరుగుతుంది. కానీ ఇక్కడ నిహారికకి చిన్న గీత కూడా పడలేదు. పైగా, దొంగలు వస్తున్నప్పుడు ఆమె ముందే అలర్ట్ అయినట్లు కెమెరాలో కనిపించింది.ప్రద్యుమ్న నిహారిక కాల్ డేటాను పరిశీలించాడు. ఒక గుర్తుతెలియని నంబర్‌తో ఆమె గత రెండు రోజులుగా మాట్లాడుతున్నట్లు తెలిసింది. ఆ నంబర్ ఆధారంగా చైన్ స్నాచర్ ‘రాకీ’ని ప్రద్యుమ్న సీక్రెట్‌గా పట్టుకుని విచారించాడు.∙∙ కమిషనర్ ఇంటికి వచ్చాడు ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న.‘రండి తను ఇందాకే వెళ్లారు. చైన్ స్నాచర్ దొరికాడా?’ అడిగింది నిహారిక.‘దొరికాడు. రాత్రంతా స్టేషన్లో థర్డ్ డిగ్రీ అప్లై చేస్తే నిజం కక్కాడు’ చెప్పాడు నిహారిక వంకే చూస్తూ...‘కొట్టారా... నిజం చెప్పాడా?’ నిహారిక మొహం పాలిపోవడం గమనించాడు.‘యస్ మేడం... ఇప్పుడు ఏం చేయమంటారు? చెప్పండి. మీరే ఇదంతా చేశారని చెప్పమంటారా? వాడికి మరో నాలుగు తగిలించి వాడే నేరం చేశాడని లోపల వేయమంటారా?’‘వద్దు వద్దొద్దు... నా కోసం అనవసరంగా చేయని నేరానికి వాడిని శిక్షించొద్దు... నా భర్త నన్ను నిర్లక్ష్యం చేయడం భరించలేకపోయాను. పాత నేరస్తుడు చైన్ స్నాచర్ వివరాలు తెలుసుకోవడం కమిషనర్ భార్యగా కష్టం కాదు. రాకీకి డబ్బులు ఇచ్చి డ్రామా ఆడాను. అలాగైనా నా భర్త నా భద్రత గురించి భయపడి, నాతో ఎక్కువ సమయం గడుపుతాడని పూలిష్‌గా చేశాను.’ రియలైజ్ అవుతూ చెప్పింది.‘పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మీకు తెలియంది కాదు. మీ బాధ అర్థమైంది. మీ బాధను సూటిగా చెప్పండి. నేరుగా మాట్లాడితే, మనసు విప్పి మాట్లాడితే చాలా అపోహలు తొలగిపోతాయి. రాకీని ఏం చేయలేదు. నిజం చెప్పినందుకు క్షమించాను. మీరిచ్చిన డబ్బుతో నిజాయితీగా బ్రతకమని చెప్పాను. ఇక మీరు కేసు గురించి ఆలోచించకండి. పొరపాటున కిందపడిందని, చైన్ స్నాచింగ్ జరగలేదని నమ్మించడం నాకు కష్టమైన పని కాదు. దయచేసి మీ సమస్యను మీరే పరిష్కరించుకోండి.‘ చెప్పి బయటకు నడిచాడు ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న.∙∙ అయితే, అదే సమయంలో అనుకోకుండా ఇంటికి వచ్చిన కమిషనర్.. ప్రద్యుమ్న, తన భార్య మాట్లాడుకుంటున్న మాటలను చాటుగా విన్నాడు. ఒక నిష్ఠుర నిజం తెలుసుకున్నాడు. భార్య చేసిన పని కన్నా, ఆ పని చేయడానికి కారణాన్ని అర్థం చేసుకున్నాడు.వెనక్కి తిరిగి ఆఫీసుకు వెళ్ళిపోయాడు. ఆఫీస్ పని ముగించుకుని పెందరాళే ఇంటికి వచ్చాడు. బెడ్రూమ్లో కూర్చున్న భార్య దగ్గరకు వెళ్లి, ‘నిహారికా.. ఇవాళ మనం సినిమాకు వెళ్తున్నాం, త్వరగా రెడీ అవ్వు’ అన్నాడు. షాకైంది నిహారిక. ఈ సమయంలో తను చేసిన పని భర్తకు చెప్పకూడదని, ఎప్పటికీ చెప్పకూడదని, భర్త వృత్తిని అర్థం చేసుకోవాలని మనసులో గట్టిగా నిర్ణయించుకుంది నిహారిక.కమిషనర్ తన భార్యను సినిమాకు తీసుకువెళ్లాడు. థియేటర్లో సినిమా ఇంటర్వెల్ సమయంలో ఆయన సీటులోంచి లేచి పక్కకు వచ్చి ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్నకు ఫోన్ చేశాడు.ఫోన్ ఎత్తగానే, ‘థాంక్యూ ప్రద్యుమ్న! మీరు కేవలం క్రిమినల్ కేసులను మాత్రమే కాదు. మనుషుల మనసులను కూడా పరిశోధించి సమస్యలను సాల్వ్ చేస్తారు.’ మనస్ఫూర్తిగా అన్నాడు కమిషనర్.అవతలి వైపు నుంచి నవ్వుతూ, ‘అప్పుడప్పుడు ఇలాంటి సమస్యల్లో అసలు సాక్ష్యాన్ని కనిపెట్టాలిగా’ నవ్వుతూ అన్నాడు ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న.- శ్రీసుధామయి -
గుడ్డు.. ‘నువ్వు ఇంటికి తిరిగి వెళ్తూండగా మరణించావు.’
‘‘నువ్వు ఇంటికి తిరిగి వెళ్తూండగా మరణించావు.’’‘‘నీకు పిచ్చా?’’ వెంటనే అడిగాను.‘‘అదో కారు ప్రమాదంలో జరిగింది. నువ్వు నీ భార్యని, ఇద్దరు పిల్లలని వదిలి ఇక్కడికి వచ్చావు. నీది బాధలేని తక్షణ మరణం.’’‘‘నేను... నేను నిజంగా చచ్చిపోయానా?‘‘అవును.’’ నేను చుట్టూ చూశాను. అంతా శూన్యం. ఆశ్చర్యంగా భూమి కాని, ఆకాశం కాని కనపడలేదు. కేవలం అతను, నేను మాత్రమే ఉన్నామని గ్రహించాను.‘‘ఈ ప్రదేశం ఏమిటి? ఇదేనా మరణానంతర జీవితం?’’ అడిగాను.‘‘అవును.’’ అతను చెప్పాడు.‘‘నువ్వు దేవుడా?’’ ‘‘అవును. నేను దేవుడిని.’’ అతను బదులు చెప్పాడు.నేను ఆసక్తిగా చూశాను. అతను దేవుడిలా కనిపించలేదు. సర్వశక్తిమంతుడిలా కూడా కాదు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిలా కనిపించాడు.‘‘నా భార్య, పిల్లలు నా గురించి ఏడుస్తున్నారా?’’‘‘నీ భార్య పైకి ఏడుస్తూ లోపల ఉపశమనం పొందుతోంది. ఐతే నీకు ఊరటని ఇచ్చేది, ఉపశమనం పొందినందుకు ఆమెలో చాలా అపరాధభావం ఉంది.’’‘‘ఇప్పుడు నేను స్వర్గానికో, నరకానికో లేక ఇంకెక్కడికైనా వెళ్తానా?’’ అడిగాను.‘‘రెండూ కాదు. నువ్వు పునర్జన్మ ఎత్తుతావు.’’‘‘అంటే భగవద్గీతలో చెప్పింది నిజమే అన్నమాట.’’‘‘ప్రతి మతం దాన్నే తనదైన పద్ధతిలో చెప్పింది.’’‘‘నేను మళ్ళీ జన్మించాక ఓ ఖాళీ పలకలా ఉంటానా? పసిబిడ్డలా. ఈ జీవితంలో నేను నేర్చుకున్నవి, నా అనుభవాలు ఏవీ నాతో రావా?’’‘‘నీ గత జన్మలన్నింటి జ్ఞానం నీలో ఉంది. కాని అవి నీకు ఇప్పుడు గుర్తులేవు. నీ ఆత్మ ఎంత అద్భుతమైందో, విశాలమైందో నీకు తెలీదు. నీ మనసు నీలోని అత్యంత చిన్న భాగాన్ని మాత్రమే ఇముడ్చుకోగలదు. అది నీళ్ళు వేడిగా ఉన్నాయో, చల్లగా ఉన్నాయో చూడటానికి గ్లాసు నీళ్ళలో వేలు ముంచడం లాంటిది. దాన్ని తిరిగి బయటకి తీసినప్పుడు, అది పొందిన అనుభవాలన్నీ నీలో నిక్షిప్తమవుతాయి. నువ్వు ఇంకా విస్తరించలేదు. నీ అపారమైన చైతన్యంలోని మిగిలినవన్నీ నువ్వు అనుభూతి చెందలేదు.’’‘‘నేను ఎన్నిసార్లు పునర్జన్మ ఎత్తాను?’’‘‘చాలాసార్లు. ఎన్నో రకాల జీవితాల్లోకి ప్రవేశించావు. సాంకేతికంగా చెప్పాలంటే నీకు తెలిసిన కాలం నువ్వు జీవించిన విశ్వంలో మాత్రమే ఉంటుంది. కాని కాలం నిజం కాదు. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అది నీకు చెప్పినా ఇప్పుడు అర్థం కాదు.’’‘‘నేను గతంలో మరణించినప్పుడల్లా నీతో ఇలా సంభాషించానా?’’‘‘అవును. అది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. నువ్వు గుడ్డు మాత్రమే కాబట్టి అది నీకు గుర్తు లేదు.’’‘‘దీని ప్రయోజనం?‘‘‘‘నేను ఈ విశ్వాన్ని సృష్టించడానికి కారణం, నువ్వు పరిణతి చెందడమే.’’‘‘నేను మాత్రమేనా? లేక మానవాళి మొత్తం పరిణతి చెందాలనా?’’‘‘లేదు. కేవలం నువ్వు మాత్రమే. నేను ఈ విశ్వాన్ని నీ కోసమే సృష్టించాను. ప్రతి కొత్త జీవితంలో నువ్వు ఎదుగుతూ, పరిణతి చెందుతూ మరింతగా విస్తరిస్తావు.’’‘‘నేనేనా? అంతానా?’’‘‘మరెవరూ లేరు. ఈ విశ్వంలో నువ్వు మాత్రమే ఉన్నావు.’’నేను అతని వంక పిచ్చివాడిని చూసినట్లుగా చూశాను.‘‘భూమి మీది ప్రజలందరి మాటేమిటి?’’‘‘అంతా నువ్వే. అవన్నీ నీ విభిన్న అవతారాలు.’’‘‘ఆగాగు. నేను అందరినా !?’’‘‘ఇప్పుడు నీకు అర్థమవుతోంది.’’‘‘ఇప్పటివరకు జీవించిన ప్రతి మానవుడినీ నేనే?’’ తెల్లబోతూ అడిగాను.‘‘అవును.’’‘‘నేను గాంధీనా?’’‘‘నువ్వు గాడ్సేవి కూడా.’’‘‘నేనే హిట్లర్నా?’’ దిగ్భ్రాంతిగా అడిగాను.‘‘అతను చంపిన లక్షలాదిమంది కూడా నువ్వే. నువ్వు ఎవరినైనా బాధించిన ప్రతిసారీ, నువ్వు నిన్నే బాధించావు. నువ్వు ఇతరులకి చేసిన ప్రతి మంచి పనీ నీకోసమే చేసుకున్నావు. ఏ మనిషైనా అనుభవించిన ప్రతీ సంతోషం, ప్రతీ బాధ నువ్వే అనుభవించావు, ఇకపైనా అనుభవిస్తావు.’’ అతను చెప్పాడు.‘‘ఇదంతా ఎందుకు?’’‘‘ఎందుకంటే ఏదో రోజు నువ్వు నాలా మారడానికి. నువ్వు నాలాంటి వాడివే. నిజానికి నువ్వే నేను. నేనే నువ్వు.’’‘‘అంటే నేను కూడా దేవుడినా?’’‘‘ఇంకా కాదు. నువ్వు నా ఊహవి. నేను నీ ఊహని. నువ్వు ఇంకా ఎదుగుతున్నావు. సకల కాలాల్లోని ప్రతి మానవ జీవితాన్నీ నువ్వు గడిపిన తర్వాత, ప్రతీ జన్మలోనూ ఎదుగుతూంటావు.’’‘‘ఐతే నేనో గుడ్డుని అన్నమాట.’’ నేను చెప్పాను.‘‘అవును. నేను కూడా నీ గుడ్డుని. ఇప్పుడు నువ్వు నీ తర్వాతి జీవితానికి వెళ్ళే సమయం వచ్చింది.’’ అతను చెప్పాడు.- మల్లాది వెంకట కృష్ణమూర్తి -
9 ఏళ్ల చిన్నారి.. రెండు జన్మల కథ!
సూర్యుడు నడినెత్తి మీదకు వస్తున్నాడు. మధుర పట్టణంలోని ద్వారకాధీశ్ ఆలయ పరిసరాల్లో రద్దీ ఓ మోస్తరుగా ఉంది. అప్పుడే అక్కడ అడుగుపెట్టిన తొమ్మిదేళ్ల శాంతిదేవి కళ్లలో ఒక విచిత్రమైన శూన్యం, అంతకంటే వింతైన వెలుగు కనిపిస్తున్నాయి.ఆమె ఆ ఊరికి రావడం ఇదే మొదటిసారి. కానీ, ఆమె అడుగులు మాత్రం వడివడిగా ముందుకు పడుతున్నాయి. ఆమెతోపాటు ఉన్న 15 మంది ప్రముఖులు ఒకింత ఆశ్చర్యం, మరికొంత ఉత్కంఠతో వెనకే వెళ్తున్నారు. ఆ బాలిక ఓ ఇంటి ముందు ఆగి, ‘ఇదే నా ఇల్లు..’ అని చెప్పి తలుపు తట్టింది. లోపలి నుంచి వచ్చిన వ్యక్తిని చూసి.. ‘ఏవండీ ఎలా ఉన్నారు’ అని అడిగేసరికి వారంతా నిర్ఘాంతపోయారు.1926 డిసెంబరు 11న ఢిల్లీలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించింది శాంతిదేవి. నాలుగేళ్ల వయసు వచ్చే వరకు అందరిలాగా ఆటపాటలతో గడిపింది. కానీ, మాటలు స్పష్టంగా వస్తున్న కొద్దీ ఆమె ప్రవర్తనలో మార్పు రాసాగింది. అద్దం ముందు నిలబడి.. ‘ఇది నేను కాదు, నా ముఖం ఇలా ఉండదు’ అని విచారంగా అనుకునేది.మొదట్లో తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె చెప్పే మాటలు వారిని భయాందోళనలకు గురిచేశాయి. ‘నా పేరు శాంతిదేవి కాదు, నేను లుగ్దీదేవిని. మధుర నా సొంతూరు. నాకు పెళ్లయింది. నా భర్త పేరు కేదార్నాథ్ చౌబే. ఒక బాబుకు జన్మనిచ్చిన తొమ్మిది రోజులకే నేను కన్నుమూశాను’ అంటూ ఏడ్చేది. ఈ విషయం శాంతిదేవి చదువుకునే స్కూలు టీచరుకు తెలియడంతో ఆయనకు ఆసక్తి కలిగి ఆమె చెప్పిన వివరాల ఆధారంగా కేదార్‌నాథ్‌కు లేఖ రాశారు.ఆశ్చర్యం.. అక్కడ నుంచి జవాబు వచ్చింది. తన పేరు కేదార్నాథ్ చౌబే అని, లుగ్దీదేవి తన భార్యే అని, ఆమె 1925లో చనిపోయిందని చెప్పడంతో ఆ టీచరుకు నోటమాట రాలేదు. వెంటనే కేదార్‌నాథ్‌కు విషయాలన్నీ వివరించి ఢిల్లీ రావాలని కోరారు. ఈ విషయాలేవీ శాంతిదేవికి చెప్పకుండా కేదార్‌నాథ్‌ను తీసుకుని ఆమె ఇంటికి వెళ్లారు. ఆయన్ను చూసిన శాంతిదేవి– ఎంతో ఉద్విగ్నతకు లోనై, ‘ఏవండీ..’ అంటూ పిలిచేసరికి కేదార్నాథ్ బిత్తరపోయారు. ఎందుకంటే తనను అలా పిలిచే ఏకైక వ్యక్తి ఆయన భార్య మాత్రమే. కానీ ఆమె మరణించిన పదేళ్ల తర్వాత ఓ చిన్నారి అలా పిలిచేసరికి ఆయన షాక్‌లో ఉండిపోయారు. తమ ఇద్దరికీ మాత్రమే తెలిసిన ఎన్నో వ్యక్తిగత విషయాలను శాంతిదేవి ప్రస్తావించడంతో ఆమె గత జన్మలో తన భార్యే అని కేదార్నాథ్ నిర్ధారణకు వచ్చారు.ఈ వార్త మహాత్మా గాంధీ వరకు చేరింది. దీంతో 1935లో శాంతిదేవిని, ఆమె తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు. చిన్నారి చెప్తున్న విషయాల్లోని నిజాయతీని గమనించిన ఆయన.. లోతైన విచారణ కోసం 15 మంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు.కమిటీ సభ్యులు శాంతిదేవిని తీసుకొని 1935 నవంబరులో ఢిల్లీ నుంచి మధురకు రైలులో బయలుదేరారు. ఢిల్లీ దాటి ఎప్పుడూ వెళ్ళని ఆ బాలిక మధుర స్టేషన్ రాగానే స్థానిక ‘బ్రజ్’ యాసలో అనర్గళంగా మాట్లాడటం మొదలుపెట్టింది. స్టేష¯Œ లో దిగగానే, గత జన్మలో తన భర్తకు పెద్దన్నయ్య అయిన వ్యక్తిని గుర్తుపట్టింది. అక్కడి నుంచి తన పాత ఇంటికి వారందరినీ తీసుకువెళ్లింది.ఒక గదిలో నేల కింద తాను దాచిన డబ్బు గురించి చెప్పింది. అయితే అక్కడ తవ్వగా ఖాళీ డబ్బా మాత్రమే దొరికింది. కమిటీ సభ్యులు శాంతిదేవి వైపు అనుమానంగా చూశారు. ఆ క్షణంలో కేదార్నాథ్ కన్నీళ్లు పెట్టుకుంటూ.. ‘ఆ డబ్బు లుగ్దీదేవి చనిపోయాక నేనే తీశాను’ అని అంగీకరించడంతో అందరూ నోరెళ్లబెట్టారు. అలాగే తమ కుమారుడి చిన్నప్పటి గుర్తులు కూడా చెప్పి అందరినీ విస్తుపోయేలా చేసింది.శాంతిదేవి చెప్పిన చాలా అంశాలు వందకు వంద శాతం సరిపోయాయని కమిటీ తన నివేదికలో పేర్కొంది. పలువురు పారానార్మల్ పరిశోధకులు కూడా శాంతిదేవి కేసును పునర్జన్మలకు సంబంధించిన బలమైన ఉదాహరణగా ప్రస్తావించారు. అయితే, దీనిపై శాస్త్రీయంగా ఏకాభిప్రాయం రాలేదు. కొందరు దీనిని పునర్జన్మకు ఆధారంగా పేర్కొన్నారు. మరికొందరు మెదడులోని పాత జ్ఞాపకాల పొరలని వాదించారు.ఓవైపు ఈ జన్మ ఇచ్చిన తల్లిదండ్రులు.. మరోవైపు గత జన్మ తాలూకు జ్ఞాపకాలు.. ఇలా జీవితాంతం రెండు జన్మల మధ్య బతికిన శాంతిదేవి వివాహం చేసుకోకుండా తన 61వ ఏట 1987లో మరణించారు.- కె.సత్యకిశోర్ -
15 చెర్రీలు.. ధర లక్షల్లో! జపాన్ పండుకు ప్రపంచం ఫిదా!
మామూలుగా చెర్రీ ధర కిలోకు రెండువందల నుంచి నాలుగువందల రూపాయలు ఉంటుంది. కొన్ని అరుదైన రకాల చెర్రీ ధర కిలోకు మూడువేల రూపాయల వరకు కూడా ఉంటుంది. జపాన్‌లో పండే ఈ అత్యంత అరుదైన చెర్రీ ధర మాత్రం చుర్రుమనిపిస్తుంది.ఈ చెర్రీ రకం పేరు ‘అమరీ హార్ట్‌బీట్’. జపాన్‌లో పండించే చెర్రీ రకాలలో ఇవి అత్యంత అరుదైనవి. వీటిని కిలోల లెక్కన కాకుండా, పదిహేనేసి చొప్పున ప్యాక్‌చేసి, అందమైన ప్యాకెట్లలో విక్రయిస్తారు. ఇవి ఇతర రకాల చెర్రీల కంటే ఎక్కువ తీపిగా ఉంటాయి. వీటిలో చక్కెర శాతం మిగిలిన చెర్రీ రకాల కంటే ఇరవై శాతం ఎక్కువగా ఉంటుంది.ఈ చెర్రీలను ఎక్కువగా వేలం పాటల్లో విక్రయిస్తుంటారు. వేలంలో పదిహేనేసి చెర్రీలు ఉండే ఒక్కో ప్యాకెట్ ధర నాలుగున్నర లక్షల నుంచి ఆరులక్షల యెన్ల వరకు పలుకుతుంటుంది. ‘అమరీ హార్ట్‌బీట్’ చెర్రీలలో అత్యంత నాణ్యమైన వాటిని వేరుచేసి, వేలంశాలల్లో విక్రయిస్తుంటారు. మిగిలిన వాటిని లగ్జరీ ఫ్రూట్ షాపుల్లో అమ్ముతుంటారు. లగ్జరీ ఫ్రూట్ షాపుల్లో వీటి ధర ఒక్కో ప్యాకెట్‌కు యాభైవేల యెన్ల వరకు ఉంటుంది.


